తోటకూర వడలు
కావలసినవి:పచ్చి సెనగపప్పు: కప్పుతోటకూర: కట్టఉల్లిపాయ: ఒకటివెల్లుల్లిరెబ్బలు: నాలుగుఅల్లం: అర అంగుళం ముక్కపచ్చిమిర్చి: ఐదుఉప్పు: టీస్పూనునూనె: వేయించడానికి సరిపడాతయారుచేసే విధానం:పచ్చిశెననగ పప్పుని కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి.నానిన పప్పుకి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉప్పు చేర్చి కాస్త పలుకుగా రుబ్బాలి. నీళ్లు కలపకూడదు. శుభ్రంగా కడిగిన తోటకూర సన్నగా తరిగి ఈ పిండి మిశ్రమంలో కలపాలి. సన్నగా తరిగిన ఉల్లిముక్కలు కూడా వేసి కలపాలి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని చేతిమీదగానీ పాలిథీన్ కవర్మీద గానీ చిన్న వడలుగా వత్తి కాగిన నూనెలో ఎర్రగా వేయించి తీయాలి. వీటిని ఏదైనా సాస్ లేదా చట్నీతో తింటే బాగుంటాయి.
Read More
You must be logged in to post a comment.