లీనియర్ వెలాసిటీ, ఆంగ్యులర్ వెలాసిటీ మధ్య సంబంధం ఏమిటి?

వెలాసిటీ ని వేగం అందాం. “లీనియర్ వెలాసిటీ” అనేదానిని సరళ వేగం అందాం. అనగా, ఒక సరళ రేఖ వెంబడి వేగం. అనగా ఒక సరళ రేఖ వెంబడి ఒక క్షణంలో ఎంత దూరం కదిలేమో చెబుతుంది. అనగా, వేగం = కదలిన దూరం/జరిగిన కాలం. (ఇక్కడ “/” అంటే “భాగించు” అని అర్థం.) కారు సెకండుకి 10 మీటర్లు కదిలితే దాని సరళ వేగం 10 మీటర్లు/సెకండు (ఇక్కడ “/” అంటే “సెంకడుకి ఇన్ని మీటర్లు” అని అర్థం ). ఇలాంటి సరళ రేఖ వెంబడి వేగాన్ని v అనే అక్షరంతో సూచించి, ఇంగ్లీషులో linear velocity అంటారు. కారు ముందుకి కదిలినప్పుడు దాని చక్రం గిర్రున గుండ్రంగా తిరుగుతుంది కదా. చక్రం ఎక్కువ జోరుగా తిరిగితే కారు ఎక్కువ జోరుగా ముందుకి కదులుతుంది. కనుక…

Read More