‘కర్ర పెండలం’ తో వంటలు

కర్ర పెండలం:

కర్ర పెండలం దుంప ని ఉడకబెట్టి , అమ్ముతుంటారు .ఇది తినే వాళ్ళు చాలా ఇష్టం గా తింటారు . ప్రయాణాల్లో చాలా సేపు ఆకలి వేయకుండా వుంటుంది. దీనిలో పీచు పదార్థాలు, పోషక పదార్థాలు లభిస్తాయి.

సగ్గుబియ్యం కర్ర పెండలం తో తయారు చేస్తారు.

కర్రపెండలం తో సగ్గు బియ్యంతయారు చేస్తారు. సామర్లకోట లో వీటి తయారీ ఎక్కువ. ఇక్కడ ఎక్కువగా కర్రపెండలం పండిస్తారు.

సగ్గుబి్యంతో హల్వా తయారుచేస్తారు. పాయసం చేస్తారు. సగ్గబియ్యంతో వేసవిలో జావ కాచు కుంటారు. బియ్యప్పిండి వడియాలు, గుమ్మడి వడియాలు లో వేసి, ఇంకొంచెం అందం గా ఉండడానికి వాడతారు. సగ్గుబియ్యం తోనే వడియాలు పెడతారు.

చిప్స్:

నీళ్ళ లో వుప్పూ వేసి, కర్ర పెండలం చిప్స్ గా తరిగి,వాటిలో వేసి ,కొంచెం వుడికించి, తీసి ఎండ లో బాగా , ఎండ బెట్టాలి. వాటిని కావలిసి నప్పుడు వేపుకుని తినవచ్చు. మంచి రుచి గా వుంటాయి.

అప్పడాలు:

అప్పడాల రుచి మాత్రం తింటేనే వాటి రుచి తెలుస్తుంది. అంత బాగుంటాయి. అన్నవరం దగ్గర ఇవి ఎక్కువ గా పండి స్తారు. అక్కడే ఈ అప్పడాల తయారీ వుంది.

కర్ర పెండలం కూర:

ఎక్కువగా బొబ్బర్లు, చిక్కుడు లోని రకాల తో కలిపి ( శ్రీకాకుళం వైపు) వండుకుంటారు. వేపుడు చేస్తారు. పులుసు కూడా పెడతారు. వీటి నీ మిక్సి లో వేసి ,రసం తీసి హల్వా చేస్తారు.

గంజి పొడి:

కర్ర పెండలం తో గంజి పొడి తయారు చేస్తారు.అం తే కాదు . సగ్గుబియ్యం కూడా వుడ క బెట్టి, గంజి తయారీ చేసి, చీరలకు పెట్టుకుంటారు.

వీటికి సంబంధించిన చిన్న పరిశ్రమలు సామర్లకోటలో వున్నాయి.

వెలగ పండ్లు – రుచులు

Variet recipes with Wood Apple - Sakshi

వెలగ పండు భేల్‌
కావలసినవి
వెలగ పండ్లు – 4; పచ్చిమిర్చి – 10 (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); ఉప్పు – తగినంత ; పంచదార – 4 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; చాట్‌ మసాలా – ఒక టీ స్పూను; స్వీట్‌ చట్నీ- అర టీ స్పూను; గ్రీన్‌ చట్నీ- ఒక టీ స్పూను

తయారీ: వెలగపండ్లను పగలగొట్టి, గుజ్జును ఒక పాత్రలోకి తీసుకుని, గరిటెతో బాగా మెదపాలి. పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, పంచదార, కొత్తిమీర తరుగు, చాట్‌ మసాలా, గ్రీన్‌ చట్నీ, స్వీట్‌ చట్నీ జత చేసి పప్పు గుత్తితో బాగా మెదపాలి. పగుల గొట్టిన వెలగ పండు చెక్కలలోనే అమర్చి అందిస్తే చూడటానికి అందంగా ఉంటుంది.

వెలగ పండు స్మూతీ
కావలసినవి: వెలగపండు -1; తేనె- 2 టేబుల్‌ స్పూన్లు; ఓట్స్‌ – ఒక టేబుల్‌ స్పూను; పెరుగు- అర కప్పు; తాజా కొబ్బరి తురుము – ఒక టేబుల్‌ స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; బెల్లం పొడి – టేబుల్‌ స్పూను

గార్నిషింగ్‌ కోసం: దానిమ్మ గింజలు- ఒక టీ స్పూను; మామిడికాయ ముక్కలు – ఒక టీ స్పూను; జీడిపప్పు ముక్కలు – ఒక టీ స్పూను.

తయారీ: ఓట్సును తియ్యటి నీళ్లలో లేదా ఏదైనా పళ్లరసంలో పది నిమిషాలు నానబెట్టాలి. వెలగపండును పగులగొట్టి గుజ్జు బయటకు తీసి, రెండు కప్పుల నీళ్లలో సుమారు అరగంట సేపు నానబెట్టాలి. మెత్తగా పిసికి, పీచును, గింజలను వేరు చేయాలి. మిక్సీలో వెలగ పండు గుజ్జు, తేనె, ఐస్‌ క్యూబ్స్, బెల్లం పొడి, కొబ్బరి తురుము, నానబెట్టిన ఓట్స్, ఏలకుల పొడి, పెరుగు, మిరియాల పొడి వేసి మెత్తగా చేయాలి. గ్లాసులలో పోసి, కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా అయ్యాక బయటకు తీసి, జీడిపప్పు ముక్కలు, దానిమ్మ గింజలు, మామిడికాయ ముక్కలతో అలంకరించి అందించాలి.

వెలగ పండు షర్బత్‌
కావలసినవి
వెలగ పండు -1; నీళ్లు – తగినన్ని; పంచదార – తగినంత

తయారీ:
ముందుగా వెలగపండు గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙చేతితో మెత్తగా మెదిపి, తగిన న్ని నీళ్లు జత చేసి, చేతితో బాగా కలపాలి. ఒక పాత్రలోకి వడ పోయాలి. తగినంత పంచదార జత చేసి బాగా కలియబెట్టాలి. ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచి, బయటకు తీసి చల్లగా తాగాలి . ఎండ బాధ నుంచి కాపాడుతుంది.

వెలగ పండు జామ్‌
కావలసినవి: వెలగ పండ్లు – 4; వేడి నీళ్లు – పావు లీటరు; పంచదార – 200 గ్రా.
తయారీ : వెలగ పండ్ల గుజ్జును ఒక పాత్రలో వేసి మెత్తగా మెదపాలి. వేడి నీళ్లు జత చేస్తూ బాగా కలియబెట్టాక, వడబోసి, గింజలను వేరు చేయాలి. స్టౌ మీద బాణలి వేడయ్యాక గుజ్జును  అందులో వేసి బాగా కలపాలి. పంచదార జత చేసి బాగా కలియగొట్టి, పొంగులు  వచ్చేవరకు ఉడికించాలి. పావు గంట తరవాత మిశ్రమం కొద్దిగా చిక్కబడుతుంది. ఒక ప్లేటులోకి తీసుకుని, కొద్దిగా చల్లారాక గాలి చొరని  సీసాలో నిల్వ చేసుకోవాలి.


వెలగ పండు పచ్చడి
కావలసినవి: వెలగపండు- 1; బెల్లం పొడి – ఒక కప్పు; కారం- ఒక టేబుల్‌ స్పూను; ధనియాల పొడి – ఒక టేబుల్‌ స్పూను; వేయించిన జీలకర్ర పొడి – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత;  కొత్తిమీర – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ: ∙ముందుగా వెలగపండును పగులగొట్టి గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి. మిక్సీలో అన్ని పదార్థాలు వేసి మెత్తగా చేయాలి. ఈ పచ్చడిని ఫ్రిజ్‌లో ఉంచితే పదిరోజుల వరకు బాగుంటుంది.

వెలగ పండు ఐస్‌క్రీం
కావలసినవి: పంచదార- 1 టేబుల్‌ స్పూన్‌; కొబ్బరి పాలు- అరకప్పు; వెలగ కాయ – 1
తయారీ: ఒక పాత్రలో వెలగ పండు గుజ్జు వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదపాలి. కొబ్బరి పాలు జత చేస్తూ మరోసారి మెత్తగా చేయాలి. పంచదార జత చేసి బాగా కలిపి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. అంగుళం మందం ఉన్న ప్లేటులో ఈ మిశ్రమాన్ని పోసి, డీప్‌ ఫ్రీజ్‌లో ఐదు గంటల పాటు ఉంచి బయటకు తీయాలి. స్టౌ మీద పాన్‌ వేడయ్యాక, ఫ్రిజ్‌లో ఉంచిన ప్లేటును బయటకు తీసి, అందులోని వెలగపండు మిశ్రమాన్ని పాన్‌లో వేసి, కొద్దిసేపు ఉంచి, మళ్లీ ప్లేటులో పోసి, డీప్‌ ఫ్రీజర్‌లో మూడు గంటల పాటు ఉంచి, బయటకు తీసి, ఐస్‌ క్రీమ్‌ కప్పుల్లో అందించాలి.

ఇలా తింటే ఎలా ఉంటుంది..

  • ఉదయాన్నే బియ్యంతో చేసిన ఇడ్లీ, దోసెలకు దూరంగా ఉండి, వాటి బదులు జొన్నలు, మినుములతో చేసిన ఇడ్లీ, దోసెలను తినటం మంచిది. మామూలుగా చేసుకునే ఇడ్లీ, దోసెలను వారానికి ఒకసారి మాత్రమే తినాలి.
  • దోసెలను నేతిలో కాల్చుకుని తినటం మంచిది.
  • ఉడకబెట్టిన సెనగలు, వేరు సెనగలు, అలసందలు ఆరోగ్యానికి మంచిది.
  • మొలకెత్తిన గింజలు తినటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
  • పూరీ, మైసూర్‌ బోండా వంటివి నెలకు ఒకసారి తింటే పరవాలేదు. వీలైతే వాటికి దూరంగా ఉండటం మంచిది.
  • వారానికి ఒకటి లేదా రెండు సార్లు చపాతీలు తింటే పరవాలేదు. అవి కూడా నేతితో కాల్చుకుని తినటం మంచిది.

Carrot Juice / క్యారెట్ జ్యూస్

క్యారెట్ జ్యూస్ మంచి పోషకాలు, పీచుతో కూడి ఉంటుంది.ఒక కప్పు రసం మూడు క్యారెట్ లతో సమానం. ఒక కప్పుతో 94 కేలరీల శక్తి లభిస్తుంది. పచ్చి క్యారెట్ ల కంటే రసంలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. కె, ఎ విటమిన్లు ఉంటాయి.ప్రకృతి సిద్ధమైన చక్కెర ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. కానీ బరువు తగ్గాలనుకునే వారు మాత్రం పచ్చి క్యారెట్లను తినటం మంచిది. ఆకలి తీరుతుంది. తక్కువ కేలరీలు ఉంటాయి.

కావల్సినవి
క్యారెట్ : మీడియం సైజ్ ది ఒకటి
యాలకులు : రెండు
పొదీనా : కొద్దిగా
క్యారెట్ ను శుభ్రం చేసుకుని, చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి తరువాత యాలకులు, పొదీనా వేసి మరోసారి మిక్సీ తిప్పి తీసుకొని వడపోసి త్రాగవచ్చు. రుచి కోసం కొద్దిగా పంచదార, చల్లదనం కోసం కొద్దిగా ఐస్ కలుపుకోవచ్చు.

Papaya Juice / బొప్పాయి జ్యూస్

papaya juice

పండిన బొప్పాయి కొద్దిగా జిడ్డుగా, బరువుగా ఉండి తేలికగా అరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. గుండెకు, శరీరానికి బలాన్నిస్తుంది.. దాదాపు సగం వరకు బొప్పాయిలో చక్కెర గ్లూకోజ్ కలిగి ఉంటుంది. మిగిలిన సగం ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది. విటమిన్ ఏ ఎక్కువగా బొప్పాయిలో ఉంటుంది. రక్తహీనతను కూడా పోగొడుతుంది.

కావలిసినవి
బొప్పాయి : పెద్ద ముక్క ఒకటి
తయారు చేసే విధానం
బొప్పాయి ముక్కను చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రుచి కోసం యాలకులు, యాపిల్ ముక్కలు కలుపుకోవచ్చు. గ్రైండ్ చేసిన దాంట్లో కొద్దిగా నీరు, రుచి కోసం కొద్దిగా పంచదార, ఐస్ కలుపుకొని త్రాగవచ్చు.

Pomegranate Juice / దానిమ్మ జ్యూస్

pomegranite juice

దానిమ్మలో పులుపు, తీపి, తీపితో పాటు వగరుగా ఉండే రకాలు లభిస్తాయి. తీపి దానిమ్మలు రుచిగా ఉండి తేలికగా అరుగుతాయి.జ్వరపడిన వారికి దానిమ్మ జ్యూస్ చాలా మంచిది. కడుపులో మంటను తగ్గిస్తుంది. గొంతుకు సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి. ఆకలి పెరిగి, రక్తహీనతను తగ్గిస్తుంది. నీళ్లవిరేచాలను తగ్గిస్తుంది.

కావల్సినవి:
దానిమ్మ కాయ : మీడియం సైజ్ ది 1
దానిమ్మ గింజలను శుబ్రంగా వలిచి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రుచికోసం యాలకులను కలుపుకోవచ్చు. దీనిని వడపోసి కొద్దిగా నీరు కలుపుకొని త్రాగవచ్చు.

యాపిల్ జ్యూస్ / Apple Juice

కావలిసినవి
యాపిల్స్ : 2
పంచదార : 2 స్పూన్ లు
పాలు : 2 కప్పులు
తయారు చేసే విధానం
ముందు యాపిల్స్ ను శుభ్రంగా పంపునీటి క్రింద కడిగి చిన్న ముక్కలుగా కోయాలి. మధ్యలోని గింజలను తీసివేయాలి. తరువాత వీటిని మిక్సీ జారులో వేసి పాలు(పాలు కాగబెట్టి చల్లార్చుకోవాలి) పంచదార కలిపి మొత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత వడకట్టకుని తాగాలి. కొద్దిగా ఐస్ కలుపుకుంటే చల్లగా ఉంటుంది.


బజారులో లభ్యమయ్యే జ్యూస్ లో వాసన కోసం ఎస్సెన్స్ కలుపుతారు. కనుక ఇంట్లో జ్యూస్ లు చేసుకుని తాగటం మంచిది.

ద్రాక్షా జ్యూస్ / Grapes Juice

sapota milk shake

కావలిసినవి
సపోటాలు : 4
పంచదార : 3 స్పూన్ లు
పాలు : 2 కప్పులు

తయారు చేసే విధానం
ముందు సపోటాలను తొక్కతీసి చిన్న ముక్కలుగా చేయాలి. మధ్యలోని గింజలను తీసివేయాలి. తరువాత వీటిని మిక్సీ జారులో వేసి పాలు(పాలు కాగబెట్ట చల్లార్చినవి) , పంచదార కలిపి మొత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత వడకట్టకుని తాగాలి. కొద్దిగా ఐస్ కలుపుకుంటే చల్లగా ఉంటుంది. దీనిలో జీడిపప్పు కొద్దిగా చిన్నముక్కలు చేసి కలుపుకోవచ్చు.
బజారులో లభ్యమయ్యే జ్యూస్ లో వాసన కోసం ఎస్సెన్స్ కలుపుతారు. కనుక ఇంట్లో జ్యూస్ లు చేసుకుని తాగటం మంచిది.

చెరకు రసం / Sugarcane Juice

sugarcane juice

ఈ కాలంలో చాలామందిని డీహైడ్రేషన్‌, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌లు వేధిస్తుంటాయి. అలాంటివారికి చెరకు రసం ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలోని చెడు కొవ్వుల నిల్వలూ దూరమవుతాయి. శరీరానికి సహజ చక్కెర్లు అందుతాయి. ఈ రసం జీవక్రియ రేటుని వృద్ధిచేస్తుంది. నిమ్మరసం లేదా కొబ్బరినీళ్లతో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు.

గర్భిణులకు చెరకు రసం చాలా మంచిది. ఇందులో ఇనుము, ఫొలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గర్భస్థ శిశువుకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. జుట్టు ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. వృద్ధాప్య ఛాయల్నీ అడ్డుకుంటాయి.

చెరకు రసంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వ్యాధులకు దూరంగా ఉంటాం. కాలేయం శుభ్రపడి.. దాని పని తీరు మెరుగుపడుతుంది. పొట్టలో కూడా ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది –చెరకు రసంలో ఉంటే పొటాషియం మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. దంత సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది. నోటి దుర్వాసనలు రావు. దుర్వాసనలు లేకుండా చూస్తుంది. ఈ రసంలో ఖనిజాలు ఎక్కువ. గోళ్ల ఎదుగుదలా బావుంటుంది.

గొంతు మంట, ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవారు చెరకు రసం ఎంత తాగితే అంత మంచిది. ఇందులోని సహజ చక్కెరలు సమస్యని దూరం చేస్తాయి. జ్వరం వల్ల శరీరం ప్రొటీన్లు కోల్పోతుంది. అలాంటి వారు చెరకు రసం తాగడం వల్ల కావల్సిన ప్రొటీన్లు వెంటనే అంది… నీరసం తగ్గుతుంది.

కాకరకాయ జ్యూస్-Bittergourd Juice

కావల్సినవి:
కాకరకాయలు – 5
నీళ్లు – గ్లాసు
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నిమ్మరసం – టీ స్పూన్‌
తయారీ:
కాకరకాయ పైన తొక్కను చెక్కేయాలి. మరీ ఎక్కువ కాకుండా పైన బొడిపెల్లా ఉన్నంత వరకు తీసేస్తే చాలు. సన్నని ముక్కలుగా కట్‌ చేయాలి. గ్లాసు నీళ్లలో కట్‌ చేసిన కాకర కాయముక్కలు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి కనీసం 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత వీటిని మిక్సర్‌జార్‌లో వేసి బ్లెండ్‌ చేసి, రసం పిండాలి. ఈ రసానికి నీళ్లు కలిపి, దీంట్లో నిమ్మరసం కలిపి సేవించాలి. అధికబరువు, మధుమేహం, ఆస్త్మా వంటి సమస్యలకు కాకరలోని ఔషధాలు అమోఘంగా పనిచేస్తాయి.

బీట్రూట్ జ్యూస్

beetroot juice

కావల్సినవి:
బీట్‌రూట్‌ – ఒకటి, ఖర్జూరాలు – మూడు, పుదీనా ఆకులు – మూడు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, మిరియాలపొడి – అరచెంచా, నిమ్మరసం – చెంచా, ఉప్పు – అరచెంచా.
తయారు చేసే విధానం:
బీట్‌రూట్‌ కడిగి చెక్కు తీసి ముక్కల్లా కోసి మిక్సీజారులోకి తీసుకోవాలి. అందులోనే ఖర్జూరాలూ, పుదీనా ఆకులూ, నీళ్లూ పోసుకుని రసంలా చేసుకుని వడకట్టాలి. ఇప్పుడు మిరియాలపొడీ, నిమ్మరసం, ఉప్పూ కలిపి ఫ్రిజ్‌లో పెట్టి.. చల్లగా అయ్యాక తాగాలి.

బీట్ రూట్ జ్యూస్ కొద్దిగా జిడ్డుగా, చల్లగా, పోషకాలతో పిత్తాన్ని నియంత్రణలో ఉంచుతుంది. రక్తాన్ని మెరుగు పరుస్తుంది. శరీరానికి బలం చేకూరుస్తుంది. బీట్ రూట్ లోని బెటైన్ పొట్టను, పెద్దప్రేగును శుద్ధి చేస్తుంది. బీట్ రూట్ ను రసంగా చేసుకొని త్రాగితేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఏదైనా జబ్బుపడిన తిరిగి కోలుకొనేవారికి మంచి ఉపయోగం. రక్తన్ని శుద్ధిచేస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా త్రాగకూడదు. అరిగించుకోవటం కొద్దిగా కష్టం. చిన్నపిల్లలకు, అరుగుదల తక్కువగా ఉన్నవారి పలచగా చేసుకొని త్రాగటం మంచిది.

పుచ్చకాయ జ్యూస్

watermelon juice

కావల్సినవి:
పుచ్చకాయ – సగం ముక్క, నిమ్మకాయ – ఒకటి, మిరియాలపొడి – అరచెంచా, ఉప్పు – పావుచెంచా.
తయారు చేసే విధానం:
పుచ్చకాయని ముక్కల్లా కోసి, గింజలు తీసేసి మిక్సీజారులోకి తీసుకోవాలి. కాసిని నీళ్లు పోసి రసం చేసుకోవాలి. దీన్ని ఓ గిన్నెలోకి తీసుకుని నిమ్మరసం, మిరియాలపొడీ, ఉప్పు కలపాలి. చల్లగా కావాలనుకుంటే రెండు మూడు ఐసుముక్కలు వేసుకోవచ్చు.

అనాస జ్యూస్

pineapple juice

కావల్సినవి:
అనాసముక్కలు – అరకప్పు, నీళ్లు – కప్పు, మిరియాల పొడి – అరచెంచా, అల్లం తరుగు – చెంచా, తేనె – చెంచా, ఉప్పు – పావుచెంచా.
తయారు చేసే విధానం:
అనాసముక్కలూ, అల్లం తరుగూ, నీళ్లు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. వడకట్టి.. మిరియాలపొడీ, తేనె, ఉప్పు వేసి.. ఫ్రిజ్‌లో పెట్టేయాలి. చల్లబడ్డాక తీసుకుని తాగాలి.

పుదీనా జ్యూస్

pudina juice

కావల్సినవి:
పుదీనా ఆకులు – పది, కొత్తిమీర తరుగు – నాలుగు చెంచాలు, అల్లం – చెంచా, నీళ్లు – రెండు కప్పులు, ఇంగువ – చిటికెడు, నల్ల ఉప్పు – చిటికెడు, మిరియాలు – అరచెంచా, వేయించిన జీలకర్ర – అరచెంచా, నిమ్మరసం – మూడు టేబుల్‌స్పూన్లు, తేనె – చెంచా, ఉప్పు – అరచెంచా.
తయారు చేసే విధానం :
కడిగిన పుదీనా, కొత్తిమీరా, అల్లం, కాసిని నీళ్లూ, ఇంగువా, వేయించిన జీలకర్రపొడీ, మిరియాలూ, నల్ల ఉప్పూ మిక్సీజారులోకి తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని మరో గిన్నెలోకి తీసుకుని నీళ్లు కలపాలి. ఇప్పుడు నిమ్మరసం, ఉప్పూ, తేనె కలిపి రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టి తాగాలి.