CT scan అనేది డయాగ్నొస్టిక్ ఇమేజింగ్ ఎక్విప్మెంట్. ఇది xray రేడియేషన్ ని ఇమేజింగ్ కి వాడుతుంది.
MRI ఇమేజింగ్ కి రేడియో వేవ్స్ ని, శక్తివంతమైన మాగ్నెటిక్ ఫీల్డ్స్ ని వాడుతాయి.
CT Scan యంత్రం ( గూగుల్ చిత్రాల నుంచి)
రోగుల అంతర్గత అవయవాలను పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యులు సిటీ స్కాన్ కు ఆదేశిస్తారు.
మెదడు స్కాన్ ఇమేజ్ ( గూగుల్ చిత్రాల నుంచి )
వెన్ను పూసా , నడుము సిటీ స్కాన్ (మూలం :గూగుల్ చిత్రాలు)
CT స్కాన్ xrays ను వాడుతుంది గనుక గర్భవతులకు సిఫారసు చేయరు.
MRI స్కాన్ బలమైన అయస్కాoత క్షేత్రాన్ని వాడుతుంది కనుక లోహంతో తయారుచేసిన కృత్రిమ అవయవాలు (పేస్ మేకర్స్, విరిగిన ఎముకలను జత చేసే లోహపు పలకలు, కోక్లియర్ ఇంప్లాంట్స్ ..etc) అమర్చిన రోగులకు ప్రమాదకరం.
కిడ్నీ జబ్బు ఉన్న రోగి యొక్క MRI స్కాన్
MRI స్కాన్ CT స్కాన్ కంటే కొంచెం ఖరీదు ఎక్కువ , కానీ MRI స్కాన్ లో అంతర్గత అవయవాలు కొంచెం స్పష్టంగా కనపడుతాయి.
MRI స్కాన్ చేసే సమయం లో రోగి శరీరం స్వల్పంగా(ఒక డిగ్రీ సెంటీగ్రేడ్) వేడెక్కుతుంది.
ఊపిరితిత్తులు పనిచేయనంతగా వ్యాధి ముదిరినప్పుడు, శరీరానికి అవసరమైన శ్వాస అందించే పనిని వెంటిలేటర్లు చూసుకుంటాయి. వ్యాధితో పోరాడి, నయం అయ్యేందుకు అవసరమైన సమయాన్ని రోగి శరీరానికి ఇస్తాయి. ఇందుకు పలు రకాల వైద్యపరమైన వెంటిలేషన్‌ను ఉపయోగిస్తుంటారు.
కరోనావైరస్ ఊపిరితిత్తుల్ని పాడు చేస్తోంది. దీనిని శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ గుర్తించి, మరిన్ని రోగనిరోధక కణాలను పంపేలా రక్త నాళాలను విస్తరిస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తుల్లోకి రక్తం చేసి, ఊపిరాడటం కష్టమైపోతుంది. శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి. ఈ పరిస్థితి నుంచి శరీరాన్ని కాపాడేందుకు ఒక వెంటిలేటర్ మెషీన్ ఊపిరితిత్తుల్లోకి ఎక్కువ ఆక్సిజన్‌ను పంపిస్తుంది.
రోగి శరీర ఉష్ణోగ్రతకు సరిపోయేలాగా ఈ గాలికి వేడిని, తేమను జతచేసే హుమిడిఫైయర్ పరికరం కూడా ఈ వెంటిలేటర్లో ఉంటుంది. పేషెంట్ల శ్వాసను పూర్తిగా మెషీన్ నియంత్రిస్తుంది కాబట్టి వారి శ్వాసకోశ కండరాలు విశ్రాంతి తీసుకునేలాగా వైద్యం అందుతుంది. అయితే, స్వల్ప లక్షణాలున్న రోగులకైతే వెంటిలేషన్‌ను ఫేస్ మాస్కులు, ముక్కు మాస్కులు, నోటి మాస్కుల ద్వారా గాలిని, ఇతర వాయువుల మిశ్రమాన్ని ఊపిరితిత్తుల్లోకి పంపిస్తారు. ఒక గొట్టం ద్వారా ఆక్సిజన్‌ను పంపించే హుడ్స్ ను కూడా కోవిడ్-19 రోగుల కోసం వాడుతుంటారు. శ్వాసలోని తుంపర్లతో గాలి ద్వారా సంక్రమించే వైరస్ల ప్రమాదాన్ని తగ్గించేందుకు ఈ తరహా విధానాన్ని ఉపయోగిస్తారు.
వెంటి లేటర్పైకి వెళ్లినా రోగి వెనక్కిరావచ్చు
ఒకసారి వెంటిలేటర్‌పైకి వెళ్తే రోగి తిరిగి కోలుకోవడం కష్టమనే అపోహ చాలామంది రోగుల్లో, వారి రోగి బంధువుల్లో ఉంటుంది. సాధారణంగా రోగులను డాక్టర్లు.. సాధారణ పరిస్థితులోనే మొదట ట్రీట్మెంట్ అందిస్తారు. అయితే ఒక్కొసారి వారి శరీరం, మాములు స్థితికి సహకరించకపోతే ఆసమయంలోనే వారిని వెంటిలేటర్‌పైన ఉంచి వైద్యం చేస్తారు..ఒకసారి రోగిని వెంటిలేటర్‌పై పెట్టాక… ఏ పరిస్థితి కారణంగా రోగిని వెంటిలేటర్‌పై పెట్టారో, అది మెరుగయ్యే వరకు వెంటిలేటర్‌పైనే ఉంచాల్సి వస్తుంది. ఇక రోగి కోలుకోవడం అన్నది, అతడికి ఉన్న జబ్బు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉన్నప్పుడు చివరి ప్రయత్నంగా వెంటిలేటర్ పై ఉంచుతారు.
కొన్ని రోజుల గడిచిన తర్వాత వాళ్ళు సాధారణ స్థితిలోకి చేరుకుంటారు. కాబట్టి వెంటిలేటర్‌పై పెట్టిన రోగులంతా కోలుకోరని భావించడం సరికాదు. తక్కువ మంది మాత్రమే పరిస్థితి విషమించి, ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తున్నారు. కాబట్టి వెంటిలేటర్ అనగానే ఆందోళన అక్కర్లేదు.