కిడ్నీల్లో రాళ్లు పోవాలంటే వీటిని తినండి

samayam telugu

శరీరంలోని ఇంపార్టెంట్ ఆర్గాన్స్‌లో కిడ్నీలు కూడా ఉంటాయి. అవి సరిగ్గా పని చేయగలిగితేనే మనం సరిగ్గా పని చేయగలుగుతాం. కిడ్నీలు రక్తంలోని మలినాలను వడకట్టి, పనికిరాని వాటిని పక్కకి తీసేసి, బాడీలో ఫ్లూయిడ్ బాలెన్స్ ని మెయింటెయిన్ చేస్తాయి. ఎక్కువగా ఉన్న నీటిని బ్లాడర్ లోకి పంపించి యూరిన్ రూపంలో బయటికి పంపిస్తాయి. అయితే, ఏ కారణం చేతనైనా కిడ్నీలు సరిగా పని చేయకపోతే, అక్కర్లేని వాటిని బయటికి పంపించలేకపోతే కిడ్నీల్లో క్రిస్టల్స్ ఏర్పడుతాయి. వాటినే కిడ్నీల్లో రాళ్ళు అంటూంటాం. ఈ రాళ్ళు చిన్నవీ, పెద్దవీ ఉంటాయి. చిన్న వాటిని ఈజీగానే క్యూర్ చెయ్యచ్చు. ఇక్కడ కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి గల కారణాలూ, లక్షణాలూ, సహజంగా ఈ సమస్యని అధిగమించే పద్ధతులూ ఉన్నాయి.

కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయంటే..
samayam telugu

కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి ముఖ్య కారణం శరీరంలో తగినంత నీరు లేకపోవడం. దాంతో పాటు యూరిన్‌లో ఎక్కువ యాసిడ్ ఉండటం, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్ వంటివి కూడా ఈ సమస్యకి దారి తీస్తాయి. తొందరగా కనుక్కుంటే ఈ ప్రాబ్లమ్‌ని ఈజీగా క్యూర్ చేయొచ్చు.

మనం తిన్న ఆహార పదార్ధాలు జీర్ణం అయిన తరువాత కిడ్నీ లో వడకట్ట బడతాయి. కిడ్నీ లోని కొన్ని వ్యర్ధాలు రసాయనక చర్యలు ద్వారా స్పటికీకరణ చెంది రాళ్లు గా ఏర్పడ తాయి ( ఇవి కాల్షియం, ఆక్సలేట్స్, యూరేట్, సిస్టీన్, క్సాoధీన్, ఫాస్ఫేట్..) మూత్రం acedic అయితే రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. చిన్న చిన్న రాళ్లు తగినంత నీరు తాగితే మూత్ర మార్గం ద్వారా బయటకు వెళ్లి పోతాయి.మూత్రం చిక్క బడితే రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ.

చిన్న సైజ్ వి అయితే మందుల తో తగ్గి పోతాయి. పెద్ద సైజ్ వి, కరగని వి అయితే ఆపరేషన్ చెయ్యాలి.ఇప్పుడు కొత్త విధానాల ద్వారా ఆపరేషన్ లేకుండా ప్రత్యేక పద్ధతులలో రాళ్లను చిన్నవి చేయటం తొలగించడం చేస్తున్నారు.

దీనికి అసలైన మందు ఎక్కువగా నీరు త్రాగటం.నీరు ఎక్కువ తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడవు. చిన్న చిన్న రాళ్లు ఉంటే నీటిలో కరిగిపోతాయి.తక్కువ నీరు తాగటమే వ్యాధి రావడానికి కారణం. ఇప్పుడు నేను ఏమి చేస్తున్నాను అంటే ఉదయం లేచిన వెంటనే అర లీటర్ నీళ్లు తాగుతాను. అరగంట తర్వాత ఇతర కార్యక్రమాలు.

తినకూడని పదార్ధాలు. టమాటాలు, ములక్కాడలు

కిడ్నీ లో రాళ్లకు మందు. ఇందులో పోటాషియం సిట్రేట్, మెగ్నీషియం సిట్రేట్ ఉన్నాయి. ఇవి రాళ్లను కరిగిస్తాయి. ఏర్పడనివ్వవు.

లక్షణాలు
samayam telugu

కడుపులో, నడుం కింద భాగం లో నొప్పి, యూరిన్ ఆపుకోలేకపోవడం, ఒక్కోసారి యూరిన్ లో బ్లడ్ పడడం, వికారంగా ఉండడం, వాంతులు కావడం, చెమటలు లేదా చలి…ఇవన్నీ కిడ్నీ లో రాళ్ళు ఉంటే కనిపించే లక్షణాలే. అయితే ఇవన్నీ పరిస్థితి తీవ్రతను బట్టి ఎక్కువగానో తక్కువగానో ఉంటాయి. పైగా ఈ సమస్య ఉన్న ప్రతివారిలోనూ ఈ లక్షణాలన్నీ కనిపించాలన్న రూల్ కూడా లేదు.

కిడ్నీ బీన్స్ / రాజ్మా
samayam telugu

రాజ్మా చూడడానికి కూడా కిడ్నీల లాగానే ఉంటాయి. ఇవి కిడ్నీలని క్లెన్స్ చేసి కిడ్నీ లో రాళ్ళని కరిగిస్తాయని అంటారు. రాజ్మా లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు గా ఉన్న మినరల్స్, బీ విటమిన్స్ కిడ్నీలని శుభ్రపరిచి యూరినరీ ట్రాక్ట్ బాగా పనిచేసేలా చేస్తాయి.

2. యాపిల్ సైడర్ వెనిగర్
samayam telugu

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉన్న సిట్రిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ ని కరిగించేందుకు సహాయపడుతుంది. బ్లడ్ లోనూ, యూరిన్ లోనూ ఉన్న యాసిడ్ ని తగ్గించి స్టోన్స్ మళ్ళీ ఏర్పడకుండా చూస్తుంది. రెగ్యులర్ గా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటూ ఉంటే శరీరం లోని అక్కర్లేని పదార్ధం బైటికి పోతూ ఉంటుంది.

​3. దానిమ్మ రసం
samayam telugu

దానిమ్మల్లో ఉన్న పొటాషియం వలన దానిమ్మ గింజలు తిన్నా, రసం తాగినా కిడ్నీ స్టోన్స్ నుండి విముక్తి లభిస్తుంది. కిడ్నీలలో ఏర్పడే క్రిస్టల్స్ ఏర్పడకుండా పొటాషియం కాపాడుతుంది. ఇందులో ఉన్న యాస్ట్రింజెంట్ గుణాల వల్ల కిడ్నీల్లో ఉన్న టాక్సిన్స్ బైటికి వెళ్ళిపోతాయి.

4. డాండలియన్ రూట్
samayam telugu

డాండలియన్ టీ కిడ్నీలని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఈ టీ కిడ్నీలకి టానిక్ లాగా కూడా పని చేస్తుంది. అరుగుదలకు తోడ్పడి అక్కర్లేని వాటిని బైటికి పంపడంలో ఉపకరిస్తుంది.

తులసి

samayam telugu

తులసిలోని డీటాక్సిఫైయింగ్ గుణాలు కిడ్నీలని శుభ్రపరచి, కిడ్నీలోని రాళ్ళని కరిగేలా చేస్తాయి. కిడ్నీలు స్ట్రాంగ్ గా తయారౌతాయి. ఇందులో ఉన్న ఎసిటిక్ యాసిడ్ కిడ్నీ లోని రాళ్ళు చిన్న చిన్న ముక్కలు గా విడిపోయి యూరిన్ ద్వారా బైటికి పోయేలా చేస్తుంది. బేసిల్ పెయిన్ కిల్లర్ గా కూడా పని చేస్తుంది.

6. లెమన్, ఆలివ్ ఆయిల్
samayam telugu

లెమన్స్ లో ఉన్న సిట్రేట్ వలన కొత్త రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి, ఉన్న రాళ్ళు కరిగిపోతాయి. ఆలివ్ ఆయిల్ వలన కరిగిపోయిన రాళ్ళు స్మూత్ గా బైటికి వెళ్ళిపోతాయి.

7. పుచ్చకాయ
samayam telugu

పుచ్చకాయలో ఉన్న పొటాషియం యూరిన్ లోని ఎసిడిక్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది. పుచ్చకాయ రసం లో చిటికెడు ధనియాల పొడి వేసుకుని తీసుకుంటే ఈ సమస్యకి ఈజీ గా చెక్ పెట్టచ్చు.

8. ఖర్జూరాలు

samayam telugu

ఎండు ఖర్జూరాలని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్న గింజలు తీసేసి తినడం వల్ల కూడా కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి. దీని వల్ల కొత్తగా రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. ఇందులో ఉన్న మెగ్నీషియం వలన కిడ్నీలు శుభ్రపడతాయి. వీటితో పాటూ, కీరదోసకాయ రసం, చెర్రీలు, కొబ్బరి నీరు కూడా కిడ్నీ లో రాళ్ళు కరిగిపోయేలా చేస్తాయి. అయితే, ఈ పద్ధతులు పాటించే ముందు మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి మొదలు పెట్టాలి.

కిడ్నీ వ్యాధి లక్షణాలు

కిడ్నీ వ్యాధి ఆరంభంలో ఎలాంటి లక్షణాలు కనబడవు. అందువల్ల దీని ముప్పు అధికంగా ఉండే మధుమేహం, హైబీపీ బాధితులు క్రమం తప్పకుండా మూత్రపిండాల పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. కుటుంబంలో ఇంతకు ముందు ఎవరికైనా కిడ్నీ వ్యాధి ఉండి ఉంటే వారి కుటుంబ సభ్యులు కూడా తప్పనిసరిగా మూత్రపిండాల పనితీరు పరీక్షించుకోవాలి.
కిడ్నీ జబ్బుగల వారిలో మూత్రం గాఢత (కాన్‌సెంట్రేషన్‌) తగ్గిపోతుంది. అందువల్ల రాత్రిపూట కూడా మూత్రం కోసం నిద్రనుంచి లేవాల్సి వస్తుంటే కిడ్నీ వ్యాధి ఉందేమోనని పరీక్షించుకోవడం ఉత్తమం. కిడ్నీ జబ్బు వ్యాధి ముదురుతున్న కొద్దీ అధిక రక్తపోటు, మూత్రంలో ప్రోటీన్‌ పోవటం, కాళ్ళవాపు, ఆయాసం రావటం, ముఖం ఉబ్బరించటం, ఆకలి మందగించటం, మూత్రం తగ్గిపోవటం, రక్తహీనత, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనబడతాయి.
‘యురెమిక్‌ న్యూరోపతీ’ కారణంగా కాళ్ళు చేతుల్లో తిమ్మిరి కూడా రావొచ్చు. కిడ్నీ జబ్బు మరీ తీవ్రతరమైతే మూర్ఛ వచ్చి స్పృహ తప్పిపోవటమూ జరగొచ్చు. ఇలాంటి సమయంలో డయాలసిస్‌ చేయాల్సి వస్తుంది. జిఎఫ్‌ఆర్‌ 10 ఎం.ఎల్‌ కన్నా తగ్గితే డయాలసిస్‌ చేయాల్సిన అవసరముందని అర్ధం. లేదంటే కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుంది.
పరీక్షలు….
1.మూత్రంలో ప్రోటీన్‌ పరీక్ష : ఇది కిడ్నీ జబ్బు ఉందో లేదో తెలుసుకోడటానికి ఉపయోగపడుతుంది. మూత్రంలో అల్బుమిన్‌ రోజుకు 30 మి.గ్రా కన్నా తక్కువుండాలి. 30-300 మి.గ్రా మధ్యలో ఉంటే మైక్రో అల్బుమినూరియా అనీ, 300 మి.గ్రా కన్నా ఎక్కువైతే ప్రోటినూరియా అంటారు.
2.సీరం క్రియాటినైన్‌ పరీక్ష: ఇది ఎంత ఉండొచ్చన్నది వయసును బట్టి, లింగాన్ని బట్టి, శరీర నిర్మాణాన్ని బట్టి మారుతుంటుంది. మొత్తమ్మీద 1.2 నుంచి 1.4 లోపు ఉండాలి. దాటితే కిడ్నీ వ్యాధి ఉందని అనుమానించాలి. దీని ఆధారంగా జీఎఫ్‌ఆర్‌ను అంచనా వేసి, వడపోత ప్రక్రియ ఎలా ఉందో తెలుసుకుంటారు. సాధారణంగా మూత్రపిండాల్లో నిమిషానికి 100 ఎం.ఎల్‌ రక్తం శుద్ధి అవుతుంది. ఇది నిమిషానికి 80 ఎం.ఎల్‌ కన్నా తగ్గితే కిడ్నీ వ్యాధి ఆరంభమైనట్టే ఇలా మూడు నెలలపాటు జిఎఫ్‌ఆర్‌ క్రమంగా తగ్గుతూ వస్తుంటే క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌గా భావిస్తారు.
3.ఆల్ట్రాసౌండ్‌ పరీక్ష: ఇందులో కిడ్నీ పరిమాణం ఎలా ఉంది. రాళ్ళు, నీటితిత్తులు (పాలీ సిస్టిక్‌ కిడ్నీ) వంటివి ఉన్నాయేమో తెలుస్తుంది. గ్లొమెరూర్‌ నెఫ్రైటిస్‌, అధిక రక్తపోటు గల వారిలో కిడ్నీ పరిమాణం తగ్గుతుంటుంది. పాలిసిస్టిక్‌ డీసీజ్‌లో, మూత్ర మార్గంలో రాళ్ళ వంటివి అడ్డుపడినప్పుడు కిడ్నీ సైజు పెరుగుతుంది. మధుమేహుల్లో ముందు కిడ్నీ ఆకారం పెరిగి. మామూలుగా అవుతుంది.
4.పీటీహెచ్‌ పరీక్ష: క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ గల వారిలో పారాధైరాయిడ్‌ హార్మోన్‌ (పీటీహెచ్‌) ఎక్కువతుంది. కాబట్టి దీన్ని కూడా పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కిడ్నీ జబ్బు ఉంటే సీరం క్యాల్షియం, సీరం ఫాస్ఫరస్‌, సీరం యూరిక్‌ యాసిడ్‌, ఆ్కలైన్‌ ఫాస్పేట్‌జ్‌ వంటి పరీక్షలు అవసరం.
చికిత్స …మధుమేహులైతే గ్లూకోజును కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తపోటు 120/80 ఉండేలా చూసుకోవాలి. కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటే స్టాటిన్స్‌, యూరిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉంటే అప్యూరినాల్‌ వంటి మందులు ఇస్తారు. క్యాల్షియం తక్కువుంటే క్యాల్షియం మాత్రలు ఇస్తారు. వీటిని పరగడుపున వేసుకోవాల్సి ఉంటుంది. అయితే క్యాల్షియం బాగానే ఉండి ఫాస్పరస్‌ మాత్రమే ఎక్కువుంటే వీటిని భోజనంతోపాటు గానీ, భోజనం చేశాకగాని వేసుకోవాల్సి ఉంటుంది. క్యాల్షియం మాత్రల మూలంగా రక్తంలో క్యాల్షియం మోతాదు పెరుగుతుందనే అనుమానముంటే సెవలామెర్‌ వంటి మాత్రలను ఇస్తారు. వీటిని భోజనంతోపాటు వేసుకోవాల్సి ఉంటుంది. క్యాల్షియం, ఫాస్పరస్‌ స్ధాయిు అదుపులోకి వస్తాయి.
పీటీహెచ్‌ స్ధాయిూ తగ్గడానికి అవకాశముంటుంది. పీటీహెచ్‌ మరీ ఎక్కువగా ఉంటే ‘సినాక్యాల్సెట్‌’ మందులు ఇస్తారు. దీంతో రక్తనాళాల్లో క్యాల్షియం పేరుకోవటం తగ్గుతుంది. ఎముకలు బహీనపడకుండా చూస్తుంది. కిడ్నీ జబ్బు బాధితుల్లో ఇనుము లోపమూ కనబడుతుంది. దీన్ని నివారించడానికి ఇనుము మాత్రలు ఇవ్వాల్సి రావొచ్చు. అవసరమైతే ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు.

కిడ్నీ వ్యాధి వారికి మంచి ఆహారం

కిడ్నీ వ్యాధుల వారు తినకూడనవి… చెక్కెర, బెల్లం, స్వీట్ల వంటి తీపి పదార్ధాలు తక్కువగా తినాలి. బియ్యం, గోధుమ వంటి తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. సంక్లిష్ట పిండిపదార్ధాతో కూడిన తృణధాన్యాలు ఆలస్యంగా జీర్ణమవుతాయి. శక్తి కూడా నెమ్మదిగా విడుదల కావడం వల్ల దాన్ని శరీరం వెంటనే వినియోగించుకుంటుంది. చెక్కర స్వీట్ల వంటి తీపి పదార్ధాలు తినడం వల్ల ఒక్కసారిగా శక్తి విడుదల అవుతుంది. దాన్ని శరీరం వెంటనే ఖర్చు పెట్టుకోలేదు. అప్పుడది కొవ్వు రూపంలోకి మారి, నిల్వ వుండిపోతుంది. దీంతో బరువు పెరగడం, స్ధూలకాయం రావడం జరుగుతాయి. ఇది కిడ్నీలకు మంచిది కాదు. ఇక మధుమేహలు తీపి పదార్ధాలు తినడం వల్ల రక్తంలో గ్లూకోజు నియంత్రణ దెబ్బతింటుంది. మధుమేహం లేని వాళ్ళు ఎప్పుడైనా స్వీట్లు తిన్న పెద్దగా ఇబ్బంది వుండదు. కాని మితిమీరి తినరాదు.
మాంసాహారం తగ్గించాలి. కూరగాయలు ఎక్కువగా తినాలి? కిడ్నీల జబ్బు బాధితుల్లో ప్రోటీన్ల నియంత్రణ చాలా కీలకం. కూరగాయల కన్నా మాంసాహారం ద్వారా లభించే ప్రోటీన్లు ఎక్కువ ప్రమాదకరం. ఈ ప్రోటీన్లు జీర్ణమయ్యాక మిగిలిపోయే పదార్ధాలను బయటకు పంపించేందుకు మూత్రపిండాలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. అదే కూరగాయల నుండి లభించే ప్రోటీన్లతో అంత భారం ఉండదు. అయితే డయాలసిస్‌ చేయించుకునేవారికి ప్రోటీన్లు అవసరం పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి వారికి ప్రోటీన్ల నియంత్రణ పనికిరాదు. కిడ్నీలు చేయాల్సిన పనిని డయాలసిస్‌ చేస్తుంది. కాబట్టి ఇబ్బందేమీ ఉండదు. ప్రోటీన్లను తగ్గిస్తే వీరిలో పోషకాహార లోపం ఏర్పడవచ్చు. అయితే ప్రోటీన్లతో పాటు ఫాస్పరస్‌ కూడా అందుతుంది కాబట్టి దాని మోతాదును అదుపులో ఉంచుకోవడానికి మందులు వేసుకోవాల్సి ఉంటుంది. వెన్న, నెయ్యి వంటి సంతృప్త కొవ్వులు తక్కువగా తినాలి.
అసంతృప్త కొవ్వులు గల ఆలివ్‌నూనె, చేపనూనె, అవిసెనూనె ఎక్కువగా తినాలి. ఎందుకు? : కిడ్నీ జబ్బు గలవారిలో, మధుమేహుల్లో కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు, ఎల్‌డీయల్‌ కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఎక్కువ. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది కూడా, అందువల్ల వీళ్ళు వెన్న, నెయ్యి వంటి సంతృప్త కొవ్వులను బాగా తగ్గించాలి. పాలి, ఒమెగా-3, అసంతృప్త కొవ్వులు గల ఆలివ్‌నూనె వంటివి మంచిది. మాంసాహారులైతే చేపనూనె తీసుకోవచ్చు. వీటిలోని ఒమెగా త్రీ కొవ్వు అధిక రక్తపోటు తగ్గించటానికి రక్తంలోని ప్లేట్‌లెట్ల పనితీరును కొవ్వును నియంత్రణలో వుంచడానికి తోడ్పడతాయి.
అవిసెనూనె (ఫ్లాక్స్‌సీడ్స్‌ అయిల్‌) లోనూ ఒమెగా-3 కొవ్వులెక్కువగా వుంటాయి. అవిసెగింజల పొడిని కూరలో వేసుకున్నా, అన్నంలో కలుపుకొని తిన్నా మంచిదే. పొద్దుతిరుగుడు నూనె, నువ్వులనూనె కూడా మంచివే. ఈ నూనెలను మార్చి మార్చి వాడుకుంటే మేలు.
మాంసం కన్నా చేపలు తినడం మేలు. చేపల్లో ఒమెగా-3 కొవ్వులు ఆమ్లాలు అధికంగా వుంటాయి. కాబట్టి మాంసం కన్నా చేపలు తినడం మంచిది. సముద్రం చేపలైతే ఇంకా మంచిది. అలాగే మాంసం ద్వారా లభించే ప్రోటీన్లలో ఫాస్పరస్‌ కూడా అధికంగా ఉంటుంది. కిడ్నీ జబ్బు గలవారిలో ఫాస్ఫరస్‌ మోతాదు పెరిగితే ఒంట్లో క్యాల్షియం, ఫాస్ఫరస్‌ స్ధాయిల్లో సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా ఎముకలు బలహీన పడతాయి. రక్తనాళాల్లో క్యాల్షియం చేరి, గట్టిపడటంలో అడ్డంకులు ఏర్పడి ఆయా అవయవాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.
రక్తనాళాల్లో క్యాల్షియం మరీ ఎక్కువగా పోగుబడి గట్టిపడితే చర్మం నెక్రోసిస్‌ రావచ్చు. దీంతో కండరం, చర్మం చనిపోయే ప్రమాదం వుంది. కొన్ని పప్పు దినుసుల్లోను ఫాస్పరస్‌ అధికంగా ఉంటుంది. వీటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కాని పరిమితంగా తీసుకోవాలి. బీరు, పన్నీరు, చాక్లెట్లలోను ఫాస్ఫరస్‌ ఎక్కువే.
ఉప్పు తక్కువగా తినాలి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో నీరు అధికంగా చేరిపోతుంది.ఉప్పుతో పాటు నీరు కూడా నిల్వ ఉండటంతో బరువు పెరుగుతారు. కాళ్ళ వాపులు ఆయాసం వస్తాయి. అలాగే ఉప్పు మూలంగా నీటితో పాటు రక్తమోతాదు పెరగటంతో గుండె మీద అధిక భారం పడుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది కూడా. ఉప్పు, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేందుకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా మధుమేహలు తీపి పదార్ధాలతో పాటు ఉప్పును పరిమితంగానే తీసుకోవాలి. ఎందుకంటే వీరికి మామూలుగానే అధిక రక్తపోటు ముప్పు ఎక్కువ. దీనికి ఉప్పు కూడా తోడైతే అది మరింత ఎక్కువవుతుంది. చివరికి ఇది కిడ్నీల జబ్బుకు దారి తీస్తుంది.
కిడ్నీ జబ్బుల బాధితులు రోజుకు 4 గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తినకూడదు. కాబట్టి వండేటప్పుడు కాకుండా వండిన తరువాత కూరల్లో ఉప్పు కలుపు కోవడం మంచిది. దీనితో ఎంత మోతాదు తింటున్నామనేది తెలుస్తుంది.
నిల్వ పచ్చళ్ళల్లో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే ఒంట్లో నీటి శాతం పెరగటం,బీపి పెరగటం వంటి సమస్యకు దారి తీస్తుంది. అప్పటికప్పుడు చేసుకునే రోటీ పచ్చళ్ళల్లో అంత ఉప్పు ఉండదు కాబట్టి వీటిని తినవచ్చు. పిజ్జాలు, గింజపప్పులు, ఆలూ చిప్స్‌, శుద్ధి చేసిన ఆహార పదార్ధాలు, బటర్‌, కెచప్‌, సాస్ లు, ఉప్పు కలిపిన ఎండబెట్టిన చేపలు, మాంసంలోను ఉప్పు ఎక్కువ ఉంటుంది.
అరటి, పుచ్చ, నారింజ, కమలా, బత్తాయి పండ్ల వంటివి పరిమితంగానే తినాలి. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి తగ్గించి తినాలి. జిఎఫ్‌ ఆర్‌ తగ్గిపోయినపుడు ఒంట్లో అధికంగా ఉన్న పొటాషియంను మూత్రపిండాలు సరిగా బయటకు పంపించలేవు. దీంతో పొటాషియం మోతాదు పెరుగుతుంది. అందువల్ల పొటాషియం లభించే ఆహార పదార్ధాలను తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. యాపిల్‌, బొప్పాయి, జామ, సీతాఫలం వంటి వాటిల్లో పొటాషియం మోతాదు తక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవచ్చు.
మొక్కజొన్నల్లోను పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి పరిమితంగానే తినాలి. దాదాపు అన్ని కూరగాయల్లోను పొటాషియం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వాటిని ముక్కలుగా తరిగిన తరువాత గంటసేపు నీటిలో నానవేసి ఉంచటం మంచిది. దీంతో అందులోనే పొటాషియం నీటిలోకి చేరుకుంటుంది. ఈ పద్ధతిని ‘లీచింగ్‌’ అంటారు. ఆ తరువాత కాయగూర ముక్కలను వంటలో ఉపయోగించుకోవాలి.
బేకరీ పదార్ధాలు మానేయాలి. బేకరీ పదార్ధాల్లో ఉప్పుతోపాటు పొటాషియం ఎక్కువగా ఉంటుంది.కాబట్టి సాధ్యమైనంత వరకు వీటిని మానేయడమే మంచిది. నిమ్మ ఉప్పు, నల్ల ఉప్పును మానివేయాలి. బేకరీ పదార్ధాలు మసాలా దినుసుల్లోను పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిది.
బిస్కట్లు, కేకులు బ్రెడ్‌లో పొటాషియం ఎక్కువగా వుండే అవకాశం ఉంది. కాబట్టి తక్కువగానే తినాలి. పాలు, పెరుగు వంటి పాలపదార్ధాలు పరిమితంగానే తీసుకోవాలి.చప్చటి మజ్జిగ మంచిది. కిడ్నీ జబ్బు గలవారిలో క్యాల్షియం మోతాదు తగ్గే అవకాశం ఉంది. అలాగే విటమిన్‌ డి లోపం కూడా ఎక్కువే. కాబట్టి క్యాల్షియం, విటమిన్‌-డి మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో క్యాల్షియం జీవక్రియ కొంతవరకు మెరుగు పడుతుంది. పాలు, పెరుగు వంటి వాటిల్లో క్యాల్షియం లభిస్తుంది. కాని దాంతో పాటే ఫాస్ఫరస్‌ కూడా ఎక్కువగా లభించే అవకాశం ఉంది. అందువల్ల వెన్నతీసిన పాలు పెరుగు తీసుకోవాలి. అదీ పరిమితంగానే వాడుకోవాలి. చప్చటి మజ్జిగ తీసుకుంటే అంత ప్రమాదమేమి ఉండదు.
మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే స్వభావం కలవారు మాత్రం పాలకూర, టమోట, క్యాబేజి, క్యాలిఫ్లవర్‌ మానేయడం మంచిది. స్వీట్లు తగ్గించాలి. వీటిలో అగ్జలేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో అధికంగా పోగుపడితే రాళ్ళు ఏర్పడడానికి దోహదం చేస్తాయి. ఇవి కిడ్నీ జబ్బులకు దారి తీస్తాయి. కాబట్టి రాళ్ళ సమస్యలున్నవారు టమోటా, పాలకూర, క్యాబేజి, క్యాలిఫ్లవర్‌ వంటివి మానేయాలి. వీళ్లు డాక్టర్‌ సలహా లేకుండా విటమిన్‌-సి కూడా ఎక్కువగా తీసుకోరాదు.
ఇది అగ్జలేట్లుగా మారిపోయి తిరిగి రాళ్ళు ఏర్పడడానికి దోహదం చేస్తుంది. వీళ్ళు స్వీట్లు ఎక్కువగా తింటే మూత్రంలోకి క్యాల్షియం ఎక్కువగా విడుదలవుతుంది. దీంతో తిరిగి రాళ్లు ఏర్పడేందుకు దోహదం చేస్తుంది.
గుడ్డులో పచ్చసొన మంచిది కాదు. ఇందులో కొలెస్ట్రాల్‌, ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ డిసీజస్ గలవారికి ఇది అంత మంచిది కాదు. తెల్లసొన తింటే పర్వాలేదు.
అవసరమైన మేరకే నీళ్లు తాగాలి. మనం ఎప్పుడైనా నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలు ఆమేరకు నీటిని బయటకు పంపించేస్తాయి. కాని కిడ్నీ జబ్బు గలవారిలో మూత్రపిండాలు ఆపనిని సమర్ధవంతంగా చేయలేవు. దీంతో ఒంట్లో నీటి శాతం ఎక్కువై రక్తపోటు పెరగటం, ఆయాసం, కాళ్ళు ముఖం ఉబ్బటం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మూత్రం ఎంత మోతాదులో వస్తుందనేది దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు నీరు త్రాగాల్సి ఉంటుంది.అంటే మూత్రం తక్కువగా వస్తుంటే నీళ్లు తక్కువే తాగాలన్న మాట.
కాఫీ, టీలు ఎక్కువగా తాగరాదు. కెఫిన్‌ మూలంగా ఒంట్లో కొవ్వు పదార్ధాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కాఫీ, టీలను పరిమితంగానే తీసుకోవాలి. ఇన్‌స్టంట్‌ కాఫీ కన్నా ఫిల్టర్‌ కాఫీ మేలు. ఇన్‌స్టంట్‌ కాఫీలో పొటాషియం మోతాదు ఎక్కువగా ఉంటుంది.
చింతపండు తక్కువగానే తినాలి. చింతపండులో అగ్జలైట్స్‌ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీల పనితీరు మందగించినప్పుడు ఇవి శరీరంలో పేరుకుపోయే అవకాశముంది. కాబట్టి పులుపు కోసం చింతపండు బదులు నిమ్మరసం వాడుకోవచ్చు అయితే దీన్ని పరిమితంగానే తీసుకోవాలి.
పొగమానేయాలి. మద్యం పరిమితంగా తీసుకోవాలి. పొగతాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. రక్తనాళాలు గట్టి పడతాయి. పొగలోని విషపదార్ధాలు నేరుగా మూత్రపిండాల్లోని గ్లోమరుస్‌ను దెబ్బతీస్తాయి. గుట్కా కూడా పొగ మాదిరిగానే దుష్‌ప్రభావం చూపుతుంది. ఇక మద్యం నేరుగా కిడ్నీ ట్యూబ్స్ ను దెబ్బతీస్తుంది. దీంతో ఒంట్లో కొవ్వు పెరిగే అవకాశముంది. మద్యం అలవాటు గలవారు ఇతర పదార్ధాలు అంతగా తీసుకోకపోవడం వల్ల వీరిలో పోషకాహార లోపం రావచ్చు.
వక్కపొడి మంచిది కాదు.ఇందులో పొటాషియం, ఆల్కాలాయిడ్స్ ఎక్కువగా వుంటాయి కాబట్టి. కూల్‌డ్రింకులు మానేయాలి. వీటిలో ఫాస్పేట్‌ అధికంగా ఉండటం వల్ల ఎముకల్లో క్యాల్షియం చేరకుండా అడ్డుకుంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండడమే మంచిది.

Kidney stones….. కిడ్నీలలో రాళ్ళు

మూత్రనాళాల్లో లేదా మూత్రపిండాల్లో రాళ్ళు ఉండాటాన్ని వైద్య పరిభాషలో యూరోలిథియా లేదా నెఫ్రోలిథియాసిస్‌ అంటారు. సాధారణంగా కిడ్నీలలో ఏర్పడే ఒకరకం రాయైన ఆక్సలైట్ స్టోన్‌కు తగినంత చికిత్స అందించని కేసుల్లో 40 శాతం మందిలో ఏడాది వ్యవధిలో, 35 శాతం మందిలో ఐదేళ్ళలో, 50 శాతం మందిలో పదేళ్ళలో మళ్ళీ వస్తాయి.
కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి…?
మన మూత్ర విసర్జక వ్యవస్థలో రెండు మూత్రపిండాలు, వాటి నుంచి సంచిలా ఉండే బ్లాడర్‌ను కలిపే యురేటర్స్‌ అనే రెండు గొట్టాలు, బ్లాడర్‌ నుంచి మూత్రాన్ని శరీరం బయటకు విసర్జించే ఒక మూత్రనాళం ఉంటాయి. రక్తంలోని అనేక పదార్థాలను మూత్రపిండం వడ పోస్తుంటుంది. ప్రమాదకరమైన పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించి వేస్తుంది. రక్తంలోని క్యాల్షియం ఆక్సలైట్ అనే పదార్థాలు మూత్రవిసర్జన వ్యవస్థలో గడ్డలా మారిపోతూ క్రమంగా రాయిలా ఏర్పడవచ్చు. ఇవి సన్నగా స్పటికాల్లా ఉండి మూత్ర పిండం నుంచి మూత్రనాళం మధ్యలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది.
మూత్ర వ్యవస్థలో ఏర్పడే రాళ్ళు అనేక పరిమాణాల్లో ఉండవచ్చు. 5 మి.మీ కంటే తక్కువ సైజ్‌లో ఉండేవి మూత్ర ప్రవాహంలో కొట్టుకుపోతాయి. అంతకంటే ఎక్కువ సైజ్‌లో ఉన్న రాళ్ళు మూత్రపిండం, యూరేటర్‌ లేదా మూత్రనాళంలో ఎక్కడైనా ఇరుక్కుపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మూత్రంలో రాళ్ళు ఏర్పడటం అన్నది అనువంశికంగానూ కనిపించవచ్చు. కుటుంబ చరిత్రలో మూత్రంలో రాళ్ళు ఏర్పడే కండిషన్‌ ఉంటే అవి వారసుల్లోనూ కనిపించడానికి ఫెమిలియల్‌ రీనల్‌ ట్యూబ్యులార్‌ అసిడోసిస్‌ సిస్టిన్యూరియా అనే కండిషన్స్‌ ఉదాహరణలు.
లక్షణాలు : ఒకచోటి నుండి మరోచోటికి తెరలు తెరలుగా వ్యాపిస్తున్నట్లుగా కడుపులో నొప్పి, వికారం లేదా వాంతులు కావడం, మూత్రంలో రక్తం పడటం, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో మంట… పై లక్షణాలన్నీ కనిపిస్తూ తరచూ జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే పెద్ద రాళ్ళు ఉన్నప్పటికీ కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు.
రాళ్ళు ఏర్పడానికి దారితీసే కొన్ని పరిస్థితులు :
1. వేడిగా ఉండే వాతావరణ పరిస్థితుల్లో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం ఎక్కువ. ద్రవాహారం, నీళ్లు తక్కువగా తీసుకునే వారిలో ఈరిస్క్‌ మరింత ఎక్కువ.
2. శారీరకంగా కొన్ని రకాల నిర్మాణపరమైన తేడాలు ఉండేవారిలో (ఉదా: ముడుల్లరీ స్పాంజ్‌ కిడ్నీ, యూపిజె ఆబ్‌స్ట్రక్షన్‌) మూత్రపిండాల్లో రాళ్ళు రావచ్చు.
3. కొన్ని రకాల మందులు.. ఉదా: ఫ్యురోసమైడ్‌ (లాసిక్స్‌) అసిటజోలమైడ్‌ (డయామాక్స్‌) వంటివి తీసుకునే వారిలో రాళ్లు ఏర్పడవచ్చు.
4. మెలింగోమైలోసీల్‌, లేదా న్యూరోజెనిక్‌ బ్లాడర్ వంటి జబ్బులు, స్ట్రువ్‌ టి స్టోన్‌ అనే రకం రాళ్లు ఏర్పడేందుకు దోహదపడవచ్చును.
5. మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఈ రిస్క్‌ ఎక్కువ.
6. సార్కారాయిడోసిస్‌, లెప్రసీ, క్యాన్సర్‌ ఉన్న రోగులలో, క్యాల్షియమ్‌ పాళ్ళు పెరిగి రాళ్ళు వచ్చేందుకు అవకాశం ఎక్కువ. 7. గర్భిణీల్లో 1500 నుంచి 2500 మందిలో ఒకరికి ఇలా రాళ్ళు ఏర్పడేందుకు అవకాశం ఎక్కువ. అప్పటికీ మూత్ర విసర్జక వ్యవస్థలో రాయి ఉన్న సందర్భాలలో కడుపు పెరుగుతుండటం వల్ల ఒక్కోసారి అది నొక్కుకుపోయి మూత్రంలో రక్తస్రావం కనిపించవచ్చు.
నిర్థారణ ఇలా
రోగులకు చేసే సాధారణ మూత్రపరీక్షలు, అల్ట్రాసౌండ్‌ పరీక్షలు, ఇంట్రావీనస్‌ యూరోగ్రఫీ (ఐవియూ) కొందరి రోగులలో రాళ్లను ఎక్స్‌-రే ద్వారా కనుగొనలేని సందర్భాల్లో లేదా కిడ్నీ ఫెయిల్యూర్‌ అయిన కేసుల్లో, పొట్టలో ఇంకా ఏవైనా జబ్బులు ఉన్నపుడు.. ఇలాంటి వారిలో సిటీస్కాన్‌ అబ్డామిన్‌ పరీక్ష ద్వారా రాళ్లను కనుక్కోవాల్సి ఉంటుంది. లోపల ఉండే రాళ్ల సైజ్‌ను బట్టి చేయాల్సిన చికిత్స నిర్ణయించవలసి ఉంటుంది.
చికిత్స
కిడ్నీస్టోన్స్‌ చాలా వరకు ఆపరేషన్‌ చేయాల్సిన అవసరం లేకుండా మూత్రంతో పాటు పడిపోతుంటాయి. రాయి సైజు, రాయి ఉన్న ప్రాంతం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స నిర్ణయిస్తారు. నాన్‌ ఇన్‌వేజివ్‌ ఎక్స్ట్రా కార్పోరియల్‌ షాక్‌వేవ్‌ లిథోటోప్సీ విధానంలో లేజర్‌, ఆల్ట్రాసోనిక్‌ తరంగాల ద్వారా లేదా మెకానికల్‌గా కాని రాయిని పొడి అయిపోయేలా చేస్తారు. ఎండోస్కోపీ ద్వారా యురేటర్‌లో రాయిని తీయడం ఎండోస్కోపీ ప్రక్రియతో మూత్రపిండం నుంచి రాయితీయడం, వంటి ప్రక్రియలతో రాయిని తొలగించవచ్చు. రోగి విపరీతమైన నొప్పితో బాధపడుతున్నపుడు కిడ్నీ వ్యవస్థ విఫలమైనపుడు, ఇన్‌ఫెక్షన్‌ గురైనపుడు సర్జరీ చేయాలి. ఆపరేషన్‌ ఇష్టపడని రోగులు ఒక నెల రోజులు ఆగి చూసి అప్పటికీ రాయి దానంతట అదే పడిపోకపోతే ఆపరేషన్‌ చేయించడం అవసరం లేకపోతే రాయి వల్ల ఇన్ఫెక్షన్‌ పాకి కిడ్నీలు దెబ్బతినవచ్చు.

Kidneys….కిడ్నీలు

కిడ్నీలు పక్కటెముకల కింద, వెనుకవైపున ఉంటాయి. చూడ్డానికి పిడికెడంత వున్నా ఇవి చేసే పని ఎక్కువ. నలభై మైళ్ళ సూక్ష్మనాళాలుంటాయి. రోజుకు కనీసం 100 గ్యాలన్ల రక్తాన్ని శుభ్రపరుస్తాయి.
శరీరంలో రకరకాల జీవక్రియల వల్ల యూరియా, యూరికామ్లం వంటి వ్యర్థాలు, విషతుల్యాలు తయారవుతాయి. రక్తంలో వీటిపరిమాణం పెరిగితే చాలా ప్రమాదం. కిడ్నీలు ఈ వ్యర్ధాల్ని వేరుచేసి వడకట్టి బయటకు పంపుతాయి. మూత్రపిండాల్లో వున్న అతి సున్నితమైన పది లక్షల వడపోత నిర్మాణాలు (నెఫ్రాన్లు) నిరంతరం పనిచేస్తుంటాయి. మనం నీళ్ళు తాగగానే, వాటిని పేగులు రక్తంలో కలుపుతాయి. రక్తం పలుచగా మారుతుంది. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండే కిడ్నీలు రక్తంలో ఎక్కువగా వుండే నీటిని బయటికి పంపిస్తాయి. కొన్నిసార్లు శరీరంలో నీటి కొరత ఏర్పడినపుడు పొదుపుగా వడకట్టి నీటిని బయటకు పంపుతాయి. ఈ ప్రక్రియకు ఆటంకం కలిగితే ఊపిరితిత్తులకు మరియు గుండెకు ప్రమాదం. రక్తవృద్ధికి అవసరమైన ఎరిత్రోసిన్‌ అనే హార్మోన్‌ను మూత్రపిండాలు విడుదల చేస్తాయి. అది ఎముక మజ్జల్లోకి వెళ్ళి రక్తాన్ని తయారుచేసే కణాల్ని ప్రేరేపిస్తుంది. మూత్రపిండాలు మొరాయిస్తే రక్తహీనత వచ్చే ప్రమాదం కలదు.
మూత్రపిండాల సమస్యతో కాల్షియం, ఫాస్పరస్‌ జీవక్రియ దెబ్బతింటుంది. దీంతో ఎముకలు బలహీనపడతాయి. కొంతమందికి రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోయి గుండెజబ్బులొచ్చే ప్రమాదముంది. రక్తపోటును సమస్ధాయిలో ఉంచుతుంది. కిడ్నీలు దెబ్బతింటే హై బీపి వచ్చే ప్రమాదముంది. రక్తపోటు నియంత్రణలో రెనిన, యాంజియోటెన్సిన్‌ అనే ఎంజైములు కిడ్నీలలో తయారవుతాయి.
మూత్రపిండాలు విఫలమవుతున్న కొద్దీ రక్తంలో క్రియాటినైన్‌ స్ధాయి పెరుగుతుంది. దీంతో రక్తహీనత, రక్తపోటు సమస్యలు వస్తాయి. గుండె చేసే పని పంపిగ్‌ ఒక్కటే. అందుకే కృత్రిమ గుండెను తయారుచేయగలిగారు. కిడ్నీలు విఫలమయినపుడు చేసే డయాలిసిస్‌ కేవలం వడపోత మాత్రమే చేస్తుంది. అదికూడా కేవలం 10 శాతం మాత్రమే. మిగతా పనులకు మందులమీద ఆధారపడవలసిందే.
కిడ్నీలు విషలమైనపుడు శారీరకంగా కనిపించే సూచనలు..
రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లటం. మూత్రం వస్తున్నట్టు అనిపించినా విసర్జన కాకపోవచ్చు. మూత్రం పెద్ద మొత్తంలోనూ వస్తుండొచ్చు. నోరు చప్పబడటం, రుచి తెలియకపోవటం. నోటి నుంచి దుర్వాసన. వికారం, వాంతి. ఆకలి తగ్గటం. రక్తహీనత, .బలహీనత, తలతిప్పుటం. రక్తపోటు పెరగటం. కాళ్లు, మడమలు, పాదాల వాపులు.ముఖం ఉబ్బరించటం ఆయాసం. చర్మం పొడి బారటం, దురదలు. ఎముకలో నొప్పులు.మూత్రంలో రక్తం సుద్దలు సుద్దలుగా పడటం. తరచుగా పిక్కలు, కండరాలు పట్టేయటం. వీటిలో ఏవి కనపడ్డా వెంటనే డాక్టరును సంప్రదించాలి
డా॥.కె.వి. దక్షిణామూర్తి, ఫ్రొఫెసర్‌, హెడ్‌ నెఫ్రాలజి, నిమ్స్‌ హైదరాబాద్‌
మన మూత్రపిండాలు శరీరంలోని వ్యర్ధ పదార్థాలను బయటకు పంపించటమేకాదు.. ఎరిత్రోపైటిన్‌ అనే హార్మోన్‌ను విడుదల చేస్తూ రక్తం పరిమాణాన్ని నియంత్రిస్తాయి. విటమిన్‌-డి ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కాల్షియం, సోడియం, పొటాషియం,ఫాస్పరస్‌, మెగ్నీషియం, యూరిక్‌ ఆమ్లం వంటి వాటిని సమతులంగా ఉండేలా చూస్తాయి. ముఖ్యంగా రక్తాన్ని వడపోసి, వ్యర్ధాలన్నింటినీ నీటితో కలిపి మూత్రం రూపంలో బయటకు పంపించేస్తాయి. ఈ పనులన్నింటినీ మూత్రపిండాలు సమర్ధంగా చెయ్యలేకపోతుంటే దాన్నే మనం మూత్రపిండాల వ్యాధి (కిడ్నీ డిసీజ్‌) అంటాం.
మూత్రపిండాల పనితీరు హఠాత్తుగా అంటే… కొద్దిరోజుల్లోనే తగ్గిపోతే ‘ఆక్యూట్‌ రీనల్‌ ఫెయ్యిూర్‌’ అంటారు. వారాల్లో తగ్గిపోతే ‘ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్‌ కిడ్నీ డిసీజ్‌’ అనీ.. ఇక మూడు నెలల పాటు మూత్రపిండాల పనితీరు క్రమంగా తగ్గుతూ వస్తుంటే ‘క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌’ అంటారు. వ్యాధి బాగా ముదిరిపోయి, ప్రాణానికి హాని కలిగే స్ధాయికి చేరుకుంటే ‘ఎండ్‌ స్టేజ్‌ కిడ్నీ డిసీజ్‌’ గా పిలుస్తారు. కిడ్నీ వ్యాధితీవ్రతను గ్లోమెర్యూర్‌ ఫ్టిరేషన్‌ రేటు (జిఎఫ్‌ఆర్‌) ఆధారంగా నిర్ధరిస్తారు. ఎక్యూట్‌రీనల్‌ ఫెయ్యిూర్‌ హఠాత్తుగా వస్తుంది. కాబట్టి ప్రాణాపాయానికి దారితీసే అవకాశం కూడా ఇందులోనే ఎక్కువ. క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ క్రమంగా మూత్రపిండాల పనితీరు తగ్గుతుంటుంది. కాబట్టి దీన్ని మందులతో, ఆహార నియమాలతో అడ్డుకోవటం అవసరం.
ముప్పు కారకాలేంటి?
క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ రావడానికి మధుమేహం, హైబీపీ ప్రధాన కారణాలు మూత్రపిండాల వాపు (గ్లోమరుర్‌ నెఫ్రైటిస్‌) మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌, రాళ్లు ఏర్పడటం వంటివి కిడ్నీ డిసీజ్‌కు దారితీయొచ్చు. రాళ్ళు ఏర్పడినప్పుడు మూత్రం సరిగా బయటకు వెళ్ళకపోవటం వల్ల ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడి, కిడ్నీవ్యాధి వస్తుంది మూత్రం ఎక్కువగా నిల్వ ఉండటం వలన కిడ్నీపై ఒత్తిడి పెరిగి దెబ్బతినే అవకాశమూ ఉంది. వృద్ధుల్లో ప్రోస్టేట్‌ గ్రంధి వాపుతో కూడా కిడ్నీ వ్యాధి రావొచ్చు.
కొందరికి పుట్టుకతో ‘పాలీ సిస్టిక్‌ కిడ్నీ డిసీజ్‌’ వంటి జబ్బుండొచ్చు. మూత్రంలో ప్రోటీన్‌ పోవటం కూడా కిడ్నీ వ్యాధికి కారణం కావచ్చు. స్థూలకాయం కూడా కిడ్నీ జబ్బు ముప్పును తెచ్చి పెడుతుంది. వీరికి మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఇవేమి లేకపోయినా కొలెస్ట్రాల్‌ వంటి కొవ్వు వలన సమస్యలు రావొచ్చు.
మధుమేహుల్లో 5 దశలు .
మధుమేహం కూడా కిడ్నీ వ్యాధికి ముఖ్యకారణం. నిజానికి చాలామందిలో మూత్రంలో ప్రోటీన్‌ రావటాన్ని గుర్తించటం ద్వారానే మధుమేహం తొలిసారి బయటపడుతుంది కూడా వీరిలో ఇది 5 దశలుగా కనపడుతుంది. మొదట్లో ‘జిఎఫ్‌ఆర్‌’ మామూలు కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. రెండో దశలో జిఎఫ్‌ఆర్‌ మామూలుగా ఉన్నప్పటికి పైకి ఎలాంటి లక్షణాలు కనపడకుండానే లోపల్లో మూత్రపిండాలు దెబ్బతింటూ ఉంటాయి.
మూడోది ‘మైక్రోఅన్ బమినూరియా’ దశ ఈ సమయంలో మూత్రంలో తక్కువ మోతాదులో రోజుకు (24 గంటల్లో) 30-300 మి.గ్రా ప్రోటీన్‌ పోతుంటుంది. అంటే అప్పటికే కిడ్నీ వ్యాధి ఆరంభమైందన్నమాట.
నాలుగో దశలో మూత్రంలో ప్రోటీన్‌ మరీ అధికంగా (ఓవర్ట్‌ ప్రోటీనూరియా) పోతుంది. అంటే రోజుకు 300 మి.గ్రా కన్నా ఎక్కువ ప్రోటీన్‌ పోతుందన్నమాట. దీన్నే ‘డయాబెటిక్‌ నెఫ్రోపతీ’ అంటారు.
ఇక ఐదో దశ కిడ్నీ వైఫల్యం! మూడోదశలో వ్యాధిని గుర్తిస్తే మధుమేహం, హైబిపీను నియంత్రణలో ఉంచుకోవటం, ఆహారనియమాలు, మందుల ద్వారా దాన్ని ఆపటం గాని, తిరిగి సాధారణ స్ధాయికి తేవటం కాని చేయొచ్చు.నాలుగు, ఐదో దశలో గుర్తిస్తే కిడ్నీ పనితీరు మరింత తగ్గిపోకుండా చూడొచ్చు గానీ తిరిగిమామూలు స్ధాయికి చేర్చడం అసాధ్యం.
అధిక రక్తపోటు ముప్పు
వ్యర్థాలను వడపోసే ప్రక్రియ అంతా కూడా మూత్ర పిండాల్లోని నెఫ్రాన్‌లో జరుగుతుంటుంది. దీన్ని గ్లోమరుస్‌ నిర్వహిస్తుంది. అధిక రక్తపోటు గల వారిలో ఈ గ్లోమరుస్‌ పై ఒత్తిడి పెరిగిపోయి అది దెబ్బతింటుంది. ఫలితంగా మూత్రంలో ప్రోటీన్‌ పోతూ, క్రమేపీ అది కిడ్నీ వ్యాధికి దారితీస్తుంది.