ప్రాచీన భారతం

ancient india

Pratistanapuram.. ప్రతిష్టాన పురం…చంద్రవంశపు రాజైన పురూరవుని రాజధాని. ఇతని తండ్రి బుధుడు, తల్లి ఇళ. అలహాబాద్, ఝూన్సీలహాబాద్, ఝూన్సీ

Gokulam వ్రేపల్లె : (గోకులం) మధురకు దగ్గరలో కలదు. గోకుల్ అనే పేరుతో పిలువబడుచున్నది. శ్రీకృష్ణుని పెంపుడు తల్లిదండ్రులు యశోదా నందులకు చెందిన ప్రాంతం. శ్రీకృష్ణుని బాల్యమంతా వ్రేపల్లెలోనే గడిచింది. శ్రీకృష్ణుడు పూతన, శకటాసురుడు, ధేనుకాసురుడు మొదలగు రాక్షసులను సంహరించిన ప్రాంతం.

Madhuvanam/Madhupuram…మధుపురం/మధువనం శ్రీకృష్ణుని మేనమామ, ఊగ్రసేనుని కుమారుడు కంసుని రాజ్యం మధుర. దీని రాజధాని మధుపురం. (మధుర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉన్నది).
శ్రీకృష్ణుని తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను ఇక్కడే కారాగారంలో బంధిస్తాడు. శ్రీకృష్ణుడు 14 సంవత్సరాల బాలుడుగా ఉన్నపుడే మహాబలవంతుడైన కంసుని అతని రాజ్యంలోనే వధించి తన తల్లిదండ్రులను విడిపిస్తాడు.

Hastinapuram… హస్తినాపురం … ధృతరాష్ట్ర, గాంధారీ పుత్రులైన కౌరవుల రాజధాని హస్తినాపురం. ఉత్తరప్రదేశ్ లోని హస్తినాపూర్

Indraprastam….. ఇంద్రప్రస్తం…. పాండవులకు సగం రాజ్యం లభించిన తరువాత ఖాంఢవ ప్రస్తంలో పాండవులు కొత్తగా నిర్మించుకున్న పట్టణం. కృష్ణుడు ఇంద్రుని ద్వారా విశ్వకర్మచేత నిర్మింపచేసిన పట్టణం కనుకను ఇంద్రప్రస్తం అని పేరు వచ్చింది.
నేటి ఢిల్లీయే ఆనాటి ఇంద్రప్రస్తం అంటారు.

Dhamouli.. ధమౌలి… మహాభారత రచయిత శ్రీ వ్యాస మహర్షి జన్మస్థలం ధమౌలి నేపాల్ లో కలదు. వ్యాసమహర్షి తల్లి తండ్రులు సత్యవతి, పరాశర మహర్షి.

Nishada Kingdom…నిషాధ రాజ్యం దమయంతి భర్త నలమహారాజు రాజ్యం. మధ్యప్రదేశ్ లోని గ్యాలియర్ జిల్లాలో ఉన్నది.

Mahendra Parvatam… మహేంద్రపర్వతం … ఇరవై ఒక్క సార్లు క్షత్రీయ రాజులమీద దండయాత్ర చేసి వారిని సంహరించిన పరశరాముడు తపస్సు చేసిన స్థలం మహేంద్ర పర్వతం. పశ్చిమ ఒరిస్సాలో ఉన్నది.

Rakshasthalam… రక్షస్థలం .. లంకేశుడు, పరమశివభక్తుడు రావణాసురుడు తన పది తలలు నరికిశివుణ్ణి పూజించి వరాలు పొందిన స్థలం. లాంగ్ కో, టిబెట్

Gokarnam… గోకర్ణం … రావణాసురుడు శివుణ్ణి పూజించి ఆత్మలింగాన్ని సాధిస్తాడు. కానీ గణపతి పరమ శివుని ఆత్మలింగాన్ని ఈ ప్రదేశంలోని యుక్తితో నేలమీద స్థాపిస్తాడు.గోకర్ణం కర్ణాటకలో ఉన్నది.

Prabhateertham… ప్రభాసతీర్ధం .. శ్రీకృష్ణ భగవానుడు బోయవాని బాణానికి గురై నిర్యాణం చెందిన ప్రదేశం. ఇది గుజరాత్ లోని సోమనాధ్ లో ఉంది. సోమనాథ్ శివాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ సోమనాధ్ శివాలయంను మహ్మదీయులు అనేక సార్లు ధ్వంసం గావించారు. స్వాతంత్రానంతరం సర్ధార్ వల్లభభాయ్ ఆధ్వర్యంలో పునర్మించబడింది.

Sonapuram… శోణపురం …. శ్రీకృష్ణ భగవానుడి మనుమడైన అనిరుద్దుడు వివాహమాడిన ఉషాదేవి తండ్రి బాణాసురుడు. బాణాసురుని రాజధానే శోణపురం. అస్సాంలోని సోనిత్ పూర్ లో ఉంది.

Pragjyothishapuram… ప్రాగ్జోతిషపురం … విష్ణుమూర్తి దశావతారాలలో ఒకటైన వరాహావతారునికి, భూదేవికి పుట్టిన కుమారుడు నరకాసురుడు. నరకాసురుని రాజధాని ప్రాగ్జోతిషపురం (నేటి అస్సాంలోని తేజ్ పూర్ ).
ఈ నరకాసురుడే తన తల్లిదండ్రులైన సత్యభామ, శ్రీకృష్ణ భగవానుని చేతిలో యుద్ధంలో మరణిస్తాడు. ఇతని కుమారుడు భగదత్తుడు గొప్పవీరుడు. మహాభారత యుద్ధంలో కౌరవల పక్షాన పోరాడి మరణిస్తాడు.

Virat Nagaram… విరాట్ నగరం … పాండవులు అరణ్యవాసం తరువాత ఒక సంవత్సరం పాటు విరాట రాజు కొలువులో ఆజ్ఙాతవాసం చేస్తారు. ఈ విరాటుని రాజ్యం మత్స్యదేశం. దీని రాజధానే రాజస్థాన్ లోని విరాట్ నగరం.

Parham… పర్హాం … పాండవ మధ్యముడు అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని పుత్రుడు పరీక్షత్ మహారాజు. ఇతను శాపవశాత్తూ తక్షకుడు అనే సర్పం కాటువల్ల మరణిస్తాడు. ఇతని పుత్రుడే జనమేజయుడు. తండ్రి మరణానికి కారకుడైన తక్షకునిపై పగబట్టి సర్పజాతిని నాశనం చేయటాని సర్పయాగం చేస్తాడు. ఆ ప్రదేశమే పర్హాం ఉత్తరప్రదేశ్ జిల్లాలో ఉన్నది

Parnal…వర్నాల్ … కౌరవులు పాండవులను లక్షాగృహంలో ఉంచి తగలబెట్టిన ప్రదేశం వర్నాల్. ఇది ఉత్తరప్రదేశ్ లోని హస్తినాపూర్ లో ఉన్నది.

Kampil… కంపిల్ … పంచపాండవుల భార్య ద్రౌపతీ దేవి జన్మస్థలం కంప్లీ. అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపతిని చేపట్టిన ప్రాంతం కంపిల్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. ద్రుపద మహారాజు రాజ్యం పాంచాల దేశం. ద్రుపదుని పుత్రికే ద్రౌపతీ దేవి.

Kamyakavanam…కామ్యకవనం (ద్యైతవనం) కౌరవుల చేతిలో జూదంలో ఓడిపోయిన పాండవులు ధర్మరాజు జూదంలో వేసిన పందెం నియమాలను అనుసరించి అరణ్యవాసం చేస్తారు. ఈ పరిసర ప్రాంతాలలోనే పాండవులు అరణ్యవాసం చేశారు. ఈ ప్రాంతం పశ్చిమ హర్యానాలోఉంది.

Kusinagar… కుశీనగర్ బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందిన ప్రదేశం కుశీనగర్. ఉత్తరప్రదేశ్ లో ఉంది.
మిధిల భారతీయులే కాక ప్రపంచ ప్రజల హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న శ్రీరాముని పట్టమహిషి సీతాదేవి జన్మస్థలం నేపాల్ లోని జనక్ పూర్ లో ఉన్న మిధిల. జనక మహారాజు సీతాదేవి తండ్రి.

Ayodhya…అయోధ్య (సాకేతపురం) రామాయణ కథానాయకుడు శ్రీరాముని జన్మస్థలం అయోధ్య. బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం కూడా అయోధ్యే. సరయూ నదీలో మునిగి అవతారం చాలించిన ప్రదేశం కూడా ఇదే. ఈ అయోధ్యలోనే బాబ్రీమసీద్ కూలగొట్టబడింది. ప్రస్తుతం ఈ ప్రాంత వివాదంలో ఉంది.

Ahobilam… అహోబిలం నరసింహావతారంలో శ్రీమహావిష్ణువు హిరణ్యకశిపుని వధించి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించిన చోటు అహోబిలం. ఇది ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్నది.

Mahishamiti… మహిష్మతి … జమదగ్ని మహర్షి దగ్గరనుండి కామధేనువుని బలవంతంగా సంగ్రహించి అతని కుమారుడైన పరశరాముని ఆగ్రహానికి గురై అతని చేతిలో మరణించిన కార్తవీర్యార్జుని రాజధాని మహిష్మతి. ఇది ప్రస్తుతం మహేశ్వరగా పిలువబడుచున్నది. మధ్యప్రదేశ్ లో ఉంది.

Angarajyam… అంగరాజ్యం …. (ఆఫ్గనిస్తాన్ – కాబూల్). పాండవులు, కౌరవులు విద్యాభ్యాసానంతరం అస్త్రవిద్యా ప్రదర్శనలో దుర్యోధనుడు కర్ణుని అంగరాజ్యానికి రాజుగా ప్రకటిస్తాడు. అంగరాజ్యమే నేటి ఆఫ్గనిస్తాన్. ఆఫ్టనిస్తాన్ రాజధాని కాబూల్.

Kuntipuri… కుంతిపురి : పాండురాజు మొదటి భార్య కుంతిదేవి జన్మస్థలం కుంతిపురి. గ్యాలియర్ లో ఉంది.

Madhra… మద్రదేశం పాండురాజు రెండోభార్య మాద్రి జన్మస్థలం మద్రదేశం. ప్రస్తుతం పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స లోన ఉంది.

Dwaraka…ద్వారక .. అర్జునుని రధసారధిగా ఉండి మహాభారత యుద్ధాన్ని నడిపించి పాండవులకు విజయాన్ని చేకూర్చిన శ్రీకృష్ణ భగవానుని రాజ్యమే ద్వారక. గుజరాత్ లోని నేటి ద్వారకే శ్రీకృష్ణుని ద్వారకగా భావిస్తున్నారు. ఇందుకు పురావస్తుశాఖ వారు జరిపిన త్రవ్వకాలు, పరిశోధనలే ఆధారం.

Chedi Kingdom…ఛేదిరాజ్యం… శ్రీ కృష్ణుని మేనల్లుడు శిశుపాలుడు. పుట్టుకతోనే వికృత రూపంలో పుడతాడు. శ్రీకృష్ణుని చేతిలో మామూలు రూపం పొందుతాడు. పాండవుల రాజసూయ యాగం చేస్తారు. రాజసూయ యాగం ముగిస్తుండగా శిశుపాలుడు శ్రీకృష్ణుని 101 సార్లు నిందించి అతని చేతిలో హతుడవుతాడు. ఈ శిశుపాలుని రాజ్యమే ఛేదిరాజ్యం. ఇది మధ్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్.

Vidharba… విదర్భ … శ్రీకృష్ణుని పెద్దభార్య రుక్మిణీదేవి. రుక్మిణీ దేవిని శ్రీకృష్ణుడు, రుక్మిణీ దేవి కోరిక మేరకు రాక్షస వివాహ పద్ధతిలో అపహరించి వివాహం చేసుకుంటాడు. ఈ విదర్భ దేశమే రుక్మీణీ దేవి స్వస్థలం. ఇది మహారాష్ట్రలోని విదర్భ.

Kurukshetram…..కురుక్షేత్రం మహాభారతంలో పాండవులకు, కౌరవులకు యుద్ధం జరిగిన స్థలం కురుక్షేత్రం. నేటి హర్యానా రాష్ట్రంలో పానిపట్ సమీపంలో ఉంది.
కొన్నివేల సంవత్సరాలక్రితం ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కురురాజులు ఈ ప్రాంతాన్ని సాంస్కృతిక, విద్య, వైజ్ఞానికి కేంద్రంగా అభివృద్ది చేసారు.
వ్యాసమహర్షి ఇతిహాసాలను పురాణాలను కూడా ఇక్కడే రచించాడంటారు. కృష్ణభగవానుడు అర్జునునికి గీతోపదేశం చేసింది కూడా ఇక్కడి జ్యోతిసార్ వద్ద అని పండితుల అభిప్రాయం.
సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రం పుణ్యక్షేత్రంగా మారుతుంది. లక్షలమంది భక్తులు ఇక్కడ నదులలో స్నానం, పూజలు చేస్తారు.
ఒకేసారి లక్షమంది స్నానం చేయటానికి వీలున్న బ్రహ్మసరోవరం కూడా ఇక్కడే ఉన్నది.
భీష్ముడు అంపశయ్యమీద పడుకుని ఉత్తరాయణం కోసం ఎదురుచూసింది కూడా ఇక్కడే ఉన్న బౌన్ గంగ అనేప్రదేశం అంటారు. అర్జునుడు తాతగారి దాహం తీర్చటానికి తన బాణాలతో భూమిని ఛేదించి గంగాజలాన్ని రప్పించింది కూడా ఇక్కడే.