Hernia….హెర్నియా
పొట్టలో ఉండే భాగాలు బయటకు చొచ్చుకు వస్తే ఆ వ్యక్తి పడే బాధ అంతా ఇంతా కాదు. హెర్నియా ఉన్నవాళ్ళు నలుగురిలో తిరగలేక, సాధారణ జీవితం గడప లేక ఎంతో ఆందోళనకు గురవుతుంటారు. కొందరు సమస్యను అలాగే నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. పొట్టభాగంలో కండరభాగం బలహీనపడి పేగులు లేదా ఇతర భాగాలు బయటకు చొచ్చుకు రావడాన్ని హెర్నియా అంటారు. హెర్నియాను నిర్లక్ష్యంచేస్తే ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. బలహీనపడిన కండరభాగం నుంచి బయటకు వచ్చిన పేగులు, ఇతర భాగాలు ఏకారణాల వల్లనైనా పగిలినట్లయితే ఇనఫెక్షన్కు దారితీయవచ్చు. ఇన్ఫెక్షన్ పెరిగిపోతే ప్రాణాలు పొయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హెర్నియాను గుర్తించిన వెంటనే చికిత్స తీసుకోవాలి.ఎన్నో రకాలు : హెర్నియాలో ఇన్సిషనల్ హెర్నియా, ఇంగ్వైనల్ హెర్నియా, ఫిమెరల్ హెర్నియా, హయటల్ హెర్నియా అని పలురకాలున్నాయి. సాధారణంగా ఎక్కువ మందిలో…
Read More
You must be logged in to post a comment.