అయోధ్య

అయోధ్య సరయు నది ఒడ్డున ఉన్న హిందువుల ప్రఖ్యాత పుణ్య క్షేత్రం. విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారం అయిన శ్రీ రాముడి జన్మస్థలం కూడా. రామాయణం ప్రకారం శ్రీ రాముడు జన్మించిన అయోధ్య రఘు వంశీకుల యొక్క రాజధాని. హిందూమతంతో పాటు అయోధ్యలో బౌద్ధమతం, జైనమతం మరియు ఇస్లాం మతం జాడలు కూడా కనిపిస్తాయి. జైన్ తీర్థంకరు లలో అయిదుగురు ఇక్కడే జన్మించారని నమ్ముతారు. మొదటి తీర్థంకరుడు అయిన రిషబ్ దేవ్ కూడా ఇక్కడే జన్మించారని అంటారు.

అయోధ్య అనగానే శ్రీరాముడు గుర్తుకు వస్తాడు. కానీ భారతీయుల దురదృష్టం కొద్దీ 1527లో శ్రీ రాముడి జన్మ స్థలంగా పరిగణించబడిన ప్రాంతంలో మొఘల్ చక్రవర్తి బాబ్రీ మసీదును నిర్మించాడు. 1992లో ఈ మసీదు కొందరి చేత కూలగొట్టబడింది. ఆ తరువాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.

శ్రీ రాముడి కుమారుడు కుశుడి చేత నిర్మించబడిన నాగేశ్వరనాథ్ ఆలయం మరియు ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. తులసీదాస్ యొక్క జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం చేత నిర్మించబడిన తులసీ స్మారాక్ భవన్ ఇక్కడే ఉంది.
బంగారపు కిరీటాలు ధరించిన సీతారాముల చిత్రాలని కనక భవన్ లో గమనించవచ్చు. హనుమాన్ గర్హి అనే భారీ నిర్మాణాన్ని కూడా చూడవచ్చు. శ్రీ రాముడి తండ్రికి చెందిన దశరధ భవన్ ని ఇక్కడ చూడవచ్చు. ట్రేటా కే ఠాకూర్ అనే ప్రదేశం లోనే శ్రీ రాముడు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడని అంటారు.
రామ జన్మభూమి ఆలయానికి సమీపంలో సీతాకి రసోయి ఉంది. శ్రీ రాముడితో వివాహం తరువాత సీతాదేవి మొట్ట మొదటి సారి ఇక్కడే వంట చేసిందని అంటారు. సరయు నది వద్ద ఉన్న రామ్ కి పైది అనే స్నానపు ఘాట్ ఉంది. ఆ తరువాత, మని పర్బాత్ అనే బౌద్ధుల విహార ప్రదేశంకూడా ఇక్కడే ఉంది. ఆ తరువాత ఇది హిందువుల ఆలయంగా మార్చారు.

సయోధ్యకు అంకురార్పణ

PM Narendra Modi Will Inaugurate Ayodhya Ram Temple - Sakshi

అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాలంటూ అలుపెరగని రీతిలో దశాబ్దాలుగా పోరాడు తున్నవారి స్వప్నం ఈడేరబోతోంది. బుధవారం ఆ నగరంలో మూడు గంటలపాటు జరిగే భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీసహా 174మంది ఆహ్వానితులు పాల్గొంటున్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి పంజా విసిరిన పర్యవసానంగా ఇలా తక్కువమందితో నిరాడంబరంగా ఆ కార్యక్ర మాన్ని ముగిస్తున్నారు. లేనట్టయితే ఇవాళ్టి రోజున అయోధ్య లక్షలాదిమంది జనసందోహంతో హోరె త్తిపోయేది. బాబ్రీ మసీదు వున్న ప్రాంతం రామ జన్మభూమి అని, దాని స్థానంలో రామమందిరం నిర్మించాలని జన్‌సంఘ్‌గా వున్నప్పటి నుంచి బీజేపీ రాజకీయంగా పోరాడుతూ వుంది. అంతకు చాన్నాళ్లముందే… అంటే 1885 డిసెంబర్‌లో వలసపాలకుల హయాంలోనే తొలిసారి సివిల్‌ కేసు దాఖలైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949 చివరిలో అయోధ్య అదనపు నగర మేజిస్ట్రేట్‌ కోర్టులో ఈ వివాదంపై విచారణ జరిగింది. ఈ వ్యాజ్య పరంపర ఇలా కొనసాగుతుండగానే న్యాయ స్థానాల వెలుపల ఇరువర్గాలమధ్యా సామరస్యపూర్వక పరిష్కారం కోసం ప్రయత్నించినవారు కూడా లేకపోలేదు.

Rear view of the Babri Masjid in Ayodhya before it was demolished. Photo: Wikimedia Commons
File photo of L.K. Advani during his 1990 rath yatra. Also present, Narendra Modi, then an RSS pracharak, now prime minister. Photo: Reuters

1990లో స్వల్పకాలం ప్రధానిగా ఉన్న చంద్రశేఖర్, 1992లో అప్పటి ప్రధాని పీవీ నర సింహారావు, 2003లో నాటి ప్రధాని వాజపేయి ఈ మార్గంలో ప్రయత్నించారు. ఇతర ప్రయత్నాల సంగతలా వుంచి పీవీ హయాంలో ఆయన సలహాదారుగా పనిచేసిన పీవీఆర్‌కే ప్రసాద్, తాంత్రికుడు చంద్రస్వామి పీఠాధిపతులతో, హిందూ మత పెద్దలతో, ముస్లిం సంఘాలతో మాట్లాడారు. ఆ సంభా షణలు కొంతవరకూ ఫలించిన దాఖలాలు కూడా కనబడ్డాయని, కానీ చివరకు అది కాస్తా మూలన పడిపోయిందని చెబుతారు. నిరుడు మార్చిలో సుప్రీంకోర్టు సైతం ఇలాంటి మధ్యవర్తిత్వ ప్రయత్నం చేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఫకీర్‌ మహ మ్మద్‌ ఇబ్రహీం కలీఫుల్లా, సీనియర్‌ న్యాయవాది శ్రీరాం పంచులతో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ అన్ని పక్షాలతో చర్చించి ఒక ఒప్పందాన్ని రూపొందించింది. అయితే కొన్ని పక్షాలు మాత్రమే దానికి అంగీకరించాయి. ఆ పక్షాలు కూడా షరతులు విధించాయి. అయితే మధ్యవర్తిత్వాలు సర్వ సాధారణంగా ఆస్తుల పంపకాలు, స్థల యజమానుల మధ్య వుండే సరిహద్దు తగాదాలు వగైరాల్లో చెల్లుబాటవుతుంది. పరస్పరం తలపడేవారు ఏదో ఒక దశలో కోర్టు వివాదాలతో విసిగిపోయి కొంద రిని పెద్దమనుషులుగా అంగీకరించి, వారి తీర్పునకు తలొగ్గుతారు. కానీ రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం మౌలికంగా మతపరమైన మనోభావాలతో, విశ్వాసాలతో ముడిపడి వున్న సమస్య. అక్కడ అంతక్రితం వున్న రామమందిరాన్ని బాబర్‌ ధ్వంసం చేయించి, దానిపై మసీదు కట్టాడన్నది రామ మందిరం నిర్మించాలని పోరాడినవారి వాదన. ఈ వివాదం రాజకీయంగా మాత్రమే కాదు… సామాజికంగా కూడా కల్లోలం సృష్టించింది.

తన మధ్యవర్తిత్వ ప్రయత్నం ఫలించలేదని గ్రహించాక సుప్రీంకోర్టు నిరుడు నవంబర్‌ 9న తుది తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని రామమందిర నిర్మాణానికి అప్పగించా లని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశించింది. ఒక ట్రస్టు ఆధ్వర్యంలో మందిర నిర్మాణం పనులు జరగాలని నిర్దేశించింది. మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం కేటాయించా లని కేంద్రాన్ని ఆదేశించింది. దేశంలో విద్వేషపూరిత పరిణామాలకు దారితీసిన ఒక సంక్లిష్ట సమస్య సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో పరిసమాప్తమైంది. అన్ని వర్గాలూ ఈ తీర్పును స్వాగతిం చాయి. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ చొరవ, పట్టుదల వల్లే ఈ చిక్కుముడి వీడింది. చివరి దశలో కూడా ఇది యధాప్రకారం వాయిదా పడేలా చూడాలని కొన్ని పక్షాలు ప్రయత్నించాయి. 40 రోజులపాటు నిర్నిరోధంగా సాగిన వాదప్రతివాదాల క్రమంలో ఉద్వే గాలు చోటుచేసుకున్నాయి. కోపతాపాలు మిన్నంటాయి. సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పువల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న భయాందోళనలు అందరిలోనూ ఉన్నాయి. బాబ్రీ మసీదు విధ్వంçసం అనంతరం ఎన్నో విషాదకర పరిణామాలు చూసి ఉండటం వల్ల అవి సహజమే. కానీ ఏళ్లు గడుస్తున్నకొద్దీ అందరిలోనూ పరిణతి వచ్చింది. పరస్పర ఘర్షణల వల్ల ఒరిగేదేమీలేదన్న అవగాహన ఏర్పడింది. అందుకే ఎక్కడా ఆగ్రహావేశాలు కట్టుదాటలేదు. అంతా ప్రశాంతంగా గడిచిపోయింది.

కాలం మారేకొద్దీ ఎలాంటి ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియాలంటే రామ జన్మభూమి ఉద్యమాన్ని చూడాలి. తన రథయాత్రతో ఆ ఉద్యమానికి ఆయువు పోసి, అది దేశవ్యాప్తమయ్యేందుకు బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అడ్వాణీ కారకులు. ఆ రథయాత్రవల్లే బీజేపీ దేశం నలుమూలలా బలపడింది. కానీ ఇప్పుడు జరిగే భూమి పూజ కార్యక్రమాన్ని ఆయన తన ఇంట్లో టెలివిజన్‌ సెట్‌లో వీక్షించవలసి వస్తోంది. కరోనా కారణంగా 90 ఏళ్లు పైబడి వయస్సున్నవారిని అనుమతించరాదని నిర్ణయించినందువల్లే ఆయనను ఆహ్వానించలేదని నిర్వాహకులు చెబుతున్నారు. అప్పట్లో ప్రధాన పాత్రధారులైన నేతలు మురళీ మనోహర్‌ జోషి, కల్యాణ్‌సింగ్, ఉమాభారతిలకు ఆహ్వానం అందినా వారు నిరాకరించడం ఆసక్తికరమైన విషయం. ఉమాభారతి అయోధ్య వెళ్తున్నా, కార్యక్రమానికి హాజరుకాబోనని ఇప్పటికే చెప్పారు. అడ్వాణీ రథయాత్ర గుజరాత్‌ వచ్చినప్పుడు ఆ కార్యక్ర మానికి నిర్వాహకుడిగా ఉండి పెద్దగా వార్తలకెక్కని నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రధాని హోదాలో భూమి పూజలో కీలక భూమిక పోషించబోతున్నారు. మన దేశంలో రామకోవెల లేని ఊరు, వాడా వుండదు. రాముడు కోట్లాదిమంది హిందువులకు ఆరాధ్యుడు కావొచ్చుగానీ, రామాయణం చాటి చెప్పిన విలువలు కాలావధుల్ని దాటి పరివ్యాప్తమయ్యాయి. కులాలు, మతాలు, జాతులకు అతీ తంగా  అందరికీ ఆదర్శనీయమైనవిగా నిలిచాయి. అయోధ్యలో నిర్మాణం కాబోయే రామ మందిరం సైతం ఆ విలువల స్ఫూర్తికి అద్దం పట్టేలా రూపుదిద్దుకుంటుందని ఆశించాలి.

What is Ram Mandir and Babri Masjid’s history?

 1. Started in the 1500s: King Babur, founder of the Islamic Mughal Empire, ordered one of his generals to construct a mosque in Ayodhya, to be known as Babri Masjid (“Babur’s mosque”).
 2. The mosque was built on a hill known as “Rama’s fort,”a shrine to Ramasite was demolished to make way for it.
 3. Since then, local Hindu group started to make demand to build a temple at that place, but it was denied by the colonial Government.
 4. In 1859, the British colonial administration separated the places of worships by a wall to avoid dispute between Hindus and Muslims. Muslims were allowed to use the inner part and Hindus were allowed to use the outer part.
 5. The first case was filed in Court in January 1885, by Mahant Raghubir Das (a Hindu priest) for seeking permission to build a canopy on the Ramchabutra (a raised platform) outside the mosque. The faizabad district Court rejected that plea.
 6. On 16th December 1992 the Central government set up a commission named Liberhan Commission, to investigation.
 7. In 1990, BJP leader Lal Krishna Advani began a rath yatra to Ayodhya in order to generate public support, the main purpose of the rath yatra was to erect ram mandir in the place of Babri Masjid.
 8. This yatra begun from Somnath, it resulted communal riots in many cities as a result L K Advani was arrested by the Government of Bihar when the yatra passed through the Bihar.
 9. On 6th December, 1992 Vishwa Hindu Parishad and its association BJP organized a rally involving 150,000 VHP and BJP kar sevak at the site of mosque. They began with speeches of L.K. Advani, Murli Monohar Joshi and Uma Bharati. During the speech communal riots arose in various cities like Mumbai, Delhi, Hyderabad, and Bhopal etc. and almost 2000 people died in these riots.
 10. December 6, 1992 – Babri Masjid is demolished.
 11. 1992 – LIBERHAN COMMISSION is formed
 12. In September 30, 2010 a Bench of Allahabad High court consisting Justice S.U Khan, Justice Sudhir Agarwal and Justice D.V Sharma had ruled that the disputed land of Ayodhyaa should be divided into three parts. Two third to Hindu plaintiffs and one third to the Muslim Sunni Wakf Board.
 13. 2011 – Supreme Court suspends the high court decision.
 14. 2017 – Supreme Court calls for “out of setlement” ( An agreement reached between the parties in a pending)
 15. November 2019 – Supreme Court decides that a temple will be built at the disputed Ayodhya sie. An alternate site was given to the sunni Waqf Board
 16. February 2020 – The Uttar Pradesh Central Waqf Board accepts Five acres of land allotted to it by the state govy. for building a mosque.
 17. AUGUST 5, 2020 – BHOOMI PUJA AT THE RAM TEMPLE SITE IN AYODHYA

Despite delays due to the pandemic as well as clashes with China, the temple is ready to be consecrated on Wednesday.

This brings us to Times Square and the efforts of Indian American and Hindu American groups to displaying images of Rama and the temple on the day of its opening. Opponents of the billboards have sent letters to New York City Mayor as well as to other elected officials to request that this not take place.

And ,

Image

The approximate cost of the construction of Ram Mandir in Ayodhya

 • Ram Temple in Ayodhya will be 161 feet tall.
 • Temple will have five domed mandap and one shikhar
 • Number of pillars 360
 • Total number of floors will be 3
 • Width of the stairs will be 16 feet.
 • Nagar style Temple has been designed by keeping in mind Shilpa Shastra specifications.
 • 4 more smaller Temples will surround the main structure.
 • 2 lakh brick with Shri Ram inscribed to form the foundation of the Temple
 • Stones from Banshi mountains in Rajasthan will be used
 • Construction will take 3.5 years

Estimated cost of construction is Rs 300 crore.

మూడున్నరేళ్ల తర్వాత అయోధ్యలో రామ మందిరం ఇలా ఉండబోతుంది.. 

మూడున్నరేళ్లు పడుతుంది..

ఆర్కిటెక్ట్ ప్రాజెక్టు ప్రకారం ప్రకారం ఆలయ నిర్మాణం పూర్తికావడానికి మూడున్నర సంవత్సరాలు పడుతుంది. ఈ మందిరం మూడో అంతస్తులతో ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మితమవనుంది. రామ్ లల్లా గర్భగుడి ఎక్కడైతే నిర్మిస్తారో దాని పైభాగంలో మాత్రమే ఆలయ ప్రధాన గోపురం ఉండనుంది. రామాలయం ఎత్తు 33 అడుగులు పెరగనుంది. ఈ కారణంగా మరో అంతస్తును పెంచాల్సి ఉంది. రామాలయం పాత నమూనా ప్రకారం 268 అడుగుల 5 అంగళాల ఎత్తు ఉంది. అయితే తాజాగా 280 నుంచి 300 అడుగుల వరకు ఆలయం ఎత్తు పెరిగే అవకాశముంది.

​ఆలయంలో 5 గోపురాలు ఉంటాయి..

రామ్ లల్లా గర్భగుడి ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆలయ ప్రధాన గోపురం నిర్మిస్తారు. ఇది కాకుండా ఈ మందిరంలో ఐదు గోపురాలు ఉంటాయి. పాత నమునాలో కేవలం రెండు గోపురాలు మాత్రమే ఉన్నాయి. కానీ కొత్త నమునాలో ఆలయ వైభవాన్ని పెంచేందుకు 5 గోపురాలు నిర్మించనున్నారు. రామ మందిరం దిగువ భాగంలో ఈ ఐదు గోపురాలు నెలకొననున్నాయి. ఇందులో సింహ ద్వారం, నృత్య మండపం, రంగ మండపాలను నిర్మిస్తారు. భక్తులు వివిధ పూజా కార్యక్రమాలు చేసేందుకు గాను తగినంత స్థలం ఉంటుంది.

​ఆలయం గోపురం 161 అడుగులు..

ఆలయం ప్రధాన గోపురం ఎత్తు 161 అడుగులకు పెంచారు. దీంతో గోపురాల సంఖ్య మూడు నుంచి ఐదుకి పెరిగాయి. ఆలయానికి చెందిన భూమి పరిమాణం కూడా పెంచారు. రామ మందిరం ఐదు గోపురాల దిగువన నాలుగు భాగాలు ఉంటాయి. సింహ ద్వారం, నృత్య మండపం, రంగ మండపాలను నిర్మిస్తారు. భక్తులు వివిధ పూజా కార్యక్రమాలు చేసేందుకు గాను తగినంత స్థలం ఉంటుంది. ఆలయ గోపురం ఎత్తు 161 అడుగుల ఎత్తు ఉంటుంది.

​20 నుంచి 25 అడగుల లోతు పునాది..

మట్టి పరీక్ష నివేదిక ఆధారంగా ఆలయానికి పునాదిని తవ్వుతారు. ఈ పునాది 20 నుంచి 25 అడుగుల లోతు ఉంటుంది. వేదిక ఎంత ఎత్తులో ఉండాలనేది రామ మందిరం ట్రస్టు నిర్ణయిస్తుంది. ప్రస్తుతం 12 నుంచి 14 అడుగుల ఎత్తు వరకు ఉండాలని చర్చిస్తున్నారు. రామ మందిరం కొత్త నమునా ప్రకారం మొత్తం ఆలయంలో 318 స్తంభాలు ఉంటాయి. ఆలయ ప్రతి అంతస్తులో 106 స్తంభాలు నిర్మించనున్నారు.

Image
Image
Image
Image
This image has an empty alt attribute; its file name is main-qimg-35eeeddb0ccd51e63858cc78d345fc8f

ఖజురహో దేవాలయాల సముదాయం

khajaraho temple

ఖజురహో మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తర్ పూర్ జిల్లాలోని ఒక గ్రామం. ఢిల్లీకు 620 కి.మీ. దూరంలో గల ప్రాంతం. ఇక్కడి నిర్మాణ సమూహాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడ్డాయి.

ఈ దేవాలయాలు, హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు సంస్కృతం భాషనుండి మూలంగా వచ్చినది. సంస్కృతంలో ఖజూర్ అనగా ఖర్జూరము. 10 నుండి 12వ శతాబ్ద కాలం వరకు భారత దేశము లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చండేలా అనే హిందూ రాజపుత్ర వంశస్థుల రాజధానిగా వర్థిల్లినది. ఈ దేవాలయాల సమూహాలు 950 నుండి1050 మధ్య సుమారు నూరు సంవత్సరాల మధ్య కాలంలో నిర్మింపబడినవి. తరువాత కాలంలోచందేల రాజధాని మహోబా కు మార్చబడినది. అయినా మరి కొంత కాలం పాటు ఖజురాహో వెలుగొందినది.

దీని చుట్టూ 8 ద్వారాలతో కూడిన కుడ్యం ఉన్నది. ప్రతి ద్వారము రెండు బంగారు కొబ్బరి కాండముల మధ్య ఉన్నది. సుమారు 8 చదరపు మైళ్ళ అంటే 21 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం లో 80 కి పైగా హిందూ దేవాలయాలు పరుచుకొని ఉన్నాయి. కాని ప్రస్తుతం 22 మాత్రమే చెప్పుకోదగినంత వరకు పునరుద్ధరించబడినాయి.
ఉత్తర భారతం లో ఇతర సాంస్కృతిక స్థానాల వలె ఖజురాహో దేవాలయాలు క్రీ.శ.1100-1400 ల మధ్య ముస్లిం చొరబాటు దారుల చేత నేలమట్టం కాలేదు. చాలా కాలపు నిర్లక్ష్యం తరువాత 19 వ శతాబ్దం లో బ్రిటీష్ వారు వీటిలో కొన్నింటిని కనిపెట్టారు. తవ్వకాలు మొదలు పెట్టారు
ఇక్కడి శిల్పాలు ప్రపంచ ప్రసిద్ది చెందాయి. ఇవి వాత్సాయన కామసూత్ర గ్రంధములోని వివిధ భంగిమలలో చెక్కబడ్డాయి

How to go : Khajuraho group of monuments are located in the Indian state of Madhya Pradesh, in Chhatarpur District, about 620 kilometres (385 mi) southeast of New Delh. Some train routes from Hyderabad
Hyderabad to Jhansi-Khajuraho
Hyderabad to Datia – Khajuraho
Hyderabad to Bargarh – Khajuraho
Hyderabad to Gwalior – Khajaraho
Hyderabad to Morena -Khajuraho
Hyderabad to Manikpur – Khajuraho
By Air: Khajuraho Airport, located at a nearby distance of around 5 km from the heart of the city, is the nearest airport to the place. Following are some of the major airlines operating from that airport:
Air India: These flights connect the area to the cities like Delhi, Mumbai and Varanasi.
Jet Airways: Offers flights to Delhi and Varanasi.
Kingfisher: They have flights to the city of Varanasi.
By Rail: Khajuraho Railway Station that has got direct trains from Agra, Jhansi, New Delhi
Varanasi is the nearest railway station in the place. However, rail tickets can not be purchased from that station. To buy a train ticket, one needs to visit the main bus terminal of Khajuraho, which is just about 1 km from the town, or book it online.
By Road: Khajuraho is linked with the neighboring areas through regular bus services. These areas include Agra, Allahabad, Bhopal, Chhatarpur, Gwalior, Harpalpur, Indore, Jabalpur, Jhansi, Mahoba, Panna, Sagar, Satna and Varanasi.

వైష్ణవ దేవి ఆలయం

vaishno devi temple

వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉన్నది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని, వైష్ణవి అని కూడా పిలుస్తారు. ఈ అమ్మ వారి ఆలయం ఉత్తర భారతాన జమ్ము జిల్లాలోని కాట్ర లో వున్నది. ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్ముకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో వున్నది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణి లో ఉన్నది. జమ్ము నుండి 50 కిలో మీటర్ల దూరంలో వున్న కాట్రా ప్రాంతానికి హెలి కాప్టర్ల లో వెళ్లవచ్చు. ఇతర వాహనాలు వుంటాయి. అక్కడి నుండి కాలి నడకన, గుర్రాలమీద, పల్లకిల్లో ఎలాగైన వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో వున్నది. ఈ దారి చాల కష్టతరమైనది. తిరుపతి కొండ ఎక్కేవారు గోవిందా గోవింద అని అరుస్తున్నట్లె ఇక్కడ కూడ కొండ ఎక్కేవారు జై మాతాదీ అంటు అరుస్తుంటారు. ఇంకా చాల దూరం వుందనగానే మాతాదీ ఆలయం కనిపిస్తూనే వుంటుంది. ఈ ఆలయం వున్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు. భక్తులను గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబరిస్తారు. దాని ప్రకారం భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తారు. ఆలయంలోపలికి సెల్ ఫోన్లు, కెమరాలు, అలాగే తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు. కనుక వాటిని కలిగి వున్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్రపరుచు కోవచ్చు. వైష్ణో దేవి మూడు రూపాల్లొ దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహా లక్ష్మి, సరస్వతి. ఆలయానికి వెళ్లే దారిలో ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడ వున్నాయి.


How to go : Vaishno Devi Mandir is in Jammu and Kashmir, near Katra town. 65 km to Jammu. From Katra – 15 km. Horses and pallakis are available for rent. Very difficult route. To reach this temple by trekking about 12 km from Katra (Base Camp)
Official website : https://www.maavaishnodevi.org

కేదార్నాథ్ దేవాలయం

kedaranath temple

కేదార్ నాద్ ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3,584 మీ. ల ఎత్తున కల ఈ ప్రదేశం హిమాలయాల ఒడి లో హిందువులకు ఒక ప్రసిద్ధ, పవిత్ర యాత్రా స్థలంగా కూడా పేరు గాంచినది. వేసవి కాలంలో అనేక మంది హిందూ యాత్రికులు కేదార్ నాద్ సందర్శించి శివ భగవానుడి ఆశీస్సులు పొందుతారు.. ఇక్కడ కల కేదార్ నాద్ టెంపుల్ సుమారు వేయి సంవత్సరాల కిందట నిర్మించిన ఒక రాతి నిర్మాణం. పర్వత శ్రేణి మధ్య ఉన్న కేదార్నాథ్ దేవాలయం, హిందూ మతం పరమ శివుని యొక్క జ్యోతిర్లింగా ను ప్రతిష్టించారు. దీనికి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు ఉంది. కేదార్నాథ్ జ్యోతిర్లింగా మొత్తం12 జ్యోతిర్లింగాలలో అత్యున్నతమైనది.ఆది శంకరాచార్య 8 వ శతాబ్దం AD లో ఈ ఆలయంను స్థాపించారు నికి దగ్గరలోనే మందాకిని నది ప్రవహిస్తుంది. ఈ ఆలయ చరిత్ర ప్రకారం ఈ ఆలయం పాండవులచే నిర్మించబడింది. ఒక పాత ఆలయం ప్రక్కనే ఉంది. ఒక అసెంబ్లీ హాల్ లోపలి గోడల మీద వివిధ హిందూ మతం దేవుళ్ళ మరియు దేవతల యొక్క చిత్రాలను చూడవచ్చు. పౌరాణిక కథలు ప్రకారం శివ మౌంట్ అయిన నంది దూడ విగ్రహాన్ని ఒక గార్డ్ గా ఆలయం వెలుపల ఉంచబడుతుంది. 1000 సంవత్సరాల నాటి ఈ దేవాలయమునకు ఒక దీర్ఘచతురస్రాకార వేదిక మీద ఒకే విధంగా కత్తిరించిన భారీ రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు. భక్తులు లార్డ్ ను పూజించటానికి ఆలయంలో ఒక ‘గర్భగుడి’ ఉంది. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఒక మండపంను చూడవచ్చు. జానపద కధ ప్రకారం, కురుక్షేత్ర పోరాటం ముగిసిన తర్వాత పాండవులు తమ పాపాలకు పశ్చాత్తాపంగా ఈ దేవాలయానికి వచ్చారు.

How to go : Kedaranath is a panchayat in the Rudraprayaga dist,Uttarakhand state, Himalayan range of Garhwal area and near to Mandakini River – The unstable temple is not directly accessible by road and has to be reached by a 14 kilometres (8.7 mi) uphill trek from Gaurikund.
01. Delhi – Haridwar – Gowrikud – Kedaranath (from Delhi to Haridwar bus and train facilities available)
01. Travel agecies are available at Haridwar to go to Kedaranath
02. own travel: go to Rushikesh. from Rushikesh to Gowrikund RTC bus facilities available
From gowrikund horses and dolies are avilable.
Precautions : 01. ATMs are not working properly in this area. 02. minus 5 degrees – 10 degrees wheather
Temple will be remained open from April (Akshaya thrutiya) to November (Depavali) for visitors

బద్రీనాథ్

badrinath temple

బద్రీనాథ్ హిందువుల ఒక పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లా లో ఉన్న పంచాయితీ. చార్ ధామ్(నాలుగు పట్టణాలు) లలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. బద్రీనాథ్ గర్హ్వాల్ కొండలలో అలకనందానదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నర నారాయణ కొండల వరసలమధ్య నీలఖంఠ (6,560 మీటర్లు) శిఖరానికి దిగువభాగంలో ఉంది. బద్రీనాథ్ ఋషికేశ్‌కు ఉత్తరంలో 301 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్‌‌కు సమీపంలో ఉన్న గౌరీ కుండ్‌కు 233 కిలోమీటర్ల దూరంలో ఉంది.

బద్రీనాథ్ లో ప్రత్యేక ఆకర్షణ బద్రీనాధ్‌గుడి. పురాణ కథనం అనుసరించి ఆదిశంకరాచార్యులు అలకనందా నదీ తీరంలో లభించిన సాలిగ్రామ శిల్పంను తప్త కుండ్ వేడినీటి చలమ సమీపంలో ప్రతిష్టించి అక్కడ ఒక గుడి నిర్మించాడు. 16వ శతాబ్ధంలో గర్హ్వాలా రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్థుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడి నిర్మించాడు.

బద్రీనాథ్ గుడిలో అనేకమార్లు కొండచరియలు విరిగి పడిన కారణంగా నిర్మాణ పునరుద్దరణ కార్యక్రమాలు నిర్వహించారు. 17వ శతాబ్ధంలో గర్హ్వాలా రాజుచేత ఈ గుడి విస్తరించబడింది. 1803లో హిమాలయాలలో సంభవించిన భూకంపంలో ఆలయం శిధిలం కావడంతో జయపూర్ రాజుచే ఈ ఆలయం పునర్నిర్మించబడింది.

బద్రీ అంటే రేగుపండు నాధ్ అంటే దేవుడు ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండటం వలన ఇక్కడ వెలసిన దేవునికి బద్రీనాధుడు అనే పేరు వచ్చింది. లక్ష్మీదేవి విష్ణుమూర్తి దీర్ఘ శీతాకాల శోషణ(అలసట)తీర్చడానికి రేగుచెట్టు రూపం దాల్చినట్లు పురాణాలు చెప్తున్నాయి.

బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో చేర్చి 50 అడుగులు. ముఖ ద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మించారు. ఆలయం పై కప్పు బంగారు రేకులతో తాపడం చేయబడింది. ఆలయం ముందరి భాగంలో ఉన్న విశాలమైన మెట్లు ఆర్చిలా నిర్మించిన ప్రధాన ద్వారానికి తీసుకు వెళతాయి. ఆలయ నిర్మాణశైలి బుద్దవిహార నిర్మాణశైలిని పోలి ఉంటుంది. వర్ణమయంగా అలంకరించిన ముఖద్వారం బుద్ధ ఆలయాలను గుర్తుకు తెస్తుంది. మండపాన్ని దాటి కొంత లోపలభాగానికి వెళ్ళామంటే రాతి స్తంభాలతో నిర్మించిన మధ్య భాగం గర్భ ఆలయానికి తీసుకు వెళుతుంది. ఆలయం లోపలి స్తంభాలు, గోడలు అందంగా చెక్కిన శిల్పాలతో శోభాయమానంగా ఉంటాయి.

అతి శీతల వాతావరణం కారణంగా వేసవిలో మాత్రమే గుడిలో భక్తుల ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. బద్రీనాథ్, హేమకుండ్ కు వెళ్ళే భక్తులతో ఈ మార్గం వేసవిలో జనసమ్మర్ధం అధికమై రద్దీగా ఉంటుంది. బద్రీనాధుని దర్శించడానికి అనువైన కాలం జూన్ సెప్టెంబర్‌ల మధ్యకాలం. స్వెట్టర్లు మొదలైన చలిని తట్టుకొనే దుస్తుల అవసరం సంవత్సరమంతా ఉంటుంది. బద్రీనాథ్ మరియు పరిసర పల్లెలను బస్సు మార్గంలో చేరవచ్చు. ఆదిశంకరాచార్యుడు ఉత్తరభారతంలో స్థాపించిన జ్యోతిమఠం బద్రీనాథ్‌కు సమీపంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో ఉన్న ఇతర పుక్ష్యక్షేత్రాలు హరిద్వార్ మరియు కేదార్‌నాధ్.

Pandaripuram Temple, Maharashtra, Panduranga Swamay

ప్రసిద్ధి చెందిన ఈ వైష్ణవ పుణ్యక్షేత్రం మహారాష్ట్రలో షోలాపూర్‌లో భీమా నది ఒడ్డున ఉన్నది. ఈ దేవాలయానికి ఆరు ద్వారాలు ఉన్నాయి.తూర్పున ఉన్న ఆరవ ద్వారాన్ని నామ్‌దేవ్‌ ద్వారంగా పిలుస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవి సమేతం పాండురంగ విఠలుడుగా వెలసి ఉన్నాడు. మహారాష్ట్ర వారు ఈ పుణ్యక్షేత్రాన్ని దక్షిణకాశిగా పిలుస్తారు. స్వామిని విఠోబా, పండరీనాథ్‌, పాండురంగ, విఠల్‌నాధ్‌ అని కూడా పిలుస్తారు. కుల, మత భేధం లేకుండా ప్రతివారు ఆలయ ప్రవేశం తరువాత స్వామివారి పాదాలను కూడా తాకవచ్చు.

పాండురంగస్వామి భక్తులు : తుకారం, ధ్యానేశ్వర్‌, నామ్‌దేవ్‌, పురంధరదాస్‌, విజయదాస్‌, గోపాదాస్‌ జగన్నాధదాస్‌ వీరంతా ప్రసిద్ధిచెందిన పాండురంగస్వామి భక్తులు. వీరంతా13 నుండి 17వ శతాబ్ధాల మధ్య కాలానికి చెందినవారు.

ఉత్సవాలు : ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశికి జరిగే ఉత్సవం ప్రసిద్ధి చెందినది. ఈ ఉత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. భీమా నదీ ప్రాంతమంతా కోలాహంగా ఉంటుంది. కార్తీక మాసం(కార్తీక ఏకాదశి), మాఘమాసం, శ్రావణమాసాలలో కూడా స్వామివారికి ప్రత్యేకంగా ఉత్సవాలు జరుగుతాయి.

దర్శన వేళలు : దేవాలయాన్ని ఉదయం 04-00 గంటకు తెరుస్తారు. ఉదయం గం॥04-30 నుండి రాత్రి గం॥11-00 వరకు దర్శనం చేసుకోవచ్చు.

వసతి సౌకర్యాలు : పండరీపురంలో పాండురంగ భక్తనివాస్‌ (భక్తనివాస్‌ ఫోన్‌ నెం : 23312 / 24466) మరియు అనేక మఠాల వారి థర్మశాలలు, మఠాలు తక్కువ ధరలో ఉన్నవి. ఇవికాక ప్రైవేట్‌వారి లాడ్జీలో ఉండవచ్చు. జులై నుండి ఫిబ్రవరి వరకు పర్వటనకు అనుకూలం. ఎండాకాలంలో చాలా వేడిగా ఉంటుంది. 42 డిగ్రీల సెల్సియస్‌ దాకా వేడి ఉంటుంది

ఎలా వెళ్ళాలి :
దగ్గరలో ఉన్న విమానాశ్రయము : పూనా (204 కి.మీ.)
రైల్వే స్టేషన్‌ : షోలాపూర్‌ (పండరీపురానికి 74 కి.మీ. దూరం) లేక కురువాడి – మీరజ్‌ దారిలో ఉన్న పండరీపురంలో దిగవచ్చు.
Trains…From Secunderabad Jn to Solapur
11020-Konark Express 11:45 AM….. 06:45 PM….. 7h All Days
12026-Pune Shatabdi 02:55 PM…….. 07:37 PM……… 4h 42mjourney time…… Except Tue-All days
17204- Cct Bvc Express 03:00 PM…….. 09:15 PM…….. 6h 15mjourney time….. Thu
17018)- Rajkot Express 03:00 PM…….. 09:15 PM…….. 6h 15mjourney time…… Mon, Tue & Sat
From Hyderabad Decan
12702- Hussainsagar Ex 02:45 PM……… 08:50 PM….. 6h 5m……. journey time…… All Days

అరుణాచలం

అరుణాచలం గొప్ప శైవపుణ్య క్షేత్రం. స్మరించినంత మాత్రమే ముక్తిని ప్రసాదించే దివ్వక్షేత్రమంటారు. తమిళంలో తిరువణ్ణామలై అని పేరు. అరుణాచలం వేదాలలో మరియు పురాణాలలో కూడా ప్రస్తావించిన క్షేత్రం. సాక్షాత్తు శివాజ్ఞచే విశ్వకర్మ అరుణాచలంను నిర్మించాడంటారు. ఇక్కడ పూజా విధానం మరియు అరుణాచల స్తోత్రం శివుడే గౌతమ ముని ద్వారా నిర్ధేశించాడని అరుణాచల మహాత్యంలో వివరించబడినది. ఈ కొండకు తూర్పున గల అరుణాచల క్షేత్రం కంటే ఈ కొండకే ప్రాముఖ్యం ఎక్కువ. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్యక్షేత్రం అరుణాచలం.

అరుణాచలం జ్యోతిర్లింగమని చెప్పబడుచున్నది. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు. అగ్ని అంటే జ్వాల. మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడి శివుడు అగ్నిరూపంలో దర్శనమివ్వడు. కేవలం రాతి లింగంగానే ఉంటాడు. అరుణాచలం పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది. అది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అంటారు ఇక్కడే అనేక పవిత్ర తీర్ధాలు ఉన్నవి. బ్రహ్మతీర్ధం, వ్యాసతీర్ధం, శివగంగతీర్ధం మొదలగునవి. ఒక్కొక్క తీర్ధంలో స్నానమాచరిసే ఒక్కోక్క రకమైన ఫలితం దక్కుతుందంటారు. పంచభూత లింగాలో ఒకటైన అగ్నిలింగమే ఈ అరుణాచలేశ్వరుడు.

చోళరాజు 910 శతాబ్ధాల మధ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ క్షేత్రానికి నాలుగు వైపుల నాలుగు రాజగోపురాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుంటాయి. అన్నిటి కంటే ఎత్తైనది తూర్పు గోపురం. ఈ గోపురం ఎత్తు 217 అడుగులు. ఈ ఆలయం 25 ఎకరాలలో విస్తరించి ఉన్నది. శ్రీకృష్ణదేవరాయలచే నిర్మింపబడిన వేయి స్తంభాల మండపం, కోనేరు సందర్శకులను ఆకట్టుకుంటాయి. అరుణగిరిపై స్కంధాశ్రమం, విరుపాక్ష గుహ ఉన్నాయి. అక్కడే రమణ మహర్షి ఎన్నో రోజుల పాటు ధ్యానముద్రలో ఉండేవారట.

స్థలపురాణం
పూర్వం బ్రహ్మ, మహా విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురు కలహించుకొన్నారట. సృష్టికర్త అయిన బ్రహ్మ.. స్థితికారుడైన విష్ణువు శివమాయకు వశం కావడం ఈ కలహానికి కారణమైంది. శివ మాయా మోహితులైన వీరిని మాయా మేఘం కమ్మేసింది. దీంతో ఇరువురి మధ్య అహంకారం ప్రజ్వరిల్లి కలహానికి దారితీసిందట.

‘నేను సృష్టికర్తను. నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది’ అని బ్రహ్మ.. ‘నేను స్థితికారుడను. అన్నీ సవ్యంగా సాగడానికి కారణం నేనే కనుక నేనే గొప్ప’ అని విష్ణువు అనడం ఇద్దరి మధ్య ఎడతెగని చర్చకు, వాదోపవాదానికి దారితీసిందట. ఏ మాయవల్ల వారు కలహానికి దిగారో అది తెలియాలని ఇరువురి మధ్య పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా వెలిశాడట. అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరినీ ఈ జ్యోతిస్తంభం ఆది, అంతములు తెలుసుకొని రమ్మన్నాడట.

వరాహమూర్తియై శ్రీమహావిష్ణువు జ్యోతిర్లింగం ఆదిని తెలుసుకోవడానికి భూమిని తవ్వుకొంటూ పాతాళలోకం దాటి వెళ్లిపోగా, పైన ఉన్న కొనభాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ.. వూర్థ్వముఖానికి వెళ్లారట. అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు వారు ప్రయాణం చేశారట. బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయారట. ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలిపువ్వును పట్టుకుని అడిగారట.. ‘నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు?’ అని. అప్పుడు మొగలిపువ్వు ‘నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నా’ అని సమాధానమిచ్చిందట. ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేతకీపుష్పాన్ని బ్రహ్మ అడగగా, అందుకు అది సమాధానమిస్తూ ‘నేను ఇలా పడటం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయింది’ అని చెప్పిందట.

ఆద్యంత రహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలిపువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడట. శివలింగం పై భాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకీపుష్పం అంగీకరించిందట. అప్పుడే అక్కడకు వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడట. దీంతో ఆ రెండింటినీ తీసుకుని పరమశివుడి వద్దకు చేరాడట బ్రహ్మ. అప్పటికే మాయమేఘం వీడిపోయిన శ్రీమహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకొన్నాడట. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని అందుకు మొగలిపువ్వు, కామధేనువులే సాక్షి అని చెప్పాడట బ్రహ్మ. మొగలిపువ్వు అవును అని సమాధానమివ్వగా, కామధేనువు తలతో ఔనని, తోకతో కాదు అని సమాధానమిచ్చిందట. అందుకు ఆగ్రహించిన శివుడు ‘నువ్వు భూలోకంలో పూజాదికాలు లేకుండా ఉండుగాక’ అని బ్రహ్మను శపించాడట. అసత్యాన్ని పలికిన మొగలిపువ్వును పూజకు పనికి రావనీ, సగం నిజం, సగం అబద్ధం చెప్పిన ఆవు ముఖానికి పూజలేకుండా కేవలం పృష్టానికి మాత్రమే పూజలందుకుంటావనీ శపించాడట. ఆనాడు అలా వెలసిన అగ్నిస్తంభాన్ని బ్రహ్మ ప్రార్థన చేశాడట. ‘మా అహంకారం పోయింది.

అసలు పరబ్రహ్మ స్వరూపమేదో, ఆద్యంతములు లేనిదేదో తెలిసింది. ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసిన మీరు భూ లోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగమన్న పేరుతో భక్తులను అనుగ్రహించాలి’ అని ప్రార్థన చేశారు. ఆ కారణంతోనే పరమశివుడు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలశాడన్నది పురాణగాథ.

గిరి ప్రదక్షణ అరుణాచలం జ్యోతిర్లింగ స్వరూపం కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గిరి ప్రదక్షణకు చాలా వరకు తారురోడ్డు ఉంది. ప్రక్కనే ఫుట్‌పాత్‌ కూడా ఉంది. ఉదయం ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేకువ జామున గానీ, రాత్రి గానీ గిరి ప్రదక్షణ చేస్తారు. గిరి ప్రదక్షణాన్ని శ్రీ రమణమహర్షి ఆశ్రమంనుండి ప్రారంభించి దక్షిణామూర్తి దేవాలయంలో ముగిస్తారు. మధ్యలో పాళెతీర్ధం, గళశగుడి, అగస్త్యతీర్ధం, ద్రౌపదీ గుడి, స్కంధాలయం, యమలింగం, సిద్ధాశ్రమం, శోణ తీర్ధం, నైరుతీ లింగం, హనుమాన్‌ గుడి, ఉణ్ణావలై అమ్మగుడి, ఉణ్ణామలై తీర్ధం, రామలింగేశ్వరాయం, రాఘవేంద్రమఠం, ప్రతిధ్వని మంటపం, గోశాల, రాజరాజేశ్వరీ ఆలయం, గౌతమ ముని ఆశ్రమం, పూర్యలింగం, వరుణలింగం, ఆది అణ్ణామలై ఆలయం, రేణుకా మాత ఆలయం, వాయిలింగం, అక్షరమండపం, ఈశాన్యలింగం, ప్రవాళపర్వతం, అరుణాచలేశ్వరాలయం, ఇంద్రలింగం, గురుమూర్తం, మామిడితోట, అగ్నిలింగం, శేషాద్రిస్వామి ఆశ్రమంను దర్శించచవచ్చు. గిరి ప్రదక్షణ మొత్తం దూరం 14 కి.మీ.

కార్తీక పౌర్ణమినాడు ఇక్కడ భారీ వేడుక జరుగుతుంది. మూడు టన్నుల ఆవునెయ్యితో కొండమీద పెద్ద జ్యోతిని వెలిగిస్తారు. దక్షిణభారతంలో వెసిన పంచలింగాలలో అరుణాచలం అగ్నిక్షేత్రంగా ప్రసిద్ధి చెందినది.

పంచభూత లింగాలు
అరుణాచం – అన్నామలైశ్యరుడు – అగ్నిలింగం
జంబుకేశ్వరం – జంబుకేశ్వరుడు – జలలింగం
ఏకాంబరేశ్వరుడు – కంచి – పృద్వీలింగం
శ్రీకాళహస్తి – శ్రీకాళహస్తీశ్వరుడు – వాయిలింగం
అరుణాచల దేవాలయ విశిష్టతలు ఈ దేవాలయానికి నాలుగు ప్రక్కలా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టు నాలుగు రాజగోపురాలున్నాయి. పాతాళ లింగం, పెద్దనంది, వేయి స్థంబాల మండపం కలవు.

కిలిగోపురం (చిలక గోపురం) అరుణగిరినాధర్‌కు సంబంధించినది ఇది. గోపురంపై చిలకను చూడవచ్చు. అరుణగిరి నాధుడు చిలకరూపంలో ఇక్కడ ఉండిపోయాడంటారు. దీనిని భళ్ళాల మహారాజు కట్టించాడంటారు.
తమిళనాడులోని దేవాలయాలన్నీ మధ్యాహ్నం గం.12-30 మూసివేస్తారు. తిరిగి సాయంత్రం గం.4-00గంటలకు తెరచి 8-30 లేక 9-00 గం.కు మూసివేస్తారు.
గిరి ప్రదక్షణ చేయు భక్తులకు సూచనలు 14 కి.మీ. గిరి ప్రదక్షణ చెప్పులు లేకుండా చేయాలి. గిరి ప్రదక్షణ చేయు సమయంలో బరువైన సామాన్లు, సంచులు లేకుండా వెళితే ప్రయాణం సునాయాసంగా ఉంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షణ కష్టంగా ఉంటుంది. ఎండ మరియు ట్రాఫిక్‌ సమస్యలు ఉంటాయి.
గిరి ప్రదక్షణ ఉదయం 9 గంటలలోపు గాని రాత్రి పూటగాని, తెల్లవారు జామున గాని చేయటం మంచిది. పౌర్ణమి రోజున ఎక్కువ మంది గిరి ప్రదక్షణ చేస్తారు. కనుక కొత్తవారు ఆరోజున గిరి ప్రదక్షణ చేయటం మంచిది. గిరి ప్రదక్షణ చేసేటప్పుడు చిల్లర తీసుకుపోవటం మర్చిపోవద్దు.

రమణమహర్షి ఆశ్రమం అరుణాచలేశ్వర దేవాలయానికి 2 కి.మీ దూరంలో రమణమహర్షి ఆశ్రమంను చూడవచ్చు. విదేశీయులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు.ఆశ్రమానికి సాయంత్రం వేళలో వెళితే ప్రార్థనలో పాల్గొని రమణల వారి సమాధి చూడవచ్చు. ఆశ్రమంలో కోతులు, నెమళ్ళు ఎక్కువగా ఉంటాయి.
ప్రయాణసదుపాయాలు చెన్నై నుండి అరుణాచల క్షేత్రం (తిరువణ్ణామలై) 189 కి.మీ దూరంలో ఉంది. చెన్నై సెంట్రల్‌ నుండి రైలు లేక బస్సులలో వెళ్లవచ్చు.

అరుణాచలంలో వసతి సౌకర్యాలు….
శివసన్నిధి
తెలుగు వారిచే నిర్వహించబడుచున్న…శివసన్నిధి అరుణాచలం గుడికి కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్నది. ఆటోలకు రూ.50- తీసుకుంటారు. రూమ్ లకు అద్దె తీసుకోరు. కానీ తప్పనిసరిగా కొంత డోనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. డోనేషన్ బట్టి గదులు కేటాయిస్తారు. గది కేటాయించబడితే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఉచితంగా పెడతారు. డోనేషన్ మన ఇష్టం వచ్చినంత ఇవ్వవచ్చు. శివసన్నిధికి ఫోన్ చేసి గదులు రిజర్య్ చేసుకోవచ్చు. లేక డైరెక్ట్ గా వెళ్ళవచ్చు.
ఫోన్ నెం: 04175-235089. సెల్ : 9789378779.
శేషాద్రి ఆశ్రమం
అరుణాచలం గుడికి కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ నార్మల్ డీలక్స్, ఏ.సి.(రూ.800) గదులు కలవు. ఫోన్ చేసి గదులు బుక్ చేసుకోవచ్చు.
ఫోన్ నెంబర్లు 04175-236999, 238599.
రమణాశ్రమం
ఈ ఆశ్రమం కూడా అరుణాచలం గుడికి రెండుకిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ ఆశ్రమంలో గదులు అప్పటికప్పుడు దొరకవు. కనీసం 15 నుండి 20 రోజుల ముందుగా బుక్ చేసుకోవలసి ఉంటుంది. ashramam@sriramanamaharshi.org ఈ మెయిల్ కు ముందుగా గదుల రిజర్వేషన్ కొరకు వివరాలు పంపవలసి ఉంటుంది. గదులు దొరికితే గది అద్దె, భోజనం ఉచితం.
ఈ ఆశ్రమంలోనే రమణ మహర్షి సమాధి ప్రాంగణం ఉంది. ఆశ్రమం చాలా ప్రశాంతంగా, మనోహరంగా ఉంటుంది. గుడి చుట్టుప్రక్కల హోటల్స్ ఉన్నాయి కానీ చాలా ఖరీదు.

Dwadasa Jyothirlingalu

Somanath, Gujarat…సోమనాథ్ – సోమనాథుడు – గుజరాత్

Srisail Mallikarjunudu…శ్రీశైలం మల్లికార్జునుడు- కర్నూలు

Ujjain Maha Kaleswaswarudu…ఉజ్జయని – మహాకాళేశ్వరుడు – ఉజ్జయని<

Omakr, Omkareswarudu….ఓంకార్ – ఓంకారేశ్వరుడు – మధ్యప్రదేశ్

vidyanath, Vaidyanathudu… వైద్యనాధ్ – వైద్యనాథుడు – మహారాష్ట్ర

Bhimasankar, Bhimasankar…భీమశంకర్ – భీమశంకరుడు – మహారాష్ట్ర

Rameswaram….రామేశ్వర్ – రామేశ్వరం – తమిళనాడు

Nageswar…నాగేశ్వర్ – నాగేశ్వరుడు – గుజరాత్

Kasi Visweswarudu….కాశీ – విశ్వేశ్వరుడు – వారణాశి

Nasik Trayambakeswarudu…నాసిక్ – త్రయంబకేశ్వరుడు – మహారాష్ట్ర

Kedareswar….కేదారనాథ్ – కేదారేశ్వరుడు-ఉత్తరాంచల్

Grushneswar…ఘృశ్నేశ్వర్ – ఘృశ్నేశ్వరుడు – మహారాష్ట్ర

Sri Ghusmeswara Lingam…. ఘుశ్మేశ్వరము లింగము

sri ghusmeswar temple

ఘుశ్మేశ్వరము లింగము ఒకప్పుడు దేవగిరి అను ఊరునందు సుదర్ముడనే బ్రాహ్మాణుడు ఉండేవాడు. అతని భార్య సుదేహ. వీరికి సంతానము లేదు. ఒకనాడు వారి ఇంటికి ఒక యతి వచ్చాడు. ఆ యతీంద్రునికి అతిధి సత్కారము చేసి భిక్ష స్వీకరించమని కోరగా సంతానహీనుల ఇంట భిక్ష స్వీకరించరాదనే నియమం ఉందని తెలిపి వెళ్ళిపోయాడు.

భార్యా భర్తలు మిక్కిలి దుఖించి …సుధర్ముని భార్య సుదేహ స్వామీ మన వంశము అంతరించకుండా మీరు నా చెల్లెలు ఘుశ్మను వివాహమాడవలసిందని కోరటంతో వారి విహాహం జరుగుతుంది. ఘుశ్మ మహప్రతివత. భర్తనే ప్రత్యక్ష దైవంగా సేవించే ఆమె మనస్సున శివుని క్షణక్షణము స్మరించేది. ఆమె గర్భవతియై ఒక బాలునికి జన్మనిస్తుంది. బాలుడు శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతుంటాడు.

ఆ బాలుని గాంచి తనకి సంతానము కలగలేదేనే బాధ సుదేహకు అధికమై అది ఆ బాలునిపై ద్వేషముగా మారింది. ఒకనాటి రాత్రి అందరూ నిదురించుచుండగా సుదేహ ఆ బాలుని భుజాన వేసుకొని ఊరి బయటకు వెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికి చెరువులో పారేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చి నిద్రపోయింది.

మర్నాడు యధాప్రకారం ఘుశ్మ నీటికై చెరువుకు వెళ్ళి, చెరువులో దిగి బిందె ముంచి నీళ్ళు తీసుకుంటున్న సమయంలో ఆ బాలుడు ఆమె కాళ్ళు పట్టుకుని అమ్మా అమ్మా అంటూ చెరువులో నుంచి బయటకు వస్తాడు. ఆమె కుమారుని ముద్దాడి ఇంట్టో ఉండవలసిన కుమారుడు ఈ చెరువులోనికి ఎలా వచ్చాడని సంశయించింది. ఆ బాలుడు ‘‘అమ్మా నాకు ఒక కల వచ్చింది. కలలో నేను మరణించి మరల బ్రతికినట్లు కనిపించింది’’ అని చెబుతాడు. ఆమె ఆశ్ఛర్యపోవుచుండగా శివుడు ప్రత్యక్షమై సాధ్వీ..నీ కుమారుడు చెప్పినదంతయూ నిజమే…సుదేహ ద్వేషముచేత నీ కుమారుని చంపి ఈ తటాకమున పారవేసినది. నీవు మహాసాధ్వివి నా భక్తురాలివైనందున నేను నీ కుమారునికి పునర్జన్మనిచ్చాను’’ అని పలికి నీ సోదరిని శిక్షించెదనని పలుకుతాడు. సుదేహ శివుని పాదములపై పడి స్వామి దుర్గుణముల చేత ప్రేరణ పొంది ఇట్టి అకృత్యములు జరుగుతాయి. మా అక్కగారిని క్షమించి మంచి బుద్ధిని ప్రసాదించమని వేడుకొనగా శివుడు సంసించి ఘశ్మా.. నీ ప్రవర్తనకు సంతసించి నేను ఇచ్చటనే జ్యోతిర్లింగ రూపమున ఘుశ్మేశ్వరునిగా వెలుస్తానని వరమిచ్చి జ్యోతిర్లింగంగా అవతరిస్తాడు. ఈ ఘుశ్మేశ్వరుని ఆరాధించువారికి పుత్రశోకము కలగదు.

ఎలా వెళ్ళాలి ? ఘుశ్మేశ్వరము మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు దగ్గరలో వేలూరు గ్రామమునందు కలదు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుండి వేలూరు గ్రామం 29 కి.మీ. దూరంలో ఉంటుంది. ఎల్లోరా గుహలు 1 కిలోమీటరు దూరంలో కలవు.
వసతి : ఇక్కడ వసతి సౌకర్యములు తక్కువ కాబట్టి ఔరంగాబాద్ పట్టణంలో బసచేయటం మంచిది.

Kedarnath Temple…కేదార్ నాద్

Kedarnath Temple కేదార్నాథ్ దేవాలయం, కేదార్నాథ్ కేదార్ నాద్ ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3,584 మీ. ల ఎత్తున కల ఈ ప్రదేశం హిమాలయాల ఒడి లో హిందువులకు ఒక ప్రసిద్ధ, పవిత్ర యాత్రా స్థలంగా కూడా పేరు గాంచినది. వేసవి కాలంలో అనేక మంది హిందూ యాత్రికులు కేదార్ నాద్ సందర్శించి శివ భగవానుడి ఆశీస్సులు పొందుతారు.. ఇక్కడ కల కేదార్ నాద్ టెంపుల్ సుమారు వేయి సంవత్సరాల కిందట నిర్మించిన ఒక రాతి నిర్మాణం.

పర్వత శ్రేణి మధ్య ఉన్న కేదార్నాథ్ దేవాలయం, హిందూ మతం పరమ శివుని యొక్క జ్యోతిర్లింగా ను ప్రతిష్టించారు. దీనికి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు ఉంది. కేదార్నాథ్ జ్యోతిర్లింగా మొత్తం12 జ్యోతిర్లింగాలలో అత్యున్నతమైనది.

ఆది శంకరాచార్య 8 వ శతాబ్దం AD లో ఈ ఆలయంను స్థాపించారు నికి దగ్గరలోనే మందాకిని నది ప్రవహిస్తుంది. ఈ ఆలయ చరిత్ర ప్రకారం ఈ ఆలయం పాండవులచే నిర్మించబడింది. ఒక పాత ఆలయం ప్రక్కనే ఉంది. ఒక అసెంబ్లీ హాల్ లోపలి గోడల మీద వివిధ హిందూ మతం దేవుళ్ళ మరియు దేవతల యొక్క చిత్రాలను చూడవచ్చు.

పౌరాణిక కథలు ప్రకారం శివ మౌంట్ అయిన నంది దూడ విగ్రహాన్ని ఒక గార్డ్ గా ఆలయం వెలుపల ఉంచబడుతుంది. 1000 సంవత్సరాల నాటి ఈ దేవాలయమునకు ఒక దీర్ఘచతురస్రాకార వేదిక మీద ఒకే విధంగా కత్తిరించిన భారీ రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు. భక్తులు లార్డ్ ను పూజించటానికి ఆలయంలో ఒక ‘గర్భగుడి’ ఉంది. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఒక మండపంను చూడవచ్చు. జానపద కధ ప్రకారం, కురుక్షేత్ర పోరాటం ముగిసిన తర్వాత పాండవులు తమ పాపాలకు పశ్చాత్తాపంగా ఈ దేవాలయానికి వచ్చారు.

How to go : Kedaranath is a panchayat in the Rudraprayaga dist,Uttarakhand state, Himalayan range of Garhwal area and near to Mandakini River – The unstable temple is not directly accessible by road and has to be reached by a 14 kilometres (8.7 mi) uphill trek from Gaurikund.
01. Delhi – Haridwar – Gowrikud – Kedaranath (from Delhi to Haridwar bus and train facilities available)
01. Travel agecies are available at Haridwar to go to Kedaranath
02. own travel: go to Rushikesh. from Rushikesh to Gowrikund RTC bus facilities available
From gowrikund horses and dolies are avilable.
Precautions : 01. ATMs are not working properly in this area. 02. minus 5 degrees – 10 degrees wheather
Temple will be remained open from April (Akshaya thrutiya) to November (Depavali) for visitors

Trayambakeswaram Jyothirlingam

Trayambakeswaram….త్రయంబకేశ్వరం : వనవాస కాలంలో శ్రీరామచంద్రుని మోహించిన రావణాసురుని చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులను లక్ష్మణుడు కోస్తాడు. ఈ ప్రాంతాన్నే నాశిక్ అంటారు. ఇక్కడకు దగ్గరలోనే బ్రహ్మగిరి అనే పర్వతం ఉంది. ఈ పర్వతం దగ్గర సప్తర్షులో ఒకరైన మహాముని గౌతముడు తన భార్య అహ్యలతో నివసించేవాడు. ఒకసారి ఈ ప్రాంతంలో కరువు వచ్చి మునులందరూ నీరు లభించక అనేక ఇబ్బందులు పాలయ్యారు. గౌతముడు తన తపశ్శక్తితో దేవతల అనుగ్రహంతో నీటి సౌకర్యాన్ని కల్పించి పంటలు పండిస్తాడు.

తోటి మునులు అసూయతో ఒక మాయాగోవును సృష్టించి గౌతముని పోలంలోనికి వదలుతారు. గౌతముడు పంటను పాడుచేస్తున్న ఆవును ఆదిలించటానికి ఒక దర్భను (గడ్డిపోచ) విసురుతాడు. దానితో ఆ మాయాగోవు మరణిస్తుంది. గౌతముడు గోహత్యా నివారణకై శివుని కొరకు ఘోర తపస్సు చేస్తాడు. గౌతముని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శివభగవానుని ప్రార్థించి గోహత్య నివారణకై శివుని జటాజూటంలో ఉన్న గంగను భూమిపైకి వదలమని ప్రార్థిస్తాడు.శివుని జటాజూటం నుండి బ్రహ్మగిరిపై పడిన గంగ రెండు పాయలుగా విడిపోతుంది. మొదటి పాయ గౌతముని పేరుమీదుగా గౌతమి గాను ఇంకొక పాయ గోదావరి గాను ప్రసిద్ధి చెందినది. గౌతముని కోరిక మేరకు శివభగవానుడు ఈ ప్రాంతంలో త్రయంబకేశ్వరుడే అనే పేరుతో వెలిశాడు.

ఎలావెళ్లాలి : త్రయంబకేశ్వరం మహారాష్ట్రలోని నాశిక్‌లో ఉన్నది. హైదరాబాద్‌ నుండి రైలు మార్గంలో వెళ్ళవచ్చు. హైదరాబాద్‌ నుండి సుమారు 700 కి.మీ. దూరంలో ఉన్నది. షిర్డి సాయిదగ్గరకు వెళ్ళిన వారు అక్కడ నుండి 117 కి.మీ. దూరంలో ఉన్న త్రయంబకేశ్వరం వెళ్ళవచ్చు.

Sri Kasi Visweswara Lingam..కాశీ విశ్వేశ్వర లింగము

కాశీ విశ్వేశ్వర లింగము సృష్టిని నిర్మించతలచి పరమేశ్వరుడు శివశక్తి స్వరూపము దాల్చినాడు. ఆ అర్థనారీశ్వరరూపము నుండి పురుషుడగు నారాయణుడు, ప్రకృతి అవతరించారు. వారికి తామెవరో ఎక్కడ నుండి వచ్చారో తెలియలేదు.

అప్పుడు అశరీరవాణి అఖిలాండ కోటి బ్రహ్మాండములను సృష్టించుటకు మీరు సృజించబడ్డారు. ఆ శక్తిని పొందుటకు, పరబ్రహ్మము గూర్చి తపస్సు చేయండి అని అని వినిపించింది. అయితే ఎటుచూసినా జలమే తప్ప నివశించుటకు స్థలమే కానరానందున ఎక్కడ తపస్సు చేయాలో వారికి తెలియలేదు.

అప్పుడు పరబ్రహ్మ తేజము నుండి ఐదు క్రోసుల విస్తారము గల ఒక పట్టణము ఉద్భవించినది. అదేకాశీ పట్టణం. నారాయణుడు కాశీ పట్ఠణము నందు ఘోర తపస్సు చేయగా ఆ తపోవేడిమికి అతడి శరీరమున చెమటలు పట్టగా ఆ నీరు కాలువలై ప్రపవహించినది నారాయణుడా జలములను ఆశ్ఛర్యముతో తిలకించగా అతడి చెవికమ్మ జారి జలమునందు పడిపోయినది. ప్రదేశమే మణికర్ణకగా విరాజిల్లుతోంది. ఆ జలరాశి యందు మునిగిన కాశీ పట్టణమును శివుడు తన శూలాగ్రము నందు ధరించి రక్షించినాడు.

ఆ తరువాత నారాయణుడి నాభినుండి బ్రహ్మ అవతరించాడు. అతడు పదునాలుగు భువనములను, దేవ, మానవ, దానవ జాతులను పశుపక్ష్యాదులను సృష్టించాడు. బ్రహ్మండమును రెండు భాగములుగా ఛేదించి పై భాగాన ఏడు లోకాలను క్రింది భాగాన ఏడు లోకాలను సృష్టిస్తాడు.

అప్పుడు విష్ణు, బ్రహ్మాది దేవతలు మహర్షులు పరమేశ్వరుని స్మరించి ప్రార్థిస్తారు. వారి భక్తికి శివుడు సంతసించి వరము కోరుకొమ్మన్నాడు. అప్పుడు వారు దేవా నీవిచటనే శాశ్వతముగా అవతరించి సృష్టిని చల్లగా కాపాడమని ప్రార్థిస్తారు. అంతట శివుడు విశ్వేశ్వరుడనే పేరిట కాశీ పట్ఠణము నందు జ్యోతిర్లింగ రూపుడై వెలిశాడు.

కాశీపట్టణము వరుణ, అసి అను రెండు నదుల మధ్య నుండుట చేత ‘‘వారణాసి’’గా పేరు పొందినది. ఇచ్చట బ్రహ్మ, విష్ణు అనేక మంది దేవతలు యజ్గ్నాలు చేసారు. ఇక్కడ ఆదిశక్తి అన్నపూర్ణగా వెలసినది. కాలభైరవుడు ఈ క్షేత్ర పాలకుడు, గణపతులు, నవదుర్గలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాధిత్యులు, నవగ్రహములు ఇచట కొలువై ఉన్నారు.

ఎలా వెళ్ళాలి ? ఉత్తరప్రదేశ్ నందు గల కాశీకి ఆంధ్రప్రదేశ్ లోని అని ముఖ్యపట్టణముల నుండి విమాన మరియు రైలు సౌకర్యం కలదు.

Nageswar Jyothirlingam

Nageswaralayam, Gujarat…నాగేశ్వరాలయం (నాగేశ్వర్‌) – గుజరాత్‌
ఈ పవిత్ర నాగేశ్వరాలయానికి సంవత్సరం పొడుగు భక్తులు వస్తారు. ఈ స్వామిని దర్శించుకుంటే అన్నిరకాల విషప్రయోగాల నుండి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం.

స్థలపురాణం : శివపురాణం ప్రకారం ఇక్కడ దారుకా వనంలో దారుకుడనే రాక్షసుడు తన భార్య దారుకితో నివసిస్తాడు. శివభక్తుడైన సుప్రియడు మరియు అనేక మందిని చెరసాలలో బంధిస్తాడు. సుప్రియుని ప్రేరణతో అందురూ ఓంనమఃశ్శివాయ మంత్రాన్ని జపిస్తారు. కోపోద్రేకుడైన దారుకుడు వారిని సంహరించబోగా శివభగవానుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై పాశాపతాస్త్రంతో దారుకుని సంహరిస్తాడు.

ఎలా వెళ్ళాలి : ఈ పవిత్ర నాగేశ్వరాలయం గుజరాత్‌ రాష్ట్రంలో గోమటి ద్వారక మరియు బేయిట్‌ ద్వారకా దీవి మార్గంలో కలదు. బెట్‌ద్వారకా, జామ్‌నగర్‌, అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌ నుండి రోడ్డుమార్గాలలో వెళ్ళవచ్చు. దగ్గరలోని రైల్వే స్టేషన్‌ లు జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌, ద్వారక, పోర్‌బందర్‌ అహ్మదాబాద్‌.

Rameswaram Jyothirlingam

Rameswaram…రామేశ్వరం … రామేశ్వరం తమిళనాడులోని రామేశ్వరం అనే దీవిలో ఉన్నది. సముద్రం మీదుగా నిర్మించిన పంబన్‌ అనే వంతెన మీదగా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఆలయం పొడవైన వసారా(నడవా) తో అలంకారంతో చూడచక్కగా నిర్మించబడింది. ఇక్కడ 36 తీర్థాలు కూడా కలవు.

స్థలపురాణాం : శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించి లంకపై విజయం సాధించిన తరువాత తిరుగు ప్రయాణంలో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించదలచి హనుమంతుని కాశీనుండి శివలింగాన్ని తేవలసిందిగా కోరతాడు. హనుమంతుని రాక ఆలస్యమైనందున శ్రీరాముడు సీతాదేవిచే చేయబడిన ఇసుక లింగాన్ని ఇక్కడ ప్రతిష్టాడు. తరువాత హనుమంతునిచే తేబడిన శివలింగం (విశ్వనాధ శివలింగంగా పేరుపొందినది) కూడా ఇక్కడ ప్రతిష్టించబడుతుంది.

రామేశ్వరం 15 ఎకరాలలో చూడముచ్చటైన గోపురాలతో చుట్టూ ఆలయ ప్రాకారాలతో నిర్మించబడినది. ఎత్తైన వేదిక మీద నాలుగు వేల స్థంభాల మీద నిర్మించ బడిన వసారా ప్రపంచంలో అతి పొడవైన వసారాగా పేరుపొందినది. తూర్పున ఉన్న రాజగోపురం 126 అడుగుల ఎత్తున తొమ్మిది అంతస్థులతో నిర్మించబడినది. ఇక్కడ తొమ్మిది అడుగుల ఎత్తు 12 అడుగుల పొడవైన నందీశ్వరుని దర్శించవచ్చు.

Bhimasankar Jyothirlingam

భీమశంకరాలయం మహారాష్ట్రలోని పూనాకు దగ్గరగా భావగిరి గ్రామంలో ఖేడ్‌కు సుమారు 50 కి.మీ దూరంలో సహ్యాది పర్వతాలలో భీమా నది ఒడ్డున కలదు. భీమానది ఇక్కడ నుండి ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది. మహారాష్ట్రలోని గృష్ణేశ్వర్‌ మరియు త్రయంబకేశ్వరం అనే జ్యోతిర్లింగాలు కూడా కలవు.

స్థలపురాణం : రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుని కొడుకు భీముడు తన తల్లి కర్కాటితో ఇక్కడ అరణ్యాలలో నివసిస్తుంటాడు. రావణాసురుని మరియు తన తండ్రి కుంభకర్ణుని చంపిన మహావిష్ణువు మీద పగతో బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి అపారమైన శక్తులు పొందుతాడు. వరగర్వంతో ఇంద్రుని జయిస్తాడు. మూడులోకాలను పీడించసాగాడు. మరియు శివభక్తుడైన గృష్ణేశ్వర్‌ ను పాతాళచెరలో బంధిస్తాడు. దేవతలంతా బ్రహ్మతో కలసి భీముడి ఆగడాలను గురించి శివునితో మొరపెట్టుకుంటారు.


భీముడు శివునికి బదులుగా తనని ప్రార్థించవసినదిగా కమృపేశ్వర్‌ను ఆజ్ఞపించగా అతను తిరస్కరిస్తాడు. అపుడు కోపోద్రేకుడైన భీముడు తన ఖడ్గంతో శివలింగాన్ని ఖండించబోగా శివభగవానుడు ప్రత్యక్షమై భీమునితో యుద్దంచేసి సంహరిస్తాడు. దేవతల కోరిక మేరకు భీమశంకరునిగా వెలుస్తాడు.

వైద్యనాధేశ్యరుడు

sri vaidanath temple

వైద్యనాధేశ్యరుడు
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే,, సదా వసంతం గిరిజాసమేతమ్,
నురాసురారాధిత పాదపద్మం, శ్రీవైద్యనాథం తమహం నమామి
లంకాధిపతి అయిన రావణుడు మహఆశిభక్తుడు. అతడు కోరినపుడలు కైలాసమునకు వెళ్ళి శివదర్శన భాగ్యము పొందేటంతటి గొప్పవాడు. ఒకసారి శివుని ఆత్మలింగం పొందగోరి ఘోరతపస్సచేసి శివుని దర్శనం పొందిన తరువాత శివుని ఆత్మలింగాన్ని కోరతాడు. . శివుడు తన ఆత్మలింగాన్ని ఇస్తూ దీనిని నీ లంకారాజ్యంలో ప్రతిష్టించు కానీ మార్గమధ్యమున ఈ ఆత్మలింగాన్ని నేలపై ఉంచరాదు. అలా ఉంచిన ఆత్మలింగం అక్కడే ప్రతిష్టమవుతుంది. దానిని కదిలించడం నావల్ల కూడా కాదు. అని హెచ్చరించాడు.

రావణుడు సంతోషంతో ఆత్మలింగాన్ని దోసిట్లో ఉంచుకొని లంకకు బయలు దేరతాడు. దారిలో అఘుశంక తీర్చుకోవలసిన అవసరం వచ్చింది. రావణనికి సమీపంలో గోవులను మేపుకుంటున్న ఒక బాలకుడు కన్పిస్తాడు.

రావణుడు ఆ బాలుని పిలచి కొంతసేపు ఆత్మలింగాన్ని పట్టుకోవాల్సిందిగా కోరతాడు. ఆ బాలుడు ముమ్మారు పిలుస్తాను. రాకపోతే శివలింగాన్ని కింద పెడతాను అంటాడు. రావణుడు ఆత్మలింగాన్ని బాలకునికి అప్పగించి లఘుశంక తీర్చుకోవటానికి వెళతాడు. కాని ఆ బాలకుడు వెంటనే మూడు సార్లు రావణుని పిలచి వెంటనే ఆ శివలింగాన్ని భూమిపై ఉంచుతాడు.

రావణుడు ఆ లింగాన్ని లేపటానికి ప్రయత్నించగా ఆ శివలింగం పాతాళం దాకా పెరిగి కూరుకుపోతుంది. రావణుడు ఇది శివుని చర్యగా భావించి వెనుతిరిగి లంకకు వెళతాడు. రావణాసురుడికి ఆత్మలింగం లభించటం ఇష్టం లేక దేవతల కోరిక మేరకు వినాయకుడే గొల్లవాని రూపం ధరించి రావణునికి ఆత్మలింగం దక్కకుండా చేస్తాడు. దేవతలు, వినాయకుడు కోరిక మేరక శివుడు వైద్యనాధేశ్వరుడు గా జ్వోతిర్లింగంగా వెలుస్తాడు.

జార్ఘండ్ లోని ధియోగర్ లోని జ్యోతిర్లింగాన్ని కూడా వైద్యనాథ్ జ్వోతిర్లింగంగా కొందరు భావిస్తారు.
ఎలా వెళ్లాలి ? వైద్యనాధేశ్యర దేవాలయం మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథ్ పట్టణంలో ఉన్నది. పర్లి హైదరాబాద్ – మన్మాడ్ రైల్వే లైన్లోని పారబ్బాని రైల్వే స్టేషన్ కు దగ్గరలో కలదు.
వసతి సౌకర్యాలు ఇక్కడ బసచేయుటకు ధర్మశాలలు, వసతి గృహాలు, హోటళ్లు కలవు

Omkareswara Lingam…. ఓంకారేశ్వరుడు

omkareswaram

ఓంకారేశ్వరుడు నారదుడు ఒకసారి భూలోక సంచారం చేస్తూ వింధ్య పర్వతాలకు వస్తాడు. వింధ్యపర్వతుడు నారద మహర్షికి గౌరవ మర్యాదలతో అతిధి సత్కారాలు చేస్తాడు. తదుపరి ఇరువురి ప్రసంగంలో వింధ్య పర్వతుడు నా యందు సమస్త సంపదలు సకల ధాతువులు మిక్కిలిగా ఉన్నాయి. కాబట్టి నేనే పర్వతాలన్నిటి సార్వభౌముడని అన్నాడు.

అందులకు నారదుడు వింధ్యా నీ ఎలా పర్వత సార్వభౌముడవు కాగలవు. మేరు పర్వత శిఖరాలు మహోన్నతాలై దేవలోకము వరకు వ్యాపించి ఉన్నాయి. ఇంద్రాది దేవతలు ఆ పర్వతంపై విహరిస్తుంటారు. నీకా భాగ్యం లేదు కదా. అని అన్నాడు. వింధ్యుడు విచారించి మేరు పర్వతం కన్నా తానే గొప్పవాడనిపించుకోవటానికి నిశ్ఛయించుకొన్నాడు.

వింధ్యుడు తన శిఖరమున ఓంకార యంత్రమును నిర్మించి దాని మధ్య పార్థివ లింగమును స్థాపించి శివుని కొరకై ఘోర తపమాచరించాడు. ఇట్లు నూరు మాసములు కఠోర తపస్సు సాగిన తరువాత శివుడు అనుగ్రహించి దర్శనమిచ్చి వరం కోరుకొమ్మన్నాడు.

వింధ్యుడు వినయంతో నమస్కరించి శంకరా…మేరు పర్వతములపై విహరించు ఇంద్రాదులకు నీ పవిత్ర పాద పద్మమలు నిత్య పూజనీయములు అట్టి నీవు నా శిఖము నందు నివసించి పూజలందుకొనుమని ప్రార్థించాడు.

వింధ్యాద్రి ప్రార్థనను మన్నించి కైలాసనాథుడు ఓంకార యంత్రమును మరియు అందులో స్థాపించిన పార్థివ లింగమును ఒకటిగా చేసి ఓంకారేశ్వరుడు అను పేర జ్యోతిర్లింగ రూపుడై వెలిసాడు. ఆనాటి నుండి కైలాసనాథుని బ్రహ్మాది దేవతలు సేవిస్తున్నందు వలన వింధ్యుడు ఆనందిస్తాడు.

ఎలా వెళ్ళాలి ? దగ్గరలోని విమానాశ్రయం ఇండోర్. సమీప రైల్వే స్టేషన్ ఓంకారేశ్వర్ రోడ్. (ఖాండ్వా మీటర్ గేజ్ రైలు మార్గములో ఉన్నది.) ఓంకారేశ్వర్ రోడ్ నుండి 9 కి.మీ. దూరంలో ఓంకారేశ్వరం వున్నది. ఓంకారేశ్వర్ రోడ్ నుండి ఆటోలలో.

Mahakaleswar Jyothirlingam

Makaleswar, Ujjain…మహాకాళేశ్వర్‌ ఉజ్జయని …. మహాకాళేశ్వరాయం ఉత్తరభారత దేశంలోని జ్యోతిర్లింగాలో ముఖ్యమైనది.

స్థలచరిత్ర : పురాణ ప్రకారం ఉజ్జయనీ రాజైన చంద్రహాసుని శివభక్తికి ఆకర్షితుడైన 5 సంవత్సరాల బాలుడు శ్రీకరుడు ఒక రాయిని తీసుకొని అదే శివలింగంగా భావించి రోజూ పూజించసాగాడు. అక్కడి ప్రజలు అతనిని అనేక రకాలుగా నిరుత్సాహపరచారు. వారి ప్రయత్నాలన్నీ విఫలంకాగా శ్రీకరుని భక్తికి మెచ్చి శివభగవానుడు జ్యోతిర్లింగ రూపంలో అక్కడ వెలిశాడు.

ఇంకొక కథóనం ప్రకారం దుశాన అనే రాక్షసుడు అవంతీ నగరప్రజలను పీడించుచుండగా శివభగవానుడు ఆ రాక్షసుని సంహరించి ప్రజల కోరిక మేరకు అక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడంటారు.
మహాకాళుని ఆలయం విశాలమైన ప్రాంగణంలో చుట్టూ గోడలతో 5 విభాలుగా ఉన్నది. భూగర్భంలో ఉన్న మహాకాళుని గర్భగుడిలోనికి ఇత్తడి దీపాల వెలుగులో వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడి శివలింగం పెద్దదిగాను మరియు వెండితో చేయబడిన సర్పం చుట్టుకొని ఉంటుంది. శివలింగానికి ఒకవైపున గణేశుని ప్రతిమ, ఇంకోప్రక్క కుమారస్వామి మరియు పార్వతీ దేవి ప్రతిమలు చూడవచ్చు.
మహాకాళుని మందిరం (ఉజ్జయని) ఏడు పవిత్రక్షేత్రాలో ఒకటిగా భావిస్తారు. మిగతా ఆరు క్షేత్రాలు అయోధ్య, మథుర, హరిద్వార్‌, బెనారస్‌ (కాశీ) కాంచీపురం మరియు ద్వారక.

క్షిప్రా నదీతీరంలో జరిగే కుంభమేళాకు భక్తులు వచ్చి మహాకాళుని ఆశీర్వాదం పొందుతారు. సహ్వాద్రి పర్వతాలలో ఉన్న ఈ ఆలయం చూట్టూ కోటలతో, అరణ్యాలతో కనువిందుచేస్తుంది. ఈ ఆలయ శిఖరాన్ని నానాపాండవీస్‌చే నిర్మించబడినది. మరాఠా యోధుడైన చత్రపతి శివాజీ మహాకాళుని దర్శించుకున్నాడు. శివరాత్రికి ఇక్కడ మహావైభవంగా ఉత్సవం జరుగుతుంది. ఎలావెళ్ళాలి : మహాకాళేశ్వరాయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయనిలో క్షిప్రా నదీతీరంలో కలదు.

శ్రీశైల మల్లికార్జునుడు

srisailam

ద్వాదశ జ్యోతిర్లింగములలో శ్రీశైలం రెండవది. ఈ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలో దట్టమైన నల్లమల అడవులలో ఉంది.

స్థలపురాణం : పార్వతి పరమేశ్వరుల కుమారులు గణేశుడు, స్కందుడు రుద్రగణాధిపత్యంకై జరిగిన పోటీలో వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షణం చేసి గెలిచి గణాధిపత్యం దక్కించుకుంటాడు. స్కందుడు అలిగి కైలాసం వదలిపెట్టి శ్రీశైలం వచ్చి క్రౌంచపర్యతం మీద తన కాళ్ళకు మంత్రబద్ధంగా బంధనములు ఏర్పాటు చేసుకొని ఆసీనుడు అవుతాడు.

కుమారుని అలక తీర్చి కైలాసమునకు తీసుకురమ్మని శివపార్వతులు నారదుని పంపుతారు. నారదుడు వచ్చి ఎంత నచ్చ చెప్పినా స్కందుడు వినేలేదు. పార్వతీ దేవి పుత్రవాత్సల్యము చేత శ్రీశైలమునకు వచ్చి కుమారునకు నచ్చచెప్పినా వినలేదు. అప్పుడు పార్వతీ దేవి శ్రీశైలంలోని స్థిరనివాసం ఏర్పరుచుకొంటొంది. శివుడు కూడా ఆమెను అనుసరించి శ్రీశైలంలో జ్వోతిర్లింగ స్వరూపుడై వెలుస్తాడు.

నారదుడు, బ్రహ్మాది దేవతలు అచ్చటికి వచ్చి శివపార్వతులు, స్కందుని పూజిస్తారు. ఆ తరువాత వినాయకుడు కూడా శ్రీశైలానికి వచ్చి సాక్షిగణపతి పేరున వెలుస్తాడు.

కాలాంతరంలో శ్రీశైల ప్రాంతమును పరిపాలిస్తున్న చంద్రగుప్తుని దంపతులకు ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె పసికందుగా ఉండగానే చంద్రగుప్తుడు యుద్ధానికి వెళతుడు. కాని యుద్ధం 16 సంవత్సరముల పాటు జరుగుతుంది. యుద్ధంలో విజయం సాధించిన తరువాత చంద్రగుప్తుడు తిరిగా తన రాజ్యనికి వస్తాడు. అప్పటికి అతని కుమార్తె 16 సం.ప్రాయంలో ఉంటుంది. చంద్రగుప్తుడు ఆమెను చూసి కామాంధుడై ఆమెను చెరపట్టబోతాడు. మహారాణి ఆమె మన కుమార్తె అని చెప్పినా మోహావేశుడై చంద్రగుప్తుడు వినకుండా ఆమెను వెంబడిస్తాడు.

చంద్రగుప్తుని బారినుండి తప్పించుకొనుటకు చంద్రావతి కొండమీద నుండి కృష్ణానది లోనికి దూకుతుంది. కృష్ణనది రెండుగా చీలుతుంది. ఆ దారిలోనుండి ఆమె నడుస్తుండగా చంద్రగుప్తుడు ఆమెను వదలకుండా వెబడిస్తాడు. చంద్రావతి తండ్రిని చూసి కామాంధుడవై వావివరుసలు గానకున్నావు, నీవు బండరాయివై పడివుండమని శపిస్తుంది. చంద్రగుప్తుడు పాతాళ గంగ యందు పచ్చటి బండరాయిగా మారిపోతాడు. అందువలనే పాతాళగంగ నీరు పచ్చగా ఉంటుందంటారు.
చంద్రావతి శ్రీశైలమున జ్యోతిర్లింగముగా వెలసిన శివుని మల్లెపూలతో సేవింపసాగినది. ఒకనాడు శివుడు ఆమె భక్తికి సంతసించి దర్శనమిచ్చి వరం కోరుకొమ్మంటాడు. చంద్రావతి స్వామి ఈ మల్లెమాలను శాశ్వతముగా నీ కంఠసీమనందు అలంకరించుకొనుము మరియు నీ జటజూటమునందు మల్లెమాలను అర్థచంద్రాకారముగా నా స్వహస్తములతో అలంకరించు భాగ్యము ప్రసాదించుమని వేడుకొంటుంది. శివుడు అనుగ్రహించి కుమారీ నేటి నుంచి నేను మల్లికార్జుడను పేరున భక్తులను అనుగ్రహిస్తాను. ఈ మల్లెమాల నా శిరమునందు మూడువందల కోట్ల సంవత్సరము ఉంటుందని వరమిస్తాడు.

నాటి నుండి శ్రీశైలమునందున్న జ్యోతిర్లింగము మల్లికార్జున లింగంగా ప్రసిద్ధి చెందుతుంది. మల్లికార్జునుని ఆగస్త్య మహర్షి, వేదవ్యాసులవారు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణస్వామి ద్వాపరమున పంచపాండవులు ద్రౌపతీ దేవితో సహా అర్చిస్తారు. అప్పటి నుండి శ్రీశైలం భక్తజనానికి ఆరాధ్యమై ప్రకాశిస్తుంది.

ఎలా వెళ్ళాలి ? శ్రీశైలానికి ఆంధ్రప్రదేశ్ లోని అన్నిముఖ్య పట్టణాలనుండి బస్సులలో వెళ్లవచ్చు. హైదరాబాద్ నుండి 232 కి.మీ. దూరంలో మరియు విజయవాడ నుండి గుంటూరు, వినుకొండ, దోర్నాల మీదుగా 260 కి.మీ. దూరంలో ఉంటుంది.

సోమనాథక్షేత్రం – గుజరాత్‌

జ్యోతిర్లింగాలో మొదటిది ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నది. స్కందపురాణంలో ఈ క్షేత్రం గురించి వివరించబడి ఉన్నది. దక్షప్రజాపతి యొక్క పుత్రికలలో 27 మందిని చంద్రుడు పెళ్ళాడుతాడు. వారిలో రోహిణి పట్ల ప్రత్యేక ప్రేమ కనపరుస్తాడు. దీంతో కోపోద్రికుడైన దక్షుడు చంద్రుని శపిస్తాడు. దీంతో చంద్రుడు తన తేజస్సును, కళను కోల్పొతాడు. అప్పుడు చంద్రుడు రోహిణితో సహా ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉన్న స్పర్శలింగన్ని కొలిచి తన తేజస్సును తిరిగి పొందుతాడు.

అప్పటినుండి ఈ క్షేత్రం ప్రభాస తీర్థంగా పేరు పొందినది. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ ఇక్కడ బ్రహ్మశిలను స్థాపిస్తాడు. దేవతల కోరిక మేరకు శివభగవానుడు సోమనాధుడి పేరిట ఇక్కడ నివసిస్తాడు. ఈ పవిత్ర క్షేత్రం మహ్మద్‌ గజని చేత 1025లో నాశనం చేయబడినది. ఇక్కడ ఉన్న అపారసంపద ధనరాశులు గజనీ చేత కొల్లగొట్టబడినవి. తిరిగి ఈ దేవాలయం గుజరాత్‌ పాలకుడైన భీముడు మరియు మాళ్వారాజైన భోజుని చేత పునర్మించబడినది.

కాని మరలా 1300 సం॥లో అల్లావుద్ధీన ఖిల్జీ మొక్క సేనాధిపతైన అలాఫ్‌ఖాన్‌ చేత నాశనం చేయబడినది. తిరిగి చౌడసామ వంశస్థుడైన మహీపాల మహారాజుచే పునర్మించబడినది.
తరువాత వరుసుగా తురుష్కుల మూకచే 1390, 1490, 1530 సంవత్సరాలలో మరియు ఔరంగజేబ్‌చే 1701లో నాశనం చేయబడినది. చివరిగా స్వాతంత్య్రం వచ్చిన తరువాత సర్థార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి వలన పునర్మించబడినది.

లా వెళ్ళాలి : ఈ క్షేత్రం గుజరాత్‌లో ఘతియావాడ్‌ జల్లాలోని ప్రభాస్‌ తీర్థంలో ఉన్నది.

షిరిడీ సాయిబాబా ఆలయం

దేవస్థానం వారి వసతి సౌకర్యాలు

ద్వారావతి భక్తినివాస్‌ : బస్‌స్టాండ్‌ నుండి నడచి వెళ్ళవచ్చు ( ధర్మశా తరువాత రెండు నిమిషాలప్రయాణం) 334 రూములు. సత్రాలు, 6 నుండి 10 మంది సభ్యులకు సరిపోవు రూములు కలవు. 80 ఎ.సి రూములు కలవు. పార్కింగ్‌ స్పేస్‌, 24 గంటలు నీటివసతి, కరెంట్‌ సౌకర్యం కలదు.
సామాన్య భక్తులకు : కామన్‌ బాత్‌ రూమ్స్‌, టాయ్‌లెట్స్‌ : రూ.50 మాత్రమే.
ఎ.సి. సూట్స్‌ : ఒక రోజుకు రూ.700

భక్తినివాస్‌ (కొత్తది)542 రూములు గల విశామైన కాంప్లెక్స్‌ సాయి మందిరానికి దక్షిణము వైపున గల హైవేలో ఉన్నది. షుమారు 1 కిలో మీటరు దూరం. మందిరం కాంప్లెక్స్‌ నుండి న్యూ భక్తినివాస్‌కు 24 గంటలు ఉచిత బస్సులు కలవు. పార్కింగ్‌ సౌకర్యం, 24 గంటలు విద్యుత్‌ మరియు నీటి సౌకర్యం, ఫలహారశాలు కలవు. సోలార్‌ సిస్టమ్‌ ద్వారా వేడినీటి సౌకర్యం.

ధర్మశాల ప్రాంగణం
మందిరాని దక్షిణ పశ్ఛిమ దిశలో మరియు బస్‌స్టాండ్‌నకు పశ్చిమ దిక్కులో కలదు.15 నుండి 80 మంది గల సభ్యులకు విశాలమైన వసతి సదుపాయం సాధారణ రుసుముతో (ఒక్కొక్కరికి రూ.13. రూపాయలు)పార్కింగ్‌ స్పేస్‌, 24 గంటలు నీటి, కరెంట్‌ వసతి. పహారశాల కలదు
సాయి ప్రసాద్‌ భక్తి నివాస్‌ 1 మరియు 2 : ఇక్కడ భక్తుల కోసం165 గదుల మరియు లాకర్ల సౌకర్యం కలదు. (సమాధి) ఆలయ సముదాయానికి ఉత్తరము వైపున కలదు
సాయినివాస్‌ (వి ఐ పి) వసతి గృహం: పాత ప్రసాదాలయం సముదాయంలో లడ్డూ కౌంటర్‌ వెనుక భాగంలో కలదు.

సాయి ఆశ్రమం 1 : భక్తుల కొరకు 1536 రూములు కలవు.పలహారశాల సౌకర్యం కలదు.
సాయిబాబా భజనలు, కీర్తనలు మరియు సాంస్కృతిక కార్య క్రమాల కోసం ఓపెన్‌ ఎయిర్‌ ధియేటర్‌. సాయిబాబా సమాధి మందిరం నుండి దక్షిణ దిశలో నగర్‌-మన్మాడ్‌ జాతీయ రహదారిలో అహ్మద్‌నగర్‌కు వెళ్ళే దారిలో కలదు.

ఇతర ఉచిత వసతి సౌకర్యాలు
శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవీ ఆర్యవైశ్య ట్రస్ట్‌ వారి నిత్యాన్న సత్రం
మతపర భేదం లేకుండా అన్ని వర్గాల వారికి 3 రోజుల పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పించ బడును.(కొద్దిపాటు రుసుము మాత్రమే నిర్వహణ ఖర్చు మాత్రమే) మూడు అంతస్తులలో 320 రూములతో రెండు ఎకరాల వైశాల్యములో కలదు.
అఖిల భారత సిద్ధిక్షేత్ర సాయిభక్త నివాస్‌ ట్రస్ట్‌
సాయి ద్వార్‌ లైన్‌, పింపుల్‌ వాడి రోడ్‌, షిర్డి ఫోన్‌ : : 02423-256178
శ్రీ ఆనందసాయి అన్నపూర్ణ ఛారిటబుల్‌ ట్రస్ట్‌
డోర్‌ నెం.1613, పెంపుల్‌ వాడి రోడ్‌, దత్తా నగర్‌, షిర్డి.
ఫోన్‌ : 08888988822. 08888479756 దేవాలయం నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో కలదు.
స్వామి నిత్యాన్నదానం : మధ్యాహ్నాం 1.00 నుండి 02.30 వరకు రాత్రి 08.00 నుండి 09.00 వరకు
(విరాళాలు ఇవ్వవచ్చు. మీ పేరుమీద అన్నదానం జరుపబడును) వసతి సౌకర్యం కలదు (ఒక్కొరికి రూ.100 మాత్రమే).

ఆలయ ప్రవేశానికి ముందు భక్తులకు సూచనలు

1 సరైన సమాచారం/సహాయం కోసం షిర్డి టెంపుల్‌ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న రిసెప్షన్‌ సెంటర్‌లో సంప్రదించగలరు. తరువాత సమాచార కేంద్రంలో రూముల కోసం సంప్రదించవచ్చు.
2. సమాధి మందిరం సమీపంలో ఉన్న దేవస్థానం బుక్‌షాప్‌లో సాయిబాబా సాహిత్యం అన్ని భాషలో లభించును.
3. పూజా సామాగ్రి అమ్ము వ్యాపారస్తులతోదేవస్థానమునకు ఎటువంటి సంబంధము లేదు. భక్తులే రేట్లు విచారించి కొనుగోలు చేయగలరు.
4. సమాచార కేంద్రం నందు సామానులు భద్రపరచుకొనుటకు నామమాత్రపు రుసుముతో లాకర్లు లభించును.
5. హారతి మరియు పండుగ సమయాలలో రద్దీ ఎక్కువగా ఉండుట వలన భక్తులు తమ నగల పట్ల జాగ్రత్తగా ఉండగలరు.
6. బాబావారి పవిత్ర పాదుకలు సాయిబాబా మందిరంలో మాత్రమే కలవు.
7. దేవస్థానంచే నడుప బడుచున్న ప్రసాదాలయం మరి టీ దుకాణంలో భోజనం మరియు టీ తగ్గింపు రేట్లలో పొందగలరు.
8. డొనేషన్స్‌ ఇవ్వగోరు వారు దేవస్థానం ఆఫీస్‌ నందు మాత్రమే సంప్రదించగరు.
9. దేవాలయ ప్రాంగణములోనికి సెల్‌ ఫోన్స్‌, కెమేరాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు అనుమతించబడవు. ఈ వస్తువులను మరియు చెప్పులను దేవాలయ ప్రాంగణమునకు దక్షిణ వైపున దేవస్థానం వారి చెప్పుల స్టాండ్‌ వద్ద భద్రపరచుకోవచ్చు.
10. ప్రసాదం కౌంటర్లు : భక్తుకుల గమనిక షిర్డి సంస్థానం (కో ఆపరేటివ్‌ సొసైటీ) వారిచే నడుపబడుచున్న కౌంటర్ల నందు మాత్రమే భక్తులు ప్రసాదాలు కొనుగోలు చేయగరు.
కౌంటర్ల వివరాలు :
11. 2 మరియు 3 గేట్ల బయట ప్రక్కన, 5 సమాధుల వెనుక
12.లడ్డూ ప్రసాదం : లడ్డూ ప్రసాదాు 1వ గేటు ఎదురుగా, పాత ప్రసాదాలయం బిల్డింగ్‌లో మాత్రమే అమ్మబడును. ఉదయం 6 గంట నుండి రాత్రి 10 గంటల వరకు అమ్మబడును.ఒక్కొక్క పాకెట్‌ ఖరీదు రూ.10 మాత్రమే. ఒక పాకెట్‌లో 3 లడ్డూలు ఉండును.
13. సాయిబాబా వారి శేష వస్త్రాలు : సాయిబాబా వారికి కప్పబడిన శేష వస్త్రాలు ఇక్కడ అమ్మబడును. మరియు సాయిబాబా వారిని ముద్రించిన బంగారు, వెండి నాణెము అమ్మబడును. ఇది రైల్వే బుకింగ్‌ ఆఫీసు మరియు డొనేషన్లు స్వీకరించు ఆఫీసుకు దగ్గరలో కలదు (2వ గేటుకు దగ్గరలో)
కియోస్క్‌ (టచ్‌ స్క్రీన్స్‌) సౌకర్యం
సాయిసంస్థానం గురించి మరింత సమాచారం కోసంసాయి సంస్థానం వారు రెండు కియోస్క్‌ లను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.భక్తులు వీటి ద్వారా భక్తినివాస్‌ సమాచారం, సంస్థానం వారి పబ్లికేషన్స్‌, బస్‌ మరియు రైళ్ళ సమయలు మొదలగు వాటి గురించి తెలుకోవచ్చును. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఇవి పనిచేయును.
రైల్వే బుకింగ్‌ ఆఫీస్‌ – షిర్డి: సాయిభక్తు సౌకర్వం కోసం రైల్వేవారు షిర్డిలో పారాయణ్‌ హాల్‌ దగ్గర కంప్యూటరైజ్డ్‌ బుకింగ్‌ ఆఫీసును నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుండి దేశంలో అన్ని ప్రాంతాకు టికెట్లు రిజర్వ్‌ చేయుంచుకొనవచ్చు. రిజర్వేషన్‌ స్టేటస్‌ను విచారించుకొనవచ్చును. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రిజర్వేషన్‌ కౌంటర్‌ పనిచేయును.
షిర్డికి దగరలో 5 రైల్వే స్టేషన్స్‌ కలవు
అవి : సాయినగర్‌ 2 కి.మీ దూరం
కోపర్‌గాన్‌ 16 కి.మీ. దూరం
శ్రీరాంపూర్‌ 39 కి.మీ.
నాగర్‌సోల్‌ 55 కి.మీ
మన్మాడ్‌ 60 కి.మీ.
ఈ స్టేషన్‌ ల నుండి షిర్డికి దేవస్థానం వారు బస్సులు నడుపుచున్నారు.

బాబా దర్శనవేళలు మరియు పూజలు

ఉదయం 04-00 – గుడి తెరచు సమయం
ఉదయం 04-15 – భూపాలి
ఉదయం 04-30 – కాకాడ్‌ ఆరతి
ఉదయం 05-00 – భజన
ఉదయం 05-05 – మంగళ స్నానం
ఉదయం 05-35 – ఆరతి – షిరిడి మహే పండరీపూర్‌
ఉదయం 05-40 – భక్తులకు సాయి సమాధి మందిరం దర్శనం మొదలు
ఉదయం 09-00 – అభిషేక పూజ
ఉదయం 07,9,1011 – సత్యన్నారాయణ స్వామి పూజ
ఉదయం 11-30 – ధుని పూజ (అన్నం నెయ్యితో)
మధ్యాహ్నం 12-00 – మధ్యాహ్న ఆరతి
సాయంత్రం 04-00 – పోతి ( భక్తి కార్యక్రమాలు)
రాత్రి 08-30, 1000 – ధూన్‌ ఆరతి భక్తి పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు
రాత్రి 09-00 – చావడి మరియు గురుస్థాన్‌ మూసివేయబడును
రాత్రి 09-30 – బాబా వారికి ద్వారకామాయి నీరు ఇవ్వబడును. బాబా వారికి దోమతెరవేయబడును
రాత్రి 09-45 – ద్వారకామాయి పైభాగం మూసివేయబడును
రాత్రి 10-30 – షెజ్‌ ఆరతి, బాబా వారికి శాలువా చుట్టబడును. బాబా మెడలో రుద్రాక్ష మాల ధారణ, బాబాకి దోమతెర వేసి అందులో గ్లాసుతో మంచినీరు పెట్టబడును
రాత్రి 11-15 – రాత్రి ఆరతి తరువాత మందిరం మూసివేయ బడును.

దేవాయాలనికి ప్రవేశ మార్గాలు

ప్రధాన ప్రవేశ ద్వారం : పింపుల్‌ వాడి రోడ్‌లో వున్న 2వ గేటు ప్రక్క న వున్న ప్రధాన ప్రవేశ ద్వారం దర్శనానికి వెళ్ళుట ఉత్తమం. ఇక్కడ క్వూ కాంప్లెక్స్‌ నుండి శాంతి హాల్‌కు తరువాత భక్తి హాల్‌ ఇక్కడ నుండి ఇంకా 6 ద్వారములు (కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య ద్వారములు)కలవు. మొత్తం తొమ్మిది ద్వారములు (నవ విధ భక్తి ద్వారములు) దాటిన తరువాత బాబావారి సమాధి మందిరానికి ప్రవేశం.
గెట్‌ 1 : ఆలయానికి పశ్ఛిమ దిశలో నగర్‌-మన్మాడ్‌ రోడ్డులో కలదు. ఈ గేటు ద్వారా భక్తులు ఆలయ ప్రాంగణములోనికి మాత్రమే ప్రవేశించగరు. సాయిబాబా వారిని దూరం నుండి కిటికీ ద్వారా ముఖదర్శనం మాత్రమే చూడవచ్చు. సాయిబాబా వారి విభూది తీసుకోవచ్చు. మ్యూజియం మరియు సమాధుల చూడవచ్చు.
లెండీ బాగ్‌ తోట, సాయిబాబావారి బావిని చూడటానికి వీలు పడదు. ఈ గేటు ద్వారా ప్రవేశించిన వారు 4 వ గేటు ద్వారా బయటకు రావచ్చు. పింపుల్‌ వాడి రోడ్‌లో వున్న 2వ గేటు ప్రక్క న వున్న ప్రధాన ప్రవేశ ద్వారం దర్శనానికి వెళ్ళుట ఉత్తమం.
గేట్‌ 3 : తూర్పు వైపున ఉన్న ఈ మార్గం పింపుల్‌ వాడి రోడ్‌ నుండి బయటకు దక్షణముఖ హానుమాన్‌ మందిరం, ద్వారకా మాయి, చావిడి,అబ్దుల్‌ బాబా ఆశ్రమమునకు వెళ్ళును. ఇక్కడ ఎడమ ప్రక్కనుండి సాయిబాబా ముఖదర్శనము మాత్రమే సాధ్యము. కుడి ప్రక్క నుండి నడవలేని వృద్ధులు, వికలాంగుకు మాత్రమే ప్రవేశము. వీరు తోడుగా ఒకరిని తీసుకు వెళ్ళవచ్చు.

సాయిబాబా మందిరంలో చూడ వలసినవి

మ్యూజియం
దీక్షిత్‌ వాడా ప్రక్కన మరియు గురుస్థాన్‌కు ఎదురుగా ఉన్నది. సాయిబాబా వారు వాడిన అనేక వస్తువులు ఇందులో ఉన్నవి. మ్యూజియం రెండు అంతస్తులలో కలదు.
ఉదయం మ్యూజియం 6-00 గంటకు తెరచి రాత్రి 09-00 గంటలకు మూయబడును
గురుస్థాన్‌
సాయిబాబా మందిరం నుండి బయటకు వచ్చు మార్గంలో కలదు. గురుస్థానంలో ఉన్న వేప చెట్టుకు భక్తులు 108 ప్రదక్షణు చేయటం రివాజు. ఇందు కోసం పాత గురుస్థాన్‌ ట్రస్ట్‌ వారిచే ఆధునీకరించబడినది.
టాకియా
గురుస్థాన్‌ ప్రక్కన, దీక్షిత్‌ వాడకు తూర్పు వైపున వేప చెట్టుకు ఎదురుగా ఉన్నది. ఇక్కడ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ ఇటీవల కట్టబడినది. ఇది ఫకీర్లు విశ్రాంతి తీసుకొనే చోటు. మొదటిసారి బాబా వారు షిర్డి వచ్చినపుడు ఇక్కడ కొంత కాలం విశ్రాంతి తీసుకునేవారు.
లెండీ బాగ్‌ (లెండీ తోట)
లెండీ బాగ్‌ చూచుటకు భక్తులు 4 వ నెంబరు గేటునుండి ప్రవేశించవలసి యున్నది. ఇక్కడ దత్త మందిరం, గణపతిని మరియు బాబా వారు ఉపయోగించిన బావిని దర్శించవచ్చు. ఇటీవల లెండీ బాగ్‌లో సంస్థానం వారిచే కృత్రిమ వాటర్‌ఫాల్‌ ఏర్పాటు చేయబడినది.
నందదీప్‌
సాయిభక్తులు నందదీప్‌లో 108 ప్రదక్షిణలు చేయటం రివాజు. నందదీప్‌ చూడగోరు వారు 1వ నెంబరు గేటు లేక 3వ నెంబరు గేటు ద్వారా మాత్రమే ప్రవేశించగరు.
వేపచెట్టు
ఇది నందదీప్‌కు ఎడమ ప్రక్కన ఉన్నది. ఈ చెట్టు బాబాగారిచే స్వయంగా నాటబడినది. బాబా గారి జీవితంలో రోజూ ఈ చెట్టు క్రింద 2 నుండి 3 గంటల పాటు గడిపేవారు.
పీపుల్‌ చెట్టు
నందదీప్‌కు కుడి ప్రక్కన ఉన్నది.ఈ చెట్టు క్రింద కూడా బాబా గారు రోజూ 2 నుండి 3 గంటలు పాటు గడిపేవారు.
బాబావారు వాడిన బావి
కాంపౌండ్‌ వాల్‌కు కుడి ప్రక్కన ఉన్నది. సాయిబాబా చావిడి : సాయిబాబా వారి చావిడి అబ్దుల్‌ బాబా వారి ఆశ్రమమునకు ఎదురుగా ఉన్నది. ఇది రెండు భాగాలుగా విభజింపబడినది. ఎడమ ప్రక్క భాగంలోనికి ఆడవారికి మాత్రమే ప్రవేశం. కుడిప్రక్క భాగంలోకి పురుషులకు మాత్రమే ప్రవేశం. ఇది బాబా వారు రోజూ నిద్రించిన చోటు.
శని సింగనాపూర్‌
సూర్యభగవానుని పుత్రడైన శని దేవుడు ఇక్కడ ప్రసిద్ధి చెందిన దేవుడు. శని సింగనాపూర్‌ గ్రామంలో ఇళ్ళకు తలుపులు ఉండవు. శనిదేవుడే దొంగల బారి రక్షిస్తాడని గ్రామస్థుల నమ్మకం. నగర్‌-మన్మాడ్‌ రోడ్‌కు తూర్పున షుమారు 50 కి.మీ. దూరంలో శని సింగనాపూర్‌ కలదు. షిర్డి సంస్థానం వారి బస్సులు మరియు ప్రైవేటు వాహనములలో వెళ్ళ వచ్చును.

దేవస్థానం వారి ప్రసాదాలయం (భోజనశాల)

భక్తుల సౌకర్యం కోసం షిర్డి సంస్థాన్‌ వారు అత్యాధునిక భోజనశాల ఏర్పాటు చేశారు. నామమాత్రపు ధరతో కేవలం ఒకరికి రూ.10 తో భోజనం లభిస్తుంది. ఒక రోజుకు లక్షమంది భక్తులకు ఏర్పాట్లు గలవు. ప్రతి రోజు 30 నుండి 35 వేల మంది భోజనం చేస్తారు. పండుగలు మరియు సెలవులో 70 నుండి 80 వేల మంది భోజనం చేస్తారు. సంస్థానం వారు సంవత్పరానికి 190 మిలియన్‌ రూపాయలను భోజనం కోసం ఖర్చు పెడతారు. ప్రసాదాలయం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంటుంది. ప్రసాదం ముందు బాబా వారికి సమర్పించిన తరువాత భక్తులకు వడ్డిస్తారు. భక్తు అన్నదానంకు డొనేషన్స్‌ ఇవ్వవచ్చు. భక్తులకు నెలవారీ భోజన టికెట్స్‌ ఇస్తారు.
షిర్డి సంస్థానం వారు పాత ప్రసాదాలయం ఎదురుగా ఉన్న 2వ గేటు దగ్గర నుండి (లడ్డూ కౌంటర్‌ దగ్గర) ప్రసాదాలయంనకు ఉదయం గం॥ 09-30ని॥ నుండి రాత్రి 09-00 గంట వరకు ఉచిత బస్సులు నడుపుచున్నారు.

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయం

ramappa temple, warangal

రామలింగేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్‌ జిల్లా ములుగు తాూకా, వెంకటాపురం మండలంలోని పాలంపేట అనే గ్రామనికి దగ్గరలో ఉన్నది. 5 ఎకరాల స్థలం ఈ గుడి నిర్మించబడినది. మరియు చుట్టుప్రక్కల ఇంకా 20 ఎకరాల స్థలంలో పచ్చదనం అభివృద్ధిచేయబడినది. నక్షత్రాకార కట్టడం మీద ఉన్న ఈ శివాలయం 12, 13వ శతాబ్దాలకు చెందినది. ఈ దేవాలయం చెక్కిన ప్రధానశిల్పి రామప్ప. ఇతని పేరుతోనే ఈ దేవాలయం వ్వవహరించబడటం విశేషం. తూర్పుదిశగా ఎత్తైన వేదిక మీద గర్భాలయం, అంతర్భాగంలో మూడువైపుల ప్రవేశద్వారాలు గల మహామండపం కలిగియున్నది. ఈ దేవాలయం తేలికైన ఇటుకలతో నిర్మించబడినది. ఈ ఇటుకలు నీటిపై తేలతాయని చెబుతారు. ఈ దేవాలయం గోడమీద రామాయణ, మహాభారత గాథలు చెక్కబడి ఉన్నవి. పైకప్పు క్రింది భాగాన నల్లని నునుపు రాతిపై చెక్కబడిన మదనిక, నాగిని శిల్పాలు కాకతీయుల కళాభిరుచికి తార్కారణం. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థం బాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలను చూడవచ్చు. ఇక్కడ జరుగు ముఖ్యమైన పండుగ శివరాత్రి.

ఈ దేవాలయం ముస్లిం దండయాత్ర వలన, ప్రకృతి వైపరీత్యా వలన, 17వ శతాబ్ధంలో వచ్చిన భూకంపం వలన కొంత భాగం దెబ్బతిన్నది. అయినను దేవాలయంలో స్వామి ఎదురుగా తొమ్మిది అడుగుల ఎత్తున్న ఉన్న నంది విగ్రహం మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండా శివుని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్లు కూర్చున్న భంగిమలో ఉన్నది. ఈ దేవాలయంను చూడటానికి మనదేశం నుండియే గాక విదేశాల నుండి కూడా పర్యాటకులు వస్తారు.

ఈ ఆలయం కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని పరిపాలనలో అతని సైన్యాధిపతి రేచర్ల రుద్రయ్యచే నిర్మించబడినది. ఇక్కడికి దగ్గరలో ఉన్న పాకాల చెరువు కాకతీయ రాజులచే త్రవ్వించబడినది. ఇప్పటికీ కొన్నివేల ఎకరాకు సాగునీరు అందించుచున్నది.

ఎలా వెళ్ళాలి : విజయవాడ-హైదరాబాద్‌ రైలు మార్గంలో వరంగల్‌ రైల్వే స్టేషన్‌ లో దిగి అక్కడ నుండి బస్సులో రామప్ప గుడికి వెళ్ళవచ్చు.

వేయు స్థంభాల గుడి, హనుమకొండ…(వరంగల్‌)

కాకతీయ వంశస్థుడైన రుద్రదేవునిచే నిర్మించబడినది. కాకతీయుల శిల్ప కళావైభవానికి మచ్చు తునక ఈ దేవాలయం. నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు (శివుడు లింగరూపంలో) ప్రధాన అర్చామూర్తిగా కొలువై ఉన్నాడు. ప్రధాన ఆయం తూర్పుకు అభిముఖంగా అధ్బుతమైన శిల్పకళతో చూపరులను ఆకట్టుకుంటుంది. నందీశ్వరుని విగ్రహం ప్రధానాలయానికి ఎదురుగా ఠీవిగా దర్శనమిస్తుంది. ఆలయంలోకి ప్రవేశించగానే పానపట్టం లేని నిలువెత్తు శివలింగం దర్శనమిస్తుంది. ఆలయం లోపల లతలు పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులను, పురాణ ఘట్టాలు చూపరులను ఆకట్టుకుంటాయి. కళ్యాణమంటపం మరియు ప్రధానాలయాన్ని మొత్తం వేయు స్థంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయు స్థంభాల దేవాలయమనే పేరు వచ్చింది. కానీ ప్రస్తుతం వేయు స్థంభాలు లేవు. విదేశీయులు, మహ్మదీయుల దండయాత్రలో మరియు ప్రకృతి వైపరీత్యాల వలన ఆయం కొంతవరకు దెబ్బ తిన్నది.

thousand pillars temple, warangal

ఆలయ ప్రాంగణంలో మారేడు, రావి, వేప వృక్షాలు నీడలో భక్తులు సేదతీరుతారు. ఇటీవల పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో కళ్యాణ పండపం క్రింద ఒక బావి వెలువడినది. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రులో మరియు పర్వ దినాలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

ఎలా వెళ్ళాలి : ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌ లోని వరంగల్‌ జిల్లా హనుమకొండ నడిబొడ్డున ఉన్నది. వరంగల్‌ రైల్వేస్టేషన్‌ నుండి బస్సు ద్వారా లేదా ఆటోలలో వెళ్ళవచ్చు. స్టేషన్‌ నుండి 5 కి.మీ. దూరం. వరంగల్‌ విజయవాడ-హైదరాబాద్‌, (హైదరాబాద్‌-విజయవాడ) రైలు మార్గంలో వరంగల్ పట్టణం ఉన్నది.(విజయవాడ నుండి 241 కి.మీ. దూరం,హైదరాబాద్‌ నుండి 147 కి.మీ దూరం).

యాదగిరిగుట్ట – పంచనారసింహ క్షేత్రం

దక్షిణాదిలో …తెలుగు రాష్ట్రాలలో నారసింహ క్షేత్రాలుఎక్కువ. దేశంలోనే ఏకైక నవనారసింహక్షేత్రం అహోబిలం. ఆ తరువాత అంత ప్రాముఖ్యత ఉన్న క్షేత్రం యాదగిరిగుట్ట. ఎందుకంటే ఇది పంచనారసింహక్షేత్రం.

సృష్టికి పూర్వం శ్రీ మహావిష్ణువు నరసింహరూపంలోనే బ్రహ్మకు దర్శనం ఇచ్చాడట.‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యుం నమామ్యహం’అని మంత్రోపదేశం చేశారట. దీనివల్లే బ్రహ్మకు వేద దర్శనమై ఆ తరువాత సృష్టి మొదలు పెట్టాడట. అంతటి ప్రాముఖ్యం ఉన్న అవతారం నృసింహావతారం. అలాంటి నారసింహుడు వెసిన పవిత్రక్షేత్రం యాదగిరి.

రామాయణ కాలం నాటి విభాండక రుషి, అతడి పుత్రుడైన రుష్యృశృంగ్నుడి కుమారుడు యాదరుషి. అతడ్ణే యాదర్షి అంటారు. చిన్నప్పట్నుంచి నరసింహుడి భక్తుడైన అతడికి ఆస్వామిని దర్శించాలని బలమైన కోరిక ఉండేదట. నరసింహుడ్ని అన్వేషించడానికి అడవులు, కొండలు, కోనలు తిరిగాడు. నరసింహుని దర్శనం కాలేదు. అలా సంచరిస్తున్న యాదర్షి ఒకరోజు ఇప్పుడున్న యాదగిరి అరణ్య ప్రాంతానికి చేరుకుని అలసిపోయి ఒక రావి చెట్టు క్రింద పడుకున్నాడు. అపుడు కలలో ఆంజనేయ స్వామి కనిపించి ‘ నీ పట్టుదల నాకు నచ్చింది. నీకు తోడుగా నేనుంటాను. కఠినంగా తపస్సుచేస్తే స్వామి తప్పక ప్రత్యక్షమవుతాడు ’ అని చెప్పాడట. నిద్రలేచిన యాదర్షి అక్కడే తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్ళకు ఉగ్రనరసింహుడు ప్రతక్షమయ్యాడట. ఆ తేజస్సును చూడలేక శాంతస్వరూపంతో కనిపించమని కోరాడట. యాదర్షి అప్పుడు లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ‘‘ఏమికావాలో కోరుకో’’ అని అడిగాడు స్వామి. ‘‘నీ దర్శనం కోసం ఇంతఘోర తపస్సు సామాన్యులు చేయలేరు. అందుకే నువ్వు శాంతరూపంతోనే ఇక్కడ కొలువై ఉండిపో’’ అని కోరాడట. అప్పుడు కొండశిల మీద స్వామి ఆవిర్భవించాడు.

కొన్నాళ్ళ తరువాత యాదర్షికి మరో కోరిక కలిగింది. ‘‘స్వామిని ఒకే రూపంలో చూసాను. వేర్వేరు రూపాల్లో చూడలేక పోయానే’’ అనుకొని మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు స్వామి ప్రత్యక్షమయ్యాడు. ‘‘ నారూపాన్నీ నువ్వు చూడలేవు అయినా నీకోసం నాలుగు రూపాలు చూపిస్తాను’’ అని జ్వాల, యోగానంద, గండభేరుండ, నారసింహ రూపాలుగా దర్శనమిచ్చాడు. జ్వాలా నరసింహుడు సర్పరూపంలో వుంటాడు. యోగానందుడు అర్చా విగ్రహరూపంలో వుంటాడు. గండభేరుండ నరసింహుడు కొండబిలంలో కొలువై ఉంటాడు. తరువాత యాదర్షి….. తనను స్వామిలో ఐక్యం చేసుకోమని కోరడంతో అలాగే చేసుకున్నాడట స్వామి. ఆ యాదర్షి పేరుమీద ఇది యాదగిరి గ్నుట్ట అయింది.

ఆ తరువాత ఈ విషయం గురించి ఎవరికి తెలియలేదు. కలియుగంలో ఒక రోజు రాత్రి గ్రామాధికారికి స్వామి కలలో కనిపించి తాను ఈ ప్రాంతంలోనే నాలుగ్ను రూపాల్లో ఉన్నానని గర్తులు చెప్పాడట. గ్రామాధికారి వెళ్ళి రేఖామాత్రంగా ఉన్న స్వామి రూపాలను గుహలనూ, ఆంజనేయుణ్ని కనుగొన్నాడట. అప్పట్నుంచి స్వామికి పూజాధికాలు మొదలయ్యాయి. గర్భగ్నుడిలో ఎదురుగా ఉండే స్వామి జ్వాలా నరసింహుడు. మరికాస్త లోపల యోగ ముద్రలో యోగానందస్వామి, లక్ష్మీనరసింహ స్వాములను చూడవచ్చు. గర్భాలయం నుండి బయటకు వస్తే మెట్లకు ఎడమ ప్రక్కన క్షేత్రపాలకుడైన హనుమంతుడి గుడి ఉంది. హనుమంతుడి విగ్రహానికి క్రిందన ఉన్న పెద్ద రాతిచీలికలో గండభేరుండ నరసింహుని స్వయంభువు రూపం కనిసిస్తుంది.

ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాక బయట ఎడమ వైపు మెట్లు దిగితే పుష్కరిణి, కుడివైపు కొన్ని మెట్లు దిగితే పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరుని ఆలయం కనిపిస్తాయి. సత్యనారాయణ వ్రతాలు మరియు ‘ప్రదక్షణ మొక్కు’ ప్రధానమైంది. దీనివల్ల మానసిక, శారీరక, ఆర్ధిక బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మండలం (41 రోజులు) అర్ధమండం, 11 రోజులు ప్రదక్షిణ మొక్కులు మొక్కుకుంటారు భక్తులు. నిత్యం గ్నర్భాయానికి రెండు సార్లు, ఆంజనేయ స్వామికి 16 సార్లు ప్రదక్షణలు చేస్తారు. ఈ మొక్కు తీర్చుకునే దశలో స్వామి కలలోనే తమకు శస్త్రచికిత్స చేసి, శారీరక బాధల నుంచి విముక్తి చేస్తాడని నమ్ముతారు. సత్యనారాయణస్వామి వ్రతాలకు అన్నవరం తరువాత అంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం యాదగిరి గుట్ట. రోజులో నాలుగుసార్లు ఈ వ్రతాలు జరుగుతాయి. ఏటా ఫాల్గుణ మాసంలో 11 రోజుల పాటు నారసింహుని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఉత్సవాల్లో ఎనిమిది రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.

ఎలా వెళ్లాలా..?…. హైదరాబాదు నుండి 60 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్లటానికి ఆర్‌టిసి బస్సులున్నాయి. సొంత వాహనాల వారు హైదరాబాదు-వరంగల్‌ జాతీయ రహదారిలో రాయగిరి క్రాస్‌రోడ్డు నుండి వెళ్లవచ్చు.

రైలుమార్గంలో భువనగిరి, రాయగిరి , ఆలేరు రైల్వేస్టేషన్‌లో దిగి స్వామి వారి సన్నిధికి బస్సులలో వెళ్లవచ్చు. ఈ క్షేత్రాన్ని దృష్టిలోపెట్టుకుని హైదరాబాదునుండి సరికొత్తగా ‘యాదగిరి రోడ్డు’ పేరిట 8 లైన్ల రహదారిని నిర్మించారు.

భద్రాచలం శ్రీరామాలయం

1730 (17వ శతాబ్దం) ప్రాంతంలో… భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తుండేది. ఆ మహా భక్తురాలి భక్తికి మెచ్చి ఒక రోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడట! తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం… భద్రగిరిపై ఉన్నానని.. నన్ను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చెయ్యండి.. ఈ కార్యక్రమంలో నీకు మరో పరమభక్తుడు సాయంగా నిలుస్తాడు.. అని ఆదేశించారట! ఆ మేరకు దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియజేసి.. భద్రగిరిపైకి వెళ్లి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించిందట. ఆపై అక్కడ పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిందట. ప్రతీ సంవత్సరం సీతారాముల కల్యాణం కూడా నిర్వహించేవారని స్థలపురాణం చెబుతుంది.

అనంతరం రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడున్న బ్రహ్మాండపై ఆలయాన్ని నిర్మించాడు. గోపన్నది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం. అప్పటి గోల్కొండ ప్రభువు తానీషా కొలువులో మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న, మాదన్నలకు ఈ గోపన్న మేనల్లుడు.

మేనమామల సహకారంతో గోపన్న పాల్వంచ తాలుకా తహశీల్దారుగా పదవీబాధ్యతలు చేపట్టాడు. భద్రాచలంలో వెలిసిన శ్రీరాముడి గురించి తెలుసుకున్న ఆయన స్వామివారికి భక్తుడిగా మారుతాడు. భద్రాచల రాముడికో మంచి ఆలయం లేకపోవడాన్ని చూసి.. ఎంతో బాధపడతాడు. తాను ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన సర్కారు డబ్బు ఆరు లక్షల మొహరీలతో తన దైవం.. భద్రాచల శ్రీరామచంద్రుడికి 1674లో ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించాడు! ఈ విషయం నవాబ్‌ తానీషాకి ఆగ్రహం కలిగించింది. వెంటనే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము జమచేయాలని ఉత్తర్వులు ఇస్తాడు. సొమ్మంతా భద్రాచలం ఆలయ నిర్మాణానికే వినియోగించా… ఇక నా దగ్గరేమీ మిగల్లేదు ప్రభూ.. అని విన్నవిస్తాడు రామదాసు. దీంతో తానీషా రామదాసును గోల్కొండకు రప్పించి.. బందిఖానాలో ఖైదు చేయిస్తాడు. 12 ఏళ్ల పాటు రామదాసు ఆ బందిఖానాలో నానా కష్టాలు అనుభవిస్తాడు. ఆయా సందర్భాల్లో అతను భద్రాచల శ్రీరాముడికి తన దుస్థితిని మొరపెట్టుకుంటూ ఆర్తితో ఆలపించిన వందలాది కీర్తనలు ఆ తర్వాత ప్రపంచ విఖ్యాతమయ్యాయి.

చివరకు రామదాసు ప్రార్థనలు ఫలించి.. శ్రీరాముడు స్వయంగా లక్ష్మణ సమేతంగా వచ్చి.. తానీషాకు బాకీ సొమ్ము 6 లక్షల మొహరీలు చెల్లించి.. రశీదు తీసుకొని మరీ రామదాసును బందిఖానా నుంచి విముక్తం చేశాడట! ఇప్పటికీ అప్పట్లో శ్రీరామదాసు తన ఆరాధ్యదైవమైన శ్రీరాముడితో పాటు.. సీత.. లక్ష్మణస్వాములకు చేయించిన పలు ఆభరణాలు… తానీషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మొహరీలు.. ఉత్సవ సామగ్రి.. అప్పటి శాసనాలు.. పరికరాలు ఆలయంలో చూడొచ్చు.

భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాల నందు రాముడు, సీత మరియు లక్ష్మణుడు కొంతకాలం నివాసం ఉన్నట్లు తెలియజేయబడింది. గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్నకొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరుపర్వతం మరియు మేనకల కుమారుడే భద్రుడు (భద్రగిరి). ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రిరాముడు అయినాడు. ఈ భద్రగిరిపై వెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్ కు కూడా ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్నది. కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నపుడు అతన్ని నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమయినాయి అని మళ్ళీ అతనిని ఆలయంలోనికి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో దివ్య చిత్రాలు పునర్దర్శనం అయ్యాయని చెబుతుంటారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలం కి మరింత తోడ్పాటునందించింది. మేరుపర్వతం మరియు మేనక లకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్ర పర్వతం. ఈ భద్రుడి (చిన్నకొండ) వలనే ఈ చిన్నకొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది.

కళ్యాణం
ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణం. ఇది దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ది చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవుతుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ఈ దేవాలయమునకు ప్రతి సంవత్సరం పంపడం జరుగుతున్నది.

పర్ణశాల
ఇది భద్రాచలంనుండి 35 కి.మీ. దూరంలో ఉన్నది. సీతారామలక్ష్మణులు తమ వనవాసంసమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు. వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర, శిల్ప రూపాలలో ప్రదర్శింపబడుతున్నాయి. ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడిరూపంలో వచ్చిన మారీచుని బొమ్మ. పర్ణశాలకు సమీపంలో ఉన్న సీతమ్మవాగువద్ద సీత ఆరవేసిన చీర గుర్తులనీ, ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్ళనీ కొన్ని చిహ్నాలను చూపిస్తారు. నదికి ఆవలివైపుని రావణుని రథపు జాడలని కొన్ని గుర్తులను చూపిస్తారు. 

పాపికొండలు
పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక కొండల శ్రేణి. ఇవి ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఆనుకొని ఉన్నాయి. సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది.

పాపికొండల అడవుల్లో వివిధ రకాల జంతువులు, పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉన్నది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మద్య ప్రవహిస్తూ ఆ వాతావరణంకు మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.

దర్శనం, పూజలు – సేవలు

* రోజూ ఉదయం 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
* ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు బాలభోగం నివేదన. ఆపై ఉదయం 8.35 నుంచి 9.30 వరకు సహస్ర నామార్చన.. ఈ పూజలో పాల్గొనేందుకు రూ.100 టిక్కెట్‌పై ఒక్కరు లేదా దంపతులకు అనుమతిస్తారు.
* ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అర్చనలుంటాయి. వీటిల్లో రూ. 150 టిక్కెట్‌ ద్వారా పాల్గొనవచ్చు.
* ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే స్వామివారి నిత్యకల్యాణంలో పాల్గొనేందుకు రూ. వెయ్యి చెల్లిస్తే.. ఒకరు.. లేదా దంపతులను అనుమతిస్తారు.
* ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాజభోగం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకూ ఆలయాన్ని మూసేస్తారు.
* రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు దర్బార్‌సేవ జరుగుతుంది. 8.30 గంటల నుంచి 9 గంటల వరకు నివేదన. పవళింపు సేవ ఉంటుంది.

వసతి సౌకర్యం

భద్రాచలం రామాలయ పరిధిలో 10 ఏసీ కాటేజీలున్నాయి. ఒక్కో గదికి రోజుకు రూ. 1500.
నాన్‌ ఏసీ కాటేజీలు 10 ఉన్నాయి. వీటిల్లో ఒక్కో గదికి రోజుకు రూ. 800 చొప్పున చెల్లించాలి.
* కాటేజీలు కాకుండా మరో 46 నాన్‌ ఏసీ గదులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గది ధర రూ. 300
* ఏసీ గదులు 64 అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గదికి రూ. 800 నుంచి రూ. 1100 వరకూ చెల్లించాలి.

భద్రాచలంనకు రోడ్డు మరియు రైలు సదుపాయం కలవు. ఖమ్మం నుండి 120 కి.మీ. దూరం.
హైదరాబాద్ నుండి 325 కి.మీ దూరం.
దగ్గరలో గల రైల్వేస్టేషన్ – కొత్తగూడెం (భద్రాచలం రోడ్) ఇక్కడనుండి 40 కి.మీ. దూరంలో దేవలయం కలదు.
దగ్గరలోగల విమానాశ్రయాలు : హైదరాబాద్ మరియు రాజమండ్రి, విజయవాడ (విజయవాడ మరియు ఇతర ప్రాంతాల నుండి భద్రాచలాని బస్సులలో వెళ్ళవచ్చు.

బిర్లామందిర్‌

280 అడుగుల ఎత్తున్న కాలాపహాడ్‌ అనే కొండపై ప్రముఖ పారిశ్రామిక వెత్తలైన బిర్లాలచే ఈ దేవాలయం నిర్మించబడినది. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి. ఈ దేవాలయం మొత్తం రాజస్థాన్‌ నుండి తెప్పించబడిన తెల్లరాయితో నిర్మించబడినది. ఇక్కడ కానుకలు స్వీకరించరు. నిర్వహణ మొత్తం బిర్లాలదే. రాజస్థాన్‌ మరియు ఉత్కళ సాంప్రదాయాలలో కట్టబడినది.

దేవాలయం దర్శనం వేళలు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 3 గంటల నుండి 9 గంటల వరకు.

ఎలా వెళ్ళాలి
బిర్లా మందిర్‌కు హైదరాబాద్‌ సిటీ బస్సులో లేక ఆటోలో చేరుకోవచ్చు. దగ్గరలో గల బస్‌ స్టాప్‌ సెక్రటరియేట్‌ మరియు లకడీ-కా-పూల్‌.
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుండి 7 కి.మీ. నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుండి 3 కి.మీ. కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుండి 5 కి.మీ. దూరంలో కలదు.

బాసర జ్ఞానసరస్వతి

basara temple

ద్వాపరయుగంలో కురుక్షేత్ర యుద్ధం పూర్తి అయిన తరువాత ప్రశాంతంగా తపస్సు చేసుకునేందుకని వ్యాసమహర్షి, విశ్వామిత్ర మహర్షి మొదలగు వారు శిష్యసమేతంగా ఈ ప్రాంతానికి వచ్చారట. ఈ ప్రదేశంలో ప్రశాంత వాతావరణానికి ముగ్ధులై.. ఇక్కడే తపస్సు కొనసాగించారంటానే. వ్యాస భగవానులు రోజూ పావన గోదావరిలో స్నానం చేశాక.. పిడికెడు ఇసుక చొప్పున తీసుకెళ్లి.. సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని రూపొందించారట! ఆ మూర్తికే ఆయన నిత్యపూజలు చేసేవారని.. ఇప్పుడు ఇక్కడున్న విగ్రహం అప్పట్లో వ్యాస మహర్షి ఆరాధించిన మూర్తేనని స్థలపురాణం! అలా వేద వ్యాస ప్రతిష్ఠగా పరిగణించే బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి సన్నిధిలో నిత్యం వేల మంది చిన్నారులు అక్షరాభ్యాసం చేసుకుంటూ.. ఆ తల్లి దీవెనలు.. చల్లని చూపులతో విజ్ఞానవంతులుగా ఎదుగుతున్నారు.

ఆలయం తెరచే సమయాలు
– రోజూ ఉదయం 4 గంటలకే ఆలయద్వారాలు తెరుస్తారు.
– ఉదయం 4.30 గంటలకు అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు.
– అనంతరం 4.30 నుంచి 6.30 వరకూ అభిషేకం కొనసాగుతుంది.
– 6.30 నుంచి 7.30 గంటల వరకు విరామం.
– ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాధారణ దర్శనం, ప్రత్యేక దర్శనం, అక్షరాభ్యాస పూజలు ఆరంభం.
– మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.00 గంటల వరకు మధ్యాహ్న విరామం
– మధ్యాహ్నం 2 నుంచి 6.30 వరకు దర్శనం, పూజలు
– సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సాయంత్ర ప్రదోషకాల పూజలు
– రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు హారతి. అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు.
వివిధ ఆర్జిత సేవలు/ పూజల వివరాలు
– అభిషేకసేవ టిక్కెట్టు: రూ.200- ఒక కుటుంబం లేదా నలుగురు మాత్రమే
– ప్రత్యేక దర్శనం ఒక టిక్కెట్టుపై ఒకరు మాత్రమే
– సాధారణ అక్షరాభ్యాసం: రూ. 100
– ప్రత్యేక అక్షరాభ్యాసం: రూ. 1000
– నిత్య చండీ హవనం: రూ. 500
– కుంకుమార్చన రూ.50

ఇతర దేవతలు : ప్రధాన సరస్వతీ ఆలయ అంతరాలయంలో మహాలక్ష్మీ. ఆలయానికి పశ్చిమ దిక్కులో మహాకాళీ కొలువై ఉంటారు. అంటే ఈ ఆలయం త్రిశక్తులైన లక్ష్మి.. పార్వతి.. సరస్వతి అమ్మవార్లు కొలువైన మహిమాన్విత క్షేత్రమన్న మాట. ఆలయానికి తూర్పున దత్తాత్రేయుడు, ఆలయం ముందు ప్రధాన రహదారి వద్ద వేదవ్యాస మహర్షి ఆలయం.. వ్యాసుల వారి గుహ.. గోదావరి నది.. నదీ తీరాన మహేశ్వర ఆలయం.. బస్టాండ్‌ సమీపంలోని వేదశిల (శ్రీ వేదవతిశిల) చూడవలసినవి.

ఆలయంలో నిత్యం నిర్వహించే వివిధ పూజలు: అభిషేకం, అక్షరాభ్యాసాలు, సత్యనారాయణ వ్రతాలు, చండీ హవనం, కుంకుమార్చన. ప్రత్యేక ఉత్సవాలు
– సరస్వతి అమ్మవారి జన్మదినమైన వసంత పంచమి నాడు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. మహాభిషేకంతో పాటు అమ్మవారి పల్లకి సేవ నిర్వహిస్తారు.
– దసరా నవరాత్రి ఉత్సవాలనూ ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మూల నక్షత్ర పర్వదినం రోజున మూల నక్షత్ర మహా సరస్వతీపూజ నిర్వహిస్తారు.
– గురుపౌర్ణమి సందర్భంగానూ ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. సప్తశతి చండీయాగం చేసి. వేద పండితులకు సన్మానం నిర్వహిస్తారు.
– ఇక్కడ నిర్వహించే పూజలు.. ప్రత్యేక దర్శనాలకు సంబంధించి ఆన్‌లైన్‌ బుకింగ్‌ సౌకర్యమేమీ లేదు.
మరిన్ని వివరాలకు ఆలయ విచారణ కేంద్రం ఫోన్‌: 08752-255503 నెంబరులో లేదా.. వెబ్‌సైట్‌:basaratemple.org ఇ-మెయిల్‌ ఐడీ:infobasaratemple.orgలేదా.. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కార్యాలయంలోనైనా సంప్రదించవచ్చు. 

Basara Accodomation….బాసర వసతి వివరాలు వసతి వివరాలు:
బాసర సరస్వతీ ఆలయానికి వచ్చే భక్తుల వసతి కోసమని దేవస్థానం 100 సాధారణ గదులు, 18 ఏసీ గదులు అందుబాటులో ఉంచుతుంది. ఇంకా ఆలయం వద్ద వివిధ ఆలయాల నిధులతో నిర్మించిన అతిథి గృహాల్లోనూ వసతి అందుబాటులో ఉంది. పర్యాటక శాఖ వారి హరిత అతిథిగృహంతో పాటు పలు ప్రైవేటు లాడ్జిలు, రిసార్టుల్లోనూ వసతి సౌకర్యముంది. బాసరలోని హోటళ్ల సమాచారం కోసం www. basarahotels.com వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

టి టి డి అతిథి గ్నృహం 4 గదులు ఒక్కొక్క గది ఎ.సి రూమ్‌ : 400- నాన్‌ ఎ సి రూ.150-(ఒక్క రోజుకు)
వేములవాడ అతిథి గృహం : 4 గదులు ఒక్కొక్క గది రూ.75- ఒక్క రోజుకు
నీలం ఘేకర్‌ అతిథి గృహం -4 గదులు (దాతలు కట్టించినవి) ఒక్కొక్క గది రూ.100- ఒక్క రోజుకు
గౌర్ల అతిథి గృహం: 2 గదులు (దాతు కట్టించినవి) ఒక్కొక్క గది రూ.150- ఒక్క రోజుకు
థర్మశాల : 9 గదులు ఒక్కొక్క గది రూ.100- ఒక్క రోజుకు
టిటిడి వారి అతిథి గృహాం -100 రూములు పెద్దవి ఒక్కొక్క గది రూ.100- ఒక్క రోజుకు
ఇవి కాక ఎ పి టి డి సి వారి పున్నమి హోటల్‌ వివరాలకు :08752-243691 మరియు బ్రాహ్మణు సత్రం, వైశ్యుల సత్రం దేవాలయంనకు దగ్గరలో కలవు.
ఇవికాక ప్రైవేటు వారి లాడ్జీలు 20 దాకా ఉన్నవి.

తిరుమల – తిరుపతి

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల కొండ దిగువ ప్రాంతంలో ఉన్న తిరుపతి భారతదేశంలోని సాంస్కృతికంగా అత్యంత వైభవంగా వుండే నగరాల్లో ఒకటి. సుప్రసిద్ధ తిరుపతి దేవాలయం సమీపంలో వుండడం వల్ల ఇది భక్తులకు, పర్యాటకులకు ఇష్టమైన నగరం అయింది. తిరుపతి అనే పదానికి మూలం ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా ‘తిరు’, ‘పతి’ అనే రెండు పదాల కలయికతో ఈ పేరు ఏర్పడిందంటారు. తమిళంలో ‘తిరు’ అంటే గౌరవప్రదమైన అనీ, ‘పతి’ అంటే భర్త అనీ అర్ధం. కాబట్టి ఆ పదానికి అర్ధం ‘గౌరవనీయుడైన పతి’ అని అర్ధం. నగరానికి చాలా దగ్గరలో వున్న తిరుమల కొండలు ప్రపంచంలోనే రెండో అత్యంత ప్రాచీనమైన కొండలని చెప్తారు. తిరుపతి దేవాలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి బలమైన సాక్ష్యాలు లేనప్పటికీ క్రీ.శ. 4వ శతాబ్దం నుంచి వివిధ రాజవంశీకులు దీన్ని నిర్వహి౦చి, పునర్నిర్మించారు. 14, 15 శతాబ్దాలలో ఈ దేవాలయం ముస్లింల దండయాత్రను విజయవంతంగా ప్రతిఘటించింది. అలాగే బ్రిటిష్ దాడుల నుంచి కూడా తన్ను తాను కాపాడుకుని ఈ కట్టడం ప్రపంచంలోనే సంరక్షి౦చదగ్గ అతి ప్రాచీన కట్టడంగా నిలిచి వుంది. 1933లో మద్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఏర్పడి పరిపాలనా వ్యవహారాలూ చూసుకునేలా మద్రాస్ శాసనసభశాసనసభ ఒక చట్టం చేసింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలూ నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది. ధార్మిక విషయాల్లో ధార్మిక సలహా మండలి తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇచ్చేది. తిరుపతి నగరం ఇప్పటి కే టి రోడ్ లో కొత్తూరు లో వుండేది. తరువాత అది గోవిందరాజస్వామి దేవలాయం దగ్గరికి మారింది. ఇప్పుడు నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించింది.

తిరుమల

తిరుపతి కి దగ్గరగా ఉన్న తిరుమల కొండ ప్రదేశం. ఇక్కడ ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ కొండలు సముద్ర మట్టంపై 3200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, ఏడు శిఖరాలను కలిగి ఉంటుంది. నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, వేంకటాద్రి అని పిలువబడే ఏడూ శిఖరాలూ ఆదిశేషుడికి ప్రాతినిధ్యం వహిస్తాయి.

శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వేంకటాద్రి అని పిలువబడే ఏడవ శిఖరంపై ఉంది. తిరుమల అనే పదం ‘తిరు’ (పవిత్ర), ‘మల’ (రద్దీ లేదా పర్వతం) అనే రెండు పదాలను కలిగి ఉంటుంది. అందువల్ల తిరుమల పదం ద్రావిడ భాషలో అక్షరాలా ‘పవిత్ర పర్వతం’ అని అనువదించబడింది.

తిరుపతి, వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి ఆలయం, గోవిందరాజ స్వామి దేవాలయం, శ్రీనివాస మంగాపురం లలాంటి ప్రసిద్ధ గుళ్ళతో పాటు వివిధ పశు, వృక్ష జాతులకు ఆవాసమైన ఇక్కడి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ కూడా చూడవచ్చు. శిలాతోరణం అనబడే ఇక్కడి రాతి ఉద్యానవనాన్ని కూడా చూడవచ్చు. చక్కర పొంగలి, లడ్డూ రుచి చూడకపోతే తిరుపతి సందర్శన సంపూర్ణం కాదు. చెక్క బొమ్మలు, తెల్ల చెక్కతో చేసిన వస్తువులు, కలంకారీ చిత్రాలు, తంజావూర్ బంగారు ఆకుల చిత్రాలు, మరీ ముఖ్యంగా చందనపు బొమ్మలు లాంటి ఇక్కడి కళాకృతులు కూడా చూడాల్సిందే. తిరుపతి ప్రయాణం చాలా తేలిక. తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట విమానాశ్రయం వుంది. డిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లనుంచి రేణిగు౦ట నేరుగా విమానాలు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానించబడిన రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ వుంది. చెన్నై, బెంగళూర్, వైజాగ్, హైదరాబాద్ లాంటి నగరాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నిత్యం నడుస్తుంటాయి. అద్దె కార్లు, బస్సులు అందుబాటులో వుండడం వల్ల నగరంలో తిరగడం కూడా తేలికే. నామమాత్రపు ధరల్లో రోజంతటికీ కార్లు అద్దెకు తీసుకోవచ్చు. తిరుమల సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి నివాసముండే స్థలం… దీనికి నిదర్శనo.. వేర్వేరు కొండలు వేర్వేరు ఆకారాలు సంతరించుకోవడమే.. మనము శేషాచలం కొండను (శేషాద్రి) చూస్తే స్వామి నామాలు, కిరీటం, పూలమాల మనకు స్పష్టంగా కనిపిస్తాయి… లక్ష్మీసమేత వరహ స్వామి రూపంలో ఉన్న కొండలూ కనిపిస్తాయి… ఆంజనేయ స్వామి (అంజనాద్రి) రూపంలో ఉన్న కొండ కనిపిస్తుంది.. శ్రీవారి ఏనుగు ఆకారంలోని కొండ కనిపిస్తుంది… సాక్షాత్ గరుడవిగ్రహం(గరుడాద్రి) మనకు కనపడుతుంది.. శ్రీవారి ఆర్చి శిలా తోరణం కనపడుతుంది.. ఇలా అన్ని కొండలూ వాటి రూపాలు, సాక్షాత్ శ్రీవారి రూపం కొండలో గోచరించడం అద్భుతంకాదా!! అందుకే స్వామి వారిని దర్శించుకున్నంత భాగ్యం క్రింది వాటికి కల్పించారు…   1. స్వామిని సాక్షాత్ దర్శించుకోలేని వారు విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే చాలు… 2. విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోలేని వారు… గోపురాన్ని దర్శించుకుంటే చాలు 3. గోపురాన్ని దర్శించుకోలేని వారికి గాలిగోపురాన్ని చూస్తే చాలు … 4. అక్కడకు కూడా వెళ్ళలేని వారు… కొండను చూస్తే చాలు… 5. కొండకు వెళ్ళలేని వారు అక్కడనుండి వచ్చిన తిలములను సమర్పించిన శిరమును(గుండు) తాకినా చాలు… మనకు స్వామిని దర్శించిన పుణ్యం వస్తుందట…

తిరుమల యాత్ర అంటే తిరుమల కొండమీద శ్రీవేంకటేశ్వరుని దర్శనం చేసుకోవటంతో పూర్తవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ తిరుమల వెళ్ళిన వారు ముందుగా ఆదివరాహస్వామిని దర్శనం చేసుకున్నాక మాత్రమే స్వామిని దర్శించుకోవాలి. ఇది శ్రీవేంకటేశ్వరుడు వరాహస్వామికి స్వయంగా ఇచ్చిన వరం. ఆనంద నిలయం(స్వామివారి ఆలయంపేరు) లోనే చూడవలసినవి చాలా ఉన్నాయి అంతేకాదు పచ్చని లోయలు, అడుగడుగునా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండే స్వామివారి ఏడు శిఖరాలు, తిరుమల చుట్టుపక్కలా ఉన్న ఆకాశగంగ, కపిలతీర్ధం, తుంబుర, కపిలతీర్ధం, పాపనాశన తీర్ధాలు…. మరియు తిరుపతి సమీపంలోనే ఉన్న పవిత్ర ఆలయాలు, శ్రీనివాస మంగాపురం, నారాయణుడి వివాహం జరిగిన నారాయణవనం, నాగులాపురం… ఇంకా ఎన్నో ఆలయాలున్నాయి. 

ఆది వరాహాస్వామి

తిరుమల వెళ్ళే భక్తులు ముందుగా పుష్కరిణికి వాయువ్య మూలన ఉన్న వరాహా దేవుడిని దర్శించుకుని తరువాత శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలి. ఈ వరం స్వయంగా శ్రీవేంకటేశ్వరుడే వరాహస్వామికి ఇచ్చాడు. తిరుమల మొత్తం వరాహాస్వామి ఆధీనంలో ఉండేది. శ్రీనివాసుడు తిరుమలలో నివాసం ఏర్పరుచుకోవటానికి వరాహాస్వామి నుండి అనుమతి పొందుతాడు. వరాహస్వామి ఆలయం చిన్నది. ధ్వజస్ధంభం కూడా ఉండదు. వరాహస్వామి, శ్రీ వేంకటేశ్వరుడు వేరు కాదు కాబట్టి వరాహస్వామికి ప్రత్యేక పూజలుండవు. సుమారు ఒక అడుగు ఎత్తున్న శిలా వేదిక మీద రెండడుగులు ఎత్తున్న వరాహస్వామి విగ్రహం దివ్య తేజస్సుతో దర్శనమిస్తుంది. పై రెండు చేతులలో శంఖు, చక్రాలుంటాయి. ఎడమ తొడమీద భూదేవి కూర్చుని ఉంటుంది. ఇక్కడే ఒక చతురస్రాకారపు రాగిరేకు కనబడుతుంది. ఇది శ్రీనివాసుడు వరాహాస్వామికి రాసి ఇచ్చిన అంగీకార పత్రమని అంటారు. లిపి బ్రహ్మలిపి లాగా ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారమే వరాహాస్వామి పూజలకు అవసరమైన ద్రవ్యాలన్నీ శ్రీనివాసుని భాండాగారం నుంచే అందుతాయి. ప్రయాణ బడలిక వలనో, లేక సమయం లేదనో ఈ స్వామిని దర్శించుకోకుండా శ్రీనివాసుని దర్శనానికి వెళతారు. కానీ అలా వెళ్ళటం వలన ఓ దివ్యమైన అనుభూతిని కోల్పోతాం. కనుక తిరుమల వెళ్ళిన వారు తప్పకుండా మందుగా వరాహమూర్తిని దర్శించుకోవాలి. ఇది శ్రీనివాసుడు వరాహామూర్తికి ఇచ్చిన వరం.

ఆనందనిలయం విశేషాలు

శంఘనిధి-పద్మనిధి :
మహాద్వారానికి ఇరువైపులా రెండు విగ్రహాలుంటాయి. జగద్రక్షుకుడి సర్వసంపదలకు రక్షణగా నిలిచిన దేవతామూర్తులు వీరు. ఒకరు శంఘనిధి మరొకరు పద్మనిధి. వీరిద్దరిని నిధిదేవతలంటారు. స్వామివారి వజ్రవైఢూర్యాలను రత్నసంపదను మణుగుల కొద్ది బంగారంను అపారమైన ధనరాశులను కాపాడే బాధ్యత వీరిదే. ఈ దేవతల పాదాల వద్ద విజయనగర ప్రభువు అచ్యుతరాయల వారి విగ్రహాన్ని గమనించవచ్చు.

మహాద్వారం :
హరినివాసానికి తొలివాకిలి మహాద్వారం. దీనినే పడికావలి, ముఖద్వారం, సింహద్వారం, పెరియా తిరువాశల్ అని కూడా పిలుస్తారు. గడప దాటి లోనికి కాలుపెట్టగానే భక్తజనుల హృదయస్పందనలో గోవిందనామం. మహాద్వారంపై గోపుర నిర్మాణానికి అనువైన చౌకట్టు ఏర్పరచారు. గోపురమంటే తిరుమల గోపురమే. యాభై అడుగుల ఎత్తులో నయన మనోహరంగా విశ్వరూపదర్శన అనుభూతిని కలిగిస్తుంది. పదకవితా పితామహుడు అన్నమయ్య శ్రీకృష్ణుడికీ వేంకటేశ్వరునికి అభేద్యాన్ని పాటించాడు.

అతివరో శ్రీవేంకటగిరి మీద వీడె
కౌరవుల పాలిట విశ్వరూపమితడు
అని కీర్తించాడు.

కృష్ణరాయ మండపం :
దీనినే ప్రతిమా మండపమని అంటారు. శ్రీకృష్ణదేవరాయలు…పరమ వైష్ణవుడు. ఆయన పేరుతో ప్రాచుర్యం పొందిన కృష్ణరాయ మండపం విజయనగర శిల్పకళా రీతికి ప్రతీక. నూరురాయర గండడు….భక్తిగా చేతులు జోడించిన రాగి విగ్రహం ఇక్కడ కనువిందు చేస్తుంది. ఇరువైపులా ముద్దుల దేవేరులు తిరుమలాదేవి, చిన్నాదేవి. ద్వారానికి ఎడమ పక్కన ఉన్న ప్రతిమ చంద్రగిరి పాలకుడు వేంకటపతి రాయలది. పక్కనే ఉన్న రాతి ప్రతిమలు వరదాజి అమ్మాణి, అచ్యుతరాయల దంపతులవి. కారే రాజుల్ రాజ్యముల్ ఎంతమంది ప్రభువులు పుట్టలేదు గిట్టలేదు శ్రీవారి భక్తులకే ఈ అదృష్ఠం.
వెనుకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు
యెనసి బ్రహ్మండము లేలిరట
పెనగొని వారల పేరులు మరచిరి
మనుజ కీటకముల మరెవ్వడెరుగు
అంటారు తాళ్ళపాకవారు. కల్పానికొకరు చొప్పున చాలా మందే బ్రహ్మదేవుళ్ళు వచ్చి వెళ్ళారు. వాళ్ల నామధేయాలను కూడా ఎవరూ గుర్తు పెట్టకోలేరు. అలాంటిది, నరమానవుల పేర్లేవరికి గుర్తుంటాయి? శ్రీనివాసుని దాసానుదాసుల పేర్లే నిత్యములూ సత్యములూ.

అద్దాల మండపం :
ముద్దుగారీ జూడరమ్మ మోహనమురారి వీడె
మద్దులు విరిచిన మా మాధవుడు
అయినా మహల్ అద్దాల అలంకరణల మధ్య ముద్దుమోము స్వామి మరింత ముద్దొస్తాడు. ప్రతిమా మండపానికి ఉత్తరాన ఉంటుంది అద్దాల మండపం. ఒకప్పుడు ఇక్కడ ప్రసాదం అరలుండేవి. అర్చకులు తమ వంతుకు వచ్చే ప్రసాదాలకు విక్రయించుకునేవారట. ప్రస్తుతం ఈ విధానం లేదు. అరలూ లేవు. ప్రసాదం పట్టెడ అనే పేరు మిగిలింది. తూర్పు భాగంలో నిర్మించిన అంతరాళమే అద్దాల మండపం. డోలోత్సవం జరుగుతుందనడానికి గుర్తుగా …వేలాడే గొలుసులు, చుట్టూ గోడలకు పైకప్పుకు పెద్దపెద్ద అద్దాలు బిగించారు. క్రీస్తుశకం 1831 నాటికే డోలోత్సవ సంప్రదాయం ఉంది. వరాహస్వామి ఆలయం శిథిల స్థితికి చేరుకున్నప్పుడు..మూలమూర్తిని అద్దాల మండపంలో భద్రపరిచారని చెబుతారు.
రంగనాయక మండపం :
అనంతకరము లనంతాయుధము
లనంతుడు ధరించెలరగను
ఆయన కరములు అనంతం, ఆయుధాలు అనంతం, శరణువేడిన వారికి అనంతమైన అభయాన్ని ప్రసాదిస్తాడు. అతడే రక్షకులందరికీ రక్షకుడు. తురుష్కుల దండయాత్రల సమయంలో తమిళనాడులోని శ్రీరంగంలో వెలసిన రంగనాథుడి ఉత్సవమూర్తులకు స్వామి ఆశ్రయమిచ్చి ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. పరిస్థితులు చక్కపడ్డాక సాదరంగా సాగనంపాడు. అపురూప ఆతిధ్యానికి గుర్తగా నిలిచిందీ రంగమండపం. సువిశాల మండపంలో పన్నెండు అడుగుల చతురస్రాకార మందిరం ఉంది. ఇప్పటికీ ఇత్సవాలలో సేవల్లో ద్రావిడ దివ్వ ప్రబంధ పారాయణం ఉంది. గతంలో కళ్యాణోత్సవాలు ఇక్కడే జరిగేవి. రద్దీ పెరగటంతో వేదిక మారింది.

తిరుమలరాయ మండపం :
ఉయ్యాల బాలునూచెదరుకడు
నొయ్యనొయ్య నొయ్యనుచు…
స్వామి హంసతూలికలో ఊగుతున్న దృశ్యాన్ని ఊహించుకున్నా చాలు.. హృదయానందకరం. ఆ వేడుకను కళ్లార చూసి తరించాలనే, సాళువ నరసింహరాయలు ప్రత్యేకంగా మండపాన్ని నిర్మించాడు. అప్పట్లో హంస ఊయల ఉత్సవం ఏటా ఐదు రోజులపాటూ వైభోగంగా జరిగేదట. కృష్ణదేవరాయల అల్లుడు ఆళియ రామరాయలకు ఓ తమ్ముడుండేవాడు. పేరు తిరుమలరాయలు. ఈ మండపాన్ని విస్తరించిన మహానుభక్తుడు. అందుకే ఇప్పటికీ ఆయన పేరుతో పిలుచుకుంటున్నాం. బ్రహ్మోత్సవాలపుడు ధ్వజారోహణ సమయంలో ఉత్సవమూర్తి మలయప్ప స్వామి ఇక్కడున్న చతురస్ర శిలావేదికపై వేంచేసి నివేదనలూ హారతులూ అందుకుంటారు. ఉదయాస్తమయాలలో ఇక్కడ కొలువుమేళం జరుగుతుంది. ఇక్కడే రాజా తోడరమల్లు విగ్రహము ఉంది. ఈయన ఒక మహావీరుడు. తురుష్కుల నుంచి తిరుమల ఆలయాన్ని కాపాడాడు. ఆశ్రితపాలకుడు ఆ భక్తికి మెచ్చి శ్రీహరివాసంలో చోటిచ్చాడు.

ధ్వజస్తంభము:
గరుడధ్వజ మెక్కి కమలాక్షు పెండ్లికి
పరుషలదివో వచ్చే పైపై సేవించను
…ఇదే ధ్వజస్తంభము. శ్రీనివాసుని జయకేతనం. బ్రహ్మోత్సవ సమయాల్లో ధ్వజారోహణ పూర్వకంగా ముక్కోటి దేవతలకూ ఆహ్వానపత్రం పంపడం తిరుమల సంప్రదాయం. గరుడుని బొమ్మ చిత్రించిన ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. లోపలి వస్తవుని బయటికి తీసుకువెళ్ళాలన్నా, బయటి వస్తువు లోపలికి తీసుకురావాలన్నా ధ్వజస్తంభం సాక్షిగానే జరగాలి. ప్రదక్షిణ తప్పనిసరి. ఊరేగింపులకు వస్తున్నపుడు వెళ్తున్నప్పుడు స్వామివారు కూడా ప్రదక్షిణ పూర్వకంగానే రాకపోకలు సాగిస్తాడు. ధ్వజస్తంభానికి అంత ప్రాధాన్యం. కర్రతో చేయడం వలన అప్పుడప్పడు దాన్ని మార్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నది నాలుగు దశాబ్దాల నాటిది. పైనుంచి కింది దాకా బంగారు పూత పూసిన రాగి రేకు తాపడం చేశారు. ధ్వజస్తంభానికి తూర్పున ఆనుకుని ఉన్నదే బలిపీఠం. ఇక్కడే బలి సమర్పిస్తారు. ఈశాన్యాన చిన్న శిలాపీఠం మీద క్షేత్రపాలక శిల కన్పిస్తుంది. రుద్రదేవుడు తిరుమల క్షేత్రపాలకుడు. తెల్లవారుజామున స్వామి కైంకర్యానికి వస్తున్నప్పుడు ఏకాంత సేవ తర్వాత ఇంటికి వెళ్లిపోతున్నప్పుడూ అర్చకులు తాళాలను క్షేత్రపాలక శిలకు తాకించడం ఓ నియమమం.

పుష్పమండపం :
దేవదేవుడు…పూలదేవుడు. అలంకారప్రియో హరి: ఎన్నిపూలు అలంకరిస్తే అంత పులకిస్తాడు. ఒకప్పటి తిరుమల గిరి…నిజంగానే పుష్పగిరి. పేరిందేవి తోట. అనంతాళ్యారు తోట. తాళ్లపాక వారి తోట, తరిగొండ వేంగమాంబ తోట, సురపురంవారి తోట…ఎటుచూసినా ఉద్యానవనాలే. అసలు, ఆనంద నిలయ ఆవరణలోనే ఓ సంపంగి తోట ఉండేదట. ఆ పూలనే స్వామివారికి సమర్పించేవారట. రానురాను తోట కనుమరుగైంది. ఇప్పటికీ ప్రాంతాన్ని సంపంగి ప్రదక్షిణ అని పిలుస్తారు. యోగానరసింహస్వామి ఆలయ ప్రదక్షిణ మార్గంలో ప్రత్యేకంగా ఓ పూల అర ఉంది. ఉదయం, సాయంత్రం జరిగే తోమాల సేవలో స్వామివారికి పుష్పాలంకరణ జరుగుతుంది. శ్రీవారికి నిత్యం అలంకరించే దండలకు ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. కిరీటం నుంచి రెండు భుజాలవరకు అలంకరించే దండ శిఖామణి. రెండు భుజాలపై అలంకరించే దండ కంఠసరి. బొడ్డున ఉన్న ఖడ్గానికి అలంకరించే దండ కఠారిసరం. అన్నమాచార్యుల వారు ఓ శృంగార కీర్తనలో..ప్రేయసి ఐన అమ్మవారు ప్రియసఖుడైన శ్రీనివాసుని తనింటికి ఆహ్వనిస్తారు. ఆ పిలుపులోను పిసరంత రసికత. చిరునామా చెప్పారు కానీ, చెప్పీ చెప్పనట్లు చెప్పారు.
మరుని నగరిదండ మాయిల్లెరగవా..
విరుల తావులు వెల్లవిరిసిటి చోటు..
అంటూ చెప్పారు. పూలపరిమళాలు విరిసేచోటే పద్మావతీ దేవి ఉంటుంది. దేవేరి ఉన్నచోటే దేవదేవుడు ఉంటాడు.

పడిపోటు:
సంపంగి ప్రదిక్షిణ మార్గంలోనే సరుకులు నిల్వ చేసే ఊగ్రాణానికి ఆనుకుని పడిపోటు ఉంటుంది. స్వామివారికి నివేదించే లడ్డు, వడ, అప్పం, దోసె, పోళి, సుఖియ, జిలేబి, తేన్తొళ మొదలైన ప్రసాదాలను ఇక్కడే వండుతారు. ఓ మూలన పోటు తాయార్ అనే అమ్మవారి విగ్రహం ఉంటుంది.
కళ్యాణమండపం:
కొమ్మకు నీవిట్టే పెండ్లి కొడుకవై వచ్చితివి
ఇమ్ముగ సిగ్గుపడక యేలుకోవయా.
వరుడేమో నల్లనివాడు పద్మనయనములవాడు. వధువు పుత్తడి బొమ్మ యీ పొలతి చక్కదనము. చక్కదనాల పెళ్ళికి చక్కని వేదిక శ్రీవారి కళ్యాణమండపం. ఉభయ దేవేరులతో శ్రీవారికి ప్రతినిత్యం కళ్యాణం జరుగుతుంది. శుభాల స్వామికి ముహూర్తాలతో పనేమి? రాక్షసాంతకుడికి రాహుకాలాలతో నిమిత్తమేమి? ప్రతిదినం సుదినమే. ప్రతి ముహూర్తం సుముహూర్తమే. పూర్వపు రోజుల్లో బ్రహ్మోత్సవాది విశేత్సవాలలో మాత్రమే కళ్యాణం జరిగేదట. అన్నమయ్య కాలంలో నిత్యోత్సవమైంది. పదకవితా పితామహుడు కన్యాదాతగా మారి పురుషోత్తముడికి పిల్లనిచ్చిన మామ అయ్యాడు.

వెండివాకిలి :
ధ్వజస్తంభం దాటి కాస్త ముందుకు వెళ్లగానే కనిపించే రెండో ప్రవేశద్వారమే వెండివాకిలి. వాకిళ్లకు గడపలకు వెండిరేకు తాపడం చేయడంతో వెండివాకిలనే పేరు వచ్చింది. 1929 ప్రాంతంలో నైజాం రాష్ర్టానికి చెందిన ద్వారకాదాస్ పరభణీ అనే భక్తుడు రజితసేవ చేసినట్లు తెలుస్తోంది. మహాద్వారమంత పెద్దది కాదుకాని, కళాత్మకంగా తీర్చిదిద్దారు. వాకిళ్లమీద శ్రీనివాస కల్యాణం, బావాజీ శ్రీనివాసుల పాచికలాట, శ్రీరామ పట్టాభిషేకం తదితర చిత్రాలు కనువిందు చేస్తాయి. ద్వారాన్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు.

విమాన ప్రదక్షిణ :
గర్భాలయ గోపురమే ఆనందనిలయ విమానం. వి…మానం అంటే కొలవటానికి అసాధ్యమైనదని అర్థం. ఆ గోపుర శిల్పకళావైభోగాన్ని, ఆ బంగారు శిఖరాల బహుబ్రహ్మమయాన్ని మాటలలో వర్ణించలేము. చూసి తరించవలసినదే. ఈ గోపురాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని అంటారు. తర్వాత చాలా మంది పాలకులు పునరుద్దరించారు. కొత్త సొబగులు అద్దారు. సాళువ మంగిదేవుడు కొత్త స్వర్ణకలశాన్ని ప్రతిష్టించాడు. కృష్ణదేవరాయలు 30 వేల బంగారు వరహాలతో ఆనందనిలయ విమానానికి బంగారుపూత పూయించాడు. మహంతుల పాలనలోనూ కొన్ని మార్పులు చేర్పులు జరిగినట్లు ఆధారాలున్నాయి. చివరిసారిగా 1958లో తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఎంతో కాలంగా పోగై ఉన్న ఆభరణాలను కరిగించి బంగారు రేకులు సమర్పించారు. గోపురం ఉత్తర దిక్కున వాయువ్యమూలన విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవచ్చు. స్వామి మూలవిరాట్టును పోలి ఉంటాడు. ఆలయం లోపలి నుంచి విమానమూర్తకి నివేదనలు జరుగుతాయి.
ఈ ప్రదక్షిణ మార్గంలో వెండివాకిలికి ఎదురుగా శ్రీరంగనాథుడు కన్పిస్తాడు. దక్షిణం నుంచి ప్రదక్షిణగా వెళ్తే వరదరాజస్వామి ఆలయం, బంగారుబావి, అంకురార్పణ మండపం, యాగశాల, సన్నిధి భాష్యకారులు (శ్రీరామానుజుల సన్నిధి) యోగ నరసింహస్వామి ఆలయం మొదలైనవి దర్శనమిస్తాయి. వీటన్నిటిని కలిపి చుట్టుగుళ్ళుగా పిలుస్తారు.
సంకీర్తనా భాండాగారం:
సకల వేదములు సంకీర్తనలు జేసి
ప్రకటించి నినుపాడి పావనుడైన
అకలంకుడు తాళ్లపాకన్నమాచార్యుల
వెకలియై యేలిన శ్రీ వేంకట నిలయ
ఇదే తాళ్లపాక కవుల సంకీర్తనా నిధి. రోజుకు ఒకటి తక్కువ కాకుండా ముప్పైరెండువేల సకీర్తనలను హరిపాదాలకు సమర్పించిన పరమ భక్తుడు అన్నమయ్య. తాళ్లపాక అన్నమయ్య, పెదతిరుమలయ్య, చినతిరుమలయ్య తదితరులు శ్రీవారి సాహిత్యాన్ని రాగిరేకులలో రాయించి ఇక్కడ భద్రపరచారు. ఆ అరపై రెండు విగ్రహాలున్నాయి. ఒకటి అన్నమయ్యది. ఇంకొకటి ఆయన కుమారుడు పెదతిరుమలయ్యది. బ్రహ్మోత్సవాల సమయంలో సంకీర్తనా భాంఢాగారం దగ్గర అఖంఢ దీపారాధనలు నిర్వహించిన రోజులున్నాయి. ఇప్పటికీ, ప్రత్యేక సందర్భాలలో మలయప్పస్వామి సంకీర్తనా భాంఢాగారం దగ్గర హారతులు అందుకుంటాడు. మేలు కొలుపు మొదలు పవ్వళింపు సేవల దాకా ప్రతి సందర్భంలోనూ తాళ్లపాకవారి సంకీర్తనలు గానం చేయాల్సిందే.

పరిమళం అర :
ఆ పరిసరాలకు వెళ్ళగానే సువాసనలు వెదజల్లుతాయి. అదే పరమళం అర ప్రభావం. ప్రతి గురువారం మధ్యాహ్నం స్వామివారి తిరునామానికి ఉపయోగించే పచ్చకర్పూరాన్ని ఇక్కడున్న సాన మీద నూరుతారు. పదహారు తులాల పచ్చకర్పరం పొడితోనే…శుక్రవారం ఉదయం అభిషేకానికి అవసరమయ్యే సుగంధద్రవ్యాలను కూడా సిద్ధం చేస్తారు. చందనాన్ని తయారు చేయడానికి ప్రత్యేక పరిచారికలుంటారు. వీరిని చందనపాణి అని పిలుస్తారు.
పచ్చకప్పురమే నూరి పసిడి గిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై
నచ్చెమల్లెపూవు వలె నిటుతానుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట…
అంటి అలమేల్ మంగ అండ నుండే స్వామిని.

ఏడు శిఖరాలు

శేషాద్రి

ఒకసారి వాయుదేవుడు స్వామి వారిని దర్శించుకునేందుకు వైకుంఠం వచ్చినపుడు ఆదిశేషుడు అడ్డగించాడట. స్వామివారు వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చేందుకు ఓ మార్గం చెప్పారు. మేరు పర్వతభాగమైన ఆనందశిఖరాన్ని శేషువు చుట్టుకొని వుండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదలించ గలగాలి. ఆ ప్రకారం ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని వుండగా దాన్ని కదిలించేందుకు వాయుదేవుడు విశ్వప్రయత్నం చేస్తాడు. కొంతసేపటి తరువాత వాయువు ఏంచేస్తున్నాడో చూడాలన్న కుతుహలంతో పడగ ఎత్తి చూశాడు. పట్టు సడలింది. వాయువు ఆనందశిఖరాన్ని కదలించి స్వర్ణముఖి నదీతీరాన దించాడట. అదే శేషాచలమని పురాణాలద్వారా తెలుస్తుంది.

నీలాద్రి

స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరుమీదనే స్వామి తన ఏడుకొండలలో ఒకదానికి నీలాద్రిగా నామకరణం చేశారు. తలనీలాలు అనే పేరుకూడా ఆమె పేరుమీదుగానే రూపొందిందే. తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు.

గరుడాద్రి

దాయాదులైన కద్రువ పుత్రుల (నాగులు)ను సంహరించిన తరువాత గరుత్మంతుడు పాపపరిహరార్థం విష్ణువు గురించి తపస్సుచేశాడు. స్వామి ప్రత్యక్షమవ్వగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్ధించాడు. దానికి స్వామి తానే ఏడుకొండలమీద వెలయునున్నానని తెలిపి గరుత్మంతుడి నికూడా శైలరూపంలో అక్కడే వుండమని ఆదేశించిరట. అదే గరుడాచలం.

అంజనాద్రి

వానరప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న తరువాత అంజనాదేవికి చాలాకాలం పిల్లలు కలుగలేదు. దాంతో ఆమె ఆకాశగంగ అంచునవున్న కొండలమీద ఏళ్ళ తరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించగా ఆ పండును తిన్న ఫలితంగా ఆంజనేయుడు జన్మించాడని, అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చిందని అంటారు.

వృషభాద్రి

కృతయుగంలో తిరుమలలోని తుంబురతీర్ధం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతి రోజూ తన తలనరికి శివునికి నైవేద్యం పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారి కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చి శివుడు ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏంవరం కావాలో కోరుకొమ్మంటే ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వయుద్ధం చేయాలని చెప్పాడట. చాలాకాలం యుద్ధం జరిగిన తరువాత ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయి ప్రాణాలు విడిచేముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని అదే వృషభాద్రిగా పేరొందినదని అంటారు.

నారాయాణాద్రి

విష్ణుదర్శనంకోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణమహర్షి తన తపానికి భంగం కలిగించని ప్రదేశం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుని కోరాడు. అపుడు బ్రహ్మదేవుడు ఈ ప్రదేశం చూపాడు. ఇక్కడ స్వామి దర్శనం పొందిన నారాయణమహర్షి తను తపమాచరించిన పవిత్రస్థలాన్ని తనపేరుతో పిలిచే వరం ఇవ్వమని కోరాడు. ఆ విధంగా నారాయణమహర్షి తపస్సుచేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు వచ్చింది.

వేంకటాద్రి

కలియుగదైవమైన శ్రీవేంకటేశ్వరుడు వెలసిన తిరుమలగిరి వేంకటాద్రి. వేం అంటే పాపాలు అని కట అంటే హరించటం అని అర్థం అంటే స్వామి సమక్షంలో సర్వపాపాలు నశిస్తాయట. అందుకే ఆ పవిత్రగిరికి వేంకటాద్రి అని పేరు.

అలిపిరి-తిరుమల మెట్ల దారి.

శ్రీవారి మెట్టు

This is a new route done by Reliance by which you can reach Tirumala by climbing only 2388 steps instead of 6588 steps in the old route

శ్రీవారిపాదం నుండి తీసిన ఆలయం ఫోటో.

This image has an empty alt attribute; its file name is photo-92-143414-8.jpg

ఈ విగ్రహాన్ని ఆనంద నిలయ దివ్య విమానంగా పిలువబడే బంగారు తాపడపు శిఖరం కింద ఉంచుతారు, ఈ విగ్రహం కళ్ళు కర్పూర తిలకంతో నింపుతారు, ఈ విగ్రహాన్ని జాతి రాళ్ళతో అలంకరించారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శి౦చాక వెంకటేశ్వరస్వామి ని దర్శించాలి. మనలో చాలా మంది చాలా సార్లు తిరుమల కొండ నడిచి ఎక్కి ఉంటాము. అదొక మధుర అనుభూతి. స్వామి వారిని దర్శించటం కోసం చాల శ్రమతో మెట్లు ఎక్కుతాం (యువకులకు శ్రమ కొంచెం తక్కువ ఉంటుంది). అన్ని కొండలు ఎక్కి చివరికి కొండపైకి చేరుకొనే సరికి పడ్డ శ్రమ అంతా ఎవరో చేత్తో తేసేసినట్టు మాయమవుతుంది. ఇది ఎన్నో సార్లు నాకు అనుభవమైంది. అసలు మనం ఇన్ని మెట్లెక్కి ఇంత దూరం ఇంత సేపు నడిచాం అని ఏమాత్రం గుర్తు ఉండదు. ఇక కొండపైకి వెళ్లిన తరువాత గదులు చూసుకోవటం, కల్యాణకట్ట ఇంకా ఏమైనా ఇతర కార్యక్రమాలు ముగించుకోవటం చాల చక చకా అయిపోతాయి. ఇక శ్రీవారిని దర్శనం చేసుకోవటం.. ఆహా.. ఆ ఆనందం యేమని చెప్పను? ఆ అనుభూతి ఎలా వర్ణించను?

ఒకప్పటి తిరుమల సన్నిధి వీధి.

ఈనాటి తిరుమల శ్రీనివాసుని సన్నిధి

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామాలు

1. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్థిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం |2|   2. ఉత్థిష్ఠోత్థిష్ఠ గోవింద ఉత్థిష్ఠ గరుడ ధ్వజ ఉత్థిష్ట కమలా కాంతా త్రైలోక్యం మంగళం కురు |2|   3. మాత స్సమస్త జగతాం మధుకైటభారేః వక్షో విహారిణి మనోహర దివ్య మూర్తే శ్రీ స్వామిని శ్రిత జన ప్రియ దాన శీల ే శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం   4. తవ సుప్రభాత మరవింద లోచనే భవతు ప్రసన్న ముఖ చంద్ర మండలే విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృష శైల నాథ దయితే దయానిధే 5. అత్ర్యాది సప్త ఋషయ స్సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాద యుగ మర్చయితుం ప్రపన్నా ః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం   6. పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా ః త్రైవిక్రమాది చరితం విబుధా స్తువంతి భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం   7. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ ఫూగద్రుమాది సుమనోహర పాలికానాం ఆవాతి మంద మనిల స్సహ దివ్య గంధై ః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం   8. ఉన్మీల్య నేత్రయుగ ముత్తమ పంజరస్థా ః పాత్రా వశిష్ట కదళీ ఫల పాయసాని భుక్త్వా సలీల మథ కేళి శుకా ః పఠంతి శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం   9. తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా గాయత్యనంత చరితం తవ నారదోపి భాషా సమగ్రమ సకృత్ కర సార రమ్యం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం   10. భృంగావళీచ మకరంద రసాను విద్ధ ఝంకార గీత నినదై స్సహ సేవనాయా నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య ః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం   11. యోషా గణేన వర దధ్ని విమథ్య మానే ఘోషాలయేషు దధి మంథన తీవ్రఘోషా ః రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం   12. పద్మేశ మిత్ర శతపత్ర గతాళి వర్గా ః హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యా భేరీ నినాద మివ బిభ్రతి తీవ్ర నాదం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం   13. శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్య మూర్తే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   14. శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః శ్రేయోర్థినో హర విరించి సనంద నాద్యా ః ద్వారే వసంతి వర వేత్ర హతోత్తమాంగాః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   15. శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   16. సేవాపరా శివ సురేశ కృశాను ధర్మ రక్షోంబు నాథ పవమాన ధనాది నాథాః బద్ధాంజలి ప్రవిలస న్నిజ శీర్ష దేశాః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   17. ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   18. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య శూరి స్వర్భాను కేతు దివిషత్ పరిషత్ ప్రధానాః త్వద్దాస దాస చరమావధి దాస దాసా ః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   19. త్వత్పాద ధూళి భరిత స్ఫురితోత్తమాంగాః స్వర్గాప వర్గ నిరపేక్ష నిజాంతరంగాః కల్పాగమా కలనయా కులతాం లభంతే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   20. త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః మర్త్యా మ్నుష్య భువనే మతి మాశ్రయంతే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   21. శ్రీ భూమి నాయక దయాది గుణామృతాబ్ధే దేవాది దేవ జగదేక శరణ్య మూర్తే శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   22. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   23. కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే కాంతా కుచాంబురుహ కుట్మల లోల దృష్టే కల్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం             24. మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్ స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూప శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   25. ఏలా లవంగ ఘన సార సుగంధి తీర్థం దివ్యం వియత్ సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టా ః తిష్టంతి వేంకటపతే! తవ సుప్రభాతం   26. భాస్వానుదేతి వికచాని సరోరుహాణి సంపూరయంతి నినదైః కకుభో విహంగాః శ్రీ వైష్ణవ స్సతత మర్థిత మంగళాస్తే ధామాశ్రయంతి తవ వేంకట! సుప్రభాతం   27. బ్రహ్మాదయ స్సురవర స్సమహర్షయస్తే సంత స్సనందన ముఖా స్త్వథ యోగి వర్యా ః ధామాంతికే తవహి మంగళ వస్తు హస్తా ః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   28. లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధోః సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   29. ఇత్థం వృషాచల పతే రిహ సుప్రభాతం యే మానవాః ప్రతి దినం పఠితుం ప్రవృత్తా ః తేషాం ప్రభాత సమయే స్మృతి రంగ భాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే!

గోవింద నామాలు

శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       నందనందన గోవిందా నవనీత చోర గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురిత నివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్దనోద్దార గోవిందా దశరథనందన గోవిందా దశముఖ మర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా       మత్స్యకూర్మా గోవిందా మధుసూదన హరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్దకల్కిధర గోవిందా వేణుగాన ప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       సీతానాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా ధర్మసంస్థాపక గోవిందా అనాథ రక్షక గోవిందా ఆపద్భాంధవ గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       కమలదళాక్ష గోవిందా కామితఫలదాతా గోవిందా పాపవినాశక గోవిందా పాహిమురారే గోవిందా శ్రీ ముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా అభయహస్త ప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా శంఖచక్రధర గోవిందా శార్ఙగదాధర గోవిందా విరజాతీర్థస గోవిందా విరోధిమర్దన గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా కస్తూరితిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా గరుడవాహన గోవిందా గజరాజరక్షక గోవిందా గోవిందా హరి గొవిందా గోకులనందన గోవిందా వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణా గోవిందా రఘుకులనందన గోవిందా ప్రత్యక్షదేవ గోవిందా పరమదయాకర గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       వజ్రకవచధర గోవిందా వైజయంతిమాల గోవిందా వడ్డీకాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీపుంరూపా గోవిందా శివకేశవమూర్తి గోవిందా బ్రహ్మాండరూపా గోవిందా భక్త రక్షక గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       నిత్యకళ్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాతీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా అభిషేకప్రియ గోవిందా ఆపన్నివరణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       రత్న కిరీటా గోవిందా రామానుజనుత గోవిందా స్వయంప్రకాశ గోవిందా ఆశ్రితపక్ష గొవిందా నిత్యశుభప్రద గోవిందా నిఖిలలోకేశా గోవిందా ఆనందరూప గోవిందా ఆద్యంతరహిత గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గొవిందా       ఇహపరదయక గోవిందా ఇభరాజరక్షక గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభ హరి గోవిందా తిరుమలవాసా గోవిందా శేషాద్రి నిలయ గోవిందా శేష శాయిని గోవిందా శ్రీనివాస శ్రీ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

విమాన వేంకటేశ్వరస్వామి విగ్రహం విశిష్టత, చరిత్ర

స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చాక తీర్థం, శఠారి తీసుకొని ,ఒక సాష్టాంగ నమస్కారం చేసుకొని నడుస్తుంటే..ఒక మూలకు వచ్చేసరికి ఒక్క సారి..అంతా ఆగిపోయి వుంటారు. చాలామంది పక్కన ఉన్న అరుగులు,మెట్లు ఎక్కి .. తలకాయ ఎత్తి చూస్తూ వుంటారు. అలా చూసేది అక్కడ వున్న విమాన వేంకటేశ్వర స్వామిని.

పైన ఉన్న స్వామి ఆలయ గోపురం పేరు “ఆనందనిలయం”.. ఈ బంగారు గోపురం ఎత్తు,కలశంతో కలిపి, 65అడుగుల 2 అంగుళాలు. ఇది మూడు అంతస్తులుగా వుంటుంది. మొదటి దాని మీద ఏవిధమైన బొమ్మలు లేవు.. లతలు,తీగలు,మకరతోరణాలు లాంటివి తప్ప. అలాగే మూడవ (గుండ్రని) అంతస్తు లో 20 బొమ్మలు వుంటాయి..కాకపోతే అవి.. మహపద్మం,8 సింహాలు..ఇలా. మనకు కనపడే దేవుళ్ళ విగ్రహాలు అన్నీ వున్నది రెండవ అంతస్తులో. ఇవి మొత్తం 40. నరసింహస్వామి,వరాహస్వామి,అనంతుడు, వైకుంఠనాథుడు,ఇంకా అనేక విష్ణురూపాలు,జయ విజయులు,విష్వక్సేనుడు.. ఇలా చెక్కబడి వుంటాయి.. మకర తోరణాలతో పాటు. ఇలా వున్నవాటితో పాటు..వాయవ్యం మూల ,ఉత్తరముఖంగా వుంటాడు మన విమాన వేంకటేశుడు. ఈయన పక్కన బాల కృష్ణుడు, గరుత్మంతుడు, ఆంజనేయస్వామి వారు వుంటారు .

ఇదిగో..పైన వున్న గోపురంలో..వెండి మకరతోరణంలో..వెలిగిపోతున్న స్వామియే..విమాన వేంకటేశ్వరుడు. ఈయన , లోపల వున్న మూలమూర్తిని పోలివున్న స్వామి. లోపల వున్న స్వామి దర్శనం బాగా అవలేదే అని మధన పడే వారికి స్వాంతన ఇచ్చే స్వామి.నిజంగా కూడా ఈ విమాన వేంకటేశుడి దర్శనం కూడా యాత్రా ఫలితం ఇస్తుంది అని చెప్తారు.

“తత ఆనందనిలయే తొండమాన్నృప నిర్మితే

విమానాగ్రే రరాజ శ్రీనివాస భగవాన్ హరిః !!”

వేంకటాచలమహాత్యం లోని ఈ శ్లోకం ప్రకారం విమానాన్ని తొండమాన్ మహారాజు ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

“విమానం సర్వపాపఘ్నం విష్ణునాధిష్టితం సహా

పశ్యతాం సర్వభూతానాం ఆహ్లాద జనకం శుభమ్!!”

విమానంతో పాటు విమానం మీద ఉన్న శ్రీనివాసుని దర్శనం సర్వ జీవుల పాపాలు తొలగించటమే కాక సర్వ శుభాలు కలిగిస్తుందని పై శ్లోకం అర్ధం.

ద్వైత సంప్రదాయం త్రిమూర్తుల్లో ఒకరైన వ్యాస తీర్థులు తిరుమలలో 12ఏళ్లపాటు స్వామి అర్చనాదికాలు చేశారని, వారికి ఈ విమాన వెంకటేశు డంటే చాలా చాలా అభిమానం అనీ చెప్తారు. ఆయన కాలం నుంచి ఈ స్వామి సన్నిధిలో పారాయణలు అవీ ప్రాధాన్యత సంతరించుకున్నాయని కూడా చెప్తారు.

ఈ విమాన వెంకటేశుడి గురించి గూగుల్ లో, ఇంగ్లీష్ కోరా లో రకరకాల కథలు వున్నాయి..అవి తితిదే పుస్తకాలలో లేవు. అందులో ఒకటి.. ఒక విజయనగర రాజు తిరుమల ఆలయంలో ఒక(కొన్ని) హత్య(లు) చేశాడని, ఆ కారణంచేత ఆలయాన్ని కొన్ని సంవత్సరాలు మూసివేసి,విమాన వేంకటే శుడి దర్శనం చేసేవారు అని.

Seven Hills – Teerthalu

Papanasana Teertham / పాపనాశనతీర్థం :

ఈ తీర్ధం స్వామివారి ఆలయానికి ఉత్తరదిశలో 5 కిలోమీటర్ల దూరంలో వుంది. పవిత్రమైన పాపవినాశనంలో స్నానమాచరిస్తే పాపాలు కడిగి వేయబడతాయని భక్తుల విశ్వాసం. స్త్రీలకు, పురుషులకు వేరువేరుగా దుస్తులు మార్చుకునే సౌకర్యం కలదు. చక్కని పార్కులతో, పచ్చదనంతో కళకళలాడుతున్న ప్రకృతిని వీక్షించవచ్చును.

స్వామి పుష్కరిణి

గరుత్ముంతునిచే భూలోకాని తేబడిన పుష్కరిణిగా పేరుగాంచినది. తిరుమల ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు ఈ పవిత్ర పుష్కరిణిలో స్నానమాచరిస్తారు. ఇక్కడ స్నానమాచరిస్తే పవిత్ర గంగానదిలో స్నానమాచరించి నట్లుగా భక్తులు భావిస్తారు. సకలపాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు. ముల్లోకాలలోని సకలతీర్థాలు స్వామిపుష్కరిణిలో కలిసివుంటాయని స్వయంగా వరాహాస్వామి భూదేవికి వివరించినట్లు వరాహపురాణం చెబుతుంది.స్వామివారి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం తరువాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ఆకాశగంగ

తిరుమల ప్రధాన ఆలయానికి ఉత్తరదిశలో షుమారు 3 కి.మీ. దూరంలో కలదు. స్వామివారి అభిషేకానికి నిత్యకార్యక్రమాలకు మూడు రజితపాత్రల నిండా ఇక్కడి నీరు వాడడం సాంప్రదాయం.

చక్రతీర్ధం

ఈ వున్న జలపాతం దర్శనీయమైన స్థలం. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవెంకటేశ్వస్వామి వారి అర్చామూర్తికి ఇక్కడ స్నానమాచరింప చేస్తారు

తలకోన

తిరుపతి షుమారు 50 కి.మి దూరంలో యర్రవారి మండలంలో వున్నది. షుమారు 300 అడుగుల ఎత్తున్న జలపాతం . పిల్లలకు, పెద్దలకు మంచి విహారకేంద్రం. రెండుకొండల మధ్యలో ఉన్న ఈ తీర్థంలో నీళ్ళు స్వచ్ఛంగా మెరుస్తు వుంటాయుయి. కోలనులో నీరు ప్రవహిస్తూ వుంటుంది, కాని ఎటువెళుతుందో కనిపించదు. ఈ తీర్థం పైభాగంలో అత్యంత ఎత్తులో పాపనాశనం వుంది. ఇక్కడ 3 శతాబ్ధాలనాటి గిల్లితీగ అనే చెట్టు తలనకోనకే విశేషం. ఈ మొక్కలోని ప్రతిభాగం ఔషధయుక్తమే. గిరిజనులు ఈమొక్కను రకరకాల వ్యాధుల నివారణకు వాడుతారు. దీని కాయలు 3 అడుగుల నుండి నాలుగున్నర అడుగులదాకా వుంటాయట.
ఇక్కడ తెల్లని ఆర్కిడ్‌ పుష్పాలను చూడవచ్చును. మద్ది, జాలరి, చందనం, రక్తచందనం మొదలగు వృక్ష సంపదను చూడవచ్చును. అడవికోళ్ళు, నెమళ్ళు, దేవాంగపిల్లులు, ఎలుగుబంట్లు, ముచ్చుకోతులు మొదలగు వాటికి ప్రసిద్ధి ఈ ప్రాంతం. 40 అడుగుల ఎత్తున చెట్లమీద కట్టిన తాళ్ళవంతెన విశేషం. పడవ విహారాలకు అనుకూలం. పచ్చనిశాలువా కప్పుకున్నట్లున్న తూర్పుకనుమల అందాలని ఆస్వాదించవచ్చు. మంచి టూరిస్ట్‌ కేంద్రం కూడా. తిరుపతి నుండి ప్రతి ఉదయం 7 గంటలకు బస్సు సౌకర్యం వుంది.

కపిలతీర్ధం

శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళేదారిలో తిరుపతికి 2.5 కి.మి. దూరంలో వున్నది కపిలతీర్ధం. శివ భగవానుడు కపిల మహర్హిని ఆశీర్వదించిన ప్రదేశంగా చెప్పబడుచున్నది. కృతయుగంలో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలసినట్లుగా చెప్తారు. ముల్లోకాలలోని సకలతీర్థాలు మక్కోటి పౌర్ణమినాడు మధ్యాహ్నంవేళ పది ఘడియలపాటు (నాలుగుగంటలు) కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆసమయంలో అక్కడస్నానంచేసి నువ్వుగింజంత బంగారాన్ని దానంఇస్తే అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింప బడుతుందని భక్తుల విశ్వాసం.

జపాలి తీర్ధం

అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడకు వచ్చాడని భక్తుల విశ్వాసం. తిరుమలకు 5 కి. మీ దూరంలో కలదు. ఇక్కడ వెలసివున్న శ్రీ ఆంజనేయస్వామి వారిని హనుమజ్జయంతి రోజున వేలాదిగా భక్తులు దర్శించుకొంటారు.

పాండవతీర్థం

దీనికే గోకర్ణతీర్థమనీ పేరుంది. వేకంటేశ్వరాలయానికి ఈశాన్యదిశలో మైలు దూరంలో ఉన్న పాండవతీర్థంలోనే పాండవ సహోదరులు ఏడాదికాలం ఉన్నారని చెప్తారు. వైశాఖమాసంలో శుక్లపక్ష ద్వాదశిరోజు ఆదివారం నాడు పాండతీర్థంలో స్నానం చేయడంగాని లేదా కృష్ణపక్ష ద్వాదశీ మంగళవారంనాడు స్నానం చేయడంగాని మంచిదని భక్తులు భావిస్తారు.

కుమారధారా తీర్థం

తిరుమల కొండల్లో శ్రీవారి ఆలయానికి వాయువ్యదిశలో షుమారు 10 కిలోమీటర్ల దూరంలో వుంది. మాఘపౌర్ణమినాడు ఈ తీర్థంలో స్నానంచేస్తే పుణ్యప్రదమంటారు. ఆనాడు అక్కడ స్వామివారి ఆలయం నుండి ప్రసాదాన్ని తెచ్చి భక్తులకు పంచడం మరో విశేషం. కుమారస్వామి ఇక్కడే శ్రీవారి ఆష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసిన కారణంగా కుమారధారాతీర్థమన్న పేరు వచ్చిందని పేరు.

చక్రతీర్థం

ఈ తీర్ధం స్వామివారి ఆలయానికి వాయువ్యదిశలో వుంది. పుష్యమీ నక్షత్రం కలిసిన గురువారం కానీ శ్రవణానక్షత్రయుక్తమైన సోమవారంనాడు కానీ ఈ తీర్థంలో స్నానంచేస్తే పాపాలు నశించి, దీర్ఘాయువు, మోక్షసిద్ధి కలుగుతాయని ప్రతీతి.
విష్యక్సేన సరస్సు, పంచాయుధ తీర్థాలు, అగ్నికుండతీర్థం, బ్రహ్మతీర్థం, రామకృష్ణతీర్ధం, వైకుంఠతీర్థం, శేషతీర్థం, సీతమ్మతీర్థం, పుష్ఫతీర్థం, సనకసనందతీర్థం, సప్తర్షి తీర్థాల వంటివి ఇంకా అనేకం వున్నాయి.

ఏడుకొండలవాడా.. వెంకటరమణా గోవిందా గోవింద ..

నాటి తిరుమల

డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వుండే శీతాకాలంలో తిరుపతి సందర్శించడం మంచిది. ఇక్కడ వేసవి చాలా వేడిగా వుంది అసౌకర్యంగా వుంటుంది కనుక, ఆ సమయంలో ఇక్కడికి రాకుండా వుండడం మంచిది.

1955 Tirumala Video..

తిరుమల టికెట్లు లేవు,గోల,గందరగోళం లేదువ్యాపారం లేదు.క్యూలైన్ లేదు . అన్నివిషయాలలో సింపుల్ గా దర్శనం.ఎక్కడా దొరకనటువంటి అరుదైన వీడియో    

శ్రీవారిసేవా పథకం

మానవసేవే మాధవసేవ అనే పెద్దల మాటనూ భక్తులు కోరుకునే పత్యేక దర్శనం అవకాశాన్ని కలిగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంవారు 2001లో ప్రవేశపెట్టిన శ్రీవారిసేవా పథకం. పదిమందికి తక్కువకాకుండా ఒక బృందంగా ఏర్పడి వారం పాటు తాము తిరుమలలో స్వచ్ఛందసేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ శ్రీవారి సేవాసెల్‌కు ధరఖాస్తుచేసుకోవాలి.

ధరఖాస్తు చేయవలసిన అడ్రస్‌
శ్రీవారి సేవాసెల్‌, అన్నదానం కాంప్లెక్స్‌ ఎదురుగా
తిరుమల, ఫోన్‌ : 0877-2263293
ఇతర వివరాలకోసం : పౌరసంబంధాల అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల ఫోన్‌ : 0877-2264217

సేవచేయవలసిన ప్రదేశాలు : అన్నదానసత్రం, క్యూలైన్లు, కళ్యాణకట్ట, భక్తులు అలిపిరి – తిరుమల కాలినడక మార్గం, ఉచితంగా సామాన్లు భద్రపరచే గదులు, పార్కింగ్‌ ప్రదేశాలు, పుష్కరిణి, సమాచారకేంద్రం శ్రీవారి ఆలయం వీటిటో ఎక్కడ సేవ చేయాలని వుందో ముందుగా తెలియపరిస్తే భక్తుల ఆసక్తిని బట్టి వారికి ఆయా స్థానాలు కేటాయిస్తారు. ఇక్కడ పేదా గొప్ప తారతమ్యంలేదు ఎవరైనా శ్రీవారిసేవలో పాల్గొనవచ్చును.

నియమ నిబంధనలు
మొదట అడిగినవారికి మొదట అనే పద్ధతిలో వీలునుబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు స్వచ్ఛంద సేవా అవకాశాన్ని కలిగిస్తారు. ఇక ఆ ఏడురోజులు దేవస్థానం వారు ఇచ్చిన కాషాయవస్త్రాన్ని భుజాల చుట్టూ ధరించి అనుక్షణం గోవిందనామస్మరణచేస్తూ వుండాలి. తెల్లవారుజామున నగర సంకీర్తనం చేయాలి. ఇందుకు కావలిసిన పరికరాలను దేవస్థానంవారు అందిస్తారు. దేవస్థానం సిబ్బందితో కలిసి ఈ ఏడురోజులు రోజుకు నాలుగు గంటలనుండి ఆరుగంటలపాటు సేవచేయాల్సి వుంటుంది. ఆ ఏడురోజులు దేవస్థానంవారే ఉచితభోజన సదుపాయం కల్పిస్తారు.

తిరుపతిలో వసతి గృహాల వివరాలు

ఈ సముదాయాలలో బసచేసిన వారు ఇక్కడనుండి తిరుమలకు ఉచిత బస్సులలో వెళ్లవచ్చు. బుకింగ్ కైంటర్ వద్ద తిరుమలకు వెళ్లేవారందరివి ఆధార్ ఒరిజనల్ కార్డులు చూపించాలి.
శ్రీనివాసం అతిథి గృహ సముదాయం :
నాన్- ఎ సిగదులు : రూ.200-
ఎసి గదులు : రూ.400-
ఎ సి డీలక్స్ గదులు : రూ.600-
సంప్రదించవలసిన చిరునామా :సూపరిండెంటెంట్ ఫోన్ : 0877-2264541
మాధవం అతిధి గృహం :
ఎసి ఆర్డనరి గదులు : రూ.800-
ఎ.సి. డీలక్స్ గదులు : రూ.1000-
శ్రీ వేంకటేశ్వరా ధర్మశాల : తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా
సింగల్ రూం : రూ.50-
డబుల్ రూం : రూ.100-
నాలుగు బెడ్ల రూంలు : రూ.100-
ఫోన్ : 0877-2225144
(S.V. Guest House) శ్రీ వేంకటేశ్వరా అతిధి గృహం : తిరుపతి రైల్వే స్టేషన్ కు ఉత్తరం పక్కగారైల్వేస్టేషన్ కు, ఆర్టీసీ బస్టాండ్ కు మధ్యలో ఉంటుంది.
ఎ.సి., నాన్ ఎ.సి గదులు 55 రూములు – రూ.150- ఒక్కొక్కటికి. వీటి బుకింగ్ మాత్రం విష్ణు నివాసంలోనే
ఫోన్ : 0877-2264507
శ్రీ గోవిందరాజా ధర్మశాల :
రైల్వే స్టేషన్ కు వెనుక వైపున కలదు. ఉచిత మరియు అద్దె గదలు ఇస్తారు. 192 గదులున్న సత్రం పూర్తిగా ఉచితం. 181 గదులున్న మరో సత్రంలో గదుల అదె రూ.50- మాత్రమే. మధ్యాహ్నం, రాత్రి ఉచిత భోజనం. వివరాలకు 0877-224503.
శ్రీ విష్ణు నివాసం :
నాన్ ఎ సి గదులు : 196 గదులు– రూ.300-
నాన్ ఎ సి సూట్స్ : 8 గదులు – రూ.500-
ఎసి గదులు : 196 గదులు – రూ.800-
ఎ.సి. సూట్స్ : 8 – రూ.1,300-

Srivari Darsanam Facilities, Tirumala Darsanam Facilities

వృద్ధులకు, వికలాంగులకు దర్శన వేళలు
శ్రీవారి దర్శనానికి వచ్చే వికలాంగులు, వృద్ధులకు తితిదే ప్రత్యేక ప్రవేశ అవకాశం కల్పిస్తోంది. మందిరం మహాద్వారం సమీపం నుంచి ఆలయంలోకి చేరుకునే సౌలభ్యం కల్పించింది. నిత్యం ఉదయం 10, మధ్యాహ్నం 3గంటలకు ఆలయ ప్రవేశాలకు అనుమతిస్తుంది. ఈ దర్శన సమయాల కన్నా గంట ముందుగా ఆయా భక్తులు పరిశీలనకు హాజరవ్వాల్సి వుంటుంది. 65 ఏళ్లకు పైబడిన వృద్ధులకు వయస్సు ధ్రువీకరణ పత్రం ఆధారంగా అనుమతిస్తారు. నడవలేని పరిస్థితిలో ఉన్నవారి వెంట సహాయకులను అనుమతిస్తారు. వికలాంగులు, గుండె జబ్బుతో ఆపరేషన్ చేసుకున్న భక్తులను వైద్యులు జారీచేసి పత్రాల పరిశీలన అనంతరం అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాలు వంటి విశేష పర్వదినాల్లో ఈ దర్శనాలను తితిదే రద్దు చేస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తితిదే ముందుగానే ప్రకటిస్తుంటుంది
సర్వదర్శనం :
ఉచిత దర్శనం : తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి ప్రతి రోజు సుమారు 60 నుండి 80 వేల మంది దాకా యాత్రికులు వస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా ఉచిత దర్శనం కల్పిస్తారు. మామూలు రోజులలో 18 గంటలు, పండుగ, ముఖ్యదినాలలో రోజుకు 20 గంటలు వీరికి కేటాయిస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయానికి అనుసంధానించబడిన అనేక హాల్స్ కలవు. ఈ హాల్స్ నందు ఉన్న భక్తులకు ఉచిత అన్న ప్రసాదం, ప్రతి మూడు గంటలకొకసారి, పాలు, కాఫీ, టీ ఉచితంగా ఇస్తారు. ఉచిత వైద్య సౌకర్యం ఉంటుంది. పరిశుబ్రమైన మరుగుదొడ్లు ఉంటాయి. టి వీలలో దైవసంబంధమైన కార్యక్రమాలు వస్తుంటాయి.
శీఘ్రదర్శనం :
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన వేళలు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రత్యేక దర్శనవేళలు ఒక్కోరోజు ఒక్కోవిధంగా ఉంటాయి. స్వామివారికి జరిగే నిత్య, వారపు సేవలను బట్టి ఆయా సమయాలను తితిదే నిర్దేశించింది. టిక్కెట్లను ముందస్తుగా అంతర్జాలం, ఈ-దర్శన్, తపాలా శాఖ ద్వారా విక్రయిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రంలోపు నిర్దేశించిన సమయంలోపు శ్రీవారిని దర్శించుకునే వేళలను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న సమయం టిక్కెట్టుపై ముద్రితమవుతుంది. ఈ సమయానికి మాత్రమే ఆలయానికి చేరుకోవడానికి వరుస వద్దకు రావాల్సి ఉంటుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నిత్యం రూ.300 ధర వంతున 26వేల టిక్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 56 రోజులకు ముందుగా టిక్కెట్లను పొందే అవకాశం ఉంది. విశేష పర్వదినాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని టిక్కెట్ల సంఖ్యను దేవస్థానమే తగ్గిస్తుంది.
కాలినడక భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు :
అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు కాలినడకన రావడానికి తితిదే అనుమతిస్తుంది. అలిపిరి నుంచి 24 గంటల సమయం, శ్రీవారి మెట్టు ల నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రవేశం కల్పిస్తుంది. గరుడోత్సవం సమయంలో 24 గంటల సమయం అనుమతించాలని నిర్ణయించింది. అడవి జంతువులను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి మెట్టు మార్గంలో పగటి సమయంలో మాత్రమే భక్తుల రాకపోకలకు అనుమతిస్తున్నారు. వీరికి మార్గమధ్యంలో దివ్యదర్శనం టోకెన్లను తితిదే ఉచితంగా జారీ చేస్తుంది. టోకెన్లను పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం ఉచితంగా కల్పించడంతో పాటు ఒక లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తారు. రెండు లడ్డూలు కావాలంటే రూ. 10 చొప్పున రాయితీపై అందజేస్తారు. అవసరమైన వారు రూ. 25 ధరపై మరో రెండు లడ్డూలూ పొందవచ్చు. భక్తుల లగేజీని తితిదేయే తిరుమలకు ఉచితంగా చేరవేస్తుంది. అలిపిరి, శ్రీవారిమెట్టు ప్రవేశమార్గంలో ఈ ఉచిత లగేజీ రవాణా కేంద్రాలు ఉన్నాయి. అక్కడ భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసి రశీదు చూపి ఈ లగేజీని తీసుకోవచ్చు.

కపిలతీర్దం

తిరుపతి కొండకు అనుకుని అలిపిరి దిగువకు వెళ్తే సుందరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. వర్షాకాలంలో ఇక్కడకు వస్తే ప్రకృతి దృశ్యాలు, జపాతాలు కనువిందు చేస్తాయి..
స్థలపురాణం : కృతయుగం కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరునికి కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు పాతాళంనుండి భూమిని చీల్చుకుని వచ్చి వెలశాడని స్థలపురాణం.అందుకే ఈ స్వామిని కపిలేశ్వరుడని, లింగాన్ని కపిల లింగమని పిలుస్తారు. తిరుపతిలో ఉన్న ఏకైక శివాలయం ఇది. తిరుమల కొండ మీద నుండి గలగలా పారుతూ 20 అడుగుల ఎత్తు నుండి ఇక్కడవున్న పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈపుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవు ఆళ్వార్‌ తీర్థమని పిలుస్తారు. 11వ శతాబ్ధంలో ఈ ప్రాంతాన్ని పాలించి మొదటి రాజేంద్ర చోళుని కాంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. కపిలతీర్థంలో కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్నవేళ ముల్లోకాల్లోని సక తీర్థాలు నాలుగు గంటలపాటు కపితీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు దూదిపింజల్లా పోతాయని ప్రసిద్ధి. కార్తీకమాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి భక్తుల తాకిడి ఎక్కువతుంది. నిత్యం ఈ తీర్థంలో స్నానంచేసి దీపాలు వెలిగిస్తారు. కార్తీకంలో ఆరుద్రా నక్షత్రం రోజున శివునికి లక్షబిళ్వార్చన, అన్నాభిషేకం వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం డిసెంబరులో తెప్పోత్సవాలు, మాఘమాసంలో 10 రోజులపాటు బ్రహ్మోత్సవాు ఘనంగా జరుగుతాయి.
ఎలావెళ్ళాలి : తిరుపతి బస్టాండ్‌ నుండి అలిపిరి మార్గంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్‌ నుండి తిరుమల దేవస్థానం వారి ఉచిత బస్సులలో వెళ్ళవచ్చు.

తలకోన జలపాతం

సుమారు 300 అడుగుల ఎత్తున్న ఈ జలపాతం పిల్లలకుకు మరియు పెద్దలకు మంచి విహారకేంద్రం. రెండు కొండల మధ్య ఉన్న ఈ జలపాతంలోని నీరు స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటుంది. కొలనులో నీరు ప్రవహిస్తూ ఉంటుంది కాని ఎటు వెళ్తుందో తెలియదు. ఈ తీర్థానికి అత్యంత ఎత్తులో పాపనాశనం ఉంది. 3 శతాబ్ధానాటి గిల్లితీగ అనే మొక్క తలకోనకే తలమానికమని చెబుతారు. ఈ మొక్కలోని ప్రతిభాగం ఔషధ యుక్తమే. గిరిజనులు ఈ మొక్కను వివిధ వ్యాధుల నివారణకు వాడతారట. ఈ మొక్క కాయలు మూడున్నర అడుగుల నుండి నాలుగడుగుల దాకా ఉంటాయంటారు. ఇక్కడ తెల్లని ఆర్కిడ్‌ పుష్పాలు, మద్ది, జాలరి, చందనం, రక్తచందనం మొలదగు వృక్ష సంపదను చూడవచ్చును. అడవికోళ్ళు, నెమళ్ళు దేవాంగన పిల్లులు, ఎలుగుబంట్లు, ముచ్చుకోతులకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. 40 అడుగుల ఎత్తుమీద కట్టిన తాళ్ళవంతెన ప్రత్యేకం.పడవలలో విహారం చేయవచ్చును. పచ్చని శాలువా కప్పుకున్నట్లు తూర్పు కనుమల అందాలు కనువిందు చేస్తాయి. మంచి టూరిస్టు కేంద్రం
ఎలా వెళ్ళాలి : తిరుపతి నుండి సుమారు 50 కి.మీ దూరంలో యర్రవారి మండలంలో కలదు. తిరుపతి నుండి బస్సులలో వెళ్ళవచ్చు.

బ్రహ్మోత్సవాలు

శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో దసరా పండగ నుండి 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రోజుకు రెండు వాహనాల చొప్పున తొమ్మిది రోజుల పాటు తిరువీధులలో స్వామివారి ఊరేగింపు కన్నుల పండుగగా జరుగుతుంది.
మొదటి రోజు అంకురార్పణ :
బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఆరంభం అవుతాయి. ఈ ఉత్సవాలకు సోముడు(చంద్రుడు) అధిపతి. ఆలయానికి నైరుతీ దిశలో ఉన్న వసంతమండపం వద్ద నుంచి మట్టిని సేకరించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి తొమ్మది కుండలలో(పాళికలు) ఆ మట్టిని నింపి నవధాన్యాలను పోసి మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. అంకురాలను ఆరోపించే కార్యక్రమం కాబట్టి దీనిని అంకురార్పణ అంటారు.
ధ్వజారోహణం :
బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ఎగురవేసే గరుడ పతాకమే ధ్వజారోహణం. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి ఒక కొత్త వస్త్రంపై గరుడుని బొమ్మని చిత్రిస్తారు. దీనిని గరుడధ్వజం అంటారు. నూలుతో పేనిన కొడితాడుకు దీనిని కట్టి ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. గోధూళిలగ్నమైన మీనలగ్నంలో ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవి సమక్షంలో గరుడపతాకాన్ని ఎగురవేస్తారు. ధ్వజస్తంభంపై ఎగిరే గరుడ పతాకమే సకలదేవతలకు, అష్టదిక్పాలకులకు, యక్ష గందర్వులకు ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకొని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు తిరుమలలో కొలువై ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
పెద్దశేషవాహనం :
శ్రీనివాసుని పానుపు శేషుడు. శేష వాహనంతోనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ధ్వజారోహణం రోజున స్వామివారు శ్రీదేవి, భూదేవీ సమేతంగా సర్వాలంకారభూషితుడై పెద్ద శేషవాహనం ఎక్కి తిరుమల ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగుతారు.
రెండవరోజు :
చిన్న శేషవాహనం రెండవ రోజు ఉదయం స్వామివారు తన ఉభయదేవేరులతో కలసి ఐదుశిరస్సుల చిన్నవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడుగా, చిన్న వాహనాన్ని వాసుకిగా భావిస్తారు.
హంసవాహనం : రెండవ రోజు రాత్రి స్వామివారు సర్వవిద్యా ప్రదాయని అయిన శారదా మాతరూపంలో హంసవాహన మొక్కి ఊరేగుతారు. హంస అనే శబ్ధానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే మనోమందిరం అని అర్ధం. అల్పమైన కోర్కెలు అనెడి అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తిమార్గం వైపు నడవాలని హంసవాహనం ద్వారా స్వామి వారు భక్తులకు చాటుతున్నారని భక్తుల విశ్వాసం.
మూడవ రోజు :
బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు ఉదయం సింహ వాహనంపై తిరుమల నాధుడు ఊరేగుతాడు. యోగాస్త్రంలో సింహాన్ని వాహనశక్తికి, గమన శక్తికి సంకేతంగా భావిస్తారు. శ్రీనివాసుడు విశ్వానికి తనలోని పరాక్రమాన్ని చాటటానికి ఈ వాహనంపై భక్తలకు కనువిందు చేస్తాడని నమ్ముతారు.
ముత్యపు పందిరి వాహనం :
మూడవ రోజురాత్రి ముత్యపు పందిరి వాహనంపై వేంకటవల్లభుడు తిరువీధులలో ఊరేగుతాడు. ముక్తి సాధనకు ముత్యంలాంటి స్వచ్ఛమైన మనస్సు కావాలని, నిర్మల చిత్తం అలవరచుకోవాలని భక్తలకు చాటిచెప్పటం ఈ వాహన అంతర్యం.
నాలుగవ రోజు :
కల్పవృక్ష వాహనం – నాలుగవ రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు. కోరిన వరాలిచ్చే కల్పవృక్ష వాహనంపై అడగకనే అన్నీ ఇచ్చి ముక్తి ప్రసాదించే దేవదేవుడు కొలువు తీరి ఊరేగే ఈ ఉత్సవం కనుల పండుగగా సాగుతుంది.
సర్వభూపాల వాహనం :
లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తనేనని చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగో రోజు రాత్రి సర్వభూపాల వాహనంపై ఊరేగుతారు. ఈ వాహన సేవ దర్శనం వలన మనలోని అహంకారం నశిస్తుందని నమ్మకం.
ఐదో రోజు :
బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ఉదయం శ్రీవారు మోహినీ అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. అన్నివాహన సేవలు వాహన మండపం నుంచి ఆరంభమైతే మొహిని అవతారం మాత్రం ఆలయం నుంచి వెలుపలకి వస్తుంది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీవారు మోహినీ అవతారంలో మాడ వీధులలో ఊరేగుతారు. మంచి కార్యాల వలన ఎలాంటి శుభాలు జరుగుతాయో చెప్పటానికి అలనాటి క్షీరసాగర మధనం సన్నివేశాలను గుర్తుకు తెస్తూ శ్రీవారు భక్తలను కనికరిస్తున్నారని నమ్మకం.
ఐదవ రోజు రాత్రి:
గరుడోత్సవం – శ్రీవారి అన్ని ఉత్సవాలకంటే ఘనమైనది గరుడోత్సవం. బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు రాత్రి గరుత్మంతుడి వాహనంమీద స్వామివారు ఊరేగుతారు. ఈ ఉత్సవంలో మూలవిరాట్ కంఠాభరణమైన మకర కంఠి, లక్ష్మీహారం, సహస్రనామాలను ఉత్సవమూర్తులకు అలంకరిస్తారు. వేంకటేశ్వర స్వామిని అనేకరీతుల కొనియాడిన గోదాదేవి పుట్టినల్లు అయిన శ్రీవిల్లి పుత్తూరు నుంచి పంపే తులసీమాల,నూతన గొడుగులు గరుడవాహనంలో అలంకరిస్తారు. ఉత్సవమూర్తి మలయప్ప మొడలోని మకరకంఠి (గరుడపచ్చ) దర్శనంతో సర్వశుభాలు కలుగుతాయని భక్తు విశ్వాసం. అందుకే గరుడోత్సం రోజున తిరుమల కొండ లక్షలాది మందిభక్తులతో కిటకిటలాడుతుంది.
ఆరవరోజు :
ఆరవరోజు ఉదయం జరిగే వాహన సేవలో హనుమంతుడి వాహనంపై శ్రీవారు ఊరేగుతారు. హనుమంతుని భక్తి తత్పరతను చాటిచెబుతూ, రాముడైనా కృష్ణుడైనా, శ్రీవేంకటేశ్వరుడైనా అన్నీ తానే అని వాహనం ద్వారా స్వామి చాటి చెబుతారు.
గజవాహనం:
ఆరవ రోజురాత్రి గోవిందుడు గజవాహనధారుడై భక్తులను కనికరిస్తాడు. గజవాహనంపై ఊరేగే శ్రీవారిని దర్శించుకుంటే ఎంతపెద్ద సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
ఏడో రోజు :
ఏడోరోజు ఉదయం భానుడు తన రథసారధిగా, సప్తాశ్యాలు కూర్చిన రథంపై ఎర్రటి పూలమాలలు ధరించి మలయప్పగా ఊరేగుతాడు. భక్తుల అజ్గ్నానాంధకారాన్ని తొలగించడానికి శ్రీవారు ఈ వాహనంపై ఊరేగుతారు
చంద్రవాహనం:
ఏడో రోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పూలమాలలు ధరించి చిరునవ్యులు చిందిస్తూ మలయప్ప చంద్రవాహనంపై ఊరేగుతారు. సర్వజనులు శాంతికాములై చల్లగా ఉండాలని దీవిస్తూ శ్రీవారు ఈ వాహనంపై ఊరేగుతారని అంటారు.
ఎనిమిదవ రోజు :
గుర్రాలవంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి, రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపుచేయాలనే తత్వజ్గ్నానాన్ని శ్రీనివాసుడు ఎనిమిదవ రోజు రథోత్సవం ద్వారా తెలియజేస్తారు.
అశ్వవాహనం :
ఎనిమిదో రోజు రాత్రి శ్రీవారు అశ్వవాహనం మీద ఊరేగుతారు. కలియుగాంతంలో శ్రీనివాసుడు గుర్రంమీద వచ్చి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తాడని చాటి చెప్పటమే ఈ వాహన సేవ ఆంతర్యం.
తొమ్మిదవ రోజు :
చక్రస్నానం- ఎనిమిది రోజుల పాటు వాహన సేవలలో అలసిపోయిన స్వామి సెదతీరటం కోసం తొమ్మిదవ రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. ఈ సందర్భంగా వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో కూడిన స్వామి ఉత్సవమూర్తులకు అభిషేకం చేస్తారు. అనంతరం స్వామివారు మరో రూపమైన చక్రతాళ్వార్ ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించటంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రతాళ్వార్ స్నానమాచరించే సమయంలో పుష్కరిణిలో స్నానమాచరిస్తే సకల పాపాలు పోతాయని భక్తుల పోతాయని భక్తుల నమ్మకం.
ధ్వజారోహణం :
చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వనిస్తూ తొలిరోజు ఎగురవేసిన గరుడధ్వజ పతాకాన్ని అవరోహణం చేస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

అన్నప్రసాదం

తిరుమలలో భక్తులందరికీ తితిదే స్వామివారి అన్నప్రసాదం అందజేస్తోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో ఉదయం 9.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఎలాంటి సిఫార్సు లేకుండా ప్రతిఒక్కరూ ఈ అన్న ప్రసాదాన్ని ఉచితంగా స్వీకరించవచ్చు. బ్రహ్మోత్సవాల్లో రద్దీ ప్రాంతాలను గుర్తించి అక్కడే భక్తులకు అల్పాహారం, పానీయాలనూ అందించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది.

శ్రీవేంకటేశ్వర మ్యూజియం

1997 సం.లో ఆలయం ఉత్తర భాగం వైపు నిర్మించిన ఈ మ్యూజియం భారత దేశంలోనే అత్యధికులు సందర్శిస్తున్న ప్రదర్శనశాల అన్నమయ్య తిరుమలేశునికి వేల సంకీర్తనలు అర్చించాడు. ఆ వాగ్గేయకారుని పద సంపద దర్శించాలనుకుంటే. శ్రీవేంకటేశ్వర మ్యూజియానికి తప్పక వెళ్లాలి. 16వ శతాబ్దంలో అన్నమయ్య రాసిన సంకీర్తనలు అక్కడ రాగిరేకులపై చూడవచ్చు. ఏడుకొండలవాని వాహనాలు, అపురూప చిత్రాలు, అందమైన విగ్రహాలు, భిన్న కళాకృతులు ఎన్నిటినోఇక్కడ చూడవచ్చు. 1.25 లక్షల చదరపు అడుగుల విశాల ప్రాంగణంలో వీటన్నిటినీ భద్రపరిచారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 నిమిషాల వరకు ఈ మ్యూజియం తెరచి ఉంటుంది. మ్యూజియం పైన మెడిటేషన్ చేయటానికి సౌకర్యం కలదు. కర్ణాటక గెస్ట్ హౌస్ దగ్గరలో మ్యూజియం కలదు.

ఆన్ లైన్ లో సేవల బుకింగ్, వసతి గృహాల బుకింగ్, దర్శనం…….

Ahobilam Narasimha Swamy

ఈ క్షేత్రంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఊగ్రనరసింహస్వామి. హిరణ్యకశిపుని వధించటం కోసం హరి నరహరిగా ఆవిర్భవించిన ప్రదేశంగా చెబుతారు. అహోబిలం యాత్రాస్థలమే కాకుండా మంచి పర్యాటక కేంద్రంగా కొండల నదులు, ప్రకృతి అందాలకు నెలవు. భవనాశని నది మరియు జలపాతం ఇక్కడ కలవు.

ఈ భూమి మీద ఉన్న నాలుగు దివ్వమైన నారసింహ క్షేత్రాలో అహోబిలం ఒకటి. రాక్షస రాజైన హిరణ్యకశిపుని సంహరించటానికి తన శిష్యుడైన ప్రహ్లాదుని రక్షించటానికి స్తంభమునుండి ఉద్భవించిన స్ధలమే అహోబిల క్షేత్రము. వ్యాసమహర్షి ఈ స్థలపురాణం గురించి బ్రహ్మాండపురాణం అంతర్గతంలోనూ 10 అధ్యాయాలు 1046 శ్లోకాలతో సంస్కృతంలో వ్రాయబడినది. ఎగువ అహోబిలం మరియు దిగువ అహోబిలం చుట్టు ప్రక్కల నవనారసింహలను దర్శించవచ్చు. ఇంకా ఇక్కడ చూడదగ్గవి ప్రహ్లాదబడి అనే చిన్న గుహ. కొండమీద నుండి పడే నీటితో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గుహ ఎదురుగా విశాలమైన రాళ్ళ చప్టాతో సహజసిద్ధంగా ఉంటుంది. అహోబిల మఠం మరియు ఊగ్రస్ఠంభంను చూడవచ్చు. ఈ స్థంభంనుండే నారసింహుడు ఉద్భవించాడని అంటారు.

ఎలా వెళ్లాలి ? ఈ క్షేత్రం నల్లమల అడవులలో, కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వే స్టేషన్‌కు 68 కి.మీ. దూరంలోనూ ఆళ్ళగడ్డకు 24 కి.మీ. దూరంలోను కలదు.

Sree Raghavendra Swamy… Mantralayam…శ్రీ రాఘవేంద్రస్వామి..మంత్రాలయం

Mantralayam Sree Raghavendra Swamy

ఆంధ్రరాష్ట్రంలోనే కాక దేశవ్వాప్తంగా పేరుపొందిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కర్నూలు జిల్లాలోని మంత్రాలయం ఒకటి- దీనినే శ్రీ రాఘవేంద్రస్వామివారి మఠం అంటారు. తమిళనాడు-భువనగిరి వాసులైన తిమ్మనభట్టు-గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు (రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే!) 1595లో జన్మించారు. ఐదేళ్లప్రాయంలో అక్షరాభ్యాసం చేసి.. ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని.. సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు.

స్థల పురాణం: మంత్రాలయాన్నే ఒకప్పుడు మంచాల గ్రామంగా పిలిచేవారు. ఆదోని నవాబు సిద్ధిమసూద్‌ఖాన్‌ పాలనలో ఉండేది.నవాబు నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్రస్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చెయ్యాలంటూ దివాన్‌ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారట! రాఘవేంద్రస్వామి మధ్వమఠంలో సన్యాసం స్వీకరించారు. స్వామి పూర్వ అవతారం శ్రీమహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు అని అంటారు. పూర్వవతారంలో రాజుగా పాలించిన స్థలం ఇదే కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు (జీవ సమాధి) కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత మంచాలమ్మ కూడా రాఘవేంద్రస్వామిని ఇక్కడే ఉంచాలని కోరిందంటారు! దీంతో స్వామి ఇక్కడే నివసిస్తూ చివరకు 1671లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవసమాధి అయ్యారు. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని… అనంతరం రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకొంటారు. రాఘవేంద్రస్వామి దర్శనానంతరం భక్తులకు ప్రత్యేక ప్రసాదం ఇస్తారు.

దర్శన సమయాలు
రోజూ ఉదయం 6-00 గంటల నుంచి 8.30 వరకూ దర్శనానికి అనుమతిస్తారు. అరగంట విరామం తర్వాత తిరిగి ఉ. 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత దర్శనం. ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు.

ప్రత్యేక పూజలు
సంపూర్ణ అన్నదాన సేవ సమర్పణ సేవ, వస్త్ర సమర్పణ సేవ, పట్టువస్త్ర సమర్పణ సేవ, బంగారు పల్లకి సేవ, కనక కవచ సమర్పణ సేవ, రజత రథోత్సవ సేవ, రథోత్సవ కనక మహాపూజ, పూర్ణసేవ, మహాపూజ, ఉత్సవరాయ పాదపూజ, ఫల పంచామృతాభిషేకం, పంచామృత సేవ, శ్రీవాయుస్తుతి పునశ్చరణ సేవ, శ్రీవాయుస్తుతి పునశ్చరణ, శ్రీ సత్యనారాయణ స్వామిపూజ, సామూహిక సత్యనారాయణ స్వామిపూజ, గోదాన సేవ ఈ ఆర్జిత సేవలను భక్తులు ఆన్‌లైన్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు లేదా నేరుగా శ్రీ మఠానికి వచ్చి.. బుక్‌ చేసుకోవచ్చు. పూజల సమయాలు, చెల్లించవలసిన రుసుము ఇతర వివరాలకు చూడండి : Sri Raghavendra Swamy వెబ్‌సైట్‌లో దర్శించండి.

భోజనం :
భక్తులందరికీ ఉచిత నిత్యాన్నదానం ఉ. 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉంటుంది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ నామమాత్రపు ధరకు పులిహోర, పెరుగు అన్నం ఇస్తారు.

వసతి సౌకర్యం
మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో 500 గదులున్నాయి. ఇవికాక కర్ణాటక, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన పలు గెస్ట్‌హౌస్‌ల్లోనూ గదులు అందుబాటులో ఉంటాయి. .
పూర్తి వివరాలకు… Sri Raghavendra Swamy వెబ్‌సైట్‌లో దర్శించండి.

Srisailam Temple…శ్రీ శైలం దేవాలయం

ఈ మహాక్షేత్రం భరద్వాజ, పరాశర మహర్షుల తపోవనాaతోనూ, చంద్రగుండం, సూర్యగుండం పుష్కరిణులతోనూ, అనంతమైన ఓషది మొక్కలతోనూ విరాజిల్లే ఈ క్షేత్రాన్ని ఏటాల క్షలాది భక్తులు సందర్శిస్తుంటారు. కృష్ణానది బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అని పిలిచే మూడు పర్వత పాదాలను తాకుతూ ప్రవహిస్తూ ఈ క్షేత్రానికి మరింత శోభను తెస్తుంది.

ఈ మహాక్షేత్రానికి నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. తూర్పున త్రిపురాంతకం, పశ్చిమాన అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం, దక్షిణంలో సిద్ధపటం ద్వారాలు. . ఆలయం వెలుపల పాండవప్రతిష్ట శివలింగాలను, వీరభద్రస్వామిని దర్శించుకోవచ్చు. మల్లిఖార్జున స్వామి గర్భాలయానికి ఆనుకుని ఉన్న గుండాన్ని బ్రహ్మగుండం అనీ, సప్తమాతృకలకు ఆనుకుని ఉన్నదాన్ని విష్ణుగుండం అని అంటారు. రంగమండపంలోస్వామి భక్తులైన హేమారెడ్డి మల్లమ్మ, అక్కమహాదేవి విగ్రహాలను దర్శించవచ్చు. వీరభద్ర ఆలయానికి తూర్పుభాగంలో మల్లికా గుండం ఉంది. దీనికి పైభాగంలో మండపం ఉన్నప్పటికీ గుండంలో స్వామి ఆలయ శిఖరం కనిపిస్తుంది. ఈ నీటిని స్వామివారి అభిషేకానికి వాడతారు. ఆలయంలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నదిలోనీ నీరుఈ గుండంంలోకి చేరుతూ నిరంతరం ఒకే స్థాయిలో ఉంటుంది.

భ్రమరాంబికాదేవి : అష్టాదశ శక్తిపీఠంలో మహిమాన్వితమైనది భ్రమరాంబికా శక్తి పీఠమే అంటారు. రెండువేల సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో వామాచార సంప్రదాయం ఉండేదట. శంకరాచార్యుల అమ్మవారి ఎదురుగా శ్రీచక్రాన్ని స్థాపించి దక్షిణాచార సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఆదిశక్తి భ్రమరాంబికా దేవిగా ఈ ఆలయంలో వెలసింది. ఇందుకు గుర్తుగా అమ్మవారి ఆలయం వెనుక ఉన్న గోడ నుండి భ్రమర ఝుంకారం వినిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో లోపాముద్ర విగ్రహం ఉంది. అగస్త్య మహర్షి తన భార్య లోపాముద్రతో కలిసి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణాల్లో ఉంది.
ఆలయం బయట శంకరమఠం, అమం వీరేశ్వారాయం, గంగాధర మండపం, శృంగేరీ శారదా మఠం, నందు మఠం, మ్లమ్మ కన్నీరు, గిరిజాశంకరుడు, వరాహతీర్థం, పశుపతినాథ లింగం, గోగర్భం, బయలు వీరభద్రుని దర్శించుకోవచ్చు. ఇక్కడే ఉన్న చుక్కల పర్వతానికి 16 కి.మీ. దూరంలో ఉన్న అక్కమహాదేవి గుహకు నదీమార్గం ద్వారా వెళ్ళవచ్చు.

సాక్షి గణపతి : ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి ఆలయం ఉంది. భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినట్లు ఈ గణపతి సాక్ష్యం చెబుతాడు. అందుకే ఇక్కడ గణపతిని సాక్షి గణపతి అని పిలుస్తారు. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా తమ గోత్రనామాలను చెప్పుకుంటారు.
పాలధార, పంచధారలు: ఇక్కడ కొండలోయ చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది. లోయలోకి దిగటానికి మొట్లు అనుకూలంగా ఉంటాయి. మెట్లు దిగగానే ఎడమప్రక్క ఒకచోటనుండి పాలధార, ప్రక్కనే ఐదు నీటిధారలు ఉన్నాయి. మొదటిది శివుని ఫాలభాగం నుంచి ఉద్భవించిందనీ మిగిలిన ఐదూ శివుని పంచముఖాల నుంచి ఉద్భవించినవనీ చెబుతారు. పాలధార తెల్లగాను, పంచదార తియ్యగాను ఉంటాయి. ఈ నీటిని చాలామంది ఔషధంలా వాడుకుంటారు. ఈ నీటిధారలు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి.

హటకేశ్వరం : ఇది పాలధార, పంఛదారలకు కేవలం యాభై అడుగుల దూరంలో ఉంటుంది. శివభక్తుడైన కుమ్మరి కేశప్పకు శివుడు అటికలో (కుండ పెంకులో) బంగారు లింగరూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్రదేశమే హటకేశ్వరం.

నాగావళి తోట :నాగావళి తోటలో శివభక్తురాలు చంద్రావతి మల్లికార్జునుడికి మల్లెమాల వేస్తున్న దృశ్యం, బ్రమరాంబికాదేవి ఛత్రపతి శివాజీకి ఖడ్గాన్ని ప్రసాదిస్తున్న దృశ్యాలను చూడవచ్చు.
ఇతర వివరములకు సంప్రదించవలసిన చిరునామా
Executive Officer
Srisaila Devasthanam
Srisailam 518101
Phone: 08524 – 288883,288885,288886,288887,288888.
E-mail: eo@srisailamtemple.com
for Devastanam website click here

Lepakshi Temple / లేపాక్షి దేవాలయం

లేపాక్షి చారిత్రత్మకం మరియు బౌగోళికంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రాంతం. భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన 108 శివాయాలలో లేపాక్షి ఒకటి అని స్కంధపురాణంలో లేపాక్షి గురించి చెప్పబడియున్నది. 16వ శతాబ్ధంలో పెనుగొండ కోటలో ఖజానా అధికారిగా ఉన్న విరుపన్న వీరభద్రస్వామి ఆలయాన్ని కట్టించాడని చారిత్రక ఆధారాలున్నాయి. క్రీ.శ. 1530లో కట్టబడినది భావించుచున్న నృత్యశాల 100 స్థంబాల మీద కట్టబడి ఆనాటి శిల్పకళకు దర్పణం పట్టుచున్నది. నిలువెత్తు వీరభద్రుని విగ్రహం, నంది విగ్రహం. ఎగిరే గంధర్వుల బొమ్మలు, నాగలింగం, గణేశ విగ్రహాలు చూపరులకు కనువిందు చేస్తాయి. మంటపం మధ్యలో 21 అడుగుల ఎత్తున్న పద్మం ప్రత్యేక ఆకర్షణ. ప్రతి సోమవారం ఇక్కడ ప్రత్యేకపూజలు జరుగుతాయి. ఆశ్వయుజ మాసంలో (ఫిబ్రవరి) 10రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు అనంతపురం జిల్లానుండియే కాక దూర ప్రాంతాలనుండి కూడా భక్తులు అధికసంఖ్యలో వస్తారు.

ఎలా వెళ్లాలి : లేపాక్షి అనంతపురానికి 110 కి.మీ. దూరంలో ఉన్నది. రోడ్డుమార్గంలో (బస్సులో) వెళ్ళవచ్చు. హిందూపుర్‌కి 15 కి.మీ. దూరంలో ఉంటుంది. హిందూపూర్‌కు రైలు మార్గంలో వెళ్ళవచ్చు.

Ontimitta Kodanda Rama Swamy / ఒంటిమిట్ట కోదండ రామాలయం

కడప జిల్లాలో ప్రసిద్ధి చెందిన పురాతన దేవాలయం ఇది. ఇక్కడ వున్న విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడని ప్రతీతి. ఒకే శిలలో ఉన్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చూడవచ్చు. మిట్టపై గుడిని నిర్మించడం వలన వొంటిమిట్ట రామాలయమని పేరు వచ్చిందంటారు. అద్భుతమైన శిల్పకళా చాతుర్యంతో ఈ దేవాలయం అరాలరుతుంది. గోపుర నిర్మాణం చోళ సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ఏకశిలా నగరమని కూడా ప్రసిద్ధి. ప్రధాన ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. ఆంధ్రమహా భాగవతాన్ని రచించిన పోతన కూడా తాను ఏకాశిలానగర వాసినని చెప్పుకున్నాడు. పోతన తన భాగవతాన్ని ఇక్కడే రామచంద్రునికి అంకితం గావించాడు.ఈ కవి విగ్రహాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. ప్రౌడదేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఇతని మనుమడే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు.

ఈ దేవాలయానికి 3 గోపురద్వారాలు మరియు విశాలమైన ఆవరణ ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజు ఈ ఆలయాని మూడుదశలుగా నిర్మించారు. ఆంధ్రావాల్మీకిగా పేరుపొందిన వావిలి కొను సుబ్బారావు(1863`1936) ఈ దేవాయ పునరుద్దరణ కొరకు టెంకాయచిప్ప చేతపట్టి బిక్షాటన చేసి 10 క్ష రూపాయను ప్రోగుచేసి దేవాలయ పునరుద్దరణ మరియు మలువైన ఆభరణాలను చేయించాడు.ఇతని విగ్రహాన్ని కూడా ఇక్కద దర్శించవచ్చు. ఒంటిమిట్ట రామాలయం సందర్శించే భక్తులను ఆకట్టుకునేది ఇమాంబేగ్‌ బావి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్థశినాడు కళ్యాణం, పౌర్ణమినాడు రథోత్సవం జరుగుతాయి. నవమినాడు పోతన జయంతిని జరుపుతారు

ఈ దేవాలయం కడప పట్టణానికి కడప-తిరుపతి రహదారిలో 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సుల ద్వారా ఇక్కడికి వెళ్ళవచ్చు. శ్రీ వేంకటేశ్వరుని మీద 32,000 కీర్తలను రచించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలమైన తాళ్లపాక గ్రామం ఇక్కడికి దగ్గరలోనే కలదు.(రాజంపేట నుండి 6 కి.మీ దూరం).

Sri Veerabrahmam Gari Temple / శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం

యోగి, హేతువాది, కాలజ్ఞానం బోధించిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి సాక్షాత్‌ దైవస్వరూపుడు. 17వ శతాబ్దానికి చెందినవాడు. కడపలోని మారుమూల పల్లెలో జన్మిస్తాడు. తల్లితండ్రులు శ్రీ పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబలు. చిన్నతనంలోనే తల్లితండ్రును కోల్పోయి అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుంటాడు. కర్ణాటకలోని పాపాఘ్ని మఠాధిపతి శ్రీ వీరభోజ్యాచార్యులు సతీ సమేతంగా తీర్ధయాత్రలు చేస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటారు.అత్రి మహాముని వీరభోజ్యాచార్యుల దంపతులకు ఈ బాలుడిని ఇస్తాడు. అతి చిన్న వయసులోనే బ్రహ్మంగారు కాళికాంబా సప్తశతి రచించి అందరినీ అబ్బురపరుస్తాడు. బ్రహ్మం గారి పదవ ఏట వీరభోజ్యాచార్యు స్వర్గస్తులౌతారు. వీరబ్రహ్మం గారు లోకకళ్యాణంకోసం దేశాటనకు బయుదేరుతూ తల్లిగారికి కర్మసిద్ధాంతాన్ని గురించి వివరించి ఆమె మాయతెరను తొలగిస్తాడు.

వీరబ్రహ్మేంద్రస్వామి

బ్రహ్మంగారు సాక్షాత్ దైవస్వరూపులు. రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో సుస్పష్టంగా వివరించి, జనులందరినీ సన్మార్గంలో నడువమని బోధించిన మహిమాన్వితుడు. శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి వారు 1608 సంవత్సరంలో సరస్వతీ నదీతీరంలో ఉన్న బ్రహ్మానందపురంలో జన్మించారు. తల్లి దండ్రులు పరిపూర్ణాచార్య, ప్రకృతాంబ. కర్నాటక నందికొండలలోని పాపాఘ్నిమఠం (ప్రస్తుతం చిక్ బళ్ళాపుర్ జిల్లా కళావారి పల్లెలో ఉంది) పీఠాధిపతులు ఎనమదుల వీరభోజాచార్యులు, వీరపాపమాంట ఇంట బాల్యాన్ని గడిపాడు. సుమారు 12 సంవత్సరాల ప్రాయంలో ఈ ఆశ్రమాన్ని వదలి దేశ సంచారం చేస్తూ కంచి చేరి అక్కడ సూర్యోపాసన చేశాడు. తరువాత కర్నూలు జిల్లాలోని బనగానపల్లె చేరుకున్నారు. అక్కడ గరిమిరెడ్డి దంపతుల ఇంట గోవులను కాశాడు. ఇదే సమయంలో రవ్వలకొండలో కాలజ్గ్నానం రాశాడు. అన్నజయ్యను శిష్యునిగా స్వీకరించారు. పాతిక సంవత్సరాలు బనగాన పల్లెలో గడపి కడప జిల్లాలోని కందిమల్లాయపల్లెకు చేరుకున్నాడు. ప్రస్తుతం ఇదే బ్రహ్మంగారి మఠంగా పిలువబడుచున్నది. ఇక్కడ తుది వరకు గడిపారు.

సంస్కరణల వాది
ఒకవైపు త్యాగం, మరోవైపు జ్గ్నానం, చైతన్యం, సంస్కరణ మొత్తం కలిపి బ్రహ్మంగారి జీవితం. ఈ నాలుగింటిని సమన్యయ పరచి తన ఆధీనంలోకి తెచ్చుకొని తన జీవితం దేశానికి, మొత్తం సమాజం మీదే పట్టు సాధించి తాను ఆలోచించిన సామాజిక మార్పు దిశగా జనబాహుళ్యాన్ని మళ్ళించాడు.

కాలజ్గ్నాన తత్వాలతో రాబోవు రోజుల్లో సంభవించే విపత్కర పరిస్ధితుల నుంచి ప్రజలను మేల్కొలిపాడు. చైతన్యపు కాగడాలను వెలిగించి ప్రపంచాన్ని వెలుగులతో నింపే ప్రయత్నం చేశాడు. అందుకే ఈ స్వామి మార్గదర్శకుడు, పూజ్యనీయుడు, కీర్తింపదగినవాడు, దళితులకు, బహుజనులకు, చిరస్మరణీయుడు. వీరబ్రహ్మేంద్రస్వామి గొప్ప సంస్కర్త. భగవంతుడు ప్రసాదించిన ఈ శరీరాన్ని చక్కగా నడుపుకుంటూ దేహాంతర యాత్ర సుగమమం చేసుకోవాలని, ఈ శరీరాన్ని లౌకిక సుఖాలకు లోను చేయకూడదంటారాయన.

సర్వశాస్త్ర నిష్ణాతుడైన స్వామి చిన్నతనంలోనే అద్త్వెత ప్రచారం, అస్పృశ్వతను వ్యతిరేకించడం, సామాజిక మార్పులు, హిందూ మహ్మదీయ సమైక్యత, వృత్తి విద్యా ప్రభోధం, సాంఘిక దురాచారాలు, జీవకారుణ్యం, మహిళాభ్యుదయానికి అమిత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సందేశాన్ని యావత్ ప్రపంచానికి అందించారు. శూద్రులకు, స్త్రీలకు వేదాధికారం లేకుండా ఉన్న రోజుల్లో స్వామి వాటన్నింటిపై పూర్తి స్థాయిలో సమాజాన్ని మేల్కొలిపే విధంగా వ్యవస్థలో చైతన్యాన్ని తీసుకు వచ్చారు.

శ్రీ జగద్గురు మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి 1693 వ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమినాడు సజీవ సమాధిలో ప్రవేశించారు. ఆ సమాధిపై తర్వాత కాలంలో భక్తులు గుడి నిర్మించారు. గర్బగుడిలో స్వామి వారి సజీవ సమాధి ఒక్కటే ఉంది. సమాధిపై బ్రహ్మంగారి, గోవిందమాంబగారి ముఖ విలాసములు పూజకొరకు ఉంచారు. స్వామివారు రచించిన కాలజ్గ్నానం తాళపత్ర గ్రంధం ఒక వెండి పెట్టెలో ఉంచి సమాధిలో ఉంచారు. స్వామివారి పాదుకలు అక్కడే ఉన్నాయి. నాడు స్వాముల వారు మంచినీటితో వెలిగించిన జ్యోతి సమాధికి వెనుకభాగంలో ఉంది. దానిని అఖండ జ్యోతి అంటారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జ్యోతి వెలుగుతూనే ఉంది. బ్రహ్మంగారి పేరుమీద ఇక్కడ రిజర్వాయర్ నిర్మించబడినది. ఈ ప్రాంతం వారి దాహార్తినీ తీరుస్తూ పంటభూములను సస్వశ్వామలం చేస్తుంది. యాత్రికులకు కనువిందు చేస్తుంది మంచి విహారస్థలం కూడా.

ఎలా వెళ్ళాలి :
కడప దాకా రైలు ద్వారా ప్రయాణించి అక్కడనుండి నుండి 66 కిమీ దూరంలో ఉన్న బ్రహ్మంగారి మఠాని బస్సులలో ప్రయాణించి చేరుకోవచ్చ. విజయవాడ వైపు నుండి వెళ్ళేవారు రైలు ద్వారా ప్రయాణించి గిద్దలూరులో దిగి అక్కడ నుండి 75 కి.మీ ప్రయాణించి బ్రహ్మంగారి మఠం చేరుకోవచ్చు. లేదా విజయవాడ నుండి నేరుగా కడపకు బస్సుల ద్వారా ప్రయాణించి అక్కడనుంచి వెళ్ళవచ్చు. బ్రహ్మంగారి సదన్, గోవిందమ్మ సదన్ లలో మరియి టూరిజం వారి అతిధి గృహంలో వసతి సౌకర్యం కలదు. మఠం ఉదయం గం.6-30 ని.లనుండి మ.12-20 ని.లవరకు మరియు సా.3-00 గంటల నుండి రాత్రి 9-00 గంటల వరకు తెరచి ఉంటుంది.

Amararamam / అమరారామం

అమరారామం లేక అమరావతి చారిత్రక ప్రసిద్ధిచెందిన శైవ పుణ్యక్షేత్రం. గుంటూరు జిల్లా కేంద్రం గుంటూరుకు 35 కి.మీ. దూరంలో కృష్ణానది తీరంలో ఉన్నది. ఇక్కడి స్వామివారు అమరేశ్వరుడు. అమ్మవారు బాలచాముండి. ఈ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి. అమరారామంలో శివలింగం ఎత్తు 15 అడుగులు ఉంటుంది. శివలింగం చుట్టూ రెండు అంతస్తులు ఉంటాయి. అభిషేకాలు పైఅంతస్తు నుండి జరుపుతారు.

ఇక్కడి శివలింగం దేవతల రాజైన ఇంద్రునిచే ప్రతిష్టించబడినదంటారు. ఈ దేవాలయం కొద్ది ఎత్తులో ఉన్న క్రౌంచగిరి అనే శిల మీద ఉంటుంది. దేవత గురువు బృహస్పతి మరియు రాక్షసుల గురువు శుక్రాచార్యులు ఇక్కడ శివభగవానుడిని సేవించారు. ఈ దేవాలయానికి నాలుగు ప్రక్కలా ద్రవిడ శిల్పరీతిలో కట్టబడిన ఎత్తయిన గోపురాలున్నాయి. విజయనగర రాజు ఈ దేవాలయ అభివృద్ధికి కృషిచేశారు. అమరావతికి దగ్గరలో ఉన్న ఇప్పుడు ధరణికోట అని పిలువబడే ధాన్యకటకం శాతవాహనుల రాజధాని. 2వ శతాబ్ధంనుండి 3వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతం శాతవాహనుల పరిపానలో ఉంది. అమరావతిలో అమరావతి స్ధూపంగా పేరుపొందిన బౌద్ధస్థూపాన్ని మరియు గుడికి దగ్గరలో ఉన్న మ్యూజియంను కూడా చూడవచ్చు.

ప్రయాణసదుపాయాలు : గుంటూరు పట్టణానికి 35 కి.మీ. దూరంలో అమరారామం ఉన్నది. గుంటూరు బస్‌స్టాండ్‌ నుండి నాన్‌స్టాప్‌ బస్సులు దేవాలయం వరకు వెళతాయి.
విజయవాడ నుండి కూడా బస్సు సౌకర్యం కలదు. దగ్గరలోని రైల్వేస్టేషన్లు గుంటూరు, మరియు విజయవాడ.

Sri Lakshmi Narasimha Swamy Temple / శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

మంగళగిరిలో ఈ స్వామికి రెండు దేవాలయాలు ఉన్నాయి. కొండపైన ఉన్న దేవాలయం పానకాలస్వామి దేవాలయం. క్రింద ఉన్న దేవాలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. కొండపైన ఉన్న దేవాలయంలో విగ్రహం ఉండదు. కేవలం నోరు తెరచుకొన్న ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. పానకాలస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. పానకాల స్వామికి సమర్పించిన పానకంలో సగం త్రాగి మిగిలిన సగాన్ని మనకు ప్రసాదంగా వదలిపెడతాడని చెబుతారు. అందుకే ఈ స్వామిని పానకాలస్వామి అని అంటారు. ఇక్కడ పానకం నేలమీద పడినా చీమలు, ఈగలు రావు.

దిగువ దేవాలయం : ఇక్కడి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినది. రెండు శతాబ్ధాలు పూర్తి చేసుకున్నది. 11 అంతస్తులతో 157 అడుగు ఎత్తున 49 అడుగుల పీఠభాగంతో ఉంటుంది.1807-09 లో ధరణికోట జమిందారు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మింపచేశాడు.

బ్రహ్మోత్సవాలు : ఫాల్గుణ మాసం శుద్ధ షష్టి నుండి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగును. (ఫిబ్రవరి-మార్చి)

దేవాలయ వేళలు :శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం (దిగువ దేవాలయం) ఉదయం 5 గంటనుండి మధ్యాహ్నం 12.30 వరకు మరియు సాయంత్రం గంటల 4 నుండి గంటల 8-30 వరకు
శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం (కొండపైన దేవాలయం) : ఉదయం గంటల 7 నుండి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే. కొండపైకి ఆటోలు మరియు సొంత వాహనాలలో వెళ్ళవచ్చు.
మంగళగిరికి ప్రయాణ సదుపాయాలు : ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన మంగళగిరికి బస్‌ మరియు రైలు మార్గాలో చేరుకోవచ్చు. ఈ పుణ్యక్షేత్రం కకత్తా-చెన్నై 5 నెంబరు జాతీయ రహదారిలో ఉన్నది. విజయవాడకు 13 కి.మీటర్ల దూరంలోను గుంటూరుకు 21 కిలో మీటర్ల దూరంలో కలదు. గుంటూరు, విజయవాడ, తెనాలి నుండి బస్‌లలో ఇక్కడకి చేరుకోవచ్చు. మంగళగిరిలో రైల్వేస్టేషన్‌ కూడా ఉంది.అన్ని రైళ్లు మంగళగిరిలో ఆగవు. దగ్గరలోని రైల్వే జంక్షన్ విజయవాడ.

Kanakamahalakshmi Temple / కనకమహాలక్ష్మి దేవాలయం

మహిమగల తల్లి కనకమహాలక్ష్మి విశాఖపట్నంలోని బురుజుపేట ప్రాంతంలో బహిరంగ మండపంలో కొలువుదీరిన అమ్మరూపం కడు రమణీయం. పూర్వం విశాఖ పట్టణాన్ని పరిపాలించిన రాజులు అమ్మవారిని వైశాఖేశ్వరి పేరుతో కొలిచేవారు. వీరితోపాటూ కళింగరాజులూ కనక మహాలక్ష్మిని ఆరాధించేవారనీ, మొక్కులూ, కానుకలూ చెల్లించేవారనీ స్థలపురాణాలు తెలియజేస్తున్నాయి.

ఆ కాలంలో కొందరు శత్రు రాజులు వైశాఖీరాజ్యం మీద దండెత్తినప్పుడు తమ ఇలవేల్పును వారికి దొరక్కుండా ఉంచడం కోసం వైశాఖేశ్వరి విగ్రహాన్ని పక్కనే ఉన్న బావిలో పడేశారు. ఈ క్రమంలో అమ్మవారి వామహస్తం విరిగిపోయింది. కొంతకాలం తర్వాత అమ్మవారు ఒక భక్తురాలి కలలో కనిపించి, ‘నేను కనకమహాలక్ష్మీదేవిని. ఈ బావిలో ఉన్నాను. నన్ను బయటకు తీసి, గుడి కట్టించమని’ తెలుపుతుంది. ఆ భక్తురాలు బావి దగ్గరకు వెళ్లి చూసేసరికి దివ్యకాంతులు కనిపించాయి. దాంతో తనకు వచ్చింది కల కాదనీ అది కనకమహాలక్ష్మి అమ్మవారి ఆజ్ఞనీ గ్రహించిన ఆ భక్తురాలు విగ్రహాన్ని బయటకు తీసి గుడిని ఏర్పాటు చేసిందని భక్తులు తెలుపుతారు.

ఒకప్పుడు ఇరుకు వీధులతో ఉండేదీ ప్రాంతం 1917వ సంవత్సరంలో వీధి వెడల్పు చేసేందుకు విశాఖ మున్సిపాలిటీ అధికారులు ఈ విగ్రహాన్ని మూలస్థానం నుంచి 30 అడుగుల దూరం జరిపించారు. అదే సమయంలో ఈ ప్రాంతంలో ప్లేగు వ్యాధి ప్రబలి, ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోడంతో విశాఖ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదంతా అమ్మవారి విగ్రహాన్ని కదిలించడం వల్లే జరిగిందని భావించిన ప్రజలు ఆ విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠించారట. దాంతో ప్లేగు వ్యాధి తగ్గి ప్రజలు ఆరోగ్యవంతులయ్యారనీ, ఇదంతా కనక మహాలక్ష్మి మహిమేననీ చెబుతారు.

శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి గోపురం లేదు. గతంలో ఎన్నోసార్లు గోపురాన్ని నిర్మించడానికి ప్రయత్నించినా ఏవేవో ఆటంకాలు ఎదురయ్యేవి. దాంతో అమ్మవారి అభీష్టం మేరకు బహిరంగ మండపంలో ఉంచి, పూజాదికాలనూ, ఉత్సవాలనూ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఎవరికి వారే సిరుల తల్లిని పసుపు, కుంకుమలతో పూజించడం ఈ ఆలయం ప్రత్యేకత. పసిబిడ్డలనూ, కొత్తగా కొన్న బంగారాన్నీ మొదట కనకమహాలక్ష్మి వద్దకే తీసుకురావడం పూర్వం నుంచీ వస్తున్న ఆనవాయితీ.

మార్గశిరంలో విశేష ఉత్సవాలు…
కనకమహాలక్ష్మి అమ్మవారికి ఏటా మార్గశిర మాసంలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. మార్గశిర గురువారం చల్లని తల్లికి అత్యంత ప్రీతిపాత్రమైనదనీ, ఆ రోజున అమ్మను దర్శించుకుంటే సకల శుభాలూ చేకూరుతాయనీ భక్తుల నమ్మకం. అందుకే మార్గశిర మాసంలో ప్రతి బుధవారం రాత్రి 12 గంటల నుంచే నాదస్వర వాయిద్యాలూ, వేద మంత్రాలతో శ్రీలక్ష్మికి అభిషేకాలూ, కుంకుమ పూజలూ ప్రారంభమవుతాయి. ఈ ప్రక్రియల అనంతరం అమ్మవారి దర్శనం కొనసాగుతుంది. ఆలయంలో రథోత్సవ వేడుకను కన్నుల పండగగా జరుపుతారు.

శ్రావణమాసంలో మంగళ, గురు, శుక్రవారాలూ, పూర్ణిమ తిథి లాంటి పర్వదినాల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలూ, నోములూ, వ్రతాలూ జరుపుతారు. తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా అమ్మవారికి అష్టదళ సువర్ణ పద్మారాధన జరుపబడుతుంది. మాలధారణ సాంప్రదాయం కూడా ఉంది. ఆకుపచ్చని వస్త్రాలు ధరించి భక్తులు మాలధారణ చేపడతారు. దసరా శరన్నవరాత్రుల్లో మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలూ జరుగుతాయి. వీటిలో పాల్గొనడానికి విశాఖ వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మార్గశిర మాసంలో (జనవరి) 30 రోజులపాటు అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలు చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు.

ఎలా వెళ్లాలి …
ఈ ఆలయానికి దగ్గరలోనే రామకృష్ణా బీచ్‌, కైలాసగిరి, సింహాచలం ఉన్నాయి. విశాఖకు రైలు, రోడ్డు, వాయు మార్గాలు ద్వారా వెళ్లవచ్చు. బస్‌స్టాండ్‌, రైల్వేస్టేషన్ల నుంచి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం మీదుగా ప్రయాణించే బస్సు ప్రతి పది నిమిషాలకొకటి సిద్ధంగా ఉంటుంది.

Simhachalam Narasimha Swamy /సింహాచలం నరసింహస్వామి

నారసింహ క్షేత్రాల్లో విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రం పురాతనమైనది. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ విశాఖపట్నం నగరానికి 11 కి.మీల దూరంలో తూర్పు కనుమల్లోని సింహగిరిపై సముద్రమట్టానికి 800 అడుగుల(244మీ)ఎత్తున ప్రశాంత వాతావరణంలో శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశారు. విశాఖ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంత భక్తులంతా సింహాద్రి అప్పన్నగా వరాహ లక్ష్మీనరసింహస్వామిని పిలుచుకుంటారు. నిత్యం చందనంతో కప్పబడి కనిపించే ఈ స్వామి నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ (మే నెలలో) వస్తుంది.

స్థల పురాణం
11వ శతాబ్దంలో, స్వయంభూవైన సింహాచల శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయాన్ని నిర్మించబడినట్ల స్థలపురాణం బట్టి తెలుస్తోంది. కళింగ శైలిలో నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన శిల్ప కళ, అందమైన గోపురాలతో భక్తులకు కనువిందు చేస్తుంది. కృతయుగంలో వేదాలు అపహరించిన హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహ అవతారం, ఆ తర్వాత యుగంలో హిరణ్యకశిపుని వధించిన నరసింహావతరంగా .. స్వామి ఇక్కడ వరాహ నృసింహ స్వామిగా స్వయం వెలసారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ రోజూ నాలుగు వేదాలు, నాలాయిర దివ్య ప్రబంధాలు, పురాణాలు స్వామి వారి సన్నిధిలో పారాయణం చేస్తారు. ఈ క్షేత్రం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి.

ఏడాది మొత్తంలో 12 గంటలు మాత్రమే దేవుడి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారు ఏడాదిలో 364 రోజులు సుగంధ భరిత చందనంతో కప్పబడి ఉంటారు. భక్తులకు నిత్యం దర్శనం ఇచ్చేది.. ఈ చందన అవతారంలో వుండే స్వామి వారే. ఏటా ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే.. అర్థరాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ ఆ నిజరూప దర్శనం ఉంటుంది. స్వామి వారి నుంచి తొలగించిన గంధాన్ని చందన ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. అలాగే గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరిగే ఉత్సవం. మిగతా సమయాల్లోనూ ఎంతో రద్దీగా ఉండే సింహాచలం ఆలయం ఈ రెండు సందర్భాల్లో ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బంగా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుండి వచ్చే లక్షల మంది భక్తులతో సందడిగా మారుతుంది. ఆలయంలో కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకొంటే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం.

స్వామివారి పూజలు
స్వామి వారి నిత్యకల్యాణం:
టిక్కెట్టు ధర రూ.1000, రోజూ జరిగే ఈ సేవలో స్వామివారి పట్టు శేష వస్త్రం, చీర, రవికె, 80 గ్రాముల బరువు ఉండే 6 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు, ఆరుగురికి ఉచిత దర్శనం, అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు.
స్వర్ణ పుష్పార్చన:
టిక్కెట్టు ధర రూ.1116, ప్రతి గురువారం ఉదయం 7 గంటల నుంచి గంటపాటు జరుగుతుంది. పాల్గొన్న వారికి కండువా, రవికె, 2 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు ఉచితంగా అందజేస్తారు.
ఇతర సేవల వివరాలు
– సహస్రనామార్చన: రూ.200-
– అష్టోత్తర శతనామార్చన: రూ.100
– లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన: రూ.50
– గరుడ సేవ: రూ.300
– కప్పస్తంభ ఆలింగనం: రూ.25
– లక్ష్మీనారాయణ వ్రతం: రూ.50
– గోపూజ: రూ.50
– గోసంరక్షణ పథకం విరాళం: రూ.1116
– పశువుకట్టు: రూ.15
– అన్నప్రాశన, అక్షరాభ్యాసం: రూ.50
– ద్విచక్రవాహన పూజ: రూ.100
– కారు పూజ: రూ.200
– కేశఖండన: రూ.10
టిక్కెట్లు ఇచ్చే చోటు: అన్ని పూజా టిక్కెట్లు ఆలయంలోని కప్పస్తంభం వద్ద ఇస్తారు. రూ.100 దర్శనం టిక్కెట్లను గాలిగోపురం వద్ద ప్రత్యేక కౌంటర్లో ఇస్తారు. రూ.20 టిక్కెట్లు క్యూలైన్ల మధ్యలోనే ఇస్తారు.
స్వామివారి ప్రసాదం
– లడ్డూ : రూ.5
– పులిహోర : రూ.5
– చక్కెర పొంగలి: రూ.3
– రవ్వ లడ్డూ : రూ.2
దర్శన సమయాలు
– ఉదయం 6.30 నుంచి 11.30 వరకు సర్వదర్శనం
– ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు.
– మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకు సర్వదర్శనం – మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు పవళింపు సేవ. దర్శనాలు ఉండవు
– సాయంత్రం 3 నుంచి రాత్రి 7 వరకు సర్వదర్శనం
– రాత్రి 7 నుంచి 8.30 వరకు ఆరాధన. దర్శనాలు లభించవు.
– రాత్రి 8.30 నుంచి 9 వరకు సర్వదర్శనం
– రాత్రి 9.00 పవళింపు సేవ జరిగి తలుపులు మూసివేస్తారు
– మరలా ఉదయం 6.30కి యథావిధిగా దర్శనాలు లభిస్తాయి.
దర్శనం టిక్కెట్ల
– రూ.100 గాలిగోపురం నుంచి అంతరాలయంలోకి ప్రవేశం
– రూ.100 అష్టోత్తరం టిక్కెట్టు. అంతరాలయంలో గోత్రనామాలతో పూజ చేస్తారు
– రూ.20 సాధారణ క్యూలైన్ల నుంచి ఆలయంలోకి ప్రవేశం.

ఎలా వెళ్లాలి ?
సింహాచల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఉన్నది విశాఖపట్నం అన్ని ప్రధాన పట్టణాలనుండి రైలు, రోడ్డు, విమాన మార్గాలతో అనుసంధానమై ఉంది. దగ్గరలోని విమానాశ్రయం విశాఖపట్నం
విమానాశ్రయం నుంచి 11 కి.మీ, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి 11 కి.మీ, విశాఖపట్నం బస్ స్టేషన్ నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. సింహాచలం కొండ దిగువ నుంచి ఎగువకు మాత్రం సింహాచలం దేవస్థానమే ప్రత్యేక వాహనాలను నడుపుతోంది. సొంత వాహనాలు ఉంటే నామమాత్రపు (రూ.10) టోల్ రుసుము వెళ్లవచ్చు.
వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలిగోపురం పక్కన లిఫ్టు సౌకర్యం ఏర్పాటు చేశారు.

వసతి సౌకర్యం
కొండపై సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే పలు సత్రాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చందన టూరిస్టు రెస్ట్ హౌస్, తితిదే సత్రాలు ఉన్నాయి. కొండ కింద పలు ప్రైవేటు వసతి గదులు అందుబాటులో వున్నాయి.

Srikalahasti ….శ్రీకాళహస్తి

చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తిలో సువర్ణముఖీ నదికి తూర్పు తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. కాళహస్తిలోని శివలింగం స్వయంభువు. శివలింగమునకు ఎదురుగా ఉన్న దీపం లింగంనుండి వచ్చు గాలికి రెపరెపలాడుతుంది. అందువలన ఈ శివలింగాన్ని వాయిలింగం అని కూడా అంటారు. పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం తమిళనాడులో ఉంటే.. ఒక్క వాయులింగం మాత్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొలువైంది. గ్రహణ కాలాల్లోనూ తెరచివుంచే గుడిగా ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది! ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. శ్రీకృష్ణదేవరాయల ఆస్ధానకవులలో ఒకరైన ధూర్జటి కవి తన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో ఈ క్షేత్రాన్ని గురించి వివరిస్తాడు.శ్రీ కాళహస్తి పుణ్యక్షేత్రం కన్నప్ప, పాము, సాలెపురుడు, ఏనుగు భక్తితో ముడిపడి ఉంటుంది. ఈ మూడు జీవులు శివుణ్ణి ఆరాధించి శివైక్యం చెందుతాయి. దేవాలయమునకు సమీపమునే చిన్న కొండపై భక్తకన్నప్పకు చిన్న ఆలయం కట్టబడింది. భక్తకన్నప్ప శివభక్తుడు. కన్నప్ప భక్తిని పరీక్షించటానికి ఒకరోజు శివుడు తన కన్నునుండి రక్తం కారుస్తాడు. అప్పుడు కన్నప్ప తన కన్ను తీసి శివలింగానికి అమరుస్తాడు. అప్పుడు శివుని రెండవ కంటినుండి కూడా రక్తం వస్తుంది. కన్నప్ప తన రెండవ కంటిని కూడా తీసి శివలింగానికి అమరుస్తాడు. కన్నప్ప భక్తికి సంతసించిన శివుడు ప్రత్యక్షమై కన్నప్పకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు.

ఆలయ ప్రత్యేకత :
ఈ దేవాలయం చాలా పెద్దది. పైకప్పుకు రంగుతో చిత్రించిన అనేక చిత్రాలను దర్శించవచ్చు. ఆదిశంకరాచార్యులవారు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. ఈ క్షేత్రాన్ని దక్షిణకాశీగా కూడా పిలుస్తారు. రాహుకేతు సర్పదోషా నివారణకు దేవాలయంలో విశేషంగా పూజలు జరుగుతాయి.

దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడకు వచ్చి తమ దోషనివారణార్ధం పూజు జరిపించుకుంటారు. అమ్మవారి సన్నిధికి సమీపం నుండి కొన్ని గోపురాలను దర్శించవచ్చు.ఈ దేవాలయంలో ఇంకో విశిష్టతకూడా ఉంది. పాతాళగణపతి ఉత్తరంగా, అమ్మవారు తూర్పు ముఖంగా శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమముఖంగా, దక్షిణామూర్తి దక్షిణముఖంగా ఉంటారు. ఆలయానికి నాలుగుదిక్కులా కళ్ళుచెదరే నాలుగు గోపురాలు ఉంటాయి భారతీయ కళకు నిలువెత్తు నిదర్శనాలు. 120 ఎత్తున్న రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించాడు. ఇక్కడ ఇంకా అనేక శివలింగాలను మహర్షులు దేవతలు ప్రతిష్టించారు. అగస్త్యుడు నీకంఠేశ్వరలింగం, బృగుమహర్షి అర్ధనారీశ్వరలింగాన్ని, వ్యాసభగవానుడు, మార్కండేయుడు మృత్యుంజయేశ్వర లింగాన్ని ప్రతిష్టించారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, పరశరాముడు కూడా ఇక్కడ శివలింగాను ప్రతిష్టించారు. సప్తర్షులు, చిత్రగుప్తుడు, యమధర్మరాజు, ధర్మరాజు కూడా ఇక్కడ శివలింగాలను ప్రతిష్టించారు.

ప్రత్యేక మంటపాలు : ఈ ఆలయంలో చక్కటి శిల్పకళతో ఉన్న మంటపాలు చూపరులను ఆకర్షిస్తాయి. నగరేశ్వర మంటపం, గుర్రపుసాని మంటపం, రాయల మంటపం (నూరుకాళ్ళ మంటపం), కోటమంటపాలను చూడవచ్చు. శ్రీకృష్ణదేవరాయలచే కట్టించబడిన నూరుకాళ్ళమంటపంలో చక్కని శిల్పకళను చూడవచ్చు. శ్రీకృష్ణ దేవరాయల సోదరుడు అచ్యుతరాయల పట్టాభిషేకం క్రీ.శ.1529లో నూరుకాళ్ళ మంటపంలో జరిగింది.

ఈ ఆలయ పరిసరాలో 36 తీర్ధాలు ఉన్నాయంటారు. అందులో కొన్ని ముఖ్యమైనవి సహస్రలింగాల తీర్ధం, హరిహర తీర్ధం, భరద్వాజతీర్ధం, మార్కండేయతీర్ధం, మూకతీర్ధం, సూర్యచంద్ర పుష్కరిణి. ఇక్కడ రాహుకేతు క్షేత్రం మరియు దక్షిణామూర్తులను దర్శించవచ్చు.

ఉత్సవాలు
మహాశివరాత్రికి ఇక్కడ ఏడురోజులపాడు స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. అనేక ప్రాంతాలనుండి భక్తులు విశేషంగా ఈ ఉత్సవాలకు వస్తారు. ఆలయ దర్శన వేళలు: ఉదయం 4.30 గంటలకు మంగళ వాయిద్యాలతో స్వామిని మేల్కొలుపుతారు. అప్పటినుంచి రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవ ముగిసే వరకూ శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకోవచ్చు. ఎలాంటి విరామం లేకుండా సర్వదర్శనం ఉంటుంది! గ్రహణ కాలాల్లోనూ స్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఈ దేవాలయం తెరిచే ఉంటుంది!

వసతి సౌకర్యం
భక్తుల కోసం ఆలయం తరఫున పలు అతిథి గృహాల్లో అందుబాటులో ఉన్నాయి. నామమాత్రపు అద్దెలతో భక్తులు ఇక్కడ వసతి పొందవచ్చు. అలాగే పట్టణంలోనూ పలు ప్రభుత్వ/ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లు.. అద్దెగదులు లభిస్తాయి. ఆ వివరాలతోపాటు.. ఆలయంలో జరిగే వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు… ముందస్తు బుకింగ్‌ల కోసం… 08578- 222240 నెంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

శ్రీకాళహస్తికి ప్రయాణసౌకర్యాలు
ఈ క్షేత్రానికి అన్ని ముఖ్యప్రాంతాలనుండి రైలు మరియు రోడ్డు మార్గాలు ఉన్నాయి. తిరుమల క్షేత్రానికి 40 కిలోమీటర్ల దూరంలొ ఉంటుంది. తిరుమలకు వెళ్ళినవారు తప్పనిసరిగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటారు. విజయవాడ వైపు నుండి వెళ్లేవారు `విజయవాడ`తిరుపతి రైలు మార్గంలో శ్రీకాళహస్తిలో దిగవచ్చు. తిరుపతి బస్‌స్టేషన్‌నుండి ప్రతి 10ని॥కు ఆర్‌ టి సి బస్సులు కలవు.

Tiruchanur – Alivelu Mangapuram / తిరుచానూరు (అలివేలు మంగాపురం)

తిరుమల తిరుపతి పట్టణానికి నాలుగున్నరు కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుచనూరు. ఇక్కడ కొలువైన అలివేలు మంగమ్మ భక్తుల పాలిట కల్పవల్లి. శ్రీ మహావిష్ణువు హృదయేశ్వరి. సాక్షాత్తు శుక మహర్షి ఆశ్రమ ప్రాంతమిది. బ్రహ్మోత్సవ సమయంలో తిరుచనూరు తిరుమలను తపిస్తుంది. అమ్మవారి ఉత్సవం అంటే దేవదేవునికి కూడా పండగే. ఆ పదిరోజులూ శ్రీనివాసుడు ఇక్కడే ఉంటాడని భక్తుల నమ్మిక. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కార్తికమాసంలో (డిసెంబరు) 10 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. పంచమీతీర్థం అత్యంత విశిష్టమైనది. కార్తీకశుద్ధ పంచమికి ఉత్సవాలు ముగుస్తాయి.

స్థలపురాణం : త్రిమూర్తులలో సత్యగుణ సంపన్నులెవరో తెలుసుకోవటానికి భృగ్నుమహర్షి మొదట బ్రహ్మను, శివుడిని పరిక్షిస్తాడు. ఆతర్వాత వైకుంఠానికి వచ్చి శేషపాన్పుపై శ్రీలక్షీదేవితో నారాయణుడు ఏకాంతంలో ఉన్న సమయంలో అక్కడికి వస్తాడు. తనను గచమనించలేదని కోపంతో శ్రీవారి వక్షస్థంపై తన్నడం, శ్రీమన్నారాయణుడు ఆ మహర్షి పాదంలో ఉన్న నేత్రాన్ని నిర్మూలించడం జరుగుతుంది. అమ్మవారు అలిగి తిరుచనారూరులో ఇప్పుడున్న పుష్కరిణిని ఏర్పరుచుకొని అందులో కలిసిపోయిందంటారు. 12 సంవత్సరాల తరువాత 13వ సంవత్సరం కార్తీక పంచమి రోజున పద్మసరోవరంలో బంగారు పద్మంలో శ్రీమహాలక్ష్మీ ఆవిర్భవించిందంటారు. ఇలా పద్మంలో జన్మించినది కాబట్టే అలిమేమంగ అయ్యిందంటారు. ఆ పద్మసరోవరమే నేటి కోనేరు. బ్రహ్మోత్సవాలో అమ్మవారి జన్మ నక్షత్రమైన శుక్లపంచమి రోజున నిర్వహించే పంచ తీర్థానికి వచ్చే వేలాది భక్తులు ఈ కోనేరులో స్నానం చేస్తారు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని విజయనగర రాజు సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయ లకాలంలో నిర్మించారని తెలుస్తుంది. తిరుమల శ్రీవారికి ఆగమన శాస్త్ర ప్రకారం జరిగే నిత్యకైంకర్యాలన్నీ అమ్మవారికీ జరుగుతాయి. పద్మావతి పరిణయం పేరుతో నిత్యకల్యాణోత్సవం, సాయంకాలం డోలోత్సవం నిర్విహిస్తారు. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో తెప్పోత్సవాలు, భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు జరుపుతారు. ఆలుమగలంటే ఎలా ఉండాలో పద్మావతి శ్రీనివాసులను చూసి నేర్చుకోవాలంటారు తాళ్లపాక అన్నమయ్య.

Govinda Raja Swamy Temple. Tirupati / గోవిందరాజస్వామి దేవాలయం

గోవిందరాజస్వామి శ్రీవేంకటేశ్వర స్వామి యొక్క సోదరుడుగా భావించ బడుచున్నాడు. తిరుపతి పట్టణంలోనే ఉన్న గోవిందరాజస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. తిరుమల వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ స్వామిని కూడా దర్శించు కొంటారు. ఈ ఆలయ గోపురం ఎత్తుగా ఉండి చాలా దూరం నుండి కూడా కనబడుతుంది. ఈ గోపురం 1628సం.లొ ఎడు అంతస్తులతో నిర్మించబడి చూపరులను ఆకట్టుకొంటుంది. ఈ గోపురానికి ఎడమ ప్రక్కన పద్మంలో కూర్నున్న లక్ష్మీదేవి ఆలయాన్ని చూడవచ్చు. ఈ ఆలయంలో గోవిందరాజస్వామితో పాటు రుక్మిణి , సత్యభామ విగ్రహాలను కూడా చూడవచ్చు. దేవాలయం యొక్క శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. మరియు శ్రీవైష్ణవ కవి వేదాంత దేశిక వారి విగ్రహాన్ని కూడా చూడవచ్చు.

Kanipakam Sri Varasiddi Vinayaka Temple / కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం

Kanipakam vinayaka templeవక్రతుండ మహాకాయుడైన వినాయకుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రం కాణిపాకం. ఏ దేవుడి మీద ఒట్టు వేసినా నమ్మనివారు కూడా కాణిపాకం ఆలయ ఆవరణలో ఎవరైనా ప్రమాణం చేస్తేమాత్రం నమ్ముతారు. తరతరాలుగా సత్యప్రమాణాలు గల దేవునిగాచ భక్తుల పూజలు అందుకుంటున్న దేవుడు. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఇక్కడ హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.

స్థలపురాణం
సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే.. వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ‘గణనాథుని’ రూపం కన్పించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారిందని ప్రశస్తి.

ప్రమాణాల దేవుడు!
కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం.

నిత్యం పెరిగే స్వామి
వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం, ప్రస్తుతం స్వామివారికి సరిపోవటం లేదు. స్వామివారు ఆవిర్భవించినపుడు కనిపించని బొజ్జ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.వెండికవచాల పరిమాణాలు మారుతుండటం ఇందుకు నిదర్శనం. కాణిపాకం శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి.

బ్రహ్మోత్సవాలు
వినాయక చవితి నుండి ప్రారంభించే బ్రహ్మోత్సవాలు 21 రోజులపాటు సాగుతాయి. స్వామివారిని హంస, నెమలి, మూషిక, శేష, వృషభ, గజ, అశ్వ, నంది, రావణబ్రహ్మ, సూర్యప్రభ. చంద్రప్రభ, కామధేను, యాళి, కల్పవృక్ష వాహనాలపై ఊరేగిస్తారు. రధోత్సవం, పుష్పపల్లకీ సేవ, తెప్పోత్సవం ఘనంగా జరుగుతాయి. బ్రహ్మహత్యా పాతక నివారణార్థం: స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారాని చెబుతారు. అద్భుత శిల్పకళ ఈ ఆలయానికి సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

ఎలావెళ్లాలి ?
కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కి.మీ.ల దూరంలో ఐరాల మండలంలో ఉంది. తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలో ఉంది. కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువ. ఎవరైనా ఇక్కడ ఉండాలనుకుంటే.. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తితిదే ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయి. తిరుపతి నుంచి.. చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు.. ప్రైవేటు వాహనాలలో వెళ్లవచ్చు. దగ్గరలోని విమానాశ్రయం తిరుపతి. దగ్గరలోని రైల్వే స్టేషన్లు తిరుపతి మరియు చిత్తూరు.

Kanakadurgamma …కనకదుర్గమ్మ….

స్థల పురాణం
పూర్వం ఇంద్రకీలుడనే యక్షుడు ఉండేవాడు అతడు గొప్ప దేవీ భక్తుడు. శివపార్వతులను గురించి వేల సంవత్సరాలు తపస్సుచేశాడు. అతని భక్తికి మెచ్చి ఆది దంపతులు ప్రత్యక్షమై ఏదైనా వరాన్ని కోరుకోమన్నారు. అప్పుడా యకక్షుడు ఆది దంపతులు ఎల్లప్పుడూ తనపై అధిష్టించి ఉంచేటట్లుగా వరం కోరాడు. శివపార్వతులు అతనిని శైలరూపాన్ని పొందమని చెప్పారు. ఆ శైలరూపమే ఇంద్రకీలాద్రి. ఆనాటు నుండి శివపార్వతులు ఇంద్రకీలాద్రిపై నివాసం ఉంటున్నారు.

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అష్టభుజాలను కలిగి ఉంది. చేతులలో శూలం, బాణం, ఖడ్గం, పాశం, చక్రం మొదలైన ఆయిధాలను ధరించి ఉంటుంది. సింహాసనం ఎక్కివచ్చి మహిషాసురుని మర్ధించిన రూపంలోనే దుర్గాదేవి దర్శనం ఈ ఆలయంలో మనకి లభిస్తుంది. కనకదుర్గ ఎడమ భాగంలో శ్రీచక్రం స్ధాపించబడి ఉంది. ఈ శ్రీచక్రం పక్కనే గణపతి విగ్రహం ఉంది. శ్రీ దుర్గామల్లేశ్వర ఆలయంలో కనకదుర్గకు జరిగే పూజలన్నీ శ్రీ చక్రానికి జరుగుతున్నాయి. గర్భాలయానికి ముందు అంతరాలయం, దాని ముందు ముఖమంటపం ఉన్నాయి. విజయవాడ శక్తి ప్రాధాన్యమైన క్షేత్రమే అయినప్పటికీ శాక్తేయ విధితో ఆరాధన ఇక్కడ లేదు. ఇది ఇక్కడి విశిష్టత. ఈ ఆలయంలో దేవీ మూర్తిని మహిషాసురమర్ధనిగా ఉన్న రూపంలో దర్శనం ఇస్తుంది. ఈ దేవీ మహిషాసుర మర్ధని అయితే దుర్గాదేవి అని ఎందుకు పిలుస్తాన్నాం. కనుక మూర్తి వేరే ఎక్కడైనా ఉందా?…… దీనికి ఆధారాలు కనిపించవు గానీ పెద్దలు చెప్పే విషయాలను గమనిస్తే కనకదుర్గాదేవి మూర్తి ఇంద్రకీలాద్రి మీదనే మరొకచోట చోట ఉందని, ఆ దేవతని ప్రతిరోజూ దేవతలు, మహర్షులు, యకక్షులు, కిన్నెరలు, యోగులు దర్శించి ఆరాధిస్తున్నారని మహిషాసుర మర్ధని మూర్తి ప్రధమ ద్వారం అని, రెండవ ద్వారం దగ్గర చింతామణి దుర్గాదేవి మూర్తి ఉందని తెలుస్తుంది.

ఇంద్రకీలాద్రిపై ఉన్న మహిషాసుర మర్ధనికి ఆ పేరు రావానికి కారణం పేరులోనే వుంది. మహిషాసురుని సంహరించిన కారణంగా ఆమెకు ఆ పేరు వచ్చింది. దితి పుత్రులైన దైత్యులను అందరినీ ఇండ్రుడు సంహరిస్తూ ఉండటం వలన ఇంద్రుని జయించగలిగిన పుత్రుని పొందాలని సుపార్శ్వుడు అనే ముని ఆశ్రమం పక్కన దితి తపస్సు చేస్తుంది. ఆమె తపస్సు వేడిమికి ఆగలేక సుపార్శ్వుడు నీకు మహిషుడు పుట్టుగాక అనే శపించాడు. కానీ ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై నీకుమారుని ముఖం మాత్రమే మహిష ముఖంగా ఉంటుందని, మిగిలిన శరీరము నరుని వలే ఉంటుందని చెప్పాడు. దితికి పుట్టిన మహిషాసురుడు శివుని గురించి ప్రార్థించగా మహిషుడు తనకు మరణంలేకుండా ఉండే విధంగా వరం కోరుకుంటాడు. ప్టుట్టిన వారికి మరణం తప్పదని శివుడు చెప్పగా మహిషుడు తనకు స్త్రీ వలన మరణం కలిగే విధంగా వరం కోరుకుంటాడు.

రాక్షసులందరూ మహిషుణ్ణి పూజిస్తారు. మహిషుడు దేవతలు అపహరించిన రాజ్యాన్ని తిరిగి స్వాధీనపరచుకుంటాడు. మహిషుడు పెట్టే బాధలకు తట్టుకోలేక దేవతలు తమ నారీ తేజాలు ఒక్కిటిగా చేసి ప్రార్థిస్తారు. ఆ నారీతేజం నుండి దేవీ ఉద్భవిస్తుంది. ఆమెకు దేవతలు తమ తమ ఆయుధాలు ఇవ్వగా, ఆ దేవి సింహాన్ని వాహనంగా చేసుకొని మహిషునితో యుద్ధం చేసి అతడిని సంహరిస్తుంది. అప్పటినుండి ఆమెను మహిషాసుర మర్ధనిగా పిలుస్తారు. దేవీ భాగవతంలో ఈమె పుట్టుకకు సంబంధించిన మరొక కధ కూడా ఉంది. శుంభ నిశుంభులనే రాక్షసులు శివుని ప్రార్థించి శివుని అనుగ్రహంతో పురుషుల వలన మరణం పొందని వరాన్ని పొందారు. వీరు దేవతలను బాధలు పెడుతూ, యజ్ఞభాగాలను అపహరించుకు పోవటం వలన దేవతలు శివుని ప్రార్థించారు. అపుడు గౌరి శరీరం నుండి ఒక దేవత పుట్టింది. ఆమె పేరు కౌశిక. కౌశికను వివాహం చేసుకోమని శుంభనిశుంభులను చండముండులనే రాక్షసులు ప్రోత్సహిస్తారు. శుంభ నిశుంభులు తమను భర్తలుగా స్వీకరించమని ఆమె దగ్గరకు దూతను పంపుతారు తనతో యుద్ధంచేసి గెలిచిన వారినే వివాహం చేసుకుంటానని ఆమె చెప్పింది. వీరు తమ సేనా నాయకులైన ధూమ్రలోచనుని, చండముండుల్ని, రక్తబీజుని పంపగా కౌశికీ దేవి వారిని సంహరిస్తుంది. అప్పుడు శుంభ నిశుంభులే యుద్ధానికి వెళ్ళగా ఆమె వారిని కూడా సంహరిస్తుంది.

ఈ దుష్ట రాక్షసుల సంహరణ కోసం ఆమె భీకర రూపాన్ని దాలుస్తుంది. ఆప్పుడు ఆమె నుండి వెలువడిన రౌద్ర శక్తులు రాక్షసులను మట్టుపెడతాయి. అంత ఊగ్రరూపంలో ఉన్న దుర్గను కొలవడానికి భక్తులు భయపదేవారు. ఆ సందర్భంలో ఆదిశంకరుల వారు ఆ దేవిని దర్శించి, ఆ దేవీమూర్తి అతి భీకర రూపాన్ని రౌద్రకళలను ఉపసంహరించి, వారిని వేరొక మూర్తిలో ప్రవేశపెట్టి ఈ దేవిని శాంతమూర్తిగా దర్శనమిచ్చునట్లుగా అనుగ్రహించారు. రౌద్ర రూపాన్ని త్వజించడం కోసం ఆమెకు మల్లీశ్వరస్వామితో కళ్యాణం జరిపించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై శ్రీచక్ర స్ధాపన చేశారు. అప్పటి నుండి శాంతమూర్తి అయిన దుర్గాదేవిని వేలాది మంది భక్తులు దర్శిస్తున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులు జరిగే ఉత్పవాలలో దేవిని సరస్వతి, లక్ష్మీ, దుర్గ, కాళి, త్రిపుర, రాజరాజేశ్వరి, లలితా దేవి, గాయత్రీ దేవి మొదలైన అలంకారాలతో పూజిస్తారు. దేవికి ఈ అలంకారాలను చేయడంలోని ఉద్ధేశం దేవీ దేవతల నారీ తేజాల నుండి పుట్టింది కాబట్టి ఆయా రోజుల్లో దేవీ మూల అంశాలైన ఆయా దేవతలను పూజించడమే.

పురాణాలను పరిశీలిస్తే దేవిని దర్శించి పూజించిన వారిలో రాముడు, కృష్ణుడు, పరశురాముడు మున్నగువారు కనిపిస్తారు. అర్జునుడు మల్లయుద్దంలో శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందిన సందర్భంలో ఇంద్రకీలాద్రిపై విజయేశ్వరుడనే పేరుతో ఈశ్వరలింగాన్ని ప్రతిష్టించి విజయేశ్వరాలయాన్ని నిర్మించాడు.

శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించి పూజాది కార్యక్రమాలకు దూప, దీప నైవేద్యాలకు ఏర్పాట్లు చేసినట్లుగా దుర్గాలయానికి కొంచెం దూరంలో ఉన్న రాయల శాసనం ప్రకారం తెలుస్తుంది. అక్కన్న మాదన్నలు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించారనటానికి ఇక్కడే ఉన్న అక్కన్న మాదన్న గుహలే నిదర్శనం.

దసరా ఉత్సవాలలో అమ్మవారు కనకదుర్గాదేవిగా, గాయత్రీ దేవిగా, అన్నపూర్ణా దేవిగా, శ్రీలలితా దేవిగా, త్రిపుర సుందరిగా, మహాలక్షీగా, సరస్వతి దేవిగా, దుర్గాదేవిగా, మహిషాసుర మర్ధనిగా, రాజరాజేశ్వరీదేవిగా అలంకిరిస్తారు. ఈ తొమ్మిది రోజులు కొలిచిన వారికి కొంగు బంగారమై ఉండే దేవిని
సమ్మతి నా మనంబున సనాతనులైన యుమా మహేశులన్‌
మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటిపెద్దమ్మ
దయాంబు రాశివి గదమ్మ హరింబతి జేనయక మమ్మనిన్‌
నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ
అని రుక్మిణిదేవి ప్రార్ధించి అనుగ్రహం పొందినట్లే ఎంతోమంది భక్తులు అనుగ్రహం పొందుతున్నారు.
పరిసరాల్లోని ఉపాలయాలు: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరాలయం, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరాలయం, నటరాజస్వామి ఆలయం ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను సందర్శించి భక్తితో పూజలు చేస్తారు.

దర్శన సమయాలు
– వేకువజామున 4 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం భోగం సమయంలో కాసేపు దర్శనాన్ని నిలిపివేస్తారు.

ఆలయంలో చేసే ప్రధాన పూజలు: ఇంద్రకీలాద్రిపై ఖడ్గమాల, లక్ష కుంకుమార్చన, స్వర్ణపుష్పాలతో అర్చన, శ్రీ చక్రార్చన, చండీహోమం, శాంతి కల్యాణం ప్రధానపూజలు.
– ఖడ్గమాల పూజ తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సేవలో పాల్గొనే భక్తులు రూ. 516 చెల్లించి వేకువజామున 4 గంటలకు ఆలయానికి చేరుకోవాలి. రెండుగంటల పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ పూజ జరుగుతుంది. ఒక టిక్కెట్టుపై దంపతులను అనుమతిస్తారు. – మిగతా పూజలకూ రుసుం.. రూ. 516 మాత్రమే. ఈ పూజలు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. ఒక టిక్కెట్టుపై దంపతులు పాల్గొనవచ్చు. ఈ పూజల కోసం ఉదయం 8 గంటలకే ఆలయానికి చేరుకోవాలి. ప్రధానమైన పూజల్లో స్వర్ణపుష్ప పూజ ఒకటి. ప్రతి గురువారం సాయంత్రం 5.15 గంటల నుంచి 6.30 గంటల వరకు అమ్మవారి అంతరాలయంలో 108 స్వర్ణపుష్పాలతో జరిగే ఈ పూజలో భక్తులు రూ. 2,500 చెల్లించి పాల్గొనవచ్చు. కేవలం ఏడు టిక్కెట్లు మాత్రమే ఇస్తారు. – రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు హారతుల సమయం. ఈ సమయంలో అమ్మవారి హారతులు తిలకించేందుకు రూ. 200 టిక్కెట్టు తీసుకుంటే.. ఒక టిక్కెట్టుపై ఇద్దరు చొప్పున అనుమతిస్తారు. స్థలాభావం కారణంగా కేవలం 20 టిక్కెట్లు మాత్రమే రోజూ సాయంత్రం 4 గంటల నుంచి దేవస్థానం అధికారులు కౌంటరులో విక్రయిస్తారు. దసరా ఉత్సవాలు, భవానీదీక్షలు, బ్రహ్మోత్సవాల సమయంలో కాకుండా ఈ పూజలు నిర్వహించుకోవచ్చు. పూజలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రం, రవిక, లడ్డూప్రసాదం అందజేస్తారు.

దేవస్థానంలో నిర్వహించే పూజలు: ఇంద్రకీలాద్రిపై దేవస్థానంలో పరిమిత దినాల్లో నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు ఉచితంగా పాల్గొనవచ్చు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్బారు సేవ, ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక సేవలు జరుగుతాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కృష్ణానదీ తీరాన దుర్గాఘాట్‌లో కృష్ణమ్మకు పంచహారతులు ఇస్తారు. ఈ హారతులను భక్తులంతా తిలకించవచ్చు. దసరా రోజుల్లో భవానీలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తారు.

అన్నప్రసాదం….
1991 నుంచి ఇంద్రకీలాద్రిని దర్శించుకునే భక్తులకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తోన్నారు. భక్తులు అందించిన విరాళాలను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి వాటిపై వచ్చే ఆదాయంతో రోజూ 5 వేల మందికి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.

ఎలా వెళ్లాలి ?….
విజయవాడకు.. రైలు.. రోడ్డు.. విమాన మార్గాల్లో వెళ్లవచ్చు. విజయవాడకు దేశం నలుమూలల నుంచి రోడ్డుమార్గం, రైలు మార్గంలో చేరడం చాలా సులభం. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుండి అమ్మవారి గుడికి బస్సులున్నాయి. ప్రైవేటు ఆటోలు.. క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. సొంత వాహనాల ద్వారా అమ్మవారి గుడిపైకి వెళ్లవచ్చు. దగ్గరలోని విమానాశ్రయం గన్నవరం.

వసతి సౌకర్యం
ఇంద్రకీలాద్రిపై మేడపాటి గెస్ట్‌హౌస్‌.. ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్‌ల్లో కలిపి మొత్తం (ఏసీ.. నాన్‌ ఏసీ) 55 గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని రోజుకు కనిష్ఠంగా రూ. 500 నుంచి గరిష్ఠంగా రూ. 1200 చొప్పున రుసుంతో భక్తులకు ఇస్తారు. విజయవాడలో అన్ని తరగతుల వారికి అందుబాటులో హోటల్స్ కలవు.

Dwaraka Tirumala Temple / ద్వారకా తిరుమల

ఈ పవిత్ర పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్ఛిమగోదావరి జిల్లాలో ఉన్నది. ఏలూరు నుండి 42 కి.మీ. దూరంలో ఉన్నది. ఏలూరు నుండి ద్వారకా తిరుమలకు మూడు బస్సు దారుల ద్వారా వెళ్ళవచ్చు. వయా భీమడోలు (15 కి.మీ.) వయా తడికపూడి మరియు దెందులూరు నుండి కూడా వెళ్ళవచ్చు. విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళు అన్ని రైళ్ళు ఏలూరు రైల్వేస్టేన్‌లో ఆగుతాయి. చుట్టు ప్రక్కల దేవాయాలకు దేవస్థానం వారు రోజుకు రెండుసార్లు మాత్రం ఉచిత బస్సు నడుపుచున్నారు. .

స్థలపురాణం : ఇక్కడ స్వామి శ్రీ వేంకటేశ్వరుడు. చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధిచెందినది. ద్వారక అనే ముని పేరుమీదగా ఈ క్షేత్రం ఏర్పడినదని అంటారు. స్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. పెద తిరుపతి వెళ్ళలేనివారు చిన్న తిరుపతిగా పేరుపొందిన ఇక్కడ మ్రొక్కులు తీర్చుకున్నా అదే ఫలితం లభిస్తుందంటారు. ద్వారకుడు అనే ముని స్వామివారి పాదసేవను కోరటం జరిగింది కనుక పాదములను పూజించే భాగ్యం అతనికి దక్కిందని అంటారు. స్వామివారి పైభాగం మనకు దర్శనమిస్తుంది. శ్రీరామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి మరొక నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించాడని అంటారు. ఒక్కడ స్వామివారికి అభిషేకము చేయరు. చిన్న నీటిబొట్టు పడినా అది స్వామివారి విగ్రహము క్రింద వున్న ఎర్రచీమలను కదుల్చునని చెబుతారు. .

స్వామివారికి ప్రతి సంవత్సరం రెండుసార్లు వైశాఖ మాసం మరియు ఆశ్వియుజ మాసాలలో కళ్యాణోత్సవాలు జరుపుతారు. ఇందుకు కారణం స్వామి స్వయంభువుగా వైశాఖంలో దర్శనమిచ్చాడని మరియు ఆశ్వయుజంలో స్వామివారి సంపూర్ణ విగ్రహాన్ని ప్రతిష్టించారని చెబుతారు. .గుడి ప్రవేశద్వారం వద్ద కళ్యాణమండపం ఉన్నది. దీని ప్రక్కన పాదుకామండపంలో స్వామివారి పాదాలున్నాయి. శ్రీవారి పాదాలకు నమస్కరించి భక్తులు కొండపైకి ఎక్కుతారు. మనం ఇక్కడ ద్వారకాముని, అన్నమయ్య విగ్రహాలను, గర్భగుడి చుట్టూఉన్న ఆళ్వారు విగ్రహాలను దర్శించవచ్చు. ఆంజనేయస్వామి, గరుడ మందిరాలను కూడా చూడవచ్చు. అర్ధమండపం ప్రక్కనే తూర్పుముఖంగా మంగతాయారు, ఆండాళ్‌ (శ్రీదేవి, భూదేవి) అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష పూజ చేస్తారు. .

స్వామివారి పుష్కరిణి : గ్రామానికి పశ్ఛిమంలో స్వామివారి పుష్కరిణి ఉన్నది. ఈ పుష్కరిణిని సుదర్శన పుష్కరిణి, నరసింహసాగరం, కుమారతీర్థమని కూడా అంటారు. చక్రతీర్థం, రామతీర్థం అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ప్రతి సంవత్సరం కార్తీకశుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి) రోజున స్వామివారికి తెప్పోత్సవం జరుపుతారు. .

అర్జిత సేవలు.
01. సుప్రభాత సేవ : ఉదయం 4 గంటలకు ఒక్కొక్కరికి రూ.100` రెండు లడ్డూలు ఉచితం.
02. అష్టోత్తర శతనామార్చన : ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు స్వామివారి ఉత్సవ మూర్తులకు. రూ.130 ఇద్దరికి శీఘ్రదర్శనం ఉచితం. .
03. కుంకుమపూజ : అమ్మవార్ల దగ్గర కుంకుమపూజ జరుపబడును. రూ.58 ఒక్కొక్కరికి. .
04. గోపూజ : రూ.116 ఇద్దరికి శీఘ్రదర్శనం మరియు 2 లడ్డూలు ఒక పులిహోర ఇవ్వబడును. .
దేవాలయం తెరచు వేళలు మరియు పూజ వివరాలు : .
ఉచిత దర్శన వేళలు : ఉదయం 6 గంలట నుండి మ. 1 గంట వరకు సా. 3 గంటల నుండి 5.30 గం. వరకు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు.
ఉదయం 4.40 నుండి 5 గంటల వరకు సుప్రభాతం.
ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు : బాలభోగం మరియు పవిత్ర జలాలో స్వామివారి అభిషేకం. .
ఉదయం 6 గం॥ల నుండి 8.00 గం॥ల వరకు స్నపన (శుక్రవారాలు మాత్రమే) .
ఉ॥ 6 గంటల నుండి మ॥ 1 గంటల వరకు భక్తుల కొరకు స్పెషల్‌ మరియు శీఘ్రదర్శనం.
ఉదయం 9.30 గం॥ల నుండి మ॥ 12 గంటల వరకు వేదపారాయణం.
ఉదయం 9.30 గంటల నుండి 12 వరకు అర్జిత కళ్యాణం .
మ॥ 12.00 నుండి 12.15 ని॥ వరకు మహానైవేద్యం మరియు ప్రసాద వితరణ. .
మ॥ 1 గంటకు గుడి మూసివేత.
సా॥ 3 గంటల నుండి 5 గంటల వరకు సర్వదర్శనం (ఉచిత దర్శనం) .
సా॥ 3.30 ని. ప్రభత్సోవం.
సా॥ 6 గంటల నుండి 7 గంటల వరకు సాయంకాల అర్చన .
రాత్రి 8.30 గంటల నుండి 9.00 గంటల వరకు సేవాకాలం మరియు పవళింపుసేవ .
రాత్రి 9.00 గంటలకు దేవాలయం మూసివేయబడును. .

The Executive Officer.
Sri Venkateswara Swamy vari Devasthanam, .
Dwaraka Tirumala – 534 426.
West Godavari Dist. Andhra Pradesh, India.
E-mail : eo_dwarakatirumala@yahoo.co.in.
Phones : EO: (08829) 271436 .
Enquiry : +91 8829 271427.
Temple : +91 8829 271469.
FAX : +91 8829 271766.
Official Website : http://www.dwarakatirumala.org

Sri Suryanarayana Temple, Arasavalli / శ్రీ సూర్యనారాయణ దేవాలయం – అరసవల్లి

ప్రసిద్ధి చెందిన శ్రీ సూర్యనారాయణ దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పట్టణానికి కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్నది.ఇది దేశంలో కెల్లా పురాతన దేవాలయం. మానవుల శ్రేయస్సు కోరి శ్రీ కశ్యపమహర్షి సూర్యదేవుని విగ్రహాన్ని ప్రతిష్టించాడని చెపుతారు. ప్రతి సంవత్సరం మార్చి మరియు సెప్టెంబర్‌ మాసాలలో 9 నుండి 12వ తారీకు వరకు ఉదయం 6 గంటల నుండి 6 గంటల 20 ని॥ల వరకు సూర్యకిరణాలు దేవాలయంలోని స్వామివారి మీద నేరుగా ప్రసరిస్తాయి.

స్వామి వారి అర్జిత సేవ వివరాలు
అష్టోత్తరం, సహస్రనామార్చన, క్షీరాన్న భోగం, క్షీరాభిషేక సేవ, తిరువీధిసేవ, కళ్యాణ సేవ, సూర్యనమస్కారము

జీవిత కాలపు అర్జిత సేవలు
అష్టోత్తరం, సహస్రనామార్చన, క్షీరాన్న భోగం, క్షీరాభిషేక సేవ, తిరువీధి సేవ, కళ్యాణ సేవ, సూర్యనమస్కారము

శ్రీ సూర్యనారాయణ దేవాలయం – అరసవల్లికి రవాణా సదుపాయాలు
ప్రసిద్ధి చెందిన శ్రీ సూర్యనారాయణ దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పట్టణానికి కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్నది.పాత బస్‌స్టాండ్‌ నుండి బస్‌లో వెళ్ళవచ్చు.
శ్రీకాకుళం పట్టణానికి రైలు మరియు బస్సు మార్గాలో వెళ్ళవచ్చు. చెన్నై -కలకత్తా రైలు మార్గంలో శ్రీకాకుళం ఉన్నది. (స్టేషన్‌ పేరు ఆముదాల వలస) విజయవాడ, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్‌ ఇంకా అనేక ప్రాంతాల నుండి రైలు ద్వారా వెళ్ళ వచ్చు) హౌరా మెయిల్‌, కోణార్క్‌, విశాఖా ఎక్స్‌ప్రెస్‌, కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లలో వెళ్ళవచ్చు. విశాఖపట్నం నుండి షుమారు 80 కి.మీ. దూరం. బస్సులో వెళ్ళవచ్చు.

వీరేశ్వరస్వామి ఆలయం……. మురమళ్ల / Veereswara Swamy Temple, Muramalla

కొబ్బరిచెట్ల సవ్వడులూ పచ్చని పంటపొలాలూ గోదావరీజలాల గలగలల మధ్య భద్రకాళీ సమేతంగా వెలసిన వీరేశ్వరస్వామి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంతో అలరారుతుంటుంది. తూర్పుగోదావరి జిల్లా, మురమళ్లలో వెలసిన ఆ వీరేశ్వరుడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలి వస్తుంటారు. ఆలయంలో కొలువైన స్వామికి కళ్యాణం జరిపిస్తే అవివాహితులకు వెంటనే వివాహం జరుగుతుందని ప్రతీతి. దక్షిణ భారతదేశంలోనే మరెక్కడాలేని విధంగా ఈ ఆలయంలో స్వామికి నిత్యం వివాహ వేడుకని అత్యంత శాస్త్రోక్తంగా జరిపించడం విశేషం. భక్తులంతా సంకల్పం చెప్పుకుని, తమ గోత్రనామాలతో ఆ వీరభద్రుడికి కళ్యాణం జరిపిస్తుంటారు. అందుకే ఆయన్ని పెళ్లిళ్ల దేవుడని పిలుస్తారు.

స్థల పురాణం!
దక్షయాగాన్ని భంగం చేసి, సతీదేవి పార్థివ దేహంతో తాండవం చేస్తూ ముల్లోకాలనూ అల్లకల్లోలం చేస్తోన్న వీరభద్రుడి మహోగ్రాన్ని చల్లార్చేందుకు దేవతల కోరిక మేరకు ఆ జగజ్జనని భద్రకాళి పేరుతో అతిలోకసుందరిగా రూపుదాల్చుతుంది. ఆమెను చూడగానే స్వామి శాంతించి, వివాహం చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు వాళ్లిద్దరికీ గాంధర్వ పద్ధతిలో మునులంతా కలిసి వివాహం జరిపించారట. మునులు సంచరించే ప్రాంతాన్నే మునిమండలి అంటారు. ఆ మునిమండలి ప్రాంతమే కాలక్రమంలో మురమళ్లగా మారింది అనేది పురాణ కథనం. ఆరోజునుంచీ అక్కడ వెలసిన స్వామికి మునులంతా కలిసి గాంధర్వ పద్ధతిలో కళ్యాణం జరిపిస్తున్నారు.

పూర్వం గౌతమీ నదికి వరదలు వచ్చినప్పుడు స్వామి ఆలయం మునిగిపోయిందట. అప్పుడు శివభక్తుడైన వేలవలి శరభరాజుకి స్వామి కలలో కనిపించి మునిమండలి ప్రాంతంలోని గోదావరిలో మునిగి ఉన్న తనను వెలికితీయాలని కోరడంతో, శివలింగాన్ని గడ్డపారతో తీసేందుకు ప్రయత్నించాడట. అయితే గడ్డపార దెబ్బకు శివలింగం నుంచి రక్తం రావడంతో, భయభ్రాంతులైన భక్తులు స్వామిని ధ్యానించగా శివలింగం నుంచి మాటలు వినిపించాయట. శివలింగాన్ని ఐ.పోలవరం సమీపంలోని బాణేశ్వరాలయానికి తీసుకువెళ్లాలనీ మధ్యలో అనుకూలంగా ఉన్నచోట ఆగిపోతానన్నది ఆ మాటల సారాంశం. అంతట భక్తులు జయజయ ధ్వానాలమధ్య శివలింగాన్ని తీసుకెళుతుండగా మురమళ్ల గ్రామంలోని ఓ ప్రదేశంలో శివలింగం భారీగా పెరగడంతో అదే స్వామి ఆజ్ఞగా భావించి అక్కడే దించి, ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడుగా లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు.

వివాహమహోత్సవం!
అనాదిగా వస్తోన్న ఈ వివాహ క్రతువు జరిగే తీరు భక్తులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతుంటుంది. బాజా భజంత్రీలూ మేళతాళాలతో ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం జరపడం ద్వారా కళ్యాణ వేడుకను ప్రారంభిస్తారు. ఓ పక్క కొందరు అర్చకులు యక్షగానం ఆలపిస్తుంటారు. మరోపక్క స్మార్తాగమం ప్రకారం ఆలయ పురోహితులు స్వామివారి వివాహ వేడుకను నిర్వహిస్తుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి తంతులన్నీ స్వామి కళ్యాణంలో కనిపిస్తాయి. అనంతరం స్వామివారినీ అమ్మవారినీ అద్దాల మండపానికి తోడ్కొని, పవళింపుసేవ చేయడంతో కళ్యాణమహోత్సవం ముగుస్తుంది. మూడుగంటల పాటు జరిగే ఈ వివాహ మహోత్సవం భక్తులకు కన్నులపండగే. కళ్యాణం జరిపించే భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ఉదయంపూట అభిషేకం జరుపుతారు. రోజుకిన్ని కళ్యాణాలు అన్న లెక్క ఉండటంతో భక్తులు నెల రోజులు ముందుగానే నమోదు చేసుకుంటుంటారు.

ఎలా వెళ్లాలి ?
కాకినాడకు 36, రాజమండ్రికి 90 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. దూరప్రాంతాలనుంచి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఆలయంలో నిత్యాన్నదానం, వసతి గదులూ అందుబాటులో ఉన్నాయి.

Kumara Ramam / కుమారరామం (సామర్లకోట భీమేశ్వరాయం)

చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, కళాత్మకంగా ఎంతో విశిష్టిత కలిగిన పుణ్యక్షేత్రమిది.చాళుక్య భీమ మహారాజు (క్రీ॥శ 872-921) నిర్మించడం వలనే ఈ క్షేత్రానికి భీమేశ్వరాలయం అనిపేరు వచ్చింది. 13 అడుగు శివలింగాన్ని దర్శించుకుంటున్నప్పుడు కలిగేది మాములు ఆనందం కాదు శివానందం. మిగతా పంచారామ క్షేత్రాలో లాగా ఇక్కడ వివాహాది శుభకార్యాలుండవు. స్వామివారి యోగనిద్రకు భంగం కలగకుండా ఉండటానికే ఈ ఏర్పాటని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం నిర్మాణశైలిలో ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి ఉంటుంది. చాళుక్యల సంప్రదాయం గోచరిస్తుంది..
ఆలయం చుట్టూ ఇనుపరాతితో కట్టిన రెండు ప్రాకారాలు కలవు. బయట ప్రాకారానికి నాలుగు దిక్కుల్లో నాలుగు గోపుర ద్వారాలు కనువిందు చేస్తాయి. లోపలి ప్రాకారాన్ని రెండు అంతస్తులతో నిర్మించారు. కింది అంతస్తులో ప్రతిష్ఠించిన లింగం రెండస్తుల ఎత్తు ఉంటుంది. మహాశివుడిని అభిషేకించాలంటే రెండో అంతస్తు నుండి చేయాల్సిందే. అప్పటికి గాని రుద్రభాగానికి పూజ పూర్తవుంది. కాలభైరవుడు ఈ క్షేత్రపాలకుడు. కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, దుర్గాదేవి, విష్ణుమూర్తి, బాలాత్రిపురసుందరి అమ్మవారు తదితర ఉపాయాలు ఉన్నాయి.

వసంత నవరాత్రులు మొదలు మొదట నాలుగు నెలల కాలంలో సూర్యకిరణాలు ప్రభాత కాలంలో మూలవిరాట్టునూ ప్రదోష సమయంలో బాత్రిపురాసుందరి అమ్మవారిని తాకుతాయి. ఏకశిలా నంది విగ్రహం,ఊలయ మండపం, నాటి శిల్ప కళానైపుణ్యానికి తార్కాణాలు. ఊయల మండపాన్ని కాస్తంత ఊపితే కాస్తంత కదుతున్నట్టు ప్రకంపనలు వస్తాయి.

నందీశ్వరుడి వైభవాన్ని చూడాల్సిందే. మొడలో గంటతో, శివలింగమంత మూపురంతో రాజసంగా ఉంటుందీ విగ్రహం. ఆలయ నిర్మాణసమయంలో శ్రమజీవులకు మజ్జిగ పోసిన గ్లానును మరచిపోకుండా సుమారు యాభై అడుగు ఎత్తున్న గొల్ల స్థంభాన్ని ఏకశిలలో నిర్మించారు. . కుమారస్వామి చేతుల మీదుగా లింగప్రతిష్ట జరిగింది కాబట్టి కుమారరామంగా పేరు వచ్చింది.

ఎలా వెళ్ళాలి ? : సామర్లకోట రైల్వే స్టేషన్‌నుండి కిలోమీటరు దూరంలో ఉంటుంది. రాజమండ్రి నుండి 50 కి.మీ. దూరం. విజయవాడ మరియు విశాఖపట్నం నుండి వెళ్ళేవారు సామర్లకోట రైల్వేస్టేషన్‌లో దిగవచ్చు.

స్వామి దర్శన సమయాలు: ఉదయం గం.06-00 నుండి మ.12-00 వరకు తిరిగి సా.04-00 నుండి రా.08-00 గంటల వరకు.

Draksharamam / ద్రాక్షారామం

ఈ పవిత్ర క్షేత్రం పంచారామాలలో మెదటిది. మరియు త్రిలింగ క్షేత్రాలలో ఒకటి . ద్రాక్షారామం(తూర్పుగోదావరి). దక్షప్రజాపతి యజ్ఞం చేసిన పుణ్యస్థలం మరియు పార్వతీదేవి జన్మస్థలం. సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తాడో అలాగే ద్రాక్షారామం కూడా ప్రకాశిస్తుందని చెబుతాడు పరమేశ్వరుడు. ఈ క్షేత్రంలో స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు. శివలింగం సగం నలుపు రంగులో సగం తెలుపు రంగులో ఉంటుంది. శివలింగం 14 అడుగుల ఎత్తు ఉంటుంది. స్వామివారిని అర్చించడానికి సప్తర్షులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని అందుకే అంతర్వాహినిగా ప్రవహించే గోదావరిని సప్తగోదావరి అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. శాతవాహనుల రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతి అన్న ప్రాకృత భాషా కావ్యంలో వ్రాశారు.

భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యమేశ్వర, కాళేశ్వర, వీరభద్రేశ్వర శివలింగాలు దర్శనమిస్తాయి. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిక్కులో ఉన్న గోపురాలను ఒక్కో అమ్మవారు పర్వవేక్షిస్తున్నట్లుగా స్థలపురాణం వివరిస్తుంది. భీమేశ్వరునికి ఎనిమిది దిక్కులలో ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్టించాడని చెబుతారు. తూర్పున కోలం, పడమరన వెంటూరు, ఉత్తరాన వెల్ల, ఆగ్నేయాన దంగేరు, నైరుతిన కోరుమిల్లి, పశ్చిమాన సోమేశ్వరం, ఈశాన్యంలో పెనుమళ్ళలో ఈ అష్ట సోమేశ్వరాయాలున్నవి.

ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబా దేవి. శ్రీచక్రంతో విరాజిల్లుతుంది. ఇక్కడ స్వామివారి దేవేరి పార్వతీదేవి, అష్టాదశ పీఠాలో 12వ పీఠం మాణిక్యాంబా పీఠంగా ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో శ్రీడుండి విఘ్నేశ్వరుడు, అశ్వర్థనారాయణమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నటరాజు, వీరభద్రుడు, మహిషాసురమర్ధని, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, ఆంజనేయస్వామి వారిని కూడా దర్శించవచ్చు. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. శ్రీనాధ కవిసౌర్వభౌముడు తన భీమేశ్వరపురాణంలో ఈ క్షేత్రం గురించి విశేషంగా వర్ణిస్తాడు. దుష్యంతుడు, నలమహారాజు, భరతుడు, నహుషుడు ఈ ఆలయాన్ని దర్శించారని వ్రాశాడు. ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్య వంశానికి చెందిన భీమేశ్వరుడు క్రీ॥శ॥ 7-8 శతాబ్దాల మధ్య కట్టించాడు. ఇంకా అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి వివరించారు. ఈ ఆలయ శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.

ఆలయం తెరచే వేళలు :
ప్రతిరోజు ఉదయం గం.06-00 ఆలయం తెరవబడుతుంది.
ఉ.గం.06-00 నుండి మ॥ గం.12.00వరకు సర్వదర్శనం, అభిషేకాలు, అర్చనలు
మ.గం.12-15 ని. నుండి సా.గం.03-00 వరకు విరామం
సా। గం.03-00 నుండి రాత్రి గం.08-00 గంట వరకు సర్వదర్శనం, అభిషేకాలు, అర్చనలు
రాత్రి గం.08-00 కు గుడి మూసివేస్తారు.

ఎలా వెళ్లాలి ? : ఈ దేవాలయం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఉన్నది. రాజమండ్రికి 62 కి.మీ. కాకినాడకు 32 కి.మీ దూరంలో ఉంది. రాజమండ్రి నుండి బస్సులలో వెళ్లవచ్చు.

అయితే ఈ ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలానికి చెందిన గ్రామము ఇది కాకినాడకి 32 కిలోమీటర్ల దూరంలోని రాజమహేంద్ర వరం నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉంది ద్రాక్షారామం చూడదగ్గ ప్రదేశం ఇది మండల కేంద్రమైన రామచంద్రాపురం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది . ద్రాక్షారామం లో శ్రీ భీమేశ్వరుడు ఎనిమిది దిక్కుల్లో 108 శివలింగాలను స్వయంగా ప్రతిష్టించాడని విశ్వసించబడుతుంది. తూర్పున కోలంక పడమర వెంటూరు దక్షిణాన కోటపల్లి ఉత్తరాన ఆగ్నేయంలో దంగేరు నైరుతిలో కోరుమిల్లి వాయువ్యంలో సోమేశ్వరం ఈశాన్యాన పెనుమళ్ళ ఇక్కడ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి అలానే ఇక తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ దిశగా ఉన్న ఒక్కొక్క గాలి గోపురం యొక్క అమ్మవారు పర్యవేక్షిస్తున్నారు స్థల పురాణం వివరిస్తుంది ద్రాక్షారామం లో శివుడు భీమేశ్వరుడు స్వయంభువు గా అవతరించాడు.

శ్రీ లక్ష్మీనారాయణ ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు త్రిలింగ క్షేత్రాలలో ద్రాక్షారామం ఒకటి అలానే పంచారామాల్లో ఒకటిగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం ఈ క్షేత్రం గురించి శ్రీనాథ కవిసార్వభౌముడు తన కావ్యాలలో పేర్కొన్నాడు. ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేయడానికి సప్తరుషులు కలిసి గోదావరి తీసుకువచ్చారని పురాణ కధనాలు వర్ణిస్తున్నాయి అందువల్ల అంతర్వాహినిగా ప్రవహించే గోదావరి సప్తగోదావరి అని కూడా పిలుస్తూ ఉంటారు. అలానే అమరావతిలో ఇంద్రుడు ప్రతిష్టించాడు కాబట్టి అమరేశ్వరస్వామిగా అయ్యాడు. అలానే ఇక్కడ చంద్రుడు ప్రతిష్టించాడు కాబట్టి సోమేశ్వర స్వామి గా వెలసే భీమవరంలో. పాలకొల్లు లో శ్రీ రామచంద్రమూర్తి ప్రతిష్టించాడు కాబట్టి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి గా వెలిశాడు సామర్లకోట లో ఆత్మలింగాన్ని ఛేదించిన దోషం తనకు రాకూడదని కుమారస్వామి స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించిన కాబట్టి కుమారారామ భీమేశ్వర స్వామి ఇక్కడ వెలిశాడు. ప్రతీ ఏకాదశీ పర్వదినముల లో ఏకాంతసేవ, పవళింపు సేవ జరుగుతుంది. అలానే ప్రతీ మాస శివ రాత్రి పర్వదినముల లో గ్రామోత్సవం కూడా ఇక్కడ జరుపుతారు. అంతే కాక్ ప్రతీ కార్తీక పూర్ణిమ తో కూడిన క్రృత్తికా నక్షత్రం రోజున జ్వాలాతోరణ మహోత్సవం ఇక్కడ జరుపుతారు. ప్రతీ మార్గశిర శుద్ధ చతుర్ధశి రోజున శ్రీ స్వామివార్ల జన్మ దినోత్సవం ఇక్కడ జరుగుతుంది.  ప్రతీ ధనుర్మాసంలోనూ క్షేత్రపాలకులు అయిన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి వార్లకు ధనుర్మాస పూజలు అంగరంగ వైభవముగా ఇక్కడ జరుగుతుంది. ప్రతీ మాఘశుద్ధ ఏకాదశీ ( భీష్మ ఏకాదశి ) రోజున శ్రీ స్వామి వారి అమ్మవార్లకు దివ్య కల్యాణ మహోత్సవం కూడా ఎంతో ఘనంగా ఈ ఆలయం లో జరుగుతుంది. ప్రతీ మహా శివ రాత్రి పర్వదినము లో శివరాత్రి ఉత్సవాలు జరుగును. శరన్నవరాత్రులు (దేవీనవరాత్రులు) – ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు కార్తీక మాసం ప్రత్యేక ఉత్సవాలు – జ్వాలా తోరణం (కార్తీక పున్నమి నాడు) సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం- మార్గశిరశుద్ధ షష్ఠి నాడు ఇక్కడ అతి వైభవముగా జరుగుతాయి.

Pattisachalam Veerabhadra Swamy Temple / పట్టిసాలచం (పట్టిసీమ) వీరభద్రాలయం

అఖండగోదావరి నడిమధ్యలో ఉన్నదీ క్షేత్రం. రేవునుంచి పడవపై నది దాటి ఇసుక తిన్నెలపై కిలోమీటరు దూరం నడిచి గుట్టమీద ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోనికి అడుగుపెట్టగానే పచ్చని వాతావరణం, పక్షుల కిలకిలారావాలు వినగానే శ్రమంతా మర్చిపోయి, భక్తులు అద్వితీయమైన అనుభూతికి లోనవుతారు.

కాశీ, కేదారం, శ్రీశైలం, కాళహస్తి, పట్టిసీమను ప్రాచీన పంచ మహాశైవక్షేత్రాలుగా చెబుతారు. శివకేశవులిద్దరిని ఆరాధించే క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రానికి పాలకుడు భావనారాయణస్వామి. శివుని ఆజ్ఞానుసారం దక్షయజ్ఞం ధ్యంసం చేసిన తదుపరి వీరభద్రుడు దేవకూట పర్వతానికి వచ్చి ప్రళయతాండవం చేస్తుండగా చేతిలోనుండి శివునిచే ప్రసాదించబడిన పట్టిసం అనే ఆయుధం జారి పర్వతంపై పడిరదనీ అందుకే ఈ క్షేత్రం పట్టిసాచలంగా పేరొందిందని చెబుతారు.

వీరభద్రుణ్ణి శాంతింపజేసేందుకు ముక్కోటి దేవతలు వేడుకున్నా ఫలితం లేకపోయింది. అప్పుడు అగస్త్యముని వీరభద్రుని ఆలింగనం చేసుకుని శాంతింపజేయగా స్వామి లింగాకారంలో స్వయంభువుగా ఈ దేవకూట పర్వతంపై వెలసినట్లు స్కందపురాణం వలన తెలుస్తుంది . ఈ ఆలయ ప్రాంగణంలో వీరభద్రునితో పాటు లక్ష్మీగణపతి, కుమారస్వామి,సరస్వతీదేవి ఆలయాలు కనిపిస్తాయి. ఇంకోచోట భావనారాయణస్వామి, సీతారామస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. శివరాత్రి సుబ్రహ్మణ్యేశ్వర షష్టి, భీష్మ ఏకాదశి పండగను ఘనంగా నిర్వహిస్తారు. శివరాత్రి రోజున సుమారుల క్షమందికి పైగా స్వామిని దర్శించుకుంటారు.

వీరభద్ర ప్రభ : శివరాత్రి రోజున ఆలయ ధర్మకర్తలు గోదావరి నుంచి తీర్థబిందెలతో నీటిని తీసుకువచ్చి స్వామికి నిత్యాభిషేకం చేసి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమపూజ చేస్తారు. తరువాత పూజాకార్యక్రమాలు ప్రారంభమై అర్థరాత్రి వరకు సాగుతాయి. నైవేద్యం తరువాత వీరభద్ర ప్రభ సంబరం ఉంటుంది. ఉత్సమూర్తులను ప్రభ వాహనపై తీరువీధులలో ఊరేగిస్తారు. చాళుక్య చక్రవర్తు కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రతాపరుద్రుని కాలంలో పునరుద్దరించినట్లు తెలుస్తుంది.

శివరాత్రి సమయంలో సువిశాలంగా కనిపించే ఇసుకతిన్నెలన్నీ జనాలతో నిండిపోతాయి. రేవునుండి ఆలయం వరకు తాటాకు పందిళ్ల వేసి దుకాణాలు పెడతారు. జీళ్లు, కర్జూరాల దుకాణాలు ప్రత్యేకం. మూడురోజులపాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకోసం భారీ పంటును వేసి ప్రత్యేక లాంచీలను ఏర్పాటు చేస్తారు. పట్టిసీమ రేవునుంచి లాంచీలో గొదావరి గలగలను దాటుకుంటూ హరోం హర…హరోం హర… అనుకుంటూ ఇసుకతిన్నెలమీద అలవోకగా నడుస్తూ ఆనందపారవశ్యంతో ఆ వీరభద్రుని దర్శించుకుంటారు. ఆ బోళాశంకరుడికి మనసులోని కోరికలను నివేదించుకుంటారు.

ఎలా వెళ్ళాలి ? : పశ్చిమగోదావరి జిల్లా పోలవరానికి మూడు కిలోమీటర్ల దూరంలో అఖండ గోదావరి నది మధ్యలోఉంటుంది ఈ ఆలయం. రేవునుండి పడవపై నదిదాటి సుమారు కిలోమీటరు దూరం నడిచి గుట్టమీద ఉన్న ఆలయానికి చేరుకోవచ్చు. రాజమండ్రి నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోవూరుకు 25 కి.మీ దూరంలో ఉంటుంది. విజయవాడ వైపు నుండి వచ్చేవారు కోవూరులో దిగి వెళ్ళవచ్చు. రాజమండ్రికి రైలుమార్గం ద్వారా వెళ్లి అక్కడనుండి బస్సులలో వెళ్లవచ్చు.

Talupulamma Talli, Lova / తలుపులమ్మ తల్లి, లోవ

తలుపుమ్మ దేవాలయం రమణీయమైన ప్రకృతి అందాల మధ్య కనువిందు చేస్తుంది. అమ్మవారు స్వయంభువు అని చెబుతారు.ఈ ఆలయం దారకొండ మరియి తీగకొండల మధ్యన వున్న కొండపై ఉన్నది. గోదావరి జిల్లా వారు నూతన వాహనాలను కొన్నతరువాత పూజకు తప్పకుండా ఇక్కడకు వస్తారు. తలుపులమ్మ తల్లి వాహన ప్రమాదాల నుండి కాపాడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

అమ్మవారికి ఇక్కడ కోళ్ళు, మేకలు, గొర్రెలను బలి ఇచ్చే ఆచారం ఉంది. ఇక్కడే వర్తకులు కోళ్ళు, మేకలు అమ్ముతారు. బలి తరువాత మాంసాహారం వండుకునే వారికి అన్ని సౌకర్యాలను ఇక్కడి వర్తకులే కల్పిస్తారు. మిగిలిన వంటలకాను భక్తులు ఇళ్ళకు తీసుకు వెళ్ళరు. స్థానికంగా ఉండేవారికి ఇస్తారు. తలుపులమ్మ దేవాలయం సాయంత్రం 06-00 గంటకే మూసివేస్తారు. కారణం కొండపై సంచరించే క్రూరమృగాల వలన భక్తులకు ప్రమాదాలు జరుగుతాయని. ఆదివారం, మంగళవారం, బుధ, గురువారాలో మరియు పండగ రోజులో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

స్థల పురాణం : పూర్వం అగస్త్యముని ఇక్కడ ప్రకృతి రమణీయతకు సంతోషపడి ఇక్కడ తపమాచరించాడని ప్రతీతి. ఇక్కడ చెట్ల ఫలాలు తింటూ ఇక్కడ కొండమీద నుండి వచ్చే నీటిని త్రాగేవాడని చెబుతారు. ఇక్కడి కొండకు దారకొండ, తీగకొండని పేరు పెట్టాడంటారు. దారకొండ మీద నుండి అన్ని కాలాలో వచ్చే జలధారను చూడవచ్చు.

ఉత్సవాలు : ప్రతి సంవత్సరం చైత్రమాసం (మార్చ్‌, ఏప్రియల్‌) బహుళ విదియ తదియ నుండి 15 రోజలపాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢమాసంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
వసతి సౌకర్యాలు: తలుపులమ్మ తల్లి దేవస్ధానం వారిచే యాత్రికుల కొరకు 28 గదులు కట్టించబడినవి. వేరే అతిధిగృహాలు లేవు. సాధారణంగా భక్తులు ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతారు.

ప్రయాణ సదుపాయాలు : శ్రీ తలుపుమ్మ తల్లి దేవస్ధానం తూర్ప