కటికి జలపాతానికి కొంత దూరం ట్యాక్సీల్లో ప్రయాణం చేయాలి. తరువాత ఓ కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. నడక జలపాతం సవ్వడి.. దగ్గరయ్యే క కొద్దీ.. జలపాతగీతం మరింత మధురంగా చెవిన పడుతుంటుంది.. దట్టమైన చెట్ల మధ్యలో నుంచి వెళ్తే..ఆశ్చర్యం….. 350 అడుగుల ఎత్తునుంచి దూకే జలపాతం దర్శనమిస్తుంది. జలధారల నుంచి విడివడిన నీటి బిందువులు సూదిమొనల్లా గుచ్చుకుంటాయి. చల్లగా ఉన్న నీళ్లు మంచుకరిగి మీద పడుతోందా అనిపిస్తోంది. మనోహరమైన దృశ్యం చూశాక.. జలపాతం కిందికి చేరుకుంటారు. నిమిషాలు.. గంటలు.. తెలియకుండా గడచిపోతాయి. వర్షాకాలం మొదలయ్యే కటికి సోయగాలు వేసవి వచ్చేవరకూ కొనసాగుతాయి.
ఎలావెళ్లాలి…?
కటికి జలపాతం బొర్రాగుహలకు 7 కి.మీ దూరంలో ఉంది. విశాఖపట్నం నుంచి ఉదయం ఐదు గంటలకు కిరోండూల్ పాసింజర్ రైలులో బొర్రాగుహలకు చేరుకోవాలి. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల్లో జలపాతానికి కిలోమీటర్ దూరం వరకు వెళ్లొచ్చు. ఆపై కాలినడకన వెళ్లాలి.
సౌకర్యాలు : కటికి జలపాతానికి వెళ్లే నడకదారిలో చిరుతిళ్లు లభిస్తాయి. బొర్రాగుహల దగ్గర బస, భోజన వసతులు ఉన్నాయి.
Category: జలపాతాలు
ఎత్తిపోతల జలపాతము
నాగార్జునసాగర్ – మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరములో గుంటూరు జిల్లాతాళ్ళపల్లె వద్ద ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉన్నది. చంద్రవంక నది నల్లమల శ్రేణుల తూర్పు కొండలలో ముటుకూరు వద్ద పుట్టి, తుమృకోట అభయారణ్యములో తాళ్ళపల్లె వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి ఉత్తర దిశగా ప్రయాణించి, తుమ్మకోటకు వాయువ్య దిశలో కృష్ణా నదిలో కలుస్తున్నది. ఇక్కడ మొసళ్ళ పెంపక కేంద్రం ఉంది.
ఆలయాలు ఈ లోయలో అతి పురాతనమైన దేవాలయాలు ఉన్నవి. దత్తాత్రేయస్వామి సుగాలీయుల ఇలవేలుపు. ప్రతి సంవత్సరం తొలిఏకాదశి రోజున జరిగే తిరునాళ్ళకు సమీప జిల్లాలలోని సుగాలీలు అధిక సంఖ్యలో వస్తారు. రంగనాథస్వామి, చౌడేశ్వరీదేవి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నవి. కొండను తొలచి లోపల విగ్రహాలు ఏర్పాటు చేశారు. తల వంచుకొని లోపలకు వెళ్ళాల్సి ఉంటుంది. దత్తజయంతి మరియు పర్వదినాలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. బస చేయటానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖవారి పున్నమి అతిధి గృహం ఉన్నది. ప్రతి శని, ఆదివారాలలో ప్రత్యేకపూజలు నిర్వహించుచుంటారు. అయినా ఇక్కడ సౌకర్యాలు మాత్రం సరిగా లేవు ఉన్నవి.
ఎలా వెళ్ళాలి ?: గుంటూరు నుండి నాగార్జునాసాగర్ (మాచర్ల పట్టణానికి దగ్గరలో) దారిలో తాళ్ళపల్లి గ్రామంలో ఈ ఎత్తపోతల జలపాతం ఉన్నది. మాచర్ల నుండి బస్సులలో వెళ్ళవచ్చు.
తలకోన జలపాతం
300 అడుగుల ఎత్తులో ఉన్న ఈ అందమైన జలపాతం పిల్లలకు మరియు పెద్దలకు సహితం మంచి విహారకేంద్రం. రెండుకొండల మధ్య ఉన్న ఈ జలపాతంలోని నీరు స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటుంది. కొలనులోనీ నీరు ప్రవహిస్తుంటుంది కానీ ఎటువెళ్తుందో తెలియదు. ఈ జలపాతానికి అత్యంత ఎత్తులో పాపనాశనం కలదు. 3 శతాబ్ధాల నాటి గిల్లితీగ అనే మొక్క తలకోనకే తలమానికం అని చెబుతారు. ఈ మొక్కలోని ప్రతి భాగం ఔషధయుక్తమేనని అంటారు. గిరిజనులు ఈ మొక్కను వివిధ వ్యాధుల నివారణకు వాడతారు. ఈ మొక్క కాయలు మూడునుండి నాలుగు అడుగుల దాకా ఉంటాయంటారు.
తలకోన అడవిలో తెల్లని ఆర్కిడ్ పుష్పలు, మద్ది, జాలరి, చందనం, ఎర్రచందనం మొదలగు చెట్లను చూడవచ్చు. అడవి కోళ్ల, దేవాంగన పిల్లులు, ముచ్చుకోతులు, ఎలుగుబంట్లు, నెమళ్లు ఇక్కడ ఎక్కవగా ఉంటాయి. 40 అడుగుల ఎత్తులో కట్టిన తాళ్లవంతెనమీద నడవటం ఒక మరిచిపోలేని అనుభూతి. పడవలలో షికారు చేయవచ్చు. పచ్చని శాలువా కప్పుకున్నట్లు ఉన్న ఈ తూర్పుకనుమలు వీక్షకులకు కనువిందు చేస్తాయి.
ఎలావెళ్లాలి ?
చిత్తూరు జిల్లా యర్రంవారి మండలంలో తలకోన జలపాతం ఉంది. తిరుపతి వెళ్లిన వారు అక్కడనుండి షుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతానికి బస్సులలో వెళ్లవచ్చు.
జోగ్ ఫాల్స్ – ఘనత వహించిన జోగ్ జలపాతాలు
