టీ తాగే ముందు మంచి నీళ్లు ఎందుకు తాగాలి

టీ తీసుకునే ముందు ఒక గ్లాసు నీరు త్రాగడానికి కారణం అది కడుపులోని ఆమ్ల స్థాయిలను తగ్గిస్తుంది. ఏదైనా పదార్ధం యొక్క pH విలువ దాని ఆమ్ల స్థాయిలను సూచిస్తుంది. టీలో pH విలువ 6 ఉంటుంది (ఇది ఆమ్లమైనది). నీటి pH విలువ 7 తటస్థంగా ఉంటుంది. మీరు అధిక పిహెచ్ స్థాయి కలిగిన పానీయాలను తీసుకునేటప్పుడు ఇవి గుండెల్లో మంట, కడుపు గోడలు దెబ్బతినడం, పెద్దప్రేగు క్యాన్సర్ మొదలైన ఇతర వ్యాధులకు దారితీస్తుంది. మీరు టీ కి ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల, ఇది యాసిడ్ ఉత్పత్తి అరికడుతుంది, యాసిడ్ స్థాయిలను పలుచన చేయడమే కాదు, కడుపుపై నష్టాన్ని తగ్గిస్తుంది, అధిక ఆమ్ల స్థాయి కారణంగా దంతాలపై టీ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. త్రాగునీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది మరియు శరీరం నుండి విషాన్ని బయటకు తీయడానికి సహాయపడుతుంది, తద్వారా మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.

అలాగే కాఫీకి pH విలువ 5 ఉంటుంది (ఇది కూడా ఆమ్ల పరిధిలో వస్తుంది) కావున కాఫీ తీసుకునే ముందు ఒక గ్లాసు నీరు తాగడం మంచిది.

ప్రస్తుతానికి అప్రస్తుతమైన కూడా నేను ఒకచోట ఎక్కడో నీరు గురించిన డెమో క్లాస్ లో విన్నాను, మనం తాగే కూల్ డ్రింక్లు pH విలువ 2.5 ఉంటుంది, దీని నుండి మన శరీరాన్ని కాపాడుకోవాలి అంటే ఒక గ్లాస్ కూల్ డ్రింక్ కి కనీసం 30 గ్లాసులు నీరు తాగితేగాని లోపల తటస్తం అవ్వదు అని!!!

గ్రీన్‌ టీలో ఈ రసం కలిపి తాగితే ఈజీగా బరువు తగ్గుతారు

మీరు రెగ్యులర్ గా తీసుకునే గ్రీన్ టీ కు కాసిన్ని మార్పులు చేయండి. సూతింగ్ లెమనేడ్ ను సిద్ధం చేసుకోండి. మీకు గ్రీన్ టీ అంటే ఇష్టమైనా సరే రోజూ అదే పనిగా దాన్నే తీసుకుంటే మీకు బోర్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ లో వివిధ రకాల గ్రీన్ టీలు అందుబాటులో ఉన్నా మీ డ్రింక్ ను కొంచెం ఫ్లేవర్ తో మరికొంచెం టేస్ట్ తో మరింత డెలిషియస్ గా మార్చుకోవడం వల్ల మీరు గ్రీన్ టీ ను ఆస్వాదించగలుగుతారు. కాబట్టి, రెగ్యులర్ గ్రీన్ టీ కు కాస్తంత టేస్టీ ట్విస్ట్ నివ్వండి. దీని ద్వారా హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందండి.

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయన్న విషయం తెలిసిందే. అందుకే, ఇది చాలామందికి ఆల్ టైమ్ ఫ్యావరేట్ డ్రింక్. ఎండాకాలంలో ఈ డ్రింక్ ను తీసుకునేందుకు ఎక్కువగా ప్రిఫర్ చేయరు. అంతేకదా? అప్పుడు చల్ల చల్లటి నిమ్మరసాన్ని దీనికి జోడిస్తే ఆ టేస్టే వేరు. ఇలా చేయడం వల్ల ఈ డ్రింక్ నుంచి కూలింగ్, సూతింగ్ అలాగే హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ లభిస్తాయి. గ్రీన్ టీతో పాటు నిమ్మరసం బెనిఫిట్స్ కూడా పుష్కలంగా అందుతాయి. 

కావలసిన పదార్థాలు

  • వేడి నీళ్ళు – అరకప్పు
  • గ్రీన్ టీ బ్యాగ్
  • ఐస్
  • నిమ్మరసం
  • తేనె

ప్రాసెస్:

అరకప్పు వేడి నీళ్లల్లో గ్రీన్ టీ బ్యాగ్ ను పెట్టండి. వడకట్టండి. ఐస్, నిమ్మ మరియు తేనెను కలపండి. బాగా కలపండి. ఈ డ్రింక్ ను ఆస్వాదించండి. ఈ డ్రింక్ ను మీకు నచ్చినప్పుడు ప్రిపేర్ చేసుకుని తాగండి.

హెల్త్ బెనిఫిట్స్:

నిమ్మ మరియు తేనెతో కలిపిన గ్రీన్ టీ అనేది మెటాబాలిజాన్ని పెంపొందిస్తుంది. బ్యాడ్ బ్రీత్ ప్రాబ్లెమ్ ను తగ్గిస్తుంది. లోపల నుంచి డీటాక్స్ చేస్తుంది. మరోవైపు లేమనేడ్ లో విటమిన్ సి పుష్కలంగా కలిగి ఉంటుంది. కాబట్టి, ఈ డ్రింక్ ను కచ్చితంగా తాగి తీరాలి. నవంబర్ 2014లో జర్నల్ ఆఫ్ ఫుడ్ ప్రోసెసింగ్ అండ్ టెక్నాలజీలో పబ్లిష్ ఐన స్టడీ ప్రకారం సిట్రస్ జ్యూస్ అనేది గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ ను శరీరానికి అందుబాటులో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. దాంతో, శరీరం గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ ను సులభంగా గ్రహించగలుగుతుంది.

వెయిట్ లాస్..

వెయిట్ లాస్ కి సంబంధించి ఎన్నో డైట్ ప్లాన్స్ తో పాటు మరెన్నో ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో దేన్ని ఫాలో ఐతే మంచిదో అన్న విషయంలో చాలామంది కాస్తంత కన్ఫ్యూజన్ కు గురవుతున్నారన్న విషయం వాస్తవమే. ఐతే, ఖరీదైన మీల్ ప్లాన్స్ అనేవి వెయిట్ లాస్ ను వేగవంతం చేస్తున్నాయని ప్రకటిస్తున్నా ఇంట్లోనే హ్యాపీగా వెయిట్ లాస్ కి సపోర్ట్ చేసే రెమెడీస్ అనేకం ఉన్నాయి. వాటిలో ఈ సింపుల్ ట్రిక్ తో చిరాకు పుట్టించే బెల్లీ ఫ్యాట్ ను తరిమికొట్టవచ్చు. అదనపు బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు.

గ్రీన్ టీ నుండి అనేక హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చని కొన్ని శతాబ్దాల నుంచి హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్ చెబుతూనే ఉన్నారు. ఈ విషయంపై అనేక స్టడీస్ కూడా జరిగాయి. వాటిలో కూడా గ్రీన్ టీ లో ఉండే కెఫైన్ తో పాటు ఫ్లెవనాయిడ్స్ అనేవి మెటాబాలిజాన్ని బూస్ట్ చేస్తాయని చెప్పబడి ఉంది. ఫ్యాట్ ను బ్రేక్ డౌన్ చేయడానికి అలాగే ప్రాసెస్ చేయడానికి ఇవి ఎంతో హెల్ప్ చేస్తాయని స్టడీస్ వెల్లడిస్తున్నాయి.

ఒక స్టడీ ప్రకారం గ్రీన్ టీను తరచూ తీసుకున్నవారు పన్నెండు వారాల్లో సగటున ఒకటిన్నర కిలోల బరువు తగ్గారు. వారు తమ డైట్ లో ఎటువంటి మార్పులూ చేర్పులో చేసుకోలేదు. కాటెచిన్ అనే ఫ్లెవనాయిడ్ మరియు గ్రీన్ టీ లో ఉండే కెఫైన్ కాంబినేషన్ వల్ల ఇదంతా సాధ్యమైందని వారంటున్నారు. ఈ రెండూ బాడీలోని ఎనర్జీను వాడే మోతాదును పెంచుతాయట. అందుకే, వెయిట్ లాస్ ప్రక్రియ ఆరోగ్యంగా జరుగుతుందని స్టడీస్ చెబుతున్నాయి.

కేవలం గ్రీన్ టీ మాత్రమే అనేక హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందన్న విషయం తెలిసిందే. ఐతే, ఈ గ్రీన్ టీలో తాజాగా పిండిన నిమ్మరసాన్ని కలిపితే ఇది అద్భుతమైన డీటాక్స్ డ్రింక్ గా మారి మీ బాడీలోని టాక్సిన్స్ ను బయటికి పంపించేందుకు హెల్ప్ చేస్తుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అలాగే శరీరానికి తగినంత న్యూట్రిషన్ కూడా ఈ విధంగా అందుతుందని చెబుతున్నారు. ఇందులో కేలరీస్ అనేవి లేకపోయినా మెటాబాలిజాన్ని బూస్ట్ చేసే ప్రాపర్టీస్ మాత్రం పుష్కలంగా లభిస్తాయి. డిటాక్సిఫికేషన్ అలాగే క్లీన్సింగ్ తో శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వెయిట్ ని హెల్తీగా మెయింటెయిన్ చేయాలన్నా అలాగే వెయిట్ ను తగ్గించుకోవాలన్నా కూడా ఈ రెండూ ముఖ్యమే. రిజల్ట్స్ ఆశాజనకంగా ఉండాలంటే రోజుకు వందకేలరీలను అదనంగా కరిగించగలగాలి. రోజుకు మూడు సార్లు ఈ మ్యాజిక్ డ్రింక్ ను తాగగలిగితే ఫలితం ఉంటుంది.

గ్రీన్ టీతో పాటు నిమ్మలో శక్తివంతమైన ఫ్యాట్ బర్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ పై పోరాడతాయి. ఇరిటేటెడ్ స్కిన్ ను సూత్ చేస్తాయి. అలాగే, వీటిలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఫైన్ లైన్స్ తో పాటు ముడతల సమస్యలు తగ్గుతాయి.

అదేవిధంగా, నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అలాగే వెయిట్ లాస్ కి తోడ్పడే న్యూట్రియెంట్స్ కూడా లభిస్తాయి. స్ట్రోక్, ఆస్త్మా, క్యాన్సర్ రిస్క్ లను తగ్గించే గుణం నిమ్మలో ఉంది. రోజూ నిమ్మ వంటి ప్లాంట్ ఫుడ్స్ ను తీసుకుంటే డయాబెటిస్, ఒబెసిటీ, హార్ట్ డిసీజ్ లకు గురయ్యే రిస్క్ చాలామటుకు తగ్గుతుందని స్టడీస్ చెబుతున్నాయి. కాబట్టి, ఈ డెలిషియస్ డ్రింక్ తో హెల్తీగా ఉండండి. వెయిస్ట్ లైన్ కూడా ఆటోమేటిక్ గా స్లిమ్ అవుతుంది.

Kashmiri Tea / కశ్మీరీ చాయ్‌

కావాల్సినవి
మంచినీళ్లు: 12 కప్పులు
గ్రీన్‌ టీ ఆకులు: 2 టేబుల్‌స్పూన్లు
యాలకులు: నాలుగు
అనాసపువ్వు: ఒకటి
లవంగాలు: మూడు
పాలు: 3 కప్పులు
పంచదార: రుచికి సరిపడా
బేకింగ్‌సోడా: చిటికెడు
దాల్చిన చెక్క: అంగుళం ముక్క

తయారుచేసే విధానం
మందపాటి గిన్నెలో ఆరు కప్పుల మంచినీళ్లు పోసి సిమ్‌లో మరిగించాలి. అందులో గ్రీన్‌ టీ ఆకు వేసి, మరో పది నిమిషాలు సిమ్‌లోనే మరిగించాలి. తరవాత సోడా వేయాలి. ఇప్పుడు టీ రంగు గులాబీరంగులోకి మారిపోతుంది. వెంటనే మిగిలిన ఆరు కప్పుల చల్లని నీళ్లు పోసి వడబోయాలి.
ఇప్పుడు వడబోసిన టీ కషాయంలో యాలకులపొడి, దాల్చినచెక్క, లవంగాలు, అనాసపువ్వు వేసి మూత పెట్టి సగమయ్యేవరకూ మరిగించాలి. తరవాత నెమ్మదిగా పాలు పోసి బాగా కలపాలి. చివరగా చిటికెడు ఉప్పు, పంచదార వేస్తే నోరూరించే కశ్మీరీ చాయ్‌ రెడీ. దీన్ని బాదం, పిస్తాలతో కలిపి అందించాలి.

Dhum Tea / దమ్‌ కీ చాయ్‌

కావాల్సినవి
మంచినీళ్లు: 3 కప్పులు
పాలు: 4 కప్పులు
టీపొడి: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు
పంచదార: 3 టేబుల్‌స్పూన్లు
కోవా: 3 టేబుల్‌స్పూన్లు
యాలకులు: మూడు
అల్లంతురుము: టేబుల్‌స్పూను

తయారుచేసే విధానం
టీ పాత్రలో నీళ్లు పోసి మరిగించాక దంచిన యాలకులు, అల్లంతురుము వేసి ఆ నీళ్లు సగమయ్యేవరకూ మరిగించాలి. తరవాత టీపొడి, పంచదార వేసి మూతపెట్టి సిమ్‌లో మరిగించాలి. సుమారు పది నిమిషాలకు ఆ నీళ్లు సగమవుతాయి. అదేసమయంలో మరో పాత్రలో పాలు పోసి కాచాలి. అవి మరగడం మొదలవగానే సిమ్‌లో పెట్టి మూడింట రెండొంతులు అయ్యేవరకూ కాచాలి. ఇప్పుడు పాలల్లో కోవా కూడా వేసి పూర్తిగా కలిసేవరకూ కలిపి ఓ నిమిషం మరిగించి దించాలి.
ఇప్పుడు కప్పులో ఒక వంతు టీ డికాక్షన్‌ పోసి నాలుగు వంతుల పాల మిశ్రమం వేసి స్పూనుతో తిప్పి అందించాలి.

Spicy Tea / స్పైసీ చాయ్‌

కావాల్సినవి
చిక్కని పాలు: 2 కప్పులు
మంచినీళ్లు: 2 కప్పులు
సోంపు: పావుటీస్పూను
మిరియాలు: నాలుగు
యాలకులపొడి: అరటీస్పూను
అల్లంతురుము: అరటీస్పూను
పంచదార: మూడున్నర టీస్పూన్లు
దాల్చినచెక్క: ఒకటిన్నర అంగుళంముక్క
బ్లాక్‌ టీ: 5 టీస్పూన్లు

తయారుచేసే విధానం
దాల్చినచెక్క, యాలకులపొడి, మిరియాలు, సోంపు అన్నీ కలిపి బాగా దంచాలి.
గిన్నెలో పాలు పోసి మూడింట రెండొంతులు అయ్యేవరకూ మరిగించాలి. తరవాత పంచదార, మసాలాపొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి సిమ్‌లో మూడు నిమిషాలు మరిగించాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి. మరో గిన్నెలో నీళ్లు పోసి సగమయ్యేవరకూ మరిగించాక టీ ఆకు వేసి మరో నిమిషం మరిగించి స్టవ్‌ ఆఫ్‌చేసి మూతపెట్టి ఉంచాలి. సుమారు ఐదు నిమిషాల తరవాత డికాక్షన్‌ను వడబోసి మరిగే పాలల్లో పోసి సిమ్‌లో నిమిషం మరిగించి అందించాలి.

Irani Tea /ఇరానీ చాయ్‌

కావాల్సినవి
చిక్కని పాలు(హోల్‌మిల్క్‌): 4 కప్పులు
కోవా: 4 టేబుల్‌స్పూన్లు
పంచదార: 2 టీస్పూన్లు
టీపొడి: 2 టేబుల్‌స్పూన్లు
మంచినీళ్లు:3 కప్పులు

తయారుచేసే విధానం
గిన్నెలో టీ పొడి వేసి నీళ్లు పోసి మూతపెట్టి సుమారు అరగంటసేపు మరిగించాలి. అది వడబోస్తే సుమారు అరకప్పు అవుతుంది. మరో గిన్నెలో పాలు పోసి సుమారు ఒకటిన్నర కప్పులు అయ్యేవరకూ మరిగించాలి. తరవాత కోవా, పంచదార వేసి కరిగేవరకూ వేగంగా కలపాలి. ఇప్పుడు ఇందులో వడబోసిన డికాక్షన్‌ వేసి కలిపితే హైదరాబాదీ ఇరానీ చాయ్‌ రెడీ.

మసాలా టీ / Masala Tea

కావాల్సినవి
అల్లం పేస్ట్ : అరస్పూను
చెక్క, లవంగాలు, యాలకులు : ఒక స్పూను
నిమ్మరసం : అరస్పూన్
టీ పొడి : రెండు స్పూన్లు
తులసి, పొదినా ఆకులు : పది
తేనె లేక పంచదార : ఒక స్పూను


తయారు చేసే విధానం :
రెండు గ్లాసుల నీరు తీసుకుని మరగబెట్టి నిమ్మరసం తప్ప మిగతా వాటిని వేసి బాగా మరిగించాలి. మంచి సువాసన వచ్చేవరకు మరగబెట్టాలి. తరువాత కొద్దిగా చల్లారనిచ్చి నిమ్మరసం, తేనె లేక పంచదార కలిపి తాగవచ్చు.
ఈ మసాలా టీ తాగటం వలన జలుబు, దగ్గునుండి ఉపశమనం కలుగుతుంది. పాలు లేకుండా తాగడం వలన కొవ్వు సమస్య ఉండదు. ఉదయం, సాయంత్రం తాగితే తక్షణం శక్తి వస్తుంది.

గ్రీన్‌ టీ / Green Tea

తయారు చేసే విధానం

నీళ్ళు బాగా మరగపెట్టి దించుకొని ఈ నీళ్లలో గ్రీన్ టీ ఆకులు కొద్దిగా వేసి మూతపెట్టి 3 నిమిషాల సేపు ఉంచాలి. తరువాత వడపోసుకొని త్రాగవచ్చు. మంచి ఫలితాలకోసం గ్రీన్ టీలో పాలు గానీ, పంచదార గానీ కలుపకూడదు. 2,3 చుక్కల నిమ్మరసం పిండుకోవచ్చు.

గ్రీన్‌ టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. గ్రీన్ టీతో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో సుగుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పలు రకాలైన క్యాన్సర్‌లనుండి కాపాడడంలో తోడ్పడతాయి. రోజూ గ్రీన్‌ టీని తాగడం వల్ల గుండె జబ్బులనుండి మనల్ని కాపాడుతుంది. శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ పెరుగుదలను నిరోధిస్తుంది. గుండె సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. గ్రీన్‌టీలో తక్కువ కెలోరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారు ఈ టీని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

శరీరంలోని కొలెస్టరాల్‌ను కరిగించడంలో గ్రీన్‌టీ చక్కగా తోడ్పడుతుంది. ఫలితంగా బరువు తగ్గడం జరుగుతుంది. వయసు పెరుగుదల ప్రభావం చర్మంపై ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావాన్ని గ్రీన్‌టీ తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను అదుపులో ఉంచుతుంది.

దాల్చినచెక్క టీ / Cinnamon Tea

తయారు చేసే విధానం
పాలు, డికాషన్ మరిగేటప్పుడు కొద్దిగా దాల్చిన చెక్కను మొత్తగా పొడిగా నూరుకొని డికాషన్ లో వేసి బాగా మరగనివ్వాలి. శరీరంలో పేరుకున్న కొవ్వుని తగ్గించుకోవడానికే కాదు… ఏకాగ్రతను పెంచడంలోనూ దాల్చిన చెక్క బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందట. అందుకే దాంతో చాయ్‌ చేసుకున అప్పుడప్పుడూ తాగవచ్చు.

దాల్చిన చెక్కలో సాధారణ యాంటీఆక్సిడెంట్లతో పోలిస్తే పాలీఫినాల్‌ అనే శక్తిమంతమైన పోషకం ఉంటుంది. అందుకే దీనిని సూపర్‌ఫుడ్‌ అంటారు. ఇది రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువ తక్కువ కాకుండా క్రమబద్ధీకరిస్తుంది. పరీక్షల సమయంలో, పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు మనం తాగే చాయ్‌లో కొద్దిగా దాల్చినచెక్క పొడి వేసుకుంటే మంచిది. ఇది మెదడు పనితీరును చురుగ్గా మారుస్తుంది.

కొవ్వు సమస్య ఉన్నవారు దాల్చిన చెక్క టీని రోజూ తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. శరీరాన్ని ఇబ్బందిపెట్టే వాపూ, మంటా, అలెర్జీతో పాటూ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుందీ చాయ్‌. దాల్చిన చెక్కని పొడి కొట్టుకుని పెట్టుకుంటే ఆరునెలలు ఉంటుంది. చెక్క రూపంలోనే ఉంచితే ఏడాది పాటు దాని సుగుణాలు పదిలంగా ఉంటాయి. దీన్ని అచ్చంగా చాయ్‌లా చేసుకోవచ్చు లేదా మామూలు టీలోనూ కొద్దిగా కలుపుకోవచ్చు.

గుండె ఆరోగ్యానికి ఈ చాయ్‌ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది.

తులసి టీ / Tulasi Tea

గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ, వైట్‌ టీ.. ఇలా రకరకాల టీలు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే ఈసారి తులసి చాయ్‌ కూడా తాగి చూడండి. దానివల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనం ఉంటుంది.

తులసి ఆకుల్ని ఉడికించి నిమ్మరసం మాత్రమే చేర్చి తీసుకుంటే మధుమేహం ఉన్నవారికి ఎంతో మంచిది. ఇందులో ఉండే పాలీశాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపు చేస్తాయి.

తులసి టీ తాగడం వల్ల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా అంది.. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలూ దూరమవుతాయి. చర్మ కణాలను పునరుద్ధరించే శక్తి ఈ టీ సొంతం.

తరచూ జలుబుతో బాధపడేవారు రోజుకు రెండు కప్పులు ఈ టీ తాగాలి. దీనిలోని పోషకాలు జలుబుతోపాటూ ఇతర ఇన్‌ఫెక్షన్లూ దూరం చేస్తాయి.

ఈ టీలో లభించే బీటాకెరొటిన్లు గుండెకు మేలు చేస్తాయి. గుండెకు రక్త సరఫరా సక్రమంగా ఉండటానికి దోహదం చేస్తాయివి. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందీ టీ.

అల్లం టీ / Zinger Tea

తయారు చేసే విధానం :
పాలు, డికాషన్ మరిగేటప్పుడు కొద్దిగా అల్లం ముక్కను శుభ్రం చేసుకొని మొత్తగా దంచి డికాషన్ లో వేసి బాగా మరగనివ్వాలి.

అల్లం చాయ్‌ తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు చేసే ఆమ్లాలు విడుదలవుతాయి. జీర్ణాశయాన్ని శుభ్రం చేసి అరుగుదల బాగుంటుంది. అజీర్తిని సమస్య ఎదురుకాదు. వికారం ఉన్నా తగ్గుతుంది. ఎంతో ఉపశమనంగా ఉంటుంది.

శ్వాసకోశ సంబంధ సమస్యలున్నవారు ఈ చాయ్‌ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. అలానే జలుబూ, అలర్జీల వంటివి కూడా అల్లం తీసుకోవడం వల్ల త్వరగా తగ్గుతాయి.
అల్లంలో అమినో ఆమ్లాలూ, విటమిన్లూ, ఖనిజాలూ.. అధికంగా ఉండటం వల్ల హృదయానికి రక్తప్రసరణ సక్రమంగా అందుతుంది. హృద్రోగాలూ ఇబ్బంది పెట్టవు.

నెలసరి సమయంలో చాలామంది కడుపునొప్పితో బాధపడుతుంటారు. అలాంటప్పుడు కప్పు అల్లం చాయ్‌లో చెంచా తేనె వేసి తాగితే ఫలితం కడుపు నొప్పితోపాటూ, అధిక రక్తస్రావం కూడా తగ్గుతుంది.