మల్లాడి కృష్ణా రావు

మల్లాడి కృష్ణారావు (1964)

మల్లాడి కృష్ణారావు గారు పుదుచ్చేరి రాష్ట్రంలో ఉన్న యానాం జిల్లా దరియాల తిప్ప గ్రామంలో నిరు పేద మత్స్యకారుల కుటుంబంలో జన్మించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన కృష్ణారావు గారు కుటుంబసభ్యులతో భేదాభిప్రాయాలు కారణంగా స్వగ్రామం నుంచి యానాంలో స్థిరపడి అక్కడే వ్యాపార రంగంలో ప్రవేశించి మంచి లాభాలు ఆర్జించారు.

వ్యాపారవేత్త గా విజయవంతమైన తరువాత సామాజిక సేవలోకి ప్రవేశించి అనేక మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్య కు ఆర్థిక సహాయం, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు నిర్మించారు, అలాగే తన సొంత స్థలంలో వేలాది మంది పేదలకు ఇళ్ళు నిర్మించారు. మద్యపానం వ్యతిరేకంగా యానాం ప్రాంతం మొత్తం మహిళలతో ధర్నాలు నిర్వహించి విజయవంతంగా యానంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించడం లో సఫలీకృతం అయ్యారు.

1994లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణారావు గారు , 1996, 2001(ఇండిపెండెంట్), 2006,2011, 2016 లలో యానాం నుంచి 5 సార్లు ఎన్నికయ్యారు, 2000లో పోటీ చేయలేదు.

2006 నుంచి ఒక్క ఆర్థిక, హొమ్ శాఖలు తప్పించి అన్ని శాఖల మంత్రులుగా పనిచేశారు. పుదుచ్చేరి ఆధీనంలో ఉన్న ప్రత్యేక పౌరవిమానాయన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న కృష్ణారావు గారు యానాం నియోజకవర్గాన్ని దేశంలోనే అభివృద్ధి తో కూడిన ఆదర్శవంతమైన నియోజకవర్గం గా నిలబెట్టారు. కృష్ణారావు గారు లాంటి శాసనసభ్యులు తమ నియోజకవర్గాలకు ఉండాలి అని కోరుకుంటున్నారు.

Image result for malladi krishna rao in telugu language

నితీశ్ కుమార్

నితీశ్ కుమార్(1951)

నితీశ్ కుమార్ గురించి మన తెలుసుకొనే ముందు వారి కుటుంబ నేపథ్యంలోకి వెళితే బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో ఉన్నా హర్నట్ తాలూకాలోని కళ్యాణ్ భిగా వారి స్వగ్రామం, నితీశ్ తాతగారు కిశోరి శరణ్ సింగ్ గ్రామంలో పేరొందిన రైతు మాత్రమే కాకుండా ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు కూడా ,గ్రామంలో అనేక సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా కూడా పేరుపొందరు. నితీశ్ కుమార్ గారి తండ్రి కవిరాజ్ గారు కూడా వారి తండ్రి నుండి ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకోని ఆయుర్వేద వైద్యులు అయ్యారు ,స్వాతంత్ర్య సమరయోధులు మరియు బీహార్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు,పాట్నాలో చదువుకొనే రోజుల్లో ఆర్య సామాజ్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు,కవిరాజ్ గారు తన రాజకీయ కార్యకలపాల కోసం కళ్యాణ్ భిగా దగ్గరలోని బర్హా తాలూకాలోని భక్తియార్ పూర్ గ్రామంలో స్థిరపడ్డారు.ఇది నితీశ్ కుమార్ గారి కుటుంబ నేపథ్యం.

ప్రారంభ జీవితం, విద్య:

నితీశ్ కుమార్ 1వ తేదీ మార్చ్1951లో కవిరాజ్ రామ్ లాఖాన్ సింగ్,పరమేశ్వరి దేవి దంపతులకు,బీహార్ రాష్ట్రంలో ఉన్న పాట్నా జిల్లాలోని బర్హా తాలూకా భక్తియార్ పూర్ గ్రామంలో జన్మించారు.నితీశ్ కుమార్ చిన్నతనం నుంచే తెలివైన విద్యార్థిగా ఉపాధ్యాయుల నుంచి గుర్తింప బడ్డాడు,గణిత శాస్త్రం అంటే చాలా మక్కువ, అలాగే హిందీ భాష అంటే కూడా మక్కువ చూపేవారు,ముఖ్యంగా పాఠశాలలో జరిగే హిందీ వృకత్వ పోటీలలో కూడా పాల్గొనే వారు, పాట్నా లోని పాట్నా విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాల బీహార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ప్రస్తుతం జై ప్రకాశ్ నారాయణ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్))లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వెంటనే బీహార్ రాష్ట్ర విద్యుత్ కార్పొరేషన్ లో సహాయక ఇంజినీర్ గా చేరి కొంత కాలం పనిచేసి రాజీనామా చేశారు.1973లో జె.పి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమంలో పాల్గొని క్రియాశీలక రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

రాజకీయ జీవితం:

నితీశ్ కుమార్ తండ్రి కవిరాజ్ సింగ్ గారు బీహార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు, స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్ళారు, అటువంటి నిజాయితీ గల నాయకుడైన కవిరాజ్ గారు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1952లో జరిగిన బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో తనకు పట్టున్న భక్తియార్ పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయాలని ఆశించారు,కానీ అధిష్టానం వేరే వ్యక్తికి ఇవ్వడం జరిగింది, మళ్ళీ 1957లో పార్టీ టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు,తరువాత రాజకీయాల నుంచి విరమించుకున్నారు. తండ్రి రాజకీయ జీవితాన్ని సునిశితంగా గమనిస్తున్న నితీశ్ చిన్నతనం నుంచే సోషలిస్టు దిగ్గజం రామ్ మనోహర్ లోహియా భావజాలనికి ఆకర్షితులయ్యారు.

 • విద్యార్థి నేతగా:

ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో మొదటిసారిగా లోహియా, జయప్రకాష్ నారాయణ్,సత్య నారాయణ్ సిన్హా వంటి సోషలిస్టు దిగ్గజాలను కలుసుకోవడంతో వారి భావాల ప్రభావం వల్ల రాజకీయాల మీద ఆసక్తి మరింత పెరిగింది,నితీశ్ లోహియా నాయకత్వంలోని సంయుక్త సోషలిస్టు పార్టీ యువజన విభాగం సమాజ్ వాదీ యువజన్ సభలో చేరారు అప్పుడే లాలూ ప్రసాద్ యాదవ్(ఆర్.జె.డి పార్టీ అధినేత, మాజీముఖ్యమంత్రి), రఘువంశ్ ప్రసాద్ సింగ్(కేంద్ర మాజీమంత్రి) వంటి మొదలైన యువనాయకులు పరిచయమయ్యారు (తరువాత కాలంలో వీరందరూ దేశ, బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో రాణించారు) . పాట్నా విశ్వవిద్యాలయంలో నెలకొన్న అనేక సమస్యల మీద లాలూ ప్రసాద్ నాయకత్వంలో పోరాటం చేశారు, నితీశ్ తన విషయ పరిజ్ఞానంతో అనతి కాలంలోనే పార్టీలో అలాగే లాలూకి అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిగా మారారు, ఎంతలా అంటే యువజన విభాగం తరుపున అంతరాష్ట్ర విద్యార్థుల చర్చలకు నితీశ్ ని ఎంపిక చేసేలా,అలాగే ఏదైనా పోరాటం మొదలుపెట్టాలన్న ముందు నితీశ్ తో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకునేటంతగా. లాలూ వయస్సులో నితీశ్ కన్న పెద్దవాడైన యిద్దరు కలసి పార్టీ తరుపున విశ్వవిద్యాలయంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.సోషలిస్టు యువజన విభాగానికి నితీశ్, లాలూ ప్రసాద్ ఉన్నట్లు జనసంఘ్ యువజన విభాగనికి సుశీల్ కుమార్ మోడీ(ప్రస్తుత బీహార్ ఉపముఖ్యమంత్రి), రవి శంకర్ ప్రసాద్(ప్రస్తుత కేంద్ర మంత్రి) ఉండేవారు. రాజకీయ భవజాలపరంగా నితీశ్ కుమార్, సుశీల్ కుమార్ లకు వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఇద్దరూ ఎంతో స్నేహితంగా ఆనాటి నుండి ఈనాటికి కొనసాగుతున్నారు.

 • సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో :

బీహార్ విద్యుత్ కార్పొరేషన్ లో ఇంజినీర్ గా పనిచేస్తున్న నితీశ్ కుమార్ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ చేపట్టిన సంపూర్ణ క్రాంతి ఉద్యమం వైపు ఆకర్షితుడై తన ఉద్యోగం నుండి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చారు. అవినీతి, పాలన నియంతృత్వం ప్రధానంగా జరిగిన ఉద్యమంలో లాలూ ప్రసాద్, రామ్ విలాస్ పాశ్వాన్, సుశీల్ కుమార్ మోడీ,ములాయం సింగ్ యాదవ్,శరద్ యాదవ్ వంటి యువకులతో పాటు చంద్రశేఖర్, రామకృష్ణ హెగ్డే, జార్జ్ ఫెర్నాండెజ్, మధు దండవాతే, ఎస్.ఆర్.బొమ్మై, నానజీ దేశముఖ్ వంటి రాజకీయ నాయకులతో కలిసి నితీశ్ కుమార్ ఉద్యమంలో పనిచేశారు.సంపూర్ణ క్రాంతి ఉద్యమ కాలంలో నితీశ్ సోషలిస్టు సిద్ధాంతాలను మరింత లోతుగా అధ్యయనం చేసారు.జె.పి గారి ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో ఇందిరా ప్రభుత్వం విధించిన ఎమెర్జెన్సీ వల్ల మీసా చట్టం కింద అరెస్ట్ చేయడంతో తన జీవితంలో మొదటిసారి జైలుకు వెళ్లారు,1977లో ఎమెర్జెన్సీ తొలగించిన తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.

 • ప్రజాక్షేత్రంలో :

1977లో జె.పి స్థాపించిన జనతా పార్టీలో లాలూ ప్రసాద్, నితీశ్ కుమార్ చేరారు , లాలూ ప్రసాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు, కానీ నితీశ్ పోటీ చేసిన హర్నట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమి పాలయ్యారు, కేవలం మూడేళ్ళ ల్లో జనతా ప్రభుత్వం పడిపోవడంతో లాలూ ప్రసాద్ తో కలిసి జనతా పార్టీలో చీలిక వర్గమైన రాజ్ నారాయణ్ నేతృత్వంలోని జనతా పార్టీ(సెక్యూలర్)లో చేరి 1980లో మళ్ళీ రెండోసారి హర్నట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.1984 లో జనతా పార్టీ(సెక్యూలర్), చరణ్ సింగ్ నేతృత్వంలోని లోక్ దళ్ పార్టీ లో విలీనం జరగడంతో 1985 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ లోక్ దళ్ అభ్యర్థిగా టిక్కెట్ ఆశించిన నిరాశ ఎదురవడంతో స్వతంత్ర అభ్యర్థిగా హర్నట్ నుంచి మూడోసారి పోటీ చేసి గెలుపొందారు తిరిగి లోక్ దళ్ పార్టీలో చేరారు, శాసనసభలో నితీశ్ చేసే ప్రతి విమర్శ పాలకపక్షానికి కాలవరనికి గురి చేసేది లాలూ పార్టీ నేతగా వ్యవహరిస్తున్న అసెంబ్లీలో జరిగే వాడివేడిగా జరిగే చర్చల్లో నితీశ్ కుమార్ పాల్గొని తమ పార్టీ గళాన్ని గట్టిగా వినిపించారు. 1989లో మొదటి సారి లోక్ సభకు పోటీ చేసి బర్హా నుంచి గెలుపొందిన నితీశ్ తరువాత 1991,1996,1998,1999, 2004 వరకు వరుసగా ఆరుసార్లు గెలుపొందిన ఏకైక బీహార్ నాయకుడిగా నితీశ్ చరిత్రలో నిలిచిపోయారు (ముఖ్యంగా బర్హ్ లోక్ సభ నియోజకవర్గంలో అంతకుముందు ఉన్న కేంద్ర మాజీ మంత్రి తారకేశ్వరి సిన్హా పేరిట ఉన్న 4 సార్లు రికార్డును బద్దలుకొట్టి నితీశ్ 5 సార్లు గెలిచారు,ఆరోసారి నలంద నియోజకవర్గంలో గెలుపొందారు).2005 నుంచి ప్రస్తుతం వరకు బీహార్ శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు.

 • పార్లమెంట్ సభ్యుడిగా:

1989: యువకుల కోటాలో జనతా దళ్ పార్టీ తరుపున మొదటిసారి లోక్ సభకు తన సొంత నియోజకవర్గం మైన బర్హా నుంచి పోటి చేసి గెలిచి మొదటిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు . నితీశ్ సోషలిస్టు దిగ్గజం చంద్రశేఖర్ గారి శిష్యరికం వల్ల పార్లమెంట్ రాజకీయాలను అవగాహన చేసుకుని బీహార్ రాష్ట్ర సమస్యలు మీద ఎక్కువగా మాట్లాడేవారు, అనతి కాలంలోనే ప్రధానమంత్రి వి.పి.సింగ్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. జనతాదళ్ పార్టీలోని దిగ్గజాలు దేవిలాల్,అరుణ్ నెహ్రూ, అరిఫ్ మొహమ్మద్,మధు దండవతే,చంద్రశేఖర్, జార్జ్ ఫెర్నాండెజ్ వంటి హేమహామీలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.1990లో కేంద్ర వ్యవసాయ,సహకార సహాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

1991: రెండో సారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యి పార్లమెంట్ పార్టీ ఉపనాయకుడిగా జనతాదళ్ పార్టీ తరుపున ఎన్నుకోబడ్డారు,అటు పార్లమెంటులో మాత్రమే కాకుండా బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు . వివిధ పార్లిమెంట్ స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా నియమించబడ్డారు, అలాగే వ్యవసాయ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా కూడా వ్యవహరించారు.

1996: మూడోసారి పార్లమెంట్ సభ్యుడిగా సమతా పార్టీ తరుపున పోటీ చేసి ఎన్నికయ్యారు, సమతా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా జార్జ్ ఫెర్నాండెజ్ , ఉప నాయకుడిగా నితీశ్ కుమార్ ఎన్నికవ్వడం జరిగింది, పార్లిమెంట్ సభ్యుడిగా నితీశ్ బీహార్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తన తోటి సభ్యులతో కలిసి గళం విప్పేవారు, లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా ఎన్నికయ్యారు,అలాగే అంచనాలు, రాజ్యాంగ, రక్షణ పార్లమెంట్ స్థాయి సంఘాలలో సభ్యుడిగా ఎన్నికయ్యారు.

1998: 12వ లోక్ సభ ఎన్నికల్లో సమతా పార్టీ బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్యకూటమి (ఎన్.డి.ఏ)లో చేరి ఎన్నికల్లో పోటీ చేసి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది నితీశ్ నాలుగోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు, కేంద్ర రైల్వే, ఉపరితల రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

1999: 12వ లోక్ సభ కేవలం 13 నెలల్లో రద్దు కావడం వల్ల మళ్ళీ జరిగిన 13వ లోక్ సభ ఎన్నికల్లో సమతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు, కేంద్రంలో మళ్ళీ ఎన్.డి.ఏ అధికారంలోకి రావడంతో నితీశ్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో ఉపరితల,వ్యవసాయ, రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

2004: 14వ లోక్ సభ ఎన్నికల్లో బర్హ్ , నలంద నియోజకవర్గాల్లో పోటీచేసి నలంద నియోజకవర్గంలో గెలుపొంది ఆరోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు, అలాగే జనతాదళ్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కూడా వ్యవహరించారు.

 • కేంద్రమంత్రిగా:

1989లో వి.పి.సింగ్ నేతృత్వంలో ఏర్పడిన జనతాదళ్ ప్రభుత్వంలో నితీశ్ మొదటి సారిగా 1990లో కేంద్ర వ్యవసాయ, సహకార శాఖల సహాయ మంత్రిగా భాద్యతలు చెప్పట్టారు, పేరుకే సహాయ మంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రిత్వ భాద్యతలు మొత్తం నితీశ్ కుమార్ నిర్వహించారు(వ్యవసాయ శాఖ మంత్రి అయిన దేవిలాల్ ఉప ప్రధానమంత్రి కూడ కావడంతో తన కార్యభారం మొత్తాన్ని నితీశ్ కు అప్పగించారు), నితీశ్ వ్యవసాయ శాఖామంత్రి గా రైతుల కోసం అనేక పథకాలు అమలు జరపడానికి కార్యచరణ రూపొందించి అమలు జరుపుతున్న సమయంలో వి.పి.సింగ్ ప్రభుత్వం కూలిపోయింది.

1998లో మళ్ళీ అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో కేంద్రంలో ఎన్.డి.ఎ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సమతా పార్టీ నుంచి జార్జ్ ఫెర్నాండెజ్ రక్షణ శాఖ మంత్రిగా, నితీశ్ కుమార్ రైల్వే శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రైల్వే అధికారులతో సమీక్షలు జరుపుతూ శాఖ ఆదాయం పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు, అలాగే బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి రెండు నెలలు వ్యవధి మాత్రమే ఉండటంతో రైల్వే బడ్జెట్ తయారు చేయడం పై విస్తృతంగా అధికారులతో సమీక్షలు జరిపి బడ్జెట్ తయారీలో సూచనలను అనేక చేశారు,అలా రెండు నెలలు రోజుకు 18 గంటలు పనిచేసి ప్రధానమంత్రి మన్ననలు పొందారు. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న సమయంలో

తరువాత మీడియాతో మాట్లాడుతూ

రైల్వే మంత్రి గా పనిచేస్తున్న సమయంలోనే ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్న అన్నా డి యం కె చెందిన నాయకుడు రాజీనామా చేయడంతో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ఆ శాఖను నితీశ్ కుమార్ కు అప్పగించారు, రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో

నితీశ్ కుమార్ మొదటిసారి ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలొనే ప్రధాని వాజపేయిగారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మరియు గుజరాత్ లోని ద్వారకా నుండి కలకత్తా వరకు దేశం మొత్తాన్ని కలుపుతూ “స్వర్ణ చతుర్భుజి(Golden triangle) ” పథకానికి స్వీకారం చేశారు,రవాణా శాఖ మంత్రిగా ప్రాజెక్ట్ చేప్పట్టేందుకు కావాల్సిన వ్యయం,మౌలికవసతులు వంటి అనేక విషయాలను అధికారులతో చర్చించి రిపోర్టు తయారు చేసి ఇవ్వవలని అధికారులను ఆదేశించారు. నూతన రవాణా ప్రోజెక్టుల వివరాల గురించి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయం.

రైల్వే, రవాణా మంత్రిత్వశాఖలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న సమయంలోనే అన్నా డి యం కె ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వల్ల 1999లో వాజపేయి ప్రభుత్వం కూలిపోయింది,1999లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ ఎన్.డి.ఎ కూటమికే అధికారం ఇవ్వడంతో నితీశ్ కుమార్ మళ్ళీ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో

ఉపరితల మంత్రిగా కేవలం కొద్ది నెలలు మాత్రమే పనిచేసిన ఆ శాఖలోని పై అధికారులు నుంచి కింది స్థాయి గుమస్తా వరకు నితీశ్ జవాబుదారీతనాన్ని అమలు చేసారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టిన నితీశ్ తాను సహాయ మంత్రిగా ఉన్న సమయంలో రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి పూనుకున్నారు ఆలాంటి వాటిలో ఒకటి పంటలకు గిట్టుబాటు ధర(M.S.P) పెంచడం ముందుగా ఒకటి, తరువాత సాగునీటి ప్రాజెక్టులపై కూడా దృష్టి సారించారు, సాగునీటి వనరుల నిర్వహణ పద్దతులు కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం వంటివి మొదటిసారిగా నితీశ్ కుమార్ హయాంలోనే జరిగింది .వ్యవసాయ, రవాణా మంత్రిత్వ శాఖలు ఒక ఎత్తయితే రైల్వే శాఖ సమర్ధవంతంగా నిర్వహించిన మంత్రిగా అందరిచేత ప్రశంసలు అందుకున్నారు.కేంద్ర రైల్వే మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రైల్వే శాఖ కార్యాలయాలు మొత్తాన్ని ఆధునికీకరణ నితీశ్ హయాంలోనే జరిగింది, టిక్కెట్ రిజర్వేషన్ ,తత్కాల్ బుకింగ్ వంటివి నితీశ్ హయాంలోనే ప్రవేశపెట్టారు. రైల్వే రిజర్వేషన్లు ప్రారంభించిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ

అలాగే దేశంలో కొత్త రైల్వే జోన్స్ ఏర్పాటు కూడా నితీశ్ హయాంలోనే జరిగింది,రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు ఎక్కువ నిధులను మంజూరు చేయడం కూడా నితీశ్ హయాం నుంచే మొదలైంది, అలాగే రైల్వే బడ్జెట్ లో ప్రయాణికులకు టిక్కెట్ రాయితీ ప్రోత్సాహకాలు వంటివి ఎన్నో కార్యక్రమాలు రైల్వే మంత్రిగా చేపట్టారు. పాట్నాలోని గంగా నది ఒడ్డున ఉన్న జె.పి సేతుగా పిలవబడే డిఘ-సొన్ పూర్ రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి శంకుస్థాపన నితీశ్ కుమార్ హయాంలోనే జరిగింది (2016లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ,బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లు ప్రారంభించారు ). శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ప్రధానమంత్రి వాజపేయి తో పాటుగా స్టేజ్ మీద

దేశం మొత్తం మీద అనేక రైల్వే ప్రొజెక్టులకు అంకురార్పణ చేశారు . రైల్వే బడ్జెట్ ప్రవేశానికి ముందు పార్లమెంట్ ఆవరణలో

నితీశ్ రైల్వే శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసే సమయానికి అత్యంత లాభదాయక శాఖగా మార్చిన ఘనతను సొంతం చేసుకున్నారు.

 • ముఖ్యమంత్రిగా:

2000:

2000 లో జరిగిన బీహార్ ఎన్నికల్లో సమతా పార్టీ, బీజేపీ కలిసి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రెండు పార్టీలు ఎన్నికల బరిలోకి దిగాయి.ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత 324 స్థానాలు ఉన్న అవిభజిత బీహార్ రాష్ట్ర అసెంబ్లీలో ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే సీట్లు రాలేదు,124 సీట్లతో అతిపెద్ద పార్టీగా లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ అవతరించింది.బీజేపీ పార్టీ ,సమతా పార్టీకి కలిపి మొత్తం 101 స్థానాలు రావడంతో శరద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ్ పార్టీ, శిబు సొరేన్ నేతృత్వంలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ,అలా వారు అసెంబ్లీలో అడుగు పెడుతున్న సమయంలో మీడియా ముందు తమ ఐకమత్యం తెలియజేస్తూ

అలా, మొదటిసారిగా నితీశ్ కుమార్ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు కొన్ని కారణాల వల్ల అసెంబ్లీలో సంఖ్య బలం నిరూపించుకోలేక కేవలం 7 రోజులు ముఖ్యమంత్రి గా పనిచేసి రాజీనామా చేశారు.

2005–2010:

ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2005 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ లేకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించి మళ్ళీ అక్టోబర్ చివర్లో ఎన్నికలు జరిగాయి ఈ సారి జనతాదళ్, బీజేపీ కలిసి తొలిసారిగా సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి,నితీశ్ కుమార్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు, తన మిత్రుడు బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ ఉపముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత

భాద్యతలు స్వీకరించిన తర్వాత నితీశ్ కుమార్ మొదట రాష్ట్ర ఆర్థిక పరిస్థితి , శాంతిభద్రతల గురించి దృష్టి సారించారు, 1990నుండి 2005 వరకు సాగిన లాలూ ప్రసాద్ కుటుంబ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతల, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారయ్యింది, అలాగే దేశంలో “బిమారు(బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్)” రాష్ట్రాల జాబితాలోకి చేర్చబడింది,లాలూ ప్రసాద్,రబ్రీ దేవీ ముఖ్యమంత్రిలుగా ఉన్నప్పుడు అవినీతి, బంధుప్రీతితో అలరారుతూ ఆటవిక రాజ్యాన్ని తలపించింది. నితీశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ క్రమంలో అనేకమంది నేరస్తులను అరెస్టు చేసి జైలుకు పంపించారు, శాంతిభద్రతల సమస్యలు సాధారణ స్థితికి వచ్చిన తరువాత కేంద్రప్రభుత్వంతో కలసి మావోయిస్టుల కార్యకలాపాలు రాష్ట్రంలో బలపడడానికి విలులేకుండా అనేక కఠినమైన చర్యలు తీసుకున్నారు. బిహార్ రాష్ట్ర ప్రధాన ఆర్థిక వనరు వ్యవసాయం కావడంతో(అవిభజిత బిహార్ రాష్ట్రంలో ఝార్ఖండ్ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం చేకూరేది కానీ ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాత బీహార్ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది)నితీశ్ ప్రభుత్వం సేల్స్, ల్యాండ్ టాక్స్ ల ద్వారా ఖజానాకు ఆదాయం చేకూర్చే అనేక సంస్కరణలు విస్తృతంగా అమలు చేయడం జరిగింది. అవినీతి రహిత పరిపాలన అందించేందుకు అవినీతి నిరోధక శాఖకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు.2009 బిమారు రాష్ట్రాల వార్షిక నివేదిక లో మిగిలిన రాష్ట్రాల కన్న ఆర్థిక ప్రగతి మెరుగ్గా ఉందని సాక్షాత్తు రిసర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ నుండి ప్రశంసలు అందుకున్నారు.బీహార్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి గా దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు,ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు వారంలో ప్రతి శుక్రవారం ప్రజల కోసం ” జనతా దర్బార్ ” కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అదేశించడమే కాకుండా తాను కూడా నెలలో ఒకరోజు తన నివాసంలో కార్యక్రమంలో ఇప్పటికీ పాల్గొంటూనే ఉన్నారు. ప్రజలు నితీశ్ ను ” సుసన్ బాబు ( అభివృద్ధి ప్రదాత )” గా బీహార్ ప్రజలు చేత గౌరవాన్ని పొందారు.

2010–2015 :

నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి 2009 లోక్ సభ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలు సాధించింది( మొత్తం 40 స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 32 స్థానాలను కైవసం చేసుకుంది),2010లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ తో గెలిపించారు(మొత్తం 243 స్థానాలకుగాను ఎన్డీయే కూటమి 206 స్థానాలు కైవసం చేసుకుంది). ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ

ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేస్తూ

నితీశ్ మూడోసారి ముఖ్యమంత్రి గా భాద్యతలు చేప్పట్టిన వెంటనే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి సారించారు, మొదటి సారి అధికారం చేపట్టిన తరువాత కేవలం రోడ్లు విస్తరణ పనులు ముమ్మరంగా ఆరంభించారు కానీ విద్య,విద్యుత్, త్రాగునీటి సమస్యల పరిష్కారం కోసం కార్యచరణ రూపొందించి పనులు చేపడుతున్న సమయంలో ఎన్నికలు రావడంతో కొంత జాప్యం జరిగిన తిరిగి నితీశ్ అధికారంలోకి వచ్చిన తరువాత పనులను వేగవంతం చేశారు,2013 నాటికి రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి విద్యుత్, రోడ్లు, వైద్య , త్రాగునీటి సదుపాయాలు సమకూర్చారు.నితీశ్ మరో అడుగు ముందుకు వేసి మహిళా సాధికారత కోరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50%సీట్లు మహిళలకు కేటాయించారు,అలాగే బాలికలకు పాఠశాలకు వెళ్ళేటందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున సైకిళ్లు అందించారు. నితీశ్ ప్రభుత్వ అభివృద్ధి నమూనాను మెచ్చుకుంటూ ప్రపంచ బ్యాంక్ అధికారులు ప్రశంసించారు,తన మిత్రపక్షమైన బీజేపీ ఎన్డీయే కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పేరును ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ ఎన్డీయే కూటమి నుండీ వైదొలగారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పొందడంతో బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు, కొద్దీ నెలల్లోనే మళ్లీ నాలుగో సారి అధికారం చేపట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు.

2015–2020:

2015 ఎన్నికల్లో తన పాత మిత్రుడు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ తో కలసి మహాఘట్ బంధన్ కూటమిగా బరిలోకి దిగి మళ్ళీ ఎన్నికల్లో విజయం సాధించి ఐదో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

ముఖ్యమంత్రి అయ్యాక బీహార్ రాష్ట్రం మొత్తం సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు జరిగేలా చర్యలు చేపట్టారు, ప్రజల కోసం నూతన సంక్షేమ పథకాల అమలు శ్రీకారం చుట్టారు,లాలూ ప్రసాద్ తనయుడు అప్పటి బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రైల్వే కాంటీన్ కు సంబంధించిన అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ జరిపించాలని నితీశ్ స్వయంగా కేంద్ర దర్యాప్తు సంస్థకు లేఖ రాశారు, అలాగే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్డీయే కూటమిలో చేరి బీజేపీ మద్దతుతో మళ్లీ 6వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

2019 లోక్ సభ ఎన్నికల్లో మళ్ళీ నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి బీహార్ రాష్ట్రంలో 40 సీట్లకుగాను 39 సీట్లు కైవసం చేసుకుంది.

2020:

2020లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలో తిరిగి ఎన్డీయే కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చింది.ఏడో సారి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు.

 • నితీశ్ కుమార్ ప్రాతినిధ్యం వహించిన రాజకీయ వేదికలు :

నితీశ్ కుమార్ రాజకీయాలు మొత్తం సామాజిక న్యాయం కోసం చుట్టే కేంద్రీకృతమైనవి, ప్రజలకు సామాజిక న్యాయం అందించే కోరకు పలు రాజకీయ వేదికలతో కలిసి పని చేసారు.

సంయుక్త సోషలిస్టు పార్టీ :

నితీశ్ కుమార్ ఎంతగానో అభిమానించే సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా స్థాపించిన పార్టీ. విద్యార్థిగా ఉన్న సమయంలో పార్టీ యువజన విభాగం మైన సమాజ్ వాదీ యువజన విభాగంలో చేరిన కొద్ది రోజులకే పార్టీ యువజన విభాగం నాయకుడు లాలూ ప్రసాద్ తో స్నేహం ఏర్పడింది, వారి స్నేహం ఎంతలా అంటే లాలుకు వివాహం జరిగేదాక నితీశ్ కుమార్ తో హాస్టల్లో ఒకే గదిలో ఉండేవారు, పాట్నా విశ్వ విద్యార్థి సంఘం ఎన్నికల్లో లాలూ ప్రసాద్ నిలబడేలా ఒప్పించి తానే స్వయంగా లాలూ ప్రసాద్ తరుపున ప్రచారం చేసి గెలిపించారు, లాలూ ప్రసాద్ ఎం.ఎ చదువు పూర్తి చేసి యూనివర్సిటీ లో లా కోర్స్ ను అభ్యసించడానికి అక్కేడే ఉండిపోయారు, నితీశ్ మాత్రం ఇంజినీరింగ్ పూర్తి చేసి బీహార్ విద్యుత్ కార్పొరేషన్ లో ఇంజినీరుగా తన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించిన నితీశ్ అందులో ఇమడలేక రాజీనామా చేసి అప్పుడే అవినీతి రహిత సమాజం కోసం జె.పి తలపెట్టిన ఉద్యమం వైపు ఆకర్షితుడై ఉద్యమంలో తన మిత్రుడు లాలూ ప్రసాద్ తో కలసి ఉద్యమంలో పాల్గొని ఎమెర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు సైతం వెళ్లారు.

జనతా పార్టీ :

1977లో ఎమెర్జెన్సీ ఎత్తివేసిన తరువాత నిరంకుశ ఇందిరా గాంధీ పరిపాలనకు వ్యతిరేకంగా జై ప్రకాశ్ నారాయణ్ స్థాపించిన జనతా పార్టీలో తన మిత్రుడు లాలూ ప్రసాద్ తో కలిసి చేరారు,1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ లోక్ సభకు పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు, నితీశ్ మాత్రం 1978లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు,ఓటమి చవిచూసిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఇండియా తరుపున ప్రపంచ యువతకు సంబంధించిన నాయకత్వ సదస్సులో పాల్గొన్నారు ముఖ్యంగా సోషలిస్టు భావజాలాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రష్యా దేశంలో పర్యటించి సోషలిస్టు నూతన భావాలను అధ్యయనం చేసేటందుకు రష్యా పర్యటన బాగా ఉపయోగపడింది.1980లో జనతా పార్టీలో చీలికలు ఏర్పడటంతో , రాజ్ నారాయణ్ నేతృత్వంలో ఉన్న జనతాపార్టీ(సెక్యూలర్)లో తన మిత్రుడు లాలూ ప్రసాద్ తో కలిసి చేరి మళ్ళీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు, లాలూ ప్రసాద్ మాత్రం అసెంబ్లీకి ఎన్నికయ్యి అసెంబ్లీలో పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారు, నితీశ్ మాత్రం ఓటమికి నిరాశ చెందకుండా తన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చెప్పట్టారు ప్రజల మద్దతు పొందటం జరిగింది,1984లో జనతాపార్టీ(సెక్యూలర్)ని మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్ నేతృత్వంలోని లోక్ దళ్ పార్టీలో విలీనం జరిగింది.

లోక్ దళ్ :

లాలూ ప్రసాద్ , నితీశ్ కుమార్ తదితరులు లోక్ దళ్ పార్టీ లో చేరారు 1985 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కొందరి ఒత్తిడి తో నితీశ్ కు పార్టీ టిక్కెట్ రాకుండా చేయడంతో ,నితీశ్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా తన నియోజకవర్గం హర్నట్ నుంచి బరిలోకి దిగి లోక్ దళ్ పార్టీ అభ్యర్థి మీద ఘనవిజయం సాధించారు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు, లాలూ ప్రసాద్ చొరవతో తిరిగి లోక్ దళ్ పార్టీలో చేరారు అసెంబ్లీలో తన విషయ పరిజ్ఞానం తో అతికొద్ది సమయంలో పార్టీలో ముఖ్యనేతగా ఎదిగారు,1987లో పార్టీ అనుబంధ విభాగామైన యువ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో లాలూతో

జనతాదళ్ :

1989 లోక్ సభ ఎన్నికల్లో పూర్వ జనతా పార్టీలోని చీలికలు మొత్తం కలసి జనతాదళ్ పార్టీగా ఏర్పడటంతో లాలూ ప్రసాద్, నితీశ్ కుమార్ లు ఇద్దరూ కలిసి జనతాదళ్ పార్టీ విజయం కోసం పార్టీ తరుపున బీహార్ రాష్ట్రం మొత్తం ప్రచారం చేశారు, అలా ప్రచారం చేస్తున్న సమయంలో

ఇదే ఎన్నికల్లో నితీశ్ పాట్నా సమీపంలోని తన సొంత లోక్ సభ నియోజకవర్గమైన బర్హ్ నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు, నితీశ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నేతగా పార్టీలో ఎదుగుతున్న సమయంలోనే కేంద్రంలో జనతాదళ్ పార్టీ అధికారంలోకి రావడంలో కృషి చేసినందుకు కేంద్ర పార్టీ అధినాయకత్వం నితీశ్ ను బీహార్ రాష్ట్ర జనతాదళ్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా నియమించింది.ఒకవైపు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటూనే బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ గడిపారు,1990లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ముఖ్యమంత్రి గా ఎవరిని నియమించాలనే మీమాంసలో ఉన్న లాలూ ప్రసాద్ పేరును మొదటగా నితీశ్ ప్రతిపాదించడమే కాకుండా పార్టీ తరుపున గెలిచిన సభ్యులతో కలిసి పార్టీ నాయకులు ఉప ప్రధానమంత్రి దేవి లాల్, ఒరిస్సా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ , ప్రధానమంత్రి వి.పి.సింగ్ చేత లాలూ ప్రసాద్ అభ్యర్థిత్వానికి ఆమోద ముద్ర వేయించారు,అలా లాలూ ప్రసాద్ బీహార్ రాష్ట్రానికి జనతాదళ్ పార్టీ తరుపున ముఖ్యమంత్రి అవ్వడంలో నితీశ్ కీలక పాత్ర పోషించారు. ప్రమాణ స్వీకారం సమయంలో నితీశ్, లాలూ,శరద్ యాదవ్

1990 ప్రారంభంలో నితీశ్ కేంద్ర వ్యవసాయ, సహకార శాఖ సహాయ మంత్రి భాద్యతలు చేపట్టి కొంతకాలం పనిచేసారు,1991లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు, జనతాదళ్ పార్టీ కి జాతీయ ప్రధానకార్యదర్శి గా కూడా ఎన్నికయ్యారు ,పార్టీ పార్లమెంట్ ఉపనాయకుడిగా పార్లమెంటులో బీహార్ రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తూనే కేంద్ర ప్రభుత్వం తీసుకొనే వివాదాస్పద నిర్ణయాలను విమర్శలు చేయడానికి వెనుకడేవారు కాదు,ముఖ్యంగా బాబ్రీ మసీదు కూల్చివేత ప్రక్రియ జరగడానికి కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే ప్రధాన కారణం గా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి పి.వి నైతిక బాధ్యత వహిస్తు రాజీనామా చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి మంత్రి లాలూ ప్రసాద్ తో కలిసి పాట్నా లో నిరాహారదీక్ష సమయంలో

ఈ సమయంలో లాలూ ప్రసాద్ ముఖ్యమంత్రి గా కొన్ని వివాదాస్పద నిర్ణయాల వల్ల అటు ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు రావడంతో నితీశ్ తదితరులు నిర్ణయాలను పూనః సమీక్ష చేయాల్సిందిగా కోరాడం లాలూ ప్రసాద్ ససేమిరా అనడం వెంటవెంటనే జరిగిపోయాయి, అలాగే లాలూ ప్రసాద్ తన పాలన సుస్థిరం చేసుకోవడానికి పార్టీలో నేరస్తులను చోటు ఇవ్వడం కూడా వారి మధ్య పెరిగేలా చేసింది ,1993లో నితీశ్ తన అనుచరులతో కలిసి జనతాదళ్ పార్టీ పదవులకు రాజీనామా చేశారు.రాజీనామా చేసిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ

సమతా పార్టీ :

జనతాదళ్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత నితీశ్ పార్లమెంట్ కేంద్రంగా బిహార్ రాష్ట్రంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు మీద పార్లమెంట్ సాక్షిగా విమర్శలు చేశారు, అదే సమయంలో జనతాదళ్ పార్టీ చీలికవర్గమైన జనతాదళ్(జార్జ్)పార్టీ అధినేత జార్జ్ ఫెర్నాండెజ్ తో మంతనాలు జరిపి కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు, అలా 1994 ప్రారంభంలో సమతా పార్టీ ఆవిర్భావించింది,పార్టీ కార్యాలయంలో జార్జ్ ఫెర్నాండెజ్ , నితీశ్ కుమార్ మిగిలిన నాయకులు

1994లో పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన సమావేశంలో సమతా పార్టీ ని ప్రజలకు పరిచయం చేశారు ఆ సమయంలో భాగంగా వేదిక మీద

బీహార్ లోని లాలూ ప్రసాద్ యాదవ్ వ్యతిరేక వర్గం మొత్తం పార్టీలో చేరడంతో పార్టీకి రాష్ట్రంలో బలమైన పూనాదులు ఏర్పడ్డాయి, సమతా పార్టీ అధ్యక్షుడిగా జార్జ్ ఫెర్నాండెజ్ ఎన్నికయ్యారు. సమతా పార్టీ ఆవిర్భావంతో జనతాదళ్ పార్టీకి అండగా ఉన్న వెనుకబడిన తరగతుల ప్రజలు క్రమంగా సమతా పార్టీ వైపు మల్లడంతో లాలూ ప్రసాద్ యాదవ్ -ముస్లింల సంఘటిత ఓట్లను తనవైపు ఆకర్షించేందుకు వారికి పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తన వైపు తిప్పుకున్నారు.1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సమతా పార్టీ ప్రకటించి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా

ఎన్నికల్లో సమతా ఓటమి పాలయింది,1996 లోక్ సభ ఎన్నికల్లో సమతా పార్టీ 13 సీట్లు కైవసం చేసుకుంది నితీశ్ కూడా మళ్ళీ లోక్ సభకు ఎన్నికయ్యారు, కేంద్రంలో అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో ఏర్పడ్డ 13 రోజుల ప్రభుత్వానికి సమతా పార్టీ ద్వారా మద్దతునిచ్చారు, తరువాత బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమిలో చేరడం జరిగింది, బీహార్ రాష్ట్రంలో బీజేపీతో కలిసి లాలూ ప్రసాద్ అవినీతి పాలన మీద అనేక పోరాటాలు చేశారు, ముఖ్యంగా లాలూ ప్రసాద్ హయాంలో జరిగిన దాణా కుంభకోణం వెలుగులోకి తీసుకు రావడంలో బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీతో కలిసి కృషి చేశారు. 1998 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసి ఎన్నికల్లో గెలవడమే కాకుండా కేంద్రంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు, మళ్ళీ 1999లో జరిగిన ఎన్నికల్లో సమతా పార్టీ 21 సీట్లు కైవసం చేసుకుంది నితీశ్ మళ్ళీ కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.2000 లో జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున ఎన్నికల్లో పోటీకి దిగి కేంద్రమంత్రి హోదాలో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు

ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఏ పార్టీ మెజార్టీ దక్కకపోవడంతో నితీశ్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా వంటి చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కానీ మద్దతు నిరూపించుకోలేక రాజీనామా చేశారు, ఆ సమయంలో మీడియా ముందు మాట్లాడుతూ

2003లో సమతా పార్టీ ,జనతాదళ్ పార్టీ చిలికవర్గమైన శరద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ్ ను కలపాలని నిర్ణయించింది , అందుకు ఇరువర్గాల నేతలు సుముఖంగా ఉండటంతో అధినేత జార్జ్ ఫెర్నాండెజ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ

పాట్నాలో ఉన్న గాంధీ మైదానంలో బహిరంగ సభలో సమతా పార్టీ, జనతాదళ్ పార్టీ నేతలు కలిసిపోయారు కొత్త పార్టీ గా జనతాదళ్(యునైటెడ్)పార్టీ ఆవిర్భావం జరిగిన సమావేశంలో నేతలు నితీశ్, ఫెర్నాండెజ్, శరద్ , దిగ్విజయ్ సింగ్

జనతాదళ్(యునైటెడ్) :

2004 నుంచి ప్రస్తుతం వరకు పార్టీ గెలుపు ఓటమిలో కీలకపాత్ర పోషిస్తున్నారు, అలాగే పార్టీకి జాతీయ అధ్యక్షుడు గా కూడా పనిచేస్తున్నారు.

వ్యక్తిగత జీవితం :

నితీశ్ కుమార్ వివాహం మంజూ కుమారి సిన్హా తో జరిగింది, వారిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. నితీశ్ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో మంజూ కుమారి గారు కూడా పాట్నా విశ్వవిద్యాలయం అనుబంధ మహిళా కళాశాలలో విద్యార్థిని , వారిద్దరూ తొలిసారిగా విద్యార్థులు ధర్నాలో కలుసుకున్నారు, తరువాత కాలంలో పరిచయం ప్రేమగా మారుతున్న సమయంలో నితీశ్ తండ్రిగారు వివాహం చేయడానికి సంకల్పించి అనుకోకుండా బంధువులు ద్వారా సంబంధం కోసం మంజూ కుమారి గారి తండ్రిని కలిసి వివాహ సంబంధం నిశ్చయించుకొన్నారు. సోషలిస్టు భావాలు కలిగిన నితీశ్ తన వివాహాన్ని పాట్నా రిజిస్టర్ కార్యాలయంలో ఎంతో నిరాడంబరంగా చేసుకున్నారు, ఇంజినీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్లనుకున్న సమయంలో కుటుంబ సభ్యులందరూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మంజూ కుమారి గారు మాత్రం సమర్థించారు, రాజకీయాల్లో తీరిక లేకుండా గడుపుతున్న సమయంలో మంజూ కుమారి గారు ఇంటి భాద్యతలు నిర్వర్తించారు, కుటుంబ పోషణ కోసం ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేసారు,అంతేకాకుండా 1977,1980,1985 ఎన్నికల్లో పోటీ చేసేటందుకు కి నితీశ్ కు కుటుంబ అవసరాల కోసం దాచుకున్న ధనాన్ని ఇచ్చారు. 1977,1980 ఎన్నికల్లో ఓడిపోయి డీలా పడిపోయిన నితీశ్ రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని భావిస్తున్న సమయంలో మంజూ కుమారి గారి నైతిక మద్దతు వల్ల ఓటమి ఆలోచనలు నుండి బయటపడటం జరిగింది,1985 నుంచి ప్రస్తుతం వరకు అప్రతిహతంగా సాగిపోతున్న నితీశ్ విజయాలకు ఆమె కారకురాలు ,నితీశ్ కేంద్రంలో మంత్రిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా పనిచేస్తున్న మంజూ కుమారి గారు టీచర్ గా పనిచేస్తూ సాధారణ జీవితం గడిపారు, ఆమె 2007లో మరణించారు,వారికి ఒక కుమారుడు, పేరు నిశాంత్ కుమార్ సిన్హా. నితీశ్ కుమార్ , మంజూ కుమారిగారు

వారి కుమారుడు

ప్రస్తుత భారత దేశ రాజకీయాల్లో చివరి క్రియాశీలక సోషలిస్టు ముఖ్యమంత్రి ఒక్క నితీశ్ కుమార్ మాత్రమే.

ములాయం సింగ్ యాదవ్

ములాయం సింగ్ యాదవ్(1939)

ములాయం సింగ్ యాదవ్ సఫాయి గ్రామంలో పేద రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆటలు మీద ఆసక్తి చూపారు, ముఖ్యంగా శరీరాన్ని దృడంగా ఉంచే వ్యాయామాలు చేసేవారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ప్రతి కుస్తీ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచేవారు. రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ లలో, వ్యాయామ విద్యలో డిప్లొమా పూర్తి చేసి కొంతకాలం స్వగ్రామంలో వ్యాయామ ఉపాధ్యాయులుగా, కుస్తీ పోటీల శిక్షకులుగా , రైతుగా పనిచేశారు.

సోషలిస్టు దిగ్గజం రామ్ మనోహర్ లోహియా ప్రబోధించిన సిద్ధాంతాలకు ఆకర్షితుడై లోహియా అనుచరుడిగా రాజకీయాల్లో ప్రవేశించి 1967 నుంచి 2007 వరకు 8 సార్లు రాష్ట్ర అసెంబ్లీకి, 1996 నుంచి ప్రస్తుతం వరుకు 6 సార్లు లోక్ సభకు,1980 నుంచి 1985 వరకు రాష్ట్ర మండలి సభ్యులు గా ఎన్నికయ్యారు.

1977లో మొట్టమొదటి సారి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.అనంతరం 1982 నుంచి 1985 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేత గా కొనసాగారు. ముఖ్యమంత్రి గా1989 నుంచి 1991 వరకు మొదటి సారి, 1993 నుంచి 1995 వరకు రెండో సారి, 2003 నుంచి 2007 వరకు మూడు సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసారు. 1996 నుంచి 1998 వరకు కేంద్ర యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేశ రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ములాయం కుటుంబం మొత్తం రాష్ట్ర మరియు దేశ రాజకీయాల్లో ఉంది, కుమారుడు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత లోక సభలో సభ్యుడు, కోడలు డింపుల్ యాదవ్ మాజీ యంపీ, సోదరుడు శివ పాల్ యాదవ్ ప్రస్తుత యూపీ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే, ఇంకా చాలా మంది యూపీ లోని ప్రతి జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అనేక పదవుల్లో కొనసాగుతున్నారు.

మాజీ బీహార్ ముఖ్యమంత్రి , ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె ను తన మనుమడు కిచ్చి వివాహం జరపడం వల్ల బీహార్ రాష్ట్రంలోని యాదవ సామాజిక వర్గానికి మరో ముఖ్య నేతగా పలుకుబడి కలిగి ఉన్నారు.

మొదట లోహియా అనుచరుడిగా ఉన్న ములాయం ఆయన ఆకస్మిక మరణం వల్ల మరో సోషలిస్టు నేత రాజ్ నారాయణ్ , మాజీ ప్రధాన మంత్రులు చరణ్ సింగ్, వి.పి.సింగ్, చంద్రశేఖర్ గార్ల ప్రధాన అనుచరుడిగా కొనసాగారు. ములాయం యాదవ్ గారికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు మైనార్టీ, యాదవ్ సామాజికవర్గం లో గట్టి పట్టుంది. “నేతాజీ”గా కూడా యూపీ రాష్ట్ర ప్రజానీకానికి అత్యంత సుపరిచితులు.

దేశ, యూపీ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన ములాయం మరోసారి దేశ , 2021లో జరిగే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషించడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారు.

శశి థరూర్

శశి థరూర్(1956)

శశి థరూర్ గారు లండన్ లో జన్మించారు, ఆయన తండ్రి భారత విదేశాంగ శాఖ లో ఉన్నతాధికారి, అలాగే థరూర్ కుటుంబ నేపథ్యం చాలా బలమైనది, సంపన్న మైనది. దేశంలో ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో, విదేశాల్లో ఉన్న ఉన్నతమైన విద్య సంస్థల్లో తన విద్యను పూర్తి చేసి ఐక్యరాజ్య సమితి లో 1978 నుంచి 2009 వరకు వివిధ స్థాయిల్లో పనిచేశారు.

2006లో ఐక్యరాజ్య సమితి కార్యదర్శిగా పోటీ పడి స్వల్ప ఓట్ల తేడాతో దక్షిణ కొరియా కు చెందిన బాకీ మూన్ చేతిలో ఓటమి పాలయ్యారు, లేకుంటే సమితి కార్యదర్శిగా ఎన్నికైన మొదటి భారత దేశానికి వ్యక్తిగా థరూర్ ప్రపంచ చరిత్రలో నిలిపోయేవారు.

2009 నుంచి ప్రస్తుతం వరకు కమ్యూనిస్టు పార్టీల కంచుకోట తిరువనంతపురం లోక్ సభ స్థానం నుంచి వరుసగా కాంగ్రెస్ అభ్యర్థిగా మూడు సార్లు గెలిచిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. 2009 నుంచి 2010 వరకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి గా, 2012 నుంచి 2014 వరకు మానవవనరుల శాఖ సహాయ మంత్రిగా మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో పనిచేశారు.

థరూర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా బహుళ్యంలో ఉన్న అనేక సమస్యలకు అధికార ప్రభుత్వాలకు పరిష్కారాలు సూచించారు ,పార్లిమెంట్ లో ఆయన లేవనెత్తిన సమస్యలను అన్ని పార్టీల సభ్యులు ఆసక్తిగా వింటారు. ప్రస్తుత భారత ప్రధాని నరేంద్రమోడీ విమర్శకుల్లో థరూర్ పేరు ముందు వరుసలో ఉంటుంది.

రాజకీయ నాయకుడిగా కంటే థరూర్ గారికి మంచి రచయితగా పేరుంది, ఆయన రచనలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. భారత ప్రభుత్వం నుంచి కూడా రచయిత గా అవార్డులు అందుకున్నారు. ఆంగ్ల భాష మీద ఉన్న పట్టు ఆయన్ను యువతకు దగ్గర చేయడంలో కీలక పాత్ర పోషించింది, థరూర్ వాడుక ఇంగ్లీష్ భాషలో అనేక కొత్త పదాలకు సృష్టికర్త.

థరూర్ స్వేచ్ఛ జీవి, మంచి రచయిత అలాగే దేశ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది, కానీ భారత దేశ ప్రజలు మాత్రం ఆయన ఒక మంచి రచయిత గానే పరిగణనలోకి తీసుకుంటున్నారు తప్పించి రాజకీయ నాయకుడిగా మాత్రం కాదు.

లాలూ ప్రసాద్ యాదవ్

లాలూ ప్రసాద్ యాదవ్ (1948)

లాలూ ప్రసాద్ బీహార్ రాష్ట్రంలో ప్రస్తుత గోపాల్ గంజ్ జిల్లాలో ఫుల్వారియా గ్రామంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు. గోపాల్ గంజ్, శరన్, పాట్నా ప్రాంతాల్లో ఎస్.ఎల్.సి, పియూసీ , డిగ్రీ(లా) ,పాట్నా విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్, పిహెచ్ డి పూర్తి చేసి కొంత కాలం పశువైద్య కళాశాలలో బంట్రోతు గా పనిచేశారు.

పోస్టుగ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో రబ్రీ దేవి గారితో వివాహం వీరికి 9 మంది సంతానం. ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ , లాలూ ప్రసాద్ యాదవ్ గారు విద్యార్థి సమయంలో మంచి స్నేహితులు, విశ్వవిద్యాలయం వసతి గృహంలో వీరిద్దరూ ఒకే గదిలో ఉండేవారు, అలాగే లాలూ రాజకీయ జీవితంలో అనేక విజయాల్లో నీతిశ్ కుమార్ గారి పాత్ర కీలమైనది.

లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ గారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో లాలూ ప్రసాద్ గారు ముందువారు. ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద అరెస్ట్ చేయడంతో తన పెద్ద కుమార్తెకు పేరు మీసా పేరు పెట్టారు.

1977,1989,1998,2004,2009లలో లోక్ సభకు ఎన్నికయ్యారు, 1980,1985,1995లలో మూడు సార్లు బిహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు, అలాగే 1990 నుంచి 1995 వరకు బీహార్ శాసనసభ మండలికి ఎన్నికయ్యారు. 1985 నుంచి 1989 వరకు బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా, 1990 నుంచి 1997 వరకు రెండు సార్లు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా, 2004 నుంచి 2009 వరకు కేంద్ర యూపీఏ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు.

1989, 1996 లలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పాటు లో కీలకమైన పాత్ర పోషించారు. 1990లో బీహార్ ముఖ్యమంత్రి గా దేశవ్యాప్తంగా రథయాత్ర లో భాగంగా బీహార్ లోకి ప్రవేశించిన బీజేపీ అధ్యక్షుడు అద్వానీ గారిని అరెస్ట్ చేయించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. వివాదాస్పద మండల్ కమిషన్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన తరువాత దేశంలో మొదటగా బీహార్ రాష్ట్రంలో అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రి లాలూ గారు.

1997లో జనతాదళ్ పార్టీని చీల్చి నూతనంగా రాష్ట్రీయ జనతా దళ్ పార్టీని స్థాపించారు. బీహార్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో దాణా కుంభకోణంలో అరెస్ట్ అయ్య ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు జీవితాంతం అర్హత కోల్పోయిన మొదటి రాజకీయ నాయకుడు. నిరక్షరాస్యురాలు తన భార్య రబ్రీ దేవిని బీహార్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి గా గెలిపించారు.కుమారులు తేజ్ ప్రతాప్ , తేజస్వి లు మాజీ మంత్రిలుగా పనిచేశారు, చిన్న కుమారుడు తేజస్వి గారు ప్రస్తుత బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత.

పదిహేనేళ్ల తన పార్టీ పాలనలో అగ్రవర్ణ ప్రజలను అత్యంత అవమానకర రీతిలో హింసించడం, అవినీతి, కుటుంబ పాలన మొత్తం ఆటవిక రాజ్యానికి నమూనా గా బీహార్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. ఇంత ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ గారు మాత్రం బీహార్ లో అత్యధిక జనాభా కలిగిన యాదవులు, ముస్లింలు వీరికి, వీరి పార్టీకి బలమైన మద్దతు దారులు.

లాలూ ప్రసాద్ ఒక సారి ఇవి

“జబ్ తక్ సమోసా మే ఆలు ,టబ్ తక్ బీహార్ రాజనీతి మే లాలూ” ( సమోసాలో ఆలుగడ్డ ఉన్నట్లు బీహార్ రాజకీయాల్లో లాలూ ఉంటాడు).

ఎల్.కె.అద్వానీ

లోహ పురుషుడు గా దేశవ్యాప్తంగా పేరుపొందిన అద్వానీ గారి పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. అవిభజిత భారత దేశంలో ఉన్న సింధూ రాష్ట్రంలోని కరాచీ పట్టణంలో జన్మించారు(ప్రస్తుతం పాకిస్థాన్ దేశం). అద్వానీ తండ్రి కిషన్ చంద్ గారు అప్పటి సింధూ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలో ఒకరు. దేశ స్వాతంత్ర్య సమయంలో భారత దేశానికి వలస వచ్చిన సింధీ కుటుంబాల్లో వీరి కుటుంబం ఒకటి.

14 ఏళ్ల వయస్సు లో మిత్రుడి ప్రోద్బలంతో ఆర్ ఎస్ ఎస్ లో చేరి ప్రచారక్ గా ఎదిగారు. 1952లో జనసంఘ్ పార్టీలో చేరి 1960 నాటికి పార్టీ లో ఉన్న ముఖ్య నాయకుల్లో ఒకరిగా ఎదిగారు.1966 నుంచి 1967 వరకు ఢిల్లీ నగర పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.1966 నుంచి 1977 వరకు జనసంఘ్ పార్టీ జాతీయ కార్యవర్గంలో సభ్యులుగా పనిచేశారు. 1967లో జరిగిన ఢిల్లీ నగర పురపాలిక ఎన్నికల్లో పార్టీ తరుపున అధ్యక్షుడు గా ఎన్నికయ్యి 1970 వరకు పనిచేశారు. ఇదే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటి విజయం.

1970 నుంచి 1980 వరకు దేశ రాజకీయల్లో ఆయన పాత్ర అతి స్వల్పంగా ఉండేది. 1980లలో బీజేపీ పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుల్లో ఒకరు. 1985లో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యి పార్టీని దేశవ్యాప్తంగా విస్తృతంగా విస్తరించడమే లక్ష్యం గా పనిచేశారు. 1987లో రామాజన్మభూమి ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి పార్టీ తరుపున ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లడంలో అద్వానీ గారి పాత్ర ముఖ్యమైనది. దేశంలో రథ యాత్రలకు ఆద్యుడు అద్వానీ గారు, ఆయన రథయాత్ర చేసిన ప్రతి సారి బీజేపీ పార్టీ బలపడడానికి దోహదం చేసాయి. బీజేపీ అధ్యక్షుడుగా పార్టీకి బలమైన కార్యకర్తల సైన్యం తయారు చేసిన ఘనత కూడా అద్వానీ గారి సొంతం.

కాంగ్రెస్ , మిగిలిన పార్టీలు ముస్లింల ఓట్లు, రిజర్వేషన్లు రాజకీయాల్లో బిజీగా ఉంటే వారికి విరుగుడుగా బీజేపీ పార్టీని సనాతన హిందూ ధర్మం పరిరక్షణకు సంబంధించిన రాజకీయాల్లోకి ప్రవేశపెట్టారు. 1980 మధ్య నుంచి 2004 చివరి వరకు దేశ రాజకీయాల్లో ముఖ్యంగా హిందూ సమాజంలో అద్వానీ గారు ఒక శక్తివంతమైన వ్యక్తి, హిందూ మతం పరిరక్షణకు కట్టుబడిన యోధుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం అలాంటి హోదా ప్రస్తుత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారికి సొంతం.

1970,1976,1982,1988 లలో వరుసగా జనసంఘ్, బీజేపీ పార్టీల తరుపున 4 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.1989,1991,1996,1998,1999,2004 , 2009, 2014 లలో వరుసగా 8 సార్లు వివిధ స్థానాల నుంచి లోక్ సభ కు ఎన్నికయ్యారు. 1977లో జనతా ప్రభుత్వంలో సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా, 1998 నుంచి 2004 వరకు కేంద్ర హోంశాఖ మంత్రిగా, 2002లో బొగ్గు గనుల శాఖకు ఇంఛార్జి మంత్రిగా,1980లో మొదటి ఆరు నెలలు రాజ్యసభ ప్రతిపక్ష నేతగా, 2002 నుంచి 2004 వరకు దేశానికి ఉప ప్రధానమంత్రి గా పనిచేశారు.

అద్వానీ గారికి అత్యంత సన్నిహితులు, ప్రాణ మిత్రులు వాజపేయి గారు. వారి స్నేహం జనసంఘ్ పార్టీతో మొదలై సుమారు 60 దశాబ్దాలు కొనసాగింది(వాజపేయి మరణించే వరకు). అద్వానీ గారు కరుడుగట్టిన హిందూత్వ వాది, అలా అని ఆయన ఇతర మతాల ప్రజలను ఏనాడు వ్యక్తిగతంగా కానీ ఎన్నికల సభల్లో కానీ తూలనాడలేదు. 2 సీట్లు ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు దేశంలో అతి శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దుడంలో ఆయన పాత్ర అనన్య సామాన్యమైనది.

ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారికి రాజకీయ గురువు మరియు ఆయన రాజకీయ భవిష్యత్తును కాపాడం కోసం ఎన్నో ఒత్తిడలను ఎదుర్కొన్నారు. భారతదేశంలో ఏంతో మంది గొప్ప రాజకీయ నాయకులు జన్మించారు, అలాంటి వారిలో అద్వానీ గారి పేరు ముందువరుసలో ఉంటుంది. దేశంలో రాజకీయాలు, హిందూ సమాజం ఉన్నంతవరకు ఆయన చెరిగిపోని అధ్యాయం. ఒక వేళ ఆయన వాజపేయి గారి బదులు దేశానికి ప్రధానమంత్రి అయ్యుంటే ప్రస్తుత దేశ రాజకీయ చరిత్ర మరో విధంగా ఉండేది.

అమిత్ షా

అమిత్ షా గారి పూర్తి పేరు అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా. షా మూతత్తా, తాత గార్లు గుజరాత్ లోని మన్స రాజ్యంలో మన్స నగరానికి పరిపాలన అధికారులు, వారి తండ్రి గారు అవిభజిత బొంబాయి రాష్ట్రంలో గుజరాత్ ప్రాంత ప్రముఖ వ్యాపార వేత్త. వీరి కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు, సోషలిస్టు నేత మిను మసాని, గుజరాత్ రాష్ట్ర పీత ఇందులాల్ యాగ్నిక్ , సర్దార్ పటేల్ గారి కుమార్తె మణిబెన్ గారు వీరి కుటుంబానికి అత్యంత సన్నిహితులు.1977 లోక్ సభ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థులకు ఆర్థికంగా సహాయం చేశారు.

చిన్న వయస్సు లోనే ఆర్ ఎస్ ఎస్ లో బాల స్వయం సేవక్ గా పనిచేసిన షా , అహ్మదాబాద్ లో చదువుకుంటున్న సమయంలో పూర్తిగా శాఖ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థిగా ఉన్న సమయంలోనే ప్రస్తుత ప్రధాన మంత్రి, అప్పటి ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ఉన్న మోడీ గారిని కలుసుకున్నారు అప్పట్నుంచి ఇప్పటి దాకా వారి బంధం ఆరోగ్యకరంగా ఉంది. డిగ్రీ పూర్తి చేసిన తరువాత కొంతకాలం తండ్రి వ్యాపారంలో సహాయకారిగా, స్టాక్ మార్కెట్ లో ఏజెంట్ గా పనిచేశారు.

షా తొలుత ఆర్ ఎస్ ఎస్ విద్యార్థుల విభాగం ఏబీవీపీ లో అనేక పాత్రలు పోషించారు, ఎబివిపి లో ఉన్న సమయంలో ప్రముఖ దిగ్గజ నాయకుడు నానజీ దేశముఖ్ గారి తో కలిసి పనిచేశారు. 1988లో బీజేపీ పార్టీ లో చేరి పార్టీ యువ విభాగం యువ మోర్చా లో అనేక పదవులు జాతీయ స్థాయిలో చేపట్టారు,ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గార్లు కూడా బిజెవైఎం లో షాతో కలిసి పనిచేశారు. 1991లో గాంధీనగర్ లోక్ సభ స్థానం నుంచి అద్వానీ గారు భారీ విజయం సాధించడంలో షా పాత్ర కీలకం.

మోడీ షా లు కలిసి గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పార్టీని పటిష్టపరిచేందుకు కలిసి పనిచేశారు, అప్పట్నుంచి ఇప్పటి దాకా వారు నిర్మించిన పార్టీ వ్యవస్థ రాష్ట్రంలో బలంగా ఉంది. మోడీ జాతీయ పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలో గుజరాత్ రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులు గురించి తెలియజేసే వ్యక్తి గా షా ముఖ్య పాత్ర పోషించారు. 1997 నుంచి 2014 వరకు నాలుగు సార్లు గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు, 2002 నుంచి 2010 వరకు అనేక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఒక దశలో 12 శాఖలకు మంత్రిగా పనిచేశారు.

1995 నుంచి 1996 వరకు గుజరాత్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు,1999లో అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు ఎన్నికల్లో గెలిచి బ్యాంకు అధ్యక్షుడిగా నష్టాల్లో ఉన్న బ్యాంక్ ను లాభాల బాటలో నడిపించారు. 2009 నుంచి 2017 వరకు గుజరాత్ క్రికెట్ సంఘానికి ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం సర్దార్ పటేల్ స్టేడియం నిర్మాణం షా పర్యవేక్షణలో జరిగింది.

మోడీ వరుసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడంలో షా ముఖ్య పాత్ర పోషించారు. 2014,2019లలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ వరుసగా కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ తో రెండు సార్లు అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం షా, అందుకే ఆధునిక దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడు గా పేరు గాంచారు .

2014 నుంచి ప్రస్తుతం వరకు బీజేపీ పార్టీని దేశంలో బలమైన పార్టీగా మలచడంలో షా గారి పాత్ర కీలకం. బీజేపీ ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు , ద్వారకా నుంచి ఈశాన్య రాష్ట్రాల కు విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. 2019లో దేశానికి హోమ్ మంత్రిగా దేశంలో ఉన్న వివాదాస్పద సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. మోడీ గారు అధికారాన్ని నిర్వహిస్తుంటే , షా గారు పార్టీని నిర్మించడానికి, ఎన్నికల్లో పార్టీ ని విజయ తీరాలకు చేర్చేందుకు కృషి చేస్తున్నారు.

అమిత్ షా గారు కరుడుగట్టిన హిందుత్వ వాది, ఆయన దేశంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసమే రాజకీయాల్లోకి ప్రవేశించారు . ప్రస్తుతం దేశంలో ప్రధానమంత్రి మోడీ తరువాత రెండో శక్తివంతమైన వ్యక్తి అమిత్ షా గారు. భవిష్యత్తులో దేశానికి ప్రధానమంత్రి కూడా అవుతారని దేశ రాజకీయాల్లో వినికిడి.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి(1960)

కిషన్ రెడ్డి గారు 15 జూన్ 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న తిమ్మాపూర్ గ్రామంలో తిమ్మ రెడ్డి, ఆండాళ్ మ్మ దంపతులకు జన్మించారు. వారిది సాధారణ రైతు కుటుంభం. హైదరాబాద్ లోని సెంట్రల్ టూల్ డిజైన్ ఇనిస్టిట్యూట్ నుంచి టూల్ డిజైనింగ్ లో డిప్లొమా అందుకున్నారు.

విద్యార్థిగా ఉన్న సమయంలో ఎన్నో రాజకీయ సమస్యలకు పరిష్కారం కోసం యువ చర్చ కార్యక్రమాలు నిర్వహించి తన నాయకత్వ లక్షణాలను వెలికి తీశారు. 1977లో లోక మాన్య జై ప్రకాశ్ నారాయణ్ గారి స్పూర్తితో వారు స్థాపించిన జనతాపార్టీ లో చేరి సికింద్రాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేసిన బండారు దత్తాత్రేయ తరుపున ప్రచారం చేశారు.1980లో బీజేపీ స్థాపించిన తరువాత పార్టీలో చేరిన మొదటి యువకుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉన్న వారిలో కిషన్ గారు ఒకరు.

1980లో తన సొంత జిల్లా రంగారెడ్డి జిల్లాకు బీజేపీ పార్టీ కన్వీనర్ గా ,1983లో బిజెవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, 1984లో ప్రధాన కార్యదర్శిగా, 1985 నుంచి 1992లో రాష్ట్ర అధ్యక్షుడిగా, 1992లో బిజెవైఎం జాతీయ కార్యదర్శిగా, 1992 చివరి నుంచి 1994 వరకు జాతీయ ఉపాధ్యక్షుడిగా, 1994లో ప్రధాన కార్యదర్శిగా 2001 వరకు, 2001లో బీజేపీ పార్టీ రాష్ట్ర కోశాధికారిగా 2002 వరకు , 2002లో జాతీయ బిజెవైఎం అధ్యక్షుడిగా, 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా, 2014 నుండి 2016 వరకు తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసారు.

2004లో హిమయత్ నగర్ నుంచి రాష్ట్ర శాసనసభకు మొదటిసారిగా ఎన్నికయ్యారు, 2009లో నియోజకవర్గ పూనర్విభిజన కారణంగా హిమయత్ నగర్ రద్దు చేసి అంబర్ పేట్ నియోజకవర్గం ఏర్పడింది ఆ స్థానం నుంచి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు, 2014 లో మూడోసారి అంబర్ పేట్ నుంచి మూడోసారి ఎన్నికయ్యారు, 2018లో ఓటమిని చవిచూసిన తర్వాత 2019లో జరిగిన లోక్ సభ కు జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి మొదటిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు, అలాగే కేంద్ర మంత్రివర్గంలో హోమ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రస్తుతం వరకు కొనసాగుతున్నారు.

ప్రేత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరు తెలంగాణ పేరుతో 2012లో మహబూబ్ నగర్ జిల్లా నుంచి తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా 25 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించారు. కిషన్ రెడ్డి గారు రాజకీయంగా ఎన్నో పదవులు నిర్వహించారు, మోర్చా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేషనల్ యూత్ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు, అలాగే 2003లో జరిగిన అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక యూత్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో విజయవంతంగా నిర్వహించారు, అప్పటి కార్యక్రమంలో 195 దేశాలకు చెందిన యువత పాల్గొన్నారు.

1994లో అమెరికాలో జరిగిన అమెరికా కౌన్సిల్ ఆఫ్ యంగ్ లీడర్లు స్టడీ ప్రోగ్రాంలో దేశం మొత్తం నుంచి ఎంపికైన యువ నేతల్లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తో పాటు ఎంపికయ్యారు, మోడీ గారితో ఆనాడు ఏర్పడిన అనుబంధం ఈరోజు వరకు అలాగే కొనసాగుతుంది. ఉగ్రవాదం అనే అంశం మీద పట్టున్న అతి కొద్ది మంది భారతీయ రాజకీయ నాయకుల్లో కిషన్ రెడ్డి గారు ఒకరు, వారికి హోమ్ శాఖ సహాయ మంత్రి పదవి రావడానికి ఇది ఒక కారణం.

నవీన్ పట్నాయక్

నవీన్ పట్నాయక్ (1946)

నవీన్ పట్నాయక్ గారి పూర్తి పేరు నవీన్ చంద్ర బీజయనంద్ పట్నాయక్. తండ్రి స్వాతంత్ర్య సమరయోధులు, ఒరిస్సా మహనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్, తల్లి భారతదేశంలో మొదటి వాణిజ్య మహిళా పైలట్, సామాజిక సేవకురాలు గ్యాన్ పట్నాయక్.

దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విద్య సంస్థల్లో విద్యను పూర్తి చేశారు. డూన్ స్కూల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు మరియు అనేక మంది ప్రస్తుత రాజకీయ నాయకులు ఆయనకు స్నేహితులు. పట్నాయక్ గారు మరియు వారి సోదరి గీతా మెహతా ఇంగ్లీష్ సాహిత్యరంగంలో మంచి రచయితలు. పట్నాయక్ గారు ప్రారంభ దశలో అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు.

1997లో వారి తండ్రి బిజూ పట్నాయక్ గారు అకాల మరణం కారణంగా ఒరిస్సాలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు వారి తండ్రి అనుచరులు ప్రోద్బలంతో రాజకీయ రంగ ప్రవేశానికి దారి తీసింది. 1997లో ఆస్కా లోక్ సభ స్థానం ఉపఎన్నికల్లో గెలవడంతో ప్రారంభమైంది ఆయన ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం, 1998, 1999లో మరో రెండు సార్లు విజయం సాధించి వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా 1998 నుంచి 2000 వరకు పనిచేసారు.

1997లో బిజూ జనతా దళ్ పార్టీని స్థాపించి 2000లో జరిగిన ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు, ఆ తరువాత వరుసగా నాలుగు సార్లు ఎన్నికల్లో విజయం సాధించి గత 21 సంవత్సరాలుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నారు. ఒక ముఖ్యమంత్రి మరియు రాజకీయ నాయకుడు తన సొంత భాషను మాట్లాడలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నవీన్ పట్నాయక్ గారే, ఇంగ్లీష్ లో తన ఒరియా ఉపన్యాసాలు రాసుకొని బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.

అవినీతికి ఆమడ దూరంలో ఉండే పట్నాయక్ గారు గత 20 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేశారు. దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఉన్న తన పరిధిని మాత్రం ఒరిస్సా రాష్ట్రానికే పరిమితం చేసుకున్న వ్యక్తి పట్నాయక్ గారు. పట్నాయక్ గారు మిత భాషి , తాను చేసే పనులను మాటల కన్నా చేతల్లో చేసి చూపించే కార్యశీలి. పట్నాయక్ గారు అజన్మ బ్రహ్మచారి , తాను రాజకీయల్లోకి తన తండ్రి తరువాత వచ్చిన పార్టీలో మాత్రం వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించలేదు. పట్నాయక్ గారి లాంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు.

మమతా బెనర్జీ

మమతా బెనర్జీ(1955)

మమతా బెనర్జీ గారు బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా లో జన్మించారు. 17 ఏళ్ళు వయస్సు లో తండ్రి అకాల మరణంతో కుటుంబ భాద్యతలు స్వీకరించారు. ఒకవైపు చదువుకుంటూనే కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారు. చరిత్రలో డిగ్రీ, ఇస్లాం లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి స్కూల్ టీచర్ గా పనిచేసారు. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూనే విద్యార్థి రాజకీయాల్లో రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

1976లో లోక్ నాయక్ జె.పిని కలకత్తా నగరంలో కి రాకుండా అడ్డుకున్న బృందానికి నాయకత్వం వహించారు. 1976 నుంచి 1984 వరకు బెంగాల్ మహిళా కాంగ్రెస్ లో ప్రధాన కార్యదర్శి, అధ్యక్షురాలిగా పనిచేసారు. 1984 లోక్ సభ ఎన్నికల్లో జాదవ్ పూర్ స్థానం నుంచి పోటీ చేసి దిగ్గజ కమ్యూనిస్టు నాయకులు సోమనాథ్ ఛటర్జీ గారి మీద విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. 1991,1996,1998,1999,2004,2009 లలో వరుసగా మొత్తం 8 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.

1991లో పి.వి.నరసింహ రావు ప్రభుత్వం లో యువజన క్రీడా శాఖ సహాయ మంత్రిగా1996 వరకు, 1999 నుంచి 2000 వరకు వాజపేయి ప్రభుత్వం లో రైల్వే శాఖ కేబినెట్ మంత్రిగా, 2004 లో వాజపేయి ప్రభుత్వంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా, 2009 నుంచి 2011 వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు.

1997లో కాంగ్రెస్ పార్టీతో విభేదాలు కారణంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన 14 సంవత్సరాలకు బెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. 2011లో 34 ఏళ్ళ కమ్యూనిస్టు ప్రభుత్వానికి చరమగీతం పాడిన వ్యక్తిగా దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.2011 నుంచి ప్రస్తుతం వరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నారు.

“మా , మాటి, మనుష్” ఉద్వేగానికి లోను చేసే నినాదాన్ని పలికిన మొదటి వ్యక్తి బెనర్జీ గారే. బెంగాలీ ప్రజలు ఆమెను “దీదీ(పెద్ద అక్క)” అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఆమె 44 ఏళ్ళు రాజకీయ ప్రస్థానంలో ఎక్కువగా పోరాటలు చేయడానికే సరిపోయింది. దేశంలో ఉన్న బలమైన మహిళా రాజకీయ నాయకురాళ్ల లలో మమతా బెనర్జీ గారు ముందుంటారు.

అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ(1952–2019)

అరుణ్ జైట్లీ ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రముఖ న్యాయవాది. జైట్లీ డిసెంబర్ 28, 1952లో ఢిల్లీలో ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది మహరాజ్ కిషన్ జైట్లీ, రత్న ప్రభ దంపతులకు జన్మించారు. జైట్లీ విద్యాభ్యాసం మొత్తం ఢిల్లీలో ఉన్న ప్రముఖ విద్య సంస్థల్లో పూర్తి చేశారు, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ విద్యను పూర్తి చేసి అనంతరం లాయర్ గా పని చేసి అతితక్కువ కాలంలోనే అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా కూడా పనిచేసి అనంతర కాలంలో సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో పేరు నమోదు చేసుకుని 2014 వరకు పలువురు ప్రముఖులు తరుపున వాదించారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో ఎబివిపి తరుపున విద్యార్థులు పరిషత్ కు నాయకుడిగా ఎన్నికయ్యి ఆరోజుల్లో సంచలనం సృష్టించారు, ఎందుకంటే అప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘం ఎస్.వైఫ్.ఐ ఆధీనంలో ఉన్న విద్యార్థుల పరిషత్ ఎబివిపి కైవసం చేసుకుంది.1990లలో బీజేపీ పార్టీలో చేరిన నాయకుల్లో జైట్లీ అందరికంటే చిన్న వయస్కులు, 2000లో బీజేపీ పార్టీ తరుపున రాజ్య సభకు ఎన్నికయ్యి వాజపేయి గారి మంత్రివర్గంలో సమాచార మరియు ప్రసారాల శాఖ మంత్రిగా, న్యాయ శాఖ మంత్రిగా, అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. 2006లో రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యి 2009లో రాజ్యసభ ప్రతిపక్ష నేతగా 2014 వరకు ఎన్నికయ్యారు.2014లో నరేంద్రమోడీ మంత్రివర్గంలో రక్షణ, ఆర్థిక శాఖల మంత్రిగా 2019 వరకు పనిచేసారు.ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజకీయాల్లో ఎదుగుతున్న సమయంలో ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా, వ్యక్తిగతంగా మరియు పార్టీలో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి, అలాగే గోద్రా అల్లర్ల కారణంగా మోడీ మీద పార్టీలో వ్యక్తమైన వ్యతిరేకతను తొలగిచేందుకు కృషి చేసారు . 2002లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్రమోడీ తరుపున ఎన్నికల్లో ప్రచారం చేసారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపికపై ముందుగా మీడియాలో చర్చలకు తెరతీశారు.

దేశ రాజకీయాల్లో జైట్లీ పాత్ర ప్రత్యేకమైన పాత్ర పోషించారు, పార్టీలో ఉన్న లోక్ సభ, రాజ్యసభ సభ్యుల ఎంపిక వివరాలు ఎప్పటికప్పుడు గోప్యంగా ఉంచడానికి కృషి చేయడమే కాకుండా ముఖ్యంగా 2004 నుంచి 2014 వరకు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు, 2006లో దక్షిణ భారత దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడంలో ముఖ్య పాత్ర పోషించారు. దేశంలో ఆర్థిక మరియు న్యాయ శాఖల మీద సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తుల్లో ఒకరు.

వసుంధర రాజే సింధియా

వసుంధర రాజే సింధియా(1953)

వసుంధర రాజే సింధియా ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియార్ సంస్థాన చివరి పాలకుడు , మహారాజ జీవాజి రావు సింధియా, రాజమాత విజయరాజే దంపతులకు జన్మించారు. దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విద్య సంస్థల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి , రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద సంస్థానాల్లో ఒకటైన ధోల్పూర్ రాజకుటుంబానికి కోడలు అయ్యారు.

1984లో బీజేపీ పార్టీలో చేరి పార్టీలో అనేక కీలకమైన పదవులు అధిరోహించారు ప్రస్తుతం బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 1985 నుంచి ప్రస్తుతం వరకు 5 సార్లు రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీకి, 1989 నుంచి 2003 వరకు 5 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 1998 నుంచి 2003 వరకు విదేశాంగ సహాయ మంత్రిగా, కుటీర పరిశ్రమలు, ప్రజా వ్యవహారాలు మరియు పరిపాలన వ్యవస్థ, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్న శాఖలకు పర్యవేక్షణ మంత్రిగా స్వాతంత్ర మరియు కేబినెట్ మంత్రిగా పనిచేశారు.

2003 నుంచి 2007 వరకు మొదటి సారి, 2013 నుంచి 2018 వరకు రెండో సారి రాజస్థాన్ ముఖ్యమంత్రి గా, 2007 నుంచి 2013,2018 నుంచి ప్రస్తుతం వరకు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి గా రాజే అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టి అందరిచేత ప్రశంసలు అందుకున్నారు.

సింధియా కుటుంబం తొలి నుంచి దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించిన కుటుంబం, విజయరాజే సింధియా గారు, ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికయ్యారు, బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు, సోదరుడు మాధవ రావు మాజీ కేంద్ర మంత్రి , సోదరి యశోధర రాజే మాజీ ఎంపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ముఖ్య నాయకురాలు, మేనల్లుడు జ్యోతిరాదిత్య సింధియా మాజీ కేంద్ర మంత్రి , ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ, కుమారుడు యువరాజు రాణా దుష్యంత్ సింగ్ 2004 నుంచి ప్రస్తుతం వరకు వరుసగా 4 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.

రాజకీయాల్లో మిగిలిన రాజకీయ నాయకులతో పోలిస్తే వసుంధర రాజే శైలి చాలా భిన్నంగా ఉంటుంది, ప్రస్తుత రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ ఆమెకు మంచి స్నేహితుడు , శ్రేయోభిలాషి అవడం కోసమెరుపు.

రామ్ మాధవ్

రామ్ మాధవ్(1964)

 • రామ్ మాధవ్ గారు ఆగస్టు 22,1964లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం లో సూర్యనారాయణ , జానకీ దేవి దంపతులకు జన్మించారు.
 • అమలాపురం పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా చేసారు, మైసూర్ దూర విశ్వవిద్యాలయం ద్వారా రాజనీతి శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు.
 • చిన్నతనంలోనే ఆర్ ఎస్ ఎస్ లో చేరి సంస్థ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1981 నుండి పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించారు.
 • ఆర్ ఎస్ ఎస్ లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువకులు అధిక సంఖ్యలో చేరడంలో కీలకంగా వ్యవహరించారు.
 • ఆర్ ఎస్ ఎస్ లో వివిధ స్థాయిల్లో పనిచేసిన మాధవ్ గారు పాత్రికేయులు కూడా, జాగృతి అనే వార పత్రిక సంపాదకులు కూడా పనిచేసారు, అలాగే ఆర్ ఎస్ ఎస్ కు చెందిన వివిధ పత్రికల్లో కూడా పనిచేసారు.
 • ఆర్ ఎస్ ఎస్ కార్యవర్గ సభ్యుడిగా దేశం మొత్తం పర్యటించారు. అలాగే ఆర్ ఎస్ ఎస్ మేధావులు వర్గంలో ముఖ్యులు.2003 నుంచి 2014 వరకు ఆర్ ఎస్ ఎస్ అధికార ప్రతినిధి గా పనిచేసారు.
 • 2014 ఎన్నికల్లో లో ఆర్ ఎస్ ఎస్ ను బీజేపీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో పార్టీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించారు.
 • 2014లో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా 2020 వరకు పనిచేసారు.
 • ఈశాన్య, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేశారు.
 • విదేశాంగ విధానం మీద అత్యంత స్పష్టమైన అవగాహన కలిగిన భారత రాజకీయ నాయకుల్లో ముఖ్యులు.
 • ఇండియా ఫౌండేషన్ అనే మేధావుల చర్చ వేదికను స్థాపించి దేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చలకు అనేక మంది మేధావులను ఆహ్వానించారు.

పత్రిక రంగంలో 20 సంవత్సరాల పైగా పని చేసిన అనుభవంతో పాటు దేశంలో ప్రముఖమైన వివిధ పత్రిక సంపాదకులతో బలమైన పరిచయాలు కలిగి ఉన్న వ్యక్తి ఒక్క రామ్ మాధవ్ గారే.

ముప్పవరపు వెంకయ్యనాయుడు

యం.వెంకయ్య నాయుడు (1949)

వెంకయ్య నాయుడు గారు నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, చవటపాలెం గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తండ్రి దేశటానకు వెళ్లడంతో అమ్మమ్మ, తాతయ్య సంరక్షణ లో పెరిగారు. నెల్లూరు లో ఉన్న ప్రముఖ వి.ఆర్.కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు.

ఆర్.ఎస్.ఎస్ నెల్లూరు జిల్లా ఇంఛార్జిగా ఉన్న సోమేపల్లి సోమయ్య, ముఖ్య శిక్షక్ గా ఉన్న భోగాది దుర్గాప్రసాద్ గార్ల ప్రోత్సాహంతో ఆర్.ఎస్.ఎస్ లో చేరి, అనంతరం ఆర్.ఎస్.ఎస్ అనుబంధ విద్యార్థుల సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ లో ప్రవేశించి అనతి కాలంలోనే నెల్లూరు పట్టణ ఎబివిపి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ఎబివిపి తరుపున విద్యార్థుల సంఘం అధ్యక్షుడు గా ఎన్నికయ్యారు.

విద్యార్థులు నాయకుడిగా ఉన్న సమయంలో జై ఆంధ్ర ఉద్యమం జరగడం, ఆ ఉద్యమనికి మద్దతు గా విశాఖపట్నం జిల్లాలో ఆనాటి ప్రముఖ నాయకులు తెన్నేటి విశ్వనాథం వంటి ప్రముఖ నాయకులతో పాటుగా పాల్గొన్నారు. ఉద్యమం లో అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడు వంటి ఎందరో యువకులు స్వచ్చందంగా పాల్గొన్నారు, అనంతరం ఆ ఉద్యమం లో పాల్గొన్న విద్యార్థులు కొంతమంది రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు.

1977లో జనతాపార్టీ అభ్యర్థిగా ఒంగోలు పార్లిమెంట్ నుంచి పోటి చేసి ఓటమి చవిచూసిన, 1978,1983లలో జనతాపార్టీ , బీజేపీ పార్టీ ల నుంచి ఉదయగిరి నుంచి ఎన్నికయ్యారు, 1984లో ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు. 1985లో బీజేపీ అభ్యర్థిగా ఆత్మకూరు అసెంబ్లీ నుంచి, 1989లో బాపట్ల లోక్ సభ నుంచి, 1996లో హైదరాబాద్ లోక్ సభ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు, అలా మూడు సార్లు లోక్ సభకు పోటీ చేసి ఓటమి చెందడంతో లోక్ సభ్యుడిగా పార్లిమెంట్ కు ఎన్నికవ్వాలన్న ఆయన కోరిక కలగానే మిగిలింది. 1998 నుంచి 2016వరకు కర్ణాటక రాష్ట్రం నుంచి మూడు సార్లు రాజ్యసభకు, 2016లో నాలుగో సారి రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్య సభకు ఎన్నికయ్యారు.

2000నుంచి 2002 వరకు వాజపేయి మంత్రి వర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గా పనిచేసారు,2014 నుంచి2017 వరకు నరేంద్రమోడీ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఇలా రెండు పరస్పర సారూప్యత గల మంత్రి పదవులు చేపట్టిన ఏకైక భారతీయ రాజకీయ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు.

2017 నుంచి ప్రస్తుతం వరకు దేశ ఉపాధ్యక్షుడిగా, రాజ్యసభ అధ్యక్షుడిగా సభను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సేవ వంటి అంశాలపై ఎక్కువ మక్కువ చూపుతారు. తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయలు అన్న వల్లమాలిన అభిమానం కనబరుస్తూ ఉంటారు, అందుకనే ప్రతి యేటా సంక్రాంతి పండుగ సందర్భంగా ఢిల్లీలో ఉన్న నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి.

వెంకయ్య నాయుడు గారు రాజకీయాల్లో ఎంత ఎదిగిన ఒదిగి ఉండే వ్యక్తి, రాజకీయాల్లో తన ఉన్నతికి కారణమైన గురువులను, ప్రతి వ్యక్తిని గురించి ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో నీతి నిజాయితీ లకు మారుపేరు గా నిలిచారు. వెంకయ్యనాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి, ఆదర్శ నాయకులు మన తెలుగు నెలకు చెందిన వారు కావడం రెండు తెలుగు రాష్ట్రాలలో మన తెలుగు ప్రజలందరికీ గర్వ కారణం.

యోగి అదిత్యనాథ్

యోగి అదిత్యనాథ్(1972)

యోగి అదిత్యనాథ్ అసలు పేరు అజయ్ మోహన్ సింగ్ బిస్త్. ఉమ్మడి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం(ప్రస్తుతం ఉత్తరాఖండ్) లోని పౌరి గర్వాల్ జిల్లా పంచుర్ గ్రామంలో జన్మించారు. గర్వాల్ విశ్వవిద్యాలయం నుంచి బియస్సీ గణితంలో పూర్తి చేసి పోస్టుగ్రాడ్యుయేషన్ లో చేరి మధ్యలో నే ఆపేశారు.

1990లో రామాజన్మభూమి ఉద్యమం లో పాల్గొన్నారు, ఉద్యమ నిర్వహించిన గోరఖ్ పూర్ ఆలయ పీఠాధిపతి మహంత్ అవైద్యనాథ్ గారి పరిచయం అయినను సాధువు గా మారడానికి ఉపకరించింది, 1993లో అవైద్యనాథ్ గారి పర్యవేక్షణలో సన్యాసం స్వీకరించి “యోగి అదిత్యనాథ్” గా పేరుతో గోరఖ్ పూర్ మఠంలో చేరారు ,2014లో తన గురువు నుంచి మఠం మరియు గోరక్ పూర్ ఆలయ పీఠాధిపతి గా పూర్తి స్థాయిలో నియమితులయ్యారు.

1998,1999,2004,2009,2014లలో గోరఖ్ పూర్ నుంచి వరుసగా ఐదు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. మొదటి సారి లోక్ సభకు ఎన్నికైన సమయంలో ఆయన వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే.

2017లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో, ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా ముఖ్యమంత్రి భాద్యతలు స్వీకరించమని కోరారు, ఆ విధంగా భాద్యతలు స్వీకరించి ప్రస్తుతం వరకు కొనసాగుతున్నారు.ముఖ్యమంత్రి గా ఎన్నికైన తరువాత 36 శాఖల భాద్యతలు మూడు నెలలు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి గా రాష్ట్ర పరిపాలన లో ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత సాధించిన వ్యక్తి యోగి గారు.

రాజకీయాల్లోకి రాకముందు గోరఖ్ పూర్ పట్టణంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకున్నారు, “హిందూ యువవహిని” అనే సంస్థను ఏర్పాటు చేసి పూర్వాంచల్ ప్రాంతంలో హిందువుల మీద జరుగుతున్న దాడులను ఎదురించి వారికి అండగా నిలిచారు. పూర్వాంచల్ ప్రాంత ప్రజానీకానికి ఆయన నడిచే ప్రత్యేక్ష దైవం ఆయన మాట వేదవాక్కు.ఆ ప్రాంతంలో మఠం తరుపున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అలాగే చేపడుతున్నారు.

బాల్ థాకరే

బాల్ థాకరే(1926–2012)

బాల్ థాకరే గారి పూర్తి పేరు బాలసాహెబ్ కేశవ్ థాకరే.

థాకరే తండ్రి గారు కేశవ్ సీతారాం థాకరే గారు మరాఠీ భాషలో ప్రముఖ రచయిత, పాత్రికేయులు, సంఘ సేవకుడు మరియు సంయుక్త మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేసిన ఉద్యమం చేసిన నాయకుల్లో ముఖ్యులు. థాకరే గారు ప్రారంభ దశలో ఒక ప్రముఖ పత్రికలో కార్టూనిస్ట్ గా 1960 వరకు పనిచేశారు.1960లో సోదరుడుతో కలిసి “మార్మిక్” అనే తొలుత కార్టూన్ పత్రికగా మొదలై అనంతరం సామాజిక స్పృహ కలిగిన అంశాలపై వ్యాసాలు రావడం ప్రారంభమై మంచి ఆదరణ లభించింది.

1966లో మరాఠీ ప్రజల కోసం మరాఠాల అభిమాన చక్రవర్తి శివాజీ మహరాజ్ పేరు మీద బొంబాయి కేంద్రంగా “శివ సేన” అనే సామాజిక సంస్థ ను ఏర్పాటు చేశారు. బొంబాయి నగరం లో మరాఠీ బాష పరిరక్షణ కోసం ఉద్యమం చేపట్టి విజయం సాధించారు. “భూమి పుత్రుల సిద్ధాంతం” పేరుతో బొంబాయి నగరం లో ఇతర రాష్ట్రాల ప్రజలకు విద్య, ఉపాధి అవకాశాలు దక్కకుండా కేవలం మహారాష్ట్ర వాసులకే ప్రథమం అని ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.

అప్పటి వరకు ఉద్యమ వేదికగా ఉన్న శివ సేన ను పార్టీగా ఏర్పాటు చేశారు. అనంతరం మహారాష్ట్ర మొత్తం విస్తరించారు. 1971లో జరిగిన బొంబాయి నగర మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో శివ సేన గెలవడం, మేయర్ పీఠం సొంతం చేసుకుంది, అప్పట్నుంచి ఇప్పటి వరకు నగరంలో సేన పార్టీకి ఎదురులేకుండా ఆధిపత్యం చెలాయించగలిగింది. సేన పార్టీ క్రమంగా హిందూ ధర్మం కోసం పనిచేసే పార్టీ గా మారడంతో పార్టీకి దేశవ్యాప్తంగా హిందూ మతం నుండి విశేషంగా ఆదరణ లభించింది, ముఖ్యంగా హిందూ మతం మైనార్టీ ఉన్న ప్రాంతాల్లో. 1993లో బాబ్రీ మసీదు కూల్చివేత ప్రక్రియలో శివ సైనికులు పాల్గొన్నారు, అంతే కాకుండా హిందూ ప్రజల కోసం అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆయనకు దేశవ్యాప్తంగా ప్రజల్లో మంచి ప్రాధాన్యత లభించింది ముఖ్యంగా హిందూ సమాజ పరిరక్షణకు కృషి చేస్తున్న నాయకుడిగా “హిందూ హృదయ సామ్రాట్” గా బిరుదును పొందారు, చివరి వరకు అలాగే ఉన్నారు.

1995లో బీజేపీ తో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యమంత్రి పదవి వరించిన తిరస్కరించారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం తన అదుపులో ఉంచుకుని “బొంబాయి” పేరును ” ముంబై” గా మార్చారు.

ఆయన కుమారుడు ఉద్ధవ్ థాకరే ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మనవుడు ఆదిత్య థాకరే ప్రస్తుతం మంత్రి.

పదవులతో సంబంధం లేకుండా దేశ రాజకీయల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మాత్రమే కాకుండా హిందూ ప్రజానీకానికి పెన్నిధి బాలసాహెబ్ థాకరే గారు.

జై ప్రకాష్ నారాయణ

జై ప్రకాష్ గారు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు, వీరి తండ్రి గారు రైల్వే లో పనిచేసేవారు. గుంటూరు మెడికల్ కళాశాలలో మెడిసిన్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. చిన్నతనం నుంచే సామాజిక స్పృహ ఎక్కువ, 1975లో విధించిన ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి గుంటూరు నగరంలో పోరాటం చేశారు.

1980 సివిల్స్ అల్ ఇండియాలో 4 వ ర్యాంకు సాధించి ఐ. ఏ.యస్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంపికయ్యారు. వివిధ జిల్లాల్లో కలెక్టర్ గా పనిచేసి జిల్లా అభివృద్ధి మరియు పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. రాష్ట్రంలో సహకార , ఇరిగేషన్ రంగాలు మెరుగైన ఫలితాలు సాధించడంలో వీరి పాత్ర కీలకం. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు పిలిచి మరీ తన కార్యదర్శిగా నియమించుకున్నారు , తరువాత మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణ కాంత్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేస్తున్న సమయంలో కూడా వారికి కార్యదర్శిగా పనిచేసారు.

1996లో తన పదవికి రాజీనామా చేసి సామాజిక కార్యకర్తగా మారారు. ప్రజలకు సుపరిపాలన అందించడానికి , ఓటింగ్ మీద అవగాహన, అవినీతి రహిత సమాజం వంటి పలు అంశాలపై లోక్ సత్తా ఉద్యమం చేపట్టారు, తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమై దేశవ్యాప్తంగా విజయవంతంగా విస్తరించింది. యువత లో రాజకీయ స్పృహ కలిగించడమే లక్ష్యంగా ఏన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీలో విజయవంతంగా నిర్వహించబడుతున్న “యూత్ పార్లిమెంట్ ” ప్రోగ్రాం రూపకల్పన చేసింది ఆయనే.

2006లో లోక్ సత్తా ఉద్యమన్ని రాజకీయ పార్టీగా నిర్మించాలనే తలంపుతో “లోక్ సత్తా ” పార్టీని స్థాపించారు. 2008లో జరిగిన 4 అసెంబ్లీ ఉపఎన్నికల్లో పార్టీ మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసి 2 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో జె.పి గారు కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. జె.పి గారు ఎన్నికల్లో సంస్కరణలు అమలు చేయాలని కోరుతూ అనేక సార్లు ఎన్నికల కమిషన్, ప్రధాన మంత్రి, రాష్ట్రపతికి ఎన్నో సార్లు లేఖలు రాశారు.

2010లో “సురాజ్యం” పేరుతో స్థానిక సంస్థల్లో సుపరిపాలన లక్ష్యంతో ఉద్యమం విజయవంతంగా చేపట్టారు. “ప్రజాస్వామ్య పీఠం”(foundation for democratic reforms) పేరుతో ఒక మేధో మదన సంస్థను స్థాపించి రాజకీయ, పరిపాలన వ్యవస్థ వంటి పలు అంశాలపై చర్చలు నిర్వహిస్తూనే ఆ కార్యక్రమాల్లో యువతను భాగస్వామ్యం చేశారు. రాజకీయాల్లో లేదా పరిపాలన వ్యవస్థ లోకి వెళ్లాలనుకునే వారికి(యువత) ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నషిప్ లు నిర్వహిస్తుంది.

మౌలిక వసతులు నుంచి పారిశుద్ధ్యం వరకు అనేక అంశాలపై సున్నితంగా చర్చించగలరు. జె.పి గారు సామాజిక సేవలో చేస్తున్న కృషికి గాను ప్రముఖ సామాజిక సంస్థలు ఆయన అనేక పురస్కారాలుతో సత్కరించారు. జె.పి గారు లాంటి గొప్ప వ్యక్తి మన తెలుగు వారు కావడం మన తెలుగు ప్రజలకు గర్వకారణం.

కమలా హారిస్: అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలు

Celebrating the ascendency of Kamala Harris to the Vice Presidency - TheLeaflet

అమెరికాలోని నల్లజాతి రాజకీయ నేతల్లో కమలా ప్రముఖురాలు. అయితే, ఆమెకు భారత్ మూలాలు కూడా ఉన్నాయి. వాటి పట్ల కూడా ఆమె గర్వం వ్యక్తం చేస్తుంటారు. కమలా తల్లి తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి జమైకాలో పుట్టారు.

కమల ఆత్మకథ ‘ద ట్రూత్స్ వి హోల్డ్’ పుస్తకం 2018లో విడుదలైంది.

‘నా పేరును కమలా అని పిలవాలి. పంక్చుయేషన్ కోసం ఉపయోగించే కామా ( , ) పలికినట్లు పలకాలి’’ అని అందులో కమలా రాశారు.

‘‘కమల అంటే తామర లేదా కమలం అని అర్థం. భారత సంస్కృతిలో దానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పైకి ఆ పూవు కొలనులో తేలియాడుతున్నట్లే కనిపిస్తుంది. కానీ, దాని వేళ్లు కొలను అడుగున బలంగా పాతుకుపోయి ఉంటాయి’’ అంటూ అమెరికన్లకు తన పేరు గురించి ఆ పుస్తకంలో వివరించారామె.

కమలా తండ్రి డోనల్డ్ హారిస్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్. తల్లి శ్యామల గోపాలన్ క్యాన్సర్ పరిశోధకురాలు, పౌర హక్కుల కార్యకర్త.

కమలాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే, ఆమె తల్లిదండ్రులు విడిపోయారు.

కమలా, మాయాలను వారి తల్లి ఒంటరిగానే పెంచారు.

ఆ ముగ్గురినీ కలిపి… వారికి తెలిసినవాళ్లు ‘శ్యామల అండ్ ద గర్ల్స్’ అని పిలిచేవాళ్లు.

కమలా, మాయాలకు వారి తల్లి… వారి నేపథ్యాన్ని ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండేవారు.

‘‘ఇద్దరు నల్ల జాతి అమ్మాయిలను పెంచుతున్నానని మా అమ్మ బాగా అర్థం చేసుకున్నారు. మాయాను, నన్ను తన కొత్త దేశం నల్ల జాతి అమ్మాయిలుగానే గుర్తిస్తుందని ఆమెకు తెలుసు. అందుకే, మాలో ఆత్మవిశ్వాసాన్ని ఆమె నూరిపోశారు’’ అని కమలా తన ఆత్మకథలో రాశారు.

‘‘కమలా హారిస్ భారత సంస్కృతిని ఆకళింపు చేసుకుంటూ పెరిగారు. కానీ, ఇప్పుడు ఓ ఆఫ్రికన్ అమెరికన్‌గా ఆమె గర్వంగా జీవిస్తున్నారు’’ అని గత ఏడాది వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం రాసింది.

2015లో సెనేట్‌కు కమలా పోటీ చేసినప్పుడు… ఆమెను ‘భారతీయ క్యాన్సర్ పరిశోధకురాలు, జమైకన్ ప్రొఫెసర్‌ల కూతురు’గా ఎకనామిస్ట్ మ్యాగజైన్ వర్ణించింది. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ పదవి చేపట్టిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ అమెరికన్, తొలి ఏసియన్ అమెరికన్ కమలా హారిస్.

అయితే, కమలా గురించి బాగా తెలిసినవాళ్లు… ఆమె రెండు వర్గాలకూ దగ్గరగా ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

కమలా ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం కూడా ప్రయత్నించారు. ఆ సమయంలో భారత సంతతి కమెడియన్ మిండీ కలింగ్‌తో కలిసి ఓ కుకింగ్ వీడియోలో ఆమె కనిపించారు. భారతీయ వంటకాన్ని వండుతూ, తమ దక్షిణ భారత నేపథ్యం గురించి ఇందులో వీళ్లిద్దరూ ముచ్చటించారు.

కమలా హారిస్ 2014లో డగ్లస్ ఎమ్హోఫ్‌ అనే న్యాయవాదిని పెళ్లాడారు. డగ్లస్ యూదుడు.

కమలా హ్యారిస్‌ను ఎక్కువగా నల్లజాతి అమెరికన్ రాజకీయ నేతగానే అక్కడివారు చూస్తుంటారు. జాతి విద్వేషానికి వ్యతిరేకంగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం జోరందుకున్న నేపథ్యంలో ఈ గుర్తింపుకు ప్రాధాన్యత కూడా పెరిగింది.

మరోవైపు భారతీయ అమెరికన్లు కూడా కమలాను తమలో ఒకరిగా చూసుకుంటున్నారు. ఆమె అభ్యర్థిత్వంతో అమెరికాలో ఉంటున్న భారతీయ, దక్షిణాసియా వర్గాలకు మరింత గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నారు.

కమలాపై ఆమె తల్లి శ్యామల గోపాలన్ ప్రభావం చాలా ఎక్కువ. చాలా సార్లు ఆమె ఈ విషయం గురించి మాట్లాడారు. తన తల్లిని కమలా స్ఫూర్తిగా భావిస్తారు.

శ్యామలకు నలుగురు తోబుట్టువులు. దిల్లీ యూనివర్సిటీలో ఆమె చదువుకున్నారు. 19 ఏళ్ల వయసులోనే బెర్క్లీ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకుని, చదువు కోసం1958లో అమెరికాలో అడుగుపెట్టారు.

న్యూట్రిషన్, ఎండాక్రినాలజీలో డాక్టరేట్ చేసేందుకు వెళ్లిన శ్యామల… క్యాన్సర్ పరిశోధకురాలిగా మారారు.

కమలా తల్లి తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి జమైకాలో పుట్టారు

జో బైడెన్

(పై చిత్రం గూగుల్ సౌజన్యం)

2020 నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు, అధిక మొత్తంలో ఎలక్టొరల్ కాలేజ్ సీట్లు సంపాదించిన జో బైడెన్ (Joe Biden) అమెరికా సంయుక్త రాష్ట్రాలకి 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన పదవీకాలం 2021 జనవరి 20న మొదలై నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది.

జో బైడెన్ పూర్తి పేరు జోసఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ (Joseph Robinette Biden, Jr). ఈయన 1942 నవంబర్ 20 తేదీ పెన్సిల్వేనియా రాష్ట్రంలో జన్మించాడు. తండ్రి పేరు జోసఫ్ బైడెన్ సీనియర్ (Joseph Biden, Sr), తల్లి పేరు కేథరిన్ యూజీనియా ఫినెగాన్ (Catherine Eugenia Finnegan). తండ్రి పాత కార్ల సేల్స్‌మన్‌గా పనిచేసేవాడు. తల్లి గృహిణి. వీళ్లది మధ్యతరగతి ఐరిష్ కేతలిక్ కుటుంబం.

చిన్నతనంలో జో బైడెన్ నత్తితో ఇబ్బంది పడేవాడు. ఆ కారణంతో బడిలో సహవిద్యార్ధుల హేళనకి గురయ్యేవాడు. దాన్ని అధిగమించటానికి గంటలతరబడి అద్దం ముందు నిలబడి, పొడుగాటి ఆంగ్ల పద్యాలు, పాఠాలు కంఠస్తం చేసి వల్లెవేస్తూ … కాలక్రమంలో ఆ సమస్యని అధిగమించటమే కాకుండా మంచి వక్తగా రూపొందాడు. (నత్తివల్ల వచ్చిన ఆ తడబాటు ఇప్పటికీ అప్పుడప్పుడూ బో బైడెన్ ఉపన్యాసాల్లో తొంగిచూస్తుంది).

అమెరికాలో ఓ మధ్యతరగతి విద్యార్ధి చదువుకోవటం అంత తేలిక కాదు. మంచి పాఠశాలల్లో ప్రవేశం సాధించాలంటే అవసరమయ్యే రుసుం కోసం చిన్నతనంలోనే జో బైడెన్ ఖాళీ సమయాల్లో కిటికీలు శుభ్రం చేయటం, తోట పనులు చేయటం వంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు. అలా ప్రసిద్ధ ఆర్క్‌మియర్ అకాడమీలో (Archmere Academy) ప్రవేశం సాధించిన జో బైడెన్, 1961లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. ఆ తర్వాత న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా సాధన ఆరంభించాడు. ఈ క్రమంలో, న్యాయకళాశాలలో తన సహాధ్యాయిగా పరిచయమైన నైలియా హంటర్ (Neilia Hunter) ప్రేమలో పడి, 1966లో ఆమెని వివాహం చేసుకున్నాడు.

న్యాయవాద జీవితంలో ఉండగా జో బైడెన్ దృష్టి రాజకీయాల మీదకి మళ్లింది. 1970 ప్రాంతంలో డెమొక్రాటిక్ పార్టీలో సభ్యుడిగా నమోదు చేసుకుని, ఆ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనటం ప్రారంభించాడు. 1972లో డెమొక్రాటిక్ పార్టీ తరపుని అమెరికా అత్యున్నత విధాన సభ ‘సెనెట్’కి పోటీ చేసి అనూహ్య విజయం సాధించి, 29 ఏళ్ల వయసులో ఆ సభకి ఎన్నికైన పిన్నవయస్కుల్లో ఒకడిగా చరిత్రకెక్కాడు.

తొలిసారి సెనెటర్‌గా ప్రమాణస్వీకారం చేసేలోగానే జో బైడెన్ జీవితంలో ఓ మహావిషాదం చోటుచేసుకుంది. 1972 డిసెంబర్‌లో ఆయన భార్య, కుమార్తె ఓ రహదారి ప్రమాదంలో మరణించారు. పసితనంలోనే ఉన్న ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనతో కుంగిపోయిన జో బైడెన్ ఆత్మహత్యాలోచన చేసినట్లు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

మిగిలిన ఇద్దరు కుమారుల ఆలనాపాలనా చూసుకోవటం కోసం ఆయన సొంతవూరిలోనే నివాసం ఉంటూ, సెనెటర్ హోదాలో ఉన్నప్పటికీ ఓ సాధారణ ఉద్యోగిలా నిత్యం రైల్లో ప్రయాణించి రాజధాని వాషింగ్టన్ డి.సి. కి వెళ్లివచ్చేవాడు. ఆయన సెనెటర్‌గా ఉన్న ముప్పై ఆరేళ్ల పాటూ ఇదే అలవాటు కొనసాగింది. (ఈ విషయంలో మన భారతీయ పార్లమెంట్ మెంబర్లని ఓ సారి పోల్చి చూడండి).

సెనెటర్‌గా వరుసగా ఆరుసార్లు విజయం సాధించిన బైడెన్, ముప్పై ఆరేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో చట్టాల రూపకల్పనలో పాలుపంచుకోవటమే కాకుండా, అమెరికన్ విదేశాంగ విధానంపై తనదైన ముద్ర వేశాడు. సెనెటర్‌గా ఉంటూనే 1987లో డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీచేయటానికి విఫల యత్నం చేశాడు. ఆ తర్వాత 20 ఏళ్లకి, 2007లో మరో మారు అధ్యక్ష పదవికి పార్టీ అభ్యర్ధి స్థానం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే, ఈ సారి పార్టీ అభ్యర్ధిగా రంగంలో ఉన్న బరాక్ ఒబామా విజ్ఞప్తిని మన్నించి, ఒబామాకి తోడుగా ఉపాధ్యక్ష అభ్యర్ధిగా రంగంలోకి దిగాడు.

ఈ జంట 2008 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించింది. ఆ తర్వాత 2012 నవంబర్లో మరోమారు విజయం సాధించింది. అలా ఒబామా-బైడెన్ ఎనిమిదేళ్ల పాటు అమెరికా అధ్యక్ష-ఉపాధ్యక్ష పదవుల్లో కొనసాగి, తీవ్ర ఆర్ధిక మాంద్యంతో కునారిల్లుతూ తమ చేతికొచ్చిన దేశాన్ని తిరిగి గాడిన పెట్టినవారిగా చరిత్రలో మిగిలిపోయారు. రాజకీయాల్లో యువకుడైన ఒబామాకి, తలపండిన జో బైడెన్ జత కలవటం వల్ల; ఉదారవాద ఒబామా విధానాలని, మధ్యేవాద బైడెన్ విధానాలు సమతూకంలో ఉంచేవి. సౌమ్యుడిగా పేరొందిన జో బైడెన్ ఇటు సొంత డెమొక్రటిక్ పార్టీనే కాక అటు ప్రత్యర్ధి రిపబ్లికన్ పార్టీ నాయకులని కూడా కలుపుకుపోతూ కార్యాలు చక్కబెట్టటంలో దిట్ట అని పేరొందాడు. ఒబామా ఓ సందర్భంలో జో బైడెన్‌ని, ‘అమెరికా చరిత్రలో అందరికంటే గొప్ప ఉపాధ్యక్షుడు’ అని ప్రశంసించటం జరిగింది.

ఉపాధ్యక్షుడిగా తన ఎనిమిదేళ్ల హయాం ముగింపుకొస్తున్న దశలో జో బైడెన్ వ్యక్తిగత జీవితంలో మరో విషాదం సంభవించింది. 2015లో, బైడెన్ పెద్ద కుమారుడు బ్యూ బైడెన్ (Beau Biden) కాన్సర్‌తో పోరాడుతూ 46 ఏళ్ల వయసులో మరణించాడు. (ఈ సమయంలో కుమారుడి ఆసుపత్రి ఖర్చులకి, అతని కుటుంబాన్ని ఆదుకోవటానికి అవసరమైన నిధుల కోసం ఉపాధ్యక్షుడు జో బైడెన్ తన సొంత ఇంటిని అమ్మకానికి పెట్టబోగా, అధ్యక్షుడు ఒబామా వారించి అవసరమైన మొత్తం తాను సర్దుబాటు చేస్తానని చెప్పాడట)

మొదటి భార్య మరణించిన ఐదేళ్ల తర్వాత, 1977లో జో బైడెన్ జిల్ ట్రేసీ జాకబ్స్ (Jill Tracy Jacobs) అనే ఉపాధ్యాయురాలిని వివాహం చేసుకున్నాడు. వీరిరువురికీ ఆష్లీ బైడెన్ (Ashley Biden) అనే కుమార్తె. జో బైడెన్ తొలి కళత్రం ద్వారా కలిగిన ఇరువురు కుమారుల్ని కూడా ఈమె సొంత తల్లిలా సాకిందని అంటారు. జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎనిమిదేళ్ల పాటూ, సెకండ్ లేడీ హోదాలో ఉంటూ కూడా ఈమె తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించింది. ఆ హోదాలో ఉద్యోగం చేసిన తొలి ‘ద్వితీయ మహిళ’గా జిల్ బైడెన్ చరిత్రకెక్కింది.

ఉపాధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన నాలుగేళ్ల తర్వాత, అధ్యక్ష స్థానానికి డెమొక్రటిక్ పార్టీ తరపున తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించాడు జో బైడెన్. అయితే ఆయన అభ్యర్ధిత్వం ఖరారు కావటం నల్లేరు మీద నడకేమీ కాలేదు. ఆరు నెలల పైగా సుదీర్ఘంగా సాగిన డెమొక్రటిక్ పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియలో – తొలి దశల్లో పాతతరపు జో బైడెన్ ఉదారవాద అభ్యర్ధుల ధాటికి వెనకపడిపోయాడు. ఆయన వయసు (77 ఏళ్లు) కూడా అభ్యర్ధిత్వానికి అడ్డంకిగా మారింది. సౌమ్యుడు కావటం వల్ల ప్రత్యర్ధి పార్టీ తరపున రంగంలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు, మొరటు రాజకీయాలకి పేరొందిన డొనాల్డ్ ట్రంప్ ముందు తేలిపోతాడనే అంచనాలు కూడా జో బైడెన్ వెనకపడటానికి దోహదపడ్డాయి. అయినా డీలా పడకుండా ముందుకి సాగి, క్రమంగా పుంజుకుని, ఆఖరికి పార్టీ అభ్యర్ధిత్వాన్ని సాధించాడు జో బైడెన్.

తనకి జతగా, ఉపాధ్యక్ష స్థానానికి అభ్యర్ధిగా కమలా దేవి హారిస్ (Kamala Devi Haris) ని ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు. కమలా హారిస్ భారతీయ మూలాలు, ఆమె నల్లజాతి మూలాలు, ఆమె మహిళ కావటం – ఇవి కాదు ఆశ్చర్యానికి కారణం. ప్రైమరీ ఎన్నికల్లో జరిగిన డిబేట్ల సందర్భంగా ఉదారవాది ఐన కమలా హారిస్ ఏ విధంగా జో బైడెన్‌పై దాడి చేసిందో చూసిన వారికి, ఈ ఎంపిక ఆశ్చర్యకరమే. అయితే – ఆ పని చేయటం జో బైడెన్ కలుపుగోలు తత్వాన్ని, తనకి భిన్నమైన వాదన కూడా అర్ధం చేసుకునే గుణాన్ని ఎత్తిచూపుతుంది.

ఇక – అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ప్రచారం కూడా అత్యంత సంయమనంతో సాగింది. ట్రంప్ వ్యక్తిగత దూషణలతో ఎంత కవ్వించినా జో బైడెన్ ఆ ఉచ్చులో పడకుండా తన ప్రచారాన్ని ఎక్కువగా తన పాలన ఏ విధంగా ఉండబోతోందనే విషయమ్మీదనే కేంద్రీకరించాడు. మరోపక్క కరోనా వైరస్ దాడిని ఎదుర్కునే విషయంలో ట్రంప్ సర్కార్ ఒక విధానం అంటూ లేకుండా ప్రవర్తించటం కూడా జో బైడెన్‌కి కలిసొచ్చింది. నవంబర్ 3, 2020 నాడు జరిగిన ఎన్నికల్లో బైడెన్-హ్యారిస్ జంట సుమారు 53 లక్షల వోట్ల తేడాతో, 306-232 ఎలక్టొరల్ కాలేజ్ స్థానాలతో ట్రంప్-పెన్స్ జంటపై స్పష్టమైన విజయం సాధించింది. అమెరికా చరిత్రలో ప్రత్యర్ధిపై ఇంత ఎక్కువ ప్రజాదరణ వోటు ఆధిక్యత సాధించిన అభ్యర్ధి మరెవరూ లేరు!

జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన రెండవ రోమన్ కేతలిక్. 1961లో జాన్ కెనడీ ఆ ఘనత సాధించిన తొలి కేతలిక్. ఇరువురికీ ఐరిష్ మూలాలు ఉండటం విశేషం. అధ్యక్ష ఎన్నికల్లో మతం పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ, కీలకమైన కొన్ని రాష్ట్రాల్లో విజయానికి అభ్యర్ధుల మత ప్రాధాన్యతలు, నమ్మకాలు కూడా దోహదపడతాయి. ముఖ్యంగా – ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ల ఆధిక్యత ఉండే రాష్ట్రాల్లో విజయం అధ్యక్ష ఎన్నికల ఫలితాలని నిర్ణయిస్తుంది. ఆ రాష్ట్రాల్లో, సంప్రదాయకంగా కేతలిక్‌లంటే పొసగని ప్రొటెస్టంట్‌లని కూడా ఆకట్టుకుని గెలవటం ఆషామాషీ కాదు. గత ఎన్నికల్లో ట్రంప్ వెంట నిలచిన సంప్రదాయవాద ప్రొటెస్టెంట్లలో చాలామందిని తనవైపుకు తిప్పుకోవటం బైడెన్ విజయానికి దోహద పడింది. అలాగే – 28 ఏళ్ల తర్వాత తొలిసారిగా జార్జియా రాష్ట్రంలో, 24 ఏళ్ల తర్వాత తొలిసారి అరిజోనా రాష్ట్రంలో విజయపతాక ఎగరవేసిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా జో బైడెన్ రికార్డు సృష్టించాడు. (2004, 2008 ఎన్నికల్లో ఒబామా వెల్లువలో కూడా ఈ రెండు రాష్ట్రాలు రిపబ్లికన్ అభ్యర్ధులనే గెలిపించటం గమనార్హం.)

జో బైడెన్ అధ్యక్షత 2021 జనవరి 20 నాడు మొదలవుతుంది. ప్రస్తుతానికి ప్రపంచమంతా ఈయన్ని తదుపరి అమెరికా అధ్యక్షుడిగా గుర్తిస్తున్నా, ఇప్పటి అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తన ఓటమి అంగీకరించక మొండిగా వ్యవహరిస్తుండంతో, బైడెన్‌కి అధికార బదలాయింపు ప్రక్రియలో తాత్సారం జరుగుతోంది. అయితే బైడెన్ మాత్రం తదుపరి అధ్యక్షుడి హోదాలో (president-elect) ఇప్పటికే తన పని ప్రారంభించేశాడు. అమెరికన్ మీడియా సైతం – ఇంతకు ముందెన్నడు లేని విధంగా – ప్రస్తుత అధ్యక్షుడిని పట్టించుకోవటం మానేసి, రాబోయే అధ్యక్షుడి విధాన ప్రకటనలు, వ్యవహారాలకే అధిక ప్రాముఖ్యత ఇస్తోండటం ఒక విశేషం!

అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రయాణం అత్యంత కఠిన పరీక్షలనెదుర్కోబోతోంది. కోవిడ్-19 వల్ల కుదేలైన ఆర్ధిక రంగాన్ని గాడిన పెట్టాల్సి ఉంది. ట్రంప్ అసమర్ధత, నాయకత్వ లేమి వల్ల నాలుగేళ్లలో అమెరికా ఎన్నో విధాలుగా నష్టపోయింది. అన్నిటినీ మించి, ట్రంప్ విభజన రాజకీయాల వల్ల అమెరికా సమాజంలో వచ్చిన చీలిక ఇప్పుడప్పుడే పోయేది కాదు. ప్రత్యర్ధి రిపబ్లికన్ పార్టీ పూర్తిగా ట్రంప్ కుటుంబం చేతిలో ఆటబొమ్మగా మారిపోవటం వల్ల, ట్రంప్ అధ్యక్ష పదవి నుండి దిగిపోయాక కూడా, ఆ పార్టీని అడ్డుపెట్టుకుని అమెరికన్ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమం కొనసాగించే అవకాశం ఉంది. ఒక రకంగా జో బైడెన్ పరిస్థితి 1860లలో అబ్రహాం లింకన్ ఎదుర్కొన్న పరిస్థితి లాంటిది. మరి ఆయన ఎలా నెట్టుకొస్తాడో వేచి చూద్దాం.

టంగుటూరి ప్రకాశం పంతులు

టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి
నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి.
టంగుటూరి ప్రకాశం పంతులు 1940, 50లలో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు.
టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు.ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడు
ప్రకాశంగారి పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసే వారిని సమాజంలో చాలా తేలికగా చూసేవారు. పూటకూళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక, ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరాడు. పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవాడు. తెల్లగా అందంగా ఉండడంతో ఆడ, మగ రెండు వేషాలు కూడా వేసేవాడు. ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు. క్రికెట్ చాలా చక్కగా ఆడేవాడు. ఆ వయసులో అల్లరిగా తిరిగేవాడు.
వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. అల్లరి చిల్లరి సావాసాల వల్లా, నాటకాల వ్యాపకం వల్లా, ప్రకాశానికి మెట్రిక్ పాస్ అవడం కష్టమయ్యింది. మిషనుపాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు చలవతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ లో చదివాడు. నాయుడు రాజమండ్రికినివాసం మారుస్తూ, ప్రకాశాన్ని తనతో తీసుకువెళ్ళి, అక్కడ ఎఫ్.ఏ.లో చేర్పించాడు. తరువాత మద్రాసుకు పంపించి, న్యాయశాస్త్రం చదివించాడు.
ప్రకాశం1890లో తన అక్క కూతురైన హనుమాయమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత కొద్దికాలంపాటు ఒంగోలులో న్యాయవాద వృత్తి సాగించి, 1894లో మళ్ళీ రాజమండ్రి చేరాడు. వృత్తిలో బాగా సంపాదించాడు. తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు.
అప్పట్లో ప్రకాశం సెకండ్ గ్రేడ్ ప్లీడరు. కనుక పై స్థాయి కోర్టులలో వాదించడానికి అర్హత లేదు. బారిస్టరులకు మాత్రమే ఆ అర్హత ఉండేది. ఒకమారు ప్రకాశం ప్రతిభ గమనించిన ఒక బారిస్టరు ప్రకాశాన్ని కూడా బారిస్టరు అవమని ప్రోత్సహించాడు
ప్రకాశం 1904లో ఇంగ్లాండు వెళ్ళాడు. వెళ్ళే ముందు మహాత్మా గాంధీ లాగానే మద్యం, మాంసం, పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించాడు. దీక్షగా చదివి బారిస్టరు అయ్యాడు. అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాభాయి నౌరోజీ బ్రిటీషు పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలు పంచుకొన్నాడు. ఈ సమయంలో ప్రకాశానికి జాతీయ భావాలు, సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి.
1907లో, లండనులో ప్రశంసాపత్రంతో బారిష్టరు కోర్సు పూర్తిచేసుకొని భారతదేశం తిరిగివచ్చాక, ప్రకాశం మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించాడు. అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందిన బారిష్టరులందరూ ఆంగ్లేయులు లేదా తమిళులు. పేరుపొందిన తెలుగు బారిష్టరులలో ఈయనే ప్రప్రథముడు. ప్రకాశం పౌర మరియు నేర వ్యాజ్యాలనన్నింటినీ చేపట్టేవాడు. ఈయన చేపట్టిన క్రిమినల్ కేసుల్లో ఆష్ హత్యకేసు ఒక ప్రసిద్ధిచెందిన కేసు. తిరునెల్వేలిలో కలెక్టరుగా పనిచేస్తున్న ఆష్, 1907లో కాల్చిచంపబడ్డాడు. ఈ సంఘటన బెంగాల్ కు చెందిన జాతీయవాద నేత బిపిన్ చంద్ర పాల్ ఆ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తున్న సమయములో జరిగింది. ప్రకాశం ఈ హత్య కేసులో, ఒక ముద్దాయి తరఫున వాదించి ఆయనకు స్వల్పశిక్ష పడేటట్టు చేశాడు.
ప్రకాశం, లా టైమ్స్ అనే న్యాయవాద పత్రికకు కూడా సంపాదకత్వం వహించేవాడు. అదే సంవత్సరం బ్రిటిషు ప్రభుత్వం పాల్ ప్రసంగాలు రాజద్రోహాన్ని ఉసిగొల్పేవిగా, ఉద్రేకపూరితముగా ఉన్నవని భావించటం వలన, ఇతరులు ముందుకు రావటానికి భయపడే సమయంలో, ఈయన బిపిన్ చంద్ర పాల్ ఇచ్చిన ప్రసంగాలకు హాజరయ్యేవాడు.
లక్నో ఒడంబడిక తర్వాత ప్రకాశం కాంగ్రెసు పార్టీ మీటింగులకు తరచుగా హాజరు కావటం ప్రారంభించి, 1921 అక్టోబరులో సత్యాగ్రహ ప్రతినపై సంతకం చేశాడు. 1921లో స్వాతంత్ర్య సమరంలో అడుగుపెట్టి వృత్తిని వదలిపెట్టేనాటికి, లక్షల్లో సంపాదించాడు. ఆ యావదాస్తినీ, దేశసేవకే ఖర్చు చేసాడు.
లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు మరియు తమిళ భాషలలో ఏకకాలమున విడుదలవుతున్న స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టాడు. ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపాడు.
1921 డిసెంబర్‌లో జరిగిన అహమ్మదాబాదు సదస్సులో కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనాడు. ఏదైనా అలజడి కానీ, కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటించేవాడు. ఈయన అకాలీ సత్యాగ్రహమప్పుడు పంజాబ్ ప్రాంతంలో, హిందూ-ముస్లిం ఘర్షణలు తలెత్తినపుడు ముల్తాన్ లోనూ పర్యటించాడు.
కేరళలో మోప్లా తిరుగుబాటు సమయములో బయటిప్రాంతాల వారిపై నిషేధం విధించినా లెక్కచేయకుండా ఆ ప్రాంతాన్ని పర్యటించి, పర్యవసానంగా ఊటీ లోని తన ఆస్తిని కోల్పోయాడు. 1922లోసహాయనిరాకరణోద్యమం సందర్భంగా గుంటూరులో 30,000 మంది స్వచ్ఛంద సేవకులతో ఒక ప్రదర్శనను నిర్వహించాడు. 1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెసు పార్టీఅభ్యర్థిగా ఎన్నికైనాడు. అక్కడ విఠ్ఠల్‌భాయి పటేల్, మదన్ మోహన్ మాలవ్యా, జిన్నా మరియు జి.డి.బిర్లా వంటి జాతీయ నాయకులు ప్రకాశం సహచరులు.
1921లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1921 అక్టోబర్ 29 న స్వరాజ్య అనే దినపత్రికను ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే, ఈ పత్రిక మంచి ఆదరణ చూరగొన్నది. దీని తెలుగు, తమిళ సంచికలకు ప్రజలు ఎగబడ్డారు.
1928లో మద్రాసులో సైమన్‌ కమిషను బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని, తుపాకికి ఎదురు నిలిచి, కాల్చమని సవాలు చేసాడు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు.

1928, మార్చి 2నకమీషన్ బొంబాయిలో అడుగుపెట్టినపుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలను అనుమతించలేదు. అయితే, ప్యారీస్ కార్నర్ వద్ద మద్రాసు హైకోర్టు సమీపములో జనం గుంపులు గుంపులుగా చేరారు. వాళ్లను చెదరగొట్టటానికి పోలీసులు కాల్పులు జరిపారు. పార్థ సారథి అనే యువకుడు కాల్పులకు గురై అక్కడికక్కడే మరణించాడు. ఆ యువకుని మృతదేహాన్ని సమీపించిన వారెవరినైనా కాల్చుతామని పోలీసులు హెచ్చరించారు. దీనిపై కోపోద్రిక్తుడైన ప్రకాశం, తన చొక్కా చించి ధైర్యంగా రొమ్ము చూపింవేశాడు.
1937లో కాంగ్రెసు పార్టీ ప్రాంతీయ ఎన్నికలలో పోటీ చేసి ఇతర ప్రాంతాలతో పాటు మద్రాసు ప్రెసిడెన్సీలో కూడా ఆధిక్యత తెచ్చుకున్నది. ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకాశం ముందున్నప్పటికీ, క్రియాశీల రాజకీయాలకు తిరిగివచ్చిన రాజాజీ ముఖ్యమంత్రి అయ్యేందుకు అనువుగా, కాంగ్రెసు అధిష్టానవర్గం కోరిక మేరకు తప్పుకున్నాడు. రాజాజీ మంత్రివర్గములో ప్రకాశం రెవిన్యూ శాఖామంత్రిగా పనిచేశాడు. మంత్రిగా ఈయన చేసిన పనులలో ముఖ్యమైనది, బ్రిటీషు ప్రభుత్వము పాటించే జమిందారీ వ్యవస్థ వలన వ్యవసాయరంగములో జరుగుతున్న అవకతవకలను పరిశీలించటానికి ఒక విచారణా సంఘాన్ని ఏర్పాటు చేసి, దానికి అధ్యక్షత వహించటం. రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో కాంగ్రెసు మంత్రివర్గాలు, యుద్ధంలో భారతదేశం పాల్గొనటం గురించి తమను సంప్రదించలేదని రాజీనామా చేశాయి. 1941లోయుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకముగా వ్యక్తిగత సత్యాగ్రహం చేసిన ప్రముఖ దక్షిణ భారతదేశ నాయకులలో ప్రకాశం ప్రథముడు.
1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రకాశాన్ని అరెస్టు చేసి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టారు. 1945లో జైలునుండి విడుదలైన తర్వాత, ప్రజలకు చేరువకావటానికి దక్షిణ భారతదేశమంతా పర్యటించాడు. 1946లో కాంగ్రెసు పార్టీ తిరిగి మద్రాసు ప్రెసిడెన్సీలో పోటీచేసి గెలిచింది. ఈ తరుణంలో 1946 ఏప్రిల్ 30న ప్రకాశం మద్రాసుముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. ఈయనతో పాటు తమిళ నాయకుడైన కె.కామరాజ్, జాతీయ నాయకులైన గాంధీ మరియు నెహ్రూల అభ్యర్థి అయిన రాజాజీ ముఖ్యమంత్రి అవటాన్ని వ్యతిరేకించారు. అయితే, పార్టీలోని వివిధ వర్గాల విభిన్న అభిమతాలకు అనుగుణంగా పనిచేయలేక ప్రకాశం ప్రభుత్వం కేవలం 11 నెలలే మనగలిగింది.
సామాన్య ప్రజల సంక్షేమార్ధమై ప్రకాశం, తన వ్యక్తిగత భద్రతను, జవహర్ లాల్ నెహ్రూ చేసిన హెచ్చరికలనూ,, లెక్కచేయకుండా 1948లో నిజాం పాలనలో ఉన్న హైదరాబాదు రాష్ట్రాన్ని సందర్శించాడు. నిజాం యొక్క సహాయసహకారాలతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రజాకార్ల నాయకుడు ఖాసిం రిజ్వీని కలిసి, రిజ్వీకి హెచ్చరిక చేశాడు. ఈ సందర్భంలో ప్రకాశం ధైర్యానికి మెచ్చుకోలుగా రజాకార్లు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
1952లో ప్రజాపార్టీని స్థాపించి అధికారములో ఉన్న కాంగ్రెసు పార్టీ మంత్రులందరూ ఎన్నికలలో ఓడిపోయేట్టు చేశాడు. అయితే ప్రజాపార్టీకి సొంతగా అధికారానికి వచ్చే మద్దతు చేకూరకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే బలనిరూపణకు ముందే ఈ సంకీర్ణం కూలిపోయింది.
అంతలో 1952 డిసెంబర్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మరణించటంతో ఉద్యమం తీవ్రతరమైంది.
ఉద్యమ ఫలితంగా 1953 అక్టోబర్‌ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితుడయ్యాడు. ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలెన్నో జరిగాయి. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవ సందర్భంగా 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణా నది పై బారేజి నిర్మాణం వీటిలో ప్రముఖమైనవి.
కమ్యూనిష్టులు ఈయన పాలనను వ్యతిరేకించటం, సోషలిస్టులు మద్దతు ఉపసంహరించటం వలన ముఖ్యమంత్రి అయిన 14 నెలలకే అవిశ్వాస తీర్మానంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది.
1955లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించే సమయానికి ప్రకాశం క్రియాశీల రాజకీయాలనుండి విరమించుకున్నాడు. 1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది. ప్రకాశం అనుయాయి అయిన నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినాడు. రాజకీయాలనుండి వైదొలిగినా, ప్రకాశం చురుకుగా రాష్ట్రమంతటా పర్యటించాడు.అలాంటి ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై, నీరసించి హైదరాబాదులో ఆసుపత్రిలో చేర్పించబడ్డాడు. అక్కడే ప్రకాశం 1957, మే 20న పరమపదించాడు.
ఆయన ఆత్మకథ “నా జీవిత యాత్ర” పేరిట నాలుగు భాగాల పుస్తకంగా విడుదల అయింది. ఇందులో మూడు భాగాలను ఆయన వ్రాయగా, నాలుగో భాగం మాత్రం తెన్నేటి విశ్వనాథం వ్రాసాడు. దీనిలో స్వాతంత్ర్యోద్యమ నాయకుల మనస్తత్వాలు, అప్పటి ప్రజల స్థితిగతులు వివరించబడినవి. తెలుగు సమితి హైదరాబాదు ఆగష్టు 2006 లో ప్రచురించింది. ఈ పుస్తకం హిందీ లోకి కూడా అనువదింపబడింది.
టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5నఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.

పొట్టి శ్రీరాములు

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్షతో, ప్రాణాలర్పించి, అమరజీవి, మహావ్యక్తి పొట్టి శ్రీరాములు .
పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌనులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వీరి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపాలెం గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత “గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే”లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. జీతం నెలకు 250 రూపాయలు.
1928లో వారికి కలిగిన బిడ్డ మరణించాడు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమంచేరాడు.
పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. 1985లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ అధ్యయనంలో పొట్టి శ్రీరాములు – మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి చెప్పబడింది. – “సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధతలు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు. సత్యాన్ని అహింసను ఆరాధించే ప్రేమమూర్తి. దరిద్ర నారాయణుల ఉద్ధతికి అంకితమైన మహానుభావుడు….. శ్రీరాములు తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలనూ గాంధీ ఆదరాన్నీ చూరగొన్నాడు.
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోను, ఆంధ్రలో కృష్ణా జిల్లాలోని కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కొమరవోలులోయెర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. 1943-44ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.
గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవి. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవాడు. 1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు.
జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసాడు. దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడలో వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆంధ్రదేశానికి కూడా మద్రాసు రాజధానిగా వుండేది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు పొట్టి శ్రీరాములు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు.
ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు.
చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు. కర్నూలు రాజధానిగా 1953 నవంబరు 1న ఆంధ్ర రాష్ట్రంఏర్పరచారు. బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలను తెలుగు వదులుకోవలసి వచ్చింది.