‘నమస్తే యానాం’ పేరుతో రాజకీయ అరంగేట్రం.. సీఎం అభ్యర్థిపై గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ విజయం
పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి విజయం సాధించింది. బీజేపీ, అన్నాడీఎంకే, ఎన్నార్ కాంగ్రెస్ కూటమి 16 స్థానాల్లోనూ, కాంగ్రెస్ కూటమి 8 చోట్ల, ఇతరులు 6 స్థానాల్లోనూ విజయం సాధించారు. యానాం అసెంబ్లీ ఎన్నికల్లో యువకెరటంలా దూసుకొచ్చిన స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అనూహ్య విజయం సాధించారు. ఇక్కడ మాజీ మంత్రి మద్దతుతో పోటీచేసిన సీఎం అభ్యర్థిపైనే అశోక్ గెలుపొందడం విశేషం. పుదుచ్చేరి ఎన్నార్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రంగసామిపై 655 ఓట్లతో గెలుపొందారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని మల్లాడి కృష్ణారావు ప్రకటించడంతో యానాంలో ఏర్పడిన రాజకీయ లోటును అవకాశంగా మలుచుకున్న శ్రీనివాస్ అశోక్ తెరపైకి వచ్చారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన విద్యావంతుడైన శ్రీనివాస్ అశోక్ ‘నమస్తే యానాం’ అంటూ ఈ ఏడాది జనవరిలో రాజకీయ ఆరంగేట్రం చేశారు. అన్ని గ్రామాల్లో…
Read More
You must be logged in to post a comment.