ఇయర్ ఫోన్స్, హెడ్‌ ఫోన్స్ – చెవులు దెబ్బతింటాయా? ఇవి ఎంతమేరకు వాడవచ్చు?

శబ్ద తరంగాలు మన చెవిని చేరినప్పుడు అవి మన కర్ణభేరిని (eardrum/tympanic membrane) ని కదుపుతాయి. ఆ ప్రకంపనలు లోపలికి ప్రయాణించి cochlea లో ఉన్న hair cells కదిలేలా చేస్తాయి. ఆ కణాల కదలిక వల్ల ఆ శబ్దం విద్యుత్ స్పందనగా మారి మెదడుకి చేరుతుంది. బాగా గట్టిగా ఉన్న శబ్దాలు విన్నప్పుడు ఆ hair cells వాటి సామర్ధ్యాన్ని కోల్పోయి తాత్కాలిక వినికిడి లోపం కలుగుతుంది. అదే కనుక దీర్ఘకాలికంగా కొనసాగితే శాశ్వతంగా వినికిడిలోపం కలుగుతుంది. ఈ రోజుల్లో earphones వాడని వారు చాలా అరుదు. కాలక్షేపం కోసం అయినా, ఉద్యోగ నిమిత్తం అయినా earphones, headphones వాడకం మనకి సర్వసాధారణం అయిపోయింది. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం వినికిడి శక్తి కాపాడుకోవచ్చు. మీకు వీలు ఉంటే earphones/headphones వాడే సమయాన్ని…

Read More

Ear Diseases

కాక్లియర్‌ ఇంప్లాంట్ చెవిటి, మూగ అవస్థ నుంచి విముక్తి కల్పించే అద్భుత పరిజ్ఞానం కాక్లియర్‌ ఇంప్లాంట్‌. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు ఒక లక్షమందికి పైగా పిల్లలు వినికిడి లోపంతో పుట్టుతున్నారు. సకాలంలో గుర్తించకపోవటం వలన వీరిలో చాలామంది చెవిటి మూగవారిగా మిగిలి పోతున్నారు. సంవాహకలోపం (కండక్టివ్‌ డెఫ్‌నెస్‌) :.చెవి నిర్మాణంలో బాహ్య, మధ్య, అంతర చెవి నిర్మాణాలలో ఎక్కడ సమస్య వచ్చినా వినికిడిలోపం రావచ్చు. ఉదా: బయటి, మధ్య చెవిలో సమస్యలుంటే దానివల్ల శబ్ధ తరంగాలు అసలు లోపలికి వెళ్ళవు. దీంతో వినికిడి ఉండదు. ఈ రకం వినికిడి లోపాన్ని సంవాహకలోపం (కండక్టివ్‌ డెఫ్‌నెస్‌) అంటారు. ఈ సంవాహక వినికిడి లోపాన్ని చాలా వరకూ ఆపరేషన్‌లో సరిచేయవచ్చు. కొందరికి పుట్టుకతోనే బయటి చెవి లేకపోవటం, చెవి రంధ్రమార్గం ఏర్పడకపోవటం వంటి సమస్యలుంటాయి. వీటిని సర్జరీతో చక్కదిద్దవచ్చు.…

Read More