సముద్రతీరాలు

Mumbai (ముంబై)

ముంబై నగరం పేరు చెప్పగానే ఫ్యాషన్లు, బిజీగా వుండే జీవన విధానం గుర్తుకొస్తాయి. ఆ వెంటనే బాలీవుడ్ సినిమాలు, ప్రసిద్ధ నటీ నటులు కూడా గుర్తుకు వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రపంచానికి అమెరికా దేశం కల వలే ఎలా ఉంటుందో, భారత దేశానికి ముంబై అలాగుంటుంది. ముంబై నగర ప్రాధాన్యతలు వివరించాలంటే అక్కడకల వివిధ మతాల ప్రజలు, వివిధ ప్రదేశాలు మరియు అక్కడి ప్రజల మతపర పూజలు మరియు స్ధానికంగా లభించే అనేక రకాల ఆహారాలు మొదలైనవాటిపై …

Mumbai (ముంబై) Read More »

Visakhapatnam Beaches, Rushikonda Beach, Ramakrishna Beach

రామకృష్ణ బీచ్ సమీపంలోని కాళిమాత ఆలయం, మత్స్యదర్శిని వంటివి అదనపు ఆకర్షణ. ఈ బీచ్ ఈతకు అనుకూలం కాదు. బీచ్ రోడ్డులోనే లగ్జరీ హోటల్స్, పార్కులతో పాటు కాఫీ హౌస్ లు, తినుబండారాల షాపుల, పార్కులు కలవు.ఈ బీచ్ లో పాశ్చాత్య సంస్కృతి కనబడదు. దగ్గరలోనే సబ్ మెరైన్ మ్యూజియం ఉంది. రుషికొండ బీచ్ విశాఖపట్టణానికి 8 కి.మీ. దూరంలో ఉన్న రుషికొండ బీచ్ ఇసుక తిన్నెలతో, సహజమైన వాతావరణంతో ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంది. ఈతకు …

Visakhapatnam Beaches, Rushikonda Beach, Ramakrishna Beach Read More »

కాకినాడ యన్.టి.ఆర్ బీచ్

కాకినాడ యన్.టి.ఆర్ బీచ్ – ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ బీచ్ పర్యాటకులకు కనువిందుచేస్తుంది. మ్యూజికల్ ఫౌంటెన్, అద్దాల వంతెన, లేజర్ షోలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ వంతెన ప్రత్యేకమైనది. సాల్ట్ వాటర్ లో ఏర్పాటు చేసిన లేజర్ షో మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ బీచ్ ఉంది.

ఉప్పాడ బీచ్

ఉప్పాడ బీచ్ కాకినాడ నుండి 5 కి. మీ. దూరంలో కలదు. విశాలమైన ఈ బీచ్ ఈతకు, స్నానాలకు సురక్షితమైనది. పట్టణ జీవితం నుండి ప్రశాంతంగా గడపుటకు అనుకూలమైన బీచ్.కాకినాడ హరిత బీచ్ రిసార్ట్స్ లో బస చేయవచ్చు.

సూర్యలంక బీచ్, బాపట్ల

బాపట్ల నుండి 9 కి.మీ. దూరంలో సూర్యలంక బీచ్ కలదు. ప్రకృతి సహజమైన అందాలతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. సహజసిద్ధమైన ఈ బీచ్ ఈతకు మరియు వారాంతపు సెలవలు గడపటానికి అనుకూలమైనది. హరిత బీచ్ రిసార్ట్స్ లో విడిది చేయవచ్చు.ఎలా వెళ్ళాలి ?విజయవాడ-ఒంగోలు రైలు మార్గంలో బాపట్ల ఉన్నది. రైలు లేక బస్ మార్గాల ద్వారా బాపట్లకు చేరుకోవచ్చు.