టీవీఎస్ మోటార్ కొత్త అపాచీ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. 2021 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మోటార్‌సైకిల్‌ను బుధవారం విడుదల చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. ఈ కొత్త బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. డిస్క్ వేరియంట్ ధర రూ.1,10,320,డ్రమ్ వేరియంట్ ధర రూ.1,07,270 (ఎక్స్‌షోరూం, న్యూఢిల్లీ ధరలు) గా కంపెనీ నిర్ణయించింది. రేసింగ్ రెడ్, నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ కొత్త బూక్‌లో 159.7 సీసీ సింగిల్ సిలిండర్, 4 వాల్వ్, ఆయిల్ కూల్డ్ అధునాతన ఇంజీన్ అమర్చినట్టు తెలిపింది. ఇది 9,250 ఆర్పీఎం వద్ద 17.38 హెచ్‌పీ శక్తిని, 7,250 ఆర్పీఎం వద్ద 14.73 ఎన్ఎం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. కిల్ కార్బన్ ఫైబర్ నమూనాతో సరికొత్త డ్యూయల్ టోన్ సీటు,ఎ ల్ఈడీ హెడ్‌ల్యాంప్, క్లా స్టైల్డ్ పొజిషన్ ల్యాంప్‌లు ఇతర కీలక ఫీచర్లతో ప్రీమియం లుక్‌తో ఆకట్టుకోనుంది. ఫైవ్ స్పీడ్ సూపర్-స్లిక్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైక్ ఈ సెగ్మెంట్లో అత్యంత శక్తిమంతమైన రైడింగ్ అనుభూతినిస్తుందని టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ (మార్కెటింగ్) ప్రీమియం మోటార్ సైకిల్స్ మేఘశ్యామ్ దిఘోలే వెల్లడించారు. అలాగే పాత అపాచీల వెర్షన్లతో పోలిస్తే ఈ కొత్త బైక్ రెండు కిలోల బరువు తక్కువ ఉంటుంది. డిస్క్ వేరియంట్ 147 కిలోల బరువు, డ్రమ్ వేరియంట్ 145 కిలోల బరువు ఉంటుంది.
గది పరిమాణం బట్టి ఎంత కెపాసిటీ ఏసీ అవసరమో నిర్ణయించుకోవాలి.
150 చ.అడుగుల గది – 1 టన్
250 చ.అడుగుల గది – 1.5 టన్
అంతకన్నా పెద్ద గదులకు 2టన్
సంక్షారణము (Corrosion) – రాగి vs అల్యుమీనియం
ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలు రాగి కాయిల్స్ ఉన్న మోడళ్ళు అమ్ముతున్నాయి. ఇవి గదిని త్వరగా చల్లబరుస్తాయి, ఎక్కువ కాలం మన్నుతాయి, అల్యుమీనియం కాయిల్స్‌తో పోలిస్తే ఖరీదెక్కువ.
ఇన్వర్టర్ ఏసీ
ఇవి వేగంగా గదిని చల్లబరుస్తాయి, గదిలోని ఉష్ణోగ్రతను నిరంతరంగా ఏకరీతిన ఉంచుతాయి, కరెంటు తక్కువ వాడతాయి కానీ ఎక్కువ ఖరీదు.
స్టార్ రేటింగ్
రేటింగ్‌లో నక్షత్రాలెన్ని ఉంటే ఏసీ కరెంటు అంత తక్కువ వాడుతుంది. అయితే రేటింగ్ ఎక్కువ ఉన్నవి ఖరీదు ఎక్కువ, మన్నికా ఎక్కువే. ఇంకా ఫోన్‌తో నియంత్రించగల స్మార్ట్ ఏసీలు, హానికర దుమ్ము రేణువులను ఫిల్టర్ చేసేవి, స్టెబిలైజర్ అవసరం లేనివి, ఇలా పలు ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌ను బట్టి ఇష్టమైనవి ఎంచుకోవచ్చు.
స్ప్లిట్ ఏసీ ఖరీదు ఎంత ఉంటుంది?
పై ఫీచర్లను బట్టి పాతిక నుండి డెబ్బై వేల వరకు ఉంటాయి. క్యారియర్, డైకిన్, జెనరల్ వంటి సంస్థల ఏసీలు ఎక్కువ కాలం రెపేర్లు అవసరం లేకుండా పని చేస్తాయి. వీటిలో 1.5టన్ను ఇన్వర్టర్ ఏసీలు సుమారు 50వేల వరకు ఖరీదు ఉంటాయి. దీర్ఘకాలంలో అతితక్కువ నిర్వహణ శిరోభారం కొరకు వీటిని కొనటం మంచిది .
RAM – ఇది మన ఫోన్ లో ఉండే OS ( ఆపరేటింగ్ సిస్టమ్) సాఫ్ట్వేర్, మనము వాడే యాప్ డాటా, మనము ఈ క్షణం ఫోన్ లో ఏం చేస్తున్నామో ఆ డాటా దీనిలో ఉంటుంది. ఇది ROM, SD CARDS, కంటే కూడా చాలా త్వరగా READ చేయబడుతుంది. కాబట్టి ఇది ఫోన్ కి మెదడు లాంటిది. ఎంత పెద్ద బుర్ర ఉంటే అంత వేగంగా పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చేవి అన్ని ఎక్కువగా 4,6,8 GB లు ఉన్నాయి. మామూలు గా వాడటానికి 4GB చాలు. GAMING, EDITING, MULTI TASKING లాంటి వాటికి 8 GB ఉత్తమం.
ROM- ఇది మన ఫోన్ స్టోరేజ్. మన ఫోటోలు, వీడియోలు, యాప్‌లు, ఫైల్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాము. కాబట్టి ఇది కూడా ఎక్కువగా ఉండాలి. 64/128 GB సరిపోతుంది.
PROCESSOR – మన ఫోన్ పనితనం అన్నింటి కంటే దీని మీదే ఎక్కువ ఆధార పడి ఉంటుంది. కొత్త processor ఐతే వేగంగా పనిచేస్తాయి. SD 660 – SD 855 వరకు మంచివి. (లేదా) HELIO G80/G85 కూడా .
SCREEN DISPLAY FEATURES-
ముందుగా SCREEN SIZE – 5–6 ఇంచులు బావుంటుంది. ఇది ఎవ్వరి వాడకాన్ని బట్టి వారు ఎంచుకోవచ్చు. GAMING కి ఐతే కాస్త పెద్దది బావుంటుంది.
తరువాత రిఫ్రెష్ రేట్ – 60–90–120 HZ లలో ఉన్నాయి. ఎంత ఎక్కువ REFRESH RATE ఉంటే అంత స్మూత్ గా ఉంటుంది వాడటానికి.60 HZ అంటే మన స్క్రీన్ నిమిషానికి 60 సార్లు refresh అవ్తుంది. 90 HZ అంటే 90 సార్లు, 120 HZ అంటే 120 సార్లు REFRESH అవ్తుంది.
తరువాత DISPLAY STYLE ఇప్పుడు SUPER AMOLED DISPLAY లు బావున్నాయి.
తరువాత రిజల్యూషన్ – ఇది ఎక్కువగా ఉంటే క్లారిటీ ఎక్కువగా ఉంటుంది.
BATTERY CAPACITY- ఇది మన ఫోన్ బ్యాటరీ MAh. ఎక్కువగా ఉన్నవి ఎక్కువ సేపు పని చేస్తాయి. 5000–6000 MAh ఇప్పుడు వరకు ఉన్నవి.
BUILD QUALITY – ఫోన్ తయారీ కి వాడినది లేక ఫోన్ నిర్మాణ స్థాయి అనొచ్చు. METAL అయితే బావుంటుంది. వెనకాల GLASS ఐతే గీతాలు పడవు.
OS/UI – ఆపరేటింగ్ సిస్టమ్ మరియు యూజర్ ఇంటర్ఫేస్. ఇవి LATEST UPDATED ఐతే మంచిది.
CAMERA MP – మామూలుగా అయితే ఎంత ఎక్కువ MP ఉంటే అంత మంచి ఫోటోలు వస్తాయి అంటారు. అందులో నిజం లేకపోలేదు, కానీ కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. ఫోటో క్లారిటీ కేవలం MP మీద ఉండదు. ఇంకా చాలా వాటి మీద ఉంటాయి. టూకీగా ఎక్కువ MP, APERTURE SIZE, PHOTO CONVERTING SOFTWARE, PROCESSING SOFTWARE బాగా ఉన్నది చూసి తీసుకోవచ్చు.
పెట్రోల్, డీజల్, CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ఏది కావాలో ఎంచుకోవాలి.
చాలా మంది డీజల్ ధర పెట్రోల్ కంటే తక్కువ, మైలేజ్ ఎక్కువ అని డీజల్ కారు కొంటారు. అయితే డీజల్ కార్లకు సర్వీస్ ఖర్చులు, స్పేర్ భాగాల ధరలు ఎక్కువ. అందున వాటి Cost Of Ownership ఎక్కువ. డీజల్ ఇంజన్లు అన్నింటికీ టర్బో ఉంటుంది. దీని నిర్వాహణ వ్యయం టర్బో లేని ఇంజన్ల కంటే బాగా ఎక్కువ.
నెలకు అయిదు వేల కిలోమీటర్లు తిరిగేవారికి మాత్రమే డీజల్ కార్లు ఉపకరించేది. పైగా ఇప్పుడు పెట్రోల్ కార్ల మైలేజ్ కూడా తక్కువేమీ లేదు. కాబట్టి అనవసరంగా డీజల్ ఉచ్చులో పడవద్దు. వాటి వల్ల కాలుష్యం కూడా ఎక్కువే. ఎన్నో దేశాలు త్వరలో డీజల్ కార్ల అమ్మకాలను నిషేధించబోతున్నట్టు ప్రకటించాయి.
గేర్లు – మ్యానువల్ vs ఆటోమేటిక్
కొన్నేళ్ళ క్రితం వరకు ఆటోమేటిక్ కార్లకు మైలేజ్ తక్కువ, నాణ్యమైన ఆటోమేటిక్ గేర్ బాక్సుల లేమి వంటి కారణాలు ఉండేవి. ఇప్పుడు ఈ భయాలేవీ అవసరం లేదు. హైవేలపై తిరగటానికి సైతం మంచి ఆటోమేటిక్ కార్లు ఉన్నాయి.
ఆటోమేటిక్లోనూ పలు రకాల గేర్‌బాక్సులు ఉన్నాయి – AT, AMT, TC, DCT, CVT, DSG. అన్నిట్లో చవకైనది, బేసిక్ పనితీరు గలవి AT, AMT – గేర్లు మారేప్పుడు కుదుపులు తెలుస్తాయి.
AMT కంటే మంచి పనితీరు TC (Torque Converter), TC కంటే మంచి పనితీరు DCT, DCT కంటే మంచి పనితీరు CVT, DSG (DSG ఫోక్స్వాగెన్ వారి ప్రొప్రైటరీ CVT సాంకేతికత). వీటి ఖరీదు కూడా ఈ క్రమంలోనే ఉంటుంది. మెయింటెనన్స్ ఖర్చులు కూడా ఆ క్రమంలో పెరుగుతూ ఉంటాయి.
బడ్జెట్
సాధారణంగా పదిలో ఏడుగురు మూడు నాలుగేళ్ళకు కారు మార్చేస్తారు. కావున జీవితంలో కొనబోయే కారు ఇదొక్కటే అన్న భ్రమతో ముందుగా అనుకున్న బడ్జెట్‌ను దాటకూడదు.
అనుకున్న బడ్జెట్లో మీకు, మీ కుటుంబానికి తగిన భద్రతా ఫీచర్లు రాని పక్షంలో బడ్జెట్ పెంచుకోవటమే మంచిది. ఉదాహరణకు మీరు నివసించే ప్రదేశంలో తరచూ వర్షాలు పడే అవకాశం ఉంటే తప్పకుండా ABS ఉన్న కారునే కొనాలి. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే, ఎందుకంటే ఇటీవలే మన దేశంలో ప్రతి కారుకూ ఒక ఎయిర్‌బ్యాగ్, ABS తప్పనిసరి చేశారు.
వర్గం
హ్యాచ్‌బ్యాక్, సెడాన్, SUV, MUV – వీటిలో అవసరమయింది ఎంచుకోవాలి.
హ్యాచ్‌బ్యాక్ ఉదాహరణలు:
సెడాన్ ఉదాహరణలు:
SUV ఉదాహరణలు:
కాంపాక్ట్ SUV కూడా ఉన్నాయి:
MUV ఉదాహరణలు:
తరచూ కుటుంబంతో హైవేపై ప్రయాణాలు చేసేవారు SUV (కుటుంబం పెద్దదైతే MUV) ఎంచుకోవటం మంచిది. దూరప్రయాణాలు సౌకర్యవంతంగా చెయ్యవచ్చు. కారు వాడకం ప్రధానంగా ఉన్న ఊరిలోనే అయితే హ్యాచ్‌బ్యాక్ సరిపోతుంది.
SUVలకు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉన్నందున గతుకుల రోడ్లపై కూడా నిర్భయంగా నడపవచ్చు. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లకు ఈ రోడ్లపై కింద బాడీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
బ్రాండ్
ఇక్కడ ముఖ్యంగా చూడవలసినవి “కొత్త కారు కొనాలని షోరూంకు వచ్చిన కస్టమర్”కు చేసే సర్వీస్ మరియు అమ్మకం తరువాత సర్వీస్ (A.S.S – After Sales Service).
కారు కొనేప్పుడు కస్టమర్‌ను దేవుడిలా చూసుకునే కంపెనీలు ఉంటాయి. దాదాపు అన్ని సంస్థలూ ఈ కోవకు చెందేవే – కానీ నా అనుభవంలో ఇలా చెయ్యని షోరూంలు (షోరూం ఖాళీగా ఉన్నా వచ్చిన కస్టమర్‌ను పట్టించుకోనివీ ఉన్నాయి) ఎక్కువ శాతం టాటా మోటర్స్, ష్కోడా, ఫోక్స్వాగెన్కు చెందినవి. ఈ మూడు సంస్థల A.S.S గురించి లెక్కలేనన్ని ఫిర్యాదులు కని, విని, చదివినవే.
కొనేప్పుడు కస్టమరే దేవుడని, కారు సర్వీస్‌కు తెచ్చినప్పుడు ముప్పై చెరువుల నీరు తాగించే సంస్థలు ఉంటాయి. సంస్థలు అనటం కంటే షోరూంలు అనాలిక్కడ. ఈ మధ్య నేను విని, చదివిన ఇటువంటి అనుభవాల్లో ఎక్కువ కియా షోరూంలవి.
అయితే కారు ఎంపిక చేసేప్పుడే సమీపంలో ఆ బ్రాండ్ సర్వీస్ సెంటర్ గురించి వాకబు చెయ్యటం ఉత్తమం. టొయోటా వారి షోరూంలు, సర్వీస్ సెంటర్లు అన్ని బ్రాండ్లలో అత్యుత్తమ పనితీరు కలిగి ఉంటాయని ప్రతీతి.
యాజమాన్య ఖర్చు (Cost of Ownership)
కారు కొన్నాక యజమానిని అతి ఎక్కువ సతాయించే అంశం ఇదే.
సర్వీస్ మరియు స్పేర్ భాగాల వ్యయం: పెట్రోల్ కార్ల కంటే డీజల్ కార్లకు సర్వీస్ ఖర్చులు ఎక్కువ. పెట్రోల్, డీజల్ సంబంధం లేకుండా ష్కోడా, ఫోక్స్వాగెన్ సంస్థల కార్ల సర్వీస్, స్పేర్ భాగాల ఖర్చులు బాగా ఎక్కువ, విడి భాగాలు దొరకటమూ కష్టమే. నా స్నేహితుడి పోలో TSI కారుకు DSG క్లచ్ప్లేట్ తెప్పించేందుకు సర్వీస్ సెంటర్ నెల రోజులు తీసుకుంది.
కొన్ని కార్లకు సులువుగా దొరకని సైజు టైర్లు ఉంటాయి. 2-3 ఏళ్ళకు టైర్లు మార్చేప్పుడు ఆ సైజుకు సరిపోయేవి దొరక్క ఇబ్బంది ఎదురౌతుంది. ఉన్నవి కూడా ఖరీదెక్కువ ఉంటాయి. 17, 18 అంగుళాల టైర్లలో ఈ ఇబ్బంది ఎదురవ్వవచ్చు.
బుకింగ్
కారు బుక్ చేసేప్పుడు నిరభ్యంతరంగా బేరమాడాలి కానీ ఎంచుకున్న మోడల్ బాగా అమ్ముడుపోయేదయితే బేరమాడే అవకాశం తక్కువగా ఉంటుంది.
సాధారణంగా షోరూంలకు వాహన బీమా, ఉపకరణాల (Accessories)పై ఎక్కువ శాతం (దాదాపు 30%) లాభం ఉంటుంది. వాహన బీమా షోరూంలో కాకుండా బయట కొనటం ఉత్తమం. ఇలా ఒప్పుకోమని, వారి వద్దే తీసుకోవాలని షోరూం వారు ఒత్తిడి చేస్తారు కానీ వారికి ఆ హక్కు లేదు. వీలయితే బీమాపై షోరూం వారితోనే బేరమాడవచ్చు. వారు తగ్గకపోతే నిరభ్యంతరంగా బయట తీసుకోవచ్చు.
ఉపకరణాలు కూడా అవసరం లేనివి అంటగట్టే ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా అవసరం అయినవి కావాలని పట్టుబట్టి తీసుకునే హక్కు కొనుగోలుదారుకు ఉంది. గత కొన్నేళ్ళుగా సంస్థలు AMC (వార్షిక నిర్వహణ ప్యాకేజీలు), Extended Warranty అమ్ముతున్నారు. ష్కోడా వంటి సంస్థల కార్లకు ఇవి తీసుకోవటమే మంచిది.
బుకింగ్ తరువాత షోరూం వారితో మాట్లాడుతూ వీలైనంత త్వరగా మీ కారు VIN (Vehicle Identification Number) తెలుసుకోండి. కారు తయారీ తేదీ ఖచ్చితంగా తెలిపే సంఖ్యే ఈ VIN.[2]
Delivery
కారు తీసుకునేందుకు వెళ్ళినప్పుడు 2-3 గంటల సమయం ఉండేలా చూసుకుని వెళ్ళాలి, ఉదయం సమయం అత్యుత్తమం. హడావుడిగా వెళ్ళవద్దు. సాయంత్రాలు వెళితే కారు పెయింట్ నాణ్యత, ఏవయినా చిన్న నొక్కులు ఉంటే తగినంత వెలుతురు లేనందున కనపడవు – పదికి రెండు కొత్త కార్లలో ఇలాంటి సమస్యలు ఉంటాయి, ఇవి ఆరుబయట వెలుతురులో చూడటమే ఉత్తమం.
కారు డెలివరీ తీసుకునేప్పుడు చెయ్యవలసిన తనిఖీలు ఉంటాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ మరువకూడదు
ముందుగా ఫుల్-ఫ్రేమ్(35mm), APS-Cల మధ్య తేడా తెలుసుకోవాలి. కెమెరాకు సెన్సర్ మెదడు వంటిది. లెన్స్ ద్వారా వచ్చే కాంతిని దృశ్యరూపంలో డిగిటల్గా ముద్రించే పని చేస్తుంది సెన్సర్. కళ్ళ ద్వారా చేరే కాంతిని దృశ్యంగా చూపించే మానవ మెదడులా.
సెన్సర్ పరిమాణాలు:
వీటిలో ముఖ్యమైనవి, ఎక్కువ వాడుకలోనివి రెండు:
ఫుల్-ఫ్రేమ్: ప్రకృతి దృశ్యాలు, నైట్ ఫోటోగ్రఫీకి ఇది ఎంతో ఉపయుక్తం. ఎందుకంటే సెన్సర్ పరిమాణం పెద్దదవటంవల్ల ఎక్కువ దృశ్య కాంతి ప్రవేశించి ఎక్కువ వివరాలు, వెలుతురు తక్కువ ఉన్న దృశ్యాలు బాగా వస్తాయి.
రాత్రి సమయాల్లో నక్షత్రాల చిత్రాలు మంచి ఉదాహరణ:
చిత్రమూలం: లింకన్ హారిసన్
దాదాపు అందరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు ఫుల్-ఫ్రేమ్ కెమెరాలు వాడతారు. వీటిలో ఫీచర్లు ఎక్కువ, ఖరీదు ఎక్కువే.
APS-C:
ఇందులో సెన్సర్ చిన్నది కనుక దృశ్యాన్ని జూమ్ చేసి చూసినట్టుంటుంది. అందుకే దూరం నుంచి తీసే ఫోటోలకు ఇవి బాగా ఉపకరిస్తాయి. ఉదాహరణకు వైల్డ్‌లైఫ్, పక్షులు, స్పోర్ట్స్, వగైరా.
ఒకే లెన్స్‌తో ఈ రెండు కెమెరాల్లో తీసిన ఫోటోల్లో తేడా ఇలా ఉంటుంది:
కెనాన్ కెమెరాల్లో ఈ రెండు సెన్సర్లు ఇలా ఉంటాయి:
ఎడమపక్కది APS-C, కుడిపక్కది ఫుల్-ఫ్రేమ్
కెమెరా ఎందుకు కొనాలనుకుంటున్నారు?
హాబీగా ఫోటోగ్రఫీ నేర్చుకోటానికి
కుటుంబం ఫోటోలు తీసుకోటానికి
సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెట్టటానికి
ఫోటోగ్రఫీని వృత్తిగా మార్చుకోటానికి
హాబీగా ఫోటోగ్రఫీ నేర్చుకోటానికి
APS-C సెన్సర్ కెమెరా కొంటే సరిపోతుంది. ఇందులో ముఖ్యంగా లెన్స్ లభ్యత, వాటి ధర వంటి విషయాలు చూసి తీసుకోవాలి. ఈ రకంగా నికాన్ బాగుంటుంది. కెనాన్‌తో పోలిస్తే బిగినర్స్‌కి తక్కువ బడ్జెట్లో లెన్స్ ఉంటాయి. ముఖ్యంగా 24-55 లేదా 24-105mm లెన్స్ తీసుకుంటే సరిపోతుంది. తరువాత అభిరుచిని బట్టి మ్యాక్రో, పోర్ట్రెయిట్ లెన్స్ తీసుకోవచ్చు.
మరో విషయం, నికాన్ అయినా కెనాన్ అయినా, వాటికి తగిన లెన్స్ ఇంకా తక్కువలో తయారు చేసే టామ్రాన్, సిగ్మా వంటి సంస్థలున్నాయి. నేర్చుకునేందుకు ఆ లెన్స్ కొన్నా సరిపోతుంది.
కుటుంబం ఫోటోలు తీసుకోటానికి
పర్యటనల్లోనో, ఇంట్లో వేడుకల్లోనో ఫోటోలకు DSLR కంటే కాంపాక్ట్ కెమెరాలే మంచివి. పెద్ద వేడుకలకు ఎలాగూ ఫోటోగ్రాఫర్‌ను పెట్టుకుంటారు కదా. చాలా మంది కేవలం కొనాలన్న ఆత్రంతో కొని, పుట్టినరోజు వేడుకల వంటివి జరిగేప్పుడు DSLRతో తంటాలు పడటం జరుగుతుంది. ఆ తలనొప్పి లేకుండా నిశ్చింతగా కాంపాక్ట్ కెమెరా తీసుకోవటం భేషు.
సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెట్టటానికి
ఇందుకు సోనీ మంచిదని విన్నాను. నా అనుభవంలో కెనాన్ బాగుంటాయ్. ముఖ్యంగా తేలిగ్గా ఉండే కెమెరా తీసుకోవటం ఉత్తమం. ఇక్కడ కెమెరాతో పాటు ట్రైపాడ్, మైకు వంటి ఉపకరణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఫోటోగ్రఫీని వృత్తిగా మార్చుకోటానికి
ఖరీదైనా ఒకేసారి ఫుల్-ఫ్రేమ్ కెమెరా తీసుకోవటం మంచిది. మీకు ఉత్సాహం ఉన్న అంశాన్ని బట్టి ఫీచర్లు చూసుకోవాలి.
ఉదాహరణకు పెళ్ళిళ్ళు, క్యాండిడ్ ఫోటోగ్రఫీ వంటి వాటికి ఫోకస్ పాయింట్లు, ఫోకసింగ్ వేగం మరియు విధానం, ISO వంటివి ముఖ్యం. అలాగే కొనవలసిన ఉపకరణాలూ ఎక్కువే ఉంటాయి – ఫ్ల్యాష్, బ్యాగు, ట్రైపాడ్, కెమెరాను సరిగా శుభ్రపరిచే పరికరాలు వంటివి.
మెగాపిక్సెల్స్(MP) విషయం ఎక్కడా ప్రస్తావించలేదనుకుంటున్నారా? అది కేవలం మార్కెటింగ్ చమక్కే. పెద్ద పెద్ద బిల్‌బోర్డులపై ముద్రించే యాడ్ల ఫోటోలకు తప్ప మిగతా అవసరాలన్నిటికీ 10MP అయినా సరిపోతుంది.
పై అంశాలన్నిటినీ శాసించే ముఖ్యమైన విషయం బడ్జెట్. కెమెరాల ప్రపంచం అందమైన రంగుల లోకం. చాలా మంది ఇందులో పడితే ఇంకా ఇంకా ఖర్చు పెట్టాలని తహతహలాడతారు. అందుకే మొట్టమొదట బడ్జెట్ అనుకుని దానికి లోబడి కొనుగోలు చెయ్యటం మంచిది.
డిష్వాషర్ గురించి చాలా మందికి ఉండే అపోహ: డిష్వాషర్ విద్యుత్తునూ, నీళ్ళనూ వృథా చేస్తుందని. అది నిజం కాదు. ఒకసారి డిష్వాషర్ పూర్తిగా నింపి వాడితే, సగటున 15-20 లీటర్ల నీళ్ళు, 0.87-1.5 kwH (kwH = యూనిట్) విద్యుత్తూ ఖర్చవుతుంది. ఒక మామూలు సైజు డిష్వాషర్లో, దాదాపు 10 పెద్ద పళ్ళాలు, 10 సాసర్లు, 10 టీ కప్పులు, పది గరిటెలు, 30 చెంచాలు, 10 చిన్న బేసిన్లు (cereal bowls) 10-12 గ్లాసులు, మరికొన్ని చిన్న గిన్నెలు పడతాయి. ఇవన్నీ చేతితో సింకులో కడగడానికి — కడిగే విధానాన్ని బట్టి– ఇరవై లీటర్ల కన్నా ఎక్కువ నీళ్ళు ఖర్చవుతాయి. ఇంకా 1-2 గంటల సమయం, తుడిచి పెట్టుకొనే సమయం కలుపుకోవాలి.
డిష్వాషర్ అంతగా ఉపయోగపడని సందర్భాలు:
కుటుంబంలో పిల్లలు లేనివారికీ, రోజులో ఎక్కువ భాగం ఆఫీసులో గడిపేవారికి ఇంట్లో ఎక్కువ పాత్ర సామాను “అంటు” అవదు. డిష్వాషర్ పాత్రలతో నింపకుండా వాడడం వల్ల విద్యుత్తూ, నీళ్ళు వృథా అవుతాయి. అందుకు, చిన్న కుటుంబాల వారికీ, పాత్రసామాను ఎక్కువగా లేనివారికీ డిష్వాషర్ ఎక్కువ ఉపయోగపడదు.
ప్లాస్టిక్ వస్తువులు (ఉదా: మెలమైన్ పళ్ళాలు, చెంచాలు, గిన్నెల వంటివి) డిష్వాషర్లో కడగకూడదు. వాటిలో ఆవిర్లు కక్కుతున్న పదార్థాలు ఉంచడం మంచిది కాదు కూడా.
అడుగంటిన పాల గిన్నెలు, అన్నం గిన్నెలు, మాడిన కూర బాణలి/మూకుడు, దోసెల పెనం — ఇటువంటి వాటిని డిష్వాషర్లు సరిగ్గా కడగలేవు. ఇటువంటివి చేతితో కడగక తప్పదు. మీకు ఇటువంటి అంటగిన్నెలు ఎక్కువగా ఉంటే డిష్వాషర్ ఉపయోగం ఉండదు.
నాన్‌స్టిక్ గిన్నెలు చాలా మటుకు డిష్వాషర్లో కడగకూడదు.
భారతీయ వంటకు ఉపయోగించే సుమీత్ మిక్సీ, జార్లు, వెట్ గ్రైండర్ గిన్నెలు వంటివి డిష్వాషర్లో కడగడం కుదరదు.
డిష్వాషర్ బాగా ఉపయోగపడే సందర్భాలు:
డిష్వాషర్లు వంటవండిన గిన్నెల కన్నా, పళ్ళాలు, గ్లాసులు, చెంచాలు, గరిటలు, టీ కప్పులు వంటివి బాగా కడగగలవు.
సీసాతో పాలు తాగే చంటిపిల్లలు ఉన్నవాళ్ళకి సీసాలను కడిగి, పొడిగా ఉంచడానికి డిష్వాషర్ చాలా ఉపయోగం.
కొన్ని డిష్వాషర్లలో ఉండే స్టెరిలైజ్ సౌకర్యం వల్ల పాలసీసాలు అందులో కడిగితే విడిగా స్టెరిలైజ్ చెయ్యనవసరం లేదు.
వంట వండిన గిన్నెలకన్నా, తినడానికి ఉపయోగించే పాత్రలవాడకం ఎక్కువ అయినప్పుడు డిష్వాషర్ చాలా ఉపయోగపడుతుంది.
ఇప్పుడు కరోనా వల్ల కుటుంబం అంతా ఇంట్లోనే గడపడంతో, పిల్లలు చిరుతిండి తిని, వాడి పడేసిన పళ్ళాలు, చెంచాలు, కాఫీ, టీ కప్పులతో డిష్వాషర్ తొందరగా నిండిపోతుంది.
స్టెయిన్లెస్ స్టీలు వస్తువులు డిష్వాషర్లో కడిగితే తళతళలాడుతూ ఉంటాయి.
స్టెయిన్లెస్ స్టీలు ఇడ్లీ రేకులు నూనె/నెయ్యి రాసి, ఇడ్లీలు వేసిన తరవాత ఒకసారి తొలిచి డిష్వాషర్లో పెడితే శుభ్రంగా అవుతాయి.
స్టెయిన్లెస్ స్టీలు ప్రెషర్ కుక్కరును కూడా డిష్వాషర్లో కడగవచ్చు. గాస్కెట్ మాత్రం విడిగా చేతితో కడగాలి.
డిష్వాషర్లో పాత్రలు అమర్చడానికి కొంత అలవాటు పడాలి, ప్రతి గిన్నెనూ, కప్పూనూ బోర్లించి పెట్టకపోతే వాటిలో నీళ్ళు నిలిచిపోతాయి. పాస్టిక్ వస్తువులు, డిష్వాషర్లో కడగవచ్చని సూచించినవి కూడా, అందులో కడగడం మంచిది కాదు. అవి పై అరలో అమర్చాలి. అవి సరిగ్గా అమర్చకపోతే కింద హీటింగ్ ఎలిమెంట్‌పై పడి కరిగే అవకాశం ఉంది.
The cheapest Lamborghini as of 2019–2020 costs around $200,000 (1.5 Crore Rs) depending on your location for example the United States. And I am talking about the Lamborghini LP 580-2. Keeping that in mind. Whether your salary is a fat one or not as long as you have saved up enough money you can get this beautiful car. So the only thing that comes into mind now is maintainance. This car with normal annual service and no major issues will cost you a fat $5,000 (3.7 Lakh Rs) in maintenance.
So now you must re think if owning this car with your current salary is worth it. With such a heft maintenance cost you need a minimum of $26,000 (20 Lakh Rs) monthly salary in order for you to continue living your luxury life with ease or a yearly salary/income of $320,000 (2.4 Crore Rs). But hey who cares if you want to spend all your money on your car’s monthly maintenance cost, spend on it, love it, and enjoy life.
In India buying a luxurious car will cost you more due to high import duties. So the Lamborghini LP 580-2 cost is around Rs 2.9 Crore in India.
ప్రముఖ కార్ల దిగ్గజం హ్యుండాయ్ సంస్థ తన సరికొత్త క్రెటా మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవలే ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించిన ఈ ఎస్ యూవీ ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా నిర్దేశించింది. 10 రకాల కొత్త కలర్ ఆప్షన్లతో వచ్చిందీ వాహనం.
1.5లీటర్ పెట్రోల్ ఎంపీఐ..
హ్యుండాయ్ క్రెటా ఈఎక్స్(మ్యానువల్ ట్రాన్స్ మిషన్) వేరియంట్ ధర………… రూ.9.99 లక్షలు
ఎస్ వేరియంట్ ధర……………………… రూ.11.72 లక్షల రూపాయలు
ఎస్ఎక్స్ వేరియంట్ ధర………………….. రూ.13.46 లక్షలు. అదే ఐవీటీ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ ధర అయితే 14.94 లక్షలు. 1.5 పెట్రోల్ ఎంపీఐలో ఈ వేరియంట్ అందుబాటులోకి తీసుకురాలేదు సంస్థ.
హ్యుండాయ్ క్రెటా ఈ వేరియంట్ ధర………. రూ.9.99 లక్షలు(ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ లేదు).
ఈఎక్స్ వేరియంట్ ధర…………………. రూ.11.49 లక్షలు (ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లేదు)
ఎస్ వేరియంట్ ధర………………….. రూ.12.77 లక్షలు (ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లేదు)
ఎస్ఎక్స్ వేరియంట్ ధర………….. రూ. 14.51 లక్షలు. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉన్న వేరియంట్ అయితే రూ.15.99 లక్షలు.
ఎస్ఎక్స్(ఓ) వేరియంట్ ధర………….. రూ.15.79 లక్షలు. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ ఉన్న వేరియంట్ అయితే రూ.17.2 లక్షలు.
మైలేజి..
ఈ సరికొత్త హ్యుండాయ్ క్రెటా.. అద్భుతమైన మైలేజినిస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండి మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేసే వాహనమైతే లీటరుకు గరిష్ఠంగా 21.4 కిలోమీటర్ల మైలేజినిస్తుంది. అదే ఆటో మేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ ఉన్న కారైతే 18.5 కిలోమీటర్లు ఇస్తుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థలో 16.8 కిలోమీటర్లు, సీవీటీ ట్రాన్స్ మిషన్ వ్యవస్థలో 16.9 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది. 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే లీటరుకు 16.8 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది.
ఫీచర్లు..
బీఎస్6 హ్యుండాయ్ క్రెటా మోడల్లో ఫీచర్లకు కొదవే లేదు. బ్లూ లింగ్ కనెక్టెడ్ కారు టెక్నాలజీని పొందుపరిచారు. ఈ ఎస్ యూవీలో ఉన్న సరికొత్త స్టీరింగ్ వీల్ పై కొన్ని కంట్రోళ్లను ఉంచారు. 7-అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ తో కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. 10.25 అంగుళాల సమాంతరపు టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్ లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కీలెస్ ఎంట్రీ, పానోరామిక్ సన్ రూఫ్, యాంబియంట్ లైటింగ్, టైర్స్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం లాంటి ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్లు..
అంతేకాకుండా ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టం, ప్యాడిల్ షిఫ్టర్లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రేర్ పార్కింగ్ కెమెరా, సెన్సార్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ తదితర సేఫ్టీ ఫీచ్రలు ఇందులో ఉన్నాయి. ఇంతే కాకుండా 10 రకాల కలర్ ఆప్షన్లతో 2020 హ్యుండాయ్ క్రెటా దర్శనమిచ్చింది. ఇందులో 7 సింగిల్ టోన్ కలర్లు, మూడు డ్యూయల్ టోన్ కలర్లు ఉన్నాయి.
ఇంజిన్..
బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన 2020 హ్యుండాయ్ క్రెటా వాహనంలో 1.4 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరెటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1,4 లీటర్ టీజీడిఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ 140 పీఎస్ పవర్, 242 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. 1.5 లీటర్ క్రెటా పెట్రోల్ ఇంజిన్ అయితే 115 పీఎసస్ పవర్ 144ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తూ 6-స్పీడ్ మ్యానువల్, సీవీటీ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే 115 పీఎస్ పవర్, 250 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యానువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది.
హ్యుండాయ్ క్రెటా డిజైన్..
స్పోర్టీ ఎడ్జీ లుక్ తో ఆకట్టుకుంటోన్న ఈ 2020 హ్యుండాయ్ క్రెటాలో సరికొత్త గ్రిల్, ట్రియో బీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్లతో కూడిన ఎల్ఈడీ డే లైట్ రన్నింగ్ లైట్లు. ఫాక్స్ స్కిడ్ ప్లేట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంపులు, రన్నింగ్ బోర్డుపై సిల్వర్ ప్రొటెక్షన్ బోర్డు లాంటి వాటిని పొందుపరిచారు. అంతేకాకుండా 17-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, హారిజంటల్ ఎల్ఈడీ బ్రేక్ లైట్, ట్విన్ ఎక్సాహాస్ట్ పైపులను అమర్చారు.
ఎక్స్ షోరూంలో ఈ సరికొత్త బీఎస్6 కేటీఎం డ్యూక్ 250 బైక్ ధర వచ్చేసి రూ.2.09 లక్షలుగా సంస్థ నిర్దేశించింది
డిజైన్.. ఈ సరికొత్త కేటీఎం డ్యూక్ 250 బీఎస్6 బైక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లతో అందుబాటులోకి వచ్చింది. చూసేందుకు అచ్చం కేటీఎం డ్యూక్ 390 మోడల్ మాదిరే ఉన్న ఈ మోటార్ సైకిల్ డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ ను కలిగి ఉంది. అంతేకాకుండా సూపర్ మోటో మోడ్ ఆప్షన్ ఇందులో ఉంది. దీని వల్ల ఏబీఎస్ ను పూర్తి స్విచ్ ఆఫ్ అయి రేర్ వీల్స్ ను ప్రెస్ చేస్తుంది. అంతేకాకుండా ఈ మోటార్ సైకిల్ రెండు కొత్త కలర్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. డార్క్ గాల్వానో, సిల్వర్ మెటాలిక్ కలర్స్ లో దీన్ని సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా అప్టేటెడ్ గ్రాఫిక్స్ వల్ల స్పోర్టీ, అగ్రెసివ్ లుక్ తో ఇది ఆకట్టుకుంటోంది.
ఇంజిన్.. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్టేట్ చేసిన ఈ 2020 కేటీఎం డ్యూక్ 250 మోటార్ సైకిల్.. 248 సీసీ సింగిల్ సిలీండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 29.6 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 24 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 6-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. ఇంజిన్ మార్పు కాకుండా ఇందులో చెప్పుకోదగ్గ మార్పులేమి లేవు. పాత మోడల్ మాదిరే రెండు డబ్ల్యూపీ సస్పెన్షన్, 43 ఎంఎం ఫ్రంట్ యూఎస్డీ ఫోర్కులు, వెనక భాగంలో 10 స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్ అబ్జార్బర్లు ఇందులో ఉన్నాయి. బ్రేకింగ్ సెటప్ దగ్గరకొస్తే 320 ఎంఎం, 240 ఎంఎం ముందు, వెనక డిస్క్ బ్రేకింగ్ సెటప్ ఇందులో ఉంది. 13.5 లీటర్ల ఇంధన సామర్థ్యం కలిగిన ఈ బైక్ 169 కేజీలు బరువుంది.
గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవచ్చు. అన్నట్లు.. మీ ప్రాణ మిత్రుడికి మీరు ఏం గిఫ్టు ఇవ్వాలో నిర్ణయించుకున్నారా?
MI 4K ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ లేదా అమేజాన్ ఫైర్ టీవీ స్టిక్: మీ ఫ్రెండ్‌కు గ్యాడ్జెట్లు బాగా ఇష్టమైతే ఇది ట్రై చేయండి. ఒక వేళ మీ స్నేహితుడి ఇంట్లో ‘స్మార్ట్ టీవీ’ లేనట్లయితే.. వీటిని కానుకగా ఇవ్వండి. ఎందుకంటే.. ఇవి సాధారణ టీవీని సైతం స్మార్ట్ టీవీగా మార్చేస్తాయి. దీనికి ఇన్స్టలేషన్ కూడా అవసరం ఉండదు. జస్ట్.. పెన్ డ్రైవ్ పెట్టినంత ఈజీ. దీని సాయంతో అన్నిరకాల ‘అమేజాన్ ప్రైమ్’, ‘నెట్ ఫ్లిక్స్’ తదితర ఓటీటీలను సైతం టీవీలో చూడవచ్చు. వీటి విలువ రూ.3500 నుంచి రూ.4000 వరకు ఉంటుంది. ఇవి ఆన్లైన్లో లభిస్తున్నాయి.
ఓటీటీ గిఫ్ట్‌గా ఇవ్వండి: కరోనా నేపథ్యంలో సినిమాహాళ్లు మూసేశారు. దీంతో ఎక్కువ మంది ఓటీటీలను చూసి ఆనందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఏదైనా మంచి ఓటీటీని ఒక ఏడాది సబ్స్క్రిప్షన్ చేయించి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కానుకగా ఇవ్వండి. అంతేకాదు.. దీనికి అనుసంధానంగా ఏడాదిపాటు ఇంటర్నెట్ను కూడా కానుకగా ఇవ్వొచ్చు. జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. అంటే, మీరిచ్చే ఆ ఇంటర్నెట్ ద్వారా మీ స్నేహితుడు ఓటీటీలో వెబ్‌సీరిస్‌లు సినిమాలు ఎంజాయ్ చేయొచ్చు. నెట్ ఇవ్వకుండా ఓటీటీ ఇచ్చినా పెద్దగా ఫలితం ఉండదు కదా.
వైర్లెస్ పవర్ బ్యాంక్: ఇటీవల వైర్లెస్ పవర్ బ్యాంకులకు బాగా క్రేజ్ పెరిగింది. అయితే, ఇది కొన్ని ఫోన్లకే సపోర్ట్ చేస్తుంది. మీ స్నేహితుడి ఫోన్‌కు కనుక ఇది సపోర్ట్ చేస్తే తప్పకుండా కొనివ్వండి. మార్కెట్లో అందుబాటులో ఉన్న సామ్సంగ్ వైర్లెస్ పవర్ బ్యాంక్ ప్రస్తుతం రూ.3700 వరకు ధర పలుకుతోంది. దీన్ని కూడా ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు.
MI బ్యాండ్ 3: ఇటీవల ఫిట్నెస్ కోసం బ్యాండ్ల వినియోగం పెరిగింది. ఒక వేళ మీ స్నేహితుడి వద్ద అలాంటి బ్యాండ్ లేకపోతే.. గిఫ్టుగా ఇవ్వండి. ఇలా చేస్తే.. మీరు మీ స్నేహితుడి ఆరోగ్యం మీద శ్రద్ధ చూపినవారు కూడా అవుతారు. మన ఫిట్నెస్ను ట్రాక్ చేసే ఈ బ్యాండ్ అందుబాటు ధరల్లోనే లభిస్తోంది. అయితే, MI బ్యాండ్3కి మంచి డిమాండ్ ఉంది. దీని ధర ప్రస్తుతం రూ.1400 వరకు ఉంది. మరికొన్ని బ్రాండ్లు రూ.2000 వరకు ధర పలుకుతున్నాయి. ఇది ఆన్లైన్లో లభ్యమవుతోంది.
రిలయన్స్ జియోతో టెలికాం మార్కెట్లో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ ఈ కామర్స్ విభాగం జియోమార్ట్ ద్వారా మరో సునామీ సంచలనాలు సృష్టించేందుకు మరింత దూకుడుగా సిద్ధమవుతోంది. భారతదేశంలోని 200 నగరాల్లో కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించిన రెండు నెలల తరువాత, జియోమార్ట్ తాజాగా ఆండ్రాయిడ్, ఐఫోన్వినియోగదారులకోసం కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. తద్వారా జియోమార్ట్ అన్ని ఆర్డర్లపై ఉచిత డెలివరీని కూడా అందిస్తోంది.
జియోమార్ట్ ప్రధాన ప్రణాళికలను ఆవిష్కరించిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. వినియోగదారుల కోసం లాంచ్ చేసిన జియోమార్ట్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చని జియో ప్రకటించింది. రిలయన్స్ తన లాయల్టీ ప్రోగ్రామ్ రిలయన్స్ వన్ లేదా రోన్‌ను జియోమార్ట్‌కు కూడా విస్తరించింది. తద్వారా వినియోగదారులు అనేక బ్రాండ్లు, ఉత్పత్తులపై ప్రత్యేకమైన ఆఫర్లతో పాటు, రోన్ పాయింట్లను సంపాదించవచ్చని తెలిపింది. ఐదు శాతం డిస్కౌంట్ ను కూడా ఇస్తామని ప్రకటించింది. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో ఈయాప్ దూసుకుపోతోంది. ఇప్పటికే 10వేలకు పైగా డౌన్లోడ్లను సంపాదించింది.
జియోమార్ట్ ఇంతకుముందు 750 రూపాయలు అంతకంటే ఎక్కువ ఆర్డర్లకు మాత్రమే ఉచిత డెలివరీని అందిస్తున్న సంగతి గమనార్హం. అమెజాన్ ప్రస్తుతం ఆర్డర్లకు 799 రూపాయల పైన ఉచిత డెలివరీని అందిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ ఇవ్వడానికి కనీస ఆర్డర్ విలువ 600 రూపాయలు. ఉచిత డెలివరీ కావాలంటే 1,200 రూపాయలు విలువైన వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గ్రోఫర్స్, 800 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆర్డర్లకు ఉచిత డెలివరీని అందిస్తుంది. పరిచయ ఆఫర్‌గా, జియోమార్ట్‌లో ప్రతి మొదటి ఆర్డర్‌తో కోవిడ్-19 ఎసెన్షియల్ కిట్‌ను అందిస్తామని ఏజీఎంలో ప్రకటిన సంగతి తెలిసిందే.
The 10 bikes we will be talking about are all 150-200cc in engine capacity. There are absolutely zero issues with the security of this bikes. All these bikes are load with advanced electronics like ABS,latest BS6 engine. All of these are really good to buy in terms of budget. You can buy any of these without giving a second thought about the quality and comfort.
Top 10 Bikes under 1 Lakh in India Ex-Showroom Kolkata Price List
హీరో మోటార్ సైకిళ్ల సంస్థ తన సరికొత్త బీఎస్6 హీరో ఎక్స్ పల్స్ మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ మోటార్ సైకిల్ అత్యాధునిక హంగులతో ఆకట్టుకుంటోంది. దిల్లీ ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ధర వచ్చేసి రూ.1.12 లక్షలుగా సంస్థ నిర్దేశించేంది. బీఎస్4 మోడల్ కంటే దాదాపు రూ.6,800ల ధర ఎక్కువగా వచ్చింది. అంతేకాకుండా అతి తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చిన అడ్వెంచర్ మోటార్ సైకిల్ గా ఇది గుర్తింపుతెచ్చుకుంది.
అత్యాధునిక హంగులు, ప్రత్యేకతలు, సాంకేతికతతో ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఐదు కలర్ ఆప్షన్లతో ఈ మోటార్ సైకిల్ అందుబాటులోకి వచ్చింది. వైట్, మ్యాటీ గ్రీన్, మ్యాటీ గ్రే, స్పోర్ట్స్ రెడ్, ప్యాంథర్ బ్లాక్ కలర్ లో ఇది లభ్యమవుతుంది.
ఇంజిన్..
ఈ సరికొత్త బీఎస్6 హీరో ఎక్స్ పల్స్ 200 మోటార్ సైకిల్ 199సీసీ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సింగిల్ సిలీండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 17.8 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 16.4 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. వీటితో పాటు ముందు భాగంలో 37 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్కులు, 10వే అడ్జస్టబుల్ మోనోషాక్ సెటప్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా 276 ఎంఎం, 220 ఎంఎం పెటల్ డిస్కులు ఫ్రంట్ అండ్ బ్యాక్, సింగిల్ ఛానెల్ ఏబీఎస్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 220 ఎంఎం ఉంది.
ప్రత్యేకతలు.. ఈ హోండా ఎక్స్ పల్స్ 200 మోటార్ సైకిల్లో ముందు భాగంలో 21 అంగుళాల 90/90 టైర్లతో పాటు వెనక వైపు 18 అంగుళాల 120/80 టైర్లతో ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా 157 కేజీల బరువుతో ఈ బైక్ ఉంది. 13-లీటర్ల ఫ్యూయల్ ట్యాంకు సామర్థ్యంతో అందుబాటులో ఉంది. ఇవి కాకుండా ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, నకుల్ గార్డులు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ బైక్ కు సంబంధించి ర్యాలీ కిట్ సొంతం చేసుకోవాలంటే 40 వేల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. భారత మార్కెట్లో ఈ బైక్ కు పోటీగా రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ బీఎస్6 లాంటివి ఉన్నాయి.
హోండా డియో దేశంలో అత్యధిక యూనిట్ల విక్రయాలు అందుకున్న స్కూటర్ గా గుర్తింపు పొందింది. 2002లో ఈ స్కూటర్ లాంచ్ అయినప్పటి నుంచి దాదాపు 33 లక్షల యూనిట్ల అమ్మకాలు అందుకుంది. ఈ సరికొత్త 2020 హ్యుండాయ్ డియో స్కూటర్లో సరికొత్త డిజైన్, అదనపు ఫీచర్లను పొందుపరిచారు. ఎల్ఈడీ పొజిషన్ ల్యాంపు, ఎల్ఈడీ హెడ్ ల్యాంపు, స్ప్లిట్ రేర్ గ్రాబ్ రెయిల్, న్యూ టెయిల్ లైట్ డిజైన్, సరికొత్త బాడీ గ్రాఫిక్స్ లాంటి అప్ డేట్లున్నాయి. బీఎస్6 హోండా డియో మోడల్లో వీల్ బేస్ కూడా 22 ఎంఎం అధికంగా ఉంది. ఈ బేస్ స్కూటర్ టాప్ వేరియంట్లో అనలాగ్ ఇన్ స్ట్రూమెంట్ ప్యానెల్ ను అమర్చారు. ఇందులో స్పీడ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, డిస్టెన్స్ టూ ఎంప్టీ, సర్వీస్ రిమైండెర్ లాంటి ఆప్షన్లు ఉన్నాయి. 110సీసీ ఇంజిన్ కలిగి ఉన్న 2020 హోండా డియో 8 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 9ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఎక్స్ షోరూంలో బీఎస్6 హోండా డియో ధర వచ్చేసి రూ.60,000 నుంచి రూ.63,340ల మధ్యలో ఉంది.
బీఎస్6 టీవీఎస్ జూపిటర్..
ఈ ఏడాది జనవరిలో విడుదలైన 2020 టీవీఎస్ జూపిటర్ స్కూటర్ తో బీఎస్6 పార్మాట్లో వాహనాలను లాంచ్ చేయడం మొదలు పెట్టింది టీవీఎస్ సంస్థ. అప్పటి నుంచి జూపిటర్ లైనప్ లో జూపిటర్ బేసిక్, గ్రాండే వేరియంట్లను ఈ నూతన ఫార్మాట్లో అప్ డేట్ చేసి విడుదల చేసింది. ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ లాంటి ప్రత్యేకతలు ఈ సరికొత్త 2020 టీవీఎస్ జూపిటర్ స్కూటర్లో పొందుపరిచారు. అంతేకాకుండా ఈ స్కూటర్ 109.9 సీసీ ఇంజిన్ ను కలిగి ఉండి 8 బీహెచ్ పీ పవర్, 8 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఎక్స్ షోరూంలో బీఎస్6 జూపిటర్ ధర వచ్చేసి రూ.61,449 నుంచి రూ.67,911 మధ్య ఉంది.
బీఎస్6 హీరో ప్లెజర్ ప్లస్..
బీఎస్6 స్కూటర్లలో అత్యంత అందుబాటులో ధరలో దొరుతున్న స్కూటర్ హీరో ప్లెజర్ ప్లస్ మోడల్. బీఎస్4 మోడల్ తో పోలిస్తో ఈ నూతన ఫార్మాట్లో ప్లెజర్ ప్లస్ స్కూటర్లో పెద్ద మార్పులేమి లేవు. గతేడాదే బీఎసస్6 నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ స్కూటీ ఇంతకుముందు మోడల్ మాదిరే ఫ్రంట్ అప్రాన్ మందంగా ఉండి, క్రోమ్ చుట్టూ హెడ్ లైట్లు, కర్వీ సైడ్ ప్యానెల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంపులు లాంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. బేసిక్ సమాచారాన్ని తెలుసుకునేందుకు బీఎస్6 హీరో ప్లెజర్ ప్లస్ మోడల్లో అనలాగ్ ఇన్ స్ట్రూమెంట్ ప్యానెల్ కూడా ఉంది. 110 సీసీ ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ స్కూటర్ 8 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 9 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఎక్స్ షోరూంలో బీఎస్6 హీరో ప్లెజర్ ప్లస్ ధర రూ.54,800 నుంచి 56,800 వరకు ఉంది.
బీఎస్6 హోండా యాక్టివా 6జీ..
ఆరో తరానికి చెందిన హోండా యాక్టివా భారత్ లో అత్యంత విజయవంతమై మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ జనవరిలో ఈ సరికొత్త 2020 యాక్టివా 6జీ మోడల్ భారత మార్కెట్లో విడుదలైంది. ఇందులో విభిన్న రకాల కాస్మటిక్ అప్ డేట్లు, ఫంక్షనల్ ఛేంజెస్ వచ్చాయి. రీడిజైన్డ్ ఫ్రంట్ ఆప్రాన్, క్రోమ్ ఇన్ సర్ట్, ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు తదితర ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. బీఎస్6 హోండా యాక్టివా 6జీ స్కూటర్లో ఏసీజీ సైలెంట్ స్టార్ట్ సిస్టం, ఇన్హీబీటర్ సేఫ్టీ ప్రొవిజన్ సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఫంక్షనల్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. 110 సీసీ ఇంజిన్ ను కలిగి ఉన్న హోండా యాక్టివా 6జీ 8 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 9 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
బీఎస్6 హోండా యాక్టివా 6జీ ధర వచ్చేసి రూ.63,912 నుంచి రూ.65,412 మధ్య ఉంది.
బీఎస్6 సుజుకీ యాసెస్ 125..
ఈ సరికొత్త స్కూటర్ తో బీఎస్6 ఫార్మాట్లో వాహనాలను అప్ డేట్ చేయడం మొదలుపెట్టింది సుజుకీ సంస్థ. బీఎస్6 సుజుకీ యాసెస్ 125 మోడల్.. 124 సీసీ ఇంజిన్ ను కలిగి ఉండి 9 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 10 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా క్లీనర్ ఇంజిన్, కాస్మటిక్ లేదా ఫంక్షనల్ మార్పులతో రానుంది. సెమీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ ప్యానెల్, స్పీడ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్ తదితర వివరాలను తెలియజేసే అనలాగ్ డిజిటల్ డిస్ ప్లే లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ఈ కన్సోల్ ద్వారా ఫ్యూయల్ ఎఫిషియంట్ రైడింగ్ ప్యాటర్నులను తెలియజేసే ఎకో అసిస్ట్ ఇల్యూమినేషన్ ను కలిగి ఉంది. ఎక్స్ షోరూంలో బీఎస్6 సుజుకీ యాసెస్ 125 ధర వచ్చేసి రూ.64,800 నుంచి రూ.69,500 మధ్య నిర్దేశించింది.
ఫ్రిజ్ శుబ్రపరిచే విధానం ఫ్రిజ్ లోని పదార్థాలను ఖాళీచేసి షెల్పులు, అరలు, గాజు అరలు అన్నీ తీసివేసి రూమ్ టెంపరేచర్ వచ్చేదాక ఉండి ఆ తరువాత వేడినీటితో కడగాలి లేనట్లయితే పగుళ్ళు వస్తాయి. మైల్డ్ డిష్ వాషింగ్ సోప్ లేదా లిక్విడ్ తో క్లీన్ చేయాలి. ఫ్రిజ్ నుండి తీయలేని విడిభాగాలను. లోపల పదార్థాలు ఒలికిపడి మొండి మరకలు పడినట్లయితే తడి గుడ్డతో తుడవాలి. కొద్ది నిమిషాలు నాననిచ్చి మొత్తని స్ర్కబ్బర్ తో తుడిచేయాలి. ఒక భాగం బేకింగ్ సోడా, ఏడుభాగాలు నీళ్ళు కలిపి ఫ్రిజ్ తుడవాలి. పాత టూత్ బ్రష్, టూత్ పిక్స్ వాడాలి. మెత్తని పొడిటవల్ తో చివరిలో తుడవాలి. ఆరనిచ్చి సర్థుకోవాలి.
ప్రముఖ వాహన సంస్థ హోండా.. తన సివిక్ డీజిల్ మోడల్ ను బీఎస్6 ఫార్మాట్లో అప్డేట్ చేసి భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త బీఎస్6 హోండా సివిక్ ప్రారంభ ధర వచ్చేసి రూ.20.72 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. రెండు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. 23.6 కిలోమీటర్ల మైలేజినిస్తుంది.
భారత మార్కెట్లో అత్యుత్తమ విక్రయాలు అందుకుంటున్న వాహన సంస్థల్లో ముందు వరుసలో ఉన్న కంపెనీ హోండా ఇండియా. తాజాగా ఈ వాహన సంస్థ తన సివిక్ డీజిల్ మోడల్ ను బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్ షోరూంలో ఈ 2020 హోండా సివిక్ డీజిల్ కారు ప్రారంభ దర వచ్చేసి రూ.20.72 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. అత్యాధునిక హంగులు, ప్రత్యేకతలో అందుబాటులోకి వచ్చిన ఈ సెడాన్ ఆకట్టుకుంటోంది.
వేరియంట్ల వారీగా హోండా సివిక్ ధర.. ఈ సరికొత్త హోండా సివిక్ మోడల్ రెండు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. వీఎక్స్, జెడ్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు. వీఎక్స్ వేరియంట్ ధర………… రూ.20.72 లక్షలు. జెడ్ఎక్స్ వేరియంట్ ధర……………. రూ.22.34 లక్షలు.
ఇంజిన్.. ఈ సరికొత్త హోండా సివిక్ బీఎస్6 డీజిల్ కారు 1.5-లీటర్ డీటీఈసీ టర్బోఛార్జెడ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 4000ఆర్పీఎం వద్ద 118 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 2000 ఆర్పీఎం వద్ద 300 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఇది 6-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. అంతేకాకుండా ఐ-డీటీఈసీ డీజిల్ ఇంజిన్ ఎర్త్ డ్రీమ్ టెక్నాలజీ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా ఈ కారు ప్రదర్శన, పనితీరు ఎంతో మెరుగుపడింది. అంతేకాకుండా ఈ బీఎస్6 సివిక్ డీజిల్ వాహనం లీటరుకు గరిష్ఠంగా 23.9 కిలోమీటర్ల వరకు మైలేజి నిస్తుంది.
ఫీచర్లు.. ఈ 2020 హోండా సివిక్ మోడల్లో బీఎస్6 డీజిల్ ఇంజిన్ అప్డేట్ కాకుండా వీఎక్స్, జెడ్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. కర్టెయిన్ ఎయిర్ బ్యాగులు, స్టాండర్డ్ ఆరు ట్యాలీ ఎయిర్ బ్యాగులు తదితర మార్పులు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పటికే లాంచ్ అయిన హోండా సివిక్ పెట్రోల్ మోడల్లో ఉన్న ఫీచర్లన్ని ఇందులోనూ కొనసాగించింది హోండా సంస్థ. 1.8-లీటర్ ఐ-వీటీఈసీ సాంకేతికత, సీవీటీ ట్రాన్స్ మిషన్ యూనిట్ కూడా ఉంది. వీటితో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, అతిపెద్ద టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ కారుకు పోటీగా స్కోడా ఆక్టేవియా కారు ఉంది.
బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ బైక్ ప్రారంభ ధర ఎక్స్ షోరూంలో రూ.1.05 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. సింగిల్ డిస్క్ ఫ్రంట్, డిస్క్ బ్రేక్ అప్ర్ ఫ్రంట్ అండ్ రేర్ అనే రెండు వేరియంట్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు. అత్యాధునిక హంగులు, ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చిన ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది.
డిజైన్.. ఈ సరికొత్త మోటార్ సైకిల్ రోబో ఫేస్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపు, సరికొత్త ఎల్ఈడీ టెయిల్ ల్యాంపుతో ఆకట్టుంకుంటోంది. మస్కూలర్, స్కల్ప్టెడ్ డిజైన్ ఫ్యూయల్ ట్యాంకుతో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ డ్యూయల్ ఔట్ లెట్ ఎక్సాహాస్ట్ ను కలిగి ఉంది. సరికొత్త గ్రాఫిక్స్, వీల్ స్ట్రీప్స్, స్ప్లిట్ గ్రాబ్ రెయిల్స్, ఫ్రంట్ ఫోర్కుల కోసం స్పోర్టీ లుకింగ్ కవర్ల, సైడ్ ఉన్న లింక్ టైప్ గేర్ షిఫ్టర్లు ఇందులో ఉన్నాయి.
ఇంజిన్.. ఈ 2020 హోండా ఎక్స్ బ్లేడ్ మోటార్ సైకిల్లో 160సీసీ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఎనిమిది ఆన్ బోర్డ్ సెన్సార్లు, ఇంజెక్టెడ్ ఆప్టిమమ్ ఎయిర్ ఫ్యూయల్ మిక్జర్ తో మెరుగైన మైలేజిని ఇది కలిగి ఉంది. అంతేకాకుండా హోండా ఎకో టెక్నాలజీ ఇందులో పొందుపరిచారు. 160 సీసీ ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ మోటార్ సైకిల్ 13.57 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 14.7 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. సింగిల్ డిస్క్ వేరియంట్ బరువొచ్చేసి 143 కేజీలుంది. అంటే పాత మోడల్ తో పోలిస్తే కేజీ బరువు ఎక్కువగా ఉండనుంది. అంతేకాకుండా ఈ సరికొత్త మోటార్ సైకిల్లో ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనక భాగంలో మోనోషాక్ యూనిట్లు అదనం. 276 ఎంఎం తో పెటల్ డిస్క్ తో పాటు సింగిల్ ఛానెల్ ఏబీఎస్, వెనక భాగంలో 220 ఎంఎం డిస్క్ లేదా 130 ఎంఎం రేర్ డ్రమ్ బ్రేకింగ్ సెటప్ ఇందులో ఉన్నాయి ప్రత్యేకతల దగ్గరకొస్తే డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్, హజార్డ్ ల్యాంపులు, ఇంజిన్ కిల్ స్విచ్, 582 ఎంఎం పొడవు, 137 ఎంఎం వెడల్పుతో కూడిన సీటును ఈ బైక్ కు ప్రత్యేక ఆకర్షణగా ఈ కమ్యూట్ బైక్స్ కు అందుబాటులో ఉంచారు.
భారత మార్కెట్లో ఈ సరికొత్త హోండా ఎక్స్ బ్లేడ్ మోటార్ సైకిల్ కు పోటీగా హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160, సుజుకీ జిక్సెర్ 155 లాంటి బైక్స్ పోటీగా ఉన్నాయి.
దిల్లీ ఎక్స్ షోరూంలో హోండా డబ్ల్యూఆర్-వీ ప్రారంభ ధర వచ్చేసి రూ.8,49,900 లుగా సంస్థ నిర్దేశించింది. అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతతో అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఎక్స్ టీరియర్ స్టైలింగ్, రిచ్ ఇంటీరియర్లతో పాటు బీఎస్6 పెట్రోల్, డీజిల్ ఇంజిన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
డిజైన్..
ఈ సరికొత్త హోండా డబ్ల్యూఆర్-వీ క్రోమ్ లోవర్ స్టైల్ గ్రిల్ తో పాటు అడ్వాన్సెడ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులుతో కూడిన ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్, పొజిషన్ ల్యాంపులు, అడ్వాన్సెడ్ ఫాగ్ ల్యాంపులు, అడ్వాన్సెడ్ ఎల్ఈడీ రేర్ ల్యాంపుల కాంబినేషన్ తో ఆకట్టుకుంటోంది. విశాలమైన క్యాబిన్ స్పేస్, అత్యాధునిక పీచర్లుతో ఈ కారు అదరగొడుతోంది.
ఫీచర్లు..
ఈ 2020 హోండా డబ్ల్యూఆర్-వీ మోడల్లో ఫీచర్లకు కొదవే లేదు. డీఐజీపీఏడీ 2.0 అడ్వాన్సెడ్ ఇంఫోటైన్మెంట్ సిస్టంతో పాటు ఇందులో ఫీచర్లను స్మార్ట్ ఫోన్ కు అనుసంధానించుకునే స్మార్ట్ కనెక్టివిటీ ఆప్షన్ ఇందులో ఉంది. ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, శాటిలైట్ తో లింక్ చేసుకునే టర్న్ బై టర్న్ నేవిగేషన్, లివ్ ట్రాఫిక్ సపోర్ట్, వాయిస్ కమాండ్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, వైర్లెస్ ఇంఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఇందులో ఉన్నాయి.
ప్రత్యేకతలు..
ఇవికాకుండా వన్ టచ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్, మల్టీ ఇన్ఫార్మేషన్ కాంబీమీటర్ ఈకో అసిస్ట్, టిల్ట్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో వాయిస్, హ్యాండ్స్ ఫ్రీ, క్రూయిజ్ కంట్రోల్ స్విచెస్ లాంటి ప్రత్యేకతలు దీని సొంతంవీటితో పాటు అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఫంక్షన్, హోండా స్మార్ట్ కీ సిస్టం, అండ్ కీలెస్ రిమోట్, 12 వోల్టుల పవర్ ఔట్ లెట్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ లాంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, మల్టీ రేర్ వ్యూ కెమేరా, రేర్ పార్కింగ్ సెన్సార్లు, ఈసీయూ ఇమ్మొబిలైజర్ లాంటి సేఫ్టీ ఫీచర్లు దీని సొంతం.
ఇంజిన్..
ఈ సరికొత్త హోండా డబ్ల్యూఆర్-వీ మోడల్ బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్టేట్ చేసిన 1.2-లీటర్ ఐ-వీటీఈసీ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 90 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 110 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. లీటరుకు గరిష్ఠంగా 16.5 కిలోమీటర్ల మైలేజిస్తుందని అంచనా. అదే 1.5-లీటర్ ఐ-డీటీఈసీ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉండి 100 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 200 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఇది లీటరుకు గరిష్ఠంగా 23.7 కిలోమీటర్ల మైలేజిస్తుంది.
కలర్స్..
ఈ సరికొత్త హోండా డబ్ల్యూ ఆర్-వీ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఎస్వీ, వీఎక్స్ అనే వేరియంట్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఇవి రెండు పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలోనూ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా వాహనంలో ఆరు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ప్రీమియం యాంబర్ మెటాలిక్, లునార్ సిల్వర్ మెటాలిక్, మోడర్న్ స్టీల్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెరల్ కలర్స్ లో దీన్ని సొంతం చేసుకోవచ్చు. రెండేళ్ల వారంటీని ఇస్తుంది హోండా సంస్థ.
ఈ మోటార్ సైకిల్ ధర ఎక్స్ షోరూంలో రూ.69,442లుగా సంస్థ నిర్దేశించింది. డ్రమ్, డిస్క్ వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ కమ్యూటర్ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది.
ప్రత్యేకతలు.. గత మోడల్ కంటే ఎన్నో అప్డేట్లతో అందుబాటులోకి వచ్చిన ఈ మోటార్ సైకిల్ 110సీసీ ఇంజిన్ తో ఆకట్టుకుంటోంది. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా రూపకల్పన చేసిన ఈ బైక్ 110సీసీ ఇంజిన్ తో పాటు పీజీఎం-ఫై(ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టం) సాంకేతికతతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈఎస్పీ(ఎనహాన్సెడ్ స్మార్ట్ పవర్) ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ అప్డేట్ల వల్ల మైలేజితో బండి పనితీరు కూడా మెరుగైంది. ఇవికాకుండా ఆకట్టుకునే ఇంధన ట్యాంకు, బాడీ గ్రాఫిక్స్, సరికొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ వైజర్ లాంటి ప్రత్యేకతల వల్ల ఈ మోటార్ సైకిల్ స్పోర్ట్స్ బైక్ లాగా అబ్బురపరుస్తుంది.
ఫీచర్లు.. ఇవికాకుండా బీఎస్6 హోండా లీవో మోటార్ సైకిల్ ఆల్ న్యూ డిజిటల్ అనలాగ్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, ఏసీజీ స్టార్టర్ మోటార్, సరికొత్త డీసీ హెడ్ ల్యాంపులతో కూడిన పాసింగ్ స్విచ్, స్టార్ట్-స్టాప్ బటన్, ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ తో కూడిన సర్వీస్ డ్యూ ఇండికేటర్ లాంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. 17 అంగుళాల పొడవైన సీటు వల్ల రైడర్ తో పాటు వెనక కూర్చున్న వారికి కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. వెనక భాగంలో 5-దశల అడ్జస్టబుల్ సస్పెన్షన్ సెటప్ తో పాటు, ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్కులు, స్టాండర్డ్ కాంబీ బ్రేకింగ్ సిస్టం లాంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.
కలర్ ఆప్షన్లు.. ఈ సరికొత్త హోండా లీవో బీఎస్6 మోడల్లోని రెండు వేరియంట్లు నాలుగు కొత్త కలర్ ఆప్షన్లతో అందుబాటులోకి రానున్నాయి. అథ్లెటిక్ బ్లూ, మ్యాటీ యాక్సిస్ గ్రే మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, బ్లాక్ కలర్స్ లో ఈ మోటార్ సైకిల్ ను సొంతం చేసుకోవచ్చు. భారత మార్కెట్లో ఈ మోటార్ సైకిల్ కు పోటీగా హీరో స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ రేడియన్ లాంటి బైక్స్ ఉన్నాయి.
తిండి తినకుండా ఉంటాం కానీ టిక్‌టాక్ లేకుండా ఉండలేం అంటున్నారు కొందరు టిక్‌టాక్ యూజర్లు. అందుకే టిక్‌టాక్ సహా 59 చైనీస్ యాప్‌లను ప్రభుత్వం నిషేదించడంతో ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు అయోమయంలో పడిపోయారు. ఇప్పటికే ఈ యాప్‌ను భారత్‌లో దాదాపు 20 కోట్ల మంది వినియోగిస్తున్నారు. దీంతో ఉన్నపలంగా తీసేయాలంటే ఇంకోటి రిప్లేస్ చేయాల్సిందే అనుకున్నారేమో వెంటనే టిక్‌టాక్ ప్రత్యామ్నాయం ఏంటా అని శోధించారు. అదృష్టవశాత్తూ మన భారతీయులు తయారు చేసిన ‘చింగారి’ యాప్ కళ్లెదుట ప్రత్యక్షమయ్యింది. ఇంకేముంది గంటలోనే ఈ యాప్‌ను లక్షమంది దాకా డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
షార్ట్ వీడియో సర్వీస్‌తో అచ్చం టిక్‌టాక్ మాదిరే ఉన్న ఈ యాప్‌పై ప్రస్తుతం భారతీయులు మక్కువ చూపిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం భాషల్లో ఈయాప్ అందుబాటులో ఉంది. దీంతో స్వదేశీ పరిఙ్ఞానంతో రూపొందింన ‘చింగారి’ యాప్‌ను ప్రోత్సహించాలంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
బెంగుళూరుకు చెందిన బిస్వాత్మ నాయక్, సిద్ధార్థ్ గౌతమ్ గతేడాది చింగారి యాప్‌ను రూపొందించారు. అయితే మనోళ్లకు విదేశీ వస్తువులు, యాప్‌లపై మోజెక్కువ కాబట్టి చింగారి యాప్ ఆదరణకు నోచుకోలేదు. కానీ తాజాగా 59 చైనా యాప్‌లపై ప్రభుత్వం నిషేదం విధించడంతో చింగారి యాప్ డౌన్లోడ్స్ పెరిగాయి. ఇప్పటికే 1 మిలియన్ మార్కును దాటేసి గూగుల్ ప్లే స్టోర్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.
జి – అంటే జనరేషన్ (తరం) “జనరేషన్” దాదాపుగా మీకు అర్థం అయినట్లే… మొదటి తరానికి రెండవతరానికి అభివృద్ధి ఖచ్చితంగా ముందంజ వేయాలి…
మొదటి తరం(1G):
మన పాతతరం వైర్ లెస్ టెలిఫోన్ సెట్లు అన్నమాట…
ఇక్కడ సిగ్నల్స్ ను అందుకునేది.. పంపించేది మొత్తం “అనలాగ్” పద్ధతిలో సాగుతుంది.. అందువల్ల మనం డేటాను టెక్స్ట్ మెస్సేజ్ మరియు సాధారణ కాల్స్ మాత్రమే చేసుకోవడానికి వీలుంటుంది… వీటి వేగం 2.4kbps. AMPS అనేది US లో మొదలయిన మొదటి 1G ఫోన్ ఇవి 1980 – 1990 మధ్యలో పనిచేయడం ప్రారంభించాయి.. ఇవన్ని ఒక పరిమితమైన వనరులలో నెట్ వర్క్ అందుబాటులో ఉన్నంత మాత్రమే పని చేస్తుంది.. ఈ తరం ఫోన్ లు దేశంలో అంతర్భాగంలో మాత్రమే పని చేస్తాయి.. వేరే దేశంలో పని చేయవు… ఫోన్ లోని అసౌకర్యాలు: ధ్వనిలో నాణ్యత తక్కువ, బ్యాటరీ జీవితకాలం తక్కువ, ఫోన్ సైజ్ చాలా పెద్దది… రక్షణ తక్కువ, పరిమితమైన సేవలు, చేతికి అందుబాటులో ఉండదు..
రెండవ తరం ఫోన్ లు (2 జి నెట్వర్క్):
ఇవి మొదట ఫిన్ లాండ్ లో 1991 లో కనుగొన్నారు. ఇవి ఒక రకంగా పాత సెల్ ఫోన్ సెట్స్ అని చెప్పుకోవచ్చు.. ఇవి తక్కువ నాణ్యత కలిగిన డిజిటల్ నెట్ వర్క్స్… ఇక్కడ సిగ్నల్స్ అనేవి డిజిటల్ రూపంలో ఉండడం వలన కాల్స్ లో నాణ్యత మరియు డాటా ను సులభంగా పంపుకునే విధంగా మారింది… ఇవి సెమి గ్లోబల్ రోమింగ్ సిస్టమ్(GRS) ను కలిగి ఉంటాయి.. ఈ 2G నెట్ వర్క్.. ఉన్న ఫోన్ ప్రపంచంలో నెట్ వర్క్ ఉన్న ఏ దేశంలోనైనా వాడు కోవచ్చు.. దీనికై మనం రోమింగ్ చార్జి చెల్లించవలసి ఉంటుంది… ఇవి ఒక రకంగా సెల్ ఫోన్ లో మొదటి తరం అని చెప్పవచ్చు.. GSM పద్ధతికి అనుగుణంగా పనిచేస్తాయి.. వీటి వేగం 64 kbps, వీటిలో మంచి నాణ్యత కలిగిన MMS(Multi media message) ను వాడుకోవడానికి సౌలభ్యం కలిగింది.. అసౌకర్యాలు: సిగ్నల్ ఉన్నంత వరకు మంచిగా పనిచేస్తాయి.. సిగ్నల్ లేని పరిసరాల్లో నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది.. వీడియో మెసేజ్ లకు వీలు కుదరదు..
రెండవతరం – మూడవ తరం (2G మరియు 3G మధ్య):
ఇక్కడ రెండవ మూడవ తరం మధ్యలో ఇంకొక తరం ఉంది.. దానిని 2.5Gఅని చెప్పుకోవచ్చు.. ఇక్కడి నుండే తక్కువ స్థాయి/శక్తి కలిగిన రేడియో తరంగాల ద్వారా ఫోన్ లను పని చేయించడం మొదలు పెట్టింది… ఇక్కడి నుండే సెల్ ఫోన్ లు జేబులో ఇమిడి పోవడం ప్రారంభమయింది.. ఈ తరం ఫోన్ లు GPRS (సాధారణ పాకెట్ రేడియో సర్వీస్) ను ఉపయోగించుకొనే అవకాశం దక్కింది .. ఫోన్ కాల్స్ తో పాటు, ఇ – మెయిల్స్ పంపుకునే వీలు దొరికింది .. వెబ్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు, వేగం-64 నుండి 144KBPS కు పెరిగింది.. కెమేరా నాణ్యత పెరిగింది… మూడు నిమిషాల Mp3 పాటలను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఆరు నుండి తొమ్మిది నిమిషాల సమయం పడుతుంది..
మూడవ తరం (మొబైల్ నెట్‌వర్క్‌ల 3 వ తరం):
ఇక్కడినుండే సెల్ ఫొన్ లతో ఇంటర్ నెట్ వాడు కునే సౌలభ్యం మొదలయింది… ఇక్కడినుండే సెల్ ఫొన్ లతో ఇంటర్ నెట్ వాడు కునే సౌలభ్యం మొదలయింది… ఈ తరం సెల్ ఫోన్ లు మాత్రమే కాకుండా టాబ్లెట్ లు కూడా మొదలయ్యాయి… డాటా ట్రాన్సిమిషన్ స్పీడు 144KBPS to 2MBPS. దీని వలన ఒకే సమయంలో ఎక్కువ డేటాను వాడు కోవడానికి సౌలభ్యం చిక్కింది… ఇక్కడి నుండే మనకు వీడియో కాలింగ్, వాయిస్ కాలింగ్, ఫైల్ ట్రాన్సిమిషన్, ఇంటర్ నెట్ సర్ఫింగ్, ఆన్ లైన్ టి.వి. , హై ఫ్రిక్వెన్సీ వీడియో, వేర్వేరు రకాలయిన గేమ్స్, ఆడడానికి వీలు కలిగింది.. ఎప్పుడూ ఇంటర్ నెట్ సౌకర్యం అవసరం ఉన్న వారికి 3G సర్వీసు ఒక వరం లాంటిది…వీటినే స్మార్ట్ ఫోన్స్ అంటారు.. ఇక్కడ మూడు నిమిషాల Mp3 పాటలను డౌన్ లోడ్ చేసుకోవడానికి పదకొండు సెకనుల నుండి ఒకటిన్నర నిమిషాల సమయం పడుతుంది..
నాలుగవ తరం ఫోన్ లు (4 వ జనరేషన్ మొబైల్ నెట్‌వర్క్‌లు):
4G అనేది ఒక విధంగా మేజిక్ అని చెప్పవచ్చు… ఇవి మరిన్ని విలువ ఆధారిత సేవలను అందించేందుకు వీలుకుదురుతుంది.. 3G సర్వీసులో కన్నా 4G లో డాటా ట్రాన్స్ ఫర్ ఇంకా చాలా వేగంగా ఉంటుంది.. ఇక్కడ డాటాను 100MBPs to 1GBPS వేగంతో పంపించుకునే సౌలభ్యం దొరుకుతుంది.. అందువలన, ఈ సౌలభ్యాలు కలిగాయి… మొబైల్ మల్టీమీడియా… ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా… ఇంటిగ్రేటెడ్ వైర్ లెస్ , వీడియో కాలింగ్, వాయిస్ చాటింగ్, ఫైల్ ట్రాన్స్ ఫర్, సర్పింగ్, కాన్పరెన్సింగ్, చాటింగ్, నెట్ వర్కింగ్, పార్టీఇంగ్, అన్నీ మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు.. ఒక రకంగా దీనిని మొబైల్ బ్రాడ్ బాండ్ అనవచ్చు… లోపాలు: చాలా ఖరీదైన ఫోన్ సెట్ వాడవలసి ఉంటుంది.. బ్యాటరీ జీవితం చాలా చాలా తక్కువ.. సేవలు అమలు చేయడం చాలా చాలా కష్టం… డెన్మార్క్, నార్వే, స్వీడన్ లలో తప్ప మిగిలిన దేశాలలో ఇప్పుడిప్పుడె మొదలవుతున్నాయి.. అమెరికా, జర్మనీ, స్పెయిన్, చైనా, జపాన్ , మరియు ఇంగ్లాండులోని కొన్ని భాగాలలో వాడుతున్నారు…
ఐదవతరం 5G:
ఇది పూర్తిగా వైర్ లెస్ తో కూడినది… దీనికి హద్దులే లేవు… Wwww(wireless world wide web)కు కూడా సపోర్ట్ చేస్తుంది.. హైస్పీడ్ , హై కెపాసిటి, దీని డే టా ట్రన్స్ ఫర్ వేగం.. gbps లో ఉంటుంది… మల్టీ మీడియా న్యూస్ పేపర్, టి.విప్రోగ్రామ్ లు HD QUALITY తో పుర్తిగా చేతిలో చూడవచ్చు..
1.Castbox : ఇందులో మంచి మంచి పాడ్ క్యాస్ట్ లను మనం వినవచ్చు.
పాడ్ క్యాస్ట్ అంటే ఆడియో రూపంలో ఉన్న సమాచారం, చాలా మంచి మంచి అంశాలకు(కథలు ,విహార యాత్రలు , చరిత్ర, వ్యక్తిత్వ వికాసం) సంబంధించిన ఆడియో సమాచారం తెలుగు ఇంగ్లీష్ లలో వినవచ్చు. ఈ పాడ్ క్యాస్ట్ వలన లాభం ఏంటంటే, మనం పని చేసుకుంటూ కూడా ఎంతో విజ్ఞానాన్ని నేర్చుకోవచ్చు, ఉదాహరణకి వంట చేస్తూ కారు లేదా బైక్ తుడుస్తూ, ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఇలా అన్నమాట.
తెలుగులో ఉన్న మంచి మంచి పాడ్ క్యాస్ట్ లు ఉన్నాయి. నాకు బాగా నచ్చినవి కొన్ని కింద పోస్ట్ చేస్తున్నాను.
సాహిత్య రంగంలో ,సినిమారంగంలో ఉన్న గొప్ప వ్యక్తుల గురించి
2.FreeGurukul : ఎన్నో మంచి మంచి తెలుగు పుస్తకాలు పి డి ఎఫ్ లు ఇందులో అందుబాటులో ఉన్నాయి, విశేషం ఏంటంటే అన్నీ కూడా అంశాలవారీగా ఉంటాయి చక్కగా, నచ్చిన అంశానికి సంబంధించిన పుస్తకాలను సులువుగా మనం చదువుకోవచ్చు,వాటితో పాటుగా ఆ రోజు దినపత్రికల్లో వచ్చిన మంచి మంచి వార్తల సమూహారం ఇందులో మనం చదువుకోవచ్చు. అంతేకాదు మోటివేషనల్ వీడియోస్ కూడా అంశాలు వారీగా చూడవచ్చు.
3.NDL India: నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఇందులో మనం ఎన్నో వేల పుస్తకాలను చదువుకోవచ్చు . ముఖ్యంగా నాకు బాగా నచ్చింది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బడి పుస్తకాలు 1 నుంచి 10వ తరగతి వరకు అన్నీ ఇందులో అందుబాటులో ఉన్నాయి. నేను లాక్ డౌన్ లో కొన్ని తెలుగు పుస్తకాలు డౌన్లోడ్ చేసుకుని కథలు, పద్యాలు చదివాను.
జనవరిలో భారత విపణిలోకి అడుగుపెట్టిన ఈ వాహనం ఆనతి కాలంలో మంచి విజయవంతమైంది. ఎక్స్ షోరూంలో ఈ టూ-వీలర్ ప్రారంభ ధర లక్ష రూపాయలు. బజాజ్ బైక్స్ లో అత్యంత విజయవంతమైన చేతక్ స్కూటర్ పేరును ఈ వాహనానికి పెట్టేసరికి దీని ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఈ స్కూటర్ 3.8 కిలోవాట్, 4.1కిలోవాట్ విద్యుత్ మోటార్లను కలిగి ఉంది. అంతేకాకుండా లిథియం అయాన్ బ్యాటరీని బజాజ్ చేతక్ విద్యుత్ స్కూటర్లో పొందుపరిచారు. దీనికి ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామంటే నిరంతరాయంగా గరిష్ఠంగా 95 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అదే స్పోర్ట్ మోడ్ లో అయితే 85 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. చేతక్ ప్రీమియం ప్రొడక్ట్ లో హైక్వాలిటీ మెటీరియల్స్ పొందుపరిచారు. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, టచ్ స్విచ్ గేర్, డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ లాంచి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
ఏథర్ 450..
మనదేశానికి చెందిన ఏథర్ ఎనర్జీ అనే విద్యుత్ వెహికల్ స్టార్టప్ కంపెనీ విడుదల చేసిన ఏథర్ 450 స్కూటర్ కు మంచి ఆదరణ దక్కింది. కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్లు నిర్మించడమే లక్ష్యంగా వీటిని ఉత్పత్తి చేస్తుంది ఏథర్ ఎనర్జీ. 2018లో విడుదలైన 450 స్కూటర్ 2.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. ఈ వాహనానికి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఎకో మోడ్‌లో 75 కిలోమీటర్లు, స్పోర్ట్ మోడ్‌లో 55 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తుంది. ఏథర్ 450 ప్రారంభ ధర రూ.1.13 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. అంతేకాకండా ఈ వాహనం పూర్తిగా ఛార్జింగ్ ఎక్కాలంటే 5 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.27 సెకండ్లలోనే ఇది అందుకుంటుంది.
ఏథర్ 450ఎక్స్..
ఇటీవలే లాంచ్ అయిన ఈ వాహనానికి తక్కువ సమయంలో పాపులారిటీ దక్కించుకుంది. 450 మోడల్ తర్వాత భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ విద్యుత్ స్కూటర్ మంచి విక్రయాలు సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఏథర్ 450 ఎక్స్ విద్యుత్ మోటార్.. 6కిలోవాట్ల పవర్, 26ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్లో 2.9కేడబ్ల్యూహెచ్(కిలోవాట్ అవర్) సామర్థ్యమున్న బ్యాటరీని ఉపయోగించారు. దీంతో ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామంటే గరిష్ఠంగా 85కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీంతో ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామంటే గరిష్ఠంగా 85కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గత ఏథర్ మోడల్ స్టాండార్డ్ 450 కంటే 10కిలోమీటర్లు అధికం. గరిష్ఠంగా గంటకు 80కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. కేవలం 3.3సెకండ్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వరకు చేరుకోవచ్చు. 60 కిలోమీటర్ల వేగాన్ని 6.5 సెకండ్లలో అందుకుంటుంది. ఎక్స్ షోరూంలో ఈ వాహనం ప్రారంభ ధర రూ.1.49 లక్షలు.
టీవీఎస్ ఐక్యూబ్…
టీవీఎస్ సంస్థ విడుదల చేసిన ఈ విద్యుత్ స్కూటర్ జనవరి 25న భారత మార్కెట్లో విడుదలైంది. బజాజ్ చేతక్ వచ్చిన కొన్ని రోజులకే ఈ స్కూటర్ విపణిలోకి రావడం గమనార్హం. అంతేకాకుండా టీవీఎస్ సంస్థ విడుదల చేసిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషం. 4.4 కిలోవాట్ సామర్థ్యం కలిగిన విద్యుత్ మోటార్ ను కలిగి ఉంది. టీఎఫ్ టీ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ లాంటి ప్రత్యేకత ఇందులో ఉంది. టీవీఎస్ ఐ క్యూబ్ స్కూటర్ కు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామంటే గరిష్ఠంగా 75 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లవచ్చు. అంతేకాకుండా 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.2 సెకండ్లలోనే అందుకుంటుందీ స్కూటర్. ఎక్స్ షోరూంలో టీవీఎస్ ఐక్యూబ్ విద్యుత్ స్కూటర్ ప్రారంభ రూ.1.15 లక్షలు.
హీరో ఎలక్ట్రికా ఆప్టిమా..
పైన చెప్పిన విద్యుత్ స్కూటర్లన్నింటిలో అత్యంత ధర తక్కువైన విద్యుత్ స్కూటర్ హీరో ఎలక్ట్రికా ఆప్టిమా. ఈ వాహనాన్ని గతేడాది భారత విపణిలో విడుదల చేశారు. ఎక్స్ షోరూంలో దీని ప్రారంభ ధర రూ.41,770. గరిష్ఠంగా ఈ విద్యుత్ స్కూటర్ వెల రూ.68,721 వరకు ఉంది. హీరో ఆప్టిమా స్టాండర్డ్ వేరియంట్ కు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామంటే 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అదే ఎక్స్ టెండెడ్ వేరియంట్ అయితే స్టాండర్డ్ వేరియంట్ కంటే రెట్టింపుగా 110 కిలోమీటర్లు వెళ్లవచ్చు. పూర్తిగా ఛార్జింగ్ ఎక్కేందుకు 5 గంటల సమయం పడుతుంది. మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ స్కూటర్ లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్కూటర్ 250 వాట్ల బీడీఎల్ సీ మోటార్ ను అమర్చారు.
ప్రస్తుతం పోకో ఎక్స్2 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,499గా ఉంది. ఇంతకుముందు దీని ధర రూ.20,999గా ఉండేది. లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.19,999గా ఉండేది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ ను కూడా ఇందులో అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730G ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.
పోకో ఎక్స్2లో వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. 64 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్686 సెన్సార్ తో పాటు 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ టెర్టియరీ సెన్సార్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్లు కూడా ఉన్నాయి. సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు 20 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు.
ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్. 27W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా కేవలం 68 నిమిషాల్లోనే ఈ ఫోన్ ఫుల్ గా చార్జ్ అయిపోతుంది. 4జీ వోల్టే, వైఫై యూఎస్ బీ టైప్-సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లను కూడా ఇందులో అందించారు. పోకో ఎక్స్2లో హై రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ ఫీచర్ కూడా ఉంది.
హ్యుండాయ్ కార్లలో అత్యంత విజయవంతమవడమే కాకుండా మంచి విక్రయాలు అందుకున్న మోడల్ ఎలంత్రా. తాజాగా ఈ కారు డీజిల్ మోడల్ ను బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లో విడుదల చేసింది హ్యుండాయ్ సంస్థ.
రియంట్ల వారీగా హ్యుండాయ్ ఎలంత్రా మోడల్ ధర.. ఎక్స్ షోరూంలో ఈ సరికొత్త హ్యుండాయ్ ఎలంత్రా బీఎస్6 డీజిల్ కారు ధర వచ్చేసి రూ.18.70 లక్షలు. రెండు వేరియంట్లలో లభ్యమవుతున్నన ఈ వాహనం వేరియంట్ల వారీగా ధరలో వ్యత్యాసముంచింది. హ్యుండాయ్ ఎలంత్రా ఎస్ఎక్స్ వేరియంట్ ధర……….. రూ.18.70 లక్షలు హ్యుండాయ్ ఎలంత్రా ఎస్ఎక్స్(ఓ) వేరియంట్ ధర………… 20.65 లక్షలు.
ఎంఐ నోట్ బుక్ 14 ధర ఎంఐ నోట్ బుక్ 14లో రెండు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 256 జీబీ స్టోరేజ్ ఉన్న ల్యాప్ టాప్ ధర రూ.41,999కాగా, 512 జీబీ స్టోరేజ్ ఉన్న మోడల్ ధర రూ.44,999గా ఉంది. ఇందులో ఎన్వీడియా జీఫోన్స్ ఎంఎక్స్250 జీపీయూ ఉపయోగించిన మోడల్ ధరను రూ.47,999గా నిర్ణయించారు.
ఎంఐ నోట్ బుక్ 14 హారిజన్ ఎడిషన్ ధర ఎంఐ నోట్ బుక్ 14 హారిజన్ ఎడిషన్ విషయానికి వస్తే.. ఇందులో కూడా రెండు మోడళ్లు ఉన్నాయి. ఇంటెల్ కోర్ ఐ5 మోడల్ ధరను రూ.54,999గా నిర్ణయించారు. ఇంటెల్ కోర్ ఐ7 మోడల్ ధర రూ.59,999గా ఉంది. వీటికి సంబంధించిన సేల్ ఈరోజు ఎంఐ.కాంలో జరగనుంది.
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కార్డుతో దీన్ని కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్/క్యాష్ బ్యాక్ లభించనుంది. అయితే ఈ ఆఫర్ కేవలం నెలరోజులు మాత్రమే. 9 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
ఎంఐ నోట్ బుక్ 14 స్పెసిఫికేషన్లు ఇది విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 14 అంగుళాల ఫుల్ హెచ్ డీ+(1920×1080) డిస్ ప్లేను అందించారు. యాస్పెక్ట్ రేషియో 16:9గా ఉంది. 10వ తరం ఇంటెల్ ఐ5 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. డిస్ ప్లేకు అన్ని వైపులా కేవలం మూడు మిల్లీమీటర్ల అంచులు మాత్రమే ఉన్నాయి. దీని కారణంగా ల్యాప్ టాప్ లో బిల్ట్-ఇన్ వెబ్ కాం అందుబాటులో లేదు. కానీ షియోమీ ప్రత్యేకంగా యూఎస్ బీ వెబ్ క్యామ్ ను అందించింది. దీని బరువు 1.5 కేజీలు.
ఎంఐ నోట్ బుక్ 14 హారిజన్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు ఎంఐ నోట్ బుక్ 14 హారిజన్ ఎడిషన్ కూడా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంపైనే పనిచేస్తుంది. ఇందులో 14 అంగుళాల ఫుల్ హెచ్ డీ యాంటీ గ్లేర్ ఐపీఎస్ డిస్ ప్లేను అందించారు. స్క్రీన్ టు బాడీ రేషియో 91 శాతంగా ఉంది. 60 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్స్ ఫీచర్లను కూడా ఇందులో అందించారు. ఇందులో పదో తరం ఇంటెల్ కోర్ ఐ5, పదో తరం ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 512 జీబీ వరకు స్టోరేజ్ కెపాసిటీ ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో వైఫై 802.11ac, బ్లూటూత్ వీ5.0, రెండు యూఎస్ బీ 3.1 పోర్టులు, ఒక యూఎస్ బీ 2.0 పోర్టు, చార్జింగ్ కోసం యూఎస్ బీ టైప్-సీ పోర్టు ఉన్నాయి.
ధర, లభ్యత రియల్‌మి ఎక్స్ 3 రెండు వేరియంట్లలో లభ్యం. 6జీబీ ర్యామ్/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 24,999 రూపాయలు 8 జీబీ ర్యామ్,/ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 25,999 రూపాయలు
రియల్‌మి ఎక్స్3 సూపర్ జూమ్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ లోయర్ వేరియంట్ 27,999 రూపాయలు 12 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ 32,999 రూపాయలు
ఫ్లిప్‌కార్ట్ , రియల్‌మి వెబ్సైట్ ద్వారా జూన్ 30 నుంచి అందుబాటులో ఉంటాయి. జూన్ 27వ తేదీ నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం. హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ కార్డులు , ఈఎంఏ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్
రియల్‌మి ఎక్స్ 3 6.60 అంగుళాల డిస్ ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 16+ 8-మెగాపిక్సెల్ డబుల్ సెల్పీ కెమెరా 64+8+12+2-మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా 4200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
రియల్‌మి ఎక్స్ 3 సూపర్ జూమ్ 6.60 అంగుళాల డిస్ ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 32+8 మెగాపిక్సెల్ డబుల్ సెల్ఫీ కెమెరా 64+8+8+2 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా 4200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ 110 మోటార్ సైకిల్ ను భారత విపణిలో లాంచ్ చేసింది. ఎక్స్ షోరూంలో ఈ డ్రమ్ వేరియంట్ ధర వచ్చేసి రూ.65,700లుగా సంస్థ నిర్దేశించింది.
ఈ సరికొత్త మోటార్ సైకిల్ 130 ఎంఎం డ్రమ్ బ్రేకులను ఇరువైపులా కలిగి ఉంది. అంతేకాకుండా ఈ మోటార్ సైకిల్ డిస్క్ బ్రేక్ వేరియంట్ 117 కేజీల బరువుండగా.. ఈ సరికొత్త డ్రమ్ బ్రేక్ స్ప్లెండర్ ఐస్మార్ట్ వేరియంట్ 1కేజీ తక్కువ బరువుతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా డిస్క్ బ్రేక్ వేరియంట్ తో పోలిస్తే 2200 రూపాయల ధర కూడా తక్కువకు కూడా లభ్యం కానుంది.
ఇంజిన్..హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ డ్రమ్ వేరియంట్ 110 బైక్ .. 113.2సీసీ సింగిల్ సిలీండర్ ఇంజిన్ ను కలిగి ఉండి 9 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 9.89 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 4-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా మైలేజి కూడా ఎక్కువగా రానుంది. హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ మోడల్ లీటరుకు గరిష్ఠంగా 68 కిలోమీటర్లు వరకు మైలేజినిస్తుంది.
లగ్జరీ కార్లకు ప్రసిద్ధి గాంచిన సంస్థ బీఎండబ్లూ. ఇటీవలే ఈ జర్మన్ కార్ల తయారీ సంస్థ తన సరికొత్త ఎక్స్1 ఫేస్ లిఫ్ట్ మోడల్ భారత మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎస్ యూవీ కూపేను భారత విపణిలో లాంచ్ చేసింది. ఎక్స్5, ఎక్స్7 మధ్యలో ఉన్న ఈ సరికొత్త ఎక్స్6 కూపే అత్యాధునిక హంగులు ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. బీఎండబ్ల్యూ ఎక్స్6 కూపే పెట్రోల్ ఇంజిన్ ప్రారంభ ధర వచ్చేసి రూ.95 లక్షలు. ఎక్స్ డ్రైవ్ ఆల్ వీల్ సిస్టం, బీఎండబ్ల్యూ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది.
సరికొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంపులుతో అందుబాటులోకి వచ్చింది. బీఎండబ్ల్యూ ఎక్స్6 12.3-అంగుళాల స్క్రీన్లు, లైవ్ కాక్ పిట్, ఇంఫాట్ డ్రైవర్, ఇంఫోటైన్మెంట్ సిస్టం, బీఎండబ్ల్యూ లేటెస్ట్ సాఫ్ట్ వేర్ యూజర్ ఇంటర్ఫేస్ తదిత ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కూపే బేస్డ్ స్టైల్ డిజైన్ తో పాటు టూ-బాక్స్ ఎస్ యూవీ ఆకారంలో ఆకట్టుకుంటోంది. బీఎండబ్ల్యూ లేటెస్ట్ సాఫ్ట్ వేర్ యూజర్ ఇంటర్ ఫేస్ తో అందుబాటులోకి వచ్చింది.
ఇంజిన్..
బీఎడబ్ల్యూ ఎక్స్6 కూపే 3.0-లీటర్ ఇన్ లైన్ సిక్స్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 335 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 450 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. అంతేకాకుడా ఎక్స్ డ్రైవ్ ఆల్-వీల్ సిస్టం ద్వారా పవర్ ను అన్ని వీల్స్ కు చేరవేస్తుంది.
బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎక్స్ లైన్, ఎం స్పోర్ట్ ట్రిమ్ రెండింటి ధర కూడా 95 లక్షల రూపాయల వరకు అందుబాటులోకి వస్తుంది. ఈ వాహనానికి ప్రత్యక్షంగా ఆడీ క్యూ8, పోర్షే కేయానే కూపే, లెక్సస్ ఆర్ఎక్స్ లాంటి కార్లు భారత మార్కెట్లో వీటికి పోటీగా ఉన్నాయి. ధర కుండా తక్కువ అంతరంతోనే ఇవి భారత విపణిలోకి అందుబాటులోకి ఉండనున్నాయి.
ఈ వాహనం భారత్ లో అత్యధిక విక్రయాలు అందుకున్న కారుగా గుర్తింపు తెచ్చుకుంది. మారుతీ సుజుకీ ఆల్టో మోడల్ సగటున నెలకు 18 వేల నుంచి 20 వేల యూనిట్ల అమ్మకాలు అందుకుంది. ఫిబ్రవరిలో ఈ కారు అత్యధిక విక్రయాలు అందుకున్న వాటిలో మూడో స్థానంలో ఉంది. ఆరు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ వాహనం బీఎస్4 మోడల్ తో పోలిస్తే ధర కొంచెం ఎక్కువ. 796 సీసీ ఇంజిన్ ను కలిగి ఉండి 47 బ్రేక్ హార్స్ పవర్, 69 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి కాకుండా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టంతో కూడిన ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ వ్యవస్థ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, పవర్ విండోలు తదితర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు మైలేజి వచ్చేసి లీటరుకు గరిష్ఠంగా 24.7 నుంచి 22.05 కిలోమీటర్ల వరకు ఇస్తుంది.
బీఎస్6 మారుతీ సుజుకీ ఆల్టో 800 ధర రూ. 3.6 లక్షల నుంచి 4.39 లక్షల మధ్య ఉంది.
రెనాల్ట్ క్విడ్..
తక్కువ బడ్జెట్ కార్లలో అత్యదిక విక్రయాలు అందుకుని పాపులరైన వాహనాల్లో రెనాల్ట్ క్విడ్ ఒకటి. నెలకు సగటున 4 వేల యూనిట్లు అమ్మకాలు అందుకుందీ కారు. జనవరిలో భారత విపణిలో లాంచ్ అయిన బీఎస్6 రెనాల్ట్ క్విడ్.. పాత మోడల్ కంటే ధర కొంచెం పెరిగింది. బీఎస్6 వాహనాల్లో అతి తక్కువ ధరకు వస్తున్న ఈ వాహనం ఆకట్టుకుంటోంది. ఇంజిన్ అప్ డేట్ మినహా మిగతా అంతా బీఎస్4 మోడల్ మాదిరే ఉన్న ఈ రెనాల్ట్ క్విడ్ డిజైన్ హైలెట్ గా ఉంది. హెడ్ ల్యాంప్ సెటప్, 8-అంగుళాల ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్, ఎయిర్ బ్యాగులు, యాంటీ బ్రేకింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రీబ్యూషన్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో రెండు ఇంజిన్ల ఆప్షన్లు ఉన్నాయి. 0.8 లీటర్ ఇంజిన్ యూనిట్ అయితే 53 బ్రేక్ హార్స్ పవర్, 72 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే 1.0 లీటర్ ఇంజినైతే.. 67 బ్రేక్ హార్స్ పవర్, 91 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజిన్లు 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తోనే పనిచేస్తాయి.
బీఎస్6 రెనాల్ట్ క్విడ్ 0.8 లీటర్ ఇంజిన్ ఖరీదు రూ. 2.92 లక్షల నుంచి 4.22 లక్షల మధ్య ఉంది.
బీఎస్6 రెనాల్ట్ క్విడ్ 1.0 లీటర్ ఇంజిన్ ఖరీదు రూ. 4.42 లక్షల నుంచి 5.01 లక్షల మధ్య ఉంది.
హ్యుండాయ్ శాంత్రో..
బీఎస్6 హ్యుండాయ్ శాంత్రో మోడల్.. భారత మార్కెట్లో 2018లో వచ్చింది. ఈ సరికొత్త శాంత్రో ధర వచ్చేసి రూ.4.57 లక్షల నుంచి రూ.5.98 లక్షల మధ్య ఉంది. ఈ కారులో 7-అంగుళాల ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రివర్స్ పార్కింగ్ కెమెరా సెన్సార్లు లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. 4 అంగుళాల చక్రాలను కారుకు అమర్చారు. ఇక కారు లోపలి భాగంలో ఉన్న స్థలాన్ని చక్కగా వినియోగించారు. సీట్ల అమరిక చక్కగా ఉంది. ఈ కారులో తొలిసారిగా వెనుక సీట్లకు కూడా ఏసీ సౌకర్యాన్ని కల్పించారు. హ్యాండ్ రెస్ట్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారులో 4-సిలిండర్ మోటార్‌తో 1.1లీటర్ ఎప్సిలాన్ ఇంజిన్ ఉంది. ఇది 68 బీహెచ్పీ శక్తిని, 99 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. బీఎస్-6 నిబంధనలకు అనుకూలంగా ఈ కారును రూపొందించారు. కారు మైలేజీ విషయాన్నికొస్తే లీటర్ పెట్రోలుతో 20.3 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
టాటా టియాగో..
జనవరిలో లాంచ్ అయిన ఈ వాహనం పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 85 బ్రేక్ హార్స్ పవర్ 113 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. పాత మోడల్ తో పోలిస్తే బీఎస్6 వాహనంలో డిజైన్ ను కొద్దిగా మార్పులు చేశారు. ఫీచర్ల విషయానికొస్తే 7-అంగుళాల హర్మన్ ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ ప్యానెల్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ బ్రేకింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రీబ్యూషన్, రివర్స్ పార్కింగ్ కెమెరా లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బీఎస్6 టాటా టియాగో ధర రూ.4.6 లక్షల నుంచి 6.6 లక్షల మధ్య ఉంది. సేఫ్టీలోనూ ఈ వాహనంలో అత్యుత్తమగా ఉంది. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్లకు గాను 4 స్టార్ల రేటింగ్ ను తెచ్చుకుంది.
మారుతీ సుజుకీ వాగన్ ఆర్..
మారుతీ సుజుకీ నుంచి అత్యుత్తమ విక్రయాలు అందుకున్న మరో వాహనం వాగన్ ఆర్. ఇటీవల బీఎస్6 ఫార్మాట్లో అప్ డేట్ అయిన ఈ కారులో రెండు ఇంజిన్ల ఆప్షన్లు ఉన్నాయి. 1.0 లీటర్ ఇంజిన్ 67 బ్రేక్ హార్స్ పవర్, 90 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే 1.2 లీటర్ మోటార్ అయితే 83 బ్రేక్ హార్స్ పవర్, 115 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజిన్లు 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ లేదా ఆటోమేటిక్ లేదా ఏజీఎస్ ఆటోమేటిక్ ట్రాన్ మిషన్ వ్యవస్థతలతో పనిచేస్తాయి. ఇవి కాకుండా ఇందులో 7-అంగుళాల ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ ప్యానెల్, ఆల్ ఫోర్ పవర్ విండోలు, యాంటీ బ్రేకింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రీబ్యూషన్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు లాంటి సేఫ్టీ ఫీచర్లూ దీని సొంతం.
1.0 లీటర్ మారుతీ సుజుకీ వాగన్ ఆర్ ధర రూ.4.42 లక్షల నుంచి 5.42 లక్షల మధ్య ఉంది.
1.2 లీటర్ మారుతీ సుజుకీ వాగన్ ఆర్ ధర రూ.5.10 లక్షల నుంచి 5.91 లక్షల మధ్య ఉంది.
మారుతీ సుజుకీ సెలేరియో..
ఇటీవలే ఈ కారును బీఎస్6 ఫార్మాట్లోకి అప్డేట్ చేసి భారత మార్కెట్లో లాంచ్ చేసింది మారుతీ సుజుకీ. ఈ వాహనం 1.0-లీటర్ 3-సిలీండర్ల పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉండి 68 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 90 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే సీఎంజీ వాహనమైతే.. 59 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 78 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. ఈ సరికొత్త కారులో ఫీచర్లకు కొదవే లేదు. టచ్ స్క్రీన్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. మారుతీ సుజుకీ వాగన్ ఆర్ తో పోలిస్తే ఈ వాహనం ధర దాదాపు 5 వేల రూపాయల తక్కువ. ఎక్స్ షోరూంలో మారుతీ సుజుకీ సెలేరియో వాహనం ధర వచ్చేసి రూ.4.41 లక్షల నుంచి 5.58 లక్షల మధ్య ఉంది.
వేరియంట్ల వారీగా మారుతీ సుజుకీ ఎస్-సీఎన్జీ ధర..
ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర రూ.4.84 లక్షలు. నాలుగు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ వాహనం వేరియంట్ల వారీగా ధరలో వ్యత్యాసముంచింది.
ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర............ రూ.4.84 లక్షలు
ఎల్ఎక్స్ఐ (ఓ) వేరియంట్ ధర............ రూ.5.07 లక్షలు
వీఎక్స్ఐ వేరియంట్ ధర.............. రూ.4.90 లక్షలు
వీఎక్స్ఐ వేరియంట్ ధర.............. రూ.5.07 లక్షలు.
ఇంజిన్..
మారుతీ సుజుకీ ఎస్-ప్రెసో సీఎన్జీ మోడల్ 998సీసీ, మూడు సిలీండర్ల ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 58 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 70 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. అయితే పెట్రోల్ వేరియంట్ కంటే పవర్ ఔట్ పుట్ గణంకాలు తక్కువగా ఉన్నాయి. మారుతీ సుజుకీ ఎస్-ప్రెసో పెట్రోల్ వేరియంట్ 67 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 90 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తూ 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది.
మారుతీ సుజుకీ సెలేరియో
మారుతీ సుజుకీ తన సరికొత్త సెలేరియో మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వేరియంట్లను ఇప్పటికే విపణిలో లాంచ్ చేసిన ఈ సంస్థ తాజాగా సీఎన్జీ(కంప్రెసెడ్ నేచురల్ గ్యాస్) వేరియంట్ ను బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లోకి వదిలింది. ఎక్స్ షోరూంలో మారుతీ సుజుకీ సేలెరియో మోడల్ ప్రారంభ ధర వచ్చేసి రూ.5.61 లక్షలు. రెండు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. వీఎక్స్ఐ, వీఎక్స్ఐ(ఓ) వేరియంట్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు.
వేరియంట్ల వారీగా మారుతీ సుజుకీ సెలేరియో ధర..
ఎక్స్ షోరూంలో ఈ కారు ధర వచ్చేసి రూ.5.61 లక్షలు. దీని బీఎస్4 మోడల్ తో పోలిస్తే దాదాపు 30 వేల రూపాయల వరకు పెరగనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సరికొత్త బీఎస్6 మారుతీ సుజుకీ సెలేరియో సీఎన్జీ వేరియంట్ పవర్ ఔట్ పుట్ వివరాలు సంస్థ ఇంకా బహిర్గతపరచలేదు. అయితే బీఎస్4 మోడల్ మాదిరే పవర్ ఔట్ పుట్ ఉంటుందని అంచనా. బీఎస్4 మారుతీ సుజుకీ సెలేరియో పెట్రోల్ వాహనం 1.0-లీటర్ కే10 యూనిట్ ను కలిగి ఉండి 68 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 90 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. అదే సీఎన్జీ వేరియంటైతే 59 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 78 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజి కూడా ఈ వాహనం తగ్గనుంది. ఇది 30.47 కీమీ/కేజీ వరకు ఇవ్వనుంది. బీఎస్4 మోడల్ తో పోలిస్తే 1.27 కిమీ/కేజీలు తగ్గనుంది.
భారత మార్కెట్లో ఈ కారుకు పోటీగా హ్యుండాయ్ శాంత్రో పోటీగా ఉంది. శాంత్రో సీఎన్జీ మోడల్ కూడా మ్యాగ్నా, స్పోర్ట్జ్, వేరియంట్లో లభ్యమవుతుంది. ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి 5.85 లక్షలు. దీని టాప్ వేరియంట్ ధర వచ్చేసి రూ.6.20 లక్షల
ఆడీ ఇండియా లైనప్ లో చౌకగా దొరిగే కార్లలో ఆడీ ఏ3 మోడల్ ముందువరుసలో ఉంది. ఈ ఏ3 సెడాన్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో విజయవంతమై మంచి విక్రయాలు అందుకుంది. మనదేశంలోనూ ఈ వాహనానికి మంచి ఆదరణ దక్కింది. భారత మార్కెట్లో ఈ వాహనం ధర వచ్చేసి రూ.29.2 లక్షల నుంచి రూ.32.21 లక్షల మధ్య ఉంది. లగ్జరీ సిగ్మెంట్లో ఇంత తక్కువ ధరకు దొరికే వాహనం ఇదే కావడం గమనార్హం. ఈ ఆడీ ఏ3 పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. 1.4 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా విభిన్నమైన అనుభూతిని కలుగుతుంది.
ఆడీ క్యూ3..
తక్కువ ధరకు అందుబాటులో వచ్చే కార్ల జాబితాలో తర్వాత వస్తున్న వాహనం ఆడీ క్యూ3. భారత్ లో ఈ ఎస్ యూవీ అత్యంత చౌకగా రావడమే కాకుండా కంపెనీ పోర్ట్ ఫొలియోలో అత్యుత్తమ వాహనంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆడీ ఏ3 మోడల్ మాదిరి ఇందులోనూ 1.4-లీటర్ పెట్రోల్, 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంది. ఈ ప్రీమియం ఎస్ యూవీ ఆఫ్ రోడ్ ఆఫ్ రోడింగ్ కెపాబిలిటీలతో సరికొత్త డ్రైవింగ్ డైనమిక్స్ తో అందుబాటులోకి రానుంది. ఈ ఎస్ యూవీ ధర వచ్చేసి రూ.34.96 లక్షల నుంచి రూ.43.61 లక్షల మధ్య ఉంది. ఈ సిగ్మెంట్లో తర్వాతి తరం క్యూ3 మోడల్ నూ 2020 మధ్యలో విడుదల చేసే అవకాశముంది.
ఆడీ ఏ4..
భారత్ లో ఆడీ వాహనాల్లో అత్యధిక విక్రయాలు సాధించిన మోడల్ ఆడీ ఏ4. ఎక్స్ షోరూంలో ఈ వాహనం ఖరీదు వచ్చేసి 41.96 లక్షల నుంచి రూ.46.96 లక్షల మధ్య ఉంది. అయితే దీని పాత మోడల్ తో పోలిస్తే ఆడీ ఏ4 వాహనం ధర కొంచెం ఎక్కువగా ఉంది. విభిన్నమైన డ్రైవింగ్ అనుభూతితో పాటు ఈ కారులో సరికొత్త ఫీచర్లు, అధునాతన సాంకేతికతను ఇందులో పొందుపరిచారు. ఆడీ ఏ4 వాహనం 1.4-లీటర్ పెట్రోల్ మోటార్ ను కలిగి ఉండి 150 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఆడీ ఏ4 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ను కూడా కలిగి ఉంది. ఇది 188 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 400 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఆడీ ఏ6..
ఈ జాబితాలో చివరగా వస్తున్న మోడల్ ఆడీ ఏ6. గతేడాదే భారత్ లోఈ మోడల్ కు చెందిన ఆరో తరం ఆడీ ఏ6 వాహనాన్ని భారత మార్కెట్లో లాంచ్ చేసిందీ సంస్థ. ఈ కారు లాంచ్ అయినప్పటీ నుంచి దేశవాళీగా కొనుగోలుదారు నుంచి పోటీ తీవ్రంగా ఉంది. ఈ లగ్జరీ ఏ6ను సెలబ్రెటీలు కూడా కొనుగోలు చేయడంతో దీని పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. భారత మార్కెట్లో ఈ కారు ధర వచ్చేసి రూ.54.42 లక్షల నుంచి 59.92 లక్షల మధ్య ఉంది. ఈ సిగ్మెంట్లో అత్యంత చౌకగా దొరుతున్న వాహనం ఇదే కావడం విశేషం. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ వాహనం 2.0-లీటర్ టీఎఫ్ఎస్ఐ ఇంజిన్ ను కలిగి ఉండి 245 పీఎస్ పవర్, 370 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది.
ప్రస్తుతం ఆడీ ఏ సిరీస్ ఆడీ ఏ8 మోడల్ ను ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్ షోరూంలో దీని ధర వచ్చేసి రూ.1.56 కోట్ల మధ్య ఉంది. పైన చెప్పిన ఈ వాహనాలు కాకుండా ప్రస్తుతం ఈ జర్మనీ కారుమేకర్ భారత్ లో 12 మోడళ్లను విక్రయానికి ఉంచింది.
స్పోర్ట్స్ బైక్స్ ను ఇష్టపడేవాళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా 1000 సీసీ ఇంజిన్ సామర్థ్యమున్న మోటార్ సైకిళ్లకు డిమాండ్ పెరిగిపోతుంది.
బైక్ ఎంతా.. 20 లక్షలు.. 20 లక్షలా కారే కొనుక్కోవచ్చుగా” ఈ డైలాగ్ వింటుంటే గమ్యం సినిమా గుర్తుకువస్తుంది కదూ..! ఆ సినిమాలోని ఈ పంచ్ కు నవ్వు ఆపుకులేం. అంతేకదా 20 లక్షలుంటే కారు కొనుక్కోవచ్చుగా బైక్ ఎందుకు అని చాలా మందికి సందేహం కలుగుతుంది. అయితే అందుకు కారణం లేకపోలేదు. స్పోర్టీ లుక్ తో ఉండి మంచి పికప్, మెరుగైన ఇంజిన్ ప్రదర్శనతో స్టైలిష్ గా ఉంటూ బైక్ ప్రియుల మనసుదోచేస్తుంటాయి ఈ మోటార్ సైకిళ్లు. ఎంతలా అంటే వాహనాలను ఇష్టపడేవారికి ఒక్కసారైన వాటిపై రైడ్ చేయాలని ఆశపడుతుంటారు. కనీసం 1000సీసీ ఇంజిన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే ఈ బైక్స్ స్పోర్టీ డిజైన్ లుక్ తో ఉండటం వల్లే వీటి ధర అంతగా ఉంటాయి. అంతేకాదు వీటిని సాధారణ రోడ్లపై డ్రైవ్ చేస్తే విభిన్నమైన రైడింగ్ అనుభూతిని ఆస్వాదించలేం. తగిన రేస్ ట్రాక్స్ ఉంటే వీటి అసలైన డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ ను పొందవచ్చు. ముఖ్యంగా భారీ ట్యాంకు కలిగి ఉండే ఈ స్పోర్ట్స్ మోటార్ సైకిళ్ల వాడకం భారత్ లో ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఎంతో మంది ఔత్సాహికులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. మరి ఇండియాలో 20 లక్షల కంటే తక్కువ కాస్ట్ లో అత్యుత్తమ స్పోర్ట్స్ బైక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
కవాసాకి నింజా జెడ్ఎక్స్-10ఆర్..
ఈ స్పోర్ట్స్ మోటార్ సైకిల్ ను గతేడాదే భారత మార్కెట్లో విడుదల చేసింది కవాసాకి సంస్థ. 998సీసీ నాలుగు సిలీండర్ల లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ మోటార్ సైకిల్ 200 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 115 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా నింజా జెడ్ఎక్స్-10ఆర్ ఇంజిన్ 6-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఇందులో ఉన్న క్విక్ షిఫ్టర్ డ్యూయల్ డైరెక్షన్ వ్యవస్థ ద్వారా క్లచ్ ఉపయోగించుకుండానే గేర్ మార్చుకునే సౌలభ్యముంది. ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ ఇందులో మరో హైలెట్. దీని ద్వారా స్పీడ్, ట్యాకో మీటర్, ట్రిప్ మీటర్, గేర్ షిఫ్ట్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సెమీ ఫ్లోటింగ్ బ్రెంబో డిస్కులు ముందు భాగంలో, సింగిల్ డిస్క్ వెనక భాగంలో అమర్చారు. కవాసాకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ బైక్ లో రైడర్ సేఫ్టీ కోసం ఎలక్ట్రానిక్ ఎనహాన్సింగ్, స్పోర్ట్స్ కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్, కవాసాకి లాంచ్ కంట్రోల్ మోడ్, కానసర్నింగ్ మేనేజ్ మెంట్ ఫంక్షన్, కవాసాకి ఇంటిలిజెంట్ ఏబీఎస్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కవాసాకి నింజా జెడ్ఎక్స్ 10-ఆర్ మోటార్ సైకిల్ ధర వచ్చేసి రూ.14 లక్షలు.
హోండా సీబీ1000ఆర్ఆర్..
ఈ సరికొత్త హోండా సీబీ1000ఆర్ఆర్ మోటార్ సైకిల్ 999సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉండి 189 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 114 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 6-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ మోటార్ సైకిల్లో స్లిప్పర్ క్లచ్, క్విక్ షిఫ్టర్ ద్వారా హై ఆర్బీఎం రేంజ్ వద్ద గేర్ ను త్వరగా మార్చుకోవచ్చు. ఈ హోండా సీబీ1000ఆర్ఆర్ బైక్ లో స్పీడ్, ఆర్బీఎం, ఫ్యూయల్ గేజ్ లాంటి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం టీఎఫ్టీ-ఎల్సీడీ స్క్రీన్ ను కలిగి ఉంది. సేఫ్టీ కోసం ఈ మోటార్ సైకిల్లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టం, ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేకులు ఇందులో ఉన్నాయి. ఈ సరికొత్త హోండా సీబీ 1000ఆర్ఆర్ మోటార్ సైకిల్ ధర వచ్చేసి రూ.16.41 లక్షలు.
సుజుకీ జీఎస్ఎక్స్-ఆర్1000ఆర్..
సుజుకీ జీఎస్ఎక్స్ ఆర్1000ఆర్ మోటార్ సైకిల్ రేస్ బైక్ మాదిరి ఉంది. 999.8సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉండి 199 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 118 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 6-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. స్లిప్పర్ క్లచ్ ఈజీ డౌన్ షిఫ్టులు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ ప్యానెల్ ఉంది. దీని ద్వారా ట్యాకో మీటర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, ఫ్యూయల్ గేజ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ సేఫ్టీ ఫీచర్ల దగ్గరకొస్తే బ్రెంబో డిస్క్ బ్రేకులు, ట్రాక్ బ్రేక్ సిస్టం, మోషన్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ సిస్టం లాంటి భద్రతాపరమైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఎక్స్ షోరూంలో ఈ స్పోర్ట్స్ బైక్ ధర వచ్చేసి రూ.19.81 లక్షలు.
బీఎండబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్..
బీఎండబ్ల్యూ నుంచి లేటెస్ట్ విడుదలైన ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది. ఈ స్పోర్ట్స్ బైక్ 999సీసీ ఇన్ లైన్ ఫోర్ సిలీండర్, వాటర్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 204 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 113 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా బీఎండబ్ల్యూ మోటార్ సైకిల్ షిఫ్ట్ క్యామ్ టెక్నాలజీ ఇంప్రూవ్డ్ ట్రాటిల్ రెస్పాన్స్ తో అందుబాటులోకి వచ్చింది. బీఎండబ్ల్యూ 1000ఆర్ఆర్ మోటార్ సైకిల్ 6.5-అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్ లాంటి ప్రత్యేకతలు దీని సొంతం. సేఫ్టీ ఫీచర్ల దగ్గరకొస్తే డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్, డైనమిక్ డ్యాంపింగ్ కంట్రోల్ సిస్టం లాంటివి ఉన్నాయి. అంతేకాకుండా రేస్, స్పోర్ట్, రేయిన్ రైడింగ్ మోడ్ లో ఈ స్పోర్ట్స్ బైక్స్ ప్రయాణిస్తుంది. ట్విన్ ఫ్రంట్ డిస్క్ బ్రేకులు, సింగిల్ రేర్ డిస్క్ బ్రేకులు ఇందులో ఉన్నాయి. బీఎండబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్ ధర వచ్చేసి రూ.18.5 లక్షలు. బీఎండబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్ ప్రో ధర అయితే రూ.20.95 లక్షలు.
యమహా వైజెడ్ఎఫ్-ఆర్1..
ఈ యమహా వైజెడ్ఎఫ్-ఆర్1 మోటార్ సైకిల్.. 998సీసీ ఇన్ లైన్ ఫోర్ సిలీండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 197 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 112 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా సిక్స్ స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. మల్టిపుల్ డిస్క్ వెట్ క్లచ్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. యమహా వైజెడ్ఎఫ్-ఆర్1 ఫీచర్లు దగ్గరకొస్తే 4.2-అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్ ఇందులో ఉంది. దీని ద్వారా స్పీడు, ట్రిప్ మీటర్, ట్యాకో మీటర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ లాంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ సింగిల్ డిస్క్ బ్రేక్, రేసింగ్ ఏబీఎస్ విత్ యూబీఎస్ లాంటి ఫీచర్లు దీని సొంతం. ఎక్స్ షోరూంలో యమహా వైజెడ్ఎఫ్-ఆర్1 మోటార్ సైకిల్ ధర వచ్చేసి రూ.20.39 లక్షలు.
సుజుకీ హాయబుసా..
సూపర్ బైక్స్ ను ఇష్టపడేవాళ్లకు సుజుకీ హాయబుసా డ్రీమ్ మోటార్ సైకిల్ అని చెప్పవచ్చు. గత డిసెంబరులో సుజుకీ హాయబుసా 2020 మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ ధర వచ్చేసి రూ.13.74 లక్షలుగా నిర్దేశించింది. ఈ 2020 హాయబుసా మోటార్ సైకిల్ కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. మెటాలిక్ థండర్ గ్రే, క్యాండీ డెరింగ్ రెడ్ రంగుల్లో లభ్యమవుతుంది. 1340 సీసీ ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ 2020 సుజుకీ హాయబుసా బైక్.. 197 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 115 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.74 సెకండ్లలోనే అందుకుంటుందీ వాహనం. గరిష్ఠంగా గంటకు 299 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది.
బీఎస్4 మోటార్ సైకిళ్లతో పోలిస్తే తాజాగా వస్తున్న బీఎస్6 బైక్స్ ధర పెరగడం గమనిస్తున్నాం. ఇంజిన్ అప్ డేట్ తో కొన్ని సాధారణ మార్పులతో వస్తున్న ఈ సరికొత్త ద్విచక్రవాహనాల్లో చౌకగా దొరికే వాహనాలు ఉన్నాయి. వాటిలో బీఎస్6 హీరో హెచ్ఎఫ్ డీలక్స్, స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ లాంటి టూ-వీలర్లు బైక్ ప్రియులను ఊరిస్తున్నాయి.
కాలుష్య నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్ ఒక్కటే అప్ డేట్ చేసినప్పటికీ ధర మాత్రం దాదాపు అన్ని బైక్స్ లోనూ పెంచేశాయి టూ-వీలర్ కంపెనీలు. ఈ నేపథ్యంలో బీఎస్6 మోటార్ సైకిళ్లలో చౌకగా దొరికే వాటికోసం ఎదురుచూస్తున్నారు చాలామంది. వీటిలో హీరో, హోండా, టీవీఎస్ లాంటి ద్విచక్రవాహన సంస్థలకు చెందిన కొన్ని బీఎస్6 బైక్స్ అతి తక్కువ ధరకే మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
బీఎస్6 హీరో హెచ్ఎఫ్ డీలక్స్..
ఎక్స్ షోరూంలో బీఎస్6 హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ధర 55,925 నుంచి 57,250 రూపాయల మధ్య ఉంది. మనదేశలో అత్యంత చౌకైన బీఎస్6 బైక్స్ లో ఈ మోటార్ సైకిల్ ముందువరుసలో ఉంది. ఇది రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. సెల్ఫ్ స్టార్ట్ అల్లాయ్ వీల్, సెల్ఫ్ స్టార్ట్ అల్లాయ్ వీల్ ఐ3ఎస్ అనే రెండు వేరియంట్లలో దీనిని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ కమ్యూటర్ మోటార్ సైకిల్లో సరికొత్త బాడీ గ్రాఫిక్స్, కొత్త కలర్ ఆప్షన్లను పొందుపరిచారు. 100 సీసీ ఇంజిన్ ను కలిగి ఉన్న బీఎస్6 హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్.. 8 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 8ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఐడెల్ స్టార్ట్ స్టాప్ వ్యవస్థ అయిన ఐ3ఎస్ వల్ల ఇంధన వినియోగాన్ని తగ్గించుకునే సౌలభ్యాన్ని ఇందులో పొందుపరిచారు.
బీఎస్6 హీరో స్ప్లెండర్ ప్లస్..
చౌకగా దొరుకుతున్న బీఎస్6 మోటార్ సైకిళ్ల జాబితాలో వస్తున్న మరో బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్. ఈ ఐకానిక్ బీఎస్6 స్ప్లెండర్ ప్లస్ ధర 59,600 నుంచి 63,110 రూపాయల మధ్య ఉంది. అయితే కొత్త కలర్ ఆప్షన్లో రావడం మినహా దీని డిజైన్, ఇతర ఫంక్షనల్స్ లో ఎలాంటి మార్పు లేదు. ఈ వాహనంలో వచ్చిన మరో పెద్ద మార్పు ఏమైనా ఉందంటే అది ఇంజినే. పవర్ డెలివరీని మెరుగుదల కోసం హీరో స్ప్లెండర్ ప్లస్ కార్పురేటర్ ను తొలగించారు. 100 సీసీ ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ బైక్ 8 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్ 8 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్, ఐ3ఎస్ టెక్నాలజీతో కూడిన సెల్ఫ్ స్టార్ట్ వచ్చే వేరియంట్ తో కలిపి మూడు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది.
బీఎస్6 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్..
సరికొత్త ఎల్ఈడీ హెడ్ లైట్, రేర్ వ్యూ మిర్రర్లకు సరికొత్త డిజైన్, రివర్క్ ఫెయిరింగ్ తో న్యూ లుక్ లో కనువిందు చేస్తోంది బీఎస్6 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర 62,043 నుంచి 62,534 రూపాయల మధ్య ఉంది. 5-స్టెప్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్లు, స్పోర్టీ మఫ్లర్, యూఎస్ బీ మొబైల్ ఛార్జర్, న్యూ సెమీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ ప్యానెల్ ప్రత్యేకతలు బీఎస్4 స్టార్ సిటీ ప్లస్ వాహనంలో ఉన్నాయి. అంతేకాకుండా 110 సీసీ ఫ్యూయల్ ఇంజెక్టడ్ ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ వాహనం 4-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ బైక్ ఇంజిన్ 8 బీహెచ్ పీ పవర్, 9 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది.
బీఎస్6 హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్..
మనదేశంలో బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన బైక్ హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర 64,900 రూపాయలుగా నిర్దేశించింది. పాత మోడల్ తో పోలిస్తే బీఎస్6 హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్ లో.. సరికొత్త డైమండ్ ఫ్రేమ్ ను అమర్చారు. అంతేకాకుండా ఈ ద్విచక్రవాహనంలో గ్రౌండ్ క్లియరెన్స్ నూ మెరుగుపరిచారు. దీంతోపాటు ఈ మోటార్ సైకిల్ సస్పెన్షన్ ను ఇంప్రూవ్ చేసి రైడ్ క్వాలిటీని పెంచారు. ఈ కమ్యూటర్ బైక్.. 9 బీహెచ్ పీ పవర్, 10 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
బీఎస్6 హోండా షైన్..
గత నెలలో హోండా షైన్ బైక్ ను బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా మార్చారు. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర 67,857 నుంచి 72,557 రూపాయల మధ్య ఉంది. బీఎస్4 మోడల్ తో పోలిస్తే బీఎస్6 హోండా షైన్ ఖరీదు 9,500 రూపాయలు పెరిగింది. శుద్ధమైన ఇంజిన్, సరికొత్త ఫీచర్లు, ట్రాన్స్ మిషన్ వ్యవస్థలతో ఈ బండి ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా సైడ్ కవర్లు, బాడీ గ్రాఫిక్స్, క్రోమ్ ఎక్సాహాస్ట్ కవర్ నూ అప్ డేట్ చేశారు. ఏసీజీ సైలెంట్ స్టార్ట్ సిస్టం ఈ మోటార్ సైకిల్లోని మరో ప్రత్యేకత. ఈ సరికొత్త హోండా షైన్ 124 సీసీ ఇంజిన్ ను కలిగి ఉండి 10.5 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 11 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఇది 5-స్పీడ్ గేర్ బాక్స్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. అయితే దీని బీఎస్4 మోడల్ 4-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థను కలిగి ఉంది.
ప్రముఖ ద్విచక్రవాహన సంస్థ బజాజ్ తన పల్సర్ 125 స్ప్లిట్ సీటు వేరియంట్ బైక్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్ షోరూంలో ఈ సరికొత్త మోటార్ సైకిల్ ధర వచ్చేసి రూ.79,091లుగా సంస్థ నిర్దేశించింది.
పల్సర్ బైక్ అంటే కుర్రకారులో ఎంతో క్రేజ్. బజాజ్ సంస్థ పల్సర్ మోడల్ ను లాంచ్ చేసినప్పటి నుంచి ఎప్పటికప్పుడు యువత ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారు. ఇటీవలే ఈ సంస్థ పల్సర్ లైనప్ లో 125 సీసీ మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా ఈ మోడల్లో స్ప్లిట్ సీటు వేరియంట్ ను లాంచ్ చేసింది. ఈ సరికొత్త బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీటు వేరియంట్ ధర వచ్చేసి ఎక్స్ షోరూంలో రూ.79,901లుగా సంస్థ నిర్దేశించింది. ఈ లైనప్ లో భారత మార్కెట్లోకి వచ్చిన టాప్ రేంజ్ మోటార్ సైకిల్ ఇదే కావడం విశేషం.
ప్రత్యేకతలు..
ఈ సరికొత్త వేరియంట్ అత్యాధునిక ఫీచర్లు, ఎక్విప్మెంట్ ను అలాగే కొనసాగించారు. తోడేలు కంటి ఆకారంలో (వోల్ఫ్ ఐడ్) హెడ్ ల్యాంపు క్లస్టర్, ట్విన్ పైలట్ ల్యాంపులు, ట్విన్ స్ట్రిప్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు లాంటివి ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ట్యాంకుపై 3డీ లోగో, సరికొత్త బ్లాక్ అల్లాయ్ వీల్స్, స్పోర్టీ స్ప్లిట్ గ్రాబ్ రెయిల్స్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ఈ పల్సర్ 125సీసీ మోడల్లో డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్లతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా మూడు సరికొత్త కలర్ ఆప్షన్లతో వచ్చింది. నియాన్ గ్రీన్-మ్యాటీ బ్లాక్, బ్లాక్-సిల్వర్, బ్లాక్-రెడ్ కలప్ ఆప్షన్లతో దీన్ని సొంతం చేసుకోవచ్చు.
బీఎస్6 పల్సర్ 125 స్ప్లిట్ సీట్ వేరియంట్
ఇంజిన్..
సరికొత్త బజాజ్ పల్సర్ 125 మోటార్ సైకిల్ బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. 124సీసీ సింగిల్ సిలీండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంది. అంతేకాకుండా 11 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 10.8 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా పల్సర్ 125 స్ప్లిట్ సీటు వేరియంట్లో ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్కులు, రేర్ బ్రేకింగ్ సెటప్ ను కలిగి ఉంది. అంతేకాకుండా 240 ఎంఎం ఫ్రంట్ డిస్క్ వేరియంట్, 130 ఎంఎం వెనక డ్రమ్ బ్రేక్స్, సింగిల్ ఛానెల్ ఏబీఎస్ తో అందుబాటులోకి వచ్చింది.
ఆండ్రాయిడ్ మొబైల్ స్లో గా లోడ్ అవుతుందా ? స్లో గా లోడ్ అవడం వలన చాలా చికాకుగా అనిపిస్తూ వుంటుంది కదా ?
ఈ ఆర్టికల్ లో ఇవ్వబడిన కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా మన ఆండ్రాయిడ్ మొబైల్ ను మునుపటికంటే వేగంగా చేయవచ్చు . దీనికోసం ఎటువంటి software ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే , మొబైల్ లో ఉన్న కొన్ని సెట్టింగ్ లు మార్చడం ద్వారా ఈ పని చేయవచ్చు .
ఈ సెట్టింగ్ లను మార్చాలంటే ముందుగా మొబైల్ ను Developer Mode లోకి మార్చాల్సి ఉంటున్నది .
మొబైల్ ను Developer Mode లోకి ఎలా మార్చాలి ?
ముందుగా సెట్టింగ్ లోకి వెళ్లి Developer ఆప్షన్స్ లోకి వెళ్ళాలి. developer ఆప్షన్స్ లేదంటే , About Devices ఆప్షన్ పైన Tap చేస్తే వచ్చే screen లో Build Number ఆప్షన్ వుంటుంది.
Build Number ఆప్షన్ పైన 7 సార్లు Tap చేస్తే మొబైల్ లో Developer ఆప్షన్ వస్తుంది .తర్వాత Settings screen లోకి వెళ్ళితే Developer ఆప్షన్ కనబడుతుంది . ( సెట్టింగ్స్ స్క్రీన్ లో చూడండి )
Developer ఆప్షన్ లో చివర లో Windows Animation Scale,Trasaction Animation Scale,Animatio Duration Scale ఆప్షన్స్ చూడవచ్చు , అది Default గా 1X సెట్ చేయబడివుంటుంది ( 1x నుండి 10 x వరకు ఉంటాయి).
Anmation Off చేయోచ్చు లేదంటే తగ్గించుకోవడం (0.5) చేయాలి.Windows వేగం గా లోడ్ అవడం గమనించవచ్చు
Developer ఆప్షన్ లో Apps సెక్షన్ లో Do Not Keep Activities , Check Box సెలెక్ట్ చేయడం ద్వారా ఉపయోగించే App నుండి Exit అయితే Background లో App రన్ అవకుండా close అవుతుంది .
దీని ద్వారా మొబైల్ వేగం గా వుంటుంది . కానీ whatsapp , facebook app లు close చేసినా కూడా Background లో రన్ అవాల్సిన అవసరం లేదనుకొన్న వారు ఈ ఆప్షన్ ఉపయోగించవచ్చు .
ఒకేసారి ఒకటికంటే ఎక్కువ Apps రన్ అవుతున్నప్పుడు , కొన్ని సమయాల్లో ఒకటి తర్వాత ఒకటి ఓపెన్ చేస్తూ ఉంటాము కదా ? అలా ఎన్ని apps ఓపెన్ కావాలనే Limit సెట్ చేసుకోవచ్చు .
Default గా Standrd వుంటుంది (ఓపెన్ చేసిన Apps లో ఏ App కయినా మారే అవకాసం వుంటుంది ) . Apps మనకు Background లో ఎన్ని కావాల్సిన Number ( 1 నుండి 4 ) సెట్ చేసుకోవచ్చు . ఒకటి కూడా వద్దనుకొంటే No Background Processes సెట్ చేసుకోవచ్చు .
ఇప్పుడు విద్యార్థులు దగ్గర నుంచి ఆఫీసు పనులు చేసే వాళ్లు కూడా కచ్చితంగా లాప్టాప్ అవసరం పడుతుంది. అయితే ఈ ల్యాప్ టాప్ నిజంగా ముఖ్యమైన లేకపోతే పని ఏమి జరగదేమో అలా అయిపోయింది. ఇప్పుడు అయితే ఎప్పుడూ ఎక్కువ రేట్లు పెట్టి లాప్‌టాప్‌లు కొనడం కష్టమై పోతుంది కాబట్టి సులువుగా తీసుకెళ్లి లాప్టాప్ సులువుగా కొనుక్కోడానికి 40 వేల కన్నా తక్కువ ఉన్నాయి. మీరు కూడా వీటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఆలస్యం ఎందుకు చదివేయండి…
లెనోవా ఐడి ప్యాడ్ :
ఇది ఎయిత్ జనరేషన్. అయితే దీనివల్ల లాప్టాప్ ని కొంచెం తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అయితే నిజంగా విద్యార్థులకి ఆఫీసులో పనిచేసే వాళ్లకు కూడా ఈ లెనోవా లాప్టాప్ చాలా బాగా పనిచేస్తుంది. తక్కువ బడ్జెట్ తో దీనిని కొనుక్కోవచ్చు. 57 ,999 రూపాయలు మాత్రమే.
ఓఎస్ : విండోస్ 10 హోమ్
డిస్ప్లే : 14″ (1920 X 1080)
ప్రాసెసర్ : Up to 8th Gen Intel® Core™ i7 | 1.5
మెమరీ : 256 GB SSD/12GB NA
వెయిట్ : 1.69
డైమెన్షన్ : 323.6mm x 228mm x 17.9mm
గ్రాఫిక్స్ ప్రాసెసర్ :Up to NVIDIA® GeForce® MX250
హెచ్‌పి క్రోమ్ బుక్ 14 :
ఈ లాప్ టాప్ కేవలం రూపాయలు 25,999 ఇది కూడా మంచిగా పని చేస్తుంది బాగా సహాయ పడుతుంది.
ఓఎస్ : క్రోమ్
డిస్ప్లే : 14″ (1366 X 768)
ప్రాసెసర్ :Intel Celeron N3350 | 1.4GHz
మెమరీ : 64 GB NA/4GBGB DDR4
వెయిట్ : 1.54
డైమెన్షన్ : NA
గ్రాఫిక్స్ ప్రాసెసర్ :Intel HD Graphics 500
లెనోవా ఐడి ప్యాడ్ :
దీని వెల కేవలం రూ 32 990 . ఇది కూడా అయితే జనరేషన్ ఇంటెల్ కోర్ రూపొందించడం జరిగింది. ఇలా ఈ ల్యాప్‌టాప్ సులువుగా విద్యార్థులకి అలానే తక్కువ బడ్జెట్ తో దీనిని కొనుక్కోవచ్చు.
ఓఎస్ : విండోస్ 10 హోమ్
డిస్ప్లే : 15.6″ (1920 X 1080)
ప్రాసెసర్ : Up to 8th Gen Intel® Core™ i7-8565u | 1.8
మెమరీ : 128G/256G SATA&PCIe+1TB SATA/12GB DDR4
వెయిట్ : 1.85
డైమెన్షన్ : 362.2mm x 251.5mm x 19.9mm
గ్రాఫిక్స్ ప్రాసెసర్ : AMD Radeon Vega త్రీ
హెచ్ పి క్రోమ్ x360 12b :
ఈ ల్యాప్ టాప్ వెల రూ 29 ,990 . ఇది కూడా బాగా పని చేస్తుంది.
ఇక్కడ విషయం ఏమిటంటే హార్డ్ డిస్క్ తయారు చేసే కంపెనీలు దాని యొక్క స్టోరేజీ స్పేస్ ను అంతర్జాతీయ ప్రమాణాల పద్దతి అనగా SI (system international) units ప్రకారం ఇస్తాయి. ఆ ప్రమాణాల ప్రకారం :
1 టీబీ = 1,000,000,000,000 (10^12) బైట్లు.
మన కంప్యూటరు లలో కూడాస్టోరేజీ స్పేస్ ను 10 పవర్లలో నిర్దేశిస్తే అప్పుడు ఎటువంటి తేడా వుండేది కాదు. కానీ మన కంప్యూటరు లలో స్టోరేజీ స్పేస్ ను వేరే విధంగా నిర్దేశిస్తారు. ఇక్కడ 2 యొక్క పవర్లలో నిర్దేశిస్తారు. దాని ప్రకారం ఒక కేబి అనగా 2^10 బైట్లు. => 1024 బైట్లు (1000 బైట్ల కన్న ఎక్కువ).
అలాగే ఒక ఎమ్‌బి అంటే 1024 కేబీలు, అనగా 1024*1024 బైట్లు. (10^6 బైట్ల కన్నా ఎక్కువ).
అలాగే ఒక జీబి అనగా 1024 ఎమ్ బీలు అనమాట.
=> 1024*1024*1024 బైట్లు (10^9 బైట్ల కన్నా ఎక్కువ).
అలాగే ఒక టీబి అనగా 1024 జీబీలు అనమాట.
=> 1024*1024*1024*1024 బైట్లు (10^12 బైట్ల కన్నా ఎక్కువ).
అందువలన 1టీబీ హార్డ్ డిస్క్ ను మన కంప్యూటరుకు కనెక్ట్ చేసినపుడు , మనకు 931 జీబీ అని చూపిస్తుంది.
931* (1024^3) = 10^12 బైట్లు అనమాట. (ఒక టీబి SI ప్రకారం). కానీ కంప్యుటరుకు ఒక టీబీ అంటే 1024^4 బైట్లు.
అందువలన మనకు 1టీబీ అని ఎప్పుడూ చూపించదు.
అందువలన మీరు ఏ కంపెనీ హార్డ్ డిస్క్ ను కొన్నా, అది ఏ కంప్యూటరుకు ఐనా కనెక్ట్ చేసినా ఇలాగే చూపుతుంది.
ఇప్పటికీ ఇలాంటి ఫార్మ్ ఫ్యాక్టర్‌తో ఇంతటి పనితీరు ఉన్న ఇయర్‌ఫోన్స్ లేవు.
ఐఫోన్
యువతకు ఇది స్టైల్ స్టేట్మెంట్. మాట్లాడుతున్నప్పుడు చేతిలో ఐఫోన్ కనిపించినంత ట్రెండీగా వారికి మరేదీ కనపడదు.
వాచ్
ఇక వీటి గురించి ఏం చెప్పాలి?
ఆపిల్ ఉత్పత్తులేవైనా సరే డిజైన్ సరళంగా (uncluttered) ఉంటుంది.
పనితీరు కూడా సమాన ఉత్పత్తులతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. దీనికి ఒక కారణం, సాఫ్ట్వేర్ హార్డ్‌వేర్‌కు దగ్గరగా, వారే సొంతంగా డెవెలప్ చెయ్యటం.
ఉదా: ఓ పరికరం యొక్క సమర్థవంతమైన పనితీరుకు ఎంత శక్తివంతమైన ప్రాసెసర్ అవసరమో అదే పెట్టటం.
నేను 2010 నుంచి ఫోటోలు ఎడిట్ చేసేందుకు మ్యాక్‌బుక్ ప్రో వాడుతున్నాను. ఇంతదాక ఒక్క సారి కూడా అది ఫ్రీజ్ అవ్వటం, క్రాష్ అవ్వటం, వైరస్ సోకటం వంటివి జరగలేదు. మూడు సార్లు కింద పడింది – ఒక చోట చిన్న సొట్ట పడింది కానీ పనితీరులో ఏమాత్రం లోపం లేదు. ఇదే కాలక్రమంలో వివిధ లోపాల వల్ల మూడు విండోస్ ల్యాప్‌టాప్‌లు మార్చాను.
రోలబుల్ డిస్ప్లే – ఈ లక్షణంతో LG తన సంభావిత టీవీని పరిచయం చేసింది మరియు మొత్తం డిస్ప్లే ఆన్‌లో ఉన్నప్పుడు పాపప్ అవుతుంది మరియు కంటెంట్ ప్రకారం ఎత్తును సర్దుబాటు చేస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు బ్లాక్ బార్స్ గమనించారా? ఎందుకంటే సినిమాలు 21: 9 కారక నిష్పత్తిలో చిత్రీకరించబడతాయి. రోలబుల్ టీవీలతో సినిమాలు బాధించే బ్లాక్ బార్స్ లేకుండా చూడవచ్చు.
రోలబుల్ డిస్ప్లే – ఈ లక్షణంతో LG తన సంభావిత టీవీని పరిచయం చేసింది మరియు మొత్తం డిస్ప్లే ఆన్‌లో ఉన్నప్పుడు పాపప్ అవుతుంది మరియు కంటెంట్ ప్రకారం ఎత్తును సర్దుబాటు చేస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు బ్లాక్ బార్స్ గమనించారా? ఎందుకంటే సినిమాలు 21: 9 కారక నిష్పత్తిలో చిత్రీకరించబడతాయి. రోలబుల్ టీవీలతో సినిమాలు బాధించే బ్లాక్ బార్స్ లేకుండా చూడవచ్చు.
గేమింగ్ అనుకూలమైనది – ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్‌ను ఎన్నుకునేటప్పుడు గేమింగ్ కొత్త ప్రాధాన్యత సంతరించుకుంది మరియు మోటరోలా వంటి కొన్ని బ్రాండ్లు దీనిని సద్వినియోగం చేసుకుని గేమింగ్ జాయ్‌స్టిక్‌తో ఒక టీవీని విడుదల చేశాయి. మార్కెట్లో మనకు అంకితమైన గేమింగ్ కన్సోల్లు ఉన్నాయి – ఎక్స్‌బాక్స్ మరియు సోనీ ప్లేస్టేషన్ అప్పుడు ఒక టీవీ మీడియం నుండి అధిక గేమింగ్‌ను నిర్వహించగల సామర్థ్యం ఉంటే? అది మంచి ఫీచర్ కదా?
మైక్రో ఎల్ఈడి – మైక్రో ఎల్ఈడి డిస్ప్లే టెక్నాలజీలో కొత్త తరం. ఈ డిస్ప్లేలు పవర్ ఎఫిషియెంట్, అధిక ప్రకాశాన్ని ఉత్పత్తి చేస్తాయి మరియు విస్తృత రంగు స్వరసప్తకాన్ని అందిస్తాయి. నా దృష్టిలో ఈ టెక్ ప్రస్తుత డిస్ప్లే టెక్కు అద్భుతమైన అప్‌గ్రేడ్. ఈ డిస్ప్లేలు ఇంకా వాణిజ్యంగా లేనప్పటికీ, ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పుడు అది పెద్ద ఫీచర్ అవుతుంది.