Moghalayee Curry / మొఘలాయి రొయ్యల కూర
కావల్సినవి
రొయ్యలు- 250 గ్రాములు
ఉల్లిపాయలు- రెండు
టొమాటోలు – రెండు
వెల్లుల్లి రేకలు – 10
అల్లం ముక్క – చిన్నది
గరం మసాలా- అరచెంచా
పసుపు – అరచెంచా
పచ్చిమిర్చి – రెండు కాయలు
కారం – చెంచా
ధనియాలు – చెంచా
నెయ్యి – రెండు చెంచాలు
నీళ్లు- రెండు కప్పులు
ఉప్పు – తగినంత
తయారు చేసే విధానం
రొయ్యలను శుభ్రం చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి , ఉల్లిపాయ ముక్కలూ, అల్లం, వెల్లుల్లీ, ధనియాలు మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక మెత్తగా చేసుకున్న ఉల్లిపాయ ముద్ద, తగినంత ఉప్పూ, గరంమసాలా, కారం, పసుపు వేయాలి. పచ్చివాసన పోయాక కప్పు నీళ్లు పోయాలి. ఆ నీళ్లు కాస్త మరిగాక టొమాటో ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసి మిగిలిన నీళ్లు పోసి, మూత పెట్టాలి. రొయ్యలు కూడా ఉడికి కూరలా తయారయ్యాక దింపేయాలి.
Prawns Fry / రొయ్యల వేపుడు
కావల్సినవి
రొయ్యలు – పావుకేజీ
నూనె- మూడు చెంచాలు
దాల్చినచెక్క – చిన్నముక్క
జీలకర్ర – చెంచా
యాలకులు – రెండు
ఉల్లిపాయ – ఒకటి పెద్దది
పచ్చిమిర్చి – ఒకటి
కరివేపాకు – రెండు రెబ్బలు
అల్లం, వెల్లుల్లి పేస్టు – చెంచా
కారం – చెంచా
ధనియాల పొడి – చెంచా
పసుపు – పావు చెంచా
గరంమసాలా – అర చెంచా
మిరియాల పొడి – అర చెంచా
టొమాటోలు – రెండు
ఉప్పు – తగినంత
నీళ్లు – అర కప్పు
మసాలా కోసం:
అల్లం వెల్లులి ముద్ద – చెంచా, కారం – చెంచా, ధనియాల పొడి – రెండు చెంచాలు, పసుపు – అరచెంచా, గరం మసాలా – అర చెంచా, మిరియాల పొడి – చెంచా, ఉప్పు – తగినంత.
తయారు చేసే విధానం
ఒక గిన్నెలో శుభ్రం చేసిన రొయ్యలపై మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ వేసి బాగా కలపాలి. పది నిమిషాలయ్యాక పొయ్యిమీద గిన్నెపెట్టి నూనె పోయాలి. అందులో రొయ్యలు వేసి వేయించి తీసుకోవాలి. అదే నూనెలో దాల్చినచెక్కా, యాలకులూ, జీలకర్ర వేయించి ఉల్లిపాయముక్కలూ, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. తరువాత అల్లం,వెల్లులి ముద్దా, తగినంత ఉప్పూ, కారం, ధనియాలపొడీ, పసుపూ, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇందులో టొమాటో ముక్కలు వేసి కాసిని నీళ్లు పోయాలి. టొమాటో ముక్కలు ఉడికాక ముందుగా వేయించిపెట్టుకున్న రొయ్యలు వేసి మంట తగ్గించాలి. అవి ఉడికాక దింపేస్తే చాలు.
Prawns Fry / రొయ్యలు, మునగాకు వేపుడు
కావల్సినవి
రొయ్యలు- పావుకేజీ
మునగాకులు – మూడు చెంచాలు
పసుపు- పావు చెంచా
అల్లం, వెల్లుల్లి ముద్ద – చెంచా
కారం- చెంచా
ఉప్పు – తగినంత
ధనియాల పొడి – అర చెంచా
గరంమసాలా – అరచెంచా
నూనె- రెండు చెంచాలు
చింతపండు గుజ్జు- చెంచా
తయారు చేసే విధానం
గిన్నెలో శుభ్రం చేసుకున్న రొయ్యలకు పసుపు, అల్లం, వెల్లుల్లి ముద్ద, కారం, ధనియాలపొడి, గరంమసాలా, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపాలి. అరగంట అయ్యాక పొయ్యిమీద బాణలి పెట్టి అరచెంచా నూనె వేయాలి. అది వేడయ్యాక మునగాకు వేసి బాగా వేయించి విడిగా తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి రొయ్యలు వేసి వేయించుకోవాలి. అవి కాస్త మెత్తగా అయ్యాక మునగాకూ, చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. గిన్నెపై మూత పెట్టి మంట తగ్గి్గంచాలి. రొయ్యలు ఉడికాక కావాలనుకుంటే ఇంకొంచెం ఉప్పు వేసి దింపేయాలి.
Prawns Curry / రొయ్యల కర్రీ
కావల్సినవి
రొయ్యలు – పెద్ద సైజువి 15
ఆవనూనె- నాలుగు చెంచాలు
లవంగాలు – మూడు
బిర్యానీ ఆకులు – మూడు
ఉల్లిపాయ – ఒకటి
అల్లం తరుగు – చెంచా
వెల్లుల్లి రేకలు – రెండు
పచ్చిమిర్చి – రెండు
కొబ్బరి తురుము -పావుకప్పు
కారం – చెంచా
కొబ్బరిపాలు – అరకప్పు
నీళ్లు- అర కప్పు
పసుపు – అర చెంచా ఉప్పు – తగినంత
కొత్తిమీర తరుగు – చెంచా
క్రీం – రెండు చెంచాలు
తయారు చేసే విధానం
రొయ్యల్ని ఒక గిన్నెలో తీసుకుని పసుపూ, ఉప్పు కలిపి పావుగంట సేపు నానబెట్టాలి. ఇంతలో ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి రెబ్బలూ, పచ్చిమిర్చీ, కొబ్బరి తురుమూ, కాసిని నీళ్లు తీసుకుని మిక్సీలో మెత్తని ముద్దలా చేసుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి రెండు చెంచాల ఆవనూనె వేసి రొయ్యల్ని వేసి వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి లవంగాలూ, బిర్యానీ ఆకులు వేయించి ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి. పచ్చివాసన పోయాక కారం, చక్కెర, ఉప్పూ, కొబ్బరిపాలూ పోయాలి. పాలు ఉడికాక రొయ్యలు వేయాలి. కాసేపటికి ఇది కూరలా తయారవుతుంది. అప్పుడు కొత్తిమీర తరుగూ, క్రీం వేసి దింపేయాలి.
Spicy Prawns Curry / మసాలా రొయ్యల కూర
కావల్సినవి
రొయ్యలు – పావుకేజీ
పప్పునూనె- రెండు చెంచాలు
మిరియాల పొడి – చెంచా
కారం – చెంచా
పసుపు – అరచెంచా
ధనియాల పొడి – చెంచా
యాలకులు – రెండు
సోంపు – చెంచా
కరివేపాకు – మూడు రెబ్బలు
ఉల్లిపాయలు – రెండు
టొమాటోలు – రెండు
అల్లం, వెల్లుల్లి ముద్ద – రెండు చెంచాలు
ఉప్పు- తగినంత
కొత్తిమీర తరుగు – 2 చెంచాలు
పొదీనా తరుగు : 2 చెంచాలు
తయారు చేసే విధానం
అడుగు మందంగా ఉన్న గిన్నెను పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక సోంపూ, యాలకులూ, కరివేపాకు వేయాలి. అవి వేగాక ఉల్లిపాయల ముక్కలు వేసి వేయించాలి. ఎర్రగా వేగాక టొమాటో ముక్కలూ, అల్లంవెల్లుల్లి ముద్దా, ధనియాల పొడీ, మిరియాల పొడీ, పసుపూ, కారం, ఉప్పు వేసి మరోసారి వేయించుకోవాలి. టొమాటో ముక్కలు ఉడికి నూనె పైకి తేలాక శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేయాలి. రొయ్యలు మెత్తగా అయ్యాక కొత్తిమీర తరుగు, పొదీనా తరుగు వేసి దింపేయాలి.
Chintakaya-Prawn curry / చింతకాయలతో రొయ్యల కూర
కావల్సినవి
చింతకాయలు- పావుకిలో
పచ్చిరొయ్యలు- అరకిలో
పసుపు- కొద్దిగా
కారం- రెండు చెంచాలు
నూనె- తగినంత
ఉల్లిపాయలు – 2
అల్లం- కొద్దిగా
ఉప్పు- తగినంత
తయారు చేసే విధానం
ముందుగా చింతకాయల్ని కొద్దిగా దంచి అందులోని గింజలను తీసివేయాలి . వీటిని రోట్లోకానీ మిక్సీలో కానీ వేసి పసుపు, ఉప్పు వేసుకుని దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి అందులో ఉల్లిపాయల ముక్కలు, పసుపు వేసుకుని దోరగా వేయించుకోవాలి.
ఇప్పుడు శుభ్రం చేసిన పచ్చిరొయ్యలని అందులో వేసి మగ్గించుకోవాలి. దంచిన అల్లం కూడా వేసుకుని బాగా కలిపి అందులో నూరిన చింతకాయ మిశ్రమాన్ని వేసి కలియ తిప్పాలి. కాసేపటికి మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కారం కూడా వేసి కొద్దిగా నీరు పోసుకుని మూత పెట్టేయాలి. చింత పులుపు రొయ్యలకు పట్టి ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇష్టమైన వాళ్లు కూర ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవచ్చు.
రొయ్యల ఇగురు
కావలసినవి: ప్రాన్స్ – 500 గ్రా; ఉల్లితరుగు – రెండు కప్పులు ఏలకులు – ఆరు; దాల్చినచెక్క – కొద్దిగా; నూనె – కప్పు పచ్చిమిర్చి – ఆరు (పొడవుగా కట్ చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు జీడిపప్పు – 10 పలుకులు; కొత్తిమీర తరుగు – రెండు టీ స్పూన్లుపసుపు – చిటికెడు; గరంమసాలా – రెండు టీ స్పూన్లు గ్రేవీ కోసం:గసగసాలు – రెండు టీ స్పూన్లు; జీడిపప్పు – 10 పలుకులుపుచ్చపప్పు – రెండు టీ స్పూన్లు; కొబ్బరిముక్కలు – అర కప్పు వీటికి నీళ్లు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి.
తయారి:
►ముందుగా ప్రాన్స్‌ను శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి
►స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక ఏలకులు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, ఉల్లితరుగు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగావేయించాలి
►అందులో ఉడికించిన ప్రాన్స్, జీడిపప్పు, పావు కప్పు నీరు, గసగసాల మిశ్రమం, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి తక్కువ సెగ మీద పది నిమిషాల సేపు ఉడికించాలి
►ఇప్పుడు కరివేపాకు, కారం, గరంమసాలా వేసి కలిపిమిశ్రమం దగ్గరగా వచ్చే వరకు సన్న సెగ మీద ఉడికించాలి
►ఇప్పుడు సర్వింగ్‌బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
ప్రాన్స్ మంచూరియా
కావలసినవి: ప్రాన్స్ – 200 గ్రా; అజినమోటో – టీ స్పూన్ఉప్పు – తగినంత; మిరియాల పొడి – రెండు టీ స్పూన్లుకోడిగుడ్డు – ఒకటి; కార్న్‌ఫ్లోర్ – అర కప్పు; మైదాపిండి – పావు కప్పునూనె – డీప్ ఫ్రైకి సరిపడా; పచ్చిమిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు అల్లంవెల్లుల్లి తరుగు –నాలుగు టీ స్పూన్లు; పసుపు – చిటికెడుకారం – టీ స్పూన్; కొత్తిమీర – కట్ట (సన్నగా తరగాలి)
తయారి:
►ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగా కడిగి వేడినీటిలో ఒక మోస్తరుగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి
►ఒక గిన్నెలో అర టీ స్పూన్ అజినమోటో, ఉప్పు, అర టీ స్పూన్ మిరియాల పొడి, కోడిగుడ్డుసొన, కార్న్‌ఫ్లోర్, మైదాపిండి వేసి తగినంత నీటితో గరిటజారుగా కలుపుకోవాలి
►ఆ మిశ్రమంలో ఉడికించిన ప్రాన్స్ వేసి కలపాలి
►పాన్‌లో నూనె పోసి వేడయ్యాక కలిపిపెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి
►ఇప్పుడువేరొక పాన్ పెట్టుకుని పావు కప్పు నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి తరుగు, అర టీ స్పూన్ అజినమోటో, అర టీ స్పూన్ మిరియాలపొడి, ఉప్పు, పసుపు, కారం వేసి దోరగా వేయించాలి
►ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ప్రాన్స్పకోడీని కూడా కలిపి తక్కువ సెగ మీద అయిదారు నిమిషాలు తిప్పి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ప్రాన్స్ మంచూరియా రెడీ.
థాయ్ ప్రాన్ కేక్
కావలసినవి: రొయ్యలు – 300 గ్రా.పండు మిరప పేస్ట్ – 2 టీ స్పూన్లు లెమన్ గ్రాస్ – 3 టీ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ – 3 టీ స్పూన్లు కారం – 2 టీ స్పూన్లు నిమ్మరసం – 2 టీ స్పూన్లు ఉప్పు – 2 టీ స్పూన్లు ఫిష్ సాస్ – 2 టీ స్పూన్లు తులసి ఆకులు – 2 టీ స్పూన్లునూనె – 2 టీ స్పూన్లు చిల్లీ ఆయిల్ – 2 టీ స్పూన్లుఉల్లికాడలు – 25 గ్రా.కార్న్ ఫ్లోర్– 30 గ్రా.అల్లం పేస్ట్ – 2 టీ స్పూన్లు నిమ్మ ఆకులు – 2
తయారి:
►రొయ్యలను శుభ్రపరిచాలి
►చిల్లీపేస్ట్, లెమన్ గ్రాస్, వెల్లుల్లి, కారం, నిమ్మరసం, ఉప్పు, ఫిష్ సాస్, తులసి ఆకులు,చిల్లీ ఆయిల్, ఉల్లికాడలు, కార్న్‌ఫ్లోర్, అల్లంపేస్ట్ రొయ్యలలో వేసి కలపాలి
►తర్వాత చిన్న చిన్న ముద్దలుచేసి, చేత్తో అదమాలి
►వీటినినాన్స్టిక్ పాన్‌పై కొద్దిగానూనె వేసి, వేడయ్యాక రెండు వైపులా కాల్చి, తీయాలి
►గార్లిక్ సాస్‌తో తయారుచేసుకున్న థాయ్ ప్రాన్కేక్లను వేడి వేడిగా సర్వ్‌చేయాలి.
చెట్టినాడు ప్రాన్స్
కావలసినవి: రొయ్యలు (తోక ఉంచాలి) – 8; ధనియాల పొడి– 25 గ్రా.; జీలకర్ర పొడి – 20గ్రా.; మిరియాల పొడి – 16 గ్రా.; స్టార్ అనైజ్ (మార్కెట్లో లభిస్తుంది) – 25 గ్రా.; కల్పసి (మార్కెట్లో లబిస్తుంది) – టీ స్పూన్; మరాఠీమొగ్గ్గ (మార్కెట్లో లభిస్తుంది) – చిటికెడు;జాజికాయ – 1 (పొడి చేయాలి); ఏలకులు – 2 (పొడి చేయాలి);దాల్చిన చెక్క – చిన్న ముక్క (పొడి చేయాలి); లవంగాలు – 3 (పొడి చేయాలి); సోంపు (వేయించి పొడి చేయాలి) – 8 గ్రా.; హంగ్ కర్డ్ (ఒక పలుచనివస్త్రంలో పెరుగు వేసి, వడకట్టి, నీరు తీసేసినది) – 50 గ్రా.; నిమ్మకాయ – 1; పసుపు– చిటికెడు; ఆవనూనె – టీ స్పూన్; అల్లంవెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; ఉప్పు – తగినంత
తయారి:
►ఒక వెడల్పాటి గిన్నెలో శుభ్రపరిచిన రొయ్యలను వేసి, అల్లం వెల్లుల్లిపేస్ట్, నిమ్మరసం వేసి, కలిపి, కొద్దిసేపు మ్యారినేట్ చేయాలి
►మరొక గిన్నెలో ధనియాల పొడి, జీలకర్ర,మిరియాల పొడి, స్టార్ అనైజ్, కల్పసి,మరాఠీమొగ్గ, జాజికాయ పొడి, బిర్యానీ ఆకు, ఏలకుల పొడి, దాల్చిన చెక్క పొడి చేయాలి
►సోంపు పొడి,ఉప్పు వేసి కలపాలి
►దీంట్లో ఆవనూనె, నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి
►ఈ మిశ్రమాన్ని రొయ్యలకుపట్టించి అరగంట ఉంచాలి
►కొబ్బరి పుల్లలకు మ్యారినేట్ చేసిన ప్రాన్స్‌ను గుచ్చి, గ్రిల్ చేయాలి
►వీటిని వేడివేడిగా నచ్చిన చట్నీ కాంబినేషన్‌తో సర్వ్ చేయాలి.
చిల్లీ ప్రాన్స్
కావలసినవి: ప్రాన్స్ – 200 గ్రాఅజినమోటో – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత మిరియాలపొడి – టీ స్పూన్; కోడిగుడ్డు – ఒకటి కార్న్‌ఫ్లోర్ – అర కప్పు మైదాపిండి – పావు కప్పునూనె – డీప్ ఫ్రైకి సరిపడా పొడవుగా తరిగిన క్యాప్సికం – కప్పు పొడవుగా తరిగిన ఉల్లిపాయ – కప్పుæపొడవుగా తరిగినపచ్చిమిర్చి – ఆరు అల్లం వెల్లుల్లి తరుగు – నాలుగు టీ స్పూన్లు; చిల్లీ సాస్ – టీ స్పూన్ సోయా సాస్ – టీ స్పూన్ ఉల్లికాడలు – నాలుగు (సన్నగా తరగాలి)
తయారి:
►ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి
►ఒక గిన్నెలో అజినమోటో, ఉప్పు, మిరియాలపొడి, కోడిగుడ్డుసొన, కార్న్‌ఫ్లోర్, మైదాపిండి వేసి తగినంత నీటితో గరిటజారుగాకలుపుకోవాలి
►ఈ మిశ్రమంలో సగంసగం ఉడికించిన రొయ్యలను వేసి కలపాలి
►పాన్‌లో నూనెవేడయ్యాక ప్రాన్స్‌ని పకోడీల్లా వేసి దోరగావేయించాలి
►వేరొక పాన్‌లో పావు కప్పు నూనెవేసి వేడయ్యాక క్యాప్సికం తరుగు, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చితరుగు వేసిదోరగా వేయించాలి
►అవి వేగాక అందులో రెడ్‌చిల్లీ సాస్, సోయా సాస్, ఫ్రై చేసిన ప్రాన్స్, ఉల్లికాడలను కూడా కలిపి తక్కువ సెగమీద అయిదారు నిమిషాలు బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
జింజర్ ప్రాన్స్
కావలసినవి: ప్రాన్స్ – 200 గ్రాఉల్లిపాయ పేస్ట్ – కప్పుఅల్లంవెల్లుల్లి పేస్ట్ – అరకప్పు అజినమోటో– టీ స్పూన్ఉప్పు – తగినంతమిరియాల పొడి – టీ స్పూన్కారం – రెండు టీ స్పూన్లునూనె – డీప్ ఫ్రైకి సరిపడా టొమాటో సాస్ – టీ స్పూన్సోయా సాస్ – టీ స్పూన్ఫుడ్ (రెడ్) కలర్ – చిటికెడుకొత్తిమీర తరుగు – రెండు టీ స్పూన్లు
తయారి:
►ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగాకడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించిపక్కనపెట్టుకోవాలి
►పాన్‌లో అరకప్పు నూనెపోసి వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్, అల్లంవెల్లుల్లిపేస్ట్, అజినమోటో, మిరియాలపొడి, కారం,ఉప్పు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి
►తర్వాత గ్లాస్ నీరు పోసి ఉడికించాలి
►మిశ్రమం దగ్గర పడేటప్పుడు టొమాటో సాస్,సోయా సాస్, ఫుడ్ కలర్ వేసి కలపాలి
►ఇందులోఉడికించిన రొయ్యలను కలిపి నూనెలో డీప్ ఫ్రైచేయాలి
►దోరగా వేగిన జింజర్ ప్రాన్స్‌ను సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్చేయాలి.
హక్కా ప్రాన్స్
కావలసినవి: రొయ్యలు – 250 గ్రా.కార్న్ ఫ్లోర్ – 30 గ్రా.మైదా – 30 గ్రా.పొట్టు తీసిన వెల్లుల్లి – 40 గ్రా.ఉల్లికాడలు – 20 గ్రా.డార్క్ సోయా సాస్ – 20 గ్రా.పచ్చిమిర్చి – 20 గ్రా.ఎమ్.ఎస్.జి (మోనో సోడియమ్ గల్టమేట్ ఇది మార్కెట్లో లభిస్తుంది)– చిటికెడు ఉప్పు – తగినంతపంచదార – టీ స్పూన్నూనె – 40 మీ.లీ; తెల్ల మిరియాలపొడి – చిటికెడు రెడ్ చిల్లీ ఆయిల్ (మార్కెట్లో లభిస్తుంది) – 20 మీ.లీ; చికెన్ బ్రోత్ పౌడర్ (మార్కెట్లో లభిస్తుంది) – 2 టీ స్పూన్లు
తయారి:
►రొయ్యలను శుభ్రపరుచుకొని, పక్కన ఉంచాలి
►మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, నీళ్లు కలిపి పిండిని జారుగా కలుపుకోవాలి
►కడాయిలో నూనె పోసి, కాగనివ్వాలి
►రొయ్యలను మైదా పిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా వేయించి, తీయాలి
►విడిగా మరొక పాన్‌లో బటర్ వేసి, వేడయ్యాక.. వెల్లుల్లి తరుగు,పచ్చిమిర్చి తరుగు, ఉల్లికాడలు వేయించాలి
►వేయించిన రొయ్యలను వేగుతున్న బటర్ మిశ్రమంలో వేసి కలిపి, రెండు నిమిషాలు వేయించాలి
►చక్రాలుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వేయించిన వెల్లుల్లిరెబ్బలతో ఈ హక్కా ప్రాన్స్‌ను వేడి వేడిగా సర్వ్ చేయాలి.రొయ్యల పకోడా
కావలసినవి: రొయ్యలు – 25 లేదా 30, శనగపిండి – పావు కప్పు, బ్రెడ్ పౌడర్ – 4 టేబుల్ స్పూన్లు, బియ్యప్పిండి – 1 టేబుల్ స్పూన్, మొక్క జొన్న పిండి – 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, కారం – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్, నీళ్లు, నూనె – సరిపడా
తయారీ: ముందుగా రొయ్యలు బాగా కడిగి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉప్పు, పసుపు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రెడ్ పౌడర్ వేసి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ బజ్జీల పిండిలా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో నూనె వేడి చేసుకుని.. ఒక్కో రొయ్యను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.
గోంగూర రొయ్యలు

- పెద్ద రొయ్యలు-పావుకేజీ,
- గోంగూర-పావుకేజీ
- ఉప్పు-రెండు టీస్పూన్లు
- పచ్చిమిర్చి -ఎనిమిది
- కారం-ఒక టీస్పూను
- పసుపు-అర టీస్పూను
- చింతపండు- ఒక టీస్పూను
- మినపప్పు-ఒక టీస్పూను
- జీలకర్ర-పావు టీస్పూను
- ఆవాలు-పావు టీస్పూను
- వెల్లుల్లి-ఎనిమిది, కరివేపాకు రెండు రెమ్మలు
- ఎండు మిర్చి-ఒకటి
- నూనె-మూడు టీస్పూన్లు
- నీరు-కొద్దిగా
తయారీ :
- స్టౌ వెలిగించి కుక్కర్ పెట్టి నీరు పోయాలి.
- అందులో గోంగూర వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, చింతపండు, ఉప్పు వేసి కుక్కర్లో నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి.
- తర్వాత దాంట్లో కారం, వేసి మెత్తగా మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి.
- మరో కడాయి పెట్టి నూనె, వెల్లుల్లి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, రొయ్యలు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేయించుకోవాలి.
- దీంట్లో ఉడకబెట్టిన గోంగూర వేసి బాగా కలపాలి.
- తర్వాత ఉప్పు కారం రుచికి తగినంత వేసుకుని బాగా కలిపి ఉడకనివ్వాలి.
- అంతే వేడి వేడి గోంగూర రొయ్యలు కూర రెడీ