చుండ్రు సమస్యలు

బూడిద గుమ్మడి రసం తలకు రాసుకుంటే,బట్టతల ,జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతుంది. ఈ రసం చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది. బూడిద గుమ్మడి ఆకులూ , నేలవుసిరి ఆకులు తో కామెర్ల మందు తయారు చేస్తారు. గుమ్మడి కాయ రసం బాగా చలువ చేస్తుంది. గాస్ ట్రబుల్స్ పోగొడుతుంది. మధుమేహం తగ్గిస్తుంది. మానసికంగా చాలా బలహీన పడినప్పుడు, బూడిద గుమ్మడి రసం తలకు పట్టించడం పూర్వం నుండి వాడుక లో వుంది. గింజలు కూడా చాలా బల వర్ధక మైనవి. వీటిలో కూడా ఔషధ గుణాలున్నాయి.

Read More

Ringworm….. తామర

గోటితోనే పోతుంది. కానీ గొడ్డలిదాకా తెచ్చుకుంటున్నాం. తామర (రింగ్వామ్) విషయంలో ఇప్పుడు జరుగుతున్నదిదే. ఒకట్రెండు వారాలు మందులేసుకుంటే తగ్గిపోయేది కాస్తా- ఇప్పుడు నెలలకొద్దీ వేధిస్తూ.. మహా మొండిగా తయారవుతోంది. మహిళల్లో అరుదనీ అనుకున్నది- ప్రస్తుతం తరచుగానూ కనిపిస్తోంది. పిల్లలను అసలే అంటుకోనిది- నేడు నెలల పిల్లలనూ పట్టి పీడిస్తోంది. ఇదంతా మన స్వయంకృతాపరాధమే. సిగ్గు, బిడియంతో సమస్యను దాచిపెట్టుకోవటం, డాక్టర్ను సంప్రతించకుండా సొంతంగా.. ముఖ్యంగా స్టిరాయిడ్స్ పూత మందులు కొనుక్కోవటం, వాటిని చాటుమాటుగా వాడుకోవటం, నివారణ చర్యలు పాటించకపోవటం వంటివన్నీ తామర విజృంభణకు దోహదం చేస్తున్నాయి. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే మరింత ప్రమాదంలోకి జారిపోవటం ఖాయం.ఒకటే దురద. రాత్రిపూట మరింత ఎక్కువ. ఏ పని చేస్తున్నా మనసంతా దాని మీదే. ఎప్పుడూ గోక్కోవాలనే అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు నలుగురు చూస్తున్నారన్న ధ్యాస కూడా ఉండదు. ఇలా తామరతో బాధపడేవారి…

Read More