కొల్లేరు సరస్సు

కొల్లేరు సరస్సు (కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు) : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సహజమైన మంచినీటి సరస్సు కొల్లేరు. కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో 77,138 ఎకరాలో ఈ సరస్సు విస్తరించి ఉన్నది. కృష్ణా జిల్లాలో కైకలూరు, మండవల్లి మండలాలో 12 వేల ఎకరాలో విస్తరించి ఉన్నది.  తమ్మిలేరు, బుడమేరు, ఎర్రవాగు వంటి చిన్న చిన్న నదు ఇందులో కుస్తాయి. ప్రతి సంవత్సరం శీతాకాలం ప్రారంభమైన తరువాత ఆస్ట్రేలియా, నైజీరియా, ఫిజి దేశా నుండి పక్షులు వచ్చి సంతోనోత్పత్తి తరువాత పిల్లలతో సహా తిరిగి తమ దేశాలకు వెళ్ళిపోతాయి. వలస పక్షులో ఎక్కువగా వచ్చేవి పెలికాన్‌ (గూడబాతు) పక్షులు. కొల్లేరు అక్రమ ఆక్రమణకు గురికావటంతో 2006లో సుప్రీంకోర్టు ఆదేశాలతో అక్రమ చెరువును ఆపరేషన్‌ కొల్లేరు పేరుతో ధ్వంసంచేసి ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి అభయారణ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంవారు ప్రకటించారు. కొల్లేటి అందాలను మరియు పక్షులను తికించేందుకు దేశవిదేశాల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తారు. సరస్సుపై కర్రల వంతెన ప్రత్యేక ఆకర్షణ. కొల్లేరులో వెలసిన పెద్దింట్లమ్మను పడవలలో వెళ్ళి దర్శించుకొనవచ్చును. ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో (మార్చి) పెద్దింటమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతాయి.
ఎలా వెళ్ళాలి : పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు పట్టణం నుండి 15 కి.మీ. దూరంలో కొల్లేరు సరస్సు ఉన్నది. బస్‌లో వెళ్ళవచ్చు.బయటి ప్రాంతాల నుండి వచ్చేవారు విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళే రైళ్ళు ఎక్కి ఏూరులో దిగవచ్చు. బయటి ప్రాంతాల వారు ఏలూరులో బసచేయవచ్చు. నవంబర్‌ నుండి మార్చి వరకు పర్వటనకు అనుకూలం.

పులికాట్ సరస్సు

pulicat lake

నెల్లూరు సమీపంలో ప్రసిద్ధి చెందిన పులికాట్ సరస్సు సహజసిద్ధంగా ఏర్పడిన ఉప్పునీటి సరస్సు. ఇది సుమారు 600 కి. మీ. ల విస్తీర్ణం లో వ్యాపించి ఉంది. నెల్లూరు జిల్లా వాకాడు,చిట్టమూరు, సూళ్లూరుపేట, దొరవారి సత్రం మరియు తమిళనాడు సరిహద్దులలో వ్యాపించి ఉన్నది. పక్షులకు ఆహారం పుష్కలంగా దొరకుతుంది. అక్టోబర్ నుండి మార్చిదాకా దేశ, విదేశాలనుండి షుమారు 50 లక్షల దాకా పక్షులు వస్తాయి. ఇక్కడ వాటర్ ఫౌల్, పెలికన్లు, హేరన్లు, ఫ్లమింగోలు వంటి పక్షులు తరచుగా కనపడతాయి. రాజస్థాన్ ఆఫ్ కచ్ నుండి ఫ్లెమింగో పక్షులు,సైబీరియా మరియు నైజీరియా నుండి గూడబాతులు (పెలికాన్) వస్తాయి. ఇవి నేలపట్టులో నివాసం ఏర్పరుచుకొని ఆహారం కోసం పులికాట్ కు వస్తాయి.
అరుదైన వలస పక్షి జాతులకు నిలయంగా వుంటుంది. ఒరిస్సా లోని చిలకా లేక్ తర్వాత ఇది రెండవ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు. పులికాట్ సరస్సు పర్యాటకులకు చక్కటి పిక్నిక్ ప్రదేశం. ఈ ప్రదేశం పక్షి సందర్శకులకు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. సంవత్సరంలో చాలా భాగం పక్షి సందర్శకులు ఇక్కడకు వస్తారు. పక్షులకు సంబంధించిని ఆడిటోరియం, గ్రంధాలయం, మ్యూజియం కూడా పులికాట్ లో ఉన్నయి. పక్షులకు చూడటానికి వాచ్ టవర్స్ ఉన్నాయి. లేక్ లో బోటు విహారం కూడా చేయవచ్చు. ఇక్కడి మత్స్య కారుల వద్దనుండి రూ.500 కు ఒక బోటు అద్దెకు తీసుకొని, సరస్సు అంతా చుట్టి రావచ్చు. పులికాట్ లో చేపలవేట వలన 10 వేల మంది మత్సకారులు జీవనం సాగిస్తున్నారు. పులికాట్ సరస్స మధ్యలో ఇరకటం అనే దీవి ఉన్నది. ఇది మంచి పిక్ నిక్ ప్రదేశం. ఇక్కడకు వెళ్లాలంటే భీమునివారి పాలెంనుండి పడవలలో వెళ్లవలసి ఉంటుంది.
ఎలా వెళ్లాలి ?
నెల్లూరు, సూళ్లూరుపేట, తిరుపతి నుండి బస్సులలో లేక సొంత వాహనాలలో వెళ్లవచ్చు. మద్రాసు నుండి 80 కిలోమీటర్ల దూరం.