బొండాలు రకాలు

ఇడ్లీ పిండితో బొండాలు

ఇడ్లీపింది : రెండు కప్పులుపచ్చిమిర్చి: మూడు కాయలుఇంగువ: అరటీస్పూనుకరివేపాకు తురుము: టేబుల్‌స్పూనుఉప్పు: తగినంతనూనె: వేయించడానికి సరిపడాతయారుచేసే విధానంఇడ్లీపిండిలో పైన చెప్పినవన్నీ కలిపి కాగిన నూనెలో బోండాల్లాగా దోరగా వేయించి తీసుకోవాలి

మైసూరు బోండాలు

కావలసినవి మైదా: కప్పుబియ్యప్పిండి: పావుకప్పుకొద్దిగా పుల్ల పెరుగు: కప్పుఉప్పు: రుచికి సరిపడాఅల్లంతురుము: టీస్పూనుజీలకర్ర: టీస్పూనుపచ్చిమిర్చితురుము: టీస్పూనువంటసోడా: అరటీస్పూనునూనె: వేయించడానికి సరిపడాతయారుచేసే విధానంపెరుగులో తగినన్ని నీళ్లుపోసి బాగా కలపాలి. అందులోనే మైదా, బియ్యప్పిండి, సోడా వేసి మరీ జారుగానూ గట్టిగానూ కాకుండా కలపాలి. మిగిలినవన్నీ కూడా వేసి బాగా కలిపి ఓ గంట నానబెట్టి గుండ్రని బోండాల్లా కాగిన నూనెలో వేసి తీయాలి.అల్లం చట్నీ, పొదీనా చట్నీ, కొబ్బరి చట్నీ వీటికి మంచి కాంబినేషన్.

మినప బొండాలు

మినప్పప్పు : కప్పుబియ్యం : 2 స్పూన్లుపచ్చిమిర్చి: నాలుగు కాయలుఇంగువ: పావు టీ స్పూనుకరివేపాకు తురుము: టేబుల్‌స్పూనుఉప్పు: తగినంతనూనె: వేయించడానికి సరిపడాతయారుచేసే విధానం మినప్పప్పు, బియ్యం కలిపి నీళ్లలో కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి. తరవాత మెత్తగా రుబ్బుకోవాలి. పిండి మరీ జావగా ఉండకూడదు. ఇందులో మిగిలినవన్నీ వేసి కలిపి కాగిన నూనెలో బోండాల్లా వేయించి తీయాలిఅల్లం చట్నీ, పొదీనా చట్నీ, కొబ్బరి చట్నీ వీటికి మంచి కాంబినేషన్.