Water…. మంచినీరు ఎంత త్రాగాలి

శరీరానికి ఎంతో మేలు చేసే నీటిని తగినంతగా తాగడమనేది ప్రతి ఒక్కరూ అలవాటుగా చేసుకోవాలి… సమస్త జీవకోటికి ఆధారభూతమైనది నీరు. ఆరోగ్యానిచ్చే టానిక్‌. మానవ శరీరం సుమారు 70 శాతం నీటితోనే నిండివుంది.వేదాలలోను, ఉపనిషత్తులలోను, ఇతర ప్రామాణిక గ్రంథాలోను నీటి ప్రాముఖ్యత వివరించబడింది. శరీరంలోని మలినాలు తొలగించి, ఆరోగ్యవంతంగా ఉంచే శక్తి నీటికి ఉందని ఋగ్వేదం చెబుతోంది. అనేక ఔషధ గుణాలు నీటిలో ఉన్నాయని, నీటి సద్వినియోగం వల్ల శక్తి, తద్వారా జ్ఞానం కలుగుతుందని ఋగ్వేదం చెబుతోంది. అందుకనే దీన్ని విశ్వజనీన ఔషధం అంటారు. ఆహారం లేకుండా కొన్ని రోజులు జీవించవచ్చు. కాని నీరు తాగకుండా కొన్ని గంటలు కూడా బతకలేము.శరీరం జీవకణ నిర్మితం. ఆ జీవకణాలకు ఆహారం, ఆక్సిజన్‌ నీటి ద్వారా (రక్తం ద్వారా) సరఫరా అవుతుంది. హృదయస్పందన, కాలేయం, మూత్రపిండాలలోని విషపదార్థాల విసర్జన, జీర్ణక్రియ…

Read More