ఫిట్నెస్ 

సైకిల్ తొక్కడం వల్ల – ఉపయోగాలు

పార్కింగ్ సమస్య లేదు ట్రాఫిక్ జాం ఊసే ఉండదు లైసెన్సు, ఇతర ధృవ పత్రాలు బేఖాతర్ టోల్ గేట్లు, ఇతర పన్నులు కట్టక్కర్లేదు మంచి వ్యాయామం ఆరోగ్యం బోనస్ స్టామినా పెరుగుదల ఉచితం జిమ్నాసియం మెంబర్ షిప్ డబ్బులు మిగులు నిద్ర పట్టక పోవటమనే బాధ ఉండదు ఖర్చు దాదాపు శూన్యం,  మెయింటెనెన్స్ బహు సులభంపెట్రోల్ పోయించాలి,  చార్జింగ్ పెట్టాలి అన్న దిగులు లేదు నెలవారీ సర్వీసింగ్ వేలు పోసి షోరూం లో చేయించనక్కర్లేదు లిఫ్ట్ అడిగే వారుండరు పిల్లలు పెద్దలు అందరూ వాడుకోవచ్చు డబ్బు ఆదా పర్యావరణ హితం సమాజంలో గొప్ప గుర్తింపు

Read More
ఫిట్నెస్ 

వజ్రాసనం

మోకాళ్ళను ముడిచి, రెండు కాలి బొటన వేళ్ళ ను కలప వలెను. మడమలపై పిరుదులను వుంచి కూర్చొన వలెను. అరచేతులు మోకాళ్ళ వద్ద వుంచాలి. వెన్నుముక నిటారుగా వుంచాలి. మనసును శ్వాస పై వుంచుము . బౌద్ధులు ఇట్లు ధ్యానం చేస్తారు. భోజనం చేసిన తరువాత అయిదు నిమిషాలు ఈ వజ్రాసనం లో కూర్చుంటే జీర్ణశక్తి పెరుగతుంది. సయాటికా బాధలు తగ్గుతాయని చెప్తారు. హైపర్ అసిడిటీ , పొట్టలో అల్సర్ తగ్గుతాయని చెప్తారు. ధ్యాన ఆసనాలలో ఇది గొప్పది.

Read More

వ్యాయామం ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి?

100000 సంవత్సరాల మానవ చరిత్రలో వ్యాయామం ఎప్పుడూ అవసరానికి మించే ఉండేది. యంత్రయుగం వచ్చిన తరవాత, గత 200 సంవత్సరాలలోనే తగ్గిపోయింది. కంప్యూటర్ యుగం వచ్చిన తరవాత ఇంకా తగ్గిపోయింది. 100000 సంవత్సరాల కాలంలో నిరంతర శారీరక శ్రమకు అనుకూలించేలా జరిగిన శరీర నిర్మాణం, యంత్ర యుగం వచ్చిందని 200 సంవత్సరాలలో మారిపోదు కదా! వ్యాయామం లేకపోతే శరీరం చెడిపోతుంది. ఇదేమీ బ్రహ్మజ్ఞానం(rocket science) కాదు. వాడకపోతే కారైనా పాడైపోతుంది. వ్యాయామం అనేక రకాల శారీరక, మానసిక వ్యాధులకు ఔషధం లాగా పని చేస్తుంది. చాలా సందర్భాల్లో మందులకన్నా మెరుగు. అలా అని మందులు మానెయ్యమని కాదు. బరువు తక్కువగా ఉన్న వారు కూడా వ్యాయామం చెయ్యాలి. చెప్పటానికి సులభమైనా వ్యాయామం చేయటం అంత సులభం కాదు. కొంతమందికి మరీ కష్టం. వ్యాయామం చేయని వారు తరచుగా…

Read More

ఆహార నియమాలు

జబ్బుని బట్టీ, శరీర తత్వాన్నిబట్టీ ఆహారం ఉండాలని పూర్వం అనుకునేవారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఎవరికైనా ఆహారనియమాలు స్థూలంగా ఒకటే. తక్కువగా తినండి తక్కువగా వండండి బయటి ఆహార పదార్ధాలు తినకండి ప్రకృతిలో తయారైనవి తినండి. మనుషులు తయారు చేసినవి (processed foods) తగ్గించండి. తక్కువగా తినండి. తినటానికి అనేక కారణాలు: జంతువులు అవసరమైన దానికన్నా ఎప్పుడూ ఎక్కువ తినవు. చంటిపిల్లలూ అంతే. వయసు పెరిగినకొలదీ, అనేక కారణాల వలన మనం అవసరమైన దానికన్నా ఎక్కువ తింటాం. దీనిని ఒక చెడు పరిణామం. (degradation or corruption) అని చెప్పవచ్చును. ఆకలి తీర్చుకోవటానికి మాత్రమే తినాలి. ఐతే అలా జరగటల్లేదు. ఆకలి కాకుండా మనకి తినటానికి ఇంకా అనేకమైన ఇతర కారణాలు ఉంటున్నాయి. సంతోషం వస్తే తింటాము. నీరసంగా ఉంటే తింటాము. మనసులో బాగోక పోతే…

Read More