డిష్‌వాషర్

డిష్‌వాషర్ గురించి చాలా మందికి ఉండే అపోహ: డిష్‌వాషర్ విద్యుత్తునూ, నీళ్ళనూ వృథా చేస్తుందని. అది నిజం కాదు. ఒకసారి డిష్‌వాషర్ పూర్తిగా నింపి వాడితే, సగటున 15-20 లీటర్ల నీళ్ళు, 0.87-1.5 kwH (kwH = యూనిట్) విద్యుత్తూ ఖర్చవుతుంది. ఒక మామూలు సైజు డిష్‌వాషర్లో, దాదాపు 10 పెద్ద పళ్ళాలు, 10 సాసర్లు, 10 టీ కప్పులు, పది గరిటెలు, 30 చెంచాలు, 10 చిన్న బేసిన్లు (cereal bowls) 10-12 గ్లాసులు, మరికొన్ని చిన్న గిన్నెలు పడతాయి. ఇవన్నీ చేతితో సింకులో కడగడానికి — కడిగే విధానాన్ని బట్టి– ఇరవై లీటర్ల కన్నా ఎక్కువ నీళ్ళు ఖర్చవుతాయి. ఇంకా 1-2 గంటల సమయం, తుడిచి పెట్టుకొనే సమయం కలుపుకోవాలి. డిష్‌వాషర్ అంతగా ఉపయోగపడని సందర్భాలు: కుటుంబంలో పిల్లలు లేనివారికీ, రోజులో ఎక్కువ భాగం ఆఫీసులో గడిపేవారికి ఇంట్లో…

Read More