కొలెస్ట్రాల్‌ vs గుడ్డు

Cholesterols Impact On Your Healthy  - Sakshi

కొలెస్ట్రాల్‌ అనగానే అది హానికరమనే విధంగా నే చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు ఉంటాయి. అది చెడు కొలెస్ట్రాల్‌ అయినా, మంచి కొలెస్ట్రాల్‌ అయినా ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్‌ అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్‌డిఎల్‌ అంటారు. వున శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులను రక్త పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. 12 గంటలపాటు ఏమీ తినకుండా ఈ టెస్ట్‌ చేయించుకోవాలి. ఈ పరీక్షలో మన ఎల్‌డీఎల్‌ (చెడు కొలెస్ట్రాల్‌), హెచ్‌డీఎల్‌ (మంచి కొలెస్ట్రాల్‌) మోతాదులు తెలుస్తాయి. ఎల్‌డీఎల్‌ ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎల్‌డీఎల్‌ను ‘‘చెడు కొలెస్ట్రాల్‌’’ అని అంటారు. కానీ హెచ్‌డీఎల్‌ రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. అందుకే హెడీఎల్‌ ను ‘‘ మంచి కొలెస్ట్రాల్‌’’ అని అంటారు.

మన శరీరంలో ఎప్పుడు హెచ్‌డీఎల్‌ ఎక్కువగా, ఎల్‌డీఎల్‌ తక్కువగా ఉండాలి. గుడ్డులోని తెల్లసొన లో మంచి కొలెస్ట్రాల్‌ ఉంటుంది. పచ్చ సొనలో చెడు కొలెస్ట్రాల్‌ ఉంటుంది. కాబట్టి తెల్లసొన తీసుకుని, పచ్చసొనను తగ్గించాల్సిందిగా డాక్టర్లు, ఆహారనిపుణులు చెబుతుంటారు. ఒకవేళ చెడు కొలెస్ట్రాల్‌ అంతగా లేనివారు మొత్తం గుడ్డును తినేయవచ్చు. కొలెస్ట్రాల్‌ కూడా ఉండాల్సిన మోతాదులో శరీరానికి అందాలి. అయితే అది తన మోతాదుకు మించకుండా చూసుకోవాలి. మంచి జీవనశైలితో మంచి ఆహార అలవాట్లతో సరైన వ్యాయామంతో చెడు కొలెస్ట్రాల్‌ ను అదుపులో పెట్టుకోవచ్చు.   

కొలస్ట్రాల్‌ (లిపిడ్స్‌) కొవ్వు ఎంత ఉండాలి?

పిల్లలలో, పెద్దలలో అందరిలో సామాన్యంగా కొలెస్ట్రాల్‌ పెరిగిందంటారు. దీన్నే మరో రకంగా లిపిడ్స్‌ అంటారు. వైద్యపరంగా ఈ లిపిడ్స్‌ శరీరంలో తయారయ్యే ముఖ్యమైన పోషక ద్రవ్యాలు. అలాగే మన శరీరంలోని ప్రతి వ్యవస్థలోనూ రకరకా బాధలని కలుగ చేసే కనిపించని నేరస్థుల లాంటివి కూడా. ఇది ఇంటి దొంగలా, మన జీవనాన్ని జీవకణాలు ఒంటపట్టించుకునే స్థితిని అస్థిరపరుస్తాయి. వాటినే మెటబాలిక్‌ డిజార్డర్‌ అంటారు.
మన ఆహారంలోనూ, మన శరీరంలోను అనేక ధాతుసంచయాలు ఉంటాయి. ఉదాహరణకి మనం తినే గోంగూరలో ఇనుప ధాతువు ఉంది. అలాగే మన రక్తంలో, ఎర్ర కణాలలోనూ ఉంది. ఈ ధాతు పుంజాలను లిపిడ్స్‌ అంటారు. అవి కొవ్వు పదార్థాల న్యూట్రల్‌ ఫ్యాట్స్‌ కావచ్చు. వీటిని ట్రైగ్లిజరైడ్స్‌ అని కూడా అంటారు. లేదా ఫాస్పోలిపిడ్స్‌ కావచ్చు. లేదా కొలెస్ట్రాల్‌ కావచ్చు. ఇందులో ట్రైగ్లిజరైడ్స్‌ ఒక రకంగా శరీరానికి శక్తినిచ్చే ధాతుపుంజాలు. మనం తినే ఆహారంలోని కొవ్వుపదార్థాలు జీర్ణావస్థ దాటాక చిన్నప్రేవులలో ఫ్యాటీయాసిడ్స్‌ రూపంలో రక్తంలోకి గ్రహించబడతాయి. మనం అన్నం తిన్న గంటకి మనం తిన్న కొవ్వుపదార్థాలు ఈ పరిణామం చెందటం వల్ల మన రక్తం చిక్కపడుతుంది. మరో గంట తర్వాత మామూలు స్థితికి వస్తుంది. దీనికి కారణం జీర్ణమైన ఈ లిపిడ్స్‌ సూక్ష్మరూపంలో రక్తంలో పరిణామం చెందటం. కొలస్ట్రాల్‌ 200కు తక్కువగా ఉండాలి
రక్తంలోకి చేరిన ఈ కొవ్వుపదార్థాల సూక్ష్మపదార్థాలు చిన్న చిన్న రక్తవాహికలలోని సున్నితమైన లోపలి పొరల్లోను లివరులోను చేరి అక్కడ నుంచి మిగతా శరీరభాగాలకి ప్రయాణించి శక్తిని కలుగచేయాలి. కాని కొన్నిసార్లు ఇవి అక్కడే ఉండిపోవటం కూడా జరుగుతుంది. ఇది మనకి వ్యాధి కారణం కావచ్చు. రక్తంలో ఈ కొవ్వు ధాతుపదార్థం చాలా కొద్దిగానే ఉన్నా ప్రతి మూడు నిమిషాలకి తిరిగి చేరుతూ ఉంటుంది. మిగతా ఏవి లేకపోయినా ఈ ఫ్యాటీ యాసిడ్స్‌ మన శరీరానికి కావలిసిన శక్తినిస్తాయి. ఇవి చక్కగా రక్తప్రసారంలో కదలుతూ రక్తవాహికలలోనూ, లివర్‌లోనూ ఉండిపోక మిగతా శరీరభాగాలకి వెళ్ళి ఉపయోగపడాలి. అలా జరగని స్థితి మనకి హానిని కలుగచేస్తుంది. అందుకే మన రక్తంలో ఈ కొలస్ట్రాల్‌ ఎపుడూ సరైన స్థితిలో ఉంచుకునేలా మనం జాగ్రత్తపడాలి. మొత్తం కొలస్ట్రాల్‌ 200కి తక్కువగా ఉండాలి. ఆడవారిలో 50కి తక్కువ, మగ్నవాళ్ళలో 40కి తక్కువగా ఉండాలి.
మన రక్తంలో 100-130 మధ్యలో ఉంచుకోవటం మంచిది. ట్రైగ్లిజరైడ్స్‌ ఎప్పుడూ 150కి తక్కువగా ఉండేలా చూసుకోవాలి, మన శరీరంలో కొవ్వు పదార్థాలు ముఖ్యంగా రక్తవాహికలలోనూ, లివర్‌లోనూ నిలవచేయబడుతుంది.
ముఖ్యంగా లివర్‌లో ట్రైగ్లిజరైడ్స్‌ ఎక్కువగా ఉండి మన ఉపవాసం ఉన్నప్పుడు పెరిగి శరీరానికి శక్తిని సమకూర్చడానికి సహాయపడతాయి. ఇవి ఎక్కువై నిలవ ఉంటే చెడుచేస్తాయి. అందుకే మనం ముఖ్యంగా కాస్త ఒళ్ళు వస్తున్న వాళ్ళు, లావుగా ఉండేవాళ్ళు రక్తపరీక్ష తరచూ చేయించుకుంటూ లిపిడ్స్‌ స్థితిని చూసుకుంటూ వుండాలి. ఆహారంలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉండేవి తరచూ తింటుంటే ఈ లిపిడ్స్‌ పెరిగి రక్తకణాలో పలుచోట్ల పేరుకుపోయి హైపర్‌ కొలెస్టరాల్‌ అనే స్థితి వచ్చి వ్యాధికి కారణం అవుతుంది. ముఖ్యంగా గుండెని బాధపెడుతుంది. సరైన స్థితిలో వున్న ఈ కొలెస్టరాల్‌ లివర్‌లో చేరి మిగతా వాటిలో కలిసి జీర్ణశక్తిని పెంపొందించి, ధాతుపరిణామానికి సహాయపడుతుంది.
జాగ్రత్తలు : ఈ కొస్టరాల్‌ మన శరీరంలో ఎక్కువగా చేరితే గుండెని, ఊపిరితిత్తులను, రక్తాన్ని ప్రభావితం చేసి కొన్నిసార్లు తిప్పుకోలేని బాధని కలుగ చేస్తుంది. మనం చూసుకోకపోతే ఈ పరిణామం మనకి తెలియకుండానే జరుగుతుంది. ఈ తీవ్రతను గుర్తించి అమెరికాలో ‘‘నేషనల్‌ హార్ట్ లంగ్స్‌ బ్లడ్‌ ఇన్‌స్టిట్యూట్‌’’ వివిధ పరిశోధలను , తీసుకోవలసిన జాగ్రత్తలు చేసి ప్రజలకు సూచిస్తున్నది. కొలస్టరాల్‌ మనలో పెరుగుతున్నదని గుర్తించాక డాక్టరుని సంప్రదించి గుండెజబ్బు సూచనలను కాని, రక్తవాహికలో మార్పులు, జబ్బులు కాని ఉన్నాయేమో చూసుకోవాలి. ఈ స్థితివల్ల 55 ఏళ్ళు దాటాక గుండెజబ్బు వచ్చినట్లుంటే మరీ జాగ్రత్త పడాలి. పొగతాగటం, బి.పి తగ్గకుండా వుండటం, మధ్య వయస్సులో ముఖ్యంగా మగవారిలో 40 దాటాక, ఆడవారిలో 50 దాటాక ఒళ్ళు వస్తున్నట్లు అనిపించినా, ఆయాసం వస్తున్నా జాగ్రత్తపడటం అవసరం.
ముఖ్యంగా కరిగే పీచుపదార్థం వున్న బార్లీ, యాపిల్‌, క్యారెట్‌, చిక్కుళ్ళు, నారింజ, బత్తాయి వంటివి ఆహారంలో తీసుకుని, వేపుడు కూరలు, పెరుగు, స్వీట్లు, అధికంగా మాంసాహారం తగ్గించాలి. నడక మేలుచేస్తుంది. నడవండి.
లిపిడ్స్‌ సరియైన స్థితిలో ఉండటానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు : ఎండుచేపలు, ఆకుకూరలు, కమ్మని మజ్జిగ, రాగిచెంబులో నిల్వ ఉంచిన నీళ్ళు కొలెస్టరాల్‌ను తగ్గిస్తాయి. రోజూ గుడ్డు తింటే కొలెస్టరాల్‌ పెరుగుతుంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Cholesterol Levels

Cholesterol…….. Normal Levels MgDL 200 ………… Negligible Levels MgDL 200-239 ……….. Danger Levels MgDL 240
Tryglycerids…….. “Normal Levels MgDL” 150 ………… “Negligible Levels MgDL” 150-200 ……….. “Danger Levels MgDL” 200
HDL………. Normal Levels Less than 40 mg/dL ………… “Negligible Levels MgDL” 40—59 mg/dL  ……….. “Danger Levels MgDL” 60 mg/dL and higher  LDL ……. “Normal Levels MgDL” 60-129 ………… “Negligible Levels MgDL” 135-159 ……….. “Danger Levels MgDL” 160-189

ట్రైగ్లిజరైడ్లు…… Triglysaroids

కొలెస్ట్రాల్‌.. దీని గురించి మనకు ఇప్పుడు ఎంతో కొంత తెలుసు. మనం కొలెస్ట్రాల్‌ గురించి ఎక్కువే ఆందోళన చెందుతున్నాం. తరచుగా కొలెస్ట్రాల్‌ పరీక్ష చేయించుకుని చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉంటే వెంటనే తగ్గించుకునే మార్గం గురించి ఆలోచిస్తున్నాం. ఇది అవసరమేగానీ.. ఇంతకంటే ప్రాముఖ్యం ఉన్నదీ, మనం బాగా నిర్లక్ష్యం చేస్తున్నదీ మరోటి ఉంది. అదే ట్రైగ్లిజరైడ్లు!
మనం ‘లిపిడ్‌ ప్రొఫైల్‌’ పరీక్ష చేయించుకున్నప్పుడు కొలెస్ట్రాల్‌తో పాటుగా రిపోర్టులో ఇది కూడా ఉంటుందిగానీ దీన్ని గురించి మనం ఎక్కువగా పట్టించుకోవటం లేదు. ఇది సరికాదు. ఆరోగ్య పరంగా, వైద్యపరంగా కొలెస్ట్రాల్‌ కంటే ట్రైగ్లిజరైడ్లకు కాస్త ఎక్కువ ప్రాధాన్యమే ఉందిగానీ తక్కువ కాదు. ముఖ్యంగా మన భారతీయుల్లో చాలా అనారోగ్యాలకు, వ్యాధులకు ట్రైగ్లిజరైడ్లే కీలక పాత్ర పోషిస్తున్నాయి.
భారతీయుల్లో మరీ ఎక్కువ: మన భారతీయులకు రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువుండటం కంటే కూడా ట్రైగ్లిజరైడ్లు ఎక్కువుండటమనే సమస్య అధికం! ఈ విషయాన్ని యాభై ఏళ్లుగా భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) వంటి అత్యున్నత సంస్థలు చేస్తున్న అధ్యయనాలు వెల్లడిస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఆ విజ్ఞానం రోగుల వరకూ, చికిత్సల వరకూ రావటం లేదు. వైద్యులు కూడా కొలెస్ట్రాల్‌ గురించి తీసుకున్నంతటి శ్రద్ధ ఈ ట్రైగ్లిజరైడ్ల విషయంలో చూపించటం లేదన్న వాదన ఉంది. కానీ మన భారతీయులకు సంబంధించి ట్రైగ్లిజరైడ్లు మరీ కీలకమైనవని గుర్తించటం చాలా అవసరం.
ఎక్కువుంటే నష్టం ఏమిటి?
* ట్రైగ్లిజరైడ్లు ఎక్కువుంటే గుండె జబ్బులు పొంచి ఉంటాయి. ట్రైగ్లిజరైడ్లు ఎక్కువ ఉండటం వల్ల ఎప్పుడైనా కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, రక్తనాళాల వ్యాధుల వంటివన్నీ పొంచి ఉంటాయి. ఇదొక రకం సమస్య అయితే… గుండె, రక్తనాళాల జబ్బుల బారినపడుతున్న 70% మందికి కొలెస్ట్రాల్‌ సాధారణ స్థాయిలోనే ఉండి, కేవలం ట్రైగ్లిజరైడ్లు మాత్రమే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి చాలా రకాల జీవనశైలి సంబంధ రుగ్మతలకు ట్రైగ్లిజరైడ్లను మూలంగా భావిస్తున్నారు.
* ట్రైగ్లిజరైడ్ల స్థాయి చాలా ఎక్కువైతే (ఈ సమస్య మద్యం ఎక్కువగా తాగే వారిలో మరీ అధికం) క్లోమగ్రంథి దెబ్బతినే ‘పాంక్రియాటైటిస్‌’ అనే తీవ్ర సమస్య తలెత్తుతుంది.
* ట్రైగ్లిజరైడ్లు అనేవి కొవ్వు పదార్థం. ఇవి ఎక్కువగా ఉంటే శరీరంలోని ప్రతి జీవ రసాయన క్రియకూ అడ్డుపడుతూ శారీరక ప్రక్రియలన్నింటినీ మందగింపజేస్తాయి. హైపోథైరాయిడిజం, లివర్‌ సిరోసిస్‌ వంటి సమస్యలుంటే దీనివల్ల అవి ఎక్కువ కావచ్చు.
* ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం వల్ల అతిపెద్ద నష్టం- రక్తనాళాల గోడలు దెబ్బతినటం. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ కొవ్వు ముద్దలు పేరుకోవటం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు తలెత్తుతాయి. వాస్తవానికి అక్కడ కొలెస్ట్రాల్‌ పేరుకోవటానికి ముందే- రక్తంలో అధికంగా ఉన్న ట్రైగ్లిజరైడ్లు ఆ ప్రాంతాన్ని (ఎండోథీలియం) దెబ్బతీస్తాయి. ఇవి ముందు దెబ్బతీస్తే.. తర్వాత ఆ ప్రదేశంలో కొలెస్ట్రాల్‌ (ఎథిరోమా) వచ్చి పేరుకుంటుంది. వాస్తవంగా పరీక్షించి చూస్తే అక్కడ పేరుకునే దానిలో కొలెస్ట్రాలే ఉండొచ్చుగానీ అసలు దారి తీసే పరిస్థితిని సృష్టించేవి ఈ ట్రైగ్లిజరైడ్లే! కాబట్టి ముందే వీటిని అడ్డుకుంటే కొలెస్ట్రాల్‌ పేరుకునే సమస్యను బాగా నివారించవచ్చు.
ఎందుకు పెరుగుతాయి?
1. వూబకాయంv 2. మధుమేహం
3. మద్యం ఎక్కువగా తీసుకోవటం వల్లగానీ, క్లోమంలో రాళ్ల వల్లగానీ ఏదైనా కారణంతో పాంక్రియాస్‌ గ్రంథి వాపునకు గురైతే దానివల్ల ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి.
4. లివర్‌ జబ్బులు, సిరోసిస్‌
5. పసరుతిత్తిలో రాళ్ల వంటివీ ట్రైగ్లిజరైడ్లను పెంచుతాయి.
6. పుట్టుకతో వచ్చే కొన్ని కొవ్వుల సమస్యలు. ఇవి ప్రధాన కారణాలేగానీ..
వాస్తవానికి భారతీయుల్లో 70% మందికి ఇవేమీ లేకుండా కూడా ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి వీటి విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రల వంటి తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. మన తీరు వేరు! మనం ఆహారం తీసుకుంటాం. అది జీర్ణమై.. మన శరీరానికి అవసరమైన శక్తి రూపంలోకి ఎలా పరిణామం చెందుతోంది? ఈ ప్రక్రియ ఎలా జరుగుతోందన్న దానిపై బెంగళూరుకు చెందిన సెయింట్‌ జాన్స్‌ వైద్య కళాశాల ఫిజియాలజీ విభాగం వారు దాదాపు 25 ఏళ్ల క్రితమే లోతుగా అధ్యయనం చేసి.. ఈ విషయంలో మన భారతీయులకూ – పాశ్చాత్యులకూ మధ్య చాలా కీలకమైన వ్యత్యాసం ఉందని గుర్తించారు. ఆహారం తీసుకున్నప్పుడు దానిలోని కొవ్వు పదార్ధాల్ని మన భారతీయుల్లో శరీరం ముందుగా గ్లిజరాల్‌, ఫ్యాటీ ఆమ్లాలుగా మార్చుకుని.. పేగుల గోడల్లోనే ‘ట్రైగ్లిజరైడ్లు’గా మార్చేసుకుని.. అక్కడి నుంచే దాన్ని దాచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. అలా నిల్వ రూపంలోకి మార్చుకోగా మిగిలే దాన్నే శక్తిగా మార్చుకుని ఖర్చు పెడుతోందని గుర్తించారు.
కానీ పాశ్చాత్యుల్లో వారి శరీరం తిన్న ఆహారంలోని కొవ్వుల్ని ముందుగా గ్లిజరాల్‌, ఫ్యాటీ ఆమ్లాలుగా మార్చుకుని.. శక్తిలా వినియోగించుకుంటూ, అలా వాడుకోగా మిగిలిన దాన్ని అప్పుడు ట్రైగ్లిజరైడ్లు, కొవ్వులుగా మార్చుకుని నిల్వ చేసుకుంటోంది. మన భారతీయులకూ, పాశ్చాత్యులకూ ఇంత తేడా ఎందుకు వచ్చిందన్న దానికి చాలా సిద్ధాంతాలున్నాయి. బలంగా వినిపించేది మాత్రం ‘థ్రిఫ్టీ జీన్‌’ సిద్ధాంతం. దీనిప్రకారం ఒకప్పుడు మన ప్రాంతంలో కరవులు, క్షామాలు ఎక్కువగా ఉండటం వల్ల శక్తిని, ఆహారాన్ని ఎక్కువగా నిల్వ ఉంచుకునేందుకు మనలో జన్యుపరంగానే మార్పులుచోటుచేసుకున్నాయి. అందువల్ల పాశ్చాత్యులతో పోలిస్తే మన భారతీయుల్లో ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తలెత్తుతోంది. కొలెస్ట్రాల్‌ కంటే మరీ ప్రమాదం..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలన్నీ కూడా కొలెస్ట్రాల్‌ కంటే కూడా ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం మరింత ప్రమాదకరమైన విషయమని నానాటికీ గుర్తిస్తున్నాయి. క్రమేపీ వైద్యరంగం దృష్టి కొలెస్ట్రాల్‌ మీది నుంచి ట్రైగ్లిజరైడ్ల మీదికి మళ్లుతోంది. అందుకు ముఖ్యమైన ఉదాహరణ- ఆధునిక రుగ్మతలన్నింటికీ మూలకారణంగా భావిస్తున్న‘మెటబాలిక్‌ సిండ్రోమ్‌’ను నిర్వచించే విషయంలో దానికి కారణమయ్యే అంశాల్లో ‘టోటల్‌ కొలెస్ట్రాల్‌’కు బదులుగా ట్రైగ్లిజరైడ్లను ఉంచటం! ఆ కారణాలేమిటన్నది చూస్తే- బొజ్జ, అధిక బీపీ, రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉండటం, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం, మంచి కొలెస్ట్రాల్‌ తక్కువుండటం. దీన్నిబట్టి ట్రైగ్లిజరైడ్ల ప్రాధాన్యం సుస్పష్టం.