చిలగడదుంప

Eat Sweet Potato With Skin - Sakshi

చిలగడదుంప పొట్టుతో సహా తినడం మేలు

సాధారణంగా చిలగడదుంప తినేవారు, దాన్ని ఉడకబెట్టిగానీ లేదా కాల్చిగానీ తింటుంటారు. ఇలా ఉడకబెట్టడం/ కాల్చడం చేశాక తినేటప్పుడు దానిపైన పింక్‌ రంగులో కనిపించే పొట్టును ఒలిచి తింటుంటారు. కానీ చిలగడదుంప పైన ఉండే పొట్టులో కెరటినాయిడ్స్‌ అనే పోషకాలు ఉంటాయి. ఇవి నోరు, ఫ్యారింగ్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడానికి బాగా తోడ్పడతాయి.

వాటితోపాటు ఇందులోనే ఉండే బీటా కెరోటిన్‌ అనే మరో పోషకం ఈసోఫేగల్‌ క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడే జీర్ణవ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి తోడ్పడుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నందున ఈ పింక్‌ రంగులో ఉండే పొట్టును ఒలిచిపారేయకుండా తినేయండి.

బీట్‌రూట్ – ఆరోగ్య ప్రయోజనాలు

Health Benefits Of Beetroot - Sakshi

బీట్‌రూట్‌లో ఫైటోన్యూట్రియంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. అంతేగాక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల ఆస్టియోఆర్థరైటీస్‌ వల్ల కలిగే నొప్పులు తగ్గుతాయి.

మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కావాలంటే అవసరమయ్యే డైటరీ ఫైబర్‌(పీచుపదార్థం) బీట్‌రూట్‌లో దొరుకుతుంది. ఒక కప్పు బీట్‌రూట్‌లో గ్లుటమైన్, ఎమినో యాసిడ్స్, 3.4 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచడంతోపాటు, మలబద్దకాన్ని నిరోధిస్తాయి. కోలన్‌ క్యాన్సర్‌ ముప్పును తొలగిస్తుంది. అంతేగాక జీవక్రియలను మెరుగుపరుస్తాయి. 

బీట్‌రూట్‌లో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల తిన్న తరువాత ఎక్కువసేపు ఆకలికూడా వేయదు.
బీట్‌రూట్‌లో ఉన్న నైట్రేట్స్‌ రక్తప్రసరణను మెరుగు పరిచి మెదడు పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తాయి. రక్త ప్రసరణ మంచిగా జరిగినప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపీడనం(బీపీ) నియంత్రణలో ఉండడం వల్ల హార్ట్‌ ఎటాక్స్‌ వంటి సమస్యలేవి తలెత్తవు.

బీట్‌రూట్‌లో యాంటీ క్యాన్సర్‌ గుణాలు సమద్ధిగా ఉన్నాయి. తెల్లరక్తకణాల ఉత్పత్తిని బీట్‌రూట్‌ ప్రేరేపిస్తుంది. ఫలితంగా అసాధారణంగా జరిగే కణవిభజనను నిరోధిస్తుంది. ఫలితంగా ఇది యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్‌గా పనిచేస్తుందని చెప్పవచ్చు.

బీట్‌రూట్‌ను రోజూ డైట్‌లో చేర్చుకుంటే శరీరంలో చెడుకొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. రోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ను తాగితే మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

డీహైడ్రేషన్‌ సమస్యతో బాధపడేవారికి బీట్‌రూట్‌ ఒక వరంలాంటిది. బీట్‌రూట్‌ను జ్యూస్‌రూపంలో డీ హైడ్రేషన్‌ బాధితులు తీసుకుంటే వారి సమస్య పరిష్కారమవుతుంది. మన శరీరానికి అవసరమైన నీరు బీట్‌రూట్‌ నుంచి దొరుకుతుంది.

రక్తహీనత ఉన్నవారికి బీట్‌రూట్‌ ఒక దివ్యౌషధం. బీట్‌రూట్‌ను ప్రతిరోజూ తినడం వల్ల రక్త హీనత తగ్గుతుంది.
విటమిన్‌ బీ6, విటమిన్‌ సి, ఫోలిక్‌ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్, ఫాస్ఫరస్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.

బెండకాయలు (లేడీ ఫింగర్‌)

Lady Finger Can Prevent Several Diseases - Sakshi

దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు కూరగాయల రారాజు బెండకాయ(లేడీ ఫింగర్‌)అద్భుతంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా బెండలో అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. బెండలో సీ,ఈ, కే, ఏ, విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి. కాగా, అధనంగా ఫైబర్‌, పోటాషియం, యాంటిఆక్సిడెంట్లతో మానవులకు కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి.

బరువు తగ్గడం
బరువు తగ్గాలనుకునే వారికి బెండ సంజీవనిగా పనిచేస్తుంది. బెండను నిత్యం తీసుకోవడం వల్ల పోషకాలు లబించడంతో పాటు, బరువు తగ్గడానికి ఎంతో దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు

డయాబెటిస్‌ను అదుపు చేయడం
బెండలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ (రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించేది) చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో మధుమేహాన్ని అదుపు చేసే మైరెసిటీన్‌ ఉంటుంది.  కాగా ఇది కండరాల ద్వారా రక్తంలో చక్కెర శాతాన్ని అదుపు చేస్తుంది.

గుండె వ్యాధుల నియంత్రణకు
కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాద ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. అధిక కొవ్వు (ఊబకాయం)తో బాధపడే వారికి బెండ మేలు మరువలేనిది. ముఖ్యంగా పెక్టిన్‌ అనే ఫైబర్‌ గుండె జబ్బులు కలగజేసే చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుందని అధ్యయానాల్లో తేలింది. మరోవైపు బెండలో ఉన్న పాలిఫినాల్స్‌ ఆర్టరీ బ్లాకులను నివారిస్తుంది.

క్యాన్సర్‌ నివారణకు
బెండలో ఉన్న లెక్టిన్‌ రొమ్ము క్యాన్సర్‌ రిస్క్‌ను 65శాతం మేర నివారిస్తుందని ఇటీవలే ఓ బయోటెక్నాలజీ నివేదిక తెలిపింది. మరోవైపు బెండతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడంతో పాటు, కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి

అందమైన చర్మం కోసం
బెండలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, కెరటోనాయిడ్స్‌ పదార్థం లభించడం వల్ల వయస్సు తక్కువగా కనిపించడానికి ఉపయోగపడుతుంది. మరోవైపు చెడు చర్మ గ్రంథులను తొలగించే శక్తి బెండలో ఉన్నాయి

జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి
బెండలో ఉన్న డయిటరీ ఫైబర్‌ వల్ల మలబద్దకం, అజీర్ణం లాంటి సమస్యలను నివారిస్తుంది. జీర్ణశక్తికి బెండ ఎంతో మేలు చేస్తున్నట్లు అధ్యయనాలున్నాయి

బెండతో గర్భిణి స్త్రీలకు ఎంతో మేలు
బెండకాయను గర్భిణి స్త్రీలు నిత్యం తినడం వల్ల గర్భిణిలకు అతిముఖ్యమైన ఫోలేట్‌(విటమిన్‌ 9) పోషకం లభిస్తుంది. బెండను నిత్యం తీసుకోవడం వల్ల కొత్తగా జన్మించే శిశువులకు జన్యుపరమైన నరాల జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.

రోగనిరోధక శక్తి పెరుగుదల
బెండను నిత్యం మన ఆహార అలవాట్లలో వాడడం వల్ల మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. బెండలో అత్యధికంగా లభించే విటమిన్‌ సీ వల్ల భయంకరమైన వైరస్‌(కరోనా వైరస్‌) లను ఎదుర్కొవచ్చు. రుచి కోసం చూసుకోకుండా బెండను నిత్యం వాడడంతో ఎన్నో భయంకరమైన రోగాలను నివారించవచ్చు

How to find best vegetables

కూరగాయలు, ఆకు కూరలు వండేముందు శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడిగితే 80శాతం దాకా క్రిమి సంహారక అవశేషాలు పోతాయి. ఇంకా ఉడికించినపుడు, వేయించినపుడు ఇంకొన్ని నాశనమవుతాయి అని భరోసా ఇచ్చింది జాతీయ పోషకాహార సంస్థ నియమావళి.
కూరగాయలను ఆకుకూరలను ఉప్పు కలిపిన నీళ్ళలో శుభ్రంగా కడిగిన తరువాతే తరగాలి. తరిగాక కడగటం మంచిది కాదు.
కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా కోయటం వలన పోషక విలువలు తగ్గిపోతాయి. మరీ ఎక్కువసేపు నాన బెట్టటం వలన కొన్ని రకాల విటమిన్లు ఖనిజాలు కరిగిపోతాయి.వంటలలో నూనెలు తక్కువగా వాడాలి.నెయ్యి వెన్నలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.

ఆకుకూరలు
కొత్తిమీర, పాలకూర, తోటకూర, ఏదయినా సరే ఆకుపచ్చ రంగులో ఉండి తాజాగా కనిపించాలి.ఆకులపై రంధ్రాలున్నా, వాడిపోయునా, ఎండిపోయినట్లున్నా, రంగుమారి కనిపించినా తాజావి కావనే అర్ధం. కొత్తిమీర ఆకుపచ్చ రంగులో ఉండి పొట్టిగా ఉంటే నాటు కొత్తిమీర అని అర్ధం. హైబ్రీడ్ రకాలు పొడుగ్గా లేతపచ్చ రంగులో ఉంటాయి.
దుంపలు
ముల్లంగి, క్యారెట్, బీట్ రూట్, బంగాళాదుంప, చిలగడదుంప …. వీటిని చేతిలోకి తీసుకుని చూస్తే బరువుగా ఉండాలి. తొక్క కూడామృదువుగాఉండాలి. మడతలు ఉండకూడదు.బంగాళాదుంపలకు ఆకుపచ్చ రంగు ఉండకూడదు. ఆకుపచ్చ రంగు ఉన్న భాగాన్ని తీసివేసినా అందులో సొలనైన్ అనే హానికరమైన రసాయనం ఉంటుంది. మొలకలు వచ్చిన బంగాళాదుంపలు కూడా మంచివి కావు.
తర్పూజా తొడిమ భాగంలో కొద్దిగా నొక్కితే అది మొత్తగా ఉంటే తర్బూజా బాగా పండినట్లు. లేదంటే వాసన చూడండి, తీపివాసన వస్తుంది. వాసన పెరిగే కొద్ది బాగా పండినట్లు.

పచ్చిమిర్చి

పచ్చిమిరపకాయలలో యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి సంరక్షణను ఇస్తాయి. ఫ్రీరాడికల్స్ తో పోరాడి శరీరాన్ని శుద్ది చేస్తాయి. కేన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయి.
పచ్చిమిరపకాయలలో సి విటమిన్ ఉంటుంది. ఇది ముక్కుపుటాలను తెరుస్తుంది.శ్వాసవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
పచ్చిమిరపకాయలలో తింటే చర్మానికి మేలు చేస్తుంది. పచ్చిమిరపకాయలలో ఉండే విటమిన్ ఇ చర్మానికి మెరుపు తెచ్చే సహజమైన నూనెలను విడుదల చేస్తుంది.
పచ్చిమిరపకాయలలో క్యాలరీలు ఉండవు. పురుషులకు సాధారణంగా వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ ను నిరోధించేందుకు పచ్చిమిరపకాయలు సాయంచేస్తాయి.
డయాబెటిస్ వారికి రక్తంలో చక్కెరస్థాయిలు తక్కువ ఎక్కువ కాకుండా చేస్తాయి. పచ్చిమిరపకాయలలోని పీచుపదార్ధం జీర్ణశక్తికి దోహదపడుతుంది.
సహజసిద్ధంగా ఉండే ఐరన్ శరీరానికి కావాలంటే పచ్చిమిరపకాయలు కావలిసిందే. ముఖ్యంగా మహిళలకు ఐరన్ లోపం లేకుండా సహాయం చేస్తుంది.
పచ్చిమిరపకాయలను ఎడా పెడా తినకూడదు వారి స్ధాయిని బట్టి తినాలి. నేరుగా కూడా తినకూడదు. కూరలలో తినాలి. పచ్చడిగా తినవచ్చు.

వంకాయ

Image by Peggy Choucair from Pixabay

గుత్తి వంకాయ కూరను ఇష్టపడిన వ్యక్తులు ఎవరుంటారు చెప్పండి. మాంచి మసాలా దట్టించి.. నూనెలో వేయించి కాడతో సహా ఆరగిస్తే భలే మజాగా ఉంటుంది. అయితే, కొందరు మాత్రం వంకాయను తినేందుకు వెనకాడతారు. ఎందుకంటే.. అందరికీ వంకాయ పడదు. స్కిన్ అలర్జీలతో బాధపడేవారు వంకాయలను దూరంగా ఉండటమే మంచిది. అలాంటప్పుడు వంకాయను ఎలా ఆరోగ్యకరమైన కాయగూర అంటారనేగా మీ సందేహం. ఎందుకంటే.. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ ఒక్క కారణం తప్పా.. మిగతా విషయాల్లో వంకాయ చాలా ఉత్తమమైనది. అతిగా కాకుండా వారానికి ఒక్కసారి వంకాయను ఆహారంగా తీసుకున్నా చాలు.

ఆరోగ్య ప్రయోజనాలివే:
❂ టైప్-2 మధుమేహం రోగుల రక్తంలోని చక్కెర్ల (గ్లోకోజ్) స్థాయిని తగ్గించడంలో వంకాయ బాగా పనిచేస్తుంది.
❂ వంకాయలో పిండి పదార్థాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
❂ వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రైట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది.
❂ వంకాయ శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది.
❂ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
❂ వంకాయలోని ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి.
❂ వంకాయ శరీరంలోని అదనపు ఐరన్‌ను తొలగిస్తుంది.
❂ వంకాయలో కరిగే పైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది.
❂ వంకాయ శరీరంలోని విషతుల్యాలను, వ్యర్థాలను తొలగిస్తుంది.
❂ శరీరానికి అందే కెలోరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
❂ వంకాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

❂ ఉబ్బసం, మలబద్ధకం, పేగు సంబంధిత సమస్యలు, పుండ్లు, పెద్ద పేగు క్యానర్సన్లు తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది.
❂ వంకాయ శరీరానికి పడితే చర్మంపై ముడతలు లేకుండా యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
❂ జుట్టు బలోపేతం కావడానికి వంకాయ సహకరిస్తుంది. జుట్టు ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.
❂ మలేరియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు కాల్చిన వంకాయకు కాస్త చక్కర ముట్టించి ఇవ్వాలంటారు.
❂ నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పడుకోడానికి సుమారు 4 గంటల ముందు కాల్చిన వంకాయని తినడం ఉత్తమం.
❂ వంకాయ గుత్తి మూలశంక (పైల్స్), హేమరాయిడ్స్ నివారణ చికిత్సలో ఉపయోగిస్తారు.
❂ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం వంకాయను పిండి కట్టుల్లో వాడతారు.
❂ వంకాయ శరీర వాసనను నివారిస్తుంది.
❂ వంకాయలోని ఫైబర్ శరీరంలోని విషాన్ని, రసాయనాలను గ్రహించి పెద్ద పేగు క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.

❂ శరీరంలోని కణాలు.. క్యాన్సర్ గడ్డలుగా ఏర్పడకుండా వంకాయ కాపాడుతుంది.
❂ వంకాయలో సోడియం తక్కువ. కాబట్టి.. బీపీ సమస్యతో బాధపడేవారు తినొచ్చు.
❂ పంటి సమస్యలను నివారిస్తుంది.

చింత పండు

చింత చెట్టు పొడవైన తిరిగిన గోధుమరంగు కాయలను ఉత్పత్తి చేస్తుంది వాటిని మనం చింతకాయలు అని పిలుస్తాము అయితే ప్రతీ కాయలు మూడు నుంచి 12 చిన్న గోధుమరంగు విత్తనాలు ఉంటాయి దీనితోపాటు గుచ్చుకోకూడదని ఎలా ఉంటుంది ఎదురు చాలా పుల్లగా ఉంటుంది ఇది ఎందుకు పుల్లగా ఉంటుంది అంటే దీనిలో టార్టారిక్ ఆమ్లం ఉంటుంది ఈ కాయ పండు తింటే చింతపండు లభిస్తుంది చింతకాయలు మాత్రమే కాకుండా దీని ఆకులు కూడా వంటల్లో ఉపయోగిస్తాము దీని రుచి కూడా కూల్గానే ఉంటుంది చింతపండుని కోల్డ్ స్టోరేజ్ లో భద్ర పరిచి చాలా కాలం వరకు వాడుతూ ఉంటారు దీనిని మన షాపుల్లో ఏసి చింతపండు అని చెప్పి అమ్ముతారు దీనిలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి.

ఆరోగ్య పరంగా చాలా మంచిదని చరిత్ర కూడా ఉంది అనేక సమస్యలకు చింతపండుని వాడడం కూడా జరుగుతుంది అజీర్తి సమస్యలకు ప్రేగులో ఆహారము కదలిక సాఫీగా ఉండడానికి కూడా చింతపండును వాడతారు దీనిలో పీచు సహజ విరేచ కారణంగా పనిచేస్తారు అంటే జీవితం వ్యవస్థ సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది చింతపండు దీనిలో ఉన్న కాళీ సచ్ఛరిడ్స్ కు బై యాక్టివిటీ ని పెంచే గుణం కలిగి ఉంది అంతేకాకుండా మలబద్ధకంతో డయేరియా వంటి వ్యాధులతో బాధపడే వారికి కూడా సహజ ఔషధంగా పనిచేస్తుంది

రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం చింతపండులో ఉంది అలానే రక్తపీడనాన్ని కూడా చింతపండు తగ్గిస్తుంది రక్తంలోని ఫ్రీరాడికల్స్ యొక్క ప్రభావాన్ని విటమిన్-సి తగ్గిస్తుంది గుండె రక్తనాళాల ఆరోగ్యం కోసం రోజూ రెండు మూడు గింజల చింతపండు గుజ్జు తీసుకోవాలి. మన శరీరంలో ఐరన్ బాగా ఉండాలి కాబట్టి సుమారు 10 శాతం చింతపండు ద్వారా ఈ ఐరన్ మనకు లభిస్తుంది దీని వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి సక్రమంగా అవడమే కాకుండా ఆక్సిజన్ విషయం కూడా జరుగుతుంది ఐరన్ కింకా ఒంట్లో తక్కువ ఉంటే అలసట తలనొప్పి జీర్ణ సంబంధిత ఇబ్బందులు ఏర్పడతాయి.

చింతపండులో విటమిన్ బి కాంప్లెక్స్ మరియు టైమింగ్ ఉంటాయి తమిళనాడులో పనితీరును మెరుగుపరుస్తుంది రోజుకు రెండు గింజలు చింతపండు కుచ్చు తీసుకుంటే హుషారు గా ఉండడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా కూడా చింతపండు పనిచేస్తుంది శరీరానికి అవసరమైన నివాసం కాల్షియం కూడా ఇందులో ఉంటుంది జ్వరము గొంతునొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు చింతపండు తో తయారు చేసిన పదార్థాలు తీసుకుంటే రిలీజ్ కలిగిస్తాయి. చింతపండులో గులాబీల పరిమళం కలిగిన సహజ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి అనేక రుగ్మతలను నయం చేయడానికి కూడా సహాయపడతాయి
చూసారు కదా చింత పండు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కనుక ప్రతిరోజూ మీరు వంట లో కనీసం కొత్త చింతపండుని ఉపయోగించండి దీనివల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి మీకు ఒక పరిష్కారం దొరుకుతుంది

క్యారెట్

రోజు క్యారెట్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

క్యారెట్.. అన్ని సీజన్లలో లభించే వెజిటేబుల్ ఇది. చాలామంది దీన్ని పచ్చిగా తినేందుకే ఇష్టపడతారు. కొందరు జ్యూస్ చేసుకుని మరీ తాగేస్తుంటారు. బిర్యానీ నుంచి సూప్స్, సలాడ్‌లు వరకు ప్రతి ఒక్కదానిలో క్యారెట్ ఉంటేనే అందమూ రుచి. కంటికి ఎంతో మేలు చేసే క్యారెట్‌ను రోజు తింటే.. ఇతర శరీర భాగాలకు కూడా ఎన్నో పోషకాలు అందుతాయి.

❂ క్యారెట్‌‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌‌లు పుష్కలంగా ఉన్నాయి.
❂ క్యారెట్‌లో విటమిన్-A అధికంగా ఉంటుంది. దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది.
❂ క్యారెట్‌లో విటమిన్-C కూడా ఉంటుంది.
❂ క్యారెట్‌లోని ఫ్లావనాయిడ్‌ కాంపౌండ్స్‌ చర్మాన్ని, ఊపిరితిత్తులకు రక్షణ కల్పిస్తాయి.
❂ క్యారెట్‌లోని సోడియం రక్తపోటును నియంత్రిస్తుంది.
❂ క్యారెట్‌ను రోజు తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది.
❂ క్యారెట్‌లో ఉండే ఫాల్కరినల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ క్యాన్సర్‌పై పోరాడేందుకు ఉపయోగపడుతుంది.
❂ క్యారెట్‌లో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌, పిరిడాక్సిన్‌, థయామిన్‌ వంటివి విటమిన్లు జీవక్రియను క్రమంగా ఉంచుతాయి.
❂ కాలేయంలో కొవ్వులు పేరుకుపోకుండా క్యారెట్ ఉపయోగపడుతుంది.
❂ దంతాలు, చిగుళ్లకు క్యారెట్ మేలు చేస్తుంది.
❂ క్యారెట్‌లో కాల్షియం, కాపర్‌, పొటాషియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌ కూడా ఉంటాయి.
❂ క్యారెట్ రోజు తింటే.. లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ముప్పు ఉండదు.
❂ క్యారెట్ చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.
❂ విటమిన్-ఎ లోపం వల్ల చర్మం, జుట్టు పొడిబారుతాయి. రోజు క్యారెట్ తింటే ఆ సమస్యలు దరిచేరవు.
❂ క్యారెట్‌లో ఉండే అత్యధిక కెరోటినాయిడ్స్, ఆల్ఫా కెరోటిన్, లూటిన్‌లు గుండె వ్యాధులను నివారిస్తుంది.

❂ క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్స్, విటమిన్-A శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపిస్తాయి.

గుమ్మడికాయ గింజల ఆరోగ్య ప్రయోజనాలు

.
మనం మన ఆహారంలో పోషకాలు మరియు ఖనిజాలతో నిండిన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించాలి. గుమ్మడికాయ విత్తనాలు అద్భుతమైన పోషకాలు మరియు ఖనిజాలతో నిండి ఉన్నవి. గుమ్మడికాయ విత్తనాలు మెగ్నీషియంరాగిప్రోటీన్ మరియు జింక్ వంటి అనేక రకాల పోషకాలతో నిండి ఉన్నాయి.
మీరు రోజూ గుమ్మడికాయ గింజలను తినడానికి 7 కారణాలు ఇక్కడ ఉన్నాయి:

1.మీ ఎముకలకు మంచిది
గుమ్మడికాయ గింజలు మెగ్నీషియంతో నిండి ఉంటాయిఇది ఎముక ఏర్పడటానికి అవసరమైన ఖనిజం. అధిక మెగ్నీషియం తీసుకోవడం మీ ఎముక సాంద్రతను పెంచుతుంది మరియు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది
2.రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించును
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. రక్తంలో అధిక చక్కెర స్థాయి ఉన్న ఎలుకలకు అవిసె మరియు గుమ్మడికాయ గింజలు ఇచ్చినప్పుడు వాటి రక్తంలో చక్కెర స్థాయి తగ్గినట్లు ఒక పరీక్షలో తేలింది.

3.గుండె ఆరోగ్యానికి మంచిది
గుమ్మడికాయ గింజలు యాంటీఆక్సిడెంట్లుమెగ్నీషియంజింక్ మరియు కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలంఇవి మీ గుండె ఆరోగ్యానికి అద్భుతమైనవి. ఈ విత్తనాలలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయిఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి మరియు రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి సహాయపడతాయి.

4.బరువు తగ్గడానికి సహాయం చేయును.
గుమ్మడికాయ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుందిఇది మీ బరువును నిలబెట్టడానికి సహాయపడుతుంది మరియు ఎక్కువ కాలం మిమ్మల్ని నిండుగా ఉంచుతుంది. గుమ్మడికాయ గింజలు మీ జీర్ణ ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి
.
5.మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచండి
విత్తనాలు ట్రిప్టోఫాన్ యొక్క సహజ మూలంఇది నిద్రను ప్రోత్సహిస్తుంది. గుమ్మడికాయ గింజల్లో లభించే మెగ్నీషియం నిద్రలేమి సమస్యను పరిష్కరించడానికి కూడా సహాయపడుతుంది.

6.రోగనిరోధక శక్తిని పెంచుతుంది
కెరోటినాయిడ్స్ మరియు విటమిన్-ఇ వంటి యాంటీఆక్సిడెంట్లతో  సమృద్ధిగా ఉన్న గుమ్మడికాయ గింజలు ఇంఫ్లమేషన్ తగ్గించడానికి మరియు మీ కణాలను హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడానికి సహాయపడతాయి. గుమ్మడికాయ గింజలను రోజువారీ తీసుకోవడం వల్ల జలుబు మరియు ఫ్లూ నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.
7.జుట్టు పెరుగుదల
విత్తనాలలో కుకుర్బిటిన్ (ఒక రకమైన అమైనో ఆమ్లాలు) ఉంటాయిఇవి జుట్టు పెరుగుదలకు కారణమవుతాయి. గుమ్మడికాయ గింజలలో లభించే ఇతర సూక్ష్మపోషకాలు కూడా జుట్టు యొక్క ఆకృతిని మెరుగుపరచడానికి మరియు బలంగా ఉండటానికి సహాయపడతాయి. గుమ్మడికాయ సీడ్ ఆయిల్ మీ లాక్స్/తాళాలకు కూడా మంచిది.

గుమ్మడికాయ గింజలను ఎలా తినాలి:
మీరు గుమ్మడికాయ గింజలను అనేక విధాలుగా తినవచ్చు. మీరు వాటిని పచ్చిగా తినవచ్చు లేదా వాటిని కాల్చుకోవచ్చు మరియు సాయంత్రం స్నాక్స్ చేయవచ్చు. ఇది కాకుండామీరు వాటిని మీ సలాడ్ లేదా సూప్‌లో కూడా వాడవచ్చు.

కాకరకాయ

Most Health Benefits With Bitter Gourd In telugu - Sakshi

కాకర కాయ ను ఆంగ్లం లో బిట్టర్ గౌర్డ్ అని లేదా హిందీ లో కరేలా అని అందురు. దీనిని భారతీయులు వేల సంవత్సరాలుగా వంటలలో ఉపయోగిస్తున్నారు. ఇది రెండు రకాలుగా-(పొడుగు మరియు పొట్టి) లబించును. క్యాల్సియంఫోస్ఫరస్,ఐరన్విటమిన్మరియు కొద్ది మాత్రం లో విటమిన్ కాంప్లెక్స్ దీనిలో లబించును. వండుటకు ముందు చెక్కు తీసిన కాకరకాయను ఉప్పు నీటిలో ముంచుట ద్వార దీని చెదుతనమును తగ్గించ వచ్చును. కాకర లో ఔషద గుణములు అధికముగా కలవు.

కాకరకాయను తలచుకోగానో దీని చేదు స్వభావం ముందుగా కళ్ల ముందు కదలాడుతుంది. చేదుగా ఉంటే కాకరను ఎలా తింటాంరా బాబూ అని చాలా మంది దూరం పెడుతుంటారు. అయితే కొంతమందికి మాత్రం కాకరకాయ పిచ్చిపిచ్చిగా నచ్చుతుంది. రోజువారీ ఆహారం కాకరను తప్పనిసరిగా వినియోగిస్తారు. రుచికి చేదు అయినా ఆరోగ్యానికి అమృతం లాంటింది. ఎంతో మందికి కాకర వల్ల కలిగే ప్రయోజనాలు తెలియవు. దానిలో ఉండే పోషక విలువలు తెలిస్తే ఇక వదులుకోరు. కాకర ఆస్తమా, జలుబు, దగ్గు వంటి మొదలైన శ్వాస సంబంధిత సమస్యల నివారణకు అద్భుతవమైన ఔషధంగా పనిచేస్తుంది. కాకర జ్యూస్‌ తాగితే లివర్‌ సమస్యలు తగ్గుతాయి. 

న్యూట్రిషన్‌ విలువలు
► మొత్త కాలరీలు-16
►ఆహార ఫైబర్ – 2.6 గ్రా
►కార్బోహైడ్రేట్లు – 3.4 గ్రా
►కొవ్వులు – 158 మి.గ్రా
►నీటి శాతం – 87.4 గ్రా
►ప్రోటీన్ – 930 మి.గ్రా

అసలు మనిషి ఆరోగ్యానికి కాకరకాయ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయంలో అనేక క్లినికల్ అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాలలో దీనిని తినడం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని వెల్లడైంది. మనలో చాలా మంది కాకరను రుచి కారణంగా తినడానికి పెద్దగా ఆసక్తి చూపకపోయినా, సమృద్ధిగా ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్న తర్వాత, మీరు బహుశా మీ ఆలోచనను మార్చుకోవచ్చు. దీనితో కడుపు నొప్పి, మధుమేహం, కాన్యర్‌, గుండె జబ్బులు వంటి సర్వ రోగాలకు నివారిణిగా పనిచేస్తుంది. ఎంతో మేలు చేస్తుంది.

1.మలబద్దకం, జీర్ణాశయం వ్యాధులు నివారణ
కాకరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మలబద్ధకం, కడుపు నొప్పి వంటి పేగు రుగ్మతలను నయం చేయడమే కాకుండా, జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించే పరాన్నజీవులను చంపడానికి సహాయపడుతుంది. అంతేకాక ఇది యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపించడానికి, జీర్ణక్రియకు ఉపకరిస్తుంది.అధిక ఫైబర్‌ ఉంన్నందు వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాకరను వైద్యులు సిఫార్సు చేస్తారు.

2. డయాబెటిస్‌ 
కాకర డయాబెటిస్ నిర్వహణకు సహాయపడుతుంది. డయాబెటిస్‌తో బాధపడుతున్న ఎవరికైనా దీనిని తరచుగా తీసుకోవాలని సూచిస్తారు. ఇందులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలతో కూడిన మూడు క్రియాశీల పదార్థాలు ఉన్నాయి. అవి పాలీపెప్టైడ్-పి, వైసిన్, చరణి. ఇవి ఇన్సులిన్ లాంటి లక్షణాలు కలిగి రక్తంలో గ్లూకోజ్ విలువలను తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటాయని నిర్ధారణ జరిగింది.  రక్తంలో షుగర్‌ లెవల్స్‌లను తగ్గించడంలో చురుకుగా పనిచేస్తాయి. అంతేకాక కాకరలో లెక్టిన్ ఉందని, ఇది ఆకలిని అణచివేయడం,పరిధీయ కణజాలాలపై పనిచేయడం ద్వారా శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ ఉదయం కాకర జ్యూస్‌ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మీ డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. దీనిలో పీచు లక్షణాలు అధికంగా కలిగిఉండడం వల్ల తేలికగా అరుగుతుంది. ఈ ఆహారం అరుగుదలకు, మలబద్ధకం, అజీర్తి సమస్యల నివారణలో సహాయపడి శరీరం నుండి చెత్తను తొలగిస్తుంది.
3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 
కాకరలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. మానవ శరీరానికి యాంటీఆక్సిడెంట్లు అవసరం. ఇది రోగనిరోధక కణాలు,తెల్ల రక్త కణాలు (డబ్ల్యూసీ) పెంచడానికి సహాయపడుతుంది.  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, అలెర్జీని నివారించడంలో సహాయపడుతుంది. కాకర కాయలు, ఆకులను నీటిలో ఉడకించి తీసుకోవడం వల్ల అంటు రోగాలు దరిచేరకుండా ఉంటాయి.
4. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది 
కాకరకు గల  యాంటీమైక్రోబయల్, యాటీఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలోని చెత్తను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాక ఇది మీ కాలేయంలో స్థిరపడిన అన్ని రకాల మత్తులను తుడిచిపెట్టడానికి దోహదపడుతుంది. అందువల్ల ఇది అనేక కాలేయ సమస్యలను నయం చేస్తుంది. అలాగే మీ పేగును శుభ్రపరుస్తుంది. ఇది మూత్రాశయం సరైన పనితీరుకు సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు హ్యాంగోవర్ అయితే, చేదుకాయ రసం తీసుకోవడం వల్ల మన శరీరం నుంచి ఆల్కహాల్ మత్తును తగ్గించి చురుకుగా ఉంటారు.
5. క్యాన్సర్ నుండి రక్షింస్తుంది. 
ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. అవి మన శరీరం పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. నిందుకు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ లేకుండా చూసుకోవాలి. ఫ్రీ రాడికల్స్..  ధూమపానం, కాలుష్యం,ఒత్తిడితో అధికంగా పెరుగుతుంది. కావున కారలో  లైకోపీన్, లిగ్నన్స్, కెరోటినాయిడ్లు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో విటమిన్ ఎ, జియా-శాంథిన్,లుటిన్ ఉన్నాయి. ఇవి ప్రాధమిక యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. దీంతో చివరకి మన శరీరంలో కణితులు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది.
6. కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ధమనులలో కొవ్వు ఫలకం ఏర్పడుతుంది, ఇది గుండె రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడి పనిచేస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాకర చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పుష్టి ఆరోగ్యానికి తోడ్పడటానికి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కాకరలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ గుండెపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.
7. అధిక బరువును తగ్గిస్తుంది. 
కాకరలో గొప్ప పోషకాలు ఉండటం వల్లగా బరువు తగ్గించే ఆహారంగా సహకరిస్తుంది. 100 గ్రాముల కాకరలో 16 కేలరీలు, 0.15 గ్రాముల కొవ్వు, 0.93 గ్రాముల ప్రోటీన్, 2.6 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉంటాయి. అందువల్ల, మన బరువుకు అదనపు పౌండ్లను జోడించకుండా తగ్గిస్తుంది. పోషకాలు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. జంక్, అనారోగ్యకరమైన స్నాక్స్ మీద ఆధారపడకుండా చేస్తుంది. కాకర రసం తాగడం ద్వారా ఉబకాయం తగ్గుముఖం పడుతుంది. కాకరలో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, మంచి ప్రోటీన్, ఫైబర్ ఉన్నాయి. ఇవన్నీ మిమ్మల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచుతాయి.
8. జుట్టుకు మెరుపు అందిస్తుంది.
కాకర జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దీనిలో ప్రోటీన్, జింక్.విటమిన్ సి వంటి భాగాలు జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. జుట్టుకు కాకర జ్యూస్‌ను రాయడం వల్ల మూలాలు బలోపేతం అవుతాయి. స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు చికిత్స అందుతుంది. ఇది జుట్లును షైన్‌గా ఉండటంలో సహాయపడుతుంది. 
9. చర్మాన్ని అందంగా చేస్తుంది
మొటిమలు, మచ్చలు, చర్మ అంటు వ్యాదులను తొలగిస్తుంది. నిమ్మరసంతో కాకరను ప్రతిరోజు పరగడుపున 6 నెలలు తీసుకుంటే సరైన ఫలితాలు పొందుతారు. చర్మాన్ని ముడతలు లేకుండా ఉంచడంలో, అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మం సున్నితత్వానికి కారణమవుతుంది. ఇంకా సోరియాసిస్ , తామర చికిత్సకు సహాయపడుతుంది.సూర్యుడి నుంచి హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
10. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది
కంటి చూపు, కంటిశుక్లం వంటి దృష్టి సంబంధిత సమస్యలను నివారించడంలో కాకర సహాయపడుతుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ నిండి ఉంటాయి. ఇవి కళ్ళకు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాక కళ్ల కింద నల్లడి వలయాలను తగ్గించేందుకు మంచి నివారణగా ఉపకరిస్తుంది.

మూలశంక (piles)నివారణ: కాకర కాయ ఆకుల తాజా రసం మూలశoక ను నివారించును. మూడు టీ-స్పూన్ల కాకర కాయ ఆకు రసంను ఒక టీ-స్పూన్ మజ్జిగ లో కలిపి ప్రతి ఉదయం ఒక నెల రోజులు తీసుకొన్న మూలశoక(piles) నివారించబడును. లేదా కాకర కాయ చెట్టు వేళ్ళను పేస్టు గా మొలలపై(piles) వ్రాయవలయును.

చర్మ వ్యాధులు నివారణ: గడ్డలుస్కాబీస్(గజ్జి)దురదలు,సోరియాసిస్తామర మొదలగు చర్మ వ్యాధుల నివారణ లో ఇది తోడ్పడును. ఒక కప్పు తాజా కాకర కాయ ఆకుల రసంటీ-స్పూన్ నిమ్మరసం తో కలిపి పరగడుపున 4-6 సేవించిన క్రానిక్ చర్మవ్యాదుల నుండి నివారణ లబించును.

మద్యపాన నివారణ: కాకర కాయ ఆకు రసం సంవత్సరాలుగా మద్యపాన నివారణ కొరకు వాడుచున్నారు. ఇది మద్యమత్తు తొలగించును. మద్య పానం వలన పాడు అయిన కాలేయo(liver) పునర్ద్దరణ లో సహాయ పడును.

కాకర కాయ -వేడి నీరు

వేడి నీటిలో కాకర కాయ  (కరేలా) కాన్సర్ నివారణ లో సహాయపడుతుంది. వేడి కాకర కాయ (కరేలా) క్యాన్సర్ కణాలను చంపగలదు.


కాకర కాయ యొక్క 2-3 సన్నని ముక్కలను కట్ చేసి ఒక గ్లాసులో ఉంచండిదాంట్లో వేడినీరు పోయాలినీరు ఆల్కలీన్ అవుతుంది. ప్రతిరోజూ దీనిని కనీసం ఒక్కసారైనా త్రాగాలి. ఎవరికైనా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

 వేడి నీటి కాకర కాయ (కరేలా) క్యాన్సర్ నిరోధక పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది సహజ షధం మరియు ఇది క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడుతుంది.

వేడి నీటి కాకరకాయ సారం సిస్ట్  మరియు కణితి/ట్యూమర్ ను  ప్రభావితం చేస్తుంది. ఇది వివిధ రకాల క్యాన్సర్లను నయం చేయడానికి సహాయపడుతుంది.

క్యాన్సర్ చికిత్సలో కాకర కాయను ఉపయోగించడం వలన  ఇది కణితి/ట్యూమర్ యొక్క ప్రాణాంతక కణాలను మాత్రమే చంపుతుంది. ఇది ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయదు.

అదనంగాకాకరకాయలోని అమైనో ఆమ్లాలు మరియు పాలీఫెనాల్ ఆక్సిడేస్ అధిక రక్తపోటురక్త ప్రసరణను బ్యాలెన్స్ చేయగలవురక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి మరియు లోతైన సిర/వెయిన్ త్రంబోసిస్ సంభవించకుండా నిరోధించగలవు.