Famous in Andhra Pradesh

కొత్త జిల్లాల స్వరూపమిదే..

శ్రీకాకుళం జిల్లా   జిల్లా కేంద్రం: శ్రీకాకుళంఅసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)రెవెన్యూ డివిజన్లు: పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం.  మండలాలు : 30,పలాస డివిజన్‌లోని మండలాలు: ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగంటెక్కలి డివిజన్‌లోని మండలాలు: టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, సారవకోట, మలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, లక్ష్మినరసుపేట, శ్రీకాకుళం డివిజన్‌లో మండలాలు: శ్రీకాకుళం, గార, ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బుర్జ, నరసన్నపేట, పొలాకి, …

కొత్త జిల్లాల స్వరూపమిదే.. Read More »

నెల్లూరు స్పెషల్ భోజనం – కోమలవిలాస్

కోమల విలాస్ యజమానులు తమ హోటల్ కు వచ్చేవారిని మీఆరోగ్యమే మాభాగ్యం అంటూ పలకరిస్తారు.భోజనం అరటి ఆకులో వడ్డిస్తారు. మొత్తం పదహారు రకాలు రుచి చూపిస్తారు. అదనంగా ఆ రోజు వండిన ప్రత్యేక వంటకం కూడా వడ్డిస్తారు.శెనగల పొడి, స్వచ్ఛమైన నెయ్యి వడ్డిస్తారు. ఈ హోటల్ లో పనిచేసి సిబ్బంది ఆకలితో నకనకలాడుతూ వడ్డించకుండా ముందుగానే తిని సంతోషంగా వడ్డిస్తారు.

పాలకొల్లు మినపరొట్టె

ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులో మారుతీ సినిమా హాల్ దగ్గర లభించే మినరొట్టె రుచి చూడాల్పిందే. మినప రొట్టెలతో పాటు శెనగపిండితో చేసిన చింతామణి చట్నీ, కొబ్బరి చట్నీ ఇస్తారు.ఈ రొట్టెలను ఇనుప కుంపటి పొయ్యిమీదే ప్రత్యేకంగా కాలుస్తారు.పాలకొల్లు క్షీరారామం (పంచారామాలలో ఒకటి) చూడటానికి వెళ్లినపు ఈ మినపరొట్టెలను రుచి చూడవచ్చు.

బొంగు చికెన్ – మారేడుమిల్లి

తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మారేడుమిల్లి ప్రాంతం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం. అందమైన పర్యాటక స్థలం. తూర్పు కనుమలలో ఉన్న ఈ అటవీ ప్రాంతం మారేడుమిల్లి గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో మారేడుమిల్లి – భద్రాచలం రోడ్డలో ఉంది.కొండలమీద నుండి ప్రవహించే అనేక చిన్న చిన్న జలపాతాలు చూపరులకు కనువిందు చేస్తాయి. .ఇక్కడ స్థానికులు తయారుచేసే బొంగు చికెన్ రుచే వేరు. తప్పకుండా ఆస్వాదించదగ్గది. చాలామంది పర్యాటకులు బొంగడూ చికెన్ తినటానికే ఈ ప్రాంతానికి వస్తారు.

ఆత్రేయపురం పూతరేకులు

పేపర్ స్వీట్ లేక పూతరేకులు అనగానే ఆత్రేయపురం గుర్తుకువస్తుంది. ప్రత్యేకమైన రుచితో నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ పూతరేకుల జన్మస్థానం ఆత్రేయపురం.అత్రి మహాముని తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి ఆత్రేయపురం అని పేరు వచ్చిందంటారు. ఆత్రేయపురంలో తయారయ్యే పూతరేకులు దేశ, విదేశాలకు ఎగుమతి అవుతాయి.ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాయి. 300 సంవత్సరాల క్రితమే ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ ప్రారంభమైందని చెబుతారు. ప్రస్తుతం 300 కుటుంబాలు పూతరేకులను తయారు చేస్తూ జీవోనోపాధి పొందుతున్నాయి.

Kakinada Subbaiah Hotel…కాకినాడ సుబ్బయ్య హోటల్

కాకినాడ సుబ్బయ్య అనగానే భోజనం కంటే వారు చూపే ఆప్యాయత గుర్తుకు వస్తుంది. 1955 సం.లో ఈ హోటల్ ను ప్రారంభించారు. 90 రకాల గోదావరి రుచులను వడ్డిస్తూ ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ కొసరి కొసరి వడ్డిస్తారు.మొదట్లో ఈ హోటల్ పేరు శ్రీకృష్ణా విలాస్. కానీ ఈ హోటల్ ను ప్రారంభించిన సుబ్బయ్య గారు అందరినీ ఆప్యాయంగా సలకరిస్తూ వడ్డిస్తుండటంతో ఈ హోటల్ సుబ్బయ్యగారి హోటల్ మారింది.ఆయన తరువాత ఆయన వారసులు కూడా ఇదే …

Kakinada Subbaiah Hotel…కాకినాడ సుబ్బయ్య హోటల్ Read More »

బందరు లడ్డు

బందర్ లడ్డూకి 77 సంవత్సరాల చరిత్ర ఉంది. తీయని ఈ అచ్చతెలుగు వంటకం గురించి…..దిల్లీ సుల్తానుల కాలంలో మహారాష్ట్ర – మధ్యప్రదేశ్‌ సరిహద్దున ఉండే బుందేల్‌ఖండ్‌ ప్రాంతం నుంచి మచిలీపట్నంలోని బందరుకు వలస వచ్చిన బొందిలీలు ఈ లడ్డు తయారీ ప్రారంభించారని చరిత్రకారులు చెబుతున్నారు.ఇలా వలసవచ్చిన వారిలో బొందిలి రాంసింగ్‌ కుటుంబం మొదటి సారి ఈ లడ్డుని తయారు చేసిందట. మొదట్లో సన్నకారప్పూసని తయారుచేసిన ఆ కుటుంబం.. ఆ పూసని బెల్లంపాకంతో కలిపి తొక్కి లడ్డూలని తయారుచేసి …

బందరు లడ్డు Read More »

Rajahmundry Rose Milk….రాజమండ్రి రోజ్ మిల్క్

రెడీమేడ్ గా దొరికే శీతలపానీయాలు….రాజమండ్రి రోజ్మిల్క్ రుచికి సరిపోవు అంటారు రోజ్మిల్క్ అభిమానులు. ఈ ‘రోజ్మిల్క్’ దుకాణం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటలకు మూసేంతవరకూ రద్దీనే. సుగంధివేళ్లతో ప్రత్యేకంగా తయారుచేసే ఈ రోజ్మిల్క్ కు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే! చుట్టుపక్కల గ్రామాల నుండి పనిమీద వచ్చిన వాళ్లు.. రాజమండ్రికి వచ్చిన వాళ్లు కూడా ఇక్కడ ఈ రోజ్మిల్క్ని ఒక్కసారి రుచిచూడక మానరు.సుగంధివేళ్లు ప్రత్యేకం…పాలకు తోడు వేసవితాపాన్ని చల్లార్చి చలువ చేసే సుగంధి వేళ్లను …

Rajahmundry Rose Milk….రాజమండ్రి రోజ్ మిల్క్ Read More »