చపాతీ వెజ్‌ రోల్స్‌

కావలసినవి: చపాతీలు – 4, క్యాప్సికమ్‌ – 2, టమాటోలు –2, బంగాళదుంపలు – 2(మెత్తగా ఉడికించి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), పచ్చి బటానీలు – 2 టేబుల్‌ స్పూన్లు(నానబెట్టి, ఉడికించుకోవాలి), ఉల్లిపాయ – 2(ముక్కలు కట్‌ చేసుకోవాలి), పచ్చిమిర్చి – 3(ముక్కలు కట్‌ చేసుకోవాలి), మిరియాల పొడి – 1 టీ స్పూన్‌, జీలకర్ర పొడి – 1 టీ స్పూన్‌, పసుపు – అర టీ స్పూన్‌, టమాటో కెచప్‌ – 1 టీ స్పూన్‌, ఉప్పు – సరిపడా, నూనె – తగినంత తయారీ: కళాయిలో నూనె వేసి వేడెక్కాక తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, టమాటోలను సన్నగా తరిగి వాటిని కూడా వేయించాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు, బటానీలు వేసుకుని కూరలా చేసుకోవాలి. అవసరం అనిపిస్తే కాస్త నీళ్లు పోసి ఉడికించాలి. దించడానికి కొన్ని నిమిషాల ముందు జీలకర్ర పొడి, ఉప్పు, టమాటా కెచప్‌…

Read More

Radish Chapateelu … ముల్లంగి చపాతీలు

కావల్సినవి:గోధుమపిండి : 2 కప్పులుముల్లంగి తురుము : కప్పుముల్లంగి ఆకుల తరుగు : పావు కప్పుపచ్చిమిర్చి : 4ఉల్లిపాయ : ఒకటిపసుపు : పావు టీ స్పూన్నూనె : 3 టీ స్పూన్లుఉప్పు : తగినంతకొత్తిమీర : కొద్దిగాతయారీ: ముందుగా ముల్లంగిని సన్నగా తురుముకోవాలి. తురిమిన ముల్లంగిని గట్టిగా చేతితో పిండితే నీరు వస్తుంది. దీనీని విడిగా ఉంచుకోవాలి. తరువాత ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి వేసి అందులో ముల్లంగి తరుగు, ఆకుల తరుగు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, తురుమిన కొత్తిమీర కొద్దిగా. పసుపు, ఉప్పు, ఒక స్పూను నూనె వేసి ముల్లంగి నుండి పిండిన నీరు కలపుకొని వీటిని చపాతి పిండిలా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. తరువాత వీటిని కావల్సిన సైజులో ఉండలు చేసుకొని, చపాతీలు చేసుకుని పెనం వెడెక్కిన తరువాత కొద్దిగా నూనె వేస్తూ…

Read More

సాదా చపాతీలు

ఈ సాదా చపాతీలు ఎక్కువగా చేస్తుంటారు. వీటిని చేయటం కూడా చాలా సులభంకావలిసినవిగోధుమ పిండి : పావు కిలో (సుమారు గా ముగ్గురికి సరిపోతుంది)ఉప్పు : కొద్దిగినూనె : ఒక టేబుల్ స్పూన్వేడి నీరు : కొద్దిగాతయారే చేసే విధానంఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి, తగినంత (సుమారుగా ఒక స్పూను) ఉప్పు వేసి, స్పూన్ నూనె కూడా వేసి వేడి నీరు కొద్ది కొద్దిగా పోస్తూ చపాతీ పిండిని మృదువుగా కలుపుకోవాలి. తరువాత తడిపిన నూలు వస్త్రం కప్పి అరగంట సేపు నాననివ్వాలి. తరువాత ఈ పిండిని కావలిసిన సైజులో తీసుకొని చపాతీలు ఒత్తుకోవాలి.స్టవ్ వెలిగించి పెనం పెట్టి కొద్దిగా నూనెవేసి చపాతీలను రెండుప్రక్కలా చక్కగా కాలనివ్వాలి.ఈ చపాతీలకు బంగాళా దుంప కూర, అరటి కూర, రాజ్మా గింజలతో చేసిన కూర, టమాటో కూర మంచి కాంబినేషన్

Read More

మెంతి చపాతీలు

మెంతి చపాతీలు ఆరోగ్యానికి మంచివి. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కావలిసినవిమెంతి ఆకులు : 150 నుండి 200 గ్రాములుగోధుమపిండి : పావుకిలోఅల్లం ముక్క : చిన్నదిపచ్చిమిర్చి : 4 కాయలుజీలకర్ర : 1 స్పూన్పెరుగు : 2 స్పూన్లుకొద్దిగా నూనెతయారు చేసే విధానంముందుగా మెంతి ఆకులను శభ్రంగా కడగాలి. 3 నిమిషాల పాటు ఉప్పునీటిలో నానబెట్టి కడిగితే మందుల అవశేషాలు తొలగిపోతాయి. మెంతి ఆకులను చిన్న చిన్నగా తరుగుకోవాలి. పచ్చిమిర్చి, అల్లంను పేస్ట్ చేసుకోవాలి.తరువాత ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి, మెంతి ఆకులు అల్లం, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పెరుగు, ఒక చెంచా నూనె వేసి తగినంత ఉప్పు కలిపి కొద్ది కొద్దిగా నీరు పోస్తూ చపాతీ పిండి ముద్దగా కలుపుకోవాలి. పిండి గట్టిగా మృదువు ఉండాలి. తరువాత మీకు కావలిసిన సైజులో పిండి…

Read More

పాలకూర చపాతీలు

కావలిసినవిగోధుమ పిండి : పావు కిలోపాలకూర : 150 నుండి 200 గ్రాములుపచ్చిమిర్చి : 4 కాయలుఅల్లం : చిన్న ముక్కనూనె : 2 స్పూన్లుఉప్పు : తగినంతనూనె : చపాతీలు కాల్చటానికి కొద్దిగాతయారు చేయు విధానంముందుగా పాలకూరను ఉప్పునీటిలో 3 నిమిషాలు ఉంచి శుభ్రంగా కడగాలి. కాడలు తీసి వేసి ఆకులను మాత్రమే తీసుకోవాలి. పాలకూరను కొద్దిగా నీరు పోసి ఉడికించి మొత్తగా గ్రైండ్ చేయాలి.తరువాత ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, తగినంత ఉప్పు, 2 స్పూన్ల నూనె వేసి కొద్దిగా నీళ్ళు పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. తరువాత మనకు కావలిసిన సైజులో పిండి ముద్దను తీసుకొని చపాతీలు తయారు చేసుకోవాలి.స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కిన తరువాత కొద్దిగా నూనె వేసి తయారుగా ఉన్న చపాతీలను రెండు వైపులా…

Read More