సూర్యుడి వల్ల భూమి వేడెక్కుతున్నప్పుడు, అంతరిక్షం ఎందుకు చల్లగా ఉంటుంది?

మన భూమి ఉపరితలం మీద సగటు ఉష్ణోగ్రత సుమారు 20 డిగ్రీలు. ఒక వేళ మనం విమానం ఎక్కి 10KM ఎత్తున ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు బయట ఉండే ఉష్ణోగ్రత సగటు -57 డిగ్రీలు (బయటకు వెళ్తే చలికి చచ్చిపోతాం). అంతరిక్షంలో ఉష్ణోగ్రత సుమారు –273 డిగ్రీల (బ్రతికే ప్రసక్తి ఉండదు). ఇక్కడ మీరు గమనించినట్టు అయితే మన భూమి ఉపరితలం నుండి పైకి (అంతరిక్షంలోకి) వెళ్తుంటే ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. మరి సూర్యుడి కిరణాల వలన వేడి ఎక్కితే భూమి నుండి అంతరిక్షంలోకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు పెరగాలి కదా? అసలు వాస్తవం ఏమిటంటే, మన వాతావరణంలో ఉన్న ముఖ్యమయిన అణువులు అంటే, కార్బన్ డైఆక్సైడ్ (CO2), ఆక్సిజన్(O2), నైట్రోజన్ (N2) మొదలగు వాయువులు సూర్యుని కిరణాలలో ఉన్న శక్తిని నేరుగా గ్రహించలేవు. సూర్యుని కిరణాల వేవ్ లెంగ్త్ (short wave…

Read More

అంతర్జాతీయ స్పేస్ స్టేషన్

1980లో పూర్తిగా అమెరికా ప్రయత్నంగా “ఫ్రీడం” అనే పేరు మీద ఈ కట్టడం మొదలైనా వ్యయం తగ్గించుకునేందుకు, అంతర్జాతీయంగా వివిధ అంతరిక్ష ఏజెన్సీల ప్రమేయం కల్పించుకునేందుకు “ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్” పేరుతో ఈ విశ్వంలోనే అత్యంత ఖరీదైన మానవ కట్టడం (2010 లెక్కల ప్రకారం సుమారు 150 బిలియన్ డాలర్లు పై చిలుకు)కు నాంది పలికింది. అంతరిక్షం లో ఈ “స్పేస్ స్టేషన్” సెకనుకు ఐదు మైళ్ళ వేగంతో భూమి చుట్టూ తొంభై నిమషాల కు ఒక మారు చొప్పున మొత్తం ఒక రోజులో పదహారు సార్లు ప్రదక్షిన చేస్తుంది. వ్యోమగాములకు, ప్రయోగశాలలోని జంతువులకు కలిపి మొత్తం స్టేషనుకు గానూ రెండే బాత్రూములు ఉన్నాయి. వారు విసర్జించిన మూత్రాన్నే త్రాగునీరుగా శుద్ధి చేసే ప్రక్రియ కూడా ఉంది. (ఆ రకంగానైనా త్రాగునీరు వాడకం తగ్గుతుందని కాబోలు )…

Read More

హబుల్ టెలిస్కోప్

విశ్వంలో అంతుబట్టని రహస్యాలెన్నో ఉన్నాయి. మనిషి చూడని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. వాటిని చూడాలంటే మనిషి కన్ను సరిపోదు. అందుకే శక్తిమంతమైన టెలిస్కో్‌పను తయారుచేసి విశ్వంలోకి అంతరిక్షంలోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. హబుల్‌ టెలిస్కో్‌పకన్నా ఎంతో శక్తిమంతమైన టెలిస్కోప్‌ విశేషాలు తెలుసుకుందామా!  400 ఏళ్ల క్రితం గెలిలియో మొట్టమొదటిసారి టెలిస్కో్‌పను తయారు చేశారు. ఇటలీకి చెందిన ఈ శాస్త్రవేత్త అంతరిక్ష అధ్యయనం కోసం టెలిస్కో్‌పను తయారుచేశాడు. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు టెలిస్కో్‌పలు వాడుతూనే ఉన్నారు.  1990లో హబుల్‌ స్పేస్‌ టెలిస్కో్‌పను అంతరిక్షంలోకి పంపించారు. ఇది ఇప్పటివరకు పదిలక్షలకు పైగా చిత్రాలను పంపించింది. ఈ టెలిస్కోప్‌ జీవితకాలం మరో పదేళ్లు మాత్రమే ఉంది.  తాజాగా హబుల్‌ టెలిస్కోప్‌ కన్నా కొన్ని వందలరెట్లు శక్తిమంతమైన టెలిస్కో్‌పను అంతరిక్షంలోకి పంపాలని ప్రయత్నం చేస్తున్నారు. దానిపేరు జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌.  ఈ…

Read More

జులై 24న భూమిని దాటనున్న ఆస్టరాయిడ్

‘ఆస్టరాయిడ్ 2020ఎన్​డీ’ ఈ నెల 24న భూమిని దాటుతుందని నాసా పేర్కొంది. ఆదివారం 2016 డీవై30, 2020 ఎంఈ3 అనే మరో రెండు ఆస్టరాయిడ్లు భూమిని దాటతాయని వెల్లడించింది. 170 మీటర్లు పొడవైన ఆస్టరాయిడ్​ 2020ఎన్​డీ భూమిని 5.86 లక్షల కిలోమీటర్ల దూరంలో, గంటకు 48 వేల కిలోమీటర్ల వేగంతో దాటుతుందని పేర్కొంది. ఈ ఆస్టరాయిడ్​ ప్రమాదకర జోన్​లో ప్రయాణిస్తుందని చెప్పింది. 2016డీవై30 గంటకు 54 వేల కిలోమీటర్ల వేగంతో, 2020ఎంఈ3 16 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని వెల్లడించింది. 2016డీవై30 రెండు ఆస్టరాయిడ్లలో 15 అడుగుల వెడల్పుతో అతి పెద్దదని తెలిపింది. వీటి వల్ల భూమికి ఎలాంటి అపాయం జరగదని వివరించింది.

Read More

బ్లాక్ హోల్

కాంతి కూడా తప్పించుకో లేని భారీ వస్తువు ఉంటుందనే ఆలోచనను ఖగోళ మార్గ దర్శకుడు, ఇంగ్లాండు మతాధికారి జాన్ మిచెల్ 1784 నవంబరు లో ప్రచురించిన ఒక లేఖ లో క్లుప్తంగా ప్రతి పాదించాడు. మిచెల్ యొక్క సరళమైన లెక్కల ప్రకారం, అటువంటి వస్తువుకు సూర్యుడి తో సమానమైన సాంద్రతను ఉంటుందని భావించాడు. పెద్ద మాగెల్లానిక్ క్లౌడ్ ముందు ఉన్న బ్లాక్ హోల్ సిమ్యులేషను. గ్రావిటేషనల్ లెన్సింగ్ ప్రభావం వలన క్లౌడ్ బాగా విస్తరించినట్లు, వక్రీకరణ చెందినట్లూ కనిపిస్తోంది. పైభాగంలో, పాలపుంత డిస్క్ ఒక చాపం లాగా వంగి కనిపిస్తోంది. బ్లాక్ హోల్‌ల విచిత్రమైన లక్షణాన్ని బట్టి చూస్తే, అసలు అలాంటి వస్తువులంటూ ప్రకృతి లో ఉన్నాయా, లేక అవి ఐన్‌స్టీన్ సమీకరణాల్లోంచి పుట్టుకొచ్చే పరిష్కారాలు మాత్రమేనా అని చాలా కాలం పాటు ప్రశ్నలుండేవి. కూలి, కుంచించుకు…

Read More