మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?

మొలత్రాడు మగవారు, ఆడవారు కట్టుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. మనిషి ఏ బంధము, బంధుత్వం లేక విగత జీవిగా వున్నప్పుడు అతనికి ఆ మొలత్రాడు అవసరం లేదు. మనిషి పుట్టిన వెంటనే అతనికి వెండి తో చేసిన ఒక తీగను నడుముకి చుట్టి అతనితో ఒక బంధాన్ని ఏర్పరుచు కుంటారు. అలా ఏ త్రాడు వేయకపోతే వాళ్ళ మధ్య ఏ బంధుత్వం ఏర్పడదు అని ఒక శాస్త్రం. నడుముకి ఎటువంటి తాడు లేకుండా ఏ పురుషుడు అలా వుండకూడదు. అది ఒక అమంగలం. ఆడవారు ఎలా సుమంగళిగా వుంటారో, అలానే మగవారు కూడా మొల త్రాడు తో వుండాలి. ఇలా ధరించడం వల్ల శరీరం దృష్టి దోషం లేకుండా వుంటుంది. తాయ త్తు మొల త్రాడుకే కాకుండా, మెడలో కూడా ధరించవచ్చు. కర్మకాండ అనే తంతులో ఈ త్రాడుని తీసెయ్యటం అనేది, ఇక ఈ జీవికి ఎటువంటి బంధుత్వం లేదు అని చెప్పటమే.

అఘోరాలు సహజంగా ఏ వస్త్రమూ, తాడు వాళ్ళ వంటిపైన వుంచుకొరు. అలా వాళ్ళు ఎల్లప్పుడూ ఈశ్వర సాన్నిధ్యంలో వుంటారు.

గుడి

గుడి చుట్టూ ప్రదక్షణ కుడి చేతి వైపు నుండే చేస్తారు ఎందుకు?

గుడిలో ప్రదక్షిణం సాధారణంగా “మూలవిరాట్టు ప్రదక్షిణం చేసే వ్యక్తికి కుడివైపుగా ఉండేటట్టు” చేస్తారు అని చెప్తే స్పష్టంగా ఉంటుంది. దీన్నే క్లాక్-వైస్ లేదా గడియారం తిరిగే దిశ అంటారు కదా. ఈ పద్ధతిలో నడిస్తే ప్రదక్షిణంగా నడవడమనీ, మూలవిరాట్టు వ్యక్తి ఎడమవైపుకు వచ్చేలా నడిస్తే అప్రదక్షిణంగా నడవడం అనీ అంటారు.

ఇలా ఎందుకు నడుస్తారంటే – నడిచేప్పుడు భక్తులకు కుడిచేతివైపు భగవంతుడు ఉంటాడు. ఇలా ఉండడమే విధాయకం. భార్యాభర్తలు పూజా కార్యక్రమాల్లోనూ, వివాహ క్రతువులోనూ నిలబడినప్పుడు భార్య భర్తకు ఎడమవేపున నిలబడాలి అంటారు. ఈ రెంటికి ఒకటే సూత్రం. (భర్త దేవుడిలాంటివాడు అన్నది కాదండీ, బాబోయ్) చిన్నవారికి కుడిపక్కన పెద్దవారు నిలబడాలి.


పైన చెప్పిన ప్రదక్షిణ పద్ధతి అన్ని ఆలయాలకు వర్తిస్తుంది కానీ శివాలయానికి వర్తించదు. శివాలయాల్లో మాత్రం వచ్చినవారు ఏ ఆశ్రమంలో ఉన్నారు (బ్రహ్మచర్యం, గృహస్థు, సన్యాసి) అన్నదాన్ని బట్టి వారు ప్రదక్షిణం చేసే పద్ధతి మారిపోతుదంది.

  • గృహస్థు: శివాలయంలో శివుని లింగానికి చేసిన అభిషేక జలం బయటకు వెళ్ళడానికి ఉండే మార్గాన్ని సోమసూత్రం అంటారు. గుడిలోంచి ఓ ఏనుగు బొమ్మ వంటి రూపం బయటకు పెట్టి అందులోంచి అభిషేక జలం వదులుతారు చూశారా, అది సోమసూత్రం. గృహస్థు దాన్ని దాటకూడదట. ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణంగా (శివుడు కుడిన ఉండేలా) ప్రారంభించి తిరిగి సోమసూత్రం వరకూ వచ్చి, ఆగిపోయి వెనుదిరిగి అప్రదక్షిణంగా సోమసూత్రం వరకూ వెళ్లి, ఆగి వెనక్కి తిరిగి ప్రదక్షిణంగా సోమసూత్రం దాకా నడచి – ఇలా చేయాలట. ఎందుకంటే గృహస్థు శివుని సోమసూత్రాన్ని దాటకూడదట. ఐతే, ఇలా చేసేప్పుడు అప్రదక్షిణంగా వెళ్ళడం, తద్వారా శివుడు భక్తుని ఎడమపక్కన ఉండే అవకాశం ఉంటుంది కదా, ఇలా ఎలా అంటే నాకు తెలియదు మరి.

బ్రహ్మచారి: బ్రహ్మచారికి సోమసూత్రం దాటకూడదన్న నియమం లేదు. (ఎందుకన్నది తెలియదు నాకు) కాబట్టి ప్రదక్షిణం మిగిలిన ఆలయాల్లో ఎలా చేస్తామో అలా పూర్తిగా చేసేయవచ్చు.

సన్యాసి: సన్యాసులు ప్రదక్షిణంగా కాక అప్రదక్షిణంగా (అంటే మూలవిరాట్టు ఎడమపక్క ఉండేలా) తిరగాలి ఆలయం చుట్టూ.

తావీజులు కడితే దయ్యాలు భూతాలు వదులుతాయి అంటారు కదా అది ఎంత వరకు నిజం

తావీజులు కడితే దయ్యాలు భూతాలు వదులుతాయి అంటారు కదా అది ఎంత వరకు నిజం!

అందరికి నమస్కారములు రాగి తావీజులు, అష్టబంధనము రేకులు, చేతికి రాగి కడియము, తలుపుకు మధ్యలో రాగి నాణ్యము,రాగిపాత్రలో తాగేనీరు,ఇవన్నీ చెడు ప్రభావము వున్నవన్ని,రాగి తీసుకొని మంచిప్రభావమును బయటికి తోస్తుంది. అందువలన పచ్చగాను,నలుపు రంగుగా మారుతుంది, ఇదే రాగిరేకు బీజాక్షరము లిఖించి దేవుని క్రింద ప్రతిష్ట చేస్తారు, గర్భగుడి పైన ఒక రాగి కలశము ప్రతిష్ట చేస్తారు, ఇవన్నీ,చేడు ప్రభావమును,వేదమంత్రాలు పూజలు వలన,బయటికి నెట్టి, మంచి ప్రభావమును ఆలయములో ప్రసరింప చేస్తుంది.

ఇదేవిధముగా వెండి, ఇత్తడి, ఇదే గుణము ఉంటుంది,బంగారము మాత్రము మంచి ప్రభావమును తప్ప చేడు ప్రభావమును చేర్పించదు అది ఎప్పుడు నలుపు కాదు, మంచి ప్రభావము ఉన్నందు వలన, అది సంపద గాను, విలువ అధికముగా పవిత్రముగా వుంటుంది.

దయ్యాలు భూతాలు అనేది ఏదిలేదు, కొన్ని ప్రతికూలమైన ఆలోచనలు పదే పదే ఆలోచించడము వలన, ఒత్తిడి గురిఅవుతారు దీనిని దయ్యాలు భూతాలుగా నమ్ముతారు, వీరికి ముఖమునకు ముడు సారి నీరు చెల్లు తారు, మానసిక ఒత్తిడి ఆ నిమిషము తగ్గుతుంది. అప్పుడు ఈ తావీజులు వలన దయ్యాలు భూతాలు వెళ్లిపోయింది, అని నమ్మిస్తారు దీని వలన ఈ తావీజులు వలన గుణమైనది అని నమ్మేవారికి, గుణము కావచ్చు?

నమ్మనివారికి తిరిగి మొదటికి వస్తుంది, ఇది పూర్వకాలము పాటించే వారు ఇప్పుడు దయ్యాలు భూతాలను నమ్మకుండా, సంబంధిత వైద్యులను కలవడము మంచిది. (ధన్యవాదములు).

చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మనిషి నోట్లో తులసి నీరు ఎందుకు పోస్తారు

తులసి చెట్టు, వనమూలికలు,నదిలో ప్రవహించే నీరు,ఇదికాక సముద్రజలము,భూమిపై వున్న ప్రతి మొక్కలు, చెట్లు, ఇవన్నిటికి, భూమిపై రాత్రి సమయము ప్రాణశక్తి (విశ్వశక్తి నుంచి)వెలువడుతుంది. ఈ శక్తి ప్రపంచములో వున్న, సకల జీవరాసులకు, కూడా ప్రసరణ చేస్తుంది,ఈ శక్తి పగలు సూర్య కాంతి వలన,ఈ శక్తి శాతము తగ్గుతుంది. ఉదయము చెట్ల ఆకులు పూలు వికసించి ఉంటుంది, సూర్య అస్తమము నకు, ఆకులు పూలు వాడిపోయి ఉంటుంది,ఇదే విధముగా మనిషి ఉదయము నుండి సాయంకాలము రాత్రి కి, అలసటకు గురిఅవుతారు. నిధరించి ఉదయము లేచినప్పుడు ,తాజాతనము,మనసు ప్రశాంతం గా ఉంటుంది, దీనిలో తులసి దళము, నది భూగర్భ జలాలు, ఆవు పాలు, కొన్ని మూలికలు, వీటి లో ప్రాణశక్తి పుష్కలంగా నిండి ఉంటుంది. అందుకే మహావిష్ణు దేవాలయము లో, తీర్థము తులసి దళము తో, కలిపి ఇస్తూ వుంటారు, అందుకు ఆవుపాలు, జలము, తులసిదళము, వీటిని చనిపోడానికి ముందు ఇచ్చేటప్పుడు, ప్రాణము తిరిగి వస్తుందని నమ్మకము గా భావిస్తారు.

Why wear blob in forehead….? నుదుట బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

హిందూ సాంప్రదాయంలో బొట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బొట్టులేని ముఖము,..ముగ్గులేని ఇల్లు. అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు.. రెండూ కూడా స్మశానంతో సమానం..అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో, అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు,..దరిద్రదేవత తాండవం చేస్తాయి…అని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే. కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు.వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగెటివ్ఎనర్జీ అంటారు..అది మనపై పడుతుంది. నరుడు కంటి చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు. అలాగే ఎదురుగా ఉండేటటువంటి వారు..మన ముఖాన్ని చూస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటికీ మధ్యలో ఉండేటటువంటి స్థానంలో కేంద్రీకృతమవుతుంది. మన శరీరంలో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో ఉంటాయి. ఎప్పుడైతే దృష్టి మనమీద పడిందో.. అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి.ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వలన..ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి.అంటే మెదడుకు సంభందించినటు వంటి నాడులు మన ముఖములో కనబడుతాయి.కాబట్టి ఆ మెదడు దెబ్బ తింటుంది. మెదడు దెబ్బ తినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మనకు తలనొప్పి వస్తుంది.మనఃశాంతి పోతుంది. చిరాకు వస్తుంది.ఏ విషయం పైన సరిగా దృష్టి పెట్టలేము. కాబట్టి ఎదుటి వారి యొక్క కంటిచూపు నుండే మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలంటే.. మెదడును కాపాడుకోవాలంటే..

మనకు ఉన్నటువంటి పాజిటివ్ఎనర్జీని కాపాడుకోవాలంటే ఖచ్చితముగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి.

అంటే బొట్టు పెడితే చాలు.

మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటటువంటి వారి యొక్క చూపు మన యొక్క నుదుట మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది.తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది. జ్ఞాపకశక్తి, మేధాశక్తి అన్నీ రకాలయినటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి.ఎటువంటి ఒత్తిడికి లోనూ కావు.మనల్ని కాపాడుతూ ఉంటాయి.మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి.అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి.

సైంటిఫిక్ గా కూడా తప్పనిసరిగా సైన్సు ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది.అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి.ఋణ బాధలు ఉన్నటువంటివారు నాగసింధూరాన్ని బొట్టుగా ధరించండి. ఆ బొట్టు పెట్టుకోవడం వలన ఋణబాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదే విధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఎక్కువగా మనఃశాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆరావళి కుంకుమను బొట్టు పెట్టుకోండి. పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా..సౌభాగ్యవతులే కాకుండా..మగవారే కాకుండా..వైథవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా..

కుంకుమను ధరించవచ్చు దానినే గంగసింధూరము అంటారు.ఆంజనేయస్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు. ఆ బొట్టును వైదవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు.ఎటువంటి తప్పూ లేదు. అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి. మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే.ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము. దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాము. ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారుబాటలు.అందుకని చక్కగా కుంకుమను ధరించండి.

అందం కోసం మరియు ఆధ్యాత్మికత కోసం… పిల్లలు, పెద్దలూ, మగవారు, స్త్రీలు అంతా నుదుట బొట్టు ధరించడం భారతీయ సనాతన సంప్రదాయం. చందనం, విభూతి, కుంకుమ… ఏది ధరించినా మంచిదేనని హైందవ ధర్మం తెలుపుతుంది. నుదుటిలో రెండు కనుబొమల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం మీద వేలితో నెమ్మదిగా నొక్కుతూ సిందూరాన్ని కానీ, కుంకుమను కాని పెట్టుకోవటం వల్ల అక్కడి నరాలు ఉత్తేజితమై జ్ఞాపకశక్తినీ ఆలోచనాశక్తీ పెంపొందిస్తాయని యోగశాస్త్రం తెలుపుతుంది.
పద్మపురాణం, ఆగ్నేయ పురాణం, పరమేశ్వర సంహితలోనూ బొట్టు ప్రస్తావన కనిపిస్తుంది. నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవటం ముత్తైదువుల ఐదోతనానికి చిహ్నంగా భావిస్తారు హిందూ స్త్రీలు. శుభకార్యాలకు బొట్టుపెట్టి పిలవటం హిందూ సాంప్రదాయం.


నుదుటి భాగాన్ని జ్ఞాననేత్రం, శక్తికేంద్రంగానూ పరిగణిస్తారు. అది పీనియల్‌ గ్రంథి స్థానం కూడా. ఇది మానసిక ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లని పెంపొందించి ఒత్తిళ్ళను దూరం చేస్తుందనీ మంచి ఆలోచనలు కలిగించేందుకు తోడ్పడుతుందనీ చెబుతారు శాస్త్రనిపుణులు. వీటన్నిటికీ తోడు బొట్టు ముఖానికి అందం కూడా వస్తుంది. చూసేవారికి కూడా ముచ్చటగా ఉంటుంది.బొట్టు పెట్టుకున్నవారి మీద ఎదుటవారిలో గౌరవం కలుగుతుంది.

యోగ పరంగా చూసుకుంటే: మానవ శరీరంలోని షట్చక్రాల్లో ఒకటైన ఆజ్ఞా చక్రం కనుబొమ్మల మధ్యలో నెలకొని ఉంటుంది.. ఈ ఆజ్ఞా చక్రాన్ని మూడవ కన్ను గా కూడా వ్యవహరిస్తారు.. బయటకి కనపడే రెండు కళ్ళలో ఒకటి గతాన్ని, మరొకటి ప్రస్తుతాన్ని సూచిస్తాయి,అయితే ఈ మూడవ కన్ను మాత్రం భవిష్యత్తు ని సూచిస్తుంది అని చెప్తారు.. ఈ చక్రం ద్వారా ఆధ్యాత్మితకతను మెరుగుపరచుకోవచ్చు అని చెప్తారు..

మీరు ధరించే “విబూధి” ,లేదా “కుంకుమ” ఈ ఆజ్ఞా చక్రాన్ని మరింత సక్రియం జరిపే అలంకరణ అని చెప్పవచ్చు.. ఇక హిందూ మతంలో ఉన్న విభిన్న శాఖల్లో బొట్టుని ఒకొక్కరు ఒక్కో రకంగా ధరించడం చూడవచ్చు..

  • వైష్ణవులు ధరించే బొట్టు నిలువుగా ఉంటుంది.. రెండు తెల్లని గీతలు శ్రీ మహా విష్ణువు యొక్క పాదపద్మాలను సూచిస్తే, ఎర్రటి గీత శ్రీ మహాలక్ష్మి ని సూచిస్తాయి.. వీటిని “ఊర్ధ్వపుండ్రాలు” గా వ్యవహరిస్తారు..

ఈ బొట్టునే తెల్లటి గీతలు భగవంతుని పాదపద్మాలుగా, ఎర్రటి గీత భక్తునిగా కొంతమంది వ్యవహరిస్తారు..

  • ఇక శైవ ఆరాధన లో విభూధి ని మూడు అడ్డ గీతలుగా ధరిస్తారు.. ఈ మూడు గీతల వెనుక అనేక కారణాలు చెప్తారు..

* “సత్వ” ,”రజస్”, “తమో” గుణాలకు ప్రతీకగా..

* శివుడి మూడు నేత్రాలకు ప్రతీకగా ..

* శివుడు కాలుడు కనుక “గతం”, “వర్తమానం”, “భవిష్యత్” కాలాలకు ప్రతీకగా ..

ఇలా రకరకాల సంప్రదాయాల్లో బొట్టుని ధరిస్తారు.

Cow Worship…..గోమాత

ముఖ్యంగా చిన్నచిన్న గ్రామాల్లో, పల్లెటూళ్లలో వుండేవారు గోమాతను ఎంతో దైవంగా పూజిస్తారు. ఎందుకంటే వీటి ద్వారే వారి జీవన విధానం కొనసాగుతుంది. ఆవు ఇచ్చే పాలతో వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తారు. దీంతో వారు వీటిని ఎంతో దైవంగా భావిండచమే కాకుండా… కొన్ని ప్రత్యేకరోజుల్లో పూజలను కూడా నిర్వహిస్తారు. అయితే కొంతమంది మాత్రం వీటిని పాలిస్తున్న జంతువుల్లాగా భావిస్తారు.

ఆవులను గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి. పురాణాల్లో గోమాతను సకల దేవతల స్వరూపంగా వర్ణించడం జరిగింది. ఇటువంటి స్వరూపం కలిగిన గోమాతను పూజించడం వల్ల సర్వపాపాలు సంహరించిపోతాయని పురాతనకాలం నుంచే ప్రతిఒక్కరు ప్రగాఢంగా విశ్వసిస్తూ వస్తున్నారు.

గోవు పాదాలలో ఋణ పితృదేవతలు, గొలుసులలో తులసి దళములు, కాళ్లలో సమస్త పర్వతాలు, మారుతీ తదితరులు కలవారున్నారు.
అలాగే గోమాత నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదాలుగానూ, భ్రూమద్యంబున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్లలో సూర్యచంద్రులవారు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ – ఇంద్రులు వున్నారు.
అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ – ప్రయాగ నదులు మొదలైనవి వుంటాయి. ఇలాగే గోమాతలో వున్న రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై వున్నారు. అందువల్లే పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానాన్ని పొందుపరిచారు.

Why Ladies wear Bangles….గాజులు ఎందుకు ధరిస్తారు ?

గాజులు మనకు అలంకరణ వస్తువులుగా ఆభరణాలుగా మాత్రమే తెలుసు. రంగు రంగు గాజులను ధరించి ఫ్యాషన బుల్ గా కనిపిస్తాం. అలాగా చేతి నిండా బంగారు గాజులు ధరించి వాటిని ఆస్తిగా చూస్తాం. అదే ఆచారం ఎందుకు వచ్చిందో తెలుసా?

గర్భాశయం నాడులను ఉద్దీపనం చేయడానికి ఉద్దేసించినవే గాజులు. మహిళల మణికట్టుకు ముంజేతికి మధ్య ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయి. మణికట్టునాడులు స్వల్పంగా ఒత్తిడికి లోనవుతుంటే గర్భాశయనాడులు అందుకు అనుగుణంగా ఉత్తేజితమవుతాయి. దాంతో గర్భాశయ పనితీరు కండారాల కదలికలు సవ్వంగా జరుగుతుంటాయి. ఇందుకు ప్రత్యామ్నాయం లేదా అంటే .. రోజూ కొంతసేపు మణికట్టు ముంజేతి మధ్య చేత్తో నొక్కుకోవచ్చు.

అలాగని మర్థన చేసినంత ఒత్తడి పడకూడదు. కాబట్టి ఒక రకంగా అలంకరణగాను, ఆరోగ్య సాధనంగాను ఉపకరించే విధంగా డిజైన్ అయినవే ఈ గాజులు

Beetal Leaves…..తమలపాకులు ఎందుకు?

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన హిందూ సంస్కృతిలో ప్రకృతికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. మనకు సంబంధించిన ఏ పండుగలైనైనా ప్రకృతి ఆరాధన తప్పకుండా మిళతమై వుంటుంది. అందులో ఉగాది పండుగకోసం వేపచెట్టు.. అలాగే సంక్రాంతి పండుగ ధాన్యరాశులు, పశుసంతతి పట్ల ప్రేమ చూపడం.

అదే విధంగా వినాయకచవితి అంటే అనేక విధాలైన ఫల, పత్ర, పుష్పాలతో స్వామిని అర్చించడం జరుగుతుంది. ఇలాంటి విశిష్ట సంస్కృతి ఏ ఇతర మతంలోనూ కనిపించదు.

హిందూ సంస్కృతిలో తాంబులానికి – అంటే తమలపాకులకు కూడా ఎంతో ప్రాముఖ్యత వుంది. కొందరు దేవుళ్లకయితే నిర్ణీత సంఖ్యలో వీటిని కేటాయించి పూజలు చేస్తారు. ఇలాగే ఆయుర్వేదం కూడా ఆరోగ్యానికి తాంబూల సేవనాన్ని సూచిస్తుంది ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలను పక్కనబెడితే… శరీరానికి తాంబూల సేవనం ఎంతో ఉపయోగకరమైనది. మానవ శరీర ఎముకలలో వుండే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, విటమిన్ సీ వంటి పోషకాలు కూడా తమలపాకులో పుష్కలంగా వుంటాయి. ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.

తమలపాకులో పీచుపదార్థం (ఫైబర్) కూడా అధిక మొత్తంలో వుంటుంది. ఏవిధంగా అయితే ఆకుకూరలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో అదేవిధంగా తమలపాకులు కూడా పనిచేస్తాయి.

రుద్రాక్షలు

రుద్ర అంటే శివుడు అక్ష అంటే కన్ను అని అర్ధం. రుద్రుడి కంటినుంచి జాలువారింది కాబట్టి రుద్రాక్ష అనే పేరు వచ్చిందంటారు. పురాణాల ప్రకారం ఒకసారి శివుడు చాలాకాలం తపస్సు చేసిన తరువాత కళ్ళు తెరచినపుడు ఆయన కంటి నుంచి ఓ కన్నీటి బొట్టు జారి నేలమీద పడిందంటారు. అదే రుద్రాక్ష చెట్టుగా మొలచిందంటారు.

హిందువులు, సిక్కులు, బౌద్ధులు పదో శతాబ్ధం నుంచే వీటిని ధరిస్తున్నట్లు చరిత్ర వలన తెలుస్తుంది. రుద్రాక్ష ఏకాగ్రతనూ, యోగశక్తిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించి ఆధ్యాత్మిక చింతనను పెంచుతుంది. రుద్రాక్ష ఔన్నత్యాన్ని గ్నురించి శివపురాణం, పద్మపురాణాం, శ్రీమద్భాగవతం లాంటి పురాణాలు వివరిస్తున్నాయి.

ఆధునిక పరిశోధన ప్రకారం రుద్రాక్షలకు ఉన్న అయస్కాంత, ప్రేరణ శక్తి వలన అవి మనిషి మానసికస్ధితి మీదా శారీరక రుగ్మతల మీద ప్రభావం చూపగలవని తేలింది. ఈ మాలను ధరించినపుడు రుద్రాక్షలోని విద్యుదయస్కాంత శక్తి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి గుండె సవ్యంగా పనిచేసేలా ప్రభావం చూపిస్తుందని ఐఐటి మరియు బెనారస్‌ పరిశోధకు తేల్చారు.

ఆయుర్వేద గ్రంథాల ప్రకారం రక్తంలోని వ్యర్ధాలను తొలగించడంతో పాటు శరీరం లోపలా వెలుపలా ఉన్న బాక్టీరియాతో కూడా పోరాడే శక్తి రుద్రాక్షలకు ఉంటుదని తెలుస్తుంది.

రుద్రాక్ష చెట్లు : రుద్రాక్ష చెట్లు ఆగ్నేయాసియా దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. 70 శాతం ఇండోనేసియాలో, 25 శాతం నేపాల్‌లోనూ మిగ్నతా 5 శాతం భారత్‌లోను ఉన్నాయి.

రుద్రాక్ష కాయలు : నీలం రంగులో ఉండే రుద్రాక్ష కాయలు ఎండిన తరువాత పైనున్న పొరపోయి లోపులున్న విత్తనం మిగులుతుంది. అదే రుద్రాక్ష. రుద్రాక్ష మీద పైనుంచి కిందివరకు కనిపించే గీతలనే ముఖాలంటారు. ఒక గీత ఉంటే ఏకముఖ రుద్రాక్ష అని రెండు గీతలుంటే ద్విముఖ రుద్రాక్ష అని అంటారు. ఇలా 21 ముఖాల దాకా రుద్రాక్షకు ఉంటాయి.

ప్రతి చెట్టుకు అన్ని ముఖాలున్న రుద్రాక్షలు కాస్తాయి. అయిదు ముఖాలున్న రుద్రాక్షలు తరువాత నాలుగు, ఆరు ముఖాలున్న రుద్రాక్షలు ఎక్కువగా దొరకుతాయి. వీటి ధరలు తక్కువగా ఉంటాయి. మిగిలినవి చాలా తక్కువగా దొరకుతాయి.

ముఖాలు పెరిగేకొది ధరకూడా పెరుగుతుంది. ఏకముఖి, 21 ముఖాలున్న రుద్రాక్షకు ఎక్కువ శక్తి ఉందని నమ్మకం. రుద్రాక్ష మనిషి చుట్టూ పాజిటివ్‌ శక్తిని సృష్టిస్తుంది.

నిజమైన రుద్రాక్షను తెలుసుకొనే విధానం : ఈ రుద్రాక్షలను జాగ్రత్త ఎంచుకొని కొనాలి. కొందరు కృత్రిమంగా ముఖాలను చెక్కుతారు. రుద్రాక్ష లాగానే కనిపించే నకిలీ రుద్రాక్షలు కూడా ఉంటాయి. ఇవి విషపూరితమైనవి, ధరించరాదు. నిజమైన రుద్రాక్షను ఒక రాగినాణెం మీద పెట్టి ఇంకొక రాగినాణెం దాని దగ్గరగా తీసుకువెళితే రుద్రాక్షలోని విద్యుత్‌ అయస్కాంత శక్తి మూలంగా రుద్రాక్ష నెమ్మదిగా సవ్యదిశలో తిరుగుతుంది. ఇలా రుద్రాక్ష అసలైనదో కాదో తేల్చుకోవచ్చు. భక్తి, ఆధ్యాత్మిక భావంతో వీటిని ధరించేవారు స్నానం చేసేటపుడు, కాకృత్యాలు తీర్చుకునేటపుడు, శృంగార సమయంలోనూ, కొన్ని సమయాలో వీటిని ధరించరు.

నవగ్రహాలు,నవధాన్యాలు,నవరత్నాలు, వేదాలు, యుగాలు ,అష్టదిక్కులు

నవగ్రహాలు
సూర్యుడు – సన్
చంద్రుడు – మూన్
అంగారకుడు – మార్స్
బుధుడు – మెర్య్కురి
గురుడు – జుపీటర్
శుక్రుడు – వీనస్
శని – శాట్రన్
రాహువు – నెప్ట్యూన్
కేతువు –ఫ్లూటో
నవరత్నాలు
వజ్రం
వైడూర్యం
గోమేధికం
పుష్యరాగం
మరకతం
మాణిక్యం
నీలం,
ప్రవాలం
ముత్యం
నవధాన్యాలు 
వులవలు
పెసలు
మినుములు
నువ్వులు
గోధుమలు
అనుములు
కందులు
సెనగలు
4 వేదాలు
రుగ్వేదము
యజుర్వేదము
సామవేదము
అధర్వణవేదము
4 యుగాలు
కృతయుగం – 17,28,000 సంవత్సరాలు
త్రేతాయుగం – 12,96,000 సంవత్సరాలు
ద్వాపరయుగం – 8,64,000 సంవత్సరాలు
కలియుగం – 4,32, 000 సంవత్సరాలు
పంచామృతాలు
నీళ్ళు
ఆవు పాలు
ఆవు పెరుగు
తేనె
నెయ్యి
అష్టదిక్కులు
తూర్పు (ఈస్ట్)
పడమర (వెస్ట్)
ఉత్తరం (నార్త్)
దక్షిణము (సౌత్)
తూర్పు (ఈస్ట్)
పడమర (వెస్ట్)
ఉత్తరం (నార్త్)
దక్షిణము (సౌత్)
ఆగ్నేయము –సౌత్ ఈస్ట్
నైరుతి – సౌత్ వెస్ట్
వాయువ్వం – నార్త్ వెస్ట్
ఈశాన్యము – నార్త్ ఈస్ట్

కార్తీక మాస స్నానాలు

ప్రాచీనులు ఏ నియమాన్ని మన సంప్రదాయంలో పెట్టినా దానిలో ఆధ్యాత్మిక రహస్యంతోపాటు వైద్య సామాజిక దృక్పధాలు తప్పక ఉండి తీరుతాయి. శరత్కాలం (ఆశ్వయుజ, కార్తీకమాసాలు) వసంత కాలం (చైత్రం, వైశాఖం) ఈ రెండూ వాతావరణంలో వచ్చే రెండు మార్పులకి సంధికాలం.

శరత్కాలంలో చలితో పాటు మంచూ ఉంటే, వసంతకాలంలో మంచూ మంచుతోపాటు పెరుగుతున్న ఎండలూ ఉంటాయి. ఎవరి శరీరమైనా ఒక తీరు వాతావరణానికి తట్టుకోగ్గుతుంది కానీ భిన్న వాతావరణాల మధ్య సంధికి తట్టుకోలేదు. దాంతో శరీర రక్షణవ్యవస్థ శరత్‌, వసంతకాలాల్లో దెబ్బతింటుంది. అందుకే ఈ రెండు ఋతువులను యమదంష్ట్రిక కాలం అంది శాస్త్రం.

ఉబ్బసం, అతిశ్లేష్మం, దగ్గు వంటి వ్యాధులన్నీ విజృంభించే ఈ కాంలో ఆ వ్యాధిగ్రస్తులంతా తగిన జాగ్రతను పాటించాల్సిందే. ఇక ముందుకాలంలో ఈ తీరు వ్యాధులు తమకి రాకూడదనే ముందుజాగ్రత్త మనకి ఉన్నట్లయితే తప్పక ఈ శరత్కాలంలో (అక్టోబరు-నవంబరు) తెల్లవారుజామున శరీరానికి చన్నీటి స్నానాన్ని అలవాటు చేయించాలి. స్నానాలను ప్రారంభించిన మొదటివారంలో దగ్గు, పడిసెం, గొంతు మారడం లేదా పూడిపోవడం వంటి వ్యాధులొచ్చినా అలాగే స్నానం చేస్తూన్నట్లయితే శరీరం ఆ పరిస్థితికి అలవాటు పడిపోతుంది.

ఇలా అలవాటు చేయించి వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకే ఈ కార్తీకంలో ఈ స్నానానికి అందునా తెల్లవారుజామునే అదికూడా తలారా చేసితీరాలిందేనని మన పెద్దలు నియమబద్ధంగా శాసించారు. .
స్నానాలు కార్తీకంలోనేనా? ఏ నెలలోనూ ఉండని చిత్రమైన విధానం ` స్నానానికి ` ఈ నెలలోనే ఎందుకేర్పాటు చేశారనేది అందరికీ వచ్చే సందేహం.

కార్తీకానికి వెనుక ఆశ్వయుజం దానికి వెనుక ఉన్నది భాద్రపదం, భాద్రపద మాసంలో వినాయకుణ్ణి ఓషధి గుణాలున్న 21 పత్రాలతో లక్షల సంఖ్యలో భక్తులు పూజచేసి ఆ పత్రాలను నీటిలో కలుపుతారు. ఆ ఆకుల ఔషధగుణం నీటికి చేరుతుంది.

ఆ వెంటనే వచ్చే ఆశ్వయుజమాసంలో అమ్మవారిని అనేకవిధాలైన రంగు పుష్పాలతో లక్ష సంఖ్యలో భక్తులు పూజచేసి ఆ పుష్పాలను నీటిలో కలుపుతారు ( బతుకమ్మ పండుగల్లో నిమజ్జనాన్ని చూస్తే అర్థమౌతుంది) ఆ పుష్పాల్లో దాగిన ఔషధగుణం కూడా నీటికి చేరుతుంది.

ఆ వెంటనే వస్తున్న ఈ కార్తీకంలో అప్పటి పత్రి ఔషధగుణం ఇప్పటి పుష్పాల ఔషధగుణం దాగిన నీటిలో వరుసగా నెలరోజుపాటు స్నానాల్ని చేస్తే ఆ పత్ర పుష్ప ఔషధగుణం ఈ వ్యక్తికి కలుగుతుందంటారు. మనమీద మహర్షుల కెంతటి దయాగుణమో దీన్నిబట్టి అర్థం చేసుకోవాలి.

ఇలా నెలరోజుపాటు చలికి లెక్కచేయకుండా నిద్రనుంచి లేవగలగడం కొంతదూరం వెళ్ళి స్నానం చేసి రావడమనేదానికి శరీరానికి అలవాటు చేస్తే దీనిమీదట రాబోయే మార్గశీర్షమాసంలో (ధనుర్మాసం) తెల్లవారుజాము కాలానికి లేవటానికి అలవాటైపోతుంది. చలికి అలవాటుపడిన శరీరానికి మార్గశీర్ష, పుష్యమాసాల్లో పడే మంచుని కూడా తట్టుకోగలిగిన శక్తి అపారంగా వస్తుంది.
ఇలా ఆధ్యాత్మికం, వైద్యం అనే రెంటితో ముడివడిన స్నానమనేది ఎంత చక్కని సంప్రదాయ విధానం.

గమనిక : శ్వాసకోస వ్యాధులున్నవారు, చన్నీటిస్నానం పడనివారు, చాలావృద్ధులు, శిశువు ఈ స్నానాలు చేయకూడదు. ఆరోగ్యం రాకపోగా వైద్యంకోసం తిరగాల్సి ఉంటుంది. అలాగే సంప్రదాయానికి చెడ్డ పేరు వస్తుంది.

ఉత్తరాయణం మరియు దక్షిణాయనం

మన పూర్వీకులు సంవత్సరాన్ని రెండుగా విభజించి ఆయనములు అని పేరు పెట్టారు. మొదటిది ఉత్తరాయణం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశంతో ఉత్తరాయణం, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయణం ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కటి ఆరు నెలల కాలం ఉంటుంది. ఖగోళ శాస్త్రం ప్రకారము ప్రతి సంవత్సరము, జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉత్తరాయణం అని జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయణం అని అంటారు. ఉత్తరాయణం ఆరునెలల కాలం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కాలంలో పుణ్యకార్యాలు శుభఫలితాలనిస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాలకు కూడా ప్రశస్తమైనది.

మానవమాత్రులకు రాత్రి పగలు మాదిరిగా దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయణం రాత్రి అన్నమాట. మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు . సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తరదిశలో ఉన్నట్లు కనిపించునప్పుడు ఉత్తరాయణం అని , సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణముగా సంచరించునట్లు కనిపించినప్పుడు దక్షిణాయణం అని పిలిచారు . ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం అయితే 6 నెలలు దక్షిణాయనం . ఇంతటి మార్పుకు సంబంధించిన రహస్యాన్ని లోకం లోని అతిసామాన్యులకు అర్ధమయ్యేలా వివరించేందుకు పండగను చేసుకునే అలవాటును ప్రచారం లోనికి తెచ్చారు . పూర్వం భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛందమరణాన్ని కోరుకున్నాడు.

దేవాలయానికి ఎందుకు వెళ్లాలి ?

ఇంట్లో దేవతారాధన చేస్తాం. అలాంటప్పుడు ‘గుడికి వెళ్లి పూజచేయడం ఎందుకు?’
అనే సందేహం సహజం. దేవాలయంలో మూలవిరాట్టు ఉన్న చోట బీజాక్షర యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. యంత్రాన్ని రాగితో చేస్తారు. దానిమీద బీజాక్షరాలు ఉంటాయి. చక్రాలు వేసి ఉంటాయి. చక్రం బోలెడు కోణాల కలయిక. ఒకసారి ఇందులోకి ప్రవేశించిన ఏ శక్తైనా ప్రతి కోణానికీ తాడనం చెందుతూ పెద్దదిగా మరింత బలమైనదిగా మారుతుంది.

రాగి మంచి వాహకం. భూమిలోపల ఉండే విద్యుదయస్కాంత తరంగాల శక్తిని ఒక దగ్గరికి తీసుకురావడంలో యంత్రం గొప్పగా పనిచేస్తుంది. అందువల్ల అక్కడ శక్తిక్షేత్రం ఏర్పడుతుంది. నిజానికి స్వయంభూ దేవాలయాలన్నింటి దగ్గరా ఇలాంటి శక్తి తరంగాలు అత్యధికంగా ఉంటాయి.

అలా దేవుడు వెలసిన చోటును రుషులు గుర్తించి దేవాలయాల్ని నిర్మించేవారు. ఇక, మంత్రబలంతో ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. గుళ్లొ నిరంతరం అర్చన జరుగుతూనే ఉంటుంది. దేవాలయంలో ఎన్ని పూజలు జరిగితే ఆ విగ్రహానికి అంత శక్తి వస్తుంది. ఆ విధంగా ఏళ్లతరబడి ఆ విగ్రహానికి శక్తి ఆపాదన జరుగుతుంది. అందుకే పురాతన ఆలయాలకు వెళ్లడం గొప్పవిషయంగా చెబుతారు.

సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి?

మన శరీరంలోని అన్ని అంగాలూ నేలకు తగిలేలా బోర్లా పడుకుని చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. బాగా గౌరవించే వాళ్ల దగ్గర కాస్త ముందుకు వంగి నమస్కారం చేస్తాం. మరి సృష్టికి మూలమైన భగవంతుడికి నమస్కారం చేయాలంటే..

ఎంత వంగినా ఇంకా వంగవచ్చునా అనిపిస్తుంది. అందుకే ఇక నన్ను నేను ఇంతకన్నా వంచలేను అనిపించే స్థితిలో నేలకు సాష్టాంగపడి నమస్కారం చేస్తాం. భగవంతుడికి పూర్తిస్థాయిలో మోకరిల్లడం ఇందులోని పరమార్థం. అయితే సాష్టాంగనమస్కారం పురుషులకు మాత్రమే. స్త్రీలకు వర్తించదు. మనిషి జననానికీ, జీవనానికీ కారణమైన పొట్ట, వక్షభాగాన్ని నేలకు తగిలించకూడదనీ, అందుకే వాళ్లు మోకాళ్ల మీద ముందుకు వంగి నమస్కారం చేస్తే సరిపోతుందనీ శాస్త్రం చెబుతోంది.

వేల సంవత్సరాల నాడు రుషులూ, మునులూ తాము తపించి, ఆచరించి, అనుభవంలోకి తెచ్చుకున్న ఎన్నో విషయాలనూ, విశేషాలనూ భగవంతుడికి దగ్గరగా బతికేందుకంటూ ఇలా పూజా రూపంలో పొందుపరిచి మనకందించారు.

మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు వెళ్లే స్వచ్ఛతను అందిస్తాయివి. అంతేకాదు ఒక క్రమబద్ధమైన జీవన విధానాన్నీ, మనసును అదుపులో ఉంచుకునే చాకచక్యాన్నీ, మనల్ని మనం గమనించుకుంటూ బతికే నైపుణ్యాన్నీ దోసిటపట్టే పట్టునిస్తాయి.

మంత్రపుష్పం పరమార్థం ఏమిటి?

పూజలో పూలు వాడతాం. మరి మంత్రపుష్పం ప్రత్యేకత ఏమిటీ అంటే – భగవంతుడికి మనం చేయగలిగిన ఉపచారాలన్నీ చేశాక, పెట్టగలిగిన పదార్థాలన్నీ పెట్టాక… మనల్ని మనం ఆ దేవదేవుడికి సమర్పించుకోవడమే మంత్రపుష్పంలోని పరమార్థం.
నీలతోయత మధ్యస్థా విద్యుల్లేఖేవభాస్వరా
నీవారశూక వత్తన్వీ పీతాభాస్వత్యణూపమా
తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః…

అని చెబుతుంది నారాయణ సూక్తం. అంటే కిందివైపు ముడుచుకుని ఉన్న కమలంలా నాభికి పైనా, గొంతుకు కిందా 12 అంగుళాల పరిమాణంలో ఉన్న భాగం (హృదయం), మనం తిన్న అన్నాన్ని శరీరభాగాలన్నింటికీ సమానంగా పంచుతుందట. దానిపై భాగంలో విచ్చుకున్నట్టు ఉండే సూక్ష్మపద్మంలాంటి చోట నివ్వరిధాన్యపు ముల్లంత (వడ్లగింజ కొస) పరిమాణంలో పసుపురంగు కాంతితో మనలోని పరమాత్మ ఉంటాడంటూ సవివరంగా మన జ్యోతి స్థానాన్ని వివరిస్తుంది. ఈ శ్లోకాన్ని మంత్రపుష్పంతో జతచేసి చదువుతాం. అంటే నాలోని ప్రాణం నీవు, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను స్వామీ… అని చెప్పుకోవడం మంత్రపుష్పంలోని పరమార్థం.

శఠగోపం ఆకారం ఎందుకలా?

శఠగోపం ఆకారమే చాలా ప్రత్యేకం. ఈ మధ్య పిరమిడ్‌ ధ్యానం, పిరమిడ్‌ థెరపీ గురించి వింటూనే ఉన్నాం. మన చుట్టూ ఉండే వివిధ రకాల శక్తులను ఒకచోటికి తెచ్చి, మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగానూ స్వస్థపరచేలా ఈ ఆకారాలు సాయపడతాయన్నది ఇందులోని విషయం.

గోపురాలు దాదాపు ఇదే ఆకారంలో ఉంటాయి. అలాగే చదరంగా ఉండే తలాలకన్నా వంపుగా అర్ధవృత్తాకారంలో (డోమ్‌ తరహా) నిర్మాణాలూ పిరమిడ్‌ తరహాలోనే పనిచేస్తాయి. రాజమందిరాల పై భాగాలు ఇలా ఉండటాన్ని మనం గమనించొచ్చు. అందువల్ల శఠగోపం కూడా అచ్చంగా ఇదే విధంగా పనిచేస్తుంది. ఆత్మజ్ఞానానికి ప్రతీకైన సహస్రార చక్రం మన తలకు పై భాగంలో కాస్త ఎత్తులో ఉంటుంది. అదే జ్ఞానులూ, యోగులకు దాదాపు జానెడు ఎత్తులో ఉంటుంది. అలాంటి సహస్రార చక్రం పైన ఈ శఠగోపాన్ని ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.

శఠగోపాన్ని ఆరు అంగుళాలూ, ఎనిమిది అంగుళాలూ లెక్కన ఎత్తుగా చేయడం వెనక సహస్రార చక్ర స్థితి ముడిపడి ఉంది. మనం దేవాలయానికి వెళ్లినప్పుడు ఇన్ని రకాలుగా శక్తిని పొందుతాం కాబట్టి, దాన్ని స్థిరపరచుకోవడానికి కాసేపు అక్కడే కూర్చోమని చెబుతారు.

తీర్థంలో ఏముంది?

మామూలుగా తులసికి ఓ ప్రత్యేకత ఉంది. కొడిగడుతున్న శక్తులకు పునరుజ్జీవాన్ని తెచ్చే లక్షణం దీనికుంది. చనిపోతున్న వాళ్ల నోట్లో తులసి తీర్థం వేయడం వెనుక ఉన్న మర్మం కూడా ఇదే. తులసి తీర్థాన్ని కూడా ఉద్ధరిణి సాయంతో సవ్యదిశలో తిప్పుతూ ఉండటాన్ని గమనిస్తాం.

ఇక్కడా వర్తులాకార తరంగాల శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఇందులో ఉండే పచ్చకర్పూరం, యాలకులకు మనసుకు ఉత్తేజం కలిగించే గుణం ఉంటుంది. పచ్చకర్పూరానికి దేన్నైనా పాడవకుండా ఉంచే లక్షణం ఉంటుంది. నిజానికి అదో ప్రిజర్వేటివ్‌. తిరుపతి లడ్డూలో పచ్చకర్పూరం వేయడం వెనుకా కారణం ఇదే. ఇక, ఇందులో భగవంతుడి అనుగ్రహమూ దాగుంది.

భగవంతుని పేరు చెబుతూ అరచేతిని పదార్థాలవైపు చూపుతున్నప్పుడు మన అరచేతుల నుంచి బంగారు రంగు కిరణాలు వెలువడతాయన్నది ప్రాణిక్‌హీలింగ్‌లో చెబుతారు. దేవుడికి నైవేద్యంగా సమర్పించిన ఏ పదార్థానికైనా అంత రుచి రావడం వెనకున్న రహస్యం ఇది.

ధూపం ఎందుకంత ప్రత్యేకం? …హారతి ఎందుకు ఇస్తాం?

నిప్పుల్లో సాంబ్రాణి, గుగ్గిలం, అగరులాంటివి వేస్తారు. ఇవన్నీ చెట్ల నుంచి వచ్చేవే. వాసన మనిషిని ఉత్తేజపరుస్తుంది. అరోమాథెరపీ అనే పదం వినే ఉంటాం. మిడతలా ఎగిరే మనసును కట్టడి చేయాలంటే మంచి పరిమళంతోనే సాధ్యం మరి! అంతేకాదు, మన దగ్గర కొంచెమే ఉంది. దాన్ని పదిమందికీ పంచాలి అనే భావనను కూడా ఈ ధూపం చక్కగా ప్రతిబింబిస్తుంది.

హారతి ఎందుకు ఇస్తాం?
కర్పూరానికి అలసటను దూరం చేసే శక్తి ఉంటుంది. సాధారణంగా భగవంతునికి ఇచ్చే హారతికైనా, పూజ తర్వాత మనకిచ్చే మంగళహారతికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. అంతేకాదు వృత్తాకారంలో దైవం చుట్టూ హారతిని తిప్పడం వల్ల ఉత్పన్నమయ్యే శక్తి నాలుగు దిశలకూ ప్రయాణిస్తుంది. మనం హారతిని కళ్లకు అద్దుకోవడంవల్ల ఆ తరంగాలు మన అరచేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. హారతి సమయంలో చేసే ఘంటానాదం సాంత్వననిచ్చే తరంగాల సృష్టికి సహకరిస్తుంది.

ప్రదక్షిణలోని ఆంతర్యం?

ఆలయంలోకి ప్రవేశించగానే మనం చేసేపని ప్రదక్షిణ. ప్రదక్షిణలోనూ రెండు రకాలు. ఒకటి ఆత్మప్రదక్షిణ, రెండోది దైవ ప్రదక్షిణ. దేనికదే ఓ ప్రత్యేకత కలిగింది. నిజానికి మనం ఆలయంలోకి ప్రవేశించగానే దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం. మంత్రపరంగానైతే ప్రదక్షిణల్లో మనం సత్వ, రజో, తమో గుణాల్ని విడనాడి త్రిగుణాతీతంగా అవుతామనీ, అలాంటి స్థితిలో దైవ ప్రార్థన చేయాలనీ చెబుతాం. ప్రదక్షిణ వల్ల శరీరం శక్తిని పుంజుకుంటుంది. ఏ రకంగా అంటే..

ముందుగా మనం ఆత్మ ప్రదక్షిణను తీసుకుందాం. బొంగరం సాధారణంగా పడిపోయి ఉంటుంది. అది ఎప్పుడైతే తనచుట్టూ తాను తిరగడం మొదలు పెడుతుందో అప్పుడు నిటారుగా నిలబడగలుగుతుంది. ఇక్కడ ప్రదక్షిణ బొంగరానికి నిలబడే శక్తిని ఇస్తుందన్నమాట. అలాగే భూమిని చూద్దాం…

అది నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. విశ్వంలో వేలాడుతున్నట్టు కనిపించినా దానంతట అది నిలబడేందుకు కావలసిన శక్తిని భ్రమణం ఇస్తుంది. అలాగే, భూమి నిరంతరం సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ సూర్యుడి నుంచి శక్తిని గ్రహిస్తూ ఉంటుంది. ఇదేవిధంగా మనం శక్తికేంద్రకమైన దైవం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల ఆయన్నుంచి శక్తిని పొందుతాం. ఇందులోనూ మరో విషయం ఉంది, ప్రదక్షిణ అంటే కుడిదిశలో తిరగడం అని అర్థం. అంటే మనం సవ్యదిశలో తిరుగుతామన్నమాట. విశ్వంలో ఏ పదార్థమైనా సవ్య దిశలో తిరిగినప్పుడు దాన్నుంచి పాజిటివ్‌ ఎనర్జీ ఉద్భవిస్తుంది.

దేవాలయంలో గంట మ్రోగిస్తాం ఎందుకు?

చాలా దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేక ఎక్కువ గంటలు వ్రేలాడ దీయబడి ఉంటాయి.  భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి మరియు ప్రార్ధనలకి ఉపక్రమిస్తాడు.  పిల్లలు ఎత్తుగా ఉన్న గంటను పైకి ఎగిరి లేక ఎత్తుకోబడి మ్రోగించడానికి ఇష్టపడతారు

మన ఇంట్లోకానీ, గుళ్లొకానీ పూజ మొదలు పెట్టే ముందు ఘంటానాదం చేస్తాం. మంత్రపరంగా అయితే

ఆగమార్థంతు దేవానాం
గమనార్థంతు రాక్షసాం
కురుఘంటారావం తత్ర
దేవతాహ్వానలాంఛనం…
అంటాం. దేవతలు వచ్చేందుకూ, రాక్షసగణాలు పారిపోయేందుకూ గుర్తుగా లాంఛనంగా మనం ఘంటానాదాన్ని చేస్తాం. అయితే ఘంటానాదానికి సంబంధించి శాస్త్రపరమైన విషయం ఒకటి ఉంది. మనం గంట రింగున మోగుతుంది అంటాం. నిజానికి గంటకు సంబంధించిన శబ్ద తరంగాలు వృత్తాకారంలో ఉంటాయి. వృత్తాకారంలో వచ్చే శబ్దం ఎప్పుడూ రింగులు రింగులు తిరుగుతూ పెద్దవృత్తాలను ఏర్పరుస్తుంది. అంటే అది ఆ ప్రాంతంలో శక్తి వలయాల్ని సృష్టిస్తుందన్నమాట! అంతేకాదు గంట శబ్దానికి కుడిఎడమ మెదళ్లను సమన్వయం చేసే శక్తి ఉందట. పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం అంటూ గంటలు మోగించడం క్రైస్తవ సంప్రదాయంలోనూ చూస్తాం. ఇలాంటి ఓ ప్రత్యేక శక్తిని సృష్టిస్తుంది కనుకనే చాలా మతాలు ఘంటానాదానికి గొప్ప స్థానాన్నిచ్చాయి.

దీపారాధన ఎందుకు చేయాలి?

మనకు ప్రత్యక్షదైవాలు ముగ్గురు. ఒకరు సూర్యుడు, మరొకరు చంద్రుడు, ఇంకొకరు అగ్నిదేవుడు. సూర్యుడికి నమస్కారం చేసుకుంటాం. చంద్రుడికి నూలుపోగు వేసి కృతజ్ఞత చెప్పుకుంటాం. మరి అగ్నిదేవుడూ… ఆయన్ను అర్చించేందుకే పూర్వం పెద్దలు ఇంట్లో నిత్యాగ్నిహోత్రం నిర్వహించేవారు. రోజూ అగ్ని దేవుడిని ఆవాహన చేసి నమస్కారం చేసేవారు.

నిజానికి మనం భగవంతునికి ఇవ్వదలచుకున్నది ఏదైనా ఆయనను చేరాలంటే అగ్ని ద్వారా మాత్రమే ఇవ్వగలం. మనం అగ్నిలో ద్రవ్యాన్ని వేస్తూ ‘ఇంద్రాయ స్వాహా…’ అన్నామనుకోండి అగ్ని దాన్ని నేరుగా ఇంద్రుడికి చేరుస్తాడు. అదీ అణువంత కూడా ఆయన ఉంచుకోకుండా. ఇలా ఏ దేవుడి పేరు చెప్పి మనం ద్రవ్యాన్ని సమర్పిస్తే ఆయనకు చేరవేస్తాడు అగ్ని. అంటే భగవంతుడికీ మనకీ అనుసంధానకర్తగా అగ్ని వ్యవహరిస్తాడు. కానీ ఇలా నిత్యం అగ్నిహోత్రం వెలిగించడం అందరికీ, అన్నిరోజులూ సాధ్యం కాదు కనుక కనీసం దీపారాధన చేయడం ద్వారా మనం అగ్నికి నమస్కారం చేసుకుంటాం.

ధూపం ఆఘ్రాపయామి అంటాం, నైవేద్యం పరికల్పయామి అంటాం కానీ దీప ఆరాధన అంటాం. అంటే నేరుగా దీపాన్నే పూజించటం. అందుకే దీపానికి కుంకుమపెట్టి, ఓ పువ్వూ, నాలుగక్షతలూ వేసి, ఇలా చెబుతాం…
సాజ్యం త్రివర్తి సంయుక్తం
వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం
త్రైలోక్యం తిమిరాపహం
ఈమూడు వత్తులతో నేను వెలిగించిన దీపం మూడు లోకాలలోని చీకట్లను పారదోలాలి అని దీనర్థం. మన ఇల్లు ఒక్కటే కాదు, మూడు లోకాలూ వెలుగులు విరజిమ్మాలన్న గొప్ప భావన ఇందులో దాగుంది. అచ్చంగా దీపానికే పూజచేసే సంప్రదాయమూ కొన్ని చోట్ల ఉంది. మనకిష్టమైన దైవాన్ని దీపపు వెలుగులో చూస్తూ పూజ చేయడం మరో పద్ధతి.

worship

భారతీయ సంప్రదాయంలోని పూజావిధానాల వెనుక మానసిక, శారీరక ఔన్నత్యానికి దోహదపడే విశేష క్రియలున్నాయి. దీపారాధన మొదలు హారతిదాకా… గంట కొట్టడం మొదలు మంత్రపుష్పందాకా ప్రతి క్రతువులోనూ మంత్రాలకు మించినది ఉందంటే, మన ధర్మానికి ఎంత విశిష్టత ఉందో అర్థమవుతుంది. శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం శత సంవత్సరం దీర్ఘమాయుః… అంటూ వందేళ్లు ఐశ్వర్యంతో ఆరోగ్యంగా జీవించమని దీవిస్తుంది వేదం. నిజానికి ఇక్కడ శతం అనే పదానికి పూర్ణం అనే అర్థం వస్తుంది. అంటే నిండైన జీవితంతో పాటు నిండైన ఆరోగ్యం, నిండైన ఐశ్వర్యం కూడా ఉండాలని భావం. మన జీవన విధానం అంత బాగుండాలని ఆశీర్వదించే ఆ మహాగ్రంథాలు ఏ మార్గంలో ప్రయాణిస్తే, ఎలాంటి క్రతువులు ఆచరిస్తే మనం నిండునూరేళ్లూ వర్థిల్లుతామన్న సంగతిని చెప్పకుండా ఉంటాయా..! ఆ దిశలో మనిషికి దిశానిర్దేశం చేయకుండా ఉంటాయా..! వెలుగునిచ్చే జ్యోతిని నిత్యం పూజించమనే ఆ జ్ఞానదీపికలు మన బతుక్కి వెలుగుబాటలు పరవకుండా ఉంటాయా..! మనిషి జననం మొదలు నిండు నూరేళ్ల పాటూ జరగాల్సిన క్రతువులూ మరణానంతరం నిర్వహించే సంస్కారాల వరకూ అన్ని విషయాలనూ వేదాలు పూసగుచ్చినట్టు చెప్పాయి. నల్లేరుమీద నడకలా జీవితాన్ని నడుపుకోవడమే కాదు అప్పుడప్పుడూ వచ్చే పెనుతుపానులను సమర్థంగా ఎదుర్కొనేందుకూ స్థైర్యాన్ని ఇచ్చేలా, ప్రతిదశలోనూ పాటించాల్సిన పూజా విధానాల్ని పొందికగా మలిచి మనకందించాయి. పంచభూతాలకు కృతజ్ఞతలు చెప్పేందుకు కొన్నీ, మానసిక ప్రశాంతతను ప్రసాదించేవి కొన్నీ, ఆరోగ్యాన్ని అమర్చిపెట్టేవి కొన్నీ… అన్నీ మనకోసమే, మన బాగుకోసమే. తెలిసో తెలీకో భక్తితోనో భయంతోనో మనం యాంత్రికంగా చేసే వివిధ క్రియల వెనుక పరమార్థాన్ని తెలుసుకుంటే మన పూజకూ ఓ నిండుదనం వస్తుంది.

ఉపవాసం ఎందుకు చేయాలి?

భక్తి శ్రద్దలు గల అత్యధిక పక్ష భారతీయులు ఒక క్రమ పద్దతిలో లేదా పండుగల వంటి ప్రత్యెక సందర్భాలలో ఉపవాసాన్ని పాటిస్తారు. అటువంటి రోజుల్లో వాళ్ళు ఏమీ తినకుండా లేక ఒక్కసారి తినడం లేదా పండ్లు లేక అల్పాహారమును ఆహారముగా తీసికొని ఉపవాసము ఉంటారు.  కొందరు రోజంతా కనీసం మంచి నీళ్ళు అయినా త్రాగకుండా కఠిన మైన ఉపవాసము చేస్తారు.  ఉపవాసం ఎన్నో కారణాల కోసం చేయబడుతుంది. భగవంతుని కోసం లేక సంయమనం కోసం, అసమ్మతిని తెలియ పరచడానికి కూడా ఉపవాసం చేస్తారు.  గాంధీ గారు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా అసమ్మతిని తెలియపరచడానికి ఉపవాసం చేసారు.
 
ఉపవాసం ఎందుకు చేస్తాము?
 
ఆహారాన్ని పొదుపు చేయడానికా లేక ఆకలిని బాగా పెంచుకుని విందు ఆరగించాదానికా? నిజానికి అందుకు కాదు. మరి మనమెందుకు ఉపవాసం చేస్తాము?
సంస్కృతంలో ఉప అంటే ‘దగ్గరగా’ + వాస అంటే ‘ఉండడం’ అని అర్ధము.  కాబట్టి ఉపవాసము అంటే దగ్గరా (ఆ భగవంతుడి) ఉండడం అంటే భగవంతునితో సన్నిహిత మానసిక సామీప్యతను సంపాదించడం.  మరి ఉపవాసం – ఆహారముల మధ్య ఏమిటి సంబంధము?
 
కొన్ని రకాల ఆహారము మన బుద్ధిని మందకొడి గాను మరియు మనసులో అలజడిని కలిగిస్తుంది.  అందువలన మానవుడు కొన్ని నియమిత రోజుల్లో నిరాహారముగా లేక అల్పాహారముగా గాని ఉండి తన సమయాన్ని శక్తిని ఆదా చేసికోవాలనుకుంటాడు.  తద్వారా బుద్ధి చురుకుగాను మనసు పవిత్రముగాను అవుతుంది.  అది వరకు ఆహారపుటాలోచనలు కలిగిన మనస్సు ఇప్పుడు ఉన్నతమైన ఆలోచనలతో కూడి భగవంతుని వద్ద నిలుస్తుంది.  తనకు తాను నియమించుకొన్న క్రమశిక్షణ కాబట్టి ఆనందంగా ఆ నియమాన్ని మనస్సు అనుసరించే ఉంటుంది.
ఏ పని తీరుకైనా కూడా అది బాగా పనిచేయాలంటే మరమ్మత్తూ మరియు పూర్తి విరామము అవసరము.  ఉపవాసంలో నిరాహారముగా లేక అల్పాహారముగా ఉండుట వలన జీర్ణ మండలానికి విశ్రాంతి లభిస్తుంది.
ఇంద్రియాలతో విషయ భోగాలు అనుభవించే కొద్దీ అవి వశము కాక ఇంకా ఎక్కువ కావలెననును.  ఉపవాసము మనకు ఇంద్రియ నిగ్రహము అలవరచుకోవడానికి కోర్కెలను ఉదాత్తమైన వాటిగా చేసికోవడానికి శాంతియుత మనస్సును కల్గి ఉండడానికి మార్గము చూపి సహాయ పడ్తుంది.
ఉపవాసము మనలని నీరస పరిచేదిగాను, తొందరగా కోపం కల్గిన్చేటట్లుగాను మరియు తరువాత అనుభవించ వచ్చుననే ప్రేరణ నిచ్చేదిగాను ఉండకూడదు.  ఉపవాసము వెనుక ఉన్నతమైన లక్ష్యము లేనప్పుడు ఇట్లా జరుగుతుంది.  కొందరు కేవలము బరువు తగ్గించుకునే నిమిత్తమే ఉపవాసం లేదా పత్యం (diet) పాటిస్తారు.    మరి కొందరు భగవంతుని మెప్పించడానికి ప్రతిజ్ఞగా  లేదా తమ కోరికలను తీర్చుకొనేందుకు, మరి కొందరు సంకల్ప శక్తి వృద్ధి చేసికోవడానికి, సంయమనానికై, కొందరు ఒక విధమైన తపస్సు గాను ఉపవాసము చేస్తారు.  మరీ తక్కువగా కాక ఎక్కువగా కాక యుక్త ఆహారము తీసికోవలసినదని కేవలము ఉపవాసము చేయునప్పుడే కాక మిగతా రోజుల్లో కూడా శుచి ఐన బలవర్ధకమైన సాత్విక ఆహారము తీసికోవలసినదిగా భగవద్గీత మనకు బోధిస్తుంది.

కలశాన్ని ఎందుకు పూజిస్తాము?

ముందుగా అసలు కలశము అంటే ఏమిటి?
 
నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర; పాత్ర మొదట్లో మామిడి ఆకులు; వాటి పైన కొబ్బరి కాయ ఉంచబడుతుంది.  తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది.  ఆ పాత్ర చిత్రములతో కూడా అలంకరించబడి ఉండవచ్చు.   అటువంటి పాత్ర ‘కలశం’ అనబడుతుంది.  ఆ పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు “పూర్ణకుంభము” అనబడుతుంది.  అది దివ్యమైన ప్రాణశక్తి తో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది.  ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది.
 
సంప్రదాయ బద్ధమైన గృహ ప్రవేశము, వివాహము, నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో ‘కలశము’ ఏర్పాటు చేయబడుతుంది.  స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద ఉంచబడుతుంది.  ఇది మహాత్ములను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది.
 
మనము కలశాన్ని ఎందుకు పూజిస్తాము?సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహా విష్ణువు పాల సముద్రములో తన నాగశయ్య పై పవ్వళించి ఉన్నాడు.  అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని   సృష్టించాడు . కలశములొని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రధమ జాతమైన నీటికి ప్రతీక గా నిలుస్తుంది.  ఇది అన్నింటికీ జీవన దాత.  లెక్కలేనన్ని నామరూపాలకి, జడ పదార్దముల మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త.  ఈ ప్రపంచములో ఉన్నదంతా సృష్టికి ముందుగా నున్న శక్తి నుంచి వచ్చినది శుభప్రదమైనది.
 
ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక.  చుట్టబడిన దారము సృష్టిలో అన్నింటినీ బంధించే ‘ప్రేమ’ ను సూచిస్తుంది.  అందువల్లనే ‘కలశం’ శుభసూచకముగా పరిగణింపబడి పూజింపబడుతున్నది.
 
అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించ బడిన తరువాత అందులోని నీరు “అభిషేకము” తో సహా అన్ని వైదిక క్రియలకి వినియోగింప బడుతుంది.  దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలశ జలముల అభిషేకములతో విశిష్ట పద్దతిలో నిర్వహిస్తారు.
 
పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశముతో  భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు.  కనుక ‘కలశం’ అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది.
 
పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ, ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీక గా ఉంటారు.  వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా మరియు వారిపట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణ కుంభము తో హృదయ పూర్వకముగా స్వాగతమిస్తాము.

శంఖము ఎందుకు ఊదుతాము?

దేవాలయాలలో గానీ ఇళ్ళలో గానీ శాస్త్రోక్త పూజారంభ సమయములో ఒక్కసారి లేక అనేక సార్లు శంఖము పూరించ బడుతుంది. హారతి ఇచ్చేటప్పుడు గానీ లేక సుభసూచకమైన సందర్భాన్ని గుర్తించడానికి గానీ శంఖము ఊదబడుతుంది.  యుద్ధం ఆరంభించడానికి ముందర లేక సైన్యపు విజయాన్ని ప్రకటించడానికి గానీ శంఖారావము చేయబడుతుంది.  శంఖము దైవ పీఠము వద్ద కూడా పెట్టి పూజించ బడుతుంది.
శంఖము ఎందుకు ఊదుతాము.  
ఎప్పుడైతే శంఖము ఊదబడుతుందో, అప్పుడు అందుండి సృష్టికి మూలభూతమైన ప్రణవ నాదము వెలువడుతుంది.  ఓంకారము సృష్టికి పూర్వము భగవంతునిచే చేయబడిన మంగళకరమైన నాదము.  అది ప్రపంచానికి, దానికి ఆధారమైన సత్యానికి ప్రతినిధి. 
ఒక కథనం ప్రకారం శంఖాసురుడనే రాక్షసుడు దేవతలను ఓడించి వేదాలను అపహరించి సముద్రపు అడుగు భాగములోకి వెళ్ళాడు.  దేవతలు సహాయము కొరకు విష్ణుమూర్తికి విన్నవించుకొన్నారు.   శ్రీ మహావిష్ణు ‘మత్స్యావతారము’ ధరించి శంఖాసురుణ్ణి సంహరించాడు.  భగవానుడు శంఖాకారములో ఉన్న అతని చెవి మరియు తల ఎముకను ఊదగా అందుండి వేదాలను ఉద్భవిమ్పచేసినట్టి నాదము వెలువడింది.  వేదాలలో ఉన్న జ్ఞానమంతా ఓంకారము యొక్క వివరణయే.  శంఖము ‘శంఖాసురుని’ మరణానంతరము ‘శంఖము’ గా పిలవబడుచున్నది.  భగవానునిచే పూరించబడిన శంఖము ‘పాంచ జన్యము’ గా పిలువ బడుచున్నది.  ఆయన నాలుగు చేతులలోని ఒక చేతిలో ఎల్లవేళలలో శంఖము పట్టుకొని ఉంటాడు.  అది జీవితపు చతుర్విధ పురుషార్ధాలలో ఒకటయిన ‘ధర్మము’ లేక ధర్మశీలతకుప్రతీక .  అందువల్లనే శంఖారావము అధర్మముపై ధర్మము యొక్క విజయానికి సంకేతము.  శంఖాన్ని మన చెవులకి దగ్గరగా పెట్టుకొంటే సముద్రపు అలల హోరు వినబడుతుంది. 
భక్తుల మనసులను వాతావరణమును కలవరపెట్టే వ్యతిరేక వ్యాఖ్యానాలను మోతలను పూర్తిగా తరిమెయ్యడానికి గాను శంఖము మరియు ఇతర వాయిద్యాలను మ్రోగించి మంగళకరమైన ధ్వనులను ఉత్పన్నము చేయడము అనేది మరియొక ముఖ్య ఉద్దేశ్యము. 
పురాతన భారత దేశము గ్రామాలలో నివసిస్తూ ఉండేది.  ప్రతి గ్రామము ఒక ప్రధాన దేవాలయము మరియు అనేక చిన్న దేవాలయాల అధ్యక్షతలో ఉండేది.  ప్రతి ముఖ్యమైన పూజ ముగింపులోను మరియు పుణ్య దినాలలోనూ హారతి తో పాటు శంఖారావము చేయబడుతుంది.  సాధారణంగా గ్రామము చిన్నదిగా ఉండడం వలన ఆ శంఖనాదం ఊరంతటికీ వినిపించేది.  దేవాలయానికి వెళ్ళడానికి వీలుకాని ప్రజలంతా వారు ఏ పని చేస్తున్నా ఆ పని ఆపి కొన్ని క్షణాల పాటైనా మానసికంగా భగవంతుడికి ప్రణమిల్లాలని గుర్తు చేయబడేది.  ఈ శంఖ నాదం తీరిక లేని నిత్య కృత్యాల మధ్య నున్న ప్రజల మనసులని కూడా భక్తి భావాలతో నింపుతూ సేవను అందించేది. 
నాద బ్రహ్మము, సత్యము, వేదాలు, ఓంకారము, ధర్మమూ, విజయము మరియు శుభసూచకాలకి ప్రతీకగా దేవాలయాల లోను, ఇళ్ళలోనూ, దైవ పీఠము వద్ద, భగవంతునికి ప్రక్కగా శంఖము ఉంచ బడుతుంది.  భక్తుల మనసులు ఉన్నతమై సత్యం వైపు ఎదగడానికి ఇచ్చే తీర్ధమునకు కూడా శంఖము వాడ బడుతుంది. 
ఈ క్రింది శ్లోకముతో శంఖము పూజింపబడుతుంది. 
త్వం పురా సాగరోత్పన్నః విష్ణునా విద్రుతః కరే
దేవైశ్చ పూజితః సర్వైః పాంచజన్యం నమోస్తుతే
సముద్రములో పుట్టిన, విష్ణుమూర్తి చేత బట్టిన మరియు దేవతలందరిచే పూజింపబడిన పాంచజన్యమను శంఖమునకు వందనము. 

కొబ్బరి కాయను నివేదిస్తాము – ఎందుకు?

భారత దేశపు దేవాలయాలలో చేసే అత్యంత సామాన్య నివేదనలలో కొబ్బరికాయ ఒకటి.  వివాహములు పండుగలు, కొత్త వాహనము, వంతెన, ఇల్లు మొదలగునవి వాడేటప్పుడు మరియు అన్ని శుభ సందర్భాలలోనూ కొబ్బరికాయ నివేదింపబడుతుంది.  నీటితో నిండి మామిడి ఆకులతో అలంకరింపబడి దానిపై కొబ్బరికాయ ఉన్న కలశమును ముఖ్యమైన పూజా సందర్భాలలో మరియు ప్రత్యేక అతిథులను ఆహ్వానించడానికి ఉపయోగించబడుతుంది.
హోమము చేసే సమయములో ఇది హోమాగ్నికి ఆహుతిగా అర్పించ బడుతుంది.  భగవంతుని మెప్పుకై, కోరికలు తీర్చుకొనడానికి కొబ్బరికాయ పగుల గొట్టబడి స్వామికి నైవేద్యముగా పెట్టబడుతుంది.  తరువాత ప్రసాదముగా పంచ బడుతుంది.
ఒకానొకప్పుడు మనలోని జంతు ప్రవృత్తులను భగవంతునికి సమర్పించడానికి గుర్తుగా జంతుబలి అమలులో ఉండేది.  నెమ్మదిగా ఆ ఆచారము తగ్గిపోయి దానికి బదులుగా కొబ్బరికాయ నివేదించ బడుతున్నది.  ఎండిన కొబ్బరి కాయకు పై భాగములో పిలకకోసం మాత్రము వదిలి, మిగతా పీచు అంతా తీసి వెయ బడుతుంది.  పైన ఉన్న గుర్తులు మానవుని తల మాదిరిగా కనిపిస్తాయి.  పగిలిన కొబ్బరికాయ అహంకారము యొక్క విరుపును ప్రతిబింబింప చేస్తుంది.  మనలోని అంతరంగ ప్రవృత్తులకు (వాసనలు) ప్రతీక ఐన లోపలి నీరు, మనసుకు ప్రతీక ఐన కొబ్బరితో సహా భగవంతునికి నివేదింప బడతాయి.  భగవంతుని స్పర్శతో శుద్ధి అయిన మనసు ప్రసాదం గా వినియోగించ బడుతుంది.
దేవాలయాల్లోనూ ఇళ్ళల్లోను చేసే సంప్రదాయ బద్దమైన పంచామృత అభిషేక ప్రక్రియలో విగ్రహం పైనుంచీ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, గంధపు మిశ్రమము, విభూతి మొదలగు వాటితో అభిషేకము చేస్తారు.  ప్రతి ఒక్క పదార్ధము భక్తులకి ప్రయోజనాలను కల్గించే ఒక ప్రత్యేకమైన గుర్తింపు గలిగి ఉన్నది.  సాధకునికి ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుందనే నమ్మకముతో కొబ్బరినీరు అభిషేక ప్రక్రియలలో వాడబడుతుంది.
కొబ్బరికాయ ఫలాపేక్ష రహిత సేవకి కూడా ప్రతీక.  చెట్టు యొక్క ప్రతి భాగము – మ్రాను, ఆకులు, కాయ, పీచు మొదలైనవి ఇంటి కప్పు, చాపలు రుచికరమైన వంటకాలు, తైలము, సబ్బులు మొదలైన వాటి తయారీ లో ఉపయోగించ బడతాయి.  ఇది భూమిలోనుంచి ఉప్పు నీటిని తీసికొని బలవర్ధకమైన నీటిగా మార్చుతుంది.  ఈ నీరు ప్రత్యేకముగా రోగులకు ఉపయోగ పడుతుంది.  ఇది ఎన్నో ఆయుర్వేద మందుల్లోనూ ఇతర ప్రత్యామ్నాయ వైద్య విధానాలలోను వాడబడుతుంది.
కొబ్బరి కాయకు పైనున్న మూడు కళ్ళ గుర్తుల్ని బట్టి త్రినేత్రుడైన పరమశివునికి ప్రతీకగా భావిస్తారు.  అందువల్లనే మన కోరికలు తీర్చడానికి అది సాధనంగా పరిగణించ బడుతుంది.  కొన్ని వైదిక ప్రక్రియలలో పరమ శివునికి మరియు జ్ఞానికి ప్రతీకగా కొబ్బరి కాయ కలశం పై పెట్టబడి అలంకరింపబడి, మాలాలంకృతము చేయబడి పూజింపబడుతుంది.

ఓంకారము పలుకుతాము – ఎందుకు?

భారత దేశములో ఎక్కువగా పలుకబడే శబ్ద చిహ్నము ఓంకారము.  ఓంకారము – ధ్వనింపచేసే వారి శరీరము, మనసులపైన మరియు పరిసరాల పైన కూడా పరిపూర్ణ ప్రభావము ఉంటుంది.  చాలా మంత్రాలు, వైదిక ప్రార్ధనలు ఓంకారముతో ఆరంభమవుతాయి.  ఓంహరిఃఓం మొదలైన అభినందనలలో కూడా అది వాడబడుతుంది.  దాని ఆకారము పూజింపబడుతుంది.  దానిపై భావన చేయబడుతుంది.  శుభసూచకంగా వాడబడుతుంది.  ఇది మంత్రము మాదిరి గానే పదే పదే జపించ బడుతుంది.
ఓంకారము ఎందుకు చేస్తాము?ఓం అనేది భగవంతుని యొక్క ప్రధమ నామము.  అది అ, ఉ, మ అనే అక్షరాల కలయిక వలన ఏర్పడినది.  స్వరస్నాయువుల నుండీ వెలువడే శబ్దము గొంతు యొక్క అడుగు భాగము నుంచీ ‘అ’కారముగా ఆరంభమవుతుంది.  పెదిమలు మూసుకొన్నప్పుడు ‘మ’కారము తో శబ్దము ఆగిపోతుంది.  మూడు అక్షరాలూ, మూడు అవస్థలు (జాగ్రత్, స్వప్న, సుషుప్తి), ముగ్గురు దేవతలు (బ్రహ్మ విష్ణు, మహేశ్వర), మూడు వేదాలు (ఋగ్, యజుర్, సామ), మూడు లోకాలు (భూః, భువః, సువః) మొదలైన వాటికి ప్రతీకలు.  ఇవి అన్నీ మరియు వీటన్నింటికి ఆవల ఉన్నవాడు “భగవంతుడు” రెండు ఓంకార ధ్వనుల మధ్యనున్న నిశ్శబ్దము నిర్గుణ నిరాకార పరబ్రహ్మాన్ని సూచిస్తుంది.  ఓంకారం ప్రణవము అని కూడా పిలువబడుతుంది (“దేని ద్వారా అయితే భగవంతుడు స్తుతించ బడతాడో” అని అర్ధము).  వేదాలలోని సారమంతా “ఓం” అనే పవిత్రాక్షరములో నిక్షిప్తమైనది.
భగవంతుడు ఓంకారము మరియు ‘అథ’ అని పలికిన తరువాత ప్రపంచాన్ని సృష్టించడం ఆరంభించాడని చెప్ప బడుతుంది.  కాబట్టే మనం తలపెట్టే ఏ పని ఆరంభము లోనయినా ఓంకార నాదము శుభ సూచకంగా పరిగణించ బడుతుంది.
ఓంకారనాదము చేసినప్పుడు వచ్చే శబ్దము గంట యొక్క ప్రతిధ్వనిని పోలి ఉండాలి (ఓంooooo…మ్ మ్) అది మనసుని శాంతింపచేసి పరిపూర్ణమైన సూక్ష్మమైన శబ్దంతో సంధింప జేస్తుంది.  మానవులు దాని అర్ధంపైన ధ్యానం చేసి ఆత్మానుభవాన్ని పొందుతారు.
ఓంకారం వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు విధాలుగా వ్రాయ బడుతుంది.  సర్వ సాధారణమైన ఓం ఆకారము గణేశుడికి చిహ్నముగా ఉంటుంది.  పైన ఉన్న వంపు తల, క్రిందగా ఉన్న పెద్ద వంపు పొట్ట ప్రక్కగా ఉన్నది తొండము మరియు చుక్కతో ఉన్న అర్ధచంద్రాకారము గణేశ భగవానుడి చేతిలో ఉన్న మోదకము.
ఈ విధముగా ఓంకారము జీవనగమ్యం, సాధన, ప్రపంచము దాని వెనుక ఉన్న సత్యము భౌతికము అభౌతికము సాకార-నిర్వికారములు అన్నింటిని తెలియబరుస్తుంది.

హారతి ఇస్తాము – ఎందుకు?

భగవంతుని ప్రార్ధన, పూజ లేదా భజన చివర్లో లేక గౌరవనీయులైన అతిథిని లేక మహాత్ముడిని ఆహ్వానించేటప్పుడు హారతి ఇస్తాము.  ఇదెప్పుడూ ఘంటా నాదం తోను కొన్ని సమయములలో పాటలు ఇతర సంగీత వాయిద్యాలతోను, మరియు చప్పట్లతోను కలిసి ఉంటుంది. 
 
ఇది పదహారు అంచెలుగా చేసే షోడశోపచార పూజా కార్యక్రమములోని ఒక భాగము.  ఇది శుభసూచకమైన మంగళ నీరాజనముగా సూచింప బడుతుంది.  భగవంతుని రూపాన్ని ప్రకాశింప చేయడానికి మనము కుడిచేతిలో వెలుగుతున్న దీపాన్ని పట్టుకొని వలయాకార దిశలో హారతి ఇచ్చేటప్పుడు దీపపు వెలుగులో ప్రకాశించే భగవంతుని సుందర రూపాన్ని ప్రతిభాగము విడిగాను మరియు పూర్తి రూపము శ్రద్ధగా గమనిస్తూ మనసులో గానీ పైకి గట్టిగా గానీ స్తోత్రాలు చదవడము చేస్తాము.  ఆ సమయంలో మన ప్రార్ధనలో తపన మరియు భగవంతుని రూపములో ప్రత్యేకమైన సౌందర్యము మనకు అనుభవమవుతుంది.  చివరలో ఆ వెలుగు పై మన చేతులనుంచి తరువాత నెమ్మదిగా మన కళ్ళకు తల పైభాగానికి అద్దుకొంటాము.
 
మనము చిన్నప్పటి నుంచీ ఈ ప్రక్రియను చూస్తున్నాము.  అందులో పాల్గొంటున్నాము.  మనము హారతి ఎందుకు ఇస్తామో తెలుసుకుందాము.
 
ఇష్టపూర్వకముగా భగవంతుడిని పూజించినప్పుడు, అభిషేకం చేసినప్పుడు, అలంకరించినప్పుడు, ఫలములు మరియు మధుర పదార్థములతో నివేదించినప్పుడు వైభవోపేతమైన ఆయన సుందర రూపాన్ని చూడగలము.  దీపపు వెలుగుచే ప్రకాశవంతము గా కనపడుతున్న భగవంతుని ప్రతి భాగము మీద మనస్సు సంధించబడి అతని రమ్యమైన రూపముపై మనసు మెలకువతో నిశ్శబ్ద ధ్యానం చేస్తుంది.  గానం చెయ్యడం చప్పట్లు చరచడం, గంట వాయించడం మొదలైనవన్నీ భగవంతుని దర్శనముతో కల్గిన సంతోషాన్ని మరియు శుభ సూచకాన్ని తెలుపుతాయి. 
 
హారతి సాధారణంగా కర్పూరంతో ఇవ్వబడుతుంది.  కర్పూరాన్ని వెలిగించినపుడు ఏ మాత్రము చాయలు మిగల్చకుండా తనకు తాను పూర్తిగా కాలిపోతుంది.  కర్పూరం మన అంతర్గత ప్రవృత్తులకు (వాసనలు) ప్రతీక.  జ్ఞానమనే అగ్నిచేత వెలిగించ బడినప్పుడు ఏదైతే భగవంతుడిని ప్రకాశింప చేస్తుందో ఆ జ్ఞానాగ్నే మన వాసనలు పూర్తిగా దగ్దము చేసి భగవంతుడి నుంచి దూరము చేసే అహంకారాన్ని నిర్మూలిస్తుంది.  కర్పూరము వెలుగుతున్నప్పుడు భగవంతుని విభూతిని శోభను తెలుపడానికి అది తనను తాను ఆహుతి చేసుకొంటూ కూడా చక్కని సువాసనని వెలువరిస్తుంది.  మన ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో మనము మన గురువునీ సంఘాన్నీ సేవించుకుంటూ అందరికి ‘ప్రేమ’ అనే ‘సుగంధాన్ని’ వ్యాపింపచేయడానికి మనస్పూర్తిగా మనలని మనము అర్పించుకోవాలి.
 
తరచూ మనము ప్రకాశింపచేసే భగవంతుణ్ణి చూడడానికి చాలాసేపు వేచి ఉంటాము.  కానీ మనలోపల చూసుకోవడానికా అన్నట్లు హారతి ఇచ్చే అసలు సమయానికి అయాచితంగా కళ్ళు మూత పడతాయి.  మన దేహము దేవుని ఆలయమనీ, లోపల దివ్యత్వాన్ని కలిగి ఉన్నామని ఈ విధంగా కళ్ళు మూయడం సూచిస్తుంది.  పూజారి హారతి వెలుగులో భగవంతుడిని స్పష్టంగా చూపించినట్లుగానే, గురువు గారు కూడా జ్ఞానమనే వెలుగు సహాయముతో ప్రతి ఒక్కరికి లోనున్న దివ్యత్వాన్ని స్పష్టంగా తెలియపరుస్తారు.  హారతి చివరిలో దానిపై చేతులుంచి తరువాత కళ్ళకి, తలపైభాగానికి అడ్డుకోవడమంటే అర్ధము – భగవంతుడిని ప్రకాశింపజేసిన ఈ వెలుగు నా దృష్టిని వెలిగించుగాక! నా దృష్టి పవిత్రమగు గాక నా ఆలోచనలు ఉన్నతముగాను మంచివి గాను ఉండుగాక! అని ప్రార్ధించడం.
 
హారతికి వేదాన్తపరమైన అర్ధము; సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు విద్యుత్ మరియు అగ్ని – ఇవి వెలుగుకి సహజమైన మూల కారణములు.  సృష్టిలోని అద్భుతమైన అపూర్వమైన వాటన్నింటికి భగవంతుడు ఆధారము.  ఆయన కారణముగానే మిగిలినవి ఏవైనా ఉండటమూ మరియు ప్రకాశించడమూ జరుగుతుంది.  హారతి వెలుగులో భగవంతుడిని ప్రకాశింప చేసినప్పుడు మన దృష్టిని అన్ని వెలుగులకు మూల కారణము మరియు జ్ఞానాన్ని జీవితాన్ని సూచించే పరమాత్మ వైపు మళ్లిస్తాము. 
 
సూర్యుడు బుద్ధికి, చంద్రుడు మనసుకి, అగ్ని వాక్కుకీ అధిదేవతలు.  భగవంతుడు వీటన్నింటిని వెలిగించే అత్యున్నతమైన చైతన్యము.  అతను లేకుండా బుద్ధి ఆలోచించలేదు.  మనసు భావింపలేదు.  నాలుక మాట్లాడ లేదు.  మనసు బుద్ధి మరియు వాక్కులకీ వెనుక ఉన్నదీ భగవంతుడే.  ఈ పరిమితమైన ఉపకరణాలు ఆ అపరిమితమైన భగవంతుడిని ఏ విధముగా ప్రకాశింపజేయగలవు.  అందుకే హారతి ఇచ్చేటప్పుడు మనము ఈ క్రింది విధముగా స్తుతిస్తాము.
 
న తత్ర సూర్యోభాతి న చంద్ర తారకం
నేమా విద్యుతో భాంతి కుతొ2 యమగ్నిః
తమేవ భాంత మనుభాతి సర్వం
తస్యభాసా సర్వమిదం విభాతి
 
సూర్యుడు ప్రకాశించని చోట, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్ ప్రకాశించని చోట, ఆయన ఉన్నాడు.  మరి ఈ చిన్ని జ్యోతి (నా చేతిలో ఉన్న) ఏమి చేయగలదు? ప్రతిదీ అతని వలననే ప్రకాశిస్తాయి.  అతని వెలుగు వలన మాత్రమె మనమంతా ప్రకాశింప బడుతున్నాము. 

అంత్యక్రియల్లో కుండల్లో నీళ్లు పోసి పగలకొడ్తారు ఎందుకు..!!

“జాతస్య హి ధ్రువో మృత్యు:” అని భగవద్గీతలో ఉంటుంది..పుట్టినవాడు గిట్టక తప్పదు అని దానర్దం..సాధారణంగా మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు..కానీ ప్రస్తుతం మనం తీసుకునే ఆహారం మూలంగా 100 సంవత్సరాల లోపు కి పడిపోయింది.. రకరకాల రోగాలు, యాక్సిడెంట్లు,కాలుష్యం ఇతరత్రా కారణాలతో అనేకమంది 60లోపే మరణిస్తున్నారు..మనిషి మరణించిన తర్వాత అంత్యక్రియల్ని రకరకాల సంప్రదాయాల ప్రకారం రకరకాలుగా చేస్కుంటారు..
హిందూ సంప్రదాయం ప్రకారం చేసే అంత్యక్రియల్లో శరీరాన్ని చితి మీద పెట్టాక కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు..అసలు ఇలా ఎందుకు చేస్తారు అంటే సమాధానం ఎవరి దగ్గర ఉండదు..మన పూర్వీకులు చేస్తున్నారు..మనం ఫాలో అవుతున్నాం అంతే..కానీ గీతాసారం ప్రకారం ఈ సంప్రదాయం వెనుక ఒక అర్దం ఉంది.
కుండ నీ శరీరం లాంటిది, అందులో  ఉన్న నీరు నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో. నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది అనడానికి సూచనే అది.ఆ తర్వాత కుండను కింద పడేసి పగలగొడతారు. ఇప్పుడు  శరీరాన్ని కాల్చేస్తారు. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు. నువ్వు వెళ్లిపో.. అని ఆత్మకు మనమిచ్చే సంకేతంగా చివరికి ఆ కుండను కింద పడేసి పగలగొడతారు..

భగవంతునికి తలనీలాలను సమర్పించే కార్యక్రమంలో అంతరార్థం::

ధర్మశాస్త్రాల ప్రకారం… మనం చేసే సర్వ కర్మల పాపఫలం మన వెంట్రుకలకు చేరుతుంది. దాని వల్ల అవి పాపాలకు నిలయంగా మారతాయి. కాబట్టి మన పాపాలను వదిలించుకోవాలంటే, వాటిని తమలో నింపుకున్న వెంట్రుకలను తీసేయాలి. ఆ పని దేవుని సన్నిధిలో జరిగితేనే మనం సంపూర్ణంగా పరిశుద్ధులమవుతాం. ఈ ఉద్దేశంతోనే తలనీలాలు సమర్పించే ఆచారం మొదలయ్యింది. కాబట్టి తలనీలాలు సమర్పించడమంటే… ఇంతవరకూ ఎన్నో పాపాలు చేశాం, వాటిని విడిచి ఇకపై పవిత్రంగా జీవిస్తాం అని దేవునికి మాటివ్వడమన్నమాట!
ఇక్కడి ప్రధాన ఉద్దేశ్యం పాప పుణ్యాల గురించి కాదు… చాలా వరకు చేసిన తప్పుల కన్నా మనలో మిగిలిపోయిన అపరాథ భావమే మనను ఎక్కువగా డామినేట్ చేస్తుంది.. ఇక్కడ అలాంటి అపరాథ భావనను తొలగించుకుని తిరిగి మంచి దారిలో వెళ్తామని మనసులో ధృఢంగా నిర్ణయించుకోవడమన్న మాట!!

కర్పూరం(Camphor)

భగవంతునికి హారతి ఇచ్చేందుకై వినియోగించే కర్పూరాన్ని మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు ?
No photo description available.

కర్పూరం(Camphor) :: ఈ పదార్థమునకు ఇంకా ఎన్నో మంచి సుగుణాలు ఉన్నాయి… సృష్టిలో చాలా పదార్థాలు వేడిచేస్తే ద్రవరూపంలో మారతాయి.. తర్వాతే వాయు రూపానికి రూపాంతరం చెందుతాయి.. కేవలం కర్పూరం మాత్రమే ఘన రూపంనుండి డైరెక్ట్ గా వాయు రూపానికి మారే గుణాన్ని కలిగి ఉంది..
కర్పూరాన్ని వెలిగించిన లేదా మామూలు స్థితులలో సమీపంలో ఉన్న సూక్ష్మ జీవులను చంపే సుగుణాన్ని కలిగి ఉంటుంది… దీని నుండి వచ్చే ఆవిరి వాసన శ్వాసకోశ ఇబ్బందులను దూరంచేస్తుంది.. ఎన్నో రకాల ఔషధాలలో కర్పూరాన్ని తగు మోతాదులలో ఉపయోగిస్తారు.. యునాని, ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి ఇలా అన్ని రకాల వైద్య విధానాలలోనూ ఈ కర్పూరాన్ని వినియోగిస్తారు…
అందుకే ఇన్ని రకాల ప్రయోజనాలున్న ఈ పదార్థాన్ని పూజా కార్యక్రమాలలో విరివిగా ఉపయోగిస్తారు… ఈ హారతిని కళ్ళకు అద్దుకున్నా.. లేదా ఆ వాసనలు చూసినా ఎన్నో రకాల ఇబ్బందులకు దూరమైయ్యేలా చేస్తాయి…… ప్రధానంగా ఆలయాలలో ఈ ధూప దీపాలు మనిషిలోకి ఆధ్యాత్మిక దివ్యశక్తి ప్రసారానికి తోడ్పడుతాయి..ఎక్కువ కాలం ఆ ప్రదేశంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండే లా దోహదం చేస్తాయి.. అందుకే దేవాలయాలలో దీపం , హారతి దేవునికి చూపేటపుడు తప్పని సరిగా దేవుని చూసే విధంగా మన ఆచారాలను రూపొందించారు..
సంప్రదాయంగా హిందువులు పూజాది కార్యక్రమాలకు విధిగా వినియోగిస్తారు . వెలుగుతున్న కర్పూరం హారతికి భారతీయుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది . . . పవిత్రం గా భావిస్తారు . కర్పూరం ఉండలు మండి పూర్తిగా కరిగిపోతాయి . కర్పూరం (C10H16O) ప్రగాఢమైన , తీక్షణమైన సువాసన వెదజల్లుతుంది .
కర్పూరం పుట్టుక : ఇది ఒక వృక్షం నుండి వస్తుంది , భారీ వృక్షము ఇది . స్పటిక సద్రుశమయిన తెల్లటి కర్పూరం .. చెట్టు కాండము , వేళ్ళు , చెక్కలు , ఆకులు , కొమ్మలు , విత్తనాలు నుండి లబిస్తుంది . దీని శాస్త్రీయ నామము ” సిన్నమోమం కాంఫోరా “. కృత్రిమం గా టర్పెంటైన్ ఆయిలు(Turpentine oil) నుండి కుడా కర్పూరం తాయారు చేస్తారు .
కర్పూరం యొక్క ఉపయోగాలు:
వంటకి ఉపయోగించే్ది — ఆహారపదార్ధాలు , తీపివస్తువులు ఘుమఘుమ లాడేందుకు కర్పూరం వినియోగిస్తారు .
వంటలకు ఉపయోగించనిది — పూజలు , వివాహాది శుభకార్యాలలో హారతి ఇవ్వడానికి కర్పూరం వాడుతారు.
వివిధ రకాల వ్యాధులు నయం చేయడానికి భారతదేశం లో కర్పూరం వాడుతున్నారు … జ్వరము , కోరింతదగ్గు , ఆస్తమా , మానసికవ్యాధులు , కేన్సర్ , ముత్రకోశసమస్యలు నయం చేయడానికి . స్త్రీ పురుష *జననేంద్రియాలను ఉత్తేజానికి ఉపయోగపడుతుంది .
పరుగులు మందులు , చెడువాసనల నిర్మూలానికీ , ఇన్ఫెక్షన్ తగ్గడానికి వాడుతారు ,
బట్టలను కొరికి తినే చెదపురుగులు , ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి , దోమల నిర్ములానికి ,కర్పూం చెక్కలోని రసాయనాలు విరివిగా వాడుతారు
పెయింటింగ్ , బాణాసంచా , సహజమైన పరిమళాలు , సబ్బులు తయారీ లో కర్పూరం వాడుతారు ,
విక్స్ వేపోరబ్(vicks veporub) , మెంథాల్ ఆధారంగా పనిచేసే ఆయింట్మెంట్ లన్న్తి చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు .
రక్తనాళాలలోని ప్రవాహాన్ని వ్రుద్ధిపరిచి ,హృదయ సంభందించిన మందుల్లోనూ , దగ్గు శ్వాస కోశ సంభందిత , కీళ్ళ నొప్పులు సంభందిత మందులలో దీనిని వివిరిగా వాడుతారు .
కర్పూరం పరిసర వాతావరణం శుబ్రం గా సువాసనలతో ఉంచుతుంది . కర్పూరం బిళ్ళలను , ఉండలను వాడుతారు .
తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంటకొకసారి బాధితునికి తాగించండి. దీంతో తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది.
కప్పునీటిలో కర్పూరం బిళ్లను వేసి మంచాల కింద ఉంచితే దోమలు దరిచేరవు. అరబకెట్‌నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకూ మరిగించి ఫ్లోర్‌ను … తుడిస్తే ఫ్లోర్‌మీద ఈగలు వాలవు.
కాలిన గాయాలను మాన్పుతుంది: కర్పూరాన్ని నీటిలో అరగదీసి కాలిన గాయల మీద రాయాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల కాలిన గాయాలు సులభంగా తగ్గిపోతాయి. కాలిన వెంటనే రాయాలి లేదంటే చర్మం మంట మరియు చికాకు కు దారితీస్తుంది.
మొటిమలు: మొటిమలను మరియు మచ్చలను నివారించడానికి మనం ఒక అద్భతమైన ఔషదం చర్మ సమస్యలు మరియు మొటిమలు, మచ్చలకు పూర్తిగా నివారించుకోవడానికి కర్పూరాన్ని ఒక అద్భుతమైన ఔషధంగా ఉపయోగించవచ్చు.
పగిలిన పాదాలను ఉపశమనం కలిగిస్తుంది. కొద్దిగా కర్పూరాన్ని నీటిలో వేసి ఆనీటిలో కొద్దిసేపు పాదాలను నానబెట్టుకోవాలి. 5-10నిముషాల తర్వాత కాళ్ళను బయటకు తీసి స్ర్కబ్బర్ తో రుద్ది శుభ్రం చేసుకోవాలి.
రకాలు
సాధారణంగా హారతికి ఉపయోగించే కర్పూరమే స్ఫురణకు వస్తుంది. తెల్ల కర్పూరం, పచ్చ కర్పూరం అనే రెండు రకాలు ప్రసిద్ధం. కాని, కర్పూరంలో పదిహేను రకాలు (జాతులు) ఉన్నాయి. అవి: 1. ఘన సారం, 2. భీమసేనం, 3. ఈశావాసం, 4. ఉదయ భాస్కరం, 5. కమ్మ కర్పూరం, 6. ఘటికం, 7. తురు దాహం, 8. తుషారం, 9. హిమ రసం, 10. హారతి, 11. శుద్ధం, 12. హిక్కరి, 13. పోతాశ్రయం, 14. పోతాశం, 15. సితా భ్రం. ఇవన్నీ కపురం, కప్పురం మొదలైన పర్యాయ పదాలుగా కూడా వాడుకలో ఉన్నాయి.

ఆశీర్వచనం ఎందుకు చేస్తారు? ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం?? పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి???

No photo description available.

భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు.
విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని, పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ వగైరా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు.
యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు గో బ్రాహ్మణో శుభంభవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు……… అనే ఆశీర్వచనంతో
దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృధ్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ, వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు.
అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా? అవి ఫలిస్తాయా?

తప్పకుండా ఫలిస్తాయి.
సత్పధంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి.
ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు తొలుగుతాయి, అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి. అంతేకాదు, పూర్వ జన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు.
గురువులు, సిధ్ధులు, యోగులు, వేద పండితులు, మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు – వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి. . .
అక్షింతల సంకేతం:
సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభసందర్బం లోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు. ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం? అక్షింతలే ఎందుకు చల్లాలి వేరే ధాన్యాలు వున్నాయికదా వాటిని చల్లవచ్చుకదా?
మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి?
బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమన్నమాట.
బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుబానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు.
మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారంనుంచి క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. ఆలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది.
మన పూజలు, శుభ సందర్భాల్లో అక్షింతలకు ఏంతో ప్రాధాన్యత ఉంది. అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్యమధ్యలో ”అక్షతాన్ సమర్పయామి” అంటూ భక్తిగా అక్షతలు జల్లడం హిందూ సంప్రదాయం. పెళ్ళిళ్ళు, పేరంటాలలో వధూవరులపై అక్షతలు జల్లి ఆశీర్వదిస్తారు. ఉయ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు.
మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే, శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు. కేవలం పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లోనే కాదు, అశుభ కార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది.
బియ్యంలో తగినంత పసుపు, చిటికెడు కుంకుమ, తడిచీ తడవనట్లు కొన్ని నీళ్ళు, నాలుగు చుక్కలు నూనె వేసి అక్షతలను తయారుచేస్తారు. ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలను వేసి తయారుచేసినట్లయితే ఆ అక్షతలు మరీ పవిత్రమైనవి.

ఆలయాలు ఎందుకు?? మనం ఆలయానికి ఎందుకు వెళ్ళాలి??

 

పంచేద్రియాలు(కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం) మనకు జ్ఞానాన్నిచ్చే ఇంద్రియాలు… వీటి ద్వారానే మనం జ్ఞానాన్ని గ్రహించ గలుగుతాము..
పంచభూతాలు (గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం) మనకు తెలుసు.. వీటికి ఎంత శక్తి ఉందో కూడా మనకు తెలుసు..
అటువంటిదే విశ్వ శక్తి కూడా… ఈ విశ్వ శక్తి అనేది విశ్వంనుండి గ్రహించే శక్తి.. ఇది పంచేద్రియాలకు అతీతమైనది
అయితే ఈ శక్తిని గ్రహించే వేర్వేరు పద్ధతులను యోగశాస్త్ర గురువు పతంజలి మహర్శి మనకు అందించారు.. వీటిని పంచేద్రియాలద్వారా మాత్రమే గుర్తించలేము.. మనకు అలా మనకు లభించే ఈ శక్తిని యోగశక్తి అనీ, ప్రాణశక్తి అనీ, విశ్వశక్తి అనీ పిలుస్తారు… అయితే యుగాలు ఒక దానినుండి మరొకటి ప్రారంభమైన కాలక్రమేణా ఇటువంటి యోగ శాస్త్ర రహస్యాలు … రహస్యాలుగానే మిగిలి పోయి.. ప్రజలలో సాంసారిక వ్యామోహాలలోనే మునిగి… ఆధ్యాత్మిక సారాన్ని గ్రహించలేక పోతున్నారని.. అలనాటి యోగులు ముందుగానే గ్రహించి తమ యోగ శక్తిని కొన్ని విగ్రహాలలో నిక్షిప్తం చేసి వాటిని దర్శించుకుంటే ఆ యోగ/ప్రాణ/విశ్వ శక్తి అనుభూతిని పొందేవిధంగా మన ఆలయాలను విగ్రహారాధన పద్ధతులను సృష్టించారు..
మన ఆలయాలు విశ్వశక్తి నిలయాలు.. వీటి నిర్మాణం కూడా ఒక సైన్స్ అని చెప్పవచ్చు. మనకు తెలుసు.. పిరమిడ్ క్రింద ఉంచబడిన ఆహారం ఎక్కువసేపు చెడిపోకుండా ఉంటుంది.. పిరమిడ్ క్రింద ధ్యానం కొన్ని వేల రెట్ల ఫలితాన్నిస్తుందని… మన ఆలయ గోపుర నిర్మాణము.. గర్భగుడి ఉన్న ప్రదేశం.. మూలమూర్తి ని ప్రతిష్టించిన ప్రదేశం గమనిస్తే అవి అన్నీ ఒక పద్ధతి ప్రకారం కొలతల ప్రకారం కట్టబడిన వని అర్థంచేసుకోవడానికి ఎంతో సేపు పట్టదు… అయితే విశ్వనుండి వచ్చే ఆ కాస్మిక్ ఎనర్జీ(విశ్వశక్తి) మన ఆలయ గోపురం గుండా.. శ్రీ చక్రం ద్వారా మూలవిరాట్టు ద్వారా ఆలయ శక్తి ఎప్పటికీ నిలచి ఉండే విధంగా డిజైన్ చేయబడింది.. (ఇది ఎలా అంటే ఎక్కడో అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహంనుండి మన ఇంట్లో ఉన్న టివి చానెల్ ఆపరేట్ అవుతున్న మాదిరిగా అన్నమాట…) ఇలా ప్రసారం కాబడే శక్తే ఈ ప్రాణ శక్తి…
మనం ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు ఈ శక్తిని గ్రహించ గలిగితే ఆధ్యాత్మికం గా పురోగమిస్తాము…. మనకున్న చిన్న చిన్న కోరికలనుండి ముక్తి అయి గమ్యస్థానానికి చేర్చే స్థాయి కి చేరుకుంటాము..
దేవాలయాలలోని మనం గ్రహించిన శక్తిని గుర్తు చేసుకునేందుకు ఆ మూలవిరాటు చిత్రాలు మన పూజా గదిలో ఉంచుకుని పూజచేస్తాము.. ఇక్కడ మనం కేవలం ఆ విగ్రహ రూపును కాక ఆ శక్తిని గుర్తు చేసుకోవాలి.. దీనినే నిరంతర ధ్యానం అంటారు.. ఎవరైతే అనునిత్యం ఈ శక్తిని దర్శించగలరో. వారు ధన్యమైనట్లే… ఈ శక్తిని ఎవరు ప్రసారం చేయగలరో వారు నిజమైన గురువులు..
గర్భగుడిలో మనం ఆ శక్తి(ట్రాన్స్ మిషన్) ని గుర్తించగలిగిన నాడు.. ఈ వ్యాసంలోని అంతరార్థం మీకు అర్థమవుతుంది.. ఒక్కసారి ఆ రుచి చూసిన తర్వాత ఇహలోక వ్యామోహాలు ఏవీ వాటి ముందు పనిచేయవు..