సద్గురు జగ్గీ వాసుదేవ్

సద్గురు జగ్గీ వాసుదేవ్ – ఆయన ‘సద్గురు’ గా అందరికీ సుపరిచితులు. ‘సద్గురు’ అనేది ఒక బిరుదు కాదు. ఎవరైనా తమ పాండిత్యం వల్ల ఏదైనా చెప్పగలిగినప్పుడు, మనం వారిని ఎన్నో విధాలా సంబోధిస్తాం. కానీ, ఎవరైతే తమ అంతర్ముఖ అనుభవం వల్ల చెప్పగలుగుతారో వారిని మనం సద్గురు అని అంటాం. సద్గురు ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగి ఇంకా మార్మికుడు. భౌతిక మరియు ఆధ్యాత్మిక పరంగా మానవాళి శ్రేయస్సు కొరకు ఆయన చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా నిర్విరామ కృషి జరుపుతున్నారు. పురాతన యోగ శాస్త్రాలను సమకాలీన మనస్తత్వాలకు అనుగుణంగా చేయగల ప్రత్యేక సామర్థ్యం సద్గురుకు ఉంది. ప్రాచీన యోగ ప్రక్రియలను ఆధునిక మానవుడికి ఆచరణ యోగ్యంగా, సరళమైన విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చి, ప్రపంచ వ్యాప్తంగా ఆయన కోట్లాది మంది జీవితాలను తాకారు. అందరికీ ఆధ్యాత్మికను అందించే సంకల్పంతో… ప్రతి మనిషీ, తనకు ప్రగాఢమైన…

Read More