గాలివాన, తుపాను, టైడల్ వేవ్, సునామీ, ఉప్పెన అన్న పేర్లకి నిర్దిష్టమైన అర్థాలు

శాస్త్రంలో సందిగ్ధతకి తావు లేదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో మనం ముఖ్యంగా చేసే పని “పేర్లు పెట్టడం.” అనగా, మన అనుభవ పరిధి లోకి వచ్చిన దృగ్విషయాలకి నిర్ద్వందంగా ఉండేటట్లు పేర్లు పెట్టడం. ఇప్పుడు మనం గాలివాన, తుపాను, టైడల్ వేవ్, సునామీ, ఉప్పెన అన్న పేర్లకి నిర్ధిష్టమైన అర్థాలు నిర్దేశిద్దాం. గాలివాన, తుపాను, చక్రవాతం గాలితో వచ్చే వాన గాలివాన (storm or windstorm). ఈ గాలి వేగం ఒక హద్దు (గంటకి 75 మైళ్లు లేదా 120 కిలోమీటర్లు) మీరి ఉంటే అది తుపాను. హిందూ మహాసముద్రంలో పుట్టే తుపానులని “సైక్లోనులు” (cyclones) అంటారు. అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టే తుపానులని “హరికేన్” (hurricane) అనిన్నీ, పసిఫిక్ మహాసముద్రంలో – అంతర్జాతీయ తేదీ రేఖకి తూర్పున – పుట్టేవాటిని “టైఫూన్” (typhoon) అనిన్నీ అంటారు. అనగా,…

Read More

తుఫాన్లకు పేర్లు

1990 సంవత్సరం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మచిలీపట్నంను తాకి అల్లకల్లోలం చేసింది. ఆ తుఫాను పేరు TC 02B. కాకినాడ తీరమును 1996 సంవత్సరంలో మరో తుఫాను తాకింది. దాని పేరు 07B. ఈ రెండు తుఫాన్లు మనకు గుర్తులేవు. కాని హుద్ హుద్ (HudHud) తుఫాను లేదా ఫైలిన్ (Phailin) తుఫాను అంటే గుర్తొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంకెలు కన్నా మనకు పేర్లు బాగా గుర్తుంటాయి కనుక. 1990 సంవత్సరం నుండి ప్రపంచ వాతావరణ శాఖ (WMO) తుఫాన్లకు పేర్లు పెట్టాలని నిర్ణయించుకుంది. వేర్వేరు ప్రాంతాలలో ఉన్న వాతావరణ శాఖలు, ఆయా ప్రాంతాలకు సంబంధించిన పేర్లను ఎంపిక చేసి తుఫాన్లకు పెట్టవలసి ఉన్నది. ఉదాహరణకు బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రంలో ఉద్భవించిన తుఫాన్లకు ఢిల్లీ తుఫాను వాతావరణ శాఖ (RMSC NEW DELHI) నిర్ణయించాల్సివస్తుంది .…

Read More

తుపాన్లు

తుపాన్లు ఎందుకు, ఎలా ఏర్పడతాయి? సముద్రపు నీరు ఆవిరైనప్పుడు అక్కడి గాలి వేడెక్కుతుంది. వేడెక్కువైన గాలి తేలిక పడి పైకి వెళ్లిపోతుంది. దీంతో అక్కడ ఖాళీ (వ్యాక్యూమ్) ఏర్పడి పీడనం తగ్గుతుంది. అధిక పీడనం ఉన్న చోట నుంచి తక్కువ పీడనం ఉన్న చోటుకు గాలి ప్రవహిస్తుంది. పీడనం తగ్గేకొద్దీ గాలి వేగం పెరుగుతుంది. సముద్ర వాతావరణంలో ఈ అలజడి ఏర్పడినప్పుడు, అక్కడ పీడనం తగ్గిపోతుంది. ఈ మొత్తం ప్రక్రియను ద్రోణి (టర్ఫ్) అంటారు. ఇది స్థిరంగా ఉండకుండా వందల కిలోమీటర్లు పాకుతుంది. ఇదే తుపానుకు తల్లి. పీడనం తగ్గే కొద్దీ తీవ్రత పెరుగుతుంది. ఆ పీడనం తగ్గే కొద్దీ దాని పేరు మారుతూ వస్తుంది. ‘ద్రోణి’లో పీడనం తగ్గితే అల్ప పీడనం (లో ప్రెజర్) అవుతుంది. ఆ తరువాత క్రమంగా వాయుగుండం (డిప్రెషన్), తీవ్ర వాయుగుండం…

Read More