పచ్చిమిరపకాయల వడియాలు
కావలిసినవిపచ్చిమిర్చి : పావుకిలోఎండుమిర్చి : 25 గ్రాములుమినపపప్పు : 100 గ్రాములుమెంతులు : 2 టేబుల్ స్పూన్లుతయారు చేసే విధానంమినపపప్పు, మెంతులను నీళ్ళలో 5,6 గంటల సేపు నానబెట్టాలి. ఎండుమిర్చిని కూడా ఒక గంటసేపు నానబెట్టుకోవాలి. తరువాత నానబెట్టిన వాటిలో పచ్చిమిర్చి, పెరుగు, ఉప్పు వేసి మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న వడియాలలాగా ప్లాస్టిక్ షీట్ మీద ఎండబెట్టుకోవాలి. పూర్తిగా ఎండిన తరువాత గాలిచోరని డబ్బాలలో నిల్వ ఉంచుకోవాలి. పూర్తిగా ఎండనివ్వాలి. తేమ ఉంటే బూజు వస్తుంది.
Read More
You must be logged in to post a comment.