స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ(1976)

స్మృతి ఇరానీ గారి అసలు పేరు స్మృతి మల్హోత్రా , ఆమె ఢిల్లీలో జన్మించారు. స్మృతి గారు ఇంటర్మీడియట్ పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు.

దేశ టెలివిజన్ రంగంలో ఆమె చాలా ప్రసిద్ధి చెందిన నటీమణి, మరియు హిందీ చలనచిత్ర పరిశ్రమలో కూడా సహాయ నటి గా మంచి పేరు తెచ్చుకున్నారు. స్మృతి తాత గారు , తండ్రి గారు ఆర్.ఎస్.ఎస్ లో సభ్యులు మరియు బీజేపీ పూర్వ పార్టీ జనసంఘ్ పార్టీకి మద్దతు దారులుగా ఉండేవారు. స్మృతి తల్లి గారు శిబాని గారు ఢిల్లీ జనసంఘ్ పార్టీలో మహిళా నాయకురాలు.

స్మృతి 2003లో అప్పటి ప్రధానమంత్రి వాజపేయి, అద్వానీ గార్ల సమక్షంలో బీజేపీ పార్టీలో చేరి 2004,2009ఎన్నికల్లో పార్టీ తరుపున ఉత్తర భారతం లో విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ పార్టీ జాతీయ కార్యదర్శి గా , మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా పనిచేశారు.

2009,2014లలో చాందిని చౌక్ , అమేథీ లోక్ సభ స్థానాల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2011, 2016లలో రాజ్యసభ సభ్యురాలు గా ఎన్నికయ్యారు.

2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రిగా 2016 వరకు పనిచేశారు, 2017 నుండి 2018 వరకు కేంద్ర సమాచార మరియు ప్రసారాల శాఖ మంత్రిగా పనిచేశారు.2016 నుండి ప్రస్తుతం వరకు కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అదనంగా 2019 నుంచి కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.

ప్రస్తుత ప్రధాన మంత్రి మోడీ గారికి మొదట్లో స్మృతి బద్ధ వ్యతిరేకి మరియు ఎక్కువగా విమర్శలు చేసేవారు. స్మృతి రాజకీయ జీవితం లో అత్యంత గొప్ప విజయం ఏదైనా ఉందంటే 2019లో జరిగిన ఎన్నికల్లో అమేథీ లోక్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించడం.

సుమ కనకాల

Suma Kanakala, a TV presenter. She is originally from Thrissur in Kerala. But her parents were living for their livelihood in Secunderabad. (Twin city of Hyderabad in Telangana). From the age of 21, she started presenting some shows and became successful. She isn’t only fluent in Telugu but also in Tamil, Hindi and English.

So she is one leading anchor in Tollywood, it was said that she has no interest towards acting and loves anchoring. She is one top anchor in Andhra and Telangana. The thing which is interesting from her is apart from tv shows she also presents almost of Movie release events. Spontaneous jokes from her is the thing that audience likes her. Every telugu enjoys her jokes and she is active in her tv shows like CASH which premieres every saturday and then some game show which premieres every day except sunday. And then she is handling a youtube channel. And surprise she hosts almost every movie events. And that’s how hardworking she’s. She married to Actor Rajev Kanakala an actor in Tollywood. She’s also a mother a boy and girl. So inspiring story.

జయలలిత

జయలలిత (1948–2016)

జయలలిత గారు ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలోని పాండవపుర తాలూక మేల్కొటే గ్రామంలో జన్మించారు. జయలలిత గారి అసలు పేరు” కోమలవల్లి”. ఆమె తల్లి ప్రముఖ నటీమణి సంధ్య గారు. జయలలిత తాతగారు మైసూర్ రాజ్య దివాన్ రంగా చారి గారికి వ్యక్తిగత వైద్యులు.

జయలలిత గారు చదువుల్లో బాగా రణించేవారు ,మద్రాస్ ఎస్.ఎల్.సి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం దక్కించుకున్నారు. 16 యేటనే చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో అగ్ర నటిమణిగా రాణించి 32 యేటా సినిమా రంగం నుంచి తప్పుకున్నారు. చలనచిత్ర పరిశ్రమ నుంచి విరమించుకున్న తరువాత కొంత కాలం ఇంటికే పరిమితమయ్యారు.

తన ఆరాధ్య నటుడు ఎంజీర్ ఆహ్వానం మేరకు ఆయన స్థాపించిన అన్నాడీఎంకే పార్టీలో చేరి పార్టీ గెలుపునకు కృషి చేశారు. పార్టీ తరుపున ప్రచార కార్యదర్శిగా ఎన్నికయ్యి పార్టీ ప్రచార కార్యక్రమాలు విజయవంతంగా ప్రజల్లోకి చేరడంలో కృషి చేశారు. ఎంజీర్ మరణించిన తరువాత పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కొని పార్టీ పగ్గాలు చేపట్టారు.

1984 లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు,1989 నుంచి 2016 వరకు మొత్తం 7 సార్లు తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1991 నుంచి 1996 వరకు, 2001,2002 నుంచి 2006 వరకు, 2011 నుంచి2014, 2015 ,2016 వరకు మొత్తం ఆరు సార్లు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా, 1989 నుంచి 1991 వరకు,1996 నుంచి 2001 వరకు,2006 నుంచి 2011 వరకు మొత్తం 3 సార్లు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గా పనిచేశారు. 1999లో వాజపేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూలిపోవడంలో ముఖ్య పాత్ర పోషించారు.

ముఖ్యమంత్రి గా ఆమె ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్లు దేశవ్యాప్తంగా బాగా ప్రచారం పొందిన సంక్షేమ పథకం. జయలలిత గారు మంచి వక్త, ఆమె తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో అనర్గళంగా ప్రసంగించగలరు. 1990 నుంచి చివరి శ్వాస వరకు దేశ, తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఏకైక వ్యక్తి జయలలిత గారు.

రాజకీయాల్లో తనదైన శైలిని ఏర్పరచుకున్న జయలలిత గారు తన జీవితంలో ఏ కేంద్ర రాజకీయ నాయకులు ముందు తలవంచలేదు కానీ అనేక మంది తలలను వంచారు. పురుషాధిక్యత కలిగిన దేశ రాజకీయాల్లో ఆమె తనకంటూ ప్రత్యేకమైన చరిత్రను సృష్టించుకున్నారు. అందుకునే ఆమెను” విప్లవ నాయకి” అని పిలిచేది తమిళ ప్రజానీకం. ఇష్టం లేని రంగలలో ప్రవేశించి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి జయలలిత గారు, ఆమె స్పూర్తితో మరెందరో మహిళలు రాజకీయ రంగ ప్రవేశం చేసి రాణిస్తున్నారు.

మమతా బెనర్జీ

మమతా బెనర్జీ(1955)

మమతా బెనర్జీ గారు బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా లో జన్మించారు. 17 ఏళ్ళు వయస్సు లో తండ్రి అకాల మరణంతో కుటుంబ భాద్యతలు స్వీకరించారు. ఒకవైపు చదువుకుంటూనే కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారు. చరిత్రలో డిగ్రీ, ఇస్లాం లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి స్కూల్ టీచర్ గా పనిచేసారు. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూనే విద్యార్థి రాజకీయాల్లో రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

1976లో లోక్ నాయక్ జె.పిని కలకత్తా నగరంలో కి రాకుండా అడ్డుకున్న బృందానికి నాయకత్వం వహించారు. 1976 నుంచి 1984 వరకు బెంగాల్ మహిళా కాంగ్రెస్ లో ప్రధాన కార్యదర్శి, అధ్యక్షురాలిగా పనిచేసారు. 1984 లోక్ సభ ఎన్నికల్లో జాదవ్ పూర్ స్థానం నుంచి పోటీ చేసి దిగ్గజ కమ్యూనిస్టు నాయకులు సోమనాథ్ ఛటర్జీ గారి మీద విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. 1991,1996,1998,1999,2004,2009 లలో వరుసగా మొత్తం 8 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.

1991లో పి.వి.నరసింహ రావు ప్రభుత్వం లో యువజన క్రీడా శాఖ సహాయ మంత్రిగా1996 వరకు, 1999 నుంచి 2000 వరకు వాజపేయి ప్రభుత్వం లో రైల్వే శాఖ కేబినెట్ మంత్రిగా, 2004 లో వాజపేయి ప్రభుత్వంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా, 2009 నుంచి 2011 వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు.

1997లో కాంగ్రెస్ పార్టీతో విభేదాలు కారణంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన 14 సంవత్సరాలకు బెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. 2011లో 34 ఏళ్ళ కమ్యూనిస్టు ప్రభుత్వానికి చరమగీతం పాడిన వ్యక్తిగా దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.2011 నుంచి ప్రస్తుతం వరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నారు.

“మా , మాటి, మనుష్” ఉద్వేగానికి లోను చేసే నినాదాన్ని పలికిన మొదటి వ్యక్తి బెనర్జీ గారే. బెంగాలీ ప్రజలు ఆమెను “దీదీ(పెద్ద అక్క)” అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఆమె 44 ఏళ్ళు రాజకీయ ప్రస్థానంలో ఎక్కువగా పోరాటలు చేయడానికే సరిపోయింది. దేశంలో ఉన్న బలమైన మహిళా రాజకీయ నాయకురాళ్ల లలో మమతా బెనర్జీ గారు ముందుంటారు.

వసుంధర రాజే సింధియా

వసుంధర రాజే సింధియా(1953)

వసుంధర రాజే సింధియా ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియార్ సంస్థాన చివరి పాలకుడు , మహారాజ జీవాజి రావు సింధియా, రాజమాత విజయరాజే దంపతులకు జన్మించారు. దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విద్య సంస్థల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి , రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద సంస్థానాల్లో ఒకటైన ధోల్పూర్ రాజకుటుంబానికి కోడలు అయ్యారు.

1984లో బీజేపీ పార్టీలో చేరి పార్టీలో అనేక కీలకమైన పదవులు అధిరోహించారు ప్రస్తుతం బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 1985 నుంచి ప్రస్తుతం వరకు 5 సార్లు రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీకి, 1989 నుంచి 2003 వరకు 5 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 1998 నుంచి 2003 వరకు విదేశాంగ సహాయ మంత్రిగా, కుటీర పరిశ్రమలు, ప్రజా వ్యవహారాలు మరియు పరిపాలన వ్యవస్థ, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్న శాఖలకు పర్యవేక్షణ మంత్రిగా స్వాతంత్ర మరియు కేబినెట్ మంత్రిగా పనిచేశారు.

2003 నుంచి 2007 వరకు మొదటి సారి, 2013 నుంచి 2018 వరకు రెండో సారి రాజస్థాన్ ముఖ్యమంత్రి గా, 2007 నుంచి 2013,2018 నుంచి ప్రస్తుతం వరకు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి గా రాజే అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టి అందరిచేత ప్రశంసలు అందుకున్నారు.

సింధియా కుటుంబం తొలి నుంచి దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించిన కుటుంబం, విజయరాజే సింధియా గారు, ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికయ్యారు, బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు, సోదరుడు మాధవ రావు మాజీ కేంద్ర మంత్రి , సోదరి యశోధర రాజే మాజీ ఎంపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ముఖ్య నాయకురాలు, మేనల్లుడు జ్యోతిరాదిత్య సింధియా మాజీ కేంద్ర మంత్రి , ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ, కుమారుడు యువరాజు రాణా దుష్యంత్ సింగ్ 2004 నుంచి ప్రస్తుతం వరకు వరుసగా 4 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.

రాజకీయాల్లో మిగిలిన రాజకీయ నాయకులతో పోలిస్తే వసుంధర రాజే శైలి చాలా భిన్నంగా ఉంటుంది, ప్రస్తుత రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ ఆమెకు మంచి స్నేహితుడు , శ్రేయోభిలాషి అవడం కోసమెరుపు.

రోషిణి నాడార్

HCL పగ్గాలు చేపట్టిన రోషిణి నాడార్ 2017 నుంచి ప్రపంచంలో 100 మంది శక్తివంతమైన మహిళల్లో ఒకరు. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత మహిళా ధనవంతురాలు ఆమే. భారతదేశ చరిత్ర లో ఒక మహిళ, ఒక ఐటీ కంపనీ పగ్గాలు చేపట్టి చైర్మన్ అవ్వటం ఇదే తొలిసారి.

HCL (హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్) ని స్థాపించిన శివ నాడార్ ఏకైక కుమార్తె రోషిణి, తండ్రి చాటు బిడ్డ. ఎక్కడికి వెళ్ళినా తండ్రితోనే వెళ్తుంది. తండ్రి మాట జవ దాటదు కానీ తానే స్వతహాగా విద్యాగ్యాన్ అనే సంస్థని స్థాపించింది. చాలా మంది వేరే వాళ్ళకి సహాయం చేసి ఫోటోలు దిగుతారు. ఈమె మాత్రం తాను సహాయం చేసిన వాళ్ళు నాయకులు గా ఎదగాలి, పెద్ద పెద్ద సంస్థల్లో లీడర్లు గా ఎదగాలి, భారతదేశాన్ని నడిపించాలి, అప్పుడు తాను వెళ్ళి వాళ్ళతో ఫోటోస్ దిగాలి అంటుంది. రోషిణి నాడార్ గంట సేపు మాట్లాడితే 40 నిమిషాలు వేరే వాళ్ళు బాగుపడాలి, పల్లెటూర్లు బాగుపడాలి అంటుంది. ప్రధానం గా పాఠశాల విద్య అత్యంత ముఖ్యం అంటుంది రోషిణి. పల్లెటూర్ల నుంచి కొన్ని వందల మంది విద్యార్ధులని సెలక్ట్ చేసి వాళ్ళని గొప్ప వాళ్ళగా తీర్చిదిద్దటమే ఆమె పనుల్లో ఒకటి. అందరిలాగా ఆడ మగ సమానత్వం పై మాత్రమే మాట్లాడదు, అన్ని విషయాల్లో డైవర్శిటీ ఉండాలి, పల్లెటూరి వాళ్ళు కూడా నాయకులుగా ఎదిగి అన్ని చోట్లా వాళ్ళు అన్ని స్థానాల్లో ఉండాలి అంటుంది రోషిణి.

1976 లో HCL ని స్థాపించిన శివ నాడార్ ది కూడా విలక్షణ వ్యక్తిత్వం. తమిళనాడు లోని తుత్తుకూడి జిల్లాలోని తిరుచందూర్ దగ్గర్లోని మూలైపోజి అనే పల్లెటూర్లో పుట్టిన శివనాడార్ చదువు అంతా సామాన్యమైన పాఠశాల, కాలేజ్ లే. చదువు అయ్యాక ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తూ స్నేహితులతో కలిసి HCL ని స్థాపించాడు. కంప్యూటర్స్ అంటే మన దేశం లో చాలా మందికి తెలియని కాలం లో వాటి హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ ఉత్పత్తులకోసం “హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ – HCL ” ని 1976 లోనే స్థాపించాడు. ఇప్పుడు HCL భారతదేశం లో TCS, Infosys తర్వాత మూడో అతి పెద్ద ఐటీ కంపనీ, లక్షా 50 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.

2019 లో ముఖేష్ అంబానీ 200 కోట్ల విరాళం ఇస్తే భారత దేశం అంతా ఆయన పేరు మారు మోగింది, ఆ తర్వాత రతన్ టాటా 400 కోట్లు విరాళం ఇస్తే దానకర్ణుడు రతన్ టాటా అని ప్రపంచ మీడియా కూడా కీర్తించింది. నిజానికి 2019 సంవత్సరం లో ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ గా 600 కోట్లు దానం చేసిన వ్యక్తి శివ నాడార్. ఆయనా చెప్పడు, అవతలి వారిని చెప్పొద్దు అంటాడు కారణం అది ఆయన బాధ్యత. దైవభక్తుడైన శివ నాడార్ తన సంపాదనలో 10% విరాళాలు ఇస్తుంటాడు. దీనితో పాటు తన తండ్రి పేరిట ఇంజనీరింగ్ కాలేజి స్థాపించి చాలా మందికి చాలా విషయాల్లో సహాయం చేస్తుంటాడు. ఇంకా శివా నాడార్ ఫౌండేషన్ తో కొన్ని వేల, లక్షల మందికి సహాయం చేస్తుంటాడు శివ నాడార్.

శివ నాడార్ తన తండ్రి శ్రీ శివసుబ్రమణ్య నాడార్ పేరుతో 100 మంది వరకు Ph.D కూడా చేస్తున్న అత్యంత పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపిస్తే శివ నాడార్ కూతురు రోషిణి నాడార్ తన తండ్రి శివ నాడార్ పేరిట “శివ నాడార్ విశ్వ విద్యాలయం” నే నిర్మించింది.

ప్రపంచం లో అత్యున్నతమైన చికాగో లోని నార్త్ వెస్టర్న్ విశ్వ విద్యాలయ కెల్లాగ్స్ బిజినెస్ స్కూల్ నుంచి MBA చేసింది రోషిణి. గతం లో కూడా HCL కంపనీ CEO గా పనిచేసింది, వైస్ ప్రెసిడెంట్ గా చేసింది, వైస్ చైర్మన్ గా కూడా పని చేస్తుంది. ఇప్పుడు భారత దేశం లో మూడో అతి పెద్ద ఐటీ కంపనీ HCL పూర్తి పగ్గాలు చేపట్టింది రోషిణి నాడార్.

నీ లాంటి యువతే కదా మన భారత దేశ భవిష్యత్తు. ప్రపంచం లో మన దేశం గొప్పగా ఉండాలంటే నీవు మరిన్ని విజయ శిఖరాలు అధిరోహించాలి రోషిణి.

Roshni Nadar, who was born in 1982, grew up in Delhi and carries a Masters in Business Administration from Kellogg. She is now the new chairman of HCL Tech 

Here are the top 10 things you must know about her:

1. According to the 2019 Wealth Hurun Rich List, Roshni Nadar is India ‘s wealthiest woman having a net worth of Rs 36,800. She is the world’s 54th most powerful woman according to the list of Forbes World’s 100 Most Powerful Women 2019.

2. Roshni Nadar, who was born in 1982, grew up in Delhi and carries a Masters in Business Administration from Kellogg.

3. She is the only daughter of her parent’s Kiran Nadar and Shiv Nadar (founder of HCL).

4. As a news producer in the UK, she started her career. “Media really excited me. As an undergraduate, I did internships with CNBC and CNN and my first job was at Sky News in London,” “she stated” throughout an interview with Forbes.

5. Roshni Nadar at the age of just 27, was endorsed to HCL ‘s Executive Director and CEO within one year of joining the firm in 2009.

6. “I’m not interested in the technology business, at least not in getting hands-on,” she told the Economic Times in an interview in 2012.

7. She is also the trustee of Shiv Nadar Foundation, which aims at only education and has set up some of the top schools and colleges in India.

8. She is also the president of VidyaGyan Leadership Academy which emboldens needy children through schooling.

9. Currently, she got married to Shikhar Malhotra who is also HCL’s executive director and board member. He also operates as HCL Healthcare ‘s vice chairman and CEO.

10. “It’s really important, no matter which industry you’re in and no matter what you’re doing, is that an idea is only as good as its execution,” she stated at the World Economic Forum in Davos 2019.

సరోజినీ నాయుడు

sarojini naidu

సరోజినీ నాయుడు భారత కోకిలగా ప్రసిద్ధి చెందారు. (నైటింగేల్ ఆఫ్ ఇండియా ) సరోజినీ నాయుడు స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి కూడా. ఈమె క్రీ.శ. 1879 వ సంవత్సరం ఫిబ్రవరి 13 వ తేదీన హైదరాబాద్లో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి డా.అఘోరనాథ్ చటోపాద్యాయా, తల్లి శ్రీమతి వరద సుందరి. అఘోరనాథ్ చటోపాథ్యాయగారు హైదరాబాదు కాలేజికి, (నేటి నిజాం కాలేజీ) మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచీ ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు, కథలు వ్రాయడం జరిగింది.

తండ్రి గారైన అఘోరనాథ్ చటోపాధ్యాయ ఎనిమిది భాషలలో పండితుడు. సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, గ్రీకు, జర్మనీ, హిబ్రూ, ఫ్రెంచ్, ఆంగ్లం మొదలైన భాషలు ఆయనకు అనర్గళంగా వచ్చు. ఇతను ఎడింబరో విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరు పట్టాను పొందారు.

శ్రీమతి సరోజినీ నాయుడు తల్లి దండ్రులు విద్యాధికులవటం వలన, ఆమెలో చిన్నతనం నుంచే కార్యదీక్షా, పట్టుదలా, విద్యపై తిరుగులేని సదభిప్రాయాలు ఏర్పడటం జరిగింది. బాల్యం నుంచి ప్రతి విషయం లోనూ కుతూహలం కనబరచి ఏది, ఏమిటో వివరాలు తెలుసుకొనే వరకూ విశ్రమించరు కొందరు. ఈ కోవకు చెందిన మేధావి శ్రీమతి సరోజినీ నాయుడు.

ఈ దేశం బానిస తనం నుంచీ, నియంతృత్వ సంకెళ్ళ నుంచీ విముక్తి పొంది నాది, నేను అన్న భావంతో అఖిల భారత ప్రజానీకం స్వేచ్ఛా, స్వాత్రంత్ర్యాలతో జీవించాలన్నదే సరోజినీ నాయుడు మహత్తర ఆశయం. భారతదేశంలో పురుషులే కాక, భారత మహిళలు ఏ రంగంలోనూ, తీసిపోరని నిరూపించిన వీర మహిళలు మన దేశంలో చాలా మంది పుట్టారు. అటువంటి వారిలో శ్రీమతి సరోజినీ నాయుడు కూడా ఒకరు.సరోజిని నాయుడు మంచి రచయిత్రి. పద్య రచయిత. చిన్నతనం నుంచీ ఆమెకు ఇంగ్లీషు భాషమీద చాలా ఇష్టం ఉండేది. ఇంగ్లీషు మాట్లాడాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూండేది. ఆ పట్టుదలా, ధ్యేయాలతోనే ఇంగ్లీషు భాషను ఎంతో శ్రద్ధగా అభ్యసించింది. పదకొండో సంవత్సరం వచ్చేసరికి ఆమె అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఆ వయసులోనే ఇంగ్లీషులో రచనలు ఆరంభించింది సరోజిని నాయుడు.

పన్నెండవ ఏట మదరాసు విశ్వవిద్యాలయంలో మెట్రిక్ లేషన్ పూర్తి చేయగలిగిందంటే ఆమె చురుకైన తెలివితేటలూ, విద్య యందు ఆమెకు గల శ్రద్ధ మనం అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ కు దగ్గరలోని వీరి ఇంటిని సరోజినీ నాయుడుగారి తదనంతరం తమ ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డన్ త్రెషోల్డ్ గా పేరు మార్చటం జరుగుతుంది. ప్రస్తుతం ఇది హైదరాబాద్ యూనివర్శిటిగా రూపొందింది.

సరోజినీ పదమూడవ యేట చాలా పెద్ద రచన రచించింది. దానిపేరు సరోవరరాణి (Lady of Lake). అది పదమూడు వందల పంక్తులతో నిండిన అతి చక్కని రచన. తాను చెప్పదలచుకున్న విషయము ఇతరుల హృదయాలకు హత్తుకుని ఆలోచింపజేసే విధంగా చక్కటి శైలిలో ఉండేవి. చిన్న తనం నాడె రచనలు ప్రారంభించిన ఆమెలోని ప్రత్యేకతలు గ్రహించిన నిజాంనవాబు ఆమె యందు గల అభిమానంతో ఆమెను విదేశాలకు పంపాలని నిర్ణయించుకుని, ఆమె వివిధ శాస్త్రాలలో పరిశోధన చేసేందుకు ప్రోత్సాహమిస్తూ ఆమెకు ప్రతి సంవత్సరం నాలుగువేల రెండు వందల రూపాయలు విద్యార్థి వేతనంగా ఇచ్చేందుకు కూడా అంగీకరించాడు. నిజాం నవాబు ప్రోత్సాహం దొరికేసరికి, ఆమెకు చదువుమీదనున్న ఆసక్తి గ్రహించిన తల్లి దండ్రులు ఆమెను విదేశాలకు పంపారు. సరోజినీ లండన్ లోని కింగ్స్ కాలేజీ లోను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ అధ్వర్యంలోని గిర్టన్ కాలేజిలోనూ విద్యాధ్యయనం చేసింది. ఈవిడ రాసిన కవితలను చదివి, ఇంగ్లాండ్ లోని ఆంగ్లభాషా విమర్శకులు ‘ఆర్థర్ సైమన్స్’, ఎడ్వర్ గూస్ లు అభినందించారు. పాశ్చాత్య విద్వాంసులను చాలా మందిని కలసి వారికి గల పాండిత్యాన్ని ఆకళింపు చేసుకుని వారితో స్నేహసంబంధాలు పెంచుకుని వారి సలహాలపై, ఇంగ్లీషులో అతి చక్కని గ్రంథాలు వ్రాసింది. ఆమె రచించిన కావ్యాలలో “కాలవిహంగం” (Bird of time), “స్వర్గ ద్వారం” (The Golden Threshold), విరిగిన రెక్కలు (The Broken Wings) అనేవి చాలా ప్రసిద్ధమైనవి. ఆమె ఇంగ్లాండులో నివసిస్తూ రచనలు సాగించినా వాటిలో భారతీయ జీవితాలు మన జాతి ప్రత్యేకతలు కనబడేవి. 1898 వ సంవత్సరం విదేశాలలో విద్య పూర్తి చేసుకుని భారతదేశం తిరిగి వచ్చాక, శ్రీ ముత్యాల గోవిందరాజులు నాయుడు గారితో పెండ్లి జరుగుతంది. ముత్యాల గోవిందరాజులు నాయుడు అప్పటి హైదరాబాద్ ఆరోగ్యవిభాగంలో అధికారి.

కులం మతం అనె మూఢవిశ్వాసాలంటే శ్రీమతి సరోజినీ నాయుడికి చిన్నతనం నుంచే ఏవగింపు. ఈ కుల, మతం ఏకమై జాతి జీవనాన్ని ఛిద్రంచేస్తూ, వర్గ భేదాన్ని సృష్టించి ధనవంతులు, నిరుపేదలు, బలవంతులు, బలహీనులనే వేర్పాటు ధోరణికి బలి చేస్తుందనీ, కుల మతాతీత భావాలతో పెరిగే ప్రజానీకం మాత్రమే సమాజ స్థాపన చెయ్యగలరనీ ఆమె అభిప్రాయం. ఆమె అదే అభిప్రాయంతో శ్రీ ముత్యాల గోవిందరాజులు నాయుడు తన కులానికి చెందిన వ్యక్తి కాకపోయినా భారతీయ మహిళా లోకానికి ఆదర్శం కావాలన్న అభిప్రాయంతో ఆనాడే వర్ణాంతర వివాహం చేసుకుంది. ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు వీరి వివాహం జరిపించారు. ఈ పనికి ఎన్నో విమర్శలు ఎదుర్కోవలసి వచ్చినా మానవ జీవిత మనుగడకు మనసూ, మానవతా ముఖ్యం కాని, అర్థం లేని గ్రుడ్డి నమ్మకాలను ప్రోత్సహించి జాతిని పతనము చేసే కులము కాదని ఆమె నిరూపించగలిగింది. తనూ, తన భర్త, ఆచార వ్యవహారాలు భిన్నమైన కులాలు వేరైనా మనసున్న మనుషులుగా సంస్కార వంతులుగా నియమబద్దమైన జీవితం సాగించసాగారు. స్త్రీ పురుషులు ఒకరినొకరు అర్థం చేసుకుని సంసారము దిద్దుకోగలిగితే కులము గొడవ ఏదీ లేదని మిగిలిన సమాజానికి నిరూపించారు. శ్రీమతి సరోజినీ నాయుడు గోవిందరాజులు నాయుడు గార్ల దాంపత్య చిహ్నంగా వారికి ఒక కుమారుడూ, ఇద్దరు కుమార్తెలు కలిగారు. కుమారుడు ముత్యాల జయసూర్య నాయుడు ప్రముఖ హోమియోపతీవైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు మరియు హైదరాబాదుకు చెందిన రాజకీయ నాయకుడు. వీరి కుమార్తెలలో ఒకరైన పద్మజా నాయుడు బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు.

వివాహమై బిడ్డలు పుట్టినా, ఆమె కేవలం తన సంతోషం తన పిల్లల సుఖం గురించి ఆలోచించలేదు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ ఆ రోజులలో గోపాల కృష్ణ గోఖలే నాయకత్వంలో ఉద్యమాలు సాగిస్తోంది. వీరు మహిళాభివృద్దికి ఎంతో కృషిచేసి 1906లో మహిళలకు విద్య అవసరమని దేశమంతా ఎన్నో మహిళా సమావేశాలు ఏర్పరచి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో పాటు పడ్డారు. స్వాతంత్ర్య సాధనలో తనూ పాలుపంచుకోవాలని ఆలోచించిన శ్రీమతి సరోజినీ నాయుడు కాంగ్రెస్ జాతీయ భావాలకు అనుగుణంగా నడుచుకోనారంభించింది. 1915 వ సంవత్సరం బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో, 1916 లో జరిగిన లక్నో కాంగ్రెస్ సభలలో ఆమె పాల్గొనటం జరిగింది. ఆనాటి కాంగ్రెస్ భావాలు చాలా ఆదర్శంగా ఉండేవి. సరోజినీనాయుడు భారత దేశములో గల ముఖ్యమైన, నగర, పట్టణాలు తిరుగుతూ స్వాతంత్ర్యోద్యమ ఉపన్యాసాలిచ్చి, ప్రజలతో భాష విప్లవము వచ్చేందుకు కారకురాలయినది. మృదువుగా మాట్లాడుతూ, ఎంత కఠినమైన విషయాలైనా, శ్రోతల గుండెలను హత్తుకుని మరుగున ఉన్న యదార్థ స్థితిని అర్థమయ్యే విధంగా ఆమె గంభీరమైన ఉపన్యాసం విన్న శ్రోతలకు కాలం, శ్రమ తెలిసేవి కాదు. ఆమె ఉపన్యాసాలు దేశభక్తిని నూరి పోసి చావుకు కూడా భయపడని తెగింపును తేగలిగాయి. “జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు, నీకు జరిగితే దేశానికి జరిగినట్టే, దేశం అనుభవించే బానిసతనం నీవూ అనుభవించవలసినదే” అంటూ దేశమంతా తిరిగి దేశభక్తిని నూరిపోసిందా వీరతిలకం.

ఈ విశ్రాంతి లేని ప్రయాణాలతోనూ, ఉపన్యాసాలతోనూ ఆమె ఆరోగ్యం పాడైంది. 1919 సంవత్సరంలో పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ జనరల్ డయ్యర్ నేతృత్వంలో హత్యా కాండ జరిగింది. ఆ సమయానికి సరోజినీనాయుడు లండన్ నగరంలో చికిత్స పొందుతోంది. ఈ విషయం ఆమె లండన్ నగరంలో విన్నది. ఆమె గుండె ఆ వార్తకు నీరయిపోయింది. అప్పటికే ఆమె గుండెజబ్బుతో ఉన్నదని బాగా ముదిరిపోయినదని చెప్పారు వైద్యులు. అయినా చనిపోయే ప్రతి భారతీయుని భయంకరమైన కేకలు ఆమె చెవుల్లో గింగురుమన్నాయి.

ఆ పరిస్థితిలో తను ఉండి కూడా ఆరోగ్యాన్ని ఏమాత్రం లెక్క చేయక క్రూరుడైన పంజాబ్ గవర్నర్ డయ్యర్ మీద ఆందోళన లేవదీసింది. గాంధీజీకి పంజాబ్ దారుణం గురించి ఉత్తరము వ్రాస్తూ, యావత్ ప్రపంచ భారతీయులకు డయ్యర్ ద్వారా జరిగిన ఘోరాన్ని వినిపించనిదే నిద్రపోననీ వారి రాక్షస కృత్యాలకు బదులుగా భారత దేశం నుంచి వారిని తరిమి కొట్టి, భారతీయుల స్వేచ్ఛ చూడనిదే, భరతమాత ఆత్మ శాంతించదని తన సందేశము ద్వారా తెలియపరిచింది. సరోజిని లండన్ నగరము నుంచి బయలుదేరి సముద్ర మార్గం గుండా ప్రయాణించి, భారతదేశములో ఓడ దిగటం తోటే శాసనధిక్కారం అమలు పరిచింది. స్వాతంత్ర్యోద్యమ చరిత్రల పుస్తకాలను అమ్మకూడదని, బ్రిటిష్ ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేసింది. ఆ ఆజ్ఞలు ఫలితంగా చాలా పుస్తకాలను అమ్మటం మానేశారు. గాంధీజీ సలహాపైన ఆ పుస్తకాలన్నింటినీ ప్రతివీధిలోనూ అమ్మి ప్రభుత్వశాసన ధిక్కారం జరిపింది సరోజినీనాయుడు.

దేశం పట్ల, ప్రజలమీద ఆమెకున్న ప్రేమ, వాత్సల్యం ఆమె సొంత ఆరోగ్య విషయం కూడా మరచిపొయ్యె విధంగా చేశాయంటే ఆమె దేశభక్తిని, త్యాగనిరతిని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలోనె ఒక బహిరంగ సభలో ఉపన్యసిస్తూ, బ్రిటిషు పాలకులు భారతదేశాన్ని తమదిగా భావించడమే అపరాధం. భారతీయుల హక్కుల గురించి భారతీయులను తమ బానిసలుగా చేసి వారి ప్రాణాలు సైతం బలి తీసుకోవటం క్షమించరాని అపరాధం” అంటూ ఆడపులిలా గర్జించింది. లండన్ కామన్స్ సభలోని భారత దేశ మంత్రి ఆమె చేస్తున్న తిరుగు బాటు ధోరణికి ఆగ్రహం చెంది ఆమె ఉపన్యాసాలు, ఉద్వేగం సక్రమమైనవి కావనీ, ఇకపై అటువంటి ప్రచారం చెయ్యవద్దనీ, బ్రిటిష్ ప్రభుత్వం ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చటట్లు చేస్తాడు. తనకే రకమైన శిక్ష విధించినా యధార్థాన్ని ప్రచారం చేయక మాననని నిర్భయంగా సమాధానం చెప్పింది సరోజినీ నాయుడు. ఒక భారత స్త్రీకి దేశంపై గల ప్రేమనూ, ఆమెకు గల స్వాతంత్ర్య పిపాసనూ అర్థం చేసుకుని అప్పటి నాయకుడైన గాంధీజీ ఆనందానికి అంతులేకుండాపోయింది. ఆయన రాజద్రోహము, నేరము క్రింద ఆరేండ్లు జైలు శిక్ష ననుభవించేందుకు వెళుతూ సరోజినీనాయుడు పై గల విశ్వాసంతో, ఉద్యమనాయకత్వం ఆమెకు అప్పగించి చేతిలో చేయి వేయుంచుకున్నాడు.

ఊరూరా, వాడవాడలా తిరుగుతు స్వాతంత్ర్య ప్రభోదం ముమ్మరంగా సాగించింది. అప్పటికే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. తన భర్త బిడ్డల యోగక్షేమాలు కూడా మాని సాటి భారతీయులను తన సొంత బిడ్డల మాదిరిగా భావింది పర్యటన సాగించిందా త్యాగమూర్తి. విరామ సమయాలలో దేశ ప్రజల భవిష్యత్ ను గురించి బ్రిటిష్ వారి ఘోర పరిపాలన గురించి రచనలు చేస్తూనె ఉంది. ఎక్కదున్నా, ఏదో ఒక రకంగా దేశ ప్రజలకు స్వాత్ర్ంత్ర్య భావాలను అందజేస్తూనే ఉంది.

దక్షిణాఫ్రికాలో భారతీయులు అనుభవిస్తున్న దుర్భర బానిసత్వాన్ని అర్థం చేసుకొని అక్కడి వారి హక్కులకోసం పోరాడేందుకు 1926 వ సంవత్సరం శ్రీమతి సరోజినీ నాయుడు దక్షిణాఫ్రికా వెళ్ళి వారికెంతో సేవ చేసింది. ఆమె దేశానికి చేసిన సేవల ఫలితంగా, ఆమెకు దేశంపై గల నిష్కళంక ప్రేమ ఫలితంగా కాన్పూరు లో 1925 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షురాలైంది “పీడిత ప్రజల విమోచనానికి జాతి, మత, కులపమైన భెదాలు ఇనిప సంకెళ్ళన్నీ, భారతీయులంతా ఒక్కటేనని, స్త్రీ పురుష భేదం లేకుండ త్యాగం చేస్తే గానీ, భరతజాతి బానిసత్వం నుంచి విమోచన పొందగలదని, అవసరమైతే ప్రాణత్యాగాలకైనా వెనుకాడడం తగదని, బానిసభావంతో తరతరాలు మ్రగ్గిపోతూ బ్రతికే కంటే త్యాగంతో ఒక తరం అంతరించినా కూడా, భావితరాలు వారికి స్వేచ్ఛను ప్రసాదించటం జాతీయ సంస్థ లక్ష్యమనీ!” మహోపన్యాసం యిచ్చి లక్షలాది ప్రజలను స్వాతంత్ర్య పిపాసులుగా తయారుచేసింది.

కెనడా, అమెరికా మొదలైన దేశాలకు 1928లో వెళ్ళి భారతీయుల బానిసత్వాన్ని గురించీ వీరి ఆశయాల గురించీ ప్రచారం చేసింది. 1929 లో తూర్పు ఆఫ్రికా అంతా ప్రచారము చేస్తూ పర్యటించింది. గాంధీజీ అరెస్టయినది మొదలు విశ్రాంతి అనే మాటకు తావివ్వకుండా దేశ, దేశాలు పర్యటిస్తూ పీడిత భారత ప్రజల విముక్తికి ఆమె ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఒక భారతీయ మహిళ చేస్తున్న ఉద్యమ ప్రచారానికి బ్రిటిష్ ప్రభుత్వం హడలిపోయింది. ఆమెను స్వేచ్ఛగా తిరగనీయడం తమకూ, తమ పరిపాలనకూ తగదని 1930 వ సంవత్సరం మే 23వ తేదీన శ్రీమతి సరోజినీ నాయుడును అరెస్టు చేసింది. అరెష్టయినందుకు గానీ, జైలు జీవితం అనుభవించేందుకు గానీ ఆమె ఏ మాత్రం భయపడలేదు. అవసరమైతె ప్రాణాలే ధార పోయాలని నిశ్చయించుకున్న దేశభక్తురాలికి ఏడెనిమిది నెలల జైలు జీవితం లెక్కలేదు. సమర్థురాలైన నాయకురాలిని. నిస్వార్థ దేశభక్తురాలిని అరెష్టు చేశారని విని గాంధీజీ ఎంతో బాధపడ్డాడు.

తను జైల్లో ఉన్నా అటువంటి ప్రచారకులు చీకటిలో ఉండటం వలన ప్రచారం ముమ్మరంగా సాగే అవకాశాలు లోపించగలవని ఆయన బాధ. భారతీయ ప్రతినిధిగా 1931 వ సంవత్సరంలో లండన్ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్ కు వెళ్ళింది సరోజినీ నాయుడు. క్విట్ ఇండియా ఉద్యమంలో 1942 లో బ్రిటిష్ ప్రభుత్వాన్నెదిరించి ఎన్నో రకాలుగా స్వాతంత్ర్య పోరాటం సాగించిందామె. అందుకు ఫలితంగా అరెష్టు చేయబడి, దాదాపు 1945 వరకు దుర్బర కారాగారవాస జీవితం ఆనందంగా అనుభవించింది. అనారోగ్యంగా ఉన్న కారణంగా ఆమెను విడుదల చెయ్యవలసి వచ్చింది. 1947, ఆగష్టు 15 వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. శ్రీమతి సరోజినీనాయుడు దేశానికి చేసిన సేవలు దృష్టిలో ఉంచుకుని ఈమెకు ఉత్తర ప్రదేశ్ గవర్నర్ పదవి ఇచ్చి సత్కరించడం జరిగినది. వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉండి కూడా ఆమె ఉత్తరప్రదేశ్ కు చేసిన సేవ, కార్యదక్షత ఎన్నటికీ మరపురానివి.

శ్రీమతి సరోజినీనాయుడు తన డబ్బై వ యేట 1949 మార్చి 2 వ తేదీన లక్నోలో ప్రశాంతంగా కన్ను మూసింది. . ఈమె జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 13న ఈమె చిత్రంతో ఒక తపాలబిళ్ళను విడుదల చేసింది.

ఈమె మీద అభిమానంతో హైదరాబాదులో సికింద్రాబాద్ దగ్గర ఒక వీధికి సరోజినీ దేవి రోడ్ అని నామకరణం చేసారు. ఈమె పేరున హైదరాబాదులో సరోజినీ కంటి ఆసుపత్రీ’ని కూడా స్థాపించారు. ఈవిడగారి విలువైన వస్తువులు ఇప్పటికీ సాలార్ జంగ్ మ్యూజియంలోను, జాతీయ పురావస్తు ప్రదర్శనశాలలోనూ భద్రంగా ఉన్నాయి.

సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్ ప్రముఖ భారత బాడ్మింటన్ క్రీడాకారిణి. ఒలింపిక్ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ చేరడమే కాకుండా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలి మహిళ. పుల్లెల గోపీచంద్ ఈమె శిక్షకుడుసైనా నెహ్వాల్ సైనా నెహ్వాల్.

జూన్ 20, 2010న సింగపూర్‌లో జరిగిన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సీరీస్ టైటిల్‌ను నెగ్గి రెండు సూపర్ సీరీస్ టైటిళ్ళు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి 2006లో ఫిలిప్పీన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ను గెలిచి 4-స్టార్ ఓపెన్‌ను గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించుటతో సైనా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ టోర్నమెంటులో 86వ సీడ్‌గా ప్రవేశించిన ఆమె పలు టాప్‌సీడ్‌లను ఓడించి చివరకు విజేతగా నిల్చింది. అదే సంవత్సరం BWF ప్రపంచ చాంపియన్‌లో రన్నరప్‌గా నిల్చింది.

2007 లో ఇండియా నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించి, జాతీయ క్రీడలలో బ్యాడ్మింతన్ స్వర్ణాన్ని గెలుచుకుంది. 2008లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌ను సాధించింది ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. చైనా మాస్టర్ సూపర్ సీరీస్‌లో సెమీస్ వెళ్ళగలిగింది. ఇండియన్ నేషనల్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌లో విజేతగా నిలిచి, అదే సంవత్సరం కామన్వెల్త్ యూత్ గేమ్స్ లో స్వర్ణపతకం సాధించినది. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కూడా టైటిల్ సాధించింది. 2009 ఇండోనేషియా ఓపెన్‌లో టైటిల్ సాధించి, BWF ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగలగింది.

2010లో ఆల్‌ఇంగ్లాండు సూపర్ సీరీస్ సెమీస్ వరకు వెళ్ళిగలిగింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యపతకం సాధించింది. ఇండియా ఓపెన్, ఇండోనేష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రిక్స్‌లలో టైటిళ్ళను గెలుపొందింది.సైనా నెహ్వాల్ 2008 ఒలింపిక్ క్రీడలలో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ చేరుకొని ఇందులోనూ ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.

రజియా సుల్తాన్

razia sultan

రజియా సుల్తాన్ అసలు పేరు రజియా ఆల్ దీన్. కానీ చరిత్రలో రజియా సుల్తాన్ లేదా రజియా సుల్తానాగా ప్రసిద్ ఈమె ఢిల్లీ సింహాసనంపై కొద్దికాలం మాత్రమే ఉంది. క్రీ.శ. 1236 నుండి 1240 వరకు. ఈమె సెల్జుక్ వంశానికి టర్కిష్ మహిళ, ఈమె సైనిక విద్య, కవాతు, ఇతర యుద్ధ విద్యలు నేర్చుకున్నది. టర్కిష్ చరిత్రలోనూ మరియు ముస్లింల చరిత్రలోనూ ప్రథమ మహిళా చక్రవర్తి. ఈమె తండ్రి షంసుద్దీన్ అల్తమష్ (“ఇల్‌టుట్ మిష్”) తరువాత, ఇతని వారసురాలిగా ఢిల్లీ సింహాసనాన్ని 1236 లో అధిష్టించింది. కానీ ముస్లిం నాయకులు ఒక మహిళ సుల్తాన్ గా ప్రకటించబడడం జీర్ణించుకోలేక, రజియా అన్నయైన రుక్నుద్దీన్ ఫిరోజ్ షాను అల్తమష్ ను రాజుగా ప్రకటించారు.

రుక్నుద్దీన్ పరిపాలన చాలా తక్కువకాలం సుల్తాన్ గా ఉంటాడు.. అల్తమష్ భార్యయైన షాహ్ తుక్రాన్, తన కుమారుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టి తానే అధికారాలు చెలాయించేది. రుక్నుద్దీన్ వ్యసనపరుడైనందున ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. నవంబరు 9, 1236 న షాహ్ తుక్రాన్ మరియు రుక్నుద్దీన్ చంపబడతారు. రుక్నుద్దీన్ కేవలం ఆరునెలలు మాత్రమే సుల్తాన్ గా ఉన్నాడు.
రజియా సామర్ధ్యం దృష్ట్యా, ఈమె ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించేందుకు ప్రజలు సుముఖత చూపారు. రజియా అందరు అంతఃపుర స్త్రీలలా వుండేది కాదు. ప్రజలలో ఒకరిగా వుండేది. ప్రజలతో సంబంధాల కారణంగా మంచి పేరు, గౌరవం, పలుకుబడి సంపాదించుకుంది. తన తండ్రి కాలంలో తండ్రితోనే వుంటూ రాజవ్యవహారాలను చక్కగా నేర్చుకుంది. పురుషునివలె దుస్తులు ధరించి సైనికులతో తిరిగేది. యుద్ధాలలో ముందుండి తానే నాయకత్వం వహించేది. రాజతంత్రాలలో ఆరితేరిన రజియా, తనకు వ్యతిరేకులైన టర్కిష్ ప్రతినిథులను సామంతులను అవలీలగా నిలువరించగలిగింది. తన వ్యతిరేక వర్గాల మధ్య వ్యతిరేకతను సృష్టించి తన సింహాసనాన్ని భద్రపరచుకో గలిగినది.


కానీ రజియా తన సలహాదారులలో ఒకడైన జమాలుద్దీన్ యాకూత్, ఒక అబిసీనియన్ దాసుడు పట్ల ఆకర్షితురాలవటం వలన ఇతర ప్రతినిధుల కోపాన్ని చవిచూడవలసివచ్చింది. ఒక అబిసీనియన్ దాసుడికి రజియా దాసురాలవడం వీరు సహించలేక పోయారు. రజియాకు వ్యతిరేకంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రజియా చిన్ననాటి స్నేహితుడు మరియు భటిండా గవర్నరు అయిన మాలిక్ ఇక్తియారుద్దీన్ అల్తూనియా, ఈ వ్యతిరేక వర్గాలతో చేయి కలిపాడు. వీరందరూ రజియా మీదకు యుద్దానికి వస్తారు. రజియా మరియు అల్తూనియాల మధ్య జరిగిన యుద్ధంలో యాకూత్ చంపబడతాడు, రజియాను చెరసాలలో పెడతారు. గత్యంతరం లేని పరిస్థితులలో రజియా అల్తూనియాను వివాహమాడింది. ఈ మధ్యకాలంలో రజియా అన్నయైన ముయిజుద్దీన్ బహ్రామ్ షాహ్ ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమిస్తడు. రజియా సుల్తానా, అల్తూనియా ఇద్దరూ కలిసి ఢిల్లీని తిరిగి దక్కించుకోవటం కోసం యుద్ధానికి వస్తారు. కానీ ఈ యుద్ధంలో అల్తూనియా మరియు రజియా అక్టోబరు 14, 1240 న, ప్రాణాలు కోల్పోయారు.

రజియా పరిపాలన
రజియా, సుల్తానుగా ముస్లిమేతరులపై పన్నులను తొలగించింది, ఈవిషయం ఇతర ముస్లిం ప్రతినిధులను కోపాన్ని తెప్పించింది. ఇందుకు సమాధానంగా, రజియా, ముస్లింల భావాలకన్నా ఇస్లాం సూత్రాలు ముఖ్యమనీ ముహమ్మద్ ప్రవక్త ప్రవచనాలను ఉటంకించింది, ‘‘ముస్లిమేతరులపై భారాలను మోపకండి’’ – ముహమ్మద్ ప్రవక్త ”

ఇంకో సందర్భంలో రజియా, క్రొత్తగా ఇస్లాంను స్వీకరించిన ఒకరికి ఉన్నత స్థానంగల హోదానిచ్చింది, ఈ చర్యను టర్కిష్ నోబుల్స్ వ్యతిరేకించారు రజియా తన రాజ్యంపట్ల తన ప్రజలపట్ల అమిత శ్రద్ధాశక్తులు చూపేది. ప్రజాక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చేది. ఇతర రాజులమాదిరి, ప్రజలనుండి దూరంగా వుండక, ప్రజలలోనే ఒకరిగా తిరుగుతూవుండేది. పరమత సహనం ఈమె ఆభరణము. ఈమె హిందూమతావలంబీకుల పట్ల చూపించే అభిమానం పట్ల, సమకాలీన ముస్లిం చరిత్రకారులు వ్యతిరేకత వ్యక్తపరిచారు.

రజియా, పాఠశాలలను, విద్యాసంస్థలను, పరిశోధనా కేంద్రాలను, ప్రజాగ్రంధాలయాను స్థాపించింది. ఈ సంస్థలలో, ప్రాచీన తత్వవేత్తలపై, ఖురాన్ పై, హదీసులపై పరిశోధనలు సాగేవి. హిందు ధర్మశాస్త్రాలు, తత్వము, ఖగోళశాస్త్రము మరియు సాహిత్యమునూ ఈ పాఠశాలలు, కళాశాలలో అధ్యయనా విషయాలుగా వుండేవి. రజియాను ఎవరైనా “సుల్తానా” అని సంబోధిస్తే, నిరాకరించేది. సుల్తానా అనగా ‘సుల్తాన్ గారి భార్య’ అని అర్థం వస్తుంది. తననెప్పుడూ “సుల్తాన్” అని పిలవమని కోరేది.

మేధా పాట్కర్

medha parker

మేధా పాట్కర్ సామాజిక ఉద్యమకారిణి. నర్మదా బచావో ఉద్యమంతో ఈమె పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. మేధా పాట్కర్ డిసెంబరు 1, 1954 న ముంబాయిలో జన్మించింది. తల్లితండ్రులు ఇందు, వసంత కనోల్కర్. వీరు కూడా సామాజిక సేవా కార్యకర్తలు. టాటా సంస్థలో ఎం.ఏ.సోషల్ వర్క్, తరువాత 7 సంవత్సరాలు స్వచ్చంద సంస్థల్లో పనిచేసింది. భర్తతో సామరస్యంగా విడిపోయింది.
2014 ఎన్నికలలో ఈమె ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈశాన్య ముంబయి లోక్ సభ స్థానానికి పోటీ చేసారు, కాని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

మేధా పాట్కర్ పొందిన అవార్డులు
1991లో రైట్ లివ్లీహుడ్ అవార్డు లభించింది.
1999లో ఎం.ఏ.థామస్ జాతీయ మానవ హక్కుల అవార్డు పొందినది.

కిరణ్ బేడీ

kiran bedi

కిరణ్ బేడీ భారతదేశపు మొట్టమొదటి ఐ పి యస్ అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది కిరణ్ బేడి 1949, జూన్ 9వ తేదీన పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించింది. తండ్రి ప్రకాశ్ రావ్, తల్లి ప్రేమలత. డిగ్రీవరకు అమృతసర్ లో చదువుకుంటుంది. పంజాబ్ విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్రం చదువుకుంది. ఉద్యోగంలో చేరినతరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకొని న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందుతుంది.

1993లో ఢిల్లీ ఐ.ఐ.టి. పి.హెచ్.డి. పట్టాను ప్రధానం చేసింది. కిరణ్ బేడీ చిన్న వయస్సులో మంచి క్రీడాకారిణి. గతంలో అఖిల భారత టెన్నిస్ టైటిల్ ను మరియు ఆల్ ఏషియన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుపొందింది. 22 ఏళ్ళ వయసులో ఏషియా మహిళల టైటిల్ ను గెలుపొందినది. 1972లో జూలైలో మొట్టమొదటి ఐ పి యస్ గా ఎన్నికైనారు.

కిరణ్ బేడీ అమృత్‌సర్ లోని ఖాల్సా మహిళల కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఉపన్యాసకురాలిగా (లెక్చరర్) జీవితం ప్రారంభించినది (1970-72) . 1972లో ఆమె ఇండియన్ పోలీస్ సర్వీసుకు ఎంపికైంది. ఢిల్లీలో ట్రాఫిక్ పోలీస్ కమీషనర్‌గా, మిజోరాంలో డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆప్ పోలీస్‌గా, చంఢీగర్ లెప్టినెంట్ గవర్నర్ సలహాదారునిగా, ఐక్యరాజ్య సమితిలోను పనిచేసింది. ఢిల్లీ ట్రాపిక్ పోలీస్ కమీషనర్ గా ఉన్నప్పుడు రోడ్లపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన కార్లను క్రేన్లతో పారద్రోలి క్రేన్ బేడీగా ప్రసిద్ధి చెందినది. తీహారు జైలులో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి అందరి మన్ననలను పొందింది. వాటి ఫలితంగా ప్రభుత్వ సర్వీసు రంగంలో రామన్ మెగసెసె అవార్డు పొందినది.

1973 జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భంగా మొట్టమొదట మహిళా ఐ పి యస్ ను చూసిన ప్రజలు ఆనందాశ్చర్యాలకి లోనయ్యారు.ఆ మరుసటిరోజే అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఈమెను అల్పాహారానికి ఆహ్వానించింది.1982లో ప్రధాని ఇందిరాగాంధి కారుని ప్రవేశంలేని చోట ఆపివుంచిన కారణంతో క్రేన్ సహాయంతో అక్కడనుండి తీసివేయించింది.
ఆ సమయాన ఆమెచూపిన కర్తవ్యనిర్వాహణపట్ల ముగ్డులైన ప్రజలు ఆమెను క్రేన్ బేడి అని పిలిచేవారు.1987లో నవజ్యోతి, 1994లో ఇండియావిజన్ పౌండేషన్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలను ఏర్పరిచారు. కిరణ్‌ బేడీ తన ఆత్మకథ ‘ఐ డేర్‌’ పేరుతో తనే రాసుకున్నది.

కల్పనా చావ్లా

కల్పనా చావ్లా ఒక ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు.
కల్పనా చావ్లా, భారత దేశంలో హర్యానా లోని కర్నాల్ అనే ఊరులో ఒక పంజాబీ కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులకు సునీత, దీప, సంజయ్ ల తర్వాత ఈమె జన్మించారు. ఇంట్లో అందరూ ముద్దుగా “మోంటు” అని పిలుచుకుంటారు. తండ్రి బనారసీలాల్ చావ్లా సాధారణ వ్యాపారి. కల్పనపై ఆయన ప్రభావం ఎక్కువ. పేదరికం నుంచే ఆయన పైకెదిగారు. పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి ఆయన. చిన్నగా టైర్ల వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన తొలుత ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. అయినా దాన్ని వదలకుండా అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగిపోయారు. అప్పటి వరకూ టైర్ల తయారీకి విదేశీ యంత్రాన్ని ఉపయోగించేవారు. ఆ క్రమంలో ఆయన దేశీయంగానే ఆ యంత్రాన్ని రూపొందించారు. బనారసీలాల్ శ్రమ ఫలించింది. రాష్ట్రపతి నుంచీ అభినందనలు అందుకున్నారు. తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకున్నారు ఆడపిల్లే అయినా జీవితంలో ఏదో సాధించాలన్న తపన కల్పనలో ఉండటానికి తండ్రేకారణం. “పరిస్థితులు ఎలాగున్నా… కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం అన్న మాటలు నా తండ్రి జీవితంలో నిజమయ్యాయి. ఫలితంగా అవే నాలోనూ జీర్ణించుకుకుపోయాయి. అందుకు నాన్నే కారణం.” అంటూ తొలి అంతరిక్షయానం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆలోచనలు ఏ విధంగా ప్రభావితమయిందీ కల్పన వివరించారు.

కల్పనా చావ్లా ముందుగా, కర్నాల్ లో ఉన్న టాగోర్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. తోటి పిల్లలంతా కామిక్ పుస్తకాలు చదువుతూ …..బర్బీ బొమ్మల్లా అలంకరించుకునే వయసులో… ఆమె తెల్లవారు జామునే లేచి సైకిల్ పై స్కూలు కెళ్ళేవారు. స్కూల్లో డ్రాయింగ్ క్లాసులో విమానం బొమ్మలు గీయటానికి ఇష్టపడేవారు. ఈమె సోదరుడు సంజయ్ చావ్లా కమర్షియల్ పైలట్ కావాలని కలలు కనేవాడు. తన గదిలో విమానాల బొమ్మలుంచేవాడు. అవి కల్పనలో స్ఫూర్తిని కలిగించాయి. కల్పన తన కలల్ని నిజం చేసుకోవటానికి సోదరుడు సంజయ్ ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇద్దరి కలలూ ఒకటే – ఆకాశంలో ఎగరడం. కర్నాల్ లోని టాగోర్ పాఠశాలలో ఈమె ప్రాథమిక విద్య సాగింది.

పంజాబ్ ఇంజరీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. . 1982 లో ఈమె అమెరికా వెళ్లి అక్కడ “ఏరోస్పేస్ ఇంజనీరింగ్”లో మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీని, అర్లింగ్టన్ లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి 1984 లో పొందారు. 1986 లో చావ్లా రెండవ మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీని మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పిహెచ్ .డిని బౌల్డెర్ లో ఉన్న కోలోరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందారు. అందమైన భవిష్యత్ కోసం కలలు కంటూ గాలిలో మేడలు కట్టకుండా జీవిత లక్ష్యాన్ని సాధించుకున్న మహిళ కల్పనా చావ్లా. చదువులో ఎప్పుడూ ముందు ఉండేది. ఈమెను ఎక్స్‌ట్రావెర్ట్ గా ఉపాధ్యాయులు పేర్కొనేవారు. సహజంగా ఒక వ్యక్తి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయసులో కెరియర్ ను ప్రారంభించినా, అప్పటి నుంచి ఓ 15 ఏళ్ళు కష్టపడితే గాని పేరు రాదు. కానీ కల్పన పిన్నవయసులోనే గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఈమె నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసినపుడు ఈమెతో 2 వేల మంది పోటీ పడ్డారు. అయితే ఈమె మాత్రమే నాసా శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు సంప్రదాయవాదులే అయినా కొత్తను ఎప్పుడూ ఆహ్వానించేవారని అంటారీమె. తన కెరియర్ ను వారెప్పుడూ అడ్డుకోలేదనని, తాను కోరుకున్న దానికి ఆమోదం తెలిపేవారని అన్నారు.

1986 సంవత్సరం లో, NASA ఏమ్స్ పరిశోదనా కేంద్రంలో ఓవర్ సెట్ మెథడ్స్, ఇంక్.కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. చావ్లా విమానాలకు,గ్లైడర్లు లకు మరియు ఒకటి లేదా ఎక్కువ యంత్రాలు ఉండే విమానాలకు, వ్యాపార విమానాలకు శిక్షణ ఇచ్చే యోగ్యతాపత్రం కలిగి ఉన్నారు. ఆమె దగ్గర యఫ్సిసి జారీ చేసే టెక్నికల్ క్లాసు అమెచూర్ రేడియోఅనుమతి కాల్ సైన్ KD5ESI ఉంది. ఆమె 1983 లో విమానయాన శిక్షకుడు మరియు విమాన చోదక శాస్త్ర రచయిత ఐన జీన్-పియర్ హారిసన్ ను వివాహం చేసుకున్నారు, 1990 లో యునైటెడ్ స్టేట్స్ దేశ పౌరురాలిగా అయ్యారు.

పి.టి. ఉష పరుగుల రాణి

PT Usha

పి.టి. ఉష క్రీడారంగంలో భారత దేశపు క్రీడారంగంలో పరుగుల రాణి పేరు పొందింది.
ఉష కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలీలో 1964 మే 20 న జన్మించింది.
1979 నుంచి, భారతదేశం తరఫున అథ్లెటిక్స్ లో పాల్గొని, దేశానికి పలు విజయాలను అందించింది. ఈమెను పయోలి ఎక్స్ ప్రెస్ అని పిలుస్తారు. పి.టి.ఉష 1976లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన క్రీడా పాఠశాలలో కోజికోడ్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి, అందులో చేరింది. 1979లో ఉష జాతీయ స్థాయి పాఠశాల క్రీడలలో పాల్గొన్నది. అప్పుడే ఆమెలోని నైపుణ్యాన్ని కోచ్ ఓ. నంబియార్ పసిగట్టాడు. అప్పటి నుంచి ఆమెకు చాలా కాలం వరకు అతడే కోచ్ గా శిక్షణ ఇచ్చాడు. ఆ సమయంలో దేశంలో మహిళా అథ్లెట్ల సంఖ్య చాలా తక్కువ.

అథ్లెటిక్ సూట్ ధరించి ట్రాక్ పై పరుగెత్తడం అరుదుగా జరిగేది. 1980 రష్యా ఒలింపిక్స్ లో పాల్గొన్ననూ ఆమెకు అది అంతగా కలిసిరాలేదు. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో 100 మీ. మరియు 200 మీటర్ల పరుగులో రజత పతకం పొందింది. 1985లో కువైట్లో జరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో ఉష బంగారుపతకం పొందడమే కాకుండా, కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. 1983 నుంచి 1989 మధ్యకాలంలో ఉష ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్స్ పోటీలలో 13 స్వర్ణ పతకాలను సాధించింది. 1984లో అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో ఉష సెమీఫైనల్స్ లో పథమస్థానంలో వచ్చినా కూడా పైనల్స్ లో వెంట్రుకవాసిలో పతకం పొందే అవకాశం పోగొట్టుకుంది. సెకనులో వందోవంతు తేడాతో కాంస్యపతకం పొందే అవకాశం జారవిడుచుకున్ననూ, ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్స్ లో పైనల్స్ చేరిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 1960లో ప్లయింగ్ సిఖ్ మిల్కాసింగ్ కు కలిగిన దురదృష్టమే పి.టి.ఉషకు కూడా కలిగింది.

1986లో దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరిగిన 10 వ ఆసియా క్రీడలలో పి.టి.ఉష 4 బంగారు పతకాలను సాధించడమే కాకుండా అన్నిట్లోనూ ఆసియా రికార్డులు సాధించడం విశేషం. అదే ఆసియాడ్ లో మరో రజత పతకం కూడా సాధించింది. 1985లో జకార్తాలో జరిగిన 6వ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్ షిప్ పోటీలలో ఈమె 5 బంగారు పతకాలను సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అంతర్జాతీయ క్రీడాజీవితంలో ఈమె 101 స్వర్ణ పతకాలను సాధించింది.
1984 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదం అందుకుంది. 1985 లో జకర్తా అథ్లెటిక్ మీట్ లో గొప్ప మహిళా అథ్లెట్ గా పేరుపొందింది.

1984, 1985, 1986, 1987 మరియు 1989 లలో ఆసియా అవార్డులో అత్తమ అథ్లెట్ గా అవార్డు అందుకుంది
1984, 1985, 1989 మరియు 1990 లలో ఉత్తమ రైల్వే క్రీడాకారులకు ఇచ్చే మార్షల్ టిటో అవార్డు దక్కించుకొంది
1986 లో సియోల్ ఆసియా క్రీడలలో ఉత్తమ అథ్లెట్ కు ప్రధానం చేసే అడిడాస్ గోల్డెన్ షూ అవార్డు సంపాదించింది
అథ్లెటిక్స్ లో ఉత్తమ ప్రదర్శనకు 30 అంతర్జాతీయ అవార్డులు
1999 కేరళ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అవార్డు కైవసం చేసుకొంది
1985, 1986 లలో ఉత్తమ అథ్లెటకు ఇచ్చే వరల్డ్ ట్రోఫీ అవార్డు ఈమెకు ప్రధానం చేసారు.

కోనేరు హంపి

Koneru Hampi

కోనేరు హంపి భారతదేశంలో పేరుపొందిన మహిళా చదరంగ క్రీడాకారిణి.
హంపి 1987, మార్చి 31న ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో జన్మించినది. కోనేరు 2007 అక్టోబర్ లో ఫైడ్ ఎలో రేటింగ్ లో 2600 పాయింట్లను దాటి మహిళా చదరంగంలో జూడిత్ పోల్గర్ తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో నిల్చింది. కేవలం 15 సంవత్సరాల వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించిన భారతదేశపు తొలి చెస్ క్రీడాకారిణి హంపి. 2001లో హంపి ప్రపంచ జూనియర్ బాలికల చెస్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.

ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన తండ్రి కోనేరు అశోక్ ద్వారా హంపికి చదరంగం ఆట పరిచయమైయింది. 1995లో 8 సంవత్సరాలలోపు వారికి నిర్వహించిన జాతీయ చదరంగం పోటీలో హంపి నాలుగవ స్థానం కైవసం చేసుకోగానే, అశోక్ తన వృత్తికి రాజీనామా చేసి హంపికి పూర్తి స్థాయి శిక్షకుడిగా మారిపోయాడు. ఆ తరువాత 1998లో 10 సంవత్సరాలలోపు వారికి నిర్వహించిన జాతీయ చదరంగం పోటీలో హంపి స్వర్ణపతకం సాధించి, వివిధ వాణిజ్య సంస్థలనుండి ఆర్థిక ప్రోత్సాహకాలను అందుకుంది.

2003లో చదరంగం ఆటలో అర్జున అవార్డును హంపి కైవసం చేసుకుంది. చదరంగం ఆటలో హంపి చూపించిన విశేష ప్రతిభకు గుర్తింపుగా 2007లో భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది. 2008లో ఈమెకు శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం లభించింది.

అశ్వనీ నాచప్ప

aswani nachappa

అశ్వనీ నాచప్ప భారతీయ క్రీడాకారిణి. మహిళల పరుగుపందెములో 1980వ దశకపు ప్రధమార్ధంలో పి.టి.ఉషను ఓడించి భారతీయ ఫ్లోజోగా పేరు తెచ్చుకున్నది. ఈమెకు 1988లో అర్జున అవార్డు ప్రదానం చేయబడింది.నాచప్ప జన్మస్థలం కర్ణాటక రాష్ట్రం కూర్గ్ . నాచప్ప క్రీడా రంగము నుండి తొలిన తర్వాత 1994 అక్టోబర్ 2 న ఇండియన్ ఏయిర్‌లైన్స్ జట్టు హాకీ ఆటగాడు దత్త కరుంబయ్యను వివాహము చేసుకొంది. వీరికి అనీషా, దీపాలీ కుమార్తెలు నాచప్ప హీరోయిన్ గా రెండు తెలుగు సినిమాలు వచ్చాయి.. సీఎస్‌ఐ పేరుతో ఒక సంస్థను ఆరంభించింది. మెరికల్లాంటి సుశిక్షితులయిన క్రీడాకారులను తీర్చిదిద్దుతూనే… క్రీడా రంగంలో మహిళల వేధింపులకు… నానాటికీ పెచ్చుమీరుతోన్న అవినీతి పోకడలకు వ్యతిరేకంగా గళం విప్పింది. ప్రముఖ క్రీడాకారులను కూడగట్టి ఉద్యమం బాట పట్టింది. మైదానంలో అశ్విని ఒక సంచలనం.. పరుగుల బరిలో, మెరుపు వేగంతో చిరుతపులిలా ఆమె లక్ష్యాన్ని అధిగమించే తీరు క్రీడాభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంది. చిరస్మరణీయమైన విజయాలు సాధించిన అశ్వని పదేళ్ల క్రితమే క్రీడారంగం నుండి వైదొలగింది నేను కొడగు జిల్లాలోని గోణికొప్ప అనే చిన్న గ్రామంలో పెరిగాను. అక్కడ విద్య, ఆరోగ్య వసతుల్లేవు. అక్కడ ఉంటూ పల్లె ప్రజలకు సేవ చేయాలనుకున్నా. అందుకే అక్కడ ఓ స్కూలు ఆరంభించా. పాఠాలతో పాటూ… ఆటల్లోనూ శిక్షణనిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది. అశ్విని నిర్వహిస్తున్న పాఠశాలలో అరవై శాతం స్థానికులకే చదువుకునే అవకాశం. ప్రస్తుతం 560 మంది విద్యార్థులు అక్కడ చదువుకొంటున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయాన్ని తగ్గించి క్రీడా సంఘాల నాయకత్వ బాధ్యతలని క్రీడాకారులకే అప్పగించాలి అంటున్నారుఆమె తన ఇద్దరమ్మాయిల క్రీడాసక్తుల్ని గమనించి వారికి క్రీడలలో శిక్షణ ఇస్తున్నారు. పెద్ద కూతురు అమీషా రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి. రెండో కుమార్తె దీపాలి గోల్ఫ్‌ క్రీడాకారిణి.

శోభానాయుడు – ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి.

sobha naidu

శోభానాయుడు విశాఖ జిల్లా అనకాపల్లి లో 1956 లో జన్మించారు. వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెంపటి నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించారు. స్వచ్చమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువు అలాగే నాట్యం వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి శోభానాయుడు. ఆంధ్రప్రదేశ్‍కు చెందిన శోభానాయుడు తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నది. శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్రీయ మరియు జాతీయ పురస్కారాలను అందుకున్నారు.

శోభానాయుడు కూచిపూడి కళను ప్రదర్శించడంలో అమెకు ఆమె సాటి అన్న ప్రఖ్యాతి గడించింది. ఈమె వెంకటనాయుడు మరియు సరోజిని దేవి దంపతులకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించింది. ఆమె బాల్యంలో తన నాట్యకౌశలంతో అనేకమంది హృదయాలను మంత్రముగ్ధులను చేసింది. ఈమెకు 1990 – సంగీత నాటక అకాడమీ పురస్కారం మరియు 2001 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం లభించాయి.

శకుంతలా దేవి

shkuntala devi

శకుంతలా దేవి ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ మరియు జ్యోతిష శాస్త్రవేత్తఈమెను అందరూ మానవ గణన యంత్రము అని పిలుస్తారు. ఈమె ప్రపంచవ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి గణన యంత్రము కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించింది లెక్కలను చేయటలో గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది.

శకుంతలా దేవి బెంగళూరు నగరంలో కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో నవంబర్ 4, 1929 జన్మించారు. ఆమె తండ్రి ఒక సర్కస్ కంపెనీలో తాడుతో చేసే విన్యాసములు చేసే ఉద్యోగి.

1977లో అమెరికాలో ఓ కంప్యూటర్ తో శకుంతలా దేవికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా, ఆమె కంప్యూటర్ ను ఓడించగలిగారు. ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు. 76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం.. 18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నెస్ రికార్డు ఆమె సొంతమైంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి ఆశ్ఛర్యపోయారు.

ఆరేళ్ల వయసులో తొలిసారి శకుంతలా దేవి మైసూరు విశ్వవిద్యాలయంలో తన గణిత ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించారు. ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆమె ప్రదర్శనతో శకుంతలాదేవిని బాలమేధావిగా గుర్తించారు.గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు. తన 83వ ఏట 2013 ఏప్రిల్ నెలలో గుండె, మూత్రపిండాల సమస్యలతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.

Special Story About Shakuntala Devi From Bangalore - Sakshi

‘నేను చెట్టును కాను… ఉన్న చోటునే ఉండిపోవడానికి’ ‘ఏ ఊళ్లో అయినా నాలుగు రోజులు దాటితే నాకు బోర్‌ కొట్టేస్తుంది’ ‘నాకు కాళ్లున్నాయి.. ప్రపంచమంతా చుట్టేయాలని ఉంది’ శకుంతలా దేవిని అర్థం చేసుకోవడానికి ఈ మాటలు ఉపయోగపడతాయి. జటిలమైన లెక్కల్ని సెకన్లలో తేల్చేసిన ఈ ‘హ్యూమన్‌ కంప్యూటర్‌’ జీవితం కూడా జటిలమైన లెక్క లాంటిదే. కూతురిగా, తల్లిగా, భార్యగా, జీనియస్‌గా ఆమె తన భావోద్వేగాలనే తాను విశ్వసించింది. ఎదుటివారితో ఇది ఘర్షణకు కారణమైంది. ఆమె బయోపిక్‌ ‘శకుంతలా దేవి’ ఆమె కథను చెబుతోంది. ‘రెండు జడలతో లెక్కలు చేసే’ ఒక భారతీయ జీనియస్‌ను పున:పరిచయం చేస్తుంది.

కుటుంబం కూడా భలే స్వార్థపూరితమైనది. ఎవరికైనా ఇంట్లో రెక్కలు మొలిచాయని గ్రహించిన వెంటనే ఇక అన్ని పనులు పక్కన పెట్టి అన్ని బరువులను ఆ మనిషి మీద వేయడానికి చూస్తుంది. ‘శకుంతలా దేవి’ జీవితంలో జరిగింది అదే. కొన్ని కోట్ల మందిలో ఒక్కరికి వచ్చే అరుదైన మేధ ఆమెకు వచ్చింది. ఆమె మెదడులో గణితానికి సంబంధించిన అద్భుతమైన శక్తి ఏదో నిక్షిప్తమై ఉంది. అది ఆమె ఐదో ఏటనే బయట పడింది. ఆ క్షణం నుంచి ఆమె కుటుంబానికి ఒక ‘సంపాదించే లెక్క’ అయ్యిందే తప్ప ప్రేమను పొందాల్సిన సభ్యురాలు కాకపోయింది.

బెంగళూరు పసి మేధావి
శకుంతలా దేవి బెంగళూరులోని ఒక సనాతన ఆచారాల కన్నడ కుటుంబంలో పుట్టింది (1929). వాళ్ల నాన్న సర్కస్‌లో పని చేసేవాడు. ట్రిక్స్‌ చేసేవాడు. శకుంతలా దేవి మూడేళ్ల వయసులో కార్డ్‌ ట్రిక్స్‌ను గమనించేది. ఐదేళ్ల వయసు వచ్చేసరికి అర్థ్‌మెటిక్స్‌లో అనూహ్యమైన ప్రతిభను కనపరచడం మొదలెట్టింది. రెండు రూపాయల ఫీజు కట్టలేక డ్రాపవుట్‌ అయిన ఈ పసిపాప ఆ క్షణం నుంచి కుటుంబానికి జీవనాధారం అయ్యింది. తండ్రి ఆ చిన్నారిని వెంట పెట్టుకుని ఊరూరు తిరుగుతూ ప్రదర్శనలు ఇప్పించి ఫీజు వసూలు చేసి కుటుంబాన్ని నడిపేవాడు. ఆమెను అతడు మరి స్కూలుకే పంపలేదు. శకుంతలాదేవికి స్కూల్‌ చదువు ఉండి ఉంటే ఆమె ఏయే సిద్ధాంతాలు కనిపెట్టేదో. కాని ఆమె సాటివారిని అబ్బురపరిచే గణిత యంత్రంగా ఆ మేరకు కుదింపుకు లోనయ్యింది.

తోబుట్టువు మరణం
తమ ఇళ్లల్లో స్త్రీలు ముఖ్యంగా తన తల్లి బానిసలా పడి ఉండటం, తండ్రిని ఎదిరించి తనను, తన తోబుట్టువులను బాగా చూసుకోలేకపోవడం గురించి శకుంతలాదేవికి జీవితాంతం కంప్లయింట్‌లు ఉన్నాయి. వికలాంగురాలైన తన పెద్దక్క సరైన వైద్యం చేయించకపోవడం వల్ల మరణించిందనీ, ఇందుకు తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కారణమని ఆమెకు ఆజన్మాంత ఆగ్రహం కలిగింది. ఆ అక్కతో శకుంతలాదేవికి చాలా అటాచ్‌మెంట్‌. ఆ అటాచ్‌మెంట్‌ పోవడంతో తల్లిదండ్రులతో మానసికంగా ఆమె తెగిపోయింది. అప్పటికే దేశంలోని గొప్ప గొప్ప యూనివర్సిటీలలో ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు పొందిన శకుంతలా దేవి తన పదిహేనవ ఏట 1944లో లండన్‌ చేరుకుంది. 


లండన్‌ జీవితం
శకుంతలా దేవికి ఇంగ్లిష్‌ రాదు. చదువు లేదు. ఉన్నదల్లా గణిత విద్య. దాంతో ఆమె సర్కసుల్లో పని చేసి డబ్బు సంపాదించవచ్చు అనుకుంది. కాని రెండు జడలు వేసుకున్న ఒక స్త్రీ లెక్కలు చేయడం ఏమిటని, ఒక వేళ చేసినా అదేదో మేజిక్‌ లాంటిదే తప్ప మేధస్సు అయి ఉండదని చాలామంది నిరాకరిస్తారు. అప్పుడు పరిచయమైన ఒక స్పానిష్‌ మిత్రుడు శకుంతలా దేవిని అక్కడి పరిసరాలకు అవసరమైనట్టుగా గ్రూమ్‌ చేస్తాడు. అక్కడి యూనివర్సిటీలు ఆమెను పరీక్షిస్తాయి. అక్కడి సాధారణ ప్రజలు ఆమెను గుర్తిస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా భారతీయ ఆహార్యాన్ని వదలకుండానే చీరలో పొడవైన కురులలో గణిత విద్యలు ప్రదర్శిస్తూ ఆమె విజేతగా నిలిచింది.

అనూహ్య ప్రతిభ
95,443,993 క్యూబ్‌రూట్‌ను 457గా ఆమె రెండు సెకన్లలో జవాబు చెప్పింది. 33 అంకెల సంఖ్యను ఇచ్చి దాని సెవెన్త్‌ రూట్‌ను చెప్పమంటే 40 సెకన్లలో జవాబు చెప్పి చకితులను చేసింది. ఇక 1980 జూన్‌లో ఆమె గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఆమెకు రెండు 13 అంకెల సంఖ్యల గుణకారం ఇస్తే 28 సెకెన్లలో జవాబు చెప్పి రికార్డు సాధించింది. గడిచిన శతాబ్దంలోని తేదీలు చెప్తే ఒక్క సెకనులో ఆమె ఆ తేదీన ఆ ఏ వారం వస్తుందో చెప్పేది. కొందరు సైంటిస్ట్‌లు ఉత్సాహం కొద్దీ ఆమె మెదడును పరిశీలించారుగాని ఏమీ కనిపెట్టలేకపోయారు. ఆ మేధ ఆమెకు మాత్రమే సొంతం.

బంధాల జటిలత్వం
సినిమాలో చూపిన కథ ప్రకారం ఆమెను గ్రూప్‌ చేసిన స్పానిష్‌ మిత్రుడు ఆమె లండన్‌లో గుర్తింపు పొందాక ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆమె కలకత్తాకు చెందిన ఒక ఐ.ఏ.ఎస్‌ ఆఫీసర్‌ను 1960లో పెళ్లి చేసుకుంది. వారికి అనుపమ బెనర్జీ అనే కుమార్తె జన్మించింది. తన ప్రదర్శనలు, పర్యటనలు ఆపేసి కొంతకాలం శకుంతలాదేవి కలకత్తాలో ఉండిపోయినా ఆమెకు అలా ఉండిపోవడం తీవ్ర అశాంతి కలిగిస్తుంది. భర్త అనుమతితో తిరిగి ప్రపంచ పర్యటన ప్రారంభిస్తుంది గాని కూతురికి దూరమయ్యాననే గిల్ట్‌ ఉంటుంది. ఆ తర్వాత తనే కూతురిని తీసుకుని భర్తను వదిలి తన వద్దే ఉంచుకుంటుంది. తన తండ్రి తనతో ఎలా వ్యవహరించాడో తాను కూడా కూతురి చదువు వదిలిపెట్టి తనతో పాటు తిప్పుకోవడం భర్త సహించలేకపోతాడు.

క్రమంగా ఇది వారి విడాకులకు కారణమవుతుంది. కూతురిని ఎక్కడ కోల్పోతానోనని శకుంతలా దేవి ఆ అమ్మాయిని తండ్రికే చూపక పదేళ్ల పాటు దూరం చేసేస్తుంది. ఇవన్నీ తల్లీకూతుళ్ల మధ్య ఘర్షణకు కారణమవుతాయి. భర్తతో విడాకులు అవుతాయి. ఎన్ని జరిగినా శకుంతలా దేవి రెంటిని గట్టిగా పట్టుకోవడం కనిపిస్తుంది. ఒకటి లెక్కలు. రెండు కూతురు. లెక్కలకు ప్రాణం ఉండదు. ప్రాణం ఉన్న కూతురు ఆమెతో తీవ్ర పెనుగులాటకు దిగుతుంది. ‘నన్ను నా కూతురు ఎప్పుడూ తల్లిలానే చూసింది. నన్నో జీనియస్‌గా చూసి ఉంటే సరిగా అర్థం చేసుకునేది’ అని శకుంతలా దేవి అంటుంది. మరణించే సమయానికి కూతురితో ఆమెకు సయోధ్య కుదరడం ప్రేక్షకులకు ఊరట కలుగుతుంది.
శకుంతలాదేవి పాత్రలో విద్యాబాలన్‌

గొప్ప ప్రయత్నం
ఈ గొప్ప స్త్రీ జీవితాన్ని ఒక స్త్రీ అయిన విద్యా బాలన్‌ గొప్పగా అభినయిస్తే మరో స్త్రీ అయిన అంజు మీనన్‌ గొప్పగా దర్శకత్వం వహించింది. భారత్‌లో, లండన్‌లో ముందు వెనుకలుగా కథ నడుస్తూ శకుంతలా దేవి జీవితాన్ని మనకు పరిచయం చేస్తుంది. హాస్యం, వ్యంగ్యం, తీవ్రమైన భావోద్వేగం ఉండే శకుంతలా దేవిగా విద్యా బాలన్‌ పరిపూర్ణంగా రూపాంతరం చెందింది. ఆమె కాకుండా మరొకరు ఆ పాత్ర అంత బాగా చేయలేరేమో. కొన్ని జీవితాలు రిపీట్‌ కావు. కాని వాటి నుంచి కొంత నేర్చుకోవచ్చు. శకుంతలా దేవి సినిమాను చూసి స్త్రీలు, పురుషులు విద్యార్థులు తప్పక నేర్చుకుంటారు. అదేమిటనేది వారి వారి వివేచనను బట్టి ఆధారపడి ఉంటుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా లభ్యం.

రుద్రమదేవి

Rudrama Devi

రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక మణిగా వెలిగిన మహారాణి కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేనందువలన రుద్రాంబకు రుద్రదేవుడని పేరుపెట్టి యుద్ధవిద్యలు, గుర్రస్వారీ నేర్పుతాడు. తర్వాత రుద్రాంబను తూర్పు చాళుక్యరాజు నిడవద్యపురం (నేటి నిడదవోలు) పాలకుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు కలుగుతారు.

తన తండ్రి గణపతిదేవుని తరువాత 1262 లో రుద్రమదేవి ‘ రుద్రమహారాజు ‘ బిరుదంతో కాకతీయ మహాసామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది. అయితే ఒక మహిళ పాలకురాలు కావటం ఓర్వలేని అనేకమంది సామంతులు తిరుగుబాటు చేసారు. కానీ రుద్రమదేవిని అభిమానించే గోనగన్నారెడ్డి, రేచర్ల ప్రసాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి ఈమెకు బాసటగా నిలుస్తారు.

అదేసమయంలో నెల్లూరు పాండ్యుల కింద, వేంగి ప్రాంతం గొంకరాజు మొదటి నరసింహుడు ఆక్రమిస్తారు… పాకనాటి కాయస్థ అంబదేవుడు, కళింగ నరసింహుని కుమారుడు వీరభానుడు తిరుగుబాట్లు చేస్తారు. రుద్రమ తన సేనానులతో కలిసి ఈ తిరుగుబాట్లనన్నిటినీ విజయవంతంగా అణచివేస్తుంది. రుద్రమాంబ ఎదుర్కొన్న దండయాత్రలన్నిటిలోకీ దేవగిరి యాదవరాజుల దండయాత్ర అతి పెద్దది, కీలకమైనది. దేవగిరి యాదవ మహాదేవుడు ఎనిమిది లక్షల మహాసైన్యంతో రుద్రమపైకి యుద్దానికి వస్తాడు. మహదేవునిపై పదిరోజులకు పైగా జరిగిన భీకర పోరాటంలో రుద్రమ ప్రత్యక్షంగా పాల్గొన్నది. తన అపార శక్తి సామర్థ్యాలతో అపర భద్రకాళిలా విజృంభించింది. ఆమె తన చిరకాల ప్రత్యర్థి మహదేవుడ్ని ఆ యుద్ధంలో మట్టికరిపించి మూడు కోట్ల బంగారు వరహాలను పరిహారంగా గ్రహించింది. శత్రువును ఆర్థికంగా చావు దెబ్బకొట్టి మళ్లీ తలెత్తకుండా చేసింది.

రుద్రమదేవికి గురువు విశ్వేశ్వర శివశంబు. గణపతి దేవునికి, రెండవ ప్రతాపరుద్రునికి కూడా ఈయనే గురువు. రుద్రమదేవి పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు.తెలంగాణలో ఇప్పుడు ఉన్న గొలుసు కట్టూ చెరువుల విధానం ప్రపంచం మొత్తం తిరిగి చూసిన మరెక్కడ కనిపించని శాస్త్రీయవిధానం రాణి రుద్రమ దేవి స్థాపించిన వ్యవస్ధా విధానం 800 సం.లు దాటినా తెలంగాణలో రైతులకు వ్యవసాయానికి ప్రదాన మూలాధారాం. ప్రతి గ్రామానికీ ఊట చెరువులు మరియు కుంటలు త్రవ్యించారు. లక్నవరం, పాకాల, రామప్ప లాంటి పెద్ద పెద్ద జలాశయాలు … కాకతీయుల పరిపాలనదక్షతకు నిదర్శనం.వారి కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం విస్తరించింది. విరాజిల్లింది. భరతనాట్యం, కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యాలకు దీటైన పేరిణీ శివతాండవమనే నూతన నృత్య విధానం పురుడుపోసుకుంది రుద్రమ కాలంలోనే. కాకతీయుల సైన్యాధిపతి అయిన జాయప సేనాని పేరిణీ నృత్య సృష్టికర్త. రుద్రమదేవి కాలంలో సంగీతం, సాహిత్యం, శిల్ప కళ, నృత్యం కలగలిసిపోయి విరాజిల్లాయి.

అనేకసార్లు ఓటమి పాలైన సామంతరాజు అంబదేవుడు రుద్రమదేవిపై కక్షగట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించాడు. అదునుకోసం చూస్తున్న అంబదేవుడికి సమయం కలిసి వచ్చింది. రుద్రమ రాజ్యంపైకి పాండ్యులు, చోళులు, ఇతర సామంతులు ముప్పేట దాడికి దిగారు. రుద్రమకు అండగా నిలవాల్సిన తమ సేనలను రుద్రమపైకి ఎక్కుపెట్టాడు. అంబదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయి కత్తిపట్టి కదన రంగాన దూకింది. అప్పటికి ఆమె వయస్సు ఎనభై ఏళ్లు. ఇరు పక్షాల మధ్య దాదాపు రెండు వారాలకు పైగా భీకర పోరాటం సాగింది. ఆ వయసులోనూ రుద్రమను అంబదేవుడు ఓడించలేకపోయాడు. యుద్ధంలో రుద్రమను నేరుగా ఎదుర్కోలేక కపట మాయోపాయం పన్నాడు. ఆ రోజు రాత్రియుద్ధ క్షేత్రానికి సమీపంలోని గుడారంలో కార్తీక సోమవారం సందర్భంగా పరమ భక్తురాలైన రుద్రమ ప్రత్యేక పూజల్లో నిమగ్నమై ఉంది. పూజారుల స్థానంలో తమ వాళ్లను పంపిన అంబదేవుడు తన దుష్టపథకాన్ని అమలు చేశాడు. పూజలో ఉన్న రుద్రమను అంబదేవుడి మనుషులు వెనుక నుంచి పొడిచారని చరిత్రకారులు చెబుతారు.

కాకతీయ సామ్రాజ్యానికే వన్నెతెచ్చిన వీర ధీరనారి ఆమె. శత్రువుకు ఎదురొడ్డి నిలిచి.. రాజ్యాన్ని పాలించింది. గొప్ప పరిపాలనాధ్యక్షురాలిగా.. కీర్తికెక్కిన మహిళామణి. ఆమే కాకతీయ సామ్రాజ్యాన్ని దశదిశలా విస్తరింపజేసిన రాణీ రుద్రమదేవి. అయితే రుద్రమదేవి చర్రిత అందరికి తెలిసినప్పటికీ.. ఆమె జీవిత చరమాంకానికి సంబంధించిన విషయాలు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ వివరాలు తెలియాలంటే నల్లగొండ జిల్లా చందుపట్లకు వెళ్ళాల్సిందే.

Chandupatla (నల్గొండ) శాసనం ఆధారంగా కాయస్త అంబదేవునితో జరిగిన యుద్ధాలలోనే మరణించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. చందుపట్లలో ఈ శాసనాన్ని ఇప్పటికి కూడా చూడవచ్చు.
రుద్రమదేవికి గల ఇతర బిరుదులు: రాయగజకేసరి, ఘటోదృతి

లతా మంగేష్కర్

lata mangeshkar

లతా మంగేష్కర్ ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి కూడా.
లత 1929 సెప్టెంబర్ 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్ మొదటి సంతానం. ఆమె తర్వాత వరుసగా ఆషా, హృదయనాథ్, ఉషా మరియు మీనా అనేవారు పుడతారు. ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు సంగీతాన్ని వినడం, పాడడంతప్ప మరోలోకం లేదు. తాను చదువుకోలేకపోయినా తన తర్వాతవారైనా పెద్దచదువులు చదవాలనుకొంది, కానీ వారుకూడా చదువుకన్నా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది.

దీనానాథ్ ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించాడు. దాంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందువలన సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్ లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడింది. ఆ తర్వాత చిముక్లా సుసార్ (1943), గజెభావు (1944), జీవన్ యాత్ర (1946), మందిర్ (1948 మొదలైన చిత్రాలలో నటిస్తుంది. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్, సురైయాలు గాయనిలుగా వెలుగుతున్నారు.

లత గాయనిగా 1947లో మజ్ బూర్ చిత్రంతో మొదలుపెట్టింది. దేశ విభజనకాలంలో ఖుర్షీద్, నూర్జహాన్ లు పాకిస్థాన్ వెళ్లడం, నేపథ్య సంగీత కి ప్రాధాన్యత పెరగడం వలన ఆమె గాయనిగా ఉన్నత శిఖరాల్ని చేరడానికి దోహదం చేశాయి. లతకు సంగీత దర్శకుడు గులాం హైదర్ గాయనిగా ఎదగటానికి సహాయం చేస్తాడు . సి.రామచంద్ర లత పాటను హిమాలయ శిఖరాలంత పైకి చేర్చారు. అల్బేలా, ఛత్రపతి శివాజీ,అనార్కలీలోని పాటలు అద్భుత విజయాలు చవిచూశాయి. తర్వాత అందాజ్, బడీ బహన్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, దులారీ చిత్రాల్లోని పాటలు ఆమెను 1966 నాటికి హిందీ నేపథ్యగాన సామ్రాజ్ఞిని చేశాయి.

హిందీ చిత్రసీమలో ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కళ్యాణ్ జీ-అనంద్ జీ, తర్వాత బప్పీలహరి, రాంలక్ష్మణ్, అనంతరం ఇప్పటి ఏ.ఆర్. రెహమాన్ వరకు చాలామంది సంగీతకారులు లత గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు.

లత సినీనిర్మాతగా మరాఠీలో వాదల్ (1953), కాంచన్ గంగా (1954), హిందీలో ఝూంఝుర్ (1954), లేకిన్ (1990) చిత్రాలు నిర్మించింది. ఆమె సంగీదర్శకురాలిగా రాంరాంపహునా (1950),మొహిత్యాంచి మంజుల (1963), మరాఠా టిటుకమేల్ వాలా (1964), స్వాథూ మాన్ సే (1965) మొదలైన కొన్ని చిత్రాలకు పనిచేసింది. నాచు య గడే, ఖేలు సారీ మనీ హౌస్ భారీ అనే పాటను మరాఠీ సినిమా కిటీ హాసల్(1942) కోసం పాడారు లత. ఈ పాట ఆమె మొదటి పాట. సదాశివరావ్ నవరేకర్ ఈ పాటకు స్వరాలు అందించారు. కానీ ఈ సినిమా విడుదల కాలేదు. నవయుగ చిత్రపత్ బ్యానర్ లో తీసిన మరాఠీ సినిమా పహలీ మంగళా-గౌర్(1942) సినిమాలో ఒక పాత్ర పోషించారు. దాదా చందేకర్ స్వరపరచిన నటాలీ చైత్రాచీ నవలాయీపాట కూడా పాడారు ఈ సినిమాలో. మరఠీ సినిమా గజబాహు(1943)లో మత ఏక్ సపూత్ కీ దునియా బాదల్ దే తూ ఆమె పాడిన మొదటి హిందీ పాట. 1945లో మాస్టర్ వినాయక్ సినిమా కంపెనీ ముంబైకి మారిపోయినపుడు, లతా కుటుంబంతో సహా ముంబైకు మకాం మార్చారు. హిందుస్తానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ దగ్గర నేర్చుకున్నారు. వసంత్ జొగలేకర్ తీసిన హిందీ సినిమా ఆప్ కీ సేవా మే(1946)లో దత దవ్జేకర్ స్వరపరచిన పా లగూన్ కర్ జోరీ అనే పాట పాడారామె. ఈ సినిమాలో కొరియోగ్రాఫర్ గా పనిచేసిన రోహిణి భతె ఆ తరువాత ప్రముఖ సంప్రదాయ నృత్యకళాకారిణిగా ప్రసిద్ధి చెందారు. వినాయక్ నిర్మించిన మొదటి హిందీ చిత్రం బడీ మా(1945) సినిమాలో లతా, అమె చెల్లెలు ఆశా కూడా చిన్న పాత్రలు పోషించారు. ఈ సినిమాలో లత ఒక భజన పాట పాడుతూ కనిపిస్తారు. మాతే తేరే చరణో మే అనే భజన అది. వినాయక్ రెండవ హిందీ చిత్రం సుభద్ర(1946) సినిమాతో సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ కు పరిచయమయ్యారు లత.

1947లో పాకిస్థాన్ భారతదేశం నుంచి విడిపోయిన తరువాత ఉస్తాద్ అమంత్ అలీ ఖాన్ పాకిస్థాన్ కు వెళ్ళిపోవడంతో అమంత్ ఖాన్ దేవస్వలే వద్ద సంప్రదాయ సంగీతం నేర్చుకున్నారు లత. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ శిష్యుడు పండిట్ తులసీదాస్ శర్మ వద్ద కూడా నేర్చుకున్నారు. 1948లో వినాయక్ చనిపోయిన తరువాత గాయనిగా లతకు గులాం హైదర్ ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. నిర్మాత శశధర్ ముఖర్జీకి లతను పరిచయం చేశారు హైదర్. లత గొంతు పీలగా ఉందంటూ ముఖర్జీ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఈ విషయం తెలిసిన హైదర్ చాలా బాధపడ్డారట. రాబోయే రోజుల్లో లతా గొంతు శ్రోతల్ని ఉర్రూతలూగిస్తుంది, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం కాళ్ళావేళ్ళా పడతారని ముఖర్జీతో అన్నారట. దిల్ మేరా తోడా, ముఝే కహీ కా నా చోరా పాటతో లతకు మొదటి హిట్ ఇచ్చారు హైదర్. సెప్టెంబర్ 2013లో తన 84వ పుట్టినరోజున, ఒక ఇంటర్వ్యూలో తనలో ఉన్న ప్రతిభను ముందు గుర్తించి, తన ప్రతిభపై పూర్తి నమ్మకాన్ని ఉంచిన వ్యక్తి హైదర్ అని తలచుకున్నారు లత.

మొదట్లో లతా ప్రముఖ గాయిని నూర్జహాన్ ను అనుకరించేవారట. కానీ తర్వాత తర్వాత తీవ్రమైన సాధనతో తన స్వంత శైలితో శ్రోతల మదిలో స్థానాన్ని సంపాదించుకోగలిగారు. అప్పట్లో హిందీ సినిమాలలో ఉర్దూ కవుల ప్రభావం వల్ల ఉర్దూ పదాలు ఎక్కువగా ఉండేవి. కథానాయకుడు దిలీప్ కుమార్ లత మహారాష్ట్ర యాస వల్ల ఆమె హిందీ భాష సరిగా లేదని విమర్శించారు. దాంతో ఉర్దూ శిక్షకుడు షఫీతో ఉర్దూ నేర్చుకున్నారామె.

మహల్(1949) సినిమాలోని ఆయేగా ఆనేవాలా పాటతో మొదటి హిట్ అందుకున్నారు లతా ఈ సినిమాలోని పాటలను సంగీత దర్శకుడు ఖేమ్ చంద్ ప్రకాశ్. ఈ పాటలో నటి మధుబాల నటించారు.
1950వ దశకంలో మంగేష్కర్ వివిధ సంగీత దర్శకులతో పనిచేశారు. అనిల్ బిశ్వాస్ సంగీత సారధ్యంలో తరానా, హీర్ సినిమాలు, శంకర్ జైకిసన్, నౌషాద్ అలీ, ఎస్.డి.బర్మన్, పండిట్ అమర్ నథ్ హుసన్ లాల్ భగత్ రాం సంగీత దర్శకత్వంలో బరీ బెహన్, మీనా బజార్, అఫ్సన, ఆదీ రాత్, అన్సూ, ఛోటీ భాబీ, అదల్-ఎ-జహంగీర్ వంటి సినిమాలు, సి.రామచంద్ర, హేమంత్ కుమార్, సలీల్ చౌదరి, ఖయ్యం, రవి, సజ్జద్ హుస్సేన్, రోషన్, కళ్యాణ్ జీ-ఆనంద్ జీ, వసంత్ దేశాయ్, సుధీర్ ఫడ్కే, హన్స్ రాజ్ భేల్, మదన్ మోహన్, ఉషా ఖన్నా వంటి వారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడారామె.

వనారధం(1956)తో తమిళంలో మొదటి పాట పాడారామె. ఈ సినిమాలో ఎన్తమ్ కన్నలన్ అనే పాట పాడారు. ఈ సినిమా ఉరన్ ఖోతల అనే హిందీ సినిమాకు తమిళ డబ్బింగ్. నౌషాద్ సంగీత దర్శకత్వం వహించారు.

దీదార్(1951), బైజు బవ్రా(1952), అమర్(1954), ఉరన్ ఖోతల(1955), మదర్ ఇండియా(1957) వంటి సినిమాలలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో ఎన్నో రాగ ప్రధానమైన పాటలు పాడారు లత. నౌషాద్ మొదటి పాట లత, జి.ఎం.దురానీల డ్యుయెట్ ఏ ఛోరీ కీ జాత్ బడీ బేవాఫా. బర్ సాత్, ఆహ్(1953), శ్రీ 420(1955), చోరీ చోరీ(1956) సినిమాలలో లతాతో ఎక్కువ పాటలు పాడించారు ఆ సినిమాల సంగీత దర్శకులు శంకర్‌-జైకిషన్. 1957 ముందు తన అన్ని సినిమాలలోనూ లతతో పాడించుకున్నారు సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్. సచిన్ దేవ్ స్వరపరచిన సజా(1951), హౌస్ నెం.44(1955), దేవదాస్(1955) వంటి సినిమాలలో బర్మన్ స్వరపరచిన పాటలు పాడారు. కానీ వారిద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె మళ్ళీ 1962 దాకా సచిన్ సంగీత సారధ్యంలో పాటలు పాడలేదు.

1958లో మధుమతి సినిమాలో లతా పాడిన ఆజా రే పరదేశీ పాటకు ఆమె ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఈ సినిమాకు సలీల్ చౌదరీ సంగీత దర్శకత్వం వహించారు. 1950వ దశకం మొదట్లో లత సి.రామచంద్ర నిర్మించిన అనేక సినిమాలలో పాడారు. మదన్ మోహన్ సినిమాలు లలో పాడారామె.

మొఘల్-ఎ-అజమ్(1960) సినిమాలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో లతా పాడిన ప్యార్ కియా తో డర్నా క్యా పాట ఇప్పటికీ చాలా ప్రాచుర్యం కలిగిన పాట. ఈ పాటలో మధుబాల నటించారు. దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయి(1960) సినిమాలో మీనా కుమారి నటించిన, శంకర్‌-జైకిషన్ స్వరపరచిన అజీ దస్తాన్ హై యే పాట కూడా చాలా హిట్ అయింది.

1961లో బర్మన్ సహాయ దర్శకుడు జయదేవ్ స్వరపరిచిన ప్రముఖ్ భజనలు అల్లాహ్ తేరో నామ్, ప్రభు తేరో నామ్ పాడారు లత. 1962లో హేమంత్ కుమార్ స్వరపరచిన బీస్ సాల్ బాద్ సినిమాలోనికహీ దీప్ జలే కహీ దిల్ పాటకు రెండవ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు లత.

1962లో ఆమెపై విష ప్రయోగం జరిగింది. డాక్టర్ ఆమెకు స్లోపాయిజన్ ఇచ్చారని నిర్ధారించారు. 3రోజుల వరకు ఆమె మృత్యువుతో పోరాడారు. ఆ తరువాత ఆమె కోలుకున్నారు. కానీ ఈ విష ప్రయోగంతో ఆమె చాలా నీరసపడిపోయారు. 3నెలల వరకూ ఆమె మంచంపైనే ఉన్నారు. ఈ 3నెలలూ గేయ రచయిత మజ్రూహ్ సుల్తాన్ పురీ ఆమెను కోలుకోవడానికి సాయం చేశారు. ప్రతీరోజూ సాయంత్రం ఆమె ఇంటికి వచ్చి సరదగా కథలు, కవితలు చెప్పి నవ్వించేవారట. ఆమె తినే ప్రతీ వంటనూ ముందు ఆయన తిని చెక్ చేసేవారట. ఈ సంఘటన జరిగాకా ఆమె ఇంటిలోని వంటవాడు ఆకస్మికంగా జీతం కూడా తీసుకోకుండా మాయమయ్యాడట. ఆ తరువాత ఆ వంటవాడు చాలా మంది బాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళలో పనిచేశాడట.

27 జనవరి 1963లో చీనా-భారత్ యుద్ధ సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ ఎదుట అయే మేరే వతన్ కే లోగో(నా దేశ ప్రజలారా) పాట పాడారు లత. ఈ పాట సి.రామచంద్ర స్వరపరచగా, కవి ప్రదీప్ రాశారు. ఈ పాట వింటున్న నెహ్రూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.
1963లో మంగేష్కర్ ఎస్.డి.బర్మన్ సంగీత సారధ్యంలో మళ్ళీ పాడటం మొదలుపెట్టారు. ఆయన కుమారుడు ఆర్.డి.బర్మన్ సినిమాలలో కూడా పాడారు.

1960ల్లో మదన్ మోహన్ సంగీత దర్శకత్వంలో అన్పధ్(1962)లోని ఆప్ కీ నజరో నే సంజా వో కౌన్ థీ(1964)లో లగ్ జా గలే, నైనా బర్సే రిమ్ జిమ్, జహాన్ అరా(1964)లోని వో చుప్ రహే తో, మేరా సాయ(1966)సినిమాలోని తూ జహా జహా చలేగా, చిరాగ్(1969)లోని తేరీ ఆంఖో కే సివా పాటలు పాడారు. అలాగే శంకర్-జైకిషన్ లతో కూడా ఆమె చాలా సినిమాలకు పని చేశారు. 1960లలో లతా తన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ పాటలు ఇచ్చిన సంగీత దర్శకులు లక్ష్మీకాంత్‌-ప్యారేలాల్ లతో భాగస్వామ్యం మొదలైంది. 1963లో మొదలైన్ వీరి భాగస్వామ్యం 35 సంవత్సరాలు కొనసాగింది. వీరిద్దరి సంగీత దర్శకత్వంలో ఆమె దాదాపు 700 పాటలు పాడారు.

లతా. జీనే కీ రాహ్ సినిమాకి లత మూడవ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. మరాఠీ సంగీత దర్శకులు హ్రిదయన్త్ మంగేష్కర్, వసంత్ ప్రభు, శ్రీనివాస్ ఖాలే, సుధీర్ ఫడ్కే వంటి వారి సారధ్యంలో పలు మరాఠీ సినిమాలలో పాటలు పాడారు లత. కొన్ని మరాఠీ సినిమాలకు ఆనందఘన్ పేరుతో ఆమె స్వయంగా సంగీత దర్శకత్వం వహించారు కూడా. 1960, 1970 దశకాలలో సలీల్ చౌదరి, హేమంత్ కుమార్ వంటి వారి సంగీత సారధ్యంలో పలు బెంగాలీ సినిమాలలో కూడా పాటలు పాడారు. 1967లో క్రాంతివీర సంగొల్లి రాయన్నా సినిమాలో బెల్లెనే బెలగాయితు పాటతో కన్నడలో మొదటి పాట పాడారెమె. ఈ సినిమాకు లక్ష్మణ్ బెర్లేకర్ సంగీత దర్శకత్వం వహించారు.

ఈ దశకంలో అప్పటి టాప్ గాయకులు ముఖేష్, మన్నా డే, మహేంద్ర కపూర్, మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్లతో ఎన్నో పాటలు పాడారు లతా. 1960వ దశకంలో కొన్ని రోజుల పాటు రఫీ, లతల మధ్య రెమ్యునరేషన్ విషయంలో కొన్ని గొడవలు జరిగాయి. 1961లో మాయ సినిమాలోని తస్వీర్ తేరీ దిల్ మే పాట తరువాత ఇద్దరూ కలసి పాడకూడదనే నిర్ణయం తీసుకున్నారు. కానీ తరువాత సంగీత దర్శకుడు జైకిషన్ వారిద్దరి మధ్య విభేదాలను పరిష్కరించారు.

నటిమీనాకుమారి నటించిన చివరి చిత్రం 1972లో విడుదలైన పాకీజా సినిమాలో గులాం మహ్మద్ సంగీత దర్శకత్వంలో చల్తే చల్తే, ఇన్హే లోగో నే వంటి హిట్ పాటలు పాడారు లత. ఎస్.డి.బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిని చివరి సినిమాలు ప్రేం పూజారీ(1970)లో రంగీలా రే, 1970లలో లక్ష్మీకాంత్-ప్యారేలాల్, రాహుల్ దేవ్ ల సంగీత దర్శకత్వంలో ఎన్నో హిట్ పాటలు పాడారు లత. లక్ష్మీకాంత్-ప్యారేలాల్ స్వరపరచిన చాలా పాటల్ని గేయరచయిత ఆనంద్ బక్షి రాశారు.

1973లో పరిచయ్ సినిమా కోసం పాడిన బీతీ నా బితాయ్ పాటతో ఉత్తమ నేపధ్య గాయినిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు లత. ఈ పాటను ఆర్.డి.బర్మన్ స్వరపరచగా, గుల్జార్ రాశారు. మలయాళంలో ఆమె పాడిన ఒకే ఒక పాట కాదలీ చెనకదలీ. ఈ పాట నెల్లు(1974)లోనిది. ఈ సినిమాకు సలీల్ చౌదరి స్వరాలు అందించగా, వయలర్ రామవర్మ రాశారు. 1975లో కోరా కాగజ్ సినిమాలో కళ్యాణ్ జీ ఆనంద్ జీ స్వరపరచిన రూతే రూతే పియా పాటకు కూడా ఉత్తమ నేపధ్య గాయినిగా జాతీయ అవార్డు అందుకున్నారు లత.

1970ల నుంచి లతా సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు. కొన్ని కచేరీలను ఉచితంగా చేశారు కూడా. 1974లో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో మొదటి విదేశీ సంగీత కచేరీ చేశారామె. ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ కంపోజ్ చేసిన మీరాబాయ్ భజనలు, ఛాలా వాహీ దాస్ ల భక్తిగీతాలతో ఒక ఆల్బంను రిలీజ్ చేశారు లత. ఈ ఆల్బమ్లలో సాన్ వారే రంగ్ రాచీ, ఉద్ జా రే కాగా వంటి పాటలు కూడా ఉన్నాయి. 1970వ దశకం మొదట్లో ఆమె గాలిబ్ గజళ్ళు, గణేశ్ హారతులు, శాంత్ తుకారాం రాసిన అభంగ్ లు, కోలీ గేటే పేరుతో ఒక మరాఠీ జానపద గేయాలు వంటి ప్రైవేట్ ఆల్బంలను విడుదల చేశారామె. వీటిలో శాంత్ తుకారాం అభంగ్ లు శ్రీనివాస్ ఖాలే స్వరపరచగా, మిగిలినవి ఆమె తమ్ముడు హృదయనాథ్ స్వరపరిచారు.

1978లో రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన “సత్యం శివం సుందరం” సినిమాలో టైటిల్ సాంగ్ సత్యం శివం సుందరం ఆ సంవత్సరంలోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది.

1970వ దశకం చివర్లో, 1980వ దశకం మొదట్లో ఆమె రెండవ తరం సంగీత దర్శకులతో పనిచేశారు. 60ల నాటి ప్రముఖ స్వరకర్తల కుమారులతో 80లలో ఆమె ఎన్నో హిట్ పాటలకు పనిచేశారు. రాహుల్ దేవ్ బర్మన్(సచిన్ దేవ్ బర్మన్ కొడుకు), రాజేష్ రోషన్(రోహన్ కుమారుడు), అను మాలిక్(సర్దార్ మాలిక్ కొడుకు), ఆనంద్‌-మిలింద్(చిత్రగుప్త్ కుమారులు)లతో పని చేశారు ఆమె. అస్సామీ భాషలో కూడా ఆమె చాలా పాటలు పాడారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత స్వర్గీయ భుపే హజారికాతో మంచి స్నేహం ఉంది లతకు. ఆయన గైడెన్స్ లో ఆమె పాడిన దిల్ హూం హూం కరే పాట ఆ సంవత్సరంలోనే ఎక్కువ అమ్ముడుపోయిన పాటగా రికార్డు సృష్టించింది.

1980వ దశకంలో సంగీత దర్శకులు శివ్-హరిలతో కలసి ఎన్నో సినిమాలలో ఎన్నో పాటలు పాడారు లత. రామ్-లక్ష్మణ్ ల సంగీత దర్శకత్వంలో వచ్చిన పెద్ద బడ్జెట్ సినిమాలలో పాటలు పాడారామె. 1985లో విడుదలైన సంజోగ్ సినిమాలోని జు జు జు పాట ఆ సంవత్సరంలోనే అతిపెద్ద హిట్. 1988లో మంగేష్కర్ వరుసగా తమిళంలో పాటలు పాడారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆనంద్ సినిమాలో ఆరారో ఆరారో పాట, సత్య సినిమాలో వలై ఒసీ పాట పాడారు లత.

1980వ దశకంలో లక్ష్మీకాంత్-ప్యారేలాల్ బాలీవుడ్ సినీ సంగీత ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశారు. వారి సంగీత సారధ్యంలో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు లత.

వరుస ఫ్లాపుల తరువాత అవతార్ సినిమాతో రాజేష్ ఖన్నా హిట్ అందుకున్నారు. 80లలో రాహుల్ దేవ్ బర్మన్ లతతో ఎన్నో హిట్ పాటలు పాడించారు. ఆయన సంగీత సారధ్యంలో వచ్చిన ఆజా సర్-ఎ-బజార్ ఆలీబాబా ఔర్ చాలీస్ చోర్(1980), బిందియా తర్సే ఫిర్ ఓ రాత్(1981), తోడీ సీ జమాన్ సితార(1981), క్యా యహీ ప్యార్ హై రాకీ(1981), దేఖో మైనే దేఖా లవ్ స్టోరీ(1981), ట్యూన్ ఓ రంగీలే కుద్రత్(1981), జీనే కైసే కబ్ శక్తి(1982), జబ్ హం జవాన్ హోంగే బతాబ్(1983),హుమైన్ ఔర్ జీనే అగర్ తుం నా హోతే(1983), తుఝ్ సే నారాజ్ నహీ మౌసమ్(1983), కహీ నా జా, జీవన్ కే దిన్ బడే దిల్ వాలే(1983), జానే క్యా బాత్ సన్నీ(1984), భురీ భురీ అంఖోఅర్జున్(1985), సాగర్ కినారే సాగర్(1985), దిన్ ప్యార్ కే ఆయేంగే సవరే వాలీ గాడీ(1986), క్యా భలా హై క్యా, ఖామూష్ సా అఫ్సానా సీలి హవా చూ లిబస్(1988), పాస్ హో తుమ్ మగర్ కరీబ్ లూట్ మార్(1980) , సుమన్సుధా రజినీ ఛందా మన్ పసంద్(1980), రఫీ, లతాల డ్యుయెట్లు ముఝే ఛూ రహీ హై స్వయంవర్(1980), కభీ కభీ బెజుబాన్ జానీ ఐ లవ్ యూ(1982), తుఝ్ సంగ్ ప్రీత్ కామ్ చోర్(1982), అంగ్రేజీ మే కెహతా హై ఖుద్ దార్(1982), అంఖియో హి అంఖియో మే నిషాన్(1983), దిష్మన్ నే కరే ఆఖిర్ క్యూ?(1985), తూ వాదా నా తోడ్ దిల్ తుఝ్కో దియా(1987) వంటి పాటలు ఆమె కెరీర్ లోనే క్లాసిక్స్ గా నిలిచాయి.

ఆ సమయంలోనే పూర్తిస్థాయి సంగీత దర్శకునిగా మారుతున్న బప్పీలహరి దక్షిణ భారతంలో జితేంద్ర-శ్రీదేవి-జయప్రదల సినిమాలకు డిస్కో-ప్రభావిత పాటలను అందించారు. ఆదే సమయంలో బాలీవుడ్ లో బప్పీలహరి సంగీత సారధ్యంలో లతా ఎన్నో హిట్ పాటలను పాడారు.

80లలో ఖయ్యం సంగీత దర్శకత్వంలో కూడా లతా ఎన్నో హిట్ పాటలు పాడారు. జూన్ 1985, యునైటెడ్ వే ఆఫ్ గ్రేటర్ టొరొంటోలోని “మాపల్ లీఫ్ గార్డెన్స్ ” లో ఒక సినీ సంగీత కచేరీ చేశారామె. 12,000మంది ఈ కచేరీకి వచ్చారు. ఈ కచేరీ నిర్వహించిన స్వచ్చంద సంస్థకు 150,000డాలర్లు వచ్చాయి. ఈ కచేరీని పేదల సహాయార్ధం ఉచితంగా చేశారు లతా. ఈ కచేరీలో అన్నా ముర్రే కోరిక మేరకు యూ నీడ్ మీ ఇన్ ద కాన్సర్ట్ పాట పాడి శ్రోతల్ని ఉర్రూతలూగించారు లతా.

1980వ దశకంలో మిగిలిన బాలీవుడ్ సంగీత దర్శకులకు కూడా ఆమె ఎన్నో హిట్ పాటలు పాడారు. రవీంద్ర జైన్ స్వరపరచిన రామ్ తేరీ గంగా మిలీ హోగయీ(1985)లో సున్ సహిబా సున్ పాట సూపర్ హిట్ అయింది. ఉషా ఖన్నన్ కు పాడిన చందా అప్నా సఫర్ షమా(1981), షాయద్ మేరీ షాదీ, జిందగీ ప్యార్ కా సౌతాన్(1983), హం భూల్ గయే రే సౌతాన్ కీ బేటీ(1989) ఆమే కెరీర్ లోనే అతి పెద్ద హిట్లుగా నిలిచాయి. ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ సంగీత పాటలు పాడారు.

1990వ దశకంలో ఆనంద్-మిలింద్, నదీమ్-శ్రావన్, జతిన్ లలిత్, దిలీప్ సెన్-సమీర్ సెన్, ఉత్తం సింగ్, అను మాలిక్, ఆదేశ్ శ్రీవాస్తవ, ఎ.ఆర్.రహమాన్ వంటి సంగీత దర్శకుల సారధ్యంలో ఎన్నో మంచి పాటలు పాడారు మంగేష్కర్. ఈ సమయంలోనే కొన్ని ప్రైవేట్ ఆల్బంలలోను, గజల్స్ పాడారు. ఆప్పటి ప్రముఖ గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ, హరిహరన్, కుమార్ సను, సురేశ్ వాడ్కర్, మహ్మద్ అజిజ్, అభిజీత్ భట్టాచార్య, రూప్ కుమార్ రాథోడ్, వినోద్ రాథోడ్, గుర్ దాస్ మాన్, సోను నిగమ్ లతో ఎన్నో హిట్ పాటలు పాడారు లత.

1990లో లతా హిందీ సినీ నిర్మాణ సంస్థ ప్రారంభించారు. మొదటి సినిమాగా గుల్జార్ దర్శకత్వం వహించిన లేకిన్ సినిమాను నిర్మించారు ఆమె. ఈ సినిమాకు ఆమె తమ్ముడు హృదయనాథ్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లతా పాడిన యారా సిలి సిలీ పాటకు ఉత్తమ నేపధ్యగాయినిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. యష్ చోప్రా దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలలోనూ పాటలు పాడారు లతా 90లలో మంగేష్కర్ రామ్ లక్ష్మణ్ సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలో పాటలు పాడారు.

ఈ సమయంలోనే లతా ఎ.ఆర్.రహమాన్ సంగీత దర్శకత్వంలో ఎన్నో హిట్ పాటలు పాడారు. 1994లో లతా మంగేష్కర్ అమర గాయకుల హిట్ పాటలను తన స్వంత గొంతుతో పాడి రికార్డ్ లు విడుదల చేశారు. కె.ఎల్.సైగల్, రఫీ, హేమంత్ కుమార్, ముఖేష్, పంకజ్ మల్లిక్, కిషోర్ కుమార్, గీతా దత్, జొహ్రబాయ్, అమీర్ బాయ్, పరౌల్ ఘోష్, కనన్ దేవి వంటి గాయకుల పాటలు పాడి వారికి తన శైలిలో నివాళి ఇచ్వారు ఆమె. రాహుల్ దేవ్ బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన మొదటి పాట, ఆఖరి పాట కూడా లతా మంగేష్కర్ పాడటం విశేషం. 1994లో రాహుల్ దేవ్ ఆఖరి సినిమాలోని ఆఖరి పాట కుచ్ నా కహో(1942:ఎ లవ్ స్టోరి) పాడారు లతా.

1999లో ఆమె పేరు మీద లతా ఎయు డె పెర్ఫ్యూమ్ అనే సుగంధ ఉత్పత్తి విడుదల చేశారు. అదే సంవత్సరంలో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. కానీ ఆమె ఎక్కువ సభలకు హాజరుకాలేదు. సహ సభ్యులు ప్రణబ్ ముఖర్జీ, షబానా అజ్మీ, అప్పటి రాజ్యసభ ఉపాధ్యక్షులు నజ్మా హెప్తుల్లావంటి వారి నుండి విమర్శలు వచ్చేవి. ఆమె అనారోగ్యంతోనే సభకు రాలేదని చెప్పుకునేవారు. లతా రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నందుకు జీతం కానీ దిల్లీలో ప్రభుత్వ వసతిగృహం కానీ తీసుకోలేదు.

2005లో దాదాపు 14ఏళ్ళ తరువాత ఆమె మళ్ళీ నదీమ్-శ్రవణ్ సంగీత వచ్చిన సినిమాలలో అనేక పాటలు పాడారు. 28 నవంబర్ 2012లో లతా తన స్వంత ఆడియో లేబుల్ ఎల్.ఎం.మ్యూజిక్ ద్వారా భజనపాటలు విడుదల చేశారు. ఈ ఆల్బంలో తన చెల్లెలు ఉషా మంగేష్కర్తో కలసి పాడారు. 2014లో మహిళా దినోత్సవం సందర్భంగా “స్ప్రెడింగ్ మెలోడీస్ ఎవ్రీవేర్” అనే ఆల్బంలో ఓ జానే వాలే తుఝ్కో అనే టైటిల్ పాట పాడారు ఆమె. ఈ ఆల్బంను రామ్ శంకర్ స్వరపరచగా, ఎ.కె.మిశ్రా సాహిత్యం అందించారు

మేరీ కాం

మేరీ కాం అని పిలవబడే మాంగ్టే చుంగ్నీజంగ్ మేరీకాం భారతదేశం మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళా బాక్సర్, ఈమె ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్‌చే ప్రోత్సాహంను పొందుతున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లైన మేరీ కాం ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా వరుసగా ఐదుసార్లు విజయాన్ని పొందారు. రెండు సంవత్సరాల విరామ అనంతరం, తన నాల్గవ వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ పసిడి పతాకాన్ని సాధించటానికి 2008లో తిరిగి ఆడారు. ఆమె ఇందులో కనపరచిన ప్రదర్శన, AIBA ఆమెను ‘మాగ్నిఫిషియంట్(దేదీప్యమానమైన) మేరీ’ అని కొనియాడేటట్టు చేసింది.

ఆమె ఆరంభంలో పరుగు పందాలంటే ఇష్టం ఉండేది. తనతోటి మణిపూర్ బాక్సర్ డింగ్‌కో సింగ్ విజయం తరువాత ఆమె తన ఆసక్తిని బాక్సింగ్‌ లో చూపుతుంది. ఇటీవల, మేరీ కాం తన ఐదవ వరుస ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ బిరుదును గెలిచారు. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో మేరీ కాం ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ బిరుదును సెప్టెంబరు 18, 2010 శనివారం నాడు బ్రిడ్జ్‌టౌన్‌లో స్వీకరించారు. ఈ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ బిరుదును మేరీ కాం ఐదవసారి వరుసగా గెలుచుకుంది. మేరీ కాం 16-6 స్కోరుతో రొమానియన్ ప్రత్యర్థి డుటా సెలూటాను ఓడించారు.

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ యొక్క నాలుగు టైటిల్స్‌ను 46 కిలోల విభాగంలో సాధించారు. కానీ ఈసారి ఆమె దీనిని 48 కిలోల విభాగంలో సాధించారు. సెమీఫైనల్‌లో మేరీ కాం 8-1 స్కోరుతో ఫిలిప్పినో ప్రత్యర్థి ఆలిస్ అప్పారీని ఓడించారు. ఆరు ప్రపంచ ఛాంపియన్ షిప్ లలో ప్రతి ఒక్కటిలో పతకం గెలిచిన ఒకేఒక్క బాక్సర్‌గా మేరీ కాం ఉన్నారు. 3 అక్టోబర్ 2010న, ఢిల్లీలో జరిగిన 2010 కామన్వెల్త్ గేమ్స్ కొరకు స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్వీన్స్ బాటన్‌ను పట్టుకునే
కుటుంబానికి ఆర్థిక సహకారంను అందించటానికి మేరీ కాం క్రీడలలోకి ప్రవేశించారు. “నేను ఆరంభంలో అన్ని-క్రీడలను ఆడేదానిని మరియు 400-మీ ఇంకా జావెలిన్ నా అభిమాన క్రీడలుగా ఉన్నాయి. డింగ్‌కో సింగ్ బ్యాంకాక్ (ఏషియన్ గేమ్స్)నుండి స్వర్ణంతో తిరిగి వచ్చిన తరువాత, నేను కూడా ప్రయత్నించాలని భావించాను. డింగ్‌కో విజయం మణిపూర్‌లో ఒక విప్లవాన్ని లేపింది మరియు ఆశ్చర్యకరంగా బాక్సింగ్‌లోకి ప్రవేశించనిది నేను ఒక్క అమ్మాయినే కాదు,”అని ఆమె తలిపారు.ఆమె ఎంతొ కష్తపడి ఈ స్థాయికి రావటం జరుగుతుంది ఆమె బాక్సింగ్ శిక్షణను 2000లో ఆరంభించారు మరియు వేగవంతంగా ఆటను గ్రహించే క్రీడాకారిణిగా, పురుషులకు అందించే శిక్షణను తీసుకోవటాన్ని ఇష్టపడ్డారు. ఆమె ఆరంభంలో ఈ క్రీడ మీద ఉన్న తన ఆసక్తిని తండ్రి M. తొంపు కాం మరియు తల్లి సనీఖమ్ కాంలకు తెలియకుండి ఉండేందుకు ప్రయత్నించారు, కానీ 2000ల సంవత్సరంలో ఆమె స్టేట్ ఛాంపియన్షిప్‌ను గెలిచిన తరువాత ఆమె ఫోటో వార్తాపత్రికలో వచ్చింది.

2000ల సంవత్సరంలో మణిపూర్‌లో ఫస్ట్ స్టేట్ లెవల్ ఇన్విటేషన్ మహిళా బాక్సింగ్ పోటీలో మొదటి పురస్కారంను మరియు ఉత్తమ బాక్సర్ పురస్కారంను పొందిన తరువాత, మేరీ కాం పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఏడవ ఈస్ట్ ఇండియా ఉమెన్స్ బాక్సింగ్ పోటీలో జయించారు మరియు తదనంతరం 2000 నుండి 2005 వరకు జరిగిన భారత జాతీయ స్థాయి పోటీలలో బంగారు పతకంను సాధించారు. అంతర్జాతీయ పోటీలలో కూడా ఆమె తన ప్రతిభను చూపించటం ఆరంభించటంతో, స్వర్ణ పతకాలు మరియు గౌరవసమ్మానాలు ఆమె సొంతమయ్యాయి.

బ్యాంకాక్‌లో జరిగే ఏషియన్ ఉమెన్స్ బాక్సింగ్ పోటీకి క్రీడాకారులను ఎంపిక చేసే శిక్షణా శిబిరానికి వెళుతున్న సమయంలో రైలులో ఆమె వస్తువులన్నింటినీ మరియు పాస్‌పోర్టు దొంగిలించబడ్డాయి. ఆమె తల్లితండ్రులు వెనక్కు వచ్చేయమని చెప్పినప్పటికీ, ఆమె పోటీలో పాల్గొనటానికి వెళ్ళింది.

భారతదేశంలోని హిసార్‌లో ఉన్న మహాబీర్ స్టేడియంలో నవంబర్ 22, 2003న జరిగిన ఏషియన్ ఉమెన్స్ పోటీలలో 46-కిలోల విభాగంలో ఆమె చైనీస్ థాయ్‌పే యొక్క చౌ స్జు యిన్‌ను RSCO-2తో ఓడించారు. దీనికి ముందు ఆమె శ్రీలంకకు చెందిన L. G. చంద్రికను RSCO-2తో ఓడించారు.

మేరీకాం యొక్క “అంతర్జాతీయ బంగారు పతకాల పరంపర” హిస్సార్‌లో జరిగిన రెండవ ఏషియన్ ఉమెన్స్ పోటీలతో ఆరంభమైనది మరియుతైవాన్‌లో జరిగిన మూడవ ఏషియన్ ఉమెన్స్ పోటీలలో గెలవటం వరకూ కొనసాగింది. ఆమె మొదటిసారి పాల్గొనిన, 2001లో USAలోని స్క్రాంటన్‌లో జరిగిన AIBA వరల్డ్ ఉమెన్స్ బాక్సింగ్ పోటీలో వెండి పతకంతో సంతృప్తి చెందవలసి వచ్చింది, 48-కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌లో పోలాండ్‌కు చెందిన నాడియా హోక్మిను RSCO-3తో మరియు సెమీ-ఫైనల్‌లో కెనడాకు చెందిన జామీ బెల్‌ను 21-9తో ఓడించినా ఫైనల్ పోటీలో టర్కీకి చెందిన హుల్యా సాహిన్ చేతిలో 13-5తో ఓడిపోయారు. ఫైనల్‌లో మేరీ కాం ప్రదర్శన గురించి శిక్షకుడు అనూప్ కుమార్ మాట్లాడుతూ “ఆమె మొదటి రౌండులో ముందంజలో ఉన్నారు, కానీ ఆమె ప్రత్యర్థి చివరి రౌండులో ఆధిక్యాన్ని సంపాదించగలిగారు,” అని తెలిపారు.

తరువాతి సంవత్సరం 2002లో టర్కీలోని అంటాలయాలో అక్టోబర్ 21–27 మధ్య తేదీలలో రెండవ జరిగిన AIBA వరల్డ్ ఉమెన్స్ సీనియర్ బాక్సింగ్ పోటీలో బంగారు పతకాన్ని సాధించారు, ఇందులో ఆమె 45-కిలోల విభాగంలో సెమీ-ఫైనల్‌లో ఉక్రెయిన్‌కు చెందిన స్వెట్లానా మిరోష్నీచెంకోను మరియు ఫైనల్‌లో ఉత్తర కొరియాకు చెందిన జాంగ్ సాంగ్-యేను ఓడించారు. ఒకప్పుడు ఆమె క్రీడా జీవితం మీద సందేహాస్పదంగా ఉన్న ఆమె తండ్రి, 2003లో భారతదేశం యొక్క అత్యున్నతమైన అర్జున పురస్కారాన్ని బాక్సింగ్‌లో సాధించిన ఘనతకు తొలి మహిళగా స్వీకరించే సమయంలో, మార్గదర్శిగా ఉన్న కుమార్తెతో పాటు ఆయన కూడా హాజరైనారు.

27 ఏప్రిల్ నుండి 2 మే 2004 వరకు నార్వేలోని టాన్స్‌బర్గ్‌లో జరిగిన మహిళా ప్రపంచ బాక్సింగ్ పోటీలో 46-కిలోల విభాగంలో ఆమె సెమీ ఫైనల్‌లో టర్కీకు చెందిన దెర్యా అక్టోప్‌ను RSCO-2తో మరియు ఫైనల్‌లో చైనాకు చెందిన క్సియా లీను RSCO-2తో ఓడించి బంగారు పతకంను కైవసం చేసుకున్నారు. 2004లో హంగరీలో జరిగిన ఆమె విచ్ కప్ టోర్నమెంట్ ఛాంపియన్‌గా కూడా ఉన్నారు. తైవాన్‌లో ఆగష్టు 2004లో జరిగిన ఏషియన్స్ ఉమెన్స్ బాక్సింగ్ పోటీలో 46-కిలోల విభాగం ఫైనల్‌లో ఫిలిప్పీన్స్‌కు చెందిన గ్రెట్చన్ అబనీల్‌ను 35-11తో ఓడించారు.

రష్యాలోని పోడోల్‌స్క్‌లో 25 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ 2005 వరకు జరిగిన మూడవ AIBA ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్స్‌లో 46-కిలోల విభాగంలో ఆమె తన ప్రపంచ పురస్కారాన్ని విజయవంతంగా నిలుపుకోగలిగారు. ఆమె ఫైనల్‌కు ఫిలిప్పీన్స్‌కు చెందిన గ్రెట్చెన్ అబనీల్‌ను 22-20తో ఓడించిన తరువాత చేరారు, ఫైనల్‌లో ఆమె ఉత్తర కొరియాకు చెందిన జాంగ్ ఓక్‌ను 28-13 స్కోరుతో ఓడించారు. కాం సెమీ-ఫైనల్‌లో రష్యాకు చెందిన ఎలేనా సబిటోవాను 31-16తో మరియు క్వార్టర్ ఫైనల్‌లో కెనడాకు చెందిన నాన్సీ ఫోర్టిన్‌ను 30-13తో ఓడించింది. ఆమె మరలమరల విజయాన్ని సాధించటం ఒక గొప్ప పురోగమనంగా భావించినప్పటికీ, జట్టు విభాగంలో విజయాన్ని సాధించిన రష్యన్ల మీద తన అభిమానాన్ని వ్యక్తపరచారు.

డెన్మార్క్ లోని వెజ్లేలో 19–22 అక్టోబర్ 2006లో జరిగిన వీనస్ బాక్స్ కప్‌లో, మేరీ కాం 46-కిలోల విభాగంలో సెమీ-ఫైనల్‌లో డెన్మార్క్ దేశానికి చెందిన సోఫీ మల్హోర్‌ను RSCO-2తో మరియు మూడవ రౌండులో రొమానియాకు చెందిన స్టెలూటా డూటా మీద విరమణ ద్వారా గెలుపొందారు. డూట ఫైనల్ చేరటానికి ఇటలీకి చెందిన వలేరియా కాలబ్రీస్‌ను RSCI-2తో ఓడించారు మరియు 2006లో జరిగిన అహ్మెట్ కామెర్ట్ పోటీలో 46-కిలోల విభాగంలో టర్కీకి చెందిన దెర్యా అక్టాప్‌ను RSCO-2తో ఓడించి పోటీ గెలిచారు (మేరీకాం ఈ పోటీలో పాల్గొనలేదు). 23 నవంబర్ 2006న భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్న తల్కాటొర ఇండోర్ స్టేడియంలో జరిగిన AIBA వరల్డ్ ఛాంపియన్షిప్స్‌లో మేరీ కాం 46-కిలోల విభాగంలో మళ్ళీ విజయాన్ని సాధించారు- ఈసారి ఆమె వీనస్ బాక్స్ కప్ పోటీలోని ఫైనల్ ప్రత్యర్థి రొమానియాకు చెందిన స్టెలూటా డూటా మీద 22-7 స్కోరు నిర్ణయంతో గెలుపొందారు. మేరీ కాం ఆటలో చాలాసేపటి వరకూ రొమానియన్ తన‌ను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఉంచారు, తరువాత ఆమె తన విజయ సంబరాన్ని బాక్సింగ్ రింగ్ లోపల మణిపూరి జానపద నృత్యంతో ఆనందించారు. డూటా ఫైనల్‌ను కజఖస్తాన్‌కు చెందిన బోరన్బాయేవా జల్గుల్‌ను RSCO-2తో ఓడించి చేరారు.

న్యూఢిల్లీలో, మేరీ కాం సెమీ-ఫైనల్‌లో ఉత్తర కొరియాకు చెందిన జాంగ్ ఓక్‌ను 20-8తో మరియు మొదటి రౌండులో బై తరువాత క్వార్టర్ ఫైనల్‌లో శ్రీలంకకు చెందిన చంద్రికే గెరూగాను RSCO-2తో ఓడించారు. ఆమె ఈ పోటీని దగ్గు మరియు జ్వరంతో ఆరంభించారు(డోపింగ్ పరీక్ష కారణంగా ఆమె వైద్యాన్ని కూడా తీసుకోలేకపోయారు) అయినను ఆమె ఒక రౌండు తరువాత చంద్రికే గెరూగా మీద 13-3తో ఆధిపత్యాన్ని కొనసాగించారు మరియు రెండవ రౌండులో మేరీ కాం 19-4తో ముందంజలో ఉండడంతో ఆటను ఆపివేశారు.

దుర్గాబాయి దేశ్ ముఖ్

durgabhai deshmukh

దుర్గాభాయి దేశ్ ముఖ్ ఒక పేరుపొందిన స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు ఒక సామాజిక కార్యకర్త. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జూలై 15, 1909 న కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు. పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించేవారు. బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌లో), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసింది.న్యాయశాస్త్రం చదివి మద్రాసులో హైకోర్టు వద్ద ప్రాక్టీసు ప్రారంభిస్తుంది.

దుర్గాభాయి దేశముఖ్ రాజకీయ నాయకురాలు కూడా. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ మరియు భారతదేశం యొక్క ప్రణాళికా సంఘం సభ్యురాలు. దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు ఏ మాత్రం ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా ఇస్తుంది.

ఈమె స్థాపించిన రెండు ఆసుపత్రులు, మూడు పాఠశాలలు, రెండు కాలేజీలు నేటికీ స్ర్తీ అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తున్నాయి.ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.

ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది. ఈమె 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది.

1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కాబడింది.

భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పనిచేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసారు. ఆ సందర్భములో సి.డి.దేశ్‌ముఖ్తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న జరిగింది. ఈవిడ 1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు (Central Social Welfare Board – సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్) వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేసారు. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పనిచేసారు. వీరి స్వీయచరిత్ర భాషించిన శిలలు అన్న పేరుతో వెలువడింది. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు మరియు వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంనుండి గౌరవ డాక్టరేట్1971 – నెహ్రూ లిటరసీ అవార్డు వయోజన విద్యాసేవలకు గుర్తింపుగా వచ్చింది. ఈమెకు1975 సంవత్సరంలో భారతప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ఇచ్చి సత్కరించింది. అదే సంవత్సరం ఆవిడ భర్త సి.డి.దేశ్‌ముఖ్ కూడా పద్మ విభూషణ్ పొందారు. ఈమె చిత్రంతో భారతప్రభుత్వం ఒక తపాలబిళ్ళను విడుదల చేసింది.

ఈమె జ్ఙాపకార్థం రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండు వద్ద గల స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ విగ్రహంను స్థాపించారు. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో ఈవిడ పేరున డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను నెలకొల్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 2006లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌గా నామాంతరం చెందింది.

చైతన్య సేవా స్రవంతిగా అందరినోటా కీర్తించబడ్డ దుర్గాబాయి…1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు. మరణంలేని ఓ వ్యవస్థగా ఆమె ఎప్పుడూ మనమధ్యనే చిరస్థాయిగా జీవించి ఉన్నారు.

ఆశా భోస్లే

asha bhosleyi

ఆశా భోస్లే ప్రముఖ బాలీవుడ్ గాయని. ఈమె సెప్టెంబర్ 8, 1933లో మహారాష్ట్రకు చెందిన సాంగ్లీలోని గోర్ అనే గ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. తండ్రి దీనానాధ్ మంగేష్కర్ తల్లి సుధామతి. ఈమె తండ్రి నటుడు మరయు గాయకుడు. ఆశాకు ముగ్గురు చెల్లుళ్లు, ఒకసోదరుడు ఉన్నారు. తొమ్మిది సంవత్సరల వయసులో తండ్రి మరణిస్తాడు. అప్పటికి వీరి కుటుంబం బీదరికంతో బాధపడుతుంది.

వీరు బొంబాయి చేరుకొని అక్కడ సినిమాలలో పాడటం మొదలు పెడతారు. ఈమె మొదట బెంగాలీ సినిమాలో ‘చాలా చాలా నవ్ బాలా’ అనే పాట పాడింది. ఇలా 1943 లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000 బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడింది. అప్పటినుండి జనం దృష్టి ఈమెమీద పడింది. ఆషా భోంస్లే తన పదహార ఏట గణపతి రావు భోంస్లే ప్రేమలో పడి అతనిని వివాహం చేసుకుంటుంది. కానీ కొద్దికాలం తరువాత తన ఇద్దరి పిల్లలతో మరియు గర్భిణీగా తన తల్లి ఇంటికి తిరిగి వస్తుంది. జరిగిన విషయాలు చాలా గోప్యంగా ఉంచుతుంది.

తరువాత 1956లో ఓ పి నయ్యర్ సినిమా సి ఐ డి సినిమాతో ఈమె దశ తిరుగుతుంది. చాలా పేరుపొందిన సినిమాలలో పాటలు పాడుతుంది. హరేరామ హరే కృష్ణలోని ధమ్మారే ధమ్. తరువాత ఆర్ డి బర్మన్ సినిమాలలో పాడుతూ అతనితో ఏర్పడిన సాన్నిహిత్యం వలన ఆర్ డి బర్మన్ ను 1980 సంవత్సరంలో వివాహం చేసుకుంటుంది. ఆర్ డి బర్మన్ 1994లో మరణిస్తాడు.

మరో ప్రముఖ గాయనియైన లతా మంగేష్కర్ ఈమె సోదరి. సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు.

అరుంధతీ రాయ్

arundhati rai

సుజాన్నా అరుంధతీ రాయ్ అరుంధతీ రాయ్ గా ప్రసిద్ధి, ఈమె భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి నవంబర్ 24 1961 న మేఘాలయ లోని షిల్లాంగ్ జన్మించింది. తండ్రి బెంగాలీ మరియు తల్లి సిరియన్ క్రిస్టియన్. ఈమెకు 1997లోతన రచన ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు బుకర్ ప్రైజు వచ్చింది. బుకర్ ప్రైజు పొందిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్రకెక్కారు. మరియు 2002 లో లన్నాన్ సాంస్కృతిక స్వేచ్ఛ బహుమతి ప్రదానం చేయబడింది.

ఈమె తన బాల్యం కేరళలో గడిపారు. ఉన్నతవిద్య ఢిల్లీలో చేసారు. అక్కడే తన మొదటి భర్త గెరార్డ్ డాకున్హాను కలిసారు. రాయ్ తన రెండవ భర్త, సినీ నిర్మాత ప్రదీప్ కిషన్ ను 1984లో కలిసారు, ఇతను నిర్మించిన అవార్డు పొందిన చిత్రం “మస్సీ సాహిబ్”. ఈమె నవల “ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్” వల్ల ఈమె ఆర్థిక స్థితి మెరుగు పడటం జరుగుతుంది.

ఆ తరువాత ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోటల్స్ లో ‘ఏరోబిక్స్ క్లాసెస్’ నడుపుతూ ఢిల్లీలోనే నివాసం ఏర్పరచుకున్నారు. ఈమె సమీప బంధువు ప్రణయ్ రాయ్ ప్రసిద్ధ టీవీ యాంకర్, NDTV లో ప్రధాన పాత్రధారిగా పనిచేస్తున్నాడు. సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, “నర్మదా బచావో” ఆందోళనను సమర్ధిస్తూ ఈమెరాసిన “ది గ్రేటర్ కామన్ గుడ్” రచన వివాదాస్పదంగా మారినది.

ఈమెకు సిడ్నీ శాంతి బహుమతి మే 2004 లో లభించింది. తన రచన వ్యాసాలుద ఆల్‌జీబ్రా ఆఫ్ ఇన్‌ఫినైట్ జస్టిస్కు సాహిత్య అకాడెమీ అవార్డు 2006 లో లభించింది. కానీ భారత ప్రభుత్వం అమెరికా అడుగుజాడలలో నడుస్తోంది అని ఈ అవార్డు స్వీకరించడానికి నిరాకరించింది.

ఝాన్సీ లక్ష్మీబాయి

Jhansi Rani

ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయిలు. వీరిది మహారాష్ట్రలోని సతరా. ఈమె జన్మించిన సంవత్సరం గురించి కూడా భిన్నాభిప్రాయాలున్నవి.. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు ఆధ్యాత్మిక దోరణి మెండుగా కలది. రాణి అసలు పేరు మణికర్ణిక. ముద్దు పేరు మను. ఝాన్సీ తల్లి ఝాన్సీ నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే మరణిస్తుంది. ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది.

ఇలాంటి క్లిష్ట సమయంలో బాజీరావు పీష్వా మోరోపంత్ ను బిఠూర్ కు పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకుంటాడు. బాజీరావుకు సంతానం లేకపోవడంతో నానాసాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు. నానా సాహెబ్, అతని పినతండ్రి కుమారుడు రావుసాహెబ్ మనూబాయిని తమ చెల్లెలిగా భావించి కలసిమెలసి ఉంటారు. వీరు ముగ్గురూ కలిసే విద్యలన్నీ నేర్చుకున్నారు. కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వంటి విద్యలంటే మనూకు మక్కువ ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ దూసుకొని పోయేది. లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహం జరుగుతుంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయిగా మారుతుంది. 1851లో లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మిస్తాడు. దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు. 1853 లో గంగాధర రావుకు విపరీతమైన అనారోగ్యం సోకుతుంది. ఎవరినైనా బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని అందరూ సలహ ఇస్తారు. దాంతో ఆయనకు దూరపు బందువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని దత్తత తీసుకుంటారు. కానీ ఆ మరుసటి రోజునే అనగా 1853, నవంబర్ 21 వ తేదీన గంగాధరరావు మరణిస్తాడు.

సభలో ఝాన్సీ తండ్రికున్న ప్రాభల్యం వలన, మిగిలిన యువతులు, ఎవరైతే జనానా ఆచారాలు పాటిస్తుంటారోవాళ్ళకంటే ఎక్కువ స్వాతంత్ర్యం ఝాన్సీ కలిగి వుండేది. లక్ష్మీబాయి కత్తియుద్ధం, గుర్రపుస్వారీ, విలువిద్యలలో ప్రావీణ్యం సంపాదించింది, అంతే కాకుండా తన స్నేహితురాళ్లందరినీ చేర్చుకొని స్త్రీల దళాన్ని తయారుచేస్తుంది.

దామోదర్ రావు దత్తత తీసుకునే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావల్సి ఉన్నా బ్రిటీష్ ప్రభుత్వం అందుకు అంగీకరించదు. దామోదర్ రావు వీరికి పుట్టిన బిడ్డకానందువలనే ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్-జెనరల్ లార్డ్ డల్ హౌసి, సిద్ధాంతం ప్రకారం దత్తపుత్రుడు సింహాసనాన్ని అధిష్టించే అధికారం లేదని నిరాకరించాడు. దాంతో లక్ష్మీ బాయి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎల్లిస్ ను సంప్రదించి లండన్ కోర్టులో దావా వేస్తుంది. ఆ లాయరు కేసును చాలా చక్కగా వాదించినా ప్రయోజన లేకపోయింది. కేసును కోర్టు కొట్టివేసింది. ఆంగ్లేయులు రాణి మీద కక్ష కడతారు. వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకుంటారు. మార్చి 1854 లో రాజు ఋణపడిఉన్న 60 వేల రూపాయలను ఆమెకు లభించే పెన్షన్ నుంచి తీసేసుకున్నారు. ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ చేస్తుంది.

రాణి ఝాన్సీ ని ఇంగ్లీషు వారికి ఇవ్వకూడదని నిర్ణయించుకుంటుంది. ఆమె తన సైన్యాన్ని బలపర్చి మరియు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళను పోగుచేసి ఒక సైన్యాన్ని తయారుచేస్తుంది. మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వబడింది. యుద్ధ వీరులైన గులాం గాస్ ఖాన్, దోస్త్ ఖాన్, ఖుదా బక్ష్, లాల భుబక్షి, మోతీ బాయి, సుందర్-ముందర్, ఖాసి బాయి, దీవాన్ రఘునాథ్ సింగ్, మరియు దీవాన్ జవహర్ సింగ్ రాణి బలగంలో ఉన్నారు.

ఝాన్సీలో ఇవన్నీ జరుగుతున్నపుడు, మే 10,1857లో మీరట్ లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటుగా నిలిచింది. పందులంటే ముసల్మానులకు ద్వేషమని, హిందువులకు ఆవులంటే పవిత్రమైనవని తెలిసి కూడా, వాళ్ళు యుద్ధములో తుపాకి గుండ్లు తగలకుండా వేసుకొనే తొడుగులకు, మరియు వాళ్ళు వాడే తుపాకీలకు పందుల మరియు ఆవుల కొవ్వుని పూసారు. బ్రిటిష్ అధికారులు వాళ్ళను వాటిని వాడవల్సిందిగా బలవంత పరిచి,ఎవరైతే వినలేదో వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టారు. ఆ తిరుగుబాటు సమయంలో చాలా మంది బ్రిటిష్ ప్రజలు, మహిళలు,పిల్లలు సిపాయిల చేతిలో చంపబడతారు. బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటును త్వరగా ముగించాలనుకొంటారు.

ఇంతలో, మే 1857,లో భారత దేశంలో కలవరం ప్రాకడం మొదలైంది, ఉత్తర ఖండంలో మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం మొదలైంది. ఈ క్లిష్ట పరిస్థితులలో,బ్రిటిష్ వాళ్ళు వేరే ప్రాంతంలో వాళ్ళ దృష్టిని పెట్టవలసిందిగా ఆదేశాలు రావడంతో, ఝాన్సీ ని లక్ష్మిబాయిని గురించి పెద్దగా పట్టించుకోరు. ఝాన్సీః, ఝాన్సీ రాణి ఆధీనంలోనే ఉంటుంది. ఇదే సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని, తన చాతుర్యంతో ఝాన్సీరాణి యుద్ధానికి కావలిసిన సేనలను సమర్థవంతంగా తయారుచేసింది. ఈ సమర్థత కారణం వలన ఝాన్సిని శాంతియుతంగా ఉంచగలిగింది.

జనవరి 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీ ని ముట్టడించడం ప్రారంభించింది. రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు ఝాన్సిలో మహిళా సైన్యం కూడా యుద్ధ సామగ్రిని మరియు తిను భండారాలను సిపాయిలకు అందించేవారు. రాణి లక్ష్మిబాయి చాలా చురుకుగా ఉండేది. ఆమె నగర రక్షణను తనే స్వయంగా పరిశీలించేది.

ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్ వారితో చాలా భయంకరంగా యుద్ధం చేసింది. లక్ష్మిబాయికి సహాయం చేయటానికి తిరుగుబాటు దార్ల నాయకుడైన తాంత్యా తోపే ఆధ్వర్యములో 20,000 మంది సైన్యం వస్తుంది. మార్చి 31లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర కేవలం 1,540 సిపాయిలు మాత్రమే ఉన్నారు కాని, ఏ శిక్షణ లేని తాంత్యా తోపే సైన్యం కంటే బ్రిటీష్ సైనికులు చాలా శిక్షణ పొందినవాళ్ళు, మరియు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కావడంతో, బ్రిటిష్ వాళ్ళు ఆక్రమణ మొదలు పెట్టడంతో, ఈ అనుభవం లేని సిపాయిలు పారిపోయారు. లక్ష్మిబాయి బలగాలు బలహీనమవడంతో మూడు రోజుల తరువాత బ్రిటిష్ వారు నగర గోడలను బద్దలుకొట్ట నగరాన్ని ఆక్రమించుకోగలుగుతారు. కానీ రాణి మాత్రం మగ వేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున కట్టుకొని వారి కన్నుగప్పి పారిపోయింది. కల్పి అనే ప్రదేశానికి చేరుకుని తాంతియా తోపే అనే విప్లవ కారుణ్ణి కలుసుకోగలిగింది.

రాణి మరియు తాంత్యా తోపే గ్వాలియర్ కు వెళ్లి తమ తిరుగుబాటు సహాయంతో గ్వాలియర్ మహారాజ సైన్యాన్ని గ్వాలియర్ ను స్వాధీనం చేసుకుంటారు.ఆ సంతోషంలో వీరుండాగా మరసుటి రోజే బ్రిటీష్ సేనలు గ్వాలియర్ ను ముట్టడిస్తాయి. లక్ష్మీబాయి గ్వాలియర్ కోట తలుపులు తెరపించి బ్రిటీష్ వారిని ఎదర్కొంటుంది. యుద్ధం భయంకరంగా సాగుతుంది. కాని,17 జూన్ 1858 యుద్ధములో రాణి మరణిస్తుంది .ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా భిన్నాభిప్రాయాలున్నవి.

తర్వాత మూడు రోజులకు బ్రిటీష్ వారు గ్వాలియర్ ను ఆక్రమించుకుంటారు. ఈ యుద్ధం గురించి జనరల్ రోస్ ప్రస్తావిస్తూ విప్లవ కారుల్లోకెల్లా ఆమే అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పిందని మెచ్చుకుంటారు. దాని వల్లనే ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది. తరువాత కొన్ని రోజులకే లక్ష్మీబాయి తండ్రి మోరోపంత్ ను బ్రిటీష్ వారు పాశవికంగా ఉరితీస్తారు