గుండె జబ్బులు, రకాలు

అసలు గుండె జబ్బులు ఎవరికి వస్తాయి?

గుండె జబ్బులు ఎవరికైనా రావచ్చు. ఈ జబ్బుకి దేశ, ప్రాంత, లింగ వివక్షలు లేవు. ఈ జబ్బు ఒక్కోసారి ప్రాణాంతకమే అయినప్పటికీ, తొందరగా వైద్య సహాయం తీసుకోవడం ద్వారా ప్రాణ హాని తప్పించుకోవచ్చు. ఆరోగ్యకరమైన పాటించడం ద్వారా అసలు ఈ పరిస్థితి రాకుండా నివారించుకోవచ్చు.

samayam telugu

గుండె జబ్బుల్లో రకాలున్నాయా?

గుండె జబ్బుల్లో చాలా రకాలున్నాయి. అన్నింటినీ కలిపి హార్ట్ డిసీజ్ అనేస్తారు. ఇందులో గుండె సరిగ్గా కొట్టుకోకపోవడం నుంచి, రక్తనాళాలు పూడుకుపోవడం వరకూ ఉన్నాయి.

లక్షణాలేంటి?

సమస్య చాలా రకాలుగా ఉన్నా, లక్షణాలు మాత్రం చాలా వరకూ కామన్ గానే ఉంటాయి. అవేంటంటే:
– చెస్ట్ పెయిన్
– కళ్ళు తిరగడం
– స్పృహ కోల్పోవడం
– గుండె కొట్టుకునే పద్ధతిలో తేడా
– తిమ్మిరెక్కడం
– ఒక్కసారి నీరసపడిపోవడం
– నించోలేకపోవడం

– ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవడం

– వికారం
– గాస్ ఉన్నట్టు అనిపించడం
– ఆగకుండా వస్తున్న దగ్గూ, జ్వరం, వణుకు

ఈ లక్షణాలు వ్యక్తి ని బట్టి మారతాయి. కానీ, జనరల్ గా హార్ట్ డిసీజ్ ఉన్న వారు ఫేస్ చేసే ప్రాబ్లంస్ ఇవి.

గుండె జబ్బుని క్యూర్ చేయొచ్చా?

గుండె జబ్బు ని కంప్లీట్ గా క్యూర్ చేయడం కుదరదు. ఒకసారి ఈ సమస్య వచ్చాక దాన్ని మానేజ్ చెయ్యడం తప్పించి కంప్లీట్ క్యూర్ ఇంత వరకూ లేదు. ఒక సారి వచ్చిన తరువాత ఏం చేసినా ఆ జబ్బుని దృష్టి లో పెట్టుకునే చేయాలి. అందుకనే, వీలైనంతవరకూ గుండె జబ్బు రాకుండా చూసుకోవడం ఉత్తమం. సరైన ఆహారం,నిద్రా, వ్యాయామం తో పాటూ ఒత్తిడి తగ్గించుకోవడం వలన గుండె ని పదిలంగా కాపాడుకోగలుగుతాం.

గుండె జబ్బు ఎందువల్ల వస్తుంది?

– డయాబెటీస్, హైబీపీ, ఒత్తిడి, ఆందోళన, ఆల్కహాల్/ కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం, పొగ తాగడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, అధిక బరువు, శారీరకమైన చురుకుదనం లేకపోవడం మొదలైనవన్నీ ఈ జబ్బు రావడానికికారణాలే.

ఒక్క కంజెనిటల్ హార్ట్ డిసీజ్ కి మాత్రం పుట్టుకతో వచ్చే లోపాలు కారణం. వయసు, కుటుంబంలో ఆల్రెడీ ఎవరికైనా గుండె జబ్బు ఉండడం ఎవరూ కంట్రోల్ చేయలేని కారణాలు.

గుండె జబ్బుల్ని ఎలా టెస్ట్ చేస్తారు?

ఫిజికల్ ఎగ్జామ్‌తో పాటూ ఫ్యామిలీ హిస్టరీ కంపల్సరీగా తెలుసుకుంటారు. బ్లడ్ టెస్ట్ తప్పనిసరిగా చేస్తారు. అవసరాన్ని బట్టి ఈసీజీ, ఎకో, స్ట్రెస్ టెస్ట్, హార్ట్ రేట్ మానిటర్, కరాటిడ్ అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, హార్ట్ ఎం ఆర్ ఐ వంటి పరీక్షల ద్వారా డయాగ్నోస్ చేస్తారు.

ట్రీట్మెంట్ ఏమిటి?

గుండె జబ్బు వచ్చిన కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మందుల నుంచి సర్జరీ వరకూ అవసరాన్ని బట్టి ట్రీట్‌మెంట్ ఇస్తారు. వీటితో పాటూ జీవన శైలి మార్పులు కూడా సూచిస్తారు. బీపీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండడానికి అవసరమైన సూచనలు చేస్తారు.

లైఫ్‌స్టైల్‌లో చేసుకోదగ్గ మార్పులు ఏమిటి?

ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఉప్పూ, సాచ్యురేటెడ్ ఫ్య్యట్ ఉన్న ఆహార పదార్ధాలు తగ్గించాలి. రోజుకి అరగంట నుండీ గంట వరకూ వ్యాయామం కంపల్సరీ. స్మోకింగ్, ఆల్కహాల్, కెఫీన్ వంటివి మానెయ్యాలి. బరువు ఎక్కువగా ఉంటే వెంటనే బరువు తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన్ ఆహారం తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించాలి.

Best Food for Heart

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య నిపుణులు సూచించిన ఆహారం
ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవటం వలన గుండె జబ్బుల అవకాశాలు తగ్గుతాయి.
టమాటోలు : వీటిలో లైకోపిన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. టమాటోలు ముక్కలుగా కాని, సూప్‌, సలాడ్‌ రూపంలోగాని తీసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్‌, లైకోపిన్‌ మూలంగానే టమోటోలు ఎర్రగా ఉంటాయి.
రక్త ప్రసరణ నియంత్రించటానికి ఉపయోగపడే విటమిన్‌ సి, ఇ. ఫ్లేవనాయిడ్స్‌, పొటాషియం ఎక్కువగా ఉంటాయి.
దానిమ్మ : ప్రతిరోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే కొస్టరాల్‌ మూలకంగా జరిగేది నెమ్మదిగా జరుగుతుంది. గుండెజబ్బు రిస్క్‌ తగ్గుతుంది. రక్తంలో ఆరోగ్యాన్ని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు అధికమవుతాయి.
గుమ్మడికాయ : గుమ్మడి కాయలో బీటా కెరటోన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో చేరిన తరువాత విటమిన్‌ – ఎ గా మార్పు చెందుతుంది. గుండె జబ్బుకు, క్యాన్సర్‌కు, త్వరగా వయస్సు పెరిగి పోయినట్లు కనిపించడానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ ధాతువులను హరించకుండా బీటా కెరటోన్‌ నిరోధిస్తుంది. ప్రతి రోజూ అవసరమయ్యే బీటా కెరటోన్‌, గుండెను రక్షించే ఆరోగ్యకర పొటాషియంలో పావువంతు అరకప్పు గుమ్మడికాయ ముక్కలలో లభిస్తుంది.
చేపలు : రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడకుండా, వాపు రాకుండా నిరోధించి, గుండెను రక్షించే ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్‌ చేపలలో దండిగా ఉంటుంది. ఇవి కొలస్ట్రాల్‌ లెవల్స్‌ను కూడా తగినంతగా ఉంచుతాయి. సార్టిన్‌ చేపలలో మాత్రమే దండిగా ఒమేగా-3 ఉంటుంది. సన్నని ఎముకలు తీసివేసి చేపలను తీసుకున్నట్లయితే వాటిలో ఖనిజాలు దండిగా లభిస్తాయి.
బెర్రీస్‌ : బెర్రీస్‌ గుండె ఆరోగ్యానికి మంచి పౌష్టికాహారం. ఇవి తినటం వలస రక్తపోటు తగ్గుతుంది. మంచి కొలస్ట్రాల్‌ పెరుగుతుంది. అందువలన స్ట్రాబెర్రీస్‌, బ్లూబెర్రీస్‌, బ్లాక్‌ బెర్రీస్‌, రాన్స్‌ బెర్రీస్‌ తినవచ్చు. తాజా లేదా నిల్వ చేసుకున్న బెర్రీస్‌లో బలమైన పాలిఫినాల్స్‌, రోగాలపైన పోరాడే యాంటీ యాక్సిడెంట్స్‌ ఉంటాయి.
రెడ్‌వైన్‌, ద్రాక్ష, చాక్‌లెట్‌ గింజలో కూడా ఈ పాలీఫినల్స్‌ సమృద్ధిగా లభిస్తాయి.

గుండెపోటు

శరీరమంతటికీ రక్తాన్ని సరఫరా చేసే గుండెకూ తగినంత రక్తం అందాలి. ఇందుకోసమే ప్రత్యేకంగా మూడు రక్తనాళాలు పనిచేస్తుంటాయి. ఎప్పుడైనా గుండెకు తగినంత రక్తం అందకపోయినా.. లేదూ పూర్తిగా నిలిచిపోయినా గుండెపోటుకు దారితీస్తుంది. దీనికి ప్రధాన కారణం రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్‌, ఇతర పదార్థాలు పోగుపడి పూడికలు ఏర్పడటం. ఈ పూడికలు కొన్నిసార్లు రక్తనాళం నుంచి విడిపోయి, రక్తనాళం చిట్లి రక్తం గడ్డకట్టొచ్చు కూడా. కొందరికి గుండెపోటు హఠాత్తుగా, చాలా తీవ్రంగానూ దాడిచేయొచ్చు. ఇది ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. మంచి విషయం ఏంటంటే- చాలామందిలో గుండెపోటు సంకేతాలు కొన్ని గంటలు, రోజుల ముందు నుంచే కనబడుతుంటాయి.
గుండెపోటు సూచనలు…
ఛాతీ బిగపట్టినట్టు, లోపల ఏదో నొక్కేస్తున్నట్టు అనిపించటం. నొప్పి వస్తుండటం. ఇవి కొన్ని నిమిషాల సేపు అలాగే ఉండిపోవచ్చు. లేదూ వస్తూ పోతుండొచ్చు.చేతుల్లో.. ముఖ్యంగా ఎడమ చేయి, భుజంలో నొప్పి రావటం. మెడ, దవడ, వీపు, కడుపులో కూడా నొప్పిగా, ఇబ్బందిగా అనిపించొచ్చు.శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది. ఆయాసం వస్తుండటం. తల తేలిపోతున్నట్టు, వికారంగా అనిపించటం. వాంతి కూడా కావొచ్చు.చెమట్లు పట్టటం. నిస్సత్తువ.
అయితే అందరికీ ఈ అన్ని లక్షణాలూ కనబడాలనేమీ లేదు. తీవ్రత కూడా ఒకేలా ఉండాలనేమీ లేదు. కొందరికి నొప్పి ఒక మాదిరిగా ఉంటే మరికొందరికి ఎక్కువగా ఉండొచ్చు. కొందరికి ఎలాంటి లక్షణాలు కనబడకుండానే ఉన్నట్టుండీ గుండెపోటు రావొచ్చు.

Aangioplasty….యాంజియో ప్లాస్టీ

ఒక సూక్ష్మనాళం ద్వారా శరీరంలోని రక్తనాళాల్లోకి బెలూన్‌ అనే పరికరాన్ని పంపి కొవ్వులతో పూడుకుపోయిన ఆ రక్తనాళాలను విచ్చుకుపోయేలా చేయడమే యాంజియో ప్లాస్టీ.
గుండెపోటును నివారించడానికి ఇప్పుడు లక్షలాది మంది హృద్రోగులు ఈ మార్గం ద్వారా లబ్ది పొందుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం ఇప్పుడు బైపాస్‌ కన్నా అధిక సంఖ్యలోఈ యాంజియోప్లాస్టి చికిత్సలు జరుగుతున్నాయని అంచనా. ఈ ప్రక్రియలో ముందుగా సూక్ష్మనాళాన్ని (కేథటర్‌) మూసుకుపోయిన రక్తనాళంలోకి పంపిస్తారు. తర్వాత సన్నని తీగను రక్తనాళం వద్దకు జొప్పించి లోపలికి ఒక బెలూన్‌ పంపుతారు. ఈ బెలూన్‌ను ఉబ్బేలా చేయడం ద్వారా రక్తనాళం పూడుకుపోయిన ప్రాంతాన్ని విచ్చుకునేలా చేస్తారు. ఫలితంగా రక్తనాళంలోని అడ్డంకి తొలగిపోవడం వల్ల రక్తప్రసారం మునుపటిలాగే జరడానికి ఆస్కారం ఉంటుంది.
గుండెకు సరఫరా చేసే రక్తనాళాల ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రధానంగా రక్తనాళాలలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోవటంతో ఈ అడ్డంకులు ఏర్పడుతుంటాయి. వీటిని బైపాస్‌ సర్జరీ లేదా యాంజియో ప్లాస్టీ చికిత్స ద్వారా తొలగించవచ్చు.
బైపాస్‌ సర్జరీ అంటే ఛాతీభాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తెరచి గుండెకు జరిగే రక్తప్రవాహాన్ని యధాతధంగా జరిగేందుకు మరో మార్గాన్ని ఏర్పరచడం అన్నమాట. ఇందుకోసం పూడుకుపోయిన రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా ఇతర రక్తనాళాలను కలుపుతారు. అయితే ఇది మేజర్‌ శస్త్రచికిత్స. ఆపరేషన్‌ అయిన తర్వాత కూడా రోగి కనీసం వారం రోజులపాటు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది. పూర్తిగా కోలుకోవడానికి 2 – 3 నెలలు సమయం పడుతుంది. ఈ శ్రమ, ఆందోళన లేకుండా రక్తనాళాల్లో అడ్డంకులను సులువుగా తొలగించడానికి ఇప్పటి మేలైన పద్దతే యాంజియోప్లాస్టీ.
యాంజియో ప్లాస్టీ అంటే … రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగించడానికి శస్త్రచికిత్స లేకుండానే చేసే ఈ చికిత్సలో ఎలాంటి కోతా ఉండదు. తొడ లేదా చేతిలోని రక్తనాళం ద్వారా గుండెకు వెళ్ళే రక్తనాళాల్లోకి సన్నని బెలూన్‌ను పంపుతారు. రక్తనాళం పూడుకుపోయిన స్థానాన్ని చేరగానే ఆ బెలూన్‌ను ఉబ్బేలా చేస్తారు. అలా రక్తనాళంలోని అడ్డంకులను తొలగిస్తారు. ఆ తర్వాత ఆ ప్రదేశంలో పూడిక ఏర్పడే అవకాశాన్ని తగ్గించడానికి చాలా సందర్భాల్లో స్టంట్ అనే లోహపు గొట్టాన్ని అమర్చుతారు. దీనివల్ల రోగి 1-2 రోజుల్లోనే అసుపత్రినుంచి డిశ్చార్‌ అయి, తన రోజువారీ పనులను సాధారణంగా చేసుకోవచ్చు. ఫలితాలు, ప్రయోజనాలు ఎక్కువగా ఉండటం వల్ల బైపాస్‌ సర్జరీకన్నా చాలా మంది రోగులు, డాక్టర్లు ఇప్పుడు యాంజియోప్లాస్టీ వైపు మొగ్గు చూపుతున్నారు.
యాంజియోప్లాస్టీ అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది బైపాస్‌ సర్జరీనే ఆశ్రయించేవారు. కానీ ఇటీవల యాంజీయోప్లాస్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. కారణం..ఇందులో ఉండే సౌకర్యం, పైగా సర్జరీతో సమకూరే ప్రయోజనాలు, కోత లేకుండానే సమకూరడం వల్ల దీనివైపు రోగులు మొగ్గు చూపుతున్నారు.
కొన్నేళ్ళుగా యాంజియోప్లాస్టీకోసం మరింత మొరుగైన ఉపకరణాలు అందుబాటులోకి వస్తున్నాయి. మునుపటి కంటే మెరుగైన బెలూన్లు ఇప్పుడు అందుబాటులోఉన్నాయి. రోటా బ్లాటర్‌ నిమిషానికి ఒకటిన్నర నుండి రెండు లక్షలసార్లు పరిభ్రమిస్తుంది. దీనివల్ల ఎంత గట్టిగా ఉన్న అడ్డంకినైనా డ్రిల్‌ చేసి తొలగించడం సాధ్యమవుతుంది. రక్తనాళంలోకి ప్రవేశపెట్టానికి వీలుగా ఉన్న ఇంట్రావాస్క్యులార్‌ ఆల్ట్రాసౌండ్‌ ప్రోబ్‌ అనే పరికరం వల్ల రక్తనాళంలోపలి భాగాలను స్పష్టంగా చూడడంకూడా ఇప్పుడు సాధ్యమే. యాంజీయోప్లాస్టీ సమయంలో రక్తనాళంలో పోగుపడ్డ వ్యర్థాలను సైతం ఫిల్టర్‌ వైర్‌ సహాయంతో బయటకు లాగేయవచ్చు ఈ ప్రక్రియను నెరవేర్చే క్యాథ్‌లాబ్‌లో ఇప్పుడు అత్యంత నాణ్యమైన ఇంట్రా అయోర్గిక్‌ బెలూన్‌ పంపుల సహాయంతో గుండెపనితీరు, బీ.పి స్థిరంగా ఉండేలా చేయవచ్చు.
అత్యాధునిక ట్రాన్స్‌ రేడియల్‌ విధానం…. యాంజియోప్లాస్టీలో ట్రాన్స్‌రేడియల్‌ విధానం అధునాతనమైనదిగా చెప్పవచ్చు. ఇది రోగులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే…గతంలో సంప్రదాయ యాంజియోగ్రామ్‌ లేదా యాంజియోప్లాస్టీని తొడలోని రక్తనాళం ద్వారా చేసేవారు. దాంతో యాంజియోగ్రామ్‌ తర్వాత 5-7 గంటలపాటు, యాంజియోప్లాస్టీ తర్వాత 10-14 గంటలపాటు మంచంమీద కదలకుండా పడుకోవాల్సి వచ్చేది. అయితే ఈ ట్రాన్స్‌రేడియల్‌ పద్ధతిలో చేతిలోని రక్తనాళంద్వారా యాంజియోగ్రామ్‌ లేదా యాంజియోప్లాస్టీ చేయడం వల్ల రోగి వెంటనే నడవవచ్చు. హాస్పిటల్‌లో ఉండే సమయం, రక్తస్రావం జరిగే అవకాశం చాలావరకు తగ్గిపోతాయి.
యాంజియోప్లాస్టీ అందునా చేతి ద్వారా చేసే ట్రాన్స్‌ రేడియల్‌ యాంజీయోప్లాస్టీ ఇటీవల అందుబాటులోకి రావడంతో హృద్రోగ చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దీనితో గుండెపోటు వచ్చే అవకాశాన్ని చాలావరకు నివారించడానికి వీలవుతుంది.
తిరిగి అడ్డంకులు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువ… గతంలో స్టంట్ అమర్చినా మళ్ళీ కొంతకాలానికి రక్తనాళాల్లో పూడిక చేరేది. అయితే ఇప్పుడు గతంలోని వాటి స్థానే ఔషధపూరిత స్టెంట్లను ప్రవేశపెట్టారు. దీనివలన రీబ్లాకేజ్‌లు చాలావరకు తగ్గాయి. ఔషధాలతో కోటింగ్‌ చేసిన స్టంట్లు 2-3 నెలల్లో నెమ్మదిగా మందులను రిలీజ్‌ చేసి మళ్ళీ బ్లాకేజెస్‌ వచ్చే అవకాశాలను చాలావరకు తగ్గిస్తాయి. కాబట్టి గుండె రక్తనాళాల్లో క్లిష్టమైన అడ్డంకులను తొలగించడానికి బైపాస్‌ సర్జరీ ద్వారా పొందే ఫలితాలన్నీ ఇప్పుడు శస్త్రచికిత్స అవసరంలేకుండా యాంజియోప్లాస్టీ స్టెంట్ల ద్వారా పొందవచ్చు.

గుండె మంట

గుండెలో మంట తరచుగా చాలా మంది అనుభవిస్తుంటారు. గుండెలో మంట వ్యాధి లక్షణమే కానీ వ్యాధి కాదు. గుండె లేదా ఛాతీలో లేదా అన్నవాహిక వెంబడి మంట ఉన్నట్లయితే ఇసోఫాగ్నస్‌లో (అన్నవాహికలో) మంట వుండటమే కారణం. ఛాతీ ఎముక కింద అన్నవాహిక ఉంటుంది.
జీర్ణక్రియకు సంబంధించిన సమస్య ఏర్పడినప్పుడు గుండె, ఛాతీలో మంట కలుగుతుంది. ఆహారానికి సంబందించిన సమస్యగా గుండె మంటను వైద్యనిపుణులు నిర్వచిస్తారు. అజీర్తి కోసం తీసుకొనే ఔషధాలు, ఇతర చర్యలతో ఛాతీలో మంట రాకుండా ఉపశమనం కలుగుతుంది. సాధారణంగా మనం జీవితంలో ఏదో ఒక సమయంలో గుండె లేదా ఛాతీలో మంటను అనుభవిస్తాము. ఒక్కొక్కసారి మంట గాకుండా నొప్పి కూడా అనిపించవచ్చు. పొట్టలో ఉండే పదార్థాలు అన్నవాహిక కింది భాగం వైపుకు ప్రయాణించినపుడు అసౌకర్యం లేదా నొప్పి కలుగుతుంది.
గుండె మంటకు కారణాలు : పొట్టలోని కండరాల్లో లోపం ఉండటం గుండె మంటకు దారి తీస్తుంది. పొట్టలోని పైభాగంలో వుండే ఫ్లాప్‌ (అటు ఇటు కదిలే భాగం) ఆహారం అన్నవాహిక నుండి తిరిగి లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. కొన్ని సమయాల్లో ఫ్లాప్‌ సరిగా పనిచేయకపోవటం వలన పొట్టలో యాసిడ్స్‌ పైకి వెళ్ళిపోతాయి. అలా యాసిడ్స్‌ పొట్టనుండి పైకి వచ్చినపుడు గుండె లేదా ఛాతీలో మంట వస్తుంది. సోడాలు (కోలాలతో సహా) ఇతర కార్పోనేటెడ్‌ పానీయాలు చాక్‌లెట్స్, పుల్లటి పండ్లు, టమాటోలు, టమాటో సాస్ లు, సుగంధ ద్రవ్యాలతో చేసిన పదార్థాలు, ఎర్ర మిరియాలు (కాస్పికం) పిప్పర్‌మెంట్‌, స్పియర్‌మెంట్‌, బటానీ లాంటి ఎండు గింజలతో చేసిన పదార్థాలు, ఐస్‌క్రీమ్‌ లాంటి ఫ్యాటీ ఆహార పదార్థాలు కూడా గుండె మంటకు దారి తీస్తాయి.
ఒత్తిడి, అలసట లాంటివి ఎదుర్కొన్నపుడు, ఇతర మానసిక స్థితి కూడా గుండె మంటకు కారణం అవుతుంది. అలాగే పొగత్రాగడం, మితిమీరి తినడం, అధిక బరువు, ఛాతీ బిగుసుకుపోయే లాంటి వస్త్రాలు ధరించటం వలన కూడా గుండె మంటకు దారి తీస్తాయి. గుండె మంట అదుపులోకి రాకపోతే తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి.
గుండె మంట వలన కలిగే కొన్ని ఆరోగ్య ఇబ్బందులు- ఇసోఫాగ్నస్‌ (అన్నవాహిక వాపు), అన్నవాహికలో రక్తస్రావం, అన్నవాహికలో అల్సర్‌ (వ్రణం), బ్యారెట్స్‌ ఇసోఫాగ్నస్‌, అన్నవాహికకు కేన్సర్‌ రిస్క్‌ పెరగటం.
గుండె మంట లక్షణాలు : గుండె మంట వ్యాధి కాదు అది వ్యాధి లక్షణం. పొట్ట ఎటైనా తిరిగే కండరాలతో నిర్మాణమైన అవయవం. పొట్ట మనం తిన్న ఆహారాన్ని నిల్వ వుంచటమే గాక అతి సన్నని ముక్కలుగా పచనం చేసి ఆ మిశ్రమాన్ని ఫైలోరస్‌ అనే దిగువ వున్న వాల్వ్‌ ద్వారా కిందకు పంపుతుంది. పొట్టను అంటుకుని వుండే పొరలో అనేక మిలియన్ల గ్రంథులుంటాయి. వాటి నుండి అనేక రసాయనాలు ఊరి ప్రసరిస్తాయి. వీటిలో హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌, పెప్సినోజిన్‌ అనే రెండు రసాయనాలు ప్రధానమైనవి. హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ గుండె మంటకు దారితీసే రసాయనాలో ప్రధానమైనది.
పొట్టవలనే ప్రధానంగా గుండె మంట వుండదు. కొంత మేరకు పొట్టలో వుండే వాల్వ్‌ సక్రమంగా స్పందించక పోవటం కూడా కారణం కావచ్చు. ఈ విలక్షణమైన వాల్వ్‌ను లోయర్‌ ఇసోఫాగ్నల్‌ స్పింక్టర్‌ అంటారు. ఈ వాల్వ్‌ స్పందించకపోయినా లేదా బలవంతంగా తెరచుకున్నా పొట్టలో వున్న యాసిడ్‌ వేగంగా అన్నవాహిక వైపు వస్తుంది. దీనివలన సున్నితమైన అన్నవాహిక పొరకు గాయమవుతుంది. నోటి నుండి ఆహారం పొట్టలోకి చేరడానికి కొన్ని సెకన్లు పడుతుంది అందువల్ల పొట్టలోని యాసిడ్స్‌ అన్నవాహికలో ఉండవలసిన పనిలేదు. అన్నవాహిక మెత్తని కండరాలతో నిర్మాణమైన అవయవం. ఇది ఆహారాన్ని పానీయాలను కిందకు పంపుతుంది. ప్రతిరోజూ అనేక రకాల ఆహార పదార్థాలను తింటూ వుంటాము. అపుడు ఈ అప్పర్‌ వాల్వ్‌ స్పందిస్తుందా లేదా అనే విషయం కూడా మనం గుర్తించలేము. మనం రోజూ ఎదుర్కొనే ఒత్తిడి సైతం ఈ వాల్వ్‌ పైన ప్రభావం చూపవచ్చు.
అనేకసార్లు గుండె మంట అనిపించే లక్షణాలు కనిపించవచ్చు. వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. వీటిలో కొన్నింటి కారణంగా గుండెలో మంట తీవ్రం కావచ్చు.
గుండె మంట లక్షణాలను చూడండి
పొట్టలోని యాసిడ్‌ తిరిగి పైకి ప్రయాణించి, గొంతులోకి లేదా నోటిలోకి వచ్చినప్పుడు అది మనం భరించలేనట్టుగా వుంటుంది. పైకి కనిపించే కారణం లేకపోయినా పొట్టలోని అనవసరమైన గాలి బయటకు వస్తుంది. గుండెలో మంట వేడిగా, చురుకుమన్నట్లుగా, మంద్రంగా ఛాతీ ఎముక వెనుక అనిపిస్తుంది. అది గొంతు వరకు పాకుతుంది. నోటిలో ఎక్కువ నీళ్ళలాగా లేదా ద్రవం లేదా లాలాజం రూపంలో వస్తుంది. గొంతులో లేదా అన్నవాహికలో ఏదైనా అడ్డుపడి మింగడానికి ఇబ్బందిగా వున్నట్టుగానే నోటిలోకి వచ్చే ద్రవం మింగటానికి ఇబ్బందిగా వుంటుంది. కనిపించే కారణం లేకుండానే రాత్రిపూట దగ్గు వస్తుంది. ఆస్త్మాకు లేదా పలుమార్లు బ్రోంఖైటిస్‌కు దారితీయవచ్చు. ధారాళంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకోలేకపోవడం జరుగుతుంది.
ఫ్యాట్స్‌, సుగంధ ద్రవ్యాలు, ముద్దలాంటి మొత్తని పదార్థాలు, కాఫీ, చాక్లెట్స్‌, టొమేటో ఉత్పత్తులు గుండెలో మంట వున్నట్లు అనుమానిస్తున్న వారు తీసుకోకుండా వుండటం మంచిది. తీసుకునే ఆహారంలో వాటిని మినహాయించటం ప్రారంభిస్తే సహజసిద్ధంగా గుండె మంటకు దారితీసే వాటిని తొలగించినట్లవుతుంది. తీసుకునే ఆహారాన్ని జాగ్రత్తగా గమనించుకోవటంతో పాటు సహజసిద్ధమైన చికిత్స చేసుకోవచ్చు.దీనికి అల్లం చాలా మంచిది. అల్లం పొడిని కొని నిల్వ చేసుకోవచ్చు. అల్లం క్యాప్సూల్స్‌ రూపంలో కూడా లభిస్తుంది. జీర్ణవ్యవస్థపైన అల్లం టానిక్‌లాగా పనిచేస్తేంది. ఇది సహజసిద్ధమైన గుండె మంట చికిత్స
చేయకూడనవి : పొగ తాగవద్దు, పొగతాగటం వలన గుండెలో మంట పెరుగుతుంది. బరువు తగ్గాలి: బరువు ఎక్కువగా వున్నపుడు పొట్టపైన అదనపు ఒత్తిడి కలుగుతుంది. బిగుతుగా వుండే బట్టలు ప్రత్యేకించి భోజనం తరువాత ధరించరాదు. ఆర్థరైటిస్‌కు వాడే కొన్ని రకాల వాపు నివారణ మందులు గుండె మంటను పెంచవచ్చు. అందువల్ల డాక్టరును సంప్రదించి మందులు వాడాలి.
పడుకునేటప్పుడు పొట్టకంటే తల కొంచెం ఎత్తుగా వుండేలా చూసుకోవాలి. వీలైనంతగా ఒత్తిడి తగ్గించుకోవాలి. యాసిడ్స్‌ పొట్టలో నుండి పైకి వచ్చేవారికి అన్నవాహికలో వ్రణంలాంటి కణితి ఏర్పడే అవకాశం వుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ సమస్యను సకాలంలో గుర్తించి తగిన చికిత్స చేయించుకోవటానికి క్రమం తప్పకుండా ఎండోస్కోపి చేయుంచుకోవాలి.

About Heart

గుండె గురించి తెలుసుకోండి గుండెను కాపాడుకోండి. శరీరంలోని గుండె కాకుండా మిగతా అవయవాలు పనిచేయక పోయినా మనిషి కొంతకాలం జీవించవచ్చు. కాని గుండె పనిచేయకపోతే ……? అందుకే గుండె గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొనాలి.
మానవశరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినపుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఆ అవయవాలు సక్రమమంగా పనిచేయానికి అవసరమైన శక్తిని అందించేదే గుండె. భారతదేశంలో గుండెజబ్బుతో బాధపడేవారి సంఖ్య కోట్లలలో ఉంటుది. దీనికి కారణాలు పుట్టుకతో వచ్చే సమస్యలు. రెండవది మన స్వయంకృతాపరాధం. పోషకపదార్థాల లోపం, జీవనవిధానంలో వచ్చే మార్పులు, పొగత్రాగటం, మద్యపానం, వాయుకాలుష్యం మొదలగునవి.
గుండె పరిమాణం మనిషి పిడికిటంత. బరువు షుమారు 12 ఔన్సులు. శరీర భాగాలలోని మలినపడిన రక్తాన్ని రక్తనాళాలు గుండెకు చేరుస్తాయి. ఆ రక్తాన్ని శుద్ధిచేయానికి ఊపిరితిత్తులకు పంపింగ్‌ చేస్తుంది గుండె. ఊపిరితిత్తులలో శుబ్రపడిన రక్తం తిరిగి గుండెకు చేరి అక్కడనుండి శరీరంలోని అన్ని భాగాలకు పంపుతుంది గుండె. రక్తం మలినపడటం అంటే కార్బన్‌డైఆక్సైడ్‌ను గ్రహించడం. ఊపిరితిత్తులలోని మనం పీల్చిన ఆక్సిజన్‌ ఈ రక్తాన్ని గ్రహించి, కార్బన్‌డైఆక్సైడును బయటకు పంపుతుంది.
ఆక్సిజన్‌తో కూడిన రక్తం గులాబీరంగులో వుంటుంది. మానవశరీరంలోని రక్తం రక్తనాళాలగుండా మాత్రమే ప్రవహిస్తుంది. శరీరంలోని రక్తనాళాలను కొలిస్తే ఒక లక్షా అరవైవేల కిలో మీటర్లుగా వుంటుంది. ఆరోగ్యకరమైన మనిషి గుండె ప్రతిరోజూ 7000 లీటర్ల రక్త శరీరభాగాలకు అందించడాని నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుంది. గుండె అధికంగా కొట్టుకున్నా ఇబ్బందే. తక్కువగా కొట్టుకున్నా ఇబ్బందే.
గుండెకు కీడుచేసేవి : వైద్యశాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం గుండెకు 80 సంవత్సరాలపాటు ఏ ఇబ్బంది లేకుండా పనిచేసే సామర్ధ్యం వుంది. ఈలోపు గుండె జబ్బులు వస్తే అది మన స్వయంకృతాపరాధం మాత్రమే. ప్రొగ త్రాగడం, పొగాకు ఉత్పత్తులను వాడటం పొగతాగిన ప్రతిసారి గుండె కొట్టుకునే విధానం మారి రక్తపోటు సమస్య మొదలవుతుంది. ఎక్కువ పొగతాగేవారిలో రక్తనాళాలు మూసుకుపోయి, రక్తం గడ్డకట్టి గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్‌ సరఫరా కాదు. మరో శత్రువు మత్తుపానీయాలు. అతిగా తాగడంవలన గుండె కండరాలు బలహీనపడతాయి. గుండె సక్రమంగా కొట్టుకోదు. కార్డియో మయోపతి అనే వ్యాధి వస్తుంది. మరొక ప్రధాన శత్రువు కాలుష్యం. రవాణా వాహనాలు – డీజిల్‌ ఆయిల్‌ వాడే వాహనాలనుండి వెలువడే పొగలోని సల్ఫర్‌డైఆక్సైడ్‌, నైట్రోజన్‌ డైఆక్సైడ్‌, కార్బన్‌ మొనాక్సైడ్‌ ప్రమాదకారకాలు.
మానసికవత్తిడి : నిరంతరం మానసిక వత్తిడితో బాధపడేవారికి రక్తపోటు పెరిగి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.ప్రతి చిన్న అంశానికి కోపం, కసి ద్వేషం వంటి గుణాలు కలవారి రక్తనాళాల గోడలు మందంగా తయారవుతాయి. కనుక ఈ లక్షణాలు మంచివికావు.
ఆహారం : అతిగా మాంసాహారం తినటం, నూనెలో బాగా వేయించిన వేపుళ్ళు తినటంవల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. నూనెలు, జంతుకొవ్వుల్లో కొలెస్ట్రాల్‌ అధికంగా వుంటుంది.వీటి వల్ల చెడ్డ కొలస్ట్రాల్‌ అధికమగుట వలన రక్తసరఫరాకు ఆటంకం కలుగుతుంది. వీటితో తయారైన పదార్థాలు మితంగా తీసుకోవాలి లేదా మానివేయాలి.
ఉప్పు వాడకం తగ్గించాలి. జంక్‌ఫుడ్‌లలో ఉప్పు, రసాయనాలు అధికంగా కలుపుతారు. వీటి వల్ల రక్తనాళాలు మూసుకుపోతాయి. కనుక వీటిని తినేముందు ఆలోచించాలి. మధుమేహ రోగులకు, బి.పి. ఉన్నవారికి గుండెజబ్బుల ప్రమాదం అధికం కాబట్టి వీటికి పూర్తిగా దూరంగా వుండటమే మంచిది.
గుండె ఆరోగ్యానికి :ఆవనూనెతో చేసిన వంటకాలు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువగా గల కూరగాయలు, బీర, సొర, పొట్ల కాయల వంటివి తప్పక తినాలి. వ్యాయామం, నడక, ఏరోబిక్స్‌ వీటి వల్ల చాలావరకు గుండెను కాపాడుకోవచ్చును. ప్రాణాయామం వలన మూత్రపిండాల సమర్ధత పెరుగుతుంది. రకాన్ని శుద్ధిచేసే మాత్రపిండాలు ఎంత బాగా పనిచేస్తే ఆరోగ్యం అంతా బాగా పనిచేస్తుంది.
నీరు, నిద్ర : ఈ రెండూ గుండెకు అవసరం. సరిగా నిద్రపోకపోతే గుండె దెబ్బతింటుంది. అతినిద్ర మంచిది కాదు. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగటం మంచి అలవాటు. గుండెకు అద్భుతమైన మిత్రులు వెల్లుల్లి, ఉసిరి . వెల్లులోని రసాయనాలు రక్తనాళాలో గారపట్టనివ్వదు. గారను కరిగిస్తూ గుండెజబ్బులను కొంతమేర నిరోధిస్తుంది. ఉసిరిలోని సి విటమిన్‌ రోగనిరోధక శక్తి పెంచుతుంది. రోగనిరోధక శక్తి ఎంత ఉంటే గుండె అంతే బాగుంటుంది. మెంతులు, మొంతికూర, మొంతిపొడి కొలస్ట్రాల్‌ మీద ప్రభావం చూపుతాయి. వీటిని విరివిగా వాడటం మంచిది. (మితంగా మాత్రమే తరుచుగా వాడాలి)
శనగలు : ఇవి చెడుకొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.రక్తంలోని ట్రైగ్లిజరైడ్‌ల స్ధాయిని తగ్గిస్తాయి. సోయా రక్తంలోని చెడుకొలస్ట్రాల్‌ లిపిడ్స్‌ను తగ్గిస్తాయి. సోయా వాడకం గుండెకు మంచిది.
గుండెజబ్బుకు కారకాలైన కొలస్ట్రాల్‌, బి.పి. మొదలగునవి రక్తంలో ఉండవలసిన స్ధాయి :
చెడ్డ కొలస్ట్రాల్‌ 100 ఎం.జి. కన్నా తక్కువ (మధుమేహంలో 80 ఎం.జి. కన్నా తక్కువ వుండాలి)
ట్రైగ్లిజరైడ్లు 130 ఎం.జి కన్నా తక్కువ
మంచి కొలస్ట్రాల్‌ 50 ఎం.జి./ డి.ఎల్‌ కన్నా తక్కువ
లైపోప్రోటీన్‌ ఎ 20 ఎం.జి./ డి.ఎల్‌ కన్నా తక్కువ
నడుం చుట్టుకొలత (మగవారికి) 35 అంగుళాల కన్నా తక్కువ
నడుం చుట్టుకొలత (ఆడవారికి) 31 అంగుళాల కన్నా తక్కువ
రక్తపోటు 120 / 80 ఎం ఎం / హెచ్‌ జి కన్నా తక్కువ
రక్తంలో గ్లూకోజు (పరగడుపున) 100 ఎం.జి / డి.ఎల్‌ కన్నా తక్కువ

హృదయం (Heart)

ఆరోగ్యకరమైన హృదయం కోసం -11 ఆహారాలు తప్పనిసరి

Heart Quiz: What Makes You Tick? Trivia

శరీరంలో గుండె చాలా ప్రత్యేకమైన స్థానాన్ని పొందుతుంది. గుండెకు మంచిది మొత్తం శరీరానికి మంచిది. గుండెకు అనారోగ్యకరమైన ఆహారం యొక్క ప్రభావాలు మొత్తం శరీరానికి అనారోగ్యకరమైనవి.

గుండె జబ్బులు, మధుమేహం,  ఉబకాయం మరియు స్ట్రోక్ వంటి జీవనశైలి మార్పుల

తో, గుండె ఆరోగ్యకరమైన ఆహారం తినడం యొక్క ప్రాముఖ్యత నేడు పెరిగింది.

గుండె ఆరోగ్యకరమైన ఆహారాలు క్రిందివి:

.1. కొవ్వు చేపలు Fatty fishes: సాల్మన్, సార్డినెస్ మరియు మాకేరెల్/వాలుగ  ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటాయి మరియు ధమనుల ఫలకం ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. వారానికి కనీసం రెండుసార్లు చేపలు తినడం మంచిది.

2. వోట్మీల్: ఓట్స్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫోలేట్ మరియు పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది కరిగే ఫైబర్‌లో కూడా సమృద్ధిగా ఉంటుంది మరియు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని మరియు ధమనులను ఫలకం లేకుండా ఉంచుతుంది.. ఇది జీర్ణవ్యవస్థలోని కొలెస్ట్రాల్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది.

3. అవోకాడో: ఈ పండులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు చాలా ఉంది, ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇవి లైకోపీన్ మరియు బీటా కెరోటిన్ వంటి ఇతర కెరోటినాయిడ్ల శోషణను కూడా మెరుగుపరుస్తాయి.

4. బెర్రీలు: బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీ మరియు ఇతర బెర్రీలు గుండెపోటు ప్రమాదాన్ని దాదాపు మూడింట ఒక వంతు తగ్గిస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు నిరూపించబడిన ఆంథోసైనిన్స్ మరియు ఫ్లేవనాయిడ్లు వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్త నాళాలను సడలించి రక్తపోటును తగ్గిస్తాయి మరియు గుండెపోటును తగ్గిస్తాయి.

5. డార్క్ చాక్లెట్: 60-70% కోకో కలిగి ఉన్న చాక్లెట్‌లో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇది రక్తపోటు, గడ్డకట్టడం మరియు మంట నివారించడం లో సహాయపడుతుంది.

6. ఆలివ్ ఆయిల్: మోనోశాచురేటెడ్ కొవ్వులతో నిండిన ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. వంట చేయడానికి ఆలివ్ oil మంచిది.

7. గింజలు మరియు విత్తనాలు: బాదం, అక్రోట్లను, పిస్తా, వేరుశెనగ, మరియు మకాడమియా గింజలు మోనో మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ మరియు విటమిన్-ఇలతో నిండి ఉంటాయి. అవిసె గింజలో ఒమేగా -3 మరియు ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి

8. సోయా: టోఫు మరియు సోయా పాలతో సహా సోయా ఉత్పత్తులు ప్రోటీన్ జోడించడానికి మరియు కొలెస్ట్రాల్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలను తగ్గించడానికి అనువైనవి.

9. చిక్కుళ్ళు: వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం మరియు కరిగే ఫైబర్ అధికంగా ఉంటాయి.

10. బచ్చలికూర: ఫైబర్, ఫోలేట్, లుటిన్ మరియు పొటాషియం యొక్క గొప్పవనరులు. నిజానికి, చాలా కూరగాయలు ప్రయోజనకరమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

11. గ్రీన్ టీ: యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మీ ఆహరం లో గుండె ఆరోగ్యకరమైన ఆహారాలు  కొన్నింటిని చేర్చండి మరియు హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.