పర్యాటక ప్రదేశాలు

భువనేశ్వర్ – అనేక దేవాలయాలు ఉన్న ప్రదేశం

భువనేశ్వర్ ఒడిషా యొక్క రాజధాని నగరం. భారతదేశం యొక్క తూర్పు భాగంలో ఉన్న ఒక గంభీరమైన పట్టణం. మహానది నైరుతి ఒడ్డున ఉన్నది. ఈ నగరం కళింగ కాలం నాటి నుండి అద్భుతమైన నిర్మాణం కలిగి ఉంది. ఈ పురాతన నగరం 3000 సంవత్సరాల గొప్ప వారసత్వం కలిగి ఉంది. భువనేశ్వర్ యొక్క భూభాగంలో 2000 కంటే ఎక్కువ దేవాలయాలు కలిగి ఉంటాయని భావిస్తున్నారు. ఆ కారణంగా భువనేశ్వర్ ను భారతదేశం యొక్క ఆలయనగరం అని పిలుస్తారు. …

భువనేశ్వర్ – అనేక దేవాలయాలు ఉన్న ప్రదేశం Read More »

జైపూర్ – పింక్ సిటీ

భారతదేశంలోని పురాతన నగరమైన జైపూర్, పింక్ సిటీ గా ప్రసిద్ది చెందింది. రాజస్తాన్ రాజధానైన జై పూర్ పాక్షిక ఎడారి ప్రాంతంలో ఉంది. ఈ సుందర నగరాన్ని అంబర్ మహారాజు, రెండవ మహారాజ సవాయి జై సింగ్ బెంగాల్ కు చెందిన వాస్తు శిల్పి విద్యాధర్ భట్టాచార్య సహాయంతో నిర్మించాడు. వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించిన భారత దేశం లోని మొదటి నగరం కూడా ఇదే .   హిందూ నిర్మాణ శైలి కి ఒక అద్భుత …

జైపూర్ – పింక్ సిటీ Read More »

2021 – ఏ నెలలో ఎన్ని రోజులు సెలవులున్నాయి, భారత దేశంలో చూడవలసినవి ఏవి ఉన్నాయి

ఏడాదంతా మనం చేయవలసిన పని. ఇంకో పని కూడా చేయాలి. ఆదివారం కలిసొచ్చేలా శనివారం; శనీ ఆదివారాలు కలిసొచ్చేలా శుక్రవారం సెలవు పెట్టడం. వీలైతేనే. విధిగా కాదు. ఉద్యోగమనే విధికి అడ్డు తగలకుండా చూసుకోవాలి.  జనవరి14 సంక్రాంతి. 15 శుక్రవారం సెలవు పెడితే 16, 17 శని, ఆదివారాలు. 23, 24 మళ్లీ శని, ఆదివారాలు. 26 రిపబ్లిక్‌ డే. 25 సెలవు పెడితే 24 ఆదివారం. వరుసగా మూడు రోజులు. ఇవి చూడొచ్చు  :అహమ్మదాబాద్‌లో ఇంటర్నేషనల్‌ కైట్‌ …

2021 – ఏ నెలలో ఎన్ని రోజులు సెలవులున్నాయి, భారత దేశంలో చూడవలసినవి ఏవి ఉన్నాయి Read More »

లంబసింగి

అక్కడ సూర్యుడు చంద్రుడిలా చూడముచ్చటగా కనిపిస్తాడు. మంచుతో జత కలిసిన సూర్యకిరణాలు గిలిగింతలు పెడుతుంటాయి. మండు వేసవిలో కూడా అక్కడి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు దాటదు. 250 మంది జనాభా ఉన్న ఆ గ్రామానికి శీతాకాలంలో లక్షల మంది పర్యాటకులు వస్తారు. సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండ గ్రామం అది. దీన్నే అంతా లంబసింగి అని పిలుస్తుంటే… ఆ గ్రామస్థులు మాత్రం కొర్రబయలు అంటారు. శీతాకాలం వచ్చిందంటే చాలు వర్షంలా కురుస్తున్న మంచుతో …

లంబసింగి Read More »

బెంగళూరు(Bangalore)

అందుకే దీనిని గార్డెన్ సిటీ అని పిలుస్తారు. ఈ కారణంగా వాతావరణం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది మెట్రో మార్గంలో చెట్లను చూడండి. ఇవన్నీ చూసిన తరువాత బెంగళూరును గార్డెన్ సిటీ అని ఎందుకు పిలుస్తారు అని సందేహం ఉందా? 😛 బెంగళూరులో ప్యాలెస్ లాగే ఒక విధాన సభ ఉంది. మైసూరు రాజులూ నిర్మించిన పెద్ద పాలస్ ఉంది. ఇక్కడే ముద్రించిన క్యాలెండర్ చాలా ప్రసిద్ది చెందింది. పేరు బెంగళూరు ముద్రణాలయ. ఇక్కడ చాలా మంచి నాణ్యమైన సిటీ బస్సులు ఉన్నాయి. …

బెంగళూరు(Bangalore) Read More »

సారనాథ్

సారనాథ్ ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం. బౌద్ధమత పరంగా సారనాధ్ పేరుపొందినది. ఇక్కడ ప్రఖ్యాతి గాంచిన జింకల పార్క్ లోనే గౌతమ బుద్దుడు మొదటి ధర్మాన్ని బోధించాడు మరియు మొదటి సంఘం స్థాపించబడిన ప్రదేశము. సారనాధ్ భారతదేశంలో ఉన్న నాలుగు ప్రధాన బౌద్ధ స్థలాలలో ఒకటి. అశోక చక్రవర్తిచే నిర్మింపబడిన అనేక స్థూపాలు సారనాధ్ లో ఉన్నాయి. వీటిలో అశోక స్థూపం ప్రసిద్ధి చెందినది. ఈ స్థూపంలో ఉన్న నాలుగు …

సారనాథ్ Read More »

మథుర

మథుర నగరానికి బ్రిజ్ భూమి లేదా ‘అంతు లేని ప్రేమ కల భూమి‘ అని గతంలో పేరు. ఇపుడు కూడా అలాగే పిలుస్తున్నారు. మధుర పట్టణం హిందువులకు ప్రధాన యాత్రాస్థలం. ఇక్కడ శ్రీకృష్ణుడు, అతని ప్రియురాలు రాధకు సంబంధించి అనేక దేవాలయాలు కనపడతాయి. 8వ శతాబ్దంలో ఈ ప్రాధాన్యతను బయటపడక ముందు ఈ పట్టణం బౌద్ధులకు సంబంధించినది. బౌద్ధమతానికి చెందిన అనేక బౌద్ధ ఆరామాలలో సుమారు ౩,౦౦౦ మంది బౌద్ద సన్యాసులు వుండేవారు. ఆఫ్ఘన్ ప్రభువు మహమ్మద్ …

మథుర Read More »

Lucknow

లక్నో , ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని మరియు ‘నవాబుల నగరం’గా పిలువబడే గోమతి నది తీరాన ఉంది.లక్నోలో శిధిలమైన లక్నో భవనాలు, 1857 స్వాతంత్ర మొదటి యుద్ధదృశ్యాలు, రాజ్ వంశ కాలంనాటి మెమోరియల్ మ్యూజియంలను కూడా సందర్శించవచ్చు. లక్నోలో పచ్చదనం కూడా ఒక భాగం. లక్నో జూ, బొటానికల్ గార్డెన్, బుద్ధ పార్కు, కుక్రైల్ ఫారెస్ట్ రిజర్వ్, సికందర్ బాగ్ కూడా చూడవలసినవే. లక్నోలో అవధి నిర్మాణానికి సాక్ష్యంగా నిలిచే అనేక అద్భుతమైన కట్టడాలు, ఆకట్టుకునే భవనాలు …

Lucknow Read More »

ఉదయపూర్‌

ఆరావళి పర్వతప్రాంతంలో ఉన్న ఉదయపూర్‌ (రాజస్థాన్‌)కు దేశంలో అత్యంత రొమాంటిక్‌ పట్టణాలలో ఒకటిగా పేరుంది. చుట్టూ నాలుగు సరస్సులతో అలరారుతున్న ఈ పట్టణం ఎన్నో విశేషాలకు నెలవు. ‘జెవెల్‌ ఆఫ్‌ మేవార్‌’, ‘వెనీస్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ అనే పేర్లు దీనికి సొంతం. అద్భుతమైన సరస్సులు ఉండటం ఒక విశేషమైన అత్యద్భుతమైన చారిత్రక సౌరభాలు ఉండటం మరో విశేషం. మొఘలుల కోటలు, ప్యాలెస్‌లు, దేవాలయాలు, హిల్స్‌ ఈప్రాంత సొంతం. ఉదయపూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది నధ్వారా …

ఉదయపూర్‌ Read More »

నైనిటాల్

హిమాలయ శ్రేణులలోని కుమావొన్ హిల్స్ మధ్య భాగంలో ఉన్న నైనిటాల్ భారత దేశపు సరస్సుల జిల్లాగా పిలువబడుతుంది. అత్రి, పులస్త్య, మరియు పులాహ ఋషులు ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తూ దాహం తీర్చుకునేందుకు గాను నైనిటాల్ వద్ద ఆగారు. వారికి ఆ ప్రాంతంలో నీరు లభించలేదు. వెంటనే వారు ఒక పెద్ద గొయ్యి తవ్వి దానిలోకి మానస సరోవరం నీటిని నింపి దాహం తీర్చుకున్నారు. ఆ విధంగా నైనిటాల్ సరస్సు సృష్టించబడింది. మరో కధనం ప్రకారం ఇక్కడ …

నైనిటాల్ Read More »

శ్రీనగర్

శ్రీనగర్ … వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన టూరిస్టు స్పాట్… దాల్ లేక్. ఈ సరస్సు 22 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ సరస్సు ఫిషింగ్, వాటర్ ప్లాంట్ హార్వెస్టింట్ లాంటి వాటి ద్వారా శ్రీనగర్ ఆర్థికాభివృద్ధికి ఎంతో తోడ్పడుతోంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ‘షికారాలు’. అంటే గూటి పడవలు. అందంగా అలంకరించిన ఈ పడవల్లో ప్రయాణించడానికి పర్యాటకులు ఇష్టపడతారు. చలికాలంలో ఈ సరస్సు పూర్తిగా గడ్డ కట్టేస్తుంది. అందుకే దీన్ని చూడాలంటే ఏప్రిల్ …

శ్రీనగర్ Read More »

Dharmasala / ధర్మశాల

ధర్మశాల, హిమాచల ప్రదేశ్ లోని కాంగ్రాకు 27 కిలోమీటర్ల దూరంలో ఈశాన్యాన ఉన్న ఒక పర్వత పర్యాటక కేంద్రం. ఈ ప్రాంతం కాంగ్రా లోయకు ప్రవేశద్వారంగా పరిగణింపబడుతుంది. ఈ ప్రాంతపు ప్రాకృతిక సౌందర్యం మంచుతో కప్పబడిన ధవళాధర్ పర్వతశ్రేణులతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఈ నగరాన్ని రెండు వేర్వేరు ప్రాంతాలుగా విడగొట్టారు, ఎగువ ధర్మశాల, దిగువ ధర్మశాల. దిగువ ధర్మశాల వాణిజ్య కేంద్రం కాగా, ఎగువ ధర్మశాల వలస జీవనశైలికి పేరొందింది. మెక్లియాడ్ గంజ్, ఫర్సిత్ గంజ్ …

Dharmasala / ధర్మశాల Read More »

సిక్కిం పర్యాటకం

చక్కటి ప్రాంతాలు, మంచు కిరీటాలను ధరించిన పర్వతాలు, పూలపాన్పు వంటి మైదానాలు, అందమైన జలవనరులు, ఇంకా ఎన్నో ఉండి, దాదాపుగా ఒక స్వర్గం అని పేరుపొందినదే ఎంతో అద్భుతమైన సిక్కిం. సిక్కిం, భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతంలోని రాష్ట్రాలలో ప్రకృతమైన ప్రకృతి ఉన్న అద్భుత భూమి. మరియు జీవితకాలంలో ఒక్కసారైనా చూడదగిన సుందర ప్రదేశాలతో ఉన్న రాష్ట్రం. సిక్కింకు తూర్పున భూటాన్, పశ్చిమ దిశలో నేపాల్, ఉత్తరాన టిబెట్ పీఠభూమి ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన …

సిక్కిం పర్యాటకం Read More »

రిషికేశ్

రిషికేశ్ హిందువుల పవిత్ర క్షేత్రాలలో ఒకటి. ఇది హిమాలయాల దిగువ భాగంలో ఉంది. శ్రీరాముడు రావణ సంహారం తరువాత బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఇక్కడ పరిహార ర్మలాచరించినట్లు పురాణ కథనం. రిషికేశ్ హరిద్వార్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిమాలయ చార్‌దామ్‌లుగా ప్రసిద్ధి చెందిన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి. పవిత్ర గంగానది ఋషికేశ్ గుండా ప్రవహిస్తుంది. గంగా నది హిమాలయాలలోని శివాలిక్ కొండలను దాటి ఉత్తర భారత మైదానాలలో ప్రవేశించే ప్రదేశమే ఋషికేశ్. ఋషికేశ్ …

రిషికేశ్ Read More »

గంగోత్రి

గంగోత్రి గంగా నది పుట్టిన ప్రదేశం. గంగాదేవి ప్రతిష్ఠితమైన ప్రదేశం. హిమాలయాలలోని చార్‌ధామ్‌లలో ఒకటి. ఇక్కడ గంగానది భాగీరధి పేరుతో పిలవబడుతుంది. గంగా నదినిభూమికి తీసుకు రావడానికి భాగీరధుడు కారణం కనుక ఆ పేరు వచ్చింది. దేవ ప్రయాగనుండి గంగానదిలోఅలకనందా నది ప్రవేశించే ప్రదేశం నుండి గంగా నదిగా పిలవబడుతుంది. గంగానది పుట్టిన ప్రదేశం గోముఖ్. ఇది గంగోత్రినుండి 40 కిలోమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది. హరిద్వార్, రిషికేశ్ మరియు డెహరాడూన్ నుండి ఒక రోజు ప్రయాణంచేసి …

గంగోత్రి Read More »

ఏటూరునాగారం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం అభయారణ్యం వేసవి తాపం కనిపించదు. ఎండ పడదు పెద్ద పెద్ద చెట్లు చక్కటి చల్లదనాన్నిస్తాయి. పచ్చని చెట్లు మధ్య వడగాలి మాట మర్చిపోతారు. అటవీశాఖ వారు దట్టమైన అడవి మధ్యలో తాడ్వాయి దగ్గర ఏర్పాటు చేసిన వనకుటీరాలలో బస చేయవచ్చ.ఈ అరణ్యంలో సమయం ఆనందంగా గడిచిపోతుంది. ఉదయాన్నే.. చెట్ల నుంచి తొంగిచూసే సూర్యుడి లేత కిరణాలు .. మనసుకు ఆనందం కలిగిస్తాయి. ఈ వనంలో సైకిల్‌ సవారీ కోసం ప్రత్యేకమైన ట్రాక్‌ …

ఏటూరునాగారం Read More »

ప్రశాంతి నిలయం, పుట్టపర్తి

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మరియు పుట్టపర్తి సాయిబాబా వారి జన్మస్థలం. పుట్టపర్తికే తలమానికం సాయిబాబా వారి ప్రశాంతి నిలయం. నిత్యం కొన్ని వేలమంది భక్తులు ఈ ఆశ్రమం చూసేందుకు వస్తారు. విదేశాలనుండి కూడా సాయిభక్తులు వస్తారు. పుట్టపర్తిలో సాయి సేవాసంస్థల వారు పేదవారికి ఉచిత హాస్పటల్‌,విద్యా సంస్థలు ఇంకా అనేక సేవా కార్యక్రమములు నిర్వహించుచున్నారు. భక్తులు, పర్యాటకుల కోసం ప్రభుత్వం 1.5 కోట్ల రూపాయలతో శిల్పారామం నిర్మించారు. ఎలా వెళ్ళాలిపుట్టపర్తికి రైలు మరియు రోడ్డు మార్గాలలో వెళ్ళవచ్చు. …

ప్రశాంతి నిలయం, పుట్టపర్తి Read More »

నల్లమల ఎకో టూరిజం

కర్నూలు జిల్లాలోని పచ్చర్ల, బైర్లూటి, తుమ్మలబయలు నల్లమల ఎకో టూరిజానికి ముఖద్వారాలు. వారాంతాల్లో, సెలవు రోజులలో వేలసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తారు. అడవి అందాలను ఆస్వాదించాలని పెద్దలు….. వన్యమృగాలను చూడాలని పిల్లలు ఆరాటపడుతుంటారు. ట్రెక్కింగ్ ప్రియులకు మంచి ప్రదేశం ‘జంగిల్ క్యాంప్’లోని కాటేజీల్లో బస చేసి తీరికగా అడవంతా చూడొచ్చు. లేక ఉదయాన్నే .. సఫారీ చేసి, పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ.. స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించవచ్చు. వారాంతాల్లో హైదరాబాద్, విజయవాడ, కర్నూలు తదితర నగరాల నుంచి పర్యాటకులు నల్లమలకు …

నల్లమల ఎకో టూరిజం Read More »

నాగార్జున కొండ

నాగార్జున కొండ దక్షిణ భారతంలో ప్రసిద్ధి చెందిన ఒక బౌద్ధ క్షేత్రం. బౌద్ధమత తత్వవేత్త, ఆచార్యుడు అయిన నాగార్జునుని పేరు ఈ ప్రాంతానికి పెట్టబడింది. ఆచార్య నాగార్జునుడు బౌద్ధమత వ్యాప్తికొరకు అమరావతి నుండి ఇక్కడకు వచ్చి నివాసం ఏర్పరుచుకున్నాడు. మహాయాన బౌద్ధమతాన్ని (వీరు బుద్ధుని విగ్రహాలను పూజించరు) స్థాపించిన ఈయన సుమారు 60 సంవత్సరాల పాటు ఈ సంఘాన్ని ఇక్కడ ఉన్న విద్యాలయాన్ని కూడా నిర్వహించారు. ఈ విద్యాలయానికి అప్పట్లోనే చైనా, శ్రీలంక నుండి విద్యార్ధులు వచ్చేవారు. …

నాగార్జున కొండ Read More »

అమరావతి బౌద్ధ స్థూపం

అమరావతి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్నది. ఒకప్పటి శాతవాహునుల రాజధాని ఐన ధరణికోట అమరావతికి దగ్గరలోనే ఉన్నది.. తరువాత కుషానులు కాలంలో ఇక్కడ బౌద్ధమతం వ్యాపించింది. 2000 సంవత్సరాక్రితం కట్టబడిన బౌద్ధ స్థూపాన్ని, బౌద్ధమత అవశేషాలను ఇక్కడ చూడవచ్చు. ఈ స్థూపం సాంచి స్థూపంకంటే పొడవైనది. దీనిని అశోకచక్రవర్తి కాలంలో నిర్మించారంటారు. దీనినే మహాస్థూప, దీపాలదిన్నె అనికూడా అంటారు. ఈ స్థూపం గుండ్రని వేదిక మీద ఇటుకలతో నిర్మించబడినది. ఈస్తూపం అనేక చిన్న బొమ్మలతో అలంకరించబడి …

అమరావతి బౌద్ధ స్థూపం Read More »

భవానీ ద్వీపం

కృష్ణానది మధ్యలో 130 ఎకరాలో విస్తరించి ఉన్న భవానీద్వీపం మంచి పిక్నిక్‌ స్పాట్‌. మీటింగ్‌ లకు, వివాహాది శుభకార్యక్రమాకు అనుకూలం. సమావేశాలకు ఎ పి టి డి సి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలోనే నదీ ద్వీపాలలో ఉన్న పెద్ద దీవి భవానీ ద్వీపం. వారాంతపు సెలవులు కుటుంబాలతో గానీ, స్నేహితులతో గడపటానికి మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం. బోట్ లో విహారం ఒక మరపురాని అనుభూతి. వాటర్ స్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎ పి టి …

భవానీ ద్వీపం Read More »

పాపికొండలు

పాపికొండలు తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వతశ్రేణి. పాపికొండలు ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్ఛిమగోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్నవి. ఎక్కువభాగం తూర్పు, మరియు పశ్ఛిమగోదావరి జిల్లాలలో ఉన్నవి. ప్రశాంతమైన, సుందరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం పాపికొండల సొంతం. పాపికొండలలోని చెట్లు ఆకులు రాల్చవు. కొండలు, జలపాతాలతో పూర్తిగా గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఎండాకాలంలో చల్లగా ఉండటం చేత దీనిని ఆంధ్రా కాశ్మీరం అంటారు. పాపికొండల అడవులలో పెద్దపులులు, నల్లపులులు, అడవిదున్నలు, నక్కలు, తోడేళ్లు, జింకలు, కోతులు, …

పాపికొండలు Read More »

రంపచోడవరం

తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం అటవీ ప్రాంతం వారాంతపు విహారానికి మంచి ప్రదేశం. ఇక్కడికి దగ్గరలోనే రంపా జలపాతం ఉంది. రంపచోడవరం నుంచి జలపాతానికి కాలినడకన వెళ్లవచ్చు. పచ్చి చెట్ల మధ్యలో నుంచి ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ కొద్దిదూరం నడక సాగిస్తే.. జలపాతాన్ని చేరుకోవచ్చు. జలపాతం చూడాలంటే రూ.10 చెల్లించి టికెట్‌ తీసుకోవాలి. ఇంకా ముందుకెళ్తే కొండ పైనుంచి.. రాళ్ల మీదుగా జాలువారే నీటిధారలు కనులకు విందు చేస్తాయి. మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. జలపాతం ముందున్న మడుగులో చక్కగా …

రంపచోడవరం Read More »

మారేడుమిల్లి

తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మారేడుమిల్లి ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. మంచి పర్యాటక స్ధలం. తూర్పు కనుమలలో ఉన్న ఈ అటవీ ప్రాంతం మారేడుమిల్లి గ్రామానికి 4 కి.మీ. దూరంలో మారేడుమిల్లి- భద్రాచం రోడ్డు నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ కొండమీద నుండి ప్రవహించే అనేక చిన్న చిన్న జలపాతాలు చూపరులకు కనువిందు చేస్తాయి. ఇక్కడ వామూరు నది మూడుపాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఇక్కడ గడపటం ప్రకృతి ప్రేమికులకు ఓ అద్భుతమైన అనుభూతి. వెదురు బొంగులలో చేసే స్థానిక …

మారేడుమిల్లి Read More »

దిండి పర్యాటకం

ఈ గ్రామం గోదావరి నదీతీరంలో గల మాల్కిపురం మండలం లోనిది. మంచి పర్యాటక ప్రదేశం. యాత్రికుల కొరకు హౌజ్‌బోట్లు ఉన్నాయి. ఎ.పి టూరిజం వారి వసతిగృహం కదు. మరియు స్విమ్మింగ్‌ఫూల్‌ సౌకర్యం ఉంది. వారాంతపు సెలవులు గడపటానికి గానీ, కుటుంబాలు ప్రశాంతంగా గడపటానికి గానీ, కొత్త జంటలకు గానీ చాలా అనుకూలమైన ప్రశాంతమైన వాతావరణంతో ఉన్న ప్రదేశం దిండి. ఆధునిక నాగరికత సోకని గ్రామం దిండి. రాజమండ్రి నుండి 80 కిలోమీటర్ల దూరంలో కలదు. వసతి సౌకర్యం …

దిండి పర్యాటకం Read More »

కడియం పూలతోటలు

కడియపు లంక (కడియం) : రాజమండ్రి నుండి కేవలం 8 కి.మీ. దగ్గరలో ఉన్న చిన్న అందమైన గ్రామం కడియం. ఆహ్లాదకరమైన వాతావరణం. పూలతోటలు, పూలచెట్లు, బోన్సాయ్‌ చెట్లు, అరుదైన పూల జాతుల చెట్లు లభించే నర్సరీలకు ప్రసిద్ధి. అనేక రకాల గులాబీలు, సన్నజాజులు, మల్లె మొక్కలు, ఔషధ మొక్కలకు ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం జనవరిలో ఫ్లవర్‌షో జరుగుతుంది. ఇక్కడనుండి భారతదేశం మొత్తానికి పూలమొక్కు ఎగుమతి చేయబడతాయి. రాజమండ్రికి కేవలం 8 కిమీ దూరంలో కడియం గ్రామం …

కడియం పూలతోటలు Read More »

బొర్రా గుహలు

చరిత్రాత్మక ప్రాధాన్యం కల మరియు సహజసిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు విశాఖపట్నం జిల్లా అనంతగిరిలో కలవు. బొర్రా గుహలు ఉనికి 1807లో విలియం కింగ్‌ అనే బ్రిటీష్‌ బౌగోళిక శాస్త్రవేత్తచే కనిపెట్టబడినది. సముద్రమట్టానికి 1400 మీటర్ల ఎత్తులో గుహలు ఉన్నవి. ఈ గృహలో శివలింగాన్ని మరియు కామధేనువు విగ్రహాన్ని కూడా దర్శించవచ్చు. సహజంగా ఏర్పడ్డ ఈ గృహలు ఆవు పొదుగు ఆకారంలో ఉండి ఒక ఒక మిలియన్‌ (10 లక్షల) సవంత్సరాల క్రితంవిగా భావించబడుచున్నవి. బొర్రా గుహలో …

బొర్రా గుహలు Read More »

కోలకతా

ఐకానిక్ హౌరా వంతెన బ్రిటీష్ కాలం నాటి హౌరా బ్రిడ్జ్, కోల్కత్తా నగరానికి గేట్ వే గా పనిచేస్తుంది, ప్రతి రోజు  లక్షల  వాహనాలు  మరియు 1.5 లక్షల మంది పాదచారులు దీనిని దాటుతారు.  కోల్కత్తా మరియు హౌరాను కలిపే ఒక బల్లకట్టు వంతెన స్థానం లో  ఈ  వంతెన ఫిబ్రవరి 3, 1943 న ప్రజల ఉపయోగార్ధం  ప్రారంభింప పడినది.  ఎల్లప్పుడూ అశేష జన సంద్రం చే సందడిగా ఉoడే తూర్పు మహానగరాన్ని(కోల్కత్తా) గంగా నది పై ఉన్న టెర్మినల్ హౌరా స్టేషన్ తో  కలిపి ఉక్కుతో నిర్మించబడిన ఈ వంతేనకు  నోబెల్ …

కోలకతా Read More »