కారు కొనేప్పుడు పరిగణించవలసిన అంశాలు

ఇంజను

పెట్రోల్, డీజల్, CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ఏది కావాలో ఎంచుకోవాలి.

చాలా మంది డీజల్ ధర పెట్రోల్ కంటే తక్కువ, మైలేజ్ ఎక్కువ అని డీజల్ కారు కొంటారు. అయితే డీజల్ కార్లకు సర్వీస్ ఖర్చులు, స్పేర్ భాగాల ధరలు ఎక్కువ. అందున వాటి Cost Of Ownership ఎక్కువ. డీజల్ ఇంజన్లు అన్నింటికీ టర్బో ఉంటుంది. దీని నిర్వాహణ వ్యయం టర్బో లేని ఇంజన్ల కంటే బాగా ఎక్కువ.

నెలకు అయిదు వేల కిలోమీటర్లు తిరిగేవారికి మాత్రమే డీజల్ కార్లు ఉపకరించేది. పైగా ఇప్పుడు పెట్రోల్ కార్ల మైలేజ్ కూడా తక్కువేమీ లేదు. కాబట్టి అనవసరంగా డీజల్ ఉచ్చులో పడవద్దు. వాటి వల్ల కాలుష్యం కూడా ఎక్కువే. ఎన్నో దేశాలు త్వరలో డీజల్ కార్ల అమ్మకాలను నిషేధించబోతున్నట్టు ప్రకటించాయి.

గేర్లు – మ్యానువల్ vs ఆటోమేటిక్

కొన్నేళ్ళ క్రితం వరకు ఆటోమేటిక్ కార్లకు మైలేజ్ తక్కువ, నాణ్యమైన ఆటోమేటిక్ గేర్ బాక్సుల లేమి వంటి కారణాలు ఉండేవి. ఇప్పుడు ఈ భయాలేవీ అవసరం లేదు. హైవేలపై తిరగటానికి సైతం మంచి ఆటోమేటిక్ కార్లు ఉన్నాయి.

ఆటోమేటిక్‌లోనూ పలు రకాల గేర్‌బాక్సులు ఉన్నాయి – AT, AMT, TC, DCT, CVT, DSG. అన్నిట్లో చవకైనది, బేసిక్ పనితీరు గలవి AT, AMT – గేర్లు మారేప్పుడు కుదుపులు తెలుస్తాయి.

AMT కంటే మంచి పనితీరు TC (Torque Converter), TC కంటే మంచి పనితీరు DCT, DCT కంటే మంచి పనితీరు CVT, DSG (DSG ఫోక్స్‌వాగెన్ వారి ప్రొప్రైటరీ CVT సాంకేతికత). వీటి ఖరీదు కూడా ఈ క్రమంలోనే ఉంటుంది. మెయింటెనన్స్ ఖర్చులు కూడా ఆ క్రమంలో పెరుగుతూ ఉంటాయి.

బడ్జెట్

సాధారణంగా పదిలో ఏడుగురు మూడు నాలుగేళ్ళకు కారు మార్చేస్తారు. కావున జీవితంలో కొనబోయే కారు ఇదొక్కటే అన్న భ్రమతో ముందుగా అనుకున్న బడ్జెట్‌ను దాటకూడదు.

అనుకున్న బడ్జెట్‌లో మీకు, మీ కుటుంబానికి తగిన భద్రతా ఫీచర్లు రాని పక్షంలో బడ్జెట్ పెంచుకోవటమే మంచిది. ఉదాహరణకు మీరు నివసించే ప్రదేశంలో తరచూ వర్షాలు పడే అవకాశం ఉంటే తప్పకుండా ABS ఉన్న కారునే కొనాలి. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే, ఎందుకంటే ఇటీవలే మన దేశంలో ప్రతి కారుకూ ఒక ఎయిర్‌బ్యాగ్, ABS తప్పనిసరి చేశారు.

వర్గం

హ్యాచ్‌బ్యాక్, సెడాన్, SUV, MUV – వీటిలో అవసరమయింది ఎంచుకోవాలి.

హ్యాచ్‌బ్యాక్ ఉదాహరణలు:

సెడాన్ ఉదాహరణలు:

SUV ఉదాహరణలు:

కాంపాక్ట్ SUV కూడా ఉన్నాయి:

MUV ఉదాహరణలు:

తరచూ కుటుంబంతో హైవేపై ప్రయాణాలు చేసేవారు SUV (కుటుంబం పెద్దదైతే MUV) ఎంచుకోవటం మంచిది. దూరప్రయాణాలు సౌకర్యవంతంగా చెయ్యవచ్చు. కారు వాడకం ప్రధానంగా ఉన్న ఊరిలోనే అయితే హ్యాచ్‌బ్యాక్ సరిపోతుంది.

SUVలకు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉన్నందున గతుకుల రోడ్లపై కూడా నిర్భయంగా నడపవచ్చు. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లకు ఈ రోడ్లపై కింద బాడీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

బ్రాండ్

ఇక్కడ ముఖ్యంగా చూడవలసినవి “కొత్త కారు కొనాలని షోరూంకు వచ్చిన కస్టమర్”‌కు చేసే సర్వీస్ మరియు అమ్మకం తరువాత సర్వీస్ (A.S.S – After Sales Service).

కారు కొనేప్పుడు కస్టమర్‌ను దేవుడిలా చూసుకునే కంపెనీలు ఉంటాయి. దాదాపు అన్ని సంస్థలూ ఈ కోవకు చెందేవే – కానీ నా అనుభవంలో ఇలా చెయ్యని షోరూంలు (షోరూం ఖాళీగా ఉన్నా వచ్చిన కస్టమర్‌ను పట్టించుకోనివీ ఉన్నాయి) ఎక్కువ శాతం టాటా మోటర్స్, ష్కోడా, ఫోక్స్‌వాగెన్‌కు చెందినవి. ఈ మూడు సంస్థల A.S.S గురించి లెక్కలేనన్ని ఫిర్యాదులు కని, విని, చదివినవే.

కొనేప్పుడు కస్టమరే దేవుడని, కారు సర్వీస్‌కు తెచ్చినప్పుడు ముప్పై చెరువుల నీరు తాగించే సంస్థలు ఉంటాయి. సంస్థలు అనటం కంటే షోరూంలు అనాలిక్కడ. ఈ మధ్య నేను విని, చదివిన ఇటువంటి అనుభవాల్లో ఎక్కువ కియా షోరూంలవి.

అయితే కారు ఎంపిక చేసేప్పుడే సమీపంలో ఆ బ్రాండ్ సర్వీస్ సెంటర్ గురించి వాకబు చెయ్యటం ఉత్తమం. టొయోటా వారి షోరూంలు, సర్వీస్ సెంటర్లు అన్ని బ్రాండ్లలో అత్యుత్తమ పనితీరు కలిగి ఉంటాయని ప్రతీతి.

యాజమాన్య ఖర్చు (Cost of Ownership)

కారు కొన్నాక యజమానిని అతి ఎక్కువ సతాయించే అంశం ఇదే.

సర్వీస్ మరియు స్పేర్ భాగాల వ్యయం: పెట్రోల్ కార్ల కంటే డీజల్ కార్లకు సర్వీస్ ఖర్చులు ఎక్కువ. పెట్రోల్, డీజల్ సంబంధం లేకుండా ష్కోడా, ఫోక్స్‌వాగెన్ సంస్థల కార్ల సర్వీస్, స్పేర్ భాగాల ఖర్చులు బాగా ఎక్కువ, విడి భాగాలు దొరకటమూ కష్టమే. నా స్నేహితుడి పోలో TSI కారుకు DSG క్లచ్‌ప్లేట్ తెప్పించేందుకు సర్వీస్ సెంటర్ నెల రోజులు తీసుకుంది.

కొన్ని కార్లకు సులువుగా దొరకని సైజు టైర్లు ఉంటాయి. 2-3 ఏళ్ళకు టైర్లు మార్చేప్పుడు ఆ సైజుకు సరిపోయేవి దొరక్క ఇబ్బంది ఎదురౌతుంది. ఉన్నవి కూడా ఖరీదెక్కువ ఉంటాయి. 17, 18 అంగుళాల టైర్లలో ఈ ఇబ్బంది ఎదురవ్వవచ్చు.

బుకింగ్

కారు బుక్ చేసేప్పుడు నిరభ్యంతరంగా బేరమాడాలి కానీ ఎంచుకున్న మోడల్ బాగా అమ్ముడుపోయేదయితే బేరమాడే అవకాశం తక్కువగా ఉంటుంది.

సాధారణంగా షోరూంలకు వాహన బీమా, ఉపకరణాల (Accessories)పై ఎక్కువ శాతం (దాదాపు 30%) లాభం ఉంటుంది. వాహన బీమా షోరూంలో కాకుండా బయట కొనటం ఉత్తమం. ఇలా ఒప్పుకోమని, వారి వద్దే తీసుకోవాలని షోరూం వారు ఒత్తిడి చేస్తారు కానీ వారికి ఆ హక్కు లేదు. వీలయితే బీమాపై షోరూం వారితోనే బేరమాడవచ్చు. వారు తగ్గకపోతే నిరభ్యంతరంగా బయట తీసుకోవచ్చు.

ఉపకరణాలు కూడా అవసరం లేనివి అంటగట్టే ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా అవసరం అయినవి కావాలని పట్టుబట్టి తీసుకునే హక్కు కొనుగోలుదారుకు ఉంది. గత కొన్నేళ్ళుగా సంస్థలు AMC (వార్షిక నిర్వహణ ప్యాకేజీలు), Extended Warranty అమ్ముతున్నారు. ష్కోడా వంటి సంస్థల కార్లకు ఇవి తీసుకోవటమే మంచిది.

బుకింగ్ తరువాత షోరూం వారితో మాట్లాడుతూ వీలైనంత త్వరగా మీ కారు VIN (Vehicle Identification Number) తెలుసుకోండి. కారు తయారీ తేదీ ఖచ్చితంగా తెలిపే సంఖ్యే ఈ VIN.[2]

Delivery

కారు తీసుకునేందుకు వెళ్ళినప్పుడు 2-3 గంటల సమయం ఉండేలా చూసుకుని వెళ్ళాలి, ఉదయం సమయం అత్యుత్తమం. హడావుడిగా వెళ్ళవద్దు. సాయంత్రాలు వెళితే కారు పెయింట్ నాణ్యత, ఏవయినా చిన్న నొక్కులు ఉంటే తగినంత వెలుతురు లేనందున కనపడవు – పదికి రెండు కొత్త కార్లలో ఇలాంటి సమస్యలు ఉంటాయి, ఇవి ఆరుబయట వెలుతురులో చూడటమే ఉత్తమం.

కారు డెలివరీ తీసుకునేప్పుడు చెయ్యవలసిన తనిఖీలు ఉంటాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ మరువకూడదు

Lamborghini LP 580-2

The cheapest Lamborghini as of 2019–2020 costs around $200,000 (1.5 Crore Rs) depending on your location for example the United States. And I am talking about the Lamborghini LP 580-2. Keeping that in mind. Whether your salary is a fat one or not as long as you have saved up enough money you can get this beautiful car. So the only thing that comes into mind now is maintainance. This car with normal annual service and no major issues will cost you a fat $5,000 (3.7 Lakh Rs) in maintenance.

So now you must re think if owning this car with your current salary is worth it. With such a heft maintenance cost you need a minimum of $26,000 (20 Lakh Rs) monthly salary in order for you to continue living your luxury life with ease or a yearly salary/income of $320,000 (2.4 Crore Rs). But hey who cares if you want to spend all your money on your car’s monthly maintenance cost, spend on it, love it, and enjoy life.

In India buying a luxurious car will cost you more due to high import duties. So the Lamborghini LP 580-2 cost is around Rs 2.9 Crore in India.

హ్యుండాయ్ క్రెటా

ప్రముఖ కార్ల దిగ్గజం హ్యుండాయ్ సంస్థ తన సరికొత్త క్రెటా మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవలే ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించిన ఈ ఎస్ యూవీ ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా నిర్దేశించింది. 10 రకాల కొత్త కలర్ ఆప్షన్లతో వచ్చిందీ వాహనం.

1.5లీటర్ పెట్రోల్ ఎంపీఐ..

హ్యుండాయ్ క్రెటా ఈఎక్స్(మ్యానువల్ ట్రాన్స్ మిషన్) వేరియంట్ ధర………… రూ.9.99 లక్షలు

ఎస్ వేరియంట్ ధర……………………… రూ.11.72 లక్షల రూపాయలు

ఎస్ఎక్స్ వేరియంట్ ధర………………….. రూ.13.46 లక్షలు. అదే ఐవీటీ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ ధర అయితే 14.94 లక్షలు. 1.5 పెట్రోల్ ఎంపీఐలో ఈ వేరియంట్ అందుబాటులోకి తీసుకురాలేదు సంస్థ.

1.4 లీటర్ పెట్రోల్ టర్బో జీడీఐ..

హ్యుండాయ్ క్రెటా ఎస్ ఎక్స్ వేరియంట్ ధర…………. రూ.16.16 లక్షలు

ఎస్ఎక్స్(ఓ) వేరియంట్ ధర………………… రూ.17.2 లక్షలు. 1.4 లీటర్ పెట్రోల్ టర్బో ఇంజిన్ సౌలభ్యం ఈ, ఈఎక్స్, ఎస్ వేరియంట్లలో పొందుపరచలేదు.

1.5 లీటర్ డీజిల్ సీఆర్డీఐ..

హ్యుండాయ్ క్రెటా ఈ వేరియంట్ ధర………. రూ.9.99 లక్షలు(ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ లేదు).

ఈఎక్స్ వేరియంట్ ధర…………………. రూ.11.49 లక్షలు (ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లేదు)

ఎస్ వేరియంట్ ధర………………….. రూ.12.77 లక్షలు (ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లేదు)

ఎస్ఎక్స్ వేరియంట్ ధర………….. రూ. 14.51 లక్షలు. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉన్న వేరియంట్ అయితే రూ.15.99 లక్షలు.

ఎస్ఎక్స్(ఓ) వేరియంట్ ధర………….. రూ.15.79 లక్షలు. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ ఉన్న వేరియంట్ అయితే రూ.17.2 లక్షలు.

​మైలేజి..

ఈ సరికొత్త హ్యుండాయ్ క్రెటా.. అద్భుతమైన మైలేజినిస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండి మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేసే వాహనమైతే లీటరుకు గరిష్ఠంగా 21.4 కిలోమీటర్ల మైలేజినిస్తుంది. అదే ఆటో మేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ ఉన్న కారైతే 18.5 కిలోమీటర్లు ఇస్తుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థలో 16.8 కిలోమీటర్లు, సీవీటీ ట్రాన్స్ మిషన్ వ్యవస్థలో 16.9 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది. 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే లీటరుకు 16.8 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది.

​ఫీచర్లు..

బీఎస్6 హ్యుండాయ్ క్రెటా మోడల్లో ఫీచర్లకు కొదవే లేదు. బ్లూ లింగ్ కనెక్టెడ్ కారు టెక్నాలజీని పొందుపరిచారు. ఈ ఎస్ యూవీలో ఉన్న సరికొత్త స్టీరింగ్ వీల్ పై కొన్ని కంట్రోళ్లను ఉంచారు. 7-అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ తో కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. 10.25 అంగుళాల సమాంతరపు టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్ లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కీలెస్ ఎంట్రీ, పానోరామిక్ సన్ రూఫ్, యాంబియంట్ లైటింగ్, టైర్స్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం లాంటి ఫీచర్లు ఉన్నాయి.

​సేఫ్టీ ఫీచర్లు..

అంతేకాకుండా ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టం, ప్యాడిల్ షిఫ్టర్లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రేర్ పార్కింగ్ కెమెరా, సెన్సార్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ తదితర సేఫ్టీ ఫీచ్రలు ఇందులో ఉన్నాయి. ఇంతే కాకుండా 10 రకాల కలర్ ఆప్షన్లతో 2020 హ్యుండాయ్ క్రెటా దర్శనమిచ్చింది. ఇందులో 7 సింగిల్ టోన్ కలర్లు, మూడు డ్యూయల్ టోన్ కలర్లు ఉన్నాయి.

​ఇంజిన్..

బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన 2020 హ్యుండాయ్ క్రెటా వాహనంలో 1.4 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరెటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1,4 లీటర్ టీజీడిఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ 140 పీఎస్ పవర్, 242 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. 1.5 లీటర్ క్రెటా పెట్రోల్ ఇంజిన్ అయితే 115 పీఎసస్ పవర్ 144ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తూ 6-స్పీడ్ మ్యానువల్, సీవీటీ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే 115 పీఎస్ పవర్, 250 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యానువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది.

​హ్యుండాయ్ క్రెటా డిజైన్..

స్పోర్టీ ఎడ్జీ లుక్ తో ఆకట్టుకుంటోన్న ఈ 2020 హ్యుండాయ్ క్రెటాలో సరికొత్త గ్రిల్, ట్రియో బీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్లతో కూడిన ఎల్ఈడీ డే లైట్ రన్నింగ్ లైట్లు. ఫాక్స్ స్కిడ్ ప్లేట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంపులు, రన్నింగ్ బోర్డుపై సిల్వర్ ప్రొటెక్షన్ బోర్డు లాంటి వాటిని పొందుపరిచారు. అంతేకాకుండా 17-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, హారిజంటల్ ఎల్ఈడీ బ్రేక్ లైట్, ట్విన్ ఎక్సాహాస్ట్ పైపులను అమర్చారు.

Indian stars with luxury cars

Which Bollywood actor has the world’s most expensive car?

Ajay Devgan with his Rolls Roy Cullinan approx 6.95 Crore

Shahrukh Khan with his BMWi8 Hybrid approx 2.62 Crore

Ranveer Singh with his Aston Martin Rapid-S approx 3.88 Crore

Emraan Hashmi’s Lamborghini Huracan approx 3.43 crore

Mallika Sherawat with her Lamborghini Aventador approx 3 Crore

Badshah Family with his Rolls Royce Wraith around 6.5 Crore

John Abraham with his Lamborghini Gallardo approx 3 Crore

Priyanka Chopra with her Mercedes Maybach S650 approx 2.73 Crore

Hritik roshan Rolls Royce Ghost approx 5.65 Crore but he makes modification which cost him 7 Crore

Priyanka Chopra once again with her Rolls Royce Ghost approx 5.65 Crore

Abhishek Bachchan’s Bentley Continental GT – INR 3.92 crore

Abhishek Bachchan’s Bentley Continental GT – INR 3.92 crore

Sanjay Dutt’s Ferrari 599 GTB – INR 3.52 crore

Akshay Kumar’s Bentley Continental Flying Spur – INR 3.41 crore

Aamir Khan’s Bentley Continental Flying Spur – INR 3.41 crore

బీఎస్6 హోండా సివిక్ డీజిల్ కారు

ప్రముఖ వాహన సంస్థ హోండా.. తన సివిక్ డీజిల్ మోడల్ ను బీఎస్6 ఫార్మాట్లో అప్డేట్ చేసి భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త బీఎస్6 హోండా సివిక్ ప్రారంభ ధర వచ్చేసి రూ.20.72 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. రెండు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. 23.6 కిలోమీటర్ల మైలేజినిస్తుంది.

బీఎస్6 హోండా సివిక్ మోడల్

భారత మార్కెట్లో అత్యుత్తమ విక్రయాలు అందుకుంటున్న వాహన సంస్థల్లో ముందు వరుసలో ఉన్న కంపెనీ హోండా ఇండియా. తాజాగా ఈ వాహన సంస్థ తన సివిక్ డీజిల్ మోడల్ ను బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్ షోరూంలో ఈ 2020 హోండా సివిక్ డీజిల్ కారు ప్రారంభ దర వచ్చేసి రూ.20.72 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. అత్యాధునిక హంగులు, ప్రత్యేకతలో అందుబాటులోకి వచ్చిన ఈ సెడాన్ ఆకట్టుకుంటోంది.

వేరియంట్ల వారీగా హోండా సివిక్ ధర..
ఈ సరికొత్త హోండా సివిక్ మోడల్ రెండు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. వీఎక్స్, జెడ్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు.
వీఎక్స్ వేరియంట్ ధర………… రూ.20.72 లక్షలు.
జెడ్ఎక్స్ వేరియంట్ ధర……………. రూ.22.34 లక్షలు.

samayam telugu

ఇంజిన్..
ఈ సరికొత్త హోండా సివిక్ బీఎస్6 డీజిల్ కారు 1.5-లీటర్ డీటీఈసీ టర్బోఛార్జెడ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 4000ఆర్పీఎం వద్ద 118 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 2000 ఆర్పీఎం వద్ద 300 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఇది 6-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. అంతేకాకుండా ఐ-డీటీఈసీ డీజిల్ ఇంజిన్ ఎర్త్ డ్రీమ్ టెక్నాలజీ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా ఈ కారు ప్రదర్శన, పనితీరు ఎంతో మెరుగుపడింది. అంతేకాకుండా ఈ బీఎస్6 సివిక్ డీజిల్ వాహనం లీటరుకు గరిష్ఠంగా 23.9 కిలోమీటర్ల వరకు మైలేజి నిస్తుంది.

ఫీచర్లు..
ఈ 2020 హోండా సివిక్ మోడల్లో బీఎస్6 డీజిల్ ఇంజిన్ అప్డేట్ కాకుండా వీఎక్స్, జెడ్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. కర్టెయిన్ ఎయిర్ బ్యాగులు, స్టాండర్డ్ ఆరు ట్యాలీ ఎయిర్ బ్యాగులు తదితర మార్పులు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పటికే లాంచ్ అయిన హోండా సివిక్ పెట్రోల్ మోడల్లో ఉన్న ఫీచర్లన్ని ఇందులోనూ కొనసాగించింది హోండా సంస్థ. 1.8-లీటర్ ఐ-వీటీఈసీ సాంకేతికత, సీవీటీ ట్రాన్స్ మిషన్ యూనిట్ కూడా ఉంది. వీటితో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, అతిపెద్ద టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ కారుకు పోటీగా స్కోడా ఆక్టేవియా కారు ఉంది.

హోండా

హోండా డబ్ల్యూఆర్-వీ కారు

samayam telugu

దిల్లీ ఎక్స్ షోరూంలో హోండా డబ్ల్యూఆర్-వీ ప్రారంభ ధర వచ్చేసి రూ.8,49,900 లుగా సంస్థ నిర్దేశించింది. అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతతో అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఎక్స్ టీరియర్ స్టైలింగ్, రిచ్ ఇంటీరియర్లతో పాటు బీఎస్6 పెట్రోల్, డీజిల్ ఇంజిన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

​డిజైన్..
samayam telugu

ఈ సరికొత్త హోండా డబ్ల్యూఆర్-వీ క్రోమ్ లోవర్ స్టైల్ గ్రిల్ తో పాటు అడ్వాన్సెడ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులుతో కూడిన ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్, పొజిషన్ ల్యాంపులు, అడ్వాన్సెడ్ ఫాగ్ ల్యాంపులు, అడ్వాన్సెడ్ ఎల్ఈడీ రేర్ ల్యాంపుల కాంబినేషన్ తో ఆకట్టుకుంటోంది. విశాలమైన క్యాబిన్ స్పేస్, అత్యాధునిక పీచర్లుతో ఈ కారు అదరగొడుతోంది.

​ఫీచర్లు..
samayam telugu

ఈ 2020 హోండా డబ్ల్యూఆర్-వీ మోడల్లో ఫీచర్లకు కొదవే లేదు. డీఐజీపీఏడీ 2.0 అడ్వాన్సెడ్ ఇంఫోటైన్మెంట్ సిస్టంతో పాటు ఇందులో ఫీచర్లను స్మార్ట్ ఫోన్ కు అనుసంధానించుకునే స్మార్ట్ కనెక్టివిటీ ఆప్షన్ ఇందులో ఉంది. ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, శాటిలైట్ తో లింక్ చేసుకునే టర్న్ బై టర్న్ నేవిగేషన్, లివ్ ట్రాఫిక్ సపోర్ట్, వాయిస్ కమాండ్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, వైర్లెస్ ఇంఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఇందులో ఉన్నాయి.

​ప్రత్యేకతలు..
samayam telugu

ఇవికాకుండా వన్ టచ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్, మల్టీ ఇన్ఫార్మేషన్ కాంబీమీటర్ ఈకో అసిస్ట్, టిల్ట్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో వాయిస్, హ్యాండ్స్ ఫ్రీ, క్రూయిజ్ కంట్రోల్ స్విచెస్ లాంటి ప్రత్యేకతలు దీని సొంతంవీటితో పాటు అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఫంక్షన్, హోండా స్మార్ట్ కీ సిస్టం, అండ్ కీలెస్ రిమోట్, 12 వోల్టుల పవర్ ఔట్ లెట్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ లాంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, మల్టీ రేర్ వ్యూ కెమేరా, రేర్ పార్కింగ్ సెన్సార్లు, ఈసీయూ ఇమ్మొబిలైజర్ లాంటి సేఫ్టీ ఫీచర్లు దీని సొంతం.

​ఇంజిన్..
samayam telugu

ఈ సరికొత్త హోండా డబ్ల్యూఆర్-వీ మోడల్ బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్టేట్ చేసిన 1.2-లీటర్ ఐ-వీటీఈసీ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 90 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 110 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. లీటరుకు గరిష్ఠంగా 16.5 కిలోమీటర్ల మైలేజిస్తుందని అంచనా. అదే 1.5-లీటర్ ఐ-డీటీఈసీ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉండి 100 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 200 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఇది లీటరుకు గరిష్ఠంగా 23.7 కిలోమీటర్ల మైలేజిస్తుంది.

​కలర్స్..

samayam telugu

ఈ సరికొత్త హోండా డబ్ల్యూ ఆర్-వీ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఎస్వీ, వీఎక్స్ అనే వేరియంట్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఇవి రెండు పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలోనూ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా వాహనంలో ఆరు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ప్రీమియం యాంబర్ మెటాలిక్, లునార్ సిల్వర్ మెటాలిక్, మోడర్న్ స్టీల్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెరల్ కలర్స్ లో దీన్ని సొంతం చేసుకోవచ్చు. రెండేళ్ల వారంటీని ఇస్తుంది హోండా సంస్థ.