బోదకాలు (Filariasis)

బోదకాలు (Filariasis) సమస్య క్యూలెక్స్‌ రకం దోమ కుట్టటం వల్ల వస్తుంది.ఈ వ్యాధి ఫైలేరియా అనే సూక్ష్మక్రిమి ద్వారా సంక్రమిస్తుంది. ఇంటి పరిసరాల్లో ఉన్న మురుగునీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందే క్యూలెక్స్‌ దోమ ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలోని ‘మైక్రోఫైలేరియా‘ క్రిములు మన శరీరంలో ప్రవేశించి మన లింఫ్‌ నాళాల్లో పెరిగి పెద్దవవుతాయి. అవి లింఫ్‌ గ్రంథుల్లో చేరి ఉండిపోతాయి. ఇవి అక్కడ పెద్దగా పెరగటం వల్లే మనకి బోదకాలు వస్తుంది. వీటి నుంచి వచ్చే కొన్ని విషతుల్యాల (Toxins) వల్ల లింఫు నాళాల్లో వాపు వస్తుంది. అలాగే ఈ క్రిములు చనిపోయి లింఫు నాళాల్లో అవరోధంగా మారటం వల్ల వీటికి బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా తోడవటం వల్ల కాలు వాపు, జ్వరం, గజ్జల్లో బిళ్లల వంటి బాధలు మొదలవుతాయి. ఈ బాధలు వచ్చిన ప్రతిసారీ నాలుగైదు రోజులుండి తగ్గిపోతాయి. కానీ మళ్లీమళ్లీ వస్తూనే ఉంటాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్ళకు మాత్రమే కాకుండా చేతులు, రొమ్ము, పురుషాంగాలకు, హైడ్రోసిల్‌, రొమ్ము భాగానికి, స్త్రీ మర్మాంగాలకు కూడా రావచ్చును.

మన శరీరంలో ధమనులు, శిరలే కాక లింఫ్ నాళాలు ఉంటాయి. రక్తనాళాలు సిమెంటు లేదా ఇనుప గొట్టాలవంటివి కావు. రక్తనాళాల పల్చని గోడలనుంచి వెలుపలికి స్రవించిన ద్రవం లింఫ్ నాళాలద్వారా మళ్ళీ రక్తంలోకి చేరుకొంటుంది. గజ్జలు, చంకలు వంటి చోట్ల లింఫ్ గ్లాండ్లు ఉన్నాయి. ఇవి కోటలో కాపలా లేదా పహరా పెట్టిన కవాటాలవంటివి. కొంతకాలం రోగకారక క్రిములను ఇవి నిలవరించ గలవు. ఫైలేరియా పేరసైట్ లింఫ్ గ్లాండ్ కు అడ్డపడడంవల్ల లింఫు నాళాలద్వారా ప్రవహించిన పోషక ఆహారం కలిగిన ద్రవాన్ని సమీప కండరాలు పీల్చుకొని అస్తవ్యస్తంగా పెరుగుతాయి. అట్లా పెరిగిన కాలినే ఏనుగు కాలు అనేవారు. స్త్రీలలో రొమ్ములు, చేతి కండరాలు, పురుషుల పురుషాంగం పెరిగి పోవడం కూడా సంభవమే.

మన ప్రభుత్వాలు నిరంతరం శ్రమించి పనిచేయడంవల్ల, రోగులకు వైద్యం అందడం వల్ల చాలావరకు ఇప్పుడు రోగగ్రస్తులు కనిపించడం లేదు. ఈ క్రిమి రాత్రి మనం నిద్రలో ఉన్నపుడు మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది. 1980దశకంలో ఫైలేరియా శాఖవారు పెట్రోమాక్సుదీపాలు తీసుకుని రాత్రి వేళ ఇంటింటికి తిరిగి రక్తనమూనాలు తీసి, పరీక్షలు చేసి ఇన్.ఫెక్షన్ ఉన్నవారికి హెట్రొజాన్ మందు బిళ్ళలు ఇంటికి తెచ్చి ఇచ్చేవారు.

బోదకాలు - వికీపీడియా

(తెలుగు వికీపీడియాలో నుంచి)

Keep Walking

The calf muscle in your legs is your second heart.


Everyone knows that the heart pumps blood, right? But did you know that your body has a second blood pump? It’s your calf muscles! That’s right, the calf muscles in your legs are your second heart!

The human body is engineered such that when you walk, the calf muscles pump venous blood back toward your heart.

The veins in your calf act like a reservoir for blood your body does not need in circulation at any given time. These reservoir veins are called muscle venous sinuses. When the calf muscle contracts, blood is squeezed out of the veins and pushed up along the venous system. These veins have one-way valves which keep the blood flowing in the correct direction toward the heart, and also prevent gravity from pulling blood back down your legs.

Walking or running enables your foot to play a major role in the pumping mechanism of the calves. The foot itself also has its own (smaller) venous reservoir. During the first motion of taking a step, as you put weight on your foot, the foot venous reservoir blood is squeezed out and ‘primes’ the calf reservoir. Then, in the later stages of a step, the calf muscle contracts and pumps the blood up the leg, against gravity. The valves keep the blood flowing in the right direction and prevents gravity from pulling the blood right back down.

Thus, when you are immobile for long periods of time (sitting in an airplane, car seat, or chair for hours) your calf muscle is not contracting much and the blood stagnates.

That’s why walking or running is so good for overall blood circulation. It prevents blood pooling and helps prevent potentially dangerous blood clots called deep vein thrombosis(DVT).

Another condition called venous insufficiency, or venous reflux can cause blood to pool in your legs due to the failure of the valves to work properly. In this condition, the valves fail to prevent the backflow of blood down your legs. Symptoms of venous insufficiency can include heavy, tired, throbbing, painful legs, ankle swelling, bulging varicose veins, cramps, itching, restless leg, skin discolouration and even skin ulceration. Venous insufficiency is a very common disorder, affecting over 40 million people in the U.S.

In cases when a person is even more immobile, such as laying in a hospital bed, the pooled blood can become stagnant and develop into a blood clot. This is called a deep vein thrombosis (DVT). DVT can cause leg pain and swelling and is dangerous because a blood clot can break off and travel in your blood stream and get lodge in your lungs.

Foot Problems / పాదాల సమస్యలు

పాదాలలో పగుళ్లు
పాదాల పగుళ్లకు అలర్జీలు మొదలుకొని చాలా కారణాలు ఉండవచ్చు. శరీరానికి తగిన నీరు అందకపోతే కూడా కాళ్లకు పగుళ్లు ఏర్పడతాయి. మనం వాడే సబ్బు, తీసుకునే ఆహారంలో న్యూట్రిషన్ పాళ్లు తక్కువగా ఉండటమూ కారణం కావచ్చు. కాళ్ల పగుళ్లకు బ్యాక్టీరియా/ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కారణమైతే ఒక్కోసారి అవి పగుళ్ల నుంచి పుండ్లుగా మారొచ్చు. అందుకే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కొన్నిసార్లు డయాబెటిస్/థైరాయిడ్ /ఒబేసిటీ లాంటివీ కాళ్ల పగుళ్ల సమస్యకు కారణం కావచ్చు. పాదాల పగుళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఈ కింది సూచనలు పాటించాలి. మంచినీటిని ఎక్కువగా తాగాలి. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి కాళ్లను కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి, శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత పొడిబట్టతో శుభ్రంగా, తడిలేకుండా తుడవాలి. మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉండే క్రీములను కాళ్లకు రాసుకొని సాక్సులను ధరించాలి. రాత్రంతా సాక్స్లు ధరించడం మంచిది. కాలికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నెన్నో…
పాదాలకు వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యమైన కొన్ని సమస్యలివే…
ఆనెకాయలు: షూ వల్ల ఒకేచోట నిరంతరం ఒత్తిడి పడుతుండటం వల్ల ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. దాంతో అక్కడ మృతకణాలు చేరుతూ పోవడం వల్ల ఈ ఆనెకాయలు వస్తుంటాయి. కొందరు ఆనెకాయలను బ్లేడుతో కోసేస్తుంటారు. మరికొందరు ఆనెకాయలపై కొన్ని చుక్కల యాసి పోస్తూంటారు. కానీ ఆనెకాయలు వస్తే దాని చుట్టూ ప్లాస్టర్ వేసి డాక్టర్కు చూపించాలి.
బ్యూనియన్: కొందరికి షూ ముందు భాగం సన్నగా ఉండటం వల్ల కాలి బొటనవేలు లోపలి వైపునకు నొక్కుకుపోయి, దాని వెనకవైపు ఎముక ముందుకు పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. ఈ సమసయను ‘బ్యూనియన్’ అంటారు. కొందరిలో ఇది వారసత్వంగానూ కనిపిస్తుంది. షూ వల్ల మరింత పెరుగుతుంది. షూ ఒరుసుకుపోతున్న చోట… పాదం తనను తాను రక్షించుకునేందుకు మరో అదనపు కణజాలాన్ని వృద్ధి చేసుకుంటుంది. ఇలాంటి సందర్భాల్లో సమస్య ఉన్నవారు డాక్టర్ను కలిసి, అవసరమైతే శస్త్రచికిత్స చేయించుకోవడం అవసరం.
అథ్లెట్స్ ఫుట్ : ఈ సమస్య ఫంగస్ కారణంగా వస్తుంది. నిజానికి ఈ ఫంగస్ ఎప్పుడూ పాదాలపై ఉండే ఉంటుంది. కానీ పాదం నిత్యం తేమ, తడిలో ఉన్నప్పుడు ఆ ఫంగస్ పెరిగి, చర్మం చిట్లి, అథ్లెట్స్ ఫుట్ సమస్య వస్తుంది. అరికాళ్లలో ఉండే చెమట గ్రంథుల స్రావంతోనూ పాదం చెమ్మబారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటప్పుడు పాదాన్ని శుభ్రంగా కడిగి, వీలైతే ఆల్కహాల్ ఉన్న వాష్లను ఉపయోగించి శుభ్రం చేసి, పాదాల మీద పౌడర్ చల్లి, ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకుంటే పాదం ఆరోగ్యంగా ఉంటుంది. సమస్య తీవ్రతను బట్టి యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సి రావచ్చు.
బొటనవేలి గోరు లోపలికి పెరగడం : కొందరికి బొటనవేలిపై ఉన్న గోరు లోపలివైపునకు పెరుగుతూ ఉంది. ఇలా జరగకుండా చూసుకోవాలంటే కాలి గోర్లు తీసే సమయంలో మూలల్లో మరీ చిగుర్ల నుంచి కాకుండా కాస్తంత దూరం నుంచే కట్ చేసుకుంటే ఈ సమస్యను ఎప్పటికీ రాకుండా చూసుకోవచ్చు.
పాదాలకు తిమ్మిర్లు పట్టడం : పాదానికి తిమ్మిర్లు పట్టి, పాదం మొద్దుబారినట్లుగా ఉండటం చాలా మందిలో కనిపించే సాధారణ లక్షణమే. ఇలాంటి లక్షణం కనిపించినవారిలో షుగర్ వ్యాధి లేకపోతే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే షుగర్ వ్యాధి ఉండి తిమ్మిర్లతో పాదం మొద్దుబారి స్పర్శ తెలియకపోతే మాత్రం తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.
పాదాల వ్యాయామం: పాదాల కోసం చేయాల్సిన వ్యాయామాలు చాలా రకాలుగా ఉంటాయి. చిన్న వయసులో అయితే స్కూలు ఆవరణలో ఆడే అనేక రకాల ఆటలు పిల్లలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. స్కిప్పింగ్ లాంటివి కాళ్ల ఆరోగ్యంతో పాటు ఆరోగ్యకరమైన ఎదుగుదలకూ తోడ్పడతాయి. ఇక టీనేజ్ దాటాక జిమ్కు వెళ్లే యువకులు స్క్వాట్స్ మొదలుకొని, వారికి అనువుగా ఉండే అనేక రకాల వ్యాయామాలు చేస్తారు. పిక్కలు మనకు గుండెలాంటివి కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం, వాటి రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా జాగ్రత్తపడటం వల్ల కాళ్ల ఆరోగ్యం బాగుటుంది. అయితే ఏ వయసు వారిలోనైనా బ్రిస్క్ వాకింగ్ చేయడం అన్ని విధాలా ఆరోగ్యకరం. అది కాళ్లతో పాటు సమస్త అవయవాలకూ ఆరోగ్యాన్ని ప్రదానం చేస్తుంది.

Bone Fracture

విరిగిన ఎముకలు వాటంతట అవే అతుక్కుంటాయి. అతుక్కునే శక్తి ప్రకృతి సహజంగానే ఎముకలకు ఉంది. కాకపోతే మనం చెయ్యాల్సిందల్లా.. అవి అతుక్కునేలా దగ్గరగా చేర్చటం! అలా స్థిరంగా ఉంచటం!! వంకర టింకరగా, అడ్డదిడ్డంగా అతుక్కుపోకుండా.. సజావుగా, సరైన తీరులో అతుక్కునేలా చూడటం!!! అంతే!
కానీ ఇప్పటికీ మన సమాజంలో ఈ వాస్తవం చాలామందికి తెలియటం లేదు. అందుకే ఎముకలు విరిగినప్పుడు నానా రకాలుగా గందరగోళ పడుతున్నారు. ఎముకలు అతుక్కునేందుకంటూ మందుమాకులు, పసర్లు, నాటు వైద్యాల వంటివాటన్నింటినీ ఆశ్రయిస్తున్నారు. అపోహల్లో కూరుకుని, అనవసర సమస్యలనూ తెచ్చుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మన సమాజం- ఎముకలు విరిగినప్పుడు ఏం చెయ్యాలో తెలుసుకోవటం ఎంత అవసరమో.. ఏం చెయ్యకూడదో తెలుసుకోవటం కూడా అంతే అవసరం.
మన శరీరానికి బలమైన మూలాధార పంజరం.. ఎముకలే!
గట్టిగా, దృఢంగా ఉంటాయి కాబట్టి దెబ్బ తగిలినప్పుడు ఎముక చిట్లటం లేదా విరగటం సహజం. ఈ సమస్య మనిషిని అనాదిగా వేధిస్తున్నదే. వాస్తవానికి ఎముక కూడా సజీవ కణజాలమే. అయితే దీనిలో దట్టంగా పేరుకున్న క్యాల్షియం, అక్కడి ప్రోటీన్ల ప్రత్యేకమైన కలయిక మూలంగా ఎముక చాలా గట్టిగా, దృఢంగా ఉంటుంది. శరీరానికి సుస్థిర ఆకారాన్ని తెస్తుంది. చాలా బరువు కూడా మోస్తుంది. ఎంతో బలమైన ఒత్తిడికి గురైనప్పుడు మాత్రమే ఈ ఎముక విరుగుతుంది. ఎముక విరిగిందంటే దాని మీద బలమైన ఒత్తిడి పడినట్లే! ఎముకలు విరగటమన్నది మన సమాజం ఎదుర్కొంటున్న సర్వసాధారణమైన, అతిపెద్ద సమస్య. వాహనాలు, ప్రయాణాలు, వాటితో పాటే ప్రమాదాలు పెరుగుతున్న ఈ ఆధునిక కాలంలో ఈ సమస్యా పెరిగిపోతోంది.
విరుగుట: పలు రకాలు!
తగిలిన దెబ్బ, దాని తీవ్రతను బట్టి ఎముకలు రకరకాలుగా విరగొచ్చు. లోతుగా పరిశీలించి వైద్యశాస్త్రం వీటిని ఎన్నో రకాలుగా వర్గీకరిస్తోందిగానీ స్థూలంగా 4 రకాలను చెప్పుకోచ్చు.
– -చిట్లటం: తగిలిన దెబ్బకు ఎముక మీద ఒకవైపు కాస్త పగులు వచ్చి చిట్లొచ్చు. దీన్ని ‘హెయిర్‌లైన్‌ ఫ్రాక్చర్‌’ అంటారు. చిట్లినా కూడా ఎముక ఆకారం స్థిరంగానే ఉంటుంది కాబట్టి పైకేమీ తేడా కనిపించదు. ఎక్స్‌రే తీస్తే పగుళ్లు కనబడొచ్చు. గాయమైన భాగం కదలకుండా పట్టీవేసి, విశ్రాంతి ఇస్తే చాలు, ఇవి చాలావరకూ వాటంతటవే మానిపోతాయి.
– -విరగటం: ఎముక విరిగి.. ఎక్కడిదక్కడే ఉండిపోతే దీన్ని సింపుల్‌ ఫ్రాక్చర్‌ అంటారు. విరిగినవి కదలకుండా చూసుకోవటం ముఖ్యం. ఇందుకోసం పైన సిమెంటు పట్టీ వేస్తే సరిపోతుంది. దీంతో ఎముక కదలిక ఆగిపోతుంది, నొప్పి తగ్గుతుంది. నాలుగు వారాల్లో ఎముక అతుక్కుంటుంది. అయితే ఈ మధ్యలో తరచూ ఎక్స్‌రే తీస్తూ, ఒకవేళ ఎముక బెసిగిపోతోందేమో గమనిస్తుండటం ముఖ్యం.
– -విరిగి బెసగటం: ఎముక పూర్తిగా విరిగి, అటూ ఇటూ జరిగిపోతే ముందు దాన్ని సరైన స్థితికి తీసుకురావాలి. మత్తుమందు ఇచ్చి వాటిని సరిచేసి, కదలకుండా పట్టీ వెయ్యచ్చు. పైనుంచి సరిచేయలేని స్థితిలో ఆపరేషన్‌ చేసి లోపల రాడ్‌, ప్లేట్ల వంటివి అమరస్తారు. దీంతో ఎముక అతుక్కుంటుంది. లోపల ప్లేట్లు అమర్చే అవకాశం లేకపోతే పై నుంచే రాడ్స్‌ వేసి స్థిరపరుస్తారు.
– -ముక్కలవటం: ఎముక విరిగి ముక్కలు ముక్కలైతే.. వాటన్నింటినీ యథాస్థానానికి తెచ్చి జోడించాల్సిన అవసరం ఉండదు. కష్టపడి జోడించినా రక్తసరఫరాలో ఇబ్బందులొచ్చి సరిగా అతక్క పోవచ్చు. అందుకని ఇలాంటప్పుడు ఆ ముక్కల జోలికిపోకుండా- ప్లేట్‌ వేయటం ద్వారా ఎముక పైభాగాన్నీ, కింది భాగాన్నీ బలంగా స్థిరపరిచే ‘మినిమల్లీ ఇన్‌వేసివ్‌ ప్లేట్‌ ఆస్టియోసింథసిస్‌ (మిపో)’ విధానం ఉపకరిస్తుంది. ఈ సమయంలో ఎముక పొడవు, వంపు మాత్రం సరిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. దీంతో కొంతకాలానికి ఆ ముక్కల చుట్టూ కొత్త ఎముక ఏర్పడి అవన్నీ ముద్దలా దగ్గరకు అతుక్కుపోతాయి.
– -గాయంతో: ఎముక విరగటంతో పాటు పెద్ద పుండు, గాయం కూడా ఉన్నప్పుడు దానికి అత్యవసరంగా చికిత్స చెయ్యాలి. గాయం చూసి చాలామంది రక్తం కారిపోతోందని భయపడుతుంటారు. దానికంటే కూడా ముఖ్యం- ఆ ప్రాంతాన్ని శుభ్రం చెయ్యటం! ఎక్కడెక్కడో తగిలిన దెబ్బలు కాబట్టి వాటిలో గులకరాళ్లు, చెత్త, గడ్డి, బురద వంటివెన్నో ఉండిపోతాయి. వీలైనంత వరకూ 6 గంటల్లోపు శుభ్రం చెయ్యాలి. లేకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చి, ఎముకలు అతుక్కోవు. పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత విరిగిన ఎముకలను స్థిరపరచాలి. గాయం మరీ పెద్దగా ఉన్నప్పుడు పైవైపునే.. అవసరమైతే కిందా పైనా రాడ్లు వేసి, దాన్ని ఫిక్స్‌ చెయ్యాల్సి ఉంటుంది. సర్జరీలు చేసేటప్పుడు మొదట్లోనే సరిగా చెయ్యకపోతే.. ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

ఎముకలు విరగటానికి సర్వసాధారణ కారణాలు:
రోడ్డు, వాహన ప్రమాదాలు
ఆటల్లో దెబ్బలు తగలటం
మెట్ల మీంచి పడటం
స్నానాల గదుల్లో జారిపోవటం
లోలోపలి కారణాలు
అరుదే అయినా కొద్దిమందికి దెబ్బల్లాంటివేమీ తగలకుండానే చిటుక్కున ఎముకల విరుగుతుంటాయి. దీనికి ఇతరత్రా శారీరక సమస్యలు కారణమవుతుంటాయి, వీటిని ‘పెథలాజికల్‌ ఫ్రాక్చర్స్‌’ అంటారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎముక గుల్లబారటం (ఆస్టియోపొరోసిస్‌). ఈ సమస్య వృద్ధుల్లో ఎక్కువ. వయసు పెరుగుతున్నకొద్దీ ఎముకలు గుల్లబారుతూ.. వాటి పటుత్వం తగ్గుతుంది. దీంతో చిన్నపాటి కుదుపునకు కూడా ఎముక విరగొచ్చు. కారు వేగంగా వెళుతున్నప్పుడు హఠాత్తుగా బ్రేకు వేసినా, ఏదైనా వస్తువు అందుకోటానికి అటూఇటూ తిరిగినా కూడా ఎముకలు విరగొచ్చు.
కొందరిలో ఒంట్లో ఎక్కడైనా క్యాన్సర్‌ తలెత్తితే అది ఎముకకు విస్తరించి స్థిరపడుతుంటుంది. దీంతో అక్కడ ఎముక గుల్లబారి, పటుత్వం తగ్గి విరుగుతుంటుంది.
పసరుకట్లు వద్దు!
చాలామంది నేటికీ ఎముకలు విరిగినప్పుడు పసరు కట్లను ఆశ్రయిస్తున్నారు. వాస్తవానికి ఆ పసరులో ఎముక అతుక్కునేలా చేసే గుణమేదీ ఉండదు. గట్టిగా లాగి కట్టటం వల్ల విరిగిన ఎముకలు కదలకుండా ఉండి, అవి సహజంగానే అతుక్కుంటాయి. కానీ కొన్నిసార్లు కట్టు మరీ గట్టిగా కట్టటం వల్ల రక్తసరఫరా ఆగిపోయి ఆ భాగం కుళ్లిపోయిన (గ్యాంగ్రీన్‌) ఘటనలూ ఉంటున్నాయి. అలాగే ఎముక విరిగి, అటూఇటూ జరిగినప్పుడు దాన్ని సరైన స్థానంలో ఉంచటం అన్నది ఈ పసరు కట్లతో సాధ్యం కాదు. ఏదో ఉజ్జాయింపుగా ఎముకలను లాగి కట్టేస్తుంటారు. దీనివల్ల ఎముకలు వంకరగా అతుక్కుపోతూ, జీవితాంతం ఆ ఎముక, కీళ్ల కదలికలు అస్తవ్యస్తంగానే ఉండిపోతాయి. పసరు కట్లు శాస్త్రీయమైనవి కావు. ఏదో తాతముత్తాతలు చేస్తున్నది చూసి నేర్చుకోవటం తప్పించి సరైన శిక్షణ తీసుకున్న వారు కాకపోవటం వల్ల- సంక్లిష్టమైన ఫ్రాక్చర్లను సరిచేసే అవకాశం ఉండదు. సాధారణ ఫ్రాక్చర్ల విషయంలో కూడా అవి సరిగ్గా అతుక్కుంటాయన్న నమ్మకం ఉండదు. కాబట్టి ఈ ఆధునిక కాలంలో పసరు కట్లను ఆశ్రయించటం మంచి పద్ధతి కానేకాదు. పొగ దెబ్బే!
పొగ తాగే వాళ్లలో విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవు! ఇది శాస్త్రీయంగా నిరూపణ అయిన వాస్తవం. పొగలో ఉండే నికొటిన్‌ శరీరంలో చేరి కణవిభజననూ, ఎముక అతుక్కునే ప్రక్రియను దెబ్బతీస్తుండటం వల్ల వీరిలో ఎముకలు అతుక్కోవటం చాలా ఆలస్యమవుతుంటుంది, కొన్నిసార్లు ఎంతకీ అతుక్కోవు కూడా. సాయం చెయ్యాలిగానీ..!
చాలామంది ప్రమాదం జరిగినప్పుడు- బాధితులను రక్షించాలన్న తాపత్రయంలో వారిని కారుల్లో, ఆటోల్లో, స్కూటర్ల మీద తీసుకుపోతుంటారు. దీనివల్ల అప్పటికే విరిగిన ఎముకల వంటివి మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఎముకలు విరిగాయన్న అనుమానం తలెత్తినప్పుడు ముందు బాధితుల కాళ్లు చేతుల వంటి అవయవాలు కదలిపోకుండా స్థిరంగా ఉంచే బద్దలు (యూనివర్సల్‌ స్లి్పంట్‌) వంటవి అమర్చి జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించాలి. విరిగిన ఎముకలు కదులుతుంటే నొప్పి తీవ్రమై, ఒంట్లో క్యాటకోలమైన్స్‌ ఎక్కువగా విడుదలై, బీపీ పడిపోయి, ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
ఎలా అతుక్కుంటాయి?
చర్మం గీసుకుపోతే కొద్దిరోజుల్లో దానంతటదే మానిపోతుంది. మనం చెయ్యాల్సిందల్లా గీరుకున్న చర్మం అంచులు దగ్గరగా ఉండేలా చూడటం. అచ్చం ఎముక విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఎముక మీద ‘పెరియాస్టియమ్‌’ అనే దట్టమైన పొర ఉంటుంది. బలమైన దెబ్బ తగిలి, గాయమైతే ఈ పొర చినిగి, రక్తనాళాలు తెగి రక్తస్రావమవుతుంది. ఈ రక్తంలోని ప్లేట్‌లెట్‌ కణాలు విడివడి, అక్కడున్న మూలకణాలను ప్రేరేపించే రసాయనాలు (గ్రోత్‌ ఫ్యాక్టర్స్‌) విడుదల అవుతాయి. దీంతో మూలకణాలు వృద్ధి చెందుతూ, ఎముకల మధ్య ఏర్పడిన ఖాళీలో చేరతాయి. ముందుగా అక్కడ మృదు కణజాలం (కార్టిలేజ్‌ కణాలు), తర్వాత ఎముక కణాలు ఏర్పడతాయి. ఈ కణాల్లో, వాటి మధ్యలో క్యాల్షియం చేరి, గట్టిపడుతుంది. దీంతో ఎముక మళ్లీ దృఢంగా అతుక్కుపోతుంది. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియే!
ఇదీ చికిత్స! ఇవీ సూత్రాలు!!
ఎముక దానంతట అదే అతుక్కుంటుందిగానీ అది- వేగంగా, సరిగ్గా అతుక్కునేలా చూడటం, దానివల్ల ఇతరత్రా దుష్ప్రభావాలు రాకుండా చూడటం చాలా కీలకం. కాబట్టి ఈ సందర్భంగా కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

ఎముక విరిగింది.. అతుక్కోవాలంటే ఏం చెయ్యాలి?

1. కదలకుండా ఉంచటం: విరిగిన ఎముకలు కదులుతూనే ఉంటే ఎముక అతుక్కునే ప్రక్రియ దెబ్బతినిపోతుంది. కాబట్టి విరిగిన భాగం కదలకుండా చూసేందుకు- సిమెంటు కట్లు, బద్దలతో కట్టటం, బరువు వేలాడ దీయటం వంటివన్నీ చేస్తుంటారు. అయితే సిమెంటు పట్టీ ఎక్కువకాలం అలాగే ఉంచితే కండరాలు క్షీణించే ప్రమాదముంది. అటుపక్క ఇటుపక్క కీళ్లు బిగుసుకుపోవచ్చు. భోజనం, స్నానం చేయటం వంటి పనులకు ఇబ్బంది తలెత్తొచ్చు. లోపల దురద, చర్మం కందిపోవటం వంటి సమస్యలూ ఉంటాయి. ఇంతా చేసి, లోపల ఎముక సరైన స్థితిలోనే అతుక్కుంటోందో లేదో తెలియకపోవచ్చు. అందుకే ఇటీవలి కాలంలో ఆపరేషన్‌ చేసి- లోపలి ఎముకలను ప్లేట్లు, రాడ్లు, స్క్రూలతో దగ్గరకు తెచ్చి, స్థిరంగా ఉండేలా చూడటం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇవి విరిగిన ఎముకను కదలకుండా ఉంచుతూ.. త్వరగా అతుక్కోటానికి అనువైన పరిస్థితులను కల్పిస్తాయి. ఆపరేషన్‌ చేసిన వారం పది రోజుల్లోనే తేలికపాటి కదలికలు ఆరంభించొచ్చు. దీంతో కీళ్లు బిగుసుకుపోయే సమస్య ఉండదు. కండరాలు క్షీణించవు. పైన సిమెంటు పట్టీ వంటివేవీ ఉండవు కాబట్టి పనులకు వెళ్లొచ్చు. కాకపోతే వైద్యులు చెప్పే వరకూ కొంతకాలం బరువు పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
2. సరైన స్థితిలో ఉంచటం: విరిగిన ఎముకలను సరైన స్థితిలో, సరైన కోణంలో, కచ్చితంగా దగ్గరకు చేర్చి.. అలాగే కదలకుండా చూడటం ముఖ్యం. లేకపోతే ఎముకలు వంకరగా అతుక్కుని, కీళ్లు అస్తవ్యస్తంగా అరిగిపోవటం వంటి సమస్యలు జీవితాంతం వేధిస్తుంటాయి. విరిగిన ముక్కలు సరైన స్థితిలో, అలాగే కదలకుండా ఉండేందుకు ప్లేట్లు, స్క్రూల వంటివి దోహదం చేస్తాయి.
3. సమస్యలు రాకుండా చూడటం: దెబ్బతిన్న భాగానికి రక్తసరఫరా సరిగా జరిగేలా, ఇన్‌ఫెక్షన్లు తలెత్తకుండా చూడటం ముఖ్యం. వేగంగా నడుస్తున్న వాహన ప్రమాదాల వల్ల సంభవించే ఫ్రాక్చర్లలో- ఎముకకు అంటుకొని ఉండే కండరం కూడా పక్కకు తొలగిపోతుంది. దీంతో రక్త సరఫరా తగ్గి ఎముకలు అతుక్కోవటం ఆలస్యమవుతుంది. అందువల్ల రక్తసరఫరా సాఫీగా జరిగేలా చూడాల్సి ఉంటుంది. గాయాల వల్ల సూక్ష్మక్రిములు లోపల చేరి, ఇన్‌ఫెక్షన్లు మొదలై ఎముక అతుక్కోవటం ఆలస్యమవుతుంది. కాబట్టి ఇన్‌ఫెక్షన్‌ తలెత్తకుండా, శుభ్రంగా ఉండేలా చూడటమూ కీలకమే. ఒక్కోసారి ఆపరేషన్‌ గదిలో పరిశుభ్రత లోపించటం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. దీంతో ఎముక అతకటం అటుంచి ఈ ఇన్ఫెక్షన్‌ను తగ్గించటం పెద్ద సమస్యగా తయారవుతుంది. అందుకోసం వేసిన రాడ్‌ను, ప్లేట్లను కూడా తీసి, కొద్దిరోజుల తర్వాత మళ్లీ వెయ్యాల్సి ఉంటుంది. కాబట్టి శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

ఎన్నో అపోహలు …………………
బోన్‌సూప్‌
ఎముకలు విరిగాయి కాబట్టి ఎముకల సూపు తాగితే త్వరగా అతుక్కుంటాయన్నది పెద్ద భ్రమ. అది రుచికరంగా ఉంటే ఉండొచ్చు. ఆ రుచి నచ్చిన వాళ్లు తీసుకోవచ్చు. అంతేగానీ ఎముకలు విరిగాయి కాబట్టి అవి అతుక్కోవటానికి ఎముకల సూపుతో ప్రయోజనం ఉంటుందనుకోవటం అపోహే. ఇలాంటి అపోహలకు ఆస్కారం ఇవ్వకపోవటం ఉత్తమం.
క్యాల్షియం
కొందరు క్యాల్షియం మాత్రలు తీసుకుంటే ఎముకలు త్వరగా అతుక్కుంటాయని భావిస్తుంటారు. ఇది సరికాదు. ఒకవేళ ఇప్పటికే ఒంట్లో క్యాల్షియం లోపం ఉంటే క్యాల్షియం మాత్రలతో ప్రయోజనం ఉంటుందిగానీ లేకపోతే వాటిని తీసుకోవటం నిరుపయోగం!
గుడ్డుసొన
కోడిరక్తం, కోడిగుడ్డు సొన కొన్ని రకాల పసర్ల వంటివన్నీ వేసి కడుతుంటారు. ఇవి వైద్యులు కట్టే ‘ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌’లా గట్టిపడి, తర్వాత ఎముకలు కదలకుండా స్థిరంగా ఉండేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. అంతేకానీ వాటివల్ల ఎముకలు అతుక్కోవటమన్నది ఉండదు.
అతుక్కోపోతే..!
కొన్ని సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకున్నా ఎముకలు ఎంతకీ అతుక్కోవు. ముఖ్యంగా పొగ అలవాటు, పెద్ద వయసు, అత్యంత వేగవంతమైన ప్రమాదాల్లో ఎముకలు విరగటం.. ఇలాంటి సందర్భాల్లో ఎముకలు 6-9 నెలలు దాటినా అతకవు. దీన్నే ‘నాన్‌ యూనియన్‌’ అంటారు. వీరికి మరోసారి సర్జరీ చేసి- కటి ఎముక పైభాగం నుంచి చిన్నచిన్న ఎముక ముక్కలను తెచ్చి ఆ ఖాళీలో పూరించే ‘బోన్‌ గ్రాఫ్టింగ్‌’ సర్జరీ చెయ్యాల్సి ఉంటుంది. దీంతో అక్కడ వేగంగా కొత్త ఎముక ఏర్పడుతుంది. వృద్ధుల్లో తుంటి బంతి కీలు విరిగితే రక్తసరఫరా తెగిపోయి, అది తిరిగి అతుక్కోదు. ఇలాంటి వారికి కృత్రిమ బంతికీలు వెయ్యాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆపరేషన్లు సక్రమంగా చెయ్యకపోవటం, ఆపరేషన్‌ గది పరిశుభ్రంగా లేకపోవటం కూడా ఇన్ఫెక్షన్లకు, ఎముకలు అతుక్కోకపోవటానికి ముఖ్య కారణాలుగా నిలుస్తున్నాయి.

Kneel Replacement

మోకీలు.. మన ఒంట్లో అతి సంక్లిష్టమైన కీలు. అన్ని కీళ్ల కన్నా పెద్దది, బలమైంది కూడా. అటు తుంటి ఎముకకూ ఇటు కింది కాలు ఎముకకూ మధ్య ఇరుసులా పనిచేస్తూ.. తేలికగా కదలటానికి తోడ్పడుతుంటుంది. మనం నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు, పరుగెత్తుతున్నప్పుడు శరీర బరువును మోస్తూ, ఒత్తిడిని భరిస్తూ కూడా అతి సున్నితంగా కదలటం దీని ప్రత్యేకత. మనం హాయిగా నడవగలుగుతున్నామంటే, మోకాళ్లు ముడుచుకొని కూచుంటున్నామంటే, అలవోకగా పక్కలకు తిరుగుతున్నామంటే అంతా మోకీలు చలవే. చూడటానికి ఒకటేనని అనిపించినా..
ఇది పలు ఎముకలు, కండరాలు, మృదులాస్థి, కండర బంధనాలు, అనుసంధాన కణజాలాల సమాహారం. ఇవన్నీ కలిసికట్టుగా, చక్కటి సమన్వయంతో పనిచేస్తూ మన అవసరాలకు అనుగుణంగా ఎన్నెన్నో కదలికలకు తోడ్పడతాయి. అందుకే మోకీలులో ఏ చిన్న సమస్య తలెత్తినా జీవితం కుంటుపడినట్టే అనిపిస్తుంది. ముఖ్యంగా కీళ్లవాపులు (ఆర్థ్రయిటిస్) మొదలైతే ఆ బాధ వర్ణనాతీతం. సమస్య తీవ్రమైతే అడుగు తీసి అడుగు వేయటమే గగనమైపోతుంది. మన సమాజంలో చాలామంది వృద్ధులు దీంతో బాధపడుతున్నవారే. తీవ్రమైన నొప్పుల మూలంగా- కూచుంటే లేవలేక, లేస్తే కూచోలేక.. ఎక్కడికీ వెళ్లలేక, నలుగురితో కలవలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనంతటికీ కారణం వయసు మీద పడుతున్న కొద్దీ మోకీళ్లు అరిగిపోవటమే.
ఏమిటీ సమస్య?
ఎందుకో తెలియదు గానీ.. గత 20 ఏళ్లుగా మోకీళ్ల అరుగుదల, వాపు సమస్య రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. మనదేశంలో సుమారు 30% మంది దీని బారినపడి నలిగిపోతున్నారని అంచనా. కీళ్లు అరగటం వల్ల తలెత్తే మొదటి ఇబ్బంది నొప్పి. ముఖ్యంగా ఏదైనా పనిచేసినప్పుడు లేదా ఎక్కువసేపు కదలకుండా ఉన్నప్పుడు నొప్పి మరింత వేధిస్తుంటుంది. కీళ్లు బిగుసుకుపోవటం, వాపు, కదలికలు తగ్గటం వంటి లక్షణాలూ ఉండొచ్చు. ఇంతకీ ఇది ఎందుకొస్తుంది? మన మోకీలు ఎముకల చివర్లలో మృదులాస్థి (కార్టిలేజ్) అనే సున్నితమైన ఎముక ఉంటుంది. ఇది ఎముకలు ఒకదానికి మరోటి రుద్దుకోకుండా, అవి మృదువుగా కదలటానికి తోడ్పడుతుంటుంది. అలాగే ఎముకల మధ్య ‘మినిస్కస్’ అనే దళసరి ‘వాషర్’ లాంటి పొర కూడా ఉంటుంది.
మృదులాస్థి, మినిస్కస్ పొరలు మన శరీర బరువును, కదలికల ఒత్తిడిని ఎప్పటికప్పుడు గ్రహిస్తూ.. కదలికలు సాఫీగా సాగేలా చూస్తాయి. అయితే వయసు మీద పడుతున్నకొద్దీ జట్టు తెల్లబడటం వంటి మార్పుల మాదిరిగానే మృదులాస్థి క్షీణించటమూ మొదలవుతుంది. క్రమేమీ వాషర్ కూడా దెబ్బతింటుంది. దీంతో మోకీలు కదిలినపుడు ఎముకలు రెండూ ఒకదాంతో మరోటి రుద్దుకొని విపరీతమైన నొప్పికి దారితీస్తుంది. ఇదే ఆర్థ్రయిటిస్కు మూలం. ఒకసారి ఈ మృదులాస్థి క్షీణిస్తే తిరిగి సరిచేయటం దాదాపు అసాధ్యం. అందుకే దీనికి శాశ్వత పరిష్కారం చూపించే మోకీలు మార్పిడికి ప్రాధాన్యం పెరుగుతోంది.

Cartilage Damage… కార్టిలేజ్‌ …..Meniscus Damage

మోకీళ్లకు ఏ చిన్న సమస్య వచ్చినా ఇబ్బందే. ఇక కీళ్ల స్వరూపాన్ని క్రమంగా మార్చేస్తూ.. చివరికి వాటిని కట్టిపడేసే అరుగుదల సమస్య (ఆస్టియో ఆర్థ్రయిటిస్‌) దాడి చేస్తే? మొత్తం శరీరమే కుదేలవుతుంది. నిజానికి వయసుతో పాటు మోకీళ్లు అరగటం అసహజమేమీ కాదు. కాకపోతే ఇప్పుడు 40, 50ల్లోనే ఎంతోమంది దీని బారినపడుతుండటం.. చిన్న చిన్న దూరాలకే నొప్పులతో విలవిల్లాడుతూ కూలబడిపోతుండటమే విషాదం. మారిపోతున్న జీవనశైలి, అధిక బరువు, ఊబకాయం వంటివన్నీ ఇందుకు తలో చేయి వేస్తున్నాయి.
కూచోవాలన్నా, నిలబడాలన్నా ఒకటే నొప్పి. నాలుగడుగులు వేయటమూ గగనమే. ఇలా మోకీళ్లనొప్పులతో తలెత్తే బాధలు అన్నీఇన్నీ కావు. మన శరీరాన్ని, జీవనగమాన్ని నడిపించే మోకీలు ఎందుకిలా మొరాయిస్తోంది? అసలేంటీ సమస్య? మన శరీరంలో అతి ముఖ్యమైన, అతి బలమైన కీళ్లలో మోకీలు ఒకటి. శరీర బరువును, ఒత్తిడిని భరిస్తూనే సున్నితంగా కదులుతుండటం దీని ప్రత్యేకత. మనం నడవటం, కాళ్లు ముడుచుకొని కూచోవటం వంటివి తేలికగా చేస్తున్నామంటే అంతా మోకీళ్ల చలవే. వీటి నిర్మాణం నిజంగా అద్భుతమే. పైనుంచి వచ్చే తుంటి ఎముక, పాదం నుంచి వచ్చే కింది ఎముక.. రెండూ మోకాలి దగ్గర కలుస్తాయి. ఇవి రెండూ ఒకదానికి మరోటి రుద్దుకోకుండా ఎముకల చివర్లోని మృదులాస్థి (కార్టిలేజ్‌).. ఎముకల మధ్యలోని మినిస్కస్‌ అనే మందమైన పొర తోడ్పడుతుంటాయి. శరీర బరువును, ఒత్తిడిని చాలావరకూ ఈ మృదులాస్థి, మినిస్కస్‌ పొరలే తీసుకుంటాయి. అయితే ఇవి ఎప్పటికీ అలాగే ఉండిపోవు. వయసు మీద పడుతున్నకొద్దీ అరిగిపోతుంటాయి. దీంతో మోకాలు కదిలినప్పుడల్లా ఎముకలు రెండూ ఒకదాంతో ఒకటి రుద్దుకుంటూ విపరీతమైన నొప్పి వేధిస్తుంటుంది. మోకీళ్ల నొప్పులకు (ఆస్టియో ఆర్థ్రయిటిస్‌) ఇదే మూలం. ఒకప్పుడు మోకాళ్ల నొప్పులంటే వృద్ధాప్య సమస్యే. ఇప్పుడు చిన్నవయసులోనే దాడిచేస్తోంది.
సాధారణంగా అరవై ఏళ్లు దాటినవారిలో సుమారు 20% మందిలో మోకీళ్లు అరిగిపోతుంటాయి. ఆ తర్వాత వయసు పెరుగుతున్నకొద్దీ అరిగిపోవటమూ ఎక్కువవుతుంటుంది. కానీ ఇప్పుడు 45, 50 ఏళ్లలోనే ఎంతోమంది మోకీళ్ల నొప్పుల బారినపడుతుండటం గమనార్హం.
చిన్నవయసులోనే మోకీళ్ల నొప్పులు దాడిచేస్తుండటానికి ప్రధాన కారణాలు మారిపోతున్న జీవనశైలి, ఊబకాయం. మన శరీరం చాలా అద్భుతమైంది. కండరాలు, ఎముకల మీద ఒత్తిడి పడుతున్నకొద్దీ దాన్ని తట్టుకోవటానికి అవసరమైన సామర్థ్యాన్ని సంతరించుకుంటాయి. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువ. తిని కూచోవటం తక్కువ. అందువల్ల సహజంగానే కండరాలు, ఎముకలు బలంగా ఉండేవి. మరిప్పుడో? శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. కూచొని చేసే పనులు పెరిగిపోయాయి. ఫలితంగా మోకాలి కండరాలు, కీళ్లను పట్టుకునే కండర బంధనాలు పట్టు కోల్పోతున్నాయి. ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, బరువును మోసే శక్తి కొరవడుతున్నాయి. అంతేకాదు- ఊబకాయం, అధిక బరువు కూడా చిన్న వయసు నొప్పులకు దారితీస్తున్నాయి. సరైన శారీరక శ్రమ, వ్యాయామం లేకపోతే ఒళ్లు బరువెక్కుతుందనటంలో సందేహం లేదు. దీనికి తోడు కొవ్వు పదార్థాలు, జంక్‌ ఫుడ్‌ తినటమూ పెరిగిపోయింది. ఇలాంటివన్నీ అధిక బరువు, ఊబకాయానికి దోహదం చేస్తున్నాయి. బరువు పెరిగినకొద్దీ మోకీళ్ల మీదా ఒత్తిడి ఎక్కువవుతుంది. ఫలితంగా మృదులాస్థి కూడా త్వరగా అరగటం ఆరంభిస్తుంది. కొందరిలో వంశపారంపర్యంగానూ మోకీళ్లు అరిగిపోవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడో, దెబ్బలు తగిలినప్పుడో సరైన చికిత్స తీసుకోకపోవటంతోనూ మోకాలి ఎముకల మధ్య సమతుల్యత దెబ్బతిని మృదులాస్థి అరిగే ప్రమాదముంది. కీళ్లవాతం, గౌట్‌ వంటి సమస్యలూ కొందరికి మోకీళ్ల నొప్పులకు దారితీయొచ్చు. అందువల్ల చిన్నవయసులో మోకీళ్ల నొప్పులు తలెత్తితే ఇతరత్రా సమస్యలేవీ లేవని నిర్ధరించుకోవటం చాలా అవసరం.
కారణమేదైనా మృదులాస్థి ఒకసారి క్షీణించిందంటే దానంతటదే తిరిగి మామూలు స్థాయికి రావటం అసాధ్యం.
ఎప్పుడు సమస్యాత్మకం?
ఎప్పుడైనా కాస్త ఎక్కువదూరం నడవాల్సి వస్తే మోకీళ్లు నొప్పి పుట్టటం మామూలే. కండరాల మీద, ఎముకల మీద ఒత్తిడి పడటం మూలంగా వచ్చే ఇలాంటి నొప్పులు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. వీటికి భయపడాల్సిన పనేమీ లేదు. కానీ తరచుగా, అదీ తక్కువ దూరానికే నొప్పి వస్తుంటే మాత్రం సందేహించాల్సిందే. నడవటం ఆపేస్తే నొప్పి తగ్గిపోతుండటం.. ఇంతకుముందు 2 కిలోమీటర్లు నడిస్తే వచ్చే నొప్పి ఇప్పుడు అర కిలోమీటరు దూరానికే రావటం.. రోజువారీ పనులు చేసుకుంటున్నప్పుడూ నొప్పి ఇబ్బంది పెడుతుండటం.. మోకీళ్లు పట్టేస్తుండటం.. వాపు వంటివి గమనిస్తే ఏమాత్రం తాత్సారం చేయరాదు. లక్షణాలు- ఎన్నెన్నో
నొప్పి: మొదట్లో ఎప్పుడైనా ఎక్కువ దూరం నడిచినప్పుడో, మెట్లు ఎక్కుతున్నప్పుడో, కింద కూచొని లేచినప్పుడో నొప్పి వస్తుంటుంది. తర్వాత కాస్త దూరం నడవగానే నొప్పి మొదలవుతుంది. మెట్లు ఎక్కటం, దిగటం కష్టమవుతుంది. చివరికి ఏం చేయకపోయినా, విశ్రాంతి తీసుకుంటున్నా నొప్పి బాధిస్తుంది. కొందరికి రాత్రి పూటా నొప్పి వేధిస్తుంటుంది. దీంతో నిద్ర కూడా దెబ్బతింటుంది. క్రమంగా నొప్పి మాత్రలు వేసుకుంటే తప్ప బయటకు రాలేని పరిస్థితి తలెత్తుతుంది.
వాపు: సమస్య ఆరంభంలో అప్పుడప్పుడు వాపు వస్తుంది, కొద్దిరోజులకు తగ్గిపోతుంది. ముదురుతున్నకొద్దీ వాపు తగ్గకుండా అలాగే ఉండిపోతుంటుంది.
కిరకిర చప్పుడు: కొందరికి కూచున్నప్పుడు, లేచినప్పుడు కిరకిరమంటూ చప్పుడు రావొచ్చు. మృదులాస్థి అరిగిపోయినప్పుడు అక్కడ ఎముక బయటపడుతుంది. దీంతో ఎముకలు రాసుకుపోయి చప్పుడు వస్తుంది. అయితే కిరకిరమని చప్పుడు ఉన్నంత మాత్రాన మోకీళ్ల అరుగుదలగా భావించాల్సిన పనిలేదు. కొందరికి మామూలుగానే కూచున్నప్పుడు, లేచినప్పుడు మోకీళ్లు చప్పుడు చేస్తుంటాయి. చప్పుడుతో పాటు నొప్పి, వాపు కూడా ఉంటేనే సమస్యగా భావించాలి.
వంకర పోవటం: మృదులాస్థి ఒకపక్క బాగా అరిగిపోతే కీలు వంకర పోవచ్చు. దీంతో బరువు సరిగా పడక ఒకవైపునకు ఒరిగి నడుస్తుంటారు.
బిగుసుకుపోవటం: మొదట్లో నిద్రలేచిన వెంటనే మోకీళ్లు బిగుసుకుపోయినట్టు, పట్టుకుపోయినట్టు అనిపిస్తుంది. కాస్త అటూఇటూ కదిలించటం వంటివి చేస్తే తిరిగి కుదురుకుంటాయి. క్రమంగా కూచోవాలన్నా, లేవాలన్నా వంగకుండా తయారవుతాయి. దీంతో కుర్చీలో, కారులో కూచోవాలన్నా.. వంగాలన్నా ఇబ్బంది పడతారు.
వేడి: సమస్య తీవ్రమైతే మోకీళ్లు వేడిగానూ ఉండొచ్చు.
పరీక్షలు
ముందు ఆయా లక్షణాలను, ఇబ్బందులను నిశితంగా పరిశీలించటం చాలా అవసరం. నొప్పి ఒక కాలిలో ఉందా? రెండు కాళ్లలోనా? ఎంత దూరం నడిస్తే వస్తోంది? ఎన్నిరోజుల నుంచి వస్తోంది? ఎంత తీవ్రంగా ఉంది? రాత్రిపూట కూడా నొప్పి పుడుతోందా? విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుందా? రోజువారీ పనులకు ఇబ్బంది కలుగుతోందా? మెట్లు ఎక్కటానికి వీలవుతోందా? కూచొని లేవగలుగుతున్నారా? చప్పుడు వస్తోందా? ఏవైనా మందులు వేసుకుంటున్నారా? ఎంత తరచుగా మందులు వేసుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలతోనే సమస్య ఏంటనేది చాలావరకు తేలిపోతుంది. తర్వాత నడక ఎలా ఉంది? ఒకవైపునకు ఒరిగిపోతున్నారా? కుంటుతున్నారా? అనేది చూస్తారు. అలాగే మోకీళ్ల మీద చేయి పెట్టి కీలు ఎలా ఉంది? ఎలా కదులుతోంది? చప్పుడేమైనా వస్తోందా? వంకర పోయిందా? నొప్పి ఎక్కడెక్కడ్నుంచి మొదలవుతోంది? అనేది పరిశీలిస్తారు. ఇవన్నీ సమస్యపై ఒక అంచనాకు రావటానికి తోడ్పడతాయి. ఎక్స్‌రే: మోకీళ్లు అరిగిపోయినట్టు అనుమానిస్తే ఎక్స్‌రే తీస్తారు. ఇందులో ఎముక అరిగిపోవటం, వంకరపోవటం వంటివన్నీ బయటపడతాయి.
ఎంఆర్‌ఐ: ఎక్స్‌రేలో ఎముకలకు సంబంధించిన అంశాలే తెలుస్తాయి. మృదులాస్థి, కండర బంధనాలు, మెనిస్కస్‌ ఎలా ఉన్నాయనేవి కచ్చితంగా తెలియవు. అందువల్ల అవసరమైతే కొందరికి ఎంఆర్‌ఐ కూడా చేయాల్సి ఉంటుంది.
రక్త పరీక్షలు: ఇవి రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, గౌట్‌ వంటివి గుర్తించటానికి తోడ్పడతాయి.
ఆర్థ్రోస్కోపీ: అరుదుగా ఆర్థ్రోస్కోపీ అవసరపడొచ్చు. ఇందులో మోకీలులోకి గొట్టం లాంటిది పంపించి ఎలా ఉందో చూస్తారు. మృదులాస్థి అరుగుదల తొలిదశలోనే ఉన్నా గుర్తించొచ్చు. కండర బంధనాలు బెణికినా ఇందులో బయటపడుతుంది.
ఒకసారి మృదులాస్థి క్షీణించటం మొదలైతే తిరిగి మామూలు స్థాయికి రావటం కష్టం. కాబట్టి ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
బరువు అదుపు: మోకీళ్లకు బరువు పెద్ద శత్రువు. బరువు పెరిగినకొద్దీ కీళ్ల మీద భారం ఎక్కువవుతుంది. ఫలితంగా మృదులాస్థి త్వరగా అరిగిపోయే ప్రమాదముంది. కాబట్టి ముందు నుంచే బరువు పెరగకుండా చూసుకుంటే మోకీళ్ల నొప్పులు తలెత్తకుండా చూసుకోవచ్చు. కాబట్టి సమతులాహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది. వ్యాయామాలతో మరో ప్రయోజనం ఎముకలకు దన్నుగా నిలిచే కండరాలు, కండర బంధనాలు కూడా బలోపేతమవటం.
ఇతర సమస్యలకు చికిత్స: కీళ్లవాతం, గౌట్‌ వంటి సమస్యలేవైనా ఉంటే ముందే గుర్తించి చికిత్స తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఇలాంటి సమస్యలు ముదిరిపోయి ఒకసారి కీళ్లు దెబ్బతింటే తిరిగి కుదురుకోవటం అసాధ్యం. అవి శాశ్వతంగా అలాగే ఉండిపోతాయి. కీళ్లవాతం, గౌట్‌లకు ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా వాడుకుంటుంటే సమస్య ముదరకుండా చూసుకోవచ్చు.
చికిత్స బరువు తగ్గటం, వ్యాయామం ప్రధానం
అధిక బరువు, ఊబకాయం తగ్గించుకోవటం చాలా కీలకం. ఒక కిలో బరువు తగ్గినా మోకీళ్ల మీద సుమారు 5 కిలోల భారాన్ని తగ్గించుకున్నట్టే. కాబట్టి సమతులాహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయటం అత్యవసరం. నడిస్తే నొప్పి పుడుతోందని భావిస్తే వ్యాయామ సైకిల్‌ తొక్కొచ్చు. ఈత కొడితే ఇంకా మంచిది. వీటితో పాటు డాక్టర్లు కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు, ఫిజియోథెరపీ సూచిస్తారు. ఇవి మోకీళ్లకు దన్నుగా నిలిచే కండరాలను బలోపేతం చేస్తాయి. దీంతో కీళ్లపై భారం తగ్గుతుంది, కదలికలూ మెరుగవుతాయి. మృదులాస్థి అప్పుడప్పుడే అరగటం ఆరంభమైనవారికి కీళ్లు జారిపోకుండా చూసే పట్టీలు కూడా బాగా ఉపయోగపడతాయి.
నొప్పి మందులు: ముందు మామూలు నొప్పి మందులతోనే ఫలితం కనబడుతుంది. వీటితో ఉపశమనం లభించకపోతే డ్లైక్లోఫెనాక్‌ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం మందులు ఇస్తారు. అయితే ఇవి ఛాతీలో మంట, అల్సర్ల వంటి దుష్ప్రభావాలకు దారితీయొచ్చు. కాబట్టి దీర్ఘకాలం వాడుకోవటం మంచిది కాదు. నిపుణుల సలహా మేరకే తీసుకోవాలి.
గ్లూకోజమైన్‌ మాత్రలు: ఇవి మోకీళ్లలో జిగురుద్రవం ఉత్పత్తి పెరిగేలా చేస్తాయి. మృదులాస్థి బలోపేతమవుతుంది.
ఆర్థ్రోస్కోపీ క్లీనింగ్‌: మాత్రలు వేసుకుంటున్నా, ఫిజియోథెరపీ చేస్తున్నా, పట్టీలు ధరిస్తున్నా ఫలితం కనబడకపోతే ఆర్థ్రోస్కోపీ ద్వారా మృదులాస్థి ఉపరితలాన్ని శుభ్రం చేస్తారు. పెచ్చులేవైనా లేస్తే తొలగిస్తారు. దీంతో కదలికలు మెరుగువుతాయి. నొప్పి, వాపు నుంచి తాత్కాలింగా ఉపశమనం లభిస్తుంది.
జిగురుద్రవం: కీళ్లలో హైలురోనిక్‌ యాసిడ్‌ అనే జిగురుద్రవం ఎముకలు రాసుకుపోకుండా కందెనలాగా ఉపయోగపడుతుంది. అందువల్ల అవసరమైతే దీన్ని ఇంజెక్షన్‌ రూపంలో నేరుగా కీళ్లలోకి ఇస్తారు.
ఎముకను సరిచేయటం: దీన్నే ఆస్టియోటమీ అంటారు. దెబ్బతిన్న మృదులాస్థి మీద బరువు ఎక్కువగా పడకుండా ఎముక అమరిక సహజసిద్ధంగా ఉండేలా సరి చేయటం దీని ప్రత్యేకత. ఇందులో మోకాలి కింది ఎముకకు ఒకవైపున గాటు పెట్టి.. అవసరమైన మేరకు కత్తిరించటమో.. ఎముకను జోడించటమో చేస్తారు. తర్వాత ప్లేట్‌, స్క్రూలతో బిగిస్తారు. దీంతో దెబ్బతిన్న మృదులాస్థి మీద బరువు పడటం తగ్గి, నొప్పి తగ్గుతుంది. మున్ముందు మృదులాస్థి అరిగిపోకుండానూ ఉంటుంది. అరిగిపోయిన భాగం తిరిగి కోలుకోవటానికీ వీలుంటుంది. మోకీలు మార్పిడితో పోలిస్తే ఇది తేలికైంది. పెద్దగా ఇబ్బంది పెట్టేది కాదు. ఖర్చు కూడా తక్కువే. అందుకే చిన్న వయసులో మోకీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా దీన్ని సూచిస్తున్నారు. ఇటీవల ఇది ఎక్కువగానే ప్రాచుర్యం పొందుతోంది.
మోకీలు మార్పిడి: ఇతరత్రా చికిత్సలతో ఫలితం కనబడపోతే.. చివరి ప్రయత్నంగానే మోకీలు మార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. అయితే ఇది పెద్ద ఆపరేషన్‌. ఇన్‌ఫెక్షన్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. కృత్రిమ కీలు కొంతకాలానికి అరిగిపోతుంది కూడా. అందువల్ల వీలైనంతవరకు అరవై ఏళ్ల లోపువారికి దీన్ని చేయకపోవటమే మంచిది. 50 ఏళ్ల వయసులో శస్త్రచికిత్స చేయించుకున్నారనుకోండి. ఉద్యోగాలు, పనులతో చురుకుగా ఉంటారు. దీంతో కృత్రిమ కీలు అరిగిపోయి తిరిగి 70 ఏళ్ల వయసులో మళ్లీ మార్పిడి చేయాల్సి రావొచ్చు. అదే అరవై, డెబ్బై దాటితే అంత ఎక్కువ చురుకుగా ఉండరు. అప్పుడు మోకీలు మార్పిడి చేయించుకుంటే కీలు మీద అంత ఒత్తిడి పడదు. దీంతో ఎక్కువకాలం మన్నుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఒత్తిడిని తట్టుకొని ఎక్కువకాలం మన్నే పరికరాలూ అందుబాటులోకి వచ్చాయి. కీలు ఫిక్సేషన్‌ పద్ధతులు, డిజైన్‌ కూడా మెరుగయ్యాయి. కాకపోతే అన్ని సదుపాయాలు గల ఆసుపత్రిలో, మంచి అనుభవం గల డాక్టర్లతోనే చేయించుకోవాలి. అరకొరగా ఆపరేషన్‌ చేస్తే ఇన్‌ఫెక్షన్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. అమరిక ఒక డిగ్రీ అటూఇటూ అయినా కీలు త్వరగా అరిగిపోతుంది.
పునరుత్తేజిత చికిత్సలు
వీలైనంతవరకు సహజ కీలును అలాగే ఉంచి.. మృదులాస్థిని తిరిగి కోలుకునేలా చేయటంపై ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. అందుకే మృదులాస్థిని పునరుత్తేజితం చేసే (రీజనరేటివ్‌) చికిత్సలకు ప్రాధాన్యం పెరుగుతోంది.
ప్లేట్‌లెట్‌ రిచ్డ్‌ ప్లాస్మా చికిత్స: ఇందులో నొప్పితో బాధపడుతున్నవారి నుంచి 30-40 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరించి దానిలోంచి ప్లేట్‌లెట్లు దండిగా ఉండే 3-4 మిల్లీలీటర్ల ప్లాస్మా ద్రవాన్ని వేరుచేస్తారు. దీన్ని సూది ద్వారా మోకీళ్లలోకి ప్రవేశపెడతారు. ప్లేట్‌లెట్లలో కణజాలాన్ని వృద్ధి చేసే కారకాలు (గ్రోత్‌ ఫ్యాక్టర్స్‌) దెబ్బతిన్న మృదులాస్థి పునరుత్తేజితమయ్యేలా ప్రేరేపిస్తాయి. అరుగుదల తొలిదశలో ఉన్నవారికిది బాగా ఉపయోగపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
మూలకణ చికిత్స: మూలకణాలు మృదులాస్థి కణాలుగా మారిపోయి దెబ్బతిన్న భాగం మరమ్మతు కావటానికి తోడ్పడతాయి. ఈ చికిత్సపై పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని పద్ధతులు అందుబాటులోకీ వచ్చాయి. కటి ఎముక లోపలి నుంచి మజ్జను తీసి, మూలకణాలను వేరుచేసి నేరుగా మోకీలులోకి ఎక్కించటం ఒక పద్ధతి. అయితే దీంతో ఒనగూడే ఫలితాలకు శాస్త్రీయంగా నిరూపణ లేదు. మూలకణాలను ప్రయోగశాలలో పెద్దసంఖ్యలో వృద్ధి చేసి మోకీలులోకి ప్రవేశపెట్టటం మరో పద్ధతి. ఇది బాగా ఉపయోగపడుతుంది గానీ దీన్ని నిర్వహించటానికి మనకింకా అనుమతి లభించలేదు. మూలకణాలను పూతగా చేసి మృదులాస్థి పెచ్చులు ఊడినచోట పూయటం మరో పద్ధతి. దీంతో మరింత మంచి ఫలితం కనబడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
శరీర బరువును, ఒత్తిడిని చాలావరకు మృదులాస్థి, మినిస్కస్‌ పొరలే తీసుకుంటాయి. ఇవి వయసు మీద పడుతున్నకొద్దీ క్షీణిస్తుంటాయి. మోకీళ్ల నొప్పులకు మూలమిదే బరువు, నడక వేగం పెరిగినకొద్దీ మృదులాస్థి మీద ఒత్తిడీ పెరుగుతుంది. అందువల్ల మృదులాస్థి దెబ్బతింటే అడుగు వేయటమే గగనమైపోతుంది
అరవై కిలోల బరువున్న వ్యక్తి 6 కి.మీ. వేగంతో నడిస్తే మృదులాస్థి మీద 90 కిలోల ఒత్తిడి పడుతుంది. అదే వేగంగా నడిస్తే, పరుగెడితే ఈ ఒత్తిడి 360 కిలోలకు చేరుకుంటుంది. అయినా కూడా మృదులాస్థి దాన్ని సమర్థంగానే తట్టుకుంటుంది. కానీ క్షీణిస్తే మాత్రం తట్టుకోలేక చతికిలపడి పోతుంది!

Vericose Veins……వెరికోస్‌ వెయిన్స్‌.. పైకి తేలే పెయిన్స్‌..

ట్రాఫిక్‌ సజావుగా సాగాలంటే ఎప్పుడూ ఒకేవైపు సాగాలి. వాహనాలు ఎదురు రాకూడదు. అలా వస్తే ట్రాఫిక్‌ అస్తవ్యస్తం. మన శరీరంలోని రక్తం కూడా ట్రాఫిక్‌లాగే సజావుగా ఒకేవైపు వెళ్ళే ఏర్పాటును ప్రకృతి చేసింది. రక్తనాళాల్లోని రక్తం ఎదురు వెళ్ళకుండా ట్రాఫిక్‌ పోలీసుల్లాంటి వాల్వ్స్‌ ఏర్పాటుచేసింది. ఒకవేళ ఆ రక్తనాళాల్లోని ఆ వాల్వ్స్‌ సరిగ్గా పనిచేయనప్పుడు రక్తం ఎదురు ప్రయాణం చేస్తే….? అక్కడి రక్తనాళాలు ఉబ్బుతాయి. ఆ శరీరభాగాల్లో నొప్పి వస్తుంది. ‘వేరికోస్‌ వెయిన్స్‌’గా పిలిచే ఈ సమస్యకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
శరీరంలోని ప్రతి భాగానికి గుండె నుంచి రక్తం పంప్‌ అవుతుంది. శుభ్రమైన రక్తాన్ని తీసుకెళ్ళే రక్తనాళాలను ధమనులు అంటారు. అలాగే అన్ని శరీర భాగాల నుంచి గుండెకు చెడురక్తం చేరుకుంటుంది. వీటిని తీసుకెళ్ళే రక్తనాళాలను సిరలు అంటారు. అయితే మన శరీరంలోని మంచి రక్తాన్ని తీసుకెళ్ళే ధమనులు బయటకు కనిపించవు. కేవలం సిరలే ఉబ్బినట్లుగా బయటకు కనిపిస్తాయి. ఇక ఇందులోని వాల్వ్స్‌ పనిచేయనప్పుడు రక్తం వెళ్ళాల్సిన దిశలో పూర్తిగా వెళ్ళకపోవడంతో అవి ఉబ్బినట్లుగా అవుతాయి. జిగ్‌జాగ్‌గా మెలికలు తిరిగినట్లుగానూ కనిపిస్తాయి. ఈ కండిషన్‌నే వెరికోస్‌ వెయిన్స్‌ అంటారు.
శరీరంలోని మిగతా భాగాల్లోనూ ఈ సిరలు ఉబ్బినట్లుగా కావడం సహజమే అయినా కాళ్ళల్లోనూ ఈ సిరలు ఉబ్బినట్లుగా కావడం సహజమే. అయినా కాళ్ళల్లో ఇది మరీ ఎక్కువ. కాళ్ళల్లో ఉబ్బినట్లుగా కనిపించే రక్తనాళాలను వెరికోస్‌వెయిన్స్‌ అని, మిగతా శరీర భాగాల్లో ఇదే సమస్య ఉంటే వెరికోసిస్‌ అని పిలుస్తారు.

వేరికోస్‌ వెయిన్స్‌ సమస్య నిలబడి పనిచేసే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలోని మిగతా రక్తనాళాల్లోనూ ఈ సమస్య వచ్చేందుకు అవకాశాలున్నా ఇది కాళ్ళలోనే ఎక్కువ. ఎందుకంటే కాళ్ళ నుంచి గుండెకు చెడురక్తం వెళ్ళాలంటే ‘భూమ్యాకర్షణశక్తి’కి వ్యతిరేకంగా, బలంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా భూమ్యాకర్షణకు వ్యతిరేకంగా నిత్యం పనిచేసే క్రమంలో సిరల్లోని వాల్వ్స్ కొన్ని సార్లు బలహీనం అయ్యే అవకాశాలు ఎక్కువ. దాంతో మొత్తం పంప్‌ అవ్వాల్సిన రక్తంలో కొంత భాగం సిరల్లోనే ఉండిపోవడం వల్ల అవి ఉబ్బినట్లుగా, మెలికలు తిరిగినట్లుగా అవుతాయి. అక్కడి శరీరభాగాల వాపు, నొప్పి, నిలబడలేకపోవడం, సమస్య మరీ తీవ్రమైన కొన్ని సందర్భాల్లో కాలికి పుండు పడడం వంటి సమస్యలు వస్తాయి.

మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఛాతిలోని ప్రెజర్ (intrathoracic pressure) తగ్గుతుంది. అప్పుడు కాలి వెయిన్స్లో ఉండే రక్తం తిరిగి గుండెకు ప్రవహిస్తుంది. కాలి వెయిన్స్ లో నుండి ప్రవహించిన రక్తం వెనక్కు రాకుండా అడ్డుకునే విధంగా, superficial veins కి, deep veins కి మధ్య వాల్వులు (valves) ఉంటాయి.కాలి వెయిన్స్ లో ఉండే వాల్వులు సరిగ్గా పనిచేయనప్పుడు ( valve incompetence) వెరికోస్ వెయిన్స్ వస్తాయి.

క్లుప్తంగా చెప్పాలంటే కాళ్ల లో ఉండే ఉబ్బితే వెరికోస్ వెయిన్స్ అంటారు. ఎక్కువసేపు నిలబడి ఉండడం కూడా వెరికోస్ వెయిన్స్ రావడానికి ఒక కారణం అని పరిశోధనలు చెబుతున్నాయి.

వెరికోస్ వెయిన్స్ వలన కాళ్ళ నొప్పి, అల్సర్లు వంటివి వచ్చే అవకాశం ఉంది.నివారించడానికి stockings ధరించితే మంచిది. నర్సులు stockings వేసుకోడానికి కారణం ఇదే. కాలు ఎత్తు లో పెట్టి పడుకోవడం కూడా ఉపయోగకరం

మహిళల్లో ఎక్కువ….
వెరికోస్‌వెయిన్స్‌ సమస్య అందిరిలోనూ కనిపించినా పురుషులతో పోలిస్తే మహిళల్లో అవి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. వంశపారంపర్యంగా రావడం, గర్భధారణ, బరువు పెరగడం, రుతుస్రావం ఆగిపోవడం (మెనోపాజ్‌) వంటి కారణాలతో స్త్రీలతో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
చికిత్స :
1. శస్త్రచికిత్స : గాటు ఎక్కువగా ఉండే సెఫానస్‌ స్ట్రిప్పింగ్‌, గాటు తక్కువగా ఉండే ఫ్లెబక్టమ
2. కెమికల్‌ : స్క్లెరోథెరపీ
3. థర్మల్‌ : ఆర్‌.ఎఫ్‌.ప్రక్రియ, ఎండోవీనస్‌ లేజర్‌ అబ్లేషన్‌
4. మైక్రోఫ్లెబెక్టమీ శస్త్రచికిత్స : శస్త్రచికిత్సలో భాగంగా చెడిపోయిన సిరలను తొలగిస్తారు. రక్తం క్రమంగా ఎదురు ప్రవహించడటంతో ఈ సిరలు తమ విధులను నిర్వహించలేవు. దాంతో ఆ బాధ్యతలను పక్కనే ఉండే మరికొన్ని సిరలు స్వీకరిస్తాయి. అందువల్ల చెడిపోయిన సిరలను సర్జికల్‌గా తొలగిస్తారు. శస్త్రచికిత్సల్లో సాంప్రదాయకంగా ఎక్కువ గాటు అవసరమైన సెఫినస్‌ స్ట్రిప్పింగ్‌, గాటు తక్కువగా ఉంటే ఫ్లెబెక్టమీ ఆపరేషన్స్‌ వంటివి చేస్తారు.
స్క్లెరో థెరపీ : శస్త్రచికిత్సల అవసరం లేకుండా కొన్ని రకాల మందుల సహాయంతో చెడిపోయిన సిరలు కుంచించుకుపోయేలా చేసే ప్రక్రియను స్ల్కెరోథెరపీ అంటారు. ఇలా సిరలు కుచించుకుపోయేలా చేసే రసాయనాలను స్ల్కెరో సాంట్స్ అంటారు.
లక్షణాలు : రక్తనాళాలు బాగా ఉబ్బినట్లుగా కావడం, మెలికలు తిరిగినట్లు చర్మంలోంచి బయటకు కనిపించడం, కాళ్ళవాపు, నొప్పి, బరువుగా అనిపించడం, ఎక్కువసేపు నిల్చోలేకపోవడం, కాళ్ళపై ఉన్న చర్మం రంగు కోల్పోవడం, కాళ్ళపైన దురద, రాత్రివేళల్లో కాళ్ళ కండరాలు బిగుసుకుపోయినట్లుగా కావడం, కాళ్ల పైన కొన్ని చోట్ల చర్మంపై పుండ్లు పడడం, ప్రధానంగా మడమ భాగంలో ఈ సమస్య ఎక్కువ. ఈ పుండ్లను వెరికోస్‌ అల్సర్స్‌ అంటారు. వెరికోస్‌ వెయిన్స్‌ ఉన్న ప్రాంతంలో ముట్టుకుంటే బాధాకరం (టెండర్‌)గా అనిపించవచ్చు.
ప్రమాదాలు : వీటికి చికిత్స చేయించకుండా వదిలేస్తే కొన్ని ప్రమాదాలు జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో పుండ్లు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. చిన్న చిన్న దెబ్బలకు కూడా ఆగకుండా రక్తస్రావం కావచ్చు.
ఎండోవీనస్‌ లేజర్‌ అబ్లేషన్‌ :
ఇది థర్మల్‌ ప్రక్రియల్లో భాగంగా చేసే అధునాతన చికిత్స. చిన్న ఇంజెక్షన్‌లా సిరల్లోకి సూదిని పంపి లేజర్‌ సహాయంతో అక్కడ చెడిపోయిన సిరను పూర్తిగా దహించుకుపోయేలా చేస్తారు.
సంప్రదాయ సర్జికల్‌ ప్రక్రియలో స్పైనల్‌ లేదా జనరల్‌ అనస్థీసియా ఇవ్వడం సాధారణమే. అందులో చెడిపోయిన సిరలను తొలగించుకుంటూ వచ్చే క్రమంలో కొన్నింటిని గుర్తించడం సాధ్యం కాకపోవడంతో వదిలేయడం కూడా పరిపాటి. అయితే ఎండోవీనస్‌ లేజర్‌లో అల్ట్రాసౌండ్‌ సహాయంతో సిరలను నిత్యం గమనించుకుంటూ లేజర్‌ సహాయంతో దహించుకుపోయేలా చేస్తూ సిరలను మూసివేస్తారు. కాబట్టి చెడిపోయిన కొన్ని సిరలను వదిలేసేందుకు ఆస్కారమే ఉండదు.
సాధారణ సంప్రదాయ సర్జరీలో ఆపరేషన్‌ కోసం ఆసుపత్రిలో చేరడం అవసరం. కానీ… ఎండోవీనస్‌ లేజర్‌ అబ్లేషన్‌ థెరపీలో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. కేవలం కొద్దిసేపు మాత్రమే పట్టే (డే-కేర్‌) చికిత్సతో ఈ ప్రొసీజర్‌ నిర్వహిస్తారు.
సాంప్రదాయికంగా జనరల్‌ సర్జరీ ద్వారా చేసే ఆపరేషన్‌లో వెన్నెముకకు మత్తు ఇవ్వడం (స్పైనల్‌ అనస్థీషియా), పూర్తిగా మత్తు ఇవ్వడం (జనరల్‌ అనస్థీషియా) ఇస్తారు. కానీ లేజర్‌ ద్వారా చేసే చికిత్సలో స్థానికంగా ఇచ్చే అనస్థీషియా (లోకల్‌ అనస్థీషియా) తప్ప పూర్తి మత్తు కానీ, స్పైనల్‌ అనస్థీషియా కాని అవసరం ఉండదు.
సర్జరీ ద్వారా వెరికోస్‌ వెయిన్స్‌ను తొలగించిన సందర్భాల్లో కొన్నిసార్లు కొన్నేళ్ళ తర్వాత పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చి మునుపటి సమస్య పునరావృతం అయ్యే అవకాశాలు ఎక్కువ. కానీ… ఎండోవీనస్‌ లేజర్‌ థెరిపీతో ఆ సమస్య ఉండదు. సక్సెస్‌ రేటు చాలా ఎక్కువ.
ఎండోవీనస్‌ లేజర్‌ చికిత్స పూర్తయిన వెంటనే వాళ్ళ పనులను, దినచర్యలను వెంటనే మొదలుపెట్టవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా బెడ్‌రెస్ట్‌ అవసరం లేదు.

Rheumatoid Arthritis… రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌

శరీరంలో వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోవటం వలన కాళ్లు, చేతులు,, మోచేతులు. కీళ్లు దెబ్బ తింటాయి. రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్‌ను కీళ్లవాతం అని అంటారు.
శరీర రక్షణ వ్యవస్థలో లోపాల వల్ల జాయింట్‌లో నొప్పి, వాపుతోపాటు కీళ్ల కదలిక కష్టమవుతుంది. సాధారణంగా చేతులు. కాళ్ల జాయింట్ల వద్ద తీవ్రనొప్పి ఉంటుంది. కొన్నిసార్లు కన్ను, ఊపిరితిత్తులు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఉదయం వేళలో రెండు గంటలపాటు కాళ్లు, చేతులు కొయ్యబారి పోతుంటాయి. శక్తి కోల్పోవటం, జ్వరం, నోటితో పాటు కన్ను తడారిపోతుంటాయి.
కీళ్ళవాతం రావటానికి కారణం ఏమిటి? కీళ్ల వాతం రావటానికి గల కారణాలను ఇప్పటి వరకు గుర్తించలేదు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో లోపం వల్లనే కీళ్లవాతం వస్తుంది. శరీరంలో ఉన్న కొన్ని కణాలు జాయింట్లలో ఉన్న ఆరోగ్య కణాలపై దాడి చేస్తుంటాయి. జాయింట్‌లోని కార్డిలేజ్‌ను దెబ్బతీయటం, శరీరంలోని రక్షణ వ్యవస్థపై కొన్ని కణాలు దాడితో కీళ్లవాతం వస్తుంది.
కీళ్లవాతాన్ని ఎలా గుర్తిస్తారు ? కాళ్లు మోచేతులు వేళ్ల వద్ద తీవ్రనొప్పితో పాటు వాపు, కీళ్ల మూవ్‌మెంట్‌ దెబ్బ తిని బిగుసుకు పోతుంటే దాన్ని వైద్యులు పరీక్షించి రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్‌గా గుర్తిస్తారు. రోగులకు రక్త పరీక్షలు, ఎక్స్‌రే తీయించటం ద్వారా కూడా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. చేతివేళ్ళు మోచేతులను ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ఎం ఆర్‌ ఐ పరీక్షలు చేయించటం ద్వారా కూడా ఈ వ్యాధిని నిర్థారిస్తారు.
రుమటాలజీ ఆర్థరైటిస్‌కు చికిత్స : గత పదేళ్లలో అభివృద్ధి చెందిన వైద్యవిజ్ఞానంతో రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్‌ నుంచి ఉపశమనం కలిగించేలా మేలైన చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాధి వచ్చినవారు సకాలంలో చికిత్స చేయించుకుంటే కీళ్లనొప్పులు దూరమై సాధారణ పనులు చేసుకోవచ్చు. కీళ్లవాతానికి డి ఎం ఎ ఆర్‌ డి. ఎన్‌ ఎస్‌ ఎ ఐడితో పాటు తక్కువ డోస్‌ స్టిరాయిడ్స్‌తో చికిత్స చేయవచ్చు. మేలైన మందులతో పాటు రోగికి అవగాహన కల్పించి ఫిజియోథెరపి, ఆక్యుపేషనల్‌ థెరపీతో కీళ్లవాతంను నివారించవచ్చు. ఈ వ్యాధిగ్రస్తులకు కొంత శరీర వ్యాయామం కూడా అవసరమే.
కీళ్లవాతానికి చికిత్స ఎంతకాలం తీసుకోవాలి? రుమటాలజీ ఆర్థరైటిస్‌కు జీవితకాలం చికిత్స తీసుకోవాలి. కీళ్లు పూర్తిగా దెబ్బతినకుండా నివారించడంతో పాటు కీళ్లనొప్పి నుంచి ఉపశమనం కలిగిచేందుకు మందులు వాడాలి. కీళ్లవాతం వచ్చిన రోగులు రుమటాలజీ స్పెషలిస్టు సలహాపై మందులు వాడాలి. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించు కోవటంతోపాటు ప్రతినిత్యం మందు వాడుతూ ఫిజియోథెరపిస్టు సలహాపై వ్యాయామం చేయాలి.

Osteoarthritis…..ఆస్టియో ఆర్థ రైటిస్‌

సామాన్యుల పరిభాషలో కీళ్ళు అరిగిపోయాయి అని చెప్పుకునే ఆస్టియో ఆర్థ రైటిస్‌ 40 ఏళ్ళు దాటిన వారిలో ముఖ్యంగా మహిళలలో పెరుగుతున్నది. సరిగ్గా నడవలేని పరిస్ధితులో జీవితం దుర్భరం అనిపిస్తుంది. ఒకసారి ఆస్టియో ఆర్థ రైటిస్‌ వస్తే ఇక తగ్గదని మరింత బాధ పెరుగుతుందనే అభిప్రాయం సరైనది కాదు.
శరీరం తనకు తానుగా చేసుకునే సర్దుబాటుతో లోపలి భాగాలు మరమ్మత్తు జరిగి భాధ తగ్గించవచ్చు. ఐతే కొన్ని సందర్భాలలో అరుగుదల తీవ్రమై మరమ్మత్తుకు లొంగనందున మోకాలి కీలు తుంటికీలు ఉబ్బినట్లవుతాయి. బిగుసుకుపోతాయి. ఈ స్ధితికి శాశ్వత పరిష్కారం లేకున్నా చికిత్సా విధానాలు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే బాధ తగ్గుతుంది. అరుగుదలకు సంబంధించిన జబ్బు. కీళ్ళ ప్రాంతంలో ఎముకలు కలిసే చోట ఎముకపై మృదులాస్ధి వుంటుంది. ఆ మృదులాస్ధి అరిగిపోవటంతో ఎముకలు రాపిడికి గురై బాధిస్తాయి. ఎముకలు గట్టిపడి బయటకు పెరుగుతాయి. దీని ఫలితమే కీళ్ళు ఉబ్బినట్టుగా కనిపించడం. కీళ్ళు చుట్టు ఉండే గుళిక భాగం కూడా వాస్తుంది. గట్టిపడుతుంది.
ఆస్టియో ఆర్థ రైటిస్‌ లక్షణాలు
ఆస్టియో ఆర్థ రైటిస్‌ వచ్చిన వారికి కీళ్ళు వాచి బిగుసుకుపోయి బాధిస్తాయి. వ్యాయామం చేసినప్పుడు ఆ బాధ మరింత పెరుగుతుంది. కీలు భాగాన్ని గతంలో కదిలించినంత సుభంగా కదిలించలేరు. కీళ్ళ వద్ద రాపిడి శబ్ధాలు వస్తాయి. ఆస్టియో ఆర్థ రైటిస్‌ పెరిగినకొద్ది కీళ్ళ బాగాలు ఉబ్బుతాయి. ఆ వాపు కూడా వస్తూ పోతుంటుంది. కొన్ని సందర్భాలో బాధ తీవ్రమవుతుంది. అందుకు ప్రత్యేక కారణం కనిపించదు. కాని వాతావరణ మార్పులు, శారీరక కదలికలను బట్టి బాధ పెరుగుతుందని చెప్పవచ్చు.
ఆస్టియో ఆర్థ రైటిస్‌ ప్రారంభ దశలో బాధ, బిగుసుకుపోవడం అధికంగా వుంటుంది. మెనోపాజ్‌కు చేరిన దశలో మహిళల్లో ఈ బాధ అధికంగా వుండి ఆ తరువాత క్రమంగా బాధ స్ధాయి తగ్గి స్ధిరపడుతుంది. ఆస్టియో ఆర్థ రైటిస్‌ తీవ్రమైనపుడు కీళ్ళనొప్పు రాత్రి పగలు తేడా లేకుండా వేధిస్తాయి. విశ్రాంతి సమయంలోను బాధ తప్పదు. శరీరంలోని నిర్ధిష్ట కీళ్ళ భాగానికి నిర్ధిష్ట రోగ లక్షణాలు ఉంటాయి. చేతులు, బొటనవేలు చివర మెటిక భాగాలు వాచి వేళ్ళు వంగవు. కీలు వెనుకభాగంలో ఉబ్బెత్తుగా తయారవుతుంది. దానిని హెబర్డీన్‌ కణుపు అంటారు.
మెడ, వీపు ( స్పాండిలైసిస్‌) : వెన్నుపూస మధ్య ఉన్న మృదులాస్ధి అరిగిపోయి వెన్నుపూస మధ్య ఎడమ తగ్గిపోతుంది. వెన్నుపూస అంచు దగ్గర ఎర్పడే అదనపు అరుగుదల తెచ్చే ఒత్తిడి వల్ల చేతులు లాగేస్తున్నట్లు చేయి చచ్చుబడినట్టవుతుంది
పాదాలు : కాలి బొటనవేలు ఆధార భాగంలో వచ్చే ఆస్టియో ఆర్థ రైటిస్‌ వల్ల ఆభాగం బిగుసుకుపోయి నడవటం చాలా కష్టమవుతుంది. కీళ్ళ దగ్గర ఉబ్బినట్లై భాధిస్తుంది. ఆస్టియో ఆర్థ రైటిస్‌
మోకాలు :మోకాలు ముందు భాగం, ప్రక్కభాగాలు బాధిస్తాయి. ఆస్టియో ఆర్థ రైటిస్‌ తీవ్రమైనపుడు మోకాలు వంగి పోయినట్లవుతుంది.
తుంటి : గజ్జల భాగంలో నొప్పి లేదా తొడ ముందు భాగాలో భాధ, తుంటి నుండి మోకాలు వరకు తీవ్ర బాధ దీనివల్ల కాలు కొంచెం కురచవుతుంది.
ఆస్టియో ఆర్థ రైటిస్‌ ఎందుకు వస్తుంది.
ఈ వ్యాధి ఎందుకు వస్తుందో స్ఫష్టంగా తెలియదు. అయితే ఎలాంటి సందర్భాలలో వస్తుందో తెలిసింది.
1.వయస్సు 40 దాటితే మహిళల్లో
2. భారీ కాయం కలవారికి
3. వంశంలో ఈ జబ్బు ఉన్నప్పుడు
4. ఆటల్లో కీళ్లకు దెబ్బలు తగిలినప్పుడు
5. ఏదైనా ఇతర కారణాల వల్ల కీళ్ళ ఆర్థ రైటిస్‌ ఆపరేషన్‌ జరిగినప్పుడు
6. రుమటాయిడ్‌ ఆర్థ రైటిస్‌ ప్రారంభమై అది ద్వితీయంగా ఆస్టియో ఆర్థ రైటిస్‌ కావచ్చు.
గుర్తించడం ఎలా ?
ఆస్టియో ఆర్థ రైటిస్‌ ని ఏదో ఒక పరీక్షతో గుర్తించడం సాధ్యం కాదు. అందుకే వైద్యుడు బాధ లక్షణాలను అడుగుతాడు. పరీక్షలు చేస్తారు. రోగ చరిత్ర తెలుసుకుంటారు. ఎముక వాపు అదనపు ఎదుగుదల, ఎముకల శబ్ధాలు, కీళ్ళ బలహీనత, కీళ్ళ కదలికలలో మార్పులు ఉదయం లేచిన వెంటనే అరగంట వరకు కీళ్ళు స్వాధీనంలోకి రాకపోవడం వంటి లక్షణాలను వైద్యులు అడిగి తెలుసుకుంటారు.
ఆస్టియో ఆర్థ రైటిస్‌ చికిత్స
1.చికిత్సకు స్పష్టమైన లక్ష్యం పెట్టుకుంటారు వైద్యులు
2.బాధలను ఇతర రోగ లక్షణాలను తగ్గించటం.
3. కీళ్ళ పనితీరును మరింత దిగజారకుండా చూడడం లేదా మెరుగుపరచడం
4. కీళ్ళ వంకరను తగ్గించడం.
ఆస్టియో ఆర్థ రైటిస్‌ చికిత్సకు అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ రుమటాలజీ ఎ.సి.ఆర్‌ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే చికిత్సాపరమైన నిర్ణయం మీద వైద్యుడు మరియు రోగిదే తుది నిర్ణయం అని ఎ.సి.ఆర్‌ స్ఫష్టం చేసింది. వారి చికిత్స సూచనలో మందులను వినియోగించి మందులు వాడకుండా చేసే చికిత్సా విధానాలో ఒకదానిని రోగి ఎంపిక చేసుకోవచ్చు.
మందులు అవసరం లేకుండా చికిత్స
ముందుగా ఈ విధానపు చికిత్స చేయడం మంచిదే. ఈ విధానంలో మందుల వల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్‌ సమస్యలు వుండవు. మందులు వాడని చికిత్సా విధానంలో
1.రోగికి అవగాహన పెంచి తనకు తానుగా జాగ్రత్తలు పాటించేలా చేయటం.
2.భారీ కాయం బరువు తగ్గించటం
3.కండరాలకు బలం వచ్చేలా వ్యాయామం, ఎరోబిక్‌ కండీషనింగ్‌
4.టాపింగ్‌ మరియు బ్రేసింగ్‌
5.లేటరల్‌ వెడ్జెడ్‌ ఇన్‌సోలోస్‌
6.కీళ్ళ నొప్పులకు ఆక్యుపేషనల్‌ థెరపీలో తిరిగి శక్తిని పుంజుకునేలా చేయడం
మందులతో చికిత్స :
మందులు లేని చికిత్సా విధానంతో పాటు మందుల వాడకాన్ని ప్రారంభించవచ్చు. బాధలను తగ్గించేందుకు మందులు వాడతారు. కీళ్ళ బాధ, రోగికి సైడ్‌ ఎఫెక్ట్‌ బాధ, బాధించే కీలును బట్టి మందులను వైద్యులు సూచిస్తారు.
మాత్రలు
ఎసిటోమెనోఫెన్‌, ఓపియాడ్‌ అనాల్జిసిక్స్‌ (ఉదా: ఆల్డ్రామ్‌ లేదా శక్తివంతమైన ఓపియాడ్‌ థెరపీ) ఎన్‌సెయిడ్స్‌ (ఉదా: ఐబుప్రోఫిన్‌, డైకోఫెనేక్‌, నెప్రోక్సిన్‌, మెలోక్సికామ్‌) కాక్స్‌ 2 ఇన్హిబిటర్‌ (ఉదా: సెల్‌బ్రెక్స్‌ ) నాన్‌ ఎసిటైలేటెడ్‌ సాల్సిలేట్‌
ఆస్టియో ఆర్థ రైటిస్‌ ఆపరేషన్‌ : చికిత్సలో చివరిగా ఆశ్రయించేది ఆపరేషన్‌. తీవ్రమైన బాధ అనుభవించే వారికి లేదా కీళ్ళ కదలిక తగ్గిపోతునప్పుడు మందులకు స్పందించినప్పుడు ఆపరేషన్‌ తప్పదు.
ఆపరేషన్‌తో బాధ తగ్గుతుంది. కీళ్ళు సరైన స్థితికి వస్తాయి. కీళ్ళు పనితీరు, కదలిక మెరుగవుతుంది. ఆస్టియో ఆర్థ రైటిస్‌ చికిత్సలో అనుసరించే ఆపరేషన్స్‌లో సాధారణమైనవి.
ఆర్థ్రోస్కోపిక్‌ సర్జరీ – ` ఆస్టియోటమీ ` టోటల్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌.

Joint Replacement……తుంటి మార్పిడి

మంచం మీద నుంచి కిందకు దిగాలంటే కాలు సహకరించదు. ..పట్టుమని పదడుగులు వేయాలంటే భరించలేని నొప్పి… తుంటిలో అరుగుదల కారణంగా మంచానికే అంటి పెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అరుగుదలకు పుట్టుకతోనే వచ్చే లోపాలు కొన్నయితే రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, అంకైలోజింగ్‌ స్పాండలైటిస్‌, ఆస్టియో ఆర్థరైటిస్‌ వంటి వ్యాధులు కూడా కారణలు.
కీళ్లవాతం కారణంగా తుంటి ఎముక అరిగిపోతుంది. అలాగే ఎప్పుడో తగిలిన గాయం కారణంగా కూడా తుంటి జాయింట్‌లో అరుగుదల ఏర్పడుతుంది. మరో ముఖ్యమైన కారణం అంకైలోజింగ్‌ స్పాండలైటిస్‌. దీనివల్ల వెన్నెముక నుంచి తుంటి వరకు మొత్తం కీళ్లన్నీ కలిసిపోయి నడుం కర్రలా బిగుసుకుపోతుంది. అలాంటి పరిస్థితిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటి మార్గం. అసలు తుంటి మార్పిడి అవసరం ఎందుకు ఏర్పడుతుందో తెలుసుకుందాం.
తుంటి మార్పిడి అవసరం ఎప్పుడు?.…. తుంటిలో ఉండే బంతి (బేరింగ్‌ లా పనిచేసేది) రక్తప్రసరణ తగ్గిపోయి ఆ బంతిలో ఉన్న ఎముక చనిపోవటం వల్ల బంతి అరిగిపోతుంది. దాంతోపాటు బంతి ఉన్న గిన్నె (ఎస్టాబ్లెమ్‌) కూడా అరుగుదలకు దారితీసి తుంటి జాయింట్‌ అన్నది పూర్తిగా అరిగిపోతుంది. ఆ పరిస్థితి ఎవస్కో లెక్లోసిస్‌ (ఎవిఎల్‌) లేదా అంతకు ముందు తగిలిన గాయాల కారణంగా ఏర్పడుతుంది. ఈ రెండు ముఖ్యమైన కారణాలు 20-40 మధ్య వయస్కులో ఏర్పడతాయి. చిన్న వయసు వారికి కూడా తుంటి మార్పిడి అవసరమవుతుంది. ప్రధానంగా ఈ పరిస్థితి స్త్రీలోనే అధికంగా ఏర్పడుతుంది.
తుంటి మార్పిడి చేసుకోవడానికి మరో ముఖ్యమైన కారణం అంకైలోజింగ్‌ స్పాండలైటిస్‌ అనే వ్యాధి. ఇది పురుషులలో అధికంగా వస్తుంది. 20-40 మధ్య వయసులో ఈ వ్యాధి అధికంగా తలెత్తుతుంది. వెన్నెముక నుంచి తుంటి దాకా అన్ని జాయింట్లు ప్యూజ్‌ అయిపోవడం అంటే ఒకటైపోవడం (కలసిపోవడం) వల్ల వచ్చే వ్యాధిని అంకైలోజింగ్‌ స్పాండలైటిస్‌ అంటాం. ఈ వ్యాధికి సంపూర్ణమైన వైద్యం లభించదు.
ఈ వ్యాధి కారణంగా రాను రాను మెడ నుంచి వెన్నెముక వరకు మొత్తం కదలిక లేకుండా స్తంభించిపోతుంది. మెడ తిప్పడం, నడుం వంచడం కష్టమవుతుంది. తుంటి దగ్గర కదలిక ఉండకపోవడంతో వెన్ను వెదురు బద్దలా బిగుసుకుపోతుంది. ఈ వ్యాధితో బాధపడే రోగులకు తుంటి మార్పిడి సర్జరీ కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందని చెప్పవచ్చు. తుంటి అరుగుదలో వచ్చిన మార్పును తుంటి మార్పిడి సర్జరీతో మళ్లీ కదలికను రప్పించవచ్చు. అలాగే దీనివల్ల నడుంపైన పడిన ప్రభావాన్ని తగ్గించవచ్చు
కొందరికి పుట్టుకతోనే తుంటిలో ఉన్న ఎముక అరుగుదల తొడ ఎముకలో మార్పు ఉండడం వల్ల తుంటి మార్పిడి అవసరమవుతుంది. ఇది శ్రమతో కూడుకున్న సర్జరీ. ఈ సర్జరీని అనుభవజ్ఞులైన కొంతమంది నిపుణులు మాత్రమే చేయగలరు.
సర్జరీ ఎప్పుడు చేసుకోవాలి? తుంటిలో నొప్పి అధికంగా ఉండడం. ఆ నొప్పి వల్ల కదలిక పూర్తిగా లేకపోవడం, ఎక్కువసేపు నిబడలేకపోవడం, నాలుగడుగులు కూడా వేయలేకపోవడం, కూర్చున్నవారు లేవలేకపోవడం, మంచం మీద కిందకు దిగడానికి కూడా కాలు సహకరించకపోవడం, నొప్పితో ఒక కాలు మీద అసలు నిబడలేకపోవడం, అలాగే ఎక్సెరే లో బాగా అరుగుదల కనిపించినపుడు తుంటి మార్పిడి సర్జరీ అవసరమవుతుంది.
సర్జరీ ఎలా జరుగుతుంది? తుంటిలో ఉండే బంతి (బాల్‌) గిన్నె (ఎస్టాబ్లెమ్‌) అరిగిపోవడాన్ని హిప్‌ ఆర్థరైటిస్‌ అంటారు. బంతిని గిన్నెను కృత్రిమ కప్పుతోటి, బంతిని ఒక స్టెమ్‌తోటి అమరిక ఉంటుంది. ఈ స్టెమ్‌ తొడపై ఎముక మూలగ లోపలకు చొప్పించడం జరుగుతుంది. అయితే కొద్ది మందికి మాత్రం ఇలా ఎముక మూలగలోకి వెళ్లే స్టెమ్‌ కాకుండా అరిగిపోయిన బంతిని సర్ఫేస్‌ రిప్లేస్‌మెంట్‌ ద్వారా మార్పిడి చేయడం జరుగుతుంది. ఈ బంతికి, గిన్నెకు మధ్య కదలికు సాఫీగా జరగడానికి వివిధ రకాల ఇంప్లాట్స్‌ ను వాడటం జరుగుతుంది. మొదట గిన్నె వైపు ప్లాస్టిక్‌ని, బంతివైపు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ మెటల్‌ని వాడడం మొదలైంది. ఇప్పటికి కూడా ఇదే అత్యుత్తమ ఫలితాలను ఇస్తోంది. మధ్యలో కొంతకాలం గిన్నె వైపు మెటల్‌, బంతి వైపు మెటల్‌ అన్‌ మెటల్‌ వాడడం జరిగింది. కాని దీంతో చాలామందికి సర్జరీ ఫెయిల్‌ కావడం, మెటల్‌ రక్తప్రసరణ ఎక్కడం, మెటల్‌ ఎముకను పూర్తిగా తినేయడం వంటివి జరగడంతో ప్రస్తుతం ఈ పద్ధతిని ఉపయోగించడం లేదు. ప్రస్తుతం గిన్నె వైపు బంతి వైపు సిరామిక్‌ అన్‌ సిరామిక్‌ అంటారు. జర్మనీ లో తయారయ్యే ఈ సెరామిక్‌ మెటల్‌ ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు. గతంలో సెరామిక్‌ అన్‌ సెరామిక్‌ కారణంగా రాపిడి కలిగి కరకరమని కీళ్లలో శబ్ధాలు రావడం జరిగేది. అయితే ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన పరికరా వల్ల ఈ శబ్ధాలు రావడం లేదు. అలాగే కదలికలు కూడా చాలా స్మూత్‌గా ఉంటున్నాయి.
ఎముకలలో ఎలా పట్టు చిక్కుతుంది? ఎముక మూలిగ లోపలకు చొప్పించే ఈ స్టెమ్‌కు గిన్నెకు పట్టు చిక్కడం రెండు విధాలుగా జరుగుతుంది. ఎప్పుడైతే పట్టుకోసం సిమెంట్‌ వాడడం జరుగుతుందో దీన్ని సిమెంట్‌డ్‌ అంటాము. గత 50 ఏళ్లుగా సిమెంటెడ్‌ విధానం కొనసాగుతుంది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, అంకైలోజింగ్‌ స్పాండలైటిస్‌ ఉన్నవారిలో వృద్ధులలో ఎవరికైతే కాల్షియం బాగా తక్కువ ఉందో వారిలో ఎముకలో పట్టుచిక్కడానికి సిమెంటెడ్‌ వాడడం జరుగుతుంది. ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో గత కొద్దికాలంగా ఆన్‌సిమెంటెడ్‌ వాడడం జరుగుతుంది. ఆ అన్‌సిమెంటెడ్‌ విధానంలో గిన్నెకు, స్టెమ్‌కు స్పెషల్‌ కోటింగ్‌ ఉంటుంది. వీటిని నేరుగా ఎముకలోకి చొప్పించడం జరుగుతుంది. మూడు నెలల్లో సాధారణ ఎముక ఈ కోటింగ్‌లోకి చొచ్చుకుపోవడం జరుగుతుంది. వీలైనంతవరకు అన్‌సిమెంటెడ్‌ చేయాలన్నది వైద్యుల ప్రయత్నమని చెప్పవచ్చు. కాని ఎక్కడైతే కాల్షియం బాగా తక్కువ ఉంటుందో అక్కడ మాత్రమే అన్‌సిమెంటెడ్‌ చేయడం జరుగుతుంది.
దుష్ప్రభావం: తుంటి మార్పిడి సర్జరీ చేసినపుడు ఒక్కోసారి ఇంప్లాట్స్‌ పక్కకు జరిగే అవకాశం ఉంటుంది. బంతి కప్పు నుంచి పక్కకు జరిగిపోవడం కొన్ని సందర్భాలలో జరుగుతుంది. ఇటువంటివి జరుగకుండా ఉండాలంటే రోగి సైజుకు తగ్గ గిన్నెబంతి ఇంప్లాంట్స్‌ వేయడం మంచింది. సర్జరీ లో ఖచ్చితత్వాన్ని సాధించడానికి రానున్న కాలంలో కంప్యూటర్‌ నావిగేషన్‌ కూడా అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.
ఆధునిక వైద్య విధానం
1) పూర్తి స్ధాయిలో అన్‌సిమెంటెడ్‌ వాడకం.
2)సెరామిక్‌ అన్‌ఫాలీ లేదా సెరామిక్‌ అన్‌ సెరామిక్‌ వాడకం పెరుగుదల.
3) చాలా చిన్న గాటుతో సర్జరీ చేయడం.
4) బంతి, గిన్నె సైజు రోగుల అవయవాల సైజు ప్రకారం తయారుకావడం.
5) ఇంప్లాట్స్‌ అరుగుదల చాలా తక్కువగా ఉండడం వల్ల కనీసం 15 నుంచి 20 ఏళ్లు ఇది వాడుకలో ఉంటుంది.
6) ఒకవేళ ఏ కారణం చేతనైనా ఇంప్లాట్స్‌ను సవరించవలసిన అవసరం ఏర్పడితే రివిజన్‌ సర్జరీ ఇప్పుడు అందుబాటులో ఉంది

Edema………కాళ్ళవాపులు

కాళ్లలో నొక్కినచోట గుంటలా ఏర్పడి అది మొల్లగా సర్ధుకోవడాన్ని సాధారణగా పిట్టింగ్‌ అంటారు. ఈ సమస్యను వైద్యపరిభాషలో ఎడిమా అంటారు. ఈ సమస్య సాధారణంగా పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువ. నీరు పట్టడానికి అనేక కారణాలుంటాయి.
కారణాలు : రెండు కాళ్లలోనూ నీరుపడుతుంటే ఈ కింది సమస్యలు ఉండే అవకాశం ఉంది.
1. కిడ్నీ సమస్యలు : నెఫ్రోటిక్‌ సిండ్రోమ్‌, గ్లామరూలో నెఫ్రిస్‌ వంటి మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారిలో.
2. కాలేయ సమస్యలు : సిర్రోసిస్‌ ఆఫ్‌ లివర్‌ వంటి కాలేయ సమస్య ఉన్నప్పుడు.
3. గుండె సమస్యలు : హార్ట్‌ ఫెయిల్యూర్‌ వంటి గుండె సంబంధించిన సమస్యలు
4. పోషకాహాక లోపాలు : ఆహారంలో తగినన్ని ప్రోటీన్లు తీసుకోకపోవటం బెరిబెరి వంటి పోషకాహార లోపాలు ఉండటం.
5. హైపోథైరాయిడిజం : ఇది మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య. ఈ సమస్యలో మాత్రం కాళ్ల వాపు నీరు పట్టడం వల్ల జరగదు. కాళ్లలో మిక్సిమాస్‌ అనే టిష్యూ కారణంగా కాళ్ల వాపు వస్తుంది.
6. కొన్ని రకాల మందుల వల్ల : నొప్పి నివారణ మందులు దీర్ఘకాలం వాడుతున్న వారిలో, కొన్ని రకాల హైబిపి మందులు వాడేవారిలో, రకరకాల కారణాల వల్ల స్టెరాయిడ్స్‌ వాడిన వారిలో కాళ్లవాపు కనిపించవచ్చు
. 7. ప్రయాణాల వల్ల : కొందరిలో చాలా దూరం కూర్చుని ప్రయాణం చేయడం వల్ల ఈ కాళ్లవాపు వస్తుంటుంది.
8.కారణాలు లేకుండా : కొంతమందిలో నిర్థిష్టంగా ఎలాంటి కారణం లేకుండానే కాళ్లవాపులు రావచ్చు. ముఖ్యంగా పిల్లలను కనే వయసులోని మహిళల్లో ఇది కనిపించడం చాలా సాధారణం దీన్ని ఇడియోపాధిక్‌ సైక్లిక్‌ ఎడిమా అంటారు.
చాలా మందిలో కాళ్లవాపు సమస్య ప్రమాదకరం కాదు. అయితే ఈ సమస్య ప్రమాదకరం కాదని చెప్పడానికి ముందుగా అందుకు అనుమానించే అన్ని కారణాలకు సంబంధించిన పరీక్షలు చేయించి అవి నెగిటివ్‌ అని తేలాక మాత్రమే. అది ప్రమాదకరం కాదని నిర్థారణ చేయాల్సి ఉంటుంది.
ఒక కాలిలో వాపు ఉంటే :
1. ఫైలేరియాసిస్‌, ఎలిఫెంటియాసిస్‌ : దోమకాటు వల్ల కాలిలో వాపు
2. వెరికోస్‌ వెయిన్స్‌ : కాళ్లపై ర్తనాళాల్లోని (సిరలు) కవాటాలు పనిచేయకపోడం వల్ల నరాలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి.
3. డీప్‌ వెయిన్‌ ధ్రాంబోసిస్‌ : రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఈ సమస్య వస్తుంది.
4. వీనస్‌ ఇన్‌సఫీషియన్సీ : కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం నిర్థిష్ట మార్గంలో ప్రయాణం చేయకపోవడం వల్ల ఈ సమస్య రావచ్చు.
5. సెల్యులైటిస్‌ : కాళ్ల చర్మంలోని డెర్మల్‌ సబ్‌క్యుటేనియస్‌ అనే పొరలలో ఉండే కనెక్టివ్‌ టిష్యులో సమస్యల వల్ల ఈ వాపు వస్తుంది. చికిత్స : (ఈ మందులను డాక్టరు సలహాపై మాత్రమే వాడాలి. సొంత వైద్యం పనికిరాదు)
రెండు కాళ్ళు చాచినప్పుడు : సాధారణంగా కాళ్ల వాపు వచ్చిన అన్ని సందర్భాల్లోనూ ఒకేలాంటి నిర్థిష్టమైన చికిత్స ఉండదు. కారణాన్ని బట్టి చికిత్స మారుతుంది. అందుకే ముందుగా పరీక్షలు చేయించి కాళ్ల వాపులకు ఉన్న కారణాన్ని కనుగొనాల్సి ఉంటుంది.
మూత్రపిండాల సమస్యలో : ఇమ్యునోసప్రెసెంట్స, డైయూరిటిక్స్‌ వంటి మందులు వాడాల్సి ఉంటుంది.
సిర్రోసిస్‌ ఆఫ్‌ లివర్‌లో : స్పెరనోలాప్టోన్‌ అనే మందులు వాడాల్సి ఉంటుంది. కార్డియాక్‌ సమస్యలో : అయనోట్రోపిక్స్‌, డైయూరిటిక్స్‌ వంటి మందులు వాడాలి.
పోషకాహార లోపాల్లో : అత్యధికంగా ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి.
హైపోధైరాయిడిజమ్‌ : థైరాక్సిన్‌ అనే హార్మోన్‌ ఇవ్యాల్సి ఉంటుంది.
ఏదైనా మందుల వల్ల కాళ్ల వాపు వస్తే : పేషంట్ వాడుతున్న నొప్పి నివారణ మందులు, హైబిపి మందులు, స్టెరాయిడ్స్‌ నిలిపివేసి వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర మందులు మార్చాల్సి వస్తుంది.
ఏ కారణం లేకుండా వచ్చే వాపు : ఇది ఏ కారణం లేకుండా వచ్చే ఇడియోపథిక్‌ సైక్లిక్‌ ఎడిమా అయితే ఎలాంటి మందులు వాడనవసరం లేదు. దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే కొద్ది రోజుల పాటు డైయూరిటిక్స్‌ వాడవచ్చు.
ప్రయాణంలో వచ్చే వాపులు : వీరికి ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు కాస్త ఎత్తుగా ఉండేలా తలగడపై కాళ్లు పెట్టుకోవడంతో కాళ్లవాపు తగ్గుతుంది, ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే డాక్టర్‌ సలహాపై డైయూరిటిక్స్‌ వాడవచ్చు.
ఒకే కాలి వాపునకు చికిత్స
ఫైలేరియాసిస్‌లో : డై ఇథైల్‌ కార్మోమైసిన్‌ ను సాధారణంగా ఉపయోగిస్తారు. ఎలిఫెంటి యాసిస్‌లోనూ ఇవే మందులను ఉపయోగిస్తారు. అయితే ఈ మందులు ఒకదశలో పనిచేయని పరిస్థితి రావచ్చు.
వేరికోస్‌ వెయిన్స్‌ : నిర్థిష్టంగా ప్రత్యేకంగా మందులు ఉండవు. కాళ్లకు తొడిగే ప్రత్యేకమైన తొడుగు స్టాకింగ్స్‌ల వల్ల ఈ సమస్యను నియంత్రణలో ఉంచవచ్చు.
వీనస్‌ ఇన్‌సఫిషియన్సీ: ఈ సమస్యకు కూడా నిర్థిష్టంగా చికిత్స ఉండదు. అయితే ప్రత్యేకమైన ఎలాస్టిక్‌ తొడుగుల ద్వారా కాళ్లవాపును అదుపు చేయవచ్చు. ఒకవేళ కాళ్ల వాపు మరీ ఎక్కువగా ఉంటే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.
సెల్యులైటిస్‌ : ఈ సమస్య వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది.
జాగ్రత్తలు : అన్ని రకాల కాళ్ల వాపుల విషయంలో ఈ సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు తగ్గించాలి. చాలాసేపు అదేపనిగా కూర్చోవడం, నిలబడటం తగ్గించాలి. రాత్రివేళల్లో కాళ్లను ఎత్తుగా తలగడపై విశ్రాంతిగా ఉంచాలి. అవసరాన్ని బట్టి ఎలాస్టిక్‌ స్టాకింగ్స్‌ వాడాలి.
పరీక్షలు
సీబీపీ. యూరిన్‌ స్పాట్ ప్రొటీన్ / క్రియాటినిన్‌ రేషియో. బ్లడ్‌ యూరియా క్రియినిన్‌. లివర్‌ పంక్షన్‌ పరీక్ష.2-డీ ఎకో కార్డియోగ్రామ్‌. టి3, టి4, టిఎస్‌హెచ్‌. ఆల్ట్రా సౌండ్‌ హోల్‌ అబ్డామిన్‌. వీనస్‌ డాప్లర్‌ ఆఫ్‌ ది లెగ్స్‌. నైట్ స్మియర్‌ ఫర్‌ మైక్రోఫైలేరియా లాంటి పరీక్షలు కాళ్ల వాపులు ఉన్నవారిలో చేయించాల్సి ఉంటుంది.