పిల్లల్లో ఇమ్యునిటి పెరగాలా – తినిపించండి సహజ సిద్ధమైన పదార్థాలను

Natural Foods to Boost your Kids Immunity - Sakshi

పెరుగు: నిత్యం పెరుగును కచ్చితంగా తినిపించాలి. దీంతో వారి శరీరంలో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. పెరుగులో ఉండే కాల్షియం పిల్లల ఎముకలను దఢంగా చేస్తుంది.

నిమ్మజాతి పండ్లు: నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి తదితర పండ్లను చిన్నారులకు ఇవ్వడం వల్ల వాటిలో ఉండే విటమిన్‌ సి పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి శ్వాసకోశ వ్యాధులను రాకుండా చూస్తుంది.

నట్స్‌: రోజూ జీడిపప్పు, బాదం, పిస్తాపప్పు తదితర నట్స్‌ను తినిపించడం వల్ల వాటిలో ఉండే పోషకాలు వారిలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పిల్లలు బలంగా తయారవుతారు. వారికి సంపూర్ణ పోషణ లభిస్తుంది. అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. 

క్యారెట్లు: పిల్లలకు విటమిన్‌ ఎ, జింక్‌ సమద్ధిగా లభించాలంటే వారికి నిత్యం క్యారెట్లను తినిపించాలి. వీటితో కంటి చూపు మెరుగు పడుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. 

బ్రక్సిజం – చిన్నారులు నిద్రలో పళ్లు కొరికే కండిషన్

Teeth Grinding: Diagnosis And Treatment - Sakshi

చిన్నారులు నిద్రలో పళ్లు కొరికే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘బ్రక్సిజం’ అంటారు. పిల్లల్లో ఇది చాలా సాధారణం. ఇది పిల్లల మెుదటి ఐదేళ్ల వ్యవధిలో మెుదలయ్యే సమస్య. కొందరు పెద్దవాళ్లలోనూ ఈ సమస్య ఉండవచ్చు. ఇది ఎందువల్ల వస్తుందనేందుకు నిర్ణీతంగా కారణాలు తెలియదు. సాధారణంగా ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వంతో వ్యవహరించడం వంటి లక్షణాలున్న పిల్లల్లో ఈ బ్రక్సిజం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముందుగా పిల్లల్లో ఆందోళన, వ్యాకులత తగ్గించాలి. నిద్రకు ఉపక్రమించే ముందర వాళ్లను ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయత్నించాలి.

వాళ్లతో ఎక్కువగా సంభాషిస్తూ ఉండాలి. ఆ చిన్నారుల వునసుల్లో ఉన్న భయాలు, శంకలు తొలగించేలా పెద్దలు వ్యవహరించాలి. వాళ్ల పట్ల కన్సర్న్‌ చూపాలి. పిల్లలు నిద్రకు ఉపక్రమించే సవుయంలో కెఫిన్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు (కాఫీ, చాక్లెట్లు వంటివి) పెట్టకూడదు. సమస్య వురీ ఎక్కువగా ఉంటే నోట్లో అవుర్చే మౌత్‌ గార్డ్స్, మౌత్‌పీసెస్‌ వాడితే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఈ సమస్య వల్ల కొన్నిసార్లు పళ్ల (డెంటల్‌) సమస్యలు – వూల్‌ అక్లూజన్, పళ్లు వదులుకావడం (లూజెనింగ్‌), పళ్లు పడిపోవడం, దడవ ఎముక జాయింట్‌ (టెంపోరో వూండిబులార్‌ జాయింట్‌) సమస్యలు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో దంతవైద్య నిపుణలను కలవాల్సి ఉంటుంది.

గ్రహణ మొర్రి

Cleft Palate Disease Special Story - Sakshi

గర్భవతులు గ్రహణం సవుయంలో బయట తిరగడం వల్ల బిడ్డకు ఎలాంటి వైకల్యమూ రాదు. అది బిడ్డ పిండ దశలో ఉండగానే ఏర్పడే ఓ అవకరం. బిడ్డ పెదవులూ, కొన్నిసార్లు అంగిలి చీరుకుపోయినట్లుగా ఉండేదే ‘గ్రహణం మొర్రి’. దాదాపు ప్రతి 1000 జననాల్లో ఒకరికి ఇలా గ్రహణం మెుర్రి రావడం మామూలే. పిండం ఎదిగే సవుయంలో దాదాపు ఆరు నుంచి పది వారాలప్పుడు (రెండో నెల సవుయంలో) బిడ్డలో తల భాగం రూపొందుతుంది. ఈ సవుయంలో ఒక్కోసారి బిడ్డలోని రెండు పెదవులు, అంగిలి కలవవు. అలాంటప్పుడు బిడ్డలో ఈ గ్రహణం మెుర్రి ఏర్పడుతుంది.

శస్త్రచికిత్స ద్వారా ఈ గ్రహణం మెుర్రి సవుస్యను సమర్థంగా చక్కదిద్దవచ్చు. అయితే ఎంత చిన్నవయసులో ఈ శస్త్రచికిత్స చేస్తే ఫలితాలు కూడా అంత బాగుంటాయి. గర్భం ధరించి ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తే అసలు దాని గురించి ఎలాంటి ఆందోళనా పడాల్సిన అవసరమే లేదు. కాబోయే తల్లిదండ్రులు చేయాల్సిందల్లా ఒకటే… వీలైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కు ముందునుంచీ ఫోలిక్‌ యాసిడ్‌ టాబ్లెట్లు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరల్లోనూ ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది గ్రహణం మొర్రినీ, న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్‌నూ చాలావరకు నివారిస్తుంది.

మిషన్ ఇంద్రధనస్సు ( శిశువులకు ఏడు రకాల టీకాలు వేయడం)

2014 డిసెంబర్ 25 న శిశువు కు ఏడు రకాల వ్యాక్సిన్లను తప్పనిసరిగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రారంభించింది.

1. B.C. G : అనగా బాసిల్లస్ కాలమైన్ గ్వానిన్ శిశువు పుట్టినప్పుడు మొట్టమొదటిసారిగా ఇస్తారు.

ఒకసారి మాత్రమే ఇస్తారు ఈ టీకా క్షయవ్యాధి అనగా టీబీ వ్యాధి రాకుండా శిశువును కాపాడుతుంది.

2. O. P. V, I. P. V:

ఓ పి వి అనగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇది పోలియో వ్యాధి రాకుండా శిశువును కాపాడుతుంది.అలాగే ipv కూడా ఇస్తారు ఇది కూడా పోలియో రాకుండా కాపాడుతుంది.

3. హెపటైటిస్ బి వ్యాక్సిన్.

ఈ వ్యాక్సిన్ను కామెర్ల వ్యాధి రాకుండా శిశువుకు ఇస్తారు. ఇది కూడా శిశువు పుట్టినప్పుడు మొదటిసారిగా ఇస్తారు ఈ వ్యాక్సిన్ను తయారుచేసిన దేశాలలో నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందింది.

4.పెంట వ్యాక్సిన్:

ఇది ఐదు రకాల వ్యాధులు శిశువుకు రాకుండా ఇస్తారు.

1. కంఠసర్పి

2. కోరింత దగ్గు.

3. ధనుర్వాతము.

4. కామెర్లు.

5.మెదడు వాపు మరియు నిమోనియా వ్యాధులు రాకుండా ఇస్తారు.

5. M R వ్యాక్సిన్

ఇది రెండు వ్యాధులు శిశువుకు రాకుండా కాపాడుతుంది.

  1. తట్టు (మీజిల్స్ )అంటారు. పొంగు రాకుండా శిశువును కాపాడుతుంది.
  2. రూబెల్లా. చర్మానికి సంబంధించిన వ్యాధి రాకుండా ఇది కాపాడుతుంది.

6. D. P. T వ్యాక్సిన్.

ఇది మూడు రకాల వ్యాధులు శిశువుకు రాకుండా కాపాడుతుంది.

1. డిప్తీరియా. దీనిని అంగడ వాపు వ్యాధి అని అంటారు. గొంతుకు వచ్చే వ్యాధి.

2. పెర్టుసిన్. కోరింత దగ్గు రాకుండా ఇస్తారు దీనిని ఉఫింగ్ కాఫ్ అని అంటారు.

3. టెటానస్. ధనుర్వాతము ఇనుప ముక్కలు గుచ్చుకోవడం ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది.

7. J. E వ్యాక్సిన్.

దీనిని మెదడువాపు వ్యాధి నివారణకు ఇస్తారు.

తల్లిదండ్రులు ఈ ఏడు వ్యాక్సిన్లను తప్పనిసరిగా తమ పిల్లలకు వేయించాలి.

కడుపులో పురుగులు

కడుపులో పురుగులు ఉన్నాయంటే అవి సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా మొదలుకొని, ఏకకణ జీవులైన ప్రోటోజోవా నుంచి బద్దెపురుగులూ (ఫ్లాటీహెల్మెంథిస్‌), వానపాముల జాతికి చెందిన నిమటోడ్స్‌ వరకు ఎన్నెన్నో రకాలైనవి ఉండవచ్చు. కడుపులోకి చేరి బాధించే ఏకకణజీవులైన ప్రోటోజోవా వర్గానికీ, ఆ తర్వాతి స్థానాల్లో ఉండే హెల్మింథిస్‌ (ఫ్లాటీ అండ్‌ నిమటీ హెల్మెంథిస్‌) వర్గానికి చెందిన పరాన్నజీవులివి.

► ప్రోటోజోవాకి చెందిన జియార్డియా
ఇది జీర్ణవ్యవస్థలోని చిన్న పేగుల్లో (డియోడినమ్‌ అనే భాగంలో) ఉండే పరాన్నజీవి. ఇది ఏకకణ జీవి. మైక్రోస్కోప్‌ కింద చూసినప్పుడు చిత్రంగా పెద్దపెద్ద కళ్లలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. చిన్నపేగుల్లో జీవిస్తుంది కాబట్టి దీన్ని జియార్డియా ఇంటెస్టినాలిస్‌ అని కూడా అంటారు. డియోడినమ్‌లో ఉండే దాన్ని జియార్డియా డియోడినాలిస్‌ అంటారు. కలుషితమైన ఆహారం తినేవారిలో ప్రధానంగా పరిశుభ్రత పాటించని హాస్టళ్లు, హోటళ్లలో తినేవారిలో ఇది ఉంటుంది. ఇది కడుపులో పడ్డవారిలో నీళ్ల విరేచనాలు, కడుపునొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కడుపులోని క్రిములను నిర్మూలించాకే ఆ ల„ý ణాలు దూరం అవుతాయి.

► ఎంటమీబా హిస్టొలిటికా
ఇది కూడా ప్రోటోజోవాకే చెందిన ఏకకణ సూక్ష్మజీవి. ఇది అపరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది. దీని వల్ల అమీబియాసిస్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల… నీళ్ళ విరేచనాలు, కడుపులో నొప్పి, వాంతులు, కడుపు ఉబ్బరం, విరేచనాలలో రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో అప్పుడప్పుడు ఆకస్మికంగా జ్వరం రావచ్చు. ఇంకొందరిలో దగ్గు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు, అనీమియాకు గురికావడం లాంటి లక్షణాలూ ఉంటాయి. అరుదుగా కొన్ని సందర్భాలలో పురుగులకు సంబంధించిన లార్వాలు మెదడులోకి వెళ్ళడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

► ఫ్లాట్‌ వార్మ్‌ (టీనియా సోలియమ్, టీనియా సాజినెటా): ఇవి మూడు మీటర్ల కంటే పెద్దగా ఉంటుంవి. ఇవి పొడవులను కొలిచే టేప్‌లా ఫ్లాట్‌గా ఉండటంతో టేప్‌ వార్మ్స్‌ అనీ, ఫ్లాట్‌ వార్మ్స్‌ అని కూడా అంటుంటారు. మనం తినే ఆహారాలు పూర్తిగా సరిగా ఉడికేలా జాగ్రత్త పడాలి. సాధారణంగా మనలో కొందరికి పోర్క్, ఇంకొందరికి బీఫ్‌ తినడం అలవాటు. అలాంటి వారిలో కచ్చాపచ్చాగా ఉడికించి వండిన పోర్క్‌ తినడం వల్ల టీనియో సోలియమ్‌ జీవులు పెరుగుతాయి. అలాగే సరిగా ఉడికించని బీఫ్‌ తినేవారిలో టీనియా సాజినేటా జీవులు వృద్ధి చెందుతాయి. ఈ జీవుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్‌ను టేప్‌వార్మ్‌/ఫ్లాట్‌వార్మ్‌ ఇన్ఫెక్షన్‌ అని వ్యవహరిస్తుంటారు.

► నులి పురుగు/ ఆస్కారిస్‌ వార్మ్స్‌: ఇవి చిన్నపేగుల్లో తమ ఆవాసం ఏర్పరచుకుంటాయి.  వీటి కారణంగా కడుపునొప్పి, డయేరియా వంటి లక్షణాలు ఉంటాయి. ఈ నులిపురుగులు 5 నుంచి 10 సెం.మీల పొడవు ఉంటాయి. అపరిశుభ్రమైన ఆహారం, నీటి వల్ల ఇవి కడుపులోకి చేరుకుంటాయి.

► పిన్‌ వార్మ్‌ / త్రెడ్‌ వార్మ్‌ / సీట్‌ వార్మ్‌: ఈ క్రిమి కారణంగా మలద్వారం  వద్ద విపరీతమైన దురద వస్తుంది. సాధారణంగా చిన్న పిల్లలు మట్టిలో ఆడుకుంటుంటారు. వారు ఆటల సమయంలో తమ పిరుదులు, కింది భాగంలో గీరుకోవడం, తర్వాత ఆ వేళ్లను నోటిలో పెట్టుకోవడం వల్ల ఈ క్రిములు శరీరంలోకి చేరుతాయి. అక్కడి నుంచి జీర్ణవ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. ఈ క్రిములు దాదాపు 2 నుంచి 3 మి.మీ పొడవుంటాయి.

► హుక్‌ వార్మ్‌ (ఎన్‌కైలోస్టోమా, సిస్టోజోమా): ఇవి చర్మం ద్వారా శరీరంలోకి చొచ్చుకుని వెళ్లి రక్తనాళాల్లోకి వెళ్లి రక్తప్రవాహంలో కలుస్తాయి. అలా రక్తం ద్వారా అవి  కాలేయం, మూత్రాశయం వంటి భాగాలలోకి చేరుకుని అక్కడ వృద్ధి చెందుతాయి. ఇవి 1 మి.మీ కంటే తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల ఇది కంటికి కనిపించవు. అపరిశుభ్రమైన పరిసరాల వల్ల ఇవి ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తాయి.  

కడుపులో పురుగుల నివారణకూ / బయటపడటానికీ ఆహారనియమాలివి బాగా పుష్కలంగా తినాల్సినవి :
► పురుగులు పేగుల్లో నుంచి బయటపడాలంటే మన దేహంలో కదలికలు చురుగ్గానూ, బాగా ఉండాలి. శారీరకంగా మంచి కదలికలు, శ్రమ ఉండేవారిలో పేగుల కదలికలు కూడా చురుగ్గా ఉండి, మలవిసర్జన సాఫీగా అవుతుంది. అలాంటప్పుడే విరేచనం ద్వారా పురుగులు బయటకు వస్తాయి. కాబట్టి మనం శారీరక శ్రమ / వ్యాయామం చేస్తూ ఉండాలి. అలాగే రోజూ పుష్కలంగా నీళ్లు తాగడంతో పాటు విరేచనం సాఫీగా జరగడానికి తోడ్పడేందుకు ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆకుకూరలూ / కాయగూరలను ఎక్కువగా తీసుకోవాలి.

► మనం తినే టిఫిన్లు, ఉపాహారాలలో దేహానికి ఉపయోగపడే బ్యాక్టీరియా పుష్కలంగా ఉండే ఇడ్లీ, దోస వంటివి తినాలి. అలాగే ప్రోబయాటిక్స్‌ ఎక్కువగా ఉండే తియ్యటి పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవాలి. పులిసిన పెరుగు/మజ్జిగ వంటివి మళ్లీ యాసిడ్‌ను పెంచి కడుపులో మరింత ఇబ్బందికి కారణమవుతాయి.

► ఆహారం సరిగా జీర్ణం కావడానికి తోడ్పడే ఎంజైమ్‌ల వల్ల చిన్నపేగు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఎంజైమ్‌లు వృద్ధి చెందాలంటే విటమిన్‌–సి, జింక్‌ వంటివి ఎక్కువగా ఉండే ఎక్కువగా ఉండే ఆహరం తీసుకోవాలి.

తీసుకోకూడనివి లేదా పరిమితంగా మాత్రమే తీసుకోవాల్సినవి
► కార్బోహైడ్రేట్స్, చక్కెరతో కూడిన ఆహారం, పళ్ళ రసాలు, పాల ఉత్తత్తులు, కొవ్వుపదార్థలు, నూనెలు వంటివి తగ్గించడం మంచిది.

చికిత్స
► కడుపులో పురుగులు పడ్డాయని అనుమానించినప్పుడు డాక్టర్లు మల పరీక్షల వంటి  కొన్ని పరీక్షల ద్వారా వీటిని నిర్ధారణ చేసి… కడుపులో ఉన్న క్రిములను బట్టి మిబెండజోల్‌ వంటి కొన్ని  సాధారణ మందుల ద్వారానే వీటిని నిర్మూలించేలా చికిత్స చేస్తారు.

కడుపులోకి క్రిములు / పురుగులు చేరేదెలాగంటే…
► కడుపులోకి క్రిములు / పురుగులు చేరడానికి ముఖ్య కారణం అపరిశుభ్రమైన నీరు, ఆహారాన్ని తీసుకోవడం. అలాగే సరిగ్గా ఉడికించని మాంసాహారాలతోనూ టేప్‌వార్మ్‌ వంటి జీవులు చేరతాయి. అలాగే మనం రోజూ తినే ఆకుకూరలు, కూరగాయలు సరిగ్గా శుభ్రపరచకుండా తీసుకోవడం వల్ల కూడా క్రిములు పెరిగే అవకాశముంది.

► కాళ్లకు చెప్పుల వంటి రక్షణ ఏదీ లేకుండా మట్టిలో అపరిశుభ్రమైన పరిసరాలలో తిరిగే వాళ్లలో హుక్‌ వార్మ్‌వంటి పురుగులు కడుపులోకి చేరి, అక్కడ వ్యాప్తి చెందుతాయి.

ఆటో ఇన్ఫెక్షన్స్‌ : కొందరు చిన్న పిల్లలు మర్మాంగాల వద్ద, పృష్ట భాగంలో గీరుకుంటూ… అవే వేళ్లను నోటిలో పెట్టుకోవడం వల్ల వారి నుంచి వారికే పురుగులు వ్యాపిస్తాయి.

నివారణ
► కడుపులో పురుగులు రాకుండా, క్రిములు చేరకుండా ఉండాలంటే మొట్టమొదటి సాధారణ సూత్రం పరిశుభ్రమైన నీళ్లు తాగాలి. కలుషితమైన చోట్ల తాగాల్సి వస్తే తప్పక కాచి చల్లార్చి, వడపోసిన నీటిని మాత్రమే తాగాలి.

Mumps……. గవదబిళ్లలు

ఉన్నట్టుండి జ్వరం పిల్లలకు దవడ వాచిపోయి, గవదబిళ్లలు మొదలైతే …….చూడటానికి చాలా భయంగా ఉంటుంది. నొప్పి వేధిస్తుంది. పెద్దల్లో వస్తే బాధలు కాస్త తీవ్రంగా కూడా ఉంటాయి. అయినా… ఇది మరీ అంత ప్రమాదకరమైన వ్యాధేం కాదు. దీనివల్ల దీర్ఘకాలం మిగిలిపోయే సమస్యలేం ఉండవు. అసలిదీ రాకుండా సమర్ధమైన టీకా ఉంది.

చిన్న ప్లిల్లలలో సాధారణంగా వచ్చే వ్యాధుల్లో గవదబిళ్లలు ఒకటి. దీన్నే ‘మంప్స్‌’ అంటారు. ఆటలమ్మ, పొంగు మాదిరిగానే ఇది కూడా వైరస్‌ కారణంగా వచ్చే సమస్య. ఇది 5-9 ఏళ్ల మధ్య వయస్సు ప్లిల్లలలో ఎక్కువ. అయితే ఇది పెద్దల్లో కూడా రావచ్చు, పైగా పెద్దలకు వస్తే భాధలు కాస్త తీవ్రంగా ఉంటాయి. ఈ గవదబిళ్లల సమస్య ఏడాదంతా ఎక్కడోచోట కనపడుతూనే ఉంటుంది. కాని ఎండాకాలం నుంచి వర్షఋతువు మొదలయ్యే మధ్యలో అధికం. అలాగే 2-3 మూడేళ్లకు ఒకసారి ఇది విస్తృతంగా చాలా మందిని బాధపెడుతుంది.

ఎలా వస్తుంది? గవదబిళ్లలు ఉన్నవారు దగ్గినా, తుమ్మినా, లాలాజలం తుంపర్ల ద్వారా ఈ వైరస్‌ ఇతరుకు వ్యాపిస్తుంది. అందుకే జనం కిక్కిరిసి ఉండే ప్రాంతాల్లో పిల్లలు కలివిడిగా తిరుగుతుండే స్కూళ్లు, హాస్టళ్లలో ఎక్కువగా ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తుంటుంది. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏమంటే ఈ వైరస్‌ ఒంట్లో చేరిన తర్వాత బాధలు, లక్షణాలు మొదలవ్వడానికి 14 నుంచి 21 రోజులు పట్టవచ్చు. పూర్తిస్ధాయి గవదబిళ్లలు ఉన్న వారి నుంచే కాదు, తొలిదశ లక్షణాలున్న వారి నుంచి ఈ వైరస్‌ ఇతరులకు వ్యాపిస్తుంది.

గ్రంథులలో స్ధావరం: గవదబిళ్లలకు కారణమయ్యే వైరస్‌ ప్రధానంగా గ్రంథుల్లో స్ధావరం ఏర్పాటు చేసుకుంటాయి. తర్వాత నాడుల మీద ప్రభావం చూపుతుంది. ముందుగా మామూలు ఫ్లూ మాదిరే ఇందులోను జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు నలతగా ఉన్నట్లు కనిపిస్తారు. ఈ సమయంలో చెంప దగ్గర …చెవిముందు భాగంలో ఉండే లాలాజల గ్రంధులు (పెరోటిడ్‌, సెలైవరీ గ్లాండ్స్‌) రెండువైపులా వాచి బాధపెడతాయి. ఈ గ్రంధుల వాచే సమయంలో కొందరికి చెవిపోటు కూడా రావచ్చు. దాదాపు 5-7 రోజుల్లో ఈ వాపు తగ్గుతుంది. వాపుతో పాటు జ్వరం తగ్గుముఖం పడుతుంది.

సమస్య ముప్పు: గవదబిళ్లలు కేవలం లాలాజల గ్రంధులకే పరిమితం కాదు. కొన్నిసార్లు ఇది శరీరంలోని ఇతర భాగాలను ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా మగవారిలో వృషణాలు, ఆడవారిలో అండాశయాలు, అలాగే కాలేయం, క్లోమ గ్రంధుల్లోను వాపు రావచ్చు. చాలా అరుదుగా కొద్దిమందిలో చెవుడు కూడా రావచ్చు. సాధారణంగా 12-14 మధ్య వయస్సు మగప్లిల్లలలో వృషణాల వాపు కనపడుతుంది. ముఖ్యంగా గవద వాపు తగ్గుతున్న సమయంలో ( 7-10 రోజు మధ్య) ఒక్కసారి జ్వరం వచ్చి వృషణాలు బాగా నొప్పి చేసి విపరీతంగా బాధపడతారు.ఇక ఆడపిల్లల అండాశయాల వాపు మూలంగా పొత్తి కడుపులో నొప్పి జ్వరంతో బాధపడటం కనిపిస్తుంది. కొందరిలో కడుపు మధ్యలో నొప్పి, జ్వరంతో క్లోమగ్రంథి వాచిపోయి ‘పాంక్రియాటిస్‌’ కు దారితీయచ్చు. అయితే ముఖ్యంగా చెప్పుకోవసినది ఏమంటే ఇవన్నీ తాత్కాలికంగా బాధపెట్టేవే కాని వీటితో సాధారణంగా దీర్ఘకాలం ప్రభావితం చేసే తీవ్ర దుష్ప్రభావాలేమీ ఉండవు.

అరుదుగా ప్రమాదం: చాలా చాలా అరుదుగా గవదబిళ్లలకు కారణమయ్యే వైరస్‌ మెదడుకు వ్యాపించి మెదడు వాపు, (ఎన్‌కెఫలైటిస్‌) మెదడు పైపొరల్లో వాపు (మెనింజైటిస్‌) తెచ్చిపెట్టచ్చు. అయితే ఇవి అరుదు. పైగా సకాలంలో చికిత్సతో చాలా వరకు నయమయిపోతాయి.

పెద్ద అపోహ: గవదబిళ్లల కారణంగా మగపిల్లలకు వృషణాల వాపు వస్తే … పెద్దయ్యాక వారికి పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలుంటాయని చాలామంది అపోహ పడుతుంటారు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. గవదబిళ్లలు మూలంగా పిల్లలు పుట్టకపోవడం, పటుత్వం తగ్గటం వంటి ఇబ్బందులేమి ఉండవు.

పరీక్షలో నిర్థారణ: చాలావరకు లక్షణాల ఆధారంగా వైద్యులు దీన్ని నిర్థారిస్తారు. మరీ అవసరమైతే యాంటీబోడీ, ఐజీయమ్‌, ఐజిజి, వంటి పరీక్షలతో పాటు లాలాజల పరీక్షలు చేసి ఈ వైరస్‌ను నిర్ధారించుకోవచ్చు. పిసిఆర్‌ పరీక్ష ద్వారా మూత్రంలో లాలాజలంలో కూడా వైరస్‌ను గుర్తించవచ్చు. మెదడు వాపు వచ్చినపుడు మాత్రం వెన్ను నుంచి నీరు (సియస్‌యఫ్‌) తీసి పరీక్ష చేయాల్సివుంటుంది.

విశ్రాంతి కీలకం : గవదబిళ్లలకు ప్రత్యేకమైన మందులేమి లేవు. పిల్లలకు మెత్తటి ఆహారం, సరైన పోషణ, సపర్యలు, విశ్రాంతి ఇవ్వాలి. దవడకు వేడి నీటి కాపడం హాయినిస్తుంది. నొప్పులు తగ్గేందుకు పారాసిట్‌మాల్‌ మాత్రలు తీసుకోవచ్చు. కడుపులో నొప్పి వంటి ఇతరత్రా దుష్ప్రభావాలుంటే మాత్రం తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణ అవసరం. వీరికి అవసరమైతే స్టిరాయిడ్స్‌ వంటివి ఇస్తారు.
టీకాతో నివారణ: గవదబిళ్లలు రాకుండా చిన్నపిల్లలందరికి యమ్‌.యమ్‌.ఆర్‌ ( మంప్స్‌, మీజిల్స్‌, రూబెల్లా) టీకా ఇవ్వడం అత్యుత్తమం. దీన్ని మొదటి సంవత్సరంలో ఒకసారి బడికి వెళ్లేముందు 5 ఏళ్ల వయస్సులో ఇవ్వాల్సిఉంటుంది.

ఒకసారి గవదబిళ్లలు వస్తే జీవితంలో మళ్లీ ఎప్పుడురాదు. ఈ వ్యాధి వచ్చినవారికి దాని నిరోధకశక్తి జీవితాంతం ఉంటుంది. పెద్దల్లో గవద వాపు వచ్చినప్పుడు లేదా ఎవరికైనా ఒకవైపే వాపు వచ్చినప్పుడు గవదబిళ్లలు కాకుండా లాలాజల గ్రంథుల నాళాలు మూసుకుపోవడం, ఇన్ఫ్‌క్షన్‌ వంటి ఇతరతర కారణాలేమైనా ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది.

శిశువు గుండెలో రంధ్రం

పుట్టుకతో తలెత్తే ఈ సమస్యకు ఒకప్పుడు శస్త్రచికిత్స తప్ప మరో మార్గం ఉండేది కాదు. అయితే గొడుగులా విచ్చుకునే పరికరాల రాకతో పరిస్థితి మారిపోయింది. శస్త్రచికిత్స అవసరం లేకుండా బయటి నుంచే గొట్టం ద్వారా రంధ్రాలను మూసేయటం సాధ్యమైంది. కానీ వీటితో గుండె వేగం తగ్గటం వంటి దుష్ప్రభావాలు పొంచి ఉంటుండటం.. పెద్ద రంధ్రాలకు సరిపడకపోవటం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించిన వైద్య పరిశోధనా రంగం కొంగొత్త పరికరాల రూపకల్పనపై దృష్టి సారించింది. ఇలా పుట్టుకొచ్చిందే ‘కోనార్‌ఎంఎఫ్‌’. కేవలం గుండె రంధ్రాలకే కాదు.. పుట్టుకతో వచ్చే మరికొన్ని సమస్యలకూ ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దటం విశేషం. ఇప్పటికే విదేశాల్లో కొన్నిచోట్ల దీన్ని వినియోగిస్తున్నారు కూడా. మనదేశంలోనూ త్వరలోనే దీని వాడకానికి అనుమతి లభించనుంది.

చూడటానికి పిడికెడే గానీ గుండె చేసే పని అంతా ఇంతా కాదు. నిమిషానికి 72 సార్లు.. గంటకు 4,320 సార్లు.. రోజుకు 1,03,680 సార్లు.. ఇలా అనుక్షణమూ లబ్‌డబ్‌మని కొట్టుకుంటూ రక్తం ద్వారా శరీరంలోని ప్రతి కణానికీ అవసరమైన ఆక్సిజన్‌ను, పోషకాలను చేరవేస్తుంది. మనం తల్లి కడుపులో పడ్డాక 21వ రోజు నుంచే పని ప్రారంభించే ఇది జీవితాంతం కొట్టుకుంటూనే ఉంటుంది. కాబట్టే దీనికి ఏ చిన్న సమస్య వచ్చినా జీవితం అతలాకుతలమైపోతుంది. అలాంటిది పుట్టుకతోనే గుండెలోపల రంధ్రం ఉంటే? అది మూసుకుపోకుండా వేధిస్తుంటే? ఓటి గుండెతో పిల్లలు అవస్థలు పడక తప్పదు. పుట్టుకతో వచ్చే గుండెజబ్బుల్లో 30-40% వరకూ కనబడేవి గుండెలో రంధ్రాలే.

మన గుండెలో నాలుగు గదులుంటాయి. వీటిని కర్ణికలు (పై రెండు గదులు), జఠరికలు (కింది రెండు గదులు) అంటారు. అలాగే గుండెను కుడి ఎడమలుగా రెండు భాగాలుగానూ విభజించుకోవచ్చు. గుండె కొట్టుకునే ప్రతీసారీ- శరీరంలోని వివిధ భాగాల నుంచి వచ్చిన ‘చెడు’ రక్తాన్ని కుడి భాగం తీసుకొని ఊపిరితిత్తుల్లోకి పంపిస్తుంది. ఇక ఎడమ భాగమేమో ఊపిరితిత్తుల నుంచి వచ్చిన ‘మంచి’ రక్తాన్ని గ్రహించి శరీరంలోని వివిధ భాగాలకు పంపిస్తుంది. ఈ రెండు భాగాల మధ్య ‘సెప్టమ్‌’ అనే పొర గోడ మాదిరిగా అడ్డుగా నిలుస్తూ.. మంచి రక్తం, చెడు రక్తం కలిసిపోకుండా నిలువరిస్తుంటుంది. అయితే కొందరిలో పుట్టుకతోనే ఈ మధ్య పొరలో రంధ్రాలు ఉంటుంటాయి. కర్ణికల మధ్య గోడలోని రంధ్రాలను ఏట్రియల్‌ సెప్టల్‌ డిఫెక్ట్స్‌ (ఏఎస్‌డీ) అని.. జఠరికల మధ్య గోడలోని రంధ్రాలను వెంట్రికల్‌ సెప్టల్‌ డిఫెక్ట్స్‌ (వీఎస్‌డీ) అని అంటారు. వీటి గుండా మంచి రక్తం చెడు రక్తంలో కలిసిపోతుంటుంది. అంటే మంచి రక్తం శరీరానికి కాకుండా తిరిగి ఊపిరితిత్తుల్లోకే చేరుకుంటుందన్నమాట. సాధారణంగా చాలామందిలో వయసు పెరుగుతున్నకొద్దీ ఈ రంధ్రాలు వాటంతటవే మూసుకుపోతాయి. కానీ కొందరిలో అలాగే ఉండిపోతుంటాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండె వైఫల్యం వంటి ఇతరత్రా సమస్యలకూ దారితీస్తాయి. కాబట్టి వీరిని నిశితంగా గమనిస్తుండటం, తగు చికిత్స చేయటం అవసరం. సహజమే కానీ..

నిజానికి గుండెలో కర్ణికల మధ్య రంధ్రం ఉండటమనేది సహజమనే చెప్పుకోవాలి. తల్లి గర్భంలో పిండం ఎదుగుతున్నప్పుడు- తల్లి మాయ నుంచే పిండానికి మంచి రక్తం అందుతుంది. పిండం చెడు రక్తాన్ని తల్లి శరీరమే శుద్ధి చేస్తుంటుంది. ఇది పిండానికి చేరుకోవటానికి కాన్పయ్యే వరకూ పిండం గుండెలోని పై రెండు గదుల మధ్య సహజంగానే ఒక రంధ్రం (ఫొరామినా ఒవేల్‌) ఉంటుంది. బిడ్డ పుట్టి.. శ్వాస పీల్చుకొని, ఊపిరితిత్తులు పనిచేయటం మొదలెట్టాక దీని అవసరం ఉండదు. కాబట్టి ఇది క్రమంగా.. 4-6 వారాల్లో పూర్తిగా మూసుకుపోతుంది. అయితే ఇది కొందరిలో మూసుకుపోకుండా తెరచుకునే ఉంటుంది. అయినా కూడా పెద్ద ఇబ్బందులేమీ ఉండకపోవచ్చు. చాలామందికి మూడేళ్లు వచ్చేసరికి వాటంతటవే మూసుకుపోతాయి కూడా. కానీ కొందరిలో మూసుకుపోకుండా అలాగే ఉండిపోతాయి. కొందరిలో రంధ్రాలు పెద్దగానూ ఉండొచ్చు. ఇవి గుండె వైఫల్యం, న్యుమోనియా, బరువు పెరగకపోటం, ఊపిరితిత్తుల్లో అధిక రక్తపోటు వంటి సమస్యలను తెచ్చిపెడతాయి. గుండె కండరానికి ఇన్‌ఫెక్షన్‌ (ఎండోకార్డయిటిస్‌), ఊపిరితిత్తుల్లోకి వెళ్లే రక్తనాళం కింద అదనపు కండరం పెరగటం వంటివీ తలెత్తొచ్చు. అందువల్ల రంధ్రం అదే పూడుకుపోతుందని నిర్లక్ష్యం చేయటం తగదు.

కొందరికి కింది గదుల మధ్య కూడా రంధ్రాలు ఉండొచ్చు. ఇవి ఉన్నా చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనబడకపోవచ్చు. పాఠశాలలో వైద్య పరీక్షలు చేసినప్పుడో, న్యుమోనియా వంటి సమస్యలతో డాక్టర్‌ దగ్గరికి వెళ్లినపుడు పరీక్షించినపుడో ఇలాంటి రంధ్రాలు బయడపడుతుంటాయి. అయితే ఆయాసం, న్యుమోనియా, గుండె వైఫల్యం వంటి ఇబ్బందులేవీ లేవు కదా అని వీటిని తేలికగా తీసుకోవటానికి లేదు. పరుగెత్తటం వంటి శ్రమతో కూడుకున్న ఆటలు ఆడేటప్పుడు, ఆడవాళ్లయితే పెద్దయ్యాక గర్భం ధరించినపుడు ఇవి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తాయి. పల్మనరీ హైపర్‌టెన్షన్‌కూ దారితీయొచ్చు.

పరీక్షలు
పిల్లలను స్టెతస్కోప్‌తో పరీక్షించినప్పుడు గుండె చప్పుడులో ఏదైనా తేడా కనబడితే గుండెలో రంధ్రం ఉండొచ్చని అనుమానించటం తప్పనిసరి. డొక్కలు ఎగరేయటం, పాలు ఆపి ఆపి తాగటం, పాలు తాగిన కొద్దిసేపటికే నిద్రపోయి తిరిగి ఆకలితో లేస్తుండటం, చెమటలు ఎక్కువగా పడుతుండటం వంటి గుండె వైఫల్య లక్షణాలు కనబడినా.. బరువు సరిగా పెరగకపోతున్నా ఏమాత్రం తాత్సారం చేయరాదు. కొన్ని పరీక్షలు ద్వారా సమస్యను నిర్ధరించుకోవాల్సి ఉంటుంది.

ఎక్స్‌రే: గుండె సైజు, ఊపిరితిత్తులకు ఎంత రక్తం వెళ్తోందనేది ఇందులో బయటపడుతుంది.
ఈసీజీ: ఇందులో గుండె గదుల సైజు ఎంత పెరిగిందనేది తెలుస్తుంది
ఎకో కార్డియోగ్రామ్‌: ఇందులో సమస్య తీవ్రత, రంధ్రాల సంఖ్య, రంధ్రాల సైజు, ఊపిరితిత్తుల్లోకి చేరుకునే రక్తం మోతాదు, ఊపిరితిత్తుల్లో రక్తపోటు వంటివన్నీ స్పష్టంగా తెలుస్తాయి. వీటిని బట్టి వెంటనే ఆపరేషన్‌ చేయాలా? మందులు ఇవ్వాలా? ఆపరేషన్‌ అవసరం లేకుండా ఇతర పద్ధతులతో చికిత్స చేయొచ్చా? అనేవి నిర్ధరించుకోవటానికి వీలవుతుంది

చికిత్స…..మందులు
చిన్నప్పుడే గుండె రంధ్రాలను గుర్తించగలిగితే మందులు, ఆహార జాగ్రత్తలతో దుష్ప్రభావాలు ముంచుకురాకుండా చూసుకోవచ్చు. ఫ్రూసిమైడ్‌, అల్డక్టోన్‌, డిగాక్సిన్‌, ఏసీఈ ఇన్‌హిబిటార్స్‌ వంటి మందులు బాగా ఉపయోగపడతాయి. రక్తక్షీణతతో గుండె వైఫల్యం ఎక్కువయ్యే ప్రమాదముంది కాబట్టి ఐరన్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్యాల్షియం ఇవ్వటమూ అవసరం. అలాగే న్యుమోనియా, ఫ్లూ రాకుండా టీకాలు కూడా ఇప్పించాలి. ఆహారపరంగానూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాలు ఎక్కువగా తాగలేరు కాబట్టి తక్కువ తక్కువగా ఎక్కువసార్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదనపు ఆహారాన్ని ఆరంభించినపుడు తగినంత కేలరీలు, ప్రోటీన్లు అందేలా చూడాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ.. క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉంటే కొంతకాలానికి సుమారు 60% రంధ్రాలు వాటంతటవే మూసుకుపోతాయి. అయితే తరచుగా న్యుమోనియా బారినపడుతుండటం, గుండె వైఫల్యం వంటివి గుర్తిస్తే ముందుగానే రంధ్రాలను మూసేయాల్సి ఉంటుంది.

సర్జరీ, అంబ్రెల్లా
మందులతో ఫలితం కనబడకపోయినా, రంధ్రం మరీ పెద్దగా ఉన్నా, తరచుగా న్యుమోనియా బారినపడుతున్నా సర్జరీ ద్వారా గానీ అంబ్రెల్లా పరికరంతో గానీ రంధ్రాన్ని మూసేయాల్సి ఉంటుంది. సర్జరీలో ఛాతీని తెరచి.. గుండె చుట్టూరా ఉండే కండరపొరతో లేదా కృత్రిమ పదార్థంతో రంధ్రాన్ని మూస్తారు. అయితే అంబ్రెల్లా పద్ధతి (ఇంట్రవెన్షనల్‌ డివైస్‌ క్లోజ్డ్‌ ప్రొసీజర్‌) అందుబాటులోకి వచ్చాక ఈ సర్జరీల అవసరం కొంతవరకు తప్పిపోయింది. ఇందులో తొడ దగ్గర్నుంచి రక్తనాళం ద్వారా గొట్టాన్ని పంపించి.. గుండెలోకి చేరుకొని.. గుండె గది గోడలోని రంధ్రం నుంచి చిన్న పరికరాన్ని పంపించి.. గొట్టాన్ని నెమ్మదిగా బయటకు లాగుతారు. దీంతో పరికరం గొడుగు మాదిరిగా విచ్చుకుని.. గుండె గది గోడకు రెండు వైపులా అంటి పెట్టుకొని ఉండిపోతుంది. దీంతో రంధ్రం మూసుకుపోతుంది. ఆరు నెలల తర్వాత అంబ్రెల్లా మీద కండరం వృద్ధి చెందుతుంది. రంధ్రం పూర్తిగా, శాశ్వతంగా మూసుకుపోతుంది. కొత్త పరికరం- కొత్త ఆశ.

సంప్రదాయ అంబ్రెల్లా పరికరాలతో చిక్కేటంటే- గుండెలో విద్యుత్తును ఉత్పత్తి చేసే వ్యవస్థలోని ఏవీ నోడ్‌ మీద ఒత్తిడి కలగజేయటం. దీంతో గుండె కండరానికి విద్యుత్‌ ప్రచోదనాలు సరిగా అందక గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతుంది. ఇలాంటి సమస్యలను అధిగమించటానికి రూపొందించిందే ‘కోనార్‌ఎంఎఫ్‌’ పరికరం.

మామూలు అంబ్రెల్లా పరికరం మాదిరిగా కాకుండా ఇందులో రెండు డిస్కులుంటాయి. వీటి మధ్యలోని సన్నటి తీగ ఈ రెండు డిస్కులనూ గట్టిగా కలిపి ఉంచుతుంది. గుండెలోని ఏవీ నోడ్‌ మీద ఎలాంటి ఒత్తిడీ పడదు.

దీని లోపలి భాగం శంఖాకారంలో ఉండటం వల్ల రంధ్రంలో అవసరమైన మేరకు చేరుకొని, పూర్తిగా మూసుకుపోయేలా చేస్తుంది. రంధ్రం సైజు అటూఇటూగా ఉన్నా పరికరం సరిగా కుదురుకుంటుంది.
దీని మధ్యలోని తీగ సగానికన్నా తక్కువ సన్నగా ఉంటుంది. దీంతో పరికరం తేలికగా సాగుతుంది.
రెండువైపులా స్క్రూలు ఉంటాయి కాబట్టి ఎటునుంచైనా అమర్చొచ్చు.

దీన్ని సన్నటి గొట్టం ద్వారా కూడా లోపలికి తీసుకెళ్లొచ్చు. ఫలితంగా చిన్నగా ఉండే శిశువులకూ తేలికగా అమర్చటానికి వీలవుతుంది. దుష్ప్రభావాలు తలెత్తటం తక్కువ. సంప్రదాయ పరికరాన్ని అమర్చటానికి 20-30 నిమిషాలు పడుతుంది. దీన్నయితే 3 నుంచి 10 నిమిషాల్లోనే అమర్చొచ్చు. సన్నటి నిటినాల్‌ లోహంతో రూపొందించటం వల్ల బరువు చాలా తక్కువగా ఉండటమే కాదు.. దృఢంగానూ ఉంటుంది.

కోనార్‌ఎంఎఫ్‌ పరికరం ఒక్క గుండె రంధ్రాలకే కాదు. ఇది ఇతరత్రా సమస్యలకూ ఉపయోగపడుతుంది. గుండె నుంచి శరీరానికి రక్తాన్ని తీసుకెళ్లే బృహద్ధమని, ఊపిరితిత్తుల్లోకి వెళ్లే పుపుసధమని కలిసిపోవటం (పేటెంట్‌ డక్టస్‌ ఆర్టిరియోసిస్‌).. గుండె కండరానికి రక్తసరఫరా చేసే రక్తనాళాలు గుండెలోకి తెరచుకొని ఉండటం (కరోనరీ ఆర్టీరియో ఫిస్ట్యులా).. బృహద్ధమని, పుపుసధమని ఎక్కడైనా అతుక్కొని వాటి మధ్యలో దారి ఏర్పడటం (అయోర్టో పల్మనరీ విండో).. కవాటం సర్జరీ చేయించుకున్నవారిలో రక్తం లీక్‌ అవటం (ప్యారా వాల్యులార్‌ లీక్‌) వంటి సమస్యలకూ ఈ కొత్త పరికరం ఉపయోగపడుతుంది.

విదేశాల్లో ఇప్పటికే….. కోనార్‌ఎంఎఫ్‌ పరికరాన్ని ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌, థాయిలాండ్‌, వియత్నాం వంటి దేశాల్లో సుమారు 200 మంది పిల్లలకు అమర్చారు. ఇది ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సమర్థంగా పనిచేస్తున్నట్టూ తేలింది. జర్మనీ, ఇటలీలోనూ దీన్ని వినియోగిస్తున్నారు. మనదేశానికి సంబంధించి డీసీజీఐ త్వరలోనే దీనికి అనుమతి ఇచ్చే అవకాశముంది. అప్పుడు విస్తృతంగా అవసరమైన వారందరికీ అందుబాటులోకి రానుంది

చిన్న పిల్లల్లో అలర్జీ

ఒకటే దురద. గోకితే దద్దు. తుమ్ము మీద తుమ్ము. ఉక్కిరి బిక్కిరి చేసే ఆయాసం. ఇలా అలర్జీలు తెచ్చిపెట్టే బాధలు అన్నీ ఇన్నీ కావు ప్రస్తుతం మనిషిని పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యల్లో అలర్జీలదే ప్రథమస్థానం! ఆధునికతతో పాటు ఇవీ పెరుగుతూ వస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సుమారు 50% మంది ఏదో ఒక అలర్జీతో బాధపడుతున్నారని అంచనా. మనదేశంలోనూ 20-30% మంది జీవితంలో ఎప్పుడో అప్పుడు ఏదో ఒక అలర్జీ బారినపడ్డవారే. ఒకరకంగా దీన్ని మన జీవనశైలితో ముడిపడిన సమస్యగానే చెప్పుకోవచ్చు. నగరాల్లో, పట్టణాల్లో అలర్జీలు ఎక్కువగా కనబడుతుండటమే దీనికి నిదర్శనం.

మన వాతావరణం మారిపోయింది, తిండి మారిపోయింది. ఎయిర్‌ కండిషన్‌ గదులు, తివాచీలు, సోఫాలు.. ఇలా మన జీవన విధానమే మారిపోయింది. వాతావరణ కాలుష్యమూ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. ఇలాంటివన్నీ అలర్జీలు విజృంభించటానికి అవకాశం కలిగిస్తున్నాయి. చాలామంది అలర్జీని పెద్దవాళ్ల సమస్యగానే భావిస్తుంటారు. కానీ ఇది పిల్లల్లోనూ ఎక్కువే.

ఏమిటీ అలర్జీ?
స్థూలంగా చెప్పాలంటే- రోగనిరోధకవ్యవస్థ మనకు హానిచేయని వాటికీ అతిగా స్పందించటమే అలర్జీ. సాధారణంగా పొగ, దుమ్ముధూళి వంటివి మనకేమీ హానిచేయవు. ఇవి ఒంట్లోకి ప్రవేశించినా రోగనిరోధకశక్తి వీటిని పెద్దగా పట్టించుకోదు (ఇమ్యూన్‌ టాలరెన్స్‌). అయితే జన్యుపరంగా అతిగా స్పందించే గుణం గలవారిలో రోగనిరోధక వ్యవస్థ వీటితో అనవసర ‘యుద్ధం’ పెట్టుకుంటుంది! శరీరానికి హాని చేసే సూక్ష్మక్రిముల వంటివిగా భావించి ‘నువ్వు రావొద్దు కదా. ఎందుకొచ్చినవు’ అని కొట్లాటకు దిగుతుంది. ఇమ్యునోగ్లోబులిన్‌-ఇ అనే యాంటీబాడీలను, ఈస్నోఫిల్స్‌ వంటి రసాయనాలను పెద్దఎత్తున విడుదల చేసి దాడికి పురమాయిస్తుంది. దీంతో ఆయా భాగాల్లో వాపు ప్రక్రియ మొదలవుతుంది. రక్తనాళాలు విప్పారి, వాటిలోంచి ద్రవం లీకవుతుంది. సున్నితమైన కండరాలు సంకోచిస్తాయి. నాడులు చికాకుకు గురవుతాయి. ఫలితంగా దురద, దద్దు, ఆయాసం వంటి లక్షణాలు బయలుదేరతాయి. ఇదే అలర్జీ. మున్ముందు ఎప్పుడైనా అదే అలర్జీ కారకం వచ్చినా రోగనిరోధకవ్యవస్థ ఇలాగే స్పందిస్తుంది. దీంతో మళ్లీ మళ్లీ అలర్జీ వేధిస్తూనే ఉంటుంది.

ఎందుకు పెరుగుతున్నాయి?
ప్రకృతి నుంచి దూరంగా పోతున్నకొద్దీ అలర్జీలూ ఎక్కువవుతున్నాయి. హాయిగా, సుఖంగా జీవించటానికి సౌకర్యాలు పెంచుకుంటూ పోతున్నాం గానీ అదేస్థాయిలో అలర్జీలు కూడా పెరిగిపోతున్నాయి. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తున్నాయి.

ఆహార అలవాట్లు:
ఎలాంటి తిండి తింటే అలాంటి మనిషి తయారవుతాడు. ప్రస్తుతం పిల్లలకు తల్లిపాలు పట్టటం, ఇంట్లో వండి పెట్టటం తగ్గిపోయింది. డబ్బా తిండ్లు, ప్యాక్డ్‌ ఫుడ్స్‌, బయటి తిళ్లు ఎక్కువయ్యాయి. వీటిల్లో ఎక్కువకాలం నిల్వ ఉండటానికి, రంగు, రుచి కోసం రకరకాల పదార్థాలు కలుపుతారు. ఇవి కొందరిలో అలర్జీలకు కారణమవుతున్నాయి. 

పిల్లల్లో ఆస్తమా

1, 2, 3, 4, 5, 6…. ఒకటి, రెండు, మూడు… చదువుతుంటే… ఇదేమిటి….? పిల్లల్లా ఒంట్లు లెక్కపెట్టడం ఏమి అనిపిస్తోందా? అదేం కాదు.. ఈ అంకెలు వేరే! వరుసగా ఆరు కూడా లెక్కపెట్టడానికి కూడా ఊపిరి సరిపోనట్లుగా ఆయాసం వస్తుంటే అది ఆస్తమా కావచ్చు. ఆ వ్యాధిలో ఊపిరి అందకపోవడంతోపాటు ఒక్కోసారి పిల్లికూతలతో, ఛాతీ అంతా పట్టేసినట్లుగానూ ఉండవచ్చు. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే కుటుంబానికంతటికీ క్షోభ. కానీ.. కేవలం ఆరంకెలు లెక్కపెట్టేలోపు చదవగలిగే ఆరు స్టెప్పులతో దీన్ని నియంత్రించవచ్చు.

పిల్లల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని అంచనా వేయడం ఒకింత కష్టమైన పని. ముఖ్యంగా ఆరేళ్ళలోపు వయసు ఉన్న వారిలో ఇది మరీ కష్టం. కాబట్టి లక్షణాలన్నీ ఆస్తమానే కనిపించినా డాక్టర్లు దాన్ని ఆస్తమా అని నిర్ధారణ చేయకపోవచ్చు.

ఆ తర్వాత కనిపించే లక్షణాల తీరుతెన్నులను బట్టి చిన్నారికి ఆస్తమా ఉందా అనే విషయం నిర్ధారణ చేయాలి. కాబట్టి, పిల్లికూతలు, ఆయాసం ఉన్న పిల్లల దీర్ఘకాలిక రికార్డును పరిగణనలోకి తీసుకుని దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ చిన్నారికి రెండేళ్ళలోపు ఉంటే దాన్ని ఆస్తమా అని చెప్పడం మరింత కష్టం. ఎందుకంటే ఆస్తమాలోని లక్షణాలన్నీ బ్రాంకియోలైటిస్‌, వీజీ బ్రాంకైటిస్‌ వంటి వ్యాధులు ఉండవచ్చు. ఒకవేళ అది ఆస్తమా కూడా అయి ఉండవచ్చు. అందుకే ఊపిరి తీసుకోవడంలో కష్టం. పిల్లికూతలు వంటి లక్షణాలు ఉంటే తదనుగుణ చికిత్స తీసుకుంటూనే దాన్ని సమయానుకూలంగా రికార్డు చేస్తూ, దీర్ఘకాలికంగా గమనిస్తూ ఉండడం అవసరం.

పిల్లల్లో కనిపించే పిల్లికూతలు ప్రతిసారీ ఆస్తమా కాదు….
పిల్లల్లో ఊపిరి తీసుకుంటున్నప్పుడు పిల్లికూతల శబ్దం వినిపిస్తే కొందరు తల్లిదండ్రులకు ఆందోళనగా ఉంటుంది. ఇలా పిల్లికూతలు వినిపించే పిల్లలను మూడుగ్రూపులుగా విభజించవచ్చు.
గ్రూప్‌ – 1 : ఊపిరితిత్తుల సామర్థ్యం ఒకింత తక్కువగా ఉన్న పిల్లలు… ఇలాంటి పిల్లల్లో పిల్లికూతలు వినిపించినా కాలక్రమేణా వాళ్ళు తమ సమస్యను అధిగమించి ఆస్తమా లేని పిల్లలుగానే ఉంటారు.
గ్రూప్‌ – 2 : ఇమ్యూన్‌ వ్యవస్థతో ఎలాంటి సంబంధం లేకుండా (నాన్‌ ఎటోపిక్‌గా) వైరస్‌ కారణంగా వచ్చే ఆస్తమా. ఈ పిల్లలకూడా పై గ్రూప్‌ పిల్లలకంటే కొద్దిగా ఎక్కువ కాలం బాధలు అనుభవించినా, ఆ తర్వాత సమస్యనుంచి బయటపడతారు.
గ్రూప్‌ – 3 : ఇలాంటి పిల్లల్లో ఆస్తమా లక్షణాలు బాల్యావస్థ దాటిన తర్వాత కూడా కనిపిస్తుంటాయి. కుటుంబచరిత్రలో ఆస్తమా ఉంటుంది. అలర్జీలు కూడా కనిపిస్తుంటాయి. వీళ్ళకు ఆస్తమా ఉందని చెప్పవచ్చు.

ఆస్తమాకు కారణం :
ఆస్తమా రావడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. జన్యుపరమైన, పర్యావరణ సంబంధమైన అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. కొద్దిమేర వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ల పాత్రకూడా ఉండవచ్చు.

ఎందుకు… ఎలా వస్తుంది?
మనకు పడని పదార్థం మనలోకి ప్రవేశించినపుడు లేదా ఏదైనా కాలుష్య పదార్థం ఊపిరితిత్తులకు దారితీసే గాలిమార్గంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి కండరాలు బిగిసిపోతాయి. శ్వాసమార్గం మూసుకుపోయినట్లుగా అవుతుంది. ఆ మార్గంలో జిగురు పదార్థం (మ్యూకస్‌ లేదా ఫ్లమ్‌) ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా గాలిగొట్టాల మార్గం మరింత సన్నబడుతుంది. దీనివల్ల కూడా ఊపిరి అందదు. ఫలితంగా ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి. మనకు పడనిదేదైనా మనలోకి ప్రవేశించినప్పుడు ఇదే అనుభవం పునరావృతమవుతుంది. ఇలా పడని పదార్ధాల్ని ‘ట్రిగర్‌’ అంటారు. వేర్వేరు వ్యక్తులకు ట్రిగర్స్‌ వేర్వేరుగా ఉంటాయి..

మారిన వాతావరణం, కాలుష్యం, పొగతో పాటు ఇళ్ళలోని దుమ్ము, కార్ప్‌ట్ లోని ధూళి, సరిపడని ఆహారపదార్ధాలు కొన్ని ఘాటైన రసాయనాల వాసనలు, సాఫ్ట్ టాయ్స్‌, పెట్స్ కు ఉండే వెంట్రుకల్లో దాగి ఉండే అలర్జెన్స్‌, పోలెన్స్‌, ఎక్సర్‌సైజ్‌, ఆహారానికి కలిపే రంగులు (ఫుడ్‌ అడెటివ్స్‌ – పిల్లలను మరింత ఆకర్షించేందుకు చాలా పదార్ధాలకు ఇవి కలుపుతారు) కొన్ని రకాల మందులు (యాస్పిరిన్‌, సల్ఫాడ్రగ్స్‌ వంటివి)ఇలా వేర్వేరు ట్రిగర్స్‌ వేర్వేరు వ్యక్తులకు వేర్వేరుగా ఉండవచ్చు. ట్రిగర్స్‌నుంచి పూర్తిగా దూరంగా ఉండడం సాధ్యం కాకపోవచ్చు. కానీ వీలైనంతగా వాటి నుంచి దూరంగా ఉండాలి.

ఆస్తమా నిర్ధారణ….
ఆస్తమా నిర్ధారణ అంతతేలిక కాదు. దీనికి క్లినికల్‌ పరీక్షలు, రోగి పూర్వచరిత్ర, ల్యాబ్‌ పరీక్షలతో నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. వ్యాధికి గురైనప్పుడు (ఎపిసోడ్‌లో మాత్రమే)ఊపిరి తీసుకోలేకపోవడం పిల్లికూతలు, దగ్గు రావడం, చికిత్స తీసుకుంటే తగ్గడం వంటివి జరుగుతున్నా, స్పైరోమిటి వంటి పరిక్షలు చేయించడం, నాలుగేళ్ళలోపు పిల్లలకైతే పిల్లికూతలు రోజంతా ఉండి ఆయాసంతో నిద్రపోలేక పోవడం, తల్లితండ్రులకు ఆస్తమా ఉండడం, ముక్కు కారుతూ ఉండడం (అలర్జిక్‌ రైనైటిస్‌) వంటి అంశాల ఆధారంగా నిర్ధారించవచ్చు. ఆ తర్వాత తీవ్రతను అంచనా వేయాలి. తీవ్రతను బట్టి ఆస్తమాను అప్పుడప్పుడూ వచ్చేది, స్వల్పమైనది, ఓ మోస్తరు, తీవ్రత ఎక్కువగా ఉండి ఎప్పుడూ ఉండేదిగా వర్గీకరించవచ్చు.

చికిత్స
ఒకసారి ఈ వర్గీకరణ జరిగాక అత్యంత కనిష్టస్థాయి చికిత్స మొదలుకొని ఆరు దశలలో చికిత్స చేయవచ్చు.
1వ దశలో : అప్పుడప్పుడూ అవసరాన్ని బట్టి రిలీవర్స్‌ ఇవ్వడం
2వ దశలో : పీల్చడానికి వీలైన తక్కువ మోతాదు కార్టికోస్టెరాయిడ్స్‌ (ఇన్‌హేల్డ్‌ కార్టికోస్టెరాయిడ్స్‌-ఐసిఎస్‌) లేదా మాంటెలుకాస్ట్‌ టాబ్లట్స్
3వ దశలో : ఓ మోస్తరు తీవ్రత ఉన్నవారికి ఓ మాదిరి మోతాదు (మాడరేట్)లో పీల్చదగిన యాక్టింగ్‌ బీ ఎగోనిస్ట్స్‌ (ఎల్‌బిఎ) ఇన్‌హేలర్స్‌
4వ దశలో : ఓ మోస్తరు తీవ్రత ఉన్నవారికి ఐసీఎస్‌తో పాటు మాంటెలుకాస్ట్‌ టాబ్లెట్స్ లేదా లాంగ్‌ యాక్టింగ్‌ బీ ఎగోనిస్ట్స్‌ (ఎల్‌బిఎ) ఇన్‌హేలర్స్‌
5వ దశలో : ఆస్తమా సమస్య తీవ్రంగా ఉన్నవారికి ఎక్కువ డోస్‌తో ఉండే ఐసీఎస్‌ మాంటెలుకాస్ట్‌ టాబ్లెట్స్ లేదా లాండ్‌ యాక్టింగ్‌ బీ ఎగోనిస్ట్స్‌ (ఎల్‌ఎబిఎ) ఇన్‌హేలర్స్‌
6వ దశలో : మరీ తీవ్రంగా ఉన్నవారికి హైడోస్‌ ఐసీఎస్‌తో పాటు మాంటెలుకాస్ట్‌ టాబ్టెట్స్ పాటు నోటి ద్వారా స్టెరాయిడ్స్‌ ఇవ్వడం.

పిల్లలకు ఆస్తమా తీవ్రమవుతున్నట్లు గుర్తించడం ఇలా….
ఉదయం వేళల్లో పిల్లలకు పిల్లికూతలు, దగ్గు ఎక్కువ అవుతుండడం.
వ్యాయామం తర్వాత పిల్లికూతలు, దగ్గు ఎక్కువగా రావడం.
రాత్రుళ్ళు నడిస్తే పిల్లికూతలు, దగ్గు పెరగడం.
ఏదైనా రిలీవర్‌ వాడాక ఈ లక్షణాలు తగ్గడం.
రిలీవర్‌ వాడుతున్నప్పుడు మునుపటి అంత మెరుగ్గా లేదా అంత త్వరగా రిలీఫ్‌ రాకపోవడం లక్షణాలు కనిపిస్తే పిల్లలకు ఆస్తమా తీవ్రత పెరుగుతున్నట్లుగా భావించి నిపుణులకు చూపించాలి.