మొబైల్ కొనడానికి ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు

RAM – ఇది మన ఫోన్ లో ఉండే OS ( ఆపరేటింగ్ సిస్టమ్) సాఫ్ట్వేర్, మనము వాడే యాప్ డాటా, మనము ఈ క్షణం ఫోన్ లో ఏం చేస్తున్నామో ఆ డాటా దీనిలో ఉంటుంది. ఇది ROM, SD CARDS, కంటే కూడా చాలా త్వరగా READ చేయబడుతుంది. కాబట్టి ఇది ఫోన్ కి మెదడు లాంటిది. ఎంత పెద్ద బుర్ర ఉంటే అంత వేగంగా పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చేవి అన్ని ఎక్కువగా 4,6,8 GB లు ఉన్నాయి. మామూలు గా వాడటానికి 4GB చాలు. GAMING, EDITING, MULTI TASKING లాంటి వాటికి 8 GB ఉత్తమం.

ROM- ఇది మన ఫోన్ స్టోరేజ్. మన ఫోటోలు, వీడియోలు, యాప్లు, ఫైల్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాము. కాబట్టి ఇది కూడా ఎక్కువగా ఉండాలి. 64/128 GB సరిపోతుంది.

PROCESSOR – మన ఫోన్ పనితనం అన్నింటి కంటే దీని మీదే ఎక్కువ ఆధార పడి ఉంటుంది. కొత్త processor ఐతే వేగంగా పనిచేస్తాయి. SD 660 – SD 855 వరకు మంచివి. (లేదా) HELIO G80/G85 కూడా .

SCREEN DISPLAY FEATURES- 

  • ముందుగా SCREEN SIZE – 5–6 ఇంచులు బావుంటుంది. ఇది ఎవ్వరి వాడకాన్ని బట్టి వారు ఎంచుకోవచ్చు. GAMING కి ఐతే కాస్త పెద్దది బావుంటుంది.
  • తరువాత రిఫ్రెష్ రేట్ – 60–90–120 HZ లలో ఉన్నాయి. ఎంత ఎక్కువ REFRESH RATE ఉంటే అంత స్మూత్ గా ఉంటుంది వాడటానికి.60 HZ అంటే మన స్క్రీన్ నిమిషానికి 60 సార్లు refresh అవ్తుంది. 90 HZ అంటే 90 సార్లు, 120 HZ అంటే 120 సార్లు REFRESH అవ్తుంది.
  • తరువాత DISPLAY STYLE ఇప్పుడు SUPER AMOLED DISPLAY లు బావున్నాయి.
  • తరువాత రిజల్యూషన్ – ఇది ఎక్కువగా ఉంటే క్లారిటీ ఎక్కువగా ఉంటుంది.

BATTERY CAPACITY- ఇది మన ఫోన్ బ్యాటరీ MAh. ఎక్కువగా ఉన్నవి ఎక్కువ సేపు పని చేస్తాయి. 5000–6000 MAh ఇప్పుడు వరకు ఉన్నవి.

BUILD QUALITY – ఫోన్ తయారీ కి వాడినది లేక ఫోన్ నిర్మాణ స్థాయి అనొచ్చు. METAL అయితే బావుంటుంది. వెనకాల GLASS ఐతే గీతాలు పడవు.

OS/UI – ఆపరేటింగ్ సిస్టమ్ మరియు యూజర్ ఇంటర్ఫేస్. ఇవి LATEST UPDATED ఐతే మంచిది.

CAMERA MP – మామూలుగా అయితే ఎంత ఎక్కువ MP ఉంటే అంత మంచి ఫోటోలు వస్తాయి అంటారు. అందులో నిజం లేకపోలేదు, కానీ కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. ఫోటో క్లారిటీ కేవలం MP మీద ఉండదు. ఇంకా చాలా వాటి మీద ఉంటాయి. టూకీగా ఎక్కువ MP, APERTURE SIZE, PHOTO CONVERTING SOFTWARE, PROCESSING SOFTWARE బాగా ఉన్నది చూసి తీసుకోవచ్చు.

COLOUR – ఇది మీ ఇష్టం.

జియోమార్ట్‌ యాప్‌

రిలయన్స్‌ జియోతో టెలికాం మార్కెట్‌లో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్‌ ఈ కామర్స్ విభాగం జియోమార్ట్ ద్వారా మరో సునామీ సంచలనాలు సృష్టించేందుకు మరింత దూకుడుగా సిద్ధమవుతోంది. భారతదేశంలోని 200 నగరాల్లో కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించిన రెండు నెలల తరువాత, జియోమార్ట్ తాజాగా ఆండ్రాయిడ్‌, ఐఫోన్వినియోగదారులకోసం కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. తద్వారా జియోమార్ట్ అన్ని ఆర్డర్‌లపై ఉచిత డెలివరీని కూడా అందిస్తోంది. 

జియోమార్ట్ ప్రధాన ప్రణాళికలను ఆవిష్కరించిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. వినియోగదారుల కోసం లాంచ్‌ చేసిన జియోమార్ట్ యాప్  ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని జియో ప్రకటించింది. రిలయన్స్ తన లాయల్టీ ప్రోగ్రామ్ రిలయన్స్ వన్ లేదా రోన్‌ను జియోమార్ట్‌కు కూడా విస్తరించింది. తద్వారా వినియోగదారులు అనేక బ్రాండ్లు, ఉత్పత్తులపై ప్రత్యేకమైన ఆఫర్‌లతో పాటు, రోన్ పాయింట్లను సంపాదించవచ్చని తెలిపింది. ఐదు శాతం డిస్కౌంట్ ను కూడా ఇస్తామని ప్రకటించింది. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో ఈయాప్‌ దూసుకుపోతోంది. ఇప్పటికే 10వేలకు పైగా డౌన్‌లోడ్‌లను సంపాదించింది.

జియోమార్ట్ ఇంతకుముందు 750 రూపాయలు అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లకు మాత్రమే ఉచిత డెలివరీని అందిస్తున్న సంగతి గమనార్హం. అమెజాన్ ప్రస్తుతం ఆర్డర్‌లకు 799 రూపాయల పైన ఉచిత డెలివరీని అందిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ ఇవ్వడానికి కనీస ఆర్డర్ విలువ 600 రూపాయలు. ఉచిత డెలివరీ కావాలంటే 1,200 రూపాయలు విలువైన వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గ్రోఫర్స్,  800 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆర్డర్‌లకు ఉచిత డెలివరీని అందిస్తుంది. పరిచయ ఆఫర్‌గా, జియోమార్ట్‌లో ప్రతి మొదటి ఆర్డర్‌తో కోవిడ్‌-19 ఎసెన్షియల్ కిట్‌ను అందిస్తామని ఏజీఎంలో ప్రకటిన సంగతి తెలిసిందే.

రూ.20 వేలలోపు టాప్-5 స్మార్ట్ ఫోన్లు

Top 5 Smartphones Under 20000 July 2020

1. శాంసంగ్ గెలాక్సీ ఎం31
డిస్ ప్లే: 6.4 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే

కెమెరా: 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 32 మెగా పిక్సెల్
ర్యామ్: 6 జీబీ
బ్యాటరీ: 6000 ఎంఏహెచ్
ప్రాసెసర్: శాంసంగ్ ఎక్సినోస్ 9611
ధర: రూ.16,499 నుంచి ప్రారంభం

2. రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్
డిస్ ప్లే: 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే
కెమెరా: 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 32 మెగా పిక్సెల్
ర్యామ్: 6 జీబీ
బ్యాటరీ: 5020 ఎంఏహెచ్
ప్రాసెసర్: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ
ధర: రూ.16,999 నుంచి ప్రారంభం

3. రియల్ మీ 6 ప్రో
డిస్ ప్లే: 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే
కెమెరా: 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్

సెల్ఫీ కెమెరా: 16 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్
ర్యామ్: 6 జీబీ
బ్యాటరీ: 4300 ఎంఏహెచ్
ప్రాసెసర్: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ
ధర: రూ.17,999 నుంచి ప్రారంభం

4. రియల్ మీ ఎక్స్2
డిస్ ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే
కెమెరా: 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 32 మెగా పిక్సెల్
ర్యామ్: 4 జీబీ
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ప్రాసెసర్: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730జీ
ధర: రూ.17,999 నుంచి ప్రారంభం

5. మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్
డిస్ ప్లే: 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే
కెమెరా: 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 16 మెగా పిక్సెల్
ర్యామ్: 6 జీబీ

బ్యాటరీ: 5000 ఎంఏహెచ్

ప్రాసెసర్: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730జీ
ధర: రూ.16,999

టిక్‌టాక్ పోయింది..’చింగారి’ వ‌చ్చేసింది

Chingari App  Desi Alternative To TikTok Crosses 1 Million Downloads  - Sakshi

తిండి తిన‌కుండా ఉంటాం కానీ టిక్‌టాక్ లేకుండా ఉండ‌లేం అంటున్నారు కొంద‌రు టిక్‌టాక్ యూజ‌ర్లు. అందుకే టిక్‌టాక్ స‌హా 59 చైనీస్ యాప్‌లను ప్ర‌భుత్వం నిషేదించ‌డంతో ముఖ్యంగా ప‌లువురు సెల‌బ్రిటీలు అయోమ‌యంలో ప‌డిపోయారు. ఇప్ప‌టికే ఈ యాప్‌ను భార‌త్‌లో దాదాపు 20 కోట్ల మంది వినియోగిస్తున్నారు. దీంతో ఉన్న‌ప‌లంగా తీసేయాలంటే ఇంకోటి రిప్లేస్‌ చేయాల్సిందే అనుకున్నారేమో వెంట‌నే టిక్‌టాక్ ప్ర‌త్యామ్నాయం ఏంటా అని శోధించారు. అదృష్ట‌వ‌శాత్తూ మ‌న భార‌తీయులు త‌యారు చేసిన ‘చింగారి’ యాప్ క‌ళ్లెదుట ప్ర‌త్య‌క్ష‌మయ్యింది. ఇంకేముంది గంటలోనే ఈ యాప్‌ను ల‌క్ష‌మంది దాకా డౌన్‌లోడ్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

షార్ట్ వీడియో స‌ర్వీస్‌తో అచ్చం టిక్‌టాక్ మాదిరే ఉన్న ఈ యాప్‌పై ప్ర‌స్తుతం భార‌తీయులు మ‌క్కువ చూపిస్తున్నారు.  తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ,  గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం భాష‌ల్లో ఈయాప్ అందుబాటులో ఉంది. దీంతో స్వ‌దేశీ ప‌రిఙ్ఞానంతో రూపొందింన ‘చింగారి’ యాప్‌ను ప్రోత్స‌హించాలంటూ ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

బెంగుళూరుకు చెందిన బిస్వాత్మ నాయక్‌,  సిద్ధార్థ్ గౌతమ్ గ‌తేడాది చింగారి యాప్‌ను రూపొందించారు. అయితే మ‌నోళ్ల‌కు విదేశీ వ‌స్తువులు, యాప్‌లపై మోజెక్కువ కాబ‌ట్టి చింగారి యాప్ ఆద‌ర‌ణ‌కు నోచుకోలేదు. కానీ తాజాగా 59 చైనా యాప్‌ల‌పై ప్ర‌భుత్వం నిషేదం విధించ‌డంతో చింగారి యాప్ డౌన్‌లోడ్స్ పెరిగాయి. ఇప్ప‌టికే 1 మిలియ‌న్ మార్కును దాటేసి గూగుల్ ప్లే స్టోర్‌లో అగ్ర‌స్థానానికి చేరుకుంది.