Hemophilia…. హిమోఫిలియా
మనకు రక్తమే ప్రాణాధారం. శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్‌ను, అవసరమైన పోషకాలను మోసుకెళ్లేది రక్తమే. ఇంత కీలకమైంది కాబట్టే శరీరం దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. చర్మం ఎక్కడైనా కోసుకొని రక్తం బయటకు పోతుంటే రకరకాల కణాలు, ప్రోటీన్లను అడ్డువేసి ‘కట్ట’ కట్టుకుంటుంది. హిమోఫిలియా సరిగ్గా ఈ ప్రక్రియనే దెబ్బతీస్తుంది. చిన్న గాయాలైనా రక్తం త్వరగా చిమ్ముకొచ్చేలా చేస్తుంది. రక్తం గడ్డకట్టకపోవటం వల్ల మరింత ఎక్కువసేపు రక్తస్రావం కావటానికి దారితీస్తుంది. దీంతో ప్రమాదాల వంటి వాటికి గురైనప్పుడు చాలా రక్తం పోతుంది. ఇలాంటి సమయాల్లో సత్వరం చికిత్స అందకపోతే ప్రాణాపాయమూ సంభవించొచ్చు. సమస్య తీవ్రంగా గలవారిలో ఇంజెక్షన్ తీసుకున్న చోట పెద్దగా ఉబ్బటం, అక్కడక్కడా చర్మం నల్లగా కమిలినట్టు కనిపించటం వంటివీ వేధిస్తుంటాయి. కొందరికి ఎలాంటి కారణం లేకుండానే.. ఉన్నట్టుండి ఒంట్లోనూ రక్తస్రావం కావొచ్చు. ఇలా కండరాల్లోకి, కీళ్లలోకి…
Read More
You must be logged in to post a comment.