ఓట్స్ ఇడ్లీ

కావలసినవి :
ముప్పావు కప్పు ఓట్స్
అరకప్పు రవ్వ
ఒక కప్పు పెరుగు
కొద్దిగా బేకింగ్ పౌడర్
తగినంత ఉప్పు
రెండు స్పూన్ల నూనె
ముప్పావు స్పూన్ జీలకర్ర
కొద్దిగా ఇంగువ
మిరియాల పొడి : పావు స్పూన్
చిన్న అల్లంముక్క సన్నగా తుముకోవాలి
ఒక క్యారెట్ తురుము
తాజా కొతిమీర కొద్దిగా
కరివేపాకు రెండు రెమ్మలు
తయారు చేయువిధానం : ఓట్స్ వేయించి పొడి చేసుకోవచ్చ లేదా అలాగే వాడవచ్చు. క్యారెట్ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేదాకా కొద్దిగా వేయించి అన్నీ కలిపి నీరుపోసి ఇడ్లీ పిండిలాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్ల లో మామూలు ఇడ్లీ లాగా వండుకోవాలి. ఏదైనా చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

ఓట్స్ దోసె

కావలసినవి :
ఒక కప్పు ఓట్స్
పావుకప్పు బియ్యం పిండి
పావుకప్పు బొంబాయి రవ్వ
ఒక టీస్పూన్ జీలకర్ర
ఒక పచ్చి మిరపకాయ
కొద్దిగా మిరియాలపొడి
నూనె
ఉప్పు
తగినంత నీరు
తయారు చేయువిధానం : ఓట్స్ ను నాలుగు నిమిషాలు పొడిగా వేయించుకోవాలి. చల్లారిన తరువాత మొత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక పాత్రలో ఓట్స్ పొడి, బియ్యం పిండి, రవ్వ, జీర, ఉల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు మిరియాల పొడి, ఉప్పు కొద్దిగా నీరు పోసి దోసె పిండి లాగా కలుపుకోవాలి. పెనం వేడిచేసి రవ్వదోసెల మాదిరిగా వేసి అంచుల వెంబడి నూనె కొద్దిగా వేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెండువైపులా కాల్చాలి.

Lemon Oats…..లెమన్ ఓట్స్

కావలసినవి :
ఒక కప్పు ఓట్స్
ముప్పావు కప్పు నీరు
పావు టీస్పూన్ పసుపు
నిమ్మరసం : ఒకటిన్నర స్పూనులు
ఉప్పు : సరిపడా
వేరుశెనగ గుళ్ళు : కొద్దిగా
నూనె : 2 టీస్పూన్లు
తాలింపుకు :
పోపు గింజలు : 1 స్పూను
కరివేపాకు : రెండు రెమ్మలు
ఎండుమిరపకాయ : 1
ఇంగువ : కొద్దిగా
పచ్చి మిరపకాయలు : రెండు సన్నగా తరిగినవి
తయారు చేయువిధానం : అడుగు మందంగా గల పాన్లో నూనె వేడి చేసి పోపుగింజలు వేసి చిటపటలాడనివ్వాలి. పచ్చిమిరకాయ ముక్కలు, వేరుశెనగ గుళ్ళు, ఎండు మిరపకాయ కరివేపాకు, ఇంగువ వేసి కలపాలి రెండునిమిషాలు వేయించాలి నీరుపోసి, పసుపు, ఉప్పు వేసి బాగా మరగ నివ్వాలి. తరువాత ముందుగానే కొద్దిగా వేయించిన ఓట్స్ ను వేసి కలిపి మూతపెట్టి నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి. నిమ్మరసం పిండి వడ్డించాలి.