మొలకలు – లాభాలు

మొలకలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. శరీరానికి మేలు చేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి గోధుమ ,పెసలు,శెనగలు, మెంతులు, బఠాణీలు,రాగులు. మొలకెత్తిన గింజల్లో ఇనుము, ఫాస్పరస్, కాల్షియమ్,ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, ఏ,సి, బి 6, కే మొదలైన విటమిన్ లు వున్నాయి. మొలకెత్తిన గింజల్లో మాంసకృత్తులు కూడా చాలా ఎక్కువ లభిస్తాయి. శాఖా హారులు కి మంచి మాంస కృత్తులు కలిగిన శాఖా హారం . విటమిన్ లోపాలతో బాధ పడే వాళ్ళు మొలకెత్తిన గింజలు తింటే ,త్వరగా రోగనిరోధకశక్తి నీ పొందుతారు. మొలకలలోని పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను సక్రమంగా పని చేస్తుంది.కడుపు వుబ్బరం వున్న వాళ్ళు కూడా ఈ మొలకలు తిన వచ్చు. తొందరగా అరుగుతాయి. నానబెట్టిన లేదా వు డ క బెట్టిన గింజలు కంటే మొలకెత్తిన గింజల్లో 27 శాతం ఎక్కువ ‘ ఏ’…

Read More

Barley Java….బార్లీ జావ

కావలసినవిబార్లీ – ఒక కప్పునీళ్లు – ఐదు కప్పులునిమ్మ రసం – ఒక టీ స్పూనుతేనె – ఒక టేబుల్‌ స్పూనువెల్లుల్లి రెబ్బలు – 2దాల్చిన చెక్క పొడి – చిటికెడుఅల్లం ముక్క – చిన్నదితయారు చేసే విధానంబార్లీని శుభ్రంగా కడిగి ఐదు కప్పుల నీళ్లు, వెల్లుల్లి రెబ్బ, దాల్చిన చెక్కపొడి జత చేసి, సన్నని మంట మీద సుమారు అరగంట సేపు మూడు వంతులు అయ్యేవరకు మరిగించి, దింపి చల్లారాక వడబోయాలి. చల్లారిన తరవాత నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవచ్చు.

Read More

Saggubiyyam Java….సగ్గు బియ్యం జావ

కావలసినవిసగ్గు బియ్యం – అర కప్పుబెల్లం పొడి – అర కప్పుపాలు – 3 కప్పులునీళ్లు – ఒకటిన్నర కప్పులు ఏలకుల పొడి – పావు టీ స్పూనుకిస్‌మిస్‌ – ఒక టేబుల్‌ స్పూనుజీడి పప్పులు – ఒక టేబుల్‌ స్పూనునెయ్యి – ఒక టేబుల్‌ స్పూనుతయారు చేసేవిధానంసగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి సుమారు గంటసేపు నానబెట్టాక, కుక్కర్‌లో ఉంచి ఉడికించుకోవాలి వేరోక పాత్రలో పాలు, నీళ్లు పోసి బాగా కాగిన తరువాత సగ్గుబియ్యం వేసి బాగా తిప్పాలి. బాగా చిక్కగా అయిన తరవాత బెల్లం పొడి లేదా పంచదార జత చేసి మరోమారు కలపాలి. ఏలకుల పొడి, డ్రైఫ్రూట్స్‌ వేసి బాగా కలిపి దించేయాలి.

Read More

Ragi Ambali…రాగి అంబలి

కావలసినవిరాగిపిండి : 2 టీస్పూన్లునీరు : అరలీటరుపల్చటి మజ్జిగ : ఒక గ్లాసుఉప్పు : తగినంతజిలకర్ర పొడి : 1 స్పూనుకొత్తిమీర : కొద్దిగాతయారు చేయు విధానంతయారు చేయువిధానం : నీళ్లను ఒక గిన్నెలో మరిగించాలి. చిన్నగిన్నెలో నీరుపోసి అందులో రాగిపిండి వేసి, ఉండలు లేకుండా కలపాలి. మరుగుతున్న నీటిలో రాగిపిండి వేసి మంట తగ్గించి ఉడికించి దించాలి. చల్లారాక మజ్జిగ, ఉప్పు, జిలకర్ర పొడి వేసి కలపాలి. వడ్డించే ముందు కొత్తిమీర సన్నగా తరిగి చల్లాలి.

Read More

రాగి జావ/ Ragi Java

రాగి పిండి 1/4 కప్పుఉప్పు – తగినంతనీరు – 1 కప్పుమజ్జిగ – తగినంతనూనెఆవాలుకరివేపాకుకొత్తిమీరపచ్చిమిరపకాయలు 2తయారు చేసే విధానం:రాగి పిండిలో కొద్ది నీరు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిని పొయ్యి మీద పెట్టి జావలా అయ్యే వరకు వేడి చేయాలి. తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, మజ్జిగ కలుపుకుని తాగితే రుచి ఉంటుంది. మజ్జిగ బదులు పాలు కూడా కలుపుకోవచ్చు. పాలు కలిపినపుడు పచ్చిమిరపకాయలు వేయకూడదు.

Read More

రాగి దోసె / Ragi Dosa

ఉప్పుడు బియ్యం – 1 కప్పుమినప పప్పు – 1/2 కప్పుసగ్గుబియ్యం – 1/4 కప్పురాగి పిండి – 1 కప్పుమెంతులు – 1/4 టీ స్పూన్ఉప్పు- తగినంతనూనె – తగినంతతయారు చేసే విధానం:ఉప్పుడుబియ్యం, సగ్గుబియ్యం కలిపి 4-5 గంటల వరకు నానబెట్టాలి. మినప పప్పు, మెంతులు కలిపి 3-4 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన ఉప్పుడుబియ్యం, సగ్గుబియ్యం ను మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న మినప పప్పు, మెంతుల్ని కూడా మెత్తగా రుబ్బుకుని ఆ పిండిని ఒక గిన్నెలో వేసుకొని, దానిలోనే రాగి పిండి వేసి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసి కలిపి మూత పెట్టాలి. పిండిని పులియబెట్టి, దోసెలు వేసుకొని కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Read More

జొన్న రవ్వ ఉప్మా / Jonna(Jowar) Ravva Upma

కావలసిన పదార్థాలుజొన్న రవ్వ – 200 గ్రా. (జొన్నరవ్వ ఇప్పుడు సూపర్ బజార్లలలో అమ్ముతున్నారు)ఆవాలు – 1 చెంచామినపపప్పు – 1 చెంచాపచ్చిమిర్చి – 6అల్లం – కొద్దిగానూనె – 2 టేబుల్ స్పూన్ఉప్పు – తగినంతనీరు – 4 గ్లాసులుకరివేపాకు -4 రెమ్మలుతయారు చేసే విధానం:జొన్న రవ్వ ఉడకబెట్టడానికి ఎక్కువ నీరు, సమయం అవసరం. కాబట్టి రవ్వను నీరు పోసి ముందుగానే ఉడకబెట్టి ఉంచుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్కలుగా తరగాలి. నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు మినపపప్పు తరిగిన ముక్కలు వేసి వేయించాలి. వేగిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న జొన్న రవ్వ, ఉప్పు వేసి కలిపి పొయ్యి మీద నుండి దించాలి. నిమ్మరసం కలిపి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

Read More

Korrala Kichidi / కొర్రలతో కిచిడి

కావలసిన పదార్థాలుకొర్రలతో కిచిడీ చాలా ఆరోగ్యకరం. ఇందులో కూరగాయలతో పాటు మెంతికూర లేదా పాలకూర కూడా వాడుకోవచ్చు. ముందుగా కొర్రల్ని ఓసారి కడిగి కనీసం అరగంటసేపు నానబెట్టాలి. తరవాత అడుగు మందంగా ఉన్న గిన్నె లేదా ప్రెషర్‌ కుక్కర్‌లో కిచిడీ తయారుచేసుకోవచ్చు.నూనెకు బదులు నెయ్యి లేదా వెన్న వేసుకుంటే రుచి బాగుంటుంది. వేడి చేసిన నేతిలో చెంచా చొప్పున జీలకర్రా, అల్లం తురుము వేసి కమ్మటివాసన వచ్చేవరకు వేయించుకోవాలి. అందులో ఏదో ఒక ఆకుకూర వేసుకోవాలి. అవి కాస్త వేగాక క్యారెట్‌, బీన్స్‌, క్యాప్సికం, బఠాణీ వేసుకుని వేయించుకోవాలి. అందులోనే తగినంత ఉప్పూ, కారం, పసుపూ, గరంమసాలా వేయాలి. కావాలనుకుంటే టొమాటో ముక్కలూ, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇందులో కడిగి నానబెట్టుకున్న కందిపప్పు లేదా పెసరపప్పూ, కొర్రలూ వేసుకోవాలి. కొర్రలతో సమానంగా పప్పూ వాడితే రుచిగా ఉంటుంది.…

Read More

కొర్ర పులిహోర / Korrala Pulihora

కావలసిన పదార్థాలుకొర్ర బియ్యం – 2 కప్పునీరు (ఎసరు కోసం)- 4 కప్పులునిమ్మరసం – తగినంతనూనె – తగినంతఉప్పు – తగినంతపసుపు – కొద్దిగాకరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆవాలు , జీలకర్ర, మినపప్పు, పల్లీలు – తాళింపు చేసుకోవడానికి తగినంతతయారు చేసే విధానం:కొర్రబియ్యంలో ఎసరు పోసి కుక్కర్ లో అన్నంలాగా వండుకోవాలి.ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పల్లీలు నూనెలో వేసి తాళింపు చేసుకోవాలి. ఉడకబెట్టిన అన్నానికి ఉప్పు, పసుపు కలుపుకొని తాళింపులో వేయాలి. దించిన తరువాత అన్నం కొద్దగా చల్లారిన తరువాత నిమ్మరసం కలుపుకోవాలి.ఈ పులిహోరను కనీసం ఒక గంటసేపు ఉంచితే నిమ్మరసం బాగా పడుతుంది.

Read More

కొర్ర పెసరట్టు/ Korrala Pesarattu

కావలసిన పదార్థాలుకొర్ర బియ్యం – 1 కప్పుపెసరపప్పు – 1 కప్పుఉప్పు – తగినంత తయారు చేసే విధానంకొర్ర బియ్యం, పెసరపప్పు ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. వాటిని కలిపి మెత్తగా రుబ్బుకొని, కొంచెం ఉప్పు కలిపి గరిట జారుగా చేసుకొని పెసరట్లు వేసుకోవాలి

Read More

కొర్ర ఇడ్లీలు / Korrala Idleelu

కావలసిన పదార్థాలుకొర్ర బియ్యం – 3 కప్పులుమినపప్పు – 1 కప్పుమెంతులు – 1 టేబుల్ స్పూన్ఉప్పు – తగినంతతయారు చేసే విధానంకొర్ర బియ్యం, మినప పప్పును వేరు వేరుగా 8-10 గంటలు నానబెట్టుకోవాలి. మెంతులు చేర్చి వాటిని విడి విడిగా రుబ్బుకోవాలి. ఉప్పు చేర్చి రెండిటిని ఇడ్లీ పిండిలాగా బాగా కలుపుకోవాలి . 6-8 గంటలపాటు పులియబెట్టిన తర్వాత ఇడ్లీ వేసుకోవాలి.

Read More

కొర్రలతో అన్నం

కావలసిన పదార్థాలుకొర్రలు – 2 కప్పునీరు – 4 కప్పులుతయారు చేసే విధానం మాములుగా అన్నం వండుకొనే పద్ధతిలోనే వండుకోవచ్చు. బియ్యంలో నీరు పోసి మామూలు అన్నంలాగే వండుకోవచ్చు. కావాలంటే కూరగాయలు కూడా కలుపుకోవచ్చు

Read More

Korra Dosa / కొర్ర దోసె

కావలసిన పదార్థాలుకొర్రలు – 2 కప్పులుమినపప్పు – 1 కప్పుశనగపప్పు – 2 టీ స్పూన్మెంతులు – అర టీ స్పూనుఉప్పు – తగినంతతయారే చేసే పద్దతికొర్రలు, మినపప్పు, శనగపప్పును కడిగి వేరు వేరుగా 4 గంటల సేపు నానబెట్టాలి. ఈ పప్పును కొర్రలను వేరు వేరుగా మిక్సిలో వేసి రుబ్బుకోవాలి. కొంచెం ఉప్పును వేసి రుబ్బుకున్న వాటిని బాగా కలిపి ఒక రాత్రంతా పులియబెట్టాలి. అవసరమైతే కొంచెం నీరు కలిపి దోసె పిండిలాగా తయారుచేసుకొని దోసెలు వేసుకోవాలి.

Read More