గ్లేసియర్లు

విశాలంగా ఏర్పడిన మంచు పలకలను మనం గ్లేషియర్స్ అని అనవచ్చు. అధిక మంచు ఒక ప్రాంతంలో కురవడం వలన గ్లేషియర్స్ ఏర్పడతాయి. ఈ గ్లేషియర్స్ చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. గ్లేషియర్స్ను కొన్ని రకాలుగా మనం విభజించవచ్చు.

వ్యాలీ (Valley) గ్లేషియర్స్:

ఇవి ఎక్కువగా పర్వతాలమీద ఏర్పడుతాయి. పర్వతాలు మీద మంచు ఎక్కువగా పేరుకుపోవడంతో ఆ పర్వతాల మీద మంచు పలకలు ఏర్పడతాయి. అలా కొన్ని దశాబ్దాల పాటు ఈ మంచు పేరుకుపోవడంతో కింద ఉన్న మంచు తీవ్రమయిన వత్తిడికి గురి అయ్యి మంచు యొక్క సాంద్రత పెరుగుతుంది. ఈ మంచు పలకలు ఎక్కువ బరువు పెరగడంతో కింద భాగము వత్తిడికి గురి అయ్యి, పర్వతము పైనుండి మంచు కిందకు జారుతుంది. అలా కిందికి జారిన మంచుపలకలు వేడికి కరిగి నదిలా ప్రవహిస్తాయి.

ఉదాహరణకు హిమాలయాల మీద ఏర్పడిన మంచు కరిగి, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదులు ఏర్పడినవి. కింద అమర్చిన చిత్రంలో మీరు గంగా, బ్రహ్మపుత్ర నదులు హిమాలయ పర్వతాలనుండి ఎలా ఏర్పడినవో చూడవచ్చు.

వాతావరణ మార్పువలన మన హిమాలయ హిoదు కుష్ ప్రాంతములో ఉషోగ్రతలు చాలావరకు పెరుగుతున్నాయి. ఇందువలన ముందు ముందు ఈ గ్లేషియర్స్ కరిగి అంతరించే ప్రమాదం లేకపోలేదు.

కాంటినెంటల్ (continental) గ్లేషియర్స్:

మంచు యొక్క భారీ పలకలు నెల మీద గనుక ఏర్పడితే వాటిని కాంటినెంటల్ గ్లేషియర్స్ అని పిలుస్తాము (తక్కువ ఉషోగ్రతల వలన మంచు కురుస్తుంది). ఉదాహరణకు అంటార్టికా, ఆర్కిటిక్ , గ్రీన్లాండ్ మంచు పలకలను కాంటినెంటల్ గ్లేషియర్స్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాంటినెంటల్ గ్లేషియర్స్ బరువు వలన అంటార్టికా, ఆర్కిటిక్ నెల కిందకు ఇంకిపోవడం జరుగుతుంది. వాతావరణ మార్పువలన ఈ కాంటినెంటల్ గ్లేషియర్స్ తొందరగా కరిగి సముద్రపు నీటిమట్టమును పెంచడం జరుగుతుంది. దీన్ని సి లెవెల్ రైస్ (sea level rise) అని పిలుస్తారు.

చిత్ర మూలం: NASA, గ్రీన్లాండ్ మంచు పలక/గ్లేషియర్స్

సి ఐస్ (Sea-Ice) గ్లేషియర్స్:

సముద్రపు నీరు చల్లని ఉష్ణోగ్రతల వలన మంచు పాలకలుగా ఏర్పడితే వాటిని మనం సి ఐస్ గ్లేషియర్స్ అని అంటాము లేదా సముద్రపు గ్లేషియర్స్ అని అంటాము. సముద్రపు గ్లేషియర్స్ ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ మహా సముద్రాలలో ఏర్పడతాయి. సముద్రపు గ్లేషియర్స్ శీతాకాలంలో పెరుగుతాయి మరియు వేసవి నెలల్లో కరుగుతాయి, అయితే ఇవి కొన్ని ప్రాంతాలలో ఏడాది పొడవునా ఉంటాయి.