నోట్లో పొక్కులు

Solutions For Mouth Ulcers In Telugu - Sakshi

కొందరికి నాలుక మీద పగులు వచ్చినట్లుగా అనిపించడంతో పాటు నోట్లో పొక్కులు రావచ్చు. ఏవైనా వేడిపదార్థాలో లేదా కారంగా ఉన్నవో తింటే మామూలు కంటే ఎక్కువగా మంట, బాధ ఉంటాయి. నాలుక తరచూ పగలడానికి, నోట్లో తరచూ పొక్కులు రావడానికి (అఫ్తస్‌ అల్సరేషన్‌) చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా… విటమిన్‌–బి లోపంతో ఈ సమస్య రావచ్చు. దీనికి తోడు ఎసిడిటీ, నిద్రలేమి, మానసిక ఆందోళన (యాంగై్జటీ) వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. అరుదుగా కొన్ని సిస్టమిక్‌ వ్యాధుల వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడవచ్చు. కొందరిలో పొగాకును వాడేవారికి నోటి పొరల్లో (లైనింగ్స్‌లో) మార్పులు వచ్చి అది క్రమంగా పొక్కుల్లా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి పైన చెప్పిన కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పొక్కులకు సరైన కారణం తెలుసుకుని దానికి తగిన చికిత్స చేయించాలి. అందుకే నోట్లో పొక్కులు వచ్చే వారు ముందుగా విటమిన్‌–బి కాంప్లెక్స్‌ టాబ్లెట్లు తీసుకుంటూ ఓ వారంపాటు చూసి, అప్పటికీ తగ్గకపోతే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి.

సరిగా బ్రష్‌ చేసుకుంటున్నారా?
మనం బ్రష్‌ చేసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అవి మన దంతాల, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. నోటిని ఆరోగ్యంగా ఉంచి, కేవలం దంతాలను మాత్రమే కాకుండా మన పూర్తి దేహానికి ఆరోగ్యాన్నిస్తాయి. వాటిలో కొన్ని  ముఖ్యమైనవి… 
► బ్రష్‌ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్‌ ఉన్న బ్రష్‌నే వాడాలి. మరీ బిరుసైనవీ, గట్టివి అయితే పళ్లు త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు… చిగుళ్లు గాయపడే అవకాశమూ ఉంది.  
►కిందివరసలో చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్‌ చేసుకోండి. ఇలా బ్రష్‌ చేసుకునే సమయంలో బ్రష్‌ను పైకీ, కిందికీ నేరుగా కాకుండా… గుండ్రగా తిప్పుతున్నట్లుగా మృదువుగా బ్రష్‌ చేసుకోవాలి. రఫ్‌గా బ్రష్‌ చేసుకుంటే చిగుళ్లు గాయపడి, త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. 
►బ్రషింగ్‌తో పాటు ముఖం కడుకున్న తర్వాత చివర్లో చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్‌ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పుచ్చు పళ్ళు

samayam telugu

ఈ సమస్య పళ్ళ మీద బాక్టీరియా ఏర్పడడం వల్ల వస్తుంది. ఈ బాక్టీరియా ప్లేక్ అనే ఒక పొరని తయారు చేస్తుంది. ఈ పొర పంటి మీద ఎనామిల్ లోంచి మినరల్స్ ని తీసేస్తుంది. దంతాలు బలంగా ఉండడానికి కావాల్సిన కాల్షియం, ఫాస్ఫేట్ ఈ ఎనామిల్ లోనే ఉంటాయి. దీని వల్ల ఎనామిల్ లో రంధ్రాలు ఏర్పడుతాయి. అది నెమ్మదిగా దంత క్షయానికి దారి తీస్తుంది.

ఈ సమస్య రావడానికి కల కారణాలు

– తగినంత విటమిన్ డీ లేకపోవడం

– నోరు ఎండి పోయినట్లుండడం

– పళ్ళకి అంటుకు పోయే చాక్లెట్స్ లాంటి ఫుడ్స్ తినడం

– షుగర్ ఎక్కువగా ఉన్న ఐస్ క్రీంస్, కూల్ డ్రింక్స్, సీరియల్స్ తినడం

– అరుగుదల సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే గుండెల్లో మంట

– రోజుకి రెండుసార్లు సరిగ్గా పళ్ళు తోముకోకపోడం

– పసిపిల్లలకి రాత్రి ఫీడ్ చెయ్యడం

​1. షుగర్ ఫ్రీ గమ్..

samayam telugu

భోజనం తరువాత షుగర్ ఫ్రీ గం నమలడం ద్వారా ఈ సమస్య రాకుండా కొంతవరకూ నివారించవచ్చు. దీని వల్ల నోట్లో లాలాజలం ఎక్కువగా ఊరి, ప్లేక్ పీహెచ్ ని పెంచుతుందని అంటున్నారు. ఈ గమ్ ఎనామిల్‌లో పోయిన మినరల్స్ ని మళ్ళీ తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక సారి పన్ను పుచ్చిపోయిన తరువాత ఇంట్లో ఏం చేయలేం. ఇక్కడ చెప్పినవన్నీ సమస్య అంత దూరం వెళ్ళకుండా చూసేవి.

2. విటమిన్ డీ ఫుడ్

samayam telugu

విటమిన్ డీ వల్ల ఆహారంలో ఉన్న కాల్షియం, ఫాస్ఫేట్ శరీరంలో అబ్జార్బ్ చేసుకుంటుంది. విటమిన్ డీ పాలూ, పాల పదార్ధాల నించి లభిస్తుంది. రోజుకి పదిహేను నిమిషాలు సూర్య కాంతిలో గడపడం వలన కూడా శరీరానికి విటమిన్ డీ లభిస్తుంది. ఒక వేళ సమస్య తీవ్రంగా ఉందనుకుంటే ఆ పన్నుని తీసేసి పక్క పంటికి సమస్య పాకకుండా చేస్తారు. రోజంతా షుగర్ ఉన్న ఫుడ్స్ తీసుకోకుండా ఉండడం, రోజుకి రెండు సార్లు సరిగ్గా బ్రష్ చేసుకోవడం – ఈ రెండు పద్ధతుల వల్లా ఈ సమస్య రాకుండా ఎనభై శాతం వరకూ నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

3. ఫ్లోరైడ్ టూత్ పేస్ట్

samayam telugu

కావిటీస్ ఏర్పడకుండా, ఎనామిల్ లోని మినరల్స్ పోకుండా ఫ్లోరైడ్ కాపాడుతుంది. రెగ్యులర్ గా ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్‌తో బ్రష్ చేసుకోవడం మంచిది.

4. షుగర్ తగ్గించటం

samayam telugu

షుగర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాలి. రోజంతా ఏదో ఒక పద్ధతిలో షుగర్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే కష్టం. ఒక సారి నోట్లోంచి షుగర్ లోపలికి వెళ్ళిపోయాక కొంత సేపటికి ఎనామిల్ మళ్ళి మినరల్స్ ని తయారు చేసుకుంటుంది. కానీ, ఎనామిల్ కి చాన్స్ ఇవ్వకుండా మళ్ళి షుగర్ ఉన్న ఫుడ్ తినడం వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.

5. ఆయిల్ పుల్లింగ్

samayam telugu

కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఇరవై నిమిషాల పాటు నోరంతా తిప్పుతూ ఉండడాన్ని ఆయిల్ పుల్లింగ్ అంటారు. నువ్వుల నూనెతో ఇలా చేస్తే ప్లేక్, జింజవైటిస్, బాక్టీరియా అన్నీ తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

6. లికోరిస్ రూట్

samayam telugu

లికోరిస్ రూట్ లో ఉండే గుణాలు దంత క్షయం కలిగించే బాక్టీరియాతో సమర్ధవంతం గా పోరాడగలవని నిపుణులు చెబుతున్నారు. కావిటీస్ మనకు తెలియకుండానే ఏర్పడి పెరుగుతాయి. రెగ్యులర్ గా డెంటల్ చెకప్ చేయించుకోవడం వల్ల ఈ సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి, ఫ్లోరీడ్ ట్రీట్మెంట్స్, ఫిల్లింగ్స్, రూట్ కెనాల్, కాప్ వెయ్యడం లాంటి పద్ధతుల ద్వారా ఈ సమస్యని పూర్తిగా నివారించడం జరుగుతుంది.

Dental Problems…దంత సమస్యలు

పళ్ళు జివ్వున లాగటం
ఐస్‌క్రీము, కూల్‌ డ్రింక్స్, వేడి వేడి కాఫీ..టీ.. చల్లగా లేదా వేడిగా నోట్లో ఏం పెట్టుకున్నా పళ్లు జివ్వున లాగేస్తాయి…లక్షలాది మందిని బాధించే సర్వసాధారణ సమస్యలు…
నోట్లో మనం చూసేది, మనకు కనిపించేదీ దంతం పై భాగమే.దీన్నే మనం క్రౌన్‌ అంటాము. ఈ దంతాలన్నిటికీ దవడ ఎముకలో, చిగురు లోపల కూడా కొంత భాగం ఉంటుంది. దాన్ని దంత మూలం (రూట్‌) అంటారు. మనకు పైకి కనిపించే దంతంలో ప్రధానంగా ఎనామిల్‌, డెంటిన్‌, పల్స్‌ అనే మూడు పొరలుంటాయి. ఎనామిల్‌ పొర మన శరీరం మొత్తం మీద అత్యంత దృఢమైన, ఎముక కంటే గట్టి పదార్థం. దంతాల పైభాగాన మనకు కనిపించేది అదే. రకరకాల కారణాల రీత్యా ఈ ఎనామిల్‌ పొర అరిగిపోతే దంతాలు అతి సున్నితంగా తయారై చిన్న చిన్న స్పందనకు కూడా జివ్వున లాగుతాయి. ఎనామిల్‌ డెంటిన్‌ పొరలు రెండూ కలిసే భాగం బయటపడిందంటే చాలు. మనకు దంతాలు జివ్వుమనే భావన ఆరంభమవుతుంది..
బాధకు కారణాలు
చాలా మంది దంతాలు శుభ్రంగా తెల్లగా మెరుస్తుండాలన్న ధ్యాసలో రోజూ 10నుండి15 నిమిషాలు పండ్లను బలంగా తోముతుంటారు. దీనివల్ల ఎనామిల్‌ అరిగిపోయి పన్ను సున్నితంగా తయారవుతుంది.
దంత ధావనంకోసం ఉప్పు, బొగ్గు వంటి గరుకు పదార్థాలను వాడటం.బలంగా రుద్దినా ఎనామిల్‌ అరిగిపోతుంది. బ్రష్ లలో హార్డ్‌ రకం బ్రష్ లు ఉపయోగించడం, ఎక్కువ బలాన్ని ఉపయోగించి రుద్దటటం, కిందికీ, పైకీ కాకుండా అడ్డంగా తోమటం, వీటివల్ల కూడా ఎనామిల్‌ అరిగిపోతుంది.
పండ్లు పండ్ల రసాలు, కూల్‌ డ్రింకు వంటి వాటిని తీసుకుని వెంటనే దంతాలను శుభ్రం చేసుకోకపోవటం వల్ల అక్కడ సిట్రిక్ ఆమ్లం తయారై అది ఎనామిల్‌ను తినేస్తుంది.
కొన్ని సార్లు దంతాలు విరిగి పోతుంటాయి. చిన్న చిన్న చెక్కల్లా రేగిపోతుంటాయి. ఇలా విరిగినప్పుడు డెంటిన్‌ పొర బయటపడడటం వలన కూడా పళ్లు జివ్వుమని అనిపించవచ్చు.
కొందరికి శరీరంలో క్యాల్షియం లోపం ఉంటుంది. అలాగే స్వతహాగా కొందరికి దంతాల మీద ఎనిమిల్‌ తయారవ్వదు. తయారైనా బలంగా ఉండదు. ముఖ్యంగా ఎమిలోజెనిసిస్‌ ఇమ్‌పర్‌ఫెక్టా, డిరటినో జెనిసిస్‌ ఇమ్‌పర్‌ ఫెక్టా వంటి సమస్యల్లో కూడా ఎనామిల్‌ పొర సరిగా లేక జివ్వుమనే సమస్య ఆరంభమవుతుంది.
దీర్ఘకాలంగా చిగుళ్ల వ్యాధి ఉండటం (క్రానిక్‌ పెరిడాంటైటిస్‌) వల్ల చిగుళ్లు కిందికి జారిపోయి, దంతమూలం బయటపడుతుంది. దీనివల్ల కూడా జివ్వుమనే సమస్య వస్తుంది. దంతాల మీద రంధ్రాలు (క్యావిటీస్‌) ఏర్పడినా కూడా లోపలి నాడులు ప్రభావితమవుతూ దంతాలు జివ్వున లాగుతాయి. జాగ్రత్తలు
హార్డ్‌ బ్రష్ బదులు మరింత సున్నితంగా ఉంటే ఎక్స్‌ట్రా సాఫ్ట్‌ బ్రష్ వాడటం సున్నితంగా తోముకోవటం 3 నిమిషాలకు మించి పండ్లు తోమకుండా ఉండటం, ఉదయమే కాకుండా రాత్రి కూడా బ్రష్షింగ్‌ చేసుకోవటం చాలా అవసరం.
పండ్లుగానీ పండ్లరసాలు గానీ తిసుకుంటే వెంటనే నీరు పుక్కిలించి నోరు శుభ్రం చేసుకోవటం అవసరం.చిగుళ్ల సమస్య ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలి.
చికిత్స
పళ్లు జివ్వుమనే సమస్య అసలెందుకు వచ్చింది, ఎనామిల్‌ ఏ కారణంతో అరిగిందన్నది పరిశీలించి దాన్నిబట్టి చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తారు. ముందు దంతా సున్నితత్వాన్ని తగ్గించే డీసెన్సిటైజింగ్‌ టూత్‌పేస్టు వాడటం వలన బాధ నుంచి ఉపశమనం ఉంటుంది. ఈ పేస్టును దంతాకు పట్టించి రెండు నిమిషాలుంచి ఆ తర్వాత మొత్తటి బ్రష్షుతో రుద్దుకుంటే సరిపోతుంది. అలాగే సున్నితత్వాన్ని తగ్గించేందుకు దంతాలకు ఫ్లోరైడ్‌ పేస్టు, క్రీము వంటివి పట్టించినా ఫలితం ఉంటుంది. కొందరికి దంతాల మీద రంధ్రాలు ఏర్పడటం వల్ల పళ్లు జివ్వున లాగుతుంటాయి. వీటిని వెంటనే ఫిల్లింగ్‌ చేయుంచుకోవాలి. దాంతో సమస్య తగ్గిపోతుంది. దంతాలు విరగటం వల్ల జివ్వుమనే సమస్య తలెత్తితే వాటికి రూట్‌ కెనాల్‌ చికిత్స చేసి పైన క్యాప్స్‌ అమరిస్తే సమస్య తగ్గిపోతుంది. దంతం లోపల ఉండే పల్స్‌ భాగం బయట పడకపోతే క్రౌన్స్‌ అమర్చినా ఉపయోగం ఉంటుంది. అత్యాధునిక ఆయాన్లతో చికిత్స లేదా లేజర్‌ చికిత్సతో సున్నితత్వాన్ని సమర్థంగా తగ్గించే అవకాశం ఉంది.
ఒకవేళ చిగురు కిందికి వెళ్లిపోవటం వల్ల దంతమూలం బయటపడి, జివ్వుమంటుంటే ముందు ఆ చిగుళ్ల వ్యాధికి చికిత్స చేయాలి. తరువాత దంతాన్ని సరిచేయాలి. కొందరికి వాంతలు, ఆమ్లాలు బయటకు వస్తుంటాయి. అవి కూడా దంతాలను దెబ్బతీస్తాయి. వాటిని న్యూట్రలైజ్‌ చెయ్యటానికి చికిత్స చేయాలి. దంతం విరిగిపోతే అదెంత వరకూ విరిగింది, దానికి క్యాప్స్‌ వెయ్యచ్చా? లేక కాంపోజిట్‌ ఫిల్లింగ్‌ చేయాల్పి ఉంటుంది? ఇవన్నీ ఆలోచించి వైద్యులు దాన్ని సరిచేస్తారు.
రూట్‌ కెనాల్‌ చికిత్స
పంటి మీద ఎనామిల్‌, దాని లోపల డెంటిన్‌ ఇంకా లోపల పల్స్‌ భాగాుంటాయి. లోపలగా ఉండే పల్స్‌లో నాడులు, రక్తనాళాలుంటాయి. దంతాల మీద చిన్న చిన్న రంధ్రాలు (క్యావిటీస్‌) ఏర్పడినపుడు తొలిదశలో డెంటిన్‌ వరకూ వెళ్లినా కూడా జివ్వుమనటం తప్పించి తీవ్రమైన బాధ ఉండదు. కానీ అది డెంటిన్‌ను దాటి పల్స్‌లోకి వెళ్లిందంటే మాత్రం బాధ తీవ్రంగా ఉంటుంది. అందులో నాడులు ఉంటాయి. కాబట్టి అవి ప్రభావితమై తీవ్రమైన నొప్పి ఆరంభమవుతుంది. ముఖ్యంగా ఈ నొప్పి రాత్రి పడుకున్నపుడు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలో రూట్‌కెనాల్‌ చికిత్స చాలా ఉపయోగపడుతుంది. దీనిలో దంతంలో ఉన్న నాడులు, రక్తనాళాలను శుభ్రం చేసి, రూట్‌ వరకూ ఫిల్లింగ్‌ చేసి, ఆ పంటి మీద సిరామిక్‌ లేదా జిర్కోనియంతో క్రౌన్‌ వేయ్యాల్సి ఉంటుంది. దీంతో పంటిని పూర్తిగా రక్షించుకున్నట్లుగా అవుతుంది.