సుందర్‌బన్స్ ( SUNDARBANS)

ఈ చిత్రం వికీపీడియాలోనిది.

అక్కడ ఆశ్చర్యకర విషయాలు కోకొల్లలు.

  • పల్లెల్లో ఇంచుమించు ప్రతి ఇంటి ముందు నీటి గుంట ఉంది – వారి అన్ని నీటి అవసరాలకు ఇదే ఆధారం.
  • గోదారి లంకల్లోలా అక్కడా జనాలు రవాణాకు లాంచీలు వాడతారు. అలల పోటు తగ్గినప్పుడు ఆ లాంచీలు ఇలా కనిపించాయి (కొన్ని గంటలకు మళ్ళీ నీరు వీటిని చుట్టుముట్టేసింది):
  • అక్కడ పల్లెల్లో తిరగటానికి ఈ రిక్షాలే:
  • ఆ మడ అడవుల్లో చెట్ల వేళ్ళు ఊడల్లో ఒక రకమైన Aerial Roots – అంటే భూమిలోంచి పైకి పెరుగుతాయి. నేలపై పరుచుకున్నవన్నీ చుట్టుపక్క చెట్ల వేళ్ళు:
  • పై చిత్రంలోని ప్రదేశమే హై టైడ్‌లో ఇలా:
  • ముంగీసలు, ఉడుములు ఇలా తిరిగేస్తూ కనిపించాయి:
  • చిత్తడి నేలలో రంగురంగుల ఎండ్రకాయలు కనిపించాయి:
  • పదే నిముషాల్లో వాతావరణం మారిపోయేది – నిర్మలాకాశం నుంచి హోరువానకు. ఇలా ఒక్క రోజులో రెండు సార్లు జరిగింది.
  • అక్కడ పల్లెల్లో కరెంటు లేదు – అందరూ చిన్న డీజిల్ జెనరేటర్లు పెట్టుకున్నారు. ప్రభుత్వం సబ్సిడీ కింద వారికి డీజిల్ సరఫరా చేసేది.
  • పల్లెల్లో చాలా మందికి నదిలో చేపలు, అడవిలోంచి సేకరించుకొచ్చే తేనె వంటివే జీవనాధారం. ఆ క్రమంలో పులుల దాడులు అక్కడ సాధారణం, జనులూ అలవాటు పడిపోయారు. కొన్ని పులులు నదిలో ఈదుకుంటూ పల్లెల్లోకి వస్తుండటంతో చాలా చోట్ల నదిపై వలలతో కంచెలు ఏర్పాటు చేశారు.

నీటిలో పులి నేల మీద మొసలి
అడవి అంటే… పులి అడవిలో ధీరగంభీరంగా సంచరిస్తూ ఉంటుందని కరెక్ట్‌గానే ఊహిస్తాం. నీటి మడుగులో అడుగు పెట్టాలంటే మొసలి ఉంటుందేమోనని భయపడతాం కూడా. అయితే… సుందర్‌బన్‌లో పులులు నీటిలో ఈదుతూ కనిపిస్తాయి. మొసళ్లు ఒడ్డున సేద దీరుతుంటాయి. ఆ దృశ్యం కంటపడగానే గుండె ఆగిపోయినట్లవుతుంది. రకరకాల పక్షులు… మొత్తం రెండొందల యాభై రకాలకు పైగా జాతులుంటాయని అంచనా. ఈ టైగర్‌ రిజర్వ్‌లో నాలుగు వందల బెంగాల్‌ రాయల్‌ టైగర్‌లుంటాయి. రాత్రి బస చేయాలంటే ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి అనుమతి తీసుకోవాలి.

అడవిలో ఊళ్లు
మొత్తం పదివేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అడవి ఇది. నాలుగువేలకు పైగా చదరపు కిలోమీటర్లు మనదేశంలో ఉంది. దాదాపు ఆరు వేల చదరపు కిలోమీటర్లు బంగ్లాదేశ్‌లో ఉంది. ఇది మనదేశంలో అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌. విశాలమైన ఈ అటవీప్రాంతంలో నదులు, నీటి పాయల మధ్య మొత్తం నూట రెండు దీవులున్నాయి. నూటా రెండు దీవులకు గాను యాభై నాలుగు దీవులు జనావాసాలు. అడవి మధ్య ఊర్లన్నమాట. ఈ దీవుల్లో పంటలు పండిస్తారు. అడవి మధ్య ప్రవహించే నదుల్లో జాలరులు చేపలు పడుతుంటారు. రోజూ ఉదయం సాయంత్రం ఇక్కడ బంగాళాఖాతం చేసే అల్లరిని చూడవచ్చు. అలలు ఆరడుగుల నుంచి పదడుగుల ఎత్తుకు లేస్తాయి. ఆ భారీ అలలతో నీటితోపాటు ఇసుక కూడా అడవిలోకి కొట్టుకు వచ్చి మేట వేస్తుంటుంది. పడవలు, లాంచీలలో దీవులన్నింటినీ చుట్టి రావచ్చు. 

సరిహద్దు దీవి
మనదేశానికి సరిహద్దులో ఉన్న దీవి పేరు ‘గోసాబా’ ఇది నీటి మట్టానికి 13 అడుగుల ఎత్తులో ఉంది. ఇది నిజానికి భారత ప్రధాన భూభాగానికి ఆనుకుని ఉండదు. విడిగా ఉంటుంది. నీటి ఎల్లలో మన సరిహద్దుకు లోపల ఉంది. ఇది ఒక పంచాయితీ. ఇందులో నివసించే ప్రజల కోసం స్కూలు, హాస్పిటల్‌ కూడా ఉన్నాయి. ప్రధాన భూభాగంలోకి రావాల్సిన అవసరం లేకనే హాయిగా జీవించేయవచ్చు. 

సాహిత్యవనం
సుందర్‌బన్‌ అటవీప్రదేశం కోల్‌కతాకు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ‘న్యూ సెవెన్‌ వండర్స్‌ ఆఫ్‌ నేచర్‌’ కేటగిరీలో లిస్ట్‌ అయింది. బెంగాలీ రచయితలు సుందర్‌బన్‌ అటవీ ప్రదేశం, ఇక్కడి దీవుల్లోని జన జీవనమే కథాంశంగా అనేక రచనలు చేశారు.

సుందరబన్‌కు ప్రత్యేక హోదాలు
► 1973 టైగర్‌ రిజర్వ్‌ 
► 1987 వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌
► 1989 నేషనల్‌ పార్క్‌

కర్ణాటకలో ఉన్న నేషనల్ పార్కులు

కర్నాటకలో మొత్తం ఐదు నేషనల్ పార్క్స్ ఉన్నాయి.

బన్నేరుఘట్ట నేషనల్ పార్క్

బెంగళూరు శివార్లలో ఉన్న ఇది బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇది బెంగళూరు నగరం నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇది బెంగాల్ టైగర్, వైట్ టైగర్, సింహాలు, జింకలు, జీబ్రా మరియు అనేక ఇతర జంతువులకు ప్రసిద్ధి చెందింది.

ఇక్కడ ఏనుగుల కారిడార్ మరియు ఏనుగుల అభయారణ్యం కూడా ఉన్నాయి.

ఇక్కడ సఫారీ సౌకర్యం ఉంది.

బండిపుర నేషనల్ పార్క్

ఒకప్పుడు మైసూర్ మహారాజుల ప్రైవేట్ వేట మైదానం. ఇది మైసూర్ జిల్లాలో ఉంది.

ఇది పులులు, జింకలు మరియు ఏనుగులకు ప్రసిద్ధి చెందింది.

ఇక్కడ కూడా సఫారీ సౌకర్యం ఉంది.

నాగరహొళే నేషనల్ పార్క్

ఇది కూడా మైసూర్ జిల్లాలో ఉంది. ఇది బండిపుర నేషనల్ పార్క్ కి దగ్గరలో ఉంది.

ఈ ఉద్యానవనంలో అనేక పులులు, ఏనుగులు, చిరుతపులులు, ఎలుగుబంటి, హైనా మరియు జింకలు ఉన్నాయి.

ఇక్కడ కూడా సఫారీ సౌకర్యం ఉంది.

కుదురేముఖ నేషనల్ పార్క్.

ఇది చిక్కమగలూరు జిల్లాలో ఉంది.

ఇది కర్నాటకలోని పశ్చిమ కనుమల ప్రాంతంలో వస్తుంది.

ఇది లయన్-టైల్డ్ మాకెక్యూ, పులి, చిరుతపులి, అడవి కుక్క, లంగూర్, ఎలుగుబంట్లు మొదలైన వాటికి ప్రసిద్ధి చెందింది.

కుదురేముఖ అంటే “గుర్రపు ముఖం” అని అర్థం. కన్నడలో కుదురే అంటే గుర్రం.

లయన్-టైల్డ్ మాకెక్యూ (lion-tailed macaque)

ఈ కొండ గుర్రపు ముఖాన్ని పోలి ఉంటుంది. కాబట్టి దీనికి కుదురేముఖ అని పేరు పెట్టారు.

అంశి నేషనల్ పార్క్

దీనికి ఇప్పుడు కాళీ టైగర్ రిజర్వ్ అని పేరు మార్చారు. ఇది ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. ఇది కాళీ నది దగ్గరంలో ఉంది.

బైసన్, ఎలుక, జింక, కింగ్ కోబ్రా, పాము, పైథాన్, మలబార్ హార్న్‌బిల్స్ మొదలైన అనేక జంతువులను ఇక్కడ చూడవచ్చు.

ఈ ఉద్యానవనం బ్లాక్ పాంథర్ యొక్క సహజ నివాస స్థానం.

హార్న్‌బిల్

బ్లాక్ పాంథర్

ఇది ట్రెక్కింగ్, సఫారి టూర్స్, కోరాకిల్ బోట్ రైడ్స్, మౌంటెన్ బైకింగ్, ఎకో టూరిజం మరియు సైక్లింగ్ వంటి అనేక కార్యకలాపాలను అందిస్తుంది.

కొరింగా వన్యప్రాణి రక్షితకేంద్రం

ఈ వన్యప్రాణి రక్షితకేంద్రం తూర్పుగోదావరి జిల్లాలో 235.7 చ.కి.మీటర్లలో వ్యాపించియున్నది. సముద్రతీర ప్రాంతాలో పెరిగే 65 రకాల తెల్లమడచెట్లకు స్థావరం.

జంతువులు : ఇక్కడ వున్న ప్రధానమైన జంతువులు నీటికుక్కలు, ఒక జాతి మొసళ్ళకు, చేపలు పట్టే పిల్లలకు సురక్షిత ప్రాంతం. నక్కలు, సముద్రపు తాబేళ్ళు, బాతులు, ఫ్లెమింగో జాతి పక్షులు, సముద్రపు కాకులు, ఉల్లంగి పిట్టలు
ఒకప్పుడు సముద్ర వాణిజ్య కార్యకలాపాల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కోరింగ.. ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కనుమరుగైన ఈ పోర్టు తిరిగి కోరింగ అభయారణ్యంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 235.7 చదరపు కిలోమీటర్లు విస్తరించిన మడ అడవులు.. కోరింగను ప్రకృతి సౌందర్యానికి పట్టుగొమ్మగా నిలబెట్టాయి. పక్షులు, జంతువులు, జలచరాలు.. ఈ వనాన్ని జీవవైవిధ్యానికి ఆవాసంగా మార్చాయి. 1998లో అభయారణ్యంగా ప్రకటించిన తర్వాత కోరింగ పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతూ వస్తోంది. చిరుజల్లుల వేళ.. సుందరవనాలు (మడ అడవులు) మరింత మనోహరంగా కనిపిస్తాయి.
వలస పక్షుల విడిదిగా కోరింగ విలసిల్లుతోంది. శీతాకాలంలో 239 జాతులకు చెందిన సుమారు 88 వేల పక్షులు సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వస్తుంటాయి. గౌరు కాకులు, హిమాలయాల్లో ఉండే బ్రాహ్మణి కైట్, స్టార్క్ కొంగలు, కింగ్ఫిషర్ పక్షులు ఎక్కువగా వలస వస్తాయి. గోదావరి, సముద్రం సంగమించే ఈ ప్రాంతమవ్వడంతో ఇక్కడి తీపి, ఉప్పు కలయికతో మిశ్రమ లవణ సాంద్రత ఉంటాయి. అందుకే ఈ నీటిలో విభిన్న జాతులకు చెందిన జలచరాలు మనుగడ సాగిస్తున్నాయి. 575 రకాల చేప జాతులను గుర్తించారు. చిత్తడి నేలలో మండపీతలు, పాములు అధికంగా ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ఎలుకలు కూడా పక్షులతో పోటీగా చెట్లపై గూళ్లు కట్టుకోవడం విశేషం. కోరింగ పరిధిలో ఉన్న 32వ నీటిపాయ లోనికి వెళ్తే చెట్లపై ఎలుకలు కట్టుకున్న గూళ్లు కనిపిస్తాయి.

వృక్షజాతులు : కోరింగ వనాల్లో.. 35 రకాల మడజాతి వృక్షాలు ఉన్నాయి. నల్లమడ, తెల్లమడ, బిల్లమడ వృక్షాలు కనిపిస్తాయి. వనంలో నీటి కుక్కలు, నీటి పిల్లులు, బంగారురంగులో ఉండే నక్కలను చూడొచ్చు. చొల్లంగి గ్రామం దగ్గర అభయారణ్యానికి ప్రవేశం ఉంటుంది. కోరింగ గ్రామంలో మ్యూజియం, వసతి సముదాయాలు ఉన్నాయి. మడ అడవుల్లోని 32వ క్రీకు (నీటిపాయ)లో వివిధ రకాల పక్షి జాతులను వీక్షించే ఏర్పాట్లు ఉన్నాయి. కిందంతా చిత్తడి నేల ఉండటంతో నడవడం సాధ్యం కాదు. అందుకే అడవిలో విహరించడానికి చెక్క వంతెన ఏర్పాటు చేశారు. నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించిన వంతెనపై కాలినడకన విహరిస్తూ.. వన సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. క్రీకులో ప్రయాణించడానికి జెట్టీలు ఏర్పాటు చేశారు. 200 ఏళ్ల కిందటి పాతలైట్ హౌస్ను ఇటీవలే అభివృద్ధి చేశారు. యాత్రికులు బోట్లో వెళ్తారు. హోప్ ఐలాండ్ ఇక్కడ మరో ఆకర్షణ. నిండైన పచ్చదనంతో అలరించే ఈ ద్వీపానికి బోట్లలో చేరుకోవచ్చు.
ఎలా వెళ్ళాలి : కాకినాడ రైల్వేస్టేషన్‌ నుండి 20 కి.మీ. రాజమండ్రి రైల్వేస్టేషన్‌ నుండి 70 కి.మీ. దూరంలో ఉంటుంది.
వసతి సౌకర్యం : రాజమండ్రి, కాకినాడలో ఉండవచ్చు
అక్టోబర్‌ నుండి మే వరకు పర్యటనకు అనుకూలం.

ఆంధ్ర సముద్రతీరంలో ‘కోరంగి’ రేవు చరిత్ర,ప్రత్యేకత ఏమిటి?

ఆగ్నేయ తీర ప్రాంతమున గోదావరి ముఖ ద్వారము న నున్న కోరంగ /కోరంగి ఒక గ్రామము. ఒకనాటి రేవు పట్టణము. 1789 లో తూఫాన్ కారణముగా ఇరవై వేల మంది జనం బలైనారు. అయినా గాని తట్టుకొని నిలబడినది. కానీ మరల నవంబర్ 1839 లో వచ్చిన పెను గాలులు-ప్రచండ తూఫాను మూలమున రేవులో నున్న ఇరవై వేల పడవలు ధ్వంసము కాగా మూడు లక్షల మంది జనం బలైనారు. అప్పటినుండి రేవు పట్టణం శిధిలమై ప్రస్తుతం ఒక గ్రామముగ మిగిలి ఉన్నది.

ఈ గ్రామము తూర్పు గోదావరి జిల్లా-తాళ్లరేవు మండలం, కాకినాడ పట్టణానికి ఇరవై కిలో మీటర్ల దూరము లో ఉంది. డచ్చి వారు స్థావరం ఏర్పరుచు కోగా, పిమ్మట బ్రిటీషువారు స్వాధీన పర్చుకున్నారు. హోప్ ఐలాండ్ గా పేరు పెట్టారు.

ప్రస్తుతము ఇచ్చట వన్య ప్రాణి సంరక్షణ కేంద్రము గా రూపు దిద్దుకున్నది. ఇందు ఉప్పు నీటి మొసళ్ళు కు ప్రసిద్ధి గాంచినది. మడ అడవి ప్రాంతము.

గిర్ నేషనల్ పార్క్ – అద్భుత వన్య జీవనం

భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని వన్యప్రాణుల సంరక్షణా కేంద్రం గిర్ అభయారణ్యం. ఆసియాలోనే సింహాల ఆవాసంగా ప్రసిద్ధి గాంచినది. దీనిలో ప్రస్తుతం 300 సింహాల దాకా ఉన్నాయి. 1975లో ఈ పార్కును ఏర్పాటు చేసేనాటికి సింహాలు దాదాపు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో సింహాలు చిట్టడవి నడుమ లేక ఆహారం కోసం పచ్చిక బయళ్ళలో సంచరిస్తూ ఉంటాయి. గిర్ అరణ్యం మొత్తం 1412 కిలోమీటర్ల లో విస్తరించి ఉన్నది. సింహాలతో పాటు, చిరుతలు, మచ్చల జింకలు, దుప్పులు, అడవి పందులు, సిలోన్ ఎలుగుబంట్లు, హైనాలు, నక్కలు, పంగోలిన్స్, పక్షులు మొదలగునవి కూడా ఉన్నాయి. కమలేశ్వర్ డ్యామ్ దగ్గర మొసళ్ళను, కొండచిలువలను, రాక్షస బల్లులను చూడవచ్చు. బరోడా విశ్వవిద్యాలయం వారు జరిపిన సర్వేలో ఈ ప్రాంతంలో 507 వృక్షజాతులు ఉన్నట్లుగా నిర్ధారించారు.
గిర్ అభయారణ్యం గుండా 7 నదులు ప్రవహిస్తున్నాయి. హిరాన్, శత్రుంజి, దటర్జీ, మచుంద్రీ , సింగోడా, మొడావరి, రావల్. వీటిలో హిరన్, మచుంద్రీ మరియు మరియు సింగోడా నదులపై ఆనకట్టలు కట్టబడినవి. ఈ నాలుగు జలాశయాలనుండి అభయారణ్యాలకు మండువేసవిలో కూడా నీరు లభిస్తుంది.
గిర్ వనాలలో 300కు పైగా వివిధ పక్షి జాతులున్నాయి.గరుడపక్షులు, రాబందులను సైతం ఇక్కడ చూడవచ్చు. పక్షులను గూర్చి అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకు ఇది మంచి ప్రదేశం.
ఈ అరణ్యాలలో మల్ధరీ గిరిజనులు నివసిస్తూ ఉంటారు. ఆవులను, గేదెలను పార్క్ లలో పెంచుతుంటారు. సింహాలకు ఇవే ప్రధాన ఆహారం. ఈ నేషనల్ పార్కులో నివసించే మరో గిరిజన జాతి వారు. సిద్ధీస్. వీరు ఆఫ్రికా మూలాలకు చెందినవారుగా భావిస్తున్నారు. వీరు చేసే నృత్యాలు పేరు గడించినవి. ఈ గిర్ అరణ్యాలకు తోడు దేవాలి సఫారి పార్కు కూడా ఉంది. ఇక్కడ కూడా సింహాలు ఇంకా అనేక జంతువులను చూడవచ్చు.

ఆసియా సింహాలు, జంగల్ కేట్ లు, ఇండియన్ చిరుతలు, స్లాత్ బేర్ లు, చారల హయనాలు, రాతెల్ ,ఇండియన్ కోబ్రాలు, గోల్డెన్ జాకల్, ఇండియన్ ముంగీస మరియు డెసర్ట్ కేట్ వంటివి ఇక్కడి ఆడవిలో కలవు.   అరుదైన సారీ నృప జాతులు కూడా ఇక్కడ కలవు. మానిటర్ లిజార్డ్, మార్ష్ మొసలి, ఇండియన్ స్టార్ తాబేలు కూడా చూడవచ్చు. గిర్ లో ఆసియా సింహాల సంతానోత్పత్తి కి తగిన పునరుద్ధరణ కార్యక్రమాలు కూడా అమలు చేస్తారు.