Kitchen Spices

లవంగం……………..Cloves 

అల్లం……………….Zinger 

వెల్లులి ……………. Garlics 

ఆవాలు ………….. Mustard Seed 

జీలకర్ర< ……………Cumin Seeds 

గసగసాలు ………… Poppy Seeds 

మిరియాలు …………Black Pepper 

పసుపు ……………. Turmeric Powder 

కుంకుం పువ్వు………… Saffron< 

ఏలకులు …………… Cardamom 

వాము ………..Ajowa

ఇంగువ ……… Asafoetida< 

అనాస పువ్వు ……….. Star Anise< ………..

కరివేపాకు ………..Curry Leaf 

బిర్యాని ఆకు ……….. Bay leaf 

మెంతులు ……….. Fenugreek Seeds 

ధనియాలు<……….. Coriander Seeds 

చింతపండు………..Tamarind 

జాజికాయ ………..Nutmeg 

జాపత్రి ……….. Mace< 

సోంపు ………..Fennel 

దాల్చిన చెక్క ……….. Cinnamon 

మరాటి మొగ్గ Wailong 

ఎండు మిరపకాయలు Dry Chillies 

సొంటి Dried Ginger 

షాజీర ………..Shaw jeera 

Popy Seeds…గసగసాలు

చిన్నగా, తెల్లని గింజలలాగా ఉండే గసగసాలకు నొటిలోని అల్సర్లను తగ్గించే గుణం ఉంది. శరీరంపై చల్లదనం చూపిస్తుంది. మహిళలలో సంతాన అవకాశాలను మెరుగుపరుస్తుంది. పాపిసీడ్ అని పిలువబడే ఇవి జింకుకు మంచి ఆధారం. వయసురీత్యా వచ్చే కంటిజబ్బు మాక్యులర్ డీజనరేషన్ వంటి కంటిజబ్బుల అవకాశాలను తగ్గిస్తుంది. డైటరీ పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొలస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Onions / ఉల్లిపాయ

ఉల్లిపాయలో హానికర ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయగల యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఉల్లిని వేల సంవత్సరాల నుంచీ ఆయుర్వేద వైద్యులతోబాటు ఆధునిక నిపుణులు సైతం అద్భుతమైన ఔషధంగా పేర్కొంటున్నారు.
రక్తం గడ్డకట్టకుండా పలుచగా ఉండేలా చేసే ఉల్లిపాయ ఆకలినీ తగ్గిస్తుంది. హృద్రోగులకీ వూబకాయులకీ ఉల్లి ఎంతో మేలు చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చెబుతోంది.
ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాల వల్ల దీర్ఘకాలిక ఆస్తమా, అలర్జిక్‌ బ్రాంకైటిస్‌, జలుబు, దగ్గు… వంటి వ్యాధులన్నీ తగ్గుతాయి.
పచ్చి ఉల్లిపాయ ముక్కని తీసుకుని రెండుమూడు నిమిషాలు నమిలితే చిగుళ్ల వ్యాధులు తగ్గుతాయి. ఇది నోట్లో ఉండే హానికర బ్యాక్టీరియానీ నాశనం చేస్తుంది.
సాధారణంగా ఏ ఇతర ఆహారంలోనూ దొరకని క్రోమియం అనే ఖనిజం ఉల్లిపాయల్లో పుష్కలం. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించేందుకు తోడ్పడుతుంది. అందుకే మధుమేహులు రోజూ చిన్న పచ్చి ఉల్లిపాయని తినడం వల్ల ఫలితం ఉంటుంది.
ఉల్లిపాయల్లో క్యాన్సర్‌ కణాలను అడ్డుకునే క్యుయెర్సిటిన్‌ శాతం చాలా ఎక్కువ.
చెవినొప్పి తీవ్రంగా వస్తుంటే దూది ద్వారా రెండుమూడు చుక్కల ఉల్లి రసం వేస్తే వెంటనే ఫలితం ఉంటుంది. కాస్త తేనె, ఆలివ్‌నూనె, ఉల్లిరసం కలిపి రాస్తే మొటిమలు తగ్గుతాయి.
దగ్గు, గొంతునొప్పిలతో బాధపడేవాళ్లు ఉల్లిరసం, తేనె సమపాళ్లలో కలిపి రోజుకి రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
రక్తహీనతతో బాధపడేవాళ్లకీ ఉల్లిపాయ మంచిదే. ఉల్లితురుములో బెల్లం తురుము కలిపి నీళ్లు చిలకరించి రోజూ తింటుంటే శరీరంలో ఐరన్‌ శాతం పెరుగుతుంది.
ఉల్లిపాయను మరిగించిన నీళ్లు మూత్ర సమస్యలకి మంచి ఔషధంలా పనిచేస్తాయి.

Turmaric Powder / పసుపు

భారతీయ సంస్కృతిలో పసుపుకి విశిష్టమైన స్థానం ఉంది. పసుపును శుభప్రదంగా పరిగణిస్తారు. పూజ పునస్కారాల్లోనే కాదు, వంటకాల్లో కూడా పసుపును విరివిగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద, సిద్ధ, యునానీ, చైనీస్‌ సంప్రదాయ ఔషధాల్లోనూ పసుపును వాడతారు.
పసుపులో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పసుపును రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణకోశ సమస్యలు దూరమవుతాయి.
జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యలకు, చర్మ వ్యాధులకు పసుపు మంచి విరుగుడుగా పనిచేస్తుంది. పసుపులో క్యాన్సర్‌ నిరోధక లక్షణాలు ఉన్నట్లు ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. చిన్న పిల్లలకు గానీ, పెద్దవారికి గానీ కింద పడ్డప్పుడు తగలే చిన్న చిన్న గాయాలకు, గీరుకుపోవటం జరిగితే పసుపు పెట్టటం అనవాయితీ.

Mustard Seed / ఆవాలు

దాదాపు నల్లగా ముదురు రంగులోని ఆవాలను మన దేశంలో ఎక్కువగా వాడతారు. పసుపు, తెలుపు రంగుల్లో కూడా ఇవి లభిస్తాయి. మన దేశంలో పోపు దినుసుగా ఆవాలను విరివిగా ఉపయోగిస్తారు. ఆవకాయ తయారీలోనూ వాడతారు. పాశ్చాత్య దేశాల్లో ఆవాల ముద్దను వంటకాల్లో ఉపయోగిస్తారు. పశ్చిమబెంగాల్‌ ప్రాంతంలో ఆవ ఆకులను ఆకుకూరగా ఉపయోగిస్తారు.
ఆవాల్లో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కొవ్వులు ఎక్కువగా ఉండటంతో ఆవాల నుంచి ఆవనూనెను తీసి వంటకాల్లో ఉపయోగిస్తారు.
తరచుగా అయ్యే గర్భస్రావాలను అరికట్టడంలో ఆవాలు బాగా ఉపయోగపడతాయి. గర్భిణిలు వీటిని తీసుకోవడం వల్ల.. కడుపులోని శిశువుకి హానిచేసే సూక్ష్మక్రిములు నాశనం అవుతాయి. చర్మవ్యాధులతో బాధపడేవారు ఆవ నూనె రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది

Karakkaya / కరక్కాయ

కరక్కాయను వంటల్లో వాడకపోయినా, ఇంటింటా చిట్కా వైద్యాల్లో విరివిగా వాడతారు. కరక్కాయల్లో చాలా రకాలు ఉన్నాయి. భారత్, నేపాల్, భూటాన్, శ్రీలంక, చైనా, వియత్నాం, మలేసియా తదితర ఆసియా దేశాల్లోని అటవీ ప్రాంతాల్లో ఇవి విరివిగా లభిస్తాయి. ఆయుర్వేద వైద్యంలోను, వివిధ దేశాల సంప్రదాయ వైద్యంలోనూ కరక్కాయలను ఉపయోగిస్తారు.
పోషకాలు: పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఆయుర్వేదంలోను, టిబెటన్‌ సంప్రదాయ వైద్యంలోనూ కరక్కాయను సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. దగ్గు, ఉబ్బసం వంటి బాధల నుంచి ఉపశమనానికి కరక్కాయను అరగదీసి, తేనెలో కలిపి వాడతారు. ఉసిరికాయ, తానికాయలతో సమపాళ్లలో కరక్కాయలను కలిపి తయారు చేసే త్రిఫల చూర్ణం జీర్ణకోశ సమస్యలకు, మలబద్ధకానికి, మూలవ్యాధికి చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

Vasa/ వస

ఎక్కువగా మాట్లాడేవాళ్లను వసపిట్టలనీ, వాళ్లకు చిన్నప్పుడు బాగా వసబోసి ఉంటారనీ అంటుంటారు. కానీ వస అనేది ఆయుర్వేదంలో అత్యంత శక్తిమంతమైన ఔషధం. దీని సంస్కృతనామం వచ. అదే తెలుగులో వసగా మారింది. గడ్డి జాతికి చెందిన ఈ ఔషధ మొక్క వేరు పిల్లలకు వచ్చే అన్ని రకాల వ్యాధులనీ తగ్గిస్తుందట. అందుకే దీన్ని పిల్లల ఔషధం అనీ పిలుస్తారు. ఒకలాంటి తియ్యని వాసనతో ఉండే దీని వేరుని ఎండబెట్టి పొడి చేసి ఆయుర్వేదంలో రకరకాలుగా వాడుతుంటారు.
తరచూ అజీర్తితో బాధపడే పిల్లలకు దీని వేరుని మంటమీద కాల్చి, పొడి చేసి, ఓ చిటికెడు పొడిని తల్లి పాలతో కలిపి తాగిస్తారు. అరకప్పు మరిగించిన నీళ్లలో ముప్పావు టీస్పూను శొంఠిపొడి, చిటికెడు వసపొడి వేసి తాగితే పెద్దవాళ్లలోనూ జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
పిల్లల చేతికి ఈ వేరుని కంకణంగా కడుతుంటారు. వాళ్లు దాన్ని నోట్లో పెట్టుకుని చీకుతుంటే ఆ రసం కొంచెంకొంచెంగా కడుపులోకి వెళ్లి బ్యాక్టీరియా, వైరస్ల్లాంటివి పొట్టలోకి చేరకుండా ఉంటాయట. గొంతునొప్పి, దగ్గులతో బాధపడేవాళ్లు చిన్న వస ముక్కని దంచి, కాసేపు నోట్లో పెట్టుకుని, కొంచెం కొంచెంగా ఆ రసాన్ని మింగితే ఉపశమనం ఉంటుంది. అలాగే మాటలు త్వరగా రానివాళ్లకి కూడా చిటికెడు పొడిని తేనెతో కలిపి నాకిస్తారు.
మతిమరపు, డిప్రెషన్, మూర్ఛ… వంటి నరాల సంబంధ వ్యాధులతో బాధపడేవాళ్లకి వస వేరుని దంచి, మరిగించి, చల్లార్చిన డికాక్షన్ని ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. డయేరియాకీ ఇది మంచి మందే. చిటికెడు వస పొడిని తేనెతో కలిపి ఇస్తే డయేరియా కూడా తగ్గుతుంది.
దీన్నుంచి తీసిన గాఢ తైలాన్ని చర్మసంబంధ ఇన్ఫెక్షన్లు, తలనొప్పి, ఆర్థ్రయిటిస్, కీళ్లనొప్పులు తగ్గడానికీ వాడుతుంటారు.
వసపొడిని కాసిని నీళ్లలో కలిపి ఇంట్లో అక్కడక్కడా చల్లడం ద్వారా కీటకాలను అడ్డుకోవచ్చు. అలాగే దీన్ని పలుచని బట్టలోకట్టి కబోర్డులూ బీరువాల్లో పెట్టితే బొద్దికలూ తెల్లని పుస్తకాల పురుగుల్లాంటివి చేరకుండా ఉంటాయి.

Cardamom/ యాలకులు

యాలకుల్లో మాంసకృత్తులూ, పీచూ, పిండిపదార్థాలతోపాటూ మరెన్నో పోషకాలూ ఉంటాయి. యాలకుల్లోని ఇనుము, రాగి, విటమిన్-సి, రైబోఫ్లేవిన్ రక్తహీనతను నివారిస్తాయి. ప్రతిరోజూ పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చటి పాలల్లో అరచెంచా యాలకులపొడీ, పసుపూ, చక్కెరా వేసుకుని తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది.
పొటాషియం, మెగ్నిషియం, క్యాల్షియంలతోపాటు యాలకుల్లో కావాల్సినంత స్థాయిలో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. పొటాషియం గుండె కొట్టుకునే వేగాన్ని క్రమబద్ధంగా ఉంచుతూ, అధికరక్తపోటు సమస్యను అదుపులో ఉంచుతుంది.
యాలకులు ఆకలినీ పెంచుతాయి. రోజూ రెండు బుగ్గన పెట్టుకుని నమిలినా చాలు.. ప్రయోజనం ఉంటుంది.
వికారం, వాంతి వస్తున్నట్టు అనిపించినప్పుడు రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే చాలు. సమస్యలు అదుపులో ఉంటాయి.
గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు రెండుమూడు యాలకులు వేసి మరిగించిన నీటిని పొద్దున్నే పుక్కిలిస్తే ప్రయోజనం ఉంటుంది.
యాలకులని నమలడం వల్ల నోటిదుర్వాసన సమస్య అదుపులో ఉంటుంది. చిగుళ్ల సమస్యలు కూడా చాలామటుకూ తగ్గుతాయి. యాలకులతో చేసిన నూనెని పెదాలకు రాయడం వల్ల ఆరోగ్యంగా కనిపిస్తాయి. అలాగే ముఖానికి రాస్తే ఛాయ పెరుగుతుంది.

Biryani Leaves / బిర్యానీ ఆకులు

బిర్యానీలూ పలావుల్లో వాడే ఆకులు మనందరికీ సుపరిచితమే. కానీ వీటిని సువాసన కోసమే వాడి వదిలేస్తుంటాం. కానీ ఈ ఆకుల్లో విటమిన్‌-సి, ఎ, మాంగనీస్‌, ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం… వంటి పోషకాలెన్నో ఉన్నాయి. ఇంకా వీటిల్లోని యూజెనాల్‌, క్యుయెర్సెటిన్‌, కెటెచిన్‌…వంటి ఆమ్లాలు క్యాన్సర్‌ కంతులు రాకుండా అడ్డుకుంటాయి. అందుకే ఈ ఆకుల్ని తేయాకు మాదిరిగానే తుంపి మరిగించి టీలా కూడా తీసుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
— తాజా ఆకులు పదిహేనువరకూ తీసుకుని ముక్కలుగా తుంచి మూడు కప్పుల నీళ్లలో వేసి వాటిని ఓ కప్పు అయ్యేలా మరిగించి చల్లారాక రోజూ రాత్రిపూట తీసుకుంటే కొలెస్ట్రాల్‌, మధుమేహం… వంటి వ్యాధులు తగ్గుముఖం పడతాయట.
— వూబకాయంతో బాధపడేవాళ్లు సుమారు 30 ఆకుల్ని తీసుకుని నాలుగు కప్పుల నీళ్లలో వేసి రెండు కప్పులయ్యేవరకూ మరిగించి రోజుకి రెండుపూటలా కప్పు చొప్పున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట. ఈ ఆకుల్ని మరిగించిన నీరు బీపీ రోగులకూ మంచిదేనట.
— తరచూ అల్సర్లతో బాధపడేవాళ్లు కూడా ఈ ఆకుల్ని అరలీటరు నీళ్లలో వేసి పావుగంటసేపు మరిగించి కాస్త పంచదార వేసుకుని టీలా తీసుకుంటే ఆ నొప్పి తగ్గుతుంది. ఈ నీరు డయేరియాకు కూడా మంచి మందులా పనిచేస్తుందట.
— ఈ ఆకుల్నీ కమలాతొక్కల్నీ ఎండబెట్టి నీళ్లతో మెత్తగా రుబ్బి పేస్టులా వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి.

Salt / ఉప్పు

ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ఇబ్బందే.
భారతీయులు ఉపయోగించినంత ఎక్కువగా ఉప్పు ప్రపంచంలో ఎవరూ ఉపయోగించరు. ఇదివరకటి కాలంలో ప్రజలు వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడేవారు. వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. వారు చేసే శ్రమవల్ల ఒంట్లోని ఉప్పు చెమట ద్వారా వెళ్లిపోయేది. కనుక వారికి ఉప్పు అవసరమయ్యేది.అందుకే వీరు మజ్జిగలో, పెరుగులో ఉప్పు కలుపుకుంటారు.
నేడు జీవన విధానం మారి శ్రమ తగ్గటం వలన ఉప్పును తప్పనిసరిగా తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
భారతీయులు రోజువారీ వాటకంలో పరిమితికి పదిరెట్లు అధికంగా ఉప్పు వాడుతున్నారని పరిశోధనలలో తెలిసింది. బి.పి రావాటానికి కారణం ఉప్పు అధికంగా తీసుకోవటం వలననే సూత్రీకరించారు. ఉప్పును పూర్తిగా మానివేయమని వైద్యులు చెబితేనే మానివేయాలి. సొంత నిర్ణయాలు పనికిరావు. డాక్టర్లు కూడా ఉప్పు వాడకూడదని నిర్ణయించినపుడు దానికి ప్రత్యామ్నాయంగా సైంధవలవణం వాడమంటారే కానీ పూర్తిగా మానివేయమనరు.
ఉప్పును తగిన మోతాదులో వాడితే
…… ఉప్పు శరీరాని అవసరం అది రుచిని మాత్రమే కాదు ఇతర లాభాలనూ అందిస్తుంది. శరీరంలో ద్రవపదార్ధాల స్థిరీకరణలో ఉప్పు పాత్ర ఉంది. జీర్ణ క్రియలో సహాయపడుతుంది. ఆకలిని కలిగిస్తుంది. శరీరంలోని మలినాలను తొలగించటంలో, విషపూరితమైన పదార్ధాల ప్రభావం తగ్గించటంలో ఉప్పు ఎంతగానో సహాపడుతుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరులో పాత్ర వహిస్తుంది. హార్మోన్ లు సమస్థితిలో ఉంచటంలో ఉప్పుకు పాత్ర ఉంది.
ఉప్పను అతిగా వాడటం కూడా ప్రమాదమే. అయితే ఈ ఉప్పు రోజుకు కావాల్సింది 5–10 గ్రాములు మాత్రమే. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఈ మాత్రం ఉప్పుని బయటకు పంపడానికి కిడ్నీలు 150 లీటర్ల రక్తాన్ని వడబోస్తాయి, ( శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది, దానిని ముఫై సార్లు వడబోస్తుంది కిడ్నీ) అయితే ఒకొక్క గ్రాము ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ రక్తాన్ని కిడ్నీలు వడబోయాల్సి ఉంటుంది, అందువలన కిడ్నీలు త్వరగా పాడయ్యి రక్తపీడనం అధికం అవుతుంది. రక్త పీడనం అధికం అవడం వలన రక్త నాళాలు గట్టిబడటం, చిట్లడం, పగలడం జరిగి రక్త స్రావం జరగడం తద్వారా గుండెపోటు, పక్షవాతం రావడం, ఆకస్మిక మృతి జరుగుతుంది. అందువలన అధికంగా ఉప్పు తీసుకోకూడదు. సాధారణంగా మనకు కూరలో, చారులో వేసే ఉప్పు చాలు, మళ్లీ తినేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఉప్పు వాడకూడదు. వంట గదిలో ఉప్పు డబ్బాలో చిన్న చెంచా పెట్టాలి. తద్వారా ఉప్పు తక్కువ పడుతుంది వంటలో. ఉప్పు మానేసి తిండి తినొద్దు. 


అయోడిన్ ఉప్పును ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. కానీ సహజమైన ఆహార పదార్ధాల వలన శరీరానికి తగిన అయోడిన్ అందుతుంది. అయోడిన్ అధికమైతే థైరాయిడ్ గ్రంథి మీద ప్రభావం పడి హైపర్ థైరాయిడిజమ్ వస్తుంది. నేడు భారీ సంస్థలు ఉప్పు తయారీలో ప్రవేశించి ఉప్పును మొత్తగా, తెల్లగా వుంటే తప్పించి తినలేని విధంగా ప్రజలను ఒప్పించారు వ్యాపార ప్రకటనల ద్వారా. అయోడిన్ కలిపిన ఉప్పే ఆరోగ్యం అని నమ్మించారు. వాస్తవానికి అయోడిన్ లభించని ప్రదేశాలలో మాత్రమే అయోడైజ్డ్ ఉప్పు అవసం. కానీ అందరి చేతా దానిని తినిపించి థైరాయిండ్ ను ఇబ్బంది పెడుతున్నారు. భారతీయ ఆయుర్వేద వైద్యం సైంధవలవణం (రాక్ సాల్ట్) ఉత్తమం అంటుంది. సహజంగా తయారైన ఉప్పును తినవచ్చ. నేడు మనం తినే ఉప్పు పిత్త దోషాన్ని పెంచుతున్నదనీ, సైంధవలవణం త్రిదోషాలను సమతుల్యంలో ఉంచుతుందని, రిఫైన్డ్ ఉప్పుకన్నా సాధారణ ఉప్పే మేలన్నది వారి సలహా
నిపుణుల సలహాలు…
వంటకాలలో ఉప్పును తగ్గించి వాటి బదులు ఉల్లి, వెల్లుల్లి, నిమ్మ, ఆకుకూరలు, మసాలదినుసులు వేస్తే వాటిద్వారా శరీరానికి తగిన ఉప్పు అందుతుంది.
ఆకుకూరలు లేదా నిలవవుంచిన ఆహార పదార్ధాలు తినేప్పుడు ముందుగా వాటిని బాగా నీటిలో కడిగితే వాటికి అంటివున్న అదనపు లవణాలు, మలినాలు తొలగిపోతాయి.
ఆహారంలో భాగంగా పొటాషియం అధికంగా గల బంగాళాదుంపలు, చిలగడ దుంపలు, టమాటోలు, ఆకు కూరలు తినవచ్చు. వీటిలో ఉప్పు సహజంగా ఉంటుంది. పోటాషియం శరీరంలోకి వచ్చే సోడియం ప్రభావానికి విరుగుడుగా పనిచేసి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
పదార్ధాలను వండే తీరును మార్చుకుని వాటిలో రుచికోసం నిమ్మరసం, కొత్తిమీర వాడుకుని ఉప్పును తగ్గించవచ్చు.

Zinger / అల్లం

వేల సంవత్సరాలుగా భారతదేశంలో అనేక వ్యాధులను నయం చేయటానికి అల్లంను వాడుచున్నారు. అల్లం సహజసిద్ధమైన ఔషధం.
అల్లంలోని ఎలర్జీలను తగ్గించే గుణం వలన ఉబ్బసం, రొమ్ముపడిశం తగ్గుతాయి.
గొంతునొప్పి : ఒక టీ చెంచా అల్లం రసాన్ని తేనెతో కలిపి తింటే గొంతునొప్పి తగ్గుతుంది.
ఉబ్బసరోగులకు : మెంతి ఆకుల రసం, తాజా అల్లం రసం, తేనె ఈ మూడింటిని సమానంగా తీసుకుని క్రమం తప్పకుండా వాటితే ఉబ్బసరోగులు ఉపశాంతి లభిస్తుంది.
వేవిళ్లు తగ్గటానికి : స్త్రీలు గర్భం ధరించినపుడు వేవిళ్లు రావటం సహజం, దీనితో వాంతులు, వికారం రెండింటితోనూ బాధపడుతుంటారు. వేవిళ్లు తగ్గటానికి ఉదయంపూట ఓ చిన్న అల్లం ముక్కను నోట్లో ఉంచుకుని చప్పరిస్తూ ఉండాలి. లేదా అల్లరసం ఒక చెంచా తాగవచ్చు. ఒక చెంచా అల్లం రసం మాత్రమే తాగాలి. అంతకు మించి తాగకూడదు.
అన్నం తినే ముందు ఒక చిన్న అల్లంముక్కను తింటే ఆకలి పెరుగుతుంది.
తలనొప్పి : బాగా పల్చగా చేసిన అల్లం పేస్ట్ ను నుదిటిపై రాసుకుంటే తలనొప్పి, మైగ్రేన్ నొప్పి తగ్గుతాయి.
కీళ్లనొప్పులు : అల్లంను క్రమం తప్పకుండా వాడుతుంటే కీళ్లనొప్పులు నెమ్మదిస్తాయి. కొన్ని చుక్కల అల్లం రసాన్ని నీళ్లలో వేసుకుని తాగితే కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు తగ్గుతాయంటారు.
ప్రయాణాల్లో కలిగే వికారం, శస్త్రచికిత్స తరువాత వచ్చే వికారం, కీమో ధెరపీ వల్ల వచ్చే వికారం అల్లం రసం తాగటం వలన తగ్గుతుంది.
కడుపుబ్బరం, వాయుప్రకోపం తగ్గటానికి : కడుపులోని గ్యాస్ ను బయటకు పంపటంలో అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. కడుపులోని గ్యాస్ ఇబ్బంది పెడుతుంటే, కడుపు ఉబ్బరంగా ఉంటే ఒక చిన్న అల్లం ముక్కను బాగా దంచి రసంతీసి తేటను తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది.
ఎక్కువగా కడుపు ఉబ్బరంగా ఉంటే వామును కూడా దంచి అల్లం రసంలో కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. అల్లం రసాన్ని రోజు మొత్తం మీద రెండు చెంచాలు మించకుండా తాగాలి.

మెంతులు-Fenugreek Seeds

మనదేశంలో మెంతులు ఎక్కవగా వాడరు. కానీ వీటి ప్రాధాన్యతను తెలుసుకుంటే వంటలలో తప్పనిసరిగా వాడతారు. మెంతులలో కరిగే పీచు ఎక్కువ. మెంతులు తినటం వలన జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. దానిద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా పెరుగుతాయి. కనుక డయాబెటిస్ వారు క్రమం తప్పకుండా మెంతులను వాడడం వలన కొంతవరకు డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కొలస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా మెంతులు సహకరిస్తాయి. ముఖ్యంగా లోడెన్సిటీ లిపోప్రోటీన్ ను తగ్గిస్తాయి. కొలస్ట్రాల్ ను, ట్రైగ్లజరాయిడ్స్ ను శరీరం గ్రహించకుండా అడ్డగిస్తాయి. మెంతులలో ఉండే అత్యధిక పీచువల్ల మలబద్ధకం రానివ్వదు. డయేరియా, అజీర్ణాలను అరికడుతుంది. మెంతిపిండిని ఇంట్లో తయారు చేసుకొని చక్కని స్క్రబ్ లేదా మాస్క్ గా ఉపయోగించుకోవచ్చు. క్రమం తప్పకుండా వాడుతూవుంటే చర్మానికి మెరుపుదనం వస్తుంది. మృతకణాలు తొలగిపోతాయి. నీళ్లలో మెంతులను నానబెట్టి వీటిలో శెనగపిండి, పెరుగుకలిపి చర్మంపై రాసుకోవాలి. నల్లని వలయాలు తగ్గుతాయి. సూర్యకిరణాలవల్ల కమిలిన చర్మానికి సరైన చికిత్స. శిరోజాల పెరుగుదలకు కూడా మెంతులు సహకరిస్తాయి. పొడి లేక నానబెట్టి రోజు క్రమం తప్పకుండా తినటం వలన శిరోజాలకు మేలు జరుగుతుంది. మెంతిపిండి చుండ్రును అరికడుతుంది. ఒక పూర్తి రాత్రి మెంతులను నీటిలో నానబెట్టి వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని తలకు పట్టించి అరగంట ఆగి కడిగివేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే చుండ్రుసమస్య తగ్గుతుంది. మన తెలుగు వంటలలో దోశెలలో రుచికోసం, రంగుకోసం మెంతులు కలుపుతారు. కానీ గోధుమ, శెనగపిండి, రాగిపిండిలతో చపాతీలు, పరోటాలు, ఇడ్లీ పిండిలో, ప్యాన్ కేక్స్ చేసేటపుడు కొద్దిమెతాదులో మెంతిపిండి కలిపితే (ఎక్కువ కలిపితే చేదు వస్తుంది) పీచుశాతం పెరిగి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రతివారు క్రమంతప్పకుండా మెంతులను తినవచ్చు. రాత్రంతా మెంతులను నానబెట్టి ఉదయం పూట ఏమీ తినకుండా ఆ నీటిని త్రాగవచ్చు. తరువాత కనీసం ఒక అరగంటసేపు ఏమీ తినరాదు. మామూలుగా ఒక టీస్పూన్ మెంతులు తినవచ్చు. ఎలర్జీ కలవారు డాక్టర్ సలహాపై వీటిని వాడవలెను

Garlics / వెల్లుల్లి

Garlics / వెల్లుల్లి


ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అని మన పూర్వీకులంటారు. ప్లేగు వ్యాధిని తగ్గిస్తుంది. కోలెస్టరాల్‌ని కరిగిస్తుంది రక్తపు పోటుకి పోటును అదుపులో ఉంచేది. జీర్ణశక్తిని పెంచేది, వెల్లల్లి ప్రత్యేకతలని ఇంకా చాలా ఉన్నాయి.
వెల్లుల్లి (Garlic) మొక్క శాస్త్రీయ నామం ‘ఏలియం సెతీవం’ (Allium sativum). ఉల్లి వర్గానికి చెందినది. దీనిలో గంధకపు ద్రవ్యాలు ఎక్కువగా ఉండడం వల్ల దీనినుండి వచ్చే వాసన ఘాటుగా ఉంటుంది. ఈ వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం; నీరుల్లి కన్నా ఔషధ గుణాలు ఎక్కువ.
అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. భారతదేశంలో సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువలని గుర్తించారు ఇటీవల ఎల్లోపతీ వైద్యం కూడ వెల్లుల్లి విలువని గుర్తించింది.
వెల్లుల్లి గురించి….
>అతి ప్రాచీనమైన ఆయుర్వేద గ్రంథాలలో వెల్లుల్లి ప్రస్తావన ఉంది. ఒక బ్రిటీష్ ప్రభుత్వోద్యోగి 1890లో సేకరించిన “బోవర్ మేన్యుస్క్రిప్ట్‌ (Bower Manuscript) అనే తాళపత్ర గ్రంథం ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బొడ్లియెన్ గ్రంథాలయంలో ఉంది. ఇది 6 శతాబ్దంలో రాసిన మాతృకకి నకలు. ఈ గ్రంథంలో వెల్లుల్లి ప్రస్తావన అనేక సార్లు చెప్పబడింది.
ఔషధ విలువలు…. >
వైద్య పరంగా వెల్లుల్లి అనేక జబ్బులకు దివ్యౌషధంగా వినియోగపడుతుంది. అధిక రక్తపోటుని వివారించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉప యోగపడుతుంది. ఇందులో లభ్యమయ్యే హైడ్రోజన్‌ సల్ఫేట్‌, నైట్రిక్ యాసిడ్‌ రక్తనాళాల ఉపశమనానికి ఎంతగానో దోహదపడతాయి. వెల్లుల్లి తీసుకోడం వలన జీర్ణశక్తి వృద్ధిచెంది మంచి ఆకలి పుడుతుంది. వెల్లుల్లి అల్లంతో కలిపి తింటూవుంటే ఎటువంటి ఎలర్జీలు దరిచేరవు. ప్రతి నిత్యం పరగడుపున 2, 3 వెల్లుల్లి రేకలు తినడం వలన ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. వెల్లుల్లి మీద చేసిన అనేక అధ్యయనాల వల్ల ఇందులో శృంగారాన్ని పెంపొందించి వీర్యవృద్ధిని కలిగించే శక్తి ఉందని వెల్లడయింది. అంతే కాక శృంగారం పట్ల ఆసక్తిని పెంచే గుణం కూడా ఇందులో ఉందని ఈ అధ్యయనాల వల్ల పరిశోధకులు వివరించడం జరిగింది. లూయీ పాశ్చర్‌ 1858లో, వెల్లుల్లిలో బేక్టీరియాని నిర్మూలించగల శక్తి, అలాగే మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ప్రబలిన గాంగ్రీన్‌ వ్యాధిని నిర్మూలించే శక్తీ ఉన్నాయని కనుగొన్నాడు. తూర్పు యూరప్‌ దేశాలలో వెల్లుల్లి రేకల్ని పంచదార, ఉప్పు , మొదలైన వాటిలో ఊరబెట్టి ఆ ఊరగాయని అడపాదడపా జీర్ణవృద్ధిని పెంపొందించుకోడం కోసం వాడుతూవుంటారు. వెల్లుల్లిని పొడిగా కూడా తయారుచేసుకుని నిల్వ ఉంచుకుంటారు. ఒక చెంచాలో 1/8వ వంతు వెల్లుల్లి గుండ ఒక వెల్లుల్లి రేకతో సమానంగా ఉంటుంది. వెల్లుల్లిలో థయామిన్‌ లోపాన్ని తగ్గించి అభివృద్ధిచేసే గుణం కూడా పుష్కలంగా ఉంది. వెల్లుల్లిలో విటమిన్‌ ‘సి’ అత్యంత అధికంగా ఉండడం వల్ల నోటి వ్యాధులకి దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని 1924లోనే కనుగొనడం జరిగింది. అంతేకాక ఉబ్బసం, జ్వరం, కడుపులో నులిపురుగుల నివారణకి, లివర్‌ (కాలేయం) వ్యాధులకీ చక్కటి ఔషధంగా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. అలాగే గుండెజబ్బులకి దీనిని మించిన ఔషధం లేదంటారు. జుట్టు రాలిపోకుండా మంచిగా పెరగడానికి ఎంతో దోహదపడుతుంది. లుకోడెర్మా, కుష్ఠు వ్యాధులకి కూడా ఇది అవెూఘంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల క్షయ వ్యాధికి, న్యూవెూనియాకి దీనికి మించినది లేదు. 3 వెల్లుల్లి పాయలను పాలతో మరగబెట్టి పడుకునే ముందు రాత్రిపూట సేవిస్తే ఉబ్బసం తగ్గిపోతుంది.
రక్తపోటుని నియంత్రించడంలోను, టెన్షన్‌ తగ్గించడంలోను, జీర్ణకోశ వ్యాధుల నివారణకి, రక్తకణాల్లో కొలస్ట్రాల్‌ శాతాన్ని అదుపుచేయడానికి వెల్లుల్లిని మించిన ఔషధం లేదు. వారాని కి 5 వెల్లుల్లిపాయలు పచ్చివి తిన్నా, పండినవి తిన్నా కేన్సర్‌ వ్యాధిని 40 నుంచి 50 శాతం వరకూ నిర్మూలిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వెల్లుల్లి సర్వరోగనివారిణి అనే అనవచ్చు.
వైద్యపరంగా వాడే విధానము
మనలో చాలా మందికి తరచుగా జలుబు , ముక్కు దిబ్బడ , జ్వరం వస్తు ఉంటాయి …. వారు వెల్లుల్లి రోజు ఆహారంలో తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరిగి తరచుగా వచ్చే స్థితిని తగ్గిస్తుంది . అర చెంచా నేతిలో వేయించియన రెండు వెల్లుల్లి పాయలను క్రమం తప్పకుండా రోజూ తినాలి . మీ ముఖం , శరీరం వర్చస్సు ఆకర్షణీయంగా ఉండాలంటే రెండు వెల్లుల్లి పాయల రసం అరగ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోండి . దీనివల్ల రక్తం శుభ్రపడి దేహకాంతి పెరుగుతుంది . అపుడు చాక్లెట్లు , మసాలా వస్తువులు తినకూడదు .
ఒక వెల్లుల్లి పాయ తిని , రాగిచెంబులో నీరు సాధ్యమైనంత ఎక్కువ తాగితే రక్తంలోని వ్యర్ధ పదార్ధాలు మూత్రం ద్వారా వచ్చేసి మనం శుభ్రపడతాం , మనం తినే ఆహారంలో వెల్లుల్లి చేర్చి తింటే మనల్లో ఎక్కువగా ఉండే కొలెస్టరాల్ తగ్గిపోతుంది . LDL ని నియంత్రించే anti-oxident గా పనిచేస్తుంది . ఒళ్ళు తగ్గాలని అనుకుంటున్నారా? .. సగం నిమ్మకాయ రసం లో కొంచెం వేడి నీళ్లు కలిపి అందులో రెండు వేల్లుల్లిపాయల రసం కలిపి ఉదయము , సాయంత్రం తీసుకుంటే క్రమముగా ఒళ్ళు తగ్గుతుంది . ఈ సమయం లో కొవ్వుపదార్ధాలు , పగటి నిద్ర మానేయాలి . . . కొంచెం వ్యాయాయం చేయాలి ( నడక). అర్ధ రాత్రి చెవిపోటు వస్తే … డాక్టర్ , మందులు దొరకవు కావున వేడిచేసిన వెల్లుల్లి రసం గోరువెచ్చగా ఉన్నప్పుడు నాలుగు చుక్కలు వేయండి చెవి నొప్పి తగ్గిపోతుంది . గర్భిణిగా ఉన్నప్పుడు రోజూ ఒక వెల్లుల్లి పాలతో తీసుకుంటే కడుపులో బిడ్డ బలంగా ఎదుగుతుంది . రోజూ రెండు వెల్లుల్లి పాయలను కాన్సర్ ఉన్నవారు తీసుకుంటే క్యాన్సర్ కణాలు తిరిగి గడ్డకట్టడం దూరమువుతుంది . మోకాళ్ళు నొప్పులు ఉన్నవారు వెల్లుల్లి రసం ఎనిమిది చుక్కలు అరగ్లాసు నీటిలో కలిపి రోజూ తీసుకుంటే కొన్నాళ్ళకు నొప్పులు తగ్గిపోతాయి .
జాగ్రత్తలు :
వెల్లుల్లి లో సల్ఫర్ ఎక్కువగా ఉన్నందున చిన్న పిల్లలకు తక్కువ మోతాదులో వాడాలి . ఎక్కువైతే గాబరా పడతారు వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది .. కొత్నమందికి కడుపులో మంట పుడుతుంది . వెల్లుల్లి కొంతమందికి పడదు .. ఎలర్జీ వస్తుంది , దురదలు , తలనొప్పి , ఆయాసం వస్తాయి . వీరు వెల్లుల్లి తినరాదు . ఆస్తమా ఉన్నవారు వెల్లుల్లి అస్సలు వాడకూడదు .

Cumin seeds-జీలకర్ర

జీలకర్రను మనం రోజువారీగా పయోగిస్తూ ఉంటాం. జీలకర్ర రెండు రకాలు. నల్ల జీలకర్ర, తెల్ల జీలకర్ర. నల్ల జీలకర్రను షాజీర అంటారు. రెంటికీ ఔషధ గుణాలున్నాయి. వీటిని అనేక గృహ చికిత్సలకు వాడుతూ ఉంటారు . ఇది వంట ఇంట్లో వాడుకునే పోపు దినుసులలో ఒకటి . దీని శాస్త్రీయ నామము cuminuma cyminum . ఇది సుమారు 30-50 సెంటిమీటర్లు పెరిగే మొక్క. దీని గింజలు గోధుమ రంగులో ఉన్న చిన్న గింజలు . గింజలనే వంటకాల లోనూ , ఔషధము గాను వాడుతారు . ప్రాచీన కాలము నుండి ఇది వాడుకలో ఉంది .. హిందూ వివాహములో జీలకర్ర బెల్లము తలపై పెట్టుకోవడం ఒక ముఖ్యమైన ఘట్టము .
కడుపులో నులిపురుగుల నివారణకు :
జీలకర్రను తీసుకోవాలి. మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.
గుండె నొప్పులు తగ్గుటకు :
జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఎలర్జీకి తగ్గుటకూ : శరీరంలో ఏర్పడే తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి, వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. ఇందుకుగాను సులభమైన పెరటి వైద్యం జీలకర్ర – చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలర్జీకి జీలకర్ర గొప్ప ఔషధం.

గర్భాశయ బాధలు తగ్గుటకు
జీలకర్రను నేతిలో వేయించి, మెత్తగా దంచి సైంధవలవణం లేదా ఉప్పును కలిపి 2 పూటలా తీసుకొంటే గర్భాశయ బాధలు నెమ్మదిస్తాయి. దీన్ని అన్నంలో కాని, మజ్జిగలో కాని తీసుకోవాలి.

మూత్ర సంబంధ వ్యాధులకు :
జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని కుంకుడు కాయంత మాత్రలు చేసుకొని 2 పూటలా 2 చొప్పున మాత్రలు వేసుకొవాలి. దీనివల్ల మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి.

నీరసము తగ్గుటకు :
ఎప్పూడూ నీరసం, కాళ్ళ నొప్పులు, పైత్యంతో బాధపడుతున్నవారు జీలకర్రను గాని, ధనియాలు మరియు జీలకర్ర మిశ్రమం గాని తీసుకొంటే మంచిది.

పేగులు శుభ్రపరచుట :
ధనియాలు, జీలకర్ర సమానపాళ్ళలో తీసుకొని వాటిని విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. అందులో తగినంగ సైంధవలవణం లేదా ఉప్పును కలిపి, అన్నంలో, టిఫిన్లు, మజ్జిగలో కలుపుకొని వాడుకుంటే పేగులు శుభ్రపడి రోగాలకుదూరంగా ఉంటారు.

పైత్యరోగాలకు :
జీలకర్రను నిమ్మరసముతో కలిపి సూర్యోదయ సమయాన , సూర్యాస్తమ సమయమున రెండపూటలా తింటే … తలతిప్పు , కడుపులోని వేడిని మొదలగు పైత్యరోగములు తగ్గును .

నీళ్ళవిరోచనాలు తగ్గుటకు :

అరతులము జీలకర్ర ఇనుమూ గరిటె లో మాడబెట్టి అందులులో 5-6 తులముల నీరు పోసి … చల్లారిన తరువాత ప్రతి 4 గంటలకొకసారి తీసుకుంటే నీళ్ళవిరోచాను తగ్గుతాయి

వాంతులు తగ్గుటకు : వేయించం జీలకర్ర తో సమముగా సైంధవలవణము కలిపి నూరి .. సీసాలో బద్రపరిచి రోజుకు కొంచము కొంచము గా రెండుపూటలా ఇచ్చిన వాంతులు తగ్గును

Vamu / వాము

వాము ఒక విధమైన వంటలలో ఉపయోగించే గింజలు. వాము లేదా ఓమను సంస్కృతం లో దీప్యక అని, హిందీలో అజవాన్ అని అంటారు. వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ పువ్వులనుంచే విత్తులు వస్తాయి. వాము శరీరంలో వాతాన్ని హరింపజే స్తుంది. శూలలను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపు ఉబ్బరం, ప్లీహవృద్ధిని తగ్గిస్తుంది. వాంతులను తగ్గిస్తుంది. గుండెకు కూడా అత్యంత ఉపయోగకారి.
వాము భారతదేశ వాసులకు తెలిసిన గొప్ప ఓషధి. దీనిని భారతదేశమంతటా పండిస్తారు. ఎక్కువగా మన రాష్ట్రంతో సహా మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సాగుచేస్తారు.
చలి వాతావరణంలో బాగా పెరుగుతుంది. ఇది తెల్లని పూలు కలిగిన చిన్న ఏక వార్షికపు మొక్క. దీని గింజల నుంచి సుగంధ తైలాన్ని డిస్టిలేషన్ విధానం ద్వారా వేరుపరిచి థైమాల్గా మార్కెట్ చేస్తుంటారు. వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. ఈరోజు అరిగినట్లు లేదే అనగానే, ‘కాసింత వాము వేణ్ణీళ్లతో కలిపి నమలవే. సమస్య తీరిపోతుంది’ అనే అమ్మమ్మల మాటలు గుర్తుండే ఉంటాయి. సాధారణంగా మనం వామును చక్రాలు(జంతికలు, మురుకులు) చేసినపుడు వాడుతుంటాం. పూర్వంనుండి వాడుతున్నారని వాడటమే తప్ప ఇందులోని సుగుణాలు చాలామందికి తెలియవు. వాము జీర్ణశక్తికి మంచిదని మాత్రం చాలామందికి తెలుసు.
వాము జీలకర్రలా అనిపించినా చిన్నగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా చేసే మేలులో పెద్ద స్థానాన్నే ఆక్రమించింది. వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి
వాముతో దోమలను దూరంగా ఉంచవచ్చు. వాము పొడిని ఆవనూనెతో కలిపి ఈ మిశ్రమాన్నిఅట్టముక్కలపై పూసి గది మూలలో వేలాడదీయాలి.
అజీర్ణం, ఆకలి తగ్గటం, కడుపునొప్పి వంటి సమస్యలకు వాము చక్కటి పరిష్కారం. కొద్దిగా వామును కొద్దిగా ఉప్పుతో కలిపి తింటే ఈ సమస్యలను బయటపడవచ్చు.

చింతపండు-Tamarind

ఏడు రుచులలో పులుపుకు ఉన్న ప్రాముఖ్యత వేరుగా ఉంటుంది. చింతపండు మన వంట రుచిని అమోఘంగా మారుస్తుంది.
పానీ పూరి తయారీలో చింతపండు వాడకం ఎక్కువ. తెలుగువారింట జరిగే శుభ కార్యక్రమాలలో చింతపండుతో చేసిన పులిహోర తప్పనిసరి.
ప్రయోజనాలు
జలుబు ముక్కు దిబ్బెడ నివారణలో అద్భుతంగా పనిచేస్తుంది. చింతపండు నానబెట్టిన నీరు, ఓ టీస్పూన్ నెయ్యి, కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి కాచి వేడి వేడిగా తాగితే ముక్కునుంచి, కంటినుంచి నీరు కారి ముక్కుల బ్లాక్ తగ్గుతుంది.
చింతపండు గుజ్జు జీర్ణకారి, కడుపుబ్బరం, తగ్గిస్తుంది. కూలింగ్, లాక్సేటివ్, యాంటీ సెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటుంది.
చింత గింజలలో ఆస్ట్రింజెంట్ గుణాలు ఉంటాయి. చింతపండు గుజ్జులో విటమిన్ సి ఉంటుంది. స్కర్వీ వ్యాధి రాకుండా చేస్తుంది.
సాధారణంగా కూరగాయలను ఉడికించినపుడు వాటిలోని పోషకాలు కొంత వరకు నశిస్తాయి. కాని చింత పండుగుజ్జులో యాంటీస్కోర్బటిక్ గుణాలు నశించవు. ఒక కప్పు చింతపండు గుజ్జులో 285 క్యాలరీలు ఉంటాయి.

కరివేపాకు- Curry Leaves

దక్షిణ భారతదేశ వంటకాలలో కరివేపాకు వాడకం తప్పనిసరి. కరివేపాకులో పీచు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కరివేపాకు జీర్ణక్రియకు సహకరిస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. చెడు కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది. జుట్టు నల్లపడటన్ని పెంచుతుంది. గుప్పెడు కరివేపాకును ప్రసవం తరువాత తింటే పాలు పడతాయి. కరివేపాకులో ’‘ విటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన చిన్నవయసులోనే కేటరాక్ట్ రాకుండా ఆపుతుంది.
మంచి కరివేపాకును ఎలా తెలుసుకోవాలి?
ఆకులు తాజాగా, మచ్చలు, చుక్కలు లేకుండా ముదురాకు పచ్చరంగులో ఉండాలి. విడిగా కాకుండా కొమ్మలను కొనటం మంచిది. తాలింపులకు, పప్పు, రసం, సాంబారులలో కరివేపాకు తప్పనిసరి. కరివేపాకు జ్యూస్ :
పావు కప్పు కరివేపాకు, అరటీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ శొంఠి పొడిని సన్నని సెగపై వేయించాలి. నీరు కలిపి కొద్దిసేపు మరిగించి, వడకట్టి, నిమ్మరసం, పంచదార వేసి బాగా కలిపి తాగాలి. జీర్ణక్రియకు బాగా సహకరిస్తుంది.
కరివేపాకుతో చట్నీ:
ఒక కప్పు తాజా కరివేపాకు, పావు కప్పు కొత్తిమీర ఆకులు, పావు కప్పు కొబ్బరి తురుము, అరంగుళం అల్లం ముక్క, మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు, మూడు, నాలుగు పచ్చి మిర్చి లేక ఎండు మిర్చి, అరటీస్పూన్ బెల్లం, ఒక టీస్పూన్ చింతపండు గుజ్జు, ఒక టీ స్పూన్ నువ్వులు, కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు. వీటన్నింటిని కలిపి కొద్దిగా వేయించి మొత్తగా రుబ్బుకోవాలి. ఇడ్లీ, దోసె లేక అన్నంలోకి మంచి కాంబినేషన్. కరివేపాకు ఎక్కువ రోజులు నిలవ ఉండదు. కాడలతో సహా కాగితంలో చుట్టు ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు.

Pepper మిరియాలు

మిరియాలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మిరియాలను గాలి చోరని డబ్బాలలో నిల్వ ఉంచాలి. లేకపోతే వాటిలోని రుచి, వాసన గాలికి ఆవిరైపోతాయి. అందుకని మనకు అవసరమైనపుడే మిరియాలను కొనుక్కోవాలి. ముందుగానే కొని నిల్వ ఉంచరాదు. వేడి వలన కూడా వీటి రుచి, వాసనలలో తేడా వస్తుంది. వంట పూర్తి అయ్యే ముందు మాత్రమే వీటిని వంటలలో కలపాలి. తాజాగా పొడి చేసిన మిరియాలను పప్పులలోను గ్రేవీలలోను వేస్తే వంటకాలు మరింతచ రుచికరంగా ఉండటమే కాదు, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
నల్ల మిరియాలలో ఉండే పిపరైన్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం పొట్టలో బాగా ఊరేటట్లు సహాయం చేస్తుంది. అరుగుదలకు ఈ ఆమ్లం తప్పనిసరి రోజూ ఆహారంలో మిరియాల పొడి వాడుతూ ఉంటే గ్యాస్ సమస్యలు, అజీర్ణం, అతిసారం, మలబద్దకం, కడుపులో మంట లాంటి ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి.
జలుబు దగ్గుకు మిరియాలు బాగా జలుబు, దగ్గుతో బాధపడుతూ వుంటే తాగే సూపులో, పాలలో, కొద్దిగా మిరియాల పొడి వేసి తాగితే ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, సైనసైటిస్ మరియు దగ్గు తగ్గుతాయి.
మిరియాలు ముక్కులో అడ్డుపడే మ్యూకస్ ను బయటకు పంపిస్తాయి. నల్ల మిరిమయాలు చర్మంపైన ఉండే మృతకణాలను తొలగిస్తాయి. చర్మ సంబబంధమైన ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి.
దుస్తులు వెలవకుండా : ుస్తులు వెలసిపోవడం మొదలైతే వాటిని ఉతికేటపుడు ఒక టీ చెంచా మిరియాల పొడిని వాషింగ్ మెషిన్లో కానీ, బకెట్లో కానీ వేస్తే దుస్తులు వెలసిపోవటం ఆగిపోతుంది.
శరీరంలోని వ్యర్ధాలను తొలగిస్తుంది. మిరియాలను, మిరియాల నూనెను మనం తినే ఆహారంలో వాడటం వలన శరీరంలో ఆహారం ద్వారా, ఇతర మార్గాల ద్వారా చేరిన హాని చేసే రసాయనాలు బయటకు పంపబడతాయి. శరీరంలో లోపలి భాగాలు శుద్ది అవుతాయి.
నల్ల మిరియాలను కానీ కషాయాన్న గానీ వాడటం వలన చెవిపోటు, కంటి సమస్యలు, హెర్నియా, కీటకాలు కుట్టడం వలన వచ్చిన ఇబ్బందుల నుండి బయటపడవచ్చు.

ఇంగువ – Asafoetida

ఫెరులా జాతి మొక్కల తల్లి వేరు నుంచి స్రవించే ఒక రకమైన జిగురే ఇంగువ. ఈ జిగురును సేకరించి శుభ్రం చేస్తారు. ఈ మొక్కలు ఆఫ్ఘనిస్తాన్, భారతదేశంలో ఎక్కువ. పోషకాల కన్నా ఇందులో ఉండే అంబెల్లి ఫెరోన్, ఫెరూలిక్ ఆమ్లాలతో కూడిన నూనె, జిగురుల వలన దీనికి ఔషధ గుణాలు ఎక్కువ. వీటివలనే ఒకలాంటి వాసన రుచిని కలిగి ఉంటుంది.
పచ్చిగా ఉన్నపుడు కంటే దీనిని వేడి నూనె లేదా నెయ్యిలో వేసినపుడే కమ్మటి వాసన వస్తుంది. అందుకే ఇంగువ పోపు చేర్చిన పప్పు కూర రుచి తెలిసిన వారు ఇంగువ లేకండా కూరలు ఇష్టపడరు. పప్పు కూరల కారణంగా గ్యాస్ చేరకుండా ఉండేందుకే ఇంగువ తప్పనిసరి. ప్రాచీన కాలం నుండి వైద్యంలో దీనిని వాడుతూనే ఉన్నారు. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. కడుపులోనూ ఇతర్రతా అవయవాలలో తలెత్తే మంటలను తగ్గిస్తుంది.
అజీర్ణానికి మంచి మందు. కూరల పోపులలో తప్పక వేస్తే పొట్టలో గ్యాస్ చేరినా పురుగులు ఉన్నా, మలబద్ధకం ఉన్నా, జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.
అజీర్తి మరీ ఎక్కువగా ఉంటే నాలుగైదు చిన్న ఇంగువ ముక్కలు లేదా అర టీ స్పూను పొడిని అరకప్పు నీటిలో కలుపుకుని తాగితే వెంటనే తగ్గుతుంది.
చిటికెడు ఇంగువపొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే గ్యాస్ తగ్గుతుంది. గ్యాస్ సంబంధిత మందులలో ఇంగువ తప్పకుండా ఉంటుంది.
నెలసరిలో వచ్చే నొప్పిని ఇతర సమస్యలను తగ్గిస్తుంది.
కాస్త ఇంగువలో తేనె, అల్లంపొడి కలిపి తీసుకుంటే శ్యాసకోశ సంబంధ వ్యాధులన్నీ తగ్గుతాయి. గొంతులోనూ ఛాతీలోనూ పేరుకున్న కఫాన్ని తగ్గిస్తుంది. పొడిదగ్గు, కోరింత దగ్గు, బ్రాం కైటీస్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులను అరికడుతుంది.
మధుమేహులకు మందుగా పనిచేస్తుంది. క్లోమగ్రంధిలోని కణాలను ప్రేరేపించి ఇన్సులిన్ ఉత్పత్తి జరిగేలాగా చేసి రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ వెంటనే తగ్గాలంటే కాకరకాయ కూరని ఇంగువ చేర్చి వండి తింటే ఫలితం ఉంటుంది. లేదంటే రోజూ రెండు స్పూన్ల కాకరకాయ రసంలో పావుటీ స్పూను ఇంగువపొడి కలుపుకుని తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
హిస్టీరియా వచ్చిన వారికి ఇంగువ వాసన చూపిస్తే ఫలితం ఉంటుంది.
కాస్త ఇంగువను నీళ్ళలో కలిపి తాగితే మైగ్రయిన్ తలనొప్పి తగ్గుతుంది. పుండ్లనీ గాయాలనీ సైతం తగ్గించగల శక్తి ఇంగువకు ఉంది. ఇంగువను టింక్చర్ లా వాడితే త్వరగా తగ్గినట్లు ఆధారాలు ఉన్నాయి. దీనినుంచి వచ్చే ఘాటైన వాసన వలన క్రిమి కీటకాలు దరిచేరవు.
గర్భిణీ స్త్రీలు దీనిని వాడకూడదు. మిగిలిన వారు దీనిని తగు మోతాదులో వాడాలి.

ధనియాలు , Coriander seeds

ధనియాలు , Coriander seeds

ధనియాలను ఇంగ్లీష్‌లో కొరియాండర్ అనీ పిలుస్తారు. సాధారణంగా ధనియాలను సుగంధంకోసం వంటల్లో వాడుతుంటారు. ధనియాల గింజలను కూరపొడి, సాంబారు పొడి తయారీలకు, కూరల తాళింపుకోసం వాడటం ఆనవాయితి.
అయితే కేవలం వంటింటి దినుసుగానే కాకుండా ధనియాలను ఔషధంగా కూడా వాడవచ్చు.
ఇటీవల జరిగిన అధ్యయనాల్లో ధనియాలు కార్మినేటివ్‌గా (గ్యాస్‌నుంచి ఉపశమనం కలిగించేదిగా) పనిచేస్తుందని తేలింది. అలాగే రిఫ్రిజిరెంట్‌గా (శరీరాన్ని చల్లపరిచేదిగా), డైయూరిటిక్‌గా (మూత్రాన్ని జారిచేసినదిగా), ఏఫ్రోడైజియాక్‌గా (లైంగిక శక్తిని పెంచేదిగా), యాంటీ స్పాస్‌మోడిక్‌గా (అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా), హైపోగ్లైసీమిక్‌గా (రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించేదిగా) పనిచేస్తుందని తేలింది.
ధనియాల నుంచి తీసిన తైలం బ్యాక్టీరియాను, వివిధ సూక్ష్మక్రిముల లార్వాలను అంతమొందించినట్లు పరిశోదనల్లో తేలింది.
ఇండియన్ హెర్బల్ ఫార్మకోపియా, జర్మన్ కమీషన్, బ్రిటీష్ హెర్బల్ ఫార్మకోపియా వంటివి ధనియాలను ఆకలి తగ్గిన సందర్భాల్లోనూ, డిస్పెస్పియా (ఆమ్లపిత్తం/ స్టమక్ అప్‌సెట్)లోనూ వాడవచ్చని సూచించాయి.
ధనియాలతో రకరకాల ఆయుర్వేద ఔషధాలు తయారవుతాయి. ఉదాహరణకు ధాన్యకాది హిమం (అతి దప్పికను తగ్గించడానికి వాడతారు), గుడుచ్యాది క్వాథం (జ్వరంలో తాపాన్ని తగ్గించడానికి వాడతారు), అభయారిష్టం (మలబద్ధకం, అర్శమొలల వ్యాధిలో వాడతారు), లవణ భాస్కర చూర్ణం (కడుపునొప్పిలో అజీర్ణాన్ని తగ్గించడానికి వాడతారు)… ఈ ఔషధాల తయారీలో ధనియాలు ఒక ప్రధాన ద్రవ్యం.
ధనియాలు ఔషధోపయోగాలు
ధనియాలలోని ఔషధ గుణాల గురించి మనకు అంతగా అవగాహన ఉండదు. .ధనియాలను సంస్కృతంలో ధన్యాకమని, హిందీలో ధనియ అని అంటారు. దీని మొక్క 30 సెంటీమీటర్ల వరకూ పెరుగుతుంది. ఆకులు చిన్నగా ఉండి, సువాన కలిగి ఉంటాయి. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఏర్పడుతాయి. దీని కాయ రెండు దళాలుగా ఉంటుంది. ఈ రెండింటిలోనూ రెండు బీజాలు ఉంటాయి. ధనియాలు మొక్క దశలో ఉన్నప్పుడు దానిని మనం కొత్తిమీర అని వ్యవహరిస్తాము. దీనిని కూడా వంటలలో తరచుగా ఉపయోగిస్తాము. ధనియాలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. ఎక్కిళ్లు, జ్వరా లను తగ్గిస్తాయి. కడుపులో మంటను తగ్గిస్తాయి. రుచిని పెంపొంది స్తాయి. ఆకలిని పెంచుతాయి. సుఖ నిద్ర కలుగజేస్తాయి.
ధనియాలను వేయించి పొడి చేసి పూటకు సగం చెంచా చొప్పున క్రమం తప్ప కుండా తింటే శరీర దౌర్బల్యం తగ్గుతుంది. – ధనియాలను కషాయంగా కాచుకుని అందులో పంచదార కలిపి తాగితే అతి దాహం తగ్గుతుంది. –
ధనియాలు చూర్ణం, పంచదార కలిపి బియ్యపు కడుగు నీటితో తీసుకుంటే శ్వాస, కాసలు తగ్గుతాయి.
– ధనియాలు, శొంఠి కలిపి కషాయం తీసుకుని సేవిస్తే అజీర్ణం తగ్గుతుంది.
– ధనియాల కషాయంలో పంచదార కలిపి తాగితే మంచి నిద్ర వస్తుంది. – ధనియాలు, జీలకర్ర, మిర్చి, కరివేపాకులను నేతిలో వేయించి, ఉప్పు కలిపి భద్రపరిచి ప్రతిరోజూ అన్నంతో తింటే రుచి పెరుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
– ధనియాల కషాయానికి సమంగా తేనె కలిపి ఒక కప్పు మోతాదుగా సేవిస్తే మూత్రం ద్వారా జరిగే ఇంద్రియ నష్టం తగ్గుతుంది.
– ధనియాలను పేస్టులాగా మెత్తగా నూరి తలమీద పట్టు వేసుకుంటే తలనొప్పి, వేడి తగ్గుతాయి.
-ధనియాలు, బార్లి గింజలు సమంగా నూరి వాపు ఉన్నచోట లేపనంగా వేస్తే వాపు తగ్గుతుంది. ఆయుర్వేదిక్ వినియోగము
జ్వరం
ధనియాలను బరకగా నూరి, దాని తూకానికి ఆరు రెట్లు చన్నీళ్లుపోసి రాత్రంతా ఉంచాలి. ఉదయం పంచదార కలుపుకొని తాగితే శరీరంలో మంట, వేడి తగ్గుతాయి.
ధనియాలును, చెదుపొట్ల ఆకులను కషాయం తయారుచేసుకొని తాగితే జ్వరంలో ఆకలి పెరుగుతుంది. సుఖ విరేచనమై జ్వరం దిగుతుంది.
జ్వరంలో ఆకలిని పెంచడానికి, ఉష్ణోగ్రత తీవ్రతను తగ్గించడానికి 2 భాగాలు ధనియాలను, 1 భాగం శొంఠిని నీళ్లకు కలిపి కషాయం తయారుచేసుకొని తీసుకోవాలి.
శిశిరంలో వచ్చే జ్వరాలను తగ్గించుకోవడానికి ధనియాలు, శొంఠితో కషాయం తయారుచేసుకొని, నిమ్మరసాన్ని, పంచదారనూ కలిపి తీసుకోవాలి. నీళ్ల విరేచనాలు (అతిసారం)
ధనియాలు, శొంఠి, మారేడుపండు గుజ్జు వీటితో కషాయం తయారుచేసుకొని తాగితే ఆమం పచనం చెందుతుంది. కడుపునొప్పి, మలబద్ధకం తగ్గి ఆకలి పెరుగుతుంది. జ్వరం దిగుతుంది.
ధనియాలు, నెయ్యి, నీళ్లు- వీటిని 1:4:16 నిష్పత్తిలో తీసుకొని ధృతపాకం (నీరంతా ఆవిరయ్యేలా మరిగించటం) చేసుకొని వాడుకోవాలి. దీనిని ధాన్యక ఘృతం అంటారు. దీనిని వాడితే విరేచనాల్లో కనిపించే పైత్యపు నొప్పి తగ్గి ఆకలి పెరుగుతుంది. అరుగుదల కూడా మెరుగవుతుంది. అజీర్ణం ధనియాలు, శొంఠితో కషాయం తయారుచేసుకొని తాగితే అరుగుదల పెరుగుతుంది. ఇది మూత్రాన్ని కూడా జారీచేస్తుంది.
అర్శమొలలు ధనియాలకు నేలవాకుడు (ములక/కంటకారి) మొక్కను సమూలంగా గాని లేదా శొంఠిని గాని కలిపి కషాయం కాచి తీసుకుంటే అరుగుదల పెరిగి వాయువునుంచి ఉపశమనం లభిస్తుంది. గుల్మం (శరీరంలో పెరుగుదలలు) ధనియాలను కషాయం రూపంలో తీసుకుంటే శరీరంలో అంతర్గతంగా తయారైన పెరుగుదలలు శుష్కించిపోతాయి.
వాంతులు ధనియాల కషాయానికి నిమ్మరసం, ఉప్పుకలిపి తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి. ధనియాల పొడి, వెలగ పండు గుజ్జు, త్రికటు చూర్ణం వీటిని కలిపి బియ్యం కడుగు నీళ్లతో తీసుకుంటే వాంతులు, వికారం వంటివి తగ్గుతాయి. విపరీతమైన దప్పిక ధనియాలను నలగ్గొట్టి చన్నీళ్లకు కలిపి హిమం రూపంలో పంచదార, తేనె చేర్చి తీసుకుంటే దప్పిక తీరుతుంది.
ఆమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్) ధనియాలు, శొంఠి, ఆముదం వేరు- వీటి మిశ్రమాన్ని కషాయం రూపంలో తీసుకుంటే ఆమవాతంలో కనిపించే జాయింట్ల నొప్పి, వాపులనుంచి ఉపశమనం లభిస్తుంది. వాత రక్తం (గౌట్) 10గ్రాముల ధనియాలు, 20గ్రాముల జీలకర్ర, తగినంత బెల్లం… వీటిని కలిపి ఉడికించి లేహ్యం మాదిరిగా తయారుచేసుకొని తీసుకుంటే వాత రక్తంలో ఉపశమనం లభిస్తుంది.
ధనియాల పొడిని, శొంఠి పొడిని పాలకు కలిపి తీసుకుంటే వాత రక్తంలో హితకరంగా ఉంటుంది. పిల్లల్లో దగ్గు, ఆయాసం ధనియాల పొడి (చిటికెడు), మిశ్రీ (చిటికెడు) వీటి మిశ్రమాన్ని బియ్యం కడుగు నీళ్లతో ఇస్తే చిన్న పిల్లల్లో వచ్చే దగ్గు, ఆయాసం వంటివి ఉపశమిస్తాయి. కడుపునొప్పి అజీర్ణంవల్ల కడుపునొప్పి వస్తున్నప్పుడు ధనియాలు, పచ్చి మిర్చి, కొబ్బరి తురుము, అల్లం, గింజలు తొలగించిన నల్లద్రాక్షతో పచ్చడి చేసుకొని తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది.
ఉదరంలో గ్యాస్ తయారవటం జీర్ణక్రియ జరిగే సమయంలో నొప్పి రావటం, ఉదరంలో గ్యాస్ తయారవటం, అజీర్ణం వంటి సమస్యల్లో తేనె కలిపిన ధనియాల కషాయం తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది. మూత్రంలో మంట ధనియాల కషాయానికి చిటికెడు రేవలచిన్ని పొడిని కలిపి తీసుకుంటే మూత్రంలో చురుకు తగ్గుతుంది.
శరీరంలో స్థానికంగా వాపు తయారవటం ధనియాల కషాయం తీసుకుంటే మూత్రం జారీ అవటం మూలాన వాపు తగ్గుతుంది. దీంతోపాటు 2 భాగాల పసుపును, 1 భాగం సైంధవ లవణాన్ని కలిపి మెత్తగా నూరి నీళ్లుకలిపి జారుడుగా చేసి స్థానికంగా- వాపుమీద పట్టువేసుకోవాలి. తల తిరగటం ధనియాలు, చందనం, ఉసిరి పెచ్చులు వీటిని సమాన భాగాలు తీసుకొని చన్నీళ్లలో నానబెట్టి హిమం తయారుచేసుకొని వాడితే తల తిరగటం, కళ్లు బైర్లుకమ్మటం వంటి సమస్యలు తగ్గుతాయి. కంటి సమస్యలు, కళ్ల మంటలు 20గ్రాముల ధనియాలను ఒక గ్లాసు నీళ్లలో వేసి మరిగించి, పరిశుభ్రమైన నూలుగుడ్డతో వడపోసి, ఒక్కో కంట్లో రెండేసి చుక్కల చొప్పున వేసుకోవాలి. కళ్ల కలక, కళ్లమంటలు, కళ్ల దురదలు, కళ్లనుంచి నీళ్లుకారటం వంటి కంటికి సంబంధించిన సమస్యల్లో ఇది చాలా లాభప్రదంగా ఉంటుంది.
ప్రతిరోజూ ధనియాలతో తయారుచేసిన తాజా కషాయంతో కళ్లను శుభ్రపరచుకుంటుంటే కంటి సమస్యలు ఇబ్బంది పెట్టవు. కంటి వాపు ధనియాలు, బార్లీ గింజలను సమాన భాగాలుగా తీసుకొని మెత్తగా నూరి కళ్లపైన పట్టుగా వేసుకుంటే కంటివాపు తగ్గుతుంది.
గొంతు నొప్పి ప్రతిరోజూ ఉదయం సాయంకాలాలు 5-10 ధనియాల గింజలను నమిలి రసం మింగుతుంటే గొంతు నొప్పి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.
వేడివల్ల తలనొప్పి రావటం ధనియాలు, ఉసిరికాయలను సమాన భాగాలు తీసుకొని రాత్రంతా చల్లని నీళ్లలో నానబెట్టి ఉదయం మెత్తగా రుబ్బి, రసం పిండి పంచదార కలుపుకొని తాగితే వేడివల్ల వచ్చిన తల నొప్పి తగ్గుతుంది.
అధిక బహిష్టుస్రావం ఆరు గ్రాముల ధనియాలను అర లీటర్ నీళ్లకు కలిపి సగం నీళ్లు మాత్రం మిగిలేంతవరకూ మరిగించాలి. దీనికి మిశ్రీని (పటిక బెల్లం)చేర్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా మూడునాలుగు రోజులు చేస్తే బహిష్టు సమయాల్లో జరిగే రక్తస్రావాధిక్యత తగ్గుతుంది.
దద్దుర్లు ధనియాల కషాయాన్ని తాజాగా తయారుచేసి తీసుకుంటూ బాహ్యంగా కొత్తిమీర రసాన్ని ప్రయోగిస్తే దద్దుర్లనుంచి ఉపశమనం లభిస్తుంది.
చిన్న పిల్లలు పక్క తడపటం ధనియాలు, దానిమ్మ పూవులు (ఎండినవి), నువ్వులు, తుమ్మబంక (ఎండినది), కలకండ.. వీటిని సమాన భాగాలు తీసుకొని చూర్ణంచేసి చెంచాడు మోతాదుగా రాత్రిపూట ఇస్తే చిన్నారుల్లో పక్కతడిపే అలవాటు తగ్గుతుంది.
కొలెస్టరాల్ ఆధిక్యత ధనియాల పొడి కొలెస్టరాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. రెండు చెంచాలు ధనియాలను నలగ్గొట్టి ఒక గ్లాసు నీళ్లకు చేర్చి మరిగించి చల్లారిన తరువాత వడపోసుకొని తాగాలి. ఇలా రెండుపూటలా కొన్ని నెలలపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది కిడ్నీలను ఉత్తేజపరిచి మూత్రాన్ని జారిఅయ్యేలా చేస్తుంది కూడా.

దాల్చిన చెక్క- Cinnamon

దాల్చిన చెక్క రుచిలో అద్భుతంగా ఉంటుంది. తీపి తగులుతూ అంతలో మంటనిపించే ఘాటు నషాళానికి అంటుతుంది. కోసం అనారోగ్య సమస్యలు నయం చేసేందుకు వంటలలో వాడుతుంటారు. యాంటీ ఆక్సిడెంట్లలో ఇది ఒకటి. దీనిలో మాంగనీసు చాలా ఎక్కవ స్ధాయిలో ఉంది. పీచు క్యాల్షియం కూడా లభిస్తాయి. రోజూ ఏ రూపంలో నైనా ఒక చెంచా దాల్చిన చెక్క పౌడర్ తీసుకుంటే ఆర్ డి ఏ విలువ ప్రపకారం 22% మాంగనీస్ మనకు లభిస్తుంది.
శరీరంలో ధృఢమైన ఎముకల తయారీకి, అనుబంధ కణజాలాభివృద్ధికి తోడ్పడుతుంది. రక్తం గడ్డ కట్టటానికి మాంగనీస్ ఎంతో సహాయపడుతుంది.
సెక్స్ హార్మోనుల అభివృద్ధికి, కార్బో హైడ్రేట్స్, కొవ్వులు అరుగుదలకు, రక్తంలో చక్కెర స్ధాయిలను నియంత్రించటానికి క్యాల్షియంను శోషణ చేసుకోవటానికి, మొదడు మరింత స్థాయిలో పనిచేయటానికి మాంగనీస్ ఎంతో అవసరం. సూక్ష్మ క్రిములను నాశనం చేసే గుణం ఉండటం వలన తలలోని పేలు పోవటానికి దీని నూనెను వాడతారు. నల్లులు, చీమలు, దుమ్ములో ఉండే క్రిములను వదిలించుకోటానికి ఎంతోఉపయోగపడుతుంది.
దీని నూనెలో దోమలను తరిమి వేసే గుణం కలదు. రోజూ ఒక అరస్పూను ఈ పొడిని తింటే రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. కడుపు తొందరగా ఖాళీ కాకుండా, రక్తంలోని చక్కర శాతం త్వరగా పెరగకుండా అడ్డుపడుతుంది.
దాల్చిన చెక్క పొడిని సూపులలోనూ, కాఫీ, టీలలోను వాడుకోవచ్చు.
దాల్చిన చెక్క కడుపులోని ఇన్ఫెక్షన్లను పోగొడుతుంది. కడుపులోని హానికరక బ్యాక్టీరియాను చంపుతుంది.
విషపూరితమైన రూం స్ప్రేయర్లను వాడే బదులు ఒక చుక్క దాల్చిన చెక్క నూనెను నీటిలో వేసి అవసరమైన చోట స్ప్రే చేయాలి.
ఓట్స్ లోను, పండ్ల ముక్కలలోనూ దాల్చిన చెక్క పొడిని కలిపి తినవచ్చు.గ్రీన్ టీ, కాఫీ, సూప్ లలో దాల్చిన చెక్క పోడి కలిపితే దాని రుచే వేరు. పాలలో కలిపి తాగవచ్చు. పంచదార బదులు దాల్చిన చెక్క పొడిని వాడవచ్చు. సలాడ్లలోనూ, బ్రెడ్ లలోనూ వాడితే రుచే వేరుగా ఉంటుంది.

లవంగాలు (Cloves),Lavangaalu

లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన దినుసులు . వీటిలో వాసనేకాదు .. విలువైన పోషకాలు ఉన్నాయి . కార్బోహైడ్రేట్లు , కాల్సియం , ఫాస్ఫరాస్ , పొటాషియం , సోడియం , హైడ్రోక్లోరిక్ ఆసిడ్ , మాంగనీస్, విటమిన్ … ఎ,సి , ఉంటాయి
వైద్య పరం గా
దగ్గు ఎక్కువగా ఉన్నపుడు .. టీ లో లవంగాలు వేసి తాగిన ఉపశమనం కలుగుతుంది .
జీర్ణ సమస్యలతో బాధపడేవారు వీటిని వేయించి పొడిచేసి తేనెలో కలిపి తీసుకుంటే జీర్ణము అవుతుంది .
మూడు లీటర్ల నీళ్ళలో నాలుగు గ్రాముల లవంగాలు వేసి నీళ్లు సగమయ్యే వరకూ మరిగించి తాగితే కలరా విరేచనాలుతగ్గుతాయి .
ఆరు లవంగాలు కప్పు నీళ్లు కలిపి డికాక్షన్ తయారుచేసి ..చెంచా కు కొంచం తేనే కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే ” ఉబ్బసము ” తగ్గుతుంది .
పాలలో లవంగం పొడి , ఉప్పు కలిపి నుదుటమీద ప్యాక్ వేసినచో తలనొప్పి తగ్గుతుంది , వంటకాలలో దీనిని ఉపయోగించడం వల్ల చర్మ కాన్సర్ ను తగ్గించవచ్చును ,
దీనికి రక్తాన్ని శుద్ధి చేసే గుణము ఉన్నందున శరీరము లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది .
ఇండొనేషియాలోని స్పైస్‌ ఐల్యాండ్స్‌గా పిలిచే మొలక్కస్‌ దీవులే వీటి స్వస్థలం. ప్రస్తుతం వీటిని బ్రెజిల్‌, ఇండియా, వెస్టిండీస్‌, మారిషస్‌, జాంజిబార్‌, శ్రీలంక, పెంబా దేశాల్లోనూ పండిస్తున్నారు. తాజాగా ఉన్నప్పుడు కాస్త గులాబీరంగులో ఉండే మొగ్గల్ని కోసి ఎండబెడతారు. దాంతో అవి క్రమంగా ముదురు గోధుమరంగులోకి మారతాయి. భారత్‌, చైనాల్లో రెండు వేల సంవత్సరాలనుంచీ దీన్ని వంటల్లో వాడుతున్నారు. మాంసాహార వంటలే కాదు, మసాలా ఘాటు తగలాలంటే శాకాహార వంటల్లోనూ లవంగమొగ్గ పడాల్సిందే. లేకుంటే కిక్కే రాదంటారు మషాలాప్రియులు.. పరిమళాలు, సాంబ్రాణి కడ్డీల్లోనూ వీటి వాడకం ఎక్కువే.
మొటిమలు, రాష్‌లు, దద్దుర్లు… వంటి చర్మ సమస్యలకూ లవంగనూనె ఉపయోగపడుతుంది.
అద్భుత ఔషధం
లవంగాల్లోని యుజెనాల్‌ అనే రసాయనానికి అద్భుత ఔషధ, పోషక విలువలు ఉన్నాయి. యుజెనాల్‌ కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది.
పంటినొప్పితో బాధపడేవాళ్లు ఓ లవంగవెుగ్గను బుగ్గన పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది. నోటి దుర్వాసననీ పోగొట్టి శ్వాసని తాజాగా ఉంచుతుంది.
లవంగాలను నీళ్లలో మరిగించి తాగడంవల్ల అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతాయి. అంతేకాదు, ఫ్లూ, జలుబు, సైనసైటిస్‌, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్‌ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి.
లవంగనూనెలో దూదిని ముంచి దంతాలు, చిగుళ్లులో నొప్పి వచ్చేచోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది.
పెద్దపేగులోని పరాన్నజీవుల్నీ సూక్ష్మజీవుల్నీ లవంగంలోని ‘యుజెనాల్‌’ నాశనం చేస్తుంది. అందుకే డయేరియా, నులిపురుగులు, జీర్ణసంబంధిత రుగ్మతలకి లవంగం మంచి మందు.
రెండుమూడు లవంగాలకు కొంచెం పంచదార చేర్చి నూరి చల్లటినీళ్లలో కలిపి తాగితే గుండెల్లో మంట వెంటనే తగ్గుతుంది.
జలుబుతో బాధపడేవాళ్లు కర్చీఫ్‌మీద రెండుమూడు చుక్కల లవంగనూనెని చల్లి వాసన పీలిస్తే ఫలితం ఉంటుంది.
ఏడుమొగ్గల్ని కొద్దినీళ్లలో మరిగించాలి. తరువాత దాన్నించి వచ్చే ఆవిరిని పీల్చి చల్లారిన తరువాత ఆ నీళ్లను తాగేస్తే జలుబుతో మండిపోతున్న ముక్కుకి కాస్తంత హాయి.
లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకోవడంతోబాటు క్యాన్సర్లు, హృద్రోగాలు, డయాబెటిస్‌, ఆర్త్థ్రెటిస్‌, అల్జీమర్స్‌ను నిరోధిస్తాయట. మొత్తమ్మీద ఆహారంలో భాగంగా లవంగాలను తీసుకోవడంవల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల శాతం పెరిగి హానికరమైన ఆక్సీకరణ ప్రక్రియతగ్గి రోగాలు రాకుండా ఉంటాయి.
అయితే గర్భిణులు, గ్యాస్ట్రిక్‌ అల్సర్లు, బౌల్‌ సిండ్రోమ్‌తో బాధపడేవాళ్లు దీన్ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. మరీ ఎక్కువగా వాడితే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది.
మందుగా
లవంగాల పొడి తేనెతో కలిసి తాగితే దగ్గు, కఫం తగ్గుతాయి. లవంగాలను చల్లని నీళ్లతో నూరి, వడగట్టి, పటికబెల్లంతో సేవిస్తే కడుపులో మంట తగ్గుతుంది. గర్భిణీలకు వాంతులు తగ్గుతాయి. లవంగతైలాన్ని పైపూతగా రాస్తే పిప్పిపన్ను నొప్పి తగ్గుతుంది. నీటితో ముద్దగా చేసి పట్టువేస్తే తలనొప్పి తగ్గుతుంది

కరివేపాకు

Chewing Curry Leaves On Empty Stomach Has These Benefits
కరివేపాకు ను సాధారణంగా వంటలలో మసాలాగా ఉపయోగిస్తారు. కరివేపాకు వంటకానికి రుచి ఇస్తుంది. కరివేపాకు ఐరన్కాల్షియంఫాస్పరస్ మరియు సిబి ఎ వంటి విటమిన్లతో నిండినది.  ఇవి శరీరానికి ఫైబర్ ఇస్తాయి. రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుందిఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది మరియు చర్మం మరియు జుట్టు యొక్క ఆకృతిని మెరుగుపరుస్తుంది..
కరివేపాకు యొక్క 6 అద్భుతమైన  ఆరోగ్య ప్రయోజనాలు:
1. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించును:
కరివేపాకులో ఒక ప్రత్యేకమైన ఫైబర్ కలిగి ఉండును. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కరివేపాకు శరీరంలో ఇన్సులిన్ తగినంతగా విడుదల కావడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికికరివేపాకు ఆదర్శవంతమైన సహజ సహాయకురాలు.
2. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించును:
యాంటీఆక్సిడెంట్లతో నిండిన కరివేపాకు కొవ్వు యొక్క ఆక్సీకరణను ఎల్డిఎల్ (చెడు కొలెస్ట్రాల్) గా నిరోధిస్తుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) మొత్తాన్ని పెంచుతుంది మరియు శరీరాన్ని గుండె జబ్బులు మరియు అథెరోస్క్లెరోసిస్ నుండి రక్షిస్తుంది.
3. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయం చేయును:
కరివేపాకు కడుపు రుగ్మతలను  అరికట్టడానికి గొప్ప షధంగా చెప్పవచ్చు. కరివేపాకులో కార్బజోల్ ఆల్కలాయిడ్ ఉంటుందిఇది యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.
4. ముక్కు దిబ్బడ  నుండి ఉపశమనం కలిగించును:
ఛాతీ మరియు ముక్కులో దిబ్బడను తగ్గించడానికి కరివేపాకు సమర్థవంతమైన ఔషదం. ఇది విటమిన్ సిఎ మరియు కెంప్ఫెరోల్ అని పిలువబడే సమ్మేళనంతో నిండి ఉందిఇది చాలా శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ డీకోంజెస్టెంట్ మరియు యాంటీ ఆక్సీకరణ ఏజెంట్. కరివేపాకు శ్లేష్మాన్ని విడుదల చేయడానికి సహాయపడుతుంది.
5. జుట్టు రాలుటను నివారించును:
కరివేపాకు జుట్టు తెల్లబడుతను  నివారిస్తుందిదెబ్బతిన్న జుట్టుకు చికిత్స చేస్తుందిసన్నని జుట్టు యొక్క షాఫ్ట్ను బలోపేతం చేస్తుంది. జుట్టు రాలడాన్ని అరికట్టుతుంది మరియు చుండ్రు నివారిస్తుంది..
6. మచ్చలు మరియు మొటిమలను తగ్గించును:
కరివేపాకు చర్మం యొక్క ధూళి మరియు మలినాలను తొలగిస్తుంది. మొటిమలను నివారిస్తాయి మరియు చర్మాన్ని మెరుస్తూ తాజాగా ఉంచును. మచ్చ లేని చర్మం కోసం కరివేపాకు ఫేస్ ప్యాక్‌లు అద్భుతమైనవి.
మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం కరివేపాకును ప్రయత్నించండి.
ఆరోగ్యంగా ఉండండిసంతోషంగా ఉండండి!
 

నల్ల మిరియాలు (కాలి మిర్చ్)

మిరియాలతో లాభాలు ఎన్నో..
 
నల్ల మిరియాలు పురాతన సుగంధ ద్రవ్యాలలో ఒకటి. ఇది కేరళలో సమృద్ధిగా లభిస్తుంది. దీని షధ గుణాలు అజీర్ణంపియోరియాదగ్గుదంత సమస్యలు మరియు హృదయ సంబంధ వ్యాధుల వంటి రుగ్మతలను విజయవంతంగా ఎదుర్కోగలవు. యాంటీ బాక్టీరియల్ లక్షణాల వల్ల నల్ల మిరియాలు ఆహార సంరక్షణ కోసం విస్తృతంగా ఉపయోగించబడును. ఎక్కువ ఫైబర్విటమిన్ సిమాంగనీస్విటమిన్ కె అధికంగా ఉండటం వల్ల ఇది గొప్ప యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది
 
నల్ల మిరియాలు యొక్క ప్రసిద్ధ ప్రయోజనాలు:
 
1.ఉదరం/కడుపుకు ప్రయోజనకరమైనది: నల్ల మిరియాలు హెచ్‌సిఎల్HCL స్రావాన్ని పెంచుతాయిఅనగా కడుపులోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇది సరైన జీర్ణక్రియను నిర్ధారిస్తుంది మరియు కోలిక్ మరియు డయేరియా వంటి వ్యాధులను దూరంగా ఉంచుతుంది. మిరియాలు మూత్రవిసర్జన మరియు చెమటను పెంచుతాయిశరీరంలో గ్యాస్ ఏర్పడటాన్ని పరిమితం చేసే సామర్ధ్యం కూడా దీనికి ఉంది.
 
 
2. బరువు తగ్గడం: బ్లాక్ పెప్పర్ యొక్క బయటి పొర కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. అలాగేమిరియాలు తో తయారుచేసిన ఆహారాలు బరువు తగ్గడానికి ఒక ప్రభావవంతమైన మార్గం. కొవ్వు కణాలు విచ్ఛిన్నమైన తర్వాతశరీరం దానిని ఎంజైమాటిక్ ప్రతిచర్యల యొక్క ఒక భాగంగా ఉపయోగిస్తుంది. అదనపు కొవ్వులు శరీరం నుండి నిర్మూలించబడతాయి. నల్ల మిరియాలు కూరలలో వాడవచ్చు లేదా రోజూ ఉదయాన్నే వేడి నీటితో తీసుకోవచ్చు.
 
 
3. చర్మ ఆరోగ్యం: బొల్లి వంటి చర్మ వ్యాధులను నయం చేయడంలో మిరియాలు చాలా మంచి ఏజెంట్. చర్మం యొక్క పాచెస్ సాధారణ వర్ణద్రవ్యం కోల్పోయి తెల్లగా మారుతుంది. UV థెరపీతో కలిపి మిరియాలు మంచి ప్రత్యామ్నాయమని ఇటీవలి అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఇంకానల్ల మిరియాలు చర్మ క్యాన్సర్‌ను విజయవంతంగా నివారించగలవు.
 
4. శ్వాసకోశ ఉపశమనం: దగ్గు మరియు జలుబు విషయానికి వస్తే మిరియాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇది నాసికా రద్దీ మరియు సైనసిటిస్‌ నివారణ కు గొప్ప ఏజెంట్‌గా పేరుగాంచింది. నల్ల మిరియాలు కఫం మరియు శ్లేష్మం మీద దాడి చేసితక్షణ ఉపశమనం ఇస్తుంది. ఇది నాసికా రంధ్రాల ద్వారా శ్లేష్మం శరీరం నుండి బయటపడటానికి సహాయపడుతుంది. ఇది శరీరం త్వరగా నయం కావడానికి సహాయపడుతుంది.
 
 
5. పెప్టిక్ అల్సర్ మరియు హూపింగ్ దగ్గు: పెప్టిక్ అల్సర్ మరియు గ్యాస్ట్రిక్ శ్లేష్మంతో బాధపడుతున్న రోగులకు నల్ల మిరియాలు ప్రయోజనకరంగా ఉంటాయని అధ్యయనాలు చూపించాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి  ఉబ్బసం మరియు నిరంతర దగ్గు వంటి శ్వాసకోశ వ్యాధులకు చికిత్స చేయడానికి కూడా సహాయపడతాయి.
 
 
6. యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు: నల్ల మిరియాలు యొక్క యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాలను ఎదుర్కోవటానికి సహాయపడతాయిహృదయ సంబంధ వ్యాధులతో విజయవంతంగా పోరాడటానికి మరియు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవటానికి సహాయపడతాయి. ఇంకాశరీరానికి అకాల వృద్ధాప్య పరిస్థితులైన మాక్యులార్ డీజెనరేషన్మచ్చలుముడతలు మొదలైన వాటితో పోరాడటానికి ఇది సహాయపడుతుంది. నల్ల మిరియాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయని అధ్యయనాలు నిరూపించాయి.
 

మిరియాలతో ఇలా చేస్తే జలుబు తగ్గి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది

samayam telugu

పావుటీ స్పూన్ మిరియాలను తీసుకోండి.. వీటిని నెయ్యిలో దోరగా వేయించండి.. వాటిని తినాలి. వీటిని తిన్న వెంటనే గోరు వెచ్చని పాలను తాగాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే జలుబు త్వరగా తగ్గుతుంది. మిరియాలని అలానే తినడం ఇష్టం లేకపోతే.. వాటిని పొడిలా చేయాలి.. ఆ పొడిని గోరువెచ్చని పాలల్లో కలిపి తాగాలి. వీటితో పాటు.. నిమ్మరసం మూడు టీ స్పూన్ల తేనె మిక్స్ చేసి రోజులో ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు తగ్గుతుంది.పసుపు పాలు..వీటితో పాటు గోరువెచ్చని పాలల్లో పసుపు కలిపి ఆ పాలని తాగాలి. ఇలా తాగడం వల్ల కూడా జలుబు, జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది.