డార్జీలింగ్ పర్యాటకం – భారతదేశ టీ స్వర్గం

డార్జిలింగ్‌ అంటే ఎక్కువగా తేయాకు తోటలే గుర్తుకొస్తాయి గానీ, ఇది అద్భుతమైన వేసవి విడిది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో హిమాలయాలకు దిగువన సముద్రమట్టానికి 6,700 అడుగుల ఎత్తున వెలసిన పట్టణం ఇది. ఎంతటి నడి వేసవిలోనైనా ఇక్కడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీలకు మించవు. డార్జిలింగ్‌లోని టైగర్‌ హిల్‌ నుంచి ఉత్తరానికి చూపు సారిస్తే నింగిని తాకే హిమగిరుల సొగసులను ఆస్వాదించవచ్చు. ఇక్కడి నుంచి చూస్తే మంచుతో నిండిన ఎవరెస్టు, కాంచన్‌జంగ శిఖరాలు ఇంచక్కా కనిపిస్తాయి. ఎటు చూసినా తేయాకు తోటలు, మహా వృక్షాలతో నిండిన దట్టమైన అడవుల పచ్చదనం కనువిందు చేస్తుంది. డార్జిలింగ్‌లో చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. జపానీస్‌ పీస్‌ పగోడా, భుటియా బస్టీ గోంపా వంటి బౌద్ధారామాలు, ధీర్‌ధామ్, మహాకాల్‌ ఆలయాలు, పద్మజా నాయుడు హిమాలయన్‌ జూలాజికల్‌ పార్క్, చాప్రామడి వన్యప్రాణి సంరక్షణ…

Read More

మనాలి – సుందరమైన ప్రకృతి!

మనాలి ప్రసిద్ధి చెందిన హిమాలయ పర్యాటక ప్రాంతం మరియు హిమాచల్ మొత్తం పర్యాటకులలో నాల్గవ వంతు పర్యాటకులు మనాలి సందర్శిస్తున్నారు. మనాలి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. మనాలి సాహాస క్రీడలైన స్కీయింగ్, హైకింగ్, పర్వతారోహణం, పారా గ్లైడింగ్, రాఫ్టింగ్ (బల్లకట్టు పోటీలు), ట్రెక్కింగ్ (నడక), కయకింగ్(పడవ), మరియు మౌంటైన్ బైకింగ్ (పర్వత మోటార్ సైకిళ్ళ పోటీ) వంటి వాటికి పేరు పొందింది. యాక్ స్కీయింగ్ ఈ ప్రాంతపు ప్రత్యేక క్రీడ. మనాలి దాని తీవ్రమైన యాక్ క్రీడలు టైం పత్రిక యొక్క “బెస్ట్ అఫ్ ఆసియా” లో కూడా చూపబడింది మనాలిలో వేడి నీటిబుగ్గలు, మత పరమైన పుణ్య స్థానాలు మరియు టిబెట్ ఆలయాలు మరియు బుద్ద ఆలయాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా మనాలి హనీమూన్ జంటలకు అభిమాన గమ్యస్థానంగా మారింది. మే, జూన్, డిసెంబర్,…

Read More

ఊటీ – పర్వతాలకు రాణి

ఊటీ అందమైన నీలగిరి పర్వతాలలో ఉన్న అద్భుతమైన పట్టణం. ఈ పట్టణ అధికారిక పేరు ఉదకమండలం, దక్షిణ భారతదేశం లోని ఈ పర్వత ప్రాంతానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే పర్యాటకుల సౌకర్యార్ధం ఇది ఊటీగా సంక్షిప్తీకరించబడింది. ఈ పట్టణం తమిళనాడు రాష్ట్రం లోని నీలగిరి జిల్లా లో ఒక భాగం.ఊటీ పట్టణం చుట్టూ ఉన్న నీలగిరి కొండలు దీని అద్భుతమైన అందానికి బాధ్యత వహిస్తాయి. ఈ పర్వతాలను బ్లూ మౌంటైన్స్ అని కూడా పిలుస్తారు. ఈ లోయలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కురుంజి పూలు పూస్తాయి ఈ పేరుకు మూలం ఇవేనని కొంతమంది ప్రజల నమ్మకం. ఈ పూలు నీలం రంగులో ఉంటాయి, అవి పుష్పించినపుడు ఈ పర్వతాలు నీలం ర౦గులో కనిపిస్తాయి. కొండలపై సమృద్ధిగా పెరుగుతున్న యూకలిప్టస్ చెట్లనుండి ప్రసరించే నీలం పొగవల్ల పర్వతాలు…

Read More

మున్నార్ – ప్రకృతి యొక్క స్వర్గం

కేరళ లోని ఇడుక్కి జిల్లాలో కల మున్నార్ హిల్ స్టేషన్ ఒక అద్బుత పర్యాటక ప్రదేశం. పడమటి కనుమలలోని ఈ ప్రాంతం పూర్తిగా కొండలచే చుట్టుముట్టబడి ఉంటుంది. మున్నార్ అంటే మూడు నదులు అని అర్ధం చెపుతారు. ఈ ప్రదేశం మూడు నదులు కలిసే ప్రదేశంలో కలదు. అవి మధురపుజ్జ, నల్లతాన్ని మరియు కుండలే నదులు. ఈ ప్రాంతం తమిళనాడు సరిహద్దులలో ఉండటంచేత, ఆ రాష్ట్రానికి చెందిన అనేక సాంస్కృతిక అంశాలు ఇక్కడ చోటుచేసుకునాయి. ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కావటం చేత ఈ హిల్ స్టేషన్ కేరళ రాష్ట్రానికి ప్రపంచం వ్యాప్తంగా పేరు తెచ్చిపెటింది. దేశ విదేశాలనుండి లక్షలాది పర్యాటకులు మరియు పిక్నిక్ లు కోరేవారు అద్భుతమైన ఈ ప్రాంతానికి వచ్చి తనివితీరా విశ్రాంతి పొందుతారు, ఆనందిస్తారు.   మున్నార్ లో ఒక ఔత్సాహిక పర్యాటకుడు…

Read More

గ్యాంగ్‌టక్

దేవుడి సృష్టిగా అభివర్ణించే ఈ ప్రాంతంలో అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గ్యాంగ్‌టక్‌.. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌ చక్కని వేసవి విడిది. గ్యాంగ్‌టక్‌ అంటే కొండకొన అని అర్థం. తూర్పు హిమాలయ పర్వతశ్రేణుల మధ్య వెలసిన ఈ పట్టణం సముద్ర మట్టానికి దాదాపు ఐదున్నర వేల అడుగుల ఎత్తున ఉంది. సంవత్సరం పొడవునా చల్లగా ఉండే గ్యాంగ్‌టక్‌లో వేసవిలోనూ సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పాతిక డిగ్రీలకు మించవు. సిక్కిం బ్రిటిష్‌ పాలనలో కొనసాగినా, భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్నాళ్లు స్వతంత్ర రాజ్యంగానే కొనసాగింది. చివరకు 1975లో భారత్‌లో విలీనమైంది. సిక్కిమ్‌ వాసులు ఇక్కడ ‘పాంగ్‌ లహ్‌బ్సోల్‌’ పండగ ప్రతి యేటా అత్యంత ఘనంగా జరుపుతారు. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై గడ్డకట్టే చలి ఉంటుంది. మే…

Read More

కొడైకెనాల్

దక్షిణ భారతదేశంలో బాగా పేరున్న వేసవి విడుదులు ఒకటి ఊటీ ఇంకొకటి కొడైకెనాల్.కొడై కెనాల్ తమిళనాడు రాష్ట్రానికి దాదాపు నడిబొడ్డుకు దగ్గరగా ఉన్న అందమైన ఒక హిల్ స్టేషను. చూడదగ్గ ప్రదేశాలు కొడై సరస్సు:కోడైకెనాల్ పట్టణము యొక్క సెంటరుకు దగ్గరగా 1863లో కట్టిన మానవనిర్మిత కొడై సరస్సు వుంది. 60 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ సరస్సు ఒక వైపు అరచెయ్యి మాదిరిగా వెడల్పుగా ఉండి, మరోవైపు చేతి వేళ్ళ మాదిరిగా సన్నని పాయలుగా వుంటుంది. ఈ సరస్సులో బోటు షికారు కూడా ఉంది. కోకర్స్ వాక్:ఇది ఒక కొండ అంచునే సన్నగా పొడుగుగా ఉన్న కాలి బాట. ఈ బాట వెంబడే నడుచుకుంటూ వెళితే, చుట్టూ కనిపించే ప్రకృతి దృశ్యాలు చాలా బాగుంటాయి. సెయింట్ మేరీ చర్చి :ఈ చర్చి సుమారు 150 సంవత్సరాలకు పూర్వం…

Read More

కులు లోయ

కులు దేవతల లోయ’ గా పిలువబడుతుంది. బియాస్ నది ఒడ్డున సముద్ర మట్టానికి 1230 మీటర్ల ఎత్తున వుండే ఈ ప్రాంతం చుట్టూ అందమైన ప్రాకృతిక ప్రాంతాలు వుంటాయి. త్రిపుర కు చెందిన బెహంగమణి పటేల్ స్థాపించిన ఈ అందమైన పర్వత ప్రాంతానికి 1 వ శతాబ్దం నుండి చరిత్ర వుంది. 1947 లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే దాకా ఈ ప్రాంతం చేరుకోవడం కష్టంగా ఉండేదని చెప్తారు. ఈ వేసవి విడిది చుట్టూ ఎత్తైన కొండలు, దేవదారు వనాలు, నదులు, యాపిల్ తోటలు వున్నాయి – దీని ప్రాకృతిక అందానికి ఈ ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ఇవే కాక కులులో పురాతన కోటలు, ధార్మిక క్షేత్రాలు, వన్యప్రాణి అభయారణ్యాలు, ఆనకట్టలు కూడా ఉన్నాయి. రూపిపేలస్ గా పిలువబడే సుల్తాన్పూర్ పేలస్ ఇక్కడి ప్రసిద్ధ…

Read More

సిమ్లా

ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలనే వారికి స్వర్గసీమ సిమ్లా. హిమాలయ పర్వతపాదాల దగ్గర సముద్ర మట్టానికి సుమారు 6 వేల కి.మీటర్ల ఎత్తున ఉంటుంది సిమ్లా నగరం. రణగొణులకు దూరంగా ప్రశాంతంగా ఉంటుంది సిమ్లా నగరం. శ్యామలాదేవి ఆలయం కారణంగా ఈ నగరానికి సిమ్లా అనిపేరు వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. ఢిల్లీ నుంచి రైలు విమాన మార్గాలలో సిమ్లాకు వెళ్ళవచ్చు. కల్కా రైల్వే స్టేషన్ నుండి సిమ్లాకు రైలు ప్రయాణం ఓ మధురానుభూతి. నేరో గేజ్ రైలు మార్గం. రైలుపట్టాల మధ్య దూరం రెండు అడుగుల ఆరంగుళాలు మాత్రమే. కల్కా నుండి ఏడువేల అడుగుల ఎత్తులో ఉన్న సిమ్లాకు పర్వతాలను తొలచి రైలుమార్గాన్ని నిర్మించారు. ఈ మార్గంలో 806 వంతెనలు 102గుహలున్నాయి. ప్రకృతి సోయగాల మధ్య నుండి రైలు ప్రయాణిస్తుంటే చల్లని గాలులూ, మబ్బులు ముఖాన్ని…

Read More

అనంతగిరి – తెలంగాణా ఊటి

సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యంతో పర్యాటకులకు కనువిందు చేసే ప్రాంతం అనంతగిరి. ఈ ప్రాంతం అంతగా ప్రచారంలోకీ రాలేదు. కానీ ఇటీవల ఈ ప్రాంతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అక్కడి జలపాతాల గలగలలు, పక్షుల కిలకిల రావాలు, కొండ కోనలు, సేలయేటిధారలు, రాతి కట్టడాలు,సహజసిద్ధంగా ఏర్పడినగుహలు ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం పలుకుతాయి. దట్టమైన అడవుల మధ్య నెలకొ ఉన్న అనంతగిరి ప్రాంతం మూసీనది జన్మస్థానం కూడా. అనంతగిరిని తెలంగాణీ ఊటిగా పేర్కొంటారు. అనంతగిరికి వేళ్తే పట్టణ బిజీ జీవితం మరచి పోవచ్చు. మనసుకెంతో హాయి కలుగుతుంది. ఆధ్యాత్మికం, ఆహ్లాదం ఈ రెండింటి కలయికే అనంతగిరి ప్రత్యేకం. హైదరాబాద్ కు సుమారు 90 కిలో మీటర్ల దూరంలో కనువిందు చేస్తూ తెలంగాణ ఊటీగా పేరుగాంచిన పర్యాటక కేంద్రం అనంతగిరి. వికారాబాద్‌ నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి…

Read More

అరకు వ్యాలి

అరకులోయ విశాఖపట్నం డుంబ్రీగూడ మండలానికి చెందిన గ్రామము. సముద్రమట్టానికి 600 నుండి 800 మీటర్ల ఎత్తులో ఉన్నది. విశాఖపట్నానికి 120 కిలోమీటర్లదూరంలో ఉన్న అరకులోయ ఆహ్లాదకరమైన వాతావరణంతో, కొండలు, లోయలతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. అరకు లోయ ప్రయాణం ఒక గొప్ప అనుభూతి. విశాఖపట్నం నుండి అరకు వెళ్లే దారిలో పద్మాపురం బొటానికల్ గార్డెన్స్, మల్బరీ తోటలు, సిల్క్¬ ఫారం మరియు అనంతగిరి కాఫీ తోటలను చూడవచ్చు.అరకు వెళ్లేటపుడు రైలు ప్రయాణం, తిరుగు ప్రయాణంలో బస్ ప్రయాణం చేస్తే అన్ని ప్రకృతి దృశ్యాలను చూడటానికి వీలవుతుంది.ఈ ప్రయాణం సుమారు 5 గంటలసేపు సాగుతుంది. 58 సొరంగమార్గాలు,64 వంతెనల మీద నుండి సాగే ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అరకు వెళ్లేదారిలోనే బొర్రాగుహలు ఉన్నాయి. అరకులోయలో కాఫీతోటలు పేరుపొందినవి. గిరిజనులు రసాయనిక ఎరువులు వాడకుండా పండిస్తారు. ఈ…

Read More