google.com, pub-9453835310745500, DIRECT, f08c47fec0942fa0
Posted in Wildlife Sanctuaries

సుందర్‌బన్స్

ఈ చిత్రం వికీపీడియాలోనిది.

అక్కడ ఆశ్చర్యకర విషయాలు కోకొల్లలు.

 • పల్లెల్లో ఇంచుమించు ప్రతి ఇంటి ముందు నీటి గుంట ఉంది – వారి అన్ని నీటి అవసరాలకు ఇదే ఆధారం.
 • గోదారి లంకల్లోలా అక్కడా జనాలు రవాణాకు లాంచీలు వాడతారు. అలల పోటు తగ్గినప్పుడు ఆ లాంచీలు ఇలా కనిపించాయి (కొన్ని గంటలకు మళ్ళీ నీరు వీటిని చుట్టుముట్టేసింది):
 • అక్కడ పల్లెల్లో తిరగటానికి ఈ రిక్షాలే:
 • ఆ మడ అడవుల్లో చెట్ల వేళ్ళు ఊడల్లో ఒక రకమైన Aerial Roots – అంటే భూమిలోంచి పైకి పెరుగుతాయి. నేలపై పరుచుకున్నవన్నీ చుట్టుపక్క చెట్ల వేళ్ళు:
 • పై చిత్రంలోని ప్రదేశమే హై టైడ్‌లో ఇలా:
 • ముంగీసలు, ఉడుములు ఇలా తిరిగేస్తూ కనిపించాయి:
 • చిత్తడి నేలలో రంగురంగుల ఎండ్రకాయలు కనిపించాయి:
 • పదే నిముషాల్లో వాతావరణం మారిపోయేది – నిర్మలాకాశం నుంచి హోరువానకు. ఇలా ఒక్క రోజులో రెండు సార్లు జరిగింది.
 • అక్కడ పల్లెల్లో కరెంటు లేదు – అందరూ చిన్న డీజిల్ జెనరేటర్లు పెట్టుకున్నారు. ప్రభుత్వం సబ్సిడీ కింద వారికి డీజిల్ సరఫరా చేసేది.
 • పల్లెల్లో చాలా మందికి నదిలో చేపలు, అడవిలోంచి సేకరించుకొచ్చే తేనె వంటివే జీవనాధారం. ఆ క్రమంలో పులుల దాడులు అక్కడ సాధారణం, జనులూ అలవాటు పడిపోయారు. కొన్ని పులులు నదిలో ఈదుకుంటూ పల్లెల్లోకి వస్తుండటంతో చాలా చోట్ల నదిపై వలలతో కంచెలు ఏర్పాటు చేశారు.
Posted in సంప్రదాయాలు

గుడి

గుడి చుట్టూ ప్రదక్షణ కుడి చేతి వైపు నుండే చేస్తారు ఎందుకు?

గుడిలో ప్రదక్షిణం సాధారణంగా “మూలవిరాట్టు ప్రదక్షిణం చేసే వ్యక్తికి కుడివైపుగా ఉండేటట్టు” చేస్తారు అని చెప్తే స్పష్టంగా ఉంటుంది. దీన్నే క్లాక్-వైస్ లేదా గడియారం తిరిగే దిశ అంటారు కదా. ఈ పద్ధతిలో నడిస్తే ప్రదక్షిణంగా నడవడమనీ, మూలవిరాట్టు వ్యక్తి ఎడమవైపుకు వచ్చేలా నడిస్తే అప్రదక్షిణంగా నడవడం అనీ అంటారు.

ఇలా ఎందుకు నడుస్తారంటే – నడిచేప్పుడు భక్తులకు కుడిచేతివైపు భగవంతుడు ఉంటాడు. ఇలా ఉండడమే విధాయకం. భార్యాభర్తలు పూజా కార్యక్రమాల్లోనూ, వివాహ క్రతువులోనూ నిలబడినప్పుడు భార్య భర్తకు ఎడమవేపున నిలబడాలి అంటారు. ఈ రెంటికి ఒకటే సూత్రం. (భర్త దేవుడిలాంటివాడు అన్నది కాదండీ, బాబోయ్) చిన్నవారికి కుడిపక్కన పెద్దవారు నిలబడాలి.


పైన చెప్పిన ప్రదక్షిణ పద్ధతి అన్ని ఆలయాలకు వర్తిస్తుంది కానీ శివాలయానికి వర్తించదు. శివాలయాల్లో మాత్రం వచ్చినవారు ఏ ఆశ్రమంలో ఉన్నారు (బ్రహ్మచర్యం, గృహస్థు, సన్యాసి) అన్నదాన్ని బట్టి వారు ప్రదక్షిణం చేసే పద్ధతి మారిపోతుదంది.

 • గృహస్థు: శివాలయంలో శివుని లింగానికి చేసిన అభిషేక జలం బయటకు వెళ్ళడానికి ఉండే మార్గాన్ని సోమసూత్రం అంటారు. గుడిలోంచి ఓ ఏనుగు బొమ్మ వంటి రూపం బయటకు పెట్టి అందులోంచి అభిషేక జలం వదులుతారు చూశారా, అది సోమసూత్రం. గృహస్థు దాన్ని దాటకూడదట. ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణంగా (శివుడు కుడిన ఉండేలా) ప్రారంభించి తిరిగి సోమసూత్రం వరకూ వచ్చి, ఆగిపోయి వెనుదిరిగి అప్రదక్షిణంగా సోమసూత్రం వరకూ వెళ్లి, ఆగి వెనక్కి తిరిగి ప్రదక్షిణంగా సోమసూత్రం దాకా నడచి – ఇలా చేయాలట. ఎందుకంటే గృహస్థు శివుని సోమసూత్రాన్ని దాటకూడదట. ఐతే, ఇలా చేసేప్పుడు అప్రదక్షిణంగా వెళ్ళడం, తద్వారా శివుడు భక్తుని ఎడమపక్కన ఉండే అవకాశం ఉంటుంది కదా, ఇలా ఎలా అంటే నాకు తెలియదు మరి.

బ్రహ్మచారి: బ్రహ్మచారికి సోమసూత్రం దాటకూడదన్న నియమం లేదు. (ఎందుకన్నది తెలియదు నాకు) కాబట్టి ప్రదక్షిణం మిగిలిన ఆలయాల్లో ఎలా చేస్తామో అలా పూర్తిగా చేసేయవచ్చు.

సన్యాసి: సన్యాసులు ప్రదక్షిణంగా కాక అప్రదక్షిణంగా (అంటే మూలవిరాట్టు ఎడమపక్క ఉండేలా) తిరగాలి ఆలయం చుట్టూ.

Posted in పర్యాటక ప్రదేశాలు

కోయంబత్తూరు

ఈశా యోగా కేంద్రం

ఈశా యోగా లో ఏమి నేర్పిస్తారు

ఈశా ఫౌండేషన్ 1992లో కోయంబత్తూరులోని వెల్లెంగిరి పర్వత పాదాల వద్ద సద్గురుచే స్థాపించబడింది. ఇది లాభాపేక్ష లేకుండా పూర్తిగా వాలంటీర్లచే నిర్వహింపబడుతున్న సంస్థ. ఇక్కడ యోగాని దాని పూర్తి లోతుల్లో, సంపూర్ణ విస్తృతితో అనుభూతి చెందే స్థాయిలో బోధిస్తారు. ఈ కార్యక్రమాలు మనిషి, సంపూర్ణమైన ఇంకా సజీవమైన జీవన విధానంలో తనని తాను నిర్మించుకునే విధానాలను అందిస్తాయి. ఆధ్యాత్మిక జీవితం అంటే ప్రాపంచికమైన, సామాజిక పరమైన ఇంకా కుటుంబ సంబంధమైన బాధ్యతల నుండి తప్పుకు పోయేది కాకుండా వాటిని వ్యక్తిగత ఎదుగులకు, ఆత్మ సాక్షాత్కారానికి వాహనాలుగా చేసుకోవడం అని ఇది నిరూపిస్తుంది.

ఈశా యోగా కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్రాలలో తరచూ నిర్వహించబడుతూ ఉంటాయి. ప్రతీ కార్యక్రమం గురించి ఇచ్చిన వివరాలతో పాటు లింక్ లను జతచేయడం జరిగింది. అవేమిటో చూద్దాం.

ఇన్నర్ ఇంజనీరింగ్ (Inner Engineering)

సద్గురు రూపొందించిన ప్రాథమిక స్థాయి కార్యక్రమం ఇన్నర్ ఇంజినీరింగ్ (Inner Engineering), లోతైన పరివర్తన కోసం, ఒక తేలికైన ఇంకా శక్తివంతమైన క్రియ (అంతర్గత శక్తి ప్రక్రియ) శాంభవీ మహా ముద్రను పరిచయం చేస్తుంది. మానవ శ్రేయస్సు కోసం, ప్రధానంగా రూపొందించిన ఇన్నర్ ఇంజినీరింగ్ కార్యక్రమం, ఈ సంస్థ కార్యకలాపాలకు పునాది. ఈ కార్యక్రమంలో యోగ విజ్ఞానం ద్వారా మన శరీరం, మనస్సు, శక్తుల యొక్క సామర్థ్యాన్ని పరమోన్నత స్థాయికి చేర్చే సాధనాలు అందించబడతాయి. ఈ ప్రోగ్రాములో 21 నిమిషాల శాంభవి మహాముద్ర ఉపదేశం జరుగుతుంది. ఎంతో అద్భుతమైన పరివర్తన తీసుకువచ్చే ఈ శాంభవి మహాముద్ర ప్రక్రియను, సద్గురు ఆధునిక ప్రపంచానికి అందించారు.

ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ ((Inner Engineering Online)

మీకు వీలైనంత సమయంలో, ఎక్కడినుంచైనా సద్గురుతో ఇన్నర్ ఇంజినీరింగ్ ను అనుభూతి పొందండి. ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ లో 7 సెషన్స్ ఉంటాయి. ఒక్కో సెషన్ 90-నిమిషాల నిడివి కలిగి ఉంటుంది.

ప్రాచీన యోగశాస్త్రాల నుండి గ్రహించబడి, సరాసరి మీరు జీవించే, జీవితాన్ని నిర్వహించుకునే మరియు అనుభూతి చెందే విధానంలో పరివర్తన తీసుకురాగల సమర్ధత కలిగిన శక్తివంతమైన సాధనాలు అందించబడతాయి. ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ గురించి మరింత సమాచారం ఇంకా రిజిస్ట్రేషన్ వివరాల కోసం ఇక్కడ చూడండి.

ఇన్నర్ ఇంజినీరింగ్ ముగింపు (Inner Engineering Completion)

ఇన్నర్ ఇంజినీరింగ్ ముగింపు కార్యక్రమం, ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేయబడిన నగరాలలో స్వయంగా సద్గురుచే అందించబడుతుంది. ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ పూర్తి చేసిన వారికి అందుబాటులో ఉంటుంది.

ఈ రెండు రోజుల కార్యక్రమంలో శాంభవీ మహాముద్ర క్రియ 21- నిమిషాల శక్తిమంతమైన శుద్ధీకరణ ప్రక్రియ అందించబడుతుంది. దానిలో శ్వాస ప్రక్రియ, పునరుత్తేజం మరియు శక్తివర్ధకం చేసే సన్నాహక ఆసనాలు ఉంటాయి. సద్గురుతో ఈ కార్యక్రమం హాజరుకాలేని వారికి కూడా, ఇన్నర్ ఇంజనీరింగ్ ముగింపు కార్యక్రమం, సుశిక్షితులైన ఈశా యోగ బోధకులచే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని ఈశా నగర కేంద్రాలలో తరచుగా అందించబడుతుంది.

అర్హత: ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్‌లైన్ చేసి ఉండాలి.

ఈ కార్యక్రమం గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.

ఉప యోగా (Upa Yoga)

ఉపయోగా అంటే ప్రాధమికంగా “యోగాలో ఉప భాగం” లేదా “యోగాకు ముందు భాగం” అని అర్థం. ఈ కార్యక్రమం కీళ్ళు, కండరాలు ఇంకా శక్తి వ్యవస్థలను ఉత్తేజపరచడం ద్వారా మొత్తం వ్యవస్థలో హాయిని తీసుకువచ్చే సులభమైన మరియు శక్తిమంతమైన 10 అభ్యాసాల క్రమాన్ని అందిస్తుంది. ఇది శరీరంలో శక్తి స్తబ్దుగా ఉండకుండా చేసి మొత్తం వ్యవస్థలో అనాయాస స్థితిని తీసుకువస్తుంది.

మానవ శరీరంలో శక్తి 72000 మార్గాల గుండా ప్రవహిస్తుంది. వీటినే నాడులు అంటాము. కీళ్ళ భాగాల్లో అనేక నాడులు కలుసుకొని కేంద్రీకృతమౌతాయి కాబట్టి, కీళ్ళు శక్తి నిక్షిప్త కేంద్రాలుగా ఉంటాయి. ఉపయోగా అనేది ఈ శక్తిని ఉత్తేజపరిచి, కీళ్ళలోని ఘర్షణని తొలగించి తక్షణ చురుకుదనాన్ని ఇంకా సజీవత్వాన్ని తీసుకువస్తుంది. కొత్తగా యోగా చేసేవారు వీటితో మొదలు పెట్టడం మంచింది, ఇతర యోగ సాధనలు చేయడానికి ముందస్తు ప్రక్రియగా వీటిని చేయవచ్చు.

శరీరం పనిచేసే విధానంపై సక్లిష్టమైన అవగాహనతో ఉపయోగా ఈ కింది ప్రయోజనాలను చేకూరుస్తుంది.

 • శారీరక ఒత్తిడి ఇంకా అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 • కీళ్ళను, కండరాలను బలోపేతం చేస్తుంది.
 • చాలా గంటల పాటు స్తబ్దంగా ఉన్న తరువాత శరీరాన్ని పునరుద్ధరిస్తుంది.
 • జెట్ లాగ్ ఇంకా సుదీర్ఘ ప్రయాణాలు శరీరంపై ప్రభావం చూపకుండా చేస్తుంది.

ఉపయోగా గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

హఠ యోగా (Hatha Yoga)

వేల సంవత్సరాలుగా ఒక యోగ సాంప్రదాయం ద్వారా సంపూర్ణ స్వచ్ఛతతో, సచేతనత్వంతో కొనసాగించబడుతూ వచ్చిన అభ్యాసాలను నేర్చుకునేందుకు ఈశా హఠ యోగా కార్యక్రమాలు సరి సాటిలేని అవకాశంగా నిలుస్తున్నాయి. సుశిక్షితుడైన బోధకులచే, సాంప్రదాయ హఠ యోగా దాని పూర్తి లోతు ఇంకా విస్తృతితో అందించబడుతుంది.

మేము హఠయోగాను పరివర్తన తీసుకువచ్చే విధానంలో బోధిస్తాము.ఈ పరివర్తన శరీర స్థాయిలోనే కాదు, మీరుండే విధానంలో కూడా. – సద్గురు

సాంప్రదాయ హఠ యోగా(Classical Hatha Yoga) ను శరీరం, మనస్సు పై పట్టు సాధించి, తద్వారా ఆరోగ్యం, ఆనందం ఇంకా పరవశాన్ని అందించే ఒక సంపూర్ణ ప్రక్రియగా ఈశా ఫౌండేషన్ సమర్పిస్తుంది.

ఈశా 4 సాంప్రదాయ హఠ యోగా కార్యక్రమాలను అందిస్తుంది.

అంగమర్ధన

సూర్యక్రియ

యోగాసనాలు

భూతశుద్ధి

అంగమర్ధన (Anga Mardhana)

అంగమర్ధన – యోగా వ్యవస్థపై ఆధారితమైన వ్యాయామ వ్యవస్థ. ఇది శరీరాన్ని బలోపేతం చేయడం ద్వారా అత్యుత్తమ శారీరక ఇంకా మానసిక ఆరోగ్యాన్ని పొందే అవకాశాన్ని అందరికీ కల్పిస్తుంది. “అంగమర్ధన” అంటే కాళ్ళుచేతులు, అవయవాలు ఇంకా శరీరంలోని ఇతర భాగాలపై పూర్తి ఆదిపత్యాన్ని సాధించడం. పేరుకి తగ్గట్టుగానే, దీనిని అభ్యాసం చేయడం ద్వారా కండరాలు, ప్రసరణ వ్యవస్థ, అస్థి పంజరం, నాడీ వ్యవస్థ ఇంకా ప్రాధమిక శక్తి వ్యవస్థలతో సహా శరీరాన్ని అన్ని స్థాయిల్లోనూ పునరుద్ధరిస్తుంది.

“మానవ శరీర వ్యవస్థలో పరమోన్నత స్థాయి ఆరోగ్యం, శ్రేయస్సుకు తీసుకువచ్చేందుకు, ఇంకా అన్నిటికీ మించి సంపూర్ణమైన మానవుడిగా వికసించేందుకు అంగమర్ధన ఒక శక్తివంతమైన విధానంగా పనిచేస్తుంది.” – సద్గురు

అందరికీ నప్పేలా, అందరూ ఆచరించగలిగేలా సద్గురు ఎంపిక చేసిన అభ్యాసాలతో కూడిన అంగ మర్ధన కోసం ఏవిధమైన వ్యాయామ పరికరాలూ అవసరం లేదు. దానికి కావాల్సింది శరీరమే ఇంకా దానిని ఎక్కడైనా, ప్రయాణంలో కూడా సాధన చేయవచ్చు.

ప్రయోజనాలు:

 • వెన్నెముక, ఆస్థి మరియు కండరాల వ్యవస్థలను బలోపేతం చేస్తుంది.
 • శారీరక దృఢత్వాన్ని ఇంకా పటుత్వాన్ని పెంపొందిస్తుంది.
 • శరీరాన్ని బలోపేతం చేసి, తేలికదనం ఇంకా ఉల్లాసాన్ని తీసుకువస్తుంది.
 • హఠ యోగా కోసం శరీరాన్ని సన్నద్ధం చేస్తుంది.

అంగమర్ధన గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

సూర్య క్రియ (Surya Kriya)

సూర్యక్రియ అంటే ఏమిటి?

సూర్యక్రియ ఆరోగ్యం, శ్రేయస్సు ఇంకా అంతర్గత శ్రేయస్సు కొరకు సంపూర్ణమైన ప్రక్రియగా రూపొందించబడిన శక్తివంతమగు అతి ప్రాచీనమైన యోగ సాధన క్రియ. “సూర్య” అంటే “సూర్యుడు”, “క్రియ” అంటే “అంతర్గత శక్తి ప్రక్రియ.” సూర్యక్రియ మణిపుర చక్రాన్ని (Solar Plexus) ఉత్తేజపరిచి, మీ వ్యవస్థలోని ‘సమత్ ప్రాణ’ని, అంటే మీ శరీర వ్యవస్థలోని సౌర తాపాన్ని ప్రేరేపిస్తుంది. అంతేకాక మనిషిలోని ఈడా మరియు పింగళ నాడులను సమతులం చేసి, తద్వారా శారీరక స్థిరత్వం ఇంకా మానసిక నిశ్చలతలను చేకూర్చుతుంది. ఈ దృఢమైన పునాది, జీవితపు ఉన్నత పార్శ్వాలను అన్వేషించడానికి ఆధారభూతమౌతుంది.

“సూర్యక్రియ అనేది మీలో అంతర్గతంగా ఉన్న సూర్యుడిని ఉత్తేజపరిచే ఒక శక్తివంతమైన ప్రక్రియ.” – సద్గురు

సాంప్రదాయకంగా కొన్నిప్రత్యేక వర్గాలకు చెందిన యోగులకు మాత్రమే అందుబాటులోఉంటూవచ్చిన ఈ సూర్యక్రియను, ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచానికి తగిన విధంగా సమగ్ర ఆధ్యాత్మిక సాధనగా సద్గురు అందిస్తున్నారు.

ప్రయోజనాలు:

 • మానసిక స్పష్టత మరియు ఏకాగ్రతను పెంపొందిస్తుంది.
 • బలహీన పడిన శరీరాన్ని బాగుచేస్తుంది.
 • చురుకుదనాన్ని, సజీవత్వాన్ని పెంపొందిస్తుంది.
 • శరీర హార్మోనుల స్థాయిని క్రమబద్దీకరిస్తుంది.
 • గాఢమైన ధ్యాన స్థితులను పొందేందుకు సన్నద్ధం చేస్తుంది.

సూర్యక్రియ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

యోగాసనాలు (Yogasanas)

ఆసనం అంటే ఒక భంగిమ అని అర్ధం. మన శరీరం అసంఖ్యాకమైన భంగిమలను తీసుకోగలదు. వీటిలో 84 భంగిమలు ‘యోగాసనాలు‘ గా గుర్తించబడ్డాయి. తద్వారా శరీరాన్ని, మనస్సుని అంతిమమైన శ్రేయస్సుకు అవకాశంగా మార్చడం సాధ్యపడుతుంది. యోగాసనాలంటే వ్యాయామం కాదు, మనిషిలోని శక్తిని ఒక నిర్ధిష్ట దిశలో పరివర్తన చెందించగల సూక్షమైన ప్రక్రియలు. శక్తి యొక్క ఉన్నత పార్శ్వాలను తట్టుకునే సామర్థ్యాన్ని శరీర వ్యవస్థ పొందేందుకు, ఒక 36 శక్తివంతమైన భంగిమలు (లేదా) యోగాసనాలుగా హఠయోగాలో అందించబడతాయి.

“ఎరుకతో మీరు ఒక్క ఆసనంలో ఉండగలిగితే, అది మీ ఆలోచనలు, భావాలు ఇంకా మీరు జీవితాన్ని అనుభవించే విధానాన్ని మార్చ గలదు. హఠయోగాకు ఆ సామర్థ్యం ఉన్నది.” – సద్గురు

ఏ విధమైన శిక్షణా లేనప్పుడు, మానవ శరీరం వివిధ స్థాయిలలో నిర్భందతను సంతరించుకుంటుంది. ఎరుకతో శరీరాన్ని నిర్థిష్టమైన భంగిమలో ఉంచటం ద్వారా, శక్తి ప్రవాహానికి అనుకూలమైన మార్గం ఏర్పాటుచేసి, తద్వారా మనిషిలోని చైతన్యాన్ని జాగృతం చేయగలము. యోగాసనాలు అంతర్గత వ్యవస్థను , ఖగోళ జ్యామితితో అనుసంధానం చేసేందుకు గల ఒక విధానం. తద్వారా మిగిలిన సృష్టితో సమన్వయంలో ఉండడంతో పాటు సహజంగానే ఆరోగ్యదాయకమైన, ఆనందదాయకమైన రసాయనికతను సాధించడమే కాకుండా అన్నింటికీ మించి సమతౌల్యత కలుగుతుంది.

ప్రయోజనాలు

 • దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలనుండి ఉపశమనం
 • ఉన్నత సంభావ్యత దిశగా శరీరం, మనస్సు పరిణామం చెందడం.
 • శరీరం,మనసు ఇంకా శక్తి వ్యవస్థను సుస్థిరం చేయడం.
 • వయసు పైబడడం నిదానిస్తుంది.

యోగాసనాలు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

భూతశుద్ధి (Bhuta Shuddhi)

భౌతిక కాయంతో సహా, సమస్త సృష్టికీ మూలమైనది ఐదు మూలకాల సముదాయం. అవే భూమి, నీరు, వాయువు, అగ్ని ఇంకా ఆకాశం. మానవ దేహంలోని ఈ ఐదు మూలకాలను శుద్ధీకరించడం ద్వారా శారీరక మరియు మానసిక శ్రేయస్సు నెలకొంటుంది. ఈ ప్రక్రియే శరీరాన్ని, పరమోన్నత శ్రేయస్సుకు సోపానంగా కూడా మలుస్తుంది.

భూతశుద్ధి అనబడే ఒక సంపూర్ణ యోగ వ్యవస్థే ఉంది. అంటే “మూలకాలను శుద్ధీకరించడం”. ఈశా అందించే భూతశుద్ధి ప్రక్రియ అనేది తీవ్ర సాధన చేస్తేగానీ అందని ప్రయోజనాన్ని, ఈ నిగూఢమైన యోగ శాస్త్ర విజ్ఞానం ద్వారా అందరూ పొందేందుకు గల ఒక అరుదైన అవకాశం.

ప్రయోజనాలు

 • వ్యవస్థలో సామరస్యాన్ని ఇంకా సమతౌల్యాన్ని నెలకొల్పుతుంది.
 • ప్రగాఢమైన శక్తి స్థాయిలకు నిలువగలిగేలా వ్యవస్థను సన్నద్ధం చేస్తుంది.
 • భౌతిక శరీరం, మనస్సు ఇంకా శక్తి వ్యవస్థల సామర్థ్యాలను పెంపొందిస్తుంది.
 • మానవ శరీర వ్యవస్థపై పూర్తి ఆదిపత్యాన్నిసాధించేందుకు పునాదిని ఏర్పరుస్తుంది.

భూతశుద్ధి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

భావ స్పందన (Bhava Spandana)

భావ స్పందన సద్గురుచే రూపొందించబడిన ఉన్నత శ్రేణి ధ్యాన కార్యక్రమం. అది శరీర, మానసిక పరిమితులకు అతీతంగా ఉన్నత స్థాయి చైతన్యావస్థలను అనుభూతి చెందే అవకాశాన్ని ఇస్తుంది.

భావ అనే పదానికి అర్థం “స్పర్శ”. స్పందన అనేదాన్ని ఒకరకంగా “అనునాదం” అని చెప్పవచ్చు. శక్తివంతమైన ప్రక్రియలు ఇంకా ధ్యానాల ద్వారా, భావ స్పందన కార్యక్రమం తీక్షణమైన శక్తితో కూడిన వాతావరణాన్ని కలిపిస్తుంది. తద్వారా వ్యక్తిత్వం (మిగిలిన వారి నుండి వేరు అనే తత్వం), పంచేంద్రియాల పరిధులను అధిగమించి, మిగతా సృష్టి ఉనికితో ఐక్యత, అనునాదంతో ఉండే అనుభవాన్ని సృష్టిస్తుంది. అది అవధుల్లేని ప్రేమ, ఆనందాలతో కూడిన అతిశయమైన అనుభూతిని కలిగిస్తుంది.

“మిమ్మల్నీ, మీ చుట్టూ ఉన్నదానినీ, మీరు అనుభూతి చెందే విధానాన్ని పరివర్తన చేసేందుకు కావలసిన సాధనాలను భావస్పందన అందిస్తుంది. – సద్గురు”

భావస్పందన కార్యక్రమం, ఈశా యోగా కేంద్రంలో 4 రోజుల రెసిడెన్షియల్ కార్యక్రమంగా అందించబడుతుంది.

ఈ కార్యక్రమం పూర్తిగా అనుభూతి పూర్వకమైనది – ఎటువంటి కొత్త అభ్యాసాలూ బోధింపబడవు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటే Isha Yoga/Inner Engineering (శాంభవీ మహాముద్ర క్రియతో కలుపుకుని) పూర్తి చేసి ఉండాలి.

అర్హతలు:

ఈ కార్యక్రమానికి హాజరు కావాలనుకునే వారు ముందుగా ఇన్నర్ ఇంజినీరింగ్ కార్యక్రమం (శాంభవీ మహాముద్ర క్రియతో కలుపుకుని) పూర్తి చేసి ఉండాలి.

భావ స్పందన గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

శూన్య ఇంటెన్సివ్ (Shoonya Intensive)

లోతైన అంతర్గత పార్శ్వాలను అన్వేషించాలనుకునే వారికి, శూన్య ఇంటెన్సివ్ అనేది సధ్గురుచే రూపొందించబడిన ఒక ఉన్నత స్థాయి ధ్యాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శక్తిచాలన క్రియతో పాటు శూన్య ధ్యానం కూడా బోధించబడుతుంది. శక్తి చాలన క్రియ అనేది శక్తివంతమైన, శుద్ధీకరణ సామర్థ్యం గల అభ్యాసాల కలయిక. అది ప్రాణ శక్తి ప్రసరణను పెంపొందిస్తుంది. శూన్య ధ్యానం అనేది ఎరుకతో కూడిన క్రియారహిత స్థితిని సునాయాసంగా పొందే ప్రక్రియ. ఈ అభ్యాసాలు జీవితంలోని భౌతిక, మానసిక మరియు భావోద్వేగపు అవరోధాలను నుండి విముక్తికి పురిగొల్పి లోతైన అంతర్గత శ్రేయస్సు వైపు మనల్ని నడిపిస్తాయి.

మీ మనసు ఒక సారి పూర్తి నిశ్చల స్థితికి చేరితే మీ మేధస్సు మానవ పరిమితులను దాటుతుంది. – సద్గురు

అన్నీ ఈశా యోగా సమర్పణలూ, ఈ మెళకువలు అన్నీ కూడా పూర్తిగా యోగశాస్త్రాల ఆధారితమై ఉన్నాయి కనుక మతం, జాతి, సామాజిక నేపథ్యం, వయసు, లింగ భేదాలతో నిమిత్తం లేకుండా అందరూ అభ్యసించేందుకు యోగ్యమైనవి.

శూన్య ఇంటెన్సివ్ అనేది కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలోనూ, అమెరికాలోని ఈశా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్ లో 4-రోజుల రెసిడెన్షియల్ కార్యక్రమంగా నిర్వహించబడుతుంది. చాలా అరుదుగా ప్రపంచ వ్యాపంగా ఉన్న వివిధ కేంద్రాలలో కూడా జరుగుతుంది.

అర్హతలు:

ఈ కార్యక్రమానికి హాజరు కావాలనుకునే వారు ముందుగా ఇన్నర్ ఇంజినీరింగ్ కార్యక్రమం (శాంభవీ మహాముద్ర క్రియతో కలుపుకుని) పూర్తి చేసి ఉండాలి.

శూన్య గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

సమ్యమ (Samyama)

సమ్యమ అనేది ప్రత్యేకంగా సద్గురుచే నిర్వహించబడే రెసిడెన్షియల్ కార్యక్రమం. ఇందులో పాల్గొనేవారు ఎనిమిది రోజుల పాటు పూర్తి నిశ్శబ్దంలో ఉంటూ ధ్యానంలో నిమగ్నమౌతారు. సమ్యమ, వ్యక్తులు కర్మ బంధనాల నుండి తమని తాము విముక్తుల్ని చేసుకుని, వ్యవస్థను శుద్ధిచేసి, దివ్యభూమికల అనుభవాన్ని పొందేలా వారిని సంసిద్ధపరచుకునే సంభావ్యతను వారికి కల్పిస్తుంది. ఈ కార్యక్రమం, అందులో పాల్గోనేవారికి, సద్గురు సమక్షంలో, ఉన్నత చైతన్య స్థాయిలను ఇంకా గాఢమైన ధ్యానానుభవ స్థితిని చేరుకునే అవకాశాన్ని అందిస్తుంది.

“సమ్యమ అనేది ఈ శరీరం మీరు కాదు, ఈ మనస్సు మీరు కాదు, చుట్టూ ఉండే ప్రపంచం మీరు కాదు అని పూర్తిగా మీ ఎరుకలోకి వచ్చే స్థితి.” – సద్గురు

ఇది కోయంబత్తూరు ఈశా యోగా కేంద్రంలో నిర్వహింపబడే 8-రోజుల రెసిడెన్షియల్ కార్యక్రమం.

అర్హతలు

సమ్యమకు హాజరుకావాలంటే ముందుగా ఇన్నర్ ఇంజినీరింగ్, భావ స్పందన, శూన్య ఇంకా యోగాసనాలు పూర్తి చేసి ఉండాలి. ఈ కార్యక్రమంపై ఆసక్తి కలవారికి, కార్యక్రమం జరగడానికి రెండు నెలల ముందే ప్రీ- సమ్యమ మీట్ నిర్వహించబడుతుంది.

సమ్యమ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

గురుపూజ (Guru Pooja)

గురుపూజ అనేది స్తోత్రాలు మరియు నివేదనల ద్వారా మీరు నివసించే ప్రదేశంలో శక్తివంతమైన అనుభూతిని సృజించేందుకు గల ఒక నిర్దిష్టమైన విజ్ఞానం. ప్రత్యేకించి ఈ గురుపూజను శోడషోపచార గురుపూజ అంటారు. అంటే గురువుని స్వాగతించేందుకు గల పదహారు విధానాలు. మతపరమైన క్రతువుగా కాకుండా, గురుపూజ అనేది భావోద్వేగాన్ని ఒక ఉపకరణంలా ఉపయోగించి, మన శక్తులలో ఒక రకమైన ప్రచోదనాన్ని కలిగించే ఒక విధానం. అందువల్ల దీనిని రోజూ అభ్యాసం చేయడం ద్వారా ఇది మీ జీవితంలోకి ప్రత్యేక లక్షణాన్ని తీసుకురాగలదు. ఏ మత సాంప్రదాయాలకు చెందిన వారు అనే దానితో నిమిత్తం మహనీయులైన గురువులందరికీ ప్రతీకగా ఒక దీపానికి గురుపూజ సమర్పించబడుతుంది.

గురుపూజ శిక్షణను కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో 4-రోజుల రెసిడెన్షియల్ కార్యక్రమంగా నిర్వహిస్తారు.

అర్హత: ఇన్నర్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

గురుపూజ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈశా హఠ యోగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం

‘ఈశా హఠ యోగ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం’ అనేది యోగా వ్యవస్దని లోతుగా అర్ధం చేసుకోవడానికి, సాంప్రదాయ హఠ యోగాని నేర్పించడానికి కావలసిన నైపుణ్యాన్ని పొందేందుకు లభించే ఒక అసమానమైన అవకాశం.

సాంప్రదాయ హఠ యోగాని శుద్ధరూపంలో అందించాలి అనేది సద్గురు ఆశయం. అసలైన హఠ యోగాని నేర్పించే యోగా టీచర్లను తయారుచేయటం కోసం ‘ఈశా హఠ యోగా స్కూల్‌’ వారు 21-వారాల టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అందిస్తున్నారు.

ధ్యానలింగం

పైకి సాదాసీదాగా కనిపించే పైకప్పును(The Dhyanalinga Dome) , ఒక్క స్తంభం కూడా ఆధారంగా లేకుండా కట్టారంటే, మీకు ఆశ్చర్యం కలగక మానదు.

ధ్యానలింగం వెనుక కథ, క్లుప్తంగా…

దీనికి చాలా పెద్ద నేపథ్యమే ఉంది. వివరాలలోకి వెళ్తే, ఆత్మజ్ఞానం పొందినవారందరూ, ఎన్నో తరాలుగా, ఏడూ చక్రాలూ శక్తివంతంగా ఉన్న ఒక లింగంతో ఒక క్షేత్రాన్ని కట్టాలని ఆశించారు. ఒక ధ్యానలింగ ఆలయం. ఎంతో కాలానికి ఆ కలలను సాకారం చేస్తూ 1999, జూన్ 23న సద్గురు (Sadhguru), కోయంబత్తూరు సమీపంలోని వెల్లంగిరి పర్వత పాదాల వద్ద(Velliangiri foot hills) ధ్యానలింగాన్ని స్థాపించారు. ఇది ఈశా యోగా కేంద్రంలో కొలువు తీరింది. ప్రత్యేకించి, ధ్యానలింగ ప్రతిష్ఠాపన ప్రక్రియ కోసం, ఆయనకు మూడు సంవత్సరాల అత్యంత తీవ్ర సాధన అవసరమైంది. 

సర్వ ధర్మ స్తంభం ( Sarva Dharma Stambha)

ఆలయంలోకి వెళ్ళే ముందు, సర్వ ధర్మ స్తంభం కనిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని ముఖ్యమతాల గుర్తులు, ఈ స్తంభానికి మూడు వైపులా చెక్కబడి ఉంటాయి. మీకు మతాతీతమైన స్వాగతం లభిస్తుంది. అక్కడికి వచ్చేవారందరికీ, గర్భగృహ ప్రవేశం ఇవ్వాలన్నదే సద్గురు ఆకాంక్ష. ఇలాంటి ప్రవేశం, దర్శనం మిగతా దేవాలయాలలో చాలా అరుదు.

ధ్యాన సన్నద్ధుల్ని చేసే ప్రయత్నం, అడుగడుగునా…

ఆలయానికి వచ్చే భక్తులూ, సాధకులూ మొదట తీర్థకుండంలో స్నానం చేస్తారు, తద్వారా వారి గ్రహణశీలత పెరిగి, ధ్యానలింగ శక్తుల్ని మరింతగా అందిపుచ్చుకోగలుగుతారు.

ఆలయ ప్రవేశం వద్ద అసాధారణమైన ఎత్తుతో ఉన్న ఆ గులకరాయి మెట్లు, ఎక్కేవారి పాదాలలోని కొన్ని నాడులను, నాడీ కేంద్రాలను జాగృతం చేస్తాయి. ఇది ధ్యానలింగ శక్తిని మనం గ్రహించడానికి సన్నద్దం చేసే మరొక పధ్ధతి.

ఆలయ ప్రవేశ మంటపంలో, ధ్యానలింగ ముఖ ద్వారానికి ఎడమవైపున వనశ్రీ (Vanashree), కుడివైపున యోగ విజ్ఞానానికి ఆధ్యులైన పతంజలి మహర్షి (Maharshi Patanjaliల మూర్తులు దర్శనమిస్తాయి. ఇవి మానవ దేహంలోని ఈడాపింగళ నాడులను సూచిస్తాయి. ఈ ఏర్పాటువెనుక ఉద్దేశ్యం ఏంటంటే, భక్తులూ, యోగ సాధకులూ వీటి మధ్య గుండా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు, వారి శక్తి వ్యవస్థలో మరింత సమతుల్యత ఏర్పడుతుంది. దీనితో గర్భగుడిలో ప్రవేశించిన తరువాత వారు సునాయాసంగా ధ్యాన స్థితిని పొందగలుగుతారు.

ఈ రకంగా, తీర్థకుండంలో స్నానం మొదలు,గర్భాలయ ప్రవేశం వరకూ, భక్తుల గ్రహణశీలతను మరింత పెంచేందుకు చేసిన ఆలోచన, కృషి అడుగడుగునా కనిపిస్తుంది. ధ్యానలింగాన్ని, అసాధారణ శక్తియుక్తులు కలిగిన ఒక యోగి పుంగవుడి అత్యద్భుత సృష్టికి తార్కాణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అసలు ధ్యానలింగం (Dhyanalingam) ఎందుకు?

సంస్కృతంలో, ధ్యాన అంటే ధ్యానం. లింగం అంటే ఆకారం. ఇక్కడ మౌనంగా కొన్ని నిమిషాలు కూర్చుంటే, ఆ ధ్యానలింగ సమక్షంలో ధ్యానం అంటే తెలియని వారికి కూడా, లోతైన ధ్యానానుభవం కలుగుతుంది.

మీరు కేవలం ధ్యానలింగం పరిధిలో కూర్చున్నంత మాత్రాన, ధ్యాన నిమగ్నులు అవుతారు. మీరు అక్కడ పది నిముషాలు కళ్లు మూసుకుని కూర్చుంటే చాలు, స్వతహాగానే ఎవరి సూచనల అవసరం లేకుండానే, మీరు ధ్యాన నిమగ్నులు అవుతారు. – సద్గురు.” – Sadhguru

ఏడు చక్రాల శక్తీ, తారా స్థాయిలో శక్తీకరింపబడిన ఈ ప్రదేశం, మనలోని వేరొక పార్శ్వాన్ని తాకి, మనలోని ఆధ్యాత్మికతకు బీజం వేస్తుంది.

ధ్యానలింగం ఒక గురువు పాత్రను పోషిస్తుంది (Role of a Guru)

ఒక ఆధ్యాత్మిక సాధకుడి జీవితంలో గురువు పాత్ర, దారి చూపించడం, బోధనలివ్వడానికే పరిమితం కాదు. ఒక సాధకుడు గురువుని ఆశ్రయించేందుకు ముఖ్య కారణం, ఆయన అతడిలో ఉన్న శక్తిని ప్రేరేపించి, ఒక కొత్త పార్శ్వాన్ని తాకేలా చెయ్యటమే.ఈ అంశంతో కూడిన గురువు పాత్ర, సాధకుడికి ధ్యానలింగం ద్వారా నిశ్చయంగా లభిస్తుంది. ఒక్కసారి, ఆ ధ్యానలింగ పరిథిలోకి వచ్చినవారెవరూ, వారిలో ముక్తి అనే ఆధ్యాత్మిక బీజం పడకుండా తప్పించుకోలేరు.

ధ్యానలింగం యొక్క శక్తుల ప్రాధమిక లక్ష్యం ఒక వ్యక్తి యొక్క ఆధాత్మిక ఉన్నతినీ, వికాసాన్నీ పెంపొందించడమే. కానీ ధ్యానలింగం, వారంలోని ప్రతి రోజూ ఒక్కో ప్రత్యేకమైన లక్షణాన్ని ప్రసరిస్తుంది. తద్వారా వివిధ ప్రయోజనాలను పొందవచ్చు. 

Posted in జాతరలు

Happy Sankranti 2021

Sankranti Celebrations At Village - Sakshi

సంక్రాంతి అంటే మూడు పండుగలు. అటు భోగి, ఇటు కనుమ, నడుమ సంక్రాంతి. గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, రంగవల్లులు మనకు తెలిసిన సంక్రాంతి. పట్టణంలో ఉండేవారికి తెలియని సంస్కృతులు, సంప్రదాయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. నిన్న భోగి ముగిసింది. నిన్నటి కొనసాగింపుగా, నేడూ సాగి, రేపటికి పూర్తయ్యే ఈ సంరంభాలు పల్లెల్లో ఎలా జరుగుతాయో తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది. 

భోగి రోజు ఇంటి పెద్ద కొడుకు నిద్రలేచి చిమ్మచీకట్లోనే టార్చిలైటు సాయంతో పొలానికి వెళ్లి గరిక, గుమ్మడి ఆకులు, పువ్వులు తీసుకొస్తాడు. ఇంటిల్లపాదీ తెలవారక ముందే స్నానం చేసి భోగి మంటలో నుంచి నెయ్యిదీపం వెలిగించుకుని నట్టింట పెడతారు. మరో నెయ్యి దీపం నివాసం ముఖద్వారం ముందు ఈశాన్య మూల ఉంచుతారు. అక్కడే గోమూత్రం చల్లి, గోవుపేడతో నాలుగు చిన్న ముద్దలుగా చేసి పసుపు, కుంకుమ పెట్టి దానిపై గుమ్మడిపువ్వులు, గరిక ఉంచుతారు. ఆ తరువాత గుమ్మడి ఆకుల్లో బెల్లం లేదా చక్కెర పెట్టి ప్రత్యేక పూజచేసి పెద్దలను పండుగకు ఆహ్వానిస్తారు. ఇదంతా భోగి నాడు నిన్న జరిగే ఉంటుంది. నేడిక (సంక్రాంతికి) నివాసంలో ఉన్న మహిళలంతా  వివిధ రకాల పిండి వంటకాలు తయారు చెయ్యటానికి సిద్దమవుతారు. 

ఇంటి ముందు పొయ్యి
పిండి వంటల కోసం ఇంటి ముందు పొయ్యి తవ్వుతారు. అక్కడ ఒకటిన్నర అడుగు పొడవు, లోతు పొయ్యి తవ్వుతారు. ఆ పొయ్యి చుట్టూ గోమూత్రం చల్లి ఎర్రమట్టి, ముగ్గుపిండితో ముగ్గువేస్తారు. అందులో వరిపొట్టు, ఎండబెట్టిన గోవుపేడ పిడకలను ఉంచి కర్పూరం వెలిగిస్తారు. ఆ తరువాత ఆ పొయ్యి చుట్టూ మట్టితో తయారుచేసిన ముద్దలను ఉంచి వాటిపై కొత్తగా తయారు చేయించిన మూడు మట్టి కుండలను ఉంచుతారు. అప్పటికే ఆ కుండలకు పల్చగా సున్నం పూసి దారంతో పసుపుకొమ్ము కడతారు. అనంతరం పొయ్యిలో కర్పూరం వెలిగించి మామిడి, వేప కర్రలతో మంటపెడతారు. మూడు మట్టికుండల్లో మొదటగా పాలు పోస్తారు. అవి బాగా వేడెక్కి పొంగుతుండగా తూర్పువైపుగా కొబ్బరి మట్టతో తయారుచేసి ఉంచుకున్న గరిటతో ‘పచ్చా పొంగళ్లు… పాల పొంగళ్లు..’ అంటూ మూడు పర్యాయాలు పాల పొంగును కిందకు తోస్తారు. అనంతరం బియ్యం వేసి వంట సిద్దం చేస్తారు. ఒక కుండలో పెద్దలకు, మరో కుండలో సూర్య  భగవానునికి వంట చేస్తారు. ఇంకో కుండలో గుమ్మడికాయ కూర, ఆ తరువాత మిగిలిన వంటకాలు అదే పొయ్యిపై తయారు చేస్తారు. ఈ వంటకాలన్నిటినీ వరిగడ్డితో తయారుచేసిన కుదురుపై ఉంచుతారు.

దేవునికి మొక్కులు
పిండి వంటలన్నీ తయారు చేసిన అనంతరం మూడు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మొదటగా ఇంటి ముఖద్వారం వద్ద ఐదు గుమ్మడి ఆకుల్లో పిండివంటలు, గుమ్మడికాయ కూర, బెల్లం కొద్దికొద్దిగా ఉంచి కొబ్బరికాయ కొట్టి పెద్దలకు మొక్కుతారు. ఆ తరువాత సూర్యుడు కనిపించే ప్రాంతానికి (ఇంటి బయట) నివాసంలో ఉన్న నెయ్యిదీపాన్ని, ఐదుగుమ్మడి ఆకుల్లో ఉంచిన పండివంటలను ఒక తట్టలో తీసుకెళ్తారు. అక్కడ సూర్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజ పూర్తయ్యాక నేతి దీపం ఆరకుండా  ఇంటికి తీసుకొస్తారు. కనుమ పండగ నాడు పశువులు ఉన్న వారు వాటి కొమ్ములకు రంగులు వేసి గజ్జలు, గంటలు కట్టి ముస్తాబు చేస్తారు. సాయంత్రం పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Posted in పర్యాటక ప్రదేశాలు

2021 – ఏ నెలలో ఎన్ని రోజులు సెలవులున్నాయి, భారత దేశంలో చూడవలసినవి ఏవి ఉన్నాయి

ఏడాదంతా మనం చేయవలసిన పని. ఇంకో పని కూడా చేయాలి. ఆదివారం కలిసొచ్చేలా శనివారం; శనీ ఆదివారాలు కలిసొచ్చేలా శుక్రవారం సెలవు పెట్టడం. వీలైతేనే. విధిగా కాదు. ఉద్యోగమనే విధికి అడ్డు తగలకుండా చూసుకోవాలి. 

ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌(అహమ్మదాబాద్‌) 

జనవరి
14 సంక్రాంతి. 15 శుక్రవారం సెలవు పెడితే 16, 17 శని, ఆదివారాలు. 23, 24 మళ్లీ శని, ఆదివారాలు. 26 రిపబ్లిక్‌ డే. 25 సెలవు పెడితే 24 ఆదివారం. వరుసగా మూడు రోజులు. 
ఇవి చూడొచ్చు  :అహమ్మదాబాద్‌లో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌; బికనీర్, రాజస్థాన్‌లలో బికనీర్‌ కామెల్‌ ఫెయిర్‌ (జనవరి 12–13); శ్రీనగర్, జమ్ము–కశ్మీర్‌; ఉత్తరాఖండ్‌లోని ఆలీకి స్కీయింగ్‌ ట్రిప్, కచ్‌ గుజరాత్‌లో వైట్‌ డెజర్ట్‌. ఆ ఉప్పు ఎడారిని సూర్యకిరణాలు పడుతున్నప్పుడు చూడాలి. కళ్లు జిగేల్మంటాయి. 


జిరంగ నేషనల్‌ పార్క్‌ (అస్సాం)

ఫిబ్రవరి
13, 14 శని, ఆదివారాలు. 15 సెలవు పెడితే 16 వసంత పంచమి.
ఇవి చూడొచ్చు : ఎప్పుడూ పార్టీలు జరుగుతుండే గోవా, తాజ్‌మహల్‌ (ఆగ్రా), కజిరంగా నేషనల్‌ పార్క్‌ (అస్సాం), ఉదయ్‌పూర్, జైసల్మేర్, జో«ద్‌పూర్‌ (రాజస్థాన్‌), పురాతన నగరం వారణాసి; ఖజురహో–హెరిటేజ్‌ టూర్‌ (మధ్యప్రదేశ్‌).


బృందావనంలో హోలీ
మార్చి
11 మహా శివరాత్రి. 12 శుక్రవారం సెలవు పెడితే 13, 14 శని, ఆదివారాలు. 26 శుక్రవారం సెలవు పెడితే 27, 28 శని, ఆదివారాలు. 29 హోలీ. 
ఇవి చూడొచ్చు : హోలీకి బృందావనం (మధుర), ప్రకృతి దృశ్యాల కోసం ఊటీ, వన్యప్రాణుల కోసం రాజస్థాన్‌లోని రంథంబోర్, మానసిక సాంత్వన కోసం సిక్కిం, యాత్రా స్థలంగానైతే మౌంట్‌ అబూ. చారిత్రక శిథిల కట్టడాలకు హంపీ.


గుల్‌మార్గ్‌ స్కీయింగ్‌ (కశ్మీర్‌)

ఏప్రిల్‌
2 గుడ్‌ ఫ్రైడే. 3, 4 శని, ఆదివారాలు. ఈ నెలలో ఇంతే. శని ఆదివారాలకు కలిసొచ్చేవి లేవు. 
ఇవి చూడొచ్చు : చల్లదనం కోసం జమ్ము–కశ్మీర్‌. పెంచ్‌ నేషనల్‌ పార్క్‌ (మధ్యప్రదేశ్‌), ఉదయ్‌పూర్, ట్రెక్కింగ్‌ కోసం కొడైకెనాల్, స్కీయింగ్‌కి గుల్‌మార్గ్, వైన్‌ యార్డ్‌ చూడాలంటే నాసిక్‌. నీలాకాశ వీక్షణకు, బీచ్‌లకు లక్షద్వీపాలు, స్వచ్ఛమైన గాలి కోసం కూర్గ్‌. 


ధర్మశాలలో క్రికెట్‌ స్టేడియం
 

మే
13 ఈదుల్‌ ఫిత్ర్‌. 14 సెలవు పెడితే 15, 16 శని, ఆదివారాలు. 
ఇవి చూడొచ్చు :రిషికేశ్, ముస్సోరి (ఉత్తరాఖండ్‌), కొడైకెనాల్‌ (తమిళనాడు), స్పితీ వ్యాలీ (హిమాచల్‌ ప్రదేశ్‌), కాలింపాంగ్‌ (పశ్చిమ బెంగాల్‌), వేయనాడ్‌ (కేరళ), ధర్మశాల (హిమాచల్‌ ప్రదేశ్‌)


అల్మోరా, ఉత్తరాఖండ్‌

జూన్‌
జూన్‌లో శని, ఆది వారాలకు కలిసొచ్చే సెలవు రోజులు లేవు. తెలంగాణ ఆవిర్భావం దినోత్సవమైన జూన్‌ 2 ఈ ఏడాది బుధవారం వచ్చింది. ఇక వేళ రెండు మూడు రోజులు సెలవు దొరికితే..
ఇవి చూడొచ్చు : చిక్‌మగళూర్‌ (కర్ణాటక), లడఖ్, అండమాన్‌; గాంగ్‌టక్‌ (సిక్కిం), అల్మోరా (ఉత్తరాఖండ్‌). ఈ నెలలో ఈ ప్రదేశాలలోని వాతావరణం సమ శీతల ఉష్ణస్థితిలో ఆహ్లాదంగా ఉంటుంది. 


వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ (ఉత్తరాఖండ్‌)

జూలై
10, 11 శని, ఆదివారాలయ్యాయి. 12 రథయాత్ర. 17, 18 శని, ఆదివారాలు. 19 సెలవు పెడితే 20 బక్రీద్‌. 
ఇవి చూడొచ్చు : పూరి రథయాత్ర (ఒడిశా), వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ నేషనల్‌ పార్క్‌ (ఉత్తరాఖండ్‌), శివస్థలి అమర్‌నాథ్‌. 


 మౌంట్‌ అబు (రాజస్థాన్‌)

ఆగస్ట్‌ 
28, 29 శని, ఆదివారాలు. 30 జన్మాష్టమి. 
ఇవి చూడొచ్చు :  జన్మాష్టమి ఉత్సవాల కోసం బృందావనం, కూనూరు (తమిళనాడు), చిరపుంజీ (మేఘాలయ), జిమ్‌ కార్బెట్‌ (ఉత్తరాఖండ్‌), మౌంట్‌ అబూ (రాజస్థాన్‌)


హర్మందిర్‌ సాహిబ్‌ (అమృత్‌సర్‌)

సెప్టెంబర్‌
10 వినాయక చవితి. 11, 12 శని, ఆదివారాలు. 
ఇవి చూడొచ్చు: అమృత్‌సర్, కేరళ, శ్రీనగర్, కూర్గ్, పాండిచ్చేరి, ముంబై, మహాబలేశ్వర్, గుజరాత్‌లోని విల్సన్‌ హిల్స్‌. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖంలో ఉండి, వాతావరణం తడిపొడి సమ్మేళనంగా ఉల్లాసభరితంగా ఉంటుంది కనుక పర్యాటనకు అనువైన ప్రదేశాలలో ఇవి కొన్ని. 


కులు దసరా సంబరాలు
 

అక్టోబర్‌
15 దసరా. 16, 17 శని, ఆదివారాలు.  
ఇవి చూడొచ్చు :దసరా సంబరాలకు కులు (హిమాచల్‌ ప్రదేశ్‌), రివర్‌ రాఫ్టింగ్‌కి రిషికేశ్, దుర్గాపూజకు కోల్‌కతా, వన్యప్రాణి వైవిధ్య వీక్షణకు మానస్‌ నేషనల్‌ పార్క్‌ (అస్సాం), జాపపద సంస్కృతుల కోసం జో«ద్‌పూర్‌; మైసూరు.


భరత్‌పూర్‌ (రాజస్థాన్‌) పక్షుల ఆవాసం
 

నవంబర్‌
19 గురు నానక్‌ జయంతి. 20, 21 శని, ఆదివారాలు
ఇవి చూడొచ్చు : ఫుష్కరోత్సవాలు (రాజస్థాన్‌), నైట్‌ లైఫ్‌ కోసం గోవా, పక్షుల్ని చూడటానికి భరత్‌పూర్‌ (రాజస్థాన్‌); రాయల్‌ బెంగాల్‌ టైగర్‌లను చూడ్డానికి సుందర్‌బాన్‌ (పశ్చిమ బెంగాల్‌), మంచుకొండల కోసం మనాలీ (హిమాచల్‌ ప్రదేశ్‌)


కబిని అభయారణ్యం (కర్ణాటక)

డిసెంబర్
24 సెలవు పెడితే 25 క్రిస్మస్, 26 ఆదివారం.
ఇవి చూడొచ్చు  : కబిని వన్యప్రాణి అభయారణ్యం (కర్ణాటక), స్కీయింగ్‌కి ఆలీ (ఉత్తరాఖండ్‌), కచ్‌ (గుజరాత్‌).

Posted in పర్యాటక ప్రదేశాలు

లంబసింగి

లంబసింగి

అక్కడ సూర్యుడు చంద్రుడిలా చూడముచ్చటగా కనిపిస్తాడు. మంచుతో జత కలిసిన సూర్యకిరణాలు గిలిగింతలు పెడుతుంటాయి.

మండు వేసవిలో కూడా అక్కడి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు దాటదు. 250 మంది జనాభా ఉన్న ఆ గ్రామానికి శీతాకాలంలో లక్షల మంది పర్యాటకులు వస్తారు.

సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండ గ్రామం అది. దీన్నే అంతా లంబసింగి అని పిలుస్తుంటే… ఆ గ్రామస్థులు మాత్రం కొర్రబయలు అంటారు.

శీతాకాలం వచ్చిందంటే చాలు వర్షంలా కురుస్తున్న మంచుతో లంబసింగి మంచు మందారంలా మెరిసిపోతుంది. దక్షిణాది కశ్మీర్‌గా పేరు పొందిన ఈ ప్రదేశంలో డిసెంబరు నుంచి జనవరి చివరి వరకూ అతి చల్లటి వాతావరణం కనిపిస్తుంది.

ఈ కాలంలో సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉదయం పదిగంటలైనా సూర్యుడు కనిపించని ఈ ప్రాంతానికి రెండుమూడు కిలోమీటర్ల దూరంలో మాత్రం సాధారణ వాతావరణమే ఉండటం విశేషం.

లంబసింగి
Advertisements

‘ఓసారి దొంగ కొయ్యబారిపోయాడు’

ఈ ప్రాంతాన్ని స్థానికులు కొర్రబయలు అని పిలుస్తారు. కొర్ర అంటే కర్ర, బయలు అంటే బయట అని అర్థం. ఎవరైనా పొరపాటున ఇంటి బయట పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారనే అర్థంలో అలా పిలుస్తారు. అంతటి చలి ఇక్కడ ఉంటుంది.

ఈ చలి తీవ్రతకి ఓసారి ఓ దొంగ ప్రాణాలు పోయేంత పరిస్థితి వచ్చిందని స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు బీబీసీతో చెప్పారు.

“ఇక్కడ ఎప్పట్నుంచో తీవ్రమైన చలి ఉంది. అయితే ఏజెన్సీలోని మారుమూల ప్రాంతం కాబట్టి లంబసింగి కోసం పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. నా చిన్నతనంలో జరిగిన సంఘటన చెబుతాను. ఊర్లోకి వచ్చిన ఒక దొంగని మా గ్రామస్థులు పట్టుకున్నారు. ఇప్పుడున్న హనుమంతుడి గుడి వద్ద అప్పట్లో ఒక పెద్ద కొయ్య పాతేసి ఉండేది. అతడిని ఆ కొయ్యకి కట్టి… రాత్రంతా అక్కడే ఉంచారు. ఉదయం చూసేసరికి అతడు కొయ్యబారిపోయాడు. అప్పుడు అతడికి స్థానిక మంత్రసానులు వైద్యం చేసి కాపాడారు. అతడు కోలుకోడానికి మూడు రోజులు పట్టింది. ఇక్కడ ఆ స్థాయిలో చలి ఉంటుంది. ఒకప్పుడు మా గ్రామంలో పది మంది కూడా బయట కనిపించేవారు కాదు. ఇప్పుడు వందలాది మంది మా గ్రామానికి వస్తున్నారు. అసలు ఇది మా ఊరేనా అనిపిస్తుంటుంది” అని ఆశ్చర్యపోతూ చెప్పారు.

లంబసింగి

నిత్యం భోగి పండగే

కశ్మీరం దారి తప్పి వచ్చిందా అన్నట్లు ఉంటుంది లంబసింగి. అందరికి భోగి పండగ ఏడాదికి ఒకసారి వస్తే… ఇక్కడి వారికి మాత్రం నిత్యం భోగి పండగే. నిత్యం చలి మంటలు కనిపిస్తాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ… అలాగే సాయంత్రం 4 గంటల నుంచి మళ్లీ ఉదయం వరకూ ఎక్కడ చూసినా చలిమంటలే ఉంటాయి.

లంబసింగి

ఉండేది 250 మంది… వచ్చేది లక్షల మంది’

దట్టంగా కమ్ముకున్న పొగమంచు ఓవైపు… మంచు తుంపరుల పలకరింపు మరోవైపు… గాలిని సైతం గడ్డకట్టించే చల్లగాలి ఇంకోవైపు… ఇవి లంబసింగిలో నిత్యం కనిపించే దృశ్యాలు.

మైదాన ప్రాంతాలకు సుదూరంగా ఉండే లంబసింగి లాంటి గిరిజన గ్రామాలకు సాధారణంగా ఎవరూ రారు. అక్కడ అడుగడుగునా చెట్లు, పుట్టలే కానీ మనుషులు పెద్దగా కనిపించరు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.

లంబసింగిలో ఉన్నవి కేవలం 60 కుటుంబాలు మాత్రమే. మొత్తం జనాభా 250. అయితే శీతాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాలే పర్యాటకులతో ఊరు సందడి సందడిగా మారిపోతుంది.

“లంబసింగికి సీజన్‌లో సరాసరి రోజూ 10 నుంచి 12 వేల మంది పర్యాటకులు వస్తుంటారు. నాలుగు నెలల పాటు సీజన్ కొనసాగుతుంది. లంబసింగి ఏజెన్సీ టూరిజానికి హాట్ స్పాట్‌గా మారింది. ఏడేళ్ల క్రితం ఒక్కసారిగా ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు పడిపోవడంతో అప్పట్నుంచి ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడి ఉష్ణోగ్రతల కారణంగానే లంబసింగికి ఆంధ్రా కశ్మీర్, ఆంధ్రా ఊటీ, దక్షిణాది కశ్మీర్ అనే పేర్లొచ్చాయి. 

లంబసింగి

కొండగ్రామంలో హనీమూన్

విశాఖపట్నం నుంచి లంబసింగికి 130 కిలోమీటర్ల దూరం. అందులో 30 కిలోమీటర్లు ఘాట్ రోడ్ ప్రయాణమే. వంపులు తిరిగిన కొండల్లో సాగే ఈ ప్రయాణం నిజంగా ఒక మధురానుభూతే.

లంబసింగి వరకు మాములుగా ఉండే చలి… చెక్ పోస్ట్ దాటేసరికి ఒక్కసారిగా మంచు ప్రపంచంలోకి మనల్ని లాగేసుకుంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ఛాయ్ మీద ఛాయ్ కొట్టాల్సిందే. లేదా చలిమంటల వద్దకు పరుగులు పెట్టాల్సిందే.

3 గంటల కోసం… 2 రోజుల పర్యటన

ఇక్కడి మంచు అందాలనూ… ఎప్పుడూ అనుభవించనంత చలినీ… ఎంజాయ్ చేయాలంటే రెండు రోజుల లంబసింగి పర్యటనకు ప్రణాళిక చేసుకోవాలి. ముందురోజు రాత్రి దగ్గరిలో ఉన్న మైదాన ప్రాంతానికి చేరుకున్న టూరిస్టులు… లంబసింగిలో మంచుతో జతకలిసిన సూర్యోదయాన్ని చూడటం కోసం వేకువజామునే పయనమవుతారు. లంబసింగి చేరుకొనేటప్పుడు చల్లని వాతావరణం, మంచుతెరలు…చక్కటి అనుభూతిని కలిగిస్తాయి.

లంబసింగిలో తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలైన చలి ఉదయం ఏడు గంటల వరకు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది.

కుటుంబాలు, కొత్త జంటలు, ప్రేమికులు ఇలా ఎక్కడెక్కడి నుంచో ‘ఛలో లంబసింగి’ అంటూ వస్తుంటారు. శీతకాలం వారాంతాల్లో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ నుంచే కాకుండా బెంగళూరు, భువనేశ్వర్ నుంచి కూడా వాహనాల్లో లంబసింగికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.

దీంతో ఈ గిరిజన గ్రామంలో గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ అయి…నగర వాతావరణాన్ని తలపిస్తుంది. ఉదయం ఆరు గంటలకు కొద్దిగా వెలుతురు రావడంతో పర్యాటకులు తమ కెమెరాలకు పనిచెబుతారు. ప్రకృతి అందాల నేపథ్యంతో సెల్ఫీలు, గ్రూప్‌ ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తారు. యువతీయువకులు చలిమంటల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేస్తుంటారు.

లంబసింగి

మంచు ‘పాలసముద్రం’

లంబసింగికి మూడు కిలోమీటర్ల దూరంలో ‘చెరువులవేనం’ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం కొండపైకి ఎక్కితే అక్కడో అద్భుతం ఆవిష్కృతమవుతుంది. సినిమాల్లోనో, ఫోటోల్లోనో గ్రాఫిక్ మాయజాలంలో చూసే పాలసముద్రం అక్కడ మన కళ్లేదుట ప్రత్యక్షమతుంది.

మంచు మేఘాలను తాకుతున్నట్లుగా కనిపించే ‘చెరువులవేనం’ పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తోంది. ఉదయం నాలుగైదు గంటలకే లంబసింగి చేరుకున్న పర్యాటకులు ‘చెరువులవేనం’ వెళ్లేందుకు క్యూ కడతారు. కనుచూపుమేరలో కమ్ముకుని ఉన్న మంచు మేఘాలను ఆస్వాదిస్తారు.

ఇక లంబసింగికి ఆరు కిలోమీటర్ల దూరంలో తాజంగి రిజర్వాయర్ ఉంది. ఇది కూడా పర్యాటక కేంద్రమే. ఈ రిజర్వాయర్‌ను చూసేందుకు లంబసింగికి వచ్చిన అందరూ ఇక్కడకీ వస్తారు.

ఈ రిజర్వాయర్‌పై ‘జిప్ వే’ ఏర్పాటు చేసింది పర్యాటక శాఖ. రిజర్వాయర్ ఒక చివర నుంచి మరో చివరకు గాల్లో తేలుతూ…సెల్ఫీలు తీసుకుంటూ ‘జిప్ రోప్’ ద్వారా చేరుకుంటారు పర్యాటకులు. ఇది ప్రధాన ఆకర్షణగా మారింది. అలాగే ఇక్కడికి వచ్చే పర్యాటకులను అలరించేందుకు థింసా నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు.

లంబసింగి

పెరిగిన పర్యాటకం… తగ్గిన వలసలు

లంబసింగితో పాటు చుట్టు పక్కల ఉన్న గిరిజన గ్రామాల్లోని యువత ఉపాధి కోసం మైదాన ప్రాంతాలకు వలస పోతుండేవారు. అయితే గత కొంతకాలంగా లంబసింగి విపరీతంగా ఫేమస్ కావడంతో ఈ ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య అనుహ్యాంగా పెరిగింది.

పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుండటంతో లంబసింగి అంతటా పెద్ద ఎత్తున వ్యాపారాలు విస్తరించాయి. టూరిస్టులు పెరగడంతో స్థానిక యువకులు చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకుని ఇక్కడే ఉపాధి పొందుతున్నారు.

ఇక్కడ ‘నైట్ స్టే’ చేసేందుకు రిసార్ట్స్, హోటల్స్, గుడారాలను అందుబాటులోకి తెచ్చారు కొందరు స్థానికులు. అలాగే టూరిజంశాఖకి కూడా ఆదాయం గణనీయంగా పెరిగింది.

“టిఫిన్, టీ దుకాణాలతో పాటు రాత్రి స్టే చేసేందుకు టూరిస్టులకు గుడారాలు అద్దెకివ్వడం, టూరిస్టుల కోరిక మేరకు వారు భోజన సౌకర్యాలు చూడటం వంటివి చేస్తూ ఉపాధి పొందుతున్నాం. ఎక్కడో దూరంగా వెళ్లి ఉపాధి పొందేకంటే ఇక్కడే సీజన్‌లో వ్యాపారం చేసుకుని…అన్ సీజన్‌లో వ్యవసాయం చేసుకుంటున్నాం. స్థానికంగా ప్రభుత్వ, ప్రైవేటు రిసార్ట్స్ కూడా రావడంతో… వాటిలో కూడా మాకు పని దొరుకుతుంది” అని గుడారాలను అద్దెకిచ్చే స్థానికుడు రామగోవింద్ చెప్పారు.

లంబసింగి

లంబసింగికి ఆ ప్రత్యేకత ఎందుకంటే…

లంబసింగిలో ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం రావాడానికి ఇక్కడున్న ప్రకృతి సమతుల్యతే కారణం అంటున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం మెటరాలజీ, ఓషియనోగ్రఫీ విభాగాధిపతి ప్రొఫెసర్ రామకృష్ణ.

“రెండు చిన్న కొండల మధ్యలో ఉండే గ్రామం లంబసింగి. రెండు కొండల మధ్య నుంచి వచ్చే శీతల గాలులు అక్కడ మేఘాలను నిలవనివ్వవు. దాంతో అక్కడ చల్లని వాతావరణం ఏర్పడుతుంది. సముద్ర మట్టానికి ఎత్తుతో ఉండటం కూడా మరో కారణం. ముఖ్యంగా గుంపులుగా ఉండే చెట్ల వల్ల ఇక్కడి గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రకృతి సమతుల్యత ఏర్పడుతుంది. ప్రకృతి సమతుల్యత ఉన్న ప్రదేశాల్లో చల్లని, అతి చల్లని వాతావరణం ఉంటుంది. 

Posted in Indian Railways

loco pilots

Where do loco pilots stay after their trip?

In their second home “ running room’. After reaching the relief point towards outside from headquarter they relieved by a new set of crew. Now they have to stay for a minimum of 06 hours to 08 hours at their second home running room. Here are images the of running room.

They have to register their names in the running room register. The crew are given a separate room. Like this. Nowadays mostly all the running rooms are air-conditioned.

After get fresh they have to go to the market to buy the ration for them. Cooks in the running room will make their meals. Now they can read magazines in the hall, can also do meditation, yoga or taking rest in their room.

Thill calls for at dining hall when their meals will ready. Dining hall.

After completing the meal now it is time to take rest. They will call for their train towards headquarter after rest.

Runniisfis distalmost memorable place of loco pilots apart from home.

Posted in సంప్రదాయాలు

తావీజులు కడితే దయ్యాలు భూతాలు వదులుతాయి అంటారు కదా అది ఎంత వరకు నిజం

తావీజులు కడితే దయ్యాలు భూతాలు వదులుతాయి అంటారు కదా అది ఎంత వరకు నిజం!

అందరికి నమస్కారములు రాగి తావీజులు, అష్టబంధనము రేకులు, చేతికి రాగి కడియము, తలుపుకు మధ్యలో రాగి నాణ్యము,రాగిపాత్రలో తాగేనీరు,ఇవన్నీ చెడు ప్రభావము వున్నవన్ని,రాగి తీసుకొని మంచిప్రభావమును బయటికి తోస్తుంది. అందువలన పచ్చగాను,నలుపు రంగుగా మారుతుంది, ఇదే రాగిరేకు బీజాక్షరము లిఖించి దేవుని క్రింద ప్రతిష్ట చేస్తారు, గర్భగుడి పైన ఒక రాగి కలశము ప్రతిష్ట చేస్తారు, ఇవన్నీ,చేడు ప్రభావమును,వేదమంత్రాలు పూజలు వలన,బయటికి నెట్టి, మంచి ప్రభావమును ఆలయములో ప్రసరింప చేస్తుంది.

ఇదేవిధముగా వెండి, ఇత్తడి, ఇదే గుణము ఉంటుంది,బంగారము మాత్రము మంచి ప్రభావమును తప్ప చేడు ప్రభావమును చేర్పించదు అది ఎప్పుడు నలుపు కాదు, మంచి ప్రభావము ఉన్నందు వలన, అది సంపద గాను, విలువ అధికముగా పవిత్రముగా వుంటుంది.

దయ్యాలు భూతాలు అనేది ఏదిలేదు, కొన్ని ప్రతికూలమైన ఆలోచనలు పదే పదే ఆలోచించడము వలన, ఒత్తిడి గురిఅవుతారు దీనిని దయ్యాలు భూతాలుగా నమ్ముతారు, వీరికి ముఖమునకు ముడు సారి నీరు చెల్లు తారు, మానసిక ఒత్తిడి ఆ నిమిషము తగ్గుతుంది. అప్పుడు ఈ తావీజులు వలన దయ్యాలు భూతాలు వెళ్లిపోయింది, అని నమ్మిస్తారు దీని వలన ఈ తావీజులు వలన గుణమైనది అని నమ్మేవారికి, గుణము కావచ్చు?

నమ్మనివారికి తిరిగి మొదటికి వస్తుంది, ఇది పూర్వకాలము పాటించే వారు ఇప్పుడు దయ్యాలు భూతాలను నమ్మకుండా, సంబంధిత వైద్యులను కలవడము మంచిది. (ధన్యవాదములు)

Posted in Indian Railways

Railbus in Indian Railways

It is a light weight passenger vehicle operated by Indian Railways on its tracks. The body of the railbus looks similar to that of those operated on the roads except for the bogies and the wheels. It is generally operated for a short distances in India. A railbus in India looks like this

Since passengers are increasing nowadays railbus is being replaced by EMUs and DMUs

BEML Railbus Specifications

The Length: 10.7m; width: 3.2m; height: 3.65m; wheel-base: 7m. Tare weight is 16t and gross weight is 24t. The body is all steel, with an integral shell design of formed and rolled sections welded together. There are driving cabs at each end of the railbus, each with access through sliding doors one on the side and one leading to the passenger compartment. A door in the middle of the railbus leads to the passenger compartment.

Max. speed 60km/h. Engine: inline 6-cylinder, with mechanical variable speed governor, 175hp. Transmission: automatic hydraulic with twin turbine torque converters. (Allison torque converter, made by Hindustan Motors.) Drive: single driven axle (axle-mounted bevel gear drive with single stage reduction). Brakes: Service brakes use compressed air; there are also standby brakes (with separate brake valves) in case of main brake failure, and air-assisted parking brakes.

Axle/wheel capacity is 13 tonnes; wheel diameter 915mm. Suspension: single-stage with vertical guide, helical spring, and shock absorber. Electricals: 24V 180Ah lead-acid battery for starting, controls, lighting; 24V 45A alternator

Railbus services can be found in states like Andhra Pradesh,Karnataka,Rajasthan,UP etc

Posted in Indian Railways

longest running Superfast train in Indian Railways

The longest running Superfast train in Indian Railways is Aronai Superfast Express.


About Aronai Superfast Express

 • Aronai Superfast Express is a superfast express train that runs between two indian cities Thiruvananthapuram Central, Kerela and Silchar, Assam.
 • The train operates as train number 12507 from Thiruvananthapuram Central to Silchar and as train number 12508 in reverse direction serving 8 indian states i.e. Assam, West Bengal, Bihar, Jharkhand, Odisha, Andhra Pradesh, Tamil Nadu and Kerela.
 • The train travels 3,925 kilometers between Thiruvananthapuram Central and Silchar.
 • The train is being operated by Northeast Frontier Railway zone of Indian Railways.
 • 12507 Aronai SF Express departs Thiruvananthapuram Central on Tuesday at 04:55 pm and arrives Silchar on Friday at 07:00 pm on the fourth day of commencing of journey. The total travel time is 74 hours 05 minutes.
 • 12508 Aronai SF Express departs Silchar on Thursday at 08:05 pm and arrives Thiruvananthapuram Central on Sunday at 10:40 pm on the fourth day of commencing of journey. The total travel time is 74 hours 35 minutes.
 • The train runs with ICF coaches in which there are 4 AC III tier coach, 1 AC II tier coach, 11 sleeper coach, 1 pantry car, 2 unreserved coach and 2 SLR coach. The total coaches in this train is 23 coaches.
 • The train currently holds the unique record of being the longest distance running superfast train in Indian Railways.
 • Initially, the train ran between Guwahati and Thiruvananthapuram Central. On November 21, 2017, the train was extended to Silchar.
 • The train has rake sharing with 12515/12516 Thiruvananthapuram Central – Silchar SF Express.

Note 1 :- As stated above, the 12507/12508 Aronai SF Express has rake sharing with 12515/12516 Thiruvananthapuram Central – Silchar SF Express. Both the train runs via same route and zones of Indian Railways. The main difference between both the train is travel time.

 • The approximate travel time of Aronai SF Express is 74 hours whereas the approximate travel time of 12515/12516 SF Express is 76 hours.
 • So, Aronai SF Express is the longest running superfast train in Indian Railways.

Note 2 :- Before November 21, 2017, the longest running superfast train in India was 22501/22502 New Tinsukia – Bengaluru Weekly SF Express because the train 12507/12508 Aronai SF Express was running between Thiruvananthapuram Central and Guwahati and due to this the total distance travel of New Tinsukia – Bengaluru Weekly SF Express was more than Aronai SF Express.

 • The train New Tinsukia – Bengaluru Weekly SF Express runs 3,563 kilometers between New Tinsukia and Bengaluru whereas the train Aronai SF Express runs 3,546 kilometers between Thiruvananthapuram Central and Guwahati.
 • So, New Tinsukia – Bengaluru Weekly SF Express was the longest running superfast train in Indian Railways before November 21, 2017.