రెక్టమ్‌ క్యాన్సర్

Anal Cancer Symptoms Or Rectum Cancer - Sakshi

మల విసర్జన సమయంలో రక్తం పడగానే అది క్యాన్సరేనేమో అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలా రక్తం పడడం అన్నది మూడు ప్రధాన సమస్యల కారణంగా జరగవచ్చు. మొదటిది యానల్‌ ఫిషర్‌ అనే సమస్య. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు కూడా రక్తం పడటంతో పాటు నొప్పి కూడా ఉంటుంది. రెండోది హెమరాయిడ్స్‌ అనే సమస్య. దీన్నే పైల్స్‌ అని కూడా అంటారు. తెలుగులో ఈ సమస్యనే తెలుగులో మొలలు లేదా మూలశంక అని వ్యవహరిస్తుంటారు. ఈ సమస్యలో కూడా రక్తస్రావం కనిపిస్తుంది. మొలలు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.

ఇక మూడో సమస్య క్యాన్సర్‌ కూడా కావచ్చు. ఎవరిలోనైనా మలద్వారం నుంచి రక్తం పడుతున్నప్పుడు ఆ సమస్యకు ఈ మూడింటి లో ఏది కారణమన్నది తెలుసుకోవడం కోసం కొన్ని నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదాహరణకు పెద్దపేగు, మలద్వారం వంటి భాగాలను పరీక్షించేందుకు చేసే కొలనోస్కోపీ వంటివి పరీక్షలు చేస్తారు. ఒకవేళ ముందు చెప్పిన సమస్యల్లో యానల్‌ ఫిషర్‌ లేదా పైల్స్‌ అనే రెండు సమస్యల్లో దేనినైనా సాధారణ శస్త్రచికిత్సలు లేదా ఇతరత్రా మరింత అడ్వాన్స్‌డ్‌ ప్రక్రియలతో పరిష్కరించవచ్చు.

పైగా ఆ రెండూ ప్రాణాంతకాలు ఎంతమాత్రమూ కావు. అయితే ఒకవేళ క్యాన్సర్‌ ఉన్నట్లుగా ప్రాథమిక రిపోర్టులు వస్తే…  అక్కడి గడ్డ నుంచి కొంత ముక్క సేకరించి, వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఆ వచ్చిన రిపోర్టుల ఆధారంగా ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఒకవేళ అది క్యాన్సరే అయినప్పటికీ… ఇప్పుడు పెద్దపేగు క్యాన్సర్లకూ, మలద్వార క్యాన్సర్లకూ మంచి చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పై మూడు సమస్యల్లో ఏదైనప్పటికీ ఎవరూ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

మలద్వారం (రెక్టమ్‌) క్యాన్సర్‌ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న అనుభూతి ఉంటుంది. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. దాంతో దాన్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్‌ ఓ గడ్డలా ఉండటంతో ఏదో గడ్డ మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న భావన కలుగుతూ ఉంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. 

క్యాన్సర్ రకాలు

Types Of Cancers In Humans Symptoms Ways To Recognize - Sakshi

శరీరంలోని ఏదైనా ఒక కణం… నిరాటంకంగా, నిర్విరామంగా, నిరుపయోగంగా పెరుగుతూ పోయేదే క్యాన్సర్‌. అలా పెరిగాక రోగిని నిస్సత్తువగా చేసేస్తుంది. అలా ఓ పరిమితీ పాడూ లేకుండా అనారోగ్యకరంగా, అసాధారణమైన పెరిగే ఈ క్యాన్సర్‌ కణం మొదట ఒకే కణంతోనే మొదలవుతుంది. అది రెట్టింపు అయ్యే ప్రక్రియలో 20వ సారి రెట్టింపు అయ్యే సమయంలో ఒక మిలియన్‌ కణాలుగా వృద్ధిచెందుతుంది. మిలియన్‌ కణాల సముదాయంగా పెరిగిన ఆ సమయంలోనూ దాన్ని కనుక్కోవడం కష్టసాధ్యం. అదే 30వసారి రెట్టింపు అయ్యే సమయంలో అందులో బిలియన్‌ కణాలుంటాయి. ఆ సమయంలో దాన్ని ఓ గడ్డ (లంప్‌)లా గుర్తించడం సాధ్యం.

అంటే… చేత్తో గడ్డను తాకి గుర్తించే సమయంలో అందులో బిలియన్‌ కణాలుంటాయన్నమాట. ఇక 40వ సారి రెట్టింపయ్యాక అందులో ఒక ట్రిలియన్‌ కణాలుంటాయి. అప్పటికీ చికిత్స లభించక 42–43వ సారి రెట్టింపయినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. అన్ని రెట్టింపులు కాకముందే… అంటే కేవలం 20వ సారి రెట్టింపయ్యే లోపు కనుక్కోగలిగితే నయం చేసే అవకాశాలు  చాలా ఎక్కువే. మరి ఆ దశలో కనుక్కోవడం ఎలా? తల నుంచి మన దేహంలోని కింది భాగాల్లోని ఏదైనా అవయవంలో క్యాన్సర్‌ను ముందే ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం. క్యాన్సర్‌ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారిపోతాయి. అయితే క్యాన్సర్‌ రోగులందరిలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ కనిపించేవి కావడంతో వాటిని గుర్తించడం కష్టం.  

క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొన్ని సాధారణ అంశాలు… 

  • ఆకలి తగ్గడం
  • కారణం తెలియకుండా / ఏ కారణమూ లేకుండా బరువు తగ్గడం
  • ఎడతెరిపి లేకుండా దగ్గు 
  • లింఫ్‌ గ్లాండ్స్‌ (బాహుమూలాల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు
  • (కొన్నిసార్లు కొన్ని అవయవాలలో మాత్రమే) అవయవాలనుంచి రక్తస్రావం… 

ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌వే కానక్కర్లేదు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత కూడా, అదేపనిగా కనిపిస్తున్నప్పుడు మాత్రం ఒకసారి డాక్టర్‌చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్‌ కాదని నిర్ధారణ చేసుకొని నిశ్చింతగా ఉండాలి.  తల నుంచి శరీరం కింది భాగం వరకు ఆయా అవయవభాగాల్లో తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొన్ని ప్రాథమిక లక్షణాలివి… 

బ్రెయిన్‌ క్యాన్సర్‌… 
తలనొప్పి, అకస్మాత్తుగా మతిమరపు రావడం, కొన్నిసార్లు సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాట్లాడటానికీ, దృష్టికీ, వినికిడి కీ, కాళ్లూచేతుల కదలిక ల నియంత్రణకు… ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్‌) ఉంటాయన్న విషయం తెలిసిందే. క్యాన్సర్‌ అభివృద్ధి చెందిన సెంటర్‌ దేనికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇవీ ఆయా అవయవాలకు సంబంధించి తొలిదశలో క్యాన్సర్‌కు లక్షణాలు.  

గొంతు భాగంలో… 
దీన్ని ఓరో ఫ్యారింజియల్‌ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఇరుక్కుని ఉన్న భావన ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడంలో ఇబ్బంది. 

కడుపు (స్టమక్‌)లో… 
అదే కడుపు (స్టమక్‌)లో అయితే మంట పుడుతున్నట్లుగా ఉండే నొప్పి. పొట్టలో మంట. కొన్నిసార్లు పొట్టలో రక్తస్రావం అయినప్పుడు ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతో పాటు కొన్ని సార్లు కొద్దిగా తినీతినగానే కడుపునిండిపోయిన ఫీలింగ్‌. 

తల భాగంలో… 
ఈ క్యాన్సర్స్‌ నోటిలో, దడవ మీద, నాలుక మీద లేదా చిగుళ్లు (జింజివా) మీదా ఇలా తలభాగంలో ఎక్కడైనా రావచ్చు. ఆయా భాగాల్లో ఎరుపు, తెలుపు రంగుల ప్యాచెస్‌ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్‌ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది. ఇక స్వరపేటిక ప్రాంతంలో అయితే స్వరంలో మార్పు. మెడ దగ్గరి లింఫ్‌ గ్రంధుల వాపు. 

సర్విక్స్‌ క్యాన్సర్‌… 
దక్షిణ భారతదేశంలోని తీరప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్‌ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్‌) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్‌ తర్వాత రక్తస్రావం (పోస్ట్‌ కాయిటల్‌ బ్లీడింగ్‌), ఎరుపు, తెలుపు డిశ్చార్జీ వంటివి దీని లక్షణాలు. 

రొమ్ము క్యాన్సర్‌… 
మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ రకం క్యాన్సర్‌లో… రొమ్ములో ఓ గడ్డ చేతికి తగలడం, రొమ్ము పరిమాణంలో మార్పు, రొమ్ము మీది చర్మం ముడతలు పడటం, రొమ్ము చివర (నిపిల్‌) నుంచి రక్తంతో కలిసిన స్రావం లాంటివి రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలు. 

ఊపిరితిత్తులు…  
పొగతాగేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువ.  ఈ క్యాన్సర్‌ ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లెలో రక్తం పడటం వంటì  లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్‌–రే, సీటీ స్కాన్‌ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. 

రెక్టమ్‌ క్యాన్సర్‌లో… 
మలద్వారం (రెక్టమ్‌) క్యాన్సర్‌ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న అనుభూతి ఉంటుంది. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. దాంతో దాన్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్‌ ఓ గడ్డలా ఉండటంతో ఏదో గడ్డ మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న భావన కలుగుతూ ఉంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. 

ఒవేరియన్‌ క్యాన్సర్‌… 
దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కింది భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి క్యాన్సర్‌ వస్తే ఒక్కోసారి ఏ లక్షణాలూ కనిపించకుండానే ప్రమాదకరంగా పరిణమించవచ్చు. 

టెస్టిస్‌ క్యాన్సర్‌… 
పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్‌లో వృషణాల సైజ్‌ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడటం వల్ల పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు ఎక్కువ. 

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌… 
సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన పురుషుల్లో తరచూ కనిపించే క్యాన్సర్‌ ఇది. దాదాపు లక్షణాలు ఏవీ పెద్దగా కనిపించకుండా వచ్చే ఈ క్యాన్సర్‌లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉండవచ్చు. పీఎస్‌ఏ అనే పరీక్ష ద్వారా దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు. 

కిడ్నీ అండ్‌ బ్లాడర్‌ క్యాన్సర్స్‌..
మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం. 

చర్మ క్యాన్సర్‌… 
చర్మ క్యాన్సర్‌ను ఏ,బీ,సీ,డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే… ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే… బార్డర్‌ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్‌ రంగు మారినా, డీ అంటే డయామీటర్‌… అంటే వ్యాసం (సైజు) పెరిగినా దాన్ని చర్మం క్యాన్సర్‌ లక్షణాలుగా భావించవచ్చు. 

కొంతమందిలో తమ తాత తండ్రుల్లో, పిన్ని వంటి దగ్గరి సంబంధీకుల్లో క్యాన్సర్‌ ఉన్నప్పుడూ, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్‌ వంటి అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారూ… ఇక జన్యుపరంగా అంటే… జీరోడెర్మా, న్యూరోఫైబ్రమాటోసిస్‌ వంటి  వ్యాధులున్నవారిలో క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హైరిస్క్‌ వ్యక్తులంతా మిగతావారికంటే మరింత అప్రమత్తంగా ఉంటూ, మరింత ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించాలి. 

అందరూ గమనించాల్సిన అంశం ఏమిటంటే… ఇక్కడ ప్రస్తావించిన లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించినవే అని ఆందోళన వద్దు. కాకపోతే తొలిదశలో తేలిగ్గా గుర్తిస్తే క్యాన్సర్‌ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. అందుకే ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా ఒకసారి డాక్టర్ల సూచన మేరకు పరీక్ష చేయించుకోవాలి.ఇక అది క్యాన్సర్‌ కాదని నిర్ధరించుకొని నిశ్చింతగా, నిర్భయంగా ఉండండి. 

బ్లడ్‌ క్యాన్సర్స్‌… 
రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి… బ్లడ్‌ క్యాన్సర్‌ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద పొడలా (పర్ప్యూరిక్‌ ప్యాచెస్‌) రావడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్‌ క్యాన్సర్‌ లక్షణాలు. లింఫ్‌ గ్లాండ్స్‌ అన్నవి బాహుమూలాల్లో, దవడల కింది భాగంలో మెడకు ఇరువైపులా, గజ్జెల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్‌ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు. 

Lung Cancer / ఊపిరితిత్తుల కేన్సర్

భోజనం చేయకుండా కొద్దిరోజులు జీవించొచ్చు. నీళ్లు తాగకుండా కొన్ని గంటలు గడపొచ్చు. కానీ శ్వాస తీసుకోకుండా ఒక్క క్షణమైనా నిలవలేం. మన ప్రాణాలు నిలబడటానికి అత్యవసరమైన ఆక్సిజన్‌ అందటం నిమిషం ఆలస్యమైనా ఉక్కిరిబిక్కిరైపోతాం. కాబట్టే వూపిరితిత్తులకు అంతటి ప్రాధాన్యం. ఇవి ప్రకృతి నుంచి లభించే ఆక్సిజన్‌ను శ్వాస ద్వారా లోపలికి తీసుకుంటూ.. దాన్ని రక్తం ద్వారా అన్ని కణాలకు సరఫరా అయ్యేలా చేస్తూ.. అవసరం లేని కార్బన్‌ డయాక్సైడ్‌ను బయటికి పంపిస్తూ.. మన జీవం, జీవితం సజావుగా సాగటానికి నిరంతరం అలుపెరగకుండా పనిచేస్తుంటాయి. ఇలాంటి వూపిరితిత్తుల్లో ఏ చిన్న సమస్య తలెత్తినా ఇబ్బందే. అలాంటిది అనుక్షణం శరీరాన్ని కబళిస్తూ.. అహరహం నిర్వీర్యం చేసే క్యాన్సర్‌ ముంచుకొస్తే? పచ్చగా కళకళలాడే చెట్టుకు చీడ సోకితే వాడిపోయినట్టుగానే.. మనకు వూపిరిని అందించే తిత్తులూ వాడిపోవటం మొదలెడతాయి. పైగా వూపిరితిత్తుల క్యాన్సర్‌తో ముప్పేటంటే.. నూటికి 80% మందిలో ఇది బాగా ముదిరిన తర్వాతే బయటపడటం. దీంతో నయం కావటం అటుంచి.. అదుపులో పెట్టుకోవటమే కష్టమవుతోంది. ఒకప్పటి కన్నా ఇప్పుడు మంచి చికిత్సలు అందుబాటులోకి వచ్చినా.. ఇంకా ఇది కొరకరాని కొయ్యగానే సవాల్‌ చేస్తోంది. వూపిరితిత్తుల క్యాన్సర్‌ ఎందుకొస్తుందో కచ్చితంగా తెలియదు. ఎవరికి వస్తుందో తెలియదు. కానీ రావటానికి దోహదం చేసే కొన్ని కారణాలను మాత్రం మనం తప్పకుండా నిలువరించుకోవచ్చు.

This image has an empty alt attribute; its file name is samayam-telugu.jpg

మన ప్రాణానికి, జీవానికి శ్వాస అత్యంత కీలకం. గుండె కొట్టుకోవటం వంటి ఇతర ప్రక్రియలు సజావుగా జరుగుతున్నా.. శ్వాస సరిగా సాగకపోతే శరీరం వెంటనే కుప్పకూలుతుంది. తగినంత ఆక్సిజన్‌ అందక కణాలన్నీ చేతులెత్తేస్తాయి. కాబట్టే వూపిరితిత్తులకు ఎలాంటి సమస్య వచ్చినా భరించటం కష్టం. ఇక క్యాన్సర్‌ వంటి తీవ్ర సమస్యలు ముంచుకొస్తే జీవితం మరింత నరకప్రాయంగా మారుతుంది. మనదేశంలో అతి ఎక్కువగా కనబడే ఐదు రకాల క్యాన్సర్లలో వూపిరితిత్తుల క్యాన్సర్‌ ఒకటి. ఒకప్పుడు పురుషుల్లో నోటి క్యాన్సర్‌, గొంతు క్యాన్సర్‌, జీర్ణాశయ క్యాన్సర్లు ఎక్కువగా కనబడుతుండేవి. ఇప్పుడు వూపిరితిత్తుల క్యాన్సర్‌ వీటన్నింటినీ అధిగమించి ప్రథమ స్థానాన్ని ఆక్రమించేసింది. స్త్రీలు, పురుషులు..
ఇద్దరినీ పరిగణనలోకి తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌ తర్వాత రెండో స్థానం కూడా దీనిదే కావటం గమనార్హం. మనదేశంలో కొత్తగా బయటపడుతున్న క్యాన్సర్‌ కేసుల్లో 6.9% కేసులు వూపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించినవే. క్యాన్సర్ల మూలంగా చనిపోతున్న వారిలో 9.3% మంది వూపిరితిత్తుల క్యాన్సర్‌ బాధితులే. అయినా కూడా మన సమాజంలో దీనిపై చాలామందికి అవగాహన ఉండటం లేదు. దీనిలోనూ క్షయ మాదిరి లక్షణాలు కనబడుతుండటం పొరబడటానికి దారితీస్తోంది. క్షయకు చికిత్స తీసుకుంటున్నా కూడా లక్షణాలు తగ్గుముఖం పట్టకపోయిన సందర్భాల్లోనూ క్యాన్సర్‌ను అనుమానించటం లేదు. అలాగే విచ్చలవిడిగా పెరిగిపోతున్న పొగాకు అలవాట్లు, వాయు కాలుష్యం వంటివీ వూపిరితిత్తుల క్యాన్సర్‌కు ఆజ్యం పోస్తున్నాయి.

iStock-1168178985

లక్షణాలేంటి?
వూపిరితిత్తులకు మాత్రమే పరిమితమైన కణితులు, ఇతర భాగాలకు విస్తరించిన కణితులను బట్టి వేర్వేరు లక్షణాలు కనబడుతుంటాయి.
* విడవకుండా దగ్గు
* శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది
* కళ్లెలో రక్తం పడటం
* బరువు తగ్గటం
* ఆకలి తగ్గిపోవటం
* గొంతు బొంగురు పోవటం
* ముద్ద మింగటంలో ఇబ్బంది
* ఆయాసం
* బ్రాంకైటిస్‌, న్యుమోనియా
* జ్వరం
* నిస్సత్తువ
* కామెర్లు
* తలనొప్పి, వాంతి
* నాడీ సమస్యలు

1. ప్రపంచవ్యాప్తం గా చాలా మంది బాధ పడేది లంగ్ కాన్సర్ తోటే.
2. భారత దేశం లో ఎక్కువ మంది చనిపోయేది లంగ్ కాన్సర్ తోనే.
3. లంగ్ కాన్సర్ లక్షణాలు తొందరగా బయటపడవు. అంటే, లేటర్ స్టేజెస్ లో తప్ప కాన్సర్ ఉందని కూడా తెలియదు.

4. ఆగకుండా వచ్చే దగ్గు లంగ్ కాన్సర్ కి ఒక లక్షణం. ఈ దగ్గు ఎక్కువౌతూ ఉంటుంది.
5. లంగ్స్ పై భాగం లో ఉండే ట్యూమర్ వలన ముఖానికి సంబంధించిన నరాలు ఎఫెక్ట్ అవుతాయి. అందువల్ల కను రెప్పలు వాలిపోవడం, ముఖంలో ఒక వైపు చెమట పట్టకపోవడం లాంటివి జరుగుతాయి.
6. స్మోకింగ్ లంగ్ కాన్సర్ కి ప్రధాన కారణం. లంగ్ కాన్సర్ వల్ల చనిపోయేవారిలో ఎనభై శాతం మందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది.
7. ఒకప్పుడు స్మోకింగ్ అలవాటు ఉన్న వారు మానేసిన పదిహేను సంవత్సరాల వరకూ ఏడాదికోసారి స్క్రీంగ్ చేయించుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

8. సెకండ్ హాండ్ స్మోక్ కి ఎక్స్పోజ్ అయిన వారికి కూడా లంగ్ కాన్సర్ వచ్చే రిస్క్ ఉంది.
9. చాలా సంవత్సరాలు స్మోక్ చేసినా సరే, మానేయడం వల్ల లంగ్ కాన్సర్ వచ్చే రిస్క్ బాగా తగ్గుతుంది.
10. లంగ్ కాన్సర్ కి రెండవ కారణం రాడాన్ గాస్. ఇది సహజం గా ఉండే గాస్. దీనిని రెగ్యులర్ గా పీల్చడం వలన కూడా లంగ్ కాన్సర్ రిస్క్ ఎక్కువౌతుంది.
11. వయసు పెరుగుతున్న కొద్దీ లంగ్ కాన్సర్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది.
12. లంగ్ కాన్సర్ ని డయాగ్నోస్ చేయడానికి ఎక్స్-రే కానీ, సీటీ స్కాన్ కానీ తీస్తారు. లంగ్స్ లో మాస్ ఉందని తేలితే బయాప్సీ ద్వారా నిర్ధారిస్తారు.

13. ఆ ట్యూమర్ మీద జెనెటిక్ టెస్ట్స్ చేస్తారు. దీని వల్ల టార్గెటెడ్ థెరపీ కి అవకాశం ఉంటుంది.
14. లంగ్ కాన్సర్ కి కీమోథెరపీ, సర్జరీ, రేదియేషన్ థెరిపీ, రేడియో సర్జరీ వంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి.
15. సర్జరీ చేసినప్పుడు ట్యూమర్ ని మాత్రమే తీసేసే అవకాశం ఉంటుంది. కానీ, ట్యూమర్ చెస్ట్ కి దగ్గరగా ఉన్నప్పుడు మొత్తం లంగ్ ని తీసేయాల్సి రావచ్చు.
16. నాన్-స్మాల్ సెల్ లంగ్ కాన్సర్ ని ట్రీట్ చేయడంలో ఇమ్యూనోథెరపీ కూడా వాడతారు. కాన్సర్ సెల్స్ తో పోరాడే టీ సెల్స్ ని కార్న్సర్ సెల్స్ అడ్డుకుంటాయి. ఇమ్యూనోథెరపీ అలా అడ్డుకోకుండా చేస్తుంది.

17. లంగ్ కాన్సర్ లో మూడు రకాలున్నాయి. నాన్-స్మాల్ సెల్, స్మాల్ సెల్, లంగ్ కార్సినాయిడ్ ట్యూమర్. లంగ్ కాన్సర్ ఉన్న వారిలో ఎనభై ఐదు శాతం మంది నాన్-స్మాల్ సెల్ కాన్సర్ ఉన్న వారే.
18. లంగ్ కాన్సర్ ఉన్న వారిలో ఐదు శాతం కంటే తక్కువ మందికి లంగ్ కార్సినాయిడ్ ట్యూమర్ ఉంటుంది.
19. నాన్-స్మాల్ సెల్ లంగ్ కాన్సర్ కి నాలుగు స్టేజెస్ ఉంటాయి. మొదటి స్టేజ్ లో కాన్సర్ కేవలం లంగ్స్ లోనే ఉంటుంది. నాలుగవ స్టేజ్ లో రెండు లంగ్స్ కీ, లంగ్స్ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ కీ, ఇతర అవయవాలకీ పాకుతుంది.
20. స్మాల్ సెల్ కాన్సర్ కి రెండు దశలుంటాయి. ఫస్ట్ స్టేజ్ లొ ఒక లంగ్ మాత్రమే ఎఫెక్ట్ అయి ఉంటుంది. లేదా దగ్గరలో ఉన్న లింఫ్ నోడ్స్ కి కూడా చేరి ఉంటుంది. సెకండ్ స్టేజ్ లో రెండవ లంగ్ కీ, లంగ్స్ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ కీ, ఇతర అవయవాలకీ కూడా చేరుతుంది.
21. కొలోన్, బ్రెస్ట్, ప్రోస్టేట్ కాన్సర్ వల్ల సంభవించే మరణాలన్నింటి కంటే కూడా లంగ్ కాన్సర్ ఒక్క దాని వల్ల సంభవించే మరణాలు ఎక్కువ.
22. లంగ్ కాన్సర్ నుండి స్త్రీలు, చిన్న వయసులో ఉన్నవారు తొందరగా కోలుకోగలరు.
23. లంగ్ కాన్సర్ లంగ్స్ దగ్గరే ఉన్నప్పుడు కనుక్కోగలిగితే ఐదేళ్లలో 55% సర్వైవల్ రేట్ ఉంటుంది.
24. లంగ్ కాన్సర్ ఇతర అవయవాలకి స్ప్రెడ్ అయితే ఐదేళ్ళలో నాలు శాతం సర్వైవల్ రేట్ మాత్రమే ఉంటుంది.
25. ఆగస్ట్ ఒకటిన వరల్డ్ లంగ్ కాన్సర్ డే ని జరుపుతారు.

దశలను బట్టి చికిత్స
వూపిరితిత్తుల క్యాన్సర్‌లో ఆయా దశలను బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ, టార్గెటెడ్‌ థెరపీ, ఇమ్యూనో థెరపీల్లో ఎవరికి, ఏది పనికొస్తుందనేది నిర్ణయిస్తారు.
1, 2 దశల్లో..
* మొదటి, రెండో దశ కణితులకు శస్త్రచికిత్స ఉత్తమమైన పద్ధతి. ఇందులో కణితి ఏర్పడిన భాగాన్ని పూర్తిగా తొలగిస్తారు. అవసరమైతే ఒక భాగాన్ని (లోబ్‌), ఒక వూపిరితిత్తి మొత్తాన్ని కూడా తొలగించాల్సి రావొచ్చు. శస్త్రచికిత్సతో కణితిని తొలగించినప్పటికీ.. కంటికి కనిపించని అతి సూక్ష్మమైన క్యాన్సర్‌ కణాలు ఛాతీలోనో, మరెక్కడో ఇంకా లోపలే ఉండిపోవచ్చు. ఇవి పెట్‌ స్కాన్‌లోనూ కనబడనంత చిన్నగానూ ఉండొచ్చు. ఒకవేళ క్యాన్సర్‌ కణాలు లోపల మిగిలిపోతే జబ్బు తిరగబెట్టే ప్రమాదముంది. అందువల్ల బయటకు తీసిన కణితిని పరిశీలించి.. జబ్బు తిరగబెట్టే అవకాశం ఎంత వరకు ఉందనేది అంచనా వేస్తారు. తిరగబెట్టే అవకాశం ఉంటే కీమో థెరపీ, రేడియో థెరపీ చేయాల్సి ఉంటుంది. కణితిని పూర్తిగా తొలగించటం సాధ్యం కానప్పుడు కొంత భాగం లోపలే వదిలేస్తుంటారు. ఇలాంటి వారికి కీమోతో పాటు రేడియోథెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
3వ దశలో..
* వీరికి ఒకే సమయంలో కీమోథెరపీ, రేడియోథెరపీ చేయాల్సి ఉంటుంది. కొందరికి శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావొచ్చు. కణితి ఏర్పడిన చోటు, సైజు, లింఫ్‌ గ్రంథుల ఉబ్బు వంటి వాటిని బట్టి దీన్ని నిర్ణయిస్తారు. అయితే మూడో దశలో చికిత్స చేసినా క్యాన్సర్‌ నయమయ్యే అవకాశం 30% మాత్రమే. 70% మందిలో జబ్బు పూర్తిగా తగ్గకపోవచ్చు. ఒకవేళ తగ్గినా మళ్లీ తిరగబెట్టొచ్చు. 4వ దశలో..
* నాలుగో దశలో క్యాన్సర్‌ నయం కావటం దాదాపు అసాధ్యం. అందువల్ల రోగికి ఇతరత్రా సమస్యలేవీ లేకుండా.. బతికినంతకాలం ఇంట్లో హాయిగా జీవించేలా చూసేందుకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయంలో ‘టార్గెటెడ్‌ థెరపీ’ బాగా ఉపయోగపడుతుంది. కీమోథెరపీ క్యాన్సర్‌ కణాల మీదే కాదు. ఇతర కణాలపైనా ప్రభావం చూపుతుంది. దీంతో జుట్టు రాలటం, వాంతులు, రక్తకణాలు తగ్గటం, రోగనిరోధకశక్తి క్షీణించటం వంటి దుష్ఫలితాలు తలెత్తొచ్చు. అంటే చికిత్సతో ఒనగూడే ప్రయోజనం కన్నా సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదముంది. కాబట్టి వీరికి టార్గెటెడ్‌ థెరపీయే మంచిది. ఇందులో క్యాన్సర్‌ వృద్ధి చెందటానికి కారణమవుతున్న ప్రోటీన్‌ను గుర్తించి, అది పనిచేయకుండా చేసే మాత్రలు ఇస్తారు. వీటిని వేసుకుంటూ రోజువారీ పనులన్నీ చేసుకోవచ్చు. రెండు వారాల్లో దీని ప్రభావం కనబడుతుంది. పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు. క్యాన్సర్‌ వృద్ధికి దోహదం చేస్తున్న ప్రోటీన్ల వంటివి కనబడనివారికి కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది.
* రోగనిరోధకవ్యవస్థను ప్రేరేపించి క్యాన్సర్‌ కణాలను నిర్వీర్యం చేసే ‘ఇమ్యూనోథెరపీ’ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఇది గతి తప్పిన కణాలను గుర్తించే, వాటిని నిర్వీర్యం చేసే యంత్రాంగాలను తిరిగి ప్రేరేపితం చేస్తూ.. క్యాన్సర్‌ కణాలను చంపుతుంది.
జీవనకాలం మెరుగు టార్గెటెడ్‌, ఇమ్యూనోథెరపీలు ఆయా రకాలకు, వ్యక్తులకు అనుగుణంగా చికిత్స చేయటానికి బాగా తోడ్పడతాయి. వీటి ద్వారా 60% మందికి కీమోథెరపీని తప్పించే అవకాశముంది. ఇవి చాలాకాలం పనిచేస్తాయి కూడా. వీటి రాకతో జీవనకాలం గణనీయంగా పెరిగింది. గతంలో వూపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడితే ఆరు నెలల కన్నా ఎక్కువకాలం జీవించేవారు కాదు. ఇప్పుడు దాదాపు 25% మంది ఐదేళ్లకు పైగా జీవిస్తున్నారు! అయితే ఏదో ఒక చికిత్సకు మాత్రమే సరిపోయేవారి కన్నా అన్ని రకాల చికిత్సలకు అనుగుణంగా ఉన్నవారు ఎక్కువకాలం జీవించే అవకాశముంటుంది.
క్షయకు దగ్గరి పోలిక వూపిరితిత్తుల క్యాన్సర్‌, క్షయ..రెండింట్లోనూ దగ్గు, ఆయాసం, బరువు, ఆకలి తగ్గటం, జ్వరం వంటి లక్షణాలు కనబడుతుంటాయి. దీంతో వీటి మధ్య తేడాను గుర్తించటం చాలా కష్టమవుతోంది. వూపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్స కోసం వచ్చేవారిలో క్షయ చికిత్స తీసుకొని, ఇంకా దగ్గు తగ్గలేదని వచ్చేవారు దాదాపు 15-50% మంది కనబడుతుంటారు. అప్పటికే వీరిలో క్యాన్సర్‌ ముదిరిపోయి ఉంటుంది. అందువల్ల వీలైనంత త్వరగా వీటి మధ్య తేడాను గుర్తించటం చాలా అవసరం. సాధారణంగా క్షయ చికిత్స ఆరంభించిన మూడు, నాలుగు వారాల్లో లక్షణాలు తగ్గుముఖం పట్టాలి. ఆరోగ్యమూ కాస్త మెరుగవ్వాలి. లేకపోతే వెంటనే అప్రమత్తం కావాలి. ఎక్స్‌రే, సీటీస్కాన్‌.. అవసరమైతే బయాప్సీ చేసి వూపిరితిత్తుల క్యాన్సర్‌ ఉందేమో చూడాలి.
ఆలస్యమే.. పెద్ద సమస్య
వూపిరితిత్తుల క్యాన్సర్‌తో పెద్ద చిక్కటేంటంటే చాలా ఆలస్యంగా బయటపడుతుండటం. వూపిరితిత్తి పెద్ద అవయం. దీనిలో కణితి తలెత్తినా కూడా.. అది కీలకమైన భాగాలకు తగిలేంత వరకూ ఎలాంటి లక్షణాలు కనబడవు. అందువల్ల వూపిరితిత్తుల క్యాన్సర్‌ బయటపడేసరికే ముదిరిపోయి ఉంటోంది. ఇతరత్రా జబ్బుల్లో చేసే పరీక్షల్లో యాదృచ్ఛికంగా బయటపడటం తప్పించి.. తొలి దశలో వూపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించటం చాలా అరుదు. సుమారు 70-80% మందిలో ఇది మూడు, నాలుగు దశల్లోనే బయటపడుతోంది. దీన్ని ఒకటో దశలోనే గుర్తించి శస్త్రచికిత్స చేయగలిగితే 90% వరకు నయం చేయొచ్చు. రెండో దశలో 70% వరకు నయం కావొచ్చు. అదే మూడో దశలో నయమయ్యే అవకాశం 30 శాతానికి పడిపోతుంది. ఇక నాలుగో దశలోనైతే నయం కావటం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి.
నివారణ కీలకం
వూపిరితిత్తుల క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించటం కష్టం. అందుకే అమెరికా వంటి దేశాల్లో వూపిరితిత్తుల క్యాన్సర్‌కు ముందస్తు పరీక్షలు చేస్తున్నారు. 55 ఏళ్లు పైబడి.. 20 ఏళ్లకు పైగా పొగ తాగే అలవాటున్నవారికి ఏడాదికి ఒకసారి తక్కువ మోతాదు సీటీస్కాన్‌ పరీక్ష చేస్తున్నారు. కానీ మనదేశంలో ఇదంత సులువైన పని కాదు. అందువల్ల నివారణ మీదే దృష్టి పెట్టటం చాలా అవసరం. క్యాన్సర్‌కు దారితీసే పొగాకు జోలికి వెళ్లకపోవటం అన్నింటికన్నా మంచిది. ఒకవేళ పొగ తాగటం, పొగాకు నమలటం అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మద్యం పరిమితం చేసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అధికబరువు, వూబకాయాన్ని తగ్గించుకోవాలి. పరీక్షలు: మూడు ప్రధానం
వూపిరితిత్తుల క్యాన్సర్‌ను నిర్ధరిచటంతో పాటు అది ఏ దశలో ఉందనేది గుర్తించటమూ చాలా అవసరం. ఎలాంటి చికిత్స చేయాలనేది దీని దశల ఆధారంగానే నిర్ణయిస్తారు. ఇందుకు ప్రధానంగా మూడు రకాల పరీక్షలు తోడ్పడతాయి.
* ఎక్స్‌రే: వూపిరితిత్తుల క్యాన్సర్‌ను అనుమానిస్తే ముందు ఎక్స్‌రే తీస్తారు. కణితి నీడ ఏదైనా ఉంటే బయటపడుతుంది. నీరు చేరిందా? ఛాతీలో గుండె సరైన స్థానంలో ఉందా? శ్వాసనాళం ఎలా ఉంది? అనేవీ ఇందులో తెలుస్తుంది.
* సీటీ స్కాన్‌: క్యాన్సర్‌ ఉన్నట్టు అనుమానిస్తే, లక్షణాలు కూడా అనుగుణంగానే కనబడుతుంటే సీటీ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. కణితి ఉంటే ఇందులో స్పష్టంగా బయటపడుతుంది.
* బయాప్సీ: కణితి ఉన్నట్టు తేలితే దాన్నుంచి చిన్న ముక్కను బయటకు తీసి (బయాప్సీ) పరీక్షిస్తారు. దీంతో క్యాన్సర్‌ నిర్ధరణ కావటమే కాదు, అది ఏ రకానికి (స్మాల్‌ సెల్‌, నాన్‌ స్మాల్‌ సెల్‌) చెందినదనేదీ తెలుస్తుంది.
* ఇతర పరీక్షలు: అవసరమైతే ఇతరత్రా వివరాల కోసం మరోసారి సీటీ స్కాన్‌, ఎముక స్కాన్‌, పెట్‌ స్కాన్‌ వంటివి చేస్తారు. దీంతో క్యాన్సర్‌ ఏ దశలో ఉంది, ఎక్కడెక్కడికి విస్తరించిందనేది బయటపడుతుంది.
నాలుగు దశలు
వూపిరితిత్తుల క్యాన్సర్‌ 4 దశలుగా కనబడుతుంది.
* స్టేజ్‌ 1: కణితి కేవలం ఒక వూపిరితిత్తిలోనే ఏర్పడటం. లింఫ్‌ గ్రంథులకు విస్తరించకపోవటం.
* స్టేజ్‌ 2: కణితి లింఫ్‌ గ్రంథులకు విస్తరించటం.
* స్టేజ్‌ 3: ప్రధాన శ్వాసనాళం చుట్టూరా ఉండే లింఫ్‌ గ్రంథులకు, ఛాతీ గోడకు, డయాఫ్రంకు కణితి విస్తరించటం.
* స్టేజ్‌ 4: వూపిరితిత్తుల్లో, గుండె చుట్టూ నీరు చేరటం.. కణితి ఇతర భాగాలకు విస్తరించటం.

ఇప్పుడు లంగ్ కాన్సర్ గురించిన కొన్ని అపోహలను చూద్దాం.

1. మీరు స్మోక్ చేయకపోతే మీకు లంగ్ కాన్సర్ రాదు.

లంగ్ కాన్సర్ కి ప్రధాన కారణం స్మోకింగ్ అన్నది నిజమే. కానీ, రాడాన్, ఆస్బెస్టాస్, హానికరమైన కెమికల్స్, ఎయిర్ పొల్యూషన్, సెకండ్ హాండ్ స్మోక్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా లంగ్ కాన్సర్ రావచ్చు. ఫ్యామిలీ లో ఎవరికైనా లంగ్ కాన్సర్ ఉంటే కూడా లంగ్ కాన్సర్ రావచ్చు. ఒక్కొక్కసారి ఎలాంటి రిస్క్ ఫాక్టర్స్ లేకుండా కూడా లంగ్ కాన్సర్ రావచ్చు.

2. మీరు ఒకప్పుడు స్మోక్ చేసి ఉంటే ఇప్పుడు మానేసినా కూడా లంగ్ కాన్సర్ రిస్క్ తగ్గదు.

చాలా సంవత్సరాలు స్మోక్ చేసినా కూడా ఒకసారి మానేసిన తరువాత లంగ్ కాన్సర్ ముప్పు తగ్గుతూ వస్తుంది. లంగ్స్ కి కొంత పర్మనెంట్ డామేజ్ జరిగినా సరే, స్మోకింగ్ మానేయడం వల్ల ఇంకా డామేజ్ జరగకుండా ఉంటుంది. లంగ్ కాన్సర్ తో డయాగ్నోజ్ అయిన తరువాత స్మోకింగ్ మానేసినా సరే, ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అయ్యే చాన్సెస్ పెరుగుతాయి. ఒకప్పుడు స్మోక్ చెసి ఇప్పుడు మానేసి ఉంటే మాత్రం రెగ్యులర్ గా స్క్రీంగ్ చేయించుకోవడం అవసరం.

3. లంగ్ కాన్సర్ ప్రాణాంతకమైనది

లంగ్ కాన్సర్ కి ఎర్లీ స్టేజెస్ లో ఎలాంటి లక్షణాలు ఉండకపోవడంతో దాన్ని తొందరగా కనుక్కోలేం కాబట్టి ఈ వ్యాధి ప్రాణాంతకం గా మారుతుంది. ఒకవేళ కాన్సర్ ని ఎర్లీ స్టేజెస్ లో కనుక్కోవడం కుదిరితే దాన్ని పూర్తిగా నయం చేయవచ్చు. ఒకవేళ నయం చేయలేకపోతే ట్రీట్మెంట్ వల్ల జీవితకాలం పెరుగుతుంది. రిస్క్ ఫాక్టర్స్ ఉన్న వారు స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండడం మంచిది. దగ్గు తగ్గకుండా పెరుగుతూ ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిది.

4. లంగ్ కాన్సర్ ని ఎయిర్ కి ఎక్స్పోజ్ చేసినా, సర్జరీ టైంలో కట్ చేసినా కాన్సర్ స్ప్రెడ్ అవుతుంది. లంగ్ కాన్సర్ లంగ్స్ లో మిగిలిన భాగాలకీ, లింఫ్ నోడ్స్ కీ, ఇతర అవయవాలకి కూడా పాకుతుంది. అయితే, సర్జరీ వల్ల ఎలాంటి కాన్సర్ అయినా సరే స్ప్రెడ్ అవ్వడం అనేది జరగదు. ఎర్లీ స్టేజ్ లో ఉన్న లంగ్ కాన్సర్ ని సర్జరీ క్యూర్ చేయగలుగుతుంది కూడా.

5. లంగ్ కాన్సర్ వయసులో పెద్ద వారికి మాత్రమే వస్తుంది.

అరవై సంవత్సరాలు దాటినా వారికి లంగ్ కాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. అంత మాత్రాన అరవై లోపు ఉన్న వారికి రాదు అని చెప్పలేం. రిస్క్ ఫాక్టర్స్ ని బట్టి లంగ్ కాన్సర్ వచ్చే ముప్పు కూడా ఉంటుంది.

Chemotheraphy / కీమోథెరపీ

క్యాన్సర్ చికిత్సలో కీలకంగా నిలిచే కీమోథెరపీకి చాలా దుష్ప్రభావాలు తలెత్తుతాయి. ముందు జుట్టు రాలిపోతుంది. నోరు పూచిపోతుంది. గుక్క తిప్పుకోనివ్వని వాంతులు. డీలా చేసే విరేచనాలు.. ఇలా ఎన్నో ఎదురవ్వచ్చు. ఇవి అనివార్యమే అయినా.. వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు నేటి అత్యాధునిక వైద్యరంగం ఎన్నో మార్గాలను కనుగొంది.
క్యాన్సర్ కణితిని తుదముట్టించేందుకు ప్రధానంగా మూడు చికిత్సా విధానాలున్నాయి. వీలైనంత వరకూ సర్జరీ చేసి ఆ కణితిని తొలగించెయ్యటం ఒక విధానం. రేడియేషన్ కిరణాలతో కణితిపై దాడి చేసి దాన్ని ఛిద్రం చెయ్యటం మరో విధానం. ఈ సర్జరీ, రేడియేషన్ థెరపీలే కాకుండా.. మందులతో క్యాన్సర్ కణితినీ.. ఒంట్లోని క్యాన్సర్ కణాలనూ తుదముట్టించి వాటిని మట్టుబెట్టటం మరో కీలక మార్గం. దీన్నే ‘కీమోథెరపీ’ అంటారు. ఈ కీమోథెరపీలో భాగంగా లోనికి ఇచ్చేవి మందులే అయినప్పటికీ ఇవి మహా శక్తిమంతమైనవి. అత్యంత ప్రభావవంతమైనవి. క్యాన్సర్ కణాలపై ఇవి పెద్దఎత్తున దాడి చేస్తాయి. అయితే ఈ క్రమంలో ఇవి కొన్నిసార్లు ఒంట్లోని ఆరోగ్యవంతమైన కణాలనూ దెబ్బతీస్తాయి. అందుకే కీమోథెరపీ తీసుకుంటున్న సమయంలో అనివార్యంగానే కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతాయి. ఇలా ఏయే రకాల దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందో ముందే అవగాహన పెంచుకుంటే.. వాటిని అధిగమించటం చాలా తేలిక అవుతుంది.
ఎందుకిలా? అసలు క్యాన్సర్ కణాలను తుదముట్టించాల్సిన కీమోథెరపీ మందులు.. ఇలా సాధారణ, ఆరోగ్యవంతమైన కణాలనూ ఎందుకు దెబ్బతీస్తాయన్న అనుమానం సహజం. దీనికోసం క్యాన్సర్ కణాల స్వభావాన్ని కొద్దిగా అర్థం చేసుకోవటం అవసరం. సాధారణంగా మన శరీరంలోని కణాలన్నీ ఒక క్రమంలో విభజన చెందుతుంటాయి. కానీ కొన్ని కణాలు ఈ క్రమం తప్పి… విపరీతంగా విభజన చెందుతూ.. తామరతంపరగా తమ సంఖ్యను పెంచుకుంటూ.. అవే ఓ పెద్ద కణితిలా తయారవుతాయి. అవే క్యాన్సర్ కణాలు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా మనం ఇచ్చే కీమోథెరపీ మందులు.. ప్రధానంగా ఇలా వేగంగా విభజన చెందే కణాలను పట్టుకుని వాటిని చంపేస్తుంటాయి. అందుకే మన శరీరంలో వేగంగా విభజన చెందుతుండే ఇతరత్రా కణాలు కూడా కొంత వరకూ ఈ మందుల ప్రభావానికి లోనై దెబ్బతింటాయి. దుష్ప్రభావాలకు ఇదే మూలం. ఉదాహరణకు మన వెంట్రుకల కుదురులోని కణాలు చాలా వేగంగా విభజన చెందుతుంటాయి. అందుకే కీమోథెరపీ ఆరంభించగానే ఈ కణాలు దెబ్బతిని.. జుట్టు రాలిపోతుంది! అలాగే ఎముక మజ్జలోనూ రక్తకణాలు వేగంగా విభజన చెందుతుంటాయి. కాబట్టి కీమోథెరపీ ప్రభావం దాని మీదా ఉంటుంది. ఇలా వేగంగా విభజన చెందని కణాలు, అవయవాలపై కీమోథెరపీ ప్రభావం పెద్దగా ఉండదు. అందుకే దుష్ప్రభావాలను ఈ కోణం నుంచి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
దుష్ప్రభావాలు
జుట్టు రాలిపోవటం
కీమోథెరపీ ఆరంభించగానే చాలా ఎక్కువగా కనిపించే దుష్ప్రభావం ఈ జుట్టు రాలిపోవటం. కుప్పలుకుప్పలుగా జుట్టురాలిపోతుంటే తీవ్ర మనస్తాపానికీ, ఆందోళనకు గురవుతుంటారు. కానీ వాస్తవానికి ఇదేమంత పెద్ద సమస్య కాదు. చికిత్స పూర్తవగానే జుట్టు మళ్లీ వచ్చేస్తుంది. పైగా ఇటీవలికాలంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక మందులతో ఈ జుట్టు రాలిపోవటమన్న ఇబ్బందీ ఉండదు.
తిమ్మిర్లు: కీమోథెరపీ మందులు శరీరంలోని నాడులను కూడా కొద్దిగా ప్రభావితం చేస్తాయి. దీనివల్ల చేతులు, కాళ్లలో తిమ్మిర్లు మొదలవుతాయి. ఇది మరీ అంత ఎక్కువగా వేధించేది కాదుగానీ వైద్యులతో చర్చిస్తే దీనికీ చికిత్స సూచిస్తారు.
వాంతులు: చాలా ఎక్కువగా ఇబ్బందిపెట్టేది వాంతులు. ఎప్పుడూ వికారంగా అనిపించటం. నోరు చేదు, ఆకలి తగ్గిపోవటం, తినబుద్ధి కాకపోవటం.. కొద్దిగా తిన్నా జీర్ణం కాక.. రోజంతా కడుపు నిండినట్లుండటం. వీటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇప్పుడు మందులున్నాయి.
అరుదుగా: కీమోథెరపీ తీసుకునే క్యాన్సర్ బాధితుల్లో 2 శాతం మందికి గుండె కూడా దుష్ప్రభావానికి లోనవ్వచ్చు. కొందరిలో మూత్రపిండాలు, కాలేయం కూడా ప్రభావితం కావచ్చు. దుష్ప్రభావాలకూ చికిత్స ఉంది!
కీమోథెరపీ ఆరంభించగానే చాలామందిలో వికారం, వాంతులు మొదలవుతాయి. దీన్ని నివారించేందుకు అసలు కీమో మొదలుపెట్టక ముందే స్టిరాయిడ్స్ ఇస్తారు. దీనివల్ల వాంతుల సమస్య చాలా వరకూ తగ్గుతుంది. వాంతులు మరీ ఎక్కువ అయితే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చెయ్యాల్సి ఉంటుంది. కీమోథెరపీ వల్ల జీర్ణ సమస్యలూ కొన్ని తలెత్తుతాయి. ముఖ్యంగా గ్యాస్ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. అందుకని గ్యాస్ చేరకుండా, చేరినా తేలికగా బయటకు వచ్చేయటానికి కొన్ని రకాల మందులుంటాయి. మలవిసర్జన సరిగా లేకుంటే కొన్ని రకాల సిరప్లు వాడాల్సి ఉంటుంది. ఇలా ప్రతీ దుష్ప్రభావానికీ కొన్నిరకాల మందులుంటాయి. అందుకని కీమోథెరపీ తర్వాత అవయవాలపై ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయన్నది తెలుసుకునేందుకు ముందుగానే కొన్ని పరీక్షలు చేయిస్తుంటారు. కీమోథెరపీ ఇచ్చే ముందు ప్రతిసారీ కొన్ని రక్తపరీక్షలు చేసి అప్పుడే నివారణ చర్యలు ఆరంభిస్తారు.
అవసరాన్నిబట్టి కీమోథెరపీ మోతాదులను కూడా హెచ్చుతగ్గులు చేస్తుంటారు. ఉదాహరణకు రోగికి కామెర్లు వస్తే దాన్ని తగ్గించటానికి ఒక క్రమపద్ధతిలో చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రక్తకణాల సంఖ్య తగ్గిపోతుంటే అలా తగ్గకుండా ఉండేందుకు బూస్టర్ ఇంజెక్షన్లు ఇస్తారు. అయితే ఈ మందులు నూరుశాతం ఫలితాన్నివ్వకపోవచ్చు. ఇవి కాకుండా మరికొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశం లేకపోలేదు. అందుకని తరచూ పరీక్షలు చేసి చూస్తూ.. అప్పటికప్పుడు వైద్యం చేయాల్సి ఉంటుంది. మరో ముఖ్యమైన సమస్య- రోగనిరోధక శక్తి బలహీనపడటం. దీనివల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు మొదలవుతుంటాయి. తరచూ జ్వరం వస్తుంటుంది. మన ఒంట్లో ఉండే సూక్ష్మక్రిములే మనపై విజృంభించి కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. అందుకే వైద్యులు తరచూ పరీక్షలు చేసి, రోగి పరిస్థితిని అంచనా వేస్తుంటారు.
రోగులు ఏం చెయ్యొచ్చు?
ఆహారం
ఈ దుష్ప్రభావాల నుంచి తేలికగా గట్టెక్కటానికి రోగులు తమకు తాముగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం. ఆహారపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. తక్కువ ఆహారం తినాలి. నోరు చేదు, కొద్దిగా తింటే కడుపు నిండినట్లు, కడుపులో తిప్పినట్లు ఉంటుంది కాబట్టి తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. మరీ వేడిగా.. మరీ చల్లగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. కారం మసాలాలు లేని పదార్ధాలు ఉత్తమం.
తరచూ ఇన్ఫెక్షన్ల బారినపడకుండా ఉండేందుకు తాజాగా వండిన, శుభ్రమైన వెచ్చటి ఆహారం తీసుకోవాలి. కొందరు చక్కెర, పాలు, మాంసాహారం తినకూడదని భావిస్తుంటారుగానీ ఇవన్నీ అపోహలే. నోటికి సయించేది ఏదైనా తినొచ్చు. కీమోథెరపీ కోసమంటూ ఆహారపుటలవాట్లను కొత్తగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. కొందరు క్యారెట్, బీట్రూట్ జ్యూసులు ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఇదేమంత అవసరం లేదు. ఏం తీసుకున్నా అందులో క్యాలరీలు, ప్రోటీన్లు ఉంటున్నాయో లేదో చూసుకోవటం ముఖ్యం. కీమోథెరపీ వల్ల కొంత మంచి కణజాలం దెబ్బతింటుంది కాబట్టి అది కోలుకునేందుకు మంచి బలవర్ధకమైన ఆహారం తినాలి. అందుకే కీమోథెరపీ చేసే అన్ని ఆసుపత్రుల్లో డైటీషియన్లు ఉంటారు. వారి సలహా మేరకు ఆహారాన్ని ఎంచుకోవటం ఉత్తమం. మనం రోజూ తినే పూరీ, దోశ, పొంగల్ వంటి పదార్ధాలనే బలవర్ధకంగా ఎలా వండుకోవచ్చో వాళ్లు చెబుతారు. కొందరు కేవలం పండ్లు, గింజలు మాత్రమే తింటుంటారు. అలాగే రోగులను చూడటానికి వచ్చేవాళ్లు కూడా నారింజ, బత్తాయి, కొబ్బరినీళ్ల వంటివి తెస్తుంటారు. వాటివల్ల ప్రత్యేకించి ప్రయోజనం ఏదీ ఉండదు. పైగా రోగికి రక్తక్యాన్సర్ ఉంటే నారింజ పండ్లు, కొబ్బరినీళ్లు తాగితే అందులోని పొటాషియం రోగిలోకి చేరి.. అతని శరీరంలో పొటాషియం స్థాయిని పెంచుతుంది. అది మంచిదే కాదు. అందుకే ఏం చేసినా పద్ధతిగా, వైద్యులు లేదా డైటీషియన్ల సూచలన మేరకే తీసుకోవాలి.
అపోహ – వాస్తవం
వ్యాయామం చేయొచ్చా?
క్యాన్సర్ రోగులు ఎలాంటి శ్రమ లేకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. కానీ సాధ్యమైనంత వరకూ చురుకుగా ఉండటానికే ప్రయత్నించాలి. ఉదయాన్నే నడక, ఇంట్లో కూడా అటూఇటూ నడవటం, ప్రాణాయామం చేయడం, తమ పనులు తాము చేసుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల శారీరకంగానూ, మానసికంగానూ బలపడతారు. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లొచ్చా? క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవాళ్లు జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. కొందరు మాస్క్ కట్టుకుని తిరుగుతూ ఉంటారు. అది కొంత మంచిదేగానీ మంచి నాణ్యమైన మాస్కులు ధరిస్తేనే ప్రయోజనం. దగ్గు, జలుబు ఉండేవారికి కాస్త దూరంగా ఉండాలి.
ఇది అంటువ్యాధా?
ఇంటికి ఎవరైనా వస్తే హాయిగా మాట్లాడొచ్చు. ఏమీకాదు. అంతేకానీ ఇన్ఫెక్షన్లు వస్తాయని ఇంట్లోనే మగ్గాల్సిన పని లేదు. ముఖ్యంగా- క్యాన్సర్ ఓ అంటువ్యాధిలాంటిదనే అపోహ కొందరిలో ఉంటుంది. కానీ క్యాన్సర్ అస్సలు అంటువ్యాధి కానేకాదని అంతా గుర్తించాలి!
పొయ్యి దగ్గరకు వెళ్లొచ్చా?
చాలామంది క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న మహిళలు పొయ్యి దగ్గరకు వెళ్లకూడదు, వేడివల్ల ఇబ్బంది అని చెబుతుంటారుగానీ ఇవన్నీ వాస్తవాలు కావు. సౌకర్యవంతంగా ఉంటే తమ పనులు, ఇంటి పనుల్లో నిమగ్నం కావటం ఉత్తమం.
దిగులు పడొద్దు..
కొందరు రోగులు డిప్రెషన్లోకి వెళ్లిపోయి ఏడుస్తారు, కోప్పడతారు. ఇక జీవితంలో ఏమి చేయలేమని భోరుమంటారు. నిజానికి దీనికి కారణం వ్యాధి కాదు.. సమాజంలో వినిపించే మాటలు, వ్యాధి గురించి సరైన అవగాహన లేకపోవటం. రోగిలో అవగాహన పెంచి, ఆశావాహదృక్పథం నెలకొనేలా, ధైర్యం చెప్పటం అవసరం. అందుకే క్యాన్సర్ చికిత్సా సమయంలో… రోగీ, వైద్యుల మధ్య బంధం గట్టిగా ఉండాలి. సమస్యలేవైనా తలెత్తుతుంటే వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.

Lung Cancer / ఊపిరితిత్తుల కేన్సర్

భోజనం చేయకుండా కొద్దిరోజులు జీవించొచ్చు. నీళ్లు తాగకుండా కొన్ని గంటలు గడపొచ్చు. కానీ శ్వాస తీసుకోకుండా ఒక్క క్షణమైనా నిలవలేం. మన ప్రాణాలు నిలబడటానికి అత్యవసరమైన ఆక్సిజన్‌ అందటం నిమిషం ఆలస్యమైనా ఉక్కిరిబిక్కిరైపోతాం. కాబట్టే వూపిరితిత్తులకు అంతటి ప్రాధాన్యం. ఇవి ప్రకృతి నుంచి లభించే ఆక్సిజన్‌ను శ్వాస ద్వారా లోపలికి తీసుకుంటూ.. దాన్ని రక్తం ద్వారా అన్ని కణాలకు సరఫరా అయ్యేలా చేస్తూ.. అవసరం లేని కార్బన్‌ డయాక్సైడ్‌ను బయటికి పంపిస్తూ.. మన జీవం, జీవితం సజావుగా సాగటానికి నిరంతరం అలుపెరగకుండా పనిచేస్తుంటాయి. ఇలాంటి వూపిరితిత్తుల్లో ఏ చిన్న సమస్య తలెత్తినా ఇబ్బందే. అలాంటిది అనుక్షణం శరీరాన్ని కబళిస్తూ.. అహరహం నిర్వీర్యం చేసే క్యాన్సర్‌ ముంచుకొస్తే? పచ్చగా కళకళలాడే చెట్టుకు చీడ సోకితే వాడిపోయినట్టుగానే.. మనకు వూపిరిని అందించే తిత్తులూ వాడిపోవటం మొదలెడతాయి. పైగా వూపిరితిత్తుల క్యాన్సర్‌తో ముప్పేటంటే.. నూటికి 80% మందిలో ఇది బాగా ముదిరిన తర్వాతే బయటపడటం. దీంతో నయం కావటం అటుంచి.. అదుపులో పెట్టుకోవటమే కష్టమవుతోంది. ఒకప్పటి కన్నా ఇప్పుడు మంచి చికిత్సలు అందుబాటులోకి వచ్చినా.. ఇంకా ఇది కొరకరాని కొయ్యగానే సవాల్‌ చేస్తోంది. వూపిరితిత్తుల క్యాన్సర్‌ ఎందుకొస్తుందో కచ్చితంగా తెలియదు. ఎవరికి వస్తుందో తెలియదు. కానీ రావటానికి దోహదం చేసే కొన్ని కారణాలను మాత్రం మనం తప్పకుండా నిలువరించుకోవచ్చు.
మన ప్రాణానికి, జీవానికి శ్వాస అత్యంత కీలకం. గుండె కొట్టుకోవటం వంటి ఇతర ప్రక్రియలు సజావుగా జరుగుతున్నా.. శ్వాస సరిగా సాగకపోతే శరీరం వెంటనే కుప్పకూలుతుంది. తగినంత ఆక్సిజన్‌ అందక కణాలన్నీ చేతులెత్తేస్తాయి. కాబట్టే వూపిరితిత్తులకు ఎలాంటి సమస్య వచ్చినా భరించటం కష్టం. ఇక క్యాన్సర్‌ వంటి తీవ్ర సమస్యలు ముంచుకొస్తే జీవితం మరింత నరకప్రాయంగా మారుతుంది. మనదేశంలో అతి ఎక్కువగా కనబడే ఐదు రకాల క్యాన్సర్లలో వూపిరితిత్తుల క్యాన్సర్‌ ఒకటి. ఒకప్పుడు పురుషుల్లో నోటి క్యాన్సర్‌, గొంతు క్యాన్సర్‌, జీర్ణాశయ క్యాన్సర్లు ఎక్కువగా కనబడుతుండేవి. ఇప్పుడు వూపిరితిత్తుల క్యాన్సర్‌ వీటన్నింటినీ అధిగమించి ప్రథమ స్థానాన్ని ఆక్రమించేసింది. స్త్రీలు, పురుషులు..
ఇద్దరినీ పరిగణనలోకి తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌ తర్వాత రెండో స్థానం కూడా దీనిదే కావటం గమనార్హం. మనదేశంలో కొత్తగా బయటపడుతున్న క్యాన్సర్‌ కేసుల్లో 6.9% కేసులు వూపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించినవే. క్యాన్సర్ల మూలంగా చనిపోతున్న వారిలో 9.3% మంది వూపిరితిత్తుల క్యాన్సర్‌ బాధితులే. అయినా కూడా మన సమాజంలో దీనిపై చాలామందికి అవగాహన ఉండటం లేదు. దీనిలోనూ క్షయ మాదిరి లక్షణాలు కనబడుతుండటం పొరబడటానికి దారితీస్తోంది. క్షయకు చికిత్స తీసుకుంటున్నా కూడా లక్షణాలు తగ్గుముఖం పట్టకపోయిన సందర్భాల్లోనూ క్యాన్సర్‌ను అనుమానించటం లేదు. అలాగే విచ్చలవిడిగా పెరిగిపోతున్న పొగాకు అలవాట్లు, వాయు కాలుష్యం వంటివీ వూపిరితిత్తుల క్యాన్సర్‌కు ఆజ్యం పోస్తున్నాయి.

లక్షణాలేంటి?
వూపిరితిత్తులకు మాత్రమే పరిమితమైన కణితులు, ఇతర భాగాలకు విస్తరించిన కణితులను బట్టి వేర్వేరు లక్షణాలు కనబడుతుంటాయి.
* విడవకుండా దగ్గు
* శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది
* కళ్లెలో రక్తం పడటం
* బరువు తగ్గటం
* ఆకలి తగ్గిపోవటం
* గొంతు బొంగురు పోవటం
* ముద్ద మింగటంలో ఇబ్బంది
* ఆయాసం
* బ్రాంకైటిస్‌, న్యుమోనియా
* జ్వరం
* నిస్సత్తువ
* కామెర్లు
* తలనొప్పి, వాంతి
* నాడీ సమస్యలు

దశలను బట్టి చికిత్స
వూపిరితిత్తుల క్యాన్సర్‌లో ఆయా దశలను బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ, టార్గెటెడ్‌ థెరపీ, ఇమ్యూనో థెరపీల్లో ఎవరికి, ఏది పనికొస్తుందనేది నిర్ణయిస్తారు.
1, 2 దశల్లో..
* మొదటి, రెండో దశ కణితులకు శస్త్రచికిత్స ఉత్తమమైన పద్ధతి. ఇందులో కణితి ఏర్పడిన భాగాన్ని పూర్తిగా తొలగిస్తారు. అవసరమైతే ఒక భాగాన్ని (లోబ్‌), ఒక వూపిరితిత్తి మొత్తాన్ని కూడా తొలగించాల్సి రావొచ్చు. శస్త్రచికిత్సతో కణితిని తొలగించినప్పటికీ.. కంటికి కనిపించని అతి సూక్ష్మమైన క్యాన్సర్‌ కణాలు ఛాతీలోనో, మరెక్కడో ఇంకా లోపలే ఉండిపోవచ్చు. ఇవి పెట్‌ స్కాన్‌లోనూ కనబడనంత చిన్నగానూ ఉండొచ్చు. ఒకవేళ క్యాన్సర్‌ కణాలు లోపల మిగిలిపోతే జబ్బు తిరగబెట్టే ప్రమాదముంది. అందువల్ల బయటకు తీసిన కణితిని పరిశీలించి.. జబ్బు తిరగబెట్టే అవకాశం ఎంత వరకు ఉందనేది అంచనా వేస్తారు. తిరగబెట్టే అవకాశం ఉంటే కీమో థెరపీ, రేడియో థెరపీ చేయాల్సి ఉంటుంది. కణితిని పూర్తిగా తొలగించటం సాధ్యం కానప్పుడు కొంత భాగం లోపలే వదిలేస్తుంటారు. ఇలాంటి వారికి కీమోతో పాటు రేడియోథెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
3వ దశలో..
* వీరికి ఒకే సమయంలో కీమోథెరపీ, రేడియోథెరపీ చేయాల్సి ఉంటుంది. కొందరికి శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావొచ్చు. కణితి ఏర్పడిన చోటు, సైజు, లింఫ్‌ గ్రంథుల ఉబ్బు వంటి వాటిని బట్టి దీన్ని నిర్ణయిస్తారు. అయితే మూడో దశలో చికిత్స చేసినా క్యాన్సర్‌ నయమయ్యే అవకాశం 30% మాత్రమే. 70% మందిలో జబ్బు పూర్తిగా తగ్గకపోవచ్చు. ఒకవేళ తగ్గినా మళ్లీ తిరగబెట్టొచ్చు. 4వ దశలో..
* నాలుగో దశలో క్యాన్సర్‌ నయం కావటం దాదాపు అసాధ్యం. అందువల్ల రోగికి ఇతరత్రా సమస్యలేవీ లేకుండా.. బతికినంతకాలం ఇంట్లో హాయిగా జీవించేలా చూసేందుకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయంలో ‘టార్గెటెడ్‌ థెరపీ’ బాగా ఉపయోగపడుతుంది. కీమోథెరపీ క్యాన్సర్‌ కణాల మీదే కాదు. ఇతర కణాలపైనా ప్రభావం చూపుతుంది. దీంతో జుట్టు రాలటం, వాంతులు, రక్తకణాలు తగ్గటం, రోగనిరోధకశక్తి క్షీణించటం వంటి దుష్ఫలితాలు తలెత్తొచ్చు. అంటే చికిత్సతో ఒనగూడే ప్రయోజనం కన్నా సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదముంది. కాబట్టి వీరికి టార్గెటెడ్‌ థెరపీయే మంచిది. ఇందులో క్యాన్సర్‌ వృద్ధి చెందటానికి కారణమవుతున్న ప్రోటీన్‌ను గుర్తించి, అది పనిచేయకుండా చేసే మాత్రలు ఇస్తారు. వీటిని వేసుకుంటూ రోజువారీ పనులన్నీ చేసుకోవచ్చు. రెండు వారాల్లో దీని ప్రభావం కనబడుతుంది. పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు. క్యాన్సర్‌ వృద్ధికి దోహదం చేస్తున్న ప్రోటీన్ల వంటివి కనబడనివారికి కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది.
* రోగనిరోధకవ్యవస్థను ప్రేరేపించి క్యాన్సర్‌ కణాలను నిర్వీర్యం చేసే ‘ఇమ్యూనోథెరపీ’ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఇది గతి తప్పిన కణాలను గుర్తించే, వాటిని నిర్వీర్యం చేసే యంత్రాంగాలను తిరిగి ప్రేరేపితం చేస్తూ.. క్యాన్సర్‌ కణాలను చంపుతుంది.
జీవనకాలం మెరుగు టార్గెటెడ్‌, ఇమ్యూనోథెరపీలు ఆయా రకాలకు, వ్యక్తులకు అనుగుణంగా చికిత్స చేయటానికి బాగా తోడ్పడతాయి. వీటి ద్వారా 60% మందికి కీమోథెరపీని తప్పించే అవకాశముంది. ఇవి చాలాకాలం పనిచేస్తాయి కూడా. వీటి రాకతో జీవనకాలం గణనీయంగా పెరిగింది. గతంలో వూపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడితే ఆరు నెలల కన్నా ఎక్కువకాలం జీవించేవారు కాదు. ఇప్పుడు దాదాపు 25% మంది ఐదేళ్లకు పైగా జీవిస్తున్నారు! అయితే ఏదో ఒక చికిత్సకు మాత్రమే సరిపోయేవారి కన్నా అన్ని రకాల చికిత్సలకు అనుగుణంగా ఉన్నవారు ఎక్కువకాలం జీవించే అవకాశముంటుంది.
క్షయకు దగ్గరి పోలిక వూపిరితిత్తుల క్యాన్సర్‌, క్షయ..రెండింట్లోనూ దగ్గు, ఆయాసం, బరువు, ఆకలి తగ్గటం, జ్వరం వంటి లక్షణాలు కనబడుతుంటాయి. దీంతో వీటి మధ్య తేడాను గుర్తించటం చాలా కష్టమవుతోంది. వూపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్స కోసం వచ్చేవారిలో క్షయ చికిత్స తీసుకొని, ఇంకా దగ్గు తగ్గలేదని వచ్చేవారు దాదాపు 15-50% మంది కనబడుతుంటారు. అప్పటికే వీరిలో క్యాన్సర్‌ ముదిరిపోయి ఉంటుంది. అందువల్ల వీలైనంత త్వరగా వీటి మధ్య తేడాను గుర్తించటం చాలా అవసరం. సాధారణంగా క్షయ చికిత్స ఆరంభించిన మూడు, నాలుగు వారాల్లో లక్షణాలు తగ్గుముఖం పట్టాలి. ఆరోగ్యమూ కాస్త మెరుగవ్వాలి. లేకపోతే వెంటనే అప్రమత్తం కావాలి. ఎక్స్‌రే, సీటీస్కాన్‌.. అవసరమైతే బయాప్సీ చేసి వూపిరితిత్తుల క్యాన్సర్‌ ఉందేమో చూడాలి.
ఆలస్యమే.. పెద్ద సమస్య
వూపిరితిత్తుల క్యాన్సర్‌తో పెద్ద చిక్కటేంటంటే చాలా ఆలస్యంగా బయటపడుతుండటం. వూపిరితిత్తి పెద్ద అవయం. దీనిలో కణితి తలెత్తినా కూడా.. అది కీలకమైన భాగాలకు తగిలేంత వరకూ ఎలాంటి లక్షణాలు కనబడవు. అందువల్ల వూపిరితిత్తుల క్యాన్సర్‌ బయటపడేసరికే ముదిరిపోయి ఉంటోంది. ఇతరత్రా జబ్బుల్లో చేసే పరీక్షల్లో యాదృచ్ఛికంగా బయటపడటం తప్పించి.. తొలి దశలో వూపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించటం చాలా అరుదు. సుమారు 70-80% మందిలో ఇది మూడు, నాలుగు దశల్లోనే బయటపడుతోంది. దీన్ని ఒకటో దశలోనే గుర్తించి శస్త్రచికిత్స చేయగలిగితే 90% వరకు నయం చేయొచ్చు. రెండో దశలో 70% వరకు నయం కావొచ్చు. అదే మూడో దశలో నయమయ్యే అవకాశం 30 శాతానికి పడిపోతుంది. ఇక నాలుగో దశలోనైతే నయం కావటం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి.
నివారణ కీలకం
వూపిరితిత్తుల క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించటం కష్టం. అందుకే అమెరికా వంటి దేశాల్లో వూపిరితిత్తుల క్యాన్సర్‌కు ముందస్తు పరీక్షలు చేస్తున్నారు. 55 ఏళ్లు పైబడి.. 20 ఏళ్లకు పైగా పొగ తాగే అలవాటున్నవారికి ఏడాదికి ఒకసారి తక్కువ మోతాదు సీటీస్కాన్‌ పరీక్ష చేస్తున్నారు. కానీ మనదేశంలో ఇదంత సులువైన పని కాదు. అందువల్ల నివారణ మీదే దృష్టి పెట్టటం చాలా అవసరం. క్యాన్సర్‌కు దారితీసే పొగాకు జోలికి వెళ్లకపోవటం అన్నింటికన్నా మంచిది. ఒకవేళ పొగ తాగటం, పొగాకు నమలటం అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మద్యం పరిమితం చేసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అధికబరువు, వూబకాయాన్ని తగ్గించుకోవాలి. పరీక్షలు: మూడు ప్రధానం
వూపిరితిత్తుల క్యాన్సర్‌ను నిర్ధరిచటంతో పాటు అది ఏ దశలో ఉందనేది గుర్తించటమూ చాలా అవసరం. ఎలాంటి చికిత్స చేయాలనేది దీని దశల ఆధారంగానే నిర్ణయిస్తారు. ఇందుకు ప్రధానంగా మూడు రకాల పరీక్షలు తోడ్పడతాయి.
* ఎక్స్‌రే: వూపిరితిత్తుల క్యాన్సర్‌ను అనుమానిస్తే ముందు ఎక్స్‌రే తీస్తారు. కణితి నీడ ఏదైనా ఉంటే బయటపడుతుంది. నీరు చేరిందా? ఛాతీలో గుండె సరైన స్థానంలో ఉందా? శ్వాసనాళం ఎలా ఉంది? అనేవీ ఇందులో తెలుస్తుంది.
* సీటీ స్కాన్‌: క్యాన్సర్‌ ఉన్నట్టు అనుమానిస్తే, లక్షణాలు కూడా అనుగుణంగానే కనబడుతుంటే సీటీ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. కణితి ఉంటే ఇందులో స్పష్టంగా బయటపడుతుంది.
* బయాప్సీ: కణితి ఉన్నట్టు తేలితే దాన్నుంచి చిన్న ముక్కను బయటకు తీసి (బయాప్సీ) పరీక్షిస్తారు. దీంతో క్యాన్సర్‌ నిర్ధరణ కావటమే కాదు, అది ఏ రకానికి (స్మాల్‌ సెల్‌, నాన్‌ స్మాల్‌ సెల్‌) చెందినదనేదీ తెలుస్తుంది.
* ఇతర పరీక్షలు: అవసరమైతే ఇతరత్రా వివరాల కోసం మరోసారి సీటీ స్కాన్‌, ఎముక స్కాన్‌, పెట్‌ స్కాన్‌ వంటివి చేస్తారు. దీంతో క్యాన్సర్‌ ఏ దశలో ఉంది, ఎక్కడెక్కడికి విస్తరించిందనేది బయటపడుతుంది.
నాలుగు దశలు
వూపిరితిత్తుల క్యాన్సర్‌ 4 దశలుగా కనబడుతుంది.
* స్టేజ్‌ 1: కణితి కేవలం ఒక వూపిరితిత్తిలోనే ఏర్పడటం. లింఫ్‌ గ్రంథులకు విస్తరించకపోవటం.
* స్టేజ్‌ 2: కణితి లింఫ్‌ గ్రంథులకు విస్తరించటం.
* స్టేజ్‌ 3: ప్రధాన శ్వాసనాళం చుట్టూరా ఉండే లింఫ్‌ గ్రంథులకు, ఛాతీ గోడకు, డయాఫ్రంకు కణితి విస్తరించటం.
* స్టేజ్‌ 4: వూపిరితిత్తుల్లో, గుండె చుట్టూ నీరు చేరటం.. కణితి ఇతర భాగాలకు విస్తరించటం.

కలుషిత ఆహారం వలన పెరుగుతున్న క్యాన్సర్‌

క్యాన్సర్‌ కణం పుట్టుకకు ఖచ్చితంగా కారణం ఇది అని తెలియక పోయినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన అలవాట్లు చేసే వృత్తి, వాతావరణ కాలుష్యం రకరకాల ఇన్‌ఫెక్షన్లు, అధిక బరువు, మితిమీరిన హార్మోన్ల వాడకం, వయస్సు పైబడటం, వంటివి కారణం కావచ్చు. వయస్సు పైబడే కొద్దీ వచ్చే క్యాన్సర్‌ మెల్లగా పెరిగితే, యుక్త వయస్సులో వచ్చే క్యాన్సర్‌ వేగంగా వ్యాప్తి చెందుతాయి. అందుకే ట్రీట్‌మెంట్‌ వయస్సును బట్టి మారుతుంటుంది.
ఈ రోజుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకున్నా ఫ్రెండ్స్‌, పార్టీలు, పబ్‌ కల్చర్‌తో స్మోకింగ్‌ పెరుగుతోంది. ఆల్కాహాల్ స్త్రీ, పురుషులు అన్న బేధం లేకుండా తీసుకోవటం వలన, అంతే కాకుండా ఇవేవి లేకపోయినా వారంలో రెండు, మూడుసార్లు బయట హోటల్స్‌లో రకరకాల ఆహార పదార్థాలు ప్రయత్నించటంలో భాగంగా బాగా ఫ్రై చేసిన ఐటమ్స్‌, కలర్‌పుల్‌గా ఉండే ఆహారపదార్థాలు, కొవ్వు ఎక్కువగా కలిపిన పిజ్జాలు, బర్గర్‌లు, బిరియానీలు కూడా కాన్సర్‌ కారకాలుగా మారుతున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.
వీటితోపాటు ఇంట్లో పెంపుడు జంతువులకు, మనుషులు వాడే రకరకాల కాస్పోటిక్‌ ప్రోడక్ట్స్‌, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు త్వరగా పండటానికి, ఎక్కువగా కలర్‌ఫుల్‌గా ఉండటానికి వాడే అనేక రకాల రసాయనాలు కూడా క్యాన్సర్‌ కారకాలు
HIV, HEP B వైరస్ లు రాకుండా వ్యాక్సిన్స్‌ తీసుకోవటం, పళ్లు, కూరగాయలను ఉప్పునీటితో కడగటమూ, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను ముందే తెలిపే స్క్రీనింగ్‌, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందే పసిగట్టే ప్యాప్‌స్మియర్‌ చెకప్‌, పురుషులో 50 ఏళ్లు పైబడితే ప్రొస్టేట్‌ గ్రంధి కాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువ కాబట్టి ముందుగానే పి ఎస్‌ ఎ పరీక్ష చేయుంచు కోవటం మంచిది. ఒత్తిడి తగ్గిస్తాయనో, లేదా స్నేహితుల కోసం అలవాటు చేసేకునే స్మోకింగ్‌, ఆల్కాహాల్‌ వలన లంగ్‌ క్యాన్సర్‌కు, లివర్‌ క్యాన్సర్‌కు దారి దగ్గరవుతుందని అందరూ గమనిస్తే చాలా మంచిది.
సంతాన భాగ్యం పొందని దంపతులు ఎక్కువ కాలం పాటు ఫెర్టిలిటీ మందులు వాడితే, మరీ ముఖ్యంగా స్త్రీలు ఈస్ట్రోజన్‌ ప్రొజెస్టిరాన్‌ కాంబినేషన్‌లో మందులు దీర్ఘకాం పాటు వాడితే రొమ్ము సంబంధిత, అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్స్‌కు గురవటం గమనిస్తున్నాము. న్యూక్లియర్‌ ప్లాంట్‌ దగ్గర రేడియేషనకు గురవటం కాని, చిన్న వయస్సులో క్యాన్సర్‌కు కీమో, రేడియో థెరపీ ఎక్కువ మోతాదులో ఇవ్వటం వలన క్యాన్సర్స్‌ తిరగబెట్టే ప్రమాదం కూడా పెరుగుతుంది.
జంతువులకు, మొక్కలకు, మనుషులకు ఇలా జీవం ఉన్న ఏ కణజాలం అయినా క్యాన్సర్‌కు గురవ్యవచ్చు. ఆ కణంలో డి ఎన్‌ ఏ మ్యుటేషన్‌ చెంది అపరిమితంగా పెరిగి పోవటమే క్యాన్సర్‌. ఇలా జరగటానికి జెనెటిక్స్‌ కూడా దోహదం చేయవచ్చు. అందుకే కొన్ని రకాల వృత్తులలో ఉండేవారిలో కొద్ది మంది క్యాన్సర్‌కు గురైతే మరికొంతమంది ఆరోగ్యంగానే ఉంటారు. ఆస్‌బెస్టాస్‌ కంపెనీలో పనిచేసేవారు, అల్యూమినియమ్‌ ప్రొడక్షన్‌ కంపెనీలోని వారు, ఆల్కాహాలిక్‌ బెవరేజెస్‌, పొగాకు ఉత్పత్తులు, రేడియో న్యూక్లయిడ్స్‌, చెక్కపొడి, మరియు గామా రేడియేషన్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాలో పనిచేసే వారికి ఊపిరితిత్తల క్యాన్సర్‌ కాని ఇతర హెడ్‌ మరియు నెక్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువని చెప్పుకోవచ్చు.
ఆధునిక జీవనశైలిలో అనేక రకాల పరికరాలు, ఉత్పత్తులు, పదార్థాలు నిల్వ ఉండటానికి వాడే పదార్థాలు, మళ్లీ, మళ్లీ వాడే నూనెలు, క్రిమి సంహారకాలు, నైట్‌ డ్యూటీలు, వాతావరణ కాలుష్యం, వాహనాల నుండి వెలెవడే పొగలు, పొగాకు ఉత్పత్తులు, ఆల్కాహాల్ , అసలు శారీరక శ్రమ లేకపోవటం వలన అధిక బరువు, ఆహారంలో వాడే రంగులు, ఇవన్నీ కూడా క్యాన్సర్‌ కారకాలు రాత్రిపూట లైట్ల వెలుగు, ఎ.సి. రూముల్లో నిద్రలేకుండా పనిచేసేవారికి మెలటోనిన్‌ ఉత్పత్తి తగ్గటం వలన రోగనిరోధక శక్తి తగ్గి క్యాన్సర్స్‌ వచ్చే ప్రమాదం పెరుగుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి

Cervical Cancer, Liver Cancer, Stomack Cancer

క్యాన్సర్ చికిత్సలు, పూర్వపు రోజుల కన్నా క్యాన్సర్లను వేగంగా కనుగొనగల పరీక్షల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినప్పటికీ…. మన దేశంలో వ్యాధుల కారణంగా సంభవిస్తున్న మరణాల్లో క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. గత పదేళ్లలో క్యాన్సర్తో మరణించే రోగుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ప్రతి ఏడాదీ దాదాపు 45,000 మంది పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీరిలో 70 శాతం మందికి పూర్తిగా నయమవుతుంది కూడా. అయితే జీవితంలోని ఏదో దశలో ఇది తిరగబెట్టే ప్రమాదం ఉంది. అందుకే అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్లో రక్తసంబంధమైన క్యాన్సర్లు (లుకేమియా), మెదడులో వచ్చే కణుతులు (బ్రెయిన్ ట్యూమర్స్) ఎక్కువ. పిల్లల్లో అకస్మాత్తుగా జ్వరం, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలతో క్యాన్సర్ బయటపడుతుంది.
సర్విక్స్ క్యాన్సర్
మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్ అన్నిటికంటే ఎక్కువ. అమ్మాయిలు పెళ్లికి ముందు హెచ్పీవీ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకుంటే చాలు… ఈ క్యాన్సర్ బారిన ఎప్పుడూ పడకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ అప్పటికే పెళ్లయి ఉన్నవారు పాప్స్మియర్ అనే ఒక చిన్న పరీక్ష ద్వారా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలను చాలా ముందుగానే గుర్తించే అవకాశమూ ఉంది. లక్షణాలను ముందే గుర్తిస్తే నయం చేయడం చాలా తేలిక. దీని లక్షణాలు ఇవి…
యోని నుంచి అసాధారణ స్రావాలు ∙ నెలసరి మధ్యలో గాని లేదా కలయిక సమయంలో నొప్పి, రక్తస్రావం ∙నెలసరి సమయంలో అంతకుముందు కంటే చాలా ఎక్కువగా రక్తస్రావం కావడం ∙ఆకలి, బరువు తగ్గడం, అలసట లేదా క్యాన్సర్ దశను బట్టి తీవ్రమైన నడుమునొప్పి, ఎముకలనొప్పులు, కాళ్లవాపు వంటి ఇతర లక్షణాలు. పాప్స్మియర్, కాల్పోస్కోపీ, బయాప్సీ వంటి పరీక్షలతో దీన్ని గుర్తించవచ్చు. హిస్టెరోస్కోపీ, ఊపరెక్టమీ వంటి శస్త్రచికిత్సలతో దీన్ని నయం చేయవచ్చు.
రొమ్ము క్యాన్సర్
మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలూ పెరుగుతుంటాయి. అవివాహిత మహిళలు, పిల్లలు పుట్టని స్త్రీలు, పాలు ఇవ్వనివారిలో, హార్మోన్ల మీద ప్రభావం చూపించే మందులు దీర్ఘకాలం పాటు వాడే వారిలో ఈ క్యాన్సర్ ఎక్కువ. దీన్ని గుర్తించడం చాలా తేలిక. రొమ్ములో కదలని గట్టి గడ్డ, రొమ్ముల్లో లేదా చంకల్లో గడ్డ లేదా వాపు, చనుమొన సైజ్లో మార్పు, అది లోపలికి తిరిగి ఉండటం, రొమ్ము మీద చర్మం మందం కావడం, సొట్టపడటం, రొమ్ము మీద గుంటలు పడటం, రొమ్ము పై భాగాన ఎంతకూ నయం కాని పుండు, చనుమొన నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరిలో లక్షణాలు కనిపించే నాటికే వ్యాధి ముదిరి తొలిదశను దాటిపోయే ప్రమాదమూ ఉంది.
అందుకే 20 ఏళ్ల వయసు నుంచే మహిళలు తమ రొమ్ము పట్ల అవగాహనతో ఉండాలి. నెలసరి తర్వాత ఏడో రోజున స్వయంగా తన వేళ్లతో పరీక్షించుకుంటూ పై మార్పులు కనిపించాయా అని చూసుకోవాలి. 40 ఏళ్ల పైబడ్డాక డాక్టర్ చెప్పిన నిర్ణీత వ్యవధుల్లో అల్ట్రాసౌండ్, మామోగ్రామ్, అవసరాన్ని బట్టి బయాప్సీ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. చికిత్సలో భాగంగా గడ్డను మాత్రమే తీసివేయడం లేదా అవసరాన్ని బట్టి రొమ్మును తొలగించడం జరుగుతుంది. వైద్యచికిత్సల్లో ఇటీవలి పురోగతి వల్ల రొమ్మును తొలగించే అవసరం పెద్దగా ఉండటం లేదు.
లివర్ క్యాన్సర్
హెపటైటిస్–బి ఇన్ఫెక్షన్ దీర్ఘకాలంలో లివర్ క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే అందరూ హెపటైటిస్–బి వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకుంటే మేలు. అయితే ఇంచుమించూ ఇలాగే వ్యాపించే హెపటైటిస్–సి కి వ్యాక్సిన్ ఇంకా వ్యాక్సిన్ రూపొందలేదు. కాబట్టి సురక్షితం కాని శృంగారానికి, రక్తమార్పిడికి దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది.
కడుపులో నొప్పి, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, కామెర్లు, వాంతులు, పొట్టలో నీరు చేరడం వంటి లక్షణాలు కాలేయ క్యాన్సర్ తీవ్రతకు సూచనలు. అందుకే హెపటైటిస్–బి ఉన్నవారు తరచూ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. తల్లికి హెపటైటిస్–బి ఉంటే పుట్టిన వెంటనే బిడ్డకు 12 గంటలలోపు హెపటైటిస్ ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. దాంతో బిడ్డను హెపటైటిస్ వైరస్ బారిన పడకుండా చూడవచ్చు.
లంగ్ క్యాన్సర్
ప్రపంచవ్యాప్తంగా కనిపించే క్యాన్సర్ మరణాల్లో లంగ్ క్యాన్సర్ కారణంగా సంభవించేవే ఎక్కువ. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం, దగ్గు, రక్తం పడటం, బరువు తగ్గడం, ఛాతీ/పొట్టలో నొప్పి, మింగడం కష్టం కావడం లంగ్ క్యాన్సర్ లక్షణాలు. ఈ క్యాన్సర్కు వ్యాపించే గుణం ఎక్కువ. ఛాతీ ఎక్స్రే, బయాప్సీ, సీటీ స్కాన్, ఎమ్మారై పరీక్షలతో నిర్ధారణ చేయవచ్చు. స్పైరోమెట్రీ, బ్రాంకోస్కోపీ, రక్తపరీక్షలతో క్యాన్సర్ కణితి నిర్దిష్టంగా ఎక్కడ, ఏ దశలో ఉందో గుర్తించి అవసరమైతే లంగ్లో కొంత భాగాన్ని తీసివేసి లోబెక్టమీ అనే శస్త్రచికిత్స చేస్తారు. లేదా అదీ కుదరకపోతే కీమోథెరపీ ఇస్తారు.
పొట్ట క్యాన్సర్
దక్షిణ భారత దేశంలో పొట్ట (స్టమక్) క్యాన్సర్లు ఎక్కువ. కారణాలు కచ్చితంగా తెలియకపోయినా మసాలాలు, కారం ఎక్కువగా తినే అలవాట్లు దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. పొట్ట క్యాన్సర్ లక్షణాలు అల్సర్ లక్షణాల్లాగే కనిపిస్తాయి. అందుకే పొట్ట క్యాన్సర్ను చాలా సందర్భాల్లో అల్సర్ లక్షణాలుగా పొరబడే అవకాశం ఉంది. ఒక్కోసారి అది జీర్ణాశయం క్యాన్సర్కు దారితీయవచ్చు. కడుపులో నొప్పి, ఎసిడిటీ, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, వికారం, ఎక్కిళ్లు, తేన్పులు, రక్తపు వాంతులు, మలం నల్లగా రావడం లేదా మలంలో రక్తం కనిపించడం వంటివి దీని లక్షణాలు. ఎండోస్కోపీ, బయాప్సీ, అవసరాన్ని బట్టి సీటీ స్కాన్, ఎమ్మారై పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేస్తారు. చికిత్స విషయానికి వస్తే… కణితి అయితే పొట్టలో కొంతభాగాన్ని తీసివేసే గ్యాస్ట్రెక్టమీ చేస్తారు. కణితి పెద్దగా ఉండి చుట్టూ ఉన్న కణజాలానికి పాకితే అన్నవాహికలో కొంతభాగాన్ని, చిన్న పేగుల్లో కొంతభాగాన్ని తీసేయాల్సి రావచ్చు. అదే జరిగితే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Thyroid Cancer……..థైరాయిడ్‌ క్యాన్సర్

థైరాయిడ్‌ అనగానే చాలామందికి హార్మోన్‌ సమస్యలే గుర్తుకువస్తాయి. కాని కొందరిలో థైరాయిడ్‌ క్యాన్సర్లు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. వ్యాధిని గుర్తించి వైద్య చికిత్స తీసుకుంటే 95 శాతం క్యాన్సర్లు పూర్తిగా నయమవుతాయి.
శరీరంలో థైరాక్సిన్‌ అనే అతిముఖ్యమైన హార్మోన్‌ను ఉత్పత్తిచేసే గ్రంధినే థైరాయిడ్‌ అంటారు. థైరిస్‌ అంటే గ్రీకు భాషలో షీల్డ్‌ అని అర్ధం. సుమారు 99 శాతం మందిలో ఈ గ్రంధి మామూలుగానే పనిచేస్తుంటుంది. కేవలం ఒక శాతం మందిలో మాత్రం ఈ గ్రంధి విరుద్ధంగా అంటే కొందరిలో తక్కువగానూ, కొందరిలో ఎక్కువగానూ పనిచేస్తుంది. థైరాయిడ్‌ గ్రంధి తక్కువగా పనిచేయడాన్ని హైపో థైరాయిడిజం అని, ఎక్కువగాపనిచేయడాన్ని హైపర్‌ థైరాయిడిజం అని పిలుస్తారు. అయితే హార్మోను ఉత్పత్తి సంబంధిత సమస్యలే కాకుండా థైరాయిడ్‌ ఒక్కొక్కసారి క్యాన్సర్‌ బారిన పడే అవకాశం వుంది. కాకపోతే హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం వంటి సమస్యలకు థైరాయిడ్‌ క్యాన్సర్లకు ఎటువంటి సంబంధం లేదు.
థైరాయిడ్‌ క్యాన్సర్‌ సమస్య పసిపిల్ల నుంచి వృద్థుల దాకా ఎవరికైనా రావచ్చు. కాకపోతే 20 నుంచి 40 ఏళ్లలోపు వారిలో ఈ క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఒక థైరాయిడ్‌ గ్రంధుల్లో ఒకటి క్యాన్సర్‌ బారిన పడినా రెండవ గ్రంధి మొత్తం శరీరానికి కావలసిన థైరాక్సిన్‌ హార్మోనును ఉత్పత్తి చేస్తునే వుంటుంది. అందుకే చాలా రోజుల దాకా థైరాయిడ్‌ సమస్య మనకేమి మనకు తెలియకపోవచ్చు. కాని లోలోప క్యాన్సర్‌ పెరుగుతునే వుండవచ్చు.
ఎలా తెలుస్తుంది ?
థైరాయిడ్‌ క్యాన్సర్‌ బారిన పడినవారు వారి మెడముందు భాగంలో వాపు కనిపిస్తుంది. ఆ వాపు గొంతు లోని ఏదో ఒకవైపున కాని, రెండువ వైపు కాని ఈ వాపు రావచ్చు. అయితే థైరాయిడ్‌ సమస్య సంబంధిత గాయిటర్‌లోను వాపు కనిపిస్తుంది. ఇది అయోడిన్‌ లోపం వల్ల వస్తుంది. మరి కొన్ని ఇతర కారణాలతో కూడా కొందరిలో ఈ వాపు రావచ్చు. అందువల్ల థైరాయిడ్‌ లో వాపు కనిపించినంత మాత్రాన అది క్యాన్సర్‌ అనుకోవాల్సిన పనిలేదు. కాకపోతే థైరాయిడ్‌ క్యాన్సర్‌కు గురైన కొందరిలో ఇది ఒక లక్షణంగా కనిపిస్తుంది. థైరాయిడ్‌ గ్రంధినుంచి ఒక నరం, ఛాతీనుంచి స్వరపేటికకు వెళుతుంటుంది. థైరాయిడ్‌ క్యాన్సర్‌ను అశ్రద్ధ చేస్తే క్యాన్సర్‌ కణితి ఆ నరాన్ని ఒత్తిడికి గురిచేస్తుంది. దీనివల్ల గొంతు బొంగురు పోవచ్చు. అందుకే గొంతు ఎక్కువ రోజు బొంగురుపోయి అలాగే వుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
కొందరిలో థైరాయిడ్‌ గ్రంధిలో ఉన్న క్యాన్సర్‌ కణితి చాలా చిన్నగా వున్నపుడే లింక్‌ గ్రంధుకు సంబంధించి ముక్క పరీక్ష చేస్తే థైరాయిడ్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు బయటపడవచ్చు. థైరాయిడ్‌ క్యాన్సర్‌ రోజులు గడిచేకొద్ది ఎముకకు శ్వాసకోసాలకు వెన్నెముకకు ఇలా చాలా వివిధ భాగాలకు పాకుతు వెళుతుంటుంది.
అనేక రకాలు
థైరాయిడ్‌ క్యాన్సర్ అనేక రకాలు . వాటిల్లో ప్రధానంగా పాప్లిరీ కార్సినోమా,ఫాలికుర్‌ కార్సినోమా అనేవి రెండు రకాలు. ఈ క్యాన్సర్లు ఎక్కువగా 20 నుంచి 40 ఏళ్లలోపు వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే చాలావరకు ఈ రెండు పూర్తిగా నయమైపోయే క్యాన్సర్లే. పాప్లిరీ క్యాన్సర్‌కు ఎక్కువగా లింఫ్‌ నోడ్స్‌ లోకి పాకే స్వభావం వుంటుంది. పాలికులార్‌ క్యాన్సర్లు ఎముకకు, శ్వాసకోశాలకు ఎక్కువగా పాకుతూ వుంటాయి. అవసరమైన పరీక్షలన్నీ చేస్తే గాని, అది ఏరకమైన క్యాన్సరో నిర్ధారించలేము. ఈ రెండు రకాల క్యాన్సర్లలోనూ థైరాయిడ్‌ గ్రంధిని పూర్తిగా తొగించడం ఒక్కటే సరియైన పరిష్కారమార్గం.
శరీరంలోని ఏ ఇతర భాగాల్లో అయినా కణితి కనిపిస్తే ప్రోజన్‌బయాప్సి (ముక్క పరీక్ష) చేస్తే ఓ 10 నిమిషాల్లో రిపోర్టు వచ్చి వ్యాధి నిర్థారణ అయిపోతుంది. కాని, థైరాయిడ్‌ కణుతుల విషయంలో ఈ ప్రోజన్‌ బయాప్సి ఆధారంగా అది క్యాన్సరో కాదో నిర్ధారించడం చాలా కష్టం. థైరాయిడ్‌ గ్రంధికి ఇరువైపులా రెండు లోబ్స్‌ వుంటాయి. కుడి, ఎడమ లోబ్స్‌ అంటారు. ఒకవేళ కుడి లోబ్‌ లో కణితి ఏర్పడితే దాని ముక్క తీసి పరీక్షకు పంపితే ప్రోజన్‌ బయాప్సిలో ఒక్కోసారి ఏమీ తెలియకపోవచ్చు. అప్పుడు చివరి రిపోర్టు (పారాఫిన్‌ బయాప్సి) కోసం మళ్లీ ఎదురు చూడవలసి వుంటుంది.
పెద్ద వయసులో వేగంగా…….
నిజానికి 20 నుంచి 40 ఏళ్ల లోపు వచ్చే ఇతర క్యాన్సర్‌ లన్నీ వేగంగా పెరుగుతాయి. పెద్ద వయసులో మాత్రం నిదానంగా పెరుగుతాయి. అయితే, థైరాయిడ్‌ క్యాన్సర్ల తీరు మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా వుంటుంది. ఇవి 20 నుంచి 40 ఏళ్ల లోపు నిదానంగా పెరుగుతాయి. వైద్య చికిత్సలతో 95 శాతం మందిలో పూర్తిగా నయమవుతాయి. పెద్ద వయసులో వస్తే చాలా వేగంగా పెరుగుతాయి. అలాగే మరీ చిన్న ప్లిల్లో వచ్చే థైరాయిడ్‌ క్యాన్సర్లు కూడా చాలా వేగంగాపెరుగుతాయి. వీరందరికి శస్త్ర చికిత్స సరియైన మార్గం. థైరాయిడ్‌ క్యాన్సర్‌ కు శస్త్ర చికిత్స పూర్తయ్యాక రేడియో అయోడిన్‌ థెరపీ ఇస్తాం. నోటి ద్వారా అయోడిన్‌ ఇచ్చేదే ఈ థెరపీ. థైరాయిడ్‌ గ్రంధికి సహజంగా అయోడిన్‌ గ్రహించే తత్వం ఉంటుంది. అయోడిన్‌ థైరాయిడ్‌లో క్యాన్సర్‌ కణాల్లోకి వెళ్లిపోయి వాటిని నాశనం చేస్తుంది.
థైరాయిడ్‌ క్యాన్సర్‌ ఆలస్యంగానే వచ్చినా, థైరాయిడ్‌ గ్రంధిని మొత్తంగా తీసివేసి, రేడియో అయోడిన్‌ థెరపీ ఇస్తే వారిలో ఆయుష్షు గణనీయంగా పెరుగుతుంది. థైరాయిడ్‌ క్యాన్సర్లకు రేడియోషన్‌ గాని, కీమోథెరపీగాని పెద్దగా ఉపయోగపడదు. ఏమైనా శస్త్ర చికిత్స ఈ థైరాయిడ్‌ క్యాన్సర్లకు ప్రధాన చికిత్స.

About Cancer….కేన్సర్ గురించి

అత్యాధునిక చికిత్సలు ఎన్నివున్నా ….ఆరోగ్యకరమైన జీవనవిధానంతోనే క్యాన్సర్‌ ముప్పు తప్పుతుంది…..
క్యాన్సర్‌ వ్యాధి ప్రాణాంతకం. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లతో పెను ప్రమాదం అన్న భావనలు విస్తృతంగా వ్యాప్తి చెందాయి. కాని ప్రారంభ దశలో ఉన్నపుడే తగు చికిత్సా పద్ధతులను ఖచ్చితంగా అవలంభించడం వలన చాలామటుకు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. నిర్లక్ష్యం వీడితే: అన్ని ప్రాంతాలలోనూ క్యాన్సర్‌ ప్రభావం దాదాపు ఒకే రకంగా ఉంది. చాలా చోట్ల అవగాహనా రాహిత్యం, ఆరంభంలో వైద్యుల్ని సంప్రదించడంలో చేసే ఆలస్యం, సమస్య చిన్నదే కదా అన్న ధోరణి ప్రాణాపాయాన్ని అధికం చేస్తున్నాయి అంటున్నారు.
ముందు జాగ్రత్తలు ముఖ్యం : క్యాన్సర్‌ కేవలం పెద్ద వయసువారికే వస్తుందన్నది నిజం కాదంటరు శాంత. ఏ వయసు వారయినా ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, పరిశుభ్రత పాటించకపోవటం, ధూమపానం చేస్తున్న వారికి సన్నిహితంగా ఉండి పొగను పీల్చడం, కొన్ని ప్రాంతాల్లో మహిళలూ పొగాకూ తీసుకోవడం.. వంటివన్నీ క్యాన్సర్‌ ముప్పును పెంచుతాయి. అయితే , వయసు పెరిగే కొద్దీ మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవన విధానం తప్పనిసరిగా పాటించాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌, జంక్‌ఫుడ్‌లకు బదులుగా పోషకాహారం తీసుకోవడం అన్నివిధాలా మేలు అంటున్నారు.
అంతేకాదు, నేడు పాఠశాలల్లో క్రీడా మైదానాలు దాదాపు కనుమరుగయ్యాయి. ఇంటి నుంచి అతిస్వల్ప దూరం వెళ్లడానికిక్కూడా వాహనాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో శరీరానికి సహజ సిద్ధమైన నడక, వ్యాయామం వంటివి నిత్య జీవితంలో తగ్గిపోతున్నాయి. అది ఎన్నిరకాల శారీరక సమస్యలకు గురిచేస్తుందో ఊహించలేకపోతున్నారు అంటూ ముందు జాగ్రత్త అవశ్వకతను విశదీకరించారు.
అవగాహనతో ఆరోగ్యమే.. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కి సంబంధించి చాలామంది మహిళలకు అవగాహన లేదు సరికదా అపోహలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో మార్పు రావాలి అన్నారామె. ఆలస్యంగా వివాహం చేసుకోవటం, పిల్లల్ని కనడం, వారికి తల్లిపాలు పట్టకపోవడం, ఎక్కువకాలం గర్భనిరోథక మాత్రలను వాడటం, పట్టణ ప్రాంతాల్లో అధికంగా జరుగుతోంది. ఇవి రొమ్బు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను పెంచుతాయి. కనీసం ఆరు నెలల పాటయినా పిల్లలకు పాలివ్వడం తల్లికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక పెద్ద సంఖ్యలో గ్రామీణ మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో సతమతమవుతున్నారు.
చాలామంది దాని బారిన పడ్డట్లు కూడా తెలుసుకోలేకపోతున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించక పోవడం ప్రధాన సమస్య. పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉండదు. నెలసరి సమయంలో శానిటరీ న్యాప్‌కిన్లు వాడాలి. మల, మూత్ర విసర్జన తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ చిన్న చిన్న పద్ధతులు గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ నుంచి రక్షణను ఇస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న దీనిబారిన పడితే అది ప్రాణాంతకమనేనని చాలామంది ప్రాణాలపై ఆశలు వదులుకొంటారు. ఇది సరికాదు. ఆరంభదశలో దీనిని గుర్తించగలిగితే కోలుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. అక్కడి దాకా ఎందుకు ఏడాదికొకసారి పాప్‌స్మియర్‌ పరీక్షను చేయుంచుకోవడం వల్ల దానిని ముందే గుర్తించవచ్చు.

Cancer Symptoms…క్యాన్సర్‌ సంకేతాలు

మన ఒంట్లో కణాలన్నీక్రమపద్దతిలో శరీరమంతటా పెరుగుతూ, చనిపోతూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఇవి గతి తప్పి.. అవసరం లేకపోయినా, అవసరానికి మించి.. మన శరీరానికి హాని కలిగించేంతగా విపరీతంగా ఒకేచోట పెరుగుతాయి. ఇదే క్యాన్సర్‌. శరీరంలో ఏ భాగానికైనా క్యాన్సర్‌ రావొచ్చు. వీటిని తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స చెయ్యటం సులువు. చాలా ఎక్కువగా కనబడే 8 రకాల క్యాన్సర్లను తొలిదశలోనైతే పూర్తిగా నయం చేసే అవకాశముంది కూడా. Cancer Signs…క్యాన్సర్‌ సంకేతాలు..
అకారణంగా వేగంగా బరువు తగ్గిపోతుండటం. 5 అంతకన్నా ఎక్కువ కిలోల బరువు తగ్గిపోవటం.ఆకలి తగ్గటం. ఎప్పుడూ కడుపు నిండుగా ఉండటం. ముద్ద మింగుతున్నప్పుడు ఇబ్బందిగా అనిపించటం.తీవ్ర నిస్సత్తువకు లోనవుతుండటం. క్యాన్సర్‌ వృద్ధి చెందుతున్న సమయంలో తీవ్ర అలసట కనబడుతుంటుంది. ఇది విశ్రాంతి తీసుకున్నా తగ్గదు. ఎముక, వృషణాల క్యాన్సర్లలో నొప్పి తొలి సంకేతం కావొచ్చు. విడవకుండా తలనొప్పి, వెన్నునొప్పి వస్తుండటమూ కొన్ని రకాల క్యాన్సర్లకు సూచిక కావొచ్చు. మల విసర్జన పద్ధతుల్లో (మలబద్ధకం, అతిసారం).. మలం పరిమాణంలో మార్పులు తలెత్తటం.
మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, తరచుగా మూత్రం వస్తుండటం. నోట్లో చాలాకాలంగా మానకుండా పుండ్లు, తెల్లటి మచ్చలు ఉండటం. జననాంగాల్లో పుండ్లు, ఇన్‌ఫెక్షన్లు వేధిస్తుండటం. మూత్రంలో, మలంలో, కళ్లెలో రక్తం పడుతుండటం. మెడ వద్ద, చంకల్లో లింప్‌ గ్రంథులు ఉబ్బటం. ఇవి రెండు వారాలైనా తగ్గకపోతే వెంటనే జాగ్రత్త పడాలి. రొమ్ముల్లో మార్పులు, చనుమొనల నుంచి రక్తంతో కూడిన స్రావం వస్తుండటం. విడకకుండా దగ్గు వేధించటం. దగ్గుతో పాటు ఛాతీలో నొప్పి, గొంతు బొంగురుపోవటం, నిస్సత్తువ, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటివి కనబడితే ఏమాత్రం తాత్సారం చేయరాదు.
జ్వరం తగ్గకపోవటం. క్యాన్సర్‌ ఇతర చోట్లకు వ్యాపించినపుడు విడకుండా జ్వరం వేధిస్తుంటుంది. ఇలాంటి జ్వరాలు పగటిపూట పెరుగుతూ తగ్గుతూ వస్తుంటాయి. రోజులో ఒకే సమయంలో తీవ్రమవుతుంటాయి కూడా. ఆయా జబ్బులు ఉన్నంత మాత్రాన అందరికీ అన్ని లక్షణాలూ ఉండాలనేమీ లేదు. కొందరిలో కొన్నిరకాల లక్షణాలు కనబడితే మరికొందరిలో మరికొన్ని లక్షణాలు పొడసూపొచ్చు. నిజానికి జలుబు, ఫ్లూ వంటి మామూలు సమస్యల్లోనూ జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పుల వంటివి కనబడుతుంటాయి. వయసుతో పాటు అప్పుడప్పుడు మతిమరుపు వేధించటమూ సహజమే. కాబట్టి ఆయా లక్షణాలు కనబడినంత మాత్రాన వెంటనే బెంబేలు పడాల్సిన పనిలేదు. కానీ ఒకసారి డాక్టర్‌ను సంప్రతించి అసలు కారణమేంటో గుర్తించటం ముఖ్యం. దీంతో సమస్య ఏదైనా ఉంటే ముదరకుండా చూసుకోవచ్చు. ముందే నయం చేసుకోవచ్చు. ఒత్తిడి
ఒత్తిడి సహజం. స్వల్పంగా ఉన్నప్పుడిది మేలే చేస్తుంది. భయాలను జయించటానికి.. పనులను పూర్తి చేయటానికి అవసరమైన శక్తిని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కానీ అదేపనిగా ఒత్తిడికి లోనవుతున్నా.. దీర్ఘకాలంగా వేధిస్తున్నా ప్రమాదం తప్పదు. హైబీపీ, ఊబకాయం వంటి సమస్యలకూ దారితీస్తుంది. ఆత్మహత్య ఆలోచనలనూ ప్రేరేపించొచ్చు.
ఇవీ సంకేతాలు..
తలనొప్పి, మెడ నొప్పి, కండరాలు బిగుసుకుపోవటం.
నోరు పొడిబారుతుండటం.
గుండె దడ, ఛాతీలో నొప్పి.
తీవ్ర అలసట, నిస్సత్తువ.
ఆకలి తగ్గిపోవటం లేదూ తీపి పదార్థాలు, జంక్‌ ఫుడ్‌ అతిగా తినటం.
తరచుగా జలుబు, ఫ్లూ బారిన పడుతుండటం.
పనులపై శ్రద్ధ, ఆసక్తి తగ్గటం.
మతిమరుపు. అనవసర కోపం, ఆందోళన