ఇవి జామకాయల కంటే చిన్నసైజులో ఉండే… పర్పుల్, ఎరుపు రంగులో కనిపించే… తియ్యటి, పుల్లటి పండ్లు. నిండా పోషకాలు కూడా ఉంటాయి. ఇవి ఎక్కువగా వేడి ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. ప్రధానంగా వియత్నాం ప్రజలు ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు. ప్యాషన్ పండ్ల తోటల్లోకి వెళ్లామంటే… తియ్యటి వాసన వస్తుంది. అందువల్ల ఈ పండ్లపై పరిశోధనలు చేశారు. ఇవి ఎంతో మంచివని తేలింది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ (మన బాడీలో విష వ్యర్థాల్ని తొలగించే గుణాలు), విటమిన్ A, విటమిన్ C, ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ పండ్లను మందుల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకంటే ఇవి తింటే రిలాక్స్ ఫీల్ కలిగిస్తున్నాయి. ఒత్తిడి దూరం చేస్తున్నాయి. మంచిగా నిద్ర పట్టేలా చేయగలుగుతున్నాయి.
ఇవి కంటిచూపును మెరుగుపరుస్తున్నాయి. రేచీకటికి చెక్ పెడతాయి. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకానికి చెక్ పెడుతుంది. ఈ పండ్లలో ఐరన్ ఎక్కువ. అందువల్ల ఇవి మన రక్తంలో ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచుతాయి. వీటిలోని కాపర్, పొటాషియం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. పొటాషియం, సోడియం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. మన ఎముకలు బలంగా ఉండేందుకు కూడా ఈ పండ్లు సహకరిస్తాయి.
100 గ్రా. వెలగపండు గుజ్జు నుంచి 140 క్యాలరీలు వస్తాయి. అనేక వ్యాధుల నివారణలో ఔషధంగా పనిచేస్తోంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండు మంచి మందు. అల్సర్‌తో బాధపడే వారికి ఈ పండు వల్ల ఉపశమనం కలుగుతుంది. వెలగపండు గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధి అవుతుంది. రక్తహీనతను నివారించే గుణం వెలగపండులో ఉంది. ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటే, వెలగ పండు జ్యూస్ తాగిస్తే తగ్గుతాయి. అలసటగా, నీరసంగా ఉన్నప్పుడు వెలగపండు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది.
మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఈ పండ్లు తినడం మంచిది. మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి. వెలగపండు గుజ్జుకి తగినంత గోరువెచ్చని నీళ్లు, కొద్దిగా పంచదార కలిపి తీసుకుంటే రక్తంలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి. కాలేయం, కిడ్నీలపై అధిక పనిభారం పడకుండా ఉంటుంది ∙స్త్రీలు వెలగ పండు గుజ్జు క్రమం తప్పకుండా తినడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. వెలగపండు గుజ్జు తినడం వల్ల ప్రొటీన్లు సమపాళ్లలో అంది కండరాలు వేగంగా వృద్ధి చెందుతాయి ∙వెలగపండు గుజ్జుకి మధుమేహాన్ని అదుపులో ఉంచే శక్తి ఉంది. ∙వెలగ పండుకి 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది ∙నోటి పుండ్లనీ తగ్గిస్తుంది ∙పొట్టలో పేరుకున్న గ్యాస్‌నీ తొలగిస్తుంది. నరాలకూ ఉత్తేజాన్నీ, శక్తినీ ఇస్తుంది.
❂ మొక్క జొన్న గింజలు శరీరానికి బలం ఇస్తుంది. వీటిలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ E, B1, B6, ఫోలిక్ ఆసిడ్, రిబోఫ్లావిన్ నియాసిన్‌లు ఉంటాయి. ❂ మొక్కజొన్నలో ఫైబర్ (పీచు) పుష్కలంగా వుంటుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పుడుతుంది. ❂ మొక్క జొన్నలోని ఫైబర్ మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ❂ మొక్క జొన్న పేగు క్యాన్సర్‌ను అరికడుతుంది. ❂ మొక్కజొన్నలో బోలెడన్ని మినరల్స్ ఉంటాయి. ❂ మెుక్కజొన్నను రోజూ తినేవారిలో హెయిర్ ఫోలీ సెల్స్ బలంగా ఉంటాయి. ❂ మొక్క జొన్నలో ఉండే విటమిన్-C, యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ వల్ల జుట్టుకు కాంతివంతంగా ఉంటుంది. ❂ మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్‌లు ఉంటాయి. దీని వల్ల ఎముకలు గట్టిపడతాయి. ❂ మొక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.
❂ బాగా ఎండిన మొక్కజొన్న విత్తనాల నూనెను చర్మానికి రాసుకోవచ్చు. ❂ మొక్క జొన్న నూనెలో ఉండే లినోలె యాసిడ్ చర్మమంటలను తగ్గిస్తుంది. ❂ మొక్కజొన్నలో ఉండే విటమిన్ C, కేరోటియాయిడ్లు, మయో ప్లేవినాయిడ్లు.. చెడు కొలెస్టరాల్ నుంచి గుండెను కాపాడుతాయి.
❂ మొక్క జొన్న శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది. ❂ మొక్కజొన్న మధుమేహంతో బాధపడే వారికి మేలు చేస్తుంది. కాబట్టి ఎలాంటి అభ్యంతరం లేకుండా దీన్ని తినొచ్చు. ❂ మొక్కొజొన్నను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడం శరీరానికి మంచిది. ❂ పసుపు రంగులో ఉండే మొక్కజొన్న గింజలలో మినరల్స్ అధికంగా ఉంటాయి. ❂ మొక్కజొన్న కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ❂ మెుక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉండటం వలన అది రక్తహీనతను తగ్గిస్తుంది.
తర్పూజా తొడిమ భాగంలో కొద్దిగా నొక్కితే అది మొత్తగా ఉంటే తర్బూజా బాగా పండినట్లు. లేదంటే వాసన చూడండి, తీపివాసన వస్తుంది. వాసన పెరిగే కొద్ది బాగా పండినట్లు.
పుచ్చకాయ పుచ్చకాయ పైభాగాన తట్టితే డొల్ల శబ్దం రావాలి. గట్టి శబ్దం రాకూడదు. నిమ్మ, కమాలా, యాపిల్ వంటి వాసన తాజాగా ఉండాలి.ఎలాంటి మచ్చలు, గీతలు ఉండరాదు. యాపిల్స్ చర్మం చాలా మృదువుగా, మచ్చలు లేకుండా ఉండాలి.
ద్రాక్షా : ద్రాక్షా కవర్లలో ఉన్నవి కొనేటపుడు కవర్ అడుగుభాగాన చూస్తే రాలినవి ఎక్కువగా ఉండకూడదు. కుళ్ళిన దశలో ఎక్కువగా రాలిపోతాయి. ద్రాక్షాలకు ఎక్కువగా పురుగు మందులు వాడతారు కనుక కొన్న తరువాత నేరుగా తినకూడదు. ఉప్పునీటిలో ఓ ఐదు నిమిషాలు ఉంచి ధారగా నీరు పడుతున్న పంపు కింద శుభ్రపరిస్తే చాలావరకు మందులు తొలగిపోతాయి.
✺ అనాస పండును తింటే మూత్ర పిండాల్లో రాళ్లు కరుగుతాయని ఆహార నిపుణులు తెలుపుతున్నారు. ✺ అనాస పండులో విటమిన్ సి అధికంగా ఉంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ✺ సంతాన సమస్యలతో బాధపడేవారు అనాస తినడం ఎంతో మంచిది. ✺ అనాసలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం ఉంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది. ✺ కడుపు నిండా భోజనం చేసిన తర్వాత చిన్న అనాస ముక్కను తింటే త్వరగా జీర్ణమైపోతుంది. ✺ అనాస పండును ముక్కలుగా చేసి, తేనెతో కలిపి తింటే శరీరానికి శక్తి మాత్రమే కాదు.. మేని ఛాయ కూడా నిగారింపు కూడా వస్తుంది. ✺ అందాన్ని పెంచుకోవాలంటే అనాస తినండి. ఇది శరీరంపై ఉండే మృతకణాలను నివారించి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ✺ రోజూ పైనాపిల్ జ్యూస్ తాగినా, తిన్నా ఉల్లాసంగా ఉంటారు. ✺ అనాసలోని పొటాషియం రక్త ప్రవాహం సాఫీగా సాగేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా రక్తపోటు అదుపులో ఉంటుంది.
✺ ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఒక గ్లాసు అనాస జ్యూస్ తాగండి. ✺ అనాస రసాన్ని ఒక ఔన్సు మోతాదులో రోజుకి నాలుగుసార్లు తీసుకున్నట్లయితే నడుము నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అ ✺ గొంతు నొప్పి, నోటిలో పుండ్లు ఉన్నట్లయితే.. అనాసరసాన్ని నోటిలో కాసేపు ఉంచుకుని మింగేయండి. తప్పకుండా అవి తొలగిపోతాయి. ✺ అనాసపండు రసం పచ్చకామెర్లకు మంచి ఔషధం. ✺ అనాస కాలేయానికి, మూత్రపిండాల సమస్యలను నయం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ✺ అనాస కాలేయానికి మేలు చేస్తుంది. ✺ అనాసలోని కాపర్ శరీరంలో ఉన్న ఎర్ర రక్తకణాలను వృద్ధి చేయడానికి సహాయపడుతుంది. ✺ అనాసపండులోని మాంగనీస్ ఎముకలు, దంతాలు, కండరాలు, జుట్టు సమస్యలను నివారిస్తుంది. ❂ గర్భణీలు, మధుమేహం, గుండె సమస్యలతో బాధపడేవారు అనాస పండును తీసుకోకూడదని గమనించగలరు.
ఆరెంజ్ ఆనందం, శ్రేయస్సు, ఉల్లాసం మరియు సాదారణ భావనలను ప్రోత్సహించి శరీరాన్ని మానసికంగా బలపరుస్తుంది.ఆరెంజ్ ని ప్రతి రోజు తింటే శక్తిని పెంచటంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.అందువల్ల అథ్లెట్లు సులభంగా శక్తి రావటానికి ఆరెంజ్ లను తింటారు.
1.క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది
సిట్రస్ జాతి పండు అయిన ఆరెంజ్ లో లిమోనాయిడ్స్ సమృద్దిగా ఉండుట వలన చర్మ, ఊపిరితిత్తుల, రొమ్ము, కడుపు మరియు ప్రేగు క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్ రకాల మీద పోరాటానికి సహాయపడుతుంది.
2.కిడ్నీ వ్యాధులను నిరోధిస్తుంది
ఆరెంజ్ జ్యూస్ ని ప్రతి రోజు క్రమం తప్పకుండా త్రాగితే మూత్రపిండాల వ్యాధులను నిరోధిస్తుంది.అలాగే మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
గమనిక: జ్యూస్ లను తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.పండ్ల రసాలలో ఉండే అధిక చక్కెర కంటెంట్ దంత క్షయానికి కారణమవుతుంది.
అంతేకాక అధిక ఆమ్ల శాతం ఎనామెల్ కి నష్టాన్ని కలిగిస్తుంది.
3.లివర్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
జపాన్ లో జరిగిన రెండు అధ్యయనాలలో మాండరిన్ అరెంజ్ తినడం వలన కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని తెలిసింది.ఆరెంజ్ లో ఉండే కెరోటినాయిడ్ అని పిలిచే విటమిన్ A కాంపౌండ్స్ క్యాన్సర్ రాకుండా కాపాడతాయి.
వేసవి కాలం లో భారతీయ ఉపఖండం లో విస్తారం గా దొరికే పండ్ల లో జామున్ లేదా నేరెడు పoడు ఒకటి. భారత దేశం లో నేరేడు పండు ముదురు ఊదా రంగు లో మే నుంచి ఆగష్టు వరకు విస్తారంగా దొరుకు తుంది. ఒక గిన్నె నేరేడు పండ్ల పై ఉప్పు చిలకరించి ఒక రుచికరమైన వేసవి అల్పాహారం గా తింటారు. నేరేడు లో అనేక పోషక విలువలు ఉన్నాయి. నేరేడు పండు ఆరోగ్య ప్రయోజనాలు క్రింది విధంగా వివరించ వచ్చు.
1. మధుమేహం కు మంచిది
జామున్ లేదా నేరేడు శరీరంలోని రక్తo లో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది తక్కువ శక్తి మరియు తరచుగా దాహం మరియు మూత్రవిసర్జన వంటి మధుమేహ లక్షణాలను నివారిoచును. సుక్రోజ్ లేక పోవడం మరియు జంబోలిన్(jambolin) కలిగి శరీరం లోపల పిండి పదార్ధాలను చక్కెరగా మార్చడంను అడ్డుకుంటుంది నేరేడు తేనెను మధుమేహం కోసం ఒక తీపి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
2. శరీరం ను చల్లబరుచును.
నేరేడు పండు లో నీటి శాతo దాని మొత్తం బరువులో 84%కంటే ఎక్కువఉంది. ఫాస్పరస్ మరియు అయోడిన్ వంటి ఖనిజాలు కలిసి , అది చమట, వేడి పరిష్కారంలో సహాయ పడును.1 కప్ నీరుమరియు 1 కప్ ఐస్ తో 2 కప్పుల నేరేడు కాయల (విత్తనాలు లేకుండా) మిశ్రమంను ఉప్పు, మిరియాలు, తేనె మరియు పుదీనా తో కలిపి తీసుకొన్న అది వేసవి లో ఒక చల్లని పానీయం అగును.
3. వ్యాధినిరోధక శక్తి పెంచును
విటమిన్లు B1, B2, B3 మరియు B6 పాటు, నలుపు నేరేడు పండులో విటమిన్ సి, అంటి-ఆక్సిడెంట్ లను కలిగి అది శరీరం యొక్క రోగనిరోధక శక్తి పెంచును. అంటి-బ్యాక్తిరియాల్ లక్షణాలు కలిగి బహిర్గత మరియు అంతర్గత ఇన్ఫెక్షన్నినివారించును. నీరు కలిపిన నేరేడు పొడి(powder) చర్మం మరియు చిగుళ్ళ వ్యాధుల కోసం ఒక సహజ నివారణ మార్గంగా చెప్పవచ్చు.
4. ఎముకలను పటిష్టపరుచును.
నేరేడు లో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాల ఉనికిని ఎముకలు మరియు దంతములు బలపడటానికి తోడ్పడును.ఒక గాజు గ్లాస్ పాలలో ఒక టీ-స్పూన్ నేరేడు పొడి కలిపి తీసుకొన్న అది మీ ఎముకలు బలోపేతం అవడానికి తోడ్పడును.
5. క్యాన్సర్ ను అరికడుతుంది
నేరేడు లో ఉండే పోల్యఫేనోల్స్ లో (polyphenols) క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు ఉన్నాయని అధ్యయనాలు నిరూపించాయి. నేరేడు కాయలను రోజు తీసుకొన్న ఇది మానవులలో కాన్సర్ వ్యాధి రాకుండా నిరోధించును.
.6. రక్తం శుద్ధి
నేరేడు లో ఉండే ఇనుము మరియు విటమిన్ సి రక్తమును శుభ్రపర్చడానికి సహాయపడుతుంది మరియు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచుతుంది.
నేరేడు కొన్ని రకాల అస్త్రిజెంట్స్ ని కలిగి అవి బ్లాక్-హెడ్స్ ను మొటిమలను మరియు అచ్నే(ACNE)లను నివారించును మరియు రక్తమును శుద్ది పరిచి చర్మమును కాంతివంతంగా ఉంచును.
8. హృదయంను బలపరుస్తుంది.
నేరేడు లో పొటాషియం మరియు ఫాస్పరస్ వంటి అత్యవసర ఖనిజాలు ఉంటాయి అవి అదిక రక్త పోటు వంటి కార్డియో వాస్కులర్ పరిస్థితులను నిరోధించడానికి ఉపయోగపడతాయి.
9 . జీర్ణ క్రియ లో సహాయ పడును.
నేరుడు లో జీర్ణక్రియను ప్రోత్సహించే పీచు పదార్థం ఉందును. ఇది కాలేయo మరియు ప్లీహము తద్వారా డైజెస్టివ్ ట్రాక్ట్ ను సరిగా ఉంచడం లో ప్రేరేపిస్తుంది
గుర్తుంచుకోవలసిన విషయాలు
Øనేరేడుపండు తినడం లో మితం పాటించండి. రెండు రోజులకు ఒక సారి ఈ రుచికరమైన పండ్లు 100 గ్రాములు తీసుకోండి.
Øతినడానికి ముందు ఉప్పు నీటితో కడగడం మర్చిపోవద్దు.
Øఖాళీ కడుపుతో నేరేడు పండు ను తినవద్దు.
Øనేరేడు పండు తిన్న తరువాత 2 గంటల ముందు లేదా వెనుక పాలు త్రాగవద్దు.
Øగర్భవతి మరియు పాలుఇచ్చే తల్లులు నేరేడుపండ్లు తిన రాదు.
Øమధుమేహం ఉన్నవారు తక్కువ పరిమాణం లో నేరేడు పండ్లు తినవలయును.
నేరేడు పండుగా గాక అదనంగా నేరేడు తేనె, నేరేడు వెనిగర్ మరియు నేరేడు ఆకుల సారం కూడా పండు వలె సమాన లాభాలను కలిగి ఉందని చెప్పవచ్చు.
కాబట్టిఈ వేసవిలో నేరేడుపండు రుచులను ఆస్వాదించండి మరియు ఈ రుచికరమైన పండు అందించే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఫలితాలు పొంది ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీ గా జీవించండి.
మనదేశంలోకిబొప్పాయి(Papaya) 400 ఏళ్లక్రితమేప్రవేశించింది.మెక్సికోప్రాంతానికిచెందినబొప్పాయినిమన దేశం లో ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్తదితరరాష్ట్రాల్లోవిరివిగాపండిస్తున్నారు. బొప్పాయిని పరందపుకాయ, పరమాత్మునికాయ, మదన ఆనపకాయఅనికూడాబొప్పాయినిపిలుస్తుంటారు.
వైద్య పరమైన ఉపయోగములు.
బొప్పాయిపండులోవిటమిన్“ఏ”, విటమిన్ “బీ”, విటమిన్ “సీ”, విటమిన్ “డీ”లుతగుమోతాదులోనున్నాయి. తరచూబొప్పాయిపండునుఆహారంగాతీసుకుంటుంటేశరీరానికికావలసినవిటమిన్లుపుష్కలంగాలభిస్తాయి.ఇందులోపెప్సిన్అనేపదార్థంఉండటంవలనజీర్ణక్రియసాఫీగాజరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయిపండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.
· డయాబెటిస్ కారణంగా వచ్చే హృద్రోగాల్ని పచ్చి బొప్పాయి తగ్గిస్తుంది.
· బొప్పాయి లోని పపైన్ను ట్యాబ్లెట్గా రూపొందించి జీర్ణసంబంధ సమస్యలకు మందుగా వాడుతున్నారు.
· ఈపపైన్ గాయాల్ని మాన్పుతుంది. ఎలర్జీల్ని తగ్గిస్తుంది. అందుకే గాయాల మీదా పుండ్ల పైనా బొప్పాయి పండు గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి.
· పులియబెట్టిన బొప్పాయి నుంచి పపైన్ ఆయింట్మెంట్ తయారుచేస్తారు.
· నొప్పి నివారిణి గానూ (పెయిన్‌కిల్లర్) పపైన్ గొప్పదే. అందుకే నరాల మీద ఒత్తిడిని తగ్గించేందుకూ వెన్నుపూసలు జారినప్పుడూ దీన్ని ఇంజెక్ట్ చేస్తారు.
· బొప్పాయి హెమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది.
ఇతర విశేషాలు
· ఆసియా దేశాల్లోని కొన్ని ప్రాంతాలలో బొప్పాయిపండులోని గింజల్ని ఎండబెట్టి మిరియాలకు బదులుగా వాడతారు
· బొప్పాయి ఆకుల్ని ఉడికించి పాలకూరలా తింటుంటారు
· శ్రీలంక, భారత్, పాకిస్థాన్… వంటి దేశాల్లో గర్భనిరోధానికీ, గర్భస్రావానికీ బొప్పాయిని వాడతారు
· బొప్పాయి పండులో అన్నిరకాల విటమిన్లు, కంటి ఆరోగ్యానికి అవసరమైన బీటాకెరోటిన్ ఇందులో ఉంటాయి. విటమిన్ సి, రెబోఫ్లేవిన్ సమృద్ధిగా ఉంటాయి. చక్కెర, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఈ పండు పైత్యాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని తొలగిస్తుంది
· హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి కాయను కూరగా వండి తీసుకుంటే బాలింతలకు మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. బొప్పాయి పాలు, బెల్లంతో కలిపి తినిపిస్తే చిన్నారుల కడుపులో ఉండే నులి పురుగులు నశిస్తాయి. బొప్పాయి ఆకులు మెత్తగా దంచి, పసుపుతో కలిపి పట్టు వేస్తే బోదకాలు తగ్గుతుంది.
· ప్పాయి రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. చిగుళ్లవాపును, రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ పండులో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది.
· బొప్పాయి మలబద్ధకాన్ని పోగొడుతుంది.ఆహారాన్ని వెంటనేఅరిగేలా చేస్తుంది. టీబీని నివారిస్తుంది.రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తంలోని దోషాలను నివారిస్తుంది.రక్త ప్రసరణ పెరగడానికి దోహదపడుతుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. కడుపులోని యాసిడ్స్‌ను కంట్రోల్ చేస్తుంది.
· జీర్ణక్రీయ వేగవంతం…
బొప్పాయికాయలో పపేయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మాంసాహారం త్వరగా అరగడానికి దోహదం చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
· బ్రేక్ ఫాస్ట్ గా బొప్పాయి…
బొప్పాయి పండును ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే చాలా మంచిది. బొప్పాయిపండు ముక్కలకు తేనె చేర్చి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయి ముక్కలను పాలతో ఉదయం పూట తీసుకుంటే కాలేయసంబంధ జబ్బులు నయం చేస్తుంది.నీళ్ల విరేచనాలకు: నీళ్ల విరేచనాలకు బొప్పాయి పండు బాగా పనిచేస్తుంది. కడుపు నొప్పితో నీళ్ల విరేచనాలు మొదలైతే బొప్పాయితో నయం చేయవచ్చు. పైల్స్ నివారణకు పచ్చి బొప్పాయికాయ కూర బాగా ఉపయోగపడుతుంది.
బీపీ తగ్గిస్తుంది
రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం పరగడుపున బొప్పాయి తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. అంతేగాకుండా కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బొప్పాయి వేరును అరగదీసి నీటిలో కలిపి దాహం అనిపించినప్పుడల్లా తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు మాయమవుతాయి. బాలింతలకు : బొప్పాయి ముక్కలను పాలతో కలిపి బ్రేక్ఫాస్టుగా తీసుకుంటే బాలింతలకు స్తన్యం ఎక్కువగా వస్తుంది.· ఔషధంగా…
అజీర్ణం, ఆకలి మందగించడం, వికారం వంటి లక్షణాలు ఉన్నప్పుడు, గుండెల్లో మంట, కడుపులో నొప్పి, ఆహారం సహించకపోవడం, నీళ్ల విరేచనాలను వెంటనే అరికడుతుంది. వేళకు భోజనం చేయకపోవడం, అతిగా భుజించడం, ఆల్కహాల్ వంటివి ఎక్కువగా తాగటం, మానసిక ఒత్తిడి, మితిమీరిన టెన్షన్ వంటివి జీర్ణకోశాన్ని నష్టపరుస్తాయి. ఇలాంటి సమయంలో బొప్పాయి పండు అమోఘంగా పనిచేస్తుంది. · బొప్పాయి కాయలను కూరగా వండుకుని రెండు వారాలు తింటే జీర్ణకోశ వ్యాధులు నయమవుతాయి. బొప్పాయిలో ఫాస్పరస్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీనిద్వారా మనిషి ఎదుగుదలకు, కళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.· ఆకలి లేకపోవటం, బలహీనత వంటి వాటికి బొప్పాయి అరచెక్కను తింటే ఆకలి పెరగడమే కాకుండా బలహీనత తగ్గుతుంది. ఒక స్పూను బొప్పాయి పాలను తీసుకున్నా ఆకలి పుడుతుంది.
· సౌందర్య సాధనంగా
బొప్పాయిపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, నునుపుగా చేస్తుంది.
డెంగీ జ్వరం వచ్చిన వారి శరీరంలో ప్లేట్లెట్లను పెంచేందుకు బొప్పాయి పండు, ఆకులు ఉపయోగపడతాయని అందరికీ తెలిసిందే.
· బొప్పాయి పండులో కొలెస్ట్రాల్ అంటే కొవ్వు లేదు, క్యాలరీలూ తక్కువే.అందుకే స్థూలకాయులు సైతం హాయిగా బొప్పాయిని తినొచ్చు.
కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్ తోడ్పడుతుంది. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. విటమిన్ బి నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది.
· కెరోటిన్, ఎ, బి, సి, ఇ విటమిన్లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్లు, ఫొలేట్లు, పాంతోనిక్ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీని వలన కొన్ని రకాల జబ్బులను కూడ తగ్గించవచ్చు.పచ్చికాయ అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది.
· బొప్పాయి మంచి సౌందర్యసాధనం కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని తెల్లని గుజ్జుని ముఖానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. మొటిమలూ తగ్గుతాయి. బొప్పాయి ఫేస్‌ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది.
ఆపిల్ మనల్నిఆరోగ్యంగాఉంచుతుంది. . రోజుకుఒకఆపిల్వైద్యుడినిదూరంగాఉంచుతుందిఅనేది పురాతన వెల్ష్సామెత. ఆపిల్వాస్తవానికిఆరోగ్యప్రధాయని. .
స్వీడన్లోనిఉమియావిశ్వవిద్యాలయంలోఇటీవలనిర్వహించినఒకఅధ్యయనంప్రకారం, ఆపిల్యొక్కయాంటీబాక్టీరియల్లక్షణాలుదానిలోనిఅధికవిటమిన్సికంటెంట్తో కలసి న్యుమోనియా, ఊపిరితిత్తులవ్యాధులకు వ్యతిరేకంగారోగనిరోధకశక్తినిపెంపొందించడానికిసహాయపడుతుంది. ఆపిల్ప్రపంచంలోఅత్యధికంగాపండించే మరియువినియోగించేపండ్లలోఒకటి. దీనిలో యాంటీఆక్సిడెంట్లుమరియుడైటరీఫైబర్,పోషకాలుసమృద్ధిగాకలవు.
ఆపిల్తినడంవల్లపెద్దదుష్ప్రభావాలులేవు. ఏదేమైనా, కొన్నిఇటీవలిఅధ్యయనాలుఆపిల్లోఆమ్లస్థాయికాలక్రమేణాపెరిగిందనిమరియుఆపిల్విత్తనాలలోసైనైడ్అనేవిషంఉందనిసూచిస్తున్నాయి. కానీఇవిఅన్ని తప్పుసాగుఫలితాలే. ఆపిల్ మీఆరోగ్యాన్నిసుసంపన్నంచేస్తుంది మరియుమీశ్రేయస్సునుపెంచుతుంది. . ఆపిల్యొక్కకొన్నిప్రధానఆరోగ్యప్రయోజనాలుఇక్కడఉన్నాయి.
ఆపిల్ లోనియాంటీఆక్సిడెంట్లుమీఊపిరితిత్తులనుబాహ్యవాతావరణంవల్లకలిగేనష్టంనుండిరక్షిస్తాయి.అలెర్జీ సీజన్ లో మీఊపిరితిత్తులకణజాలంఎర్రబడినప్పుడు, ఆపిల్చర్మంలోఉన్నఫ్లేవనాయిడ్క్వెర్సెటిన్మీరోగనిరోధకశక్తినిబలపరుస్తుందిమరియువాపును తగ్గిస్తుంది.
ఆపిల్ యొక్క మొత్తం పోషక కూర్పు శరీరానికి అవసరమైన అన్ని వస్తువులను కలిగి ఉంటుంది. సుమారు 200 గ్రాముల మధ్యస్థ పరిమాణంలో ఉండే ఆపిల్‌లో 95 కేలరీలు ఉన్నాయి, ఇందులో పిండి పదార్థాలు, ఫైబర్, పొటాషియం, విటమిన్ సి మరియు విటమిన్ కె ఉన్నాయి. ఈ పోషకాలు మరియు సూక్ష్మపోషకాలు కాకుండా ఆపిల్‌లో మెగ్నీషియం, రాగి మరియు ఇనుము కూడా ఉన్నాయి. ఆపిల్ యొక్క చర్మం కూడా ఫైబర్ యొక్క మంచి మూలం. కాబట్టి, దీనిని పై తొక్కతో తినడం మంచిది.
యాపిల్ విత్తనాల్లో సైనైడ్
యాపిల్ గింజల్లో అమిగ్డలిన్ అని ఒక రసాయనం ఉంటుంది. అది మన శరీరంలో జీవక్రియ వల్ల విరగ్గొట్టబడి, అత్యంత విషపూరితమైన హైడ్రోజన్ సైనైడ్గా మారుతుంది. ఆ హైడ్రోజన్ సైనైడ్ అధిక మోతాదులో శరీరంలో చేరితే కొద్ది నిమిషాల్లోనే మనిషిని చంపగలదు.
నమలకుండా మింగిన గింజలోనుంచి అమిగ్డలిన్ విడుదలవ్వదు. తినేడప్పుడు పోరబాటున ఒకటి రెండు గింజలు నమిలినా సమస్య ఏమీ ఉండదు. యాపిల్ రకాన్ని బట్టి కొన్ని వందల నుంచి వేల గింజలు పనికట్టుకుని నమిలి మింగితే తప్ప మనకి విషప్రభావం కనిపించదు.
అరటిపండ్ల ఆరోగ్య ప్రయోజనాలు తరతరాలుగా మానవాళి కి తెలుసు.
అరటిపండ్లన్నింటిలో “ఆరోగ్యం”పుష్కలంగా లబించును. దానిలోని పోషకాల సమృద్ధిని పరిగణనలోకి తిసుకోనిన దానిని ఆరోగ్యదాయనిగా భావించవచ్చు, అరటిపండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో సహజ చక్కెరలు, సుక్రోజ్ మరియు ఫ్రక్టోజ్ సమృద్ధిగా లబించును.
.అరటి పండ్లన్నుప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఎక్కువగా వినియోగిస్తారు. దక్షిణ భారతదేశంలో, అరటిపండ్లు చాలా వంటలలో కీలకమైనవి. అవి యునైటెడ్ స్టేట్స్లో కూడా ప్రాచుర్యం పొందాయి మరియు వాటిని అక్కడ ఆపిల్ మరియు నారింజ కంటే ఎక్కువగా వినియోగిస్తారు. అవి పండినప్పుడు, ఆకుపచ్చ రంగులో ఉంటాయి మరియు వాటి చర్మంపై మచ్చలు ఉండవు. పండిన తరువాత, అవి మచ్చలతో కప్పబడి ఉంటాయి చర్మంపై ఎక్కువ మచ్చలు ఉన్న అరటిపండ్ల కోసం చూడండిఅవి ఆరోగ్యంగా ఉంటాయి.
పండిన అరటిలో టిఎన్ఎఫ్ (ట్యూమర్ నెక్రోసిస్ ఫాక్టర్) పుష్కలంగా ఉంటుంది, ఇది అసాధారణ శరీర కణాలతో పోరాడటం ద్వారా క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. శరీర కణాలు మరియు రోగనిరోధక వ్యవస్థ మధ్య సంభాషణను TNF సులభతరం చేస్తుంది, ఇది కణాల పోషణకు మద్దతు ఇస్తుంది. ఇంకా, టిఎన్ఎఫ్ అపోప్టోసిస్ (సెల్ డెత్) ను ప్రేరేపించడం ద్వారా కణితి కణాల పెరుగుదలను ఆపగలదు. అరటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు రక్త కణాల సంఖ్యను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ది లైఫ్ హ్యాకర్ ప్రకారం, చర్మంపై చాలా మచ్చలు ఉన్న అరటిపండ్లు అధిక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అరటి పండు అధిక శక్తిని ఇస్తుంది మరియు అది క్యాన్సర్‌ను నివారించే సామర్థ్యమే కాకుండా, దానివల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి:
మలబద్దకానికి చికిత్స: అరటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు అది ప్రేగు కదలికకు దారితీస్తుంది.
రక్తపోటు తగ్గించును.: అరటి సోడియం స్థాయిలను తగ్గిస్తుంది మరియు గుండె ఆరోగ్యాన్నికాపాడుతుంది..
అల్సర్స్ నివారణ: వాటి మృదువైన నిర్మాణం కడుపులో చికాకును నివారిస్తుంది.
శరీర ఉష్ణోగ్రతను నియంత్రించును : మీకు జ్వరం వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి.
డిప్రెషన్‌తో పోరాటం : అరటిపండ్లలో లభించే ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం మీ మనసుకు విశ్రాంతినిస్తుంది.
వ్యాయామ సెషన్‌కు ముందు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినడం వల్ల గంటసేపు శక్తి లభిస్తుంది. దానిలో విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉన్నందున అవి మీ ఓర్పును(endurance) కూడా పెంచును.. ఇవి పొటాషియం యొక్క అద్భుతమైన వనరు మరియు కండరాల తిమ్మిరిని నివారించడంలో సహాయపడతాయి. అరటి పండ్లు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలవు.
చిన్న పిల్లలు నుండి గర్భిణీ స్త్రీలు, వృద్ధుల వరకు, ప్రతి ఒక్కరూ కొబ్బరి నీళ్ళు తాగవచ్చు (డాక్టర్ వద్దని చెప్పితే తప్ప) కొబ్బరి నీరు తీపి, గింజ లాంటి రుచికలిగి చాలా రిఫ్రెష్ మరియు ఓదార్పునిస్తుంది, వేసవిలోహాయి నిస్తుది. రోజు ప్రారంభం ఒక గ్లాస్ కొబ్బరి నీరు తో ప్రారంబించిన అనేక ప్రయోజనాలు కలవు. క్రీడా పానీయం, కోలా డ్రింక్, పంచదార ప్రీమిక్స్ లేదా పండ్ల రసం కంటే మన శరీరంనకు కొబ్బరి నీరు ఆరోగ్యకరమైనది.
పోషక విలువలు:
లేత కొబ్బరి నీళ్ళ విటమిన్లు, ఎలెక్ట్రోలైట్స్, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, ఎంజైములు, పైటో హార్మోన్లు ; సైటోకైనిన్స్ తో నిండిఉండును. ఇది నాలుగు అరటికాయ ల కంటే ఎక్కువ పొటాషియం కలిగి కేలరీలు, కొవ్వు లేకుండా సులభంగా జీర్ణం అగును.
కొబ్బరి నీటి యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:
1. తక్కువ కేలరీల పానీయం: ప్రాసెస్ చేసిన పండ్ల రసం, ఎరేటెడ్ పానీయాలు మరియు పానీయాలకు కొబ్బరి నీరు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం.
2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: కొబ్బరి నీరు ఫాస్ఫేటేస్, డయాస్టేస్, ఫోలిక్ ఆమ్లం మరియు ఇతర ఎంజైమ్‌ల యొక్క అద్భుతమైన మూలం, ఇది ఆహారం జీర్ణక్రియకు సహాయపడుతుంది.
3. డీహైడ్రేషన్ ఉన్న వ్యక్తి (విరేచనాలు, విరేచనాలు లేదా కలరా యొక్క ఫలితం) కొబ్బరి నీటి నుండి ఎంతో ప్రయోజనం పొందవచ్చు. శరీరంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్ మరియు ప్లాస్మా సమతుల్యతను పునరుద్ధరించడం ద్వారా కొబ్బరి నీరు పనిచేస్తుంది.
4. చర్మ వృద్ధాప్యాన్నిఅరికట్టుతుంది.: సైటోకిన్స్ మరియు లారిక్ ఆమ్లం యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మం యొక్క పిహెచ్ బ్యాలెన్స్ ను నిర్వహిస్తాయి. కొబ్బరి నీరు లారిక్ ఆమ్లం మరియు సైటోకిన్ల యొక్క గొప్ప మూలం. కొబ్బరి నీరు చర్మం యొక్క సహజ ప్రకాశాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీరు దద్దుర్లు మరియు చర్మ వ్యాధుల నుండి చర్మాన్ని బాగా పోషిస్తుంది మరియు రక్షిస్తుంది.
5. కొబ్బరి నీళ్ళు తాగండి, నిరాశను మరచిపోండి: రిబోఫ్లేవిన్, పాథోజెనిక్ ఆమ్లం మరియు థియామిన్ ఒక వ్యక్తిలో నిరాశ మరియు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడే ట్రిపుల్ హీలింగ్ విటమిన్లు. ఈ ముఖ్యమైన విటమిన్లు కొబ్బరి నీటి లో ఉన్నందున, కొబ్బరి నీరు మీ మానసిక స్థితిని పెంచుతుంది.
6. బరువు తగ్గుదల : తక్కువ కేలరీల పానీయం కావడంతో, కొబ్బరి నీరు కొన్ని అదనపు కిలోలు కోల్పోవాలనుకునే వారికి ఆరోగ్యకరమైన ఎంపిక.
7. ఆరోగ్యకరమైన ఎముకలు సహజమైన మార్గం: కొబ్బరు నీరు కాల్షియం యొక్క అద్భుతమైన మూలం. కొబ్బరి నీరు మీ ఎముకలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.
8. కిడ్నీ రాళ్ళ నివారణ : కొబ్బరి నీరు మూత్రపిండాల రాళ్ల సమస్యను పరిష్కరించడానికి సహజమైన మార్గం. కొబ్బరి నీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, ఇది మూత్రపిండాల రాళ్లను కరిగించడంలో సహాయపడటమే కాకుండా, పరిస్థితి (కిడ్నీ స్టోన్స్) పునరావృతం కాకుండా చూస్తుంది.
9. ఆరోగ్యకరమైన రక్తపోటు: అధిక రక్తపోటు ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా అవసరం. విటమిన్-సి తో పాటు ఖనిజాలు (పొటాషియం మరియు మెగ్నీషియం) రక్తపోటు ఆరోగ్యకరమైన పరిమితుల్లో ఉండేలా చూస్తుంది.
10. ఇతర ప్రయోజనాలు:
· కొబ్బరి నీటిలో ఉండే మెగ్నీషియం మైగ్రేన్లు ఉన్నవారికి రక్షకుడిగా పనిచేస్తుంది.
· పొటాషియం యొక్క గొప్ప మూలం కొబ్బరి నీరు. ఇది కండరాల తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడుతుంది.
· పొడవైన, ఆరోగ్యకరమైన మరియు మెరిసే జుట్టును కలిగిస్తుంది.ఇది నెత్తిని హైడ్రేట్ చేస్తుంది, తద్వారా జుట్టుకు అవసరమైన పోషణ లభిస్తుంది.
· చక్కెర మరియు కేలరీలు తక్కువగా ఉండటం వలన, డయాబెటిక్ రోగులకు కొబ్బరి నీరు అద్భుతమైన నివారణ.
నిమ్మ కాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. వాటిని ఆహారంలో కలుపుకున్నా.. రసం తీసుకుని తాగినా ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిమ్మలో విటమిన్-C, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే బరువు తగ్గుతారు. వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మరసం ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది. అయితే, నిమ్మకాయలను ఆహారంగా తీసుకోవడం వల్లే కాదు. ఇంట్లో ఉంచుకున్నా సరే ఆరోగ్యానికి మంచిదే. కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువ మంది నిమ్మను రోజువారీ ఆహారంతో తీసుకుంటున్నారు. నిమ్మతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, రోజూ దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆహర నిపుణులు చెబుతున్నారు.
మన పూర్వికులు గుమ్మానికి నిమ్మ కాయలు కట్టేవారు. ఇప్పటికీ కొన్ని దుకాణాలు, వాణిజ్య కేంద్రాల్లో నిమ్మకాయలను కడతారు. కొందరు నీటిలో నిమ్మకాయ, పసుపు వేసి అలంకరణగా పెడతారు. వాటిని మనం దిష్టి నిమ్మకాయలని భావిస్తాం. అయితే, దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
❂ నిమ్మ రసం రక్తంలో కొవ్వు నియంత్రిస్తూ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా కాపాడుతుంది. ❂ నిమ్మ రసంలో తేనె కలుపుకుని తాగితే అజీర్ణం, పైత్యం తగ్గుతాయి. కాలేయం శుభ్రమవుతుంది. ❂ నోటి పూతకు నిమ్మ మంచి ఔషదం. ❂ నిమ్మ రసంలోని సిట్రిక్ యాసిడ్ కడుపులోని చెడు క్రిములను నాశనం చేస్తుంది. ❂ బాగా నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది. ❂ మంచి పోషక పదార్ధాలతోపాటు నిమ్మరసం తీసుకుంటే మహిళల్లో గర్భస్రావాలు ఉండవు. ❂ జలుబు తగ్గాలంటే నిమ్మ షర్బత్ తాగండి. ❂ జీర్ణక్రియ వ్యాధులైన మలబద్ధకం, అజీర్ణం లాంటి వాటిని తగ్గించటంలో నిమ్మరసం సహాయపడుతుంది. ❂ గజ్జి, తామర, చుండ్రు, మొటిమలు, కుష్టు మొదలైన చర్మవ్యాధులతో బాధపడేవారు నిమ్మరసాన్ని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
నిద్రపోయే ముందు నిమ్మకాయలను ముక్కులుగా కోసి బెడ్ రూమ్‌లో పెడితే గాలి శుభ్రమవుతుంది.
❂ నిమ్మకాయలను రూమ్‌లో పెడితే ప్రత్యేకంగా రూమ్ ప్రెషర్ అవసరం ఉండదు. నిమ్మ వాసనతో గది పరిమళ భరింతం అవుతుంది.
❂ నిమ్మకాయ ముక్కలను బెడ్రూంలో పెట్టుకుని నిద్రిస్తే శ్వాస చక్కగా తీసుకోగలుగుతారు.
❂ ఊపిరి తీసుకోడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే తప్పకుండా నిమ్మ ముక్కలను గదిలో పెట్టుకుని నిద్రించండి.
❂ నిమ్మ వాసన డిప్రెషన్‌ను తొలగిస్తుంది.
❂ నిమ్మ వాసన వల్ల యాంగ్జైటీ దూరమై మీలో పాజిటీవ్ ఫీలింగ్స్ కలుగుతాయి.
❂ నిమ్మ వాసన వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.
❂ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే నిమ్మకాయను కట్ చేసి లవంగాలను గుచ్చి పెట్టండి. దెబ్బకు దోమలు పారిపోతాయ్.
❂ ప్రయాణాల్లో నిమ్మకాయ వాసన చూడటం వల్ల కడుపులో తిప్పడం, వికారం తగ్గుతుంది. కాబట్టి.. అది ఇంట్లో ఉంటే ఆ సమస్యలే దరిచేరవు.
❂ నిమ్మ వల్ల మూత్రంలో సిట్రేట్ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడవు. ❂ చిన్న పిల్లల్లో వచ్చే టాన్సిలైటిస్ సమస్యకు చెంచాడు నిమ్మరసం, చిటికెడు సైంధవ లవణం వేసి తాగిస్తే ఫలితం కనిపిస్తుంది. ❂ నిమ్మరసంలో చిటికెడు ఉప్పు, వంటసోడా కలిపి దంతాల మీద రుద్దితే దుర్వాసన పోతుంది. ❂ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. ❂ శరీరంలో వాపు, కణాలు దెబ్బతినడానికి కారణమయ్యే కణాలను విటమిన్-C నిర్వీర్యం చేస్తుంది. ❂ రోజూ ఆహారంలోగానీ, విడిగాగానీ నిమ్మరసాన్ని తప్పనిసరిగా వాడాలి. దీనివల్ల వ్యాధులు దరిచేరవు. ❂ జ్వరంగా ఉన్నప్పుడు నిమ్మరసం తాగితే కాస్త ఉపశమనం ఉంటుంది. ❂ దగ్గు మందుల్లో కఫాన్ని తగ్గించడానికి కూడా నిమ్మరసం కలుపుతారు.
❂ నిమ్మ ఆకుల రసానికి తేనె కలిపి ఇస్తే కడుపులో నూలి పురుగులు తగ్గుముఖం పడతాయి. ❂ గుండెల్లో మంట, డయేరియా, బద్ధకం నివారణకు నిమ్మరసం మంచి ఔషధం ❂ కొవ్వు తగ్గించడంలో నిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది. ❂ బ్యాక్టీరియా వల్ల కలిగే దుర్వాసనను నిర్మూలించే లాలాజలాన్ని నిమ్మరసం ఉత్పత్తి చేస్తుంది. ❂ రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా నిమ్మకాయ రసం, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది. ❂ నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణశక్తి బాగుంటుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది. ❂ కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండుసార్లయినా బ్రష్ చేస్తే దంతాలు మెరుస్తాయి. ❂ ప్రయాణాలలో వాంతులతో బాధపడేవారు నిమ్మకాయ వాసన చూడడం లేదా నిమ్మ చెక్కను చప్పరించినా చక్కని ఉపశమనం కలుగుతుంది.
✺ నిమ్మరసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు సమస్యను అరికట్టవచ్చు.
✺ నిమ్మరసం రక్తాన్ని శుద్ధి చేసి, అందులోని రోగ కారక క్రిములను నశింపజేస్తుంది.
✺ రోజూ నిమ్మరసం తీసుకోవడం వల్ల కలరా, మలేరియా వంటి వ్యాధులు దరిచేరవు.
✺ ముఖం మీద ఏర్పడే నల్లటి మచ్చలను తగ్గించడంలోనూ నిమ్మ ఉపయోగపడుతుంది.
✺ రోజుకో గ్లాస్ నిమ్మ రసం తాగితే వల్ల ఆర్థరైటీస్, జీర్ణ సంబంధ సమస్యల నుంచి బయటపడవచ్చు.
ఉదయాన్నే వేడి నిమ్మకాయ నీరు
1. జీర్ణ ప్రయోజనాలు: మనం తినే ఆహారo ఆహార పైపు గుండా వెళుతుంది. మంచి రాత్రి నిద్ర తర్వాత ఆహార పైపు లో ఆహారం యొక్క అవశేషాలు ఉండవచ్చు, మరియు వెచ్చని లెమన్/నిమ్మ నీరు త్రాగటం ఆహార పైపును శుభ్రంగా చేస్తుంది. వెచ్చని నీరు నూనెను తొలగించడంలో కూడా సహాయపడుతుంది,
2. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది: నిమ్మకాయలోని విటమిన్-సి మరియు పొటాషియం రోగనిరోధక శక్తిని పెంచును. వాటిని ఖాళీ కడుపుతో తీసుకోవటం వలన శోషణ మంచిది మరియు శరీరం పూర్తి ప్రయోజనాన్ని పొందుతుంది.
3. బరువు తగ్గించే సహాయం: ఉత్తమ బరువు తగ్గించే సహాయాలలో ఒకటిగా, వెచ్చని లెమన్/నిమ్మ నీరు జీవక్రియను పెంచుతుంది మరియు శరీరాన్ని కొవ్వును దహించడానికి అనుమతిస్తుంది, తద్వారా బరువు నియంత్రణకు సహాయపడుతుంది. ఖచ్చితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
4. మెరుస్తున్న చర్మం: కొల్లాజెన్ ఏర్పడటానికి నిమ్మ కాయ/లైం లో ఉండే విటమిన్-సి అవసరం, అది చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, చర్మ సంరక్షణ అవసరాలలో హైడ్రేషన్ ఒకటి, మరియు ఉదయాన్నే వెచ్చని లైం /నిమ్మ నీరు త్రాగటం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లి చర్మం మెరుస్తూ మరియు స్పష్టంగా ఉంటుంది.
5. పరిశుబ్ర కాలేయం: కాలేయం జీవక్రియకు కేంద్రం మరియు ఉదయం వెచ్చని లెమన్/నిమ్మ నీరు త్రాగటం కాలేయాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. కాలేయం రాత్రిపూట చురుకుగా ఉంటుంది మరియు ఉదయం వెచ్చని లెమన్/నిమ్మ నీరు త్రాగటం దాని శక్తిని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో శోషరస మరియు పిత్త ప్రవాహాన్ని పెంచుతుంది.
6. గాయాలను త్వరగా మాన్పుతుంది.: గాయాలు అయినవారికి, నిమ్మకాయలో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది మరియు గాయం నయం చేయడంలో సహాయపడుతుంది. ఇది మృదులాస్థి మరియు ఎముకలతో సహా బంధన కణజాల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది.
7. మూడ్ పెంచేది: నిమ్మరసం యొక్క వాసన మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఇది ఆందోళన మరియు నిరాశను కూడా తగ్గిస్తుంది.
8. పిహెచ్ బ్యాలెన్స్: లైం/నిమ్మ కాయ లోని ఆస్కార్బిక్ మరియు సిట్రిక్ ఆమ్లం సులభంగా జీర్ణమవుతాయి మరియు ఫలితం ఆల్కలీన్ వాతావరణం. శరీర పిహెచ్ ఆమ్లంగా ఉన్నప్పుడు శరీర వ్యాధులు సంభవిస్తాయి. పర్యావరణాన్ని ఆల్కలీన్గా ఉంచడం ద్వారా, లైం/నిమ్మ నీరు శరీర అనారోగ్యానికి మొత్తం అవకాశాన్ని తగ్గిస్తుంది.
ఒక రోజులో ఎంత నిమ్మకాయ తినడం మంచిది?
నిమ్మకాయలను తినడం, వాటి జ్యూస్ ను తాగడం చేస్తే మనకు విటమిన్ సి ఎక్కువగా అందుతుంది. విటమిన్ సి వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిత్యం మనం 90 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి తీసుకోవచ్చు. విటమిన్ సి లోపం ఉన్నవారు అయితే గరిష్టంగా 2000 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి తీసుకోవచ్చు. అంతకు మించితే దంతాలపై ఉండే ఎనామిల్ క్షీణిస్తుంది. అలాగే విరేచనాలు వస్తాయి. ఇతర అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
ఒక సాధారణ నిమ్మకాయ ద్వారా మనకు దాదాపుగా 30 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి లభిస్తుంది. అంటే రోజుకు 3 నిమ్మకాలను తినొచ్చు. అంతకు మించకూడదు. అదే విటమిన్ సి లోపం ఉన్నవారు 66 వరకు నిమ్మకాయలను తినొచ్చు. కానీ ఎవరైనా అన్ని నిమ్మకాయలను తినలేరు. కనుక సగటున ఒక వ్యక్తి రోజుకు 3 నిమ్మకాయలను తినడం ఆరోగ్యకరం. విటమిన్ సి లోపం ఉంటే కేవలం నిమ్మకాయలు మాత్రమే కాకుండా ఇతర విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకోవాలి.
సిమ్ల యాపిల్‌లా ఎర్రగా ఆకర్షణీయంగా ఉండదు దోరమగ్గిన జాంపండులా చూడగానే కొరుక్కు తినాలనిపించదు మధురమైన మామిడిలా పళ్లల్లో రారాజు కూడా కాదు కానీ ఆ పండు ఒక రత్నమూ, మాణిక్యమే మన పెద్దలు ఎప్పుడో ఈ విషయాన్ని గుర్తించారు. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్న మాణిక్యాలు, మనవలు బొమ్మరాళ్లు అంటూ ఆ పండు చుట్టూ ఒక పొడుపు కథనే అల్లేసారు. పనస పండులో ఓ పస ఉంది. ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే మనమూ గుర్తిస్తున్నాం.. పాశ్చాత్య దేశాలు కూడా పనసను మనసారా ఆస్వాదించడం మొదలు పెట్టాక ఆ పండు విలువ ఆకాశమే హద్దుగా సాగిపోయింది. వీగన్ డైట్ ఫాలోయర్లకు పనస పండు ఒక వరంగా మారింది. పనస. అదొక కల్పవృక్షం. ఆ పండులో తొనలే కాదు, పై తొక్క, పిక్కలు, చెట్టు ఆకులు, బెరడు.. దాని కర్ర.. ఇలా ప్రతీ భాగమూ అత్యంత విలువైనవి. దాని చుట్టూ ఉన్న మార్కెట్‌ని చూస్తే విస్తుపోతారు. భారీ సైజు, రవాణాలో సంక్లిష్టత, పండు పై తొక్క తీసి తొనల్ని వలవడం అదో పెద్ద ప్రహసనం కావడంతో జనసామాన్యంలోకి అంతగా వెళ్లలేదు..పనసలో ఆరోగ్య విలువలు గ్రహించాక తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రాష్ట్రీయ ఫలంగా ప్రకటించి మార్కెట్‌ని విస్తరించే పనిలో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్ జాతీయ ఫలం కూడా పనసే. వాళ్లు ఎప్పట్నుంచో పనసతో సొమ్ము చేసుకునే పనిలో ఉన్నాయి అమెరికా, యూరప్, బ్రిటన్ దేశాల్లో ఈ పనసంటే పడి చచ్చిపోతారు. కేవలం కేరళ రాష్ట్రం నుంచి ఈ పండు ఎగుమతులు గత ఏడాది 500 టన్నులకు చేరుకున్నాయి. ఈ ఏడాది చివరికి 800 టన్నులు దాటేస్తుందని ఒక అంచనా. పనస కేరళ రాష్ట్రానికి 15 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతూ కాసుల వర్షం కురిపిస్తోంది. పనసపండుకి పుట్టినిల్లు భారత దేశంలోని పశ్చిమ కనుమలు. పండ్లల్లో అతి పెద్దది. ఒక్కో పండు 5 నుంచి 50 కేజీల వరకు తూగుతుంది. 3 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. పనసలో ఏకంగా 300 రకాలు జాతులు ఉన్నాయి. ఉత్పత్తి అయ్యే పళ్లలో రెండేళ్ల క్రితం వరకు 80 శాతం వృథా అయ్యేవి. వీటి విలువ 2వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా పనసతో 200 రకాల వంటకాలు చేయొచ్చు. పనసపొట్టు కూర, పసన దోసెలు వంటి సంప్రదాయ వంటల నుంచి అటు వెస్ట్రన్ ఘుమఘులైన పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, ఐస్‌క్రీమ్ వరకు ఎన్నో రకాలు ఉన్నాయి. చివరికి పనస వైన్ కూడా తయారు చేస్తున్నారు.
పరిపూర్ణ ఆహారం పనస పరిపూర్ణ ఆహారానికి మరో రూపం. ఈ పండులో అత్యధికంగా ప్రొటీన్లు ఉంటాయి. విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది.. ఒక కప్పు అన్నంలో కంటే కప్పు పనస తొనల్లో కార్బోహైడ్రేట్లు 40% తక్కువగా ఉంటాయి. ఇక ఫైబర్ నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. వరి, గోధుమలో ఉండే గ్లూకోజ్‌లో సగం కంటే తక్కువ పనస పండులో ఉంటుంది. థైరాయిడ్, ఆస్తమా వంటి రోగాలను నియంత్రిస్తుంది.
మధుమేహం ఆమడదూరం కేరళ డయాబెటీస్‌కు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడిప్పుడే మధుమేహ గ్రస్తుల్లో వరి, గోధుమ రొట్టెలకు బదులుగా పనస పొట్టు, పనస తొనలు, పిక్కలతో చేసే ఆహారాన్ని రోజూ తీసుకోవాలన్న స్పృహ పెరుగుతోంది. చక్కెర వ్యాధిని నియంత్రించే శక్తి పనస కాయకి ఉండడంతో దానికి డిమాండ్ పెరిగింది.
పేరు వెనుక కథ పనసకున్న శాస్త్రీయ నామం ఆర్టోకార్పస్, గ్రీకు భాష నుంచి ఈ పదం వచ్చింది. గ్రీకులో ఆర్టో అంటే బ్రెడ్ అని కార్పస్ అంటే పండు అని అర్థం. బ్రెడ్ అంటేనే అందరి కడుపు నింపేది. దానికి తోడు అది పండు కూడా కావడంతో పరిపూర్ణమైన ఆహారంగా మన పూర్వీకులే గుర్తించారు. కానీ అది ప్రాచుర్యంలోకి రావడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. 1563 సంవత్సరంలో పోర్చుగీస్‌కు చెందిన ఒక స్కాలర్ గరిక డా ఓర్టా అన్న పుస్తకంలో పనసని ప్రస్తావించారు. ఈ పండుని జాకా అని రాశారు. క్రమంగా ఇంగ్లీషులో అది జాక్ ఫ్రూట్‌గా మారింది.
వీగన్లకి వరం
వీగన్ డైట్ అంటే ఏమిటో తెలుసు కదా.. పూర్తిగా మొక్కల మీద పండిన ఆహారమే ఈ డైట్. ఈ మధ్య కాలంలో క్రీడాకారులందరూ వీగన్ డైట్‌ను తెగ ఫాలో అవుతున్నారు. భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ కూడా వీగన్‌గా మారడంతో అసలు ఏమిటీ డైట్ అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. మాంసాహారం మాత్రమే కాదు జంతువుల నుంచి వచ్చే పాలు, పెరుగు, తేనె వంటి పదార్థాలు కూడా ఈ డైట్లో తీసుకోరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే శుద్ధశాకాహారులన్న మాట. కక్క ముక్క లేనిదే ముద్ద దిగని వారు రాత్రికి రాత్రి మాంసాహారానికి దూరం కావడం అంత ఈజీ కాదు. అలాంటి వారికి పనస ప్రాణ సమానంగా అనిపిస్తోంది. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా పనసపండుని పాశ్చాత్య దేశాలు గుర్తించాయి. దీనికి కారణం ఆ పండు తొనలే. వాటిని నములుతుంటే మెత్తగా, రుచిగా అచ్చంగా మాంసం తింటున్న ఫీల్ వస్తుంది. తొనల చుట్టూ ఉండే పీచు కూడా విదేశీయులు ఇష్టంగా తింటారు.
Is jackfruit difficult to learn how to eat?
Eating is the easy part.
Depending on the size of the fruit, it feels like slaughtering a green scaly hippopotamus.
It taste good, when ripen,
and the seed can be eaten after boiling with a dash of salt.
Green jackfruit are used for making curries and imitation meat Check it out with South Asian and South East Asian.