ఉగాది

Ugadi 2021 Special Story In Telugu By Gumma Prasada Rao - Sakshi

చైత్రశుద్ధ పాడ్యమి అనగా ఉగాది పర్వదినం. కాలగమన సౌధానికి తొలి వాకిలి. ఋతు సంబంధ ప్రథమ ఆరోగ్యకోకిల గానం నూతన సంవత్సరానికి శ్రీకారం. ప్రజల మధ్య పెంపొందించే మమకారం. బహు సాంప్రదాయాలకు సాకార క్రియారూపం. ఆబాలగోపాలం ఆనందంగా చేసుకునే పండుగ ఉగాది. పౌర్ణమిరోజున చంద్రుడు ఏ నక్షత్రంలోఉంటాడో ఆ మాసానికి అదే పేరు ఉంటుంది. చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉండటం వలన ఈ మాసావికి చైత్రమాసం అని పేరు.

అన్ని ఋతువులకన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు. ఋతూనాం కుసుమాకరః– ఋతువుల్లో చెట్లు చిగిర్చి పూవులు పూయు వసంత ఋతువును నేనే అని తన ముఖ్య విభూతులు చెప్తూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. కోకిల పాటలు, సన్నజాజి, మల్లెల పరిమళాలు, చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో ప్రకృతిమాత కొత్త అందాలు సంతరించు కుంటుంది. వసంత ఋతువు చైత్రమాసంతో మొదలవుతుంది. మనిషిని, మనస్సును, బుద్ధిని వికసింపజేసే అహ్లాదభరిత వాతావరణంలో ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. 

వసంతుడికి స్వాగతం చెబుతూ తెలుగు లోగిళ్లు జరుపుకునే పండగే ఉగాది.. ఉగాది అచ్చమైన ప్రకృతి పండగ. ఈ రోజు నుంచే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండగ. చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా పేర్కొంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించాడని చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైంది కూడా ఉగాదినాడే…

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఈ పండుగ తెలుగు వారికి తెలుగు సంవత్సరము ప్రకారముగా తొలి పండుగ. ఈ పండుగ ప్రతీ సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి (అనగా చైత్రమాసములో శుక్ల పక్షము నందు పాడ్యమి తిథి కలిగిన మొదటిరోజు) రోజున వస్తుంది.   ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

ఉగాది పండగకు సంబంధించిన ఎన్నో ఐతిహ్యాలు మన పురాణాల్లో కనిపిస్తాయి. ప్రకృతి పరంగా చూస్తే… మోడువారిన చెట్లు చిగురిస్తూ, పూల పరిమళాలతో గుబాళిస్తూ పుడమితల్లిని పులకింపచేసే వసంతరుతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది.

ఉగాదిని కొత్తదనానికి నాందిగా అభివర్ణిస్తారు. ఒక్క తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు గుడి పడ్వా, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖీ, బెంగాలీలు పాయ్‌లా బైశాఖ్‌, తమిళులు పుత్తాండు అనే పేర్లతో ఉగాదిని జరుపుకోవడం విశేషం.

షడ్రుచుల సమ్మేళనం ‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు’
అన్న శ్లోకాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడి తినాలని చెబుతోంది శాస్త్రం. మధుమాసంలో పుట్టినటువంటి, శోక బాధలను దరిచేరనివ్వకుండా చేసేటటువంటి ఓ నింబ కుసుమమా, నన్ను ఎల్లప్పుడూ శోక రహితుడిగా చెయ్యమని దీని అర్థం. ఈ పండగకు మాత్రమే ప్రత్యేకంగా తినే పదార్థం ఉగాది పచ్చడి.

కొత్త చింత పండు, బెల్లం, మామిడి పిందెలు, వేపపువ్వు, మిరియాలు లేదా కారం లేదా పచ్చిమిర్చి, అరటిపండ్లు… మొదలైన పదార్థాలను ఉపయోగించి ఈ పచ్చడిని తయారుచేస్తారు. ఇది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులూ జీవితంలోని బాధ, సంతోషం, ఉత్సాహం, నేర్పు, సహనం, సవాళ్లకు సంకేతాలు. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలనూ ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని చెప్పకనే చెబుతుందీ ఉగాది పచ్చడి.

ఉగాది రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. పెద్దవారితో నువ్వుల నూనెను తలమీద పెట్టించుకుని, నలుగుపిండితో అభ్యంగన స్నానం చేయాలి. తర్వాతకొత్త బట్టలు ధరించి, ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. పరగడుపునే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. ప్రకృతి మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని సంసిద్ధం చేసే శక్తి ఈ పచ్చడికి ఉందని పురాణాలు చెబుతున్నాయి.

సాయంత్రం వేళ దేవాలయంలో జరిగే పంచాంగ శ్రవణాన్ని తప్పక వినాలని చెబుతారు పెద్దలు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఈ అయిదు అంగాల కలయికనే పంచాంగం అంటారు. మనకు పదిహేను తిథులు, ఏడు వారాలు, ఇరవై ఏడు నక్షత్రాలు, ఇరవై ఏడు యోగాలు,

పదకొండు కరణాలు ఉన్నాయి. వీటన్నింటి గురించీ పంచాంగం వివరిస్తుంది. వీటితోపాటు నవగ్రహాల సంచారం, వివాహాది శుభకార్యాల ముహూర్తాలూ, ధరలూ, వర్షాలూ, వాణిజ్యం… ఇలా ప్రజలకు అవసరమైన వాటికి అధిపతులు ఎవరూ, అందువల్ల కలిగే లాభనష్టాలు ఏమిటీ వంటి విషయాలతోపాటు దేశ స్థితిగతులను కూడా పంచాంగంలో ప్రస్తావిస్తారు.

ఉగాది పచ్చడి  :   ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. మానవ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, సంతోషం, బాధ, అవమానాలు అన్ని ఉంటాయి. వీటిన్నంటిని ఒక్కో రుచితో మేళవించారు పెద్దలు. షడ్రుచుల మిళితమైన శ్రేష్ట పదార్ధమే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి సేవనం తెలియజెప్పే నిజం. ‘కష్ట సుఖాలు జీవితంలో చవిచూడాలి’. కాబట్టి ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.  

This image has an empty alt attribute; its file name is 39ee6-ugaadi.jpg

కావాల్సిన పదార్థాలు: తగినన్ని మామిడి ముక్కలు, 2 టీ స్పూన్ల వేప పువ్వు, 100 గ్రాముల కొత్త చింతపండు, 30 గ్రాముల బెల్లం, టీ స్పూను కారం, తగినంత ఉప్పు, అరటిపండు ముక్కలు   తయారీ విధానం: ముందుగా కొత్త చింతపండుని ఓ గ్లాసు నీళ్లలో వేసి నానబెట్టాలి. ఆ తర్వాత చింతపండు పులుసు పిండి ఓ గిన్నెలో వేయాలి. ఈ పులుసులో సన్నగా తరిగిన మామిడి ముక్కలు, వేప పువ్వు, కారం, ఉప్పు కలపాలి. ఆ తర్వాత దానికి బెల్లం, అరటి పండు ముక్కలు కలిపితే ఉగాది పచ్చడి సిద్ధమమైనట్లే.

షడ్రుచులు దేనికి సంకేతం అంటే..

  • బెల్లం తీపి – ఆనందానికి సంకేతం 
  • ఉప్పు – జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం 
  • వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు 
  • చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు 
  • పచ్చి మామిడి ముక్కలు – వగరు – కొత్త సవాళ్లు 
  • మిరియాలు – కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

మహా శివరాత్రి

హిందువుల పండుగల్లో మహాశివరాత్రి ముఖ్యమైనది. ఈ పండుగ మాఘమాసం కృష్ణపక్షంలో అర్థరాత్రి ఉండే చతుర్దశి తిథినాడు వస్తుంది. చతుర్దశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైంది. అందులోనూ కృష్ణచతుర్దశి అంటే అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి తిథి మరీ ప్రీతికరమైంది. ఆ కారణంగానే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణచతుర్దశి తిథులు మహాశివరాత్రులుగా ఉంటాయి. సంవత్సరంలోని పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో వచ్చే శివరాత్రి శివుడికి బాగా ఇష్టమైంది కాబట్టి దాన్ని మహాశివరాత్రి అని అంటారు.

ఏడాదికొకసారి వచ్చే మహాశివరాత్రినాడు శివపూజ చేయడం పుణ్యప్రదం. యోగి అయినవాడు తన యోగబలం చేత యోగనిద్రలోకి వెళ్లే రాత్రిని యోగశివరాత్రి అని అంటారు. సాధారణంగా రాత్రిపూట దేవీపూజను, పగటిపూట దేవపూజను చేయడం ఒక ఆచారంగా ఉంటుంది. కానీ శివరాత్రి విషయంలో మాత్రం ఇది భిన్నంగా కనిపిస్తుంది. శివరాత్రి రోజున రాత్రిపూటే శివపూజ జరుగుతుంది. త్రిమూర్తులలో మూడోవాడు శివుడు. బ్రహ్మ సృష్టికర్త. విష్ణువు సంరక్షకుడు. శివుడు లయకారకుడు. ఇలా శివ ఆరాధన రాత్రిపూట జరగడానికి ఓ కారణం కూడా ఉంది.

ఉపవాసం రోజు ఏం చేయాలి

Maha Shivaratri 2021 Fasting: What Can You Eat Details in Telugu - Sakshi

మహా శివరాత్రి పర్వదినం నాడు భక్తులు ఉపవాసం, జాగరణ చేస్తుంటారు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ‘ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను’ అని సంకల్పం చెప్పుకోవాలి. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతునివైపు మనసును తిప్పడం కష్టం. ఉపవాసం ఉండేవారు ఆరోగ్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటించడం మంచిది. దీని కోసం ఏం చేయాలనే దాని గురించి వైద్య నిపుణులు పలు సూచనలు ఇచ్చారు.

ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక…


► రోజులో 6 సార్లు ఒక్కోసారి ఒక్కో సలాడ్ కప్పు పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.

► పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువ. బొప్పాయిలో విటమిన్లు అధికం. అందుకని పుచ్చకాయ, బొప్పాయి సలాడ్ తీసుకోవాలి.

► పచ్చికొబ్బరి కోరి సలాడ్‌లో కలిపి తీసుకోవచ్చు. వీటికి కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి యాడ్ చేసుకోవచ్చు.

► గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే పోషకాలు సమృద్ధిగా శరీరానికి అందుతాయి.

► ఆరుసార్లు తీసుకుంటే మంచిది. ఆకలి వేస్తున్న ఇదీ ఉండదు. ఆరోగ్యంపై దెబ్బ పడదు.

►పాలు ఇష్టపడని వారు పలచటి మజ్జిగ తీసుకోవచ్చు. కండరాలు బలహీనం కాకుండా ఉంటాయి.

► జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే తగినంత శక్తి లభిస్తుంది.

► పూజలలో పూర్తి శ్రద్ధ పెట్టాలంటే శరీర స్థితిని కూడా గమనించుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.

పూర్వం ఓసారి ప్రళయం వచ్చినప్పుడు అంతా కటికచీకటిగా మారిపోయింది. ఆ సమయంలో లోక కల్యాణం కోసం పార్వతీదేవి శివుడిని గురించి తపస్సు చేసింది. ఆనాటి పార్వతి తపస్సు మెచ్చిన శివుడు ఆ చీకటిని పోగొట్టి మళ్లీ మామూలుగా రాత్రి, పగలు ఏర్పడేలా చేశాడు. దాంతో జీవులన్నీ మళ్లీ ఆనందించాయి. తాను చేసినట్లుగా అంత రాత్రివేళ శివుడిని గురించి పూజలు చేసినవారికి సర్వసుఖాలు కలిగేలా అనుగ్రహించమని పార్వతీదేవి శివుడిని ప్రార్థించింది. శివుడు అందుకు అంగీకరించాడు. పార్వతి చేసిన శివపూజకు గుర్తుగా ఆనాటి నుంచి మహాశివరాత్రి పూజా పర్వదినం ఏర్పడింది.

ఈశాన సంహిత ప్రకారం శివుడు ఓసారి అర్థరాత్రి సమయంలో తేజోలింగంగా ఆవిర్భవించాడు. అదే లింగోద్భవకాలం. అలా పరమశివుడు లింగాకారంలో పుట్టినరోజు కావడంచేత శివుడికి ఇష్టమైన ఆ రోజున శివపూజ జరపడం మంచిదని శైవం చెబుతోంది. వినాయక చవితి, శ్రీరామనవమి లాంటి పండుగలలో దేవుళ్లను పగటిపూట పూజిస్తారు. శివరాత్రినాడు శివుడిని రాత్రిపూట మాత్రమే పూజించడం, మిగిలిన పండుగలలా పంచభక్ష్య పరమాన్నాలతో కాక ఉపవాస దీక్షతో శివరాత్రి పండుగను జరుపుకోవడం ఓ విశేషం.

శివుడు అభిషేక ప్రియుడు. అలాగే బిల్వదళ ప్రియుడు. అందుకే అభిషేకాలు, బిల్వార్చనలను శివరాత్రినాడు విధిగా చేస్తుంటారు. తెలిసైనా, తెలియకైనా కొన్ని నీళ్ళు శివలింగం మీద పోసి మరికొన్ని మారేడు దళాలు ఆ శివలింగంమీద పెడితే బోళాశంకరుడు పరవశించి అలా చేసినవారిని అనుగ్రహించిన కథలు ఎన్నెన్నో మన పురాణాల్లో కనిపిస్తున్నాయి.

Happy Sankranti 2021

Sankranti Celebrations At Village - Sakshi

సంక్రాంతి అంటే మూడు పండుగలు. అటు భోగి, ఇటు కనుమ, నడుమ సంక్రాంతి. గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, రంగవల్లులు మనకు తెలిసిన సంక్రాంతి. పట్టణంలో ఉండేవారికి తెలియని సంస్కృతులు, సంప్రదాయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. నిన్న భోగి ముగిసింది. నిన్నటి కొనసాగింపుగా, నేడూ సాగి, రేపటికి పూర్తయ్యే ఈ సంరంభాలు పల్లెల్లో ఎలా జరుగుతాయో తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది. 

భోగి రోజు ఇంటి పెద్ద కొడుకు నిద్రలేచి చిమ్మచీకట్లోనే టార్చిలైటు సాయంతో పొలానికి వెళ్లి గరిక, గుమ్మడి ఆకులు, పువ్వులు తీసుకొస్తాడు. ఇంటిల్లపాదీ తెలవారక ముందే స్నానం చేసి భోగి మంటలో నుంచి నెయ్యిదీపం వెలిగించుకుని నట్టింట పెడతారు. మరో నెయ్యి దీపం నివాసం ముఖద్వారం ముందు ఈశాన్య మూల ఉంచుతారు. అక్కడే గోమూత్రం చల్లి, గోవుపేడతో నాలుగు చిన్న ముద్దలుగా చేసి పసుపు, కుంకుమ పెట్టి దానిపై గుమ్మడిపువ్వులు, గరిక ఉంచుతారు. ఆ తరువాత గుమ్మడి ఆకుల్లో బెల్లం లేదా చక్కెర పెట్టి ప్రత్యేక పూజచేసి పెద్దలను పండుగకు ఆహ్వానిస్తారు. ఇదంతా భోగి నాడు నిన్న జరిగే ఉంటుంది. నేడిక (సంక్రాంతికి) నివాసంలో ఉన్న మహిళలంతా  వివిధ రకాల పిండి వంటకాలు తయారు చెయ్యటానికి సిద్దమవుతారు. 

ఇంటి ముందు పొయ్యి
పిండి వంటల కోసం ఇంటి ముందు పొయ్యి తవ్వుతారు. అక్కడ ఒకటిన్నర అడుగు పొడవు, లోతు పొయ్యి తవ్వుతారు. ఆ పొయ్యి చుట్టూ గోమూత్రం చల్లి ఎర్రమట్టి, ముగ్గుపిండితో ముగ్గువేస్తారు. అందులో వరిపొట్టు, ఎండబెట్టిన గోవుపేడ పిడకలను ఉంచి కర్పూరం వెలిగిస్తారు. ఆ తరువాత ఆ పొయ్యి చుట్టూ మట్టితో తయారుచేసిన ముద్దలను ఉంచి వాటిపై కొత్తగా తయారు చేయించిన మూడు మట్టి కుండలను ఉంచుతారు. అప్పటికే ఆ కుండలకు పల్చగా సున్నం పూసి దారంతో పసుపుకొమ్ము కడతారు. అనంతరం పొయ్యిలో కర్పూరం వెలిగించి మామిడి, వేప కర్రలతో మంటపెడతారు. మూడు మట్టికుండల్లో మొదటగా పాలు పోస్తారు. అవి బాగా వేడెక్కి పొంగుతుండగా తూర్పువైపుగా కొబ్బరి మట్టతో తయారుచేసి ఉంచుకున్న గరిటతో ‘పచ్చా పొంగళ్లు… పాల పొంగళ్లు..’ అంటూ మూడు పర్యాయాలు పాల పొంగును కిందకు తోస్తారు. అనంతరం బియ్యం వేసి వంట సిద్దం చేస్తారు. ఒక కుండలో పెద్దలకు, మరో కుండలో సూర్య  భగవానునికి వంట చేస్తారు. ఇంకో కుండలో గుమ్మడికాయ కూర, ఆ తరువాత మిగిలిన వంటకాలు అదే పొయ్యిపై తయారు చేస్తారు. ఈ వంటకాలన్నిటినీ వరిగడ్డితో తయారుచేసిన కుదురుపై ఉంచుతారు.

దేవునికి మొక్కులు
పిండి వంటలన్నీ తయారు చేసిన అనంతరం మూడు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మొదటగా ఇంటి ముఖద్వారం వద్ద ఐదు గుమ్మడి ఆకుల్లో పిండివంటలు, గుమ్మడికాయ కూర, బెల్లం కొద్దికొద్దిగా ఉంచి కొబ్బరికాయ కొట్టి పెద్దలకు మొక్కుతారు. ఆ తరువాత సూర్యుడు కనిపించే ప్రాంతానికి (ఇంటి బయట) నివాసంలో ఉన్న నెయ్యిదీపాన్ని, ఐదుగుమ్మడి ఆకుల్లో ఉంచిన పండివంటలను ఒక తట్టలో తీసుకెళ్తారు. అక్కడ సూర్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజ పూర్తయ్యాక నేతి దీపం ఆరకుండా  ఇంటికి తీసుకొస్తారు. కనుమ పండగ నాడు పశువులు ఉన్న వారు వాటి కొమ్ములకు రంగులు వేసి గజ్జలు, గంటలు కట్టి ముస్తాబు చేస్తారు. సాయంత్రం పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

బక్రీద్

త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. ఈద్ అల్ అద్హా అని పిలిచే బక్రీద్ ముందు రోజు.. ముస్లింలు మరణించిన తమ కుటుంబసభ్యుల సమాధుల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలను ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వారు స్వర్గం నుంచి వాటిని స్వీకరిస్తారని నమ్ముతారు. రంజాన్‌లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా అనే ధార్మిక ప్రసంగంతో ప్రారంభిస్తారు. సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఖుర్బానీ పేరిట జంతువులను బలిస్తారు. ఖుర్బానీ అంటే బలిదానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలున్నాయి. ఖుర్బానీ ఇవ్వడానికి హజరత్ ఇబ్రహీం అనే ప్రవక్త త్యాగమే కారణమని భావిస్తారు.

ఖురాన్ ప్రకారం.. అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. మక్కా పట్టణాన్ని ఆయనే నిర్మించి నివాస యోగ్యంగా మార్చారు. అల్లాను ఆరాధించడం కోసం ప్రార్థనా మందిరం ‘కాబా’ను నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరొందుతారు. ఇబ్రహీం దంపతులకు చాలా కాలం సంతానం కలగదు. లేకలేక పుట్టిన కొడుక్కి ఇస్మాయిల్‌ అని పేరు పెట్టారు. ఇస్మాయిల్ మెడను కత్తితో కోస్తున్నట్టు ఓ రోజు ఇబ్రహీంకు కల వస్తుంది. అల్లా ఖుర్భానీ కోరుతున్నాడమోనని భావించి ఒంటెను బలిస్తారు. కానీ మళ్లీ అదే కల వస్తుంది.

దీంతో అల్లాహ్ తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నాడని ఇబ్రహీం భావిస్తారు. ఇదే విషయాన్ని తన కుమారుడికి చెప్పగా.. అల్లా కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమని చెబుతాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహ్‌కు ఇబ్రహీం సిద్ధపడగా.. ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్ ప్రాణ త్యాగానికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కోరతాడు. అప్పటి నుంచే బక్రీద్ రోజున ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా మారిందని ముస్లింలు నమ్ముతారు.

బక్రీద్ రోజున మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ సందర్భంగా ఖుర్బానీ ఇస్తారు.

ముస్లిం క్యాలెండర్ చంద్రుడి గమనం ఆధారంగా సాగుతుంది. ముస్లిం క్యాలెండర్‌లోని చివరి మాసమైన ధు అల్-హిజాహ్ పదో రోజున ఈద్ అల్ అద్హాను జరుపుకొంటారు. అదే సమయంలో హజ్ యాత్ర కూడా జరుగుతుంది. ఈ ఏడాది బక్రీద్ ఆగష్టు 12న వచ్చింది. బక్రీద్ సందర్భంగా మటన్ బిర్యానీ, మటన్ కుర్మా, మటన్ కీమా, షీర్ కుర్మా, కీర్ లాంటి వంటకాలను తయారు చేస్తారు.

వరలక్ష్మీ వ్రతం

వరలక్ష్మీ వ్రతం

భక్తితో వేడుకుంటే కోరిన వరాలను ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మీ దేవి. శ్రీమహావిష్ణువు దేవేరి లక్ష్మీదేవి అష్టావతారాలలో వరలక్ష్మీ ఒకరు. ఆ వరలక్ష్మీ దేవి పేరున ఉన్న వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.

పూజా విధానం

శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :-
పసుపు …………….. 100 grms
కుంకుమ …………….100 grms
గంధం ……………….. 1box
విడిపూలు……………. 1/2 kg
పూల మాలలు ……….. 6
తమలపాకులు………… 30
వక్కలు………………… 100 grms
ఖర్జూరములు…………..50 grms
అగర్బత్తి ………………..1 pack
కర్పూరము……………..50 grms
చిల్లర పైసలు ………….. Rs. 30/- ( 1Rs coins )
తెల్ల టవల్ ……………..1
బ్లౌస్ పీసులు ………….. 2
మామిడి ఆకులు…………
అరటిపండ్లు ……………. 1
ఇతర రకాల పండ్లు …….. ఐదు రకాలు
అమ్మవారి ఫోటోల ………………….
కలశము ……………….. 1
కొబ్బరి కాయలు ………… 3
తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం 2…………
స్వీట్లు …………………………
బియ్యం 2 kg
కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 ML

పూజా సామాగ్రి :-

దీపాలు ….
గంట
హారతి ప్లేటు
స్పూన్స్
ట్రేలు
నూనె
వత్తులు
అగ్గిపెట్టె
గ్లాసులు
బౌల్స్

శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చు.వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. “శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే” శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతోపాటు, లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి.

వ్రత విధానం :-
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.

కావలసినవి :-
పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి.

తోరం ఎలా తయారుచేసుకోవాలి :-
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటేఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.

గణపతి పూజ :-
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥
గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణికాయ నమః,
ఓంలంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః,
ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్!!

నీటిని నివేదన చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి). ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి)ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామినీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి!అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి. అంభి

కలశపూజ :-
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ ఃస్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాఃగంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥

అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన, పూజాద్రవ్యాలపైన, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.

అధాంగపూజ:-
పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.

చంచలాయై నమః – పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః – కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమః – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి.

(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :-
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓంలోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓంలోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓంపద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓంపద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓంచంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓంఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓంవరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓంహిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓంమంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓంభువనేశ్వర్యై నమః

తోరపూజ :-
తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.

కమలాయైనమః – ప్రథమగ్రంథిం పూజయామి,
రమాయైనమః – ద్వితీయ గ్రంథింపూజయామి,
లోకమాత్రేనమః – తృతీయ గ్రంథింపూజయామి,
విశ్వజనన్యైనమః – చతుర్థగ్రంథింపూజయామి,
మహాలక్ష్మ్యై నమః – పంచమగ్రంథిం పూజయామి,
క్షీరాబ్ది తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః – సప్తమగ్రంథిం పూజయామి,
చంద్రసోదర్యైనమః – అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః – నవమగ్రంథిం పూజయామి.
ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమ

వ్రత కథా ప్రారంభం :-
శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా!స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.శ్రద్ధగా వినండి.

పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి.ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలుసర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.

వరలక్ష్మీ సాక్షాత్కారం :-
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణపౌర్ణమి నాటికిముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. “హే జననీ!నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగామన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’’ అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.

అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతితన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవినిసంకల్ప విధులతో

సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !!
అంటూ ఆహ్వానించిప్రతిష్టించింది.

అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలుఘల్లుఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచితకంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకువరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతోతమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.

వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా… శివుడుపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకువివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడాసకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయనిసూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపైవేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీతీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి.అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి.రాత్రి ఉపవాసం ఉండాలి.

భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడంతప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది….
సర్వేజనాసుఖినోభవతుః

నాగ పంచమి

Special Story About Nagpanchami By DVR In Family - Sakshi

శ్రావణ శుద్ధ పంచమిని ‘నాగ పంచమి’గా కొందరు, ‘గరుడ పంచమి’ గా మరికొందరూ జరుపుకుంటారు. మనం పూజించే నారాయణుడి శయ్య అయిన శేషుడి పేరు మీదుగా జరుపుకునే పర్వమే ‘నాగ పంచమి’. కార్తీకమాసంలో వచ్చే ‘నాగులచవితి’ మాదిరిగానే ‘నాగ పంచమి’ నాడు కూడా నాగదేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు.

ఎలా జరుపుకోవాలంటే…
నాగపంచమి రోజున ముందుగా ఇల్లూ వాకిలీ శుభ్రం చేసుకుని తలంటుకుని, నిత్యపూజ పూర్తి చేయాలి. ఆపైన దగ్గర్లో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి నీళ్ళు జల్లి ముగ్గు వేసి, పసుపు, కుంకుమ, గంధ, పుష్ప, అక్షతలతో పూజించి, దీపం, అగరొత్తులు వెలిగించి, అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళ ఈ అయిదు నాగ దేవతలనూ మనసులో స్మరించుకుని, భక్తిగా నమస్కరించాలి. పాలు, పండ్లు, పంచామృతం, నువ్వులు, కొర్రలు, పంచామృతం మొదలైన వాటిని నాగ దేవతకు నైవేద్యంగా సమర్పించాలి. నాగపంచమి పూజ చేసేవారు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు. అంతకంటే ముందు ఐదుగురు అతిథులను ఇంటికి ఆహ్వానించి, ప్రసాదం ఇచ్చి, విందు భోజనం పెడతారు. శక్తి లేనివారు కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టి, ఆ తర్వాతే వారు తింటారు. నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది.

కాలసర్ప దోష నివారణ
కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగదేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు, నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ జరిగి, సుఖసంతోషాలు అనుభూతికి వస్తాయి.

గరుడ పంచమి
నాగపంచమిలాగే గరుడ పంచమి వ్రతాన్ని కూడా కొందరు చేస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనంద దాయకంగా ఉండాలని, స్త్రీలు తమకు పుట్టిన పిల్లలు గరుత్మంతునిలా బలంగా చురుగ్గా ఉండాలని కోరుతూ గరుడ పంచమి పూజ చేస్తారు. తిరుమలలో స్వామివారు గరుడ పంచమినాడు మాడవీధులలో గరుడ వాహనంపై ఊరేగుతారు, ఈ వ్రతాన్ని తమకు పెద్దల నుంచి అనూచానంగా వస్తున్న విధానం ప్రకారం చేయడం సంప్రదాయం. ఆనవాయితీగా వస్తున్న వారు మాత్రమే చేయాలి. లేనివారు స్నానం చేసి శుచిగా ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్‌ అనే గరుడ గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే మంచిది. 

క్రైస్తవ మతం

jesus christ

క్రైస్తవమతానికి ఆద్యుడు జీసస్ క్రైస్త్. క్రీస్తుశకం 1వ శతాబ్దంలో ఏసుక్రీస్తు తాను ఎన్నుకున్న పన్నెండు మంది శిష్యబృందానికి చేసిన బోధనల ఆధారంగా వెలసిన మతం క్రైస్తవ మతం. ప్రపంచం మొత్తం మీద సుమారు వందకోట్ల మందికి పైగా ఈ మతాన్ని అనుసరిస్తున్నారు.

దాదాపు ఒకటవ శతాబ్ధంనుండి ఈ మత ప్రభావం ప్రభుత్వాల పైన, సృజనాత్మక కళలపైనా, మేధావులపైనా ప్రభావం చూపించింది. సర్వమానవ సౌభ్రాతృత్వం, కరుణ, ప్రేమ వంటి ఉదాత్త భావాలు ఈ మతానికి ప్రాతిపదికలు. ఈ మతానికి పవిత్ర గ్రంధం బైబిల్. క్రిస్టమస్ మరియు గుడ్ ఫ్రైడే వీరికి ముఖ్యమైన పండుగలు. భారతదేశంలోని మెదక్ పట్టణంలో ఉన్న వెసీలియన్ చర్చ్ చాలా పెద్దది. రోమ్ నగరంలోని సెంట్ పీటర్స్ చర్చ్ ప్రపంచలోనే పేరు గాంచినది. రోమన్ కేథలిక్ ల పుణ్యక్షేత్రమైన వాటికన్ సిటీలోని చర్చ్ కి పోప్ పీఠాధిపతి.

క్రైస్తవులు బైబిల్ లోని న్యూటెస్ట్ మెంట్ ను అనుసరిస్తారు. ప్రొటెస్టంట్స్, బాప్టిస్ట్, పెంతేకోస్త్, ఆర్ధడాక్స్ చర్చ్, సెవన్త్ డే ఎడ్వన్టింటిస్ట్ చర్చ్ మొదలగునవి క్రైస్తవ మతంలోని ప్రధానమైన శాఖలు.

అక్షయ తృతీయ

అక్షయమైన సౌభాగ్యాన్ని, విజయాలను, దైవకటాక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి వైశాఖ శుద్ధ తదియను ‘‘అక్షయతృతీయ’’గా పరిగణిస్తారు. కృతయుగం అక్షయతృతీయరోజునే ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. నాలుగు యుగాలలో మొదటిది కృతయుగంలో (సత్యయుగం అని కూడా పిలుస్తారు) ప్రతిదీ అక్షయంగా ఉండేదని చెబుతారు. పరశురామావతారం ప్రారంభమైంది ఇదే రోజంటారు. కుబేరుడికి శంఖనిథి, పద్మనిథి అనంతమైన సిరిసంపదలు లభించినది ఇదే రోజంటారు. కుచేలుడు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడుని కరుణించిన రోజుకూడా ఇదే నంటారు. క్షీరసాగరమథనం తర్వాత లక్ష్మీదేవి మహావిష్ణువును వరించిన రోజుకూడా ఇదే నంటారు. అక్షయతృతీయ రోజునే విశాఖపట్నంలోని సుప్రసిద్ధ దేవాలయం సింహాచలం శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూపదర్శనం జరుగుతుంది.

అక్షయతృతీయ నాడు రాహుకాలాలు, వ్యర్జ్యాలు ఉండవు ప్రతి నిమిషం కూడా శుభమూహూర్తమే. ఉత్తరాదిలో గృహప్రవేశాలు, వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలు, అక్షరాభ్యాసాలు ఈరోజే పెట్టుకుంటారు.

పురాణపరంగా….
మత్స్యపురాణంలో పరమేశ్వరుడు పార్వతీ దేవికి అక్షయతృతీయ వ్రత ప్రాశస్త్యాన్ని వివరిస్తాడు. అక్షయుడైన విష్ణుమూర్తే ఈ అక్షయతృతీయకు అథిపతి. సూర్యోదయానికి ముందే లేచి, తలంటుస్నానం చేసి భక్తితో స్వామిని పూజించి, అక్షతలు చల్లుకొని కొత్తబిందెలో పానకాలు పంచుతారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం చేసినా ఫలం అక్షయంగా ఉంటుందంటారు. ఇదేరోజు గోసేవ చేస్తారు, లక్ష్మీదేవిని పూజిస్తారు,పితృదేవతలను ఆరాధిస్తారు.

స్తోమత ఉంటే నగనట్రా కొనవచ్చు కానీ అప్పుచేసి కొనకూడదు. అప్పుకూడా అక్షయమవుతుంది. ఈ రోజు ఏది కొన్నాకూడా మంచిదేనంటారు. ఏ పని చేసినా మంచిదే. వేసవికాలం కనుక మజ్జిగ, మంచినీరు ఇవ్వవచ్చు. యాచకులకు చెప్పులు, గొడుగులు ఇవ్వవచ్చు.

అట్లతద్దె

ఆడపిల్ల ఆనందంగా ఊయాల ఊగుతుంటే నోరంతా లక్కపిడతలా తాంబూలం వలన ఎర్రగా కన్పిస్తుంటే, కొత్తగా కుట్టించుకున్న పరికిణీ, కొత్త బంగారు కుప్పెల జడ నిలువుగా వేలాడుతుంటే, అరచేతులనిండా గోరింటాకు ఎరుపు ఇవన్నీ కలిపే చక్కని తెలుగు వారి పండుగ అట్లతద్దె. ఒకప్పటి రోజుల్లో అట్లతద్దె కుండే హడావుడీ, కోలాహం క్రమంగా కనుమరుగైపోతున్నాయి. కనీసం అట్లతద్దెలోని మర్మమేమిటో తెలుసుకుందాం ! .

అట్లతద్దె ఆశ్వయుజమాసం (సాధారణంగా అక్టోబర్‌లో) పూర్ణిమ దాటిన 3వ రోజున వస్తుంది.ఈ రోజున త్లెవారుజామున కన్నెపిల్లలంతా బాగా విశాలమైన ప్రాంగణమున్న ఇంటికి చేరతారు. ఎవరి చేతికి గోరింటాకు బాగా పండిందో ఒకరి అరచేతినొకరు చూపించుకుని మురిసిపోతారు.

అక్కడవున్న వృద్ధురాలు వారందరిలో ఎవరిచేయి బాగా పండిందో చూస్తూ నీకు మంచి మొగుడొస్తాడులే! అనగానే ఆ పిల్ల బుగ్గల నిండుగా సిగ్గుతో ప్రహించే రక్తం కారణంగా ఎర్రబారి మరింత మనోహరంగా కన్పిస్తుంది. అక్కడకు వచ్చిన పిల్లతా గుండ్రని ఆకారంలో నిలబడి చప్పట్లు చరుస్తూ .
అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌.
ముద్దపప్పోయ్‌ మూడట్లోయ్‌ .
చప్పట్లోయ్‌ తాళాలోయ్‌.
దేవుడిగుళ్ళో మేళాలోయ్‌.
పప్పూ బెల్లం దేవుడికోయ్‌.
పాలూ నెయ్యీ పాపాయికోయ్‌.
అంటూ పాడుతూంటే ఇంకా తయారుకాని పిల్లలు కూడా ఈ పాటవిని తయారై ఈ సంబరానికొస్తారు. .
వైద్య రహస్యం : మొదటగా ప్రారంభమయ్యేది చెమ్మచెక్కపాట. ఇద్దరిద్దరు ఆడపిల్లలు ఎదురెదురుగా నిబడి తమ చేతులను చాచగలిగినంత వెడల్పుగా వెనుకకు చాపి ముందుకు తెచ్చి తమ అరచేతుతో ఎదుటి వారి అరచేతులను బలంగా చరుస్తారు.

ఇలా చేతులను వెనక్కు చాపడం మళ్లీ మందుకు సకాలంలో తేవడం, దీనికోసం నేలని బలంగా పట్టుకోవటం అంతా గొప్పవ్యాయామం. ఇదంతా వాయునాళం శ్వాసకోసం అనే వాటిలో తేడాగాని ఉన్నట్లయితే పసిగట్టగల వైద్యపరీక్షా విధానంగా భావించవచ్చు. చెమ్మచెక్క పాటలను గమనిద్దాం
చెమ్మచెక్క చారడేసి మొగ్గ
అట్లుపోయంగ ఆరగించంగ
ముత్యాల చెమ్మచెక్క ముగ్గులేయంగ
రత్నాల చెమ్మచెక్క రంగులేయంగ
పగడాల చెమ్మచెక్క పందిరేయంగ
చూచి వద్దాం రండి సుబ్బారాయుడి పెండ్లి
మా వాళ్లింట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి!

తరువాత :
కాళ్ళాగజ్జీ కంకోళమ్మ వేగుచుక్కా వెలగా మొగ్గా
మొగ్గాకాదు మెదుగబావీ బావీకాదు బచ్చలిపండూ
పండూకాదు నిమ్మవారీ, వారీకాదూ వావింటాకూ
ఆకూకాదు గుమ్మడిబెరడూ, కాలుతీసి గట్టునపెట్టు
చర్మవ్యాధి, గజ్జీకాని వస్తే కంకోళపు తీగని నూరి ఆ ముద్దని పెట్టాలట. తగ్గకపోతే వెలగమెగ్గని నూరి కట్టాలట దానికీ కుదరని పక్షంలో మోదుగాకు రసం, ఆ మీదట వావిలాకు రసం, చిట్టచివరకు గుమ్మడి గుజ్జు వాడితే గజ్జిపట్టిన కాలి గట్టునపెట్టే అవకాశం (వ్యాధి తగ్గటం) జరుగుతుందట. ఆ పాటలోని గూడార్థమిదే.
చిన్న పిల్లలు ఎత్తులెక్కి దూకటం, దెబ్బు తగిలించుకోవటం చేస్తుంటారు.
కొండమీద గుండు జారి కొక్కిరాయి కాలువిరిగే
వేపాకు పసుపూ వెల్లుల్లిపాయ
నూనెచుక్క బొట్టు
నూటొక్కసారీ పూయవోయ్‌
నూరీ పూటకొక్కతూరి
దెబ్బలు తగిలినపుడు పసుసు, వేపాకు, నువ్వుల నూనె బొట్టు కలిపి నూరి ఆ మిశ్రమాన్ని పూటకొకసారి పూయాలని చెపుతుందీ పాట.

ఇంకా కనుమరుగవుతున్న పాటలు, ఆటలు : గుడుగుడు కుంచం, విసురు విసురు పిండి (తిరగలిపాట) తొక్కుడుబిళ్ళు, చింతగింజలాట, ముక్కు గిల్లుడు, దూదూ పుల్ల ఇంకా ఎన్ని ఆటలు పాటలో.
ఈ పండుగలో చివరిగా వీడ్కోలు చెప్పే పాట ఒక ఎత్తు. పిల్లతా గుండ్రంగా నిబడి చప్పట్లు చరుస్తూ
ఉత్తముని పేరేమి? ఊరు పేరేమి?
సత్యవంతుని గన్న సాధ్వి పేరేమి?
ఉత్తముడు రాముడూ, ఊరు ఆయోధ్య
సత్యవంతుని గన్నతల్లి కౌసల్య.
అని పాడి వెళ్ళిపోతున్న పిల్లల నెత్తిమీద ఆశీర్వచన పూర్వకంగానూ దృష్టిదోషం తొగించేందుకు అందరికంటే వయసులో పెద్దామె చిట్టిమొట్టి కాయల్ని రెంటిని నెత్తిమీద కొట్టి రెండట్లు పెడుతుందట.
ఇలా ఆడుకున్న పిల్లలు కొన్ని సంవత్సరా తరువాత ఎక్కడైనా కలుసుకున్నపుడు ఆ మధుర స్మృతులెంత మధురంగా ఉంటాయో! ఇంతటి ప్రాధానత్య కలిగినది తెలుగు వారి సొంతమైన అట్లతద్దె పండుగ

నాగుల చవితి

nagula chaviti

మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో కథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి నాగుల చవితి కార్తీకశుద్ద చతుర్దశి నాడు దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. సంతానం లేకపోతే, పుట్టిన వారు బ్రతకక పోయినా , నాగ ప్రతిష్ట చేసి పూజించటం తెలుగునాట చాలా ప్రాంతాలలో ఆచరిస్తున్న సాంప్రదాయం . అలా నాగ మహిమతో పుట్టిన సంతానానికి, నాగలక్ష్మి, నాగేశ్వరరావు, నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు.

ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘ వెనుబాము’ అని అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో “పాము” ఆకారంలో వుంటుందని “యోగశాస్త్రం” చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ‘ సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పాలు నివంసించే పుట్టలో పాలు పోసి, పూజలు చేస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ‘ శ్రీమహావిష్ణువు” కు ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటంలోగల అంతరార్థమని చెప్తారు.

ఈ రోజున ఉదయమే ,తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజుకు పూజించి పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. నాగులచవితి సందర్భంగా పుట్ట వద్ద ” దీపావళి” నాడు మిగిలిన మతాబులు, కాకర పువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.

నాగులచవితి పాటలు కూడా మన తెలుగువారిలో ఎంతో ప్రసిద్ధం
నన్నేలు నాగన్న , నాకులమునేలు
నాకన్నవారల నా ఇంటివారల ఆప్తమిత్రులనందరిని ఏలు
పడగ తొక్కిన పగవాడనుకోకు
నడుము తొక్కిన నావాడనుకొనుము
తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము
ఇదిగో ! నూకనిచ్చెదను మూకనిమ్ము.పిల్లల మూకను నాకిమ్ము
అని పుట్టలో పాలు పోస్తూ , నూక వేసి వేడుకుంటారు .అలాగే
పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి…

అంటూ తాము పోసిన పాలు నాగేంద్రుడు తాగితే, తమ మనసులోని కోర్కెలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం.
ఆలయాలలో నాగదేవతలకు ఘనంగా పూజలు చేస్తారు. ప్రతి ఏటా నాగులచవితి రోజున తిరుమలలో కోనేటిరాయుడైన శ్రీవారిని పెద్దశేష వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. అలాగే గురువారం వాహన సేవకు ఆరోజంతా ఉపవాసముండి మరునాడు పారాయణం చేసి భుజిస్తారు. పాముపడగ నీడ పడితే పశువుల కాపరి కూడా ప్రభువు అవుతాడంటారు ! నేటి రోజులలో పాములకు పుట్టలో పాలు పోయడం వల్ల వాటి ప్రాణాలకు హాని అని, అందుకని వాటి సహజ నివాసములలో పాలూ, గుడ్లూ వెయ్యవద్దని చెప్తున్నారు. దానికి బదులు ఇళ్ళలోనే బియ్యం పిండితో నాగ మూర్తులను చేసి, వాటికి శాస్త్రోక్తంగా అన్నీ సమర్పించవచ్చు.

భారతీయ నాగరికత, సంప్రదాయాలు చాలా గొప్పవి. మానవ మనుగడకు జీవనాధరమైనది ప్రకృతి కనుక ప్రకృతి దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్లను, పుట్టలను , నదులను, పర్వతాలను – ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా భావిస్తూ పూజిస్తూ వస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే … అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి లోపల నివసిస్తూ పంటలను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతులకు పంటనష్టం కలగకుండా చేస్తాయి.. అలా ప్రకృతిపరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. నాగుపాముల సహజ నివాసాలను ధ్వంసం చేయకుండా ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుకుంటూ అన్నిజంతువులను బ్రతకనిస్తే అంతకన్నా గొప్ప పూజ ఇంకొకటి ఉండదు.

ఏరువాక పౌర్ణిమ

ఏరువాక అంటే రైతులు పొలం పనులు ప్రారంభించే సమయం. పొలం దున్నడానికి ఆరంభమని చెబుతారు. వర్షరుతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమనాడు రైతులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి, ఎడ్లను కట్టేకాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించడం పరిపాటి. వీధులలో ఊరేగింపు నిర్వహిస్తారు. పోటా పోటీగా ఎద్దులతో ఏరువాక తాడును తెంచి ఉత్సవాలు జరుపుకుంటారు. ఏరువాక పౌర్ణిమ సాధారణంగా జూన్ మాసంలో వస్తుంది.

ఏరువాక పౌర్ణమి.అంటేనే రైతులకు శుభప్రదమైన రోజు. తమ కష్టాలు తీరాలని, పంటలు బాగా పండాలని భూమి తల్లికి పూజలు చేసుకొనే రోజు ఇది. తొలకరి జల్లులు కురిసిన తరుణంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు.

విశేషాలు ఈ సందర్భంగా రైతులు ఉదయం గ్రామ సమీపంలో ఉన్న చెరువులు, కుంటల్లో ఎడ్లకు స్నానాలు చేయించి ఎద్దులకు వివిధములైన వస్తువులు తినిపిస్తారు. కొందరు కోడిగుడ్లను తాగిస్తారు. ఏరువాక పౌర్ణమి నుంచి వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. దీంతో పని ఒత్తిడికి గురయ్యే ఎద్దులకు బలం కోసం కోడి గుడ్లు మంచివని వారి అభిప్రాయం. వర్షాకాలంలో ఎద్దులకు ఎలాంటి రోగాలూ రాకుండా. కొంతమంది వాటికి పసుపు, ఉల్లిపాయ, వాము, కోడిగుడ్డు తినిపించి సారాయి తాగిస్తారు. ఇలా చేయడం ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూమి తల్లికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎద్దులను రంగులు, రకరకాల బట్టలతో అంకరించి డప్పులు, మేళతాళాలతో ఊరేగిస్తారు.

ఏరువాక సందర్భంగా గ్రామాలలో జాతర వాతావరణం నెలకొంటుంది. ఆషాఢ మాసం సందర్భంగా ఆడపడుచులు పుట్టింటికి రావడంతో రకరకాల పిండీవంటలు చేస్తారు. ముఖ్యంగా ఎడ్ల పందాల హోరు కనిపిస్తుంది.. సాయంకాలం గ్రామంలోని రైతులంతా మంగళవాద్యాలతో ఊరేగింపుగా పొలాలకు వెళ్లి దుక్కి ప్రారంభిస్తారు. ఊరి వాకిట గోగునారతో చేసిన తోరణం కడతారు. దాన్ని చెర్నాకోలలతో కొట్టి ఎవరికి దొరికిన పీచును వారు తీసుకుపోతారు. ఇది పశువులకు మేలు చేస్తుందని నమ్మకం. ఐరోపా దేశాల్లోని మేపోవ్ ఇటువంటి పండుగే.

భారతదేశ పురాతనమైన ఈ సాంప్రదాయం ప్రస్తుతం కనుమరుగవుతోంది. కొన్ని ప్రాంతాలలో రైతులు కూడా ఈ సాంప్రదాయాన్ని పాటించటంలేదు.

వినాయక వ్రతం

వినాయక వ్రతాని సిద్ధం చేసుకోవలసినవి
పసుపు, కుంకుమ, అక్షతలకి బియ్యం, జేగంట, 2 ఆచమన పాత్రలు, 2 ఉద్ధరిణలు, అగరుబత్తీలు, హారతి కర్పూరం బిళ్ళలు, 2 కొబ్బరికాయలు (వాటిని కొట్టేందుకూ, ఆ నీళ్లు పట్టేందుకూ ఏర్పాట్లుచేసుకోవాలి), అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు, లోతు ఉండి వెడల్పుగా ఉన్న పళ్ళాలు (నైవేద్యానికీ, పత్రికీ) 2, దీపారాధన వస్తువులు, యథోచితంగా పత్రి (మొత్తం నీటితో కడిగి ఏ జాతికి ఆ జాతిని విడివిడిగా పెట్టుకోవాలి), చేయి తుడుచుకోవడానికి ఒక వస్త్రం.

పత్తి (దూది)ని సన్నని దారంగా చేసి మధ్యమధ్యలో పసుపు కుంకుమలను అద్దిన యజ్ఞోపవీతాలు 2 చేసుకోవాలి. రూపాయిబిళ్ళలంతటి పరిమాణంలో దూదిని తీసుకుని తడిపి, నీటిని ఒత్తి కుంకుమని అద్దిన రక్తవస్త్రాలు 2, అగరుబత్తి పుల్లలకు దూదిని చుట్టి నేతిలో/నూనెలో ముంచి పొడిగా ఉండేలా ఒత్తిన ‘కైవత్తులు’ 2 తయారుచేయాలి.

5 తమలపాకుల్లో రెండు వక్కలూ, 2 అరటిపళ్ళూ చొప్పున పెట్టి దారంతో చుట్టిన తాంబూలాలు 6 సిద్ధం చేసుకోవాలి. ఒక పాత్రలో పంచామృతం (చిన్న చెంచా తేనె, అంతే పెరుగు (ఆవు పెరుగు శ్రేష్ఠం), అంతే పాలు, అంతే పంచదార, అంతే నెయ్యి కలిపి) సిద్ధం చేసుకోవాలి.

వినాయకుడికి ఉండ్రాళ్లన్నా, తెల్ల నువ్వులు కలిపిచేసిన మోదకాలన్నా చాలాఇష్టం. ఇవికాక, అప్పాలు, లడ్డూలు, పరమాన్నం, కుడుములు, అటుకులు కూడా ఇష్టమే. యథాశక్తి ఎవరికి కలిగింది వాళ్లు పెట్టొచ్చు.

వినాయక చవితినాడు వేకువజామునే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని ఇంట్లో అందరూ తలంటుస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి. దేవుడి గది ఉంటే దాన్ని లేదా ఈశాన్యమూల స్థలాన్ని శుద్ధిచేసి అలకాలి. బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు పెట్టాలి. దేవుణ్ణి ఉంచడానికి ఒక పీట వేయాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, ముగ్గు వేయాలి. దానిపై గణపతి విగ్రహాన్ని ఉంచాలి.

పూజచేసేవాళ్లు బొట్టు పెట్టుకోవాలి. కూర్చునేందుకు మరోపీట తీసుకోవాలి. దానిపై నూతనవస్త్రం (పంచె లేదా తువ్వాలు) పరిచి, అక్షతలు వేయాలి. మూడు ఆకులు (తమలపాకు కొనలు వేళ్లను తాకాలి), రెండు వక్కలు, రెండు పళ్లు, దక్షిణ పట్టుకోవాలి.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే ।।
అయం ముహూర్తః సుముహూర్తోస్తు…
తదేవలగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ
లక్ష్మీపతేతేంఘ్రియుగం స్మరామి
యశ్శివోనామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయో స్సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళమ్‌
అని చదువుతూ పీటమీద తూర్పుముఖంగా కూర్చోవాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారుచేసి, కుంకుమబొట్టు పెట్టాలి.

ప్రార్ధన
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః స్కంద పూర్వజః
అని చదివి పసుపు గణపతి దగ్గర తాంబూలాలు పెట్టాలి. బొటనవేలు, ఉంగరం వేలు, మధ్యవేళ్లతో అక్షతలు తీసుకుని పసుపు గణపతిమీద వేసి నమస్కారం చేయాలి. సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు… అని నమస్కారం చేయాలి.

ఆచమనం
ఆచమ్యా ఓం కేశవాయస్వాహా (స్త్రీలైతే కేశవాయనమః అనాలి), ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా – అని చదువుతూ ఉద్ధరిణతో కుడిఅరచేతిలోకి మినపగింజ మునిగేంత నీటిని తీసుకుని, చప్పుడు కాకుండా కిందిపెదవితో స్వీకరించాలి. ఉద్ధరిణతో మరోసారి నీళ్లు తీసుకుని కుడిచేతిని కడుక్కుని చేయి తుడుచుకోవాలి. తరవాత కింది మిగతానామాలూ చదవాలి.

ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః

దీపారాధన
దీపం వెలిగించి, పూలూ అక్షతలూ వేసి నమస్కారం చేయాలి. (ఈ కింది మంత్రాలు చదువుతూ పూలూ అక్షతలూ పసుపు గణపతిమీద వేయాలి.) ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః… ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః… ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః… ఓం శచీపురంధరాభ్యాం నమః… ఓం అరుంధతీవశిష్ఠాభ్యాం నమః… ఓం సీతారామాభ్యాం నమః… సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమోనమః

భూతోచ్ఛాటన
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చదివి… అక్షతలు వాసన చూసి, భార్య ఎడమచేతి పక్కనుంచి వెనక్కు వేయాలి. మిగతావాళ్లు కుడిచేతి పక్కనుంచి వెనక్కు వేయాలి. తరవాత ప్రాణాయామం చేయాలి.

సంకల్పం
ఓం మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం, శుభేశోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య (హైదరాబాద్‌ ప్రాంతీయులు వాయవ్య ప్రదేశే అని, తిరుపతి వాళ్లు ఆగ్నేయప్రదేశే అని, ఇతర ప్రాంతాల వాళ్లు ఈశాన్య ప్రదేశే అని చదువుకోవాలి) ప్రదేశే అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తిశ్రీ వికారినామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షరుతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ ఇందువాసరే… శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్‌ శ్రీమతః …… గోత్రస్య…… నామధేయస్య (పూజ చేసేవారు గోత్రం, పేరు చెప్పుకోవాలి. పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలి) ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం, వర్షేవర్షేప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ముద్దిశ్య, వర్షేవర్షేప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (అంటూ అక్షతలూ నీళ్లూ వదలాలి).
ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే అని అక్షతలూ నీళ్లూ వదలాలి.

(కలశానికి గంధం, కుంకుమలతో బొట్టుపెట్టాలి. కలశంలో గంధం, పువ్వులు, అక్షతలు వేయాలి)
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః
మూలో తత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః
కుక్షౌతుసాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా
రుగ్వేదోథయజుర్వేదః సామవేదోహ్యధర్వణః
అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
కలశంలోని నీటిని తమలపాకుతో కలుపుతూ…
గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధిం కురు ।।
కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య దేవమాత్మానంచ సంప్రోక్ష్య
తమలపాకుతో కలశంలోని నీటిని పూజాద్రవ్యాల మీదా, దేవుడిమీదా, తమమీదా కొద్దిగా చిలకరించుకోవాలి.
ఓం శ్రీమహాగణాధిపతయే నమోనమః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తః సుముహూర్తోస్తు… అని అక్షతలు వేయాలి.
స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు అని అక్షతలు వేసి నమస్కారం చేయాలి.
పువ్వులు రెండు చేతుల్లోకీ తీసుకుని…
గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే, కవిం కవీనా ముపమశ్రవస్తమమ్‌
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్‌।।
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
ఆవాహయామి ఆసనం సమర్పయామి
నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
పాదయోః పాద్యం సమర్పయామి… హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి
ఉపచారికస్నానం… కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు కొద్దిగా గణపతిమీద చల్లాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామి
స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి, శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీగంధాన్‌ ధారయామి, శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పైః పూజయామి, శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్‌ సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి… (అగరుధూపం చూపించాలి), శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి (దీపం చూపించాలి)
ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.
నైవేద్యం
ఓం భూర్భువస్సువః తథ్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌…
సత్యం త్వర్తేన పరిషించామి… అని నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పాలి.
అమృతమస్తు… పసుపు గణపతి దగ్గర నీళ్లు వదలాలి.
అమృతోపస్తరణమసి… అని నైవేద్యంపైన నీళ్లు చల్లి
శ్రీ మహాగణాధిపతయే నమః… నారికేళ సహిత కదళీఫల సహిత గుడోపహారం నివేదయామి…అంటూ అయిదుసార్లు నైవేద్యాన్ని స్వామికి చేత్తో చూపించాలి.
ఓం ప్రాణాయస్వాహా ఓం అపానాయస్వాహా ఓం వ్యానాయస్వాహా ఓం ఉదానాయస్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యేమధ్యే పానీయం సమర్పయామి… అంటూ నీళ్లు వదలాలి.
అమృతాపిథానమసి… ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ ప్రక్షాళయామి… పాదౌ ప్రక్షాళయామి… ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి… అంటూ నీళ్లు చల్లాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః… తాంబూలం సమర్పయామి.
శ్రీ మహాగణాధిపతయే నమః… నీరాజనం సమర్పయామి. (హారతి ఇచ్చి కళ్లకు అద్దుకోవాలి)
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతిః ప్రచోదయాత్‌
శ్రీ మహాగణాధిపతయే నమః… మంత్రపుష్పం సమర్పయామి.
శ్రీ మహాగణాధిపతయే నమః… ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.
శ్రీ మహాగణాధిపతయే నమః… ఛత్రమాచ్ఛాదయామి
చామరం వీచయామి… నృత్యం దర్శయామి…
గీతామాశ్రావయామి… వాద్యం ఘోషయామి… అశ్వానారోహయామి… గజానారోహయామి… శకటానారోహయామి…
ఆందోళికానారోహయామి… అని అక్షతలు వేయాలి.
సమస్త రాజోపచార శక్త్యుపచార భక్త్యుపచార పూజాస్సమర్పయామి అని నీళ్లూ అక్షతలూ పళ్లెంలో వదలాలి.
శ్రీమహాగణపతి దేవతా స్సుప్రీతస్సుప్రసన్నోవరదో భూత్వా వరదో భవతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు
ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్త్వితి భవంతో బ్రువంతు ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు శ్రీమహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి
పసుపు గణపతి పూజాక్షతలు శిరసున ధరించాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః… గణపతిం ఉద్వాసయామి
అని పసుపు గణపతిని తూర్పువైపుకి జరపాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః… యథాస్థానం ప్రవేశయామి
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయచ… అని అక్షతలు వేసి నమస్కారం చేయాలి.
ఇక్కడికి హరిద్రా గణపతి లేదా మహాగణపతి పూజ పూర్తయింది.

వినాయక వ్రతం
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః
ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త స్సుముహూర్తోస్తు అని మట్టిగణపతి విగ్రహం దగ్గర అక్షతలు వేయాలి.
స్వామిన్‌ సర్వజగన్నాథ యావత్పూజావసానకం
తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్‌ సన్నిధిం కురు।।
స్తిరోభవ వరదోభవ ప్రసీద ప్రసీద (అని వినాయకుడి విగ్రహం దగ్గర అక్షతలూ పూలూవేసి నమస్కరించాలి)
షోడశోపచార పూజ:
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం……….. విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే।।
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం…….. పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‌।।
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం…… భక్తాభీష్టప్రదం తస్మాత్‌ ధ్యాయేత్తం విఘ్ననాయకమ్‌।।
ధ్యానం: ధ్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం…….. చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితమ్‌।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః …….. ధ్యాయామి ధ్యానం సమర్పయామి
ఆవాహనం: ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః…… ఆవాహయామి (అక్షతలు వేయాలి)
ఆసనం: ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః …….. ఆసనం సమర్పయామి (అక్షతలు లేదా పూలు వేయాలి)
అర్ఘ్యం: గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన……. గృహాణార్ఘ్యం మయాదత్తం గన్ధపుష్పాక్షతైర్యుతమ్‌
ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః ……. అర్ఘ్యం సమర్పయామి (తమలపాకుతో స్వామిపైన నీళ్లు చల్లాలి)
పాద్యం: ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః …….. పాద్యం సమర్పయామి।।
మళ్లీ కొంచెం నీటిని స్వామికి చూపించి, స్వామి పాదాల ముందుంచాలి)
ఆచమనీయం: ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః ….. ఆచమనీయం సమర్పయామి।।
(కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)
మధుపర్కం: ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః …. మధుపర్కం సమర్పయామి ।।
(తేనె, పెరుగు, నెయ్యి కలిపి సమర్పించాలి)
స్నానం: పంచామృత స్నానం సమర్పయామి ।।
(పంచామృతం స్వామి విగ్రహంపై చల్లాలి. కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని స్వామిపై చల్లాలి)
ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః …… శుద్ధోదక స్నానం సమర్పయామి।।
(కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)
వస్త్రం: ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః …….. వస్త్రయుగ్మం సమర్పయామి ।।
(నూతన వస్త్రం లేదా పత్తికి పసుపు, కుంకుమ రాసి దాన్నే వస్త్రంగా సమర్పించాలి)
యజ్ఞోపవీతం: ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః …….. యజ్ఞోపవీతం సమర్పయామి ।।
(యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి)
గంధం: ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః …….. గంధం సమర్పయామి।।
(స్వామిపై గంధం చల్లాలి)
అక్షతలు: అక్షతాన్‌ ధవళాన్‌ దివ్యాన్‌ శాలీయాం స్తండులాన్‌ శుభాన్‌
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే
ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః
అక్షతాన్‌ సమర్పయామి।। (అక్షతలు వేయాలి)
పుష్పాలు: సుగన్ధాని చ పుష్పాణి జాతీకుంద ముఖాని చ
యేకవింశతి పత్రాణి, సంగృహాణ నమోస్తుతే
ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః
పుష్పాణి పూజయామి ।।
(స్వామిని పూలతో అలంకరించాలి, పూజించాలి)
అథ ఏకవింశతి పత్ర పూజ: (ఒక్కొక్క నామం చదువుతూ పత్రాలతో స్వామిని పూజించాలి)
ఓం సుముఖాయ నమః – మాచీపత్రం పూజయామి
ఓం గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి (వాకుడు)
ఓం ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి (గరికె)
ఓం హరసూనవే నమః – దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమః – బదరీపత్రం పూజయామి (రేగు)
ఓం గుహాగ్రజాయ నమః – అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణి)
ఓం గజకర్ణాయ నమః – వటపత్రం పూజయామి (మర్రి)
ఓం ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి (మామిడి)
ఓం వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి
ఓం వటవే నమః – దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః – దేవదారుపత్రం పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి (మరువం)
ఓం హేరంబాయ నమః – సింధువారపత్రం పూజయామి (వావిలి)
ఓం శూర్పకర్ణాయ నమః – జాజీపత్రం పూజయామి
ఓం సురాగ్రజాయ నమః – గండకీపత్రం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమః – శమీపత్రం పూజయామి (జమ్మి)
ఓం వినాయకాయ నమః – అశ్వత్థపత్రం పూజయామి (రావి)
ఓం సురసేవితాయ నమః – అర్జునపత్రం పూజయామి (మద్ది)
ఓం కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి (తెల్లజిల్లేడు)
ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతిపత్రాణి పూజయామి.
ధూపం: ధూపమాఘ్రాపయామి ।। (అగరుధూపం స్వామికి చూపించాలి)
దీపం: దీపం దర్శయామి ।। (దీపాన్ని స్వామికి చూపించాలి)
నైవేద్యం: మహానివేదన (అన్నం మొదలైన భోజనపదార్థాలు, పిండివంటలు, పానకం, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్ళు, కొబ్బరికాయ, అరటిపండ్లు అన్నింటినీ స్వామి ముందుంచాలి)
శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి
ఓం భూర్భువస్సువః తథ్సవితుర్వరేణ్యం ……. భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌
అని నైవేద్యంపై నీళ్లు చల్లాలి.
సత్యం త్వర్తేన పరిషించామి… నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పాలి.
అమృతమస్తు… స్వామి దగ్గర నీళ్లు వదలాలి.
అమృతోపస్తరణమసి… అని నైవేద్యంపైన నీళ్లు చల్లి ఈ కింది మంత్రాలు చెబుతూ అయిదుసార్లు చేత్తో నైవేద్యాన్ని స్వామికి చూపించాలి.
ఓం ప్రాణాయస్వాహా… ఓం అపానాయస్వాహా… ఓం వ్యానాయస్వాహా… ఓం ఉదానాయస్వాహా… ఓం సమానాయ స్వాహా… మధ్యేమధ్యే పానీయం సమర్పయామి (స్వామి దగ్గర నీళ్లు చల్లాలి)
అమృతాపిథానమసి… ఉత్తరాపోశనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి… పాదౌ ప్రక్షాళయామి… ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి… అంటూ నీళ్లు చల్లాలి.
తాంబూలం: పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‌ తాంబూలం సమర్పయామి
(తమలపాకులు, వక్క, పండు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని వినాయకుడి విగ్రహం ముందు ఉంచి నమస్కరించాలి)
నీరాజనం: (లేచి నిల్చుని హారతి ఇవ్వాలి) నీరాజనం సమర్పయామి ।।
(హారతి పళ్ళెంపై కొంచెం నీళ్లు వదిలి, హారతి కళ్ళకు అద్దుకోవాలి)
మంత్రపుష్పం: (నిలుచుని పూలూ అక్షతలూ తీసుకుని చదవాలి)
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా
అక్షతలూ పూలూ స్వామి పాదాలవద్ద ఉంచాలి.
ప్రదక్షిణ: యానికానిచ పాపాని జన్మాన్తరకృతానిచ ।
తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణం పదేపదే ।।
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష గణాధిప ।।
అనేక ఆత్మప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి ।।
(ప్రదక్షిణ చేసి సాష్టాంగ ప్రణామం చేయాలి)

ఆ తరవాత మళ్లీ కూర్చుని, కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలి. కొంచెం నీటిని అక్షతలపై వేసుకుని ఈ శ్లోకం చెప్పుకోవాలి.
మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహప్రభో
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానమావాహనాది షోడషోపచార పూజయాచ, అష్టోత్తర
నామార్చనయాచ, అవసర, మహా నివేదన యాచ భగవాన్‌ సర్వా
త్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు.
శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు
ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అంటూ అక్షతలనూ నీటినీ పళ్ళెంలో వదలాలి. పూజాక్షతలు శిరసున ధరించాలి.

శ్రీ వినాయక వ్రత కథ
వ్రతకథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తరవాత వాటిని శిరసుపై వేసుకోవాలి.
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది రుషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, నమస్కరించి ‘‘రుషివర్యా, మేము రాజ్యాధికారాన్నీ సమస్త వస్తు వాహనాలనూ పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి’’ అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు… వినాయకవ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి, సమస్త సౌఖ్యాలూ కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.

‘‘ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి ‘తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలనూ విజయాలనూ వైభవాలనూ పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి’ అని కోరాడు. అందుకు శివుడు ‘నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామ్యార్థ సిద్ధిప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితినాడు ఆచరించాలి. ఆరోజు ఉదయమే నిద్రలేచి, స్నానం చేసి, నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తిమేరకు బంగారంతోగానీ, వెండితోగానీ లేదా మట్టితోగానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు మొదలైన ఫలములను, రకమునకు ఇరవైఒకటి చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి, యథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ, తాంబూలాదులు ఇవ్వాలి.

బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానసంధ్యలు పూర్తిచేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలూ సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకీ అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గంధర్వాదులందరిచేతా ఆచరింపబడింది’ అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు.

కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే- నీ శత్రువులను జయించి సమస్త సుఖాలనూ పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే… తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడ గలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితోబాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు విఘ్నేశాధిపత్యం.

ఒకనాడు దేవతలు, మునులు, మానవులు, పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారుల నుద్దేశించి ‘మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుం’దని చెప్పాడు. అంత కుమారస్వామి వెంటనే బయలుదేరాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమనీ తరుణోపాయం చెప్పమనీ తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు. నారములు అనగా జలములు. జలములన్నీ నారాయణుని అధీనములు – అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావాన ప్రతి తీర్థంలోనూ కుమారస్వామికన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా మూడుకోట్ల యాభైలక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు. తండ్రి పక్కన ఉన్న గజాననుణ్ణి చూసి, నమస్కరించి ‘తండ్రీ, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి. ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి’ అని ప్రార్థించాడు.

చంద్రుని పరిహాసం
అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజాననునికి విఘ్నాధితప్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి కుడుములు, ఉండ్రాళ్లు మొదలైన పిండివంటలు; టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమికానిన చేతులు భూమికానక ఇబ్బందిపడుతుండగా, శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థచూసి నవ్వాడు. రాజదృష్టి సోకిన రాళ్లు కూడా నుగ్గవుతాయి అన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి, లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అది చూసి పార్వతి ఆగ్రహంతో చంద్రుని చూసి, ‘పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక’ అని శపించింది.

ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నిప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు రుషిపత్నులను మోహించి, శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్యయైన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక, మిగిలిన రుషిపత్నుల రూపాలను ధరించి పతిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవాళ్లు తమ భార్యలేనని శంకించి, రుషులు తమ భార్యలను విడనాడారు. రుషిపత్నులు చంద్రుని చూడటం వల్లే వారికి ఈ నీలాపనింద కలిగింది.

రుషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలూ మునులూ పరమేశ్వరునికి తెలుపగా, అతడు అగ్నిహోత్రుని భార్యయే రుషిపత్నుల రూపం ధరించిందని చెప్పి రుషులను సమాధానపరిచాడు. అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి, మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు. అంత దేవాదులు ‘పార్వతీ, నీ శాపంవల్ల ముల్లోకాలకూ కీడు వాటిల్లుతోంది. ఉపసంహరించుకోవా’లని ప్రార్థించారు. ‘వినాయకచవితినాడు మాత్రమే చంద్రుని చూడరాదు’ అని శాపాన్ని సడలించింది పార్వతి.

శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగంలో భాద్రపద శుద్ధ చవితినాటి రాత్రి… క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు పోయి పాలు పిదుకుతున్నాడు. అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి ‘అయ్యో… నాకెలాంటి అపనింద రానున్నదో’ అనుకున్నాడు.

కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకిమ్మని అడగ్గా ఇవ్వనన్నాడు సత్రాజిత్తు. తరవాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. ఒక సింహం దాన్ని మాంసఖండమనుకుని అతణ్ణి చంపి, మణిని తీసుకుపోయింది. అప్పుడు ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి, మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చింది. ఆ తరవాత మణికోసం తన తమ్ముణ్ణి కృష్ణుడే చంపాడని సత్రాజిత్తు పట్టణంలో చాటించాడు. అది విన్న కృష్ణుడు… చవితి చంద్రుణ్ణి చూసిన దోష ఫలమే ఇది అనుకున్నాడు. దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్లి వెదకగా ఒకచోట ప్రసేనుని కళేబరం, సింహం కాలిజాడలు, ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారినే వెళ్తూ ఒక పర్వత గుహద్వారాన్ని చూసి కృష్ణుడు గుహ లోపలికి వెళ్లి మణిని చూశాడు. దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది.

అది చూసి, జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు. ఇద్దరి మధ్యా ఇరవైఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకుని ‘దేవా త్రేతాయుగంలో నామీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు. నీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. అప్పట్నుంచీ మీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది’ అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు ‘శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. మణికోసం ఇలా వచ్చాను. ఇవ్వ’మని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితోపాటు తన కూతురు జాంబవతినీ కానుకగా ఇచ్చాడు. పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి పిన్నపెద్దలను ఒకచోట చేర్చి యావత్‌ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు ‘అయ్యో, లేనిపోని నింద మోపి తప్పుచేశా’నని విచారించి, ‘మణితోపాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి, క్షమించ’మని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు. ఒక శుభముహూర్తాన జాంబవతీ సత్యభామలను పరిణయమాడాడు. దేవాదులు, మునులు కృష్ణుణ్ణి స్తుతించి ‘మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకొన్నారు. మా పరిస్థితి ఏంటి’ అని అడగ్గా ‘భాద్రపద శుద్ధ చతుర్థినాడు ప్రమాదవశాత్తూ చంద్రుణ్ణి చూసినవాళ్లు గణపతిని పూజించి, ఈ శమంతకమణి కథను విని, అక్షతలు తలపై చల్లుకుంటే నీలాపనిందలు పొందరు’ అని చెప్పాడు కృష్ణుడు. అప్పట్నుంచీ ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థినాడు దేవతలూ మహర్షులూ మానవులూ తమతమ శక్తికొద్దీ గణపతిని పూజించి అభీష్టసిద్ధి పొందుతూ సుఖసంతోషాలతో ఉన్నారు.

వినాయక చవితి

వినాయక చరిత్ర…. పూర్వం గజముఖుడయిన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు ‘స్వామీ నువ్వు నా ఉదరమందే నివసించాలి’ అని కోరాడు. దాంతో భక్తసులభుడైన శివుడు అతడి ఉదరంలో ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీమహావిష్ణువును ప్రార్థించినది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియైన హరి చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానందభరితుడై ‘ఏమి కావాలో కోరుకోండి… ఇస్తాను’ అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ‘ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు’ అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ‘స్వామీ, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి, నా చర్మాన్ని నువ్వు ధరించు’ అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు.

వినాయక జననం..
కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి, తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్యసుందరుని వాకిట్లో ఉంచి, ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది.

కాసేపటికి శివుడు వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేసి, లోపలికి వెళ్ళాడు. జరిగింది తెలుసుకుని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తనవద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుడి మొండేనికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్నీ త్రిలోక పూజ్యతనూ కలిగించాడు. గణేశుడు గజాననుడై, శివపార్వతుల ముద్దులపట్టియైనాడు. ఆ తరవాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.

ఓనమ్

మహాబలి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళవాసులు సంబరం జరుపుకొనే పండుగే ఓనమ్‌. కేరళ ఘనమైన సంస్కృతీ వారసత్వంగా ఈ పండగను పదిరోజుల పాటు జరుపుతారు. సెప్టెంబర్‌ 2 నుంచి 13 వరకు జరిగే ఈ పండుగ విశేషాలను తిలకించడానికి విదేశీ పర్యాటకులు సైతం వస్తారు. ఇక్కడ నృత్యాలు, విందుభోజనాలు, పులివేషాలు, ప్రాచీన విద్యలు-ఆటలు, పడవ పందేలు కన్నులపండువగా జరుగుతాయి.

ఒక్కొక్కరోజు ఒక్కో పేరుతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఓనమ్‌ పండుగను చూడాలని ఆసక్తి ఉన్న పర్యాటకుల కోసం టూరిజం శాఖ ప్రత్యేక సదుపాయాలను కలిపిస్తున్నది. పదిరోజులు జరిగే ఓనమ్‌ వేడుకల్లో ప్రతి రోజూ జరిగే వేడుకలను వివిధ పేర్లతో పిలుస్తారు. సెప్టెంబర్‌ 2న అథం పేరుతో తొలిరోజు పండుగ ప్రారంభమవుతుంది. ఆ రోజు ఇంటిని అందంగా అలంకరిస్తారు. పూలతో చేసిన అలంకరణ ఆకర్షణీయం గా ఉంటుంది. సెప్టెంబర్‌ 3న చితిరా అంటారు. ఈ రోజు కొత్త బట్టలు కొనుక్కోవడం, బహుమతులు కొనడం చేస్తారు.

మూడో రోజు విశాఖం. ఈ రోజు ఓనమ్‌ భోజనం చేయడానికి అవసరమైన పదార్థాలను సేకరించడం, నిల్వచేయడం చేస్తారు. పూకం డిజైన్‌ పోటీలు కూడా ప్రారంభమవుతాయి. నాల్గవరోజు అనిజమ్‌. ఈ రోజు పాముపడవ పోటీలు ప్రారంభమవుతాయి. దీన్ని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు, పర్యాటకులు వస్తారు. తరువాత త్రికెటా, ఆరవ, ఏడవ రోజు మూలం అంటారు. ఈరోజు రాష్ట్రాన్ని అందంగా అలంకరిస్తారు. సెప్టెంబర్‌ 9న పూరడం. ఈ రోజు బంకమట్టితో చేసిన ఒనాతప్పన్‌ అనే విగ్రహాలను ప్రతిష్టిస్తారు.

10న ఉత్రాడోమ్‌ ఈ రోజును ఓనమ్‌ ఈవ్‌గా పరిగణిస్తారు. 11న తిరుఓనం. ఈ రోజు మహాబలి ప్రజల ఇళ్లను సందర్శిస్తారని నమ్ముతూ వనసద్య అనే శాఖాహార విందును ఏర్పాటు చేస్తారు. 12న అవవిట్టం. మహాబలి తిరిగి వెళ్లిపోవడం. ఒనాతప్పన్‌ విగ్రహాలను నది లేదా సముద్రంలో కలుపుతారు. 13న నాల్గవ ఓనం. ఈరోజు పాము పడవ రేసులు, పులిక్కలి టైగర్‌ ప్లే (పులి బొమ్మల ఆటలు), కేరళ టూరిజం శాఖ ఓనమ్‌ వీక్‌ కార్యక్రమంతో వేడుకలు ముగింపు దశకు చేరుకుంటాయి.

త్రిపునితుర అత్తఛమయం సంప్రదాయం ప్రకారం, ఎర్నాకులం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిపునితురలో ఓనం పండుగ ఉత్సవాలు మొట్టమొదట ప్రారంభమవుతాయి. ఆ రోజున పురవీధులన్నీ విద్యుద్దీ పాలతో అందంగా ముస్తాబు చేస్తారు. ఏనుగులను అందంగా అలంకరించి వరుసలో నిలబెడతారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల సంగీత, నృత్య ప్రదర్శన ఆకట్టుకుంటుంది.

వామనమూర్తి టెంపుల్‌ ఓనమ్‌ పండుగ రోజులలో కేరళలోని త్రిక్కకరలో గల వామనమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తమ తమ ఇళ్లలో త్రిక్కకర అప్పన్‌ (వామనుడు) విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. ఇక్కడ కూడా ఓనమ్‌ పండుగ ఘనంగా నిర్వహిస్తారు. వీధులెంబట స్టాల్స్‌, పూల అలంకరణలు అలరిస్తాయి.

కోవలమ్‌ ఈ ప్రదేశం కథాకళి నృత్యానికి ఖ్యాతి గాంచింది. ఇక్కడ ఏ చిన్న వేడుక జరిగిన ఈ నృతాన్ని ప్రదర్శిస్తారు. ఓనమ్‌ నాడు వందల కొలది కళాకారులు వరుసలో నిలబడి నృత్యం చేసే తీరు యాత్రికులను ఆకట్టుకుంటుంది. దీంట్లో చివరి రోజున అలంకరించిన గజరాజుల విన్యాసాలు ఉంటాయి. స్నేక్‌ బోట్‌ రేస్‌ ఓనమ్‌ పండుగలో ప్రధాన ఆకర్షణ స్నేక్‌ బోట్‌ రేస్‌. అరన్ముల బోట్‌ రేస్‌ పార్థసారధి దేవాల యం దగ్గర పంపానదిలో సెప్టెంబర్‌ 5 న జరుగుతుంది.

వెల్లాయని సరస్సు తిరువనంతపురంలోని రైల్వేస్టేషన్‌లో ట్రైన్‌ దిగాక, అక్కడి నుంచి కోవలమ్‌ బీచ్‌కు బస్‌ సౌకర్యం ఉంటుంది. అదే మార్గంలో వెల్లాయని సరస్సు ఉంటుంది. తిరువునంతపురం జిల్లాలో ప్రవహించే అతి పెద్దమంచి నీటిసరస్సు వెల్లాయని. స్థానికులు దీన్ని వెల్లాయని కాయల్‌ అని పిలుస్తారు. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే విహార కేంద్రాల్లో వెల్లాయని సరస్సు ఒకటి. ఓనమ్‌ పండగ సందర్భంగా పడవ పందాలు ఇక్కడ నిర్వహిస్తారు. వీటిని చూడడానికి వందల సంఖ్యలో ప్రజలు వస్తారు. సరస్సు మీద వెన్నెల పడగానే ఈ ప్రాంతం అంతా మనోహరంగా మారిపోతుందట. ఆ దృశ్యాన్ని చూడడానికి పర్యాటకులు రాత్రిదాకా వేచి ఉంటారు.

కోవలమ్‌ బీచ్‌ ఓనమ్‌ పండుగ రోజుల్లో కోవలమ్‌ బీచ్‌లో సందడి నెలకొంటుంది. వెల్లాయని నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఈ బీచ్‌ ఉంటుంది. రోడ్డుకు ఇరువైపులా కొబ్బరిచెట్లు, అరటిచెట్లు, పచ్చని పంటపొలాలు, జలాశయాలు మనకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. బీచ్‌లో ఎగిసిపడే సముద్రపు కెరటాలు కనువిందు చేస్తాయి. అక్కడ విడిది చేయాలనుకునేవారికి హోటళ్ళు, దుకాణాలు అందుబాటులో ఉంటాయి. ఈ బీచ్‌ను హావా బీచ్‌, లైట్‌హౌస్‌ బీచ్‌, సముద్ర బీచ్‌ అని మూడు భాగాలుగా విభజించారు.

పులి వేషాలు… శాస్త్రీయ వాద్యపరికరాలను వాయిస్తుండగా పులి వేషాలు కట్టిన వారు ఆ చప్పుళ్లకు నృత్యాలు చేయడమనే ఆచారం ఈ పండుగకు మరో ఆకర్షణ. దీనిని ‘పులిక్కలి’ అంటారు. భారతదేశంలోనే అతి ప్రాచీన వేడుకగా దీనికి పేరుంది. సరైన పులివేషధారికి బహుమతులు కూడా ఉంటాయి. త్రిసూర్‌లో ఈ వేడుకలు సెప్టెంబర్‌ 13న ఘనంగా జరుగుతాయి.
తిరువనంతపురంలో జరిగే బాణాసంచా వేడుక ఆ ప్రాంతాన్ని అద్భుత లోకంగా మార్చివేస్తుంది. కొత్త దుస్తులు, సంప్రదాయ వంటలు, నృత్యం, సంగీతాలతో రాష్ట్రమంతటా పాటించే ఆచారాలు ఈ వ్యవసాయ పండుగకు చిహ్నాలు. తిరుఓనమ్‌ సాంప్రదాయిక కేరళ భోజనం తొమ్మిది రకాల వంటకాలతో నోరూరిస్తుంది. దీనిని ‘వన సద్య’ అంటారు. అదనంగా మరో పదకొండు రుచులను అరిటాకుల మీద వడ్డించడానికి కేరళ రెస్టారెంట్లు సిద్ధమవుతాయి. సెప్టెంబర్‌ 7న (తిరుఓనమ్‌) కేరళలోని అన్ని రెస్టారెంట్లలోనూ విందుభోజనాలు ఉంటాయి.

కోయంబత్తూరు నుంచి రైలులో ప్రయాణిస్తే కేరళ చేరుకోవచ్చు. తిరువనంతపురంలోని రైల్వేస్టేషన్‌లో ట్రైన్‌ దిగాక, అక్కడి నుంచి కోవలమ్‌, వెల్లాయని చేరుకోవచ్చు. ఓనమ్‌ ఉత్సవాలు జరిగే త్రిసూర్‌ మధ్య కేరళ ప్రాంతంలో ఉంటుంది. కొచ్చి నుంచి రెండు గంటల ప్రయాణం. రైలు, బస్సు ద్వారా చేరుకోవచ్చు.
వసతి ఇక్కడ బస చేయడానికి పేరొందిన చిన్న, పెద్ద హోటల్స్‌ ఉన్నాయి. పర్యాటక శాఖ వివిధ ప్రాంతాల సందర్శనకు ప్యాకేజీలుఉన్నాయి
మరిన్ని వివరాలకు: కేరళ టూరిజమ్‌ పార్క్‌ వ్యూ,
తిరువనంతపురం
టోల్‌ ఫ్రీ నెం. 1-800-425-4747 ఫోన్‌: +4712321132

జగన్నాథ రథయాత్ర

హిందూ ఆలయాలలో , ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. వూరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగిస్తారు. కానీ ఒడిశాలోని పూరీ జగన్నాథాలయంలో ప్రతిసంవత్సరం కొత్తరథాలు తయారవుతాయి. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే… జగన్నాథుడి రథయాత్ర అత్యంత అపురూపం.

ఆషాఢ శుద్ధవిదియ… పూరీ క్షేత్రంలో పండుగ ఆ రోజు. జగన్నాథ జయజయధ్వానాలతో పూరీ నగరవీధులన్నీ మారుమోగుతుంటాయి. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం కోసం వేచి చూస్తుంటారు భక్తులు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించి పోతారు. భక్తిపారవశ్యంతో మైమరచిపోతారు. ఆ క్షణం అపురూపం. స్వరం జగన్నాథం.

రెండు నెలల ముందే
జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢ శుద్ధ విదియనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియనాడు రథనిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయతృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకీ, 763 కాండాలను బలరాముడి రథనిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ వినియోగిస్తారు.

ఆషాఢ శుద్ధ పాడ్యమినాటికి రథనిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటిచారలున్న పసుపువస్త్రంతో ‘నందిఘోష’ను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. పద్నాలుగు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలివస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం. ఎత్తు 43 అడుగులు. పన్నెండు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతిరథానికీ 250 అడుగుల పొడవూ ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పుభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు.

విదియనాడు…
మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లిన పండాలు (పూజరులు) ఉదయకాల పూజాదికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే ‘మనిమా(జగన్నాథా)’ అని పెద్దపెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా వాటిని వూరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా… దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుడ్ని చూడగానే జై బలరామా, జైజై బలదేవా అంటూ భక్తులు చేసే జయజయధ్వానాలతో బోడోదండా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే జయహో జగన్నాథా అంటూ భక్తిపారవశ్యంతో జయజయధ్వానాలు చేస్తారు. ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండీ అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ మూడు విగ్రహాలనూ తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు. వీరు… ఇంద్రద్యుమ్న మహారాజుకన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు. ఆలయ సంప్రదాయాల ప్రకారం… వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది.

సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా… పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను చెరా పహారా అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడినీ, సుభద్రాదేవినీ అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి.జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి…జై జగన్నాథా అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. విశాలమైన బోడోదండ(ప్రధానమార్గం) గుండా యాత్ర మందగమనంతో సాగుతుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు.భక్తుల తొక్కిసలాటలో చక్రాలకింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే… జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

దీన్ని బహుదాయాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్రపేరిట పదిరోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్తకళ సంతరించుకుంటుంది.

రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరొకొందరు చెబుతారు. ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే… పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ కూడా జగన్నాథబలభద్రుల కోసం ప్రధానాలయానికి మూడు కి.మీ. దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలనూ ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు. ఒకరకంగా చెప్పాలంటే గుండీచామందిరం జగన్నాథుడి అతిథిగృహం.

కృష్ణాష్టమి

కృష్ణాష్టమి అంటే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి. కృష్ణుడు జన్మించిన రోజు. కృష్ణుడు పుట్టిన సమయానికే, నంద గోకులంలో యశోదాదేవికి పుత్రికగా మహాశక్తి యోగమాయ జన్మించింది. ఆ తల్లి పుట్టిన అష్టమి కూడా ఇదే!

దైవీ గుణసంపద గలవారి మోహాది మాయాజాలాన్ని క్షయింపజేసే మోక్ష కారకుడు, జగన్మోహనుడు శ్రీకృష్ణుడు. ఆ అవతారం అగాధమైనది, అనంతమైనది! పరమాత్మ తత్వాన్ని, ఉపనిషత్ రహస్యాలను తన లీలల ద్వారా ప్రకటించిన భగవానుడు ఆయన. ప్రేమ, రౌద్ర, వీర, కరుణ, హాస, శాంత భావాల్ని ప్రకటించిన గోవిందుడి గాథ.

బాల్యంలోనే దావాగ్నిని మింగి గోకులాన్ని కాపాడిన స్వామి కృష్ణుడు. బ్రహ్మదేవుడి అహాన్ని అణచివేస్తూ- ఏకకాలంలో అనేక వేల రూపాలలో లేగ దూడల, గోప బాలుర రూపాల్ని ధరించి ఆశ్చర్యపరడాడు. పాలకడలిపై శేషతల్పంపై శయనించిన స్వామి వైకుంఠ ఏకాదశి రోజున కోటి వెలుగులతో దర్శనమిస్తాడు..ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుని దర్శించుకునే రోజు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. తిరుమలతో సహా అన్ని దేవాలయాలలో ఉత్తరంవైపున ఉండే వైకుంఠద్వారాన్ని తెరుస్తారు ఈ రోజున. సౌరశక్తి ఉత్తరాయణానికి మారే సుదినం.

తనను మట్టుపెట్టడానికి మాయారూపాలతో వచ్చిన రాక్షసులను చడీచప్పుడు లేకుండా రూపుమాపిన బాల వీరుడు కృష్ణుడు. చిటికెన వ్రేలితో గోవర్ధనగిరిని ఎత్తినవాడు. స్వర్గలోకంలోని ఇంద్రుడి దర్పాన్ని నిగ్రహించాడు. శుద్ధజలాల్ని విషమయం చేసిన కాళీయ సర్ప గర్వాన్ని అణచివేశాడు. ఫణి ఫణాలపై నర్తించి, అతడిని ఆ నీటి నెలవు నుంచి మళ్లించి, సురక్షిత స్థలానికి పంపి అనుగ్రహించాడు. ప్రకృతిని కలుష రహితంగా ఉంచాలని సకల మానవాళికీ బోధించాడు కృష్ణుడు.
బహుజన్మల యోగసాధనతో పరబ్రహ్మ ప్రాప్తి కోసం గోపికా రూపాలు ధరించిన శుద్ధ జీవులకు ఆయన బ్రహ్మానంద రసానుభవాన్ని ప్రసాదించాడు. రాసలీలా వినోది, నాదావతారుడికి వేణుగానాన్ని వినిపించిన మూర్తి కృష్ణపరమాత్మ.

కృష్ణుడు కంసునికి చెందిన కువలయాపీడం అనే మదగజాన్ని నిరోధించాడు. చాణూర ముష్టికాది మల్లయోధుల్ని ఓడించాడు. కంస శిశుపాలాది దుష్టుల్ని పరలోకానికంపిన ప్రతాపశాలి. జరాసంధ, రుక్మి, కాలయవనుడు వంటి దుర్మార్గుల దురాగతాల్ని అడ్డుకున్నాడు.రాజనీతి చతురుడు. వంచనతో ఆగకుండా ద్రౌపదీదేవిని నిండుసభలో పరాభవించిన కౌరవుల్ని హెచ్చరించాడు. అనివార్యమైన సంగ్రామంలో వారికి తగిన పాఠం చెప్పిన ధర్మరక్షకుడు కృష్ణుడు.

కృష్ణభగవానుడు ఆర్తితో శరణు వేడిన పాంచాలిని ఆదుకున్నాడు. ధర్మానికి కట్టువడి తననుఆశ్రయించిన పాండవుల్ని కాపాడాడు. జ్ఞానభక్తుడై చేరుకున్న కుచేలుణ్ని ఆదరించి, అనుగ్రహించిన స్వామి కృష్ణుడు. జరాసంధుడి చెరలో గల ఎనభై మంది రాజుల్ని విడిపించి, సుస్థిరత కలిగించిన కృపాళువు. నరకాసురుడి బారిన పడిన పదహారువేల మంది రాచకన్యలను విడిపించి, వారి కోరిక మేరకు భద్రత చేకూర్చిన స్వామి! .

తన వైపు గల సైన్యం వద్దని తానే చాలని ఎంచుకున్న అర్జునుడి రథానికి సారథిగా విజయాన్ని ప్రసాదించాడు. కృష్ణుడు విశ్వజనీన తత్వశాస్త్రమైన గీతామృతాన్ని యుద్ధభూమిలో అర్జునినికి ఉపదేశించిన స్వామి.

వేదాల నుంచి విస్తరించిన కర్మ, యోగ, ఉపాసన, తత్వమార్గాల్ని కృష్ణుడు చక్కగా సమన్వయించాడు.సర్వశాస్త్రసారంగా అర్జునుడికి గీతాశాస్త్రాన్ని బోధించడమే కాక, తన అవతార పరిసమాప్తి వేళ ఉద్ధవుడికి తత్వబోధ చేసిన జగద్గురువు ఆయన. .
అవతార కాలంలోనే కాక ఆ తరవాతి కాలంలోనూ- తనను స్మరించి, ఆరాధించి, కీర్తించిన యోగుల్ని తరింపజేసిన భగవానుడు. శుక యోగి, ఆదిశంకరులు, రామానుజాచార్య, మధ్వాచార్య, చైతన్య మహాప్రభు, వల్లభాచార్య, జయదేవుడు, పోతన, లీలాశుకుడు, నారాయణ తీర్థులు, మధుసూదన సరస్వతి, మీరాబాయి, తుకారాం, సక్కుబాయి, సూరదాసు… ఇలా ఎందరెందరో కృష్ణయోగులున్నారు. వారందరూ సాత్విక, మధుర, దివ్య భక్తిమార్గంలో జ్యోతి స్వరూపులై వెలుగునింపారు. .
ఇంతమంది మహాత్ముల భావనలో ప్రకాశించిన శ్రీకృష్ణ భగవానినుని, ఈ రోజే కాదు ప్రతిరోజూ స్మరిద్దాం.

తొలి ఏకాదశి

This image has an empty alt attribute; its file name is 6437b-toliekadasi-.png

మన భరత భూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి వొకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరింపబడుతోంది.   ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.

ఆషాఢ శుక్ల ఏకాదశిని ‘తొలి ఏకాదశి’, ‘శయనేకాదశి’ అంటారు. ఇదే పర్వదినాన క్షీరాబ్ధిలో శ్రీమహావిష్ణువు శేషపాన్పు మీద పవళించి ఉంటాడని భావిస్తారు. ‘చాతుర్మాస్యం’ అంటే నాలుగు నెలల సమయం. ఆషాఢ శుక్ల ద్వాదశి నుంచి కార్తిక శుక్ల ద్వాదశితో ముగిసే ఈ పవిత్ర సమయంలో భక్తులు చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తారు. దీని విశేషాల్ని స్కాంద, భవిష్యోత్తర పురాణాలు వివరిస్తున్నాయి.

ఏకాదశినాడు ఉపవాసం ఉండి, చాతుర్మాస్య వ్రతం ప్రారంభించి, నాలుగు నెలలూ నియమ నిష్ఠలతో ఆచరించడం శుభప్రదమని పురాణగాథలు చెబుతున్నాయి. ఈ వ్రతం స్త్రీలకు అత్యంత ప్రధానమైనదని భీష్మ పితామహుడు ప్రవచించాడు. ఇదే వ్రత ప్రాముఖ్యాన్ని గౌతమబుద్ధుడు అనుభవపూర్వకంగా తెలియజెప్పినట్లు ‘జాతక కథలు’ వెల్లడిస్తాయి. ఈ వ్రతాన్నే జైనులు స్నానోత్సవంగా ఆచరిస్తారు. నాలుగు మాసాలూ క్షీరాబ్ధిపై విష్ణువు యోగనిద్రలో ఉండటం వల్ల, నదులు ఆధ్యాత్మిక ప్రభావ శక్తి కలిగి ఉంటాయంటారు. గృహస్థులకు, వానప్రస్థ ఆశ్రమం స్వీకరించినవారికీ ఇది ఫలప్రదమయ్యే తరుణమని ‘నిర్ణయసింధు’ తెలియజెబుతోంది. హిందువులు, బౌద్ధులు, జైనులతో పాటు పలు మతాలవారు ఈ వ్రతానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు అశోక శాసనాలు వెల్లడిస్తున్నాయి.

చాతుర్మాస్య వ్రతారంభంలో సాధువు ‘ఈ వర్షకాలంలో సంచరించే క్రిమికీటకాల్ని ఎవరూ హింసించకుండా చూసేందుకు ఇక్కడ ఈ నాలుగు నెలలూ ఉంటాను’ అని గృహస్థుడితో అంటాడు. అతడు మహదానందంతో ‘మీకు శుశ్రూష చేయడం మాకు ఆనందదాయకం. ఇక్కడే ఉండి మమ్మల్ని కృతార్థుల్ని చేయండి’ అని స్వాగతిస్తాడు. అలా ఈ శుభ తరుణం అహింసాధర్మాన్ని ప్రబోధిస్తుంది. క్రిమికీటకాలు అంతరించరాదన్న భావంతో వంటల్ని నిలిపివేసి, ఉపవాసాలకు ప్రాధాన్యమిస్తారు. విష్ణు సంబంధమైన ఆరాధనలు పాపహరణాలని భక్తులు విశ్వసిస్తారు.

బాల్యంలో తల్లితోపాటు చాతుర్మాస్య వ్రతం చేయడం వల్ల విశేష జ్ఞానప్రాప్తి కలిగిందని నారద మహర్షి అనుభవం చెబుతుంది. ఇదే కాలంలో వ్యాసపూర్ణిమ గురుపౌర్ణమిగా సమాదరణ పొందుతోంది. స్మార్త సాధువులకు వ్యాసపూజతో ఆరంభమయ్యే ఈ వ్రతం విశ్వరూప యాత్రతో ముగుస్తుంది. చాతుర్మాస్యం సర్వగుణయుక్త సమయం. శ్రద్ధాపూర్వకంగా వేద, పురుషసూక్త పఠనాలు; దానం, సత్సాంగత్యం, ప్రాతఃకాల స్నానం, ఉపవాసం, దైవాభిషేకం, బ్రహ్మచర్యం, సత్యవాక్పాలన, పురాణ శ్రవణం, మిత భాషణం, మిత భోజనం చేస్తారు. పంచాక్షరి, ద్వాదశాక్షరి జపిస్తారు.

ఈ పావన సమయాన్ని యోగ-ధ్యాన తత్పరతతో పాటు భూతదయ; అన్న, జల, గోదానాలతో సద్వినియోగం చేసుకోవాలంటారు పెద్దలు. ఆత్మస్తుతి, పరనింద తగవని హితవు చెబుతారు. నదీస్నానం విశేష ఫలమిస్తుందని భావిస్తారు. ఎటువంటి పదార్థాల్ని భుజించాలో వివరించడం వల్ల, ఈ వ్రతం మానవుడి ఆరోగ్య పరిరక్షణకిచ్చే ప్రాధాన్యం తేటతెల్లమవుతుంది. ఆరోగ్యం బాగుంటేనే, ఆధ్యాత్మిక జ్ఞాన సంపదా వృద్ధి చెందుతుంది. యోగనిద్రలో ఉండే విష్ణు భగవానుణ్ని ప్రసన్నం చేసుకొనేందుకు భక్తుల యోగముద్రలు దోహదపడతాయనీ అంటారు. ఈ వ్రత శుభ తరుణంలో సాగించే యోగసాధన, చేసే సత్కార్యం సత్వర ఫలసిద్ధి కలిగిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం!

రధసప్తమి

భారతీయులకు శ్రీ సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి ఆరు ఆకులు. రథానికి ఏడు అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు ఆరు ఋతువులు. ఏడు అశ్వాలు ఏడు కిరణాలు. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసులనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టియొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు.

ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణువు అనే ఈ పన్నెండు మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధార భూతులవుతున్నారని, ఈ పన్నెండు నామాలు స్మరిస్తే, దీర్ఘ రోగాలు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణంలో చెప్పబడింది.

సౌరమానం, చాంద్రమానం, బార్హ స్పత్సమానం మొదలైనవి కాలగమన విధానంలో ప్రసిద్ధమైనవి. సౌరమాన ప్రకారంగా ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమినాడు వచ్చే ‘రథసప్తమి’ని సూర్యవ్రతం అని పిలుస్తారు. మాఘమాసంలో ‘శుద్ద సప్తమి’, ‘సూర్యసప్తమి’, ‘అచలాసప్తమి’, ‘మహాసప్తమి’, ‘సప్తసప్తి సప్తమి’ అనీ… ఇలా ఎన్నో పేర్లతో పిలువబడే సూర్యారాధనకు, సూర్యవ్రతానికి విశిష్టమైన పర్వదినంగా భావిస్తున్న రోజు ‘రథసప్తమి’ దినంగా ‘సూర్యజయంతి’గా కూడా జరుపుకోవడం మన సంప్రదాయం.

ఈ సప్తమినాడు సూర్యోదయాన ఆకాశంలోని నక్షత్ర సముదాయం రథాకారాన్ని పోలి ఉండడం చేత ‘రథసప్తమి’ అని అంటారు. సూర్యుడు మాఘశుక్ల పక్షం అశ్వనీ నక్షత్రయుక్త ఆదివారం, సప్తమి తిథిన దక్ష ప్రజాపతి పుత్రికయైన అదితి, కశ్యప మహర్షికి ‘వివస్వంతుడు’ అనే పేరున జన్మించాడు. అదితి, కశ్యపులకు పుత్రుడైనందున ఆదిత్యుడని, కశ్యపుడని వ్యవహరిస్తారు.

విశ్వకర్మ కుమార్తె సంజ్ఞ సూర్యునికి భార్య. ఈమె యందు సూర్యునికి వైవస్వత మనువు, యమున, యముడు అనే కవలలు జన్మించారు. సంజ్ఞ సూర్యని వేడిని భరించలేక తనకు మారుగా ఛాయను సృజించి, కొంత కాలము భర్తకు దూరంగా ఉన్నసమయంలో సూర్యుడు ఆ ఛాయనే సంజ్ఞగా భావించడం చేత ఆమె వల్ల సూర్యునికి శనైశ్చరుడు జన్మించాడు.
నియమాలు
శ్లో || సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ
అరుణోదయవేళాయాం స్నానం తత్ర మమాలమ్
మాఙే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యదా
కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్య సంపద:
షష్ఠి నాడు రాత్రి ఉపవసించి సప్తమినాడు అరుణోదయమున స్నానమాచరించినట్లైతే ఏడు జన్మల పాపము తొలగిపోవునని, రోగశోకములు నశించుననియు, ఏడు విధములైన పాపములు పోతాయని విశ్వాసం. ప్రాతఃకాలములోనే స్నానమాచరించి సూర్యుని ధ్యానిస్తూ రాగి, వెండి, మట్టి ప్రమిదలలో, దేనిలోనైనా నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి, దీపజ్యోతులను తలపై పెట్టుకుని నదీ జలాల్లో గానీ, మనకు దగ్గరగా కాలువలో పారే జలాల్లోగానీ తటాకాదులకు గాని, వెళ్లి సూర్యుని ధ్యానించి, ఆ దీపమును నీటిలో వదిలి, ఎవ్వరును నీటిని తాకకముందే స్నానము చేయాలి. స్నానము చేసేటప్పుడు ఏడు జిల్లేడుఆకులు గానీ, ఏడు రేగాకులుగాని తలపై ఉంచుకుని..

శ్రో|| జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే, సప్తవ్యాహృతికే దేవి ! సమస్తే సూర్యమాతృకే
అనే మంత్రంతో స్నానం చేయాలి. “సప్తాశ్యములు గల ఓ సప్తమీ ! నీవు సకల భూతములకును, లోకములకును జననివి. సూర్యునికి తల్లినైన నీకు నమస్కారము. అని ఈ మంత్రమునకు అర్థం.
సూర్యునకు అర్ఘ్యమిచ్చి పూజించి-అటుపైన పితృతర్పణము చేయాలి. పితృతర్పణము చేసేటప్పుడు తామ్రపాత్రముగాని, మట్టిపాత్రముగాని చిమ్మిలి వంటి పదార్థమును చేసిపెట్టి, దానిని ఎర్రగుడ్డతో కప్పి గంధపుష్పాక్షతలతో పూజించి, బ్రాహ్మణులకు దానమివ్వాలి.
సర్వదేవతామయుడు, సర్వవేదమూర్తి సూర్య భగవానుని ఈ రోజుల్లో ఆరాధించడం ఆరోగ్యాన్ని-ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ మాసమంతా నియమంగా సూర్యుని ఆరాధిస్తూ.. “ఆదిత్య హృదయం” వంటివి పారాయణం చేయడం మంచిది. ప్రతి ఆదివారం ఉదయాన్నే శుచిగా క్షీరాన్నం (పాయసాన్నం) వండి సూర్యునికి అర్చించాలి. ఆ రోజు తరిగిన కూరల్ని తినరాదు. (కత్తి తగలని పదార్థాలను తినవచ్చు).

Mukkoti Ekadasi / ముక్కోటి ఏకాదశి

మంచి పని తలపెట్టగానే, దగ్గర్లో దశమి ఏకాదశులు ఉన్నాయేమో గమనించడం తెలుగునాట పరిపాటి. ఏడాది పొడుగునా ఇరవై నాలుగు ఏకాదశి తిథులుంటే, అన్నీ పుణ్య తిథులే కావడం విశేషం! ప్రతి ఏకాదశీ పురాణ గాథతో ముడివడి ఉండటం మరో ప్రత్యేకత.

హరినామ సంకీర్తనలకు ఆలవాలం కావడంతో, ఏకాదశిని ‘హరి వాసరం’గా వ్యవహరిస్తారు. ప్రతి హరి వాసరానికీ ఒక్కో ప్రత్యేక వ్యవహార నామం ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశికి ‘ప్రథమ ఏకాదశి’ అని పేరు. దానికే ‘శయన ఏకాదశి’ అనే మరో పేరు పురాణ గాథ అనుసరించి ఏర్పడింది. ఆషాఢ బహుళ ఏకాదశి- కామిక ఏకాదశి. శ్రావణ మాసంలో మొదటిది పుత్ర ఏకాదశి (లలిత ఏకాదశి అంటారు). రెండోది, అజ ఏకాదశి లేదా ధర్మప్రభ ఏకాదశి.

ధనుర్మాసంలో మకర సంక్రమణానికి ముందుగా వచ్చే ఏకాదశి- వైకుంఠ ఏకాదశి. దీన్ని ముక్కోటి, మోక్షద ఏకాదశి, సఖ్యద ఏకాదశి అని పిలుస్తారు. వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం మోక్ష ద్వారమని ప్రతీతి. అది ఆ ఒక్క రోజే తెరుచుకుంటుంది. దాన్ని ‘వైకుంఠ ద్వారం’ అంటారు. తిరుమలలో వైకుంఠద్వార ప్రవేశానికి భక్తులు ఉవ్విళ్లూరుతారు. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ఏకాదశి కనుక, దీనికి ‘వైకుంఠ ఏకాదశి’ అన్న ప్రసిద్ధి ఏర్పడింది.

వైకుంఠ ద్వారం నుంచి దర్శనానికి- భక్తులే కాదు, మూడు కోట్లమంది దేవతలూ తహతహలాడతారని చెబుతారు. అందువల్ల దీనికి ‘ముక్కోటి’ అనే పేరు సార్థకమైంది. ముక్కోటి ఏకాదశినాటి విధివిధానాలను, ఏకాదశి వ్రత నియమాలను పాటించినవారికి స్వర్గసుఖప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం కారణంగా దీనికి ‘సౌఖ్యద ఏకాదశి’గా పేరుంది. మోక్షప్రాప్తినిస్తుందనే అర్థంలో మోక్ష‘ద’ ఏకాదశిగానూ సార్థక నామాలు ఏర్పడ్డాయి.

వైఖానసుడు అనే రాజుకు తన తండ్రి నరకంలో యాతన పడుతున్న దృశ్యం కలలో కనిపించిందట. ముక్కోటి ఏకాదశినాడు ఆ రాజు దీక్ష స్వీకరించి, వ్రతం, ఉపవాసాది నియమాలు పాటించడం వల్ల ఆయన తండ్రికి మోక్షప్రాప్తి కలిగిందని పురాణ గాథ. ఆ కారణంగా దీనికి ‘మోక్ష్తెకాదశి’ అనే పేరు స్థిరపడిందంటారు.

బ్రహ్మ నుదుటి నుంచి అకస్మాత్తుగా ఓ చెమటబొట్టు రాలి పడిందట. దాని నుంచి రాక్షసుడు జన్మించి, తనకో చోటు కల్పించాలని బ్రహ్మను కోరాడట. ఏకాదశినాటి అన్నం మెతుకుల్లో అతడికి బ్రహ్మ చోటు కల్పించాడంటారు. ఆనాటి నుంచి ఏకాదశి తిధిలో ఉపవాస నియమం ఏర్పడిందని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.

మానవుల కాలమానం లెక్కల్లోని మన ఆరునెలల కాలం, దేవతలకు ఒక పగలుతో సమానం. తక్కిన ఆరు నెలలూ దేవతలకు ఒక రాత్రి. ఆషాఢ మాసంలో, అంటే దక్షిణాయనంతో మొదలయ్యే చీకట్ల నుంచి దేవతలు విముక్తులై ఈ ఏకాదశితో వెలుతురులోకి ప్రవేశిస్తారు. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలానికి దీన్ని శుభారంభ తిథిగా భావిస్తారు.

ఏకాదశులన్నీ ప్రత్యేకమైనవే అయినా- విధివిధానాలు, పురాణ గాథలను అనుసరించి కొన్ని ఏకాదశులు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చాతుర్మాస్య దీక్షలకు ఆరంభదినం కాబట్టి, ఆషాఢమాస ప్రథమ ఏకాదశిగా పిలుస్తారు. యోగనిద్ర ముగించి శ్రీమహావిష్ణువు మేలుకుంటాడన్న గాథ ప్రకారం ‘కార్తికమాస ఉత్థాన ఏకాదశి’గా భావిస్తారు. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ధనుర్మాస ముక్కోటి ఏకాదశిని- ‘నిర్ణయ సింధువు’ వంటి గ్రంథాలు మరీ విశేషమైనవిగా వర్ణిస్తున్నాయి.
ఇంతటి ఘనత వహించిన వైకుంఠ హరివాసరాన్ని ఉపవాస నియమంతో సాకారం చేసుకోవాలి. దాన్ని శ్రీవారి దివ్య పాదారవింద ‘చింతనామృత పాన విశేష శుద్ధ చిత్తం’తో సద్వినియోగం చేసుకోవడం మన వంతు!

Makara Sankranti…మకర సంక్రాంతి

తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ముఖ్యంగా పల్లెలలో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీనికి కారణం ఈ సమయానికి పంటలు పండటం పూర్తయి ఇంటికి తెచ్చుకుంటారు. దీనిని పెద్దల పండుగ అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ.

మార్గశిర, పుష్య మాసాలలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినపుడు ఉత్తరాయణం (జనవరి నెల మధ్యలో) ప్రారంభంతో వస్తుంది.ఈ పండుగను మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజున భోగి పండుగ జరుపుకుంటారు. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలమీద నువ్వుల నూనెతో మర్ధన చేసుకుని, కుంకుడుకాయలతో స్నానం చేయటం సంప్రదాయం. ఇదే రోజున భోగిమంటల పేరుతో భోగిమంటను వేస్తారు. ఇందులో ఇళ్లలోని పాత చెక్కసామానుతో పాటు కట్టెలు వేస్తారు.
స్త్రీలు ఇంటిముందు పేడతో కళ్లాపి చల్లి ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. భోగిరోజున పిల్లలకు భోగిపళ్లు (రేగిపండ్లు) తలమీద పోసి పేరంటం జరుపుకుంటారు.

రెండవనాడు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా పల్లెలలో అరిసెలు చేయని ఇల్లుండదు.
తరువాత రోజు కనుమ పండుగ జరుపుకుంటారు. ఇది పూర్తిగా రైతుల పండుగ. ఈ రోజున పశువులను శుభ్రంగా కడిగి అలంకరించి వాటి కొమ్ములకు రంగుపూసి, వాటికిష్టమైన ఆహారం పెడతారు. పశువుల కొట్టంలో పొంగలి వండి అది పొగుతున్నపుడు పాలపొంగలి, పనుల పొంగలి అని కేకలు వేసి పొంగలిని దేవతలకు నైవేద్యంగా సమర్పించి తరువాత పొలాలకు వెళ్లి ఈ పొంగలిలో పసుపు, కుంకుమలకు కలిపి పొలంలో చల్లుతారు.

సాయంకాలం పశువులను పూలదండలు, గజ్జెలు, పట్టెడలతో అలంకరించి ఊరేగిస్తారు. వీటికి చక్కెర పొంగలి తినిపిస్తారు. వ్యవసాయంలో ఆరుగాలం కష్టపడి పంటలు ఇంటికి తెచ్చుకునే వరకూ పశువుల పాత్ర చాలా ఉంటుంది. దీనికి కృతజ్ఞతగా రైతులు ఇలా చేస్తారు.

తెలుగు రాష్ట్రలలోనే కాకుండా తమిళనాడులోసంక్రాంతిని పొంగల అనే పేరుతోనూ, ఇంకా అనేక ప్రాంతాలలో ఈ పండుగను జరుపుకుంటారు. మాంసాహారులు కనుమ పండుగ రోజున తప్పకుండా మాంసాహారం తింటారు.

వైష్ణవులు ఆండాళ్ చేత రచించిబడిన తిరుప్పావై పాశురాలు రోజుకొకటిగా పాడతారు. సంక్రాంతికి ముందు నెలరోజుల పాటు ధనుర్మాసం ఉంటుంది. ఈ నెల రోజుల పాటు పల్లెలలో హరిదాసులు భగవత్ కీర్తనలు చేస్తూ పల్లెలలో ఇంటింటికి తిరుగుతారు. గృహస్తులు వీరికి బియ్యంగానీ తమకు తోచినవి కాని ఇస్తారు. గంగిరెద్దుల మేళం కూడా సంక్రాంతి పండుగ రోజులలో కనబడుతుంది. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, ఎడ్ల పందాలు జరుగుతాయి.

బతుకమ్మ పండుగ

బతుకమ్మలో దైవత్వం కంటే మానవత్వమే ఎక్కువగా కనిపిస్తుంది. సామాన్యమైన పూలు తంగేడు, గునుగు, కట్ల, బంతిపూలతో బతుకమ్మను చేస్తారు. బతుకమ్మ గురించి పురాణాల్లో ప్రస్తావన లేదు. పల్లెజనం జానపదాలతో గుండెల్లో ప్రతిష్టించుకున్నారు. బతుకమ్మ పండుగకు కులబేధాలు లేవు. అందరూ చేయీ చేయీ కలిపి ఆడతారు పాడతారు. మహాలయ అమావాశ్య నుంచి సద్దుల బతుకమ్మ దాకా తొమ్మిది రోజులూ సందడే సందడి. తెలంగాణా ఆడపడుచులకు బతుకమ్మ పండగకు రావాలె బిడ్డా! అన్న పిలుపు పుట్టింటి నుండి వస్తుంది. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళతో అనుబంధాలు, చిన్ననాటి నేస్తాలతో కబుర్లు. ఆనందంగా బతుకమ్మ ఆడతారు. బతుకమ్మకు మంత్రాలుండవు..కలిసి పాడుకునే పాటే మంత్రం! బతుకమ్మకు గుడులుండవు… నలుగురు గుమిగూడిన చోటే గుడి. బతుకమ్మ ఆటకు నిబంధనలు ఏమీ లేవు. నాలుగు చేతులు కలిస్తే ఆట..జనజీవన సౌందర్యమే బతుకమ్మ! బతుకమ్మను అంకరించడం ఒక కళ. . రోజుకోరకంగా పూలతో బతుకమ్మను తయారుచేస్తారు. ముక్కాలిపీట మీద తంబాలం లాంటిది పెట్టి..అందులో బీర, గుమ్మడి ఆకులు పరచి పూలను శిఖరంలా పేరుస్తారు. శిఖరం మీద ధగధగ మెరిసే పువ్వులను కొసమెరుపుగా ఉంచుతారు. పెద్ద బతుకమ్మకు తోడుగా చిన్న బతుకమ్మ. పసుపుతో గౌరమ్మను చేసి పూజిస్తారు.

సాయంత్రం పట్టుచీరతో ముస్తాబై బతుకమ్మను ఎత్తుకుంటారు. గుడి ఆవరణలోనో వీధి కూడలిలోనో పెట్టి గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలందుకుంటారు. మొదటిరోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ. రెండోరోజు అటుకుల బతుకమ్మ. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ. ఐదోరోజు అట్ల బతుకమ్మ. ఆరోరోజు అలిగిన బతుకమ్మ. ఏడోరోజు వేపకాయ బతుకమ్మ ఏనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ. చివరి రోజు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మకు పెరుగన్నం సద్ది, చింతపండు పులిహోరా, నిమ్మకాయ పులిహోరా, కొబ్బరి తురుము సద్ది, నువ్వుల పొడి కలిపిన సద్ది.. ఇలా రకరకా సద్దులు చేస్తారు. చీకటి పడ్డాక చెరువుగట్టు కెళ్ళి…బతుకమ్మను నీళ్లలో వదిలేస్తారు. బతుకమ్మను తీర్చిదిద్ది తంబాలంలో పప్పు, ఫలహారాలు పోసి వాయనాలు ఇచ్చుకుంటారు. .

బతుకమ్మ కథ: ఓ ముద్దు చెల్లి, ఆమెకు ఏడుగురు అన్నదమ్ములు. అంతా వీరులే. అందరికీ వివాహాలు జరిగాయి. అన్నలకు చెల్లెలు మీద అపారమైన ప్రేమ. కానీ వదినలకు మాత్రం అసూయ. ఆ బంగారుబొమ్మను బాధపెట్టేవారు. ఓరోజు వేటకెళ్ళిన అన్నలు, ఎంతకాలమైనా తిరిగిరాలేదు.

ఇదే సమయం అనుకుని వదినలు సూటిపోటి మాటలతో వేధించారు. యాతన తట్టుకోలేక ఆ చెల్లి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆ తరువాత అన్నలు వచ్చి చెల్లెలు గురించి అడుగుతారు. వారికి విషయం అర్థమైంది. చెల్లికోసం వెతకని ప్రదేశం లేదు. నిద్ర, ఆహారం లేదు. ఓ ఊరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటుండగా పెద్ద తామరపువ్వు ఒకటి నీళ్లలో తేలుతూ వారి దగ్గరకు వస్తుంది. ఆ పువ్వునే చెల్లెలుగా భావిస్తారు ఆ అన్నదమ్ములు.

ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఆ తామరపువ్వును తనతో తీసుకువెళ్ళి కొనులో వేస్తాడు. కొలనుచుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి. ఆ తరువాత విష్ణుమూర్తి తామరను స్త్రీగా చేసి లక్ష్మీ అవతారమని ప్రకటిస్తాడు. పువ్వుకు బతుకుదెరువు చూపింది కాబట్టి ఆ నాటినుండి బతుకమ్మ అయింది. తెలంగాణాలో ప్రచారంలో ఉన్న జానపద కథ ఇది.
ఇంకొక కథనం ప్రకారం… మహిషాసురుని చంపిన అలసి సొలసి మూర్చపోయిన దుర్గమ్మకు మహిళలంతా కలిసి ఆటపాటలతో సృహ తెప్పించే ప్రయత్నమని చెబుతారు.

గుమ్మడిపూలు పూయగ బ్రతుకు .
తంగేడు పసిడి చిందగ బ్రతుకు.
కట్ల నీలిమలు చిమ్మగ. బ్రతుకు .
బతకమ్మా బ్రతుకు! .
– —- కాళోజి నారాయణరావు. .
2014 సంలో బతుకమ్మ పండుగను మరియు బోనాల జాతరను రాష్ట్ర పండుగలుగా తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది.

బోనాల పండుగ

తెలంగాణా సంస్కృతి, సంపప్రదాయాలకు పట్టుగొమ్మ… బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా వేపాకులతో వీధుల అలంకరణ, నెల రోజుల పాటు జంటనగరాలు ఆధ్యాత్మిక సంద్రంగా మారుతాయి. జంట నగరాలలో 115 ఆలయాలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

ఆషాఢమాసం ప్రారంభమైన తొలి ఆదివారం నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తొలివారం గోల్కొండ కోటలో వెలసిన శ్రీజగదాంబా మహంకాళి (ఈ దేవతనే ఎల్లమ్మ తల్లిగా పిలుచుకుంటారు) ఆలయం నుండి ప్రారంభమవుతాయి. తరువాత లష్కర్‌ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్‌లోని ఉజ్జయనీ మహంకాళి ఆలయం, కట్ట మైసమ్మ ఆలయం మీదుగా పాతబస్తీకి చేరుతాయి. ఎల్లమ్మ దేవతతో మొదలయ్యే బోనాలు అఖరి రోజున ఎల్లమ్మ దేవత అర్చనతోనే ముగుస్తాయి. రంగురంగుల కాగితాలతో కట్టిన తొట్లు బోనాల ప్రత్యేక ఆకర్షణ.

బోనం తమ ఇష్టదైవాలకు సమర్పించే నైవేద్యమే బోనం. కొత్త కుండలో బియ్యం, బెల్లం, పాలతో వండి నైవేద్యంగా సమర్పిస్తారు. వేటపోతుకు మెడలో వేపమండలు కట్టి పసుపు కలిపిన నీరు,వేపాకులను చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గుళ్లకు తరలి వస్తారు. జాతరను కన్నుల పండుగగా జరుపుతారు. అమ్మవారి దర్శనానికి సకుటుంబ సమేతంగా వెళ్ళి బోనాలు సమర్పించాక ప్రసాదంగా ఇంటికి తీసుకొచ్చి బంధుమిత్రులతో కలిసి మాంసాహార విందు ఆరగిస్తారు.

రంగం బోనాల వేడుకలో రెండో రోజు జరిగే ఉత్సవాన్ని రంగం అంటారు. ఈ సందర్భంగా పూనకం వచ్చిన భక్తురాలు ఆలయం ముందు భక్తులకు భవిష్యవాణి వినిపిస్తుంది. అమ్మవారి సోదరుడు పోతరాజుగా ఒక వ్యక్తిని అంకరిస్తారు. అతను ఎర్రటి ధోవతి కట్టి,శరీరమంతా పసుపు రాసుకొని, నుదుటి మీద కుంకుమ, కాళ్ళకు గజ్జెలు కట్టి నాట్యం చేస్తాడు.

ఘటం రంగం తరువాత ఘటం ముఖ్య వేడుక. అమ్మవారి ఆకారంలో అంకరించిన రాగి కలశాన్ని ఘటం అంటారు. పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పాతబస్తీలో ఈ వేడుకు 11 రోజుల పాటు జరుగుతాయి.

ఉజ్జయనీ మహంకాళి బోనాలు గోల్కొండ కోట బోనాలు తరువాత ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయనీ మహంకాళి ఆలయం (లష్కర్‌ బోనాలు) మరియు లోయర్‌ టాంక్‌బండ్‌లోని కట్టమైసమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి.
లష్కర్‌ బోనాలు వచ్చే గురువారం నాడు మూసాపేటలోని అన్ని బస్తీల ప్రజలు ఒకేరోజు బోనాలు ఉత్సవాటను నిర్వహిస్తారు.

పాతబస్తీ బోనాలు తరువాత లాల్‌దర్వాజ బోనాలుగా ప్రసిద్ధి చెందిన పాతబస్తీ బోనాలు 11 రోజుల పాటు పాతబస్తీలోని ఆలయాలలో జరుగుతాయి. అక్కన్న, మాదన్న మహంకాళి ఆలయం నుంచి అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపై అలంకరించి ఊరేగించడం అత్యంత వైభవంగా జరుగుతుంది. సాయంత్రం నయాపూల్‌లో ఘట నిమజ్జనంతో ఉత్సవం ముగుస్తుంది.

బల్కంపేట ఎల్లమ్మ బోనాలు ఎల్లమ్మ అమ్మవారు ఇక్కడ బావిలో 10 అడుగుల లోతులో దర్శనమివ్వటం ఓ ప్రత్యేకత. నిజాం కాలం నుండి ఇక్కడ పూజలు చేస్తున్నారు. సికింద్రాబాద్‌ ఉజ్జయనీ బోనాల తరువాత ఆదివారం ఇక్కడ బోనాలు ప్రారంభమవుతాయి. మంగళవారం అమ్మవారి కళ్యాణం, ఆదివారం బోనాలు జరుపుతారు.

చిత్తారమ్మ బోనాలు మూసాపేట చిత్తారమ్మ అమ్మవారి బోనాలు ఆషాఢమాసం చివరి ఆదివారం నాడు జరపటం ఆనవాయితీ. ఈ రోజు అమ్మవారికి బోనాలతో పాటు పలహారం బళ్ళు, తొట్టెలు, ఎడ్లబండ్లు వంటివి ఊరేగిస్తారు.

సమ్మక్క సారమ్మ జాతర

సమున్నతమైన ఆశయంకోసం, జనం కోసం, నమ్ముకున్న వారి కోసం ప్రాణాల్ని సైతం తృణపాయంగా అర్పించిన అమరవీరుల్ని దైవస్వరూపులుగా భావించి పూజించి వారికి కృతజ్ఞాతా పూర్వకంగా మొక్కుబడులు సమర్పించుకోవటం గిరిజనుల సాంప్రదాయం. సమ్మక్క సారమ్మ త్యాగాలకు గుర్తుగా ప్రారంభమైనది సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. ప్రజలకు ఆపద వచ్చినపుడు యుద్ధానికి నడుం బిగించి ఆ పోరులో ప్రాణాలు అర్పించిన గిరిజన వీరులు వీరు. వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి మాఘమాసంలో జరుగుతుందీ జాతర. ఆసియాలోనే అతి పెద్ద జాతలరలో ఒకటిగా పేరుగాంచిన జాతర ఇది. 2109 వ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఘనంగా జరిగుతుంది. ఈ ఉత్సవాల వెనుక చాలా చరిత్ర ఉంది. 13వ శతాబ్బంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కాలంలో గోదావరి తీర ప్రాంతం మేడరాజు అనే కోయదొర ఏలుబడి క్రింద ఉండేది. ఒక రోజు వేటకు వెళ్ళిన కోయదొరకు పులి సంరక్షలో ఉన్న పసిపాప కనబడుతుంది. మేడరాజు ఆ పాపకు సమ్మక్కని పేరు పెట్టుకొని పెంచుకొంటాడు.

యుక్తవయస్కురాలైన సమ్మక్కను కాకతీయుల సామంతుడు మరియు తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేస్తాడు. పగిడిద్దరాజు మేడారం ప్రాంతానికి కోయదొర. ఇతనికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే వారు సంతానం. కాకతీయులకు వీరు ప్రతి సంవత్సరం కప్పం కట్టేవారు.

కరవు కాటకాల మూలకంగా ఓ ఏడాది కప్పం చెల్లించలేకపోయారు. ఓరుగల్లు వారు వీరి విన్నపాలను మన్నించలేదు. యుద్ధానికి వస్తారు. గిరిజనుల సైనికబలం తక్కువైనా ఆత్మాభిమానంతో యుద్ధానికి సిద్ధపడతారు. సంపెంగి వాగు ఒడ్డున పోరు భీకరంగా సాగుతుంది. కాని సుశిక్షుతులైన కాకతీయ సైన్యంతో గిరిజనులు తలపడ లేకపోతారు. పోరులో పగిడిద్దరాజు, నాగులమ్మ, సారలమ్మ, ఈమె భర్త గోవిందరాజు ప్రాణాలు కోల్పోతారు. శత్రువు చేతికి చిక్కడం ఇష్టంలేక జంపన్న, సంపెంగ వాగులో దూకి ప్రాణత్వాగం చేస్తాడు.

అప్పటి నుండి సంపెంగె వాగు, జంపన్న వాగుగా ప్రసిద్ధి పొందినది. యుద్ధంలో గాయపడిన సమ్మక్క మేడారానికి ఈశాన్యంగా ఉన్న చిలకలగుట్ట వైపుకు వెళ్ళి అదృశ్వమవుతుంది. కోయదొరలు వెతుకగా నెమలినార చెట్టువద్ద పుట్ట దగ్గర ఓ కుంకుమ భరిణ కనిపించింది. అదే సమ్మక్క ఆనవాలని గిరిజనులు నమ్ముతారు. నాటి నుంచి సమ్మక్క సారలమ్మలు వనదేవతలై ఇక్కడ పూజలందుకుంటున్నారు.

జరిగిన ఈ దారుణంతో ప్రతాపరుద్రునిలో పరివర్తన కలిగింది. ఆధ్యాత్మిక చింతనతో సమక్క-సారమ్మకు ఉత్సవాన్ని నిర్వహిస్తాడు. అలా ప్రతాపరుద్రుడు ఏర్పరచిన సంప్రదాయం నేటికి మేడారం జాతరగా కొనసాగుతుంది.
శూరత్వానికి, దీరత్వానికి సంకేతాలైన సమ్మక్క సారలమ్మ రూపాల్ని గిరిజనులు జువ్విచెట్టు కింద ప్రతిష్టించుకొని పూజించసాగారు. కొన్ని శతాబ్దాల క్రితం చిన్న జాతరగా ప్రారంభమై నేడు ఆసియాలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి పొందినది.

జాతర విశేషాలు : వనదేవతలైన సమ్మక్క, సారలమ్మకు రూపాలుండవు. 2 మీ. వ్యాసార్థంలో నిర్మించిన గద్దె (అరుగు) మధ్య గుంజ (కర్ర) పాతి వనం తెచ్చి గద్దెపై చేర్చటంతో జాతర ప్రారంభమవుతుంది. వనం అంటే అడవిలో బండరాతిపై మొలిచే వెదురును మాఘపౌర్ణమికి ముందురోజు తెల్లవారు జామున వనంగా తెస్తారు. పుజారులు కుటుంబ స్త్రీలు నిష్టతో గద్దెను శుభ్రంచేస్తారు. తరువాత కార్యక్రమమంతా మగవారే నిర్వహిస్తారు. జాతరలో భాగంగా మొదటిరోజు సారలమ్మ గద్దెపై కొలువు తీరుతుంది. మేడారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కన్నెపెల్లి గ్రామంలోని గుడి నుండి సారలమ్మను పూజారులు సంప్రదాయ డప్పు చప్పుళ్లతో తెస్తారు. ఆ సమయంలో పిల్లలు లేని మహిళలు వరం పడతారు. దేవాలయం నుంచి సారలమ్మను తీసుకొచ్చే పూజారులు వీరి వీపుపై నడుచు కుంటూ ఆలయం నుంచి బయటికి వస్తారు. అదే రోజు అదే సమయానికి పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దెపైకి వస్తారు.

మేడారానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడ మండలం పూనుగొండ్ల గ్రామం నుండి పూజారులు పగిడిద్దరాజును తీసుకొస్తారు. ఈ కార్యక్రమం అంతా కాలినడకనే సాగుతుంది. మధ్యలో ఒక రోజు విరామం. మళ్ళీ నడక ప్రారంభించి తరువాత రోజు సాయంత్రానికి మేడారానికి చేరుకుంటారు.

అదే విధంగా మేడారం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గొవిందరాజుస్వామిని తీసుకు వస్తారు. మాఘమాసం పౌర్ణమి రోజున చిలకల గుట్టపై నుండి మేడారం గద్దెపైకి (2 కి.మీ. దూరం) చేరుకునే సన్నివేశం ఉత్కంఠతకు గురిచేస్తుంది. పూజలు చేసే విధానం ముగ్గురు పూజారులకు మాత్రమే తెలుసు. మిగతా పూజారులు గుట్ట మధ్య భాగంలో వేచి ఉంటారు. ముగ్గురు పూజారులు కూడా వేరు వేరు దారుల్లో చిలకల గుట్టపైకి చేరుకుంటారు. భక్తులంతా గుట్ట దిగువన అమ్మవారి రాకకోసం ఎదురు చూస్తుంటారు. గుట్టపైన పూజారులు పూజలు జరిపిన తరువాత సమ్మక్క అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమ భరిణను కిందికి తీసుకువస్తారు. సంకేతంగా కొమ్ముబూర ఊదుతారు. సమ్మక్కను తెచ్చేటప్పుడు మేకలు, గొర్రెలు, కోళ్ళు బలి ఇస్తారు. శివసత్తు పూనకాలు, భక్తుల జయజయధ్యానాల నడుమ సమ్మక్కను గద్దెపైకి చేరుస్తారు. వనదేవతలంతా భక్తజనుల దర్శనార్థం గద్దెపై కొలువు తీరుతారు. తరువాత రోజు సాయంత్రం తిరిగి వనప్రవేశం చేస్తారు. దీంతో మొత్తం నాలుగు రోజు జాతర ముగుస్తుంది.

మేడారం జాతరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండే కాక పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి కూడా జనం తరలివస్తారు. అలా వచ్చే భక్తులు తొలుత మేడారం పొలిమేరలోని జంపన్న వాగులో పుణ్యస్నానం చేసి స్నానఘట్టాలపై కొలువై ఉన్న జంపన్నను దర్శించుకొంటారు. కొందరు మహిళలు బంగారం (బెల్లం) పసుపు, కుంకుమ, చీరెతో పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. కోరిన కోర్కెలు తీరితే నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించటం ఇక్కడ రివాజు. మొక్కు ఉన్నవారు బంగారాన్ని నెత్తిన పెట్టుకుని వస్తారు. సమ్మక్క తల్లిని దర్వించుకుని బంగారం, ఒడి బియ్యం, పసుపు, కుంకుమ సమర్పించుకుంటారు. కొబ్బరికాయు కూడా కొడతారు. ఆ పక్కనే ఉన్న పగిడిద్ద రాజునూ సారమ్మనూ దర్శించుకుంటారు. ఆమె భర్త గొవిందరాజు స్వామిని కూడా దర్శించుకుని ప్రాంగణం నుండి బయటికి వస్తారు.

జాతర సందర్భంగా మేడారం చుట్టుపక్కల సుమారు 80 చ.కి.మీ. విస్తీర్ణంలో భక్తులు విడిది చేస్తారు. జంపన్న వాగులో 3 కి.మీ. పొడవునా భక్తుల స్నానం చేస్తున్న దృశ్యం కుంభమేళాను తలపిస్తుంది.

ఎలా వెళ్లాలి : ఉత్తరాది నుండి వచ్చేవారు హైదరాబాద్‌ మీదుగా వచ్చి వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో దిగి అక్కనుండి బస్సులో వెళ్లవచ్చు. అలాగే దక్షిణప్రాంతం నుండి వచ్చేవారు కూడా విజయవాడ మీదుగా వచ్చి ఖాజీపేట లేక వరంగల్‌లో దిగి అక్కడనుండి బస్సులో వెళ్ళవచ్చు. ప్రతి సంవత్సరం కొన్ని నెలల ముందు జాతర తేదీను ప్రకటిస్తారు.

శ్రావణ శుక్రవారము

వర్ష ఋతువునందు వచ్చు శ్రావణ మాసములొని శుక్రవారములను శ్రావణ శుక్రవారములందురు. హిందువులకు ఇది చాలా పవిత్రమైన మాసము. ఈ మాసంలో వచ్చే శుక్రవారాల్లో అమ్మవారిని కొలిచే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి.
 
గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజా సమయంలో దుర్గాష్టకం లేదా ఏదేని అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి.
 
ఇంకా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసముండి, అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురోహితులు అంటున్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారమైన నేడు అమ్మవారిని ఆలయాల్లో దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.
 
అంతేగాకుండా.. మల్లెపువ్వులు, కస్తూరి, జాజిపువ్వులను అమ్మవారి కోసం సమర్పించి, నేతితో దీపమెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు.

రంజాన్

ముస్లింలకు అతిపవిత్రమైన మాసం రంజాన్ మాసం. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ నెల వస్తుంది. బక్రీద్ తదితర పండుగుల వచ్చినా, ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం, ముఖ్య పండుగ రంజానే.
 
నెలవంకను చూసినప్పట్నుంచీ ప్రారంభమయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపడతారు. దీనినే ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ అని కూడా అంటారు. అంటే ఉపవాసాన్ని విరమించడం అని అర్థం. ఈ నెలలో ముఫ్పై రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేపడతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉంటారు. కనీసం నోట్లో ఊరే లాలాజలం కూడా మింగరు. సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమించి భుజిస్తారు.
 
ఈ సందర్భంగా వారు ఖీర్ (పాయసం), బిరియానీ మామిడితో స్వీట్లు తదితరాలు చేసుకుని భుజిస్తారు. ఈ ఉపవాసాల సమయంలో ముస్లిం మతస్థులు ఇచ్చే విందునే రంజాన్ విందు అని పిలుస్తారు.
 
రంజాన్ పండుగ నాడు ఇచ్చే విందుకు, రంజాన్ మాసంలో ఇచ్చే విందుకు మధ్య చాలా తేడాలు ఉన్నాయంటారు ముస్లిం సోదరులు. రంజాన్ నెల చివరి పది రోజుల్లో పవిత్ర గ్రంధం ఖురాన్ భూమికి చేరిందని ముస్లింల నమ్మకం.
 
ముస్లింల క్యాలెండర్‌లోని తొమ్మిదో నెలలో ఈ రంజాన్ పండుగ వస్తుంది. మన క్యాలెండర్‌లో లాగా వారి క్యాలెండర్‌లోని నెలల్లో 30, 31 రోజులు ఉండవు. కేవలం 28 రోజులు మాత్రమే ఉంటాయి. అమావాస్య తర్వాత చంద్రదర్శనం నుంచి వారికి నెలా మొదలవుతుంది.
 
సంవత్సరం అంతా ఏ దానాలు, చేయకపోయినా, ఉపవాసాలు ఉండపోయినా రంజాన్ నెలలో తప్పకుండా దానధర్మాలు చేస్తారు. అనారోగ్యం కలిగిన వారు, వృద్ధులు, పిల్లలు తప్ప అందరూ ఈ రోజాలు (ఉపవాసాల)ను తప్పక పాటిస్తారు.
 
రంజాన్ నెలలోని 27వ తేదీన ‘ షబ్-ఎ-ఖద్ర్ ‘ జరుపుకుంటారు. దివ్యఖురాన్ ఈ రోజుకే అవతరించిందని భావించే ముస్లిం సోదరులు ఆ రోజు రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేస్తూ గడుపుతారు. ఆ రాత్రి భక్తితో కఠోరదీక్షతో ప్రార్థనలు చేసేవారికి 83 సంవత్సరాల పాటు ప్రార్థనలు చేసిన ఫలం దక్కుతుందనే నమ్మకం వుంది. ఆ రాత్రి చేసే ప్రార్థనల వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భావిస్తారు.
 
రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు , సంపన్నులైనవారు రంజాన్ నెలలో ‘ జకాత్ ‘ అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తంను పేదలకు దానం చేయడాన్ని ‘ జకాత్’ అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి రెండున్నర శాతం[2.5%] చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ ‘ జకాత్ ‘ ఉపయోగపడుతుంది
 
‘జకాత్’ తో పాటు ‘ ఫిత్రా’ దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత వుంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది వున్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోదిస్తూవుంది. దీనినే ‘ ఫిత్రాదానం’ అని పిలుస్తారు. ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రాదానంలో 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ , దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెట్టాలి. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. దీనివలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం వుంది.
 
దైవ ప్రవక్త ఫిత్రాధానాన్ని విధిగా నిర్ణయించడానికి కారణం – ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు జరుగుతూ వుంటాయి. ఇలాంటి అనాలోచిత పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి ‘ అని మహమ్మద్‍ అనుచరుడు అబ్దుల్లా బిన్ మసూద్ తెలిపాడు.

కార్తీకమాసంలో దీపదానం, కార్తీక దీపం (ఆకాశ దీపం)

 
 
 
 
 
న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్‌
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరం!
కార్తీక మాసమంత పవిత్ర మాసం లేనేలేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదీస్నానం ఆచరించి, నదీస్నానం లభ్యం కాకపోతే లభ్యమైన జలాలతోనే సాన్నం ఆచరించి, ‘కార్తీక దామోదర ప్రీత్యర్ధం అని విష్ణువుని పూజిస్తే విశేష ఫలం లభిస్తుంది. అదేవిధంగా శివాలయంలో దీపా రాధన చేస్తే చాలా మంచిది. శరత్‌ రుతువులో చంద్రుడు పూర్ణిమ నాడు ‘కృత్రికా నక్షత్రం దగ్గరగా రావడం వల్ల ఈ మాసం కార్తీకమాసంగా పిలువబడుతుంది. కార్తీకమాసంలో దీపదానం ఉత్తమఫలాన్ని ఇస్తుంది.
 
నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం కార్తీక పురాణ పఠనం, వనభోజనాలు కార్తీకమాసంలో ముఖ్యంగా జరుప వలసిన విధులు. కార్తీక మాసంలో నాగుల చవితి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీకపౌర్ణమి మొదలగు ముఖ్యమైన పండుగలు జరుపుకుంటారు. ఈ నెల రోజులు కార్తీకపురాణం రోజుకు ఒక అధ్యాయం పఠనం చేయడం వల్ల శివప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం కార్తీకమాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో దేశ వ్యాప్తంగా శివార్చనలు జరుపుతారు. శివుడు అభి షేకప్రియుడు ”అభిషేక ప్రియః శివః శివాభిషేకం అన్ని శుభాలను ప్రసాదిస్తుంది అని అర్ధం. శివునికి ”అర్కద్రోణ ప్రభృతి కుసుమైః అర్చనంతే విధేయం అనగా జిల్లేడు, ఉమ్మెత్త పువ్వులతో శివుడిని అర్చిస్తే శివానుగ్రహం లభిస్తుంది.
 
ఇంకను శివుణ్ణి తులసి, మారేడు(బిల్వ) పతాల్రతో శివాలయంలో, విష్ణు ఆలయంలో సాయం సంధ్య వేళల్లో పూజించి దీపాలు పెట్టడం వల్ల దివ్యమైన ఫలాలు లభిస్తాయి. ఈ మాసంలో స్వగృహంలో తులసీ సన్నిధిలోను, దేవాయలంలోను దీపం పెట్టడం వలన అఖండ, ఐశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రాలలో చెప్పబడింది. ఈ మాసంలో పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివార్చనం లేదా విష్ణుపూజ చేసి నక్షత్రదర్శనం చేస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. కార్తీక సోమవారం శివునికి ప్రీతికరమైనది.
 
ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు తొలగిపోతాయి.కార్తీకమాసంలో ‘అయ్యప్ప దీక్షలు స్వీకరిస్తారు. ఈ మాసంలో ఏ దీక్ష అనుసరించినా మోక్షదాయకమే. ”కార్తీకేతు కృతదీక్షా నృణాం జన్మవిమోచనీ. కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద బంధుమిత్ర సహితంగా ‘కార్తీక సమారాధన నేటికీ ఆచరణలో ఉంది. విష్ణుప్రీతికై సూర్యాస్తమ య కాలమందు ఆకాశ దీపాన్ని వెలిగించడం వల్ల శివసాన్నిధ్యం లభిస్తుందని పురాణాలలో చెప్ప బడింది.అంతేకాక, ఉసిరికాయ, అరటి దొప్ప లలో దీపాలను పెట్టి చెరువులలో, నదులలో విడి చిపెట్టి భగవదార్పణం చేయడం సాంప్రదాయం.

కార్తీక దీపం (ఆకాశ దీపం)

ఆశ్వయుజ అమావాస్య అయిన మరుసటి రోజు ప్రారంభమయ్యె మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో దేవాలయాలలోని ధ్వజస్తoభానికి పైభాగాన జ్యొతిర్మార్గoలో వెలుతూoడే పితృదేవతలoదరికీ మార్గాన్ని చూపించేoదుకు ఓ దీపాన్ని పెడుతారు. దీనినే కార్తీక దీపం లేదా ఆకాశ దీపం అంటారు. ఈ దీపం ఆ నెల రోజుల పాటూ ఉoడి తీరవల్సిoదే.

 

రధ సప్తమి

సప్త సప్తి వహ ప్రీత సప్త లోక ప్రదీప
సప్తమీ సహితో దేవా గృహాణార్ఘ్యం దివాకరా!


లోకబాంధవుడు, గ్రహాలకు అధిపతి, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుని జన్మతిథి మాఘశుద్ధ సప్తమి. దీనికే రథసప్తమి అని పేరు. రథసప్తమినాటి బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని తారకలన్నీ రథాకారం దాల్చి, సూర్యరథాన్ని తలపింప చేస్తాయని ప్రతీతి. ఈవేళ్టి నుంచి సూర్యునికి భూమి చేరువ కావడం ప్రారంభమవుతుంది. అంటే భానుడి కిరణాలు భూమికి పుష్కలంగా అందడం ఆరంభమవుతుంది. సర్వదేవమయుడైన ఆదిత్యుని ఆరాధించడం వల్ల తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.

రథసప్తమినాడు స్నానం చేసేటప్పుడు సూర్యభగవానుని మనసారా స్మరిస్తూ తలపై జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతోంది. రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైనది. అందువల్ల గురువు నుంచి మంత్రదీక్ష తీసుకోవడానికి, నోములు పట్టడానికి అనుకూలమైన రోజు. ఉపదేశం ఉన్న మంత్రాలను జపం చేయడం సత్ఫలితాలను ప్రాప్తింప చేస్తుంది.

రథసప్తమినాడు సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయాన్ని 9 మార్లు పఠించి, ఆవుపేడ పిడకలను కాల్చిన నిప్పు సెగపై ఆవుపాలతో పరమాన్నం వండి, దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదించడం వల్ల సమస్త వ్యాధులు, శోకాలు నశించి, సుఖ సంపదలు చేకూరతాయని శాస్త్రోక్తి. జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనం కలిపిన నీటిని లేదా పాలను రాగిపాత్రలో ఉంచి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఇహలోకంలో సకల సంపదలు, పరంలో మోక్షప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి, కోణార్క సూర్యదేవాలయం తదితర సూర్యక్షేత్రాలలో ఈవేళ విశేషపూజలు జరుగుతాయి. అంతేకాదు, తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరికి ఈవేళ రథసప్తమీ వ్రతం చేయడం ఆనవాయితీ.

గురుపౌర్ణమి విశిష్ఠత

గురుర్ర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురుపౌర్ణమి’ లేదా ‘వ్యాసపౌర్ణమి’ అని అంటారు.ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
 
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు.
 
అసలు ఈ ఆసాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత ఏమిటో? తెలుసుకుందాం. దీనికి ఒక చక్కని ప్రాచీన గాధకలదు.పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు ‘వేదనిధి’. ఆయన సతీమణి పేరు ‘వేదవతి’. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది.
 
ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు. వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకోమంటారు.ఈ క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.
 
అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారిగృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు.
 
వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠులైన ఆ ముని శ్రేష్ఠుడు.. ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు. ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు. అని బదులు పలుకుతారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు, అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు.
 
కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదుముగాక! వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.
 
దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.
 
షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.